ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) దాదాపు దశాబ్ద కాలం తర్వాత తమ విమాన సిబ్బంది కోసం కొత్త యూనిఫామ్‌లను మార్చింది. ప్రైవేట్ నిర్వహణలోకి మారిన తర్వాత తన కార్యకలాపాలను మెరుగుపరచడంలో భాగంగా, ‘పీఐఏ న్యూ యూనిఫామ్ డిజైన్ షోకేస్ 2026’ను నిర్వహించి మహీన్ ఖాన్, హెచ్‌ఎస్‌వై, నోమి అన్సారీ వంటి ప్రముఖ డిజైనర్ల ద్వారా కొత్త నమూనాలను సిద్ధం చేయించింది.
The wait is over. Introducing PIA’s new uniform, designed by Hassan Sheheryar Yasin (HSY). A fresh expression of style, a distinctive new look, and a vision that moves us forward. #PIA #HSY #PIANewLook #NewJourneyNewLook #PIANewUniform #FlyingForward #everyone #followers #trending #cabincrewlook #PakistanInternationalAirlines #NewEra
— PIA (@Official_PIA) October 22, 2026
అయితే ఈ కొత్త యూనిఫామ్‌లపై ఆన్‌లైన్‌లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుస్తుల మార్పు కంటే ప్రయాణికులకు అందించే సేవల నాణ్యతపై దృష్టి పెట్టాలని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. 1966లో పియర్స్ కార్డిన్, 1975లో సర్ హార్డీ అమీస్ వంటి దిగ్గజ డిజైనర్లు రూపొందించిన అద్భుతమైన చరిత్ర కలిగిన పీఐఏ యూనిఫామ్‌లను 2016లో మార్చారు. ఇప్పుడు ప్రైవేట్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ విమానయాన సంస్థ, తన పూర్వ వైభవాన్ని పునరుద్ధరించుకునేందుకు, ప్రజల నమ్మకాన్ని పెంపొందించుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది.
ఇదీ చదవండి: ట్రంప్‌కు ‘మధ్యంతర’ భయం.. కెనడా సుంకాలపై యూటర్న్!


