విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఈఎన్‌ఈ రిపీట్’ (ఈ నగరానికి ఏమైంది రిపీట్). తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ (2018) మూవీకి సీక్వెల్‌గా విశ్వక్ సేన్–తరుణ్ భాస్కర్ కాంబినేషన్‌లోనే ‘ఈఎన్‌ఈ రిపీట్’ రూపొందింది. శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను ఇతర పాత్రలు పోషించారు. ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా పతాకాలపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్.
(చదవండి: రావణుడి పది తలలకు.. పది గొంతులు ..)
ఈ నగరానికి ఏమైంది సినిమాలో చివర్లో విశ్వక్ సేన్ విజయ్ దేవరకొండతో షార్ట్ ఫిలిం తీస్తున్నట్టు చూపించారు. ఈ ట్రైలర్ అక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. ‘ఏమైంది రా స్టోరీ నచ్చలేదా(విశ్వక్ సేన్), ‘హా.. నువ్వు రాసింది ఏమన్నా టైటానిక్ అనుకుంటున్నావా? (అభినవ్).. అంటే మనకిప్పుడు పాన్ ఇండియా కలెక్షన్స్ రావు అంటున్నావు(వెంకటేశ్ కాకుమా), సినిమా హిట్ కాకపోతే వీడిని ఉరితీసేయండి(అభినవ్), ‘పిచ్చెక్కిపోతుంది ఆడియన్స్‌కి’ లాంటి డైలాగ్స్‌తో ఆద్యంతం వినోదాత్మకంగా ట్రైలర్‌ని కట్ చేశారు. ట్రైలర్‌ని బట్టి చూస్తే.. విశ్వక్ సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు, ఈ నలుగురు ఫ్రెండ్స్ బ్యాంకాక్ వెళ్లి అక్కడ పడ్డ ఇబ్బందులు, మధ్యలో కామెడీతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.


