అలాంటి పాత్రలు చేయడం మానేశా | Vijay Sethupathi Said Not Doing Cameos Except Jailer 2 | Sakshi
Sakshi News home page

Vijay Sethupathi: అప్పుడు విలన్.. ఇప్పుడు క్యామియో

Aug 2 2026 8:44 PM | Updated on Aug 2 2026 8:46 PM

Vijay Sethupathi Said Not Doing Cameos Except Jailer 2

విజయ్ సేతుపతి పేరు చెప్పగానే వైవిధ్యమైన సినిమాలు, భిన్నమైన పాత్రలు గుర్తొస్తాయి. రీసెంట్ టైంలో రిలీజ్‌ల పరంగా కాస్త నెమ్మదించినప్పటికీ చేతిలో చాలానే ఉన్నాయి. అందులో పూరీ జగన్నాథ్ తీసిన 'స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్' కూడా ఒకటి. పెద్దగా హడావుడి లేకుండా తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఇతడు.. అతిథి పాత్రలు మానేయడంపై క్లారిటీ ఇచ్చాడు. అలానే 'జైలర్ 2' విషయంలో ఈ రూల్ ఎందుకు బ్రేక్ చేయాల్సి వచ్చిందో వెల్లడించాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)

'నేను మిగతా సినిమాల్లో అతిథి పాత్రలు చేయడం ఎప్పుడో మానేశా. రజనీకాంత్ కోసమే ఈ నిబంధన బ్రేక్ చేశాను. ఆయనతో కలిసి పనిచేయాలని 'జైలర్ 2'కి ఓకే చెప్పాను. ఎందుకంటే పోస్టర్‌పై రజనీ సర్ ఫొటో ఉంటే అందరి దృష్టి ఆయనపై ఉంటుంది. కానీ వేరే చిత్రాల్లో మాత్రం అతిథి పాత్రలు చేసినప్పుడు పోస్టర్‌పై నన్నే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. దీని ప్రభావం నేను హీరోగా చేస్తున్న మిగతా సినిమాలపై పడుతోంది. అందుకే అతిథి పాత్రలు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను' అని సేతుపతి చెప్పాడు.

గతంలో విలన్, అతిథి పాత్రల పరంగా విక్రమ్, జవాన్, సైరా నరసింహారెడ్డి, మాస్టర్ తదితర మూవీస్ చేశాడు. ప్రస్తుతం అయితే అన్ని హీరోగా చేస్తున్న చిత్రాలే. గతంలో రజనీకాంత్ 'పేట'లో విజయ్ సేతుపతి విలన్‌గా చేయగా.. ఇప్పుడు మాత్రం అతిథి పాత్ర పోషించాడు. దీపావళి కానుకగా 'జైలర్ 2'.. అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement