బాలకృష్ణ స్టెప్.. పశ్చాత్తాపడుతున్న శేఖర్ మాస్టర్ | Sekhar Master Regretting Dabidi Dibidi Song Step | Sakshi
Sakshi News home page

Sekhar Master: అప్పుడు తెలియలేదు.. వేరేలా అర్థం చేసుకున్నారు

Aug 10 2026 2:51 PM | Updated on Aug 10 2026 2:57 PM

Sekhar Master Regretting Dabidi Dibidi Song Step

ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా నడుస్తోంది. సినిమాల్లో ఎలా పడితే అలా సీన్స్ పెట్టినా, ఏది పడితే ఆ స్టెప్ వేసినా మనోభావాలు దెబ్బతినడం, ట్రోల్స్-విమర్శలు రావడం సర్వసాధారణం. గతేడాది సంక్రాంతికి ఇలానే 'డాకు మహారాజ్' మూవీలో బాలకృష్ణ వేసిన ఓ స్టెప్ చాలా విమర్శలకు కారణమైంది. అయితే దీన్ని కంపోజ్ చేసినందుకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పశ్చాత్తాపపడుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఈ స్టెప్ కొరియోగ్రాఫ్ చేసినందుకు ఎప్పుడైనా పశ్చాత్తపపడ్డారా? అనే యాంకర్ ప్రశ్నకు బదులిస్తూ.. ఆ పాటకు స్టెప్స్ కంపోజ్ చేస్తున్నప్పుడు తెలియలేదు. స్పెషల్ సాంగ్ ఎలా చేస్తామో ఇది అలానే చేశాను. కానీ జనాలు వేరేలా అర్థం చేసుకున్నారు. స్టెప్ అందరికీ తెలుసు కానీ నేను కంపోజ్ చేశానని చాలామందికి తెలీదు. కానీ చాలా వైరల్ ‍అయింది' అని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.

బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ తదితరులు ప్రధాన పాత్రలు చేసిన ఈ సినిమాకు బాబీ దర్శకుడు. ప్రేక్షకుల నుంచి కంటెంట్ పరంగా మంచి స్పందనే దక్కించుకుంది కానీ 'దబిడి దిబిడి' పాటలో బాలయ్య, ఊర్వశి రౌతేలా పిరుదులపై బాదినట్లు ఉండే స్టెప్ మాత్రం చాలా ట్రోలింగ్‌కి గురైంది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ దానిని చేసినందుకు పశ్చాత్తాపడుతున్నని చెప్పడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement