ఈక్యూ మోడ్‌తో లెనోవా వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్లు

Lenovo unveils new wireless headphones at Rs 2499  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా బహుళజాతి సాంకేతిక సంస్థ లెనోవా తన కొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్లను తాజాగా విడుదల  చేసింది.    సరికొత్త ఈక్యూ టెక్నాలజీతో 'హెచ్‌డి 116' పేరుతో  ప్రస్తుతం అమెజాన్‌ ద్వారా అందుబాటులో ఉంచింది. ఈ నెల చివరి నాటికి ఫ్లిప్‌కార్ట్‌లో కూడా లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది.
దీని ధరను రూ .2,499 గా వుంచింది.

మంచి,లుక్, ఉన్నతమైన నాణ్యత, గొప్ప సౌండ్ అవుట్‌పుట్‌, బలమైన బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి క్లాసిక్  మేళవింపుతో తమ తాజా హెడ్‌ఫోన్స్‌ ఆకట్టుకుంటాయని  షెన్‌జెన్ ఆడిషి టెక్నాలజీ లిమిటెడ్‌ ఇంటర్నేషనల్ బిజినెస్  సీఈవో జిసేన్‌జు తెలిపారు.   డ్యూయల్ ఈక్యూ మోడ్‌,  (ఒకే బటన్‌ను నొక్కడం ద్వారా వినియోగదారుడు రెండు మోడ్‌లకు మారడానికి అనుమతి), 240హెచ్ స్టాండ్‌బై సమయంతో 24 గంటల ప్లేయింగ్‌ సమయం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.  2019లో  తమ ఆడియో పరికరాలకు భారత వినియోగదారుల నుంచి  వచ్చిన విశేష ఆదరణ నేపథ్యంలోఇక్యూ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ వెర్షన్‌ను తీసుకొచ్చామని ఆడిషి టెక్నాలజీ లిమిటెడ్  ఇండియా బిజినెస్ హెడ్ నవీన్ బజాజ్ తెలిపారు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top