breaking news
alert
-
సౌదీ రాజధానిలో హై అలర్ట్.. వైమానిక దాడులు?
రియాద్: యెమెన్‌లో హౌతీలు విజృంభిస్తున్న నేపథ్యంలో సౌదీ అలర్టయ్యింది. ఆ నేపథ్యంలోనే తొలిసారిగా రాజధాని రియాద్‌లో హెచ్చరికలు జారీ చేసింది. శనివారం తెల్లవారుజామున రియాద్‌లో వైమానిక దాడి హెచ్చరిక జారీ అయింది. ఆ ప్రాంతంలోని పౌరులకు వైమానిక దాడుల ముప్పు ఉందని ఇళ్లలోనే ఉండాలని అధికారులు సందేశాలు పంపారు. కొద్దిసేపటికే రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో నగర ప్రజల్లో ఆందోళన వాతావరణం నెలకొంది.యెమెన్‌లో సౌదీ అరేబియా మద్ధతిస్తున్న ప్రభుత్వ బలగాలకు అక్కడి హౌతీలకు తీవ్రంగా యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో హౌతీలు వేగంగా దాడులు చేస్తూ భారీగా భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో వారి పట్టు పెరగడం సౌదీ అరేబియాకు ఆందోళన కలిగిస్తోంది. గతంలో హౌతీలపై సౌదీ అరేబియా అనేక వైమానిక దాడులు చేసినప్పటికీ వారి పురోగతిని పూర్తిగా అడ్డుకోలేకపోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. హౌతీలు తమపై దాడి చేసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేసింది. మక్కాపై దాడి ఆరోపణఇటీవల మక్కాపై హౌతీలు దాడి చేశారని సౌదీ అరేబియా ఆరోపించగా, హౌతీలు ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రియాద్‌లో జారీ చేసిన తాజా హెచ్చరికకు ముప్పు ఎక్కడి నుంచి వచ్చిందో సౌదీ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. అయితే యెమెన్‌లో కొనసాగుతున్న పోరాటం కారణంగా ఇప్పటివరకు 1.12 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాలపై హౌతీల నియంత్రణ పెరగడం వల్ల అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో సౌదీ అరేబియా తన రక్షణ సామర్థ్యాలను పెంచుకునే చర్యల్లో భాగంగా అమెరికా నుంచి 48 ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోలుకు 24.3 బిలియన్ డాలర్ల ఒప్పందానికి అనుమతి పొందింది. అమెరికా సహాయం కోరినప్పటికీ, హౌతీలపై నేరుగా దాడులు చేయడానికి అమెరికా నిరాకరించినట్లు సమచారం వచ్చింది. -
TG: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాంలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగుడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్,జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనగామ, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షాలు
-
తెలంగాణలో వాన మోత.. ఈ 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వాతావరణ శాఖ రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, మెదక్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షాలు పడే సూచనలున్నాయి. మరోవైపు మరో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.రాత్రి దంచి కొట్టిన వానతెలంగాణ అంతటా గత రాత్రి భారీ వర్షాలు దంచి కొట్టాయి. హైదరాబాద్ సహా జనగామ, భద్రాద్రి, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలను ముంచెత్తాయి. కొడకంట్లలో 12 సెం.మీ, పాల్వంచలో 11.7 సెం.మీ. రామన్నపేట, దేవురుప్పలలో 10.8 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్‌లోనూ ఈ వేకువ జాము నుంచి ఎడతెరిపి లేకుండా రెండు గంటల సేపు గట్టి వాన పడడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. -
హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో జోరుగా వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాల్, గాజులరామారం, కూకట్పల్లి, మియాపూర్‌లో వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, టోలిచౌకిలోనూ వర్షం కురుస్తోంది.మరోవైపు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.వర్షం సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద ఉండకుండా జాగ్రత్త పడాలని సూచించారు. వాహనదారులు రోడ్లపై నీరు నిలిచిన చోట నెమ్మదిగా ప్రయాణించాలని, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఇదీ చదవండి: ఏఐ.. రాక్షసి!! -
ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది. పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలతో పాటు యానాంలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో వేకువజాము నుంచి దాదాపు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపుల ధాటికి బెజవాడ వాసులు బెంబేలెత్తిపోయారు. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.ముఖ్యంగా బెంజిసర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ స్థాయిలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఏలూరు రోడ్డులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనూ శనివారం వేకువజామున భారీ వర్షం కురిసింది. ఉ.8 గంటల వరకు జిల్లాలో సగటున 37.4 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది.పి.గన్నవరంలో అత్యధికంగా 60.0 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా, ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా దారకొండ పంచాయతీ గంగవరం వద్ద గిరిజనులు నిర్మించుకున్న తాత్కాలిక తూరల వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. ఒడిశా వైపు వెళ్లే మార్గంలో సుమారు 30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.ఇదీ చదవండి: చవితి పూట.. ధరల మంట -
AP: రాష్ట్రంలో భారీ వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి, అమరావతి: ఛత్తీస్గడ్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలతో పాటు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
ఏపీలో వర్షాలే వర్షాలు
-
తెలంగాణకు వర్ష హెచ్చరిక.. ఈ రెండు రోజులు జాగ్రత్త!
తెలంగాణ: రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు వర్షాల ప్రభావం ఉండొచ్చని, ముఖ్యంగా 12, 13 తేదీల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని చెబుతోంది. దీంతో గతంలో అంచనా వేసిన దానికంటే వర్షాలు ముందుగానే మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోంది. ఇది క్రమంగా బలహీనపడి విదర్భ ప్రాంతంలో బలహీన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.అయితే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉండకపోవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసి 50 నుంచి 70 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఈ రెండు రోజులు మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 12న వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దీంతో ప్రజలు వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో మాత్రం అల్పపీడనం ప్రభావం తక్కువగా ఉండొచ్చని అంచనా. అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 15 నుంచి 17 మధ్య వర్షాలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని, వాతావరణ పరిస్థితులను బట్టి తాజా అంచనాల్లో మార్పులు ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. -
ఏపీకి బిగ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో దక్షిణ ఒరిస్సా ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య అల్పపీడనం బలపడుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా 9.4 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రెండు రోజులపాటు ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.ఇవాళ(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ భారీ వర్షాలు పడే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రేపు (శుక్రవారం) అనకాపల్లి, అల్లూరు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. రేపు(శుక్రవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు(శుక్రవారం) ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు.. రెండు రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఆదేశించారు.విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ ప్రకాశం 4 సెం.మీ, అనకాపల్లి 4, భీమిలి 2, పల్నాడు 2, గుంటూరు 2, ఎన్టీఆర్ 1.5, విజయనగరం 1.5, తుని 1 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
ఏపీకి భారీ వర్ష సూచన.. ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి: వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్టంలో రానున్న మూడుగంటల్లో అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పడడంతో పాటు ఈ సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పెద్దఎత్తున గాలులు వీయడంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని,గాలివాన సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని సూచించింది. వర్ష తీవ్రత రూపుదాల్చుతున్న దృష్ట్యా, గతంలో జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్‌ను తాజాగా 'రెడ్ అలర్ట్'గా సవరించింది. -
TG: వాతావరణ శాఖ హెచ్చరిక.. పలు జిల్లాల్లో వర్షం
సాక్షి, హైదరాబాద్: వాతావరణ శాఖ రాష్ట్రానికి వర్ష సూచనలు జారీ చేసింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, యాదాద్రి, ఉమ్మడి మెదక్ జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అదే విధంగా పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
హిమాలయాల్లో 188 సరస్సుల విస్పోటనం?
న్యూఢిల్లీ: భారత హిమాలయ ప్రాంతంలో పలు హిమానీనద సరస్సులు విస్ఫోటనం (గ్లోఫ్ - GLOF) చెంది వరదలు సంభవించే ముప్పు పొంచివుంది. ఇలాంటి అత్యంత కీలకమైన 188 సరస్సుల వద్ద ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను (Early Warning Systems) ఏర్పాటు చేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. నేపాల్–టిబెట్ సరిహద్దుల్లో ఇటీవల సంభవించిన భారీ వరద విపత్తులో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలను వేగవంతం చేశారు.శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం 1990 నుంచి 2018 మధ్య కాలంలో హిమానీనద సరస్సుల ఉపరితల విస్తీర్ణం 51 శాతం మేరకు పెరిగిందని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. ఈ సరస్సుల పరిమాణం, సంఖ్య పెరుగుతుండటం వల్ల లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు పెను ముప్పుగా పరిణమిస్తోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు ఇలాంటి సరస్సుల విస్ఫోటన వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరిలో సగానికి పైగా ప్రజలు భారత్, పాకిస్థాన్, పెరూ, చైనా దేశాల్లోనే ఉన్నారు.2023 అక్టోబర్ 4న సిక్కింలోని సౌత్ లోనాక్ సరస్సు విస్ఫోటనం, 2024 ఆగస్టు 16న నేపాల్‌లోని ఖుంబు ప్రాంతం థామే గ్రామాన్ని ముంచెత్తిన థ్యాన్బో సరస్సు వరదలు తీవ్రతను స్పష్టం చేశాయి. ఈ విపత్తులు కేవలం స్థానిక సంఘటనలు కావని, హిందూకుష్ హిమాలయ ప్రాంత క్రయోస్పియర్లో పెరుగుతున్న విపత్తుల క్రమంలో భాగమని అధికారులు పేర్కొన్నారు. ఎన్ఆర్ఎస్సీ, సీడబ్ల్యూసీ, జీఎస్ఐ, ఐసీఐఎమ్‌వోడీ వంటి ప్రముఖ సంస్థలు గంగ, బ్రహ్మపుత్ర, సింధు నదీ పరివాహక ప్రాంతాల్లో 7,500కి పైగా హిమానీనద సరస్సులను గుర్తించాయి.ఇది కూడా చదవండి: ఆప్ నేత దారుణ హత్య.. బైక్‌ను వెంబడించి.. -
TG: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: వాతావరణ శాఖ రాష్ట్రానికి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. మహబూబ్‌నగర్, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాలకు వర్షసూచన చేసింది. ఈనేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దానితో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా పలు ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లకింద, హోర్డింగుల వద్ద ప్రజలెవరూ నిల్చోకూడదని సూచనలు చేసింది. -
రైతుల్లో గుబులు: సెప్టెంబర్‌లోనూ వర్షాలు అనుమానమే..
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కదలికలు అత్యంత విచిత్రమైన వాతావరణ పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఆగస్ట్ నెలలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ, దేశం మొత్తం మీద చూస్తే పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఒడిశా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తుతుండగా, దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో వర్షపాతంలో తీవ్ర లోటు నెలకొనడం సర్వత్రా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.13 శాతం వర్షపాతం లోటుతో..భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ సీజన్లో నైరుతి రుతుపవనాలు తీవ్రంగా బలహీనపడ్డాయి. జూన్ 1 నుంచి ఆగస్ట్ 16 వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే సాధారణం కంటే ఏకంగా 13 శాతం లోటు నమోదైంది. ఆగస్ట్ నెలలో వర్షాలు ఊపందుకున్నట్లు కనిపించినప్పటికీ, ఆరంభంలో ఏర్పడిన భారీ లోటును భర్తీ చేయడంలో రుతుపవనాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి.ఒడిశా, ఢిల్లీలలో కుండపోత..దేశవ్యాప్తంగా వర్షపాత పంపిణీ తీవ్ర అసమానతలతో కూడి ఉంది. ఒడిశా, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాలలో వర్షాలు రికార్డు స్థాయిలో కురిశాయి. ఒడిశాలో దీర్ఘకాలిక సగటు కంటే ఏకంగా 27 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అలాగే ఈశాన్య భారత ప్రాంతాల్లోనూ వర్షాలు సంతృప్తికరంగా పడ్డాయి. అయితే ఈ వర్షాలు కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితం కావడంతో ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.ఖరీఫ్ పంటల దిగుబడిపై ప్రభావంఈ వర్షపాత లోటు దేశ వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌కు పెను సవాలుగా మారుతోంది. వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పప్పుధాన్యాల వంటి ప్రధాన పంటలు వర్షాలపైనే ఎక్కువగా ఆధారపడతాయి. సమృద్ధిగా వర్షాలు పడిన ప్రాంతాల్లో పంటలకు మేలు జరుగుతున్నప్పటికీ, వర్షాలు లేని ప్రాంతాలలో సాగునీటి కొరత పెరిగి దిగుబడులు భారీగా పడిపోయే ముప్పు పొంచి ఉంది.జూన్‌లో దెబ్బతీసిన రుతుపవనాలు..ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వెదర్ (Skymet Weather) అంచనాల ప్రకారం ఈ ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగానే నమోదవుతున్నాయి. జూన్ నెలలో వర్షపాతం దారుణంగా పడిపోయి, సాధారణ సగటులో కేవలం 65 శాతమే నమోదైంది. జూలై నెలలో రుతుపవనాలు పుంజుకున్నప్పటికీ, రెండో వారంలో వచ్చిన వర్షాలకు బ్రేక్ పడింది. నెల చివరి నాటికి కాస్త కోలుకున్నా, జూన్-జూలై మొత్తం మీద 13 శాతం లోటు తప్పలేదు.సెప్టెంబర్‌లోనూ వర్షాభావంసెప్టెంబర్ నెలపై వాతావరణ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు మరింత భయాందోళన కలిగిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్-నినో’ పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయి. ఈ ఎల్-నినో ప్రభావం వల్ల ఆగస్ట్ ముగిసే సమయానికి 16 శాతం, సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే సుమారు 20 శాతం వరకు వర్షపాత లోటు ఏర్పడే అవకాశం ఉందని స్కైమెట్ అంచనా వేసింది. ఈ పరిణామం యావత్ దేశాన్ని కరువు దిశగా నెట్టే ప్రమాదం ఉంది.రబీ సీజన్ భవితవ్యంపై నీలినీడలువర్షాకాలం చివరి దశలో కూడా సమృద్ధిగా వర్షాలు కురవకపోతే భూగర్భ జలాలు, జలాశయాల నీటి నిల్వలు అడుగంటిపోతాయి. ఖరీఫ్ సీజన్‌కు జరిగే నష్టంతో పాటు, రాబోయే రబీ పంటల సాగుకు అవసరమైన నీటి వనరులు సమకూరడం కష్టతరంగా మారుతుంది. సెప్టెంబర్‌లో వాతావరణం ఎలా మారుతుందనే దానిపైనే దేశ ఆహార భద్రత, వ్యవసాయ రంగ భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి.ఇది కూడా చదవండి: నేపాల్ భీకర వరదలు.. ఏరియల్ వ్యూలో.. -
ఎగసిపడుతున్న అలలు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
-
ఆలయంలో తొక్కిసలాట: ఐదుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం!
మధేపుర: బిహార్‌లోని మధేపుర జిల్లాలోని బాబా సింగేశ్వర్నాథ్ ఆలయంలో సోమవారం ప్రధాన ద్వారం తెరవగానే ఒక్కసారిగా తొక్కిసలాట పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం జననాయక్ కర్పూరి ఠాకూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక భక్తుడి తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమంగా ఉంది. శ్రావణ మాస సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆలయంలో రాత్రి 12:30 గంటలకు ప్రభుత్వ అధికారిక పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం రాత్రి ఒంటి గంటకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచారు. ఆలయ బయటి ప్రాంగణంలోని ప్రధాన ద్వారం పక్కనుంచి భక్తులను వరుస క్రమంలో లోపలికి అనుమతించారు. అయితే, భక్తుల రద్దీ తీవ్రం కావడంతో తెల్లవారుజామున 4:00 గంటలకు ప్రధాన ద్వారాన్ని పూర్తిగా తెరవగానే ఒక్కసారిగా తోపులాట జరిగింది. సుమారు 15 నిమిషాల పాటు తీవ్ర గందరగోళం కొనసాగింది.ఇనుప గ్రిల్స్‌ను ఢీకొని కిందపడిపోవడంతో ఒకరి తలకు తీవ్ర గాయం అయ్యింది. పరిస్థితిని అదుపు చేసే క్రమంలో సుమారు అర డజను మంది పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు. డజనుకుపైగా ఇతర భక్తులు స్వల్ప గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో సుపౌల్‌కు చెందిన సింటూ కుమార్, సహర్సా జలసీమాకు చెందిన రూనా దేవి, మధేపుర గ్వాల్పారాకు చెందిన సులేనా దేవి, మరో గుర్తుతెలియని మహిళా భక్తురాలు ఉన్నారు. శ్రావణ సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇటీవల లఖీసరాయ్‌లోని అశోక్‌ధామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.ఇది కూడా చదవండి: ‘సిల్క్యారా’లో మళ్లీ ప్రమాదం.. 2023ను గుర్తుకు తెస్తూ.. -
TG: రానున్న ఐదు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు నుంచి (శనివారం) ఈ నెల 26 వరకూ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దానితో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, నల్గొండ, సూర్యాపేటలో వేగంగా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. -
AP: ఈ రోజు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం
సాక్షి, అమరావతి: ఈ రోజు శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. పోలవరం, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన పడే అవకాశం ఉందని తెలిపింది. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందుకు ప్రజలెవరూ చెట్లకింద హోర్డింగుల వద్ద నిల్చోకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
భారత్ కి బిగ్ అలర్ట్! వచ్చేసిన 3,500 KM రాక్షస మేఘాలు!
-
2011 రికార్డు బద్దలు.. ఆగస్టు మొదట్లోనే కుండపోత వర్షాలు!
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం కురిసిన కుండపోత వర్షాలకు రాజధానిలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయం కాగా, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2011 తర్వాత ఆగస్టు తొలి వారంలో ఢిల్లీలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ నెల మొదటి ఏడు రోజుల్లో నగరంలో ఏకంగా 127 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి ఉత్తరప్రదేశ్ మీదుగా ఏర్పడిన ఆవర్తనం, పశ్చిమ ద్రోణి ప్రభావం వల్లే ఈ భారీ వర్షాలు కురిశాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. #WATCH | Heavy rain batters Delhi; Commuters face challenge as they wade through waterlogged roads in Sainik Farms area pic.twitter.com/6DnGGb3iUo— ANI (@ANI) August 7, 2026శనివారం నుంచి వర్షాల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఆగస్టు 10 వరకు ఈ వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఢిల్లీతో పాటు దేశంలోని మరో 14 రాష్ట్రాల్లోనూ వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో రెడ్ అలర్ట్ నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ సూచించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, కేరళలోని కాసర్కోడ్, కన్నూర్, వాయనాడ్, కోజికోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లోనూ రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.ఇది కూడా చదవండి: ఇక మటన్ ముక్కలు కాదు.. ఆకులు! -
మీ EPF డబ్బు సురక్షితంగా ఉండాలా?
ఉద్యోగ విరమణ చేసిన లేదా ఉద్యోగాలు మారిన చందాదారులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నిధులను సకాలంలో ఉపసంహరించుకోవాలని లేదంటే వడ్డీ నష్టపోవాల్సి వస్తుందని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తెలిపింది. ఈ మేరకు ఇనాపరేటివ్ (క్రియాశీలకంగా లేని) ఖాతాలపై చందాదారులకు అధికారికంగా అవగాహన కల్పిస్తూ స్పష్టతనిచ్చింది.ఉద్యోగం వదిలేసిన తర్వాత లేదా చందా చెల్లింపులు నిలిచిపోయిన తర్వాత ఖాతాలోకి కొత్తగా డిపాజిట్లు రాకపోతే ఆ ఖాతాలు ఇనాపరేటివ్‌గా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి ఖాతాలపై వడ్డీ నష్టపోకుండా ఉండేందుకు ఈపీఎఫ్ఓ రెండు విభిన్న వయోపరిమితి ఆధారిత నిబంధనలను స్పష్టం చేసింది.55 ఏళ్ల కంటే ముందే రిటైర్మెంట్ పొందినవారు.. వీరు తమకు 58 ఏళ్ల వయసు నిండేలోపు ఈపీఎఫ్ సొమ్మును పూర్తిస్థాయిలో క్లెయిమ్ చేసుకోవాలి.55 ఏళ్లు లేదా ఆ తర్వాత రిటైర్ అయినవారు.. ఉద్యోగ విరమణ పొందిన తేదీ నుంచి సరిగ్గా మూడేళ్ల (3 ఏళ్లు) కాలపరిమితిలోగా నిధులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.రిటైర్మెంట్ నిధి సురక్షితంగా ఉండాలంటే..మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఎన్) ద్వారా ఈపీఎఫ్ ఖాతాను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తుండాలి.ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలను(కేవైసీ) ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోవాలి.ఉద్యోగం మారిన ప్రతిసారీ పాత ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను కొత్త కంపెనీ ఖాతాకు బదిలీ చేసుకోవాలి.పదవి విరమణ అనంతర నిధులను నిర్దేశిత గడువు దాటకముందే ఉపసంహరించుకోవాలి.ఈపీఎఫ్ఓ జారీ చేసే తాజా మార్గదర్శకాలను తరచూ గమనిస్తూ ఉండాలి.కేవలం పొదుపు చేయడమే కాకుండా విరమణ నిధిని బాధ్యతాయుతంగా నిర్వహించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సకాలంలో క్లెయిమ్‌లు పూర్తి చేసుకుని వడ్డీ నష్టపోకుండా చూసుకోవడం చందాదారుల ప్రాథమిక బాధ్యత.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ తీరుపై వారెన్ బఫెట్ సీరియస్! -
TG: నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: ఈ రోజు (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.యాదాద్రి, నల్గొండ, సూర్యాపేటలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.కాగా నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో హైడ్రా, డీఆర్ఎఫ్, ఎమ్ఆర్టీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. భారీ మోటార్ల సాయంతో రోడ్లపై నీరు తొలగింపు చేపడుతున్నాయి. నిన్న వర్షం వివరాలు. సరూర్ నగర్ 11.2, ఉప్పల్ 8.1 సెం.మీ,బండ్లగూడ 7.9 సెం.మీ, హయత్ నగర్ 7.2 సెం.మీల వర్షం నమోదైంది. -
Kerala: ఎడతెగని వర్ష బీభత్సం.. విద్యా సంస్థలకు సెలవు
తిరువనంతపురం: కేరళలో ఎడతెగని విధంగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వానల కారణంగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం కేరళలోని మొత్తం 14 జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. భారీ వర్షాల ధాటికి పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా కాసరగోడ్, కన్నూర్, వాయనాడ్, పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, త్రిసూర్, మలప్పురం తదితర జిల్లాల్లోని విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగాలు సెలవు ప్రకటించాయి.అలాగే ఆలప్పుళ జిల్లాలోని చెంగన్నూర్, కుట్టనాడ్ తాలూకాలు, ఎర్నాకులం పరిధిలోని విద్యాసంస్థలను మూసివేశారు. ఈ సెలవు పాఠశాలలు, వృత్తి విద్యా సంస్థలు, అంగన్వాడీలు, మతపరమైన విద్యా సంస్థలన్నింటికీ వర్తిస్తుందని కలెక్టర్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు భారీ వర్షాల కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గల్లంతు కాగా, 13 మంది గాయపడ్డారు. వరదలు, కొండచරلలు విరిగిపడటం వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. 27 ఇళ్లు పూర్తిగా, 196 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 209 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి, 5,792 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిరాశ్రయులైన వారికి, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం అందిస్తుందని అధికారులు తెలిపారు. వచ్చే రెండు రోజుల్లో వర్షాల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.ఇది కూడా చదవండి: మనిషి డీఎన్ఏలో అజ్ఞాత పూర్వీకుల ఆనవాళ్లు! -
తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
-
17 రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఉత్తరాదిన అలా.. ఏపీలో ఇలా
-
భారీగా మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా..! అయితే నేరుగా జైలుకే..ఎందుకంటే?
-
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో రేపు (సోమవారం) కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది..మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అనేకచోట్ల ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించింది. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలకు సూచించారు. -
రైతన్నలకు గుడ్ న్యూస్.. ఆగస్టులో దంచుడే దంచుడు
-
వణికిస్తున్న వర్షాలు: పలు రాష్ట్రాల్లో వరద భీభత్సం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్లలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోగా, రైలు, రోడ్డు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. 🚨🌊 कोल्हापुरात मुसळधार पाऊस जिल्ह्यातील कासारी आणि पंचगंगा नद्या दुथडी भरून वाहत असून पंचगंगेची पातळी ३० फुटांवर पोहोचली आहे. (इशारा पातळी ३९ फूट, धोका पातळी ४३ फूट). जिल्ह्यातील ३३ बंधारे पाण्याखाली गेले आहेत. महापुराचा धोका नसला, तरी प्रशासनाने नागरिकांना नदीकाठी न जाण्याचे… pic.twitter.com/w81z1GC9w1— DD Sahyadri News | सह्याद्री बातम्या (@ddsahyadrinews) July 5, 2026ఒడిశాలోని పలు పట్టణాలు జలమయమయ్యాయి. మహారాష్ట్రలో వర్షాల తీవ్రత అత్యధికంగా ఉంది. పుణేలో మరో ముగ్గురు మరణించడంతో, గత మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో మరణాల సంఖ్య 13కు చేరింది. ముంబై, ఠాణే, రాయ్‌గఢ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై కొండచరియలు విరిగిపడటం, కాంక్రీట్ పిల్లర్ కూలిపోవడంతో రవాణా నిలిచిపోయింది.ముంబైలో లోకల్ రైళ్లు, విమాన సర్వీసులు కూడా ప్రభావితమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదల వల్ల రోడ్లు, పంట పొలాలు దెబ్బతిన్నాయి. చంబాలో రాయి పడి 14 ఏళ్ల బాలిక మరణించింది. జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఆకస్మిక వరదలకు హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సమీపంలో వాహనాలు, యంత్రాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఒడిశాలో వాయుగుండం ప్రభావంతో వరుసగా మూడో రోజు భారీ వర్షాలు కురుస్తుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. రాజస్థాన్‌లో సైతం రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. -
తీరం దాటిన వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
షోపియాన్: నక్కిన ఇద్దరు ఉగ్రవాదుల కోసం సైన్యం వేట..
షోపియాన్: జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. శుక్రవారం ఒక పండ్ల తోటలో ఏర్పాటు చేసిన కెమెరాకు చిక్కిన ఇద్దరు ఉగ్రవాదుల కదలికల ఆధారంగా ఈ ముమ్మర గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలోని ఏడు గ్రామాలను ఆర్మీ, స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.భద్రతా దళాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇప్పటివరకు నాలుగు గ్రామాలను ఖాళీ చేయించాయి. కుల్గాం జిల్లాకు చెందిన లతీఫ్, జాకీర్‌లుగా గుర్తించిన ఈ ఉగ్రవాదులు సైన్యంపైకి ఎదురుకాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమై దీటుగా సమాధానం ఇస్తున్నాయి. ఉగ్రవాదులు పారిపోకుండా తోట చుట్టూ ఉన్న అన్ని మార్గాలను సైన్యం పూర్తిగా మూసివేసింది.దక్షిణ కశ్మీర్‌ను సెంట్రల్ కాశ్మీర్, పీర్ పంజాల్ శ్రేణులతో అనుసంధానించే షోపియాన్ వ్యూహాత్మకంగా ఉగ్రవాదులకు కీలక రహదారిగా మారింది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇక్కడి దట్టమైన అడవులు, తోటలు ఉగ్రవాదులు తప్పించుకోవడానికి సహకరిస్తున్నాయి. పాకిస్తాన్ మద్దతు కలిగిన ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను అణచివేయడానికి జరుగుతున్న ఈ ఆపరేషన్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. -
అలర్ట్.. వాట్సాప్ కొత్త ఫీచర్ పై కేంద్రం అప్రమత్తం
-
జులైలో భారీ వర్షాలు! బంగాళాఖాతంలో రెండు అల్ప పీడనాలు
-
గుడ్ న్యూస్.. కదులుతున్న నైరుతి రుతుపవనాలు
-
AP: పలు జిల్లాల్లో భారీ వర్షం.. ఎల్లో అలెర్ట్ జారీ
సాక్షి, విజయవాడ: రాగల మూడుగంటల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా పల్నాడు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా ప్రస్తుతం విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. -
డెడ్‌లైన్ అలర్ట్: ఈ-కేవైసీ, ఐటీ రిటర్న్.. ఇంకా..
జూన్ నెల ముగింపునకు వచ్చేసింది. జూన్ 30 పలు కీలక విషయాలకు గడువు తేదీ. ఎల్పీజీ సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారుల ఈ-కేవైసీ నుంచి ఆదాయపు పన్ను శాఖ పరిశీలన (స్క్రూటినీ) నోటీసుల వరకు, అలాగే త్రైమాసిక ముగింపు నేపథ్యంలో వ్యాపారాల జీఎస్టీ, టీడీఎస్ సంబంధిత సన్నాహాల వరకు పలు ముఖ్యమైన గడువులు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక నష్టాలు లేదా పరిపాలనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఎల్పీజీ సబ్సిడీ నిలిచిపోయే అవకాశంప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు ప్రతి సంవత్సరం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటివరకు ధ్రువీకరణ పూర్తి చేయని ఇతర ఎల్పీజీ సబ్సిడీ లబ్ధిదారులు కూడా జూన్ 30లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేనిపక్షంలో వారి బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీ జమ కావడం తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. అయితే గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. పూర్తి ధర చెల్లించి సిలిండర్ పొందవచ్చు. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ-కేవైసీ పూర్తి చేసిన లేదా సబ్సిడీకి అర్హులు కాని వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు.ఐటీఆర్ స్క్రూటినీ నోటీసులకు కీలకం2025-26 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన ఆదాయపు పన్ను రిటర్నులపై సెక్షన్ 143(2) కింద స్క్రూటినీ నోటీసులు జారీ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు జూన్ 30 చివరి గడువు. ఇది పన్ను చెల్లింపుదారులు రిటర్న్ దాఖలు చేయాల్సిన గడువు కాదు. కేవలం ఇప్పటికే దాఖలైన రిటర్నులను పరిశీలనకు ఎంపిక చేస్తే నోటీసులు పంపేందుకు శాఖకు ఉన్న చట్టబద్ధమైన చివరి తేదీ మాత్రమే. రిటర్నులో చూపిన వివరాలు, ఫారం 26AS, AIS, TIS, బ్యాంకు లావాదేవీలు లేదా అధిక విలువ గల ఆర్థిక లావాదేవీల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తే స్క్రూటినీకి ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) కూడా జూన్ 30నే ఈ గడువుగా స్పష్టం చేసింది.వ్యాపారాలకు త్రైమాసిక ముగింపుజూన్ 30తో 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ముగియనుంది. దీంతో కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ ఖాతాల పుస్తకాలు, టీడీఎస్, టీసీఎస్ నమోదులు, జీఎస్టీ రికార్డులు, ఇతర చట్టబద్ధమైన లెక్కలను నవీకరించుకోవాల్సి ఉంటుంది. తద్వారా జూలైలో దాఖలు చేయాల్సిన జీఎస్టీ రిటర్నులు, టీడీఎస్/టీసీఎస్ స్టేట్మెంట్లను సకాలంలో సమర్పించేందుకు వీలు కలుగుతుంది.ఈ గడువులను చివరి నిమిషానికి వాయిదా వేయకుండా ముందుగానే పూర్తి చేస్తే అనవసరమైన జరిమానాలు, సబ్సిడీ జాప్యాలు, పన్ను సంబంధిత ఇబ్బందులను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
భూకంపం రాకముందే ఎలా తెలిసిందబ్బా?
వెనెజువెలాలో సంభవించిన భారీ భూకంపాలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. అయితే భూకంపాల కంటే ముందే కొందరు ఆండ్రాయిడ్ వినియోగదారుల ఫోన్లకు గూగుల్ నుంచి హెచ్చరిక సందేశాలు రావడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రకంపనలు మొదలుకాక ముందే గూగుల్‌కు ఆ విషయం ఎలా తెలిసి ఉంటుంది అనే ప్రశ్నకు చాలా మంది సమాధానం కోసం వెతుకుతున్నారు.. నిపుణులు చెప్పేది ఏంటంటే.. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లో ఉండే యాక్సిలెరోమీటర్ సెన్సార్‌ను స్క్రీన్ రొటేషన్ కోసం ఉపయోగిస్తుంటారు. అయితే ఇదే సెన్సార్ భూమిలో ఏర్పడే సూక్ష్మ ప్రకంపనలను కూడా గుర్తించగలదు. ఒక ఫోన్ భూకంపానికి సంబంధించిన ప్రకంపనలను గుర్తించిన వెంటనే ఆ సమాచారాన్ని గూగుల్ ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ సిస్టమ్‌కు( Android Earthquake Alerts System)కు పంపిస్తుంది. అలాగని.. కేవలం ఒక ఫోన్ నుంచి వచ్చిన సమాచారంతోనే గూగుల్ నిర్ణయం తీసుకోదు. అదే ప్రాంతంలో ఉన్న మరిన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి వచ్చే సంకేతాలను విశ్లేషిస్తుంది. ఒకేసారి అనేక ఫోన్లు ఒకే తరహా ప్రకంపనలను నమోదు చేస్తే.. అప్పుడు భూకంపం సంభవిస్తున్నట్లు నిర్ధారించి వినియోగదారులకు హెచ్చరికలు పంపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లు ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఉండటంతో.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ భూకంప గుర్తింపు వ్యవస్థగా ఏర్పడింది.అసలు భూకంపం కంటే ముందే హెచ్చరికలు ఎలా వస్తాయన్నది మరింత ఆసక్తికరం. భూకంపం ఒకే దెబ్బగా సంభవించదు. అది తరంగాల రూపంలో వ్యాపిస్తుంది. మొదట వచ్చే పీ-వేవ్స్ వేగంగా ప్రయాణించినప్పటికీ వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఎస్-వేవ్స్ ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఫోన్లు ముందుగా పీ-వేవ్స్‌ను గుర్తించి గూగుల్‌కు సమాచారం పంపుతాయి. మొబైల్ సిగ్నల్స్ కాంతి వేగంతో ప్రయాణించడంతో.. భూకంపం తీవ్ర ప్రకంపనలు ప్రజల వద్దకు చేరుకునేలోపే గూగుల్ హెచ్చరికలు పంపగలుగుతోంది.ఆండ్రాయిడ్ వ్యవస్థలో బీవేర్ అలర్ట్(Be Aware Alert), టేక్ యాక్షన్ అలర్ట్ (Take Action Alert) అనే రెండు రకాల హెచ్చరికలు ఉంటాయి. ప్రకంపనల తీవ్రతను బట్టి ఈ అలర్ట్‌లు వినియోగదారులకు పంపిస్తారు. అలర్ట్‌పై క్లిక్ చేస్తే భూకంప కేంద్రం, అంచనా తీవ్రతతో పాటు భద్రతా సూచనలు కూడా కనిపిస్తాయి.ఇదిలా ఉంటే.. ఈ వ్యవస్థ భారత్‌లోనూ 2023 నుంచే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 5 లేదంటే అంతకంటే పై వెర్షన్ ఉన్న ఫోన్లలో ఈ సేవ పనిచేస్తోంది. మొబైల్ డేటా కనెక్షన్ ఉంటే ముందస్తు హెచ్చరికలను అందుకోవచ్చు.వెనెజువెలా భూకంప ఘటన మరోసారి ఒక విషయాన్ని స్పష్టం చేసింది. మన చేతిలోని స్మార్ట్‌ఫోన్ కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు.. ప్రాణాలను కాపాడగల అత్యవసర హెచ్చరిక వ్యవస్థలో భాగమని!. -
హైదరాబాద్‌లో భారీ వర్షం.. పోలీసుల కీలక సూచన
సాక్షి, హైదరాబాద్: ఈ రోజు ( సోమవారం) హైదరాబాద్‌కు భారీ వర్షహెచ్చరిక ఉన్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షం దృష్ట్యా విద్యాసంస్థలు, ఐటీ కార్యాలయాలు త్వరగా విధులు ముగించి ముందు బయలుదేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమర్జెన్సీ సర్వీసులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కీలక సూచన చేశారు. కాగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా హైదరాబాద్‌లో తీవ్ర స్థాయిలో వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది -
పిల్లలకు టై కడుతున్నారా? ఈ తప్పు చేయొద్దు!
తెలుగు రాష్ట్రాల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై పాఠశాలలు సందడిగా మారాయి. యూనిఫాంలు, షూస్, బ్యాగులతో చిన్నారులు మళ్లీ బడిబాట పట్టారు. అయితే స్కూల్ యూనిఫాంలో భాగమైన ఒక అంశం గురించి వైద్య నిపుణులు హెచ్చరికలను ఓసారి చర్చిద్దాం. చాలామంది తల్లిదండ్రులు సాధారణంగా భావించే ఈ విషయం.. పిల్లల సౌకర్యం, ఆరోగ్యంతో ముడిపడి ఉందని చెబుతున్నారు. స్కూల్ యూనిఫాంలో టై అనేది తప్పనిసరి. పిల్లలు చక్కగా కనిపించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు టైలను సరిగ్గా కట్టి పంపిస్తుంటారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఊడిపోకూడదని భావిస్తుంటారు. అయితే టైని అతిగా బిగించడం వల్ల పిల్లలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.మెడకు బిగిగా టై ధరించడం వల్ల.. మెదడుకు వెళ్లే రక్తప్రసరణపై స్వల్ప ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. జర్మనీకి చెందిన పరిశోధకులు.. నిర్వహించిన అధ్యయనంలో బిగుతుగా కట్టిన టై మెదడుకు వెళ్లే రక్తప్రసరణను తాత్కాలికంగా తగ్గించే అవకాశం ఉందని గుర్తించారు. పిల్లల డాక్టర్లు చెబుతోంది ఏంటంటే.. పిల్లలు రోజులో చాలా గంటల పాటు తరగతి గదుల్లో కూర్చుంటారు. అలాంటి సమయంలో మెడపై అనవసర ఒత్తిడి పడితే తలనొప్పి, తలతిరుగుడు, వికారం, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. టై బిగుతుగా ఉందా? లేదా? అనేది కొందరు పిల్లలు చెప్పలేని సందర్భాలు ఉంటాయి. కొందరు అసౌకర్యంగా ఉన్నా కూడా స్కూల్ నిబంధనల కారణంగా భరిస్తుంటారు. అందుకే ఉదయం పిల్లలను స్కూల్‌కు పంపే ముందు టై మరీ గట్టిగా ఉందేమో ఒకసారి పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.మరోవైపు పరిశుభ్రత విషయంలో కూడా టైలను నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూనిఫాంలను తరచూ ఉతికే తల్లిదండ్రులు టైలను మాత్రం చాలాసార్లు మర్చిపోతుంటారు. పిల్లలు టైలను చేతులతో తాకడం, కొన్నిసార్లు నోటికి దగ్గరగా తీసుకెళ్లడం వల్ల వాటిపై సూక్ష్మక్రిములు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే టైలను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అవసరం.తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు..* టైని మెడకు అతిగా బిగించవద్దు.* మెడకు, టైకి మధ్య ఒకటి లేదా రెండు వేళ్లు వెళ్లేంత ఖాళీ ఉండాలి.* పిల్లలు అసౌకర్యంగా ఉందని చెబితే వెంటనే టైని వదులుగా చేయాలి.* ఇంటికి వచ్చిన తర్వాత టైని తీసేయాలి.* టైలను కూడా యూనిఫాంల మాదిరిగానే క్రమం తప్పకుండా ఉతకాలి.* తలనొప్పి, తలతిరుగుడు వంటి సమస్యలు తరచూ ఉంటే వైద్యులను సంప్రదించాలి.అయితే పైన చెప్పిన అధ్యయనం నేరుగా చిన్నారులపై జరగకపోయినా.. పిల్లల విషయంలో కూడా అతిగా బిగించిన టైలు ఇబ్బందులకు దారితీయవచ్చని వైద్యులు చెబుతున్నారు. టై అనేది యూనిఫాంలో చిన్న భాగమే కావచ్చు. కానీ పిల్లల సౌకర్యం, ఆరోగ్యం విషయంలో ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. స్కూల్‌కు పంపే ముందు టై సరిగ్గా ఉందా, బిగుతుగా లేదో ఒకసారి చూసుకోవడం ద్వారా అనవసరమైన అసౌకర్యాన్ని నివారించవచ్చు. పిల్లలు చక్కగా కనిపించడం ఎంత ముఖ్యమో.. వారు రోజంతా సౌకర్యంగా, ఆరోగ్యంగా ఉండటం అంతకంటే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. -
మరో 2 రోజులు భారీ వర్షాలు
-
హీరోయిన్ పేరుతో ఫేక్ అకౌంట్.. ఫ్యాన్స్‌కు అలర్ట్
ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా, విపరీతంగా సామాజిక మాధ్యమాలను వాడేస్తున్నారు. అదే సమయంలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేయడం సులభమైపోయింది. ముఖ్యంగా ఫేమ్ ఉన్న వారి పేర్లతో ఐడీలు క్రియేట్ సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటితో బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించారు.ఈ నకిలీ ఖాతాలపై హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందించింది. ఇటీవల తన పేరు, ఫొటో, ఫేక్ నంబర్‌తో మోసం చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని అభిమానులను అలర్ట్ చేసింది. దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. ఎవరికైనా ఈ ఫేక్ నంబర్‌తో వస్తే కాల్ రిపోర్ట్ చేయాలని సూచించింది. అది తన అకౌంట్ కాదని.. ఈ సమాచారాన్ని అందించిన వారికి ధన్యవాదాలు అని రాసుకొచ్చింది.ఇక సినిమాల విషయానికొస్తే గుంటూరు కారంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య సరసన వృషకర్మ కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం : హై అలర్ట్
కేరళలో మరో సారి నిపా వైరస్ (Nipah Virus) కలకలం రేపుతోంది. కోజికోడ్‌లోని ఫెరోక్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో నిపా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కేరళ ఆరోగ్య అధికారులు అప్రమత్త మయ్యారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగానే ఉందని పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు.ప్రాథమిక పరిశీలన ప్రకారం, రోగికి మొదట మామూలు జ్వరం వచ్చి తగ్గింది, ఆ తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. నిపా అనుమానిత కేసుగా గుర్తించడానికి ముందు పలు ఆసుపత్రిలను సందర్శించిన తరువాత సదరు రోగి ప్రభుత్వ ఆసుపత్రి అవుట్‌పేషెంట్ విభాగానికి వచ్చారు. దీంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక గిడ్డంగిని శుభ్రం చేస్తున్నప్పుడు అతనికి ఈ ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ప్రదేశంలో వైరస్ సోకిన గబ్బిలాలు ఉండటమే వైరస్ వ్యాప్తికి ప్రాథమిక కారణమని దర్యాప్తు అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన మూలాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇదీ చదవండి: రూ. 954 కోట్ల స్కాం : భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్దీంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించి, తదుపరి చర్యలు తీసుకోనేందుకు గురువారం తిరువనంతపురంలోని ఆరోగ్యమంత్రి కె. మురళీధరన్ కార్యాలయంలో సీనియర్ ఆరోగ్య అధికారులతో సమావేశం కానున్నారు. ఆరోగ్య అధికారులు ఇప్పటికే కాంటాక్ట్-ట్రేసింగ్ చర్యలను ప్రారంభించారని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆరోగ్య మంత్రి ప్రకటించారు. ఆందోళన వద్దు : కేరళ ఆరోగ్య మంత్రిబాధిత వ్యక్తి చాలా మందిని కలిసినప్పటికీ, ప్రస్తుత దశలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. సంబంధిత రోగి చికిత్స కోసం వెళ్లిన ప్రైవేట్ ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించారని, దీనివల్ల ఇతరులకు కూడా వైరస్ వ్యాపించి ఉండవచ్చనే ఆందోళనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా, ఆ రోగి వెళ్లినఆసుపత్రి సిబ్బందిని క్వారంటైన్లోకి వెళ్లాలని ఆదేశించినట్లు చెప్పారు.ఇదీ చదవండి: వాహనదారులకు గుడ్ న్యూస్, ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రద్దు -
రూ.10,000 కోట్లకు 5 ఐపీఓలు రెడీ!
ముంబై: దేశీయ ప్రాథమిక మార్కెట్ రానున్న రోజుల్లో ఐపీఓలతో మరింత సందడి చేయనుంది. గ్లోబల్ ట్రావెల్–టెక్ యూనికార్న్ ఓయో మాతృసంస్థ ‘ప్రిజమ్’, వార్బర్గ్ పింకస్ పెట్టుబడులున్న ‘ట్రూహోమ్ ఫైనాన్స్’, ‘వీగాలాండ్ డెవలపర్స్’, ‘అద్వాంతా ఎంటర్ప్రైజెస్’, ‘మెహతా హైటెక్ ఇండస్ట్రీస్’ల పబ్లిక్ ఇష్యూలకు సెబీ అనుమతి ఇచి్చంది. ఈ ఐదు కంపెనీలు కలిపి సుమారు రూ.10,000 కోట్లు సమీకరించే అవకాశం ఉందని మర్చంట్ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. కంపెనీలు దాఖలు చేసిన ముసాయిదా పత్రాలపై సెబీ జూన్ 1–5 మధ్య తన పరిశీలన పూర్తిచేసి అనుమతులు జారీ చేసింది. ప్రిజమ్ (ఓయో) భారీ ఇష్యూ గ్లోబల్ ట్రావెల్–టెక్ దిగ్గజం ఓయోను నిర్వహిస్తున్న ‘ప్రిజమ్’ సంస్థ ఐపీఓ ద్వారా రూ.6,650 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఈ ఇష్యూతో సంస్థ విలువ 7–8 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంస్థ 2025 డిసెంబరులో కాని్ఫడెన్షియల్ ప్రి–ఫైలింగ్ మార్గం ద్వారా సెబీకి ముసాయిదా పత్రాలను సమరి్పంచింది. ఓయో ఆపరేటర్ ‘ఒరవెల్ స్టేస్’ 2025 సెప్టెంబరులో ‘ప్రిజమ్’గా పేరు మార్చుకుంది. ట్రూహోమ్ ఫైనాన్స్ ఇష్యూ @ రూ.3,000 ట్రూహోమ్ ఫైనాన్స్ ఐపీఓ పరిమాణం రూ.3,000 కోట్లుగా ఉండనుంది. ఇందులో రూ.1,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీ చేయనుంది. అలాగే ప్రమోటర్ సంస్థ ‘మ్యాంగో క్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్’ రూ.1,500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనుంది. తాజా షేర్ల జారీ ద్వారా వచ్చే నిధులను మూలధనాన్ని బలోపేతం చేసుకోవడానికి, రుణాల పంపిణీ అవసరాలను తీర్చడానికి, ఆర్బీఐ నిర్దేశించిన మూలధన సమృద్ధి ప్రమాణాలను పాటించడానికి వినియోగించనుంది. వీగాలాండ్ డెవలపర్స్ వీ–గార్డ్ గ్రూప్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ‘వీగాలాండ్ డెవలపర్స్’ ఐపీఓ ద్వారా రూ.250 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలోనే ఉంటుంది. ఈ నిధులను ప్రస్తుత, రానున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు, అలాగే నివాస సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములను కొనుగోలు చేయడానికి వినియోగించనుంది. అద్వాంతా ఎంటర్ప్రైజెస్ అగ్రికల్చరల్ సొల్యూషన్స్ అందించే ఈ సంస్థ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉంటుంది. ప్రమోటర్ యూపీఎల్ లిమిటెడ్‌తో పాటు ఇతర ఇన్వెస్ట్మెంట్ సంస్థలు మెల్‌వుడ్ హోల్డింగ్స్– ఐఐ, కేఐఏ ఈబీటీ స్కీమ్–2 కలిపి 3.61 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. మెహతా హైటెక్ ఇండస్ట్రీస్అహ్మదాబాద్కు చెందిన ఈ సంస్థ ఐపీఓ ద్వారా గరిష్టంగా 62 లక్షల కొత్త ఈక్విటీ షేర్లను ఐపీఓ ద్వారా జారీ చేయనుంది. -
AP: కాసేపట్లో భారీ వర్షం.. రెడ్ అలర్ట్ జారీ
సాక్షి, విశాఖపట్నం: వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. మరికొద్ది సేపట్లో విశాఖతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుందని పేర్కొంది. ది. వీటితో పాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరకు, గజపతినగరం, విజయనగరం, ఎస్.కోట, కొత్తవలస, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల మండలాల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది.భారీ స్థాయిలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందునవ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. -
HDFC బ్యాంక్ అలర్ట్: EMI కస్టమర్లకు షాక్!
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను పలు కాలపరిమితులపై 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త రేట్లు జూన్ 8, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఎంసీఎల్ఆర్ ఆధారిత గృహ, వ్యక్తిగత, వాహన రుణాలు తీసుకున్న కొందరు కస్టమర్లకు భవిష్యత్తులో ఈఎంఐలు (EMI) పెరిగే అవకాశం ఉంది.ఆర్బీఐ రెపో రేటు స్థిరంగానే.. అయినా పెంపు ఎందుకు?గత వారం జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. అయితే బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయం, డిపాజిట్ ఖర్చులు, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాల ఆధారంగా ఎంసీఎల్ఆర్ను బ్యాంకులు స్వతంత్రంగా నిర్ణయిస్తాయి. అందుకే రెపో రేటులో మార్పు లేకపోయినా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన అంతర్గత బెంచ్‌మార్క్ రేట్లను సవరించింది.ఏయే కాలపరిమితుల్లో ఎంత పెరిగింది?సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్ల ప్రకారం ఓవర్‌నైట్ రేటు 8.05 శాతం నుంచి 8.10 శాతానికి పెరిగింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.15 శాతం నుంచి 8.20 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.30 శాతం నుంచి 8.35 శాతానికి చేరింది.రిటైల్ రుణాలకు కీలక బెంచ్‌మార్క్‌గా భావించే ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.35 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్లో అత్యధికంగా 10 బేసిస్ పాయింట్ల పెంపు చోటుచేసుకుని 8.45 శాతం నుంచి 8.55 శాతానికి చేరగా, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.60 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ మాత్రం 8.05 శాతం వద్ద యథాతథంగా కొనసాగింది.తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు🔹 ఓవర్‌నైట్ – 8.10%🔹 1 నెల – 8.05%🔹 3 నెలలు – 8.20%🔹 6 నెలలు – 8.35%🔹 1 సంవత్సరం – 8.40%🔹 2 సంవత్సరాలు – 8.55%🔹 3 సంవత్సరాలు – 8.65%ఈఎంఐలు వెంటనే పెరుగుతాయా?అలా ఏం లేదు. ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణాల్లో వడ్డీ రేటు ప్రతి నెల, త్రైమాసికం లేదా వార్షిక రీసెట్ తేదీకి అనుగుణంగా మారుతుంది. కాబట్టి మీ రుణ ఖాతాకు తదుపరి రీసెట్ తేదీ వచ్చినప్పుడు మాత్రమే కొత్త ఎంసీఎల్ఆర్ ప్రభావం కనిపిస్తుంది. ఈఎంఐ పెరగవచ్చు లేదా రుణ కాలపరిమితి పొడిగించవచ్చు. ఇది రుణ ఒప్పంద నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.అసలేమిటీ ఎంసీఎల్ఆర్?ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) అనేది బ్యాంకు రుణాలను ఇవ్వగల కనీస వడ్డీ రేటు. 2016లో ఆర్బీఐ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, నగదు నిల్వల వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దీనిని నిర్ణయిస్తారు. అనేక పాత గృహ, వ్యక్తిగత, వాహన రుణాలు ఇప్పటికీ ఎంసీఎల్ఆర్ ఆధారంగానే కొనసాగుతున్నాయి.బేస్ రేట్, బీపీఎల్ఆర్ యథాతథంహెచ్డీఎఫ్సీ బ్యాంక్ బేస్ రేట్ ప్రస్తుతం 8.80 శాతంగా కొనసాగుతోంది. అలాగే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (BPLR) 17.30 శాతంగా ఉంది. ఈ రేట్లు డిసెంబర్ 26, 2025 నుంచి అమల్లో ఉన్నాయి.రుణగ్రహీతలు ఏం చేయాలి?మీ హోమ్ లోన్ లేదా ఇతర రుణం ఎంసీఎల్ఆర్ ఆధారితమా, లేక EBLR/రెపో-లింక్డ్ విధానంలో ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలు ఉన్నవారు తమ తదుపరి రీసెట్ తేదీని పరిశీలించి ఈఎంఐపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసుకోవచ్చు. రెపో-లింక్డ్ రుణాలపై ఈ తాజా ఎంసీఎల్ఆర్ పెంపు ప్రత్యక్ష ప్రభావం చూపదు. -
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. వానలు వస్తున్నాయ్!
-
భారత్ ను కమ్మేసిన 2500 కిలోమీటర్ల రాకాసి మేఘాలు
-
ఇన్వెస్టర్స్ అలర్ట్: ఇవిగో ‘న్యూ ఫండ్ ఆఫర్స్’
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కొత్తగా స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్) కేటగిరీలో రెండు ఫండ్స్‌ని ఆవిష్కరించింది. ఐసిఫ్ యాక్టివ్ అసెట్ అలొకేటర్ లాంగ్–షార్ట్ ఫండ్, ఐసిఫ్ ఈక్విటీ లాంగ్–షార్ట్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఈ రెండు ఫండ్ ఆఫర్లు జూన్ 02 వరకు అందుబాటులో ఉంటాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా లాంగ్–షార్ట్ పొజిషన్లు తీసుకోవడం, డెరివేటివ్స్ ద్వారా రిస్క్‌లను అదుపులో ఉంచడంలాంటి విధానాలతో మెరుగైన రాబడులు అందించేందుకు ఈ వ్యూహాలు పని చేస్తాయని సంస్థ ఈడీ శంకరన్ నరేన్ తెలిపారు.మొదటిది ఈక్విటీ, డెట్, కమోడిటీస్ డెరివేటివ్స్, ఇన్విట్స్ మొదలైన వాటికి నిధులు కేటాయిస్తుంది. రెండోది వివిధ మార్కెట్ క్యాప్స్‌వ్యాప్తంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. డెరివేటివ్స్ వ్యూహాన్ని కూడా పాటిస్తూ మెరుగైన రాబడులు అందించడంపై దృష్టి పెడుతుంది. ఈ తరహా సిఫ్లో తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్నవారు కనీసం రూ. 10 లక్షలు, ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వారు రూ. 10,000 నుంచి వీటిలో పెట్టుబడులు పెట్టొచ్చు. కోటక్ ఎంఎఫ్ నిఫ్టీ ఫండ్ కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ ఆల్ఫా లో–వోలటైలిటీ 30 ఇండెక్స్ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. ఇది జూన్ 12తో ముగుస్తుంది. ధరల పరంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కాకుండా విస్తృత మార్కెట్‌కి మించి రాణించగలిగే అవకాశాలున్న 30 సంస్థలు ఈ ఇండెక్స్‌లో ఉంటాయి. పరిస్థితులను బట్టి ఈ స్టాక్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలు గల ఇన్వెస్టర్లు దీన్ని పరిశీలించవచ్చని సంస్థ ఎండీ నీలేష్ షా తెలిపారు. మహీంద్రా మాన్యులైఫ్ ‘ఎంపవర్ సిఫ్’ సిఫ్ కేటగిరి కింద మహీంద్రా మాన్యులైఫై మ్యుచువల్ ఫండ్ కొత్తగా ‘ఎంపవర్ సిఫ్’ని ఆవిష్కరించింది. ఈ తరహా ఫండ్స్‌లో లాంగ్–షార్ట్ పొజిషనింగ్, డెరివేటివ్స్ ఆధారిత వ్యూహాలు కూడా అమలు చేస్తారని సంస్థ తెలిపింది. మారుతున్న ఇన్వెస్టర్ల ఆకాంక్షలు, లక్ష్యాలకు అనుగుణంగా మరింత మెరుగైన రాబడులను అందించేందుకు ఇవి ఉపయోగపడతాయని సంస్థ ఎండీ ఆంథోని హెరెడియా తెలిపారు. ఎంపవర్ సిఫ్ కింద ఈక్విటీ, హైబ్రిడ్, ఫిక్సిడ్ ఇన్రం కేటరిగీలవ్యాప్తంగా వివిధ వ్యూహాలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. -
స్టాక్ మార్కెట్ అలర్ట్: ట్రేడింగ్ సమయంలో మార్పు
డెరివేటివ్స్ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్–ఎఫ్అండ్ఓ) విభాగంలో ట్రేడింగ్ సమయాలను పొడిగిస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం 2026 ఆగస్టు 3 నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో సాధారణ ట్రేడింగ్ ముగింపు సమయం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 3:40 గంటలకు మారనుంది. ప్రీ-ఓపెన్ సెషన్, మార్కెట్ ప్రారంభ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.క్యాష్ మార్కెట్లో ప్రవేశపెట్టనున్న ‘క్లోజింగ్ ఆక్షన్ సెషన్’ (CAS)తో డెరివేటివ్స్ ట్రేడింగ్ సమయాలను సమలేఖనం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఎన్ఎస్ఈ వెల్లడించింది. కొత్త విధానంలో క్యాష్ మార్కెట్లో మధ్యాహ్నం 3:15 నుంచి 3:35 గంటల వరకు క్లోజింగ్ ఆక్షన్ నిర్వహించి, ఆ రోజు అధికారిక ముగింపు ధర (Closing Price)ను నిర్ణయించనున్నారు.ట్రేడర్లకు మరింత వెసులుబాటుక్లోజింగ్ ఆక్షన్ సమయంలో ఏర్పడే ధరల మార్పులను దృష్టిలో ఉంచుకుని, ఎఫ్అండ్ఓ ట్రేడర్లు తమ పొజిషన్లను హెడ్జ్ చేసుకోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి లేదా ఎగ్జిట్ కావడానికి అదనంగా 10 నిమిషాల సమయం లభిస్తుంది. దీంతో క్యాష్, డెరివేటివ్స్ మార్కెట్ల మధ్య ముగింపు సమయాల్లో ఉండే వ్యత్యాసం తగ్గి, ధరల ఆవిష్కరణ మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.మారని అంశాలు ఇవే...ప్రీ-ఓపెన్ సెషన్ ఉదయం 9 గంటలకే ప్రారంభంరెగ్యులర్ మార్కెట్ ప్రారంభ సమయం యథాతథంట్రేడ్ మాడిఫికేషన్ సౌకర్యం సాయంత్రం 4:15 గంటల వరకు కొనసాగుతుందిఎఫ్అండ్ఓ క్లోజింగ్ ధరల లెక్కింపునకు ఉపయోగించే VWAP విండోను 3:10–3:40 గంటల మధ్య ట్రేడింగ్‌కు అనుగుణంగా సవరించనున్నారు.ఇటీవలి కీలక మార్పులుగత కొంతకాలంగా డెరివేటివ్స్ మార్కెట్లో ఎన్ఎస్ఈ పలు సంస్కరణలను అమలు చేస్తోంది. 2025 చివర్లో ఎఫ్అండ్ఓ విభాగంలో ప్రీ-ఓపెన్ సెషన్‌ను ప్రవేశపెట్టగా, ఇప్పుడు క్లోజింగ్ ఆక్షన్ వ్యవస్థకు అనుగుణంగా ట్రేడింగ్ సమయాన్ని కూడా పొడిగిస్తోంది. మార్కెట్ పారదర్శకత, మెరుగైన ధరల నిర్ణయం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వ్యవస్థను తీర్చిదిద్దడమే ఈ మార్పుల లక్ష్యంగా పేర్కొంటున్నారు. -
ప్రజలకు హెచ్చరిక.. రానున్న మూడు గంటల్లో భారీ వర్షం
ఏపీలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. శ్రీకాకుళం, మన్యం విజయనగరం జిల్లాల్లో మరో మూడు గంటల్లో తీవ్ర స్థాయిలో పిడుగులు, గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలన్నాయంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద హోర్డింగుల వద్ద ప్రజలు నిలబడకూడదని కీలక సూచనలు చేసింది. కాగా ఇదివరకే పలాసలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఉరుములు మెరుపులతో భారీ వానలు పడుతుండడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తెలంగాణలో రేపు పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
AP: మరి కొద్ది సేపట్లో వర్షం?.. వాాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి, అమరావతి: రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీచేసింది. రాగల మూడు గంటల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. విజయనగరం జిల్లాలో సైతం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.ప్రజలందరూ ఈ సూచనలను పాటించాలని తెలిపింది. 50 నుంచి 60కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో చెట్లు, పోల్స్,హోర్డింగ్స్ క్రింద ఎట్టిపరిస్థితుల్లో నిలబడకూడదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈ హెచ్చరికలను జారీ చేశారు. -
SBI అలర్ట్: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్?
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఉందా? ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చే వారం బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీ కోసమే. మే 23 (శనివారం) నుండి దేశవ్యాప్తంగా వరుసగా ఆరు రోజుల పాటు ఎస్బీఐ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో, కొన్ని వార్తా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. వారాంతపు సెలవులు, సిబ్బంది సమ్మె, బక్రీద్ పండుగలు వరుసగా రావడం దీనికి కారణమని ప్రచారం జరుగుతోంది.అయితే, నిజంగానే 6 రోజులు బ్యాంకులు పూర్తిగా మూతపడతాయా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల జాబితా, తాజా పరిస్థితుల ప్రకారం అసలు వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం.మే 23 నుండి మే 28 వరకు బ్యాంకుల పరిస్థితి ఇదీ..మే 23 (నాల్గవ శనివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివుంటాయి.మే 24 (ఆదివారం):సాధారణ వారాంతపు సెలవు.మే 25 & 26 (సోమ, మంగళవారాలు): సిబ్బంది సమ్మెతో ఎస్బీఐ శాఖల్లో అంతరాయం మే 27 (బుధవారం): బక్రీద్ సెలవు. హైదరాబాద్, విజయవాడ, న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబైతో పాటు దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.మే 28 (గురువారం): బక్రీద్ సెలవు (రెండవ రోజు/కొన్ని ప్రాంతాల్లో) బెంగళూరు, చెన్నై, జైపూర్, పాట్నా వంటి కొన్ని నిర్దిష్ట నగరాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది.అయితే బక్రీద్ సెలవు అనేది తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) మే 27న ఉంటుంది. మే 28న ఇక్కడ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. మే 25, 26 తేదీల్లో సిబ్బంది సమ్మె కారణంగా ఎస్బీఐ బ్రాంచ్‌లలో క్లెరికల్ సేవలకు అంతరాయం ఉంటుంది. ఇతర బ్యాంకులు (డిజిటల్ సేవలు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి ప్రైవేట్ బ్యాంకులు) యథావిధిగా పనిచేస్తాయి.సమ్మెకు కారణాలు ఏమిటి?ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) వివిధ డిమాండ్ల సాధనకై ఈ రెండు రోజులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. సబ్-స్టాఫ్, ఆర్మ్డ్ గార్డుల ఖాళీలను భర్తీ చేయాలని, ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలని, అలాగే కస్టమర్లకు బీమా ఉత్పత్తులను బలవంతంగా అంటగట్టే ("మిస్-సెల్లింగ్") విధానాన్ని నిరసిస్తూ 16 డిమాండ్లతో ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ ఈ సమ్మె నోటీసు ఇచ్చింది.ఎస్బీఐ విజ్ఞప్తిసిబ్బంది సమ్మె నేపథ్యంలో కస్టమర్లకు ఎస్బీఐ విజ్ఞప్తి చేసింది. బ్యాంకింగ్ సేవల కోసం ప్రత్యామ్నాయంగా కస్టమర్ సర్వీస్ పాయింట్లు, ఏంటీఎం, యోనో, యూపీఐ వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకోవాలని సూచించింది. అదే సమయంలో ఖాతాదారులకు అత్యవసర సేవలకు గానూ బ్యాంక్ శాఖల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్బీఐ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.pic.twitter.com/1B6bJTc9Co— State Bank of India (@TheOfficialSBI) May 22, 2026 -
విపత్తులకు కొత్త వ్యవస్థ మొబైల్ సైరన్ టెస్ట్ సక్సెస్
-
మొబైల్ ఫోన్లలో ఎమర్జెన్సీ అలారం మోత
కొన్ని నిమిషాల కిందట దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా మోగాయి. ఫోన్లలో వింత శబ్దంతో కూడిన అలారం రావడంతో పౌరులు మొదట ఆందోళనకు గురయ్యారు. అయితే, ఇది ఎటువంటి ప్రమాద సంకేతం కాదని, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘సెల్ బ్రాడ్కాస్ట్’ వ్యవస్థలో భాగంగా నిర్వహించిన పరీక్ష అని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.ఈరోజు ఉదయం 11:46 గంటలకు ఈ టెస్ట్ మెసేజ్ పౌరుల మొబైల్ ఫోన్లకు చేరుకుంది. ‘ఇది భారత ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థ పంపిన నమూనా పరీక్షా సందేశం’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు.అసలేం జరుగుతోంది?నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్)తో కలిసి దేశవ్యాప్తంగా అత్యాధునిక విపత్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీన్ని ‘సాచెట్’ అని పిలుస్తారు. ఈ వ్యవస్థ పనితీరును, దేశంలోని మొబైల్ నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రభుత్వం ప్రస్తుతం దశలవారీగా పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నేడు ఆ ఫ్లాష్ ఎస్ఎంఎస్ పంపించారు. ఇది కేవలం ఒక డ్రిల్ మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ పూర్తిగా సీ-డాట్ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత. ఇది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ సిఫార్సు చేసిన కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ప్రధాన లక్షణాలు..భూకంపాలు, సునామీలు, వరదలు, పిడుగులు వంటి ప్రకృతి వైపరీత్యాలతోపాటు గ్యాస్ లీకేజీలు లేదా రసాయన ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది.విపత్తు సంభవించే అవకాశం ఉన్న నిర్దిష్ట ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే ఈ సందేశాలు పంపిస్తారు. తద్వారా అనవసర గందరగోళం తగ్గుతుంది.మొబైల్ డేటా లేకపోయినా, నెట్వర్క్ ఉన్నంత వరకు అత్యవసర సందేశం క్షణాల్లో ఫోన్‌ను చేరుతుంది.అందరి రక్షణే లక్ష్యంగా..ప్రస్తుతం జరుగుతున్నవి ప్రాథమిక పరీక్షలు మాత్రమే. ఈ పరీక్షల తర్వాత, భవిష్యత్తులో ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇది టెస్ట్ ఛానెల్ సెట్టింగులతో సంబంధం లేకుండా అన్ని రకాల మొబైల్ ఫోన్లలోనూ, అన్ని భారతీయ భాషల్లోనూ హెచ్చరికలను పంపగలదు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు దేశంలోని ప్రతి పౌరుడికి ముందస్తు సమాచారం చేరవేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.ఇదీ చదవండి: మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన -
మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్!
ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయి, స్క్రీన్‌పై వింతైన మెసేజ్ కనిపించే అవకాశం ఉంది. భయాందోళన చెందకండి. ఇది ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు మనల్ని అప్రమత్తం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన అత్యాధునిక ‘సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్’ అయి ఉండవచ్చు. అది ఈ వ్యవస్థలో భాగంగా వస్తున్న టెస్టింగ్ సందేశం మాత్రమే.అసలేం ఏం జరుగుతోంది?నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్) సహకారంతో దేశవ్యాప్తంగా విపత్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీన్ని ‘సాచెట్’ (SACHET) అని పిలుస్తారు. ఈ వ్యవస్థ పనితీరును, మొబైల్ నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రభుత్వం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్షలను నిర్వహిస్తోంది. అందుకే, మీరు అందుకున్న ఆ ఫ్లాష్ ఎస్ఎంఎస్ ఒక డ్రిల్ మాత్రమే.సందేశం వస్తే ఏం చేయాలి?మీరు ఆ సందేశాన్ని చూసినప్పుడు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి మీరు బదులివ్వాల్సిన లేదా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన పని లేదు. ఇవి కేవలం టెస్టింగ్ మేసేజ్‌లు మాత్రమే. ఒకవేళ మీరు ఈ అలర్ట్‌లను నియంత్రించాలనుకుంటే మీ ఫోన్ సెట్టింగ్స్‌లోని ‘Safety & Emergency’ లేదా ‘Wireless Emergency Alerts’ విభాగంలోకి వెళ్లి మార్చుకునే అవకాశం ఉంటుంది.ఈ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ అనేది సీడాట్ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) సిఫార్సు చేసిన కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ (సీఏపీ) ఆధారంగా ఇది పనిచేస్తుంది. భూకంపాలు, సునామీలు, వరదలు, మెరుపులు వంటి ప్రకృతి వైపరీత్యాలే కాకుండా గ్యాస్ లీకేజీలు లేదా రసాయన ప్రమాదాల వంటి మానవ నిర్మిత అత్యవసర పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది. విపత్తు సంభవించే అవకాశం ఉన్న నిర్దిష్ట ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే ఈ సందేశాలు పంపిస్తారు. తద్వారా అనవసర గందరగోళం తగ్గుతుంది.భవిష్యత్తు ప్రణాళికప్రస్తుతం జరుగుతున్నవి ప్రాథమిక పరీక్షలు మాత్రమే. ఈ పరీక్షల తర్వాత భవిష్యత్తులో ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇది టెస్ట్ ఛానెల్ సెట్టింగులతో సంబంధం లేకుండా అన్ని రకాల మొబైల్ ఫోన్లలోనూ, అన్ని భారతీయ భాషల్లోనూ హెచ్చరికలను పంపగలదు. అంటే, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు దేశంలోని ప్రతి పౌరుడికి ముందస్తు సమాచారం చేరవేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. కాబట్టి, తదుపరిసారి మీ ఫోన్ సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్‌తో మోగితే అది మీ భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న ఏర్పాటు అని గుర్తుంచుకోండి. అప్రమత్తంగా ఉండండి.ఇదీ చదవండి: మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన -
అలర్ట్: రేపటి నుంచి ఈ బ్యాంక్ అకౌంట్లు క్లోజ్!
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపయోగంగా ఉన్న లక్షలాది ఖాతాలను రేపటి (ఏప్రిల్ 16) నుండి శాశ్వతంగా మూసివేయాలని బ్యాంక్ యాజమాన్యం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇతర ప్రభుత్వ బ్యాంకుల బాటలోనే పీఎన్బీ కూడా ఈ కఠిన చర్యలకు ఉపక్రమించడం బ్యాంకింగ్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.ఎవరి ఖాతాలు మూతపడతాయి?మీడియా నివేదికల ప్రకారం.. ఈ కింది కేటగిరీల కిందకు వచ్చే ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది.మూడేళ్లుగా లావాదేవీలు లేనివి: గత మూడేళ్లుగా కనీసం ఒక్కసారి కూడా వాడని ఖాతాలు.జీరో బ్యాలెన్స్: ఖాతాలో జీరో బ్యాలెన్సు ఉండి, చాలా కాలంగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలు.కేవైసీ అప్డేట్ లేనివి: గడువులోపు e-KYC (ఈ-కేవైసీ) పూర్తి చేయని ఖాతాలపై బ్యాంక్ వేటు వేసే అవకాశం ఉంది.ఎందుకీ కఠిన నిర్ణయం?బ్యాంకులో వేల సంఖ్యలో నిరుపయోగంగా పడి ఉన్న ఖాతాల వల్ల మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని బ్యాంక్ భావిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా, అలాగే బ్యాంక్ డేటాను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో క్రమానుగతంగా ఇటువంటి చర్యలు చేపడుతుంటారు.ఖాతాను కాపాడుకోవాలంటే..మీ ఖాతా క్లోజ్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ కింది పనులు పూర్తి చేయండి:మీ సమీపంలోని పీఎన్బీ బ్రాంచ్‌కు వెళ్లి వెంటనే ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.మీ అకౌంట్లో కొంత మొత్తాన్ని జమ చేయండి.కనీసం ఒక చిన్న లావాదేవీ (డ్రా చేయడం లేదా జమ చేయడం) చేయడం ద్వారా అకౌంట్ యాక్టివ్‌గా ఉందని నిర్ధారించుకోండి.తీసుకెళ్లాల్సిన పత్రాలుఈ పనుల నిమిత్తం బ్యాంకుకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, విద్యుత్ లేదా నీటి బిల్లు (అడ్రస్ ప్రూఫ్ కోసం), బ్యాంక్ పాస్‌బుక్ ఒరిజినల్ పత్రాలతో పాటు వాటి ఫోటోకాపీలను (జిరాక్స్) వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి.ఇదీ చదవండి: పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు -
దేశంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. అలర్ట్ జారీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఉదయం పది గంటలకే భానుడు భగభగలాడుతుండటంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రానున్న రెండు వారాల్లో ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వేడి గాలులుల వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరికలు జారీ చేసింది.ఏప్రిల్ 17 నాటికి దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 41 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుందని ఐఎండి అంచనా వేసింది. ఏప్రిల్ 12 నుంచి 18 వరకు వాయువ్య భారతదేశంలో 4 నుంచి 6 డిగ్రీలు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి మధ్య ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీలు, గుజరాత్, మహారాష్ట్రల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగనున్నాయి. ముఖ్యంగా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో వడగాల్పుల ముప్పు తీవ్రంగా పొంచి ఉంది. 🚨 Next 2 weeks are going to be very hot for Indian Subcontinent 🌡️South India also at 42-45°C 📈📈Mumbai at 35-37°C 📈 pic.twitter.com/oAOHBXMLE3— Mumbai Rains (@rushikesh_agre_) April 12, 2026రాబోయే వారం రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాల్లో విపరీతమైన ఉక్కపోత వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే అస్సాం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు ఎండల విషయంలో అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ఇది కూడా చదవండి: యోగి, సువేందుల వైరల్ వీడియో.. ‘ఎంత భక్తో’ -
వారమైనా గ్యాస్ సిలిండర్ రాలేదా?
హైదరాబాద్‌కు చెందిన ఓ టెకీ గ్యాస్ బుకింగ్ చేసుకున్నాడు. ఎప్పటిలాగే ఆన్లైన్ పేమెంట్ యాప్ ద్వారా చెల్లింపు చేశాడు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యిందని.. వారం రోజుల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది ఓ మెసేజ్ వచ్చింది. కానీ, వెంటనే రావాల్సిన డీఏసీ కోడ్ మాత్రం రాలేదు. అయితే ఇంకా టైం ఉంది కదా అని కూల్‌గా ఉండిపోయాడు. వారం గడిచింది.. డీఏసీ కోడ్, సిలిండర్.. రెండూ రాలేదు. పది రోజులకు డీఏసీ కోడ్ వచ్చింది. హమ్మయ్యా.. ఇక రేపో, మాపో సిలిండర్ వస్తుంది లే అనుకున్నాడు. కానీ పేమెంట్ చేసి రెండు వారాలు గడిచినా సిలిండర్ రాకపోవడంతో అసహనానికి గురయ్యాడు. డెలివరీ బాయ్స్ అని అడిగితే.. ఏం చేయలేమన్న సమాధానం. గ్యాజ్ ఏజెన్సీ వద్దకు వెళ్తే వాళ్లూ చేతులెత్తేశారు. దీంతో సిలిండర్ ఎప్పుడు వస్తే.. అప్పుడే అన్నట్లు ఉండిపోయాడు. ఒక హైదరాబాద్‌లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకు వస్తే దేశంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితితేనే ఎదుర్కొంటున్నారు వినియోగదారులు.దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేనేలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ అయితే.. ఓ అడుగు ముందుకు వేసి ఎన్ని ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ అయ్యాయో లెక్కలేసి చెబుతోంది. వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని ప్రభుత్వం, మంత్రిత్వ శాఖ చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగానే కనిపిస్తోంది. ఇదో భారీ స్కామ్?!ఎల్పీజీ సిలిండర్ సరఫరాలో ఆలస్యానికి ‘గోస్ట్ డెలివరీలు’ ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంటే.. బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు చెప్పిన టైంలో సిలిండర్ అందదు. కొన్ని సందర్భాల్లో ఏకంగా సిలిండర్ డెలివరీ అయినట్లు మెసేజ్ మాత్రం వస్తుంది. అలా.. డెలివరీ అయ్యిందని రికార్డుల్లోకి ఎక్కుతోంది. ఆందోళన చెందుతున్న కస్టమర్లకు ఏదో ఒకటి సర్ది చెబుతున్నారు. కొన్నిరోజులు పోయాక.. నెమ్మదిగా మరో సిలిండర్‌ను కస్టమర్లకు అడ్జస్ట్ చేసి అందిస్తున్నారు. మరి మధ్యలో ఆ సిలిండర్ ఏమైనట్లు?.. అలాంటి వాటిని బ్లాక్ మార్కెట్లోకి చేర్చి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. తాజాగా ఢిల్లీ, మహారాష్ట్ర, పుణేతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నిచోట్ల అధికారుల దాడుల్లో పెద్ద సంఖ్యలో సిలిండర్లు పట్టుబడ్డాయి. ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ లేదంటే మనీపే యాప్‌ల ద్వారా బుకింగ్ చేసిన ఎల్పీజీ సిలిండర్ల విషయంలో ఇలా ప్రధానంగా జరుగుతోందని గుర్తించారు. గోస్ట్ డెలివరీ స్కామ్ కారణంగా వినియోగదారుడు తీవ్ర గందరగోళానికి గురవుతున్నాడు. కొందరైతే మళ్లీ బుకింగ్ చేసుకుని మరీ ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. గ్యాస్ కంపెనీలు మాత్రం గోస్ట్ డెలివరీ ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నాయి. తమ యాప్‌లు క్రాష్ కావడం, సర్వర్ సమస్యలు, బుకింగ్.. డెలివరీ రికార్డుల్లో లోపాల వల్లే ఆలస్యం జరుగుతోందని చెబుతున్నాయి. ఇలా చేయండి.. సిలిండర్ డెలివరీకి డీఏసీ(Delivery Authentication Code) కోడ్ అనేది తప్పనిసరి. ఆ కోడ్ చెబితేనే డెలివరీ బాయ్ సిలిండర్ ఇస్తాడు. కానీ, ఘోస్ట్ డెలివరీ దందా ఆ కోడ్‌తో సంబంధం లేకుండానే నడుస్తోందని తెలుస్తోంది. మీకు DAC కోడ్ రాకపోవడం లేదంటే డెలివరీ ఆలస్యం అవ్వడం వెనుక సిస్టమ్ లోపాలతో పాటు డీలర్ల దుర్వినియోగం, బ్లాక్ మార్కెట్‌కి మళ్లింపు కారణాలు ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి డీఏసీ కోడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే కస్టమర్ కేర్‌కి ఫిర్యాదు చేయండి. బుకింగ్ వివరాలు, నగదు చెల్లింపు రసీదులు, స్క్రీన్షాట్లను భద్రంగా ఉంచుకోండి. ఇవి ఫిర్యాదుల టైంలో సాక్ష్యంగా ఉపయోగపడతాయి.సిలిండర్ రాలేదన్న ఆందోళనతో డబ్బులు చెల్లించి మళ్లీ డబుల్ బుకింగ్ చేస్కోవద్దుడీఏసీ కోడ్ రాకుండా.. సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీలకు, గోదాంలకు పరుగులు తీయొద్దుఆన్లైన్ మోసాలు జరిగే అవకాశం ఉంటుంది గనుక అధికారిక పోర్టల్/మనీ యాప్‌ల ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలిచెప్పిన టైంలో గనుక సిలిండర్ డెలివరీ జరగకపోయినా, డీఏసీ కోడ్ విషయంలో ఆలస్యం లేదంటే ఏదైనా మతలబు జరిగినా.. సంబంధిత గ్యాస్ కస్టమర్ కేర్ నంబర్లకు సంప్రదించి ఫిర్యాదు చేయడం ఉత్తమ మార్గంఫిర్యాదుల కోసం.. • ఇండియన్ గ్యాస్ (IndianOil): 1800-2333-555• హెచ్‌పీ గ్యాస్ (HPCL): 1800-233-3555• భారత్ గ్యాస్ (BPCL): 1800-22-4344ఈ టోల్ ఫ్రీ నెంబర్లే కాదు.. అధికారిక పోర్టల్/యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అందుకోసం ఆ యాప్/వెబ్సైట్లలో Complaints/Feedback అనే విభాగం ఒకటి ఉంటుంది. లేదంటే.. స్థానిక డీలర్‌కి రాతపూర్వకంగా ఫిర్యాదును అందజేయవచ్చు. ఇవేకాదు.. వినియోగదారుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 1915కి కూడా కాల్ చేసి ఏ గ్యాస్ కంపెనీ మీద అయినా ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే.. 8800001915 అనే నెంబర్‌కు మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే consumerhelpline.gov.in అనే వెబ్సైట్ ద్వారానూ ఫిర్యాదు చేయొచ్చు. అయితే.. ఫిర్యాదులు చేసే టైంలో మీ గ్యాస్ బుక్ కన్జూమర్ నెంబర్, ఎల్పీజీ ఐడీ నెంబర్, అలాగే గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన ID.. పేమెంట్ రసీదు, మెసేజ్ స్క్రీన్‌షాట్ వంటి సాక్ష్యాలుగా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. -
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)
-
హైదరాబాద్: మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం వరుణుడి పలకరింపు (ఫొటోలు)
-
బ్యాంకులు దేశవ్యాప్తంగా తెరిచేది ఒక్క రోజే!
మీకు ఈ వారం బ్యాంకు పనులున్నాయా? అయితే ఒక్క నిమిషం ఆగండి! మార్చి 30 నుండి ఏప్రిల్ 5 మధ్య దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. పండుగలు, వార్షిక ఖాతాల ముగింపు, ఆదివారం సెలవుల కారణంగా ఈ వారంలో దాదాపు ఆరు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది.వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పండుగలు, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే వంటి సందర్భాలను పురస్కరించుకుని ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు ఈ వారంలో ఆరు రోజులు మూతపడనున్నాయి. అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు తెరిచేది వారంలో ఒక్క రోజే అన్నమాట.సెలవుల పూర్తి వివరాలు ఇవే..మార్చి 30 (సోమవారం): మహావీర్ జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు పనిచేయవు.మార్చి 31 (మంగళవారం): మహావీర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో సెలవు.ఏప్రిల్ 1 (బుధవారం): బ్యాంకుల వార్షిక ఖాతాల ముగింపు (Annual Closing) సందర్భంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో సాధారణ వినియోగదారులకు సేవలు నిలిచిపోతాయి.ఏప్రిల్ 2 (గురువారం): మౌండీ థర్స్ డే (Maundy Thursday) సందర్భంగా కేరళలో బ్యాంకులు మూసివేస్తారు.ఏప్రిల్ 3 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.ఏప్రిల్ 5 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు.సాధారణంగా నెలలో మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. కాబట్టి ఏప్రిల్ 4 (శనివారం) నాడు బ్యాంకులు తెరిచి ఉండే అవకాశం ఉంది.డిజిటల్ సేవలు యథాతథంబ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. యూపీఐ (UPI) చెల్లింపులు (GPay, PhonePe మొదలైనవి) ఎప్పటిలాగే పనిచేస్తాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా నిధుల బదిలీ చేసుకోవచ్చు. ఏటీఎం (ATM) కేంద్రాల్లో నగదు ఉపసంహరణ సేవలు కొనసాగుతాయి.ముందస్తు ప్రణాళిక అవసరంవరుస సెలవుల దృష్ట్యా నగదు అవసరాలు లేదా చెక్కుల క్లియరెన్స్ వంటి ముఖ్యమైన పనులు ఉన్నవారు ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా బ్యాంకింగ్ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. -
ఈ రోజు, రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు
-
ఒమన్‌లో వరద బీభత్సం.. ముగ్గురు మృతి
మస్కట్/దుబాయ్: గల్ఫ్ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షాలు, ఆకస్మిక వరదలతో ఒమన్, యూఏఈ అతలాకుతలమవుతున్నాయి. ఒమన్‌లో వరద ఉధృతికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వారం పొడవునా వాతావరణం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని ‘వాడి అల్ మావిల్’ వద్ద వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. వేగంగా వచ్చిన నీటి తాకిడికి మూడు వాహనాలు కొట్టుకుపోయాయి.ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు మరణించినట్లు ఒమన్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది. సహాయక బృందాలు ఒకరిని ప్రాణాలతో కాపాడగలిగాయి. మస్కట్, అల్ బతినా తీర ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన మరో 40 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. యూఏఈలో అల్పపీడన ప్రభావంతో వాతావరణం అస్థిరంగా మారింది. ముఖ్యంగా అబుదాబి, అల్ ఐన్, దుబాయ్ కారిడార్‌లో ఈ రాత్రి భారీ పిడుగులతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఎన్సీఎం)అంచనా వేస్తోంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల వల్ల ధూళి మేఘాలు కమ్ముకొని, విజిబిలిటీ గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 20°C నుంచి 23°C మధ్య నమోదవుతున్నాయి. Significant flooding in Muscat, Oman’s port capital today...🌊 pic.twitter.com/ZBkEdqBBWj— Volcaholic 🌋 (@volcaholic1) March 21, 2026వారికి భారీ జరిమానాలువరదలను చూసేందుకు, ఫోటోలు తీసేందుకు వాగులు, వంకల దగ్గరకు వెళ్లే వారికి యూఏఈ హోం మంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని స్పష్టం చేసింది. వరద కాలువలు లేదా డ్యామ్‌ల వద్ద గుమిగూడినా, ప్రవహిస్తున్న వాగుల్లోకి వాహనాలతో వెళ్లినా శిక్ష తప్పదని పేర్కొంది. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘వాడి అల్ నహ్వా’, ‘అల్ హేయర్’ దృశ్యాలు వరద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. మంగళవారం వరకూ కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.ఇది కూడా చదవండి: మరో చరిత్ర లిఖించిన ప్రధాని మోదీ -
కేంద్రం హెచ్చరిక.. భారత్ లో హింస జరిగే అవకాశం..
-
‘వేచి చూడండి’.. ఇరానియన్లకు హెచ్చరిక
టెహ్రాన్/వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ మిడిల్ ఈస్ట్(మధ్యప్రాచ్యం)లో ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడును పెంచడమే కాకుండా, సైనిక చర్యకు సిద్ధమన్నట్లుగా భారీ నౌకాదళాన్ని మొహరించారు. ఈ ఉద్రిక్తతల నడుమ సోమవారం వేలాది మంది ఇరానియన్ల మొబైల్ ఫోన్లకు ఒక అజ్ఞాత సందేశం రావడం కలకలం రేపింది.పర్షియన్ భాషలో ఉన్న ఆ సందేశంలో ‘అమెరికా అధ్యక్షుడు చేతల మనిషి.. ఏం జరుగుతుందో వేచి చూడండి’ అంటూ హెచ్చరికలు ఉన్నాయి. ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ ఈ పరిణామాలను గుర్తించింది. ఇరాన్‌పై పరిమిత సైనిక దాడికి వెనుకాడబోనని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సూచించారు. అణు ఒప్పందానికి ఇక 15 రోజుల సమయం మాత్రమే ఉందని, తరువాత సైనిక చర్య తప్పదని ట్రంప్ డెడ్ లైన్ విధించారు.ఇదే సమయంలో ఇరాన్ తన అణు ప్రతిపాదనల ముసాయిదాను సిద్ధం చేస్తోంది. అయితే అమెరికా ఈ అణు అంశంపైననే కాకుండా, ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, ప్రాంతీయ తీవ్రవాద గ్రూపులకు అందుతున్న మద్దతుపై కూడా చర్చించాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలో జెనీవాలో జరగబోయే తదుపరి రౌండ్ చర్చలు అత్యంత కీలకంగా మారాయి. యూరోపియన్ యూనియన్ సైతం ఈ ప్రాంతంలో మరో యుద్ధం వద్దంటూ దౌత్య పరిష్కారాన్ని కోరుతోంది. దేశం వెలుపల యుద్ధ భయాలు ఉండగా, ఇరాన్ లోపల అంతర్గత తిరుగుబాటు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.ఇజ్రాయెల్‌తో యుద్ధం, ప్రాంతీయ ప్రాక్సీ గ్రూపులతో ఇక్కట్లు వంటి అంశాలు ఇరాన్ పాలకులకు పెను సవాలుగా మారాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన పలు దేశాలు తమ పౌరులను తక్షణమే ఇరాన్ వదిలి వెళ్లాలని ఆదేశించాయి. ఇప్పటికే స్వీడన్, పోలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలు హెచ్చరికలు జారీ చేయగా, తాజాగా భారత్ కూడా తన పౌరులకు అడ్వైజరీ జారీ చేస్తూ అప్రమత్తం చేసింది. లెబనాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సైతం ముందు జాగ్రత్తగా సిబ్బందిని ఖాళీ చేయించే ప్రయత్నంలో ఉందని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: చెల్లెలి ముందే తండ్రిని తుపాకీతో కాల్చి.. -
ఈసారి సుర్రు! సుర్రు! జాగ్రత్త..
-
పులి సంచారం.. యాదగిరి గుట్ట ప్రజలకు హెచ్చరిక
సాక్షి, యాదాద్రి: యాదగిరి గుట్ట పరిసర ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గుట్ట శివారులో పులి సంచరిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని మంగళవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొంతకాలంగా ఆవుల్ని, మేకలు చనిపోతుండడంతో మిస్టరీ కొనసాగింది. ఈ క్రమంలో శివారులోని దత్తాయిపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యిది. అయితే ఆడ తోడు కోసం బహుశా ఆమ్రాబాద్ అడవుల నుంచి అది వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గుట్టతోపాటు పరిసర ప్రాంత ప్రజలు అప్రతమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు.. పులిని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. -
Income Tax: బినామీ వ్యవహారాల జోలికెళ్లొద్దు..
బినామీ ఆస్తి అంటే ఏమిటి.? బినామీ వ్యవహారం ఏమిటి.? బినామీదారు ఎవరు? ప్రయోజనం పొందేవారెవరు? మొదలైన విషయాలు ఇప్పటికే తెలుసుకున్నాము. ఈ వ్యవహారాలు చేయడం వల్ల కలిగే కష్టనష్టాలు ఈ వారం తెలుసుకుందాం.!ఆస్తి జప్తు: బినామీ ఆస్తి అని నిర్ధారణ జరిగితే ఆ ఆస్తిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం లేదా జప్తు చేసుకుంటుంది.శిక్షార్హులు: బినామీదారు, ప్రయోజనం పొందే వ్యక్తి (ముసుగు మనిషి), ఈ వ్యవహారాన్ని ప్రేరేపించిన లేదా ప్రోత్సహించిన వ్యక్తి, ఈ ముగ్గురూ చట్టం ప్రకారం శిక్షార్హులే. ఆరోపణలు నిరూపణ అయితే ఒక ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష (కఠినకారాగార శిక్ష) ఉంటుంది. ఇది కాకుండా, బినామీ ఆస్తి ఫెయిర్ మార్కెట్ విలువ మీద 25% జరిమానాగా విధిస్తారు. ముందుగానే తప్పు ఒప్పుకుంటే కొన్ని షరతులకు లోబడి జరిమానాను సడలిస్తారు. బినామీదారు బినామీ ఆస్తిని తిరిగి ‘ప్రయోజకుడు’ లేదా ఏ ఇతర వ్యక్తికి కూడా బదిలీ చేయకూడదు. ఇలాంటి బదిలీలు చెల్లవు. అలాంటి అమ్మకం జరిగినప్పుడు కొన్న వ్యక్తికి ఎటువంటి విషయం తెలియకపోతే.. నిజమని నమ్మించి అమ్మితే, కొన్న వ్యక్తి నుంచి ఆస్తి తీసుకోరు. అధికారుల అధికారాలు ఈ చట్టప్రకారం నాలుగు రకాల అధికారులు ఉన్నారు. వారి అధికారాలు ఏమిటంటే... (1) సమన్లు జారీ చేయడం (2) సమాచారం కోరడం (3) డాక్యుమెంట్లు స్వాధీనపరచుకోవడం (4) విచారణ చేయడం (5). విచారణలో సహకారం కోసం ఇతర అధికారులను కోరడం. ఇంకా ఏం చేస్తారు నోటీసులు ఇస్తారు. విచారిస్తారు. తీర్పు ఇస్తారు. తీర్పు అనుగుణంగా ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. వాటిని ఆధీనంలోకి తీసుకుంటారు.ఆద్యులెవరు .. ఆస్తిని స్వాధీనపరుచుకోవడానికి ముందు.. ఆద్యులు ఎవరంటే ఇన్‌కంటాక్స్ డిపార్టుమెంటు వారు. వారిచ్చిన సమాచారం, డాక్యుమెంట్ల ఆధారంగా చేసుకొని, బినామీ చట్టంలోని అధికారులు రంగంలోకి ప్రవేశిస్తారు. ఈ తరువాత పద్దతి ప్రకారం పని ముగిస్తారు.నోటీసు ప్రక్రియ.. నోటీసు ఇవ్వడానికి ప్రక్రియ మారితే.. వ్యక్తిగత పోస్టు ద్వారా లేదా సివిల్ కోడ్ ప్రకారం నోటీసు ద్వారా విచారణ, ప్రశ్నలు, ఇన్వెస్టిగేషన్, సోదాలు, కాగితాల సేకరణ, పత్రాలు అడగడం, ఆ తరువాత తీర్పు ఇవ్వడం, ఎటాచ్మెంట్ చేయడం, స్వాధీనపరచుకోవడంలాంటివి జరుగుతాయి. ఆ తరువాత బినామీ ఆస్తి కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. ఎంక్వైరీ మధ్యలో బినామీదారు/ముసుగు మనిషి మరణిస్తే వారి వారసులకు కేసు బదిలీ చేస్తారు. కోర్టు పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఏ స్థాయిలోనైనా తప్పుడు సమాచారం ఇచ్చినా., తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినా కఠిన కారాగార శిక్ష, జరిమానాలు పడతాయి.ఈ రెండు చట్టాలు–చుట్టాలు .. అటు అదాయపన్ను చట్టం, ఇటు బినామీ వ్యవహారంలో నిషేధిత చట్టం రెండూ కలిసి పనిచేస్తాయి. బినామీ వ్యవహారాల ద్వారా పన్ను ఎగవేత అంశం వెలుగులోకి వస్తుంది. ఇన్‌కంటాక్స్ అధికారులనే సూత్రధారులుగా .. ప్రారంభించే అధికారిని INITIATING OFFICERS గా వ్యవహరించమంటారు. వారే అన్ని తయారు చేస్తారు. డిపార్టుమెంటు వారు ఈ చట్టం ద్వారా సమాచారం, డాక్యుమెంట్లు రాబట్టుకుంటారు. వారి చట్టం ప్రకారం పెనాల్టీలు.. ఆదాయం మీద పన్ను వేసి... మిగతా కార్యక్రమం పూర్తి చేసి బినామీ నిషేధ చట్టం అధికారులకు అప్పగిస్తారు. ఈ అధికార్లు ఆస్తిని జప్తు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు. డిక్లేర్ చేయని ఆస్తులు.. డిక్లేర్ చేయని ఆదాయ వివరాలు తెలుసుకొని వాటిని అసెస్సీ పన్ను పరిధిలోకి తెచ్చి.. అసెస్మెంట్ చేసి... పన్ను, వడ్డీ, పెనాల్టీలు వసూలు చేసి బినామీ చట్టం అధికార్లకు అప్పగిస్తారు.ఇప్పుడు అర్థమైందా... బినామీ వ్యవహారాల వెనుకు ఎంత రిస్క్ ఉందో... దగ్గర బంధువులు, వ్యాపారం చేస్తున్న మిత్రులు, బంధువులు, మీరు చిన్న ఉద్యోగి అయితే మీ బాస్‌లు, యజమానులు, అల్లుడు, బావ, వియ్యంకుడు ఇలా అభిమానం అడ్డుపెట్టి, డబ్బులు ఎరచూపి, వారి కష్టాలని మీ దగ్గర వెలిబుచ్చి ట్రాప్ చేస్తారు. వారి వలలో పడకండి! -
ఇజ్రాయెల్‌లోని ఇండియన్స్‌కు అలర్ట్..
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఇజ్రాయెల్‌కు అనవసరమైన ప్రయాణాలు చేయవద్దని భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది.ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు అందరూ స్థానిక అధికారులు, ఇజ్రాయెల్ హోం ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు, ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో భారతీయులు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయ 24x7 హెల్ప్‌లైన్ నంబర్లు +972-54-7520711, +972-54-3278392 సంప్రదించాలని తెలిపింది.పెరుగుతున్న ఉద్రిక్తతలుఇరాన్లో విస్తృత స్థాయిలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అడ్వైజరీ జారీ అయింది. ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా అవకాశం కొట్టిపారేయకపోవడంతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా దాడి చేస్తే ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు చట్టబద్ధమైన లక్ష్యాలుగా మారతాయని ఇరాన్ హెచ్చరించింది.ఈ పరిణామాల ప్రభావంతో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రజా ఆశ్రయాలను తెరవాలని స్థానిక అధికారులు ఆదేశించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.టర్కీకి చెందిన అనడోలు ఏజెన్సీ ప్రకారం, దక్షిణ ఇజ్రాయెల్‌లోని డిమోనా నగరంలో “అనూహ్య పరిస్థితులకు సిద్ధంగా ఉండటం మంచిది” అనే ఉద్దేశంతో అన్ని ప్రజా ఆశ్రయాలను తెరవాలని మేయర్ ఆదేశాలు జారీ చేశారు.ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు ప్రయత్నాలుఇరాన్లో పరిస్థితులు అస్థిరంగా మారుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి భారతీయులను తరలించేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఇరాన్లో నిరసనలు చెలరేగుతున్న నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారత పౌరులకు ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా దేశాన్ని విడిచిపెట్టాలని, నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. -
సంక్రాంతికి బిగ్ షాక్.. APలో భారీ వర్షాలు
-
నెస్లే ఉత్పత్తులపై గల్ఫ్‌లో హై అలెర్ట్
చిన్నపిల్లల ఫుడ్ బ్రాండ్ అయిన నెస్లేపై గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. మార్కెట్లో ఉన్న నెస్లే బేబీ ఫుడ్ ఉత్పత్తులలో కొన్నింటిలో ప్రాణాంతక బ్యాక్టీరియా ఉందన్న ఆరోపణలతో వాటిని రీకాల్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నెస్లే ఉత్పత్తులను రీకాల్ చేస్తున్నారు. యూరప్ ప్రారంభమై ఆఫ్రికా, ఆసియా, అమెరికాలకు వ్యాపించిన ఈ సంక్షోభంలో యుఎఇతో సహా గల్ఫ్ దేశాలు ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించాయి. ఈ చర్యలకు కారణం ముడి పదార్థాలలో ఒకదానిలో ‘బాసిల్లస్ సిరస్’ అనే బ్యాక్టీరియా ఉండటమేనని తెలుస్తోంది. గల్ఫ్ దేశాల హెచ్చరిక..యూఏఈతో పాటు, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ దేశాలు కూడా ఈ ఉత్పత్తులపై ప్రజలను హెచ్చరించాయి. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నెస్లే బేబీ ఫుడ్ ప్యాకెట్లను ఉపయోగించవద్దని సూచించాయి. కువైట్‌లో రేషన్ కార్డుల ద్వారా అందింంచే వాటిలో ఈ ఉత్పత్తులు చేర్చలేదని అధికారులు స్పష్టం చేశారు.అసలు బాసిల్లస్ సెరియస్ అంటే ఏమిటి?ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే 'సిరిలైడ్' అనే విషం పిల్లల శరీరంలోకి ప్రవేశిస్తే తీవ్రమైన వాంతులు, విరేచనాలు, అధిక అలసట, కడుపు నొప్పికి కారణమవుతుంది. ఇప్పటివరకు ఎటువంటి అనారోగ్యాలు రానప్పటికీ.. కంపెనీ, ప్రభుత్వాలు ముందుజాగ్రత్తగా ఉత్పత్తులను ఉపసంహరించుకుంటున్నాయి.నెస్లే వివరణ..ఒక ప్రధాన సరఫరాదారు నుంచి అందుకున్న ముడి పదార్థాలలో (అరాకిడోనిక్ యాసిడ్ ఆయిల్) సమస్య కనుగొన్నట్లు నెస్లే తెలిపింది. ఉత్పత్తులను తిరిగి ఇచ్చి డబ్బు వాపసు పొందే సౌకర్యాన్ని కూడా కంపెనీ కల్పించింది. అనుమానం ఉన్నవారు కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. ఆ ఉత్పత్తులను దుకాణాలు ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగిస్తున్నట్లు తెలిపింది. ఇంట్లో ఈ ఉత్పత్తులు ఉన్నవారు వెంటనే వాటిని నాశనం చేయాలని.. లేదంటే పిల్లలకు ఇవ్వకుండా దుకాణాలకు తిరిగి ఇవ్వాలని స్థానిక ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. -
వామ్మో ఇదేం చలి
-
మరో 3 రోజులు.. గజ.. గజ..
-
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు బిగ్ అలర్ట్
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ కొత్తరూల్‌ను తీసుకొచ్చింది. హ్యాష్‌ట్యాగ్‌ల వినియోగంపై పరిమితి విధిస్తున్నట్లు తన ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఇక మీద వాటిని పోస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్లకు సూచిస్తోంది.ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే పోస్ట్ లేదంటే రీల్‌కు ఇక నుంచి గరిష్ఠంగా ఐదు మాత్రమే హ్యష్‌ట్యాగ్‌లు పెట్టుకునే అవకాశముందని ఆ ప్రకటనలో పేర్కొంది. తక్కువ యాష్ ట్యాగ్ల వల్ల పోస్టు బలంగా యూజర్లలోకి వెళ్తుందని.. తద్వారా రీచ్ బాగా అవుతుందని చెబుతోంది. ఇంతకుముందు ఇన్‌స్టాలో 30 హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టుకోవడానికి అవకాశముండేది. అయితే.. ఎక్కువ, అసాధారణమైన హ్యాష్‌ట్యాగ్‌లు (#reels, #explore) వాడటం వల్ల కంటెంట్ పనితీరు తగ్గుతుంది. అదే తక్కువగా.. అదీ నిర్దేశిత హ్యాష్‌ట్యాగ్‌లు వాడడం వల్ల కంటెంట్ డిస్కవరీకి ఎక్కువ అవకాశం ఉంటుందని ఇటు నిపుణులూ సూచిస్తున్నారు. ఉదాహరణ: బ్యూటీ క్రియేటర్లు తమ కంటెంట్‌కు సంబంధించిన బ్యూటీ హ్యాష్‌ట్యాగ్‌లు వాడితే.. ఆ కంటెంట్‌ను ఆసక్తి ఉన్నవారు సులభంగా కనుగొంటారు. వంట చానెల్స్ నడిపే వాళ్లు.. వాళ్లు చేసే వంటకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ మాత్రమే ఉపయోగించడం బెటర్. ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా ఏ హ్యాష్ ట్యాగ్‌ను పడితే ఆ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేస్తే మొదటికే మోసం రావొచ్చు. ఈ నెల ప్రారంభంలో కేవలం 3 హ్యాష్‌ట్యాగ్‌లే ఉపయోగించాలని ఇన్స్టాగ్రామ్ తన యూజర్లను అలర్ట్ చేయాలనుకుంది. కానీ, ఇప్పుడు అధికారికంగా 5 హ్యాష్‌ట్యాగ్‌ల పరిమితి అమలు చేయాలని నిర్ణయించింది.హ్యాష్ట్యాగ్లంటే(#).. కంటెంట్ డిస్కవరీకి ఉపయోగపడేవి. సంబంధిత టాపిక్ సెర్చ్‌లలో, ట్రెండింగ్ లిస్టుల్లో, సెర్చ్ (Explore) ఫీడ్‌లో కనిపించే అవకాశం ఉంటుంది. సరైన హ్యాష్‌ట్యాగ్‌లు వాడితే మీ కంటెంట్‌ను నిజంగా ఆసక్తి ఉన్నవారు చూసే అవకాశం పెరుగుతుంది. కానీ సంబంధం లేనివి.. అడ్డగోలుగా ఎక్కువ వాడితే కంటెంట్ పనితీరు తగ్గి.. ఎవరికి పడితే వాళ్లకు వెళ్తుంది. అలాగే ఇన్‌స్టా ఆల్గారిథమ్ ప్రకారమూ స్పామ్‌గా పరిగణించి రీచ్ తగ్గుతుంది. కాబట్టి ఇన్‌స్టాలో మాత్రమే కాదు.. ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫారమ్‌లోనూ తక్కువగా, సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లు వాడటం ఉత్తమని నిపుణులు చెబుతుంటారు. -
ముంచుకొస్తున్న ప్రళయం.. డేంజర్ లో ఆ 5 దేశాలు!
-
సైంటిస్టులకు చమటలు పట్టిస్తున్న చలికాలం..!
-
'అది ఫేక్.. దయచేసి అప్రమత్తంగా ఉండండి'..మైత్రి మూవీ మేకర్స్ ప్రకటన
మోసపోయేవాళ్లు ఉంటే మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ సోషల్ మీడియా యుగంలో మోసాలు మరింత ఎక్కువయ్యాయి. సైబర్ క్రైమ్స్‌తో పాటు ధనార్జనే ధ్యేయంగా పలు రకాల మోసాలకు పాల్పడుతున్నారు. సినీ ఇండస్ట్రీలోనూ కాస్టింగ్ కాల్, ఆడిషన్స్ పేరిట ఏదో ఒక చోట ఫ్రాడ్ జరుగుతూనే ఉంది. అలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలని తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరించింది. నిర్మాత నవీన్ యెర్నేని పేరు మీద ఇన్స్టాగ్రామ్ ఖాతా మా దృష్టికి వచ్చిందని తెలిపింది. దయచేసి అది నకిలీ ఖాతా అని గుర్తించాలని ప్రజలను కోరింది. మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చే ప్రతి కాస్టింగ్ కాల్ మా అధికారిక హ్యాండిల్ ద్వారా మాత్రమే ప్రకటిస్తామని తెలిపింది. మా చిత్రాల పేరు చెప్పుకునే వ్యక్తులు లేదా ఏజెన్సీలతో ఎవరూ సంభాషించవద్దని మేము ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నట్లు పోస్ట్ చేసింది. ఇలాంటి వాటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అలాంటి తప్పుదారి పట్టించే ప్రొఫైల్స్ ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నామని ట్విటర్ ద్వారా వెల్లడించింది.Every casting call from Mythri Movie Makers will only be announced through our official handle @MythriOfficial. We request everyone not to engage with any individuals or agencies claiming to cast for our films.Additionally, an Instagram account impersonating Mr. Naveen Yerneni…— Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2025 -
చూడ్డానికి చిన్నది.. కుట్టిందో ..!
-
ఏపీకి రెడ్ అలర్ట్ దూసుకొస్తున్న దిత్వా
-
ఆపరేషన్ సిందూర్ 2.0కు సిద్ధం: రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ‘ఆపరేషన్ సిందూర్ 2.0’పై ఊహాగానాలకు దారితీశాయి. భవిష్యత్తులో తలెత్తే ఏ పరిస్థితికైనా దేశ పౌరులు మానసికంగా సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం ఎంతో సంయమనం పాటించినప్పటికీ, పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో స్థిరత్వాన్ని అడ్డుకుందని ఆయన పేర్కొన్నారు.ఈ ఆపరేషన్‌లో భారత దళాలు పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేశాయని, అయినప్పటికీ, పాకిస్తాన్ మొండితనం కారణంగా సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనలేదని ఆయన పేర్కొన్నారు. రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) విజయాలను హైలైట్ చేస్తూ వెల్లడించిన ప్రెస్ బ్రీఫింగ్లో వెలువడ్డాయి. ఈ బ్రీఫింగ్లో బీఎస్ఎఫ్ డీఐజీ విక్రమ్ కున్వర్ మాట్లాడుతూ భారతదేశం చేపట్టిన ఉగ్రవాద నిరోధక చర్యల కారణంగా పాకిస్తాన్ తన పలు ఉగ్రవాద లాంచ్ప్యాడ్లను సరిహద్దు ప్రాంతాల నుండి తమ భూభాగంలోకి తరలించిందని వెల్లడించారు.ముఖ్యంగా సియాల్కోట్, జఫర్వాల్‌లోని పలు మండలాలలో 12 లాంచ్ప్యాడ్లు పనిచేస్తున్నాయని, ఇతర ప్రాంతాలలో మరో 60 లాంచ్ప్యాడ్లు ఉన్నాయని ఆయన వివరించారు. 'ఆపరేషన్ సిందూర్ 2.0' కు తాము సిద్ధంగా ఉన్నామని బీఎస్ఎఫ్ స్పష్టమైన సంకేతాలిచ్చింది. బీఎస్ఎఫ్ ఐజీ (జమ్మూ ఫ్రాంటియర్) శశాంక్ ఆనంద్ కూడా ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే తదుపరి చర్యకు దళం సిద్ధంగా ఉందని ధృవీకరించారు. యుద్ధ సమయ పరిస్థితులను నిర్వహించడంలో కేంద్ర సాయుధ పోలీసు దళానికి విస్తృతమైన అనుభవం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం మరో సరిహద్దు దాడికి ఆదేశిస్తే పాక్‌కు మరింత నష్టం కలిగించడానికి బీఎస్ఎఫ్ సన్నద్ధంగా ఉందని అన్నారు. మొత్తంగా చూస్తే, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన సూచనలు, బీఎస్ఎఫ్ చేసినసంసిద్ధత ప్రకటనలు సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలను సూచిస్తున్నాయి. భవిష్యత్తులో పాకిస్తాన్‌పై మరో సైనిక చర్య చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: అమెరికా: మరోసారి కాల్పులు.. నలుగురి మృతి -
దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. రెండు రోజులు భారీ వర్షాలు
-
80 కిలోమీటర్ల దూరంలో ముంచుకొస్తున్న మృత్యువు
-
తుఫాన్ అలర్ట్.. దూసుకొస్తున్న దిత్వా
-
ఏపీకి దిత్వా ముప్పు!
విశాఖపట్నం: సెన్యార్ ముప్పు తొలగిందని అనుకునేలోపే మరో తుపాను దూసుకొస్తోంది. దీనికి దిత్వాగా నామకరణం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం.. శ్రీలంక వైపు కదులుతూ రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను భారత వాతావరణ శాఖ(IMD) అప్రమత్తం చేసింది. దిత్వా ప్రస్తుతం ట్రింకోమలీ(శ్రీలంక)కి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో కదిలింది. ఆదివారం తెల్లవారుజాముకి నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో.. ఏపీలో రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శని, ఆదివారాల్లో మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తుపాను నేపథ్యంలో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల అధికార యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. తీరం వెంబడి 80-90 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తాయని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దిత్వా తుపాను నేపథ్యంలో అన్ని పోర్టులలో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని సూచించారు.మరోవైపు దిత్వా ప్రభావం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలపై కూడా ఉండనుంది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ తుపానుకు దిత్వాగా యెమెన్ నామకరణం చేసింది. దీనర్థం పువ్వు అని. -
APకి మరో తుఫాన్ ముప్పు.. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
-
Big Shock: మరో తుఫాను రాబోతుంది!
-
అయ్యప్ప భక్తులకు హెచ్చరిక.. కేరళలో బ్రెయిన్ ఫీవర్ అలర్ట్
-
మొంత మరువక ముందే.. ఏపీకి మరో తుఫాన్ గండం
-
బంగాళాఖాతంలో అల్పపీడనం ముంచుకొస్తున్న తుఫాన్
-
బ్రెయిన్ తినే వైరస్.. అయ్యప్ప భక్తులకు బిగ్ అలర్ట్
-
కేరళకు భారీ వర్ష సూచన.. అయ్యప్ప భక్తులకు అలర్ట్
తిరువనంతపురం: తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కేరళను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. దీంతో మూడు నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు తప్పవని భారతీయ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది(IMD). శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు రేపు (నవంబర్ 16) సాయంత్రం 5 గంటలకు మండల పూజల కోసం తెరుచుకోనున్నాయి. వేలాది మంది భక్తులు పంబా, నిలక్కల్ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం భక్తులను అప్రమత్తం చేస్తోంది. రాబోయే మూడు రోజులు నవంబర్ 16 నుంచి 18 దాకా కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఐఎండీ పేర్కొంది. ఇడుక్కి, కొట్టాయం, పత్తనంతిట్ట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో 64.5 మిల్లీమీటర్ల నుండి 115.5 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. శబరిమల యాత్రకు వచ్చే భక్తులు ఈ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారుల సూచనలు:భక్తులు రెయిన్‌కోట్, టార్చ్‌లైట్, మెడికల్ కిట్ వంటి అవసరమైన వస్తువులు వెంట ఉంచుకోవాలివర్షాల కారణంగా మార్గాల్లో మట్టి జారే ప్రమాదం ఉండవచ్చు.. అప్రమత్తంగా ఉండాలిపంబా, ఎరుగుమలై, నిలక్కల్ ప్రాంతాల్లో వాతావరణ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలిఅంతేకాదు.. కల్లకడల(Kallakkadal) కారణంగా(సముద్రంలో అలజడి) ఆలప్పుఝా, ఎర్నాలకుం, త్రిస్సూర్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్ తీరప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చే అవకాశం ఉందని, అలలు ఎగసిపడే నేపథ్యంలో మత్య్సకారులు, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం రేపు (నవంబర్ 16) సాయంత్రం 5 గంటలకు మండల-మకరవిళక్క యాత్రా కాలానికిగానూ తలుపులు తెరుచుకోనుంది. ఈ పవిత్ర యాత్రా కాలం జనవరి 20 వరకు కొనసాగనుంది. అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేపట్టింది. దేశంలో వరుసగా తొక్కిసలాట ఘటనలు జరుగుతున్న క్రమంలో.. భక్తుల ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. రోజుకు 90,000 భక్తులకు రోజువారీ పరిమితి విధించారు. నిలక్కల్, పంబా ప్రాంతాల్లో తాత్కాలిక గుడిసెలు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. -
ఢిల్లీ పేలుడు.. పాక్ వణుకు?
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన పేలుడు దరిమిలా భారత్ నుంచి ప్రతీకార దాడులుంటాయనే అనుమానం, భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. ఈ నేపధ్యంలో పాక్ వైమానిక దళం రాజస్థాన్ సరిహద్దులో వైమానిక దళ గస్తీని ప్రారంభించిందని‘దైనిక్ భాస్కర్’ తన కథనంలో తెలిపింది. పాక్‌లోని త్రివిధ దళా అధిపతులు అత్యవసర సమావేశం నిర్వహించారని పేర్కొంది. ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు ఎన్ఎస్ఏ, ఐఎస్ఐతో సమావేశాలు నిర్వహించారని సమాచారం.ఢిల్లీ ఎర్రకోట వెలుపల జరిగిన కారు బాంబు పేలుడు తరువాత పాకిస్తాన్ తన అన్ని వైమానిక స్థావరాలు, వైమానిక స్థావరాల వద్ద రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారతదేశం నుండి ప్రతీకారం ఎదురయ్యే అవకాశం లేదా సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు పెరిగే చాన్స్ ఉందని నిఘా సంస్థల నుండి పాకిస్తాన్‌కు హెచ్చరికలు అందాయి. ఫలితంగా పాకిస్తాన్ తన సైన్యం, నేవీ, వైమానిక దళాలను హై అలర్ట్‌లో ఉంచింది. అలాగే పాకిస్తాన్ సెంట్రల్ కమాండ్.. పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యంలోని అన్ని శాఖలను ఆదేశించింది.అంతేకాకుండా భారతదేశం నుండి ఏదైనా దాడి జరిగితే తక్షణం ప్రతీకారం తీర్చుకునేందుకు వాయు రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్ యాక్టివ్ చేసింది. భారతదేశం నుంచి ముందస్తు దాడి లేదా ఇతర సైనిక చర్యను ఊహించి పాక్ ఈ తరహా నిఘా కొనసాగిస్తోంది. వైమానిక రక్షణ రాడార్లు ఇప్పుడు పాకిస్తాన్ వైమానిక సరిహద్దులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అలాగే పాకిస్తాన్ నవంబర్ 11 నుండి 12 వరకు నోటమ్ (ఎయిర్‌మెన్‌కు నోటీసు) జారీ చేసింది. అంటే ఈ రెండు రోజుల్లో, సరిహద్దు ఆకాశంలో విమానాలు తిరిగేందుకు పరిమితులు, భద్రతా నిబంధనలు అమలులో ఉంటాయి.కాగా ఢిల్లీలో పేలుడు దరిమిలా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని యూకే విదేశాంగ కార్యాలయం (ఎఫ్సీడీఓ) ప్రయాణ సలహా జారీ చేసింది. భారత్-పాక్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో, జమ్ముకశ్మీర్, మణిపూర్ రాష్ట్రాలలో ప్రయాణించవద్దని బ్రిటిష్ పౌరులకు యూకే ప్రభుత్వం సూచించింది. ఇదే విధంగా ఎర్రకోట తదితర పర్యాటకులతో రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీలోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం సూచించింది. ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ఈ కష్టం పగవాడికి కూడా.. కండక్టర్ విషాదాంతం -
తెలంగాణకు భారీ వర్ష సూచన.. అధికారుల కీలక హెచ్చరిక
-
ఈ రాత్రికే భారీ వర్షం.. తెలంగాణలో ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
-
తీరాన్ని తాకిన మోంథా.. ఎగిసి పడుతున్న రాకాసి అలలు
తీరం వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను ధాటికి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా తడిసి ముద్దవగా కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. తీవ్ర వాయుగుండం నుంచి సోమవారం ఉదయానికి తుపానుగా మారింది. ఆగ్నేయ, పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుపాను గంటకు 13 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
తీరం దాటే సమయంలో బలపడనున్న తుఫాను
-
ముంచుకొస్తున్న ముప్పు.. తీరంలో హైఅలర్ట్..
-
APకి మోంథా హెచ్చరిక.. దూసుకొస్తున్న తుఫాన్
-
వేగం పుంజుకున్న మోంథా తుఫాను
‘మొంథా’ తుపాను దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. అది ఆదివారం సాయంత్రానికి పోర్టుబ్లెయిర్‌కు 670 కిలోమీటర్లు, చెన్నైకు 720, కాకినాడకు 780, విశాఖపట్నానికి 790, గోపాలపూర్ (ఒడిశా)కు 900 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం ఉదయంలోగా నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. -
కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు!
-
ఏపీకి దూసుకొస్తున్న తుఫాన్
-
మెంథా తుఫాన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
APకి దూసుకొస్తున్న తుఫాన్
-
తిరుమలను వదలని వరుణుడు
సాక్షి, తిరుపతి/విశాఖ: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. దీంతో.. వాతావరణ శాఖ అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది. ఇంకోవైపు.. తిరుమలలో వారం రోజులుగా ఎడతెరిపి ఇవ్వకుండా కురుస్తున్న వర్షాలతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. జలాశయాలలో బారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే గోగర్భం డ్యామ్ నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తేశారు. ముంపు ముప్పు దృష్ట్యా.. లోతట్టు ప్రాంతాల గ్రామాలను అప్రమత్తం చేశారు. తిరుమల భక్తుల రద్దీ ఇలా.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 20 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,110గా ఉంది. తలనీలాలు సమర్పించిన భక్తులు 25,695 మంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.89 కోట్లు.మరిన్ని వర్షాలుఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఎల్లుండికి నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం. దీని ప్రభావంతో ఇవాళ(శనివారం, అక్టోబర్ 25)) కోనసీమ,కృష్ణా,బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే.. ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ముంచుకొస్తున్న తూఫాన్.. ఏపీకి భారీ వర్ష సూచన
-
దూసుకొస్తున్న వాయుగుండం.. మరికొన్ని గంటల్లో..!
-
మరో అల్పపీడనం.. భారీ వర్షాలు
-
పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి,విశాఖ: ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తూ పలు జిల్లాలకు రెడ్,ఆరెంజ్,ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురియనున్నట్లు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఎల్లో అలెర్ట్ చేస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్ తెలిపారు.రాష్ట్రంలో 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని..ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద నిలబడొద్దని, ప్రతి కూల వాతావరణంలో ఇంట్లోనే ఉండాలని తగు జాగ్రత్తలు చెప్పారు. -
Pune: మూతపడిన స్కూళ్లు.. రేపు కూడా సెలవు?
పూణె: మహారాష్ట్రలోని పూణెలో నిన్న(ఆదివారం) రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ప్రజాజీవనాన్ని ఘోరంగా దెబ్బతీసింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదులుతోంది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో పూణేలోని పాఠశాలలకు ఈ రోజు(సెప్టెంబర్ 15) సెలవు ప్రకటించారు. Pune Rains: Heavy Downpour Triggers Traffic Jams, Waterlogging Across City🔗 https://t.co/ibQExSolWN#punenews #punerains #Rain #weatheralert pic.twitter.com/9HCdtVz3w0— Free Press Journal (@fpjindia) September 15, 2025వాతావారణశాఖ అధికారుల సూచనల మేరకు సెప్టెంబర్ 16న కూడా సెలవు ప్రకటించారు. భారీ వర్షపాతం కారణంగా పూణేలో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పూణే మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. భారత వాతావరణ శాఖ పూణేతో పాటు సమీప జిల్లాల్లో భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. భారత వాతావరణ శాఖ పూణే, ముంబై, థానే, రాయ్‌గడ్, బీడ్, అహల్యానగర్, లాతూర్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు కురియనున్నాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. -
APలో కుండపోత వానలు.. మత్స్య కారులకు హెచ్చరిక జారీ
-
తెలంగాణలో వానలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు (Rain Update) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలకి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఇక, హైదరాబాద్ నగరంలో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.ఇక సోమవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపెల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఇక, శనివారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. Overnight INTENSE THUNDERSTORMS lashed North TG districts, overall, 4th consecutive day of POWERFUL THUNDERSTORMS in many parts of TelanganaHyderabad too got decent rains yesterday. Will share today's forecast soon ⛈️👍 pic.twitter.com/tJeTJEy6rm— Telangana Weatherman (@balaji25_t) September 14, 2025 -
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో 2 రోజులు కుండపోత..!
-
ఏపీకి తుపాన్ షాక్.. ఒకటి కాదు.. మూడు!
-
పాకిస్తాన్ నుంచి 14 మంది ఉగ్రవాదులు, 400 కిలోల ఆర్డీఎక్స్
ముంబై: గణపతి నిమజ్జనోత్సవ ఏర్పాట్లలో తలమునకలై ఉన్న ముంబై యంత్రాంగాన్ని ఓ బెదిరింపు సందేశం మరింత అప్రమత్తం చేసింది. ‘పాకిస్తాన్ నుంచి మహానగరంలోకి 14 మంది ఉగ్రవాదులు ప్రవేశించారు. వివిధ ప్రాంతాల్లో 34 వాహనాల్లో 400 కిలోల ఆర్డీఎక్స్తో మానవ బాంబులు సిద్ధంగా ఉన్నాయి. శనివారం అనంత్ చతుర్దశి(గణేశ్ నిమజ్జనోత్సవం) నాడు ముంబై నగరం పేలుళ్లతో దద్దరిల్లిపోతుంది. కనీసం కోటి మంది చనిపోతారు’అని ముంబై ట్రాఫిక్ పోలీసు విభాగం ఫోన్ వాట్సాప్‌కు ‘లష్కర్– ఇ–జిహాదీ’పేరుతో శుక్రవారం ఒక మెసేజీ అందింది. దీంతో, హై అలెర్ట్ ప్రకటించినట్లు ముంబై పోలీస్ విభాగం పేర్కొంది. దీనిని కేవలం బెదిరింపుగానే భావిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయినప్పటికీ, సాధ్యమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ సందేశాన్ని పంపించిన వ్యక్తి ఎవరో కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. దీనిపై అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగుతోందన్నారు. ముఖ్యమైన ప్రదేశాల్లో బందోబస్తును మరింతగా పెంచారు. వివిధ ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. వదంతులను నమ్మొద్దని, అనుమానాస్పద కదలికల గురించిన సమాచారాన్ని వెంటనే తమకు అందజేయాలని ప్రజలను కోరారు. శనివారం జరిగే నిమజ్జన ఉత్సవాల బందోబస్తులో 12 మంది అదనపు కమిషనర్లు, 40 మంది డిప్యూటీ కమిషనర్లు, 61 మంది సహాయ కమిషనర్లు సహా 21 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ సంబంధ సమస్యలను ముందుగానే కనిపెట్టి హెచ్చరించేందుకు ఈసారి ముంబై పోలీసు యంత్రాంగం కృత్రిమ మేధ సాయం తీసుకుంటోంది. ఇటీవలి కాలంలో ముంబై, థానె పోలీసులకు పలుమార్లు బెదిరింపు సందేశాలు అందడం తెల్సిందే. జూలైలో సైతం ముంబై విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ పోలీసులకు సందేశం అందింది. -
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
-
ఐటీ ఫైలింగ్‌కి ఉపక్రమించండి... మహాశయా..!
గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2023–24 గానూ సుమారు 9 కోట్ల రిటర్నులు చేసినట్లు ఒక లెక్క ఉంది. ఇక 2024–25కి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 25.8.2025 నాటికి 3,67,94,801 రిటర్నులు పడ్డాయి. అంటే ఫైల్ చేసినట్లు. ఇందులో 3.54 కోట్ల మంది సక్రమంగా వెరిఫై చేశారు. గొప్ప విషయం ఏమిటంటే 2.29 కోట్ల మంది రిటర్నులు ప్రాసెస్ అయ్యాయి. అంటే అస్సెస్మెంట్ అయినట్లే. 13 లక్షల మంది వెరిఫై చేయలేదట.మీరు ఒకసారి చెక్ చేసుకొండి. వెరిఫై చేసుకోపోతే వెంటనే వెరిఫై చేయండి. వైరిఫై జరిగితే కానీ అసెస్మెంట్ మొదలుపెట్టరు. గతవారం అయితే రిటర్నులు వేసిన కొంతమంది అసెస్మెంట్ పూర్తి చేసి రీఫండ్ మొత్తాన్ని వారి వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ వారి కృషి, కష్టాన్ని, సామర్థ్యాన్ని మెచ్చుకోవాలి. శెహభాష్... టాక్స్ అడిట్ అవసరం లేని వారికి జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు గడువు తేది ముందుగానే పొడిగించారు. గతంలో పొడిగింపుల పర్వం లేదా వాయిదాల పద్ధతి ఉండేది. దానిని పక్కన పెట్టి గత 2 ఏళ్లుగా ఎటువంటి పొడిగింపు చేయకుండా నిలకడగా ఉన్నారు. కానీ ఏడాది ఆరంభంలో ఈసారి పెద్ద పొడిగింపు చేశారు. ఇప్పుడు అన్లైన్లో పనులు చకచకా జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఫాస్ట్‌గా, మృదువు గా బండి నడుస్తోంది. ఈ కాలమ్ చదివే సమయానికి ఫైలర్ల సంఖ్య 4 కోట్లు దాటిందన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకో 5 కోట్లకు పైచిలుకు రిటర్నులు వేయాలి. మీరు వేసిన 4 కోట్ల మందిలో ఉన్నారా..? వేయాల్సిన 5 కోట్ల మందిలో ఉన్నారా..?వెంటనే ఏం చేయాలంటే... పాన్ కార్డుని తీయండిఆధార్తో పాన్ అనుసంధానం చేసుకోండి. మీకు ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో ఆరా తీయండి. చాలా మందికి ఒక అకౌంటు లేదా రెండు అకౌంట్లు గుర్తుంటాయి. నిత్యం వాడే అకౌంట్లు గుర్తుంటాయి. ఎన్ని ఉన్నాయో మరిచిపోతుంటాము. ఎవరో తెలిసిన వ్యక్తి లోన్ ఇప్పిస్తాడు. అప్పుడు బ్యాంకులో అకౌంటు ఓపెన్ చేస్తాము. లోన్ క్లియర్ అయ్యాక ఈ సంగతి మరిచిపోతాము. ఉద్యోగాల బదిలీ వలన, ఇంటికి దగ్గరగా ఉందనో.. దగ్గర బంధువు ఉన్నాడని తెరిచిన అకౌంటు... ఇలా ఒక జాబితా చేసుకొండి. అన్నీ బ్యాంకు అకౌంటు వివరాలు సేకరించండి. వాటిలో వ్యవహారాలకు వివరాలు రాసుకొండి. ఇన్నీ ఉన్నా ఏదో ఒకదాన్ని మాత్రమే రిఫండ్ కోసం ఎంచుకోండి. అలా ఎంచుకోకపోతే రీఫండ్ రానే రాదు. వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు... వాటి విషయంలో అశ్రద్ధ వహిస్తాము. గుర్తు తెచ్చుకోండి. పుట్టింటి నుంచి వచ్చిన డబ్బును అదే ఊరిలో ఫిక్స్డ్ వేసి మరిచిపోయే నారీమణులు ఎందరో.... అన్ని వివరాలు సేకరించండి.మీరు ఉద్యోగస్తులు అయితే ఫారమ్ 16 అడగండి. అందులో అన్నీ వివరాలు చెక్ చేసుకొండి. ప్రతి నెలా తయారయ్యే శాలరీ స్లిప్‌ను జాగ్రతగా ఉంచండి. ఫారమ్ 16 ఎ లో కరెక్ట్ చేసి భద్రపరచండి.డివిడెండ్ల మీద ఆదాయం బ్రోకర్ని అడిగి తెలుసుకొండి. స్టేట్మెంట్ తీసుకొండి. మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు అమ్మకాలు స్టేట్మెంట్ తీసుకొండి. పూర్తి స్టేట్మెంట్ అడగండిఅద్దె మీద ఆదాయం ఆదాయం ఉంటే ఇంటి అడ్రెస్సు, కిరాయిదారు పాన్/ఆధార్ తీసుకొండి. ప్రాపర్టీ టాక్సు రశీదులు తీసుకోండి. విదేశాల్లో ఉండే కుటుంబ సభ్యుల నుంచి వచ్చే మొత్తం వివరాలు తెలుసుకోండిఅలాగే విదేశీ ఆస్తుల మీద ఆదాయం కూడా పాత పద్ధతిలో డిడక్షన్లకు అయితే అన్ని కాగితాలు, వివరాలు కావాలి. అద్దె రశీదులు... విరాళాల వివరాలు ఉండాలి. కరెక్ట్ ఫారాన్ని సెలెక్ట్ చేసుకోండి. డిపార్ట్మెంట్ వారి ఉపకరణాలు ఉపయోగపడుతాయి. ఇప్పుడు ఫైలింగ్‌కు ఉపక్రమించండి. ఆల్ ద బెస్ట్..... -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు
-
ఏపీకి వాన గండం.. వారం రోజులు భారీ వర్షాలు
-
తెలంగాణలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో కుండపోత వర్షం.. అప్డేట్స్మెదక్ అంధకారం..పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయంపిల్లికొట్టాల్లో పసుపులేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన సబ్ స్టేషన్కామారెడ్డిలో అంధకారంభారీ వర్షం నేపథ్యంలో విద్యుత్ సరాఫరాకు అంతరాయంజిల్లా కేంద్రంలోని గాంధీనగర్, అయ్యప్ప నగర్, బతుకమ్మ కుంట, రుక్మిణికుంట, పంచముఖి హనుమాన్ కాలనీ, గోపాలస్వామి రోడ్, షేర్ గల్లి తదితర ప్రాంతాల్లో అంధకారం.కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న జిల్లా ప్రజలుజీఆర్ కాలనీలో సహాయ చర్యల కోసం వేచి చూస్తున్న కాలనీవాసులువరదలు ఉధృతంగా ఉన్న చెరువుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుకామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కౌండిన్య కాలనీలో వరదలో చిక్కుకున్న బాధితులురక్షించేందుకు కామారెడ్డికి చేరిన బోట్లు.సుమారు 50 మంది పైగా చిక్కుకున్న కాలనీవాసులుజల దిగ్బంధంలో ఉన్న బాధితులను కాపాడేందుకు రంగంలోకి దిగిన రెస్క్యూ టీం మెదక్ జిల్లా: రేపు విద్యాసంస్థలకు సెలవుజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలుప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ తెలంగాణలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్వచ్చే మూడు గంటల్లో అతిభారీ వర్ష సూచననిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం మెదక్ రామాయంపేటలో రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్నీట మునిగిన మహిళా డిగ్రీ కళాశాలవిద్యార్థినులను రక్షించిన సహాయక బృందాలుసురక్షిత ప్రాంతానికి 300 మంది తరలింపు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సమీపంలో ఎగువ మానేరులో చిక్కుకున్న కార్మికులు ఆరు గంటలుగా సాయం కోసం ఎదురు చూపులుస్వామి అనే కార్మికుడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్స్వామితోపాటు మిగిలిన నలుగురు బాధితులు పిట్ల మహేశ్, పిట్ల స్వామి, ధ్యానబోయిన స్వామి పరిస్థితిపైనా ఆరాబాధితులెవరూ భయపడొద్దని పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బండి సంజయ్జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉంటూ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పిన కేంద్ర మంత్రిఅధికారులతో మాట్లాడి భోజనం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి వర్షాలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షరాష్ట్రంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.కామారెడ్డి ,మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు అలుగులు పొంగి పొర్లుతుండడం ,రోడ్లపై భారీ వరద నీరు వచ్చి చేరుతుండడం ఆర్టీసీ బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి .హైదరాబాద్ లో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు నీరు నిలువ లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి,భారీ వర్షాలకు వరదల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలిలోతట్టు ప్రాంతాల్లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వారిని అక్కడనుండి తరలించేలా చర్యలు తీసుకోవాలి .వర్షాల వల్ల గణేష్ మండపాల వద్ద ,ఇతర విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఉమ్మడి నల్లగొండలో వాన బీభత్సంయాదాద్రి భీమలింగం కత్వా వద్ద వరద ఉధృతిచౌటుప్పల్ నాగిరెడ్డిపల్లి మధ్య రాకపోకల బంద్ ఇంకా వరదలోనే మెదక్ హవేలిఘన్‌పూర్ మండలంలోని దూప్‌సింగ్ తండాసాయం కోసం బిల్డింగ్‌ల మీదకు ఎక్కిన జనంరక్షించేందుకు అధికారుల ప్రయత్నాలు కామారెడ్డి కలెక్టర్‌తో మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్కామారెడ్డి జిల్లా అంతటా భారీ వర్షాలు .. జలదిగ్బంధంలో పలుగ్రామాలుకలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ఇన్చార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ తక్షణ సహాయక చర్యలు కొనసాగుతాయని హామీఅధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి :మంత్రి సీతక్క,ప్రతి గ్రామం, పట్టణంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి :మంత్రి సీతక్కలోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలి :మంత్రి సీతక్కచెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాకపోకలను అనుమతించొద్దు :మంత్రి సీతక్కప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి :మంత్రి సీతక్కరక్షణ చర్యల్లో ఎక్కడా నిర్లక్ష్యం చోటుచేసుకోరాదు.. ప్రతి ఒక్క అధికారి తమ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించాలి:మంత్రి సీతక్కవర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది:మంత్రి సీతక్క బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడిన వాయుగుండంరేపూ తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలుకుండపోత వానతో రాష్ట్రమంతటా ఆగమాగంజనజీవనం అస్తవ్యస్తం భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నేడు పలు రైళ్ల దారి మళ్లింపుకామారెడ్డి మీదుగా వెళ్ళే రైళ్లు నిజామాబాద్ మీదుగా మళ్లింపునిజామాబాద్ - తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఈ రోజు రద్దుమెదక్ - కాచిగూడ రైలు ఈ రోజు పాక్షికంగా రద్దు కామారెడ్డి, మెదక్‌లకు రెడ్ అలర్ట్ రెండు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షంరాజంపేట మండలం అర్గొండలో 31.9 సెం.మీ. అత్యధిక వర్షపాతంమెదక్ నాగపూర్‌లో 20.8 సెం.మీ. వర్షపాతంబిక్నూర్లో 19.1 సెం.మీటెక్మాల్ మండలంలో 18.03 సెంటీమీటర్ల వర్షపాతంపాత రాజంపేటలో 18, రామాయంపేటలో 16 సెం.మీలుచేగుంట 13.2 సెంమీ, మెదక్‌లో 11 సెం.మీ. కామారెడ్డి తలమట్ల దగ్గర రైల్వే ట్రాక్ నుంచి నీటి ప్రవాహం.. 12 రైళ్ల రాకపోకలకు అంతరాయం కామారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్రెడ్డివెంటనే సహాయక చర్యలు చేపట్టాలని.. అన్ని విభాగాల అధికారులు సిద్ధం చేయాలని ఆదేశంఎలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండండి :సీఎం రేవంత్రెడ్డిఅన్ని శాఖల అధికారులు.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సాయం తీసుకోవాలని సీఎస్‌కు ఆదేశంఇరు జిల్లాల ఎమ్మెల్యేలతోనూ మాట్లాడిన సీఎంకలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచన భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాలు నీట మునడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరాకామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట ఘటనపై కలెక్టర్ కు ఫోన్ చేసిన కేంద్ర మంత్రిప్రమాద బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పిన బండి సంజయ్అనంతరం ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడిన బండి సంజయ్ఎల్లారెడ్డిలో తక్షణమే అవసరమైన సాయం అందించాలని ఎన్డీఆర్ఎఫ్ ను కోరిన కేంద్ర మంత్రిజిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకుని సహాయ చర్యల్లో నిమగ్నమవ్వాలని సూచంచిన కేంద్ర మంత్రి కామారెడ్డిలో భారీ వర్షాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న తిమ్మారెడ్డిలోని కల్యాణి వాగు వాగుపై బొగ్గు గుడిసె సమీపంలో వరదలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులు డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూపులు ఈ వరద కారణంగా కామారెడ్డి- భిక్కనూర్ సమీపంలో రైలు పట్టాల కింద గండి.. రైళ్ల రాకపోకలు నిలిపివేతసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో భారీ వర్షంఎగువ మానేరు నుంచి దిగువకు నీరు విడుదలనాగయ్య అనే పశువుల కాపరి గల్లంతు.. గాలిపు చేపట్టిన అధికారులుమానేరు వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతులురక్షించేందుకు అధికారుల ప్రయత్నాలు -
ఏపీకి మరో మూడు రోజులు భారీ వర్ష సూచన
-
హైదరాబాద్ లో హై అలర్ట్.. బయటకు రావద్దంటూ హెచ్చరిక
-
తెలుగు రాష్ట్రాలకు రైన్ అలర్ట్
-
భారీ వర్షాలు.. తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్
-
ఏపీలో 4 రోజులు భారీ వర్షాలు
-
High Alert: తెలంగాణకు మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన
-
Delhi: భారీ వర్ష సూచన.. వైమానిక సంస్థల హెచ్చరికలు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమాన ప్రయాణికుల సౌకర్యార్థం పలు విమానయాన సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.ఎయిర్ ఇండియా #TravelAdvisory Gusty wind and rain may impact flight operations to and from Delhi this morning.Please check your flight status here https://t.co/ZRtxRBbSY7… before heading to the airport and allow extra time for your journey.— Air India (@airindia) July 29, 2025 ఢిల్లీలో వర్షం కురుస్తున్న కారణంగా విమాన కార్యకలాపాలు ప్రభావితం కావచ్చని ఎయిర్ ఇండియా ప్రయాణికులకు తెలియజేసింది. విమానాశ్రయానికి వెళ్లే ముందు ప్రయాణికులు http://airindia.com/in/en/manage/fలో మీరు ప్రయాణం చేయబోయే విమాన స్థితిగతులను తెలుసుకోవాలని సూచించింది. మీ ప్రయాణానికి అదనపు సమయాన్ని కేటాయించాలని కోరింది. ఇండిగో Travel Advisory 🌂 A Rainy Day Reminder With heavy rainfall expected over #Delhi, we’re seeing a chance of delays and slower traffic to and from the airport. While we can’t control the skies, we’re doing everything possible to keep your journey steady on the ground.…— IndiGo (@IndiGo6E) July 29, 2025 ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ ప్రయాణికులకు వాతావరణ సంబంధిత ప్రయాణ హెచ్చరికలను జారీచేసింది. అదనపు ప్రయాణ సమయానికి ముందుగానే సిద్ధం కావాలని ప్రయాణికులను కోరింది. స్పైస్ జెట్ #WeatherUpdate: Due to bad weather in Delhi (DEL) and Dharamshala (DHM), all departures/arrivals and their consequential flights may get affected. Passengers are requested to keep a check on their flight status via https://t.co/2wynECYWr0.— SpiceJet (@flyspicejet) July 29, 2025 విమానయాన సంస్థ స్పైస్ జెట్ కూడా ప్రయాణికులకు ఇలాంటి హెచ్చరికను జారీ చేసింది. ఢిల్లీ, ధర్మశాలలో ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడనుంది. దీనిని గమనించాలని సూచించింది. భారత వాతావరణ శాఖ Delhi weather report: IMD predicts cloudy sky with moderate rain in national capital on Tuesday#DelhiRains #DelhiWeather #IMD https://t.co/rwVi0Riava— IndiaTV English (@indiatv) July 28, 2025 ఇంతలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవార మధ్యాహ్నం నాటికి వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆగస్టు 3 వరకు అంటే వచ్చే ఏడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలియజేసింది. -
ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులు భారీ వర్షాలు
-
రాష్ట్రానికి రెండ్రోజులు ఎల్లో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 2.53 సెం. మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంలో గురువారం ఉదయం ఉపరితల ఆవర్తనం విలీనమైంది. దీంతో వచ్చే రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30–40 కి.మీ. వేగంతో కూడిన ఈదురుగాలులతో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. ఈ మేరకు రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3–6 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదవుతున్నాయి. గురువారం నల్లగొండలో 28.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి: సీఎం భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం... గురువారం సీఎంఓ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు నమోదైన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వరద ఉధృతి ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షసూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని.. ప్రతి విభాగం అధికారితో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలని చెప్పారు. భారీ వర్షాలు, వరదల వల్ల ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు అవసరమైన సహాయక చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని.. జిల్లా అధికారులు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలన్నారు -
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
-
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక
-
ఏపీ, తెలంగాణలో ఎల్లో అలర్ట్
-
నేడు భారీ నుంచి అతిభారీ వర్షం.. మంత్రి పొన్నం విజ్ఞప్తి
హైదరాబాద్‌కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ (శనివారం) భారీ నుంచి అతి భారీ వర్షం తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం ఏకధాటిగా నాలుగు గంటలపాటు కురిసిన వానతో నగరంలో పలుప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న ప్యాట్నీ సింధీ కాలనీలో బోట్ల సాయంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంటోన్మెంట్ సిబ్బంది మోటార్ల సహాయంతో నీళ్లను తొలగిస్తున్నారు. నాలా రిటైనింగ్ వాల్ కట్టకపోవడంతోనే ఇళ్లలోకి వర్షపు నీరు చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ వర్షాలపై హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. వర్షాలపై సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు. లోతట్టు ప్రాంతాలపై ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్ , పోలీస్ కమిషనర్, వాటర్ వర్క్ ఇతర అధికారులను అప్రమత్తం చేస్తూ వారితో మాట్లాడడం జరిగింది.. హైదరాబాద్ నగరానికి సంబంధించి నీళ్లు ఎక్కడ నిల్వ లేకుండా సిబ్బంది వెంట వెంటనే తొలగిస్తున్నారు. మొత్తం 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ పై అధికారులు సమన్వయం చేసుకుంటూ అక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం. జీహెచ్ఎంసీ ,రెవెన్యూ , పోలీస్ అధికారులు ప్రజల ఇబ్బందులు వస్తె పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలి ఏదైనా విపత్తు వస్తె అధికారులకు వెంటనే తెలియజేయాలి’’ అని పొన్నం నగరవాసులను కోరారు.మరోవైపు.. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. -
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
-
బంగాళాఖాతంలో అల్పపీడనం
-
ఏపీలో వారం రోజులపాటు భారీ వర్షాలు
-
కరోనా అలర్ట్
బనశంకరి: కోవిడ్–19 వల్ల బెంగళూరులో ఓ వృద్ధుడు చనిపోగా, మరో రెండు పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కోవిడ్ టెస్టులను పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశించింది. సాంకేతిక సలహా సమితి సూచనల ప్రకారం రోజుకు 150 నుంచి 200 పరీక్షలు చేపట్టాలని తీర్మానించారు. శ్వాసకోస జబ్బుల రోగులకు ఆర్టీ పీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేయాలని ఆదేశించింది. టెస్టుల కిట్లను సత్వరమే వాడుకోవాలని తెలిపింది. పరీక్షలు ప్రారంభం వృద్ధులు, పిల్లల్లో గర్భిణీ స్త్రీలలో రోగ లక్షణాలు కనబడితే కోవిడ్ పరీక్షలను చేయాలని, శాంపిల్స్ ను ల్యాబోరేటరీలకు అదే రోజు పంపించాలని ఆరోగ్యశాఖ జిల్లాల వైద్యాధికారులకు సూచించింది. ఆదివారం నుంచి రాష్ట్రంలోని 8 మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు ప్రారంభించారు. బెంగళూరులో మల్లేశ్వరంలో 45 ఏళ్ల వ్యక్తి కి, రాజాజీనగరలో 38 ఏళ్ల వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వారు ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 40కి చేరుకున్నాయి. నగరంలో ఓ వృద్ధుడు మరణించినట్లు తెలిసింది. ప్రమాదకర వేరియంట్ కాదు = ఆరోగ్యమంత్రి దినేశ్ శివాజీనగర: ఇప్పుడు బయటపడిన కోవిడ్ వేరియంట్ అంత ప్రమాదకరమైనది కాదని, ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటోందని ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, ఇప్పుడు కోవిడ్ జే–1 ఉపజాతి బయటపడింది, ఇది అధిక దుష్ప్రభావం చూపినట్లు లేదు. ఎవరికీ తీవ్ర రోగ లక్షణాలు కనిపించలేదు. మూడు నాలుగు రోజుల్లో పరిస్థితిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకొంటామని తెలిపారు. మొదటి, రెండవ వేవ్‌ల పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. టెస్టింగ్ కిట్లు రెండు రోజుల్లోగా వస్తాయన్నారు. శ్వాసకోశ రోగులు, వృద్ధులు, గర్భవతులకు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పకుండా టెస్టు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కరోనా వల్ల బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడని, ఆయనకు ముందునుంచి అనారోగ్యం ఉందని చెప్పారు. బెంగళూరులో నిమ్హాన్స్ ఆసుపత్రి, బెంగళూరు మెడికల్ కాలేజీ, ఎన్ఐవీ కేంద్రంతో పాటుగా రాష్ట్రంలో 10 చోట్ల కరోనా టెస్టులు నిర్వహిస్తారన్నారు. ఒక నెలకు సరిపోయేలా 5 వేల ఆర్టీ పీసీఆర్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. -
Covid-19 మళ్లీ వచ్చేసింది : కేసులు, మరణాలు, అధికారుల హెచ్చరికలు
ఆసియాలో కోవిడ్మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆసియా అంతటా కోవిడ్ న్యూ వేవ్ ఆందోళన రేపుతోంది. హాంకాంగ్, సింగపూర్‌లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల మరణాలు కూడా నమోదవుతున్నాయి. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి కనిపిస్తుండటం మరింత ఆందోళనకరంగా మారింది. ఆసియాలోని ఈ రెండు అతిపెద్ద నగరాల్లో వైరస్ కేసులు క్రమానుగతంగా పెరుగుతున్నందున, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులు బూస్టర్ షాట్లు తీసుకోవాలని, ప్రజలు తమ టీకాలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులు పిలుపునిచ్చారు.జనసాంద్రత ఎక్కువగా ఉన్న హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని స్థానిక ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా హాంకాంగ్‌లో వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని నగరంలోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఆయు స్థానిక మీడియాతో అన్నారు. హాంకాంగ్‌లో కోవిడ్-పాజిటివ్ కేసుల శాతం అత్యధిక స్థాయికి చేరిందన్నారు. మే 3 నుండి వారంలో మరణాలతో సహా తీవ్రమైన కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాదిలో అత్యధిక స్థాయికి చేరుకుని 31కి చేరుకున్నాయని అక్కడి లెక్కల ద్వారా తెలుస్తోంది. 7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత రెండేళ్లలో కనిపించిన కేసులతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రిలో చేరికలు బాగా పెరిగాయని తెలిపారు.అటు సింగపూర్‌లో మే 3 నుండి వారంలో గత ఏడు రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య 28 శాతం పెరిగి 14,200 కు చేరగా, రోజువారీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య దాదాపు 30 శాతం పెరిగింది. దీనికి సంబంధించి నగర-రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఈ నెలలో కోవిడ్ డేటాను విడుదల చేసింది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల కేసులు పెరగవచ్చు, అయితే, మహమ్మారి సమయంలో కంటే ప్రసరణ వేరియంట్లు వ్యాప్తి, తీవ్రమైన కేసులకు సంబంధించిన సూచనలు లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ఇలా ఉంటే..హాంకాంగ్ గాయకుడు ఈసన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. ఈ వారం చివర్లో తైవాన్‌లోని కావోసియుంగ్‌లో తన కచేరీలను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చైనీస్ సోషల్ మీడియా వీబోలోని కచేరీ అధికారిక ఖాతా గురువారం తెలిపింది.ఇదీ చదవండి: పురుషులూ మేలుకోండి.. హాట్ టాపిక్‌గా ఇద్దరు మహిళల పెళ్లి!అటు చైనా కూడా కోవిడ్ కేసులను, వ్యాప్తిని నిశితంగా గమనిస్తోంది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం, ప్రస్తుతం గత సంవత్సరం వేసవిలో కోవిడ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకునే దిశగా చైనా పయనిస్తోంది. మే 4 దాకా ఐదు వారాల్లో ప్రధాన ఆసుపత్రులలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువ పెరగడం గమనార్హం.చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా? -
Intelligence alert: అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ, సాక్షి: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరగవచ్చనే నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత పట్టణాలు అప్రమత్తంగా ఉండాలని, గస్తీ పెంచుకోవాలని సూచించింది. సముద్ర మార్గం గుండా వచ్చిన ఉగ్రవాదులు 2008 ముంబై 26/11 మారహోమానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక సూత్రధారి, లష్కరే ఉగ్రవాది తహవూర్ రాణా విచారణ ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చని నిఘా సంస్థలు కేంద్ర హోం శాఖకు నివేదిక సమర్పించాయి. దీంతో హోం శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది. ఉగ్రవాదులు డ్రోన్లు, ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని, ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతాలపై ఎక్కువ నిఘా ఉంచాలని సూచించింది. మరోవైపు.. నిఘా సంస్థలు రైల్వే శాఖను ప్రత్యేకంగా అప్రమత్తం చేయడం గమనార్హం. -
నీలి రంగు అద్దాల మేడలు : భగభగ మంటలు
ముంబై, ఉప నగరాల్లో మొన్నటిదాకా 34 డిగ్రీలున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఏకంగా 37, 38 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత పదిహేను రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతను భరించలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల దెబ్బకు వివిధ అనారోగ్య సమస్యల బారిన పడి ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో చిన్న చిన్న క్లినిక్‌లు మొదలుకుని ప్రభుత్వ, ప్రైవేటు, బీఎంసీ తదితర ప్రధాన ఆసుపత్రులకు రోగులు బారులు తీరుతున్నారు. ఎండలు ముదరడంతో విధులకు వెళ్లేందుకు బయలుదేరిన ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ రకాల పనుల కోసం ఇల్లు కదిలే గృహిణులు, సామాన్యులు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. ప్రతీరోజు రెండు నుంచి మూడు లీటర్లకుపైగా నీరు తాగాలని, అవసరమైతే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీ, పండ్ల రసాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కళ్లు తిరగడం, వాంతులు, కాళ్లు, చేతుల నొప్పులు, దురద , మూత్రం సరిగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపం క్లినిక్‌లు లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని జె.జె.ఆసుపత్రి ప్రొఫెసర్ డా.మధుకర్ గైక్వాడ్ సూచించారు. లేదంటే వడదెబ్బతో తీవ్ర అనారోగ్యం బారిన పడే అవకాశముందని హెచ్చరించారు. – డా.మధుకర్ గైక్వాడ్అద్దాల మేడలూ కారణమే ముంబైలో అనేక బహుళ అంతస్తుల భవనాలు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బేస్మెంట్పై అదనపు భారం పడకుండా , అందంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో 90 శాతం భవనాలకు నీలం రంగు అద్దాలు బిగిస్తున్నారు. నగరంలో వేడిమి పెరుగుదలకు ఇది కూడా ఒక కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. – ఆరోగ్య నిపుణులు చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఅకాల వర్షాలకు అవకాశం వేసవి ఎండలతో సతమతమవుతున్న ముంబైకర్లపై మరో పిడుగు పడనుంది. త్వరలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాల వర్షాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని, జాగ్రత్తలు పాటించాలని సూచించింది.– ఐఎండీచదవండి: నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్! -
43.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. మండిపోతున్న ఎండలు
భువనేశ్వర్: దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండ వేడిమి ఠారెత్తిస్తోంది. ఒడిశా(Odisha)లోని పలు నగరాల్లో ఇప్పటికే వేడిగాలులు వీస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అందించిన సమాచారం ప్రకారం ఒడిశాలోని బౌధ్ సోమవారం వరుసగా మూడవ రోజు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు(Highest temperatures) నమోదైన ప్రదేశంగా నిలిచింది.సోమవారం ఈ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఒడిశాలోని బార్గడ్లో 42 ఢిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు మూడవ స్థానంలో నిలిచింది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 41.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత చాలా రోజుల తర్వాత 30 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యింది.మంగళవారం నుండి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుందని, మార్చి 25- 31 మధ్య రాజధానిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. ఢిల్లీలో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీలుగా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 2.1 డిగ్రీలు తక్కువ. ఢిల్లీతో పాటు ఇతర మైదాన ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తగ్గడానికి జమ్ముకశ్మీర్‌లో కురుస్తున్న హిమపాతం కారణంగా నిలిచింది. ఒడిశా విషయానికొస్తే బౌధ్‌లో శనివారం 42.5 డిగ్రీల సెల్సియస్, ఆదివారం 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒడిశాలోని ఆరు జిల్లాలకు మంగళవారం వాతావరణ శాఖ వేడిగాలుల హెచ్చరిక జారీ చేసింది.ఇది కూడా చదవండి: జో బైడెన్ సంతానానికి సీక్రెట్ సర్వీస్ రక్షణ తొలగింపు -
ఎండలు పెరుగుతున్నాయి... జర జాగ్రత్త
నిన్నామొన్నటి వరకు గజ గజ వణింకించిన చలించింది. ఇపుడిక ఎండలు దంచికొడుతున్నాయి. జనవరి మాసం అలా వెళ్లిందో లేదో ఫిబ్రవరి మాసం ఆరంభంనుంచి క్రమంగా వాతావరణ వేడెక్కడం మందలైంది. ఇపుడిక ఎండలు మండిస్తున్నాయి. ఎండ ప్రభావం, ఉక్కపోత మొదలైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా శివరాత్రితో శివ..శివా అంటూ చలి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతారు. కానీ శివరాత్రి కంటే ముందే ఎండల ప్రభావం కనిపిస్తోంది. దీంతో రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వేసవిలో ఎండల బాధలు, తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో బయటకు రాకూడదు. ఎండ వేడికి ఎక్కువగా గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా పిల్లలు, వయసైన వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని అధికారులు తెలిపారు. ముదురుతున్న ఎండలు- జాగ్రత్తలుఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి.అలాగే గాలి పీల్చుకునే తేలికపాటి బట్టలు ధరించడం ఉత్తమం.బయటికి వెళ్లేవారు గొడుగులు, స్కార్ఫ్‌లు ధరించాలి.మరీ ఎండ ఎక్కువగా సమయంలో బయటికి రాకుండా ఉండాలి. కొబ్బరి నీళ్లు, నీళ్ల కంటెంట్ ఎక్కువగా ఉండే తాజా పళ్లు తీసుకోవాలి.కానీ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తగ్గడం లేదు.ఉక్కపోతతో పాటు చెమట ఇబ్బంది పెడుతోంది. తరచూ చెమట పట్టడం వల్ల శరీరంలోని నీటి పరిమాణం, ఉప్పు శాతం తగ్గిపోతాయి. ఏసీ రూంలో ఉన్నాం కదా, చెమట లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి. వేడి వాతావరణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, రానున్న కాలంలో మరింత ముదిరే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం, ఎప్పటికపుడు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని ఆరోగ్యరంగ నిపుణులు అంటున్నారు. -
ముంబైలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, ముంబై: ముంబై నగరంలో గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జనవరిలో కొన్ని రోజులపాటు వర్షపాతం నమోదైనప్పటికీ, ఇప్పుడు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీని వల్ల ముంబై వాసులు విపరీతమైన వేడిని ఎదుర్కొంటున్నారు. జనవరిలో ముంబైలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. అయితే ఫిబ్రవరి ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 34 డిగ్రీల సెల్సియస్‌ను దాటి వెళ్లింది. ముంబై శివారు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం శాంటా క్రూజ్ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీలుగా నమోదైంది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, రాబోయే కొన్ని రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 33 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పగటి వేళ వేడి తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలో కూడా స్వల్ప పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మార్పుల కారణంగా ముంబై ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వేడి తీవ్రత పెరగడంతో బయటికి వెళ్లే ప్రజలు సౌకర్యవంతంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరాన్ని తేమగా ఉంచుకునేందుకు పుష్కలమైన నీరు తాగాలని, పొడి వాతావరణం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఎండ వేడికి అధికంగా గురికాకుండా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని కొంకణ్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని, బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవడం, గాలి పీల్చుకునే తేలికపాటి బట్టలు ధరించడం, ఎండ వేడికి ఎక్కువగా గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా పిల్లలు, వయసైన వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని అధికారులు తెలిపారు. -
తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అలర్ట్.. 4 రోజులు అంతరాయం
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు (HDFC Bank) సంబంధించిన పలు సేవలు నాలుగు రోజులు అందుబాటులో ఉండవు. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. నిర్వహణ పనుల నిమిత్తం జనవరి 17, 18, 24, 25 తేదీల్లో పలు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది.కస్టమర్లకు మెరుగైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వివరించింది. ఏయే తేదీల్లో, ఏయే సమయాల్లో ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవనేది కస్టమర్లకు సమాచారం అందించింది.జనవరి 17న తెల్లవారుజామున 2:00 నుండి ఉదయం 5:00 గంటల వరకు 3 గంటల పాటు ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డ్ సర్వీస్ అందుబాటులో ఉండదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో ప్రీపెయిడ్ కార్డ్ నెట్‌బ్యాంకింగ్, ఇన్స్టంట్ రీలోడ్ పోర్టల్ ద్వారా ఫారెక్స్ కార్డ్ రీలోడ్ చేయడం సాధ్యం కాదు. అయితే, వినియోగదారులు నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫారెక్స్ కార్డ్‌లను రీలోడ్ చేయవచ్చు.జనవరి 18, 25 తేదీలలో అర్ధరాత్రి 12:00 నుండి ఉదయం 3:00 వరకు యూపీఐ (UPI) సర్వీస్ అందుబాటులో ఉండదు. ఈ సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలపై యూపీఐ లావాదేవీలు, రూపే క్రెడిట్ కార్డ్, హెచ్డీఎఫ్సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, థర్డ్ పార్టీ యాప్‌లలో యూపీఐ సర్వీస్ నిలిపేస్తారు. మర్చెంట్ యూపీఐ లావాదేవీలు కూడా ప్రభావితమవుతాయి.ఇక జనవరి 24, 25 తేదీల్లో చాట్‌బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ (SMS) బ్యాంకింగ్, ఫోన్‌బ్యాంకింగ్ ఐవీఆర్ (IVR) సేవల్లో అంతరాయం ఉంటుంది. జనవరి 24 రాత్రి 10:00 గంటల నుండి జనవరి 25 మధ్యాహ్నం 2:00 గంటల వరకు (మొత్తం 16 గంటలు) చాట్‌బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, ఫోన్‌బ్యాంకింగ్ ఐవీఆర్ సేవలపై పని చేయనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. ఈ సమయంలో ఈ సేవలన్నీ వినియోగదారులకు అందుబాటులో ఉండవు.కస్టమర్లకు అలర్ట్హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ అప్డేట్ను రిజిస్టర్డ్ ఈ-మెయిల్ చిరునామా ద్వారా కస్టమర్లకు పంపింది. ఈ తేదీలు, సమయాల్లో ఇతర ఎంపికలను ఉపయోగించాలని సూచించించింది. తమ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈ అవసరమైన నిర్వహణను పూర్తి చేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని కస్టమర్లకు సూచించింది. -
హెచ్ఎంపీవీ విభృంభణ.. ధృవీకరించిన చైనా!
చైనాలో HMPV పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేశాయి. అయితే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది. ప్రపంచాన్ని మరో మహమ్మారి వణికించడం ఖాయమని పరిశోధకుల హెచ్చరికల వేళ.. డ్రాగన్ కంట్రీ కొత్త వైరస్ విజృంభణను ధృవీకరించినట్లు కథనాలు వెలువడుతుండడం గమనార్హం. అయితే..కేవలం చైనా ఉత్తర భాగంలోనే హెచ్ఎంపీవీ విజృంభణ కొనసాగుతోందని అటు చైనా ఆరోగ్య శాఖ.. ఇటు చైనా అంటువ్యాధుల నియంత్రణ మండలి(China CDC) ప్రకటించాయి. అన్ని వయసులవాళ్లపై ఈ వైరస్ ప్రభావం చూపుతోందని.. ముఖ్యంగా పిల్లల్లో, వయసు పైబడినవాళ్లలో త్వరగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం కేసులను ట్రేస్ చేసే పనిలో ఉన్నట్లు చెబుతున్నాయి. అలాగే మాస్కులు ధరించాలని, శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలని మార్గదర్శకాలను విడుదల చేసినట్లు తెలిపాయి. అయితే.. ఇది ప్రాణాంతకమేనా? అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.👉ఒకవైపు చైనాలో నిజంగానే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అత్యవసర పరిస్థితి(Emergency) విధించారా? అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటిల్లో వాస్తవమెంత? అనేది తేలాల్సి ఉంది.👉మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ పరిణామంపై స్పందించాల్సి ఉంది. 👉ఇంకోవైపు.. చైనా చుట్టుపక్కల దేశాల్లో కొత్త వైరస్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే జపాన్‌లో ఫ్లూ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండగా.. HMPV కేసులేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హంకాంగ్లోనూ ఈ వైరస్ కేసులు నమోదు అయినట్లు సమాచారం.ఏమిటీ హెచ్ఎంపీవీ వైరస్?హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్.. ఆర్ఎన్ఏ వైరస్. క్షీరదాలు, పక్షుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్ని కలగజేసే Pneumoviridae Metapneumovirusకి చెందింది. అయితే హెచ్ఎంపీవీ కొత్తదేం కాదు. చైనాకు 20 ఏళ్లుగా పరిచయం ఉన్న వైరస్సే. 2021లో తొలిసారిగా ఈ వైరస్ ఆనవాళ్లను శ్వాసకోశ సంబంధిత సమ్యలతో బాధపడుతున్న చిన్నపిల్లల్లో డచ్ పరిశోధకులు గుర్తించారు. అయితే ఎలా సోకుతుందని(వ్యాధికారకం) విషయం గుర్తించలేకపోగా.. ఇప్పటిదాకా దీనికి వ్యాక్సిన్, మందులు సైతం కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. సెరోలాజికల్ అధ్యయనాల ప్రకారం ఈ వైరస్ 60 ఏళ్లు భూమ్మీద సజీవంగానే ఉండి తన ప్రభావం చూపిస్తుందని తేలింది. ఇదీ చదవండి: HMPV Virus : ఆందోళన అవసరంలేదంటున్నభారత హెల్త్ ఏజెన్సీ లక్షణాలు, చికిత్సకరోనా తరహాలోనే వేగంగా వ్యాపించే ఈ వైరస్.. పిల్లలు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లపై ప్రభావం చూపెడుతుందని తెలుస్తోంది. జలుబుతో పాటు దగ్గు, ముక్కు దిబ్బడ, జ్వరం ఈ వైరస్ లక్షణాలు. అయితే పరిస్థితి తీవ్రమైతే గనుక న్యూమోనియా, బ్రాంకైటిస్‌కు దారి తీయొచ్చు. వ్యాక్సిన్, మందులు లేకపోవడంతో లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తున్నారు.ఇక హెచ్ఎంపీవీతో మరణాలు సంభవిస్తాయా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. 2021లో ఈ వైరస్ డాటా ఆధారంగా లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ఓ కథనం ప్రచురించింది. అందులో.. ఐదేండ్ల లోపు పిల్లల్లో ఒక శాతం మరణాలు సంభవించిన విషయాన్ని ప్రస్తావించింది. -
పలు రాష్ట్రాలకు కోల్డ్‌వేవ్ అలర్ట్
న్యూఢిల్లీ:ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ(IMD) అలర్ట్ ఇచ్చింది. జమ్ముకశ్మీర్,పంజాబ్,హర్యానా,రాజస్థాన్,ఢిల్లీలో డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు తీవ్రమైన చలి(కోల్డ్‌వేవ్) ఉంటుందని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు,పశ్చిమ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయి చలి తీవ్రంగా ఉంటుందని తెలిపింది. హిమాచల్‌ప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు మంచు(Snow) కురుస్తుందని వెల్లడించింది. కశ్మీర్లో మంచు ప్రభావంతో ఇప్పటికే రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ఇక్కడ పలు విమానాలు, రైళ్లు ఇప్పటికే రద్దయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీకి వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఇదీ చదవండి: హాలిడే సీజన్‌పై టోర్నడోల ఎఫెక్ట్ -
ఆరెంజ్ అలర్ట్.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
-
కేరళలో మళ్లీ మంకీపాక్స్ కలకలం
తిరువనంతపురం:మంకీపాక్స్ వైరస్ కేసులు కేరళలో మళ్లీ నమోదయ్యాయి. తాజాగా రెండు కేసులు వెలుగుచూడడం ఇక్కడ కలకలం రేపింది. యూఏఈ నుంచి ఇటీవలే కేరళ వచ్చిన ఇద్దరికి మంకీ పాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.వయనాడ్‌కు చెందిన వ్యక్తికి తొలుత మంకీపాక్స్ నిర్ధారణ కాగా తాజాగా కన్నూర్ జిల్లా వాసికి వైరస్ సోకినట్లు తేలింది.దీంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు వైరస్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు.ఇదిలాఉంటే కేరళలో ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ కొన్ని మంకీపాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.


