వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. సత్య కామెడీ సీన్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్.. ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది.కొరియా బ్యాక్ డ్రాప్ లో హారర్ యాక్షన్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. వరుణ్ ఇందులో రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించాడు.


