
పూణె: మహారాష్ట్రలోని పూణెలో నిన్న(ఆదివారం) రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ప్రజాజీవనాన్ని ఘోరంగా దెబ్బతీసింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదులుతోంది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో పూణేలోని పాఠశాలలకు ఈ రోజు(సెప్టెంబర్ 15) సెలవు ప్రకటించారు.
Pune Rains: Heavy Downpour Triggers Traffic Jams, Waterlogging Across City
🔗 https://t.co/ibQExSolWN#punenews #punerains #Rain #weatheralert pic.twitter.com/9HCdtVz3w0— Free Press Journal (@fpjindia) September 15, 2025
వాతావారణశాఖ అధికారుల సూచనల మేరకు సెప్టెంబర్ 16న కూడా సెలవు ప్రకటించారు. భారీ వర్షపాతం కారణంగా పూణేలో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పూణే మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. భారత వాతావరణ శాఖ పూణేతో పాటు సమీప జిల్లాల్లో భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. భారత వాతావరణ శాఖ పూణే, ముంబై, థానే, రాయ్‌గడ్, బీడ్, అహల్యానగర్, లాతూర్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు కురియనున్నాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది.