విజయ్ సేతుపతి హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ 'స్లమ్ డాగ్-33 టెంపుల్ రోడ్'. ఈ సినిమాకు టాలీవుడ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ బాలీవుడ్ భామ టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. టబు రోల్ పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్ చూస్తుంటే టబు పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఇన్‌కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డేగా కనిపించనుంది. ఈ చిత్రంలో టబు రోల్ హైలెట్‌గా ఉండనుందని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. 'మా ఓల్డ్ సిటీలో ముందు కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం' అనే డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. కాగా.. ఈ మూవీలో సంయుక్త, దునియా విజయ్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్నారు.


