వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(మార్చి 5, గురువారం) వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు.
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యారు.
నూతన దంపతులు కృష్ణ కావ్య, వినీత్ రెడ్డిలను ఆయన ఆశ్వీరదించారు.
హెలీప్యాడ్, కల్యాణ మండపం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు.. వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపించారు.


