‘ఇప్పటికైనా గొడవ పడకుండా ఉండు’.. భర్తపై స్టార్‌హీరోయిన్‌ కామెంట్స్‌ | Nazriya Nazim Shares Comments On Marriage To Fahadh Faasil | Sakshi
Sakshi News home page

Nazriya Nazim: ‘మనల్ని కలిసిమెలిసి ఉండమంటున్నారు’

Nov 3 2026 7:42 PM | Updated on Nov 3 2026 8:01 PM

Nazriya Nazim Shares Comments On Marriage To Fahadh Faasil

సిని పరిశ్రమలో తనకంటూ అభిమానులు ఎంతో ఇష్టపడే జంటల్లో ఫహాద్‌ ఫాజిల్‌, నజ్రియా నజీమ్‌ ఒకరు. 2014లో వివాహ బంధంలోకి ఒక్కటైన ఈ జంట తమ వ్యక్తిగత విషయాలను బయటకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. అయితే నజ్రియా అప్పుడప్పుడు భర్తతో కలిసిన ఫొటోలను సోషల్‌మీడియాలో పంచుకుంటూ అలరిస్తుంటారు. తాజాగా ‘సీన్‌’ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఈమె ఫాజిల్‌తో తనకున్న మూమెంట్స్‌ను పంచుకున్నారు.

ఫహాద్‌ ఇది విన్నావా..
సూర్య–జ్యోతిక, ఫహాద్‌ ఫాజిల్‌-నజ్రియా నజీమ్‌ జంటలు అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఓ ఇంటర్వ్యూలో యాంకర్‌ అన్నారు. దీనిపై నజ్రియా  స్పందిస్తూ.. ‘‘ఫహాద్‌ ఇది విన్నావా.. వీళ్లు మనల్ని గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉండమంటున్నారు.’ అంటూ నవ్వుతూ అన్నారు. అనంతరం ఇద్దరి మధ్య పరస్పర గౌరవం, ప్రేమ, తమ తమ వృత్తుల పట్ల అంకితభావం ఎంతో అవసరమని నజ్రియా అభిప్రాయపడ్డారు.

భార్యపై ఫహాద్‌ సరదా వ్యాఖ్యలు
ఇటీవల ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ కార్యక్రమంలో ఫహాద్‌ ఫాజిల్‌ కూడా తన భార్య నజ్రియా గురించి సరదాగా మాట్లాడారు.  తన వివాహాన్ని ప్రస్తావిస్తూ.. ‘నేను ఒక చిన్నపిల్లతో పెళ్లి చేసుకున్నాను. అందుకే నా సహనం గురించి చాలామంది అడుగుతుంటారు. ఇంట్లో ఒకరు ఉన్నారు కదా.. ఆమెతో వ్యవహరిస్తున్నాను అని చెబుతాను’ అంటూ గతంలో నవ్వులు పూయించారు.

సినిమా విషయానికి వస్తే..
‘12 ఏళ్ల తర్వాత తమిళ సినిమాకు తిరిగి రావడానికి కారణం సూర్య సర్‌ సినిమా కావడమే. నిజంగా ఇది నా కల నెరవేరినట్లుగా ఉంది. గతంలో కొన్ని కారణాల వల్ల ఆయనతో కలిసి నటించే అవకాశాలను ఒకటి రెండుసార్లు కోల్పోయాను. ఇప్పుడు మా ఇద్దరినీ కలిపిన తొలి సినిమా రావడం చాలా సంతోషంగా ఉంది’ అని నజ్రియా పేర్కొన్నారు.

నవంబర్‌ 6న ‘సీన్‌’ విడుదల
జితు మాధవన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘సీన్‌’ సినిమాలో సూర్య డీఎస్పీ పాత్రలో నటిస్తున్నారు. నజ్రియా మాయగా, నస్లెన్‌ ఈశ్వరన్‌గా కనిపించనున్నారు. యాక్షన్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 6, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

(ఇదీ చదవండి: రామాయణ: రావణుడి పది తలలకు యశ్‌ సరికొత్త ప్రయోగం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement