'శివ కోసం ఎడ్లబండిపై వచ్చా.. ఇప్పుడు శివ ఎదురుగా ఉన్నా' | Balagam actor Sudhakar Reddy emotional at prePallaburusu ss meet | Sakshi
Sakshi News home page

Pallaburusu Movie: 'శివ కోసం ఎడ్లబండిపై వచ్చా.. ఇప్పుడు శివ ఎదురుగా ఉన్నా'

Aug 10 2026 8:59 PM | Updated on Aug 10 2026 9:13 PM

Balagam actor Sudhakar Reddy emotional at prePallaburusu ss meet

బలగం మూవీతో ఫేమ్ తెచ్చుకున్న వాళ్లలో సుధాకర్‌ రెడ్డి ఒకరు. ఈ చిత్రంలో తన నటన, తెలంగాణ యాసతో అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన పళ్లబురుసుతో అలరించేందుకు వస్తున్నారు. టైటిల్‌తోనే ఆసక్తి పెంచిన ఈ సినిమా రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్‌ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన నటుడు సుధాకర్ రెడ్డి ఎమోషనలయ్యారు. నాగార్జున నటించిన శివ మూవీ చూసేందుకు మేము ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చామని తెలిపారు. ఆ రోజు సినిమా చూసి మిగిలిపోయిన మిరపకాయ బజ్జీలు తిని ఇంటికెళ్లామని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఇలా పాడేవారు, ఇలా చేసేవారని రచ్చకట్ట దగ్గర మాట్లాడుకునే వాళ్లమని అన్నారు. కానీ ఈ రోజు నేను శివ(నాగార్జున) ముందు నిలబడి మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందని సుధాకర్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కళాకారులను ఇంతవరకు తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

కాగా.. బలగం నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్ పళ్లబురుసు. ఈ చిత్రానికి  ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్‌ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రంలో ప్రజ్వల్, గోమతి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతమందించగా.. ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement