న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు ముఖేశ్ ఖన్నా తమపై చేసిన వ్యాఖ్యలకు కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చింది. నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలకు నిరసన తెలిపిన వారికి మద్దతు ఇచ్చిన యువతపై బెదిరింపులకు దిగడాన్ని తిప్పికొట్టింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న యువతకు ఉద్యోగాలు రావని, ప్రభుత్వం సాయం అందని ముకేశ్ ఖన్నా హెచ్చరించారు. అంతేకాదు వారిని మురికి కాలువలోని పురుగులుగా ఆయన వర్ణించారు. సీజేపీ ట్రాప్‌లో పడొద్దని పిల్లలకు సూచించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టడంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో కూడా షేర్ చేశారు.
''ఇంట్లోకి బొద్దింకలు వస్తే, మనం ఏం చేస్తాం?? వాటిని వెతికి పట్టుకుంటాం, పైకి ఎత్తి బయట పడేస్తాం. వీరితో కూడా అలాగే చేయండి. కొంత మంది పిల్లలు ప్రలోభాలకు లొంగిపోయి, ఆవేశంలో అన్ని రకాల తప్పుడు, నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. వారికి ఇదే నా హెచ్చరిక.. మీ మాటలు చరిత్రలో లిఖించబడ్డాయి. వారితో తిరగడం ద్వారా, మీరు మిమ్మల్ని మీరే ఒక మురికి కాలువలోని పురుగులుగా మార్చుకున్నారు. దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది!!
ఏ పోలీసులూ మీకు సహాయం చేయరు. చాలామంది మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి సంకోచిస్తారు. ప్రభుత్వ సహాయం నిలిపివేయబడుతుంది. మీకు కొన్ని వీసాలు కూడా రాకపోవచ్చు!! మీరు ఇప్పటికే మీ కుటుంబం దృష్టిలో పడిపోయారు! అందుకే, మీరు వారి బారి నుండి ఎంత త్వరగా తప్పించుకుంటే అంత మంచిది. నాకు మీ గురించి ఆందోళనగా ఉంద''ని ఎక్స్‌లో పేర్కొన్నారు.
మాకు మీరు తెలియదు
ముఖేశ్ ఖన్నా వ్యాఖ్యలను సీజేపీ తిప్పికొట్టింది. తాము జెనజీ తరానికి చెందిన వాళ్లమని మీ గురించి మాకు తెలియదు అనే అర్ధం వచ్చేలా కౌంటర్ ఇచ్చింది. ''క్షమించండి, మేము జెన్‌జీ. మేము స్పైడర్‌మాన్, బాట్‌మాన్, మార్వెల్స్ చూశాం. మీ గురించి మాకు తెలియదు. కాబట్టి మీ జ్ఞానాన్ని మీ జేబులోనే ఉంచుకోవాల''ని ఎక్స్‌లో సీజేపీ జవాబిచ్చింది. కాగా, శక్తిమాన్ పాత్రతో ముఖేశ్ ఖన్నా సినిమా రంగంలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు అదే తరహాలో సీజేపీ కౌంటర్ ఇచ్చింది.
Sorry , but we are Gen-z
हम spiderman, batman, Marvels देखते हैं Animes देखते हैं !
हम आपको नहीं जानते ! So please keep your knowledge in your pocket. https://t.co/OdQp0Pe25M— Cockroach Janta Party (@shah34516) August 1, 2026


