సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ | Actress Mirnalini Ravi Engaged And Introduce Her Boyfriend | Sakshi
Sakshi News home page

Mirnalini Ravi: ఆధ్యాత్మిక గురువుతో త్వరలో హీరోయిన్ పెళ్లి

Aug 1 2026 7:20 PM | Updated on Aug 1 2026 8:00 PM

Actress Mirnalini Ravi Engaged And Introduce Her Boyfriend

మరో హీరోయిన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఎలాంటి హడావుడి లేకుండానే రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు పంచుకోవడంతో పాటు కాబోయే భర్తని పరిచయం చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఏంటా ప్రేమకథ?

(ఇదీ చదవండి: శరీరం మారింది... ఆలోచనలు మారాయి: నటి పునర్నవి)

పుదుచ్చేరిలో పుట్టిన మిర్నాళిని రవి.. 2019లో వచ్చిన విజయ్ సేతుపతి 'సూపర్ డీలక్స్'తో నటిగా పరిచయమైంది. దీని తర్వాత 'గద్దలకొండ గణేశ్' మూవీలో హీరోయిన్ చేసి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామ మశ్చీంద్ర మూవీస్ కూడా చేసింది. వీటితో పాటు తమిళంలో ఛాంపియన్, ఎనిమీ, ఎమ్జీఆర్ మగన్, జంగో, కోబ్రా తదితర మూవీస్ చేసింది. చివరగా 2024లో 'రోమియో' అనే తమిళ చిత్రంలో నటించింది.

గత రెండేళ్లుగా యాక్టింగ్‌కి దూరమైన ఇప్పుడు ఉన్నట్టుండి సడన్‌గా తనకు నిశ్చితార్థమైన విషయాన్ని బయటపెట్టింది. మలేసియాకు చెందిన మహావిష్ణు అనే ఆధ్యాత్మిక గురువుతో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రెండు ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది. గత ఏడేళ్లుగా స్నేహితులైన వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుని ఒక్కటి కాబోతున్నారు. చూస్తుంటే నటనకు మిర్నాళిని వీడ్కోలు చెప్పేసినట్లే కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement