మలాడ్ (వెస్ట్): ముంబైలోని మలాడ్ (వెస్ట్) ప్రాంతంలో క్విక్ కామర్స్ బ్రాండ్ 'బ్లింకిట్' (Blinkit) నిర్వహిస్తున్న గిడ్డంగిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు ఉల్లంఘనలు వెలుగుచూశాయి. పెద్ద ఎత్తున బొద్దింకలు ఉండటం, నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను నిల్వ చేయడం, గడువు ముగిసిన, పాడైపోయిన ప్యాకేజ్డ్ ఆహార వస్తువులు లభించడంతో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) బ్లింకిట్ మాతృ సంస్థ ‘బ్లింక్ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆహార లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది. ఈ గిడ్డంగిలో ఆహార పదార్థాలను తుప్పుపట్టిన రాక్‌లపై ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
కోల్డ్ స్టోరేజ్ ప్రాంతాలలో కూడా సరైన పరిశుభ్రత పాటించలేదని తేలింది. ఈ ఉదంతంపై స్పందించేందుకు బ్లింకిట్ నిరాకరించింది. మరోవైపు, అమెజాన్ రిటైల్ ఇండియాకు చెందిన భివండి గిడ్డంగిలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను మార్కెట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలపై మహారాష్ట్ర ఎఫ్‌డీఏ గతంలో చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై బాంబే హైకోర్టు స్పూరిస్తూ.. గడువు ముగిసిన, పాడైపోయిన సరుకులన్నింటినీ శాస్త్రీయ పద్ధతిలో నాశనం చేసేందుకు ఎఫ్‌డీఏ అధికారులకు అప్పగించాలని అమెజాన్‌ను ఆదేశించింది.
ఇది కూడా చదవండి: నీట్ పేపర్ లీక్: ‘రసాయనశాస్త్రం’తో నమ్మించి..


