విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'అనకాపల్లి'. కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు. ఖగేష్ తమ్మినేని దర్శకుడు. కథ, స్క్రీన్ ప్లే అందించడతో పాటు త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్ర చేశారు. ఈ శుక్రవారం మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే 'డర్టీ గ్యాంగ్‌స్టర్స్' అంటూ సాగే పాటని సోనూసూద్ చేతుల మీదుగా విడుదల చేశారు.
'డర్టీ గ్యాంగ్ స్టర్స్' పాటని కేకే రచించగా పృథ్వీ చంద్ర, కేకే ఆలపించారు. దేవ్‌జండ్ బాణీ అందించారు. ఈ పాట మాస్ ఆడియెన్స్‌కి ఇన్‌స్టంట్‌గా ఎక్కేసేలా ఉంది. ఈ లిరికల్ వీడియోలోని విజువల్స్, లొకేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా బాగున్నాయి.


