Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sajjala Ramakrishna Reddy Comments On Tdp
ఈసీ అంఫైర్‌లా వ్యవహరించలేదు: సజ్జల

సాక్షి, తాడేపల్లి: ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి? అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు.‘‘10-15 రోజులుగా మాచర్ల సెంటర్‌గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్‌ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.’’ అని సజ్జల పేర్కొన్నారు. ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంఫైర్‌లా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.‘‘బాధితులు రీపోలింగ్‌ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్‌ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్‌తో ఈసీ ఇన్‌ఫెక్ట్‌ అయ్యింది’’ అని సజ్జల పేర్కొన్నారు.

Ksr Comments On The Way Buddha Venkanna Spoke About Nara Lokesh
జాకీలు పెట్టి లేపినా.. లోకేష్‌కు అంత సీను లేదబ్బా!

తెలుగుదేశం పార్టీలో ఏదో అంతర్మథనం ఆరంభమైనట్లుగా ఉంది. శాసనసభ ఎన్నికలలో వచ్చే ఫలితాలపై టీడీపీలో టెన్షన్ ఏర్పడిన నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత పార్టీలో ఏమి జరిగే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ఒక ప్రకటనలో నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో గెలుస్తామని చెబుతూనే ఆయన ఈ వ్యాఖ్య చేయడంతో పార్టీ క్యాడర్‌లో కన్ప్యూజన్ ఏర్పడింది. టీడీపీ గెలిచే అవకాశం ఉంటే లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేయవలసిన వెంకన్న ఇలా అనడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. వెంకన్న ప్రకటనకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నా, ఇది అంత చిన్న విషయం కాదన్న భావన ఉంది.చంద్రబాబు జాతీయ అద్యక్షుడు అని చెప్పుకుంటున్నా, అది నామమాత్రమే అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా కింజారపు అచ్చన్నాయుడు ఉన్నారు. ఆయన పట్ల లోకేష్‌కు అంత సదభిప్రాయం లేదు. అచ్చెన్నను తప్పించాలని గతంలో కూడా ఆలోచన చేశారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఏమైనా మాట్లాడారా? అనే సంశయం వస్తుంది. చంద్రబాబు వయసు రీత్యా ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతలను కుమారుడికి అప్పగించాలని ఏమైనా అనుకుంటున్నారా? ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే చంద్రబాబుపై పార్టీలో నమ్మకం బాగా తగ్గుతుంది. అలాగని లోకేష్ నాయకత్వ పటిమపై కూడా క్యాడర్‌లో ఇంకా విశ్వాసం ఏర్పడలేదు.ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను ఎదుర్కోగల సత్తా లోకేష్ కు ఉందా అనే సంశయం ఉంది. లోకేష్ స్వయం ప్రకాశిత నేత కాదు. తండ్రిచాటు బిడ్డగానే రాజకీయంలోకి వచ్చారు. అలాగే ఇప్పటికీ కొనసాగుతున్నారు., అప్పడప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తున్నా, వాటికి గ్యారంటీ లేదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కొన్నిచోట్ల చంద్రబాబు నాయుడు కొందరికి టిక్కెట్ హామీ ఇస్తే, లోకేష్ మరికొందరికి టిక్కెట్ హామీ ఇచ్చారట. వారి నుంచి డిపాజిట్ కూడా తీసుకున్నారని చెబుతారు. కానీ టిక్కెట్ పొందలేకపోయిన వారికి కొందరికి లోకేష్ డబ్బు తిరిగి ఇవ్వలేదని ప్రచారం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధికారంలోకి రాలేకపోతే ఇవి గొడవలుగా మారే అవకాశం ఉంటుంది.లోకేష్ ప్రసంగాలలోకానీ, పార్టీ నిర్వహణలో కానీ అంత సమర్థత చూపలేకపోతున్నారని చెబుతారు. అందుకే చంద్రబాబు ఇప్పటికీ పార్టీ పగ్గాలు వదలి పెట్టలేకపోతున్నారన్నది వారి అభిప్రాయం. మరో సంగతి ఏమిటంటే పోలవరం కాంట్రాక్టర్‌గా గతంలో వ్యవహరించిన రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు ఒక ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్ లు తమ వద్ద పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారని అనేవారు. దీనిపై ఇంతవరకు వీరు నోరు విప్పలేదు. డబ్బు లావాదేవీల సంగతి పక్కనబెడితే లోకేష్ గట్టివాడైతే 2014 ఎన్నికలలో పోటీచేసి ఉండేవారు. అప్పట్లో అధికారం రావడంతో పెత్తనం చేయడం ఆరంభించారు. తదుపరి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిల ద్వారా తండ్రి చంద్రబాబుపై ఒత్తిడి చేసి ఎమ్మెల్సీ పొంది, ఆ వెంటనే మంత్రి కూడా అయిపోయారు. అయినా తన శాఖలను నిర్వహణలో అంత పేరు తెచ్చుకోలేకపోయారు.కానీ అన్నీ శాఖలపై ఆధిపత్యాన్ని చెలాయించడం వివాదాస్పదం అయింది. చంద్రబాబు కూడా ఆయా సందర్భాలలో లోకేష్ ను కలిసి వచ్చారా అని అడిగేవారట. అంటే దాని అర్ధం ఏమిటో తెలుసు కదా! అంత అధికారం ఎంజాయ్ చేసినా, 2019 శాసనసభ ఎన్నికలలో ఆయన ఓటమి చెందడం బాగా అప్రతిష్ట అయింది. అయినా ఎమ్మెల్సీగా ఉండడంతో కౌన్సిల్ లో కొన్నిసార్లు అనుచితంగా ప్రవర్తించడం ద్వారా ప్రజల దృష్టి ఆకర్షించాలని ప్రయత్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియావారు ఆయనకు భారీ ఎలివేషన్ ఇచ్చి ప్రచారం చేశారు. అయినా ఆశించిన రీతిలో పార్టీలో నమ్మకం కలిగించలేకపోయారు.ఉపన్యాసాలలో తడబడడం, భాష సరిగా రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇవేమీ పెద్ద సమస్యలు కావు. కానీ ఒక విధానం లేకపోవడం, తండ్రి మాదిరి అబద్ధాలు చెప్పడం, అధికారులను బెదిరించడం, రెడ్ బుక్ అంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం, కార్యకర్తలు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పోస్టు ఇస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వంటివి చేయడంతో ఈయనలో నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయన్న భావన ఏర్పడింది. తన తండ్రి చంద్రబాబు బాటలోనే నడిచి అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, తానేదో చాలా గొప్పనాడిని అయిపోయినట్లు మాట్లాడడం చేస్తుడడంతో విశ్వసనీయత తెచ్చుకోలేకపోయారు. యువగళం పేరుతో పాదయాత్ర చేసినా, అందులో ఒక చిత్తశుద్ది కనిపించలేదు. పేద ప్రజలతో పూర్తిగా కలవలేకపోయారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో పోల్చి చూస్తే ఈయన దరిదాపులో కనిపించలేకపోయారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్వయం ప్రకాశిత నేతగా ఎదిగితే, లోకేష్ ఏమో ఇంకా చంద్రబాబు కుట్ర రాజకీయాలపైనే ఆధారపడవలసి వస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అండతోనే రాజకీయాలలోకి వచ్చినా, ఆ తర్వాతకాలంలో ఒంటరిగా ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కున్నారు. పోరాటాలు చేశారు. సోనియాగాంధీ, చంద్రబాబుల కుట్రలను ఎదుర్కున్నారు. 2014 ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రాకపోయినా, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. జనంలోకి వెళ్లి పాదయాత్ర చేసి, పేద ప్రజలకు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పడానికి ప్రాధాన్యత ఇచ్చారు.చంద్రబాబు, లోకేష్ లు మాత్రం ఎంతసేపు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను దూషించడం, అసభ్య భాష వాడడం చేశారు. ఆ తేడాను జనం గమనించి 2019 ఎన్నికలలో టీడీపీని ఘోరంగా ఓడించారు. లోకేష్ మంగళగిరిలోనే ఓటమిచెందారు. ఆ తర్వాత ఆయన అక్కడ కేంద్రీకరించి భారీ వ్యయం చేస్తూ, ఈసారి ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు రాయలసీమకు చెందినవారు. ఆయన చంద్రగిరి వదలి కుప్పం నుంచి గత మూడున్నర దశాబ్దాలుగా పోటీచేస్తున్నారు. లోకేష్ ధైర్యవంతుడు అయి ఉంటే తన తండ్రి పుట్టిన ప్రాంతమైన చంద్రగిరి నుంచి పోటీచేసి ఉంటే ఆయనపై టీడీపీలో విశ్వాసం పెరిగేది. కానీ ఆ పని చేయలేకపోయారు.ఈ పరిస్థితిలో లోకేష్ పార్టీ అధ్యక్షుడు కావాలని వెంకన్న వంటివారు కోరుకున్నారంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఇంకా అర్హత సంపాదించలేకపోయారని అనుకోవాలా? యూపీలో సమాజవాది పార్టీ నేత మూలాయం సింగ్ జీవించి ఉన్న రోజులలో ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ ఎన్నికలలో అఖిలేష్ యాదవే ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలంతా ఓపెన్ గానే చెప్పారు. ఆ స్థితి లోకేష్ కు లేకపోవడం ఒక బలహీనతగా కనిపిస్తుంది.టీడీపీలో 2009 లో జూనియర్ ఎన్.టీ.ఆర్ సేవలను చంద్రబాబు వాడుకుని ఆ తర్వాత వదిలివేశారు. ఆయనను కనీసం మహానాడుకు కూడా ఆహ్వానించలేదు. జూనియర్ ఎన్.టీ.ఆర్ పార్టీలో ఉంటే లోకేష్ అవకాశాలు పోతాయని చంద్రబాబు భయపడ్డారు. నిజానికి లోకేష్ రాజకీయాలలోకి వస్తారా అని అంతకుముందు రోజుల్లో ఎవరైనా చంద్రబాబును అడిగితే ఆ ప్రశ్న వేసినవారిపై రుసరుసలాడేవారు. ఆ దశ నుంచి ఇప్పుడు కుమారుడిని జాకీలుపెట్టి లేపే పనిలో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా యజమానులు పడ్డారు. పార్టీని నడపడం తప్పుకాదు. ఆ స్థాయికి ఎదగాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ రాజకీయాలను ఒక స్టాండర్డ్‌లో చేయలేకపోతే ప్రజలలో విశ్వసనీయత రాదు. ఇప్పుడు అదే సమస్యను లోకేష్ ఎదుర్కుంటున్నారు.ఏతావాతా చెప్పేదేమిటంటే వెంకన్న వంటివారికి టీడీపీ గెలుపు మీద సంశయాలు ఉండి ఉండాలి. అంతేకాక లోకేష్ సమర్థత మీద అనుమానాలు ఉండాలి. అందుకే ఆయనను పార్టీకి పరిమితం చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. కానీ లోకేష్‌ను ఒక్కసారి పార్టీ అధ్యక్షుడిగా చేస్తే పార్టీలో ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పలేం. అప్పుడు కూడా చంద్రబాబు చాటు మనిషిగానే ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. స్వతంత్రంగా పనిచేసేంత శక్తి ఉందా అనే భయం పార్టీలో ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే ఒకరకంగా, రాకపోతే మరోరకంగా ఈ పరిణామాలు ఉంటాయి. వివిధ సర్వేలను గమనిస్తే టీడీపీ శాసనసభ ఎన్నికలలో గెలిచే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల ఫలితాల తర్వాత టీడీపీ సంక్షోభంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Kavitha lawyer Clarified On Kcr Name In Delhi Court
ఈడీ కేసీఆర్‌ ప్రస్తావన తేలేదు: కవిత లాయర్‌

సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రస్తావన తేలేదని కవిత తరపు న్యాయవాది మోహిత్‌రావు తెలిపారు. కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.ఈడీ రిపోర్టులో ఎక్కడ కూడా కేసీఆర్‌ పేరు రాయలేదన్నారు. బెయిల్‌ పిటిషన్‌ వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని మాత్రమే ప్రస్తావించిందని తెలిపారు.రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులరెడ్డికి లిక్కర్‌ కేసులో ఉన్నవారిని పరిచయం చేశానని చెప్పినట్లు ఈడీ తెలిపిందన్నారు. కవిత బెయిల్‌ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్‌ చేశారు.

BCCI, Gautam Gambhir Discuss India Coach Role
టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ పేరు ఖరారు.. త్వరలోనే ప్రకటన..?

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. భారత్‌ హెడ్‌ కోచ్‌ పదవిపై ఆసక్తి ఉన్నట్లు గంభీర్‌ స్వయంగా సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ఓ ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. గంభీర్‌ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఓనర్‌ అయిన షారుఖ్‌ ఖాన్‌కు కూడా ఈ విషయం తెలుసని సదరు వెబ్‌సైట్‌ వెల్లడించింది. హెడ్‌ కోచ్‌ పదవికి గంభీర్‌ దరఖాస్తు చేశాడా లేదా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ఈ విషయం ముమ్మాటికి నిజమేనని సోషల్‌మీడియా సైతం కోడై కూస్తుంది. ఇదే విషయాన్ని ఓ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఓనర్‌ కూడా స్పష్టం చేశాడని తెలుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా, గంభీర్‌ల మధ్య డీల్‌ కుదిరిందని.. ఈ విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సదరు ఫ్రాంచైజీ ఓనర్‌ చెప్పినట్లు సమాచారం. రెండ్రోజుల కిందట ముగిసిన ఐపీఎల్‌ ఫైనల్‌ సందర్భంగా ఈ డీల్‌ క్లోజ్‌ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌ ఫైనల్‌ ముగిశాక గంభీర్‌-జై షా చాలాసేపు బహిరంగంగా డిస్కస్‌ చేసుకోవడం జనమంతా చూశారు. ఆ సందర్భంగా టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవిపైనే చర్చ జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కాని ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. టీ20 వరల్డ్‌కప్‌ 2024తో భారత హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్‌ పదవి వీడేందుకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే ప్రకటన వెలువడేందు​కు ఆస్కారం ఉంది. టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా, గంభీర్‌ మెంటార్షిప్‌లో కేకేఆర్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. పదేళ్లకు ముందు ఇదే గంభీర్‌ కెప్టెన్‌గా కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అంతకు రెండేళ్ల ముందు కూడా గంభీర్‌ ఓసారి కేకేఆర్‌కు టైటిల్‌ అందించాడు. ఘనమైన ట్రాక్‌ రికార్డుతో పాటు దేశం పట్ల గంభీర్‌కు ఉన్న కమిట్‌మెంట్‌ భారత్‌ హెడ్‌ కోచ్‌ పదవి రేసులో అతన్ని ముందుంచుతుంది.

Imran Khan finally opens up about the reason why he separated from Avantika
ఆమెతో పెళ్లి.. విడాకులు.. అసలు కారణం వెల్లడించిన హీరో!

బాలీవుడ్ హీరో ఇమ్రాన్‌ ఖాన్‌ చివరిసారిగా కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో కంగనా రనౌత్‌ అతనికి జంటగా నటించింది 2008లో జెనీలియాతో కలిసి జానే తూ...యా జానే నా చిత్రంలో తొలిసారిగా మెరిసన ఇమ్రాన్‌.. ప్రస్తుతం గూఢచారి అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అయితే 2011లోనే అవంతిక మాలిక్‌ను ఇమ్రాన్‌ ఖాన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇమారా అనే కూతురు కూడా జన్మించారు. అయితే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తన భార్య అవంతిక మాలిక్‌తో వివాహాబంధానికి గుడ్‌ బై చెప్పారు హీరో. అప్పట్లో ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇమ్రాన్ ఖాన్‌ ఆమెతో విడాకులపై తొలిసారి స్పందించారు. విడిపోవడానికి గల కారణాలను వివరించారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఇంటర్వ్యూలో ఇమ్రాన్ మాట్లాడుతూ..'ఆ విషయంలోకి పెద్దగా వెళ్లాలనుకోవడం లేదు. గాసిప్స్‌కు ఆజ్యం పోయడానికి నేను సంకోచిస్తున్నా. అయితే నేను అంతర్గతంగా చాలా ఇబ్బందులు పడ్డా. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆరోగ్యకరమైన బంధం ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్య బంధం బలంగా తయారవుతుంది. అంతేకాదు ఒకరికొకరు మద్దతు ఉంటూ ఉత్తమంగా నిలుస్తారు. కానీ మా ఇద్దరి మధ్య అదే లోపించింది. అందుకే విడిపోవాల్సి వచ్చింది.' అని పంచుకున్నారు. కాగా.. అవంతికను 2011లో ఇమ్రాన్‌తో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఇమారా అనే కుమార్తెకు తల్లిదండ్రులయ్యారు. 2019లో వీరి వివాహాబంధానికి ముగింపు పలికారు.

BJP 400 Paar Claim Bakwas Wont Cross 200 Seats: Mallikarjun Kharge
400 బక్వాస్‌.. 200 సీట్లు రావడం కూడా కష్టమే: ఖర్గే ఎద్దేవా

లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో విజయం సాధిండం ఖాయమని బీజేపీ చెప్పుకుంటున్న ప్రచారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొట్టిపారేశారు. కొన్ని రాష్ట్రాల్లో అసలు ఉనికిలోనే లేని బీజేపీకి 400 సీట్లు రావడం బక్వాస్‌(అబద్ధమని) అని అన్నారు. 400 కాదు కదా కనీసం 200 సీట్లు కూడా దాటవని అన్నారు.అమృత్‌సర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి సీట్లు తగ్గుతాయని అన్నారు. అదే విధంగా, కాంగ్రెస్‌, ఇండియా కూటమి పుంజుకుంటుందని పేర్కొన్నారు.కాగా లోక్‌సభ ఎన్నికల్లో తమకు 400 సీట్లు వస్తాయని బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ చెబుతూ వస్తోంది. దీనిపై ఖర్గే స్పందిస్తూ... బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను ఆధారమేమిటని ప్రశ్నించారు. మీ(బీజేపీ) సీట్లు తగ్గుతున్నప్పుడు మావి(కూటమి) పెరుగుతున్నప్పుడు. 400 సీట్లు ఎలా వస్తాయి. అది పూర్తిగా అబద్దమని అన్నారు. అసలు బీజేపీ కేంద్రంలో ప్రభుత్వమే ఏర్పాటు చేయదని, ఎన్డీయే కూటమికి 200 సీట్లకు మించి రావని అన్నారు.తమిళనాడు, కేరళ, తెలంగాణలో బీజేపీ ఉనికిలో లేదని, కర్ణాటకలో అంత బలంగా లేదని మండిపడ్డారు. మహారాష్ట్రలోనూ కాషాయం బలహీనంగా ఉందన్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌ ఒడిశాలో గట్టి పోటీ ఉందన్న ఖర్గే.. ఆ పార్టీకి 400 సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, భారత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాటన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు. యువత డ్రగ్స్‌కు బానిసవ్వడంపై స్పందిస్తూ..దీనిని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉందన్న బీజేపీ ఆరోపణలను ఖర్గే ఖండించారు. 'మోదీ కాంగ్రెస్‌ మేనిఫెస్టో చూడడు, చదవడు.. మందు చెప్పినం.. ఇందులో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తే కాంగ్రెస్ కార్యాలయం నుండి ఒక వ్యక్తిని పంపింస్తాం.. ఆయనకు అది వివరించడానికి సహాయం చేస్తాడు. పార్టీ మేనిఫెస్టో యువత, రైతులు, కూలీలు, బడుగు బలహీన వర్గాల కోసమే’నని అన్నారు.

Raghuram Rajan to join politics
రాజకీయాల్లోకి ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్?

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారా? 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజన్‌ కాంగ్రెస్‌ చేరుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు. తాజాగా మరోమారు ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై వార్తలు వస్తున్నాయి. దీనిపైన రాజన్‌ స్పందించారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టడం కంటే నేను చేయగలిగిన చోట మార్గనిర్దేశం చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్రయత్నిస్తున్నాని తెలిపారు. ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నాను. నేను విద్యా వేత్తని. ‘మై బిజినెస్‌ ఈజ్‌ నాట్‌ కిస్సింగ్‌ బేబీస్‌’. కానీ ప్రజలు ఇప్పటికీ నా మాటల్ని నమ్మడం లేదు. పాలిటిక్స్‌ అంటే నా భార్యకు, నాకుటుంబానికి ఇష్టం లేదు. రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదన్నారు.అనంతరం భారత్, అమెరికా తదితర దేశాల్లోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, చిన్న పరిశ్రమల ముందున్న సవాళ్లు, ఆర్థిక అసమానతలపై రాజన్ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లో యుద్ధ భయాలతో పాటు ఇతర అంశాలే అందుకు కారణం. దీనికి తోడు అధిక వడ్డీ రేట్ల ప్రభావం ప్రపంచ వృద్ది ఆశించిన స్థాయిలో ఉండదని తెలిపారు.‘మై బిజినెస్‌ ఈజ్‌ నాట్‌ కిస్సింగ్‌ బేబీస్‌’ అంటే పరోక్షంగా రాజకీయాల్లో రావడం ఇష్టం లేదు.. సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పేందుకు ఇంగ్లీష్‌లో ఈ పదాన్ని సందర్భాన్ని బట్టి వాడుతుంటారు.

Nitish Kumar May Switch Sides Once Again Tejaswiyadav
ఫలితాల తర్వాత నితీష్‌ ఏదైనా చేయొచ్చు: తేజస్వి

పాట్నా: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బిహార్‌ సీఎం మరోసారి కూటమి మారడానికి రెడీ అవుతారని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ విషయమై మంగళవారం(మే28)న తేజస్వి మీడియాతో మాట్లాడారు. జూన్ 4 తర్వాత సీఎం నితీష్‌ తన పార్టీని కాపాడుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవచ్చని చెప్పారు.కాగా గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు వేర్వేరు పార్టీలో పొత్తులు పెట్టుకుని అధికారంలో కొనసాగారు. అయితే ఇటీవల ఓ ఎన్నికల ప్రచార సభలో నితీష్‌ మాట్లాడుతూ ఇక మీదట తాను బీజేపీతో తప్ప మరే పార్టీతో పొత్తు పెట్టుకోనని హామీ ఇచ్చారు. తాను ప్లేటు ఫిరాయించడం ఇదే చివరిసారన్నారు. కాగా గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు బీజేపీ, ఆర్జేడీలతో పొత్తులు మార్చారు.

KTR Slams CM Revanth On State Emblem Decision
కా​కతీయ కళాతోరణం, చార్మినార్‌ రాచరీక పోకడనా?: కేటీఆర్‌ కౌంటర్‌

KTR | హైద‌రాబాద్ : ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సంద‌ర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాక‌తీయ క‌ళాతోర‌ణం ఉండ‌ద‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు.తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది అని కేటీఆర్ విమ‌ర్శించారు.సాక్షి, హైద‌రాబాద్: రాష్ట్ర ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణ ఉండదంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌​ ప్రెసిడెంట్‌ కౌంటర్‌ ఇచ్చారు. అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణ, చార్మినార్‌ రాచరీక పోకడ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో కాక‌తీయ క‌ళాతోర‌ణం, చార్మినార్ అనేవి రాచ‌రిక‌పు గుర్తులు కాదని, వెయ్యేళ్ల సాంస్కృతి వైభ‌వానికి చిహ్నాలు అని పేర్కొన్నారు.ఈ మేరకు ట్విటర్‌లో కేటీఆర్‌ స్పందిస్తూ..‘ ముఖ్యమంత్రి గారు..ఇదేం రెండునాల్కల వైఖరి..!ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన..!!మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం..!చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు..!!అవి రాచరికపు గుర్తులు కాదు..!వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు..!!వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు..!!!జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ?“కాకతీయ” కళాప్రభల కాంతిరేఖ రామప్పగోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. “చార్మినార్”అధికారిక గీతంలో కీర్తించి..!!అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..??చార్మినార్ అంటే.. ఒక కట్టడం కాదు..విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదు..సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం..తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి.. వీటిని తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే..!నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే..!!మీ కాంగ్రెస్ పాలిస్తున్న... కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులున్నాయి.. మరి వాటిని కూడా తొలగిస్తారా చెప్పండి..??భారత జాతీయ చిహ్నంలోనూ.. అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయి..జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది..వాటి సంగతేంటో సమాధానం ఇవ్వండి..??కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా ?ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా ?ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు..రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా..?గత పదేళ్లుగా.. ప్రభుత్వ అధికారిక చిహ్నంపై.. యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది.. సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉంది..రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో.. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించంపౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా... మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తాం..!తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం..!!’ అని పేర్కొన్నారు.

 check the List of expensive cars owned by Deepika Padukone
Deepika Padukone : దీపికా పడుకోణె అమేజింగ్‌ లగ్జరీ కార్లు, విలువ ఎంతో తెలుసా?

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోల హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా తానేంటో నిరూపించుకున్న అద్భుతమైన నటి దీపికా పదుకొణె. రెమ్యూనరేషన్‌ విషయంలో హీరోలతో పోటీ పడుతూ టాప్ నటుల్లో ఒకరిగా నిలిచింది. అందానికి తోడు నటనా నైపుణ్యంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో చోటు సంపాదించింది. అంతేనా మూడు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ టైమ్ మ్యాగజీన్ 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచింది. 2022లో టైమ్100 ఇంపాక్ట్ అవార్డు సొంతం చేసుకుంది.అద్భుతమైన నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లాడి పవర్ కపుల్ స్టేటస్‌ను దక్కించుకుంది. త్వరలో దీపికా, రణ్‌వీర్‌ జంట త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. లగ్జరీ కార్లు, బంగ్లా లాంటి విలాసవంతమైన జీవనశైలి వారి సొంతం. ఈ నేపథ్యంలో దీపికా గ్యారేజ్ కొలువుదీరిని లగ్జరీ వాహనాలకు గురించి తెలుస్తే షాక్‌ అవ్వాల్సిందే,. ఎందుకంటే దీపికా మొత్తం కార్ కలెక్షన్ విలువ రూ. 10 కోట్లు. దీపికా పదుకొణె కార్ కలెక్షన్..ఆడి క్యూ7 – ధర రూ. 80 లక్షలుమెర్సిడెస్ మేబ్యాక్ S500 – రూ. 2.40 కోట్లురేంజ్ రోవర్ వోక్ – రూ. 1.40 కోట్లుమినీ కూపర్ కన్వర్టిబుల్ – రూ. 45 లక్షలుమెర్సిడెస్‌ బెంజ్‌ ఎస్‌-క్లాస్- రూ. 1.60 కోట్లుఆడి A8 L- రూ. 1.20 కోట్లుఆడి A6- రూ. 55 లక్షలుBMW 5 సిరీస్- రూ. 60 లక్షలుపోర్షే కయెన్- రూ. 1 కోటిప్రస్తుతం దీపికా పదుకొణె కల్కి 2898 ఏడీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అలాగే "సింగం ఎగైన్"లో అనే మూవీలోనూ నటిస్తోంది. ఇందులో పోలీసు యూనిఫాంలో యాక్షన్ సన్నివేశాల్లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement