సాక్షి, హైదరాబాద్: ఈ రోజు (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.యాదాద్రి, నల్గొండ, సూర్యాపేటలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
కాగా నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో హైడ్రా, డీఆర్‌ఎఫ్, ఎమ్‌ఆర్‌టీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. భారీ మోటార్ల సాయంతో రోడ్లపై నీరు తొలగింపు చేపడుతున్నాయి. నిన్న వర్షం వివరాలు. సరూర్ నగర్ 11.2, ఉప్పల్ 8.1 సెం.మీ,బండ్లగూడ 7.9 సెం.మీ, హయత్ నగర్ 7.2 సెం.మీల వర్షం నమోదైంది.


