నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమా నుంచి మంగళవారం రోజున ది ఫస్ట్ హ్యాండ్ అంటూ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
(చదవండి: ‘ఈఎన్‌ఈ రిపీట్’ ట్రైలర్ : సినిమా హిట్ కాకపోతే ఉరి తీసేయండి..)
విదేశాల్లో చదువుకోవాలని అనుకునే ఓ కుర్రాడు, ఆ కలను సాకారం చేసుకునేందుకు గ్యాబ్లింగ్‌లోకి దిగడం..అక్కడ వాళ్లకు జేడీ చక్రవర్తి క్యారెక్టర్ పరిచయం.. అక్కడి నుంచి కథలో కీలక మలుపులు.. వీటన్నింటిని కలగలిపిన ఫస్ట్ హ్యాండ్ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.


