ఓటీటీలు అనగానే దాదాపు అందరికీ థ్రిల్లర్ సినిమాలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే మలయాళీ దర్శకులు ఎక్కువగా ఈ జానర్ మూవీస్ తీస్తుంటారు. వీటికి ఓటీటీల్లో అద్భుతమైన ఆదరణ దక్కుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కన్నడం నుంచి థ్రిల్లర్స్ వస్తుంటాయి. అలాంటి ఓ మూవీనే 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం'. చాన్నాళ్ల క్రితమే ఇది ఓటీటీలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతి ఏంటి? ఎందులో చూడొచ్చు?
(ఇదీ చదవండి: విజయ్ సీఎం కావడంపై ఎట్టకేలకు స్పందించిన కొడుకు)
2021లో రిలీజైన 'సీతారాం బెనోయ్: కేస్ నంబర్ 18' సినిమాకు సీక్వెల్ ఇది. విజయ్ రాఘవేంద్ర హీరో కాగా దేవిప్రసాద్ శెట్టి దర్శకుడు. సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథతో ఈ మూవీని తెరకెక్కించారు. కొన్నాళ్ల క్రితం తొలుత అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కన్నడలో ఆపై హిందీ, తమిళంలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించారు.
'సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం' విషయానికొస్తే.. మొదటి కేసులో భాగంగా భార్యని పోగొట్టుకొని ఒంటరిగా జీవిస్తుంటాడు పోలీస్ అధికారిక సీతారాం(విజయ్ రాఘవేంద్ర). ఆనెగడ్డ గ్రామంలోనే పనిచేస్తూ ఉంటాడు. అంతా ప్రశాంతంగా ఉందనుకునే టైంలో మళ్లీ వరస హత్యలు కలకలం రేపుతాయి. గుర్తు తెలియని వ్యక్తి కొందరు వ్యక్తుల మెడ, చేతులకు గొలుసులు కట్టి అతి కిరాతకంగా చంపేస్తుంటాడు. దీంతో గ్రామస్థులు హడలిపోతారు. ఈ హత్యల్ని సీతారాం ఇన్వెస్టిగేట్ చేస్తాడు. మరి వీటి వెనుకున్న సైకో కిల్లర్ ఎవరు? అసలెందుకు చేస్తున్నాడు? చివరకు ఈ కిల్లర్‌ని సీతారాం పట్టుకున్నాడా? లేదా అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన)


