తమిళ హీరో రవిమోహన్ అలియాస్ జయం రవి జీవితంలో ఇటీవల కాలంలో చాలానే సంఘటనలు జరుగుతున్నాయి. మనస్పర్థల కారణంగా భార్య ఆర్తితో విడాకుల వరకు పరిస్థితి వచ్చింది. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. పిల్లల సంరక్షణ, ఇతరత్రా మనోవర్తిగా నెలకు రు. 40 లక్షలు అందించేలా ఆదేశించాలని ఆర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నెలకు రూ.3 లక్షలు మాత్రమే ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన పిల్లలను చూడటానికి రవికి అనుమతినిచ్చింది. ఇదిలా ఉంటే రవిమోహన్ ఇటీవల దర్శక,నిర్మాతగా మారాడు. రవిమోహన్ స్టూడియోస్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తొలి ప్రయత్నంగా నటుడు యోగిబాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో 'యాన్ ఆర్డినరీ మ్యాన్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అలానే తాను హీరోగా 'బ్రో కోడ్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదలా ఉండగా రవిమోహన్.. 'తల్లిదండ్రుల అభినందనలు ప్రతి పిల్లలకు లభించాలి. ఇటీవల నేను దర్శకత్వం వహిస్తున్న యాన్ ఆర్డినరీ మ్యాన్ చిత్రంలోని కొన్ని సీన్స్, నేపధ్య సంగీతాన్ని మా కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ప్రదర్శించి చూపించాను. నా కుటుంబం. ప్రత్యేకంగా మా నాన్న నా కోసం చాలా సంతోషంగా చప్పట్లు కొట్టిన తరుణం ఒక్కో పిల్లలకు వారి తల్లిదండ్రుల నుంచి లభించాలి అని నేను మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను' అని ఈయన తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పు డు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. రవిమోహన్ కథానాయకుడిగా జీనీ అనే ఫాంటసీ మూవీతో పాటు రాజకీయ నేపధ్యంలో సాగే కరాటే బాబు, మిరుదన్ 2 త్వరలో రిలీజ్ కానున్నాయి.


