ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
ముస్తాబాద్(సిరిసిల్ల): ఓ మహిళతో కానిస్టేబుల్ రాసలీలలపై జిల్లా పోలీస్ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్, ఓ మహిళతో చనువుగా ఉన్నాడు. సిద్దిపేట జిల్లా రాజక్కపేట శివారులో సదరు మహిళతో కానిస్టేబుల్ సన్నిహితంగా ఉండగా గమనించిన రైతు వీరిని ప్రశ్నించాడు. పంట పొలాల్లో ఈ పాడు పనిలేమిటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కానిస్టేబుల్ సదరు రైతును బెదిరించడంతో.. ఆ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో జిల్లా పోలీస్ అధికారులకు చేరడంతో క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.
అయితే ఈ వీడియో పక్షం రోజుల క్రితం తీసిందని చర్చ సాగుతోంది. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ వివాహేతర సంబంధం కొనసాగించడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో ఉంటు హద్దులు మీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ముస్తాబాద్ ఠాణాలో గతంలో పనిచేసిన మరో ఇద్దరు కానిస్టేబుళ్ల అక్రమ వ్యవహారాలపై కూడా విచారణ సాగుతున్నట్లు సమాచారం.


