breaking news
pune
-
గాల్లోనే మాయమవుతోన్న నాలుగో వంతు వర్షం!
భారతదేశంలో కురిసే నైరుతి రుతుపవనాల వర్షంలో దాదాపు 25 శాతం (నాలుగో వంతు) వర్షపు నీరు అసలు నేలను తాకకముందే గాలిలోనే ఆవిరైపోతోందని పుణేలోని ఐఐటీఎం (ఇండియన్ ఇన్‌నిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ) శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. వర్షపు చుక్కలు గాల్లోనే ఆవిరైపోయే పరిమాణాన్ని శాస్త్రవేత్తలు ప్రత్యక్ష పరిశీలనల ద్వారా కచ్చితంగా అంచనా వేయడం ఇదే మొదటిసారి. (IITM Pune Study)దశాబ్ద కాలపు పరిశోధన.. ఎలా గుర్తించారు? జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే రుతుపవనాలపై శాస్త్రవేత్తలు సుదీర్ఘంగా పరిశోధనలు చేశారు. డేటా విశ్లేషణ: పదేళ్లుగా సేకరించిన వర్షపాతం, వాతావరణంలోని ఐసోటోప్ డేటాను క్షుణ్ణంగా విశ్లేషించి శాస్త్రవేత్తలు ఈ ముగింపునకు వచ్చారు.ప్రాంతాన్ని బట్టి మారుతున్న ఆవిరి శాతం ఈ వర్షపు నీటి ఆవిరీకరణ (Evaporation) దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులను బట్టి ఇది మారుతూ ఉంటుంది: పశ్చిమ కనుమలు: ఇక్కడ తేమ ఎక్కువగా ఉండటం వల్ల కేవలం 4 నుంచి 6 శాతం వర్షం మాత్రమే గాల్లో ఆవిరవుతుంది.వాయవ్య భారతదేశం: రాజస్తాన్ వంటి పొడి వాతావరణం ఉండే ప్రాంతాల్లో ఇది గరిష్టంగా 40 శాతం వరకు ఉంటోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? వర్షపు చినుకులు మేఘాల నుంచి పడుతున్న సమయంలో.. వాటి చుట్టూ ఉండే వేడి, పొడి గాలి కారణంగా కొంత నీరు నేలను తాకకుండానే గాలిలోకి ఆవిరి రూపంలో కలిసిపోతుంది. ముఖ్యంగా పరిమాణంలో చిన్నవిగా ఉండే చినుకులు ఇలా ఎక్కువగా ఆవిరైపోతుంటాయి.ఈ పరిశోధన వల్ల ఉపయోగం ఏంటి? ఈ సరికొత్త ఆవిష్కరణ వాతావరణ శాస్త్రంలో చాలా కీలకం కానుంది. కచ్చితమైన అంచనాలు: రుతుపవనాల గమనాన్ని, వర్ష సూచనలను మరింత కచ్చితంగా అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది.విపత్తుల నిర్వహణ: మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా... దేశంలో వచ్చే వరదలు, కరువు పరిస్థితులను ముందే ఊహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ పరిశోధన శాస్త్రవేత్తలకు ఎంతో తోడ్పడుతుంది. - సాక్షి స్పెషల్ డెస్క్ -
ప్లాన్-ఏకి భయపడి.. ప్లాన్-బీతో ఘాతుకం!
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పుణె లోహగఢ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరిన్ని సంచలనాలు బయటకు వస్తున్నాయి. యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌తో వివాహం ఇష్టం లేకనే సియా గోయల్, చేతన్ చౌదరి కలిసి హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడో షాకింగ్ విషయం బయటపడింది. ప్లాన్ ఏకు భయపడి.. ప్లాన్ బీను అమలు చేసి సియా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. కేతన్, సియాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. అయితే చేతన్‌తో ప్రేమలో ఉన్న సియా మాత్రం ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఓవైపు కేతన్‌తో సన్నిహితంగా ఉంటూనే.. మరోవైపు ప్రియుడితో దారుణమైన స్కెచ్‌లు గీసింది. ఇందుకోసం వెబ్ సిరీస్‌లు, క్రైమ్ సినిమాలు చూస్తూ గంటల తరబడి గడిపింది. చివరకు.. చేతన్‌తో కలిసి ఈ పెళ్లి ఆపడానికి రెండు ప్లాన్లు గీసింది. అందులో.. మొదటిది కేతన్కు యాక్సిడెంట్ చేయడం!. అతడిని గాయపరిచి పెళ్లిని వాయిదా వేయాలని.. ఆ తర్వాత కలిసి పారిపోవడమో లేదంటే ఈ గ్యాప్‌లో మరేదైనా ప్లాన్ అమలు చేయాలని భావించింది. అయితే ఆ ప్లాన్‌లో రిస్క్ ఎక్కువగా ఉందని భావించి డ్రాప్ అయ్యారు. కేతన్‌ను ఈ విషయం తెలిసిపోతే తమ పని అయిపోయినట్లేనని భయపడ్డారు. ఒకవేళ ప్లాన్ బెడిసి కొట్టి బలవంతంగా పెళ్లి జరిగితే ఆ తర్వాత తమ బంధం కొనసాగదని భావించారు. అందుకే ప్లాన్ బీ అమలు చేయాలని ఫిక్స్ అయ్యారు. పక్కా ప్లాన్ గీసి కేతన్‌ను అంతమొందించారు. సస్పెన్స్ సినిమాలు.. ఆన్లైన్ సెర్చ్లుహత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం సస్పెన్స్ సినిమాలు చూసారని, హత్య తర్వాత ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఇంటర్నెట్లో సమాచారం వెతికారని తెలిపారు. సియా ఫోన్ హిస్టరీలో ఈ విషయం బయటపడిందని తెలిపారు. అంతేకాదు.. కేతన్‌ను ఎక్కడ హత్య చేస్తే అది ప్రమాదంలా కనిపిస్తుందో తెలుసుకునేందుకు పలు ప్రాంతాలను పరిశీలించినట్లు వెల్లడించారు. లోనావాలాలోని టైగర్ పాయింట్, విశాపూర్ కోట తదితర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత లోహగఢ్ కోటను ఎంచుకున్నారని చెప్పారు.ముందుగానే రెక్కీ చేసిన సియా?దర్యాప్తులో భాగంగా సియా మే 31న కేతన్‌తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ పర్యటన హత్యకు ముందు చేసిన రెక్కీ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అక్కడ ఎక్కడ నుంచి తోసేస్తే కేతన్ మృతి చెందుతాడు.. ఆధారాలు దొరకకుండా ఎలా చేయాలనే విషయాలను పరిశీలించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత జూన్ 3న మరోసారి అక్కడికి వెళ్లేందుకు కేతన్‌ను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.బాలి ట్రిప్ కూడా కుట్రలో భాగమేనా?సియా, కేతన్‌లు జూన్ 6న ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఎనిమిది రోజుల పాటు అక్కడ గడపాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ ప్రయాణం తమ కుట్రకు అడ్డుగా మారుతుందని భావించిన నిందితులు.. ఎలాగైనా ఆ పర్యటనను ఆపాలని ప్రయత్నించారు. ముంబై పర్యటన సమయంలో సియా కేతన్ పాస్‌పోర్ట్‌ను దొంగిలించిందని.. దీంతో బాలి ప్రయాణం రద్దయిందని పోలీసులు తెలిపారు.ముందే ఒకసారి హత్యాయత్నం?లోహగఢ్ కోట వద్ద జూన్ 14న సియా కేతన్‌ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కేతన్ ఓ పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. ఆ సమయంలో అనుమానం రాకుండా.. పాము నుంచి కాపాడేందుకు తానే తోశానని సియా చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. తర్వాత జూన్ 18న మరోసారి లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. చేతన్‌తో కలిసి కేతన్‌ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని కొత్త విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. -
‘కేతన్ నా హీరో.. చాలా కేరింగ్’.. పొగడ్తలు గుప్పించిన సియా!
ఒకప్పుడు ప్రేమ, అనుబంధానికి గుర్తుగా నిలిచిన ఓ వీడియో.. ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమవుతోంది. పుణే లోహ్‌గఢ్ కేసులో నిందితురాలు సియా గోయల్ కేతన్ అగర్వాల్‌ను పొడుగుతూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను నెటిజన్లు చూసి నెటిజన్లు.. పాపం కేతన్, అంత మంచోడిని చంపడానికి చేతులెలా వచ్చాయి? అని సియాను తిట్టుకుంటున్నారు. ఆ వీడియో కేతన్-సియా నిశ్చితార్థ వేడుకలోది. వేదికపై కేతన్, సియా కలిసి ఉన్న సమయంలో అక్కడున్న ఒకావిడ ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అప్పటికే సియా కేతన్‌ను తన హీరో అని, ఆ హీరో నెంబర్ 1 అని వ్యాఖ్యానించింది. “కాబోయే భర్తగా కేతన్‌లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? అతడిని మీ హీరో నంబర్ వన్‌గా భావించడానికి కారణం?” అని ప్రశ్నించారు. దీనికి సియా చిరునవ్వుతో.. “కేతన్ చాలా కేరింగ్, చాలా మంచివాడు” అంటూ సమాధానం ఇచ్చింది. ఆ మాటలు విన్న కేతన్ నవ్వుతూ స్పందించగా.. అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. అప్పట్లో ప్రేమగా కనిపించిన ఈ క్షణాలు.. ఇప్పుడు కేతన్ మృతి కేసు నేపథ్యంలో మరో కోణంలో చర్చకు వస్తున్నాయి.'Ketan Agarwal Is Caring & Kind,' Said Siya Goyal During Engagement Ceremony pic.twitter.com/xMy79rhfQg— Pune First (@Pune_First) July 20, 2026పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ.. పుణె రూరల్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వివాహంపై అసంతృప్తితో ఉన్న సియా గోయల్ (20), ఆమె స్నేహితుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫొటో షూట్ పేరుతో కేతన్‌ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. అక్కడి లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. అంతకు ముందు(జూన్ 14న) ఇదే ప్రాంతంలో కేతన్‌ను చంపేందుకు మరోసారి ప్రయత్నం జరిగినట్లు కూడా తెలుస్తోంది. పుణే కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. కాబోయేవాడిని ప్రియుడి సాయంతో హతమార్చడం.. రకరకాల చర్చలకు దారి తీసింది. ఈ తరుణంలో కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. కేతన్‌ను తోసి చంపింది సియానా? లేదంటే చేతనా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. విచారణలో పోలీసులును సియా, చేతన్‌లు ఏ వివరాలు చెప్పుకుండా ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. పోలీసులు ఆమెను విచారణ కోసం పలు ప్రాంతాలకు తీసుకెళ్తున్న సమయంలోనూ మీడియా ముందు ఆటిట్యూడ్ ప్రదర్శిస్తూ వస్తోంది. సియా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలంటున్న ఆమె కుటుంబం.. మరోవైపు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం. అయితే దర్యాప్తు ఆలస్యం అవుతుండడంతో ఆమె బెయిల్ దక్కవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తోంది కేతన్ కుటుంబం. సియా కేతన్ కలిసి దిగిన ఫొటోలు, సరదాగా గడిపిన వీడియోలు.. ఇప్పుడు “కేతన్ మంచోడు.. కేరింగ్” అని చెప్పిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటూ వైరల్ అవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అంత మంచోడికి విషయం చెబితే సరిపోయేది కదా.. ఎందుకు చంపేశావ్? అని కామెంట్లలో సియాను తిట్టి పోస్తున్నారు. -
సియా గోయల్ కుటుంబానికి బిగ్ షాక్
యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సియా గోయల్ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె బెయిల్ కోసం తీవ్రంగా యత్నిస్తున్న కుటుంబానికి ఇప్పుడు పెద్ద షాకే తగిలింది. సియా కుటుంబం నిర్వహించే మసాలా, డ్రై ఫ్రూట్స్ వ్యాపార సంస్థపై మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం (FDA) చర్యలు తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనలు, కల్తీ అనుమానాల నేపథ్యంలో దుకాణ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పుణెలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఉన్న బీజీ గోయల్ అండ్ కంపెనీ (M/s BG Goyal and Company) అనే సంస్థను సియా కుటుంబం నిర్వహిస్తోంది. ఈ షాపులో తాజాగా ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఉత్పత్తులను గుర్తించారు. వీటిలో పసుపు పొడి, నువ్వులు, సోయాబీన్ చంక్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. తనిఖీల సందర్భంగా మొత్తం 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.8.14 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (FSS Act) ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను సంస్థ ఉల్లంఘించిందని ఎఫ్‌డీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. లైసెన్స్ వివరాల్లో అవసరమైన మార్పులు చేయాలని గతంలో సూచించినప్పటికీ.. సంస్థ నుంచి సరైన స్పందన రాకపోవడంతో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్పత్తుల లేబులింగ్‌లో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు, కల్తీ జరిగి ఉండొచ్చన్న అనుమానంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా.. సియా గోయల్ పేరు దేశం అంతటికి తెలిసిందే. తన కాబోయే భర్త కేతన్ (25)ను ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి లోహగఢ్ కోట వద్ద నుంచి తోసి హత్య చేసిన కేసులో ఆమె నిందితురాలిగా ఉంది. జూన్ 18న ఈ ఘటన జరగ్గా.. అనేక మలుపులు తిరిగిన ఈ కేసు చివరకు సియా, చేతన్ అరెస్ట్‌తో ఓ కొలిక్కి వచ్చింది. అయితే కేతన్‌ను తోసిందెవరు? అనే మిస్టరీ ఇంకా వీడాల్సి ఉంది. ఈ విషయంలో నిందితులిద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అలాగే ఇద్దరూ రహస్య వివాహం చేసుకున్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇటు హత్య కేసు విచారణ కొనసాగుతున్న వేళ.. తాజాగా ఆమె కుటుంబ వ్యాపారంపై FDA చర్యలు తీసుకోవడం పుణెలో చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ దూకుడు ప్రదర్శిస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ తుకారాం ముండే కల్తీపై కొరడా ఝుళిపిస్తున్నారు. కల్తీ ఆహారం, నిషేధిత ఉత్పత్తులు, నాసిరకం మందులపై వరుస దాడులు జరుగుతున్నాయి. గతంలో కఠిన నిర్ణయాలతో గుర్తింపు పొందిన ముండే.. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పలు జిల్లాల్లో అక్రమ తయారీ కేంద్రాలు, గుట్కా విక్రయదారులు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపార సంస్థలపై కేసులు, సీజ్ చర్యలు కొనసాగుతున్నాయి. -
25 ఏకరాల భూమి కొన్న స్టార్ హీరో, ధర ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పూణేలోని ముల్షీ తాలూకాలో రూ. 16.42 కోట్లతో 25.7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 1,04,000 చదరపు మీటర్లు ( సుమారు 25.7 ఎకరాలు) విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్నిరణ్బీర్ నాలుగు భాగాలుగా రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ ఏడాది మే నెలలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన అయోధ్యలోనూ భారీ పెట్టుబడుల తరువాత తాజాగా డీల్ విశేషంగా నిలుస్తోంది.రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'సిఆర్ఈ మాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ లావాదేవీ 2026 ఏప్రిల్ 30న నమోదైంది. ముల్షీలోని పింప్రి గ్రామంలో ఒకదానికొకటి ఆనుకుని ఉన్న నాలుగు భూభాగాలను రణబీర్ కొనుగోలు చేశారు. వీటి మొత్తం వైశాల్యం 1,04,000 చదరపు మీటర్లు (సుమారు 25.7 ఎకరాలు). అరుణ్ శ్రీరామ్ లూత్రా, నవీన్ శ్రీరామ్ లూత్రా ,మాలా ఉమేష్ మెహతా అనే వ్యక్తుల నుంచి ఈ స్థలాన్ని కొన్నారు. ఈ భారీ ల్యాండ్ డీల్ కోసం రణ్‌బీర్ ఏకంగా రూ. 82.13 లక్షలను స్టాంప్ డ్యూటీ రూపంలో చెల్లించినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది.రణబీర్ కపూర్ ఇటీవల అయోధ్యలోని విలాసవంతమైన లేఅవుట్ 'ది సరయూ'లో రూ. 3.31 కోట్లతో 2,134 చదరపు అడుగుల ప్లాట్‌ను 2026 మే నెలలో కొనుగోలు చేశారు. ఆ పెట్టుబడి పెట్టిన కొద్ది నెలలకే ఈ కొత్త భారీ భూమి కొనుగోలు జరగడం విశేషం.ఇదీ చదవండి: 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?రణబీర్, అలియా నెట్‌వర్త్ పలు కథనాల ప్రకారం కపూర్ కుటుంబానికి చెందిన ఈ స్టార్ హీరో రణబీర్ కపూర్ నికర ఆస్తి విలువ రూ. 400 కోట్లు. జీక్యూ ఇండియా (GQ India) 2024 నివేదిక ప్రకారం, రణబీర్ కపూర్‌తో పోలిస్తే ఆలియా భట్ నికర ఆస్తి విలువ ఎక్కువ. ఆమె ఆస్తి రూ. 550 కోట్లు. ఇవి కాకుండా రణబీర్ సావన్ (Saavn), బెకో (Beco) వంటి పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు. డ్రోన్‌ఆచార్య అనే ఏరియల్ ఇన్నోవేషన్స్ కంపెనీకి కూడా ఆయన మద్దతుగా నిలిచారు. అలాగే 'ఆర్క్స్' (Arks) వంటి వెంచర్లలో భాగస్వామ్యంతో పాటు, ముంబై సిటీ ఎఫ్‌సి (Mumbai City FC) ఫుట్‌బాల్ క్లబ్‌కు సహ-యజమానిగా ఉన్నారు.ఇదీ చదవండి: రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్పాలి హిల్‌లోని 'కృష్ణ రాజ్ బంగ్లా' రణబీర్ రియల్ ఎస్టేట్ ఆస్తులలో ముఖ్యమైనది, దీని విలువ దాదాపు రూ. 250 కోట్లుగా చెబుతారు. పూణేలోని ట్రంప్ టవర్స్‌లో కూడా ఆయనకు ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆయన లగ్జరీ కార్ల కలెక్షన్లో బెంట్లీ కాంటినెంటల్ GT V8, రేంజ్ రోవర్, మెర్సిడెస్-AMG SL 55, G63 వంటి కార్లు ఉన్నాయి.ఇక వృత్తిపరమైన విషయానికొస్తే, రానున్న నెలల్లో రణబీర్ నటించిన రెండు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. నవంబర్‌లో, నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక చిత్రం 'రామాయణం పార్ట్ 1' (Ramayana Part 1)లో కనిపించనున్నారు. ఇందులో సాయి పల్లవి, యష్ , సన్నీ డియోల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2027 ప్రారంభంలో, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్, విక్కీ కౌశల్ నటించిన 'లవ్ & వార్' (Love & War) అనే పీరియడ్-రొమాన్స్ చిత్రం విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ చిన 'యానిమల్' (2023) చిత్రంలో రణబీర్ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. -
20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!
పుణే రియల్టర్ కేతన్ అగర్వాల్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లోనావాలా సమీపంలోని లోహగఢ్ కోట వద్ద గత నెలలో హత్యకు గురైన ఈ కేసుపై వేగంగా విచారణ, త్వరితగతిన ట్రయల్ జరిపించాలని కోరుతూ కేతన్ తండ్రి, విశాల్ అగర్వాల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, కేసుత్వరగా ముందుకు సాగేలా సహాయం చేయాలని కోరారు. కేతన్ అకాల మరణాన్ని తట్టుకోలేక, తాత గుండెపోటుతో మరణించిన తరువాత ఈ పరిణామం జరిగింది.బుధవారం రాష్ట్రపతి సెక్రటరీకి పంపిన ఒక భావోద్వేగ ఈమెయిల్లో, కేతన్ మరణం తర్వాత తమ కుటుంబం ఎదుర్కొంటున్న బాధను విశాల్ అగర్వాల్ పంచుకున్నారు. తన మనవడి మరణాన్ని తట్టుకోలేక కేవలం 20 రోజుల తర్వాత తన తండ్రి కూడా కన్నుమూయడంతో ఈ వేదనను తట్టుకోవడం తమవల్ల కావడంలేదని పేర్కొన్నట్లు ఐఏఎన్ఎస్ రిపోర్ట్ చేసింది. తానొక వ్యాపారవేత్తగానో, ప్రభావితవ్యక్తిగానో కాదు, ఎంతో బాధతో, ఆశతో ఇది రాస్తున్నాననంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక తండ్రిగా కొడుకుకు న్యాయం కోసం అర్ధిస్తున్నానంటూ వేడుకున్నారు. కేవలం 20 రోజుల్లోనే అటు కొడుకును, ఇటు తండ్రిని ఇద్దరినీ కోల్పోయి తన కుటుంబం చిన్నాభిన్నమైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.కేతన్ తాతయ్య అతడిని ఎంతగానో ప్రేమించేవారని, మనవడి మరణంతో ఆయన గుండె పగిలిపోయిందని అన్నారు. కేతన్ ఇక లేడని తెలిసి, తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, బీపీ పడిపోవడంతో గుండెపోటుతో చనిపోయారన్నారు. ఇది తమ కుటుంబానికి తీరని వేదనను మిగిల్చిందంటూ తమ మానసిక ప్రభావాన్ని,కేతన్ మరణం తర్వాత తమ జీవితాలు పూర్తిగా విషాదంగా మారిపోయాని విశాల్ అన్నారు. దారుణంగా హత్యకు గురైన కేతన్కు న్యాయం జరిగేది ఎపుడు? ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకొనేదాకా ఇదే ప్రశ్న తమమెదళ్లను తొలిచేస్తోందని పేర్కొన్నారు. తక్షణమే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించేలా చూడాలని, దోషులుగా తేలిన వారికి చట్ట ప్రకారం కఠినమైన శిక్ష పడేలా చూడాలని విశాల్ అధికారులను కోరారు. తమ కుటుంబానికి ప్రత్యేక ట్రీట్మెంట్ అవసరంలేదు కానీ, అనవసర జాప్యం లేకుండా న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నా మన్నారు. లేదంటే తమలాంటి కుటుంబాలు బాధతో మరింత కుంగిపోతాయన్నారు. నా కొడుకును వెనక్కి తేలేం కానీ, కేతన్‌ను మళ్లీ వెనక్కి తీసుకురాలేం, కానీ దోషులు మాత్రం శిక్ష నుండి తప్పించుకోకూడదన్నారు. వారికి కఠినమైన శిక్ష పడినపుడు మాత్రమే తమకు మనశ్శాంతి దక్కడంతోపాటు, ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు తప్పవనే సందేశం సమాజంలో వెళుతుందని, దయచేసి తన కొడుకు కేసును కూడా మరో కేసులా మరుగున పడవేయవద్దని మార్చొద్దని, దీని వెనుక సర్వస్వం కోల్పోయిన ఒక కుటుంబం ఉంది అంటూ ఆవేదనతో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందికాగా పుణె సమీపంలోని లోహగఢ్ కోట వద్ద జూన్ 18న కేతన్ అగర్వాల్ (26) ఒక లోయలో పడి మరణించాడు. మొదట ఇది ట్రెక్కింగ్ ప్రమాదంగా భావించినప్పటికీ, విచారణలో ఇది హత్య కేసుగా మారింది. కేతన్ నిశ్చితార్థం చేసుకున్న సియా గోయల్, ఆమె, ప్రియుడిగా భావిస్తున్న చేతన్ బాబూలాల్ చౌదరి కలిసి ఈ హత్యకు ప్లాన్ చేశారని, అతడిని లోయలోకి తోసేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసి, హత్య , నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశారు.ఇదీ చదవండి: 36 ఏళ్లలో 300 ఫైవ్ స్టార్ హోటళ్లలో జల్సాలు పైసా బిల్ కట్టలేదు : కట్ చేస్తే -
కేతన్ హత్యకు 4 నెలల ముందే సియా చేతన్ సీక్రెట్ గా పెళ్లి
-
కేతన్ హత్యకు నాలుగు నెలలముందే...సీక్రెట్ మ్యారేజ్
పుణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితురాలు సియా గోయల్, క్రైమ్ జరగడానికి కొన్ని నెలల ముందే మరో నిందితుడు, తన ప్రియుడు చేతన్ చౌదరిని రహస్యంగా వివాహం చేసుకుందని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.పోలీసుల కథనం ప్రకారం.. సియా గోయల్, చేతన్ చౌదరి తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా సుమారు నాలుగు నెలల క్రితమే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా వారి మొబైల్ ఫోన్ల నుండి రికవరీ చేసిన వాట్సాప్ చాట్లను పరిశీలించినప్పుడు ఈ విషయం బయట పడింది. అలాగే జూన్ 14నే కేతన్‌ను చంపడానికి ప్రయత్నించినా చివరి నిమిషంలో సియా ధైర్యం సరిపోకపోవడంతో ఆ ప్లాన్ ఫెయిల్ అయిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సియా, చేతన్‌కు ఒక మెసేజ్ పంపుతూ.. ఒంటరిగా ఈ పని చేయడానికి తనకు ధైర్యం చాలడం లేదని, ఇద్దరం కలిసి కేతన్‌ను కొండపై నుండి కిందకు నెట్టేద్దామని, కాబట్టి తనతో పాటు రావాలని కోరినట్లు దర్యాప్తులో తేలింది.ఇదీ చదవండి: కేతన్ హత్య : సియాకు సపోర్ట్ చేసిన నెటిజన్‌పై గాయని మండిపాటునిందితుల గత ఆరేడు నెలల కాల్ రికార్డులు, లొకేషన్ డేటా, వాట్సాప్ సంభాషణలు మరియు ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీని పోలీసులు విశ్లేషించారు. ఈ డిజిటల్ ఆధారాలు క్రైమ్ ప్లానింగ్‌కు సంబంధించిన కీలక ఆధారాలను అందించాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అలాగే కుటుంబాల నుండి వ్యతిరేకత వస్తుందనే భయంతోనే సియా, చేతన్ తమ పెళ్లిని రహస్యంగా ఉంచినట్లు చాట్స్ ద్వారా తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. వారి రహస్య వివాహం తర్వాతే కేతన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.కాగా సియా, ప్రియుడి సహాయంతో, తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను జూన్ 18న లోనావాలా సమీపంలోని చారిత్రాత్మక లోహగఢ్ కోటపై నుండి కిందకు నెట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన పోలీసులు సియా, చేతన్ చౌదరిలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరు రిమాండ్‌లో ఉన్నారు. ఇదీ చదవండి: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి, ఇది గమనించారా? -
కేతన్ హత్య : సియాకు సపోర్ట్ చేసిన నెటిజన్‌పై గాయని మండిపాటు
పుణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలు సియా గోయల్‌కు మద్దుతుగా నిలుస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అదే క్రమంలో నిందితురాలు సియాను దుమ్మెత్తి పోస్తున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. బలవంతపు పెళ్లి పర్యవసానమే ఇది అంటూ సియాను సమర్థించడానికి ప్రయత్నించిన ఒక నెటిజన్‌పై నటి, గాయని సుచిత్ర కృష్ణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. నేరపూరిత ప్రవర్తనను సమర్థించడానికి ఎలాంటి సంస్కృతి లేదా వ్యక్తిగత పరిస్థితులను వాడుకోలేమంటా విమర్శలు గుప్పించారు. అసలు ఏమైంది అంటే... ప్రియుడితో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్‌పై సానుభూతి చూపిస్తూ, ఎక్స్ (ట్విట్టర్)లో ఒక యూజర్ స్పందించారు. బలవంతపు వివాహాల వల్లే ఇలా జరుగుతోందని వ్యాఖ్యానించాడు. ఒకవేళ సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి అమెరికా లేదా యూరప్‌లో ఉండి ఉంటే, వారు లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండేవారని, అప్పుడు కేతన్ అగర్వాల్ ఈ కథలోకి వచ్చేవాడే కాదని పేర్కొన్నాడు. దీనిపై సుచిత్ర కృష్ణమూర్తి ఘాటుగా స్పందించారు.నటి సుచిత్ర కృష్ణమూర్తి కౌంటర్ఒకవేళ సియాపై పెళ్లికి ఒత్తిడి తెచ్చినప్పటికీ, హింసకు పాల్పడకుండా ఆమెకు అనేక చట్టపరమైన, వ్యక్తిగత మార్గాలు ఉన్నాయంటూ కౌంటరిచ్చారు. "ఏ సంస్కృతి కూడా నేరపూరిత ప్రవర్తనను సమర్థించదు. ఇలాంటి నేరాలను సమర్థించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ఆమె ఇల్లు వదిలి పారిపోవచ్చు, లేదా తన సమ్మతి లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నందుకు కుటుంబంపై కేసు కూడా పెట్టాల్సింది. కానీ, పక్కా ప్రణాళికతో తన కాబోయే భర్తను కొండపై నుండి నెట్టి చంపడం అనేది కేవలం ఒక సైకోపాత్ (ఉన్మాది) మనస్తత్వం మాత్రమే" అంటూ ఎక్స్‌లో సుచిత్ర విరుచుకుపడ్డారు.ఇదీ చదవండి : కేతన్ హత్య : కోడ్‌వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’కాగా జూన్18న లోహగఢ్ కోట దగ్గర ట్రెకింగ్ చేస్తుండగా కేతన్ అగర్వాల్ మరణించాడు. మొదట ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించి నప్పటికీ, పోలీసుల దర్యాప్తులో ఇదొక ప్రణాళికాబద్ధమైన హత్యగా తేలింది. కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.ఇదీ చదవండి: ప్రేయసితో కలిసి భార్యను కాల్చి చంపి, నేపాల్ చెక్కేశాడు! -
CODEWORDS, EMOJI లతో సియా సీక్రెట్ చాట్స్
-
కేతన్ హత్య : కోడ్‌వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’
పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ మొబైల్ ఫోన్లో పోలీసులు డిజిటల్ చాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ‘సీక్రెట్ చాట్స్’ సరికొత్త మలుపుగా మారాయి. అసలు కోడ్‌వర్డ్స్ ఎమోజీల అర్థం ఏంటో తెలియక పోలీసులే తలలు పట్టుకుంటున్నారు. పోలీసులు సమాచారం ప్రకారం పోలీసులు స్వాధీనం చేసుకున్న చాట్లలోరహస్య కోడ్వర్డ్లు, మారుపేర్లు , ఎమోజీలు కోకొల్లలుగా ఉన్నాయి. వీటి అర్థం కేవలం నిందితులకు మాత్రమే తెలుసని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. సియా గోయల్‌కు చెందిన రెండో మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) పరిశీలనకు పంపారు. మరోవైపు నిందితులను మరింత విచారించేందుకు పోలీసు కస్టడీని పొడిగించాలని ప్రాసిక్యూషన్ కోరినప్పటికీ, కోర్టు అందుకు నిరాకరించింది. నిందితులు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలను జూలై 16 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఎ.ఎమ్. విభూతే ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: పెళ్లై నాలుగు నెలలే.. యాసిడ్ తాగించి, కన్న కొడుకు హత్యనిందితులు హత్యకు ముందు రిహార్సల్ చేసినట్లుగా భావిస్తున్న ప్రదేశంలో పోలీసులు 'పంచనామా' నిర్వహించారు. అలాగే ముంబై వైపు వెళ్తుండగా కేతన్ అగర్వాల్ పాస్‌పోర్ట్‌ను పడేసిన చోట కూడా పంచనామా పూర్తి చేశారు. కేతన్ అగర్వాల్ నుండి సియా గోయల్‌కు బదిలీ అయిన డబ్బుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్‌కు ఫౌండర్!కాగా కేతన్ అగర్వాల్, సియా గోయల్‌లకు ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే జూన్ 18న పుణె జిల్లాలోని లోహగఢ్ కోటపై నుండి కేతన్‌ను కిందకు తోసి సియా గోయల్, చేతన్ చౌదరిలు హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు కేతన్పై హత్యా యత్నం సహా అనేక సంచలన విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి.ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీ -
ఇంత బలుపా? మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్
-
కేతన్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. సీన్లోకి మూడో వ్యక్తి!
పుణె: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో పుణె పోలీసులు కీలక ఆధారాల్ని సేకరించారు. ఈ కిరాతక హత్యకు సంబంధించి బీడ్ జిల్లాకు చెందిన, బాలేవాడి కంపెనీలో పనిచేస్తున్న మరో వ్యక్తిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సియా గోయల్, చేతన్ చౌదరిలతో ఇతనికి పాత పరిచయం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.విచారణ సంస్థల కథనం ప్రకారం.. నిందితులు ఇద్దరూ కేతన్‌ను హతమార్చాలనే తమ కుట్రను ఈ మూడో వ్యక్తితో పంచుకున్నారు. అంతేకాకుండా, జూన్ 18న కేతన్‌ను లోహగఢ్ కోటపై నుండి నెట్టేసిన రోజున, తమతో పాటు రమ్మని అతడిని కోరారు. అయితే, ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడవద్దని వారిని వారించినట్లు తెలుస్తోంది.ఈ నేరపూరిత ప్రణాళిక గురించి అతనికి ఎంతవరకు తెలుసు. ఇందులో అతని పాత్ర ఎంత అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అతని వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ కేసులో మరో దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పక్కా ప్రణాళికతో హత్య చేసి, సాక్ష్యాలు దొరకకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవడానికి నిందితులు ఇద్దరూ టీవీ సిరీస్ ‘క్రైమ్ పెట్రోల్’ఎపిసోడ్లను పదే పదే చూసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.అసభ్య ప్రవర్తన కేసు దర్యాప్తులో భాగంగా గురువారం పుణె రూరల్ పోలీసులు సియా గోయల్‌ను ఆమె మార్కెట్ యార్డ్ నివాసానికి తీసుకువెళ్లారు. లోహగఢ్ కోటకు వెళ్లిన సమయంలో ఆమె ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అయితే, దర్యాప్తు ముగించుకుని తిరిగి వాహనంలోకి వెళ్తున్న సమయంలో, అక్కడ కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధుల కెమెరాల వైపు సియా గోయల్ మధ్య వేలు చూపిస్తూ తీవ్ర అసభ్యంగా ప్రవర్తించడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.25 ఏళ్ల కేతన్ అగర్వాల్‌కు, సియా గోయల్‌కు వచ్చే నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే, సియాకు చేతన్ చౌదరితో ఉన్న వివాహేతర సంబంధానికి కేతన్ అడ్డుగా మారాడని భావించిన వీరు జూన్ 18న లోహగఢ్ కోటపై నుండి అతడిని లోయలోకి నెట్టి హత్య చేశారు. పక్కాగా రిహార్సల్స్ చేసి మరీ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితులు ముగ్గురిని కఠినంగా శిక్షించేందుకు పోలీసులు వేగంగా ఆధారాలను సేకరిస్తున్నారు. -
పుణే కేసు: అసభ్య సైగ చేసిన సియా.. వీడియో వైరల్
పుణే: యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. లోహగఢ్ ఫోర్ట్ సమీపంలోని లోయలో అతన్ని ఎవరు తోసి చంపారన్న అంశంపై పోలీసులు ఇప్పటికీ స్పష్టమైన నిర్ధారణకు రాలేకపోయారు. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, దర్యాప్తులో పరస్పర విరుద్ధమైన వాదనలు బయటపడుతుండటంతో కేసు మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ మరోసారి వివాదంలో చిక్కుకుంది.క్రైమ్ రీక్రియేషన్‌లో భాగంగా.. పోలీసులు ఆమెను తన నివాసానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బయటకు తీసుకువస్తున్న సమయంలో మీడియా ఎదుట ఆమె మిడిల్ ఫింగర్(అసభ్య సైగ) చూపింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఆమె ప్రవర్తనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. Pune, Maharashtra: Siya Goyal, accused in the Ketan Agarwal murder case, was taken by Pune Rural Police to her Market Yard residence for investigation. After the investigation was completed, while leaving the house, Siya Goyal allegedly made obscene gestures and showed the middle… pic.twitter.com/mHnQKlfRrq— IANS (@ians_india) July 2, 2026జూన్ 18న పుణే సమీపంలోని లోహ్‌గఢ్ కోట వద్ద కేతన్ అగర్వాల్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. మొదట ఈ ఘటనను ప్రమాదవశాత్తు మరణంగా నమోదు చేసినప్పటికీ.. దర్యాప్తులో ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా తేలింది. సియా గోయల్, కేతన్ అగర్వాల్ కుటుంబాలు ముందే వివాహాన్ని ఖరారు చేశాయి. నవంబర్‌లో పెళ్లి జరగాల్సి ఉండగా.. ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్‌ను సియా హతమార్చింది. అయితే.. కేసులో ఎవరు నిజంగా కేతన్‌ను లోయలోకి తోశారన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో పోలీసులు లై డిటెక్టర్ పరీక్ష అవసరమని కోర్టును అభ్యర్థించారు. నిందితులు మౌనం వహిస్తున్నందున దర్యాప్తుకు ఇది కీలకంగా మారిందని అధికారులు చెబుతున్నారు. అయితే నిందితురాలి సమ్మతి తప్పనిసరి అని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు. పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా పరిగణించబడవని, అవి కేవలం దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు సహాయపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టు తీర్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది.మరోవైపు దర్యాప్తులో కీలకంగా జనవరి నుంచి జూన్ వరకు సియా–చేతన్ మధ్య 2,000కు పైగా కాల్స్ జరిగినట్లు కాల్ డేటా విశ్లేషణలో బయటపడింది. ఘటన అనంతరం కేతన్ మొబైల్ ఫోన్ కొంతసేపు సియా వద్దే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం. 33 డిగ్రీల ఎండలోనూ చేతన్ హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్న సీసీటీవీ దృశ్యాలు కూడా పోలీసులు గుర్తించారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు రెండు దశల్లో ఘటన స్థలంలో సీన్ రీక్రియేషన్ నిర్వహించారు. సియా సమక్షంలో డమ్మీ సాయంతో ఒకసారి, చేతన్‌ను తీసుకెళ్లి మరోసారి లోహగఢ్ ఫోర్ట్ వద్ద సంఘటనను పునర్నిర్మించినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో ఫోరెన్సిక్ విశ్లేషణ, డిజిటల్ ఆధారాల రికవరీపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ కేసును ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103 (హత్య), 61 (కుట్ర) కింద కేసు నమోదు కాగా, నిందితుల పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. ఒకవైపు నిందితురాలి వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతుండగా, మరోవైపు లై డిటెక్టర్ టెస్ట్ కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నం ఈ కేసును మరింత కీలక దిశలోకి తీసుకెళ్లింది. -
కేతన్ కేసులో కీలక మలుపు
-
వైరల్ అవుతున్న సియా-చేతన్ కొత్త వీడియో నెట్టింట హల్చల్!
-
పుణే కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్!.. తెరపైకి లై డిటెక్టర్ టెస్ట్
పుణే: దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసిన కేతన్ అగర్వాల్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితురాలు సియాపై లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు పోలీసులు గురువారం పుణే కోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో నిజానిజాలు వెలికితీయడానికి ఈ పరీక్ష అవసరమని వారు వాదించినట్లు సమాచారం.కేతన్‌ను లోహన్‌గఢ్ కోట వద్ద ఎవరు లోయలోకి తోసి చంపారనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదని పోలీసులు కోర్టుకు నివేదించారు. తొలుత సియా ప్రియుడు చేతన్ తోశాడని.. తర్వాత సియానే తోసిందని.. ఆపై చేతన్ స్నేహితుడి ప్రమేయం ఉందని.. ఇలా రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, ఎవరు తోశారో కచ్చితంగా చెప్పగలిగే ఆధారం మాత్రం లభించలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో నిందితులు మౌనం వహిస్తున్నారని వివరించారు. ఈ తరుణంలో లై డిటెక్టర్ పరీక్ష ఒక్కటే మార్గమని కోర్టును అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అయితే, సియా తరఫు న్యాయవాది విపుల్ దుషింగ్ మాత్రం లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలంటే కోర్టు అనుమతి మాత్రమే సరిపోదని, నిందితురాలి సమ్మతి కూడా తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అంతేకాదు, పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలను కోర్టు ప్రత్యక్ష సాక్ష్యంగా పరిగణించదని, అవి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త ఆధారాలు, లీడ్స్ సేకరించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.కేసు ఇప్పటికే మిస్టరీగా మారిన నేపథ్యంలో, ఎవరి పాత్రపై కూడా ఇప్పటివరకు తేలికైన ఆధారాలు లభించకపోవడం దర్యాప్తును మరింత క్లిష్టతరం చేస్తోంది. కోర్టు ఈ అభ్యర్థనపై ఎలా స్పందిస్తుందన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మరణించారు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ, పుణె రూరల్ పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన హత్యగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. వివాహం విషయంలో అసంతృప్తిగా ఉన్న కేతన్‌ను ఆయన కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఫోటో షూట్ సమయంలో కేతన్‌ను 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసి ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అంతేకాదు అంతకు ముందు.. జూన్ 14న ఇదే కోట వద్ద జరిగిన మరో ప్రయత్నం విఫలమైనట్లు కూడా దర్యాప్తులో బయటపడింది.దర్యాప్తులో కీలకంగా, 33 డిగ్రీల ఎండలోనూ చేతన్ చౌదరి హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అలాగే జనవరి నుంచి జూన్ మధ్యలో సియా–చేతన్ మధ్య 2,000కుపైగా కాల్స్ జరిగినట్లు కాల్ డేటా విశ్లేషణలో బయటపడింది. కేతన్ మరణం అనంతరం అతని మొబైల్ ఫోన్ కొంతసేపు సియా వద్దే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు దొరికాయి. ఈ ఆధారాల నేపథ్యంలో జూన్ 23న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కేసు అత్యంత కీలక దశలో ఉండగా, దీనిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు ప్రభుత్వం అప్పగించింది. ఈ కేసులో.. కేతన్ తరఫున ప్రముఖ క్రిమినల్ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్స్ 103 (హత్య), 61 (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు కాగా, నిందితుల పోలీస్ కస్టడీని కోర్టు జూలై 3 వరకు పొడిగించింది.దర్యాప్తులో భాగంగా పోలీసులు జూన్ 28న సియా సమక్షంలో డమ్మీ సాయంతో ఘటన పునర్నిర్మాణం (Crime Scene Recreation) నిర్వహించారు. జూలై 1న చేతన్ చౌదరిని నేరుగా లోహగఢ్ కోటకు తీసుకెళ్లి మరోసారి సీన్ రీక్రియేషన్ చేసినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో గైట్ అనాలిసిస్, డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు, అలాగే డిలీట్ చేసిన డేటా రికవరీపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ ఘటనకు ముందు.. మరో కోట వద్ద ఈ ఇద్దరూ కేతన్‌ను ఎలా తోసి చంపాలో రిహార్సల్స్ సైతం నిర్వహించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో.. లై-డిటెక్టర్ పరీక్షపై కోర్టు నిర్ణయం దర్యాప్తులో తదుపరి కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
అడగగానే ఇవ్వొద్దు.. ఆలోచించనిద్దాం!
పుణేలో కోట అంచున నిలబడ్డ ప్రేమ ఒక్కతోపుతో హత్యగా మారింది. బెంగళూరులో నట్టనడి ఇంట్లో నిలుచున్న ప్రేమ నెత్తురు పారించింది. ఈ రెండు ఘటనలూ ‘ఇప్పుడే కావాలి’ అనే ఆవేశానివే. ‘ఇవ్వాళ ఆలోచించి రేపు మాట్లాడాలి’ అనే సంస్కారం పోయి ‘ఇప్పుడే తేల్చేయాలి’ అనే తెంపరితనం ఇది. దీని పేరు – ఇన్ స్టంట్ గ్రాటిఫికేషన్. అంటే ‘తక్షణ సంతృప్తి’ అనే మానసిక జ్వరం. బిర్యానీ నుంచి బంధాల వరకు, ప్రోటీన్ షేక్ నుంచి ప్రతీకారం వరకు– అంతా ‘క్విక్ డెలివరీ’ కావాల్సిందే. వేచి చూడలేని మనసు వేటు వేయడానికి వెనుకాడడం లేదు. ఓపిక నేర్పని ఫోన్ లు... ఓదార్పు మరచిన జెన్ జెడ్. మెదడులో ‘పాజ్’ బటన్ చెడిపోతే జీవితం ‘ఫాస్ట్ఫార్వర్డ్’లో నేరం వైపు పరుగెడుతుంది. ఇది ట్రెండ్ కాదు, టైం బాంబ్. ఆపకపోతే ప్రతి ఇల్లు ఒక క్రైమ్ సీన్ అవుతుంది. ‘ఇప్పుడే వద్దు, కాస్త ఆగి ఆలోచించండి’... ఈ ఒక్క మాటే ఇవాళ మీ పిల్లలకు మీరు ఇవ్వాల్సిన ఆస్తి.‘ఈరోజే... ఇప్పుడే’ ‘ధనా ధన్ ఫటా ఫట్’ ధోరణి అనేది సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఆనంద సూత్రం(ప్లెజర్ ప్రిన్సిపుల్). ఇదిప్రాథమిక అవసరాలను తక్షణమే తీర్చుకోవడానికి, బాధను తప్పించుకోవడానికి ప్రేరేపించే ఒక సహజ ప్రవృత్తి... ప్లెజర్ ప్రిన్సిపుల్. ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఈ సూత్రం మానవ మనస్తత్వంలోప్రాథమిక నియంత్రణ శక్తిగా పనిచేస్తుంది.దీర్ఘకాలిక మానసిక సమస్య‘ఇప్పటి ఈ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ వల్ల దీర్ఘకాలికంగా కొన్ని మానసిక సమస్యలకు రావచ్చు. తాము కోరుకున్నది తక్షణమే నెరవేరాలని ఆశించేలా చేస్తుంది... ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. దీనివల్ల వేచి ఉండడం, ఓపికగా ఉండే గుణం తగ్గిపోతుంది. నిరంతర తృప్తి తొందరపాటును సృష్టిస్తుంది. తట్టుకునే శక్తిని తగ్గిస్తుంది. ఎదురుదెబ్బలు తట్టుకోలేమనే భావన కలిగిస్తుంది’ అని హెచ్చరిస్తున్నారు కోల్‌కతాలోని సీఎంఆర్ఐ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డా.అంబరీష్ ఘోష్.ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ కారణంగా జెన్ జెడ్ వినియోగ విధానాలలో, వ్యక్తిత్వంలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏకాగ్రత తగ్గిపోవడంతో... టీ 20 మ్యాచ్లకుప్రాధాన్యత పెరిగింది, థియేటర్లకు వెళ్లడం కంటే ఓటీటీప్రాచుర్యం పొందింది.తొందరపాటు వద్దుమార్కెట్కు వెళ్లి బేరసారాలు చేసి, ఆ తర్వాత వంట చేయడాన్ని చాలామంది శ్రమగా భావిస్తున్నారు. దీంతో త్వరిత డెలివరీ యాప్‌లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇలా ఆధారపడడం అనేది తొందరపాటు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి దారి తీయవచ్చు. ఆటిస్టిక్ లక్షణాలతో అనేక సవాళ్లకు దారితీయవచ్చు’ అని హెచ్చరిస్తున్న ఘోష్...ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ ప్రభావాన్ని తగ్గించడానికి... సహనం పెరిగేలా చేయడం, ఆలస్యంగా లభించే ప్రతిఫలాలను ప్రోత్సహించడం, సామాజిక విలువలను పెంపొందించడం తప్పనిసరి’ అని సలహా ఇస్తున్నారు.క్విక్–ఫిక్స్ థింకింగ్‘మనం చేసే పనులు, మనం శ్రద్ధ పెట్టే విషయాలకు స్పందనగా మన మెదళ్లు నిరంతరం మారుతుంటాయి. ఉదాహరణకు... మనం తొందరపడి అనారోగ్యకరమైన చిరుతిండి తిన్నా, ఆన్లైన్లో ఏదైనా కొన్నా, ఆ చర్యలకు సంబంధించి మన మెదడు మార్గాలు బలపడతాయి. ఇదే తరువాత బలమైన అలవాటుగా మారుతుంది. ఆ అలవాటుకు దూరం కావడం కష్టమవుతుంది.తక్షణ సంతృప్తి(ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్) వైపు దారి తీసే పనులు అనారోగ్యకరమైన, అనాలోచిత ప్రవర్తనకు దారి తీసేలా చేస్తాయి. కాలక్రమేణా...శరీరంపై తీవ్రమైన భారం మోపేలా చేస్తాయి. ఆసక్తిని రేకెత్తించే ఏ ఆన్లైన్ వస్తువైనా వెంటనే కొనెయ్యాలనుకోవడం క్రెడిట్ కార్డ్‌పై అదనపు భారాన్ని మోపుతుందనేది ఒక విషయం అయితే, మరొకటి... కుటుంబసభ్యులతో గడుపుతున్నప్పుడు కూడా సోషల్ మీడియా చూడాలనిపిస్తుంది. దీంతో కుటుంబసభ్యులతో పొడి పొడిగా మాట్లాడడం, యాంత్రికంగా సంభాషించే ధోరణి పెరుగుతుంది. తక్షణ సంతృప్తినిచ్చే వాటి కోసం అన్వేషణ సాగిస్తున్న కొద్దీ, ఆ ఫలితాన్ని అందుకోవడానికి చాలాకాలం ముందే మన మెదళ్లలో డోపమైన్ ఉప్పొగుతుంది’ అని చెబుతున్నాడు మానసిక విశ్లేషకుడు ఆస్టిన్ పెర్ల్మటర్. తక్షణ సంతృప్తి (ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్)లోని ప్రతికూల కోణాలపై ‘ది రియల్ ఇష్యూ విత్ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్: హౌ క్విక్–ఫిక్స్ థింకింగ్ క్రియేట్స్ప్రాబ్లమ్స్’ పేరుతో విశ్లేషణాత్మక వ్యాసం రాశాడు ఆస్టిన్.దూరంగా ఉన్నవారే... విజయానికి దగ్గరయ్యారు...స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ చేసిన ఒక అధ్యయనం...‘తక్షణ తృప్తికి దూరంగా ఉండే పిల్లలు ఎన్నో విజయాలు సాధించారు’ అని చెబుతోంది.ఈ అధ్యయనంలో భాగంగా... ఒక పిల్లవాడికి తక్షణం అందే ఒక చిన్న బహుమతి, కొంత సమయం వేచి ఉంటే రెండు చిన్న బహుమతులు... అని రెండు ఆప్షన్లు ఇచ్చారు.రెండో ఆప్షన్ వైపు మొగ్గు చూపిన పిల్లలు ఆ తరువాత కాలంలో చదువులలో మంచి విజయం సాధించారు. పెద్దయ్యాక ఎక్కువ ఆదాయం సంపాదించారు.స్టాన్ఫోర్డ్ స్టడీ ఇలా చెప్పింది...∙ఆకస్మిక కోరిక లేదా బలమైన కోరిక స్వీయ–నియంత్రణతో దగ్గరి సంబంధం ఉంటుంది ∙వేచి ఉండడానికి ఇష్టపడే వారిలో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ కాస్త గట్టిగా ఉంటుంది ∙ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది మెదడులోని ఫ్రంటల్ లోబ్ ముందు భాగం. ఇది కార్యనిర్వహణ విధులకు మెదడుకు సంబంధించి నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది ∙చాలామంది తక్షణ సంతృప్తి కోసం ఎందుకు ఆరాటపడతారో చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది... ఆలస్యాన్ని భరించలేకపోవడం. ‘ఇప్పుడే దొరుకుతుంది. ఎందుకు వేచి చూడాలి’ అని అనుకోవడం. తక్షణ సంతృప్తిని కోరుకునే వారు మాదకద్రవ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. ఊబకాయంతో పాటు అనేక ఇతర సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. వారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో కూడా ఇబ్బంది పడుతుంటారు. మానసిక లోపాలతో బాధపడతారు ∙తక్షణ సంతృప్తి అనేది ఒక వ్యాధా? బహుశా కావచ్చు. మన జీవితాలను క్రమబద్దీకరించుకోవాలి. మన కోరికలను నియంత్రించుకోవాలి. ‘ఇప్పుడే కావాలి’ అనే వ్యాధిని నిర్మూలించాలి.డిలేడ్ గ్రాటిఫికేషన్... చాలా కష్టమా?∙ఆధునిక సంస్కృతి తక్షణ ఫలితాలు, సౌకర్యాలను గతంలో కంటే చాలా సులభంగా అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ‘వేచి ఉండడం’ అనేది తగ్గిపోతుంది. వేచి ఉండడం కష్టం అనిపిస్తుంది. ∙భవిష్యత్‌పై దృష్టి, ప్రణాళిక లేని వారికి డిలేడ్ గ్రాటిఫికేషన్ (నిదానంగా సంతృప్తి పడడం) కష్టంగా అనిపిస్తుంది ∙ఒత్తిడి, విసుగు, ఆందోళనలాంటివి డిలేడ్ గ్రాటిఫికేషన్ దూరమయ్యేలా చేస్తాయి.డిలేడ్ గ్రాటిఫికేషన్కు దగ్గరవ్వాలంటే...∙దీర్ఘకాలిక లక్ష్యాల గురించి ఎప్పటికప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి ∙మీ లక్ష్యాలను రాసుకోండి. ప్రతిరోజూ మీరు చూసే చోట అవి కనిపించాలి ∙లక్ష్యాలను చిన్న చిన్న పార్ట్స్‌గా విభజించుకోండి ∙ఫైనల్ రిజల్ట్ కంటే ఎప్పటికప్పుడు మీరు సాధిస్తున్న ఫలితాలపై దృష్టి పెట్టండి ∙లక్ష్యంలో ఒక చిన్న భాగానికి చేరువైనప్పుడు మీకు మీరే గిఫ్ట్ ఇచ్చుకోవాలి. ఉదాహరణకు... మీకు ఇష్టమైన స్వీటు ఆరోజు హాయిగా తినవచ్చు ∙ఎప్పుడైనా ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ వైపు మనసు లాగితే, దారి మళ్లించడానికి బయటకు వెళ్లి నడవడమో, ఫ్రెండ్‌కు ఫోన్ చేయడమో, ఇష్టమైన సినిమా చూడడమో... ఇలాంటి పనులు చేయాలి.ఇన్స్టంట్ వర్సెస్ డిలేడ్ గ్రాటిఫికేషన్..డబ్బుఇన్స్టంట్: పెద్దగా అవసరం లేకపోయినా సరే, కొత్త స్మార్ట్ ఫోన్ కొనడం.డిలేడ్: ఫోన్ కొనాలనుకున్న డబ్బును పొదుపు చేసి అవసరమైనప్పుడే కొనడం.ఎంటర్టైన్మెంట్ఇన్స్టంట్: రాత్రంతా ఫోన్లో షోలను అక్కడొక సీన్ ఇక్కడొక సీన్ అన్నట్లుగా చూడడం.డిలేడ్: ఈ రోజు కొన్ని భాగాలే చూస్తాను. రేపు మరికొన్ని... అని విభజించుకోవడం.షాపింగ్ఇన్స్టంట్: ఆన్లైన్లోనో, సూపర్ మార్కెట్లోనో కొత్త వస్తువును చూసినప్పుడు ‘అరే ఇది ఈరోజే కొనెయ్యాలి’ అనిపిస్తుంది.డిలేడ్: ఒక వారం ఓపిక పట్టాలి. ‘ఆ వస్తువు నాకు నిజంగా అవసరమా?’ అని విశ్లేషించుకోవాలి.కెరీర్ఇన్స్టంట్: భవిష్యత్‌లో పురోగతి లేకపోయినా ఎక్కువ జీతానికి ఆశపడి ఉద్యోగంలో చేరడం.డిలేడ్: తక్కువ జీతమైనా సరే, మంచి భవిష్యత్ ఉన్న ఉద్యోగాన్ని ఎంచుకోవడం.రిలేషన్షిప్స్..ఇన్స్టంట్: మీ సన్నిహితులతో ఎప్పుడో ఒకసారి వాగ్వాదం జరగవచ్చు. అలాంటి సందర్భంలో ఏదో ఒకటి ఎదుటి వ్యక్తిని కసిగా అనాలనిపిస్తుంది.డిలేడ్: వాదనలో ప్రతి మాటను జాగ్రత్తగా, ఆచితూచి ఉపయోగించాలి. దీనివల్ల ఎంత పెద్ద వివాదమైనా సంబంధాలు తెగిపోవు. -
ముందే హెచ్చరించిన జ్యోతిష్యులు : సియా సోదరుడిపై అనుమానాలు
పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్ పాత్రపై కూడా ఇప్పుడు పోలీసుల నిఘా పెట్టారు. సియా-చేతన్ల ప్రేమ వ్యవహారం సాహిల్‌కు ముందే తెలుసా? అతను ఆ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే కుటుంబ సభ్యుల నుండి దాచాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుపై ఇప్పటివరకు నోరు విప్పని సాహిల్, ఒక మీడియా ముఖంగా తొలిసారి స్పందించాడు. అయితే అతని వ్యాఖ్యలకు, పోలీసుల దర్యాప్తునకు మధ్య అనేక వ్యత్యాసాలు కనిపిస్తుండటంతో మరింత గందరగోళం నెలకొంది.సియాకు పెళ్లి ఇష్టమే..కానీతాను కేతన్ అగర్వాల్‌ను మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటున్నానని, చేతన్‌తో సంబంధాన్ని కొనసాగించే ఉద్దేశం తనకు లేదని సియా తనతో చెప్పిందని సాహిల్ తెలిపాడు. తమ మధ్య ఏమీ లేదని, ఇకపై చేతన్‌తో ఎలాంటి సంబంధం పెట్టుకోనని తనపై ఒట్టు వేసిందని కూడా చెప్పాడు అందుకే, సియా, చేతన్ గురించి తాను ఎవరికీ చెప్పలేదన్నాడు. వాళ్లు స్నేహితులుగా ఉంటారని భావించి, దీనిపై తల్లిదండ్రులకు చెప్పలేదని అతను చెప్పుకొచ్చాడు.కన్ఫ్యూజన్లో ఉంది : సియా తన బంధం విషయంలో కొంత గందరగోళంలో ఉందని, వయసు రీత్యా స్నేహాన్ని ప్రేమగా అనుకోవడం సహజమేనని, అందుకే తాను ఆమెకు నచ్చజెప్పానని సాహిల్ అన్నాడు. ఆమె కేతన్‌తో పెళ్లికి, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం ఎంతో సంతోషంగా ప్లాన్ చేసుకుందని చెప్పుకొచ్చాడు.డ్రైవర్ సాక్ష్యంతో అనుమానాలుసాహిల్ చెబుతున్న మాటలకు, పోలీసుల దర్యాప్తులో తేలుతున్న విషయాలకు అస్సలు పొంతన కుదరడం లేదు. సియాకు కేతన్‌తో పెళ్లి ఇష్టం లేదనే నిజాన్ని ఆమె సాహిల్‌కు ముందే చెప్పిందని, అయినా అతను సైలెంట్‌గా ఉన్నాడని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. డ్రైవర్ ఇచ్చిన కీలక సాక్ష్యం సాహిల్‌పై అనుమానాలను మరింత బలోపేతం చేస్తోంది.ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం బాలికి వెళ్లేందుకుగాను ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడానికి సియా నిరాకరించినప్పుడు, సాహిల్ బలవంతంగా ఆమెను కారెక్కించాడని కారు డ్రైవర్ పోలీసులకు సాక్ష్యం ఇచ్చాడు.పాస్‌పోర్ట్ చింపేసినాబాలి ట్రిప్‌కు వెళ్లడానికి ముందే కేతన్ పాస్‌పోర్ట్‌ను సియా చింపేసిన విషయం సాహిల్‌కు తెలిసినప్పటికీ, అతను ఎలాంటి చర్య తీసుకోకపోవడం, ఎవరికీ చెప్పకపోవడం పోలీసులలో అనుమానాలను మరింత పెంచింది. ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్సాహిల్ ఎందుకు మౌనంగా ఉన్నాడు?ప్రస్తుతానికి సాహిల్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చకపోయినప్పటికీ, సోమవారం నాడు పోలీసులు అతన్ని దాదాపు 10 గంటల పాటు విచారించి, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసు కేవలం ఒక 'హత్య' మాత్రమే కాకుండా, దీని వెనుక పెద్ద 'ముందస్తు ప్లాన్ (కుట్ర)' ఉందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కుట్రలో సాహిల్ కూడా సియా, చేతన్‌లకు ఏమైనా సహాయం చేశాడా? లేక అంతా తెలిసి కూడా మౌనంగా ఉన్నాడా? అని పోలీసులు తేల్చనున్నారు.ముందే హెచ్చరించిన కుటుంబ జ్యోతిష్యుడుసియా గోయల్, చేతన్ చౌదరిల జాతకాలను నలుగురు వేర్వేరు జ్యోతిష్యులు ద్వారా పరీక్షించినపుడు, వారిలో ముగ్గురు వారిద్దరికీ అనుకూల ఫలితాలను అందించారట. కేతన్ అగర్వాల్ తల్లిదండ్రుల వివాహానికి పురోహితుడిగా వ్యవహరించిన అగర్వాల్ కుటుంబ పురోహితుడు, వీరి పెళ్లికి సుముఖంగా లేదని చెప్పినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.కుటుంబ పురోహితుడు ఈ సంబంధంపై ఆందోళన వ్యక్తం చేశారని, సియా కేతన్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అతనికి శారీరకంగా హాని కలిగే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం. ఇన్ని అభ్యంతరాలున్నప్పటికీ, తన తండ్రి మద్దతుతో కేతన్ సియాను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడని తెలుస్తోంది.(హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు)కాగా జూన్ 18న లోహగడ్ కోటపై కేతన్ అగర్వాల్‌ను సియా, ఆమె ప్రియుడు చేతన్ కలిసి కిందకు తోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసు కస్టడీలో ఉన్నారు.ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్ -
కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్
పుణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. అనూహ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్‌కు, ప్రముఖ న్యాయవాది అశుతోష్ శ్రీవాస్తవ రూ. 10 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. సాహిల్ తనపై చేసిన అబద్ధపు, అవమానకర ఆరోపణలతో తన ప్రతిష్ట దెబ్బతిందని శ్రీవాస్తవ ఆ నోటీసులో పేర్కొన్నారు.కేతన్ అగర్వాల్ హత్య విచారణలో సియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఆశుతోష్ శ్రీవాస్తవా లేక విపుల్ దుషింగ్నా? అనే ప్రశ్న ఈ కేసులో కొత్త న్యాయపోరాటానికి దారితీసింది. ఈ హైప్రొఫైల్ మర్డర్ కేసులో సియా తరపున అసలు ఏ న్యాయవాది వాదించాలనే విషయంపై వివాదం చెలరేగిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం సియా ఆమె ప్రియుడు (సహ నిందితుడు) చేతన్ చౌదరిలను వడ్గావ్ మావల్ కోర్టులో హాజరు పరిచారు. విచారణను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కోర్టు వీరి పోలీసు కస్టడీని జూలై 3 వరకు పొడిగించింది. అయితే, విచారణ సమయంలో కోర్టులో ఒక గందరగోళం నెలకొంది. లాయర్ అశుతోష్ శ్రీవాస్తవ కోర్టుకు హాజరై, తానే సియా తరపున వాదిస్తున్నానని చెబుతూ ఆమె సంతకం ఉన్న వకాలత్‌నామాను సమర్పించారు. కానీ, సియా మాత్రం శ్రీవాస్తవ తన లాయర్ కాదని, అడ్వకేట్ విపుల్ దుషింగ్ తన లాయర్ అని కోర్టుకు తెలిపింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా దుషింగ్నే తాము లాయర్‌గా నియమించుకున్నామని స్పష్టం చేశారు.రూ. 10 కోట్ల పరువు నష్టం కోర్టు విచారణకు ముందే, నిందితురాలి సోదరుడు సాహిల్ గోయల్ బహిరంగంగా లాయర్ శ్రీవాస్తవపై కొన్ని ఆరోపణలు చేశాడు. శ్రీవాస్తవను తాము లాయర్‌గా నియమించలేదని, మోసపూరితంగా సియా దగ్గర సంతకం తీసుకుని ఉండవచ్చని ఆరోపించాడు. అంతేకాదు శ్రీవాస్తవ తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని కూడా సాహిల్ పేర్కొన్నాడు.ఇదీ చదవండి: ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు : సియా, తల్లి షాకింగ్ రియాక్షన్ఈ ఆరోపణలపై లాయర్ శ్రీవాస్తవ తీవ్రంగా స్పందించారు. తాము నేరుగా సియాను కలిశామని, ఆమె మేజర్ కాబట్టి తన స్వంత నిర్ణయాల ప్రకారం లీగల్ హెల్ప్ కోసం వకాలత్‌నామాపై స్వచ్ఛందంగా సంతకం చేసిందని శ్రీవాస్తవ తెలిపారు. తాము సాహిల్‌తో మాట్లాడలేదని, నేరుగా సియాతోనే డీల్ చేశామని స్పష్టం చేశారు. మరోవైపు సాహిల్ నిరాధారమైన ఆరోపణల కారణగా తన ప్రతిష్టకు భంకం కలిగిందంటూ రూ. 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ నోటీసు ఇచ్చారు. సాహిల్ వెంటనే తన ఆరోపణలను ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: అపుడు లవర్ కోసం ఇస్లాంలోకి ఆయుష్ : ఇపుడు కొత్త ట్విస్ట్కాగా ఈ కేసులో పోలీసుల విచారణలో మరికొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కేతన్‌ను తోసేయడానికి ముందే సియా, చేతన్‌లు లోహగడ్ కోటను సందర్శించి, ఎక్కడి నుండి తోసేయాలో స్పాట్ ముందే ఫిక్స్ చేసుకున్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. సియాకు, కేతన్ అగర్వాల్‌తో ఇష్టంలేక, పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే కుటుంబ పరువు పోతుందని భావించి, ప్రియుడు చేతన్‌తో కలిసి పుణెలోని లోహగడ్ కోట కొండపై నుండి కేతన్‌ను కిందకు తోసి హత్య చేసిందనే ఆరోపణలెదుర్కొంటోంది. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసుల కస్టడీలో ఉన్నారు.(హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు) -
కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!
-
కోటి ఇవ్వవా.. పెళ్లి షాపింగ్ చేసుకుంటా!
పూణే: కేతన్ అగర్వాల్ మర్డర్ కేస్.. ఇందులో సియా గోయల్, చేతన్ చౌదరిల పాత్ర చూస్తుంటే థ్రిల్లర్ మలయాళం సినిమా క్రైమ్ స్టోరీ కూడా నథింగ్ అనిపిస్తోంది! నిందితురాలు 20 ఏళ్ల సియా గోయల్, తన ప్రియుడు 22 ఏళ్ల చేతన్ చౌదరితో కలిసి ఈ హత్యకు ముందే పక్కా స్కెచ్ వేసింది. అంతటితో ఆగకుండా, పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. నేరం జరిగిన కొన్నేళ్ల తర్వాత వివాహం చేసుకోవాలంటూ తమ భవిష్యత్తును కూడా ముందే ప్లాన్ చేసుకోవడం కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల్ని సైతం విస్మయానికి గురిచేస్తోంది.పెద్దలు నిర్ణయించిన వివాహం చేసుకోవడం ఇష్టం లేని సియా గోయల్, తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను పూణే సమీపంలోని లోహ్‌గఢ్ కోట వద్ద లోయలోకి తోసేసి అత్యంత క్రూరంగా హత్య చేసింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు పలు కీలక విషయాల్ని వెలికి తీశారు.లోహ్‌గఢ్ కోట వద్ద కేతన్ అగర్వాల్‌ను ఎలా హత్య చేయాలి?.. హత్య చేసే సమయంలో కేతన్ తప్పించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి?.. కేతన్‌ను హత్య చేసిన తర్వాత పోలీసులకు అనుమానం రాకుండా పెళ్లెప్పుడు చేసుకోవాలి?.. పెళ్లి చేసుకోవడంతో పాటు సియా, చేతన్ల జీవితం ఎలా ఉండాలి?.. ఇందుకోసం డబ్బులు ఎలా సంపాదించాలి?.. అని వీరంతా ముందే ప్లాన్ చేసినట్లు తేలింది.కేతన్ అగర్వాల్ హత్య తర్వాత తమ భవిష్యత్‌ను కలర్ఫుల్గా తీర్చిదిద్దేందుకు సియా గోయల్, చేతన్ చౌదరి ముందే మాట్లాడుకున్నారు. ఇందులో భాగంగానే, అనుమానం రాకుండా ఉండేందుకు నేరం జరిగిన మూడేళ్ల తర్వాత వివాహం చేసుకోవాలని అనుకున్నారు.ఈ ప్లాన్‌లో భాగంగా సియా.. పెళ్లి షాపింగ్ చేసే సాకుతో కాబోయే భర్త కేతన్ అగర్వాల్ వద్ద నుంచి ఏకంగా రూ.కోటి రూపాయలు తీసుకుంది. ఆ రూ.కోటి మొత్తాన్ని పెళ్లి షాపింగ్‌కు ఖర్చు చేయకుండా, సియా తన ప్రియుడైన చేతన్‌కు ఇచ్చేసింది. చేతన్‌తో పాటు తన భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశ్యంతో.. ఆ కోటి రూపాయలతో చేతన్ లైఫ్ సెటిల్ చేయడం, కొత్త బిజినెస్‌ను ప్రారంభించడం, ఆ తర్వాత కేతన్‌ను హత్య చేసిన మూడేళ్లకు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.ఇదిలా ఉండగా.. ఈ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు మరికొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు. లోహగడ్ కోట పైనుంచి కేతన్ అగర్వాల్‌ను లోయలోకి తోసివేయమని ప్రియుడు చేతన్ చౌదరికి సంకేతం ఇవ్వడానికి సియా గోయల్ ఒక వింత ప్లాన్ వేసింది.తాను తోసేసే సమయంలో కింద పడుతూ పడుతూ కేతన్ తనని పట్టుకుంటే.. ఆ కంగారులో సియా కూడా ఎక్కడ లోయలో పడిపోతుందోనని వారు ముందే భయపడ్డారు. అందుకే సియా భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ప్రాణాంతకమైన ఆ తోపుడు సమయంలో కేతన్కు ఆమె ఏమాత్రం అందకుండా ఉండేందుకు, సియా కింద కూర్చోవాలని వారు పక్కాగా స్కెచ్ వేశారు.లోహగడ్ కోటపై నడుస్తున్నప్పుడు.. నీళ్లు తాగడానికో లేదా షూలేసులు కట్టుకునే నెపంతోనో సియా కింద కూర్చోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అలా సియా కింద కూర్చోవడమే చేతన్ చౌదరికి గ్రీన్ సిగ్నల్!ప్లాన్ ప్రకారం.. సియా కింద కూర్చోగానే, వెనుక నుంచి వచ్చిన చేతన్ చౌదరి..కేతన్ అగర్వాల్‌ను గట్టిగా లోయలోకి తోసి చంపేశాడని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ఇది సియాను ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి వారు బాగా ఆలోచించి వేసిన ఘోరమైన ఎత్తుగడ అని పోలీసులు వెల్లడించారు.మరోవైపు, జూన్ 18న కేతన్, సియాలను అనుసరించిన చేతన్ చౌదరి.. కేసులో ఇరుక్కోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. టోల్ ప్లాజాల వద్ద కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు తనను సులభంగా గుర్తిస్తారనే భయంతో.. అతను కారును వాడలేదు. పూణే నుండి లోహగడ్ కోటకు, సుమారు 90 కిలోమీటర్ల దూరం.. ఒక స్కూటర్‌పై ప్రయాణించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం హత్యకు ఉపయోగించిన ఆ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు వెల్లడించారు. -
‘భీమ్రావు కాంబ్లేను ఉరితీయండి’.. తీర్పు వెలువరించిన కోర్టు
ముంబై: హత్యకేసులో పూణే జిల్లా ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పసిగుడ్డుపై అమానుషానికి పాల్పడిన నిందితుడు భీమ్రావు కాంబ్లేకు ఉరిశిక్ష విధించింది. కేసు విచారణ సందర్భంగా అరుదైన కేసుల్లో ఒకటిగా.. అత్యంత హేయమైన నేరంగా పరిగణిస్తూ ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పును వెలువరించింది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. మహారాష్ట్రలోని పూణే జిల్లా, భోర్ తాలూకా పరిధిలోని నస్రాపూర్ గ్రామంలో ఈ ఏడాది మే 1న జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూడున్నరేళ్ల పసికందును నిందితుడు కాంబ్లే అపహరించి, అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు. ఈ దారుణంపై మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబం నిందితుడికి ఉరిశిక్ష విధించాలని కోరింది.ఈ ఘటనపై పూణే జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో నిందితుడు నేరం చేసినట్లు తేలడంతో, అతనిపై పోక్సో చట్టం కింద కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.పూణే రూరల్ పోలీస్ విభాగం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ గిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఎస్పీ సందీప్ సింగ్‌తో పాటు మరో ఆరుగురు సభ్యులు దర్యాప్తు చేపట్టి, కేవలం 15 రోజుల్లోనే 1200 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఇందులో 55 మంది సాక్షులు, కీలక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, మెడికల్ పరీక్షా నివేదికలు, ఫోరెన్సిక్ విశ్లేషణ, మొబైల్ లొకేషన్ డేటా, కాల్ రికార్డులు వంటి సాంకేతిక ఆధారాలను పొందుపరిచారు.ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది. ఘటన జరిగిన 55 రోజుల్లోనే విచారణ పూర్తయి తీర్పు వెలువడింది. ప్రాసిక్యూషన్ పలు వారాల పాటు వాదనలు వినిపించగా, డిఫెన్స్ తరపు న్యాయవాదులు ఆరోపణలను వ్యతిరేకించారు. అయితే సమర్పించిన సాక్ష్యాధారాలు నిందితుడిని దోషిగా నిర్ధారించడానికి సరిపోతాయని కోర్టు భావించింది.జూన్ 25న నిందితుడిని దోషిగా నిర్ధారించిన తర్వాత, న్యాయమూర్తి శిక్షపై తీర్పును రిజర్వ్ చేసి, ఆ తర్వాతి సోమవారం మరణశిక్షను విధించారు. శిక్షను ఖరారు చేసే సమయంలో న్యాయమూర్తి నేర స్వభావం, బాధితురాలి వయస్సు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.తీర్పు వెలువడినప్పుడు బాధితురాలి కుటుంబం కోర్టులో హాజరైంది. డిఫెన్స్ తరఫున ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. పోక్సో చట్టం కింద మైనర్లకు సంబంధించిన కేసులకు ఇచ్చే ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ, ఈ కేసు రికార్డు సమయంలో ముగిసింది. నిందితుడు అప్పీల్ దాఖలు చేస్తే, బాంబే హైకోర్టు ఈ తీర్పును సమీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, కాంబ్లే జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నాడు.ఈ కేసు విచారణ అత్యంత వేగంగా పూర్తయిన న్యాయచరిత్రలో ఒకటిగా నిలిచింది. సున్నితమైన కేసు కావడంతో నిందితుణ్ని కెమెరా ద్వారా విచారణ చేపట్టారు. -
కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం
-
లోహగడ్ కోటపై ఏం జరిగింది?.. సీన్ రీక్రియేషన్
పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 10 రోజుల కిత్రం ఈ ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఇవాళ (ఆదివారం) నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిలను లోహగడ్ కోటపైకి తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేశారు. జూన్ 18న జరిగిన ఈ హత్య ఉదంతంలో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి కేతన్‌ను కొండపై నుండి నెట్టేసిన సంగతి తెలిసిందే.పూణే రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. నిందితులను సరిగ్గా ఘటన జరిగిన లోహగఢ్ కోట ప్రాంతానికి తీసుకెళ్లి సీన్‌ను రీక్రియేట్ చేశాం. వారు కోటకు ఏ మార్గంలో వచ్చారు, ఎక్కడెక్కడ నిలబడ్డారు? కేతన్‌ను ఎలా నెట్టేశారు అనే పూర్తి వివరాలను నిందితుల ద్వారా అడిగి తెలుసుకున్నామని తెలిపారు.మరో సీనియర్ పోలీస్ అధికారి పిటిఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడుతూ.. బాధితుడిని ఏ పాయింట్ నుంచి అయితే కిందకు తోసేశారో.. సియా గోయల్‌ను సరిగ్గా అదే చోటుకి తీసుకెళ్లాం. ఆమె ప్రియుడు చేతన్‌ను విడిగా కోటపైకి తీసుకెళ్లి విచారించాం. సీన్ రీక్రియేషన్ ద్వారా నిందితులు చెబుతున్న వాదనల్లో నిజమెంత ఉందో తేలనుంది.క్రైమ్ సీన్ రీక్రియేషన్ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. నిందితులు కోటకు ఎలా చేరుకున్నారు? కేతన్‌ను తోసేయడానికి ముందు సియా తన ప్రియుడికి ఎలాంటి సిగ్నల్ ఇచ్చింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు చేతన్ చౌదరి అసలు టికెట్ తీసుకోకుండానే కోటలోకి ప్రవేశించి, ఈ జంటను వెంబడించాడా అనే కోణాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణ సజావుగా సాగడం కోసం లోహగఢ్ కోటలోకి పర్యాటకుల ప్రవేశాన్ని పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు.కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సియా పోలీసుల ఎదుట అంగీకరించింది. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతోనే ప్రియుడితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. శనివారం.. సియా గోయల్ తల్లిదండ్రులు ప్రవీణ్, పూజలతో పాటు ఆమె సోదరుడు సాహిల్‌ను లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్లో సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అంతకుముందు శుక్రవారం కూడా సాహిల్‌ను 10 గంటల పాటు ప్రశ్నించారు. కేతన్ అగర్వాల్ కుటుంబం నివసించే గహుంజే ప్రాంతంలో స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్..? కేతన్ బట్టతలే హత్యకు కారణమా?
-
కేతన్ అగర్వాల్ కేసులో బిగ్ ట్విస్ట్..? కొత్త విషయాలు వెలుగులోకి!
-
దయచేసి ఇక ఆపండి! కేతన్ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి
ఒక కుటుంబం జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన విషాదం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వినోదంగా మారింది. చనిపోయిన కొడుకును టెక్నాలజీ సాయంతో మళ్లీ "బతికించినందుకు" సంతోషించాలా? లేక అతని హత్య కేసులో నిందితురాలితో కలిసి నవ్వుతూ, మాట్లాడుతున్నట్లు వీడియోలు సృష్టిస్తున్నందుకు బాధపడాలా? అనే వేదనలో కేతన్ అగర్వాల్ కుటుంబం మునిగిపోయింది. కేవలం వ్యూస్, లైక్స్ కోసం జరుగుతున్న ఈ ఏఐ ట్రెండ్ వారికి మరోసారి తీరని మానసిక వేదనను మిగులుస్తోంది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే లోహగడ్ హత్య కేసు ఇప్పుడు మరో కారణంతో చర్చనీయాంశమైంది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పలు సోషల్ మీడియా వేదికల్లో కేతన్ అగర్వాల్, నిందితురాలు సియా గోయల్ కలిసి ఉన్నట్లు చూపించే ఏఐ వీడియోలు, ఫోటోలు, రీల్స్ భారీగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు పూర్తిగా కల్పితమైనవే అయినప్పటికీ, లక్షలాది మంది వాటిని వీక్షిస్తూ, షేర్ చేస్తుండటంతో ఈ ట్రెండ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. "దయచేసి ఇలాంటి ఏఐ వీడియోలు చేయడం ఆపండి" అంటూ వారు సోషల్ మీడియా వినియోగదారులను భావోద్వేగంగా వేడుకుంటున్నారు. అలాగే.. కేతన్-సియాల వీడియోలను కూడా వైరల్ చేయడం ఆపమంటున్నారు.People out there are really making AI edits of Ketan and Siya, Instagram is full of it now pic.twitter.com/Rg6yy86Oyq— Shubham2.0 (@bhav_paaji) June 26, 2026పుణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫిబ్రవరిలో సియా గోయల్‌తో ఆయనకు నిశ్చితార్థం జరిగింది. అయితే సియాకు అప్పటికే చేతన్ చౌదరితో ప్రేమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులకు చెప్పకుండా, కేతన్‌ను అడ్డంకిగా భావించి హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.'Killing Ketan Was Easier Than Confronting My Family': Siya Goyal's Confession to Pune PoliceThe Ketan Agarwal murder investigation has taken a fresh turn after police claimed that accused Siya Goyal made a startling statement during interrogation.According to investigators,… pic.twitter.com/FZYImt2ZIm— upuknews (@upuknews1) June 26, 2026జూన్ 18వ తేదీన లోహగడ్ కోట వద్ద ఫొటోషూట్ కోసం తీసుకెళ్లి లోయలోకి తోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మొదట ప్రమాదంగా భావించిన ఈ ఘటన, తర్వాత పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా మారింది. ఈ కేసులో సియా గోయల్, చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు.అయితే ఈ విషాద ఘటనను ఇప్పుడు కొందరు ఏఐ కంటెంట్‌గా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కేతన్, సియా మళ్లీ కలిసి మాట్లాడుకుంటున్నట్లు, ప్రేమలో ఉన్నట్లు, అలాగే ప్రియుడితో కలిసి కేతన్‌ను సియా ఎలా చంపిందోనంటూ వీడియోలు విపరీతంగా ప్రచారం పొందుతున్నాయి. కొంతమంది వాటిని నిజమని కూడా భావిస్తుండటంతో గందరగోళం నెలకొంటోంది. అదే సమయంలో సియాకు సంబంధించినవంటూ కొన్ని వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.Meet Siya Goyal who is accused of murdering her fiancée businessman Ketan AgarwalLook closer story was posted on 2022She is 20 yo nowIt means she was consuming alcohol at 16 yo even before turning on 18This is women empowerment for feminists pic.twitter.com/FCsfL99RJB— aaru (@buttermasale) June 27, 2026ఈ వీడియోలను చూసిన కేతన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొడుకును కోల్పోయిన బాధ నుంచి బయటపడలేకపోతున్నామని, ఇప్పుడు ఇలాంటి ఏఐ వీడియోలు ప్రతిరోజూ ఆ బాధను మళ్లీ గుర్తు చేస్తున్నాయని వాపోయారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్, ఫాలోవర్ల కోసం ఒక కుటుంబం విషాదాన్ని వినోదంగా మార్చొద్దని విజ్ఞప్తి చేశారు. దయచేసి ఆపండి.. Please Stop అంటూ సోషల్ మీడియా వినియోగదారులకు భావోద్వేగ పిలుపునిచ్చారు.ఈ ఘటనతో ఏఐ సాంకేతికత దుర్వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. మరణించిన వ్యక్తుల పేరుతో నకిలీ వీడియోలు తయారు చేయడం బాధిత కుటుంబాల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సృష్టించిన ఫేక్ కంటెంట్‌ను నియంత్రించేందుకు సోషల్ మీడియా సంస్థలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వీడియోలను ప్రోత్సహించవద్దని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదీ చదవండి: కొండపై నుంచి తోసేసింది అతడుకాదు! -
కొండపై నుంచి తోసేసింది సియానే!
పుణే: దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భార్య సియా గోయల్ స్వయంగా అతడిని కొండపై నుంచి తోసివేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ దారుణం వెనుక సియా చౌదరి ప్రియుడు చేతన్ చౌదరి ప్రోద్బలం ఉన్నట్లు బహిర్గతమయ్యింది. కేతన్ అగర్వాల్‌ను సాధ్యమైనంత త్వరగా అంతం చేయాలంటూ చేతన్ చౌదరి తన ప్రియురాలు సియా చౌదరిపై పదేపదే ఒత్తిడి చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. పూర్తిగా అతడి మైకంలో పడిపోయిన సియా చౌదరి మరో ఆలోచన లేకుండా.. కాబోయే భర్తను చేతులారా చంపేసిందని తెలిపారు. ఇద్దరు నిందితులను ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రియుడి ఒత్తిడి వల్లే చేతన్‌ను లోహగఢ్ కోటకు రప్పించి హత్య చేసినట్లు సియా గోయల్ ఒప్పుకుందని స్పష్టంచేశారు. ఆమె సోదరుడిని కూడా ప్రశ్నిస్తున్నామని అన్నారు. మరోవైపు ఈ కేసులో ఫాస్ట్–ట్రాక్ కోర్టు ట్రయల్ నిర్వహించాలంటూ కేతన్ అగర్వాల్ కుటుంబం డిమాండ్ చేయగా, మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రఖ్యాత లాయర్ ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసుతోపాటు మరికొన్ని ముఖ్యమైన కేసుల్లో ఉజ్వల్ నికమ్ వాదించారు. 20 ఏళ్ల సియా గోయల్, 22 ఏళ్ల చేతన్ చౌదరి గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 18న కేతన్ అగర్వాల్(25)ను పుణే సమీపంలోని లోహగఢ్ కోటలో అంతమొందించిన సంగతి తెలిసిందే. హత్యకు పకడ్బందీగా ప్లాన్ కేతన్ అగర్వాల్ హ త్యకు నిందితులు పకడ్బందీగా ప్లాన్ చేశా రు. ఆధారాలు దొర క్కుండా జాగ్రత్తపడ్డా రు. హత్యకు ముందు, తర్వాత తమ సెల్ఫోన్లలో చాటింగ్ హిస్టరీని పూర్తిగా తొలగించారు. రీసైకిల్ బిన్లను కూడా ఖాళీచేశారు. వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. డిలీట్ చేసిన వివరాలను తిరిగి రప్పిస్తే కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని అన్నారు. సియా గోయల్, కేతన్ చౌదరి మధ్య ఫోన్లలో 238 గంటలపాటు సంభాషణ జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. వారిద్దరూ గత ఆరు నెలల వ్యవధిలో 2,004 ఫోన్‌కాల్స్ చేసుకున్నారు. హత్య జరిగిన రోజు ఓ హోటల్లో కలుసుకున్నారు. మర్డర్ ప్లాన్ గురించి చర్చించుకున్నారు. కేతన్ బట్టతల నచ్చకనే హత్య! కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌కు బట్టతల ఉండడం, అది కనిపించకుండా విగ్గు లాంటిది ధరించడం తనకు నచ్చలేదని, అందుకు అడ్డు తొలగించుకున్నానని సియా చౌదరి చెబుతున్నట్లు సమాచారం. బట్టతల కారణంగానే కేతన్ హత్యకు గురయ్యాడంటూ ప్రచారం సాగుతోంది. అయితే, ఈ విషయాన్ని కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ఖండించారు. కేతన్కు బట్టతల ఉందన్న విషయంలో ఎంగేజ్మెంట్కు ముందే సియా గోయల్‌కు, ఆమె కుటుంబానికి తెలుసని అన్నారు. బట్టతల విషయంలో ఆమె ఏనాడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెప్పారు. తన కుమారుడు నిజంగా నచ్చకపోతే ముందే చెప్పాలి తప్ప ఇలా హత్య చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. కేతన్ హత్యకు అతడి బట్టతల అంశం ఒక్కటే కారణం కాదని పోలీసులు తెలిపారు. -
కేతన్ అగర్వాల్ కేసులో కొత్త మలుపు
పుణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ తండ్రి విశాల్ అగర్వాల్ ఇవాళ(శుక్రవారం) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి.. తన కుమారుడి హత్యకు కారణమైన నిందితులకు ఉరిశిక్ష విధించాలని కోరారు. మరోవైపు, తన కుమారుడు తలకు విగ్గు (కృత్రిమ జుట్టు) వాడుతున్నాడనే కారణంతోనే ఈ హత్య జరిగిందనే ఆరోపణలను ఆయన తండ్రి విశాల్ అగర్వాల్ ఖండించారు. నిశ్చితార్థానికి చాలా కాలం ముందే తన కుమారుడికి ఉన్న స్వల్ప జుట్టు రాలే సమస్య గురించి సియా గోయల్, ఆమె కుటుంబ సభ్యులతో బహిరంగంగానే చర్చించామన్నారు.కేతన్కు తలపై ఒక చిన్న భాగంలో జుట్టు రాలింది. కానీ వివాహం ఖాయం కావడానికి ముందే ఈ విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేశామని విశాల్ అగర్వాల్ అన్నారు. కాగా, కేతన్ అగర్వాల్ విగ్ పెట్టుకోవడం సియా గోయల్‌కు నచ్చలేదని ఓ పోలీసు అధికారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. అగర్వాల్ విగ్ పెట్టుకున్న మాట నిజమే.. కానీ సియాకు అతను నచ్చకపోవడానికి అది ఒక్కటే కారణమని చెప్పలేమని ఆ అధికారి పేర్కొన్నారు.ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు మాట్లాడుతూ.. జూన్ 18న లోహగడ్ కోటపై నుండి చౌదరి.. అగర్వాల్‌ను కిందకు నెట్టేయడానికి ముందు.. గోయల్ ముందుగా అనుకున్న ప్రకారం ఒక సంకేతాన్ని (సిగ్నల్) ఇచ్చిందని తెలిపారు. ఈ ఇద్దరూ పారిపోతే తమ కుటుంబాల ప్రతిష్ట దెబ్బతింటుందనే భయంతో కేతన్ అగర్వాల్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొదట ఇద్దరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడానికి ప్రయత్నించారు. విచారణ సమయంలో నేరస్థులలో ఇలాంటి ధోరణి సాధారణంగా కనిపిస్తుంది. అయితే.. చివరకు తానే ఈ కుట్ర పన్నానని.. ఇందులో చేతన్ ప్రమేయం కూడా ఉందని సియా అంగీకరించిందని ఓ పోలీసు అధికారి తెలిపారు.చౌదరి మొదట మాట్లాడుతూ.. తాను కోట వద్దే ఉన్నానని.. అయితే అగర్వాల్‌ను నెట్టేసిన ప్రదేశానికి తాను వెళ్లలేదని.. అసలు అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదని వాదించాడు. అయితే, అతను అబద్ధం చెబుతున్నాడని స్పష్టంగా తెలిసిందన్న అధికారి.. ఆ తర్వాత ఇద్దరు నిందితులూ తమ తప్పును అంగీకరించి.. ఘటన ఎలా జరిగిందో వివరించారని తెలిపారు.అగర్వాల్, గోయల్‌ల వివాహం నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒక ప్యాలెస్‌లో జరగాల్సి ఉంది. ఈ నేరానికి బాధ్యులైన వారికి కఠిన శిక్ష పడాలని గోయల్ తండ్రి కూడా కోరారు. ఇందులో తన కూతురి ప్రమేయం ఉన్నా సరే, ఆమెకు కూడా అదే శిక్ష పడాలన్నారు. కేతన్ నాకు కొడుకు లాంటివాడు.. అతని మరణం మా రెండు కుటుంబాలను విషాదంలో ముంచేసింది. మేము పెళ్లి పనుల్లో ఎంతో ఆత్రుతగా ఉన్నాం. జరిగినదంతా చాలా విషాదకరం.ఈ రోజుకీ మేము దీన్ని నమ్మలేకపోతున్నాం’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సియా సంబంధాల గురించిన నిజాలను గోయల్ కుటుంబం దాచిపెట్టిందన్న అగర్వాల్ తండ్రి ఆరోపణలను ఆయన ఖండించారు. వారి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయనే విషయం కానీ.. సియాకు మరొకరితో సంబంధం ఉందనే విషయం కానీ తమకు తెలియదని ఆయన చెప్పారు.కాగా, సీఎం ఫడ్నవీస్ ఈ ఘటనను అత్యంత దిగ్భ్రాంతికరంగా అభివర్ణించారు. ఈ ఘటనను ఒక నేరంగానే కాకుండా.. సమాజం లోతుగా ఆలోచించాల్సిన విషయంగా చూడాలన్నారు. చదువుకుని, సమాజంలో మంచి స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల్లో ఇలాంటి ద్వేషపూరిత, వినాశకరమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఈ మానసిక స్థితి వెనుక ఉన్న కారణాలు ఏమిటి? దీనిపై మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. -
కేతన్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. తవ్వేకొద్దీ బయటపడుతున్న సంచలన నిజాలు!
-
ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు : సియా, తల్లి షాకింగ్ రియాక్షన్
మహారాష్ట్రలోని లోహగఢ్ కోటలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసుకు సంబంధించిన విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. కేతన్ కాబోయే భార్య సియాకు ఈ పెళ్లి ఇష్టం లేక ప్రియుడు చేతన్ చౌదరితో తన బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సియా, చేతన్ ఇద్దరిపై హత్య, క్రిమినల్ ప్లానింగ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరూ రిమాండ్‌లో ఉన్నారు. వీరి విచారణలో భాగంగా కీలక విషయాలను పోలీసులు రాబట్టారు.పెళ్లి రద్దుకు ఒప్పుకోలేదు, పారిపోయినా వదలనన్నాడు : సియా పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనే విషయాన్ని కేతన్ అగర్వాల్‌కు ముందే చెప్పానని సియా విచారణాధికారులకు తెలిపింది. చేతన్ చౌదరితో రిలేషన్షిప్లో ఉన్నానని చెప్పినట్టు వెల్లడించింది. అయితే ఇపుడు పెళ్లి రద్దు చేసుకుంటే, తమ ఫ్యామిలీ పరువు పోతుంతని చెప్పాడని, ఒకవేళ ఆమె పెళ్లి నుంచి తప్పించుకోవడానికి పారిపోవాలని చూసినా, వదిలిపెట్టేది లేదని కేతన్ బెదిరించాడని సియా క్లెయిమ్ చేసింది.అయితే, సియా చేస్తున్నఈ ఆరోపణలు/వాదనలు ఇంకా కోర్టు, పోలీసుల దర్యాప్తులోనే ఉన్నాయి. వీటిపై న్యాయపరమైన విచారణ జరగాల్సి ఉంది.నేరం రుజువైతే ఆమెను ఉరితీయండి!మరోవైపు తన కూతురి వ్యవహారంపై సియా తల్లి స్పందించారు. తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు రుజువైతే, ఆమెకు కఠినమైన శిక్ష పడాలని కూతురు సియా గోయల్‌ను ఉరితీయాలని ఒక తల్లిగా నేను ఈ మాట చెబుతున్నా అన్నారు.సియా తండ్రి ప్రవీణ్ గోయల్ కూడా ఇదే విధంగా స్పందించారు. నేరం రుజువైతే, తన కూతురైనా సరే, ఉరి తీయాల్సిందే అన్నారు. ఈ ఘటన తర్వాత జూన్ 23న ప్రవీణ్ గోయల్‌కు గుండెపోటు రావడంతో ప్రస్తుతం ఆయన పూణేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇదీ చదవండి: కేతన్ హత్యలో మరో ట్విస్ట్ : మాట మారుస్తున్న కిలాడీలుజరిగిన కథపూణేకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్‌ను అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ బాబూలాల్ చౌదరి కలిసి సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని లోహగఢ్ కోటపై నుండి కిందకు నెట్టేసి హత్య చేశారు. మొదట దీనిని ట్రెకింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.పక్కా ప్లాన్‌తో హత్యకేఫ్ మీటింగ్: జూన్ 18 ఉదయం పూణేలోని ఒక కేఫ్‌లో సియా, చేతన్ కలిసి కేతన్‌ను ఎలా చంపాలో ప్లాన్ చేశారు. కోటలో ఏ ప్రాంతం నుండి నెట్టేయాలో కూడా వారు ముందే చర్చించుకున్నారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు పోలీసులకు లభించాయి. ప్లాన్ ప్రకారం మధ్యాహ్నం సియా, కేతన్‌ను ట్రెకింగ్ కోసం కోటపైకి తీసుకెళ్లగా, చేతన్ వారిని రహస్యంగా వెంబడించాడు. అనుకూలమైన సమయం చూసి ఇద్దరూ కలిసి కేతన్‌ను లోయలోకి నెట్టేశారు.గత 6 నుండి 7 నెలల్లో సియా, చేతన్ ల మధ్య 2,004 సార్లు ఫోన్ కాల్స్ జరిగాయి. వారు దాదాపు 238 గంటల పాటు మాట్లాడుకున్నట్లు, కొన్ని కాల్స్ 2-3 గంటల పాటు సాగినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ 2025 దీపావళి పార్టీలో మొదటిసారి కలుసుకున్నారు.రూ. 17 కోట్ల ప్యాలెస్, ప్రైవేట్ జెట్స్కేతన్ అగర్వాల్ తమ కుటుంబానికి చెందిన 'సక్సెస్ గ్రూప్' రియల్ ఎస్టేట్ సంస్థలో డైరెక్టర్ మరియు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేసేవాడు. సియా గోయల్ కామర్స్ డిగ్రీ పూర్తి చేసింది. దాదాపు 35ఏళ్లుగా సంబంధాలున్న ఇరు కుటుంబాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరికి నిశ్చితార్థం జరిపించారు. నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఒక ప్యాలెస్ వేదికగా వీరి వివాహం ఘనంగా జరగాల్సి ఉంది. సియా, కేతన్‌లకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో వీరి వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేశాయి. వివాహం కోసం జైపూర్‌లోని ప్యాలెస్‌ను రూ. 17 కోట్లకు బుక్ చేశారు. పెళ్లికి వచ్చే అతిథులను తీసుకురావడం కోసం ప్రత్యేకంగా రెండు ప్రైవేట్ విమానాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంతలోనే కేతన్ హత్యోదంతం ఇరు కుటుంబాల్లో తీవ్ర అలజడి రేపింది. -
కేతన్ అగర్వాల్ హత్య కేసులో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్!
ముంబై: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఊహించని మలుపులు వెలుగులోకి వస్తున్నాయి. లోహగఢ్ కోట వద్ద తన ప్రియుడితో కలిసి, కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను లోయలోకి నెట్టి హత్య చేసిన నిందితురాలు సియా గోయల్.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలను వెల్లడించింది.తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని కేతన్కు ముందే చెప్పినప్పటికీ, అతను మాత్రం వివాహాన్ని రద్దు చేసుకునేందుకు ఒప్పుకోలేదని విచారణలో తేలింది. ప్రస్తుతం సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పూణే రూరల్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. మహారాష్ట్రలోని వాద్గావ్ కోర్టు వీరికి జూన్ 29 వరకు వారం రోజుల పోలీస్ కస్టడీ విధించడంతో, విచారణలో భాగంగా ఈ సంచలన వివరాలు బయటపడ్డాయి.‘నాకు మన పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేదు’. నేను చేతన్‌ను ప్రేమిస్తున్నాను. అతన్నే వివాహం చేసుకుంటాను’ అని తాను కేతన్కు స్పష్టం చేసినట్లు సియా పోలీసుల ముందు పేర్కొంది. అయితే, దానికి కేతన్ స్పందిస్తూ.. ‘నన్ను పెళ్లి చేసుకోకుండా నువ్వు తప్పించుకోలేవు.. నా గురించి, మా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి నీకు బాగా తెలుసు కదా’అంటూ తనను బెదిరించాడని సియా వాంగ్మూలం ఇచ్చింది. అయితే, సియా చేస్తున్న ఈ వాదనలు ఎంతవరకు నిజమనేది ప్రస్తుత న్యాయపరమైన పరిశీలన, పోలీసుల కొనసాగుతున్న దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.మొత్తం నువ్వు చేశావ్.. కాదు నీవల్లేఅంతకుముందు పోలీసు కస్టడీలో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి విచారణలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. హత్య, నేరపూరిత కుట్ర వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ జంట.. మొదట్లో ఇల్లు వదిలి పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అలా పారిపోతే తన కుటుంబ పరువు పోతుందనే ఆందోళనతో సియా ఆ నిర్ణయం నుండి వెనక్కి తగ్గింది. కేతన్‌ను చంపడానికి ముందే, అతనితో కుదిరిన వివాహ నిశ్చితార్థాన్ని ఎలాగైనా రద్దు చేసుకోవడానికి ఈ జంట అనేక మార్గాలను కూడా అన్వేషించినట్లు సమాచారం.విచారణ సమయంలో చేతన్ చౌదరి పోలీసులతో మాట్లాడుతూ.. సియాతో కలిసి పారిపోవడమే తన లక్ష్యమని, కానీ కేతన్‌ను హత్య చేయాలని ఆమెనే పట్టుబట్టిందని వెల్లడించాడు. మరోవైపు, ఈ హత్య పూర్తిగా చేతన్ ఆలోచనేనని సియా దర్యాప్తు అధికారులకు తెలిపింది. అంతకుముందు జూన్ 14న కేతన్‌ను చంపడానికి వారు చేసిన మొదటి ప్రయత్నం విఫలమైందని, ఆ సమయంలో చేతన్ తన ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడని కూడా సియా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది.‘ఎవరో కోటపై నుంచి కిందపడిపోయారు.. కాపాడండి’కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఫోటోలు దిగుతూ కేతన్ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయాడంటూ నిందితురాలు సియా గోయల్ ఆడిన నాటకాన్ని.. అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ ధీరజ్ జాదవ్ ఇచ్చిన సాక్ష్యం పూర్తిగా బట్టబయలు చేసింది.‘ఎవరో కోటపై నుంచి కిందపడిపోయారు.. కాపాడండి’ అంటూ నాడు సియా గోయల్ చేసిన ఆర్తనాదాలు, కేవలం పోలీసులను, అందరినీ తప్పుదోవ పట్టించేందుకేనని ఇప్పుడు స్పష్టమవుతోంది. ఆ రోజు లొహగడ్ కోటపై అసలు ఏం జరిగిందో సెక్యూరిటీ గార్డ్ కళ్లారా చూసి ఒక జాతీయ మీడియాతో పంచుకున్నారు. ‘ఎవరో కిందపడిపోయారు.. కాపాడండి అంటూ అరిచింది’ జూన్ 18న ఘటన జరిగిన సమయంలో తాను కోటపై విధి నిర్వహణలో ఉన్నట్లు ధీరజ్ జాదవ్ వివరించారు.కేతన్ పేరే చెప్పలేదుదూరం నుండి హఠాత్తుగా ఒక మహిళ గట్టిగా కేకలు వేయడం వినిపించింది. దాంతో నేను పరుగెత్తుకుంటూ ఆమె (సియా గోయల్) వద్దకు వెళ్లాను. ఏం జరిగిందని అడగ్గా.. ఆమె తీవ్ర ఆందోళన నటిస్తూ ‘ఇక్కడి నుండి ఎవరో కిందపడిపోయారు.. ప్లీజ్ సహాయం చేయండి.. సహాయం చేయండి’ అంటూ అరవడం మొదలుపెట్టింది. కానీ కింద పడింది తన కాబోయే భర్తేనని గానీ, అతని పేరని గానీ, అసలు ఏం జరిగిందనే మరిన్ని వివరాలను గానీ ఆ సమయంలో ఆమె నాకు చెప్పలేదు అని జాదవ్ పేర్కొన్నారు.కోట వద్ద 24 గంటలూ భద్రతా సిబ్బంది అందుబాటులో ఉంటారని, సమీపంలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉందని జాదవ్ తెలిపారు. కేతన్‌ను తోసేసిన ఆ నిర్దిష్ట ప్రాంతంలో తీవ్రమైన మొబైల్ నెట్వర్క్ సమస్యలు ఉన్నాయని, అందువల్లనే తాము పోలీసులకు సమాచారం అందించడం కొంచెం ఆలస్యమైందని ఆయన వెల్లడించారు. తాను వెంటనే అప్రమత్తమై పోలీసులను పిలిపించడంతో ఈ దారుణ కుట్ర వెలుగులోకి రావడానికి పునాది పడింది. -
జీవన సంగీతం
‘కోట్లు సంపాదించిన వారు కాదు విజేత. కోటి సమస్యలు చుట్టుముట్టినా... చిరుదీపం వెలిగించైనా సరే, ధైర్యంగా వెలుగు దారుల్లో నడిచేవారే విజేత’ అంటారు ఒక రచయిత. ఈ మాటలు సంగీత రాజేకు అక్షరాలా సరిపోతాయి. ఆమెకు సంబంధించిన విశిష్ఠత... రచయిత్రి, డిజిటల్ క్రియేటర్, పాడ్‌కాస్టర్ కావడం కాదు. తల్లి చనిపోయిన దుఃఖం నుంచి తేరుకోక ముందే రెండుసార్లు క్యాన్సర్ బారిన పడింది. ‘నా జీవితానికి ఇక ఏం మిగిలింది!’ అనుకునే క్లిష్ట దశలో కూడా ఆమె పెదవులపై చిరునవ్వు చెరిగిపోలేదు. పూణేకు చెందిన సంగీత రాజే తొలి పుసక్తం ‘లైట్ బియాండ్ ది షాడోస్: ఏ ట్రూ స్టోరీ’ ఎంతోమంది రోగులకు «ధైర్యాన్ని ఇస్తోంది. స్వస్థత శక్తి సానుకూల దృక్పథంలోనే ఉందని గట్టిగా చెబుతోంది....తల్లిదండ్రులను కోల్పోయిన దుఃఖం, శస్త్ర చికిత్సలు, సంవత్సరాల తరబడి నొప్పి... మరో వ్యక్తి అయితే... ‘ఈ జీవితం కంటే చావు నయం’ అనుకునేవారేమో. సంగీత రాజే మాత్రం ఎప్పుడూ అలా అనుకోలేదు. జీవనకాంక్ష ఆగిపోలేదు. అద్భుతమైన ఆత్మస్థైర్యంతో ఆశకు ఎప్పుడూ దగ్గరగానే ఉంది.బరువైన బాల్యం‘పదకొండు సంవత్సరాల వయసులో మా నాన్నను కోల్పోయాను. మేము బతకడం కోసం అమ్మ మా ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది. చాలా చిన్న వయసులోనే జీవితం ఒక పోరాటంగా మారింది. బాల్యం అకస్మాత్తుగా బరువుగా మారింది. ఆర్థిక ఇబ్బందులు దైనందిన జీవితంలో భాగమయ్యాయి’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది సంగీత. పదిహేనేళ్ల వయసులోనే సంగీతకు పెళ్లయింది. ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆమె అక్క చనిపోయింది. అక్క బిడ్డకు అమ్మలేని లోటును తీర్చడానికి సంగీత చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆడిపాడే వయసు దుఃఖం, బాధ్యతలతో నిండిపోయింది. అయితే... మాతృత్వం అనేది సంగీత జీవితంలోకి కొంత సంతోషాన్ని తీసుకువచ్చింది. కానీ రెండు సంవత్సరాల తరువాత ఊహించని విషాదం చుట్టు ముట్టింది.అడుగడుగునా అనారోగ్య సమస్యలుఇరవై రెండు ఏళ్ల వయసులో సంగీత రాజేకు లూపస్ అనేప్రాణాంతకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. లూపస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. శరీర రోగనిరోధక వ్యవస్థ దాని స్వంత కణజాలాలపైనే దాడి చేస్తుంది. ఇది అనేక అవయవాలను ప్రభావితం చేస్తుంది. సంవత్సరాల తరబడి జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, సూర్యరశ్మితో వచ్చే అలర్జీలు, తల తిరగడం...ఇలా ఎన్నో! అడుగడుగునా అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ కుటుంబ బాధ్యతలు మోస్తూనే రోజువారీ జీవితాన్ని కొనసాగించింది. 2019లో సంగీతకు మరో షాక్! ఆమెకు మెదడు క్యాన్సర్ అని నిర్ధారణ అయింది.అరుదైన కేసు... అన్నారు!‘నేను జీవించడానికి ఏ ఆశ లేదని చాలామంది భావించారు. కాని నేను ధైర్యంగా నిలబడ్డాను. క్యాన్సర్ గురించి ఆలోచిస్తూ బాధ పడి, భయపడడం కంటే మధుర జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకునేదాన్ని. భయాన్ని కాదు జీవనోత్సాహాన్నే నా ప్రపంచానికి కేంద్రబిందువు చేసుకున్నాను’ అని గతాన్ని గుర్తు చేసుకుంది సంగీత.విధి ఆమెను పరీక్షించడం ఇంకా ఆపలేదు.అమ్మ చనిపోయిన దుఃఖం నుండి తేరుకోక ముందే... ఆరు నెలల తరువాత సంగీతకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ‘మీది అరుదైన కేసు అని వైద్యులు నాతో చెప్పారు. నా శరీరంలో ఒకే సమయంలో రెండు వేర్వేరు క్యాన్సర్లు ఉన్నాయి. ఆ సమయంలో కుటుంబ బలమే నాకు అండగా నిలిచింది. ఆపరేషన్, కీమో థెరపీ సెషన్, రేడియేషన్ సైకిల్స్‌లో నా కుటుంబం నాకు ధైర్యాన్ని ఇచ్చింది’ అంటుంది సంగీత.స్వస్థపరిచే శక్తి మనసులోనే!రచనలు, రీల్స్, పాడ్‌కాస్ట్ ద్వారా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమందితో తన జీవిత అనుభవాలను పంచుకుంటూ ధైర్యాన్ని ఇస్తోంది సంగీత. వారికి ఆమె ఇచ్చే సలహా...‘స్వస్థపరిచే శక్తి మన మనస్సులో, అంతర్గత బలంలోనే ఉంది. యస్...నేను తప్పనిసరిగా కోలుకుంటాను అని ఒకటికి రెండుసార్లు బలంగా అనుకోండి. మన ఆలోచనలు శక్తిమంతమైనవి. శరీరం అవి వింటుంది. అదే సమయంలో సానుకూలంగా స్పందిస్తుంది. చీకటి రోజుల్లో...నిజం చెప్పాలంటే అనారోగ్యం అనేది నన్ను పెద్దగా భయపెట్టలేదు. అయితే నన్ను బాగా భయపెట్టిన విషయం మాత్రం ఒకటి ఉంది. నాకు ఆపరేషన్ జరిగితే, కోమాలోకి వెళితే కుటుంబ సభ్యులకు దూరమవుతానేమో, వారికి భారం అవుతానేమో అనేదే ఆ భయం. ఈ ఆలోచన అనారోగ్యం కంటే చాలా భయపెట్టేది. ఏది ఎలా జరిగినా భయంతో జీవించకూడదని నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను. ప్రతి సవాలును చిరునవ్వుతో ఎదుర్కోవడానికి సిద్ధం అయ్యాను. అత్యంత చీకటి రోజుల్లో కూడా నవ్వగలగడం అనేది నా జీవితానికి వెలుగు, బలం అయింది.– సంగీత రాజే -
కేతన్ హత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు
-
కేతన్ హత్యలో మరో ట్విస్ట్ : మాట మారుస్తున్న కిలాడీలు
పుణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ మృతి చెందిన ఘటనలో అరెస్ట్ అయిన కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి ఎవరో తెలియకుండా, ఇద్దరూ తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు.పోలీసుల సమాచారం ప్రకారం నిందితులిద్దరూ 'బ్లేమ్ గేమ్' ఆడుతున్నారు. సియా, చేతన్ ఇద్దరూ పక్కా ప్లాన్ ప్రకారం కేతన్‌ను నిర్దాక్షిణ్యంగా హత్య చేసి, ఇపుడు నేరాన్ని ఒకరిపై ఒకరు నెట్టేస్తున్నారు. తాను సియాతో కలిసి పారిపోవాలనుకున్నాను. కానీ కేతన్‌ను చంపమని సియానే ఒత్తిడి తెచ్చిందని చేతన్ మాట మారుస్తు న్నాడు. అటు సియా కూడా ఏం తక్కువ తినలేదు. అసలు ఈ హత్య ప్లాన్ అంతా చేతన్‌దే. జూన్ 14న జరిగిన మొదటి ప్రయత్నం విఫలమైనప్పుడు చేతన్ బోరున ఏడ్చాడు అంటూ సియా కొత్త నాటకానికి తీరతీసినట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: షాకింగ్ : ఆమె అలా సిగ్నల్ ఇచ్చింది.. ప్రియుడు తోసేశాడు!అయితే పోలీసులు మాత్రం వారి ఎత్తులను సరిగ్గానే అర్థం చేసుకుంటున్నారు. ఇదంతా బ్లేమ్ గేమ్ అనీ, వారి డిఫెన్స్ స్ట్రాటజీ (రక్షణ వ్యూహం) అని, కేతన్‌ను అంతం చేయాలనే కుట్రలో ఇద్దరూ సమానంగా భాగస్వాములని భావిస్తున్నారు.Pune - Chilling details have emerged in the sensational Lohagad Fort murder case, revealing that the conspiracy to kill 26-year-old Ketan Agarwal was allegedly finalised at a prominent cafe in Pune’s Kondhwa area. According to police investigations, accused Siya Goyal and her… pic.twitter.com/o4vBQVEDhB— NextMinute News (@nextminutenews7) June 25, 2026ఈ హత్యలో దర్యాప్తులో కీలకాంశాలను పోలీసులు సేకరించారు. తద్వారా వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని, కుట్రను తేట తెల్లం చేస్తున్నారు. మే 31 నుండి జూన్ 4 మధ్య పుణేలోని ఒక కేఫ్‌లో వీరిద్దరూ సమావేశమైనట్లు పోలీసులకు తెలిసింది. ఈ భేటీలోనే హత్యకు సంబంధించిన ప్లాన్ సిద్ధం చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కెఫేలో వారు కలుసుకున్న వీడియో కూడా వెలుగులోకివచ్చింది.సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ రికార్డులు, వారి మధ్య జరిగిన సంభాషణలు ఈ హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని ధృవీకరిస్తున్నాయి. జూన్ 14న కూడా కేతన్‌ను చంపడానికి ప్రయత్నించి వారు విఫలమయ్యారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరూ పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ కుట్రలో మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్ : కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు -
ఇంత ప్రేమించినట్టు నటించి ఎలా చంపేసావమ్మా!
-
కుట్ర లవర్స్‌దే.. మరి తోసిందెవరు?
పెళ్లికి పెద్దల అంగీకారం.. ఒకరికొకరు ప్రేమలో మునిగి తేలడం.. బయటకు కనిపించిన కథ ఇదే. కానీ ఆ నవ్వుల వెనుక ఓ చీకటి కుట్ర నడిచింది. రహస్య ప్రేమ, కేఫ్‌లలో జరిగిన గుట్టుచప్పుడు కాకుండా సమావేశాలు, వేల ఫోన్ కాల్స్, వరుస విఫల హత్యాయత్నాలు... చివరకు లోహగడ్ కోట అంచున ఓ యువ వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. పుణేకు చెందిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కుట్ర వెనుక ఉన్న దాదాపు అన్ని కోణాలను పోలీసులు ఛేదించారు. కానీ ఇప్పటికీ ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. తొలుత కనిపించిన దృశ్యం ఒక సాధారణ ప్రమాదం. ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువకుడు లోయలో పడి మృతి చెందాడు. కాబోయే భార్య కన్నీళ్లు పెట్టుకుంది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కూడా ప్రమాద మరణంగానే కేసు నమోదు చేశారు. కానీ ఆ కథలో ఏదో తేడా ఉందనే అనుమానం మొదట కేతన్ కుటుంబ సభ్యులకే వచ్చింది. ముఖ్యంగా కేతన్ సోదరి సంజనా అడిగిన కొన్ని ప్రశ్నలకు.. నిందితురాలు సియా గోయల్ ఇచ్చిన సమాధానాలు దర్యాప్తును పూర్తిగా కొత్త దిశలోకి మళ్లించాయి. అక్కడి నుంచే ఒక్కొక్కటిగా బయటపడిన ఆధారాలు.. ప్రేమ, మోసం, కుట్ర, హత్యతో కూడిన భయంకర కథను వెలుగులోకి తీసుకొచ్చాయి.జూన్ 18న లోహగడ్ కోట వద్ద ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ సమయంలో జరిగిన ఘటన తర్వాత కేతన్ మృతదేహాన్ని వెలికితీశారు. తొలుత ప్రమాద మరణంగా కేసు నమోదైంది. అయితే అంత్యక్రియలు పూర్తైన నాలుగు రోజుల తర్వాత కేతన్ సోదరి సంజనా సియాకు ఫోన్ చేసింది. ఇంటికి రమ్మంటూ పిలిచింది. సోదరుడి గురించి మాట్లాడుకుంటూ ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. అలా.. అసలు ఆ రోజు ఏం జరిగిందని ప్రశ్నించింది. సియా చెప్పిన వివరాల్లో తేడాలు కనిపించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు మళ్లీ మొదలైంది.విచారణలో బయటపడిన అంశాలు ఒక్కొక్కటిగా సియాపై అనుమానాలను పెంచాయి. కేతన్ మరణానికి ముందు ఆమె పలుమార్లు లోహగడ్‌కు రావాలని ఒత్తిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. మే 31న మొదటిసారి అక్కడికి తీసుకెళ్లింది. ఆ తర్వాత జూన్ 4న కూడా వెళ్లాలని పట్టుబట్టిందని, కానీ కేతన్ తల్లి అనుమతి ఇవ్వకపోవడంతో అది జరగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మే 31న ప్రదేశాన్ని ముందుగా పరిశీలించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.జూన్ 14న మరోసారి ఇద్దరూ లోహగడ్‌కు వెళ్లారు. అక్కడే మొదటి హత్యాయత్నం జరిగి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. లోయ అంచు వద్ద కేతన్‌ను నెట్టినప్పుడు అతడు పొదలను పట్టుకుని బయటపడ్డాడని, వెంటనే సియా పాము కనిపించిందంటూ నాటకం ఆడి పరిస్థితిని చక్కబెట్టిందని పోలీసులు చెబుతున్నారు. అప్పట్లో అది ప్రమాదంగా కనిపించినా.. ఇప్పుడు అదే ఘటన హత్యా కుట్రలో భాగమని భావిస్తున్నారు.ఇదిలా ఉండగా, పెళ్లికి ముందు బాలి ట్రిప్ కూడా కేసులో కీలక అంశంగా మారింది. ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్ కోసం కేతన్, సియా ఇండోనేషియా వెళ్లాల్సి ఉంది. అయితే ప్రయాణానికి ముందు కేతన్ పాస్‌పోర్ట్ కనిపించకుండా పోయింది. దీంతో ట్రిప్ రద్దయింది. ఈ ఘటన వెనుక కూడా సియా పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేతన్‌ను బాలి వెళ్లకముందే హత్య చేయాలన్న ఉద్దేశంతోనే పాస్‌పోర్ట్‌ను మాయం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.దర్యాప్తులో మరో కీలక మలుపు సీసీటీవీ ఫుటేజీలతో వచ్చింది. టికెట్ కౌంటర్ వద్ద కేతన్, సియా నడుచుకుంటూ వెళ్తుండగా.. కొంత దూరంలో హుడీ ధరించిన ఓ వ్యక్తి వారిని వెంబడిస్తున్న దృశ్యాలు కనిపించాయి. 33 డిగ్రీల ఉష్ణోగ్రత.. అంతా వేడిలోనూ కూడా ముఖం కనిపించకుండా హుడీ, హెడ్‌సెట్‌తో తిరగడం పోలీసులకు అనుమానం కలిగించింది. తర్వాత అతడే చేతన్ చౌదరి అని గుర్తించారు.చేతన్ తన మొబైల్‌ను ఇంట్లో వదిలేసి, ఒక ఉద్యోగి ఫోన్‌తో ప్రయాణించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. లోకేషన్ ట్రాకింగ్ నుంచి తప్పించుకోవడానికే ఈ ప్లాన్ వేసినట్లు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియా ఫొటోలు, డిజిటల్ ఆధారాలను సరిపోల్చిన తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని కాల్ రికార్డులు మరింత బలపరిచాయి. జనవరి 1 నుంచి జూన్ 18 వరకు సియా, చేతన్ల మధ్య 2,004 ఫోన్ కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గంటల తరబడి మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వ్యాపార పరిచయంతో మొదలైన సాన్నిహిత్యం ప్రేమగా మారిందని, కేతన్‌తో పెళ్లి విషయంలో సియా ఆసక్తి చూపకపోవడానికి ఇదే కారణమని దర్యాప్తులో తేలింది.పోలీసుల కథనం ప్రకారం.. సియా, చేతన్‌లు గత ఏడాది దీపావళి వేడుకల్లో పరిచయమయ్యారు. ఆ తర్వాత తరచూ కేఫ్‌లలో కలుస్తూ హత్యా ప్రణాళికను రచించినట్లు అనుమానిస్తున్నారు. సియా పెళ్లికి మానసికంగా సిద్ధంగా లేదని, కుటుంబ ఒత్తిడితో సంబంధాన్ని కొనసాగించిందని విచారణలో వెల్లడైంది. అయితే చేతన్‌తో పారిపోవడానికి కూడా ఆమె ఇష్టపడలేదని చెబుతున్నారు. నిశ్చితార్థం రద్దు చేసి ప్రేమికుడితో వెళ్లిపోతే కుటుంబ పరువు పోతుందని భావించిందని చేతన్ విచారణలో చెప్పినట్లు సమాచారం.కేతన్, సియా వివాహం నవంబర్‌లో ఉదయ్‌పూర్‌లో జరగాల్సి ఉంది. కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ జూన్ 18న జరిగిన ట్రెక్కింగ్ ప్రయాణమే కేతన్ జీవితానికి చివరి ప్రయాణమైంది.పోలీసుల ప్రకారం, ఘటన రోజున చేతన్ ముందుగానే లోహగడ్‌కు చేరుకుని అక్కడ మాటు వేసి ఉన్నాడు. తర్వాత సియా, కేతన్‌లను అనుసరిస్తూ ఏకాంత ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి కేతన్‌ను సుమారు 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టే ప్లాన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఆపై సియా కేకలు వేస్తూ భద్రతా సిబ్బందిని పిలిచి, అది ప్రమాదంలా కనిపించేలా ప్రయత్నించినట్లు అభియోగాలు నమోదు చేశారు.ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. చేతన్ స్నేహితుడు నీరజ్‌ను కూడా అదుపులోకి తీసుకుని అతడి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు, డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, ఘటనాస్థల పరిశీలన కొనసాగుతోంది.అయితే ఈ కేసులో ఇప్పటికీ ఒక ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కేతన్‌ను చంపాలన్న కుట్ర ఇద్దరిదేనని పోలీసులు చెబుతున్నారు. కానీ చివరి క్షణంలో లోయ అంచున నిలబడ్డ కేతన్కు నెట్టేసి చంపింది ఎవరు?.. పక్కనే నడుస్తున్న సియానా?.. లేక మాటు వేసి ఎదురుచూస్తున్న చేతనా?.. లేదంటే ఇద్దరూనా?. వీళ్లకు సహకరించిన నీరజా? ఈ విషయంలో నిందితుల నుంచి మౌనమే పోలీసులకు ఎదురవుతోంది. అదే సమయంలో.. వాళ్ల తల్లిదండ్రులు ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు. దర్యాప్తు మొత్తం ఇప్పుడు ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగి.. ఆ సమాధానం బయటపడే వరకు ఈ కేసు అతిపెద్ద మిస్టరీ అలాగే కొనసాగనుంది. -
ఫైవ్ స్టార్ హోటల్లో 70 రూములు బుకింగ్!
పుణే: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే కోడలు సియా గోయల్ పుట్టినరోజును ఘనంగా జరపాలని అగర్వాల్ కుటుంబ సభ్యులు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా, అదే సమయంలో ఆమె మాత్రం కాబోయే భర్తను హత్య చేయడానికి పథకం రచించినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ తండ్రి విశాల్ అగర్వాల్ (Vishal Agarwal), జూన్ 20న సియా గోయల్ పుట్టినరోజును మహారాష్ట్రలోని ప్రముఖ హిల్‌స్టేషన్ మహాబలేశ్వర్‌లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఏకంగా 70 గదులను బుక్ చేశారు. రెండు కుటుంబాలు కలిసి వేడుకలు జరుపుకోవాలని భావించాయి. అయితే సియా, ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కేతన్‌ను ఒప్పించి, పుణే సమీపంలోని లోహగడ్ కోటకు ఇద్దరూ మాత్రమే వెళ్లేలా ప్రణాళిక వేసినట్లు దర్యాప్తులో తేలింది.నిశ్చితార్థం తర్వాత హత్యప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన కేతన్ అగర్వాల్, సియా గోయల్ (Siya Goyal) నిశ్చితార్థం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. నవంబరులో ఘన వివాహం జరగాల్సి ఉంది. అయితే జూన్ 18న లోహగడ్ కోట వద్ద ట్రెక్కింగ్ సందర్భంగా కేతన్ లోయలో పడి మరణించాడు. మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావించారు. సియా కూడా అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ పోలీసుల దర్యాప్తులో ఇది ముందుగానే పన్నిన హత్యగా బయటపడింది.చదవండి: హుడీతో దొరికిపోయారు ఇద్దరు!ప్రేమికుడితో కలిసి కుట్రవిచారణలో సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌధరి (22) కలిసి కేతన్‌ను చంపినట్టు తేలింది. నేరానికి కొన్ని రోజుల ముందు ఒక కేఫేలో సమావేశమై హత్య ప్రణాళికను ఖరారు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, సియా, చేతన్‌ను (Chetan Chaudhary) అరెస్ట్ చేసి హత్య, నేరపూరిత కుట్ర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. లోనావాల రూరల్ పోలీసు స్టేషన్లో వీరిని విచారిస్తున్నారు. Pune trekker's death case: Accused Siya Goyal, her lover Chetan Chaudhary taken to Lonavala Rural Police Station. pic.twitter.com/RVRZU8n5sG— News Arena India (@NewsArenaIndia) June 24, 2026 -
అంతా బాగానే ప్లాన్ చేసింది.. ఇదిగో ఇక్కడే దొరికిపోయింది?
పూణే: చేతన్ చౌదరి, సియా గోయల్ క్రైమ్ కథాచిత్రంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లోహ్‌గఢ్ కోట కంటే ముందే గతేడాది దీపావళి తర్వాత కేతన్ అగర్వాల్‌ను హత్య చేయాలని సియా గోయల్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఓ కేఫ్‌లో సియా ఆమె ప్రియుడు చేతన్‌తో కలిసి మర్డర్ ప్లాన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నాటి నుంచి సుమారు ఏడు నెలల కాలంలో సియా-చేతన్ల మధ్య 2004 కాల్స్, 238 గంటల సంభాషణలు జరిగినట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం లోహగడ్ కోట సాక్షిగా జరిగిన ఒక యువ వ్యాపారవేత్త మరణం, కేవలం ఒక ప్రమాదం కాదు.. అది తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఒక పక్కా క్రైమ్ సినిమా అని పూణే రూరల్ పోలీసులు తేల్చారు. ప్రముఖ బిల్డర్ విశాల్ అగర్వాల్ కుమారుడు, 25 ఏళ్ల కేతన్ అగర్వాల్‌ను అతడికి కాబోయే భార్య 20 ఏళ్ల సియా గోయల్, తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి అత్యంత కిరాతకంగా లోయలోకి నెట్టి చంపేసింది.మొదట ట్రెకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడంటూ అందరినీ నమ్మించిన సియా అసలు రంగు, పోలీసులు జరిపిన లోతైన విచారణలో బయటపడింది. నవంబర్ 25న జైపూర్ రాజభవనంలో చార్టర్డ్ ఫ్లైట్లతో అత్యంత వైభవంగా జరగాల్సిన పెళ్లి, ఈ ఘాతుకంతో మరణానికి దారితీసింది.ఈ కేసులో మొదటి షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే.. జూన్ 18న కేతన్ చనిపోవడానికి కేవలం నాలుగు రోజుల ముందే.. అంటే జూన్ 14న కూడా అదే లోహగడ్ కోటపై అతడిని చంపేందుకు సియా ప్రయత్నించింది. కోట అంచున నిలబడిన కేతన్‌ను ఆమె బలంగా లోయలోకి నెట్టేసింది. కానీ అదృష్టవశాత్తు ఒక చెట్టు కొమ్మను పట్టుకోవడంతో కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో భయపడిపోయిన కేతన్‌తో.. ‘అక్కడ పాము కనిపించింది, నిన్ను కాపాడబోయే కంగారులో చెయ్యి తగిలింది’ అంటూ సియా నమ్మబలికింది.అయినప్పటికీ అనుమానం రాకుండా, జూన్ 19న తన పుట్టినరోజు వేడుకల కోసం మళ్లీ అదే కోటకు రావాలని కేతన్‌ను మొండిగా ఒప్పించింది. కేతన్ నిరాకరించినప్పటికీ, అతడి తల్లికి ఫోన్ చేసి మరీ ఒప్పించడం ఈ క్రైమ్ స్కెచ్‌లో భాగమేనని పోలీసులు గుర్తించారు.ఈ గుట్టు రట్టు కావడానికి ప్రధాన కారణం సియా గోయల్ వేసిన ఒకే ఒక్క తప్పుడు అడుగని తేలింది. కేతన్ అంత్యక్రియలు ముగిసిన నాలుగు రోజుల తర్వాత ఆమె అతడి ఇంటికి వెళ్ళింది. అక్కడ కేతన్ సోదరి అడిగిన కొన్ని సాధారణ ప్రశ్నలకు సియా తడబడింది. పొంతన లేని సమాధానం ఇచ్చింది. దీంతో సియాపై కేతన్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, 33 డిగ్రీల తీవ్రమైన ఎండలో ఒక వ్యక్తి ముఖం కనిపించకుండా మందపాటి హుడీ ధరించి, హెడ్సెట్ పెట్టుకుని కేతన్, సియాలను వెంబడించడం కనిపించింది. సియా వెనక్కి తిరిగినప్పుడల్లా అతడు కింద కూర్చోవడం పోలీసులకు స్పష్టమైన క్లూ ఇచ్చింది.పోలీసులు సాంకేతిక ఆధారాలను తవ్వడం ప్రారంభించాక మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి గత ఆరు నెలల్లో ఏకంగా 2,004 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. అంటే దాదాపు 238 గంటల సమయం వారు సంభాషించారు. అంతేకాదు, జూన్ 18 హత్య జరిగిన రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5:40 వరకు చేతన్ తన మొబైల్ ఇంటర్నెట్ ఆఫ్ చేశాడు. పోలీసులు తన లొకేషన్‌ను ట్రాక్ చేయకుండా ఉండేందుకు, తన సొంత ఫోన్‌ను దుకాణంలోనే వదిలేసి, తన ఉద్యోగి ఫోన్‌ను దొంగతనంగా వాడుతూ లోహగడ్ కోటకు చేరుకున్నాడు.ఈ పక్కా ప్లాన్‌తోనే కేతన్‌ను లోయలోకి నెట్టేసి హత్య చేశారు. పోలీసులు చేతన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, కేతన్ అంటే ఇష్టం లేనప్పుడు నిశ్చితార్థం ఎందుకు రద్దు చేసుకోలేదని ప్రశ్నించారు. దానికి అతడు ఇచ్చిన సమాధానం మరింత షాకింగ్‌గా ఉంది. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని పారిపోతే తన కుటుంబ గౌరవానికి భంగం వాటిల్లుతుందని, సమాజంలో పరువు పోతుందనే భయంతోనే సియా గోయల్ ఆ పని చేయలేదని, అందుకే కేతన్‌ను శాశ్వతంగా అడ్డుతొలగించాలని పథకం రచించినట్లు చేతన్ విచారణలో ఒప్పుకున్నాడు. ప్రస్తుతం లోనావాలా రూరల్ పోలీసులు నిందితులిద్దరిపై హత్య కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కేతన్ అగర్వాల్ కుటుంబం నిందితులకు ఉరిశిక్ష పడేలా చేయాలని కన్నీటి పర్యంతమవుతూ డిమాండ్ చేస్తోంది. -
కేతన్ అగర్వాల్ హత్యలో ఎన్ని ట్విస్టులో: అపుడు తప్పిందనీ ప్లాన్ ‘సి’ సిద్ధం!
మహారాష్ట్రలోని లోహగఢ్ కోట సమీపంలో జరిగిన కేతన్ అగర్వాల్ (26) మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించిన ఈ ఘటన.. అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పన్నిన క్రూరమైన హత్య కుట్రగా తేలడం అందర్నీ షాక్‌కు గురిచేసింది.తన కాబోయే భార్య సియాను ఎంతగానో ప్రేమించిన కేతన్ ఆమె పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆమెతో ఏడు అడుగులు వేయాలని కలలు కంటున్న తరుణంలో జూన్ 18న సియా చేతిలో హత్యకు గురయ్యాడు. మొదట అతడు కాలు జారి పడిపోయాడని అందరూ భావించారు.సోదరి అనుమానంతో గుట్టు రట్టుకానీ, కేతన్ అంత్యక్రియలు జరిగిన నాలుగు రోజుల తర్వాత సియా వారి కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చినపుడు అనుమానం మొదటైంది. ఆ సమయంలో ఆమె చెప్పిన వివరాలలో తేడాలు ఉండటాన్ని కేతన్ సోదరి గమనించింది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు సియా ఫోన్ రికార్డులను పరిశీలించడంతో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.6 నెలల్లో 2004 కాల్స్సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి గత ఆరు నెలల్లో ఏకంగా 2,004 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారు. మొత్తం 238 గంటలకు పైగా ఫోన్ కాల్స్‌లో గడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కాల్ డేటానే ఈ హత్య కుట్రను ఛేదించడానికి కీలక ఆధారంగా మారింది.పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నంఘటన జరిగిన రోజు చేతన్ చౌదరి తన లొకేషన్ దొరకకూడదని చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5:40 గంటల వరకు తన ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఆపివేశాడు. తన మొబైల్ ఫోన్‌ను ఎవరూ ట్రాక్ చేయకుండా తన దుకాణంలోనే వదిలేశాడు.ఇదీ చదవండి : ఆ ఒక్కడి వల్ల ముగ్గురు బలి : గాయని చిన్మయి ఫైర్లోహగఢ్ కోటకు వెళ్లేటప్పుడు తన దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి మొబైల్ ఫోన్‌ను తీసుకు వెళ్లాడు. అయితే, పోలీసులు డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ/సర్వైలెన్స్ డేటా ద్వారా అతడు అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించారు. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరినీ కోర్టు జూన్ 29 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది.మండుటెండలో హుడీసీసీటీవీ ఫుటేజ్ ప్రకారం 33 డిగ్రీల సెల్సియస్ మండుటెండలో ట్రెకింగ్ చేస్తుండగా హుడీ ధరించిన వ్యక్తి అనుమానాస్పద కదలికలు,ఇంత ఎండలో హైకింగ్‌కు వెళ్లేటప్పుడు ఎవరైనా హుడీ ఎందుకు ధరిస్తారనే అనుమానమే ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. పోలీసుల కథనం ప్రకారం, కోట వద్ద కేతన్, అతని కాబోయే భార్య సియా కలిసి నడుస్తుండగా సీసీటీవీలో కనిపించింది. సియా ప్రియుడైన చేతన్ చౌదరిగా గుర్తించబడిన మరో వ్యక్తి, వారికి సుమారు 20 నుండి 30 అడుగుల దగ్గర నుండి వారిని ఫాలో అయ్యాడు. అతను షార్ట్స్, ముఖాన్ని కప్పివేసే హుడీ ధరించి కనిపించాడు. హుడీపై హెడ్సెట్ కూడా పెట్టుకున్నాడు.మరో సీసీటీవీ ఫుటేజ్‌లో, సియా అకస్మాత్తుగా హుడీ ధరించిన వ్యక్తి వైపు వెనక్కి తిరిగి చూసి, వెంటనే కూర్చుండిపోయింది. సియా, చేతన్ల మధ్య బలమైన సంబంధం ఉందని, పక్కా ప్రణాళికతో పన్నిన కుట్ర అని కూడా టెక్నికల్ డేటా ద్వారా తేలింది.ఇదీ చదవండి: 11 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం : ఆ తర్వాత తాపీగా క్యాబ్ డ్రైవింగ్అపుడే తోసేసింది..కానీ కేతన్, సియాలు మే 31, జూన్ 14 , జూన్ 18 తేదీలలో మూడుసార్లు లోహగడ్ కోటకు ట్రెక్కింగ్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. కేతన్ హత్యకు కొన్ని రోజుల ముందు, అంటే గత నెలలో, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం కేతన్, సియా బాలికి వెళ్లాల్సి ఉంది. అయితే, ముంబై విమానాశ్రయంలో తన పాస్‌పోర్ట్ కనిపించడంలేదని డ్రామా ఆడింది. సియా కావాలనే పాస్‌పోర్ట్‌ను దాచిపెట్టి ఆ ప్రయాణాన్ని అడ్డుకుందని బాధితుడి తండ్రి ఆరోపించారు.ఆ తర్వాత లోహగడ్ కోటకు వెళ్ళినప్పుడు, జూన్ 14న సియా కేతన్‌ను హత్యకు తొలిసారి ప్రయత్నించి విఫలమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొండపై నెంచి అతణ్ని నెట్టేసింది. అయితే అతను కొండ అంచున ఉన్న పొదను పట్టుకుని ప్రాణాలు కాపాడుకో గలిగాడు. తన చర్యను కప్పిపుచ్చుకోవడానికి, పాము కనిపించిందని అరుస్తూ అందరి దృష్టి మళ్లించి, ఆపై అతన్ని వాటేసుకుని బావురుమంటూ నాటకం ఆడింది. అలా తొలి ప్రయత్నం విఫలం కావడంతో ఈసారి ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసి కేతన్‌ను మట్టుబెట్టారు. అంతేకాదు ఒకవేళ అనుకున్నట్టు జరగకపోతే, 'ప్లాన్ సి' (మూడో ప్లాన్) కూడా సిద్ధం చేసుకున్నారట.మరోవైపు,చేతన్ తరపు న్యాయవాది రామ్ షహానే ఈ ఆరోపణలను ఖండించారు. ఎఫ్ఐఆర్లో చేతన్‌కు ఈ మరణంతో సంబంధం ఉన్నట్లు ఎక్కడా ప్రత్యక్ష ఆధారాలు లేవని, ఘటన జరిగిన సమయంలో అతడు లోహగఢ్ ప్రాంతంలో ఉన్నట్లు ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ లేదా పత్రాలను పోలీసులు చూపించలేదని వాదించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో మరిన్ని డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. సియా ఒక బేకరీని నడుపుతుండగా, చేతన్ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసేవాడు.ఇదీ చదవండి: ముగ్గురికి గుడ్‌బై : వ్యాపారవేత్తతో 62 ఏళ్ల మోడల్ ఎంగేజ్మెంట్కాగా మహారాష్ట్రకు చెందిన ప్రముఖవ్యాపారవేత్త కుమారుడైన కేతన్, సియాల నిశ్చితార్థం ఈ ఏడాది ఫిబ్రవరిలోజరిగింది. ప్రైవేట్ జెట్లు, రాజభవనాల వేదికగా ఈ ఏడాది నవంబర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు కేతన్. కానీ అనూహ్యంగా అనంత లోకాలకు చేరడం విషాదం. -
'లోహగడ్ కోట' కేసులో.. కొత్త కోణం!
మండు వేసవిలో ఉక్కపోస్తుండగా ఎవరైనా హుడీ ధరిస్తారా? ఇదే అనుమానం పుణే పోలీసులకు వచ్చింది. వెంటనే ఈ దిశగా దర్యాప్తు సాగించడంతో అసలు నిజం బయటపడింది. అప్పటి వరకు ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పరిగణించబడిన కేసు కొత్త మలుపు తిరిగింది. పథకం ప్రకారం హత్య చేశారని వెల్లడైంది.పుణే: మహారాష్ట్రలో సంచలనం రేపిన పుణే వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 18న లోహగడ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడిపోయి విశాల్ చనిపోయాడు. తనను ఫొటోలు తీస్తూ ప్రమాదవశాత్తు అతడు లోయలో పడిపోయాడని అతడికి కాబోయే భార్య సియా గోయల్ (Siya Goyal).. లూనావాలా రూరల్ పోలీసులకు చెప్పింది. అయితే ప్రియుడితో కలిసి విశాల్‌ను ఆమె లోయలోకి తోసేసిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.ఎలా కనిపెట్టారంటే.. ?కాబోయే భార్య సియా గోయల్‌తో కలిసి కేతన్ అగర్వాల్ (Ketan Agarwal).. ఈనెల 18న చారిత్రక లోహగడ్ కోటకు వెళ్లాడు. వీరిని కొంత దూరం నుంచి ఓ వ్యక్తి వ్యక్తి అనుసరిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి షార్ట్, ముఖాన్ని పూర్తిగా కప్పే హుడీ ధరించి.. తలకు హెడ్సెట్ పెట్టుకున్నాడు. ఆ రోజు ఉష్ణోగ్రత సుమారు 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇలాంటి ఉక్కపోత వాతావరణంలో అతడు హుడీ ఎందుకు ధరించాడనే సందేహం పోలీసులకు వచ్చింది. వెంటనే ఈ దిశగా దర్యాప్తు సాగించారు. మరో వీడియోలో సియా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగా, వెంటనే హుడీ ధరించిన వ్యక్తి కూర్చోవడం కనిపించింది. దీంతో అనుమానం బలపడింది.మరోవైపు కేతన్ మరణించిన తర్వాత కూడా సియా ముఖంలో ఎలాంటి బాధ కనిపించకపోవడాన్ని పోలీసులు గమనించారు. పెళ్లి ఇష్టం లేనట్టుగా సియా గోయల్ కనిపించిందని కేతన్ మామ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. పెళ్లిని ఏడాది పాటు వాయిదా వేయవచ్చా అని ఒకసారి తనను అడిగిన విషయాన్ని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కుట్ర కోణంలో దర్యాప్తు మొదలుపెట్టడంతో అసలు నిజం బయటకు వచ్చింది. ప్రియుడు చేతన్ చౌధరి (Chetan Choudhary)తో కలిసి సియా గోయల్ తనకు కాబోయే భర్తను హత్య చేసిందని నిర్ధారణయింది.2,004 ఫోన్ కాల్స్ !సాంకేతిక ఆధారాలతో సియా, చేతన్ మధ్య సన్నిహిత సంబంధాలు బయటపడ్డాయి. చేతన్ సోషల్ మీడియా ఫోటోలను సీసీటీవీ దృశ్యాలతో పోల్చి చూడగా, ఫుటేజ్‌లో కనిపించిన వ్యక్తి అతడేనని పోలీసులు నిర్ధారించారు. ఇక గత ఏడు నెలల్లో సియా, చేతన్ మధ్య 2,004 ఫోన్ కాల్స్ జరిగినట్లు, వాటి మొత్తం వ్యవధి 238 గంటలకుపైగా ఉన్నట్లు విచారణలో తేలింది. గతేడాది నవంబరు నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు తెలిసింది. సియా బేకరీ వ్యాపారం నిర్వహిస్తుండగా, చేతన్ డ్రైఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్నాడు. తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి కేతన్‌తో పెళ్లికి సియా ఒప్పుకుందని సమాచారం. మొదటి హత్యాయత్నం విఫలం!కేతన్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సియా, చేతన్‌తో కలిసి అతడిని హత్య చేయాలని కుట్ర చేసింది. ఇందులో భాగంగా కేతన్‌ను సియా.. ఫొటో షూట్ పేరుతో లోహగడ్ కోటకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడికి వచ్చిన చేతన్‌తో కలిసి కేతన్‌ను లోయలోకి తోసేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మొదటి హత్యాయత్నం విఫలమైందని వెల్లడించారు. జూన్ 14న కూడా లోహగడ్ కోట వద్ద సియా కేతన్‌ను లోయలోకి నెట్టేసి చంపేందుకు ప్రయత్నించింది. అయితే అతడు పక్కనే ఉన్న పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి అనుమానం రాకుండా ఉండేందుకు కట్టుకథ అల్లింది. పాము కనిపించడంతో భయంతో అతడి మీద పడ్డానని చెప్పడంతో కేతన్ నమ్మేశాడు.చదవండి: బంధం ముగిస్తే సరిపోదా.. బలి ఎందుకు?ప్లాన్- సీ కూడా సిద్ధం!మొదటి ప్రయత్నం విఫలం కావడంతో జూన్ 18న మళ్లీ పథకం అమలు చేసి కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రయత్నం కూడా విఫలమైతే అమలు చేసేందుకు మరో ప్రత్యామ్నాయ ప్రణాళికను ("ప్లాన్-సీ") సిద్ధం చేసుకున్నట్లు కేసు పత్రాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌధరిలను హత్య, నేరపూరిత కుట్ర కేసుల్లో అరెస్టు చేసిన పోలీసులు వారిని ఏడు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
బంధం ముగిస్తే సరిపోదా?.. బలి ఎందుకు?
ఒకప్పుడు ప్రేమ విఫలమైతే దూరమయ్యేవారు. పెళ్లి బంధం సరిగా సాగకపోతే విడాకులు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా?. ప్రేమించిన వారినే హత్య చేయడం, జీవిత భాగస్వామిని అంతమొందించడం, సంబంధానికి అడ్డుగా ఉన్నారని ప్రాణాలు తీయడం వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు బంధాలు ‘బ్రేక్’ అవ్వడం కాకుండా ఎందుకు బలైపోతున్నాయి?. కాస్త లోతుల్లోకి వెళ్తే..మేఘాలయ హనీమూన్ కేసునే పరిశీలిద్దాం. ఇండోర్‌కు చెందిన జంట.. హనీమూన్‌కు వెళ్లింది. దంపతులు మిస్ కావడం.. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు.. భర్త చనిపోవం.. భార్య దీనావస్థలో రోడ్డు మీద కనిపించడం.. చివరకు భార్య&ప్రియుడి చేతిలోనే హత్యకు గురవడం తీవ్ర సంచలనం రేపింది. మరోవైపు ఇటు తెలంగాణలో సంచలనం సృష్టించిన సర్వేయర్ హత్య కేసులోనూ వివాహేతర సంబంధాల కోణం ప్రధానంగా చర్చకు వచ్చింది. అటు.. ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన మీరట్ "బ్లూ డ్రం" కేసులో భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్తను హత్య చేశారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాజాగా పుణెలో పెళ్లికి సిద్ధమవుతున్న కేతన్ అగర్వాల్ ప్రమాదవశాత్తూ చనిపోలేదని.. అది హత్య అని తేలడం సంచలనం సృష్టించింది. ఫొటోషూట్ పేరుతో ఓ కోటకు తీసుకెళ్లి కాబోయే వధువు, ఆమె ప్రియుడే అతన్ని దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.These are Ketan Agarwal and Siya Goel. They were engaged and supposed to get married this year. Look how happy, in love, and comfortable they are with each other.They must have dreamed of a great future together, but cruel fate had other ideas. On June 18, Siya's birthday,… pic.twitter.com/4Av4OQvXuc— THE SKIN DOCTOR (@theskindoctor13) June 23, 2026ఈ ఘటనల్లో పరిస్థితులు, వ్యక్తులు, ప్రాంతాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ఒక ఉమ్మడి అంశం కనిపిస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అదే.. సంబంధాన్ని ముగించడం కంటే వ్యక్తినే శాశ్వతంగా తొలగించాలనే ప్రమాదకర ఆలోచన.మనస్తత్వ నిపుణుల ప్రకారం.. నేటి కాలంలో కొందరు ప్రేమను పరస్పర గౌరవంతో కూడిన బంధంగా కాకుండా, స్వాధీన భావంతో చూస్తున్నారు. నువ్వు నాకే చెందాలి.. లేదంటే ఎవరికీ దక్కకూడదు అనే ఆలోచన తీవ్ర స్థాయికి చేరినప్పుడు హింసాత్మక ధోరణులు పెరిగే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.అలాగే, తిరస్కరణను అంగీకరించలేకపోవడం కూడా కీలక కారణమని నిపుణులు చెబుతున్నారు. సంబంధం కొనసాగకపోతే విడిపోవడం, చట్టబద్ధంగా విడాకులు తీసుకోవడం వంటి మార్గాలు ఉన్నప్పటికీ, కొందరు వాటిని పరాజయంగా భావిస్తున్నారని అంటున్నారు. పరువు పోతుందనే భయం, ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతామనే ఆందోళన, కుటుంబమో.. సమాజమో ఏమనుకుంటుందో అనే ఒత్తిడి కొందరిని తీవ్ర నిర్ణయాల వైపు నెడుతున్నాయని విశ్లేషిస్తున్నారు.మరోవైపు సోషల్ మీడియా ప్రభావం కూడా సంబంధాలపై పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ రిలేషన్షిప్ చిత్రాలతో తమ బంధాలను పోల్చుకోవడం, చిన్న చిన్న విభేదాలను కూడా పెద్ద సమస్యలుగా భావించడం వల్ల అసహనం పెరుగుతోందని చెబుతున్నారు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం, కోపాన్ని ఆరోగ్యకరంగా వ్యక్తం చేయలేకపోవడం, కౌన్సెలింగ్ తీసుకోవడంపై ఇప్పటికీ ఉన్న అపోహలు కూడా సమస్యను మరింత తీవ్రమం చేస్తున్నాయని పేర్కొంటున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. అయితే సంభాషణ, కుటుంబ సభ్యుల సహకారం, అవసరమైతే కౌన్సెలింగ్ ద్వారా చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. బంధం కొనసాగించడం సాధ్యం కాకపోతే విడిపోవడం కూడా ఒక మార్గమే. కానీ ప్రాణాలు తీయడం ఎప్పటికీ పరిష్కారం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రేమ అనేది స్వాధీనం కాదు, బాధ్యత. బంధం అనేది నియంత్రణ కాదు, పరస్పర గౌరవం. ఆ గౌరవం, నమ్మకం కోల్పోయినప్పుడు బంధాలు బలహీనపడతాయి. కానీ ఏ పరిస్థితుల్లోనూ ఒకరి ప్రాణాన్ని తీసే హక్కు మరొకరికి లేదన్న విషయాన్ని సమాజం మరచిపోకూడదు.::వెబ్ ప్రత్యేకం -
కాబోయే భర్తను లోయలోకి తోసేసిన భార్య
-
ఫొటోల వంకతో కాబోయే భర్తను లోయలోకి తోసేసిందా..?
ముంబై: పుణె వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన ప్రమాదవశాత్తు చనిపోలేదని కావాలనే లోయపై నుంచి తోసి వేశారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భార్య 'సియా గోయల్', ఆమె స్నేహితుడు 'సుధాన్షు చౌదరి'లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల నిర్ధారణతో వెలుగుచూసిన అంశాలతో అంతా షాకింగ్ గురయ్యారు.ఏం జరిగిందిపుణేకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ జూన్ 18న చారిత్రక లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాము ట్రెక్కింగ్‌కు వచ్చామని, కేతన్ తనను ఫొటోలు తీస్తుండగా హోరుగాలికి పట్టుతప్పి లోయలో పడిపోయాడని కేతన్ కాబోయే భార్య పోలీసులకు తెలిపింది. దాంతో ప్రమాదంగా భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.అయితే విచారణ సందర్భంగా కేతన్ కాబోయే భార్య పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. హత్య కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అతడిది హత్య అని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ కేసులో కేతన్ కాబోయే భార్యను, ఆమె మిత్రుడిని అదుపులోకి తీసుకున్నట్లు విచారణ చేపట్టారు.పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్.. తన కుటుంబ స్థిరాస్తి వ్యాపార కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇటీవలే అతడికి వివాహం నిశ్చయమైంది. నవంబర్‌లో జరిగే పెళ్లి వేడుక కోసం ఉదయ్‌పుర్‌లోని ఖరీదైన ప్యాలెస్‌ను కూడా బుక్ చేశారు. జూన్ 19న కాబోయే భార్య పుట్టినరోజు ఉండటంతో ఆ వేడుకల కోసం కేతన్ కొంతమంది మిత్రులతో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లారు. అక్కడే ఈ విషాద ఘటన జరిగింది.అంగరంగ వైభవంగా వివాహ వేడుక వివాహం ఈ నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగాల్సి ఉంది. దీని కోసం ఇరు కుటుంబాలు జైపూర్‌లో రూ.17 కోట్ల వ్యయంతో ఒక ప్యాలెస్‌ను బుక్ చేశారు. అంతేకాకుండా అతిథుల కోసం రెండు ప్రైవేట్ విమానాలను ఏర్పాటు చేశారని మృతుడి బంధువులు తెలిపారు. ఆ సమయంలో ఇలాంటి ఘటన జరగడం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. -
పాక్ నిషేధం లేదా?.. జాతరలో కొన్న బెడ్‌షీట్‌పై మేడ్ ఇన్ పాకిస్తాన్ ముద్ర
ముంబై: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ వెలుగుచూసింది. ఓ జాతరలో కొనుగోలు చేసిన బెడ్‌షీట్‌పై ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ (Made in Pakistan) అనే లేబుల్ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియోను మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, పాకిస్తాన్‌కు చెందిన వస్తువులు భారత్‌లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూణే సమీపంలోని పింప్రి-చించ్వాడ్ పరిధిలో ప్రసిద్ధ శ్రీ మోరయా గోసావి ఆలయంలో బుధవారం సంకష్ట చతుర్థి జాతర జరిగింది. ఈ జాతరకు పూణేకు చెందిన ఓ మహిళ వెళ్లింది. జాతరలో ఆమె.. బెడ్‌షీట్‌ను కొనుగోలు చేసింది. కొనుగోలు సమయంలో దానిపై ఎలాంటి అనుమానాస్పద గుర్తులు లేవు. అయితే, ఇంటికి వెళ్లాక దానిని వాష్ చేయడంతో ఒక మూలన దాచిన లేబుల్ స్పష్టంగా కనిపించింది. దానిపై మేడ్ ఇన్ పాకిస్తాన్ అని రాసి ఉండటం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో, వెంటనే దీన్ని ఫోన్లో రికార్డు చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పోలీసులు గుర్తించారు.पुणे के चिंचवड़ में मोरया गोसावी मंदिर के संकष्टी चतुर्थी के दिन मेले में मेड इन पाकिस्तान चीजों की बिक्रीहिंदू महिला ने किया उजागर वीडियो हुआ वायरल pic.twitter.com/JN859goEf9— Amrendra Bahubali 🇮🇳 (@TheBahubali_IND) June 5, 2026ఈ వైరల్ వీడియోపై తక్షణమే స్పందించిన పింప్రి-చించ్వాడ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బెడ్‌షీట్‌ను అమ్మిన సదరు వీధి వ్యాపారి ఎవరు? అతడికి ఈ స్టాక్ ఎక్కడి నుంచి సరఫరా అయింది? స్థానిక మార్కెట్లోకి ఈ పాకిస్తాన్ వస్తువులు ఎలా ప్రవేశించాయి? అనే సప్లై చైన్ నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు లేఖ రాశారు. అయితే, మహారాష్ట్రలోని శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లాలో కూడా ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ అని ఉన్న కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జాతరలు, స్థానిక మార్కెట్లలో విక్రయించే వస్తువులపై నిఘా వర్గాలు ప్రత్యేక నిఘా పెట్టాయి.ఇదిలా ఉండగా.. 2019లో జరిగిన పుల్వామా అటాక్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలు గణనీయంగా తగ్గాయి. భారత్.. పాకిస్తాన్‌కు ఇచ్చిన Most Favoured Nation (MFN) హోదాను రద్దు చేసింది. అనంతరం పాకిస్తాన్ కూడా అనేక భారతీయ వస్తువుల దిగుమతులపై పరిమితులు విధించింది. అందువల్ల ‘Made in Pakistan’ అనే లేబుల్ ఉన్న వస్తువు భారత మార్కెట్లో కనిపిస్తే అక్రమంగా దేశంలోని వచ్చేనట్టే లెక్క. ఈ నేపథ్యంలో సరిహద్దు భద్రత, దిగుమతి నియంత్రణలు, అక్రమ సరఫరా గొలుసులపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. -
కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్ఫ్లూయెన్సర్
వరకట్న వేధింపులకు మరో యువతి బలైంది. లక్నోలో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ (మాన్సి) తన అత్తవారింట్లో స్థితిలో కన్నుమూసింది. అదనపు కట్నంగా కార్ ఇవ్వలేదనే అక్కసుతోనే మాన్సి భర్త సాగర్ రాజ్‌పుత్, అతని కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతదేహాన్ని ఉరితీశారని మాన్సి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.పోలీసులు నమోదు చేసిన ప్రథమ సమాచార నివేదిక (FIR) ప్రకారం, కాన్పూర్‌కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ మాన్సికి, 2024లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సాగర్ రాజ్‌పుత్‌తో వివాహం జరిగింది. వీరిద్దరూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండేవారు, రాజ్‌పుత్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 8 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.పెళ్లి సమయంలో మాన్సి కుటుంబం రూ. 7 లక్షల నగదు, ఇతర గృహోపకరణాలను ఇలా పలు రకాల బహుమతిలిచ్చింది అయినప్పటికీ, తక్కువ కట్నం తెచ్చిందంటూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవారని, కారు కావాలని ఒత్తిడి తెచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లైన దగ్గర్నుంచి వేధిస్తూనే ఉండేవారనీ, ఈ వేధింపుల గురించి, తెలిసి పుట్టింటి వారు వారిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు పలుమార్లు లక్నోకు వెళ్లి మాట్లాడి, సర్ది చెప్పి వచ్చేవారు. బాధితురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త సాగర్ రాజ్‌పుత్ సహా, మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. అతని తండ్రి రాజేష్, సోదరుడు అను, ఆడపడుచులు బర్ఖా, చాందిని, అత్త ఆశలపై వరకట్న మరణం కేసు నమోదైంది. ప్రస్తుతం రాజ్‌పుత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు.గత రెండు వారాలుగా జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచిన భోపాల్ మోడల్ ట్విషా శర్మ వరకట్న మరణం కేసులొ హై-ప్రొఫైల్ CBI దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే, ఈ వరకట్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. లక్నోలోనే జరిగిన ఇలాంటి మరో కేసులో, శ్వేతా సింగ్ అనే మహిళ మరణానికి సంబంధించి కూడా వరకట్న వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
అవసరమైతే ‘సింధూర్ 2.0’కు సిద్ధం
పుణే: ఒకవేళ ‘ఆపరేషన్ సింధూర్ 2.0’ అవసరం తలెత్తితే అందుకు భారత సైనిక దళాలు సర్వసన్నద్ధం ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టంచేశారు. భూతల, గగనతల, సముద్ర యుద్ధానికి అతీతంగా ఆధునిక బహుళ–రంగ యుద్ధం కోసం త్రివిధ దళాలు సమన్వయాన్ని పెంచుకుంటున్నాయని తెలిపారు. మహారాష్ట్రలోని పుణే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(డీఎన్ఏ)లో శనివారం పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణలు తాత్కాలికంగా నిలిచి పోయినప్పటికీ.. మళ్లీ మొదలైతే అందుకోసం త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. గత ఏడాది పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద వివరాలు, శిక్షణ కేంద్రాలను సైన్యం నేలమట్టం చేసింది. పలువురు ముష్కరులను హతమార్చింది. పాక్ యుద్ధ విమానాలను కూల్చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ 2.0 ఎప్పుడు మొదలైనా సరే వెంటనే రంగంలోకి దిగేలా మన సైన్యం అన్ని రకాల సన్నాహాలతో సిద్ధంగా ఉందన్నారు. యుద్ధక్షేత్రాలు పారదర్శకం భవిష్యత్తులో యుద్ధం కేవలం భూమి, సముద్రం, గగనతలానికి పరిమితం కాదని జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. అంతరిక్ష యుద్ధాలు, సైబర్ సైబర్ యుద్ధాలు జరుగుతాయన్నారు. యుద్ధ రీతులు నానాటికీ మారిపోతున్నాయని గుర్తుచేశారు. ఆధునిక యుద్ధక్షేత్రాలు పారదర్శకంగా మారాయని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రతి కదలిక అవతలివారికి వెంటనే తెలిసిపోతుందన్నారు. అందుకే సైనిక మోహరింపులు, బలగాల రక్షణ చర్యల విషయంలో సైనిక వ్యూహకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రమబద్ధమైన, కచ్చితమైన, ప్రయోజనాత్మకమైన ప్రతిస్పందనలో భారతదేశ సంకల్పాన్ని, సాయుధ దళాల సామర్థ్యాన్ని ఆపరేషన్ సింధూర్ చాటిచెప్పిందని ఉద్ఘాటించారు. సమగ్ర ప్రణాళిక, రియల్ టైమ్ నిఘా, కచ్చితమైన లక్ష్య నిర్దేశం, పటిష్టమైన వాయు రక్షణ, సురక్షిత సమాచార మార్పిడి, వివిధ రంగాల మధ్య సమన్వయం ప్రాముఖ్యతను ఈ ఆపరేషన్ నొక్కిచెప్పిందని వివరించారు. భారత సైన్యం ఆధునీకరణ మార్గంలో ముందుకు సాగుతోందన్నారు. ‘భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శక్తి’గా మనం రూపాంతరం చెందుతున్నామని, ఇందులో యువతరం పాత్ర కీలకమని స్పష్టంచేశారు. -
అద్భుత చికిత్సల పేరుతో మోసం.. పతంజలి ఉత్పత్తులు సీజ్
ముంబై: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వ్యక్తులు, సంస్థలపై ఇకపై కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (FDA) స్పష్టం చేసింది. తప్పుడు వైద్య ప్రకటనలు, అద్భుత చికిత్సల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.73 లక్షల మందులను అధికారులు స్వాధీనం చేశారు. తనిఖీల్లో భాగంగా 33 మంది అరెస్ట్ చేసి 27 సంస్థలను సీజ్ చేశారు. కాగా, పతంజలి బ్రాండ్‌తో విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తులు కూడా ఈ దాడుల్లో పట్టుబడటం గమనార్హం.ఈ సోదాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలో ఇటీవల ఎఫ్‌డీఏ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తుకారం ముండే ప్రజారోగ్య పరిరక్షణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మే 25న బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి, చట్టవిరుద్ధ ఔషధ తయారీ, విక్రయాలు, ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆ ఆదేశాల మేరకు మే 29న మహారాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి భారీ తనిఖీలు నిర్వహించారు. ముంబై, కొంకణ్, పూణే, నాసిక్, అమరావతి, నాగపూర్, శంభాజీనగర్ ప్రాంతాల్లో డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్) యాక్ట్-1954ను ఉల్లంఘిస్తున్న సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపారు.నివారణ పేరుతో మోసంపలు సంస్థలు తమ ఆయుర్వేద, హెర్బల్ ఔషధాలను ప్రచారం చేస్తూ క్యాన్సర్, మధుమేహం, లైంగిక సమస్యలు, స్థూలకాయం, వంధ్యత్వం వంటి తీవ్రమైన వ్యాధులను పూర్తిగా నయం చేస్తామని ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు "100 శాతం ఫలితం", "శస్త్రచికిత్స అవసరం లేదు", "కొద్ది రోజుల్లో వ్యాధి మాయం" వంటి వాదనలతో ప్రజలను ఆకర్షిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటి ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, సరైన వైద్య చికిత్సకు దూరం చేసే ప్రమాదం ఉందని ఎఫ్‌డీఏ పేర్కొంది. ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్, స్థానిక టీవీ ఛానళ్లు, పత్రికలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ఈ ప్రచారం సాగుతున్నట్లు గుర్తించారు.భారీగా స్వాధీనం..రాష్ట్రవ్యాప్తంగా అధికారులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో మొత్తం రూ.73.24 లక్షల విలువైన ఆయుర్వేద, అల్లోపతి ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు.కొంకణ్ విభాగంలో – రూ.18.58 లక్షలుపుణే విభాగంలో – రూ.14.68 లక్షలునాగ్పూర్ విభాగంలో – రూ.7.26 లక్షలునాసిక్ విభాగంలో – రూ.7.10 లక్షలుగ్రేటర్ ముంబైలో – రూ.1.85 లక్షల మందులుఅదనంగా రూ.21.83 లక్షల విలువైన మిస్ బ్రాండెడ్ అల్లోపతి మందులు కూడా స్వాధీనం చేశారు.పతంజలి ఉత్పత్తులపైనా చర్యలుహరిద్వార్కు చెందిన దివ్యా ఫార్మసీ తయారు చేసిన, పతాంజలి బ్రాండ్‌తో విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తులు కూడా ఈ దాడుల్లో పట్టుబడ్డాయి. తీవ్రమైన వ్యాధులకు హామీ చికిత్స ఇస్తామని ప్రచారం చేసిన నేపథ్యంలో వాటిపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 60 రకాల ఉత్పత్తులను కలిపి రూ.28.78 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేశారు.కఠిన హెచ్చరికఈ సందర్భంగా కమిషనర్ తుకారం ముండే మాట్లాడుతూ..‘ప్రజల ఆరోగ్యంతో ఆటలాడేవారిని వదిలిపెట్టం. తప్పుడు ప్రకటనలు, అక్రమ ఔషధాలు, కల్తీ ఆహారంపై మరింత కఠిన చర్యలు తీసుకుంటాం’ అనిహెచ్చరించారు. మొత్తంగా కమిషనర్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దాడులు కల్తీ ఆహారం, తప్పుడు వైద్య ప్రకటనల మాఫియాకు గట్టి హెచ్చరికగా మారాయి. -
పుణేలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి
ముంబై: పుణేలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందారు. శివారు ప్రాంతమైన పింప్రి చించ్వాడ్లో ఈ ఘటన జరిగింది. పింప్రి చించ్వాడ్లోని వాన్వాడి ప్రాంతంలో అక్రమ మద్యం సేవించి గురువారం ఎనిమిది మంది మరణించగా.. ఇవాళ (శుక్రవారం) ఉదయం మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 11కి చేరింది. మద్యం సేవించిన తర్వాత బాధితులు స్పృహ తప్పి పడిపోయారని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వారు మరణించినట్లు ప్రకటించారు.ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని స్థానిక ఎన్సీపీ నేత యోగేష్ బహాల్ డిమాండ్ చేశారు. పోలీసులు, అధికారుల అండదండలతోనే అక్రమ, కల్తీ మద్యం బహిరంగంగా విక్రయిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. పోలీసుల కళ్ల ముందే కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారని.,. చర్యలు తీసుకోవాల్సింది పోయి.. 11 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దందాలో వారు కూడా భాగమయ్యారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఎండతీవ్రత, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ మరణాలు సంభవించి ఉండవచ్చని పేర్కొంటూ... ఈ 11 మరణాలు కల్తీ మద్యం వల్లే జరిగాయని ధృవీకరించడానికి పోలీసులు నిరాకరించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన ఆదేశించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం నెట్‌వర్క్‌ను అధికారులు గుర్తించారని.. దీని వెనుక ఎంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. -
పుణేలో అమానవీయ ఘటన.. ప్రియురాలిపై యువకుడి దాడి..
-
ఇద్దర్ని చంపి సంబరాలా? వీడియో వైరల్, పెల్లుబుకిన ఆగ్రహం
పూణే పోర్షే (PunePorsche) కారు ప్రమాదం, ఇద్దరు ఐటీ ఉద్యోగులు దుర్మరణం పాలైన కేసు గుర్తుందా? ఈ కేసులో నిందితులకు ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో నిందితుడైన మైనర్ బాలుడి తండ్రి, వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ కుటుంబ సభ్యులు ఓ స్థానిక రెస్టారెంట్లో జరుపుకున్న సంబరాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీనిపై బాధిత కుటుంబాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల దండలు, డ్యాన్స్‌లతో సంబరాలుసోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియోలో అగర్వాల్ కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు కలిసి నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ, కేరింతలు కొడుతూ కనిపించారు. మార్చి 10న సుప్రీంకోర్టు విశాల్ అగర్వాల్‌కు బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో 1977 నాటి ప్రసిద్ధ బాలీవుడ్ పాట “బంబాయి సే ఆయా మేరా దోస్త్, దోస్త్ కో సలామ్ కరో” ప్లే అవుతుండగా కుటుంబం మొత్తం డ్యాన్స్ చేసింది.విశాల్ అగర్వాల్ మెడలో గులాబీ రంగు పూల దండతో పాటు కరెన్సీ నోట్లతో చేసిన పెద్ద దండ కూడా ఉంది. అతని భార్య కూడా నోట్ల దండ వేసుకుని డ్యాన్స్ చేస్తూ కనిపించింది. వేడుకల సమయంలో విశాల్ అగర్వాల్‌ను అతని కుమారుడు, మరో వ్యక్తి భుజాలపైకి ఎత్తుకోగా, చుట్టూ ఉన్న అతిథులు చప్పట్లు, కేరింతలు కట్టారు. 2 years after the Pune Porsche incident that killed techies Aneesh & Ashwini, here’s how the family responsible for the deaths is celebrating. ALL accused, including the shameless Agarwal family, out on bail.Zero remorse. Zero guilt.Via @ndtvindia pic.twitter.com/Qv2pndDukw— Shiv Aroor (@ShivAroor) May 27, 2026నెటిజన్ల ఆగ్రహంఈ వీడియో సోషల్ మీడియాలో వ్యాపించడంతో నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రాణాలు తీసిన ఇంతటి తీవ్రమైన కేసులో, జైలు నుండి బెయిల్‌పై వస్తూనే ఇలా బాధ్యతారాహిత్యంగా సంబరాలు చేసుకోవడంపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.వీడియో వైరల్ కావడంపై మృతులలో ఒకరైన అశ్విని తండ్రి సురేష్ కోష్టా ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఒకరికి శిక్ష విధిస్తే, సుప్రీంకోర్టు వారిని వదిలేస్తుంది. ఇది నేరాలను ప్రోత్సహిస్తుంది. ముస్లిం దేశాలలో ఉన్నటువంటి 'రక్తానికి రక్తం' అనే చట్టాలు భారతదేశంలోకి తీసుకువచ్చే వరకు పరిస్థితి బాగుపడదు అంటూ మండిపడ్డారు. ఇద్దరిని చంపి, ఆ తర్వాత సంబరాలు చేసుకోవడం వారికి పారిపాటేమోఅన్నారు. చట్టాల పట్ల భయలేదని పెదవి విరిచారు. చట్టం కఠినంగా లేకపోతే ఎలా ప్రశ్నించారు. నిందితుడి బెయిల్‌ను రద్దు చేసి, అతని తల్లిదండ్రులను జైలుకు పంపాలి. ఒకవేళ ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు వస్తే, వారికి బెయిల్ మంజూరు చేయకూడదని వ్యాఖ్యానించారు.#WATCH | 2024 Pune Porsche crash case | Jabalpur, MP: On bail to the juvenile accused and viral video of celebration by his family, Suresh Koshta, father of Ashwini - one of the deceased, says, "It must be a practice in their society to kill two people and then celebrate...They… pic.twitter.com/TP2te8YLja— ANI (@ANI) May 27, 2026కేసు నేపథ్యం ఏమిటి?2024 మే 19న పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో లగ్జరీ కారు పోర్షే నడుపుతున్న ఒక మైనర్ బాలుడు మితిమీరిన వేగంగా అనీష్ అవధియా, అశ్విని కోస్టా అనే ఇద్దరు ఐటీ ఉద్యోగులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆధారాల ట్యాంపరింగ్ ఆరోపణలుతో ప్రమాదానికి తానే కారణమని ఈ అలాగే ఈ నేరం ఒప్పుకోవాలని తమ కుటుంబ డ్రైవర్‌పై విశాల్ అగర్వాల్ ఒత్తిడి తెచ్చినట్లు కూడా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ కేసులో విశాల్ అగర్వాల్ దాదాపు 22 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడని సుప్రీంకోర్టు ధర్మాసనం (జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్) పేర్కొంది. అతనికి బెయిల్ పొందే అర్హత ఉందని భావించిన కోర్టు, కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్క సాక్షినీ సంప్రదించడానికి లేదా ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: డీకే ప్రమాణ స్వీకారం ఎపుడు? ఉత్కంఠగా బ్రేక్‌ఫాస్ట్ భేటీ -
‘నీట్’ మరో మాస్టర్‌మైండ్ మనీషా అరెస్ట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్–యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతంలో మరో పెద్ద తలకాయను పోలీసులు అరెస్ట్‌చేశారు. జీవశాస్త్ర అధ్యాపకురాలిగా కొనసాగుతూ నీట్–యూజీకి సంబంధించిన నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ(ఎన్టీఏ) వారి పేపర్ సెట్టింట్ కమిటీలో సభ్యురాలిగా ఉన్న పుణెకు చెందిన మనీషా గురునాథ్ మంధరేను సీబీఐ అధికారులు శనివారం అరెస్ట్‌చేశారు. ఇప్పటికే అరెస్టయిన మరో మాస్టర్‌మైండ్, రసాయనశాస్త్ర అధ్యాపకుడు పీవీ కులకర్ణిని లోతుగా ప్రశ్నించడంతో ఈమె పేరు బయటపెట్టాడని పోలీసు అధికారులు తెలిపారు. బయాలజీ పేపర్ లీకేజీకి ఈమె ప్రధాన కారకురాలు అని సీబీఐ పేర్కొంది. మనీషాను ఢిల్లీకి తీసుకొచ్చి పోలీస్ ప్రధాన కార్యాలయంలో విచారించి, ఆమె నేరాన్ని నిర్ధారించుకున్నాక అరెస్ట్‌చేశారు. నీట్–యూజీ పరీక్ష ప్రక్రియలో ఈమె భాగస్వామిగా ఉన్నారు. ఈమెను సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా గతంలో ఎన్టీఏ నియమించింది. పేపర్ సెట్టింగ్ కమిటీలో ఉండటంతో ఈమె బాటనీ, జువాలజీ ప్రశ్నపత్రాలను నేరుగా పరిశీలించే అధికారం పొందారు. ఆ అధికారాన్ని దురి్వనియోగంచేసినట్లు తేలింది. ఈ ప్రశ్నలను తనకు లక్షల రూపాయలు చెల్లించిన కొద్దిమంది నీట్–యూజీ అభ్యర్థులకు చేరవేసినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఎవరీ మనీషా? మహారాష్ట్రకు చెందిన మనీషా వృత్తిరీత్యా బాటనీ లెక్చరర్. పుణెలోని మోడ్రన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, కామర్స్ కాలేజీలో పనిచేస్తున్నారు. ఐదారేళ్లుగా ఎన్టీఏలో పనిచేస్తున్నారు. ఈ ఏడాది నీట్–యూజీ ప్రవేశపరీక్షకు సంబంధించి బాటనీ, జువాలజీ విభాగంలో రావాల్సిన ప్రశ్నల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నారు. ఆయా ప్రశ్నపత్రాల తుదిరూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఇటు జాతీయస్థాయి సంస్థలో కీలకభూమిక పోషిస్తూనే పుణె కాలేజీతో సత్సంబంధాలు కొనసాగించడం గమనార్హం. రహస్యంగా ఉంచాల్సిన క్వశ్చన్ పేపర్లను తరచిచూసే సర్వాధికారం ఉండటంతో వాటిని ఈమె తస్కరించారు. ఈ పరీక్ష రాయబోయే అభ్యర్థుల జాబితాను వాఘ్మరే అనే మరో నిందితుని ద్వారా తెప్పించుకుని వాళ్లకు ప్రశ్నలు, వాటి ఆప్షన్లను పుణెలోని సొంతింట్లో ప్రత్యేక కోచింగ్ క్లాసులపేరిట అందజేశారు. వాఘ్మరేను నాలుగు రోజుల క్రితమే సీబీఐ అరెస్ట్చేయడం తెల్సిందే. ఈ బాటనీ, జువాలజీ ప్రశ్నలు, వాటి ఆప్షన్లు, జవాబులు అచ్చుగుద్దినట్లుగా 2026 నీట్–యూజీ ఎంట్రన్స్ బయాలజీ పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో సరిపోలాయని సీబీఐ వెల్లడించింది. పేపర్ సెట్టింగ్ కమిటీలో అంతర్గత వ్యక్తులు మొదలు మధ్యవర్తులు, అభ్యర్థుల దాకా అన్ని స్థాయిలో పకడ్బందీ నెట్వర్క్ ద్వారా ప్రశ్నపత్రాలను లీక్చేశారు. కులకర్ణి, వాఘ్మరేలను 10 రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ శనివారం ఢిల్లీలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తుర్వులిచ్చింది. వేట వేగవంతం ఈ ఉదంతంలో ఇంకెంత మంది సూత్రధారులు, పాత్రధారులు దాక్కున్నారనేది కనిపెట్టి సంకెళ్లు వేసేందుకు సీబీఐ విస్తృతస్థాయిలో దర్యాప్తును వేగవంతంచేసింది. గత 24 గంటల్లో ఆరు వేర్వేరు ప్రాంతాల్లో చాలా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లను సీజ్చేసింది. డబ్బులు ఆన్లైన్లో లావాదేవీలు జరిగిన కొన్ని బ్యాంక్ ఖాతాల వివరాలు, నేరపూరిత డాక్యుమెంట్లను సేకరించింది. వీటన్నింటీ మధ్య ఉన్న సంబంధాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. వాఘ్మరీ ద్వారానే ప్రశ్నలను కులకర్ణి ఇతర పరీక్షార్థులకు చేరవేసినట్లు గుర్తించారు. ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణె, అహల్యానగర్‌లలో మొత్తం 9 మందిని అరెస్ట్‌చేశారు. వాళ్ల జాబితా.. 1. మనీషా గురునాథ్(బాటనీ లెక్చరర్) 2. పీవీ కులకర్ణి( రసాయనశాస్త్ర అధ్యాపకుడు) 3. వాఘ్మరే(విద్యార్థులను పోగుచేసిన వ్యక్తి) 4. ధనంజయ్ లోఖండా(అహల్యానగర్వాసి) 5. శుభం ఖైర్నర్( నాసిక్ వాసి) 6. మంగీ లాల్ బివాల్( జైపూర్‌వాసి) 7. వికాస్ బిలాల్( జైపూర్‌వాసి) 8. దినేశ్ బిలాల్( జైపూర్‌వాసి) 9. యశ్ యాదవ్(గురుగ్రామ్వాసి) -
నీట్ పేపర్ లీకేజీ కేసులో కింగ్‌పిన్ అరెస్ట్
న్యూఢిల్లీ: నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ వెనుక మాస్టర్ మైండ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నీట్ పేపర్ తయారీలో కీలక పాత్ర పోషించిన పూణేకి చెందిన ప్రొఫెసర్ పీవీ కులకర్ణీని అదుపులోకి తీసుకున్నారు. తన ఇంట్లోనే ఇనిస్టిట్యూట్ నడుపుతున్న పీవీ కులకర్ణి .. ఎన్టీఏ ఏర్పాటు చేసిన క్వశ్చన్ పేపర్ కమిటీలో సబ్జెట్ ఎక్స్‌పర్ట్‌గా ఉన్నారు. నీట్ ఎగ్జామ్‌కు ముందే క్వశ్చన్ పేపర్ ఆయనకు అందింది. ఆ క్వశ్చన్ పేపర్‌ను తాను ఇంట్లో నడిపే ఇనిస్ట్యూట్ విద్యార్థికి లీక్ చేశాడు. లీకైన ప్రశ్నపత్రాలు, వాటి సమాధానాలను కాపీ చేసి గుర్తుంచుకునేలా తన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. ఈ భారీ పేపర్ లీక్ నెట్‌వర్క్‌కు సంబంధించి సీబీఐ ఇప్పటివరకు మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది.మరోవైపు నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీతో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తుమని కేంద్రం ప్రకటించింది. పేపర్ లీకేజీ దుమారం తర్వాత ఈనెల 3వ తేదీనాటి పరీక్ష రద్దయింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ అయ్యారు. -
టిక్.. టిక్.. టిక్.. సినీ ఫక్కీలో టైమ్ బాంబు నిర్వీర్యం
బాంబు ఉందని సమాచారం అందుకోవడం.. ముసుగులేసుకుని స్క్వాడ్లు అక్కడికి చేరుకోవడం.. ఏ వైర్ తెంపాలో అనే ఉత్కంఠ చివరిదాకా.. ఇలాంటి సీన్లు సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అయితే.. మహారాష్ట్ర పుణేలో ఈ తరహాలోనే ఓ ఘటన జరిగింది. ఓ ఆస్పత్రి ఆవరణలో లైవ్ బాంబు బయటపడడం తీవ్ర కలకలం రేపింది.పుణే సిటీలోని హడప్సర్ కామధేను ఎస్టేట్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం బాంబు బయటపడింది. తొలుత అనుమానాస్పద వస్తువుగా భావించినప్పటికీ.. ఆ తర్వాత అది టైమర్ బాంబ్ అని తేలడంతో అందరి గుండెలు గుభేల్మన్నాయ్. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), అగ్నిమాపక సిబ్బంది, డాగ్ స్క్వాడ్‌ను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆసుపత్రి పరిసరాలను ఖాళీ చేయించి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.ఈ పరిణామాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే.. పరిశీలనలో అది 7 గంటల తర్వాత పేలేలా టైమర్‌తో అమర్చిన లైవ్ బాంబు అని తేలింది. బీడీడీఎస్ సిబ్బంది బాంబును సురక్షిత ప్రదేశానికి తరలించి.. ఓపెన్ ఫీల్డ్‌లో నిర్వీర్యం చేశారు. బాంబులో తక్కువ శక్తి గల పేలుడు పదార్థం ఉందని నిర్ధారించారు."నగరంలో తక్కువ శక్తి గల IED (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్) కనుగొనబడింది. దానిని నిర్వీర్యం చేశాం. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది." అని పుణే పోలీస్ కమిషనర్ నితేష్ కుమార్ తెలిపారు. క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఎగతాళి : 9 ఏళ్ల కూతుర్నే ..!
పుణె జిల్లాలోని దౌండ్‌లో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కేవలం స్కూల్ మార్కుల విషయంలో వచ్చిన గొడవ కారణంగా తొమ్మిదేళ్ల బాలికను ఆమె తండ్రే కిరాతకంగా హత్య చేసిన ఉదంతం ప్రకంపనలు రేపింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిందితుడు శాంతారామ్ దుర్యోధన్ చవాన్ కుమార్తె అనామిక (9 ఏళ్లు). ఇటీవల స్కూల్ ఫలితాలు విడుదలయ్యాయి. అందులో అనామిక తమ్ముడు (సవతి తల్లి కుమారుడు) సంస్కార్‌కు ఫస్ట్ ర్యాంక్ రాగా, అనామికకు రెండో ర్యాంక్ వచ్చింది. దీనిపై ఇంట్లో వాళ్లంతా ఆమెను ఎగతాళి చేశారు. ఆ అవమానంతో అనామిక తన తమ్ముడి మార్కుల జాబితాను మార్చేసింది. తద్వారా తనదే ఫస్ట్ ర్యాంక్ అని నిరూపించుకోవాలని చేసింది. అంతే .. ఇది తెలిసి తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు. తెలిసీ తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పులను అర్థం చేసుకొని, అవగాహన కల్పించాల్సింది పోయి, విచక్షణ మరిచి తండ్రి శాంతారామ్, చెక్క కోసే యంత్రం (wood-cutting machine)తో చిన్నారిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను రూపుమాపేందుకు, మృతదేహాన్ని వస్త్రంతో చుట్టి నిప్పంటించాడు.దీనిపై పోలీసులకు సమాచారం అందడంతోవారు ఘటనా స్థలానికి చేరుకుని, పాక్షికంగా కాలిపోయిన అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. మృత దేహాన్ని డీఎన్ఏ పరీక్షలు, తదుపరి విచారణ నిమిత్తం పుణేలోని సాసూన్ ఆసుపత్రికి తరలించారు.ప్రధాన నిందితుడు తండ్రి శాంతారామ్ చవాన్‌తో పాటు, అతనితో కలిసి ఉంటున్న సవతి తల్లి చింకీ భోంస్లేను కూడా అరెస్ట్ చేశారు. ఈ నేరం గురించి తెలిసి కూడా అధికారులకు సమాచారం ఇవ్వనందుకు ఆమెపై కూడా కేసు నమోదైంది. చిన్నారి మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్షల కోసం పుణెలోని ససూన్ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు కొన సాగుతోంది.మరోవైపు వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనల నేపత్యంలో పూణేలో పిల్లల భద్రతపై ఆందోళన తలెత్తింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి విషాదాలను నివారించేందుకు కఠినమైన చట్టాల అమలు, జవాబుదారీతనం, తక్షణ చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.ఇదీ చదవండి: కారూ, గోల్డూ లేదు, కేసులు మాత్రం.. ఎవరీయన? -
పట్టాలు తప్పిన వందే భారత్ రైలు
ముంబై-సోలాపూర్ వందే భారత్ రైలు పుణే స్టేషన్లోకి ప్రవేశిస్తున్న సమయంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం (ఏప్రిల్ 27) రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో స్టేషన్లోకి ప్రవేశించే వేళ నాల్గో బోగీకి చెందిన ఒక ట్రాలీ డైమండ్ క్రాసింగ్ వద్ద పట్టాలు తప్పిందని సెంట్రల్ రైల్వే తెలిపింది.ఈ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి ప్రారంభమై మహారాష్ట్రలోని సోలాపూర్ దిశగా వెళ్తోంది. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. సాధారణ ప్రమాణాలకు అనుగుణంగా లేని డైమండ్ క్రాసింగ్ వద్ద జరిగింది. పుణే స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా దీన్ని అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.అధికారులు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు వారిని మరొక రేక్కి మార్చే ఏర్పాట్లు చేసినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారత్‌లో స్వదేశీగా అభివృద్ధి చేసిన మొదటి సెమీ హైస్పీడ్ రైలు. 2019లో భారతీయ రైల్వే దీన్ని ప్రారంభించింది. ఇది సంప్రదాయ రైళ్లతో పోలిస్తే వేగంగా, సౌకర్యవంతంగా, సాంకేతికంగా ఆధునికమైనది. -
11 రోజుల్లో పెట్టుబడి రెట్టింపు : వైద్యుడికి దిమ్మదిరిగింది!
సాక్షి, పుణే : దురాశ దుఃఖానికి చేటు అన్నట్టు ఒక 75 ఏళ్ల పుణే వైద్యుడు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే తన డబ్బు 11 రోజుల్లో రెట్టింపు అవుతుందన్న అత్యాశకు పోయి ఒకటీ రెండూ కాదు, ఏకంగా రూ. 12 కోట్లు పోగొట్టుకున్నాడు.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెడివతే భారీ లాభాలొస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మ బలికారు. తమ ద్వారా పెట్టుబడి పెడితే, కేవలం 11 రోజుల్లోనే ఏకంగా రూ. 54 కోట్ల వరకు రాబడి వస్తుందని బాధిత వైద్యుడిని నమ్మించారు. ఆయన ఆసక్తి చూపిన తర్వాత, ఆ సైబర్ మోసగాళ్లు ఆయనను "VIP Stock 24" అనే ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. ఈ గ్రూప్ ద్వారా, నిందితులు ఎంతో ఆకర్షణీయంగా, లాభదాయకంగా కనిపించే పెట్టుబడి పథకాలను పంచుకున్నారు. దీంతో మోసపోయిన వైద్యుడు తక్కువ సమయంలోనే భారీ లాభాలు వస్తాయన్న ఆశతో, బాధితుడు అనేక వారాల పాటు డబ్బును బదిలీ చేస్తూనే వచ్చారు. అలా 12.31 కోట్లకు దోచేశారు కేటుగాళ్లు.అసలు ఏం జరిగింది?ఈ ఏడాది జనవరిలో బాధితుడికి ఒక తెలియని నంబర్ నుండి స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయనే సందేశం వచ్చింది. దీనికి వైద్యుడు ఆసక్తి చూపడంతో, నిందితులు ఆయన్ని "VIP Stock 24" అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఒక సంస్థ పేరుతో ఉన్న ఒక నకిలీ ట్రేడింగ్ యాప్‌ను ఆయన చేత డౌన్లోడ్ చేయించారు. ఆ యాప్‌లో ఆయన పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు వస్తున్నట్లు తప్పుడు గణాంకాలను చూపించారు. మరి కొంతమందికి లాభాలు వచ్చినట్టుగా చూపించారు. దీంతో మార్చి 7 నుండి మార్చి 18 మధ్య కేవలం 8 లావాదేవీల ద్వారా డాక్టర్ 12 కోట్లకు పైగా నిందితులు చెప్పిన 8 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. సుమారు మూడు నెలల పాటు లాభాలొస్తాయని ఆశతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూనే వచ్చారు. ఇదీ చదవండి: వ్యాపారవేత్త హత్య: దుబాయ్‌లో భారతీయ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్బెదిరింపులు ఒకానొక దశలో డాక్టర్ మరిన్ని నిధులు పంపడానికి నిరాకరించగా, నిందితులు ఆయన ఆస్తులను సీజ్ చేస్తామని బెదిరించారు. దీంతో భయపడి ఆయన మరిన్ని నిధులు బదిలీ చేశారు. తన డబ్బు తిరిగి రాకపోవడంతో పాటు, ఇంకా డబ్బు కావాలని వారు వేధించడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.ఇదీ చదవండి: కాంగ్రెస్ విత్ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే! నోట్ : స్టాక్మార్కెట్లో పెట్టుబడి అంటే చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే తగినంత అవగాహన నిపుణుల సలహాలు అవసరం. అతి తక్కువ కాలంలో భారీ లాభాలు వస్తాయని చెప్పే స్కీములను నమ్మి పోసపోవద్దు. తెలియని వ్యక్తులు పంపే వాట్సాప్ లింకులు, ట్రేడింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.సెబీ (SEBI) గుర్తింపు లేని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం అని గురించాలి. -
'మిస్ ఇండియా ఎర్త్' కిడ్నాప్.. భర్తపై ఫిర్యాదు
మిస్ ఇండియా ఎర్త్ -2019 విజేతగా చెప్పుకుంటున్న సయాలీ సుర్వే, ఆమె నలుగురు పిల్లలు అదృశ్యమయ్యారు. పూణేకు చెందిన ఈమె, 2019లో వివాహం చేసుకున్న తర్వాత ఇస్లాంలోకి మారి ‘అలీజా’గా పేరు మార్చుకున్నారు. అయితే, పూణేలోని చించ్వాడ్లో ఉంటున్న ఆమె కనిపించడం లేదు. తన భర్త ఆతీఫ్ వేధించాడని, బలవంతంగా మతం మార్చాడని ఆరోపిస్తూ ఇటీవల హిందూ మతంలోకి తిరిగి మారారు. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే ఆమె కనిపించకుండా పోవడంతో చర్చనీయాంశంగా మారింది. పూణే పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. భర్త, అత్తింటివారే సయాలీ సర్వేని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు.2019లో మీరా-భయందర్‌కు చెందిన వ్యాపారవేత్త ఆతీఫ్ టాసేను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత, ఆమె ఇస్లాం మతంలోకి మారి, తన పేరును అతీజా టాసేగా మార్చుకుంది. గొడవల కారణంగా వారి వివాహ బంధం చాలా త్వరగా ముగిసిపోయింది. ఆతీఫ్ టాసేను పెళ్లి చేసుకోవడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని ఆమె గతంలో ఆరోపించారు. అతను పెట్టిన శారీరక హింసను కేవలం తన పిల్లల కోసం భరించానని పేర్కొంది. తనతో దూరం అయిన తర్వాత ఆమె తిరిగి హిందూ మతంలోకి చేరి తన పేరును ఆద్య సుర్వేగా మార్చుకుంది. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే ఆమె కిడ్నాప్ కావడం చర్చనీయాంశంగా మారింది.(గమనిక: కొందరు నివేదికల ప్రకారం, 2019లో అధికారిక 'మిస్ ఎర్త్ ఇండియా' విజేతగా డాక్టర్ తేజస్విని మనోజ్ఞ ఉన్నారు. ) -
5 నెలల్లో మూడోది : మెరైన్ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం
క్రీడా మౌలిక సదుపాయాల నిర్వహణలో లోపాలకు సంబంధించిన మరో సంఘటన కలకలం రేపుతోంది. పూణేలోని ఒక మెరైన్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో విషాదం చోటుచేసుకుంది. బాస్కెట్‌బాల్ బోర్డు ఫ్రేమ్ మీద పడి 20 ఏళ్ల క్యాడెట్ తీవ్ర గాయాలపాలై మరణించాడు.ఘటన వివరాలుపూణేలోని టోలానీ మెరైన్ ఇన్స్టిట్యూట్లో సెకండ్ ఇయర్ చదువుతున్న విశాల్ వర్మ, ఆదివారం ఉదయం వ్యాయామం కోసం క్యాంపస్‌లోని బాస్కెట్‌బాల్ కోర్టుకు వెళ్లాడు. బాస్కెట్‌బాల్ హూప్‌ను పట్టుకుని పుల్-అప్స్ (Pull-ups) తీస్తుండగా, ఒక్కసారిగా ఆ ఇనుప ఫ్రేమ్ మొత్తం అతనిపై కుప్ప కూలిపోయింది.ఈ ప్రమాదంలో విశాల్ తలకు బలమైన గాయాలయ్యాయి. తోటి విద్యార్థులు మరియు సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ భారీగా రక్తస్రావం కావడంతో,అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.విశాల్ ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందినవాడు. 2024లో ఈ ఇన్స్టిట్యూట్లో చేరాడు. అతని బి.టెక్ కోర్సు 2028లో పూర్తి కావాల్సి ఉంది.ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజీత్ కనుంగో ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. అసలు ఆ ఫ్రేమ్ ఎలా కూలిపోయింది అనే దానిపై మేము విచారణ జరుపుతాము" అని ఆయన తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇనుప ఫ్రేమ్ తుప్పు పట్టిపోయిందా? లేదా అమర్చడంలో ఏవైనా లోపాలు ఉన్నాయా? అనే కోణంలో ఇన్స్పెక్టర్ సంతోష్ పాటిల్ విచారణ జరుపుతున్నారు.ఇదీ చదవండి : 20 ఏళ్లలో తొలిసారి : ఇరాన్ దెబ్బ , ట్రంప్‌నకు భారీ షాక్నిర్వహణలో లోపాలు యువ క్రీడాకారుల ప్రాణాలను బలి అవుతున్నారు. గత ఐదు నెలల్లోనే ఇటువంటి ఘటనలు జరగడం ఇది మూడవసారి. ఇటీవల హర్యానాలోని రోహ్తక్లో 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు హార్దిక్ రాఠీ కూడా ఇలాగే బాస్కెట్‌బాల్ పోల్ మీద పడటంతో మరణించాడు. అలాగే హర్యానాలోని బహదూర్గఢ్ జిల్లాలో 15 ఏళ్ల బాలుడు కూడా ఇటువంటి ప్రమాదానికే బలైపోయిన సంగతి విదితమే. విషాదంగా మారుతున్న వరుస ప్రమాదాలు దేశంలోని విద్యాసంస్థలు మరియు క్రీడా ప్రాంగణాల్లోని పరికరాల భద్రత ,నిర్వహణపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇదీ చదవండి: ఇరాన్ దాడిలో ఎఫ్-35 ఫైటర్ తుస్సు? అసలేంటీ దీని సామర్థ్యం? -
అయిననూ... పొయ్యి వెలిగించవలే!
యుద్ధం ఆగడం లేదు. మన ఇంటి గ్యాస్ కష్టాలు, ఆందోళనలు ఆగడం లేదు. ఈ సంక్షోభ కాలంలో సామాన్యుల నుంచి శాస్త్రవేత్తల వరకు ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల గురించి ఆలోచిస్తున్నారు. కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. తాజా విషయానికి వస్తే... పుణెలోని సిఎస్ఐఆర్–నేషనల్ కెమికల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా డైమిథైల్ ఈథర్ (డీఎంయీ) ని తయారు చేయడానికి స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేశారు. కార్బన్ డయాక్సైడ్ను వంట ఇంధనమైన డైమిథైల్ ఈథర్‌గా మార్చే సాంకేతికతను బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు...పుణెలోని సిఎస్ఐఆర్–నేషనల్ కెమికల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా డీఎంయీని తయారు చేయడానికి స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది దేశం ఎల్పీజీ దిగుమతిపై ఆధారపడడాన్ని తగ్గించడంతోపాటు మన దేశ ఇంధన స్వయం సమృద్ధికి ఉపకరిస్తుంది. అంతేకాదు, తక్కువ ఖర్చుతో కూడిన ఉత్ప్రేరకాన్ని (కెటలిస్ట్) ఉపయోగించి మిథనాల్‌ను డైమిథైల్ ఈథర్‌గా మారుస్తుంది. పరిశోధన బృందానికి తిరుమలైస్వామి రాజా నాయకత్వం వహించారు.స్వచ్ఛమైన ఇంధనంసంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే... డైమిథైల్ ఈథర్(డిఎంఈ) చాలా తక్కువ పరిమాణంలో మసి, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, కణ పదార్థాలను విడుదల చేస్తుంది. అందుకే దీనిని స్వచ్ఛమైన ఇంధనంగా పరిగణిస్తారు. దీంతో పాటు ఇది ఎల్పీజీకి సమానమైన వేడిమిని అందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వినియోగానికి సంబంధించి ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్’ ఇప్పటికే నియమాలను నిర్దేశించింది.గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం ఎల్పీజీలో 20 శాతం వరకు డిఎంఈని కలపవచ్చు. ఎల్పీజీ మౌలిక సదుపాయాలలో ఎలాంటి మార్పులు చేయకుండానే ఎల్పీజీలో 8 శాతం వరకు డిఎంఈ కలపవచ్చు. వంటగది ఏర్పాట్లు మార్చకుండానే ఈ మిశ్రమ ఇంథనాన్ని ఉపయోగించవచ్చు.ఈ ఇంధనంతో ఎంతో ఆదా!మన దేశం 2024లో దాదాపు 21 మిలియన్ టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకుంది. కేవలం 8 శాతాన్ని డిఎంఈతో భర్తీ చేయడం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు ’9,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. వంట ఇంధనం, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకే కాకుండా ఏరోసోల్ ఉత్పత్తులలో ప్రోపెల్లెంట్గా పనిచేస్తోంది డిఎంఈ. తమ సాంకేతికతను రోజువారీ వినియోగానికి మరింత చేరువ చేయడానికి సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు పేటెంట్ పొందిన ఒక బర్నర్ నమూనాని కూడా రూపొందించారు.ఈ బర్నర్ 100 శాతం ఎల్పీజీ నుండి 100 శాతం డిఎంఈ వరకు, అలాగే ఈ రెండింటి మధ్య ఏ మిశ్రమంతోనైనా ఫ్లెక్సిబుల్ మోడ్‌లో పనిచేయగలదు. దీనికి సంబంధించి బెంగళూరులోని ఎల్పీజీ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన పరిశోధనల ద్వారా రోజుకు 2.5 టన్నుల డిఎంఈ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న ఒక ప్లాంట్‌ను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. రాబోయే ఆరు నుండి తొమ్మిది నెలల్లో దీని ఏర్పాటుకు శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు.బలమైన ముందడుగుపర్యావరణ సంరక్షణ, ఇంధన భద్రత మధ్య అంతరాన్ని పూరిస్తూ, స్వావలంబన, స్వచ్ఛమైన ఇంధన ప్రత్యామ్నాయాల దిశగా వేసిన బలమైన ముందడుగుగా ఈ ఆవిష్కరణ నిలవనుంది.‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’ నిధులతో కొన్ని సంవత్సరాల క్రితం మేము మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ఇది. కార్బన్డయాక్సైడ్ అనేది గ్రీన్హౌస్ వాయువు. దీనిని నియంత్రించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. అందులో ఒకటి... కార్బన్ కాప్చర్ అండ్ స్టోరేజ్. మేము మరో అడుగు ముందుకు వేసాం. దీనిద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్హౌస్ వాయువులను గణనీయంగా తగ్గించవచ్చు. అలా చేస్తూనే శక్తిని కూడా ఉత్పత్తి చేయవచ్చు’ అంటున్నారు ప్రోఫెసర్ సౌనక్ రాయ్.సీవో2 టు గ్యాస్!కార్బన్ డయాక్సైడ్ (సీవో2)ను స్వచ్ఛంగా మండే వంట ఇంధనమైన డైమిథైల్ ఈథర్‌గా మార్చే విప్లవాత్మక సాంకేతికతను హైదరాబాద్‌లోని బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ప్రోఫెసర్ సౌనక్ రాయ్, ప్రోఫెసర్ సత్యపాల్ సింగ్, ప్రోఫెసర్ బి.ఎం.రెడ్డి ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు.‘మేము ఇప్పటివరకు చేసింది ఒక ప్రయోగశాల–స్థాయి ప్రదర్శన మాత్రమే. తగిన సహాయ సహకారాలతో మేము దీనిని పైలట్ స్థాయికి తీసుకువెళ్లి ఆపై వాణిజ్యీకరణ వైపు వెళ్లగలం. ఇందుకు కొంత సమయం పడుతుంది. మేము ఇప్పటికే ఒక పేటెంట్ కోసం దరఖాస్తు చేశాం. మా రీసెర్చ్ గురించి ఒక సైంటిఫిక్ జర్నల్‌కు తెలియజేశాం’ అని ప్రోఫెసర్ రాయ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పా రు. -
గ్యాస్ కొరతకు..వంటగది వ్యర్థాలతో చెక్!
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన తాజా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇండియాలో ఎల్పీజీ (LPG) సరఫరా,నిల్వలపై ప్రభావం పడింది. విదేశాల నుంచి ఎల్పీజీ సరఫరా నిలిపివేతతో భారతదేశంలో సంక్షోభం తలెత్తింది. దాంతో గృహ అవసరాలకే కాక హోటళ్లు, అన్నదాన కార్యక్రమాలు వంటి పలు వాటిపై ఈ గ్యాస్ కొరత ప్రభావం మాములుగా లేదు. అంతేగాదు దీనికి ప్రత్యామ్నాయం ఏంటీ అని సర్వతా ఒకటే చర్చ. సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీ సైతం బ్యాన్ చేసిన కట్టెల పొయ్యిలను తిరిగి వినియోగించుకోమని ఆదేశించడం చూస్తేనే తెలుస్తోంది సంక్షోభం ఏ స్థాయిలో ఉందనేది. ఈ క్రమంలో దీనికి ప్రత్యామ్నాయాన్ని చూపిస్తూ..సరికొత్త ఆశను రేకెత్తించారు పూణెకి చెందిన ఇంజనీర్ ప్రియదర్శన్ సహస్రబుద్ధే. అది కూడా వంటింటి వ్యర్థాలతోనే ఈ ఎల్పీజీ గ్యాజ్ సమస్యకు పరిష్కారం చూపించాడు.పూణేకు చెందిన ఇంజనీర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే పూర్వ విద్యార్థి ఈ ఎల్పీజీ గ్యాస్ కొరతకు తన ఇంటి కోసం కనిపెట్టిన ఆవిష్కరణతోనే మార్గం చూపాడు. ఆయన కొన్నాళ్ల క్రితం కుటుంబ వ్యాపారం చేస్తున్నప్పుడు భోజనం తర్వాత ఎంతలా ఆహారం వృధా అవుతుందో గమనించాడు. ఆ వ్యర్థాలను ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తూ..పలు కంపోస్టింగ్ ప్రయోగాలు చేశాడు. కానీ పరిష్కారం దొరకలేదు. కానీ వాటిని తిరిగి మనకు శక్తిమంతంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దిశగా జీవ ఇంధనాల శాస్త్రంపై పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. అప్పుడే తెలుసుకున్నాడు వంటశాలలో ఉత్పత్తి అయిన సేంద్రీయ వ్యర్థాలను బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం చేసి మీథేన్ వాయువుని ఉత్పత్తి చేయొచ్చని. ఇది వంట కోసం ఉపయోగించే శుభ్రమైన ఇంధనం. పైగా వ్యర్థాలను పొంగిపొర్లుతున్న పల్లపు ప్రాంతాలకు పంపే బదులు గృహాలకు శక్తిగా మారిస్తే..ఆ ఆలోచనే 2017లో 'వాయు' అనే సాధారణ గృహాల కోసం రూపొందించిన కాంపాక్ట్ దేశీయ బయోగ్యాస్ ప్లాంట్‌గా రూపుదిద్దుకుంది. ఈ వ్యవస్థ వాయురహిత జీర్ణక్రియ అని పిలువబడే సహజ ప్రక్రియ ద్వారా సేంద్రీయ వంటగది వ్యర్థాలను మీథేన్‌గా మారుస్తుంది. ఇలా ఉత్పత్తి అయిన వాయువు నేరుగా స్టవ్‌కు పైపుల ద్వారా పంపొచ్చు. మిగిలిపోయిన వేస్ట్‌ని ఎరువుగా ఉపయోగించొచ్చు. ఈ ప్రయోగం ముందగా సహస్రబుద్దే తన ఇంట్లోనే ప్రారంభించాడు. ప్రతిరోజు సేకరించిన ఆహార వ్యర్థాలను ఉపయోగించి దాదాపు 800 లీటర్ల బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. ఇది అతని ఇంటి వంట అవసరాలకు సరిపోయింది. అంతేగాదు ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించింది కూడా. తన చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులకు కూడా దీనిపై అవగాహన కల్పించి..వాళ్లు కూడా ఈ మార్గంలో పయనించేలా చేశాడు. ఆ తర్వాత తన వినూత్న స్టార్టప్ సాయంతో నాసిక్, హైదరాబాద్, ఔరంగాబాద్‌తో సహా వివిధ నగరాల్లో వందకు పైగా యూనిట్లను స్థాపించారు. ఇవి ప్రతిరోజూ దాదాపు రెండు టన్నుల ఆహార వ్యర్థాలను ప్రాసెస్ చేయగలవు. ఇక్కడ ఈ ఇంజనీర్ వ్యర్థాలను పారేసివిగా కాకుండా వినియోగించుకునే విలువైన వనరుగా ఎలా వాడాలో తెలియజేశాడు. ఓ పక్క వ్యర్థాల సమస్యకు చెక్‌పెట్టాడు, అలాగే ఎల్పీజీ గ్యాస్‌పై ఆధారపడకుండా స్వచ్ఛమైన మీథేన్ వాయువుని పొందేలా చేశాడు. పర్యావరణానికి హితంగా, వంటిల్లు పరిశుభ్రంగా ఉంచే గొప్ప పరిష్కారం కదూ ఇది..!.(చదవండి: ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై మెరిసిన భారత డిజైనర్ వేర్లు, ఆభరణాలు..!) -
ఆస్పత్రిలో చేరిన ఎన్సీపీ నేత శరద్ పవార్
పూణె: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజకీయ దిగ్గజం శరద్ పవార్(85) ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప డీహైడ్రేషన్ కారణంగా ఆయన పూణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆయన రూబీ హాల్ క్లినిక్‌లో చేరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, చికిత్సలో భాగంగా సెలైన్ ఎక్కించామని ఆస్పత్రి వర్గాలు వివరించాయి.శరద్ పవార్ ఆరోగ్యంపై రూబీ హాల్ క్లినిక్ చీఫ్ కార్డియాలజిస్ట్, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పర్వేజ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆయనను మరో రెండు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచనున్నట్లు తెలిపారు. కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ అభిజిత్ లోధా ఆధ్వర్యంలోని వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఈ నెలలో పవార్ ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఫిబ్రవరి 9న ఛాతీలో ఇన్ఫెక్షన్, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల కారణంగా ఇదే ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స అనంతరం ఫిబ్రవరి 14న డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయంలో ఆయన వెంట కుమార్తె సుప్రియ, భార్య ప్రతిభా పవార్ ఉన్నారు.శరద్ పవార్ 1990వ దశకంలో నోటి క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. భారత్, అమెరికాలో పలు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. శరద్ పవార్ తన అనారోగ్యాన్ని లెక్కచేయకుండా ప్రజా జీవితంలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో తన మేనల్లుడు అజిత్ పవార్ కన్నుమూయడం ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఈ విషాదం జరిగిన కొద్ది రోజులకే ఆయన తిరిగి అనారోగ్యానికి గురికావడంతో పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
భారీ ట్రాఫిక్ జామ్.. 33 గంటల తర్వాత..
ముంబై: మహారాష్ట్రలోని ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై 33 గంటలుగా కొనసాగుతున్న భారీ ట్రాఫిక్ జామ్ ఎట్టకేలకు గురువారం ఉదయం క్లియర్ అయ్యింది. మంగళవారం సాయంత్రం ఖండాలా ఘాట్ సెక్షన్లో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం తెల్లవారుజామున 1:46 గంటల ప్రాంతంలో ఆదోషి టన్నెల్ సమీపంలో ప్రమాదానికి గురైన ట్యాంకర్‌ను తొలగించడంతో ముంబై వైపు వెళ్లే మార్గంలో రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి.మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అతివేగంతో వస్తున్న ప్రొపిలీన్ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. అత్యంత ప్రమాదకరమైన, మండే స్వభావం గల గ్యాస్ కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు వెంటనే ట్రాఫిక్‌ను నిలిపివేశారు. బుధవారం రోజంతా ట్యాంకర్‌లోని గ్యాస్‌ను మరో వాహనంలోకి మార్చే ప్రక్రియ కొనసాగింది. హెవీ డ్యూటీ క్రేన్ల సహాయంతో ట్యాంకర్‌ను రోడ్డుపై నుండి తొలగించిన తర్వాతే వాహనాల రాకపోకలకు లైన్ క్లియర్ అయిందని మహారాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్డీసీ) అధికారులు వెల్లడించారు.సుమారు 90 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఆహారం, తాగునీరు తదితర సదుపాయాలు లేక గంటల తరబడి వాహనాల్లోనే చిక్కుకుపోయారు. కొందరు పారిశ్రామికవేత్తలు ట్రాఫిక్ నుండి తప్పించుకునేందుకు హెలికాప్టర్లను ఆశ్రయించగా, సామాన్య ప్రయాణికులు మాత్రం ఎముకలు కొరికే చలిలో రోడ్డుపైనే కాలం గడపాల్సి వచ్చింది.ఈ భారీ ట్రాఫిక్ అంతరాయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని కోరారు. ప్రస్తుతం ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ, ఘాట్ సెక్షన్లో వాహనాల రద్దీ నెమ్మదిగా సర్దుకుంటోందని హైవే పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: ఘజియాబాద్ దారుణం: సంచలన వాస్తవాలు వెల్లడి -
142 ఏళ్ళ కలర్ సోడా..ఇప్పటికీ లభ్యం
ఒక చిన్న బాటిల్లో చల్లగా ఉండో ఆ సోడా... ఎప్పుడూ మనల్ని రిఫ్రెష్ చేస్తుంది కదా? కానీ, మీరు ఊహించగలరా... కోకా-కోలా, పెప్సీ రాకముందే అంటే 142 ఏళ్ల క్రితం – భారతదేశంలో ఒక సోడా జన్మించింది! అది కూడా పూణే నగరంలో! ఈరోజు మనం మాట్లాడేది ఆ అద్భుతమైన కథ గురించి – ‘అర్దేషిర్ సోడా’!1880లలో... ఇరాన్‌లోని యాజ్డ్ నగరం నుంచి ఒక యువకుడు – అర్దేషిర్ ఖోదాదాద్ ఇరానీ – జీవితంలో ఏమీ లేకుండా, కేవలం 8 రూపాయలతో భారతదేశానికి వచ్చాడు. అది కూడా పూణే నగరానికి రాగానే అతని జీవితం పూర్తిగా మారిపోయింది.ఒక రోజు పూణేలోని ఒక బార్లో గొడవ జరిగింది. ఎందుకంటే... ముంబై నుంచి సోడా సప్లై చేసే మూల్స్ (పట్టెగాడిదలు) ఆలస్యమయ్యాయి. సోడా లేకుండా ప్రజలు ఆగ్రహంతో గొడవపడుతున్నారు. అర్దేషిర్ ఆ దృశ్యం చూసి ఆలోచించాడు – "ఎందుకు ఇక్కడే సోడా తయారు చేయకూడదు? అన్న ఆలోచన వచ్చి అక్కడే అతను ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు. చార్కోల్ భట్టీ వెలిగించి, కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేసి, దాన్ని నీటిలో కలిపాడు. ఫిజ్ వచ్చింది! తర్వాత చక్కెర, ఫ్లేవర్స్ కలిపి... 1884లో *అర్దేషిర్ సోడా* పుట్టుకొచ్చింది! గమనించండి – కోకా-కోలా 1886లో పుట్టింది. అంటే అర్దేషిర్ సోడా రెండేళ్ల ముందు!ఆ రోజు నుంచి ఈ సోడా పూణే ప్రజల హృదయాల్లో చోటు చేసుకుంది. ఒరిజినల్ సోడా తప్ప... ఇప్పుడు కాఫిన్-ఫ్రీ కోలా, పైనాపిల్, గ్రీన్ యాపిల్, పీచ్, జీరా మసాలా, మసాలా కాలా ఖట్టా, టానిక్ వాటర్... ఎన్నో ఫ్లేవర్స్! అంతేకాదు, నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో తయారవుతుంది. అద్భుతమైన విషయం ఏమిటంటే – ఇప్పటికీ 'రిటర్నబుల్ బాటిల్' సిస్టమ్! 24 గాజు బాటిల్స్ కేస్కి 360 రూపాయల డిపాజిట్. ఖాళీ బాటిల్స్ తిరిగి ఇస్తే డబ్బు తిరిగి వస్తుంది. అందుకే ఈ బ్రాండ్ పూణేకే పరిమితమైంది. మార్జ్బాన్ ఇరానీ (అర్దేషిర్ గ్రేట్-గ్రాండ్సన్) చెప్పినట్లు – "బాటిల్స్ తిరిగి రాకపోతే, నాకు ఫిల్ చేయడానికి ఏమీ ఉండదు!"పూణేలోని ప్రతి ఇరానీ కేఫ్‌లో – డోరాబ్జీస్, కైకోబాడ్ వంటి సెంచరీ-ఓల్డ్ రెస్టారెంట్స్‌లో – అర్దేషిర్ సోడా తప్పనిసరి! చిన్నారులు పెరిగిన టేస్ట్, ఆ ఫిజ్ సౌండ్, ఆ నాస్టాల్జియా... ఇప్పటికీ అలాగే ఉంది. గ్లోబల్ బ్రాండ్స్ వచ్చినా, ఈ లోకల్ హీరో ఇంకా రాజ్యమే చేస్తోంది!స్నేహితులారా, ఇది కేవలం సోడా కాదు... ఒక ఇమ్మిగ్రెంట్ స్వప్నం, ధైర్యం, ఇన్నోవేషన్ కథ! పూణేకి వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా అర్దేషిర్ సోడా తాగారా? కామెంట్స్‌లో చెప్పండి! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం... మళ్లీ కలుద్దాం! జై హింద్! -
విమాన ప్రమాదంలో... అజిత్ పవార్ దుర్మరణం
బారామతి/ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పుణె జిల్లా లోని పవార్ స్వస్థలమైన బారామతిలో బుధవారం ఉదయం విమానాశ్రయంలో దిగేందుకు కొద్ది క్షణాల ముందు రన్‌వేకు కేవలం 100 అడుగుల దూరంలో ఈ దారుణం జరిగింది. రన్‌వే కన్పించకపోవడంతో మరో రౌండ్ చుట్టి తిరిగి వచ్చే క్రమంలో విమానం అదుపు తప్పింది. క్షణాల వ్యవధిలోనే శరవేగంగా కింద పడిపోయింది. నేలను ఢీకొట్టగానే మంటలు చెలరేగి పేలిపోయింది. ప్రమాద తీవ్రత ధాటికి రెండు ముక్కలైంది. దాంతో పవార్‌తో పాటు విమానంలోని మరో నలుగురు కూడా అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో పైలట్ కెపె్టన్ సుమిత్ కపూర్, కో పైలట్ కెపె్టన్ శాంభవీ పాఠక్, పవార్ వ్యక్తిగత భద్రతాధికారి విదీప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలీ ఉన్నారు. ప్రమాదం జరిగిన కాసేపటికే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. అప్పటికే అజిత్‌తో పాటు అందరూ ప్రాణాలు కోల్పోయారు. అజిత్‌ను ఆయన కళ్లద్దాలు, చేతి వాచీ సాయంతో గుర్తించారు. ఆయనతో పాటు మిగతా నలుగురి మృతదేహాలను బారామతి ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలియగానే అజిత్ కుటుంబీకులతో పాటు ఆయన పార్టీ ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. వారి శోకంతో ఆ పరిసరాల్లో విషాదం నెలకొంది. మహారాష్ట్ర అంతటా విషాద ఛాయలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలుకుని పలువురు నేతలు తదితరులు ది్రగ్భాంతి వెలిబుచ్చారు. పారీ్టలకు అతీతంగా సంతాపం తెలిపారు. మహారాష్ట్ర ఒక గొప్ప నేతను కోల్పోయిందంటూ ఆవేదన వెలిబుచ్చారు. అజిత్ అంత్యక్రియలు ఆయన రాజకీయ కర్మభూమి అయిన బారామతిలో గురువారం ఉదయం పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. మోదీ, అమిత్ షా తదితరులు పాల్గొనే అవకాశముంది. మహా రాష్ట్ర ప్రభుత్వం జనవరి 30 దాకా మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హుటాహుటిన బారామతి చేరు కుని అజిత్ కుటుంబీకులను ఓదార్చారు. ‘‘జరిగింది నమ్మశక్యం కాని ఘోరం. మంచి మిత్రున్ని కోల్పోయాను’’అంటూ ఆవేదన వెలిబుచ్చారు. అజిత్ మృతితో తాను పెద్దన్నయ్యను కోల్పోయానంటూ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన మరణం మహారాష్ట్రకు తీరని లోటన్నారు. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ రాజ్యసభ సభ్యురాలు. వారికి కుమారులు పార్్థ, జై ఉన్నారు. 66 ఏళ్ల అజిత్ మృతితో మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహా యుతి అధికార కూటమిలో భారీ శూన్యమే ఏర్పడింది. అంతేగాక ఆయన సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.ఆ చివరి క్షణాలు... జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో పుణెలో నాలుగు ప్రచార ర్యాలీల్లో పాల్గొనే నిమిత్తం అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబై నుంచి విమానంలో బారామతి బయల్దేరారు. అది వీఎస్ఆర్ వెంచర్స్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన 9 సీట్ల సామర్థ్యమున్న చిన్న లియర్‌జెట్–45 మోడల్ విమానం. ప్రమాదం జరిగిన తీరును పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ‘‘విమానం ఉదయం 8.10 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి బయల్దేరింది. 8.18కి విమానం బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) పరిధిలోకి వచి్చంది. గాలి తీవ్రత ఏమీ లేదని, 3 కి.మీ. దాకా స్పష్టమైన విజిబిలిటీ ఉందని పైలట్‌కు ఏటీసీ సిబ్బంది తెలిపారు. 8.40కల్లా విమానం బారామతి విమానాశ్రయాన్ని సమీపించి లాండింగ్‌కు సిద్ధమైంది. బారామతి విమానాశ్రయం ‘అన్‌కంట్రోల్డ్ ఎయిర్‌ఫీల్డ్’. ఇలాంటి విమానాశ్రయాల్లో ఏటీసీ టవర్ ఉండదు. దాంతో దృశ్యమానత తదితరాల ఆధారంగా పైలట్లే తమ విచక్షణ మేరకు లాండింగ్ చేస్తారు. వారికి ఎయిర్ ట్రాఫిక్ సమాచారాన్ని అందజేయడంలో స్థానిక విమానయాన శిక్షణ సంస్థల పైలట్లు, ఇన్స్ట్రక్టర్లు సాయపడుతూ ఉంటారు. 8.40 గంటలకు రన్‌వే 11పై విమానం లాండింగ్‌కు ఏటీసీ అనుమతించింది. గాలి వేగం, దృశ్యమానత (విజిబిలిటీ) ఎలా ఉన్నాయని ఏటీసీ ఆరా తీయగా రన్‌వే కన్పించడం లేదని పైలట్ చెప్పారు. లాండింగ్ ప్రయత్నం మానుకుని ‘గో అరౌండ్’ప్రక్రియను అనుసరించి విమానం గాల్లోనే మరో రౌండ్ తిరిగింది. ఆ తర్వాత కూడా రన్‌వే కన్పించడం లేదని పైలట్ తెలిపారు. అది కన్పించాక కాల్ చేస్తామని చెప్పారు. తర్వాత కొద్ది సెకన్లకే రన్‌వే కని్పస్తున్నట్టు చెప్పారు. దాంతో ఉదయం 8.43 గంటలకు రన్‌వే 11పై లాండింగ్‌కు ఏటీసీ అనుమతించింది. కానీ ఏటీసీ లాండింగ్ సందేశానికి విమాన సిబ్బంది నుంచి ‘రీడ్‌బ్యాక్’ఏమీ రాలేదు. ఏటీసీ సందేశాన్ని పైలట్/కో పైలట్ తిరిగి విన్పించడమే రీడ్‌బ్యాక్. తర్వాత కాసేపటికే, అంటే 8.44 గంటలకు విమానం రన్‌వే కొసకు ఎడమవైపున కుప్పకూలి మంటల్లో చిక్కింది. దాంతో హుటాహుటిన ఎమర్జెన్సీ సరీ్వసులను ఘటనా స్థలికి తరలించారు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది. అజిత్‌తో పాటు విమానంలోని వారంతా దుర్మరణం పాలయ్యారు’’అని ప్రకటన పేర్కొంది. విమానం నేరుగా నేలపై బండరాయిని ఢీకొట్టినట్టు చెబుతున్నారు. అందుకే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉందని సమాచారం. ప్రమాదానికి ముందు ఆపదలో ఉన్నట్టు తెలిపే ‘మే డే’కాల్ ఏదీ పైలట్ నుంచి రాలేదని డీజీసీఏ స్పష్టం చేసింది.అటూ ఇటూ ఊగింది ప్రత్యక్ష సాక్షులు విమానం కుప్పకూలేందుకు కొద్దిసేపటి ముందు అదుపు కోల్పోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. విమానాశ్రయాన్ని సమీపించి కిందిదాకా వచ్చిన అనంతరం లాండ్ అవడానికి బదులుగా విమానం మరోసారి రౌండ్ కొట్టిందని ఒక మహిళ తెలిపారు. ‘‘ఆ వెంటనే విమానం అటూ ఇటూ ఊగుతూ వేగంగా కిందివైపు దూసుకొచి్చంది. అదే ఊపులో నేలను తాకి పేలిపోయింది’’అని ఆమె చెప్పుకొచ్చారు. పేలుడు శబ్దాలు సుదూరాల దాకా విని్పంచాయన్నారు. పేలుడు తీవ్రతకు విమాన శకలాలు గాల్లో సుదూరాల దాకా ఎగిరి సమీపంలోని నివాస ప్రాంతాల వద్ద పడ్డట్టు మరికొందరు తెలిపారు. విమానం కుప్పకూలాక వరుసగా నాలుగైదు పేలుళ్లు విన్పించినట్టు వివరించారు. తర్వాత కాసేపటికి దగ్గరికి వెళ్లి మృతులను గుర్తించి అంబులెన్సుల్లోకి చేర్చినట్టు వారు చెప్పారు. తర్వాత కాసేపటికే అగి్నమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. అజిత్‌తో పాటు విమానంలోని ఐదుగురినీ వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు ఎస్పీ సందీప్‌సింగ్ గిల్ చెప్పారు. -
పూణే: రోబో శునకాలతో ఓట్ల వేట.. భారీ కానుకల వెల్లువ
పూణే: మహారాష్ట్రలోని పూణే, పింప్రి-చించ్వాడ్ సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు మునుపెన్నడూ లేని విధంగా అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. ముఖ్యంగా ఓట్లు అడుగుతూ వీధుల్లో తిరుగుతున్న ‘రోబోటిక్ డాగ్స్’ అందరినీ ఆకర్షిస్తున్నాయి.ఈ రోబో శునకాలకు పోస్టర్లను కట్టి కొందరు ప్రచారం నిర్వహిస్తుండగా, మరికొందరు కార్యకర్తలు ఎల్ఈడీ (ఎల్ఈడీ) స్క్రీన్లను బ్యాక్‌ప్యాక్‌ల మాదిరిగా తగిలించుకుని అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. జనవరి 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ హైటెక్ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా రీల్స్, వీడియోలు, కంటెంట్ సృష్టించడానికి ఏఐని వాడుతున్నారు. ఇది ఖర్చును తగ్గించడమే కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరువయ్యేలా చేస్తోంది. Pune & Pimpri-Chinchwad Election Campaigns Turn Hi-Tech With Robotic Dogs, Backpack LED Screens & More pic.twitter.com/9Do0Ea5HIf— Pune First (@Pune_First) January 9, 2026ఓటర్ల నాడిని విశ్లేషించేందుకు, ప్రజలతో సంభాషించేందుకు చాట్బాట్లను రంగంలోకి దించారు. లోహెగావ్, విమాన్ నగర్ వంటి ప్రాంతాల్లో అభ్యర్థులు డేటా ఆధారిత ప్రెజెంటేషన్లు ఇస్తూ, ప్రతి ఆరు నెలలకోసారి తమ ప్రగతి నివేదికను సమర్పిస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఓట్ల వేటలో అభ్యర్థులు వినూత్న హామీలతో పాటు భారీ బహుమతులను ఎరగా వేస్తున్నారు. కొందరు అభ్యర్థులు లక్కీ డ్రా ద్వారా ఎస్యూవీ (ఎస్యూవీ)కార్లు, బంగారు ఆభరణాలు ఇస్తామని ప్రకటిస్తుండగా, విమాన్ నగర్ అభ్యర్థి ఏకంగా ఐదు రోజుల థాయిలాండ్ లగ్జరీ టూర్ ఆఫర్ చేశారు.లోహెగావ్-ధనోరి వార్డులో ఒక అభ్యర్థి 1,100 చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేశారు. కొందరు అభ్యర్థులు.. గృహిణులకు పైతాని చీరలు, నగలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి పింప్రి-చించ్వాడ్ (పీసీఎంసీ) ఎన్నికల బరిలో ఏడుగురు మాజీ మేయర్లు నిలవడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఎన్సీపీ (ఎన్సీపీ) నుంచి వైశాలి ఘోడేకర్, యోగేష్ బెహల్.. బీజేపీ నుంచి మాయ్ ధోరే, శకుంతల దరడే సహా పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. అయితే పుణే ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల నేపథ్యం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు పరిశీలించిన 2,650 దరఖాస్తులలో 1,560 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, 60 మందిపై అత్యంత తీవ్రమైన నేరాలు నమోదై ఉన్నాయి. జనవరి 15న ఉదయం 7:30 నుండి సాయంత్రం 5:30 వరకు పోలింగ్ జరగనుంది. ఇది కూడా చదవండి: చలికి గడ్డకట్టిన ఢిల్లీ.. స్థంభించిన జనజీవనం -
ప్రేమకు ఎక్స్పైరీ లేదు!.. వీళ్లంతా ‘యంగ్’స్టర్లే!
ప్రేమకు ఎక్స్పైరీ అంటూ ఉండదు. ఏ వయసులోనైనా కాసింతా ప్రేమ, ఆదరణ కావాలనే అనుకుంటాం. ప్రేమ అనే పదంతోనే కదా ఏ బంధమైన పెనవేసుకునేది. యంగ్‌గా ఉన్నప్పుడే ప్రేమ, పెళ్లి కాదు, మలి వయసులోనూ కావాలి ఓ తోడు. అయితే మలిసంధ్యలో ఉండే ప్రేమ అత్యంత ఆత్మీయమైనది, స్నేహ మాధుర్యానికి మించినది. దాన్నే హైలెట్ చేసింది ఈ మ్యాచ్ మేకింగ్ ఈవెంట్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇన్ఫ్లుయెన్సర్ షెనాజ్ ట్రెజరీ ఈ వీడియోని నెట్టింట షేర్ చేశారు. అది 60,70, 80 ఏళ్ల లోపు వారి కోసం రూపొందించిన మ్యాచ్ మేకింగ్ ఈవెంట్ అని రాసుకొచ్చింది. ఆ కార్యక్రమాన్ని చూడటానికి వెళ్లి కళ్లనీళ్లు ఆగలేదంటోంది. వాళ్లంతా టీనేజర్ల వలే నవ్వుతూ ఉండటం చూసి తాను ఒక విధమైన ఆనందం, భావోద్వగంతో ఉక్కిరిబిక్కిరి అయినట్లు పేర్కొంది. అక్కడ గదుల్లో చాలామంది భాగస్వాములును కోల్పోయారని, మరికొందరూ విడాకులు తీసుకున్న వాళ్లని తెలిపింది. అయితే అందరూ కలిసి కూర్చొని నవ్వుకుంటూ కనిపించిన విధానం తాము కోల్పోయిన ప్రేమ, తోడు ఏదో పొందాలన్న ఆశ వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పుకొచ్చింది. అయితే ఈ కార్యక్రమం మతం, కులం, అంతస్థులతో సంబంధం లేకుండా జరగడం విశేషం. కొందరు స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ కనిపిస్తే..మరికొందరు సిగ్గుపడిపోతూ కబుర్లు చెప్పుకుంటున్న వాళ్లని చూస్తే మనసు ఆనందంతో పవరశించిపోయిందంటూ ఉద్విగ్నంగా రాసుకొచ్చిందామె పోస్ట్‌లో. వాళ్లంతా పిల్లల పెంపకం, బాధ్యతలలో తలమునకలై, తమకంటూ వ్యక్తిగత ఆనందానికి చోటు దొరకక, కనీసం మలి వయసులోనైనా పొందాలని వచ్చిన అత్యంత యంగ్ సీనియర్ సిటిజన్లుగా అని పేర్కొంది. ఈ కార్యక్రమం వారికి కొత్త ప్రేమనే కాదు..ఆ వయసు వాళ్లతో కనెక్ట్ అయ్యే ఓ గొప్ప అవకాశం కూడా ఇది. నెటిజన్లు సైతం ఈ వయసులో అలా ధైర్యంగా ముందుకొచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా గ్రేట్అంటూ ప్రశంసించారు. అందరూ తమను కూడా ఇది భావోద్వేగానికి గురించేసిందంటూ పోస్టులు పెట్టారు. అంతేగాదు ప్రేమకు వయోపరిమితి ఉందనే నమ్మకానికి ఈ ఘటనే అతి పెద్ద సవాలు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Travel, Romance, Smiles (@shenaztreasury) (చదవండి: ఏడేళ్లుగా నిలబడే ఉన్న సాధువు..! నిద్రపోవడం ఎలా అంటే..) -
మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడీ కన్నుమూత
పూణే: ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడీ (81) నేడు (మంగళవారం) తుదిశ్వాస విడిచారు. పూణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. గత కొంతకాలంగా ఆయన వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.సురేష్ కల్మాడీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఎరందవనేలోని ఆయన నివాసం ‘కల్మాడీ హౌస్’లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంచనున్నారు. అభిమానులు, రాజకీయ నేతలు ఆయనకు నివాళులు అర్పించేందుకు భారీగా తరలిరానున్నారని సమాచారం. మధ్యాహ్నం 3:30 గంటలకు పూణే నవీ పేటలోని వైకుంఠ స్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది.భారత రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతగా కల్మాడీ సుదీర్ఘ కాలం పనిచేశారు. 1995-96 మధ్య కాలంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. రాజకీయాల్లోకి ప్రవేశించకముందు ఆయన భారత వైమానిక దళంలో (ఐఎఎఫ్) పైలట్‌గా 1964 నుండి 1972 వరకు పనిచేశారు. క్రీడా రంగంలో భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షునిగా దేశీయ క్రీడా రంగంలో కీలక పాత్ర పోషించారు. భారత క్రీడా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఎనలేని కృషి చేశారు.2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు కల్మాడీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి. ఈ కేసులో 2011లో ఆయన అరెస్ట్ కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. అనంతరం 2016లో ఆయనను ఐఓఏ జీవితకాల అధ్యక్షుడిగా నియమించినప్పటికీ, తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ పదవిని తిరస్కరించారు. Pune, Maharashtra | Former Union Minister and Senior Congress leader Suresh Kalmadi passed away after a prolonged illness. He was admitted in Deenanath Mangeshkar hospital in Pune. His mortal remains will be kept at Kalmadi House, Erandwane, Pune till 2 pm and cremation will take…— ANI (@ANI) January 6, 2026 -
ఫ్యాక్టరీ కార్మికుడి నుంచి ఫుల్‌స్టాక్ డెవలపర్ రేంజ్‌కి..!
ఏ చిన్న ఉద్యోగం చేసినా..అక్కడే ఉండిపోకూడదు..దినదినాభివృద్ధి చెందాలన్నా ఆర్యోక్తిని బలంగా నమ్మాడు ఈ వ్యక్తి. శ్రమతో కూడిన ఉద్యోగం చేస్తూ..కూడా మంచి ఉన్నతోద్యోగిగా మారాలన్న ఆశయాన్ని బలంగా ఏర్పరుచకున్నాడు. ఆర్థిక పరిస్థితి చదువు కొనసాగనివ్వకపోయినా..తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనుకున్నాడు. అనుకున్నది సాధించి..పరిమితులు, ఆర్థిక వనరులు అనుకూలంగా లేకపోయినా..ఉవ్వెత్తిన ఎగిసిపడే కెరటంలా అనితర సాధ్యమైన లక్ష్యాన్ని చేధించగలమని నిరూపించి.. స్ఫూర్తిగా నిలిచాడు. అతడు పూణేకు చెందిన యువకుడు. అతడి కథ నెట్టింట వైరల్‌గా మారండంతో అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అతడు యూఎస్ ఆధారిత కూరగాయల ప్రాసెసింగ్ ఫ్యాకర్టీలో రోజుకి పదిగంటల షిప్ట్‌లో పనిచేస్తుండేవాడు. నిజానికి ఈ ఉద్యోగం శారీరకంగా, మానసికంగా చాలా శ్రమతో కూడిన ఉద్యోగం. అతనికి కోడింగ్‌పై ఎలాంటి ముందస్తు నేపథ్యంగానీ, అవగాహన గానీ లేదు. కానీ స్నేహితుడు చెప్పిన ఎలోనమస్క్ సూచన అతడిని ఎంతగానే ప్రేరేపించింది. ఆ సూచననే కార్యరూపంలోకి తీసుకొచ్చేలా..ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలాన్ మస్క్ అన్నట్లుగా ప్రతీది ఇంటర్నెట్లో ఉచితంగా లభిస్తుంది కాబట్టి అదే మీ అభ్యున్నతికి అద్భుతమైన వనరు అన్న మాటలు తూచతప్పకుండా ఫాలో అయ్యాడు అతడు. డబ్బు ఆదా చేసుకుని మరి తల్లిదండ్రుల మద్దతుతో ఓ ల్యాప్‌టాప్ కొనుకున్నాడు. దాని సాయంతో ఆన్లైన్ వనరులను ఉపయోగించుకుని హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ను అధ్యయనం చేశాడు. ఖరీదైన కోర్సులు లేకుండా డాక్యుమెంటేషన్ చదవడం ప్రారంభించాడు. అలా ప్రాజెక్టులు నిర్మించడం, ఆ క్రమంలో జరిగే తప్పుల నుంచి నేర్చుకోవడం వంటివి చేస్తున్నాడు. జస్ట్ 18 నెలల్లో తనను తాను ఫుల్‌స్టాక్ డెవలపర్‌గా తీర్చిదిద్దుకుని యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు. నేర్చుకోవాలనే తప్పన, మంచి స్ధాయిలో ఉండాలన్న అభిలాష, ఆర్థిక వనరులు, పరిస్థితులు వెనక్కిలాగలేవు, ఆపలేవు అని నిరూపించాడు. From a factory worker to a full-stack developer in 1.5 years of grind.I’m not saying this to flex.I’m saying this because I didn’t believe it was possible either.1.5 years ago, I was working in a vegetables factory.10 hours a day. Packing. Picking. Standing.Physically… pic.twitter.com/pn30AaJ8LY— Sambhav.apk▲ (@Coding_Sage) January 2, 2026 ఫుల్-స్టాక్ డెవలపర్ అంటే వెబ్సైట్ లేదా అప్లికేషన్ ముందు భాగం (యూజర్ చూసేది), వెనుక భాగం (డేటాబేస్లు, సర్వర్లు) రెండింటినీ నిర్మించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. వీరికి HTML, CSS, JavaScript (ఫ్రంట్-ఎండ్ కోసం), Python, Java, Node.js వంటి భాషలు, డేటాబేస్ మేనేజ్మెంట్ (బ్యాక్-ఎండ్ కోసం) వంటి విస్తృత నైపుణ్యాలు అవసరం. ఇది ఎండ్-టు-ఎండ్ ప్రాజెక్ట్‌ను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. (చదవండి: 52 ఏళ్ల మహిళ యూట్యూబ్ రీల్స్‌తో మొదటి సంపాదన..!) -
IPL 2026: రాజస్తాన్ రాయల్స్ ‘ఫ్యాన్స్’కి భారీ షాక్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొట్టమొదటి సీజన్ విజేతగా రాజస్తాన్ రాయల్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2008లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడిన రాజస్తాన్.. ఆ తర్వాత జైపూర్‌లోని సొంత మైదానం సవాయ్ మాన్సింగ్ స్టేడియం(SMS)లో తదుపరి మ్యాచ్ ఆడింది.సుదీర్ఘ బంధానికి వీడ్కోలుక్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి ఈ మైదానాన్ని తమ హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న రాజస్తాన్ జట్టు.. ఇప్పుడు ఈ సుదీర్ఘ బంధానికి వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది. రెవ్‌స్పోర్ట్స్ కథనం ప్రకారం.. ఐపీఎల్-2026 సీజన్ నుంచి రాజస్తాన్ రాయల్స్ హోం గ్రౌండ్ మారనుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియాన్ని తమ సొంత మైదానంగా రాయల్స్ ఎంచుకుంది.కారణం ఇదేజైపూర్లోని ‘SMS’ గ్రౌండ్లో భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేవని ఇప్పటికే రాయల్స్ యాజమాన్యం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ విషయంలో వారి నుంచి సరైన స్పందన కరువైంది. ఈ సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయన్న అంశంపై కూడా సదరు అధికార వర్గాలు కచ్చితమైన సమాచారం ఇవ్వలేదట. దీంతో రాయల్స్ తమ హోం గ్రౌండ్ మార్పు గురించి తుదినిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.పుణెలోఇప్పటికే రాయల్స్ ఆపరేషన్ టీమ్ పుణెకి వెళ్లి.. అక్కడి పిచ్ పరిస్థితులు, సీటింగ్ సామర్థ్యం, ఆటగాళ్ల సౌకర్యాలు, మంచి హోటళ్లు అందుబాటులో ఉన్నాయా? లేవా?, రవాణా తదితర అంశాల గురించి పరిశీలించినట్లు సమాచారం. ఈ క్రమంలో పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియాన్ని (MCA) హోం గ్రౌండ్‌గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండో హోం గ్రౌండ్‌గా అసోంలోని గువాహటి యథావిధిగా కొనసాగనుంది.కాగా MCA స్టేడియంలో గతం (2016-17)లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు సొంత మైదానంగా ఉండేది. ఇక చెన్నూ సూపర్ కింగ్స్ 2018లో తమ తాత్కాలిక సొంత మైదానంగా MCAను ఎంచుకుంది. ఆర్సీబీని ఓడించి..ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రాయల్స్‌తో పాటు ఆర్సీబీ కూడా ఈ మైదానం కోసం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే, చివరగా రాయల్స్‌కే ఇది హోం గ్రౌండ్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే SMSలో ఇన్నాళ్లు రాయల్స్ మ్యాచ్ వీక్షించిన స్థానిక ‘ఫ్యాన్స్’కు భారీ షాక్ తగిలినట్లే!!ఇక 2008లో విజేతగా నిలిచిన రాయల్స్.. మళ్లీ ఫైనల్ చేరడానికి దాదాపు పద్నాలుగేళ్లు పట్టింది. సంజూ శాంసన్ కెప్టెన్సీలో 2022లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక 2026 వేలానికి ముందే సంజూ శాంసన్‌ను చెన్నైకి ట్రేడ్ చేసిన రాయల్స్ యాజమాన్యం.. రవీంద్ర జడేజాను తమ జట్టులో చేర్చుకుంది. ఇంతవరకు తమ కెప్టెన్‌ను మాత్రం ప్రకటించలేదు.చదవండి: KKR: అతడొక ద్రోహి.. కేకేఆర్ ఇలాంటి పనిచేస్తుందా?.. బీసీసీఐ స్పందన ఇదే -
సీఎంపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ అభ్యర్థికి బిగ్ షాక్
ముంబై: మహారాష్ట్రలో పూణే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ మహిళా అభ్యర్థి గతంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం భార్యపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, బీజేపీ హైకమాండ్ ఒత్తిడితో సదరు మహిళా అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.వివరాల మేరకు.. పూణేలో మన్సిపల్ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కోటా కింద వార్డ్ నంబర్-2 నుంచి పూజా మోర్ జాదవ్ పోటీలో నిలిచారు. బీజేపీ మద్దతుతో ఆమెకు ఏబీ ఫారమ్ కేటాయించారు. దీంతో, ఆమె నామినేషన్ సైతం దాఖలు చేశారు. అయితే, రెండు రోజుల క్రితం అనూహ్యంగా ఆమెకు సంబంధించిన పలు పాత వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. గతంలో మరాఠా విషయంలో ఆందోళనల్లో ఆమె పాల్గొన్నారు. ఆ సమయంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం భార్యపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోలు తాజాగా వైరల్ కావడంతో స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. దీంతో, బీజేపీ హైకమాండ్ నిర్ణయం మేరకు ఆమె తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు.BJP Order Forces Pooja More to Withdraw Candidature; Breaks Down in TearsAfter receiving the BJP’s directive to withdraw her candidature, young leader Pooja More became emotional and broke down, saying she had worked hard and proved her capability, but the party’s strategic… pic.twitter.com/oej13BLK8V— Pune Mirror (@ThePuneMirror) January 1, 2026అనంతరం, ఈ వివాదంపై ఆమె స్పందిస్తూ..‘కొందరు వ్యక్తులు నా గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. నేను బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మను అని చిత్రీకరించడానికి ప్రయత్నించారు. బీజేపీ నేతల విమర్శల కారణంగా నా నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. వీడియోలలో కనిపించే వ్యాఖ్యలు నేను చేయలేదు. ఎవరో మహిళ చేసిన వ్యాఖ్యలను నాపై తప్పుగా ఆపాదించారు. నేను పోలీసుల లాఠీఛార్జీలు, క్రిమినల్ కేసులను కూడా ఎదుర్కొంటున్నాను. తరచుగా కోర్టుకు సైతం వెళ్లాల్సి వస్తోంది. చట్టపరమైన కేసులను ఎదుర్కోవడానికి నా దగ్గర డబ్బు కూడా లేని సందర్భాలు ఉన్నాయి. ఒక ప్రధాన రాజకీయ పార్టీ నుండి టికెట్ పొందడం నాలాంటి అట్టడుగు స్థాయి కార్యకర్తకు అరుదైన అవకాశం. కానీ, ఇలా జరగడం దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. మరుసటి రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. She is "Pooja Jadhav" a BJP Candidate in PMCFor Her Terrorists Has No Religion & Now She Awarded BJP Ticket To Fight Municipal Election@BJP4India @BJP4Maharashtra Terrorist Has A Religion & Its IslamIslamic Terrorist Ki!!ed hindus In #PahalgamTerrorAttack#BJP #Congress pic.twitter.com/iTxvwJQUS1— 𝐃𝐢𝐠𝐯𝐢𝐣𝐚𝐲 𝐒𝐢𝐧𝐠𝐡 🇮🇳 (@Knight_riders18) January 1, 2026 -
పుణే జర్మన్ బేకరీ కేసు నిందితుడి హతం
పుణే జర్మన్ బేకరీ పేలుడు కేసులో నిందితుడు(సహ) అస్లాం షబ్బీర్ షేక్(బంటి జాహగీర్దార్) హత్యకు గురయ్యాడు. బుధవారం మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో బైక్‌పై వచ్చిన వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీస్ శాఖ ధృవీకరించింది.జర్మన్ బేకరీ పేలుడు కేసులో పాక్ ప్రేరేపిత ఉగ్రవాది హిమాయత్ బైగ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అస్లాం షబ్బీర్ షేక్ (బంటి జాహగీర్దార్) సహనిందితుడు. ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు ఈ పేలుడుకు సహకరించాడనే అభియోగాలు అతనిపై ఉన్నాయి. ఈ కేసులో బంటి జహగీర్దార్ 2010లో అరెస్టయ్యాడు కూడా. అయితే.. 2013లో బాంబే హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయగా.. అప్పటి నుంచి బయటే ఉంటున్నాడు. German Bakery Blast co-accused Aslam Shabbir Sheikh or Bunty Haji Jahagirdar from Shrirampur Ahilya Nagar shot dead by gunmen.He was a supplier of weapons and aided the crime. He was a history sheeter and multiple times tadipaar.Bombay High Court Granted him bail in 2023. pic.twitter.com/2jaJlNj16O— शाश्वतक्षात्र⚔️ (@swadharmic) January 1, 2026బుధవారం శ్రీరాంపురంలో ఓ అంత్యక్రియల కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతన్ని కాల్చి చంపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.జర్మన్ బేకరీ పేలుడు కేసు (2010) భారతదేశంలో జరిగిన ఒక ప్రధాన ఉగ్రదాడి. 2008 26/11 ముంబై దాడుల తర్వాత అంతటి దాడిగా పేరుగాంచింది. ఫిబ్రవరి 13వ తేదీన పుణే కోరేగావ్ పార్క్ సమీపంలోని జర్మన్ బేకరీ వద్ద పేలుడు జరిగింది. ఈ ఘటనలో 18 మంది(విదేశీయులు సహా) ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. తొలుత ఇది సిలిండర్ బ్లాస్ట్గా భావించారు. అయితే.. ఫోరెన్సిక్ నివేదికలో ఆర్డీఎక్స్ వాడినట్లు తేలింది. దీంతో ఉగ్రదాడి అయి ఉంటుందని పుణే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈలోపు దాడికి తామే బాధ్యులమని లష్కరే తాయిబా, ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలు ప్రకటించుకున్నాయి. కరాచీ ప్రాజెక్టులో భాగంగా.. డేవిడ్ హెడ్లీ నేతృత్వంలో ఈ దాడికి రూపకల్పన జరిగిందని భారత దర్యాప్తు సంస్థలు ఆ తర్వాత తేల్చాయి. -
గ్యాంగ్‌స్టర్ నామినేషన్.. వీడియో వైరల్
ముంబై: మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ.. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల మేరకు.. మహారాష్ట్రలో పుణె మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మరో 28 సంస్థలకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. స్థానిక గ్యాంగ్‌స్టర్, మనవడి హత్య కేసులో ప్రధాన నిందితుడైన బందు అందేకర్ శనివారం నామినేషన్ దాఖలు చేశాడు. ప్రస్తుతం ఎరవాడ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతడు భారీ పోలీసు భద్రత నడుమ ప్రభుత్వ కార్యాలయానికి చేరుకున్నాడు. పోలీసు వ్యాన్‌లో వచ్చిన బందు అందేకర్ చేతులకు తాళ్లు కట్టి ఉండగా, ముఖానికి నల్లటి గుడ్డ కప్పి ఉండటం గమనార్హం.Notorious Andekar Gang Leader Bandu Andekar was brought from Yerwada Jail under police escort to Bhawani Peth Regional Office to file his application for the Municipal Corporation elections in Dec 27. Express Video By Pavan Khengre. pic.twitter.com/o7gyBWnFG4— Express Pune Resident Editor (@ExpressPune) December 27, 2025అనంతరం, భవానీ పేటలోని నామినేషన్ కేంద్రానికి తీసుకురాగానే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో నామినేషన్ దాఖలు చేసి మళ్లీ జైలుకు వెళ్లిపోయాడు. కాగా, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అందేకర్కు ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. అందేకర్ మాత్రమే కాకుండా, ఇదే కేసులో నిందితులుగా ఉన్న అతడి సోదరుడి భార్య లక్ష్మి అందేకర్, కోడలు సోనాలి అందేకర్ కూడా కోర్టు అనుమతితో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.ఇదిలా ఉండగా.. మాజీ కార్పొరేటర్, బందు అందేకర్ కుమారుడు వనరాజ్ అందేకర్ గతంలో హత్యకు గురయ్యాడు. దీనికి ప్రతీకారంగానే మనవడు ఆయుష్ కోమ్కర్‌ను సెప్టెంబర్ 5న కాల్చి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దారుణ హత్య వెనుక అందేకర్ గ్యాంగ్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య కేసులో అందేకర్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఇక, అందేకర్ నామినేషన్‌కు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. आंदेकर कुटुंब निवडणुकीच्या रिंगणात, फॉर्म भरताना काय घडलं? #Pune #Andekar #Crime pic.twitter.com/2CVYyxrlma— Mumbai Tak (@mumbaitak) December 27, 2025 -
గెలిచినా గంప దింపలేదు!
పుణె జిల్లాలోని అందమైన హిల్ స్టేషన్ లోనావాలా.. పర్యాటకులకు స్వర్గధామం. కానీ ఇప్పుడా ప్రాంతం ఒక సామాన్య మహిళ పోరాటానికి, నిరాడంబరతకు చిరునామాగా మారింది. ముంబైకి కూతవేటు దూరంలోని ఈ పట్టణ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగ్యశ్రీ జగ్తాప్ అనే మహిళ సాధించిన విజయం.. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. విజయం వరించినా.. వేరు మరువలేదు సాధారణంగా ఎన్నికల్లో గెలవగానే నాయకులు పూలమాలలు, ఊరేగింపులు, బాణసంచా హడావిడిలో మునిగిపోతారు. కానీ భాగ్యశ్రీ స్టైలే వేరు.. ఆదివారం ఫలితాలు వచ్చాయి.. భారీ మెజారిటీతో ఆమె గెలిచారు. సోమవారం ఉదయాన్నే అందరూ ఆమె ఇంటికి అభినందనలు తెలపడానికి వద్దామనుకుంటే.. ఆమె మాత్రం ఎప్పటిలాగే రోడ్డు పక్కన తన పండ్ల దుకాణం దగ్గర ప్రత్యక్షమైంది. కౌన్సిలర్ హోదాను ప్రదర్శించడం కంటే, తన కుటుంబాన్ని పోషిస్తున్న పండ్ల గంపే ఆమెకు దైవంగా కనిపించింది. ‘గెలిచాం కదా అని వ్యాపారాన్ని వదిలేస్తామా?.. మా కుటుంబానికి జీవనాధారం ఇదే’.. అంటూ ఆమె పండ్లను సర్దుతున్న తీరు చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. హేమాహేమీలను ఓడించి.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన భాగ్యశ్రీ, తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యరి్థని ఏకంగా 608 ఓట్ల తేడాతో ఓడించింది. పౌర సమస్యలపై ఆమెకున్న అవగాహన, సామాన్యులతో అనుబంధమే.. ఈ భారీ విజయానికి కారణమని లోనావాలా వాసులు స్పష్టం చేస్తున్నారు. దేని పని దానిదే.. పదవి గురించి భాగ్యశ్రీ మాటల్లో ఎక్కడా గర్వం కనిపించదు. ‘పండ్లమ్మడం మా వంశపారంపర్య వ్యాపారం. కౌన్సిలర్‌గా ప్రజల సమస్యలపై పోరాడతాను, వారి బాధలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాను. అదే సమయంలో నా పండ్ల దుకాణాన్ని కూడా నడుపుతాను. ఈ వ్యాపారమే నాకు గుర్తింపునిచి్చంది’.. అని ఆమె స్పష్టం చేసింది. భర్త మహదేవ్ జగ్తాప్ కూడా ఆమె నిర్ణయానికి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఆమె ప్రజా సేవలో నిమగ్నమైతే, తాను వ్యాపార బాధ్యతలు చూసుకుంటానని సగర్వంగా చెబుతోంది. శభాష్ భాగ్యశ్రీ రాజకీయాల్లో విజయం సాధించాక నేలమీద నడవని నేతలున్న కాలంలో.. నిరాడంబరతే ఆభరణంగా భాగ్యశ్రీ సాగిపోతోంది. తన కష్టాన్ని, వృత్తిని నమ్ముకున్న ఈ ’పండ్లమ్మే కౌన్సిలర్’ ఇప్పుడు సోషల్ మీడియాలో రియల్ హీరోగా నిలిచింది. గెలిచాక వాగ్దానాల ‘గంప’దించేసే నాయకుల మధ్య.. గెలిచినా గంపను నమ్ముకున్న ఈ ’భాగ్యశ్రీ’ నిజంగా అభినందనీయురాలు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రాఫిక్.. గీఫిక్.. జాన్తా నై!
రూల్స్ ఉండేవే బ్రేక్ చేయడానికి అన్న వాదన నుంచి పుట్టిన సిద్ధాంతం మనది. అందుకే ఎప్పుడు రూల్స్ గురించి మాట్లాడినా.. రాద్ధాంతం తప్పనిసరిగా ఉంటుంది. ఇక ట్రాఫిక్ రూల్స్ అంటారా.. ఇది మరీ విడ్డూరం. దేశంలో ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటిస్తూ అందరితో శభాష్ అనిపించుకున్న.. అందరూ కాకపోయినా ట్రాఫిక్ పోలీసుల మెప్పు పొందిన వారిని వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. రూల్స్ పాటించడమంటేనే చేతకాని తనానికి నిదర్శనమని త్రికరణశుద్ధిగా నమ్ముతుంటాం. అందుకే ఎదుటి వారికి చెప్పేటందుకే రూల్స్ ఉన్నాయి.. డోంట్ కేర్ అంటూ ఏఎన్నార్ లెక్కన పాటలు పాడుకుంటూ నిర్లక్ష్యంగా తిరిగే వారే ఎక్కువ. ఏదైన రూల్ ఉందంటే అది రాజుగారి గదిలాంటిది. రాజుగారి గదిలోకి మాత్రం వెళ్లకండి అంటే.. కచ్చితంగా అందులోకే వెళ్లడం సగటు భారతీయుని నైజం. ఇదీ అంతే.. రూల్స్ అంటూ ఎవరైనా మాట్లాడితే.. ఆ చెప్పొచ్చావులే పేద్ద.. రూల్స్ అంట రూట్స్.. అని ఆరున్నొక్క రాగాల దీర్ఘం తీయడం మనకు అలవాటై పోయింది.గీ ట్రాపిక్ పురాణం పొద్దుపొద్దులా మాకెందుకు బై అంటే.. జర ఆగుండ్రి మరి.. మన సివిక్ సెన్స్ చూసి విదేశీయులే నోరెల్ల బెడ్తుండ్రంట. పుణెలో ఓ విదేశీయుడు మనోళ్లు ఫుట్‌పాత్‌ల మీదికెళ్లి మోటార్ బైకులు చెలాయిస్తూంటే వారిని ఆపి.. ఏందిది? అని అడుగుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అందుకే.. ఇక్కడే కాదు.. దేశంలో చాలా చోట్ల విదేశీయులు మన భారతీయుల ఉల్లం‘ఘనుల’ను చూసి.. అరే ఎంత దర్జాగా రూల్స్ వదిలేసి తిరుగుతుండ్రని నోళ్ళు నొక్కుకుంటుండ్రు. మన దేశ రాజధాని ఢిల్లీలో సైకిల్ తిరగాల్సిన చోట వాహనాలు హల్ చల్ చేస్తుంటే.. చూస్తున్న విదేశీయులు రంగప్రవేశం చేసి జనాలకు బాబూ దీన్ని బైసైకిల్ లేన్ అంటారు. ఇక్కడ కేవలం సైకిల్స్ తిరగాలి అంతేకానీ.. ఎడాపెడా పెద్ద వాహనాలు రాకండి అంటూ నిలబడి మరీ చెప్పడం ప్రారంభించారు.కొందరు వీరి మాటలు వింటున్నట్లు నటించినా.. మరి కొందరు బేఫికర్‌గా వారి మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అరే మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ గురించి విదేశీయులు అర్థం చేసుకుని ఇలా పాటించాలి బాబూ అంటున్నా.. వినకుండా వారు అలా చెబుతున్నందుకు విసుక్కొంటున్నారట. పాపం విదేశీయులకు మన థియరీ అర్థం కాలేదు. అరే వీరేందిర బై రూల్స్ అన్నాక ఫాలో కావాలి కదా. పనిగట్టుకుని మరీ రూల్స్ బ్రేక్ చేస్తే వీరికి మాత్రం ఒరిగేదేంటి? అని లోలోపల మదనపడుతున్నారట. విదేశీయులు మన భారతీయులకు ట్రాఫిక్ రూల్స్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.🚨 A foreigner is forcing riders to move out of footpath in Pune. 🙏 pic.twitter.com/XYIqB9AzVs— Indian Tech & Infra (@IndianTechGuide) December 19, 2025మనవాళ్ళదంతా ఎడ్డెమంటే తెడ్డెమనే రకం.. ఫర్ ఎగ్జాంపుల్.. వన్ వే ట్రాఫిక్ అన్నారనుకోండి.. సరిగ్గా అదే రూట్ లోనే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అని పాటలు పాడుకుంటూ మరీ వెళుతుంటారు. పోలీసులు చూసి విజిల్ వేసినా.. పెద్దగా పట్టించుకోరు. ఒకరు అలా రావడం షురూ చేస్తే పది మందిదీ అదే దారి అవుతుంది. ఎంతైనా మనది గొర్రెదాటు కదా. సిగ్నల్ లైట్ల విషయం సరే సరి ఎర్రలైట్ ఆన్ కాగానే మనం బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే రష్ ఉండదు.. ఇలా ఉంటుందండి సగటు వాహనదారుడి సైకాలజీ.మనవాళ్ళదంతా ఎడ్డెమంటే తెడ్డెమనే రకం.. ఫర్ ఎగ్జాంపుల్.. వన్ వే ట్రాఫిక్ అన్నారనుకోండి.. సరిగ్గా అదే రూట్ లోనే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అని పాటలు పాడుకుంటూ మరీ వెళుతుంటారు. పోలీసులు చూసి విజిల్ వేసినా.. పెద్దగా పట్టించుకోరు. ఒకరు అలా రావడం షురూ చేస్తే పది మందిదీ అదే దారి అవుతుంది. ఎంతైనా మనది గొర్రెదాటు కదా. సిగ్నల్ లైట్ల విషయం సరే సరి ఎర్రలైట్ ఆన్ కాగానే మనం బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే రష్ ఉండదు.. ఇలా ఉంటుందండి సగటు వాహనదారుడి సైకాలజీ.అరే ఇదేందిర బై వన్ వే అంటూ రాసిండు గదా.. ఇట్టే వస్తున్నవేంది? అని ఎవరైనా అడిగితే... చుట్టూ ఎలితే లంబా అవుతది గందుకే షార్ట్ గా ఈ తొవ్వలో వస్తుండ అంటూ యమ కూల్ గా సమాధానం చెబుతారు. హెల్మెట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు జర ఫోర్స్ చేసిండ్రు అంటే.. గదేంది సర్ పొద్దునే ఈ రూట్ లో ఇట్టే వెళ్ళా.. గప్పుడు కూడా లేదు.. ఇప్పుడు అడుగుడేంది అంటూ ఉల్టా ప్రశ్న వేస్తుంటే సదరు పోలీసు నోరెళ్ళబెట్టాల్సిందే. ఇగ హారన్ కొట్టుడు అంటే మనకు మస్త్ మజా వస్తది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నా.. హారన్ దంచుతునే ఉంటం.. అరె బై ఆ సప్పుడేంది.. ట్రాఫిక్ ఉంది కదా అని విసుక్కొన్నారో.. హారన్ సౌండ్ మరింత పెరుగుతుంది. అదే విదేశాల్లో హారన్ కొట్టడం అంటే న్యూసెన్స్ గా భావిస్తారు.విదేశాల్లో ఇలా అంటే చాలు ఆ మా బాగా చెప్పొచ్చావులే.. అక్కడికే వెళ్ళలేకపోయావా అంటూ వ్యంగ్యం దట్టించి మరీ మాటలు వదులుతుంటారు. కానీ నిజాలు మాట్లాడుకోవాలంటే.. యూరోపియన్ దేశాల్లో అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాల్లో ట్రాఫిక్ రూల్స్ పట్టింపు చాలా ఎక్కువ. రోడ్డుపై టూవీలర్, ఫోర్ వీలర్ తోపాటు సైకిల్ పై వెళ్లే వారికి కూడా ప్రత్యేక లైన్లుంటాయి. ప్రభుత్వ బస్సులు నడపడానికి కూడా ప్రత్యేక లైన్లుంటాయి. పాదచారులకు వారు అత్యధిక ప్రాధాన్యమిస్తారు. పెడస్ట్రియన్ సిగ్నల్ పడిందంటే.. ఎన్ని వాహనాలైనా సరే అటూ ఇటూ నిలిచి వేచి చూడాల్సిందే. అలాగే స్కూల్ జోన్ వద్ద సైలంట్ జోన్ అని ఉంటుంది. అక్కడ హారన్ మోగిస్తే ఫైన్ కట్టాలి. అలాగే స్కూల్, హాస్పిటల్ వద్ద స్పీడుగా వెళ్ళినా పెనాల్టీ డబుల్ ఉంటుంది. టొరంటోలో ట్రాఫిక్ ఎప్పుడూ హెవీగానే ఉంటుంది. కానీ ప్రమాదాల శాతం చాలా తక్కువ. మనకూ ట్రాఫిక్ రూల్స్ బోలెడన్ని ఉన్నాయ్.. పాటించేవారి సంఖ్యే తక్కువ. రూల్స్ బ్రేక్ చేయడమంటే మనకు వెన్నతో పెట్టిన విద్య. అది తప్పని కూడా అనుకోం. పాపం ఢిల్లీలో విదేశీయులు మన అరాచకం చూసి అల్లాడిపోయారు. కనీసం రూల్స్ చెబితే పాటిస్తారేమోనని అనుకుని చెప్పడం ప్రారంభించారు. వారిది ఎంత దురాశో కదా.-ఆరెం. -
గిరిజన గళానికి గిన్నిస్ కిరీటం!
పుణే: భారతదేశం మరోసారి విశ్వ వేదికపై మెరిసింది. ఈసారి ఒక సాంస్కృతిక ఘనతతో, పుణే నగరం ’అత్యధిక పోస్టర్ల ప్రదర్శన’లో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. దేశంలోనే అతిపెద్ద పుస్తక మహోత్సవంలో భాగంగా ఈ చారిత్రక రికార్డు నెలకొల్పింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగ్రీకర్ శనివారం ఈ రికార్డును ధ్రువీకరించారు. అత్యధిక పోస్టర్ల ప్రదర్శన రికార్డులో అమెరికాను వెనక్కి నెట్టి, ఈ ఘనతను భారత్ సొంతం చేసుకుందని ప్రకటించారు. బిర్సా ముండాకు అంకితం ప్రపంచ రికార్డు సృష్టి వెనుక ఒక విశిష్ట లక్ష్యం ఉంది. ఈ రికార్డును గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండాకు నివాళిగా అంకితం చేశారు. పుస్తక మహోత్సవ కనీ్వనర్ రాజేష్ పాండే మాట్లాడుతూ, గిరిజన సమాజం, భారత స్వాతంత్య్ర ఉద్యమానికి బిర్సా ముండా చేసిన సేవలను గౌరవించేందుకు ఒక ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గిరిజన పదజాలంతో కూడిన పోస్టర్ల ప్రదర్శనతో గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని స్పష్టం చేశారు. 1,678 పోస్టర్లతో భారతీయ అస్తిత్వం ఫెర్గుసన్ కళాశాలలో జరుగుతున్న పుణే పుస్తక మహోత్సవంలో ఈ రికార్డును నెలకొల్పారు. నిర్వాహకుల సమాచారం ప్రకారం, గిరిజన పదాలను ప్రదర్శిస్తూ ఏకంగా 1,678 పోస్టర్లను ప్రదర్శించారు. గతంలో అమెరికాలో ఫిబ్రవరి 2025లో 1,365 పోస్టర్లతో నెలకొలి్పన రికార్డును ఈ ప్రదర్శన బద్దలు కొట్టింది. డిసెంబర్ 12న పుణే బుక్ ఫెస్టివల్, యశ్వంత్రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ, రైజ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ రికార్డును సాధించినట్లు గిన్నిస్ ధ్రువపత్రంలో పేర్కొన్నారు. అంతరిస్తున్న భాషల పరిరక్షణ సామాజిక కార్యకర్త గిరీష్ ప్రభూణే మాట్లాడుతూ, బిర్సా ముండా కృషి బహుముఖమైనదని కొనియాడారు. ‘అంతరించిపోతున్న మాండలికాలను పరిరక్షించడం అత్యవసరం. వాటిని దేవనాగరి లిపిలో నమోదు చేస్తే.. గిరిజన భాషలలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలవుతుంది’.. అని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్ 13 నుంచి 21 వరకు జరుగుతున్న ఈ పుణే పుస్తక మహోత్సవం, పుస్తక ప్రదర్శన మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, భాషా పరిరక్షణకు ఒక శక్తివంతమైన వేదికగా నిలిచింది. ఈ రికార్డు విజయంతో, పుణే నగరం పుస్తకాల పండుగను కేవలం వినోద కార్యక్రమంగా కాకుండా, సామాజిక చైతన్యం, సాంస్కృతిక గౌరవానికి చిహ్నంగా మార్చింది. -
వంద ఎకరాల ఫామ్ హౌస్.. లగ్జరీ కార్లు.. ధర్మేంద్ర ఆస్తులివే!
ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) ఇవాళ కన్నుమూశారు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా దశబ్దాలుగా చెరగని ముద్రవేసిన ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర మృతితో బాలీవుడ్‌తో పాటు సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.1935 డిసెంబర్ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ఆయన కేవలం 19 ఏళ్ల వయసులోనే ప్రకాశ్ కౌర్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే అనే మూవీతో తన సినీ ప్రస్థాన ప్రారంభమైంది. ఆ తర్వాత 'షోలే'లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆ సినిమా ఆయన సినీ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు. అంతేకాకుండా రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పని చేశారు.అయితే ఇవాళ ధర్మేంద్ర మరణించడంతో ఆయన ఆస్తులపై చర్చ మొదలైంది. తన కెరీర్లో ఎన్ని ఆస్తులు కూడబెట్టరనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఓవరాల్‌గా చూస్తే ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.335 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం హీరోగానే కాదు.. తన కెరీర్లో హోటల్, అతిథ్యరంగంలో బిజినెస్ చేశారు. 2015లో న్యూఢిల్లీలో తన మొదటి రెస్టారెంట్ గరం ధరం ధాబాను ప్రారంభించారు. ఆ తర్వాత 2022లో, కర్నాల్ హైవేలో హీ మ్యాన్ అనే రెస్టారెంట్ ప్రారంభించారు.లోనావాలాలో 100 ఎకరాల ఫామ్హౌస్పుణె సమీపంలోని లోనావాలాలోని అతని 100 ఎకరాల ఫామ్‌హౌస్ కూడా ఉంది. ఆయన తన కుటుంబంతో ముంబయి నుంచి ఈ ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి వస్తుంటారు. ఈ ఫామ్‌హౌస్‌లో అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ధర్మేంద్ర రూ. 17 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఆయన పేరిట ఉన్నాయి. రూ. 88 లక్షలకు పైగా విలువైన వ్యవసాయ భూమితో పాటు రూ. 52 లక్షల విలువైన వ్యవసాయేతర ప్లాట్స్ ఉన్నాయి. ఫామ్‌హౌస్ సమీపంలోని 12 ఎకరాల స్థలంలో ఓ రిసార్ట్‌ను అభివృద్ధి చేశారు.లగ్జరీ కార్లు..లగ్జరీ కార్లు అంటే ధర్మేంద్రకు చాలా ఇష్టం. ఆయన మొదట వింటేజ్ ఫియట్ అనే కారును కొన్నారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు రేంజ్ రోవర్ ఎవోక్ (రూ. 85.74 లక్షలు), మెర్సిడెస్-బెంజ్ (రూ. 98.11 లక్షలు)ను కొనుగోలు చేశాడు. అంతేకాకుండా 1983లో ధర్మేంద్ర విజేత ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించారు. తన బ్యానర్లోనే కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌లను బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. 1983లో బేతాబ్‌తో సన్నీ, 1995లో బర్సాత్తో బాబీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తన మనవడు కరణ్ డియోల్ పాల్ పాల్ దిల్ కే పాస్ అనే మూవీతో 2019లో అరంగేట్రం చేశాడు. అలా తనతో పాటు భారతీయ సినిమాపై కుటుంబ వారసత్వం శాశ్వతంగా ఉండేలా ప్రోత్సహించారు ధర్మేంద్ర. -
రూ.120 కోట్లతో ఏరోస్పేస్ విడిభాగాల తయారీ కేంద్రం విస్తరణ
గ్లోబల్ ఏరోస్పేస్ దిగ్గజం జీఈ ఏరోస్పేస్ (GE Aerospace) తన పుణె తయారీ కేంద్రాన్ని విస్తరించడానికి తాజాగా 14 మిలియన్ డాలర్ల (సుమారు రూ.120 కోట్లు) పెట్టుబడిని ప్రకటించింది. కంపెనీ పదో వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. ఇప్పటికే గతేడాది ప్రకటించిన 30 మిలియన్ డాలర్ల పెట్టుబడికి ఇది అదనం.ఈ తాజా పెట్టుబడి ప్రధానంగా అప్‌గ్రేడ్ చేసిన తయారీ ప్రక్రియలు, ఆటోమేషన్ కోసం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. గ్లోబల్ కమర్షియల్ జెట్ ఇంజిన్ ప్రోగ్రామ్‌ల కోసం మరింత అధునాతన ఇంజిన్ భాగాలను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని సైతం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కార్యకలాపాలు విస్తరించడం ద్వారా ఉత్పత్తిని క్రమబద్ధీకరించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం, భద్రత, నాణ్యత విషయంలో పుణె కేంద్రాన్ని మరింత బలోపేతం చేయాలని కంపెనీ భావిస్తోంది.ఈ సందర్భంగా జీఈ ఏరోస్పేస్ పుణె ఫెసిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వజిత్ సింగ్ మాట్లాడుతూ..‘కంపెనీ కార్యకలాపాల విస్తరణ మేక్ ఇన్ ఇండియా చొరవ పట్ల సంస్థ నిబద్ధతను, ప్రపంచ ఏరోస్పేస్ తయారీలో భారతదేశ పాత్రను ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో ఉపయోగపడుతుంది’ అని అన్నారు. 2015లో మల్టీ-బిజినెస్ మాన్యుఫ్యాక్చరింగ్ సైట్‌గా పుణెలో కంపెనీ యూనిట్‌ను స్థాపించింది. దేశవ్యాప్తంగా 2,200 మంది సప్లయర్ల నెట్‌వర్క్‌ను సంపాదించింది. ఏరోస్పేస్ విడిభాగాల తయారీలో 5,000 మందికి పైగా ప్రొడక్షన్ అసోసియేట్లకు శిక్షణ ఇచ్చింది. పుణె యూనిట్ ఫ్లైట్ డెక్ (Flight Deck) అనే ఏరోస్పేస్ ప్రొప్రియారిటీ లీన్ ఆపరేటింగ్ మోడల్ ద్వారా నడుస్తుంది. ఇది భద్రత, నాణ్యత, ఉత్పత్తుల సామర్థ్యాన్ని హైలైట్ చేసే మోడల్ అని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: రైల్వేకు ఐఆర్సీటీసీ కాసుల వర్షం.. ఎలాగంటే.. -
థార్‌తో విసిగిపోయిన యజమాని చేసిన పని సోషల్ మీడియాలో వైరల్
పూణే:ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా థార్ ఎస్‌యూవీతో విసిగిపోయిన కారు యజమాని వినూత్నంగా నిరసన తెలిపాడు. థార్ కారుని ఇంటి నుంచి షోరూం వరకు గాడిదలతో తరలించారు. అలా అయినా మహీంద్రా ప్రతినిధులు స్పందించి తన సమస్యను పరిష్కరిస్తారేమోనని ఆశగా ఎదురు చూశాడు. ఆ తర్వాత ఏమైందంటే?థార్‌తో రోజుకో పుట్టుకొస్తున్న సమస్యలతో విసిగిపోయిన వ్యక్తి.. గాడిదలతో షోరూమ్‌కు లాగించిన ఘటన పూణేలో జరిగింది. అక్బర్ ఖాన్ మహీంద్రా థార్ (2023 మోడల్)ను కొనుగోలు చేశాడు. లక్షలు వెచ్చించి కారును కొనుగోలు చేశాడన్న మాటేగాని నిత్యం ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. నాటి నుంచి ఇంజిన్ సమస్యలు, బ్రేక్‌డౌన్ ఫెయిలవ్వడం షోరూంకి తీసుకుపోయి బాగు చేయించుకోవడం, వేలవేలకు వేలు ఖర్చు చేయడం. ఇలా పరిపాటిగా మారింది. అలా అని థార్ సమస్యలు తీరాయా? అంటే అదీ లేదు. కారులోని సమస్యలతో ఇబ్బంది పడుతున్నా బాగుచేయండి మహాప్రభూ అంటూ షోరూం ప్రతినిధులకు కారు యజమాని మొరపెట్టుకున్నా.. ఫలితం శూన్యం. ఈ క్రమంలో ఇంజిన్ సమస్యలు, బ్రేక్డౌన్లు తరచూ ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ థార్ యజమాని కారును గాడిదలతో లాగించి షోరూమ్ ముందు ఉంచి తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. దీంతో ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ సందర్భంగా థార్ ఓనర్ అక్బర్ ఖాన్ మాట్లాడుతూ.. “థార్ వాహనం కొనుగోలు చేసిన తర్వాత ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. షోరూమ్‌కు ఎన్నిసార్లు తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. చివరికి గాడిదలతో లాగించి షోరూమ్ ముందు ఉంచి నా బాధను వెళ్లగక్కానని చెప్పుకొచ్చాడు. వీడియో వైరల్ కావడంపై షోరూమ్ ప్రతినిధులు స్పందిస్తూ, “వాహన యజమానిని సంప్రదించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు.ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది యజమాని వినూత్న నిరసనను ప్రశంసిస్తుండగా, మరికొందరు కంపెనీపై విమర్శలు చేస్తున్నారు. Pune: Frustrated Mahindra Thar Owner Ties Donkeys To SUV, Drags It To Wakad Showroom In Protest pic.twitter.com/3s2LizjBhF— Pune First (@Pune_First) November 13, 2025 -
ఏరా చిన్నా.. పోలీసులతోనే ఆటలా?
నిండా పాతికేళ్లు కూడా లేని ఓ కుర్రాడు పోలీసులకే సవాల్ విసిరాడు. దమ్ముంటే పట్టుకోండి.. అంటూ పుష్ప రేంజ్ సవాల్ విసిరాడు. సోషల్ మీడియాలో అది కాస్త వైరల్ అయ్యింది. అటు ఇటు తిరిగి ఖాకీలకు చేరడంతో వాళ్లూ దానిని అంతే సీరియస్‌గా తీసుకున్నారు. "Catch Me If You Can" అంటూ సవాల్ చేసిన ఓ యువకుడిని పట్టుకుని ఓ వీడియో తీయించారు. పుణెలో ఓ కుర్రాడు తన కవాసాకి నింజా బైక్‌కు "Will Run" అనే నెంబర్ ప్లేట్ పెట్టి.. సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దమ్ముంటే పట్టుకోండి అంటూ మరో కుర్రాడు ఆ బైక్ తీసి వైరల్ చేశాడు. ఈ పోస్ట్‌ను గమనించిన పుణె పోలీసులు "We can, and we will" అంటూ స్పందించారు. Ft. Catch me if u can @CPPuneCity @PuneCityTraffic @nachiket1982 pic.twitter.com/wBnEIJMPLq— NitishK (@nitipune007) November 11, 2025 We can, and we will…Just a matter of time.Watch this space for updates! #ChallengeAccepted https://t.co/DyezD3Yn8U— पुणे शहर पोलीस (@PuneCityPolice) November 12, 2025కొన్ని గంటల్లోనే రాహిల్‌ను గుర్తించి పట్టుకున్నారు. అనంతరం అతని బైక్, అతని క్షమాపణ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఈ తప్పు చేశాను, మీరు చేయకండి" అంటూ రాహిల్ వీడియోలో చెప్పాడు. సదరు యువకుడ్ని 21 ఏళ్ల రాహిల్‌గా, వీడియో పోస్ట్ చేసింది అతని స్నేహితుడు నితీష్‌గా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. పోలీసులు "Street's not the place to play, boy!" అంటూ గట్టిగా హెచ్చరించారు. Street’s not the place to play, boy!We always keep our promises. 😉Turns out the guy wasn't elusive enough. Played dangerous games, won dangerous prizes.#NoConsolationPrize#ChallengeCompleted#ElusionEndsHere#CaughtYou#AlwaysForPunekars#PunePolice@CPPuneCity https://t.co/zAoMI5Yld6 pic.twitter.com/mlAGVvz4ro— पुणे शहर पोलीस (@PuneCityPolice) November 12, 2025ఇదే తరహాలో గత వారం గురుగ్రామ్‌లో ఇద్దరు యువకులు బైక్ మీద మద్యం సేవిస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై కూడా అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని, ప్రజల భద్రతకు ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
మంటల్లో చిక్కుకున్న కంటైనర్లు, కారు
పుణే: మహారాష్ట్రలోని పుణే నగరంలో ముంబై–బెంగళూరు జాతీయ రహదారిపైనున్న వంతెనపై గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న రెండు భారీ కంటైనర్ వాహనాల మధ్య ఓ కారు చిక్కుకుపోయింది. రాపిడి కారణంగా అవి మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో 8 మంది మరణించారని, 14 మంది గాయడ్డారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం ఎలా జరిగిందో గుర్తించినట్లు చెప్పారు. ముంబై వైపు వెళ్తున్న కంటైనర్ బ్రేక్ విఫలం కావడంతో అదుపు తప్పింది. ముందున్న మరో కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ రెండు వాహనాల మధ్య ఓ కారు వెళ్తోంది. అది ఆ రెండింటి మధ్య ఇరుక్కుపోయింది. వెంటనే మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే మూడు వాహనాలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పారు. महाराष्ट्र –पुणे में ट्रक के ब्रेक फेल होने से करीब 25 गाड़ियां आपस में टकराईं। कई वाहनों में आग लगी। 9 लोगों की मौत हुई।@YashAhmad8 pic.twitter.com/Gtz1nhHa64— Sachin Gupta (@SachinGuptaUP) November 13, 2025 -
నిర్మలా సీతారామన్ సంతకం ఫోర్జరీ చేసి.. 99లక్షలు కాజేశారు
పూణే: హలో మేడం.. మేం ‘డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ’ నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఆధార్‌కు లింక్ చేసిన ఫోన్ నంబర్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం" అంటూ అరెస్టు వారెంట్ పంపించారు. లెటర్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతకం ఉండటంతో బాధితురాలు నమ్మింది.ఆ తర్వాత ఫోన్ చేసిన వ్యక్తి రూ.99 లక్షలు అడిగాడు. భయంతో బాధితురాలు ఆ మొత్తాన్ని చెప్పిన బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసింది. అనంతరం అదే నంబర్‌కు కాల్ చేయగా..ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించింది. తాను మోసపోయినట్లు గ్రహించిన ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.సైబర్ నేరస్తులు ఇప్పుడు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఓటీపీలు షేర్ చేయొద్దంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంతో ప్రజల్లో అవగాహన పెరగడంతో, సైబర్ మోసగాళ్లు నకిలీ అరెస్ట్ వారెంట్లు, అధికార ముద్రలు, ప్రముఖుల సంతకాలను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.తాజా ఘటన అక్టోబర్ చివరి వారంలో పూణేలోని కొథ్రుడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలు ఎల్ఐసీ సంస్థలో ఉన్నతోద్యోగినిగా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేశారు.ఇంట్లో ఉంటున్న సమయంలో ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ‘డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ’ నుంచి సీనియర్ అధికారినంటూ నిందితుడు పరిచయం చేసుకున్నాడు. ఆమె ఆధార్‌కు లింక్ చేసిన ఫోన్ నెంబర్‌తో అక్రమ లావాదేవీలకు ఉపయోగించినట్లు బెదిరించాడు.తర్వాత ఆమెను జార్జ్ మాథ్యూ అనే మరో వ్యక్తికి కనెక్ట్ చేసి, మనీలాండరింగ్ కేసులో ఆమె పేరు ఉందని చెప్పాడు.నిర్మలా సీతారామన్ నకిలీ సంతకంతో, అధికారిక ముద్ర, సీల్‌తో కూడిన అరెస్ట్ వారెంట్ పంపించారు. ఆమె వయస్సు కారణంగా మినహాయింపు ఇస్తున్నామని, విచారణ కోసం కెమెరా ముందు రావాలని సూచించారు. ధృవీకరణ కోసం కొంత నగదు బదిలీ చేయాలని చెప్పడంతో, ఆమె రూ.99 లక్షలు పంపించారు. చివరికి తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాల్ని పోలీసుల్ని ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
IPL 2026: ఆర్సీబీ అభిమానులకు చేదు వార్త
2025, జూన్ 3.. ఆర్సీబీ అభిమానుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఆ రోజు ఆర్సీబీ (RCB) తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే ఆర్సీబీ ఆటగాళ్లకు, ముఖ్యంగా అభిమానులకు ఆ ఆనందం ఎంతో సేపు మిగల్లేదు. మరుసటి రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయపడ్డారు. అభిమానుల ఉత్సాహం, అధికారుల నిర్లక్ష్యం కలిసినప్పుడు ఎంతటి విషాదం చోటు చేసుకుంటుందో ఈ ఘటన రుజువు చేసింది.సురక్షితం కాదుఈ ఘోర విషాదంపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి జాన్ మైఖేల్ డికున్హా నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చిన్నస్వామి స్టేడియం మ్యాచ్‌ల నిర్వహణకు సురక్షితం కాదని తేల్చింది. ఈ స్టేడియం భారీ జనసమూహాలు గుమి కూడటానికి అనర్హంగా ప్రకటించింది. కమిషన్ నిర్ణయం వల్ల ఆర్సీబీ 2026 ఐపీఎల్ సీజన్లో తమ హోం మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలో ఆడే అవకాశం కోల్పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సమాచారం తెలిసింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ తమ తాత్కాలిక హోం గ్రౌండ్‌గా పూణేలోని గహున్జే స్టేడియాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.ఓ ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం.. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పుణేలోని గహున్జే స్టేడియాన్ని ఆర్సీబీకి తాత్కాలిక హోం గ్రౌండ్‌గా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ అంశంపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కొన్ని సాంకేతిక అంశాలు పరిష్కారమైతే, ఆర్సీబీకి పుణే వేదికగా మారే అవకాశం ఉంది.ఆర్సీబీ అభిమానులకు చేదు వార్తఈ వార్త ఆర్సీబీ అభిమానులకు తీరని శోకాన్ని కలిగిస్తుంది. 17 ఏళ్ల తర్వాత తొలి టైటిల్ సాధిస్తే.. ఆ సంతోషాన్ని హోం గ్రౌండ్లో ఆస్వాదించలేమా అని వారు వాపోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో తాము హోం గ్రౌండ్లో మ్యాచ్‌లు ఆడలేమని తెలిసి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అన్నీ కుదిరి హోం గ్రౌండ్ పూణేకి మారితే ఆర్సీబీకి సొంత అభిమానులు దూరమయ్యే ప్రమాదం ఉంది. కొత్త వాతావరణంలో ఆర్సీబీ ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఇమడటానికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంపై బీసీసీఐ నుంచి కాని ఐపీఎల్ నుంచి కాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: IND vs SA: భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు.. క్లారిటీ ఇచ్చిన కోచ్ -
కోటి రూపాయల డిజిటల్ అరెస్ట్ స్కాం : ఆగిన రిటైర్డ్ ఆఫీసర్ గుండె
ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎంత అవగాహన కల్పించిన దేశంలో ఏదో ఒక మూల ఏదో ఒక మోసం నమోదవుతనూ ఉంది. తాజాగా ముంబై పోలీసులమని చెప్పి ఒక రిటైర్డ్ ఉద్యోగిని నిలువునా ముంచేశారు. జీవితంతం కష్టపడి సంపాదింఇ, పొదుపు చేసుకున్న సొమ్ము "డిజిటల్ అరెస్ట్" స్కాంలో పోవడంతో ఆయన గుండే ఆగిపోయింది. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ స్కామ్ స్టోరీ ఎలా మొదలైంది అంటే..పూణేకు చెందిన 82 ఏళ్ల రిటైర్డ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి, ఆయన 80 ఏళ్ల భార్యని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ఆగస్టు 16న ముంబై పోలీసులం, "ఎన్కౌంటర్ స్పెషలిస్ట్" అంటూ వచ్చిన ఒక ఫోన్ కాల్ వారి జీవితాన్ని అతలా కుతలం చేసింది. ఆగస్టు 16-సెప్టెంబర్ 17 మధ్య సాగిన ఆ స్కాంలో విదేశాల్లో స్థిరపడిన ముగ్గురు కుమార్తెలు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారంటూ భార్యభర్తల్లిద్దరినీ మోసగాళ్లు బెదిరించారు. ఒక ప్రైవేట్ ఎయిర్‌లైన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన బ్యాంక్ ఖాతా , ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉన్నాయంటూ మూడు రోజుల పాటు వారిని కదలకుండా, మెదలకుండా డిజిటల్ అరెస్ట్" చేసిన భయభ్రాంతులకు గురి చేశారు.ఫోన్ కెమెరాను స్విచ్ ఆన్‌లో ఉంచమని ఆదేశించారు. ఆ తరువాత సీబీఐ ఢిల్లీ ఆఫీసునుంచి IPS అధికారిణిగా చెప్పుకుంటూ మరొకాల్ వచ్చింది. మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నారు కాబట్టి మిమ్మల్ని 'హోమ్ అరెస్ట్' లేదా 'జైలు అరెస్ట్'లో ఉంచుతామని చెప్పారు. అలా వారికి సంబంధించిన అన్ని బ్యాంక్ , ఆధార్ వివరాలను సేకరించి, ఐదు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని బలవంతం చేశారు. అలా ఈ దంపతుల పొదుపు మొత్తాన్ని, వారి కుమార్తెలు విదేశాల నుండి పంపిన డబ్బులు కలిపి మొత్తం రూ.1.19 కోట్లు కొట్టేశారు. ఇక అప్పటినుంచి కాల్స్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో మోసపోయామని గ్రహించి, వారి కుమార్తెలలో ఒకరిని సంప్రదించారు, వారు నేరాన్ని పోలీసులకు నివేదించమని కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.పూణే సైబర్ పోలీసులకు చెందిన సీనియర్ ఇన్స్పెక్టర్ అందించిన వివరాల ప్రకారం "డిజిటల్ అరెస్ట్" స్కామ్‌లో తాము మోసపోయామని గ్రహించిన సదరు అధికారి అక్టోబర్ 22న ఆ షాక్‌లో, ఇంట్లో కుప్పకూలి పోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. దీనిపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జీవితాంతం పొదుపు చేసిన డబ్బును పోగొట్టుకోడం, స్కామర్ల వేధింపుల కారణంగా తన భర్త తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని , అదే ఆయన ప్రాణాలు తీసిందని వాపోయింది.సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరికలుఫోన్ కాల్ ద్వారా ఎవరినీ "అరెస్టు" అనేది జరగదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి అంటున్నారు సైబర్ క్రైమ్ పరిశోధకులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎపుడూ ఎవరికీ, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు షేర్ చేయవద్దని, ఈ వివరాలు లేదా డబ్బును డిమాండ్ చేసే హక్కు ఏ అధికారికీ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్‌పట్ల భయపడకుండా, అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. మోసగాళ్ళు చిన్న నగరాల నుండి సిమ్ కార్డులు, VPN నెట్‌వర్క్‌లను ఉపయోగించి తమ గుర్తింపును దాచిపెడుతున్నారన్నారు.చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ -
ఎంబిఏ చేసిన 80 ఏళ్ల సీఈవో..!
నేర్చుకోవాలనే అంతులేని తపనకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటారు కొందరు. పైగా మంచి ఉన్నత పొజిషన్లో పనిచేసి పదవీ విరమణ పొందాక కూడా విద్యను అభ్యసించడం అంటే మాటలు కాదకదా..!. చదవాలన్న కోరిక ఉన్నా..వయసు సహకరించదు. పోనీ కొత్తగా ఆ స్పీడ్ టెక్నాలజీని అందుకుంటూ చదవాలంటే వామ్మో అనేస్తారు ఎవ్వరైనా..కానీ ఈ 80 ఏళ్ల మహిళ వాటన్నింటిని ఖతారు చేస్తూ..దిగ్విజయంగా ఎంబిఏ పూర్తి చేసింది. రెండుసార్లు కేన్సర్‌తో పోరాడి గెలిచి కూడా..ఏ మాత్రం అధైర్యపడకుండా ముందుకు సాగి..నేటి యువతకు ఆదర్శంగా నిలిచారామె.ఆ మహిళే 80 ఏళ్ల ఉషా రే(Usha Ray). పూణేలోని పాటిల్ విద్యాపీఠ్ సెంటర్ ఫర్ ఆన్లైన్ లెర్నింగ్‌లో హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్లో MBA కోసం చేరినప్పుడు ఆమె వయసు 77 ఏళ్లు. ఈ ఏడాది ఆగస్టుకి 80 ఏళ్లు వచ్చిన రెండు వారాలకు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యారామె. నిజానికి ఈ సబ్జెక్టు ఆమెకు కొత్త. ఎందుకంటే ఆమె జంతుశాస్త్రంలో ఎంబిఏ చేశారు. దశాబ్దాలుగా పాఠశాల ఉపాధ్యాయురాలిగా కొనసాగిన అనుభవం ఉందామెకు. ఇప్పుడు కొత్తగా ఆర్థిక శాస్త్రం అర్థం చేసుకోవడం, కంప్యూటర్‌తో కుస్తీ పట్టడం అన్ని సవాళ్లే ఆమెకు. అయినా..తగ్గేదే లే అంటూ ఎంబీఏ చేసేందుకు ఉత్సాహం చూపించిందామె. ఆమె ఇంగ్లాండ్, యోమెన్ వంటి అంతర్జాతీయ పాఠశాలల్లో భోధించారు కూడా. ప్రస్తుతం ఆమె లక్నోలో గోమతినగర్‌లోని లవ్ శుభ్ హాస్పిటల్ సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ కోరిక ఎలా పుట్టిందంటే..2009లో టీచింగ్ వృత్తి నుంచి పదవీ విరమణ చేశాక..ఆస్పత్రిలో సీఈవోగా పనిచేస్తున్నప్పుడు ఈ కోరిక కలిగిందామెకు. అక్కడ చాలామంది ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నప్పుడూ..ప్రతిచోట ఎంబీఏ అని కనిపించేదట ఆమెకు. అందరూ చేసే ఈ ఎంబీఏ ఏంటి?..ఎలాగైనా తెలుకోవాలన్న ఉద్దేశ్యంతోనే చేయాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు ఉషా రే. అలా 2023లో ఆన్లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో చేరింది. అది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబధించిన విభాగంలో చేయడం ఆమె ఉద్యోగానికి సరిగ్గా సరిపోతుందని చెప్పొచ్చు. అంతేగాదు ఆమెకు 2003లో స్టేజ్-4 ఛాతీ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఎనిమిది నెలల కీమోథెరపీ, రేడియో థెరపీతో కోలుకుంది. మళ్లీ మహమ్మారి సమయంలో కేన్సర్ తిరగబెట్టింది. మళ్లీ ధైర్యంగా ఎదుర్కొంది. ఇన్ని ఆటోపోట్లు చూసినా ఆమె వెనక్కి తగ్గకుండా ఎంబిఏ చేయాలనుకోవడం విశేషః. ఇక్కడ ఉషా రే ఎదురుదెబ్బ తగిలినప్పుడే జాగ్రత్తగా ఉండాలే తప్ప భయంతో అస్సలు ఆగిపోకూడదు అంటారామె. చివరగా దిగ్విజయంగా ఎనిమిది పదుల వయసులో ఎంబీఏ చేయగలిగానంటే అదంతా తన కుటుంబం, సహోద్యోగుల అందించిన ప్రోత్సాహమే అంటూ క్రెడిట్ అంతా వాళ్లకే ఇచ్చేశారు ఉషారే. (చదవండి: ప్లీజ్ సరిగా కూర్చోండి..! యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు ఫైర్) -
పుణేకి పెద్ది
ప్రేయసితో కలిసి పుణేలో ల్యాండ్ అయ్యాడు పెద్ది. అక్కడి అందమైన పరిసరాల్లో ఇద్దరూ ఆటా పాటా మొదలుపెట్టారు. రామ్‌చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రానికి సంబంధించినదే ఈ ఆటా పాటా. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీకి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ పుణేలో ఆరంభమైంది. ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్, జాన్వీ కపూర్ పై ఓ పాట చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. చిత్రసంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఒకవైపు షూటింగ్ జరుపుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్ రత్నవేలు. -
భారత్‌లో జేబీటీ మారెల్ గ్లోబల్ ప్రొడక్షన్ సెంటర్
ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ దిగ్గజం జేబీటీ మారెల్ భారత్‌లో తమ గ్లోబల్ ప్రొడక్షన్ సెంటర్ (జీపీసీ)ని ఏర్పాటు చేసింది. పుణెలో ప్రారంభించిన ఈ సెంటర్ .. భారత్, ఆసియా పసిఫిక్ మార్కెట్లలోని తమ కార్యకలాపాలకు అవసరమైన సొల్యూషన్స్‌ను అందిస్తుందని సంస్థ తెలిపింది.ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు, పర్యావరణహితమైన ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలకు ఉపయోగపడే అధునాతన ప్రక్రియలను రూపొందించేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ ఈవీపీ అగస్టో రిజొలొ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో భారత్ కూడా ఒకటిగా నిలుస్తోంది. తయారీ జీడీపీలో సుమారు 12 శాతం వాటాతో, 80 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. -
Pune: మూతపడిన స్కూళ్లు.. రేపు కూడా సెలవు?
పూణె: మహారాష్ట్రలోని పూణెలో నిన్న(ఆదివారం) రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ప్రజాజీవనాన్ని ఘోరంగా దెబ్బతీసింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదులుతోంది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో పూణేలోని పాఠశాలలకు ఈ రోజు(సెప్టెంబర్ 15) సెలవు ప్రకటించారు. Pune Rains: Heavy Downpour Triggers Traffic Jams, Waterlogging Across City🔗 https://t.co/ibQExSolWN#punenews #punerains #Rain #weatheralert pic.twitter.com/9HCdtVz3w0— Free Press Journal (@fpjindia) September 15, 2025వాతావారణశాఖ అధికారుల సూచనల మేరకు సెప్టెంబర్ 16న కూడా సెలవు ప్రకటించారు. భారీ వర్షపాతం కారణంగా పూణేలో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పూణే మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. భారత వాతావరణ శాఖ పూణేతో పాటు సమీప జిల్లాల్లో భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. భారత వాతావరణ శాఖ పూణే, ముంబై, థానే, రాయ్‌గడ్, బీడ్, అహల్యానగర్, లాతూర్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు కురియనున్నాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. -
హైదరాబాద్‌కు మరో వందేభారత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు మరో వందేభారత్ రైలు రాబోతోంది. సికింద్రాబాద్–పుణే మధ్య ఇది నడవనుంది. ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణికుల సంఖ్య భారీగా ఉన్నందున వందేభారత్ రైలు నడపాలని గతంలోనే నిర్ణయించారు. కానీ, రేక్ అందుబాటులో లేక జాప్యం జరిగింది. తాజాగా హైదరాబాద్ నుంచి పుణేకు నడిపేందుకు రేక్ కేటాయించినట్టు తెలిసింది. నెల రోజుల్లో దాన్ని పట్టాలెక్కించేందుకు రైల్వే బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్–పుణే మధ్య ప్రయాణికుల సంఖ్య భారీగా ఉంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య 17 రైళ్లు నడుస్తుండటం విశేషం.8 గంటల్లోనే..రెండు నగరాల మధ్య 592 కి.మీ. దూరం ఉంది. సాధారణ రైళ్లు గమ్యం చేరేందుకు 11 గంటల నుంచి 13 గంటల సమయం పడుతోంది. శతాబ్ది రైలు 8.30 గంటలు, దురంతో 8.45 గంటల సమయం తీసుకుంటున్నాయి. ఈ నిడివిని వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 8 గంటల్లో చేరుకోనుంది. దీంతో అత్యంత వేగంగా వెళ్లే రైలుగా వందేభారత్ (Vande Bharat) నిలవనుంది. వందేభారత్ రైలు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం పుణేకు చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్నం బయలుదేరి తిరిగి రాత్రి 11 వరకు సికింద్రాబాద్ (Secunderabad) చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసు ప్రారంభమయ్యాక డిమాండ్‌ను బట్టి దురంతోను కొనసాగించాలా వద్దా నిర్ణయించనున్నారు. హైదరాబాద్ నుంచి ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు నేరుగా విమాన సర్వీసులు శంషాబాద్: నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డ్యామ్ నగరానికి హైదరాబాద్ (Hyderabad) నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కేఎల్ 874 విమానం బుధవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన తొలి సర్వీసును టేకాఫ్ తీసుకుని అమ్‌స్టర్‌డ్యామ్ నగరంలోని షిపోల్ విమానాశ్రయానికి బయలుదేరింది. హైదరాబాద్ నుంచి సోమ, బుధ, శనివారాల్లో ఈ సర్వీసులు ఉంటాయి. ఆమ్స్టర్డ్యామ్ షిపోల్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ఆది, మంగళ, శుక్రవారాలు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.చదవండి: మొత్తానికి దొరికారు.. 54 దాడులు, 33 మంది అరెస్ట్ఢిల్లీ, ముంబై, బెంగళూరు (Bengaluru) తర్వాత భారత్‌లోకి నాలుగో గేట్గా ఆమ్స్టర్డ్యామ్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు తమ సర్వీసులు ప్రారంభించినట్లు ఈ సందర్భంగా కేఎల్ఎం సీవోవో స్టీవెన్ మార్టెన్ తెలిపారు. దీనిద్వారా ఫార్మా, ఐటీ, పర్యాటక రంగాల్లో పురోగాభివృద్ధికి బాటలు పడతాయని నెదర్లాండ్స్ రాయబారి మారిసా గెరార్డ్స్ అన్నారు. కొత్త కనెక్టివిటీ యూరప్, ఉత్తర అమెరికా బంధాలను మెరుగుపరుస్తుందని ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ పేర్కొన్నారు. -
Pune: భారీ వర్షం మధ్య గణపతికి ఆహ్వానం
పూణె: భారీవర్షం నడుమ మహారాష్ట్రలోని పూణెవాసులు గణపతికి స్వాగతం పలికారు. #WATCH | Pune, Maharashtra | A procession is being carried out to take Shrimant Dagdusheth Halwai Ganpati idol to the 'Pandal' for 'Sthapana' pic.twitter.com/P6J77wEgo9— ANI (@ANI) August 27, 2025నగరంలో ప్రముఖంగా నెలకొల్పిన కస్బా గణపతి, తంబ్డి జోగేశ్వరి గణపతి, గురూజీ తాలిమ్ గణపతి, తులసిబాగ్ గణపతి, కేసరివాడ గణపతి, దగ్దుషేత్ హల్వాయి గణపతి, భౌసాహెబ్ రంగరి గణపతి తదితర వినాయక మండలాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.Punekars Welcome Ganpati Bappa With Devotion Despite Heavy Rains pic.twitter.com/YBVi15wNx1— Pune First (@Pune_First) August 27, 2025నగరం అంతటా పండుగ వాతావరణం కనిపిస్తోంది పలువురు తమ ఇళ్లకు గణపతి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. నగరంలో మొత్తం 3,959 గణేశ్ మండపాలు ఏర్పాటయ్యాయి.ఉత్సవాలు శాంతియుతంగా, సురక్షితంగా జరిగేందుకు పూణే పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఇందుకోసం ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలతో కూడిన నిఘా కెమెరాలు, ఆధారిత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లు, మొబైల్ నిఘా వాహనాలు, డ్రోన్ ఆధారిత వైమానిక పర్యవేక్షణ, జీపీఎస్ ట్రాకర్లు వినియోగిస్తున్నారు.రాష్ట్ర శబ్ద కాలుష్య నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 6న సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్ల వినియోగానికి అనుమతులిచ్చారు.శాంతిభద్రతల దృష్ట్యా ఆగస్టు 27, సెప్టెంబర్ 6వ తేదీలలో పూణే జిల్లా అంతటా మద్యం అమ్మకాలు నిషేధించారు. -
ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు
మహిళలు అనుకోవాలేగానీ ఏదైనా సాధించి తీరతారు. అది వ్యవసాయం, వ్యాపారం అయిన పట్టుబట్టి విజయం సాధించాడంలో మహిళలు ముందంజలో ఉంటారు. అనేకమంది మహిళల విజయ గాథలే దీనికి అక్షర సత్యాలు. వారి సంకల్ప బలం అలాంటిది. అలా చిన్న వయసులోనే సక్సెస్ ఫుల్ మహిళలలో ఒకరిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు పూణేకు చెందిన మహిళా రైతు. క్యాప్సికం (Capsicum ) సాగుతో ఏకంగా ఏడాది రూ. 4 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. పదండి ఆమె సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని కల్వాడి గ్రామానికి చెందిన విద్యావంతురాలు ప్రణిత వామన్. పుణెలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ కాలేజీ నుంచి ఎంబీఏ అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్లో పట్టా పుచ్చుకుంది. ఎంబీఏ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీతో పనిచేసిన నేపథ్యంలో తనకెంతో ఇష్టమైన వ్యవసాయం వైపే మొగ్గు చూపింది. తనకంటూ సొంతంగా ఎదగాలని, తద్వారా మరో పదిమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుగా సాగింది. తన తమకున్న పొలంలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. ఆమె ఆశయానికి ఉపాధ్యాయుడిగా పనిచేసి, రిటైరయ్యి, వ్యవసాయం చేసుకుంటున్న తండ్రి ప్రోత్సాహం కూడా లభించింది.చదవండి: కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా?తండ్రి ప్రోత్సాహం రూ. 20 లక్షల పెట్టుబడి2020లో తనకున్న కొద్దిపాటి భూమిలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. తనకున్న పాలిహౌజ్ నైపుణ్యానికి తోడుగా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ లభించింది. పాలీహౌస్ సాగు అంటూ వ్యవసాయంలో లేటెస్ట్ హైటెక్ వ్యవసాయం అని చెప్పవచ్చు. తీవ్రమైన వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ, ఉష్ణోగ్రత, తేమ , ఇతర పారామితులను నిర్వహించడం ద్వారా ఏడాది పొడవునా లాభదాయకమైన సాగు చేయడం.అలా రూ. 20 లక్షలు పెట్టుబడితో తన సాగుకు డ్రిప్ ఇరిగేషన్ పద్దతిని ఎంచుకుంది. ఒక్కో మొక్క ధర రూ. 10. చొప్పున బారామతి నుంచి నారును తీసుకొచ్చి నాటింది. మూడు నాలుగు నెలలకే క్యాప్సికం పంట చేతికి అందింది. దాదాపు 40 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. కానీ కరోనా వైరస్,లాక్ డౌన్ సంక్షోభం ముంచుకొచ్చింది. అయినా అధైర్య పడకుండా ఆన్లైన్ మార్కెటింగ్ ఎంచుకుంది.ప్రస్తుతం పాతిక ఎకరాలు, ఏడాదికి రూ. 4 కోట్లుమొదటి పంటలో 40 టన్నుల ఎరుపు, పసుపు ,ఆకుపచ్చ బెల్ పెప్పర్స్ దిగుబడి వచ్చింది. వాటిని కిలోకు రూ. 80 చొప్పున అమ్మింది. ఫలితంగా రూ. 32 లక్షల టర్నోవర్‌తో, తొలి ఏడాదిలోనే రూ. 20 లక్షల పెట్టుబడిని తిరిగి వచ్చేసిందని ప్రణీత స్వయంగా తెలిపింది. తొలి ఏడాదిలోనే రూ. 20 లక్షల పెట్టుబడిగాను సుమారు రూ. 12 లక్షలు లాభం వచ్చింది. ఈ ఉత్సాహంతో మరింత ధైర్యంగా అడుగులు వేసింది. 2021లో 25 ఎకరాలకు తన పరిధిని విస్తరించుకుంది. పాలిహౌస్ విధానంలో క్యాప్సికం పంటను సాగు కొనసాగిస్తోంది. ఇందులో 10 ఎకరాలు సొంత పొలం కాగా, మరో 15 ఎకరాలు లీజుకు తీసుకుంది అలా ఖర్చులు పోను ఏడాదికి రూ. 2.25 కోట్ల లాభంతో విజయవంతమైన యువమహిళా రైతుగా నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్‌పేజీపై మెరిసిన సమంత -
50 ఏళ్లైనా చెక్కు చెదరని రోడ్డు
ఈ రోజు వేస్తే.. నెల రోజుల తరువాత గుంతలు. ఇది ఇటీవలి కాలంలో రోడ్ల దుస్థితి. కానీ.. ఆ రోడ్డు వేసిన 50 ఏళ్లకు కూడా చెక్కు చెదరలేదు. 35 ఏళ్ల తరువాత ఒక్కసారి మాత్రమే మళ్లీ తారు వేశారంతే. కేవలం పదేళ్ల వారంటీతో వేసిన రోడ్డు 50 ఏళ్లయినా రిపేరుకు రాకపోవడానికి కారణమేంటి? అసలు ఒక రోడ్డు అన్నేళ్లు గుంతలు పడకుండా ఎలా ఉంటుంది? వేసిన కొద్ది రోజులకే గుంతలు పడేలా రోడ్లేస్తున్న ప్రస్తుత కాంట్రాక్టర్లు, నేతల్ని సిగ్గు పడేలా చేస్తున్న ఆ రోడ్డు ఎక్కడ ఉంది? ఇవన్నీ తెలియాలంటే.. మీరు పుణేకి వెళ్లాల్సిందే. ఆ రోడ్డు.. పుణేలోని జంగ్లీ మహరాజ్ రోడ్డు. దీన్ని బ్లాక్ పాంథర్ లైన్‌గా కూడా పిలుచుకుంటారు. 1976లో 2.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో వేశారు. వేసేనాటికి పదేళ్లుంటే చాలనుకున్నారు. కానీ.. కొత్తగా నిర్మించిన రోడ్లు, వంతెనలు కూలిపోతున్నప్పటికీ, దాదాపు 50 ఏళ్ల కిందట నిర్మించిన రోడ్డు మాత్రం ఒక ప్రత్యేకమైన పౌర ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. అయితే.. చెక్కు చెదరకుండా ఉన్నప్పటికీ.. 2014లో మరోసారి తారు వేశారు. పుణేలోని జంగ్లీ మహారాజ్ రోడ్డులో ప్రసిద్ధ రెస్టారెంట్లు, కొన్ని ముఖ్యమైన దేవాలయాలున్నాయి. రోడ్డు ఎంత బాగుంటుందంటే.. తమ యవ్వనంలో రాత్రి పూట రేస్ ట్రాక్‌గా ఉపయోగించుకునేవాళ్లమని చెబుతున్నారు స్థానికుడు 70 ఏళ్ల ఉపేంద్ర లక్ష్మేశ్వర్. ‘ప్రారంభించిన మూడు నెలలకే కర్ణాటకలోని రూ. 6.5 కోట్ల చిక్కోడి వంతెన కూలిపోయింది’, ‘ప్రారంభించిన మూడు నెలలకే ఢిల్లీ విమానాశ్రయ పైకప్పు గుంతలు’, ‘గురుగ్రామ్‌లో రోడ్డు గుంతలో భారీ ట్రక్కు దిగబడింది’వంటి కని, వినిపిస్తున్న ఈ కాలంలో నాణ్యమైన మౌలిక సదుపాయాలకు ఇదో మచ్చు తునక అంటారు అతని కొడుకు 40 ఏళ్ల సిద్ధార్థ్ లకేష్మశ్వర్. మిగిలిన రోడ్ల నిర్మాణంలో ఈ బ్లాక్ పాంథర్ లైన్ నిర్మాణాన్ని ఎందుకు అనుసరించలేదనేది స్థానికుల ప్రశ్న. విశ్వాత్మక్ గురుదేవ్ అని కూడా పిలుచుకునే జంగ్లి మహారాజ్ 1818లో బరోడాలో (ఇప్పుడు గుజరాత్‌లోని వడోదర) జన్మించారు. పుణేలోని శివాజీనగర్‌లో ఉన్న దట్టమైన భంబుర్డే అడవులలో ధ్యానం చేశారు. అక్కడే ఇప్పుడు రోడ్డు ఉంది. 1972లో మహారాష్ట్ర తీవ్రమైన కరువును ఎదుర్కొంది. ఆ తర్వాత 1973లో వరదలు పుణే రోడ్లను ధ్వంసం చేశాయి. అయితే ముంబై రోడ్లు మాత్రం ఆ వరదలను తట్టుకున్నాయి. అప్పట్లో 21 ఏళ్ల కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయిన శ్రీకాంత్ శిరోలే దీని గురించి ఆరా తీశారు. మన్నికైన రోడ్ల కోసం అధునాతన హాట్ మిక్స్ టెక్నాలజీని ఉపయోగించిన పార్సీ యాజమాన్యంలోని ముంబై కంపెనీ రెకొండో వేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. పుణేలోని రోడ్లను అదే కంపెనీకి అప్పజెప్పారు. రోడ్డు 10 సంవత్సరాల పాటు గుంతలు లేకుండా ఉంటుందని, ఆలోపు ఏవైనా మరమ్మతులు వస్తే ఎటువంటి ఖర్చు లేకుండా చేస్తామనే హామీతో వేశారు. 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డును 1976 జనవరి 1న ప్రారంభించారు. ఆ రోడ్డు పూర్తిగా చెక్కుచెదరకుండా ఉంది. 2014లో పుణే స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా రోడ్డును పూర్తిగా మార్చారు. సైకిల్ ట్రాక్, విశాలమైన కాలిబాటలు, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుణెలో కూలిన విమానం
పుణెలో ఓ శిక్షణ విమానం కూలిపోయింది. బారామతి విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం ఈ ప్రమాదానికి గురైంది. విమానాన్ని నడుపుతున్నప్పుడు, టైర్లలో ఒకటి దెబ్బతిన్నట్లు పైలట్ గమనించాడు. పైలట్ ఉదయం 8 గంటల ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడు.దీంతో విమానం ల్యాండింగ్ తర్వాత ముందు చక్రం ఊడిపోయింది. విమానం టాక్సీవే నుంచి దారితప్పి విమానాశ్రయంలోని ఒక వైపు పొదల్లోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని.. పైలట్ సురక్షితంగా ఉన్నారని ఆయన తెలిపారు.మరోవైపు, విమానం ల్యాండింగ్ సమయంలో పక్షులు అడ్డురావడంతో పైలట్ ల్యాండింగ్‌ను రద్దు చేయడానికి ప్రయత్నించాడని అయితే, తిరిగి రెండోసారి ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిండంతో ఈ సమయంలో విమానం ముందు చక్రం ఊడిపోయిందనే వాదన కూడా వినిపిస్తుంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. -
వర్కవుట్లు చేస్తుండగా ఆగిన గుండె
హఠాన్మరణాల గణాంకాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. చిన్న వయసులో గుండె సంబంధిత సమస్యలతో చనిపోతున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా 37 ఏళ్ల వ్యక్తి వర్కౌట్ చేస్తూ ఆకస్మాత్తుగా కుప్పకూలిపోగా.. గుండెపోటుతోనే మరణించాడని వైద్యులు ప్రకటించారు. మహారాష్ట్రలోని పుణేలోని పింప్రీ-చిన్చ్వడ్‌లో మిలింద్ కులకర్ణి అనే వ్యక్తి వర్కౌట్ అనంతరం నీరు తాగుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఇది జిమ్‌లోని CCTV కెమెరాలో రికార్డైంది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా, వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్టు ప్రకటించారు. గుండెపోటు కారణంగా కులకర్ణి చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. కులకర్ణి భార్య వైద్యురాలు. గత ఆరు నెలలుగా అతను జిమ్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, పర్యవేక్షణతో వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిమ్‌లో ఆకస్మిక మరణాల కారణాలు అనేకం ఉండొచ్చు. అయితే.. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి (HCM).. ఇది వంశపారంపర్యంగా వచ్చే గుండె కండరాల లావుదల, వ్యాయామ సమయంలో గుండె చలనం ఆగిపోయే ప్రమాదం ఉంది. కార్డియాక్ అరెస్ట్.. రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉండటం వల్ల గుండె హఠాత్తుగా ఆగిపోతుంది. అలాగే.. తిన్నాక వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులకు ఒత్తిడి వచ్చి ప్రమాదం కలగొచ్చు. ఇంతేకాదు.. స్టెరాయిడ్ వినియోగం.. కొంతమంది స్టెరాయిడ్లు(అనధికారిక) వాడటం వల్ల గుండె కండరాలు అధిక ఒత్తిడికి గురై, వ్యాయామ సమయంలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం గండె సంబంధిత సమస్యలే కాదు.. వర్కౌట్లు చేసే సమయంలో బ్రెయిన్ ఎటాక్ (aneurysm rupture) వల్ల కూడా మరణాలు సంభవించిన సందర్భాలు ఉన్నాయి. ఈ స్థితిలో మెదడులో రక్తనాళాలు పగిలి మరణించే అవకాశం ఉంటంది. జిమ్.. జాగ్రత్తలుజిమ్లకు వెళ్లేవాళ్లు.. వెళ్లాలనుకుంటున్నవాళ్లు.. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదికుటుంబంలో గుండెజబ్బుల చరిత్ర ఉంటే, మరింత జాగ్రత్త అవసరం.ఆహారం తర్వాత తక్షణం వ్యాయామం చేయకూడదు.అనధికారిక స్టెరాయిడ్లు, అధిక బరువులు ఎత్తడం వంటి చర్యలు నివారించాలి. #Maharashtra #Pune के पिंपरी चिंचवड में जिम में वर्कआउट के दौरान एक शख्स को आया हार्ट अटैक; अस्पताल पहुंचने से पहले हुई मौत..पूरी घटना CCTV में कैद..37 साल के शख्स की हुई मौत..@TNNavbharat @PCcityPolice pic.twitter.com/X7Nun52YpZ— Atul singh (@atuljmd123) August 2, 2025 -
వామ్మో.. బామ్మ.. కోబ్రానే షేక్ చేసిందిగా..
-
‘జీవితంలో అన్నింటా ఓడాను’.. యువ ఇంజినీర్ బలవన్మరణం
పుణే:మహారాష్ట్రలోని పూణేలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఒక ఐటీ ఇంజనీర్ తాను పనిచేస్తున్న సంస్థ సమావేశంలో పాల్గొన్న సమయంలో తనకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వస్తున్నదని తోటి ఉద్యోగులకు తెలిపారు. తరువాత తనను క్షమించమని అక్కడున్నవారిని కోరుతూ, ఆఫీసు భవనంలోని ఏడవ అంతస్తు నుంచి కిందకు దూకాడు.హింజెవాడి ఐటీ పార్క్‌లోని అట్లాస్ కాప్కోలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అతను రాసినదిగా చెబుతున్న లేఖలో తన జీవితంలోని వైఫల్యాలను పేర్కొంటూ, తన తండ్రిని క్షమాపణలు కోరాడు. పుణేలోని 23 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ పియూష్ అశోక్ కవాడే ఈ ఘటనలో ప్రాణాలొదిలాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హింజెవాడి ఫేజ్ వన్‌లోని అట్లాస్ కాప్కోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘నేను జీవితంలో అన్ని చోట్లా ఓడిపోయాను. నన్ను క్షమించండి’ అంటూ పియూష్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ బాలాజీ పాండ్రే మాట్లాడుతూ అశోక్ కవాడే ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. పియూష్ కవాడే మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందినవాడు. -
వామ్మో.. బామ్మో: భారీ కోబ్రానే షేక్ చేసింది
సాధారణంగా పాము అన్న పదం వింటేనే ఆమడ దూరం పారిపోతారు చాలామంది. మరికొంత మంది దాన్ని చంపేదాకా నిద్రపోరు. కానీ 70 ఏళ్ల బామ్మ చేసిన సాహసం చూస్తే..వామ్మో..బామ్మో.. అంటారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.పూణేలోని ముల్షి తాలూకాలోని అంబోలి గ్రామానికి చెందిన 70 ఏళ్ల శకుంతల సుతార్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. పామును మెడకు చుట్టుకుని నెటిజన్లను ఆశ్చర్యపర్చింది.ఏం జరిగిందంటేచుట్టు పక్కల వాతావరణం కారణంగా ఇంట్లోకి భారీ పాము (కోబ్రా) వచ్చింది. ఈ పామును చూడగానే ఇంట్లో వాళ్లంతా భయంతో పరుగులు పెట్టారు. కానీ బామ్మ ఏమాత్రం భయపడలేదు. దాన్ని భయపెట్టి, చంపేందుకు ప్రయత్నించలేదు. పైగా దాన్ని కాపాడింది. అదీ వట్టి చేతులతోనే, చాకచక్యంగా నక్కి ఉన్న పామును పట్టుకుంది. అయితే ఆ పాము అంత ఈజీగా ఏమీ లొంగలేదు. అయినా సరే నిర్భయంగా, అత్యంత సాహసంతో దాన్ని దొరకబుచ్చుకుని పామును పట్టుకుని మెడలో వేసుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో అక్కడున్న వారు ఫోటోలు, వీడియోలు తీస్తుంటే వారికి ఫోజులిచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.చదవండి: 100 ఏళ్లకు పెళ్లి, 103వ బర్త్‌డేకి తీరనున్న డ్రీమ్ : లైఫ్ సీక్రెట్ అదేనట!ఈ పామును స్థానికంగా ధమన్ అని పిలుస్తారట. దీనివల్ల మనుషులకు ఎలాంటి హాని లేదు. పైగాఎలుకల నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. ఇది 18 అడుగుల (5.5 మీటర్లు) పొడవు వరకు పెరుగుతుంది. భారతదేశం సహా ఆగ్నేయాసియా అడవులలో కనిపించే కింగ్ కోబ్రా దట్టమైన వృక్షసంపద, సమృద్ధిగా ఆహారం ఉన్న ప్రాంతాలలో నివసిస్తాయి.అయితే అన్ని పాములూ విషపూరితమైనవి కావు. వాటిని చూసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. తమకు హాని కలుగుతుందని భయపడనంతవరకూ అవి ఎలాంటి హానీ చేయవు. అలాగని పాము కనిపించగానే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. దానికి ప్రత్యేక శిక్షణ ఉండాలి. ఎక్కడ ఎలా పట్టుకోవాలనే ఒడుపు, విజ్ఞానం తెలియాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఏదైనా పాము, ఇతర ప్రమాదకరమైనవి కనిపించినపుడు వన్యప్రాణ సంరక్షణ అధికారులకు సమాచారం అందివ్వాలి.ఇదీ చదవండి: HealthTip ఈ గింజలతో మెకాళ్ల నొప్పి, అధిక బరువుకు చెక్ ! -
డ్రగ్ పార్టీపై పోలీసుల దాడి.. మాజీ మంత్రి అల్లుడు అరెస్ట్
పూణే: మహారాష్ట్రలోని పూణే పోలీసులు ఆదివారం ఉదయం ఓ అపార్టుమెంట్లో జరుగుతున్న డ్రగ్ పార్టీ గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలతో పాటు హుక్కాలు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే కుమార్తె రోహిణి భర్త ప్రాంజల్ ఖెవల్కర్ సహా పలువురు పట్టుబడ్డారు.రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఖరాడీ ప్రాంతంలోని స్టూడియో అపార్టుమెంట్‌పై తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో దాడి చేశామని డీసీపీ(క్రైం) నిఖిల్ పింగ్లే చెప్పారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో 2.7 గ్రాముల కొకైన్, 70 గ్రాముల గంజాయి, హుకా సామగ్రి, మద్యం దొరికాయన్నారు. పట్టుబడిన వారిపై నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్)చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరందరికీ వైద్య పరీక్షలు చేయించామని, నివేదికలు అందాల్సి ఉందన్నారు.ఎన్సీపీ(ఎస్పీ)నేత అయిన ఏక్నాథ్ షిండే ఈ పరిణామంపై మీడియా ఎదుట స్పందించారు. పోలీసుల దాడి వెనుక రాజకీయ కారణాలున్నాయా అనే విషయం తేల్చేందుకు క్షుణ్నంగా దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్సీపీ(ఎస్పీ) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా రోహిణీ ఖడ్సే వ్యవహరిస్తున్నారు. ఘటనపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఈ దాడి ఒక హెచ్చరిక వంటిదంటూ శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారె వ్యాఖ్యానించారు. प्रांजल खेवलकरांच्या रेव्ह पार्टीवर धाडीचा व्हिडिओ आला बाहेर, काय घडलं?#LokmatNews #MaharashtraNews #pranjalkhewalkar #raveparty #Policecase #MarathiNews pic.twitter.com/AufI7xJx0I— Lokmat (@lokmat) July 27, 2025 -
కొత్త వందేభారత్ రైళ్లు.. కర్నాటక, మహారాష్ట్ర.. వయా తెలంగాణ
బెంగళూరు: దక్షిణాదికి మరిన్ని వందేభారత్ రైళ్లు రానున్నాయి. ఇవి కర్నాటకలోని బెలగావితో పూణే, హైదరాబాద్‌లను అనుసంధానించనున్నాయి. ఈ కొత్త రైళ్లు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని ప్రధాన నగరాలకు రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనున్నాయి.భారతీయ రైల్వే పూణే నుండి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇది బెలగావి, షెగావ్, వడోదర, సికింద్రాబాద్ (హైదరాబాద్) లకు కనెక్టివిటీని పెంచనున్నాయి. ప్రస్తుతం రెండు వందే భారత్ రైళ్లు పూణే నుండి నడుస్తూ, కొల్హాపూర్ హుబ్బళ్లి మార్గాలకు సేవలు అందిస్తున్నాయి. త్వరలో మరో నాలుగు అదనపు రైళ్లను ప్రవేశపెట్టాక పూణే నుండి బయలుదేరే మొత్తం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య ఆరుకు చేరనుంది.కర్నాటకలోని కలబుర్గి నుంచి పూణే- హైదరాబాద్ మధ్య నడిచే కొత్త వందే భారత్ రైలు మహారాష్ట్ర, కర్ణాటక తెలంగాణలోని ప్రధాన నగరాలను కలపనుంది. కర్నాటకలోని బెలగావి ప్రజలు చాలా కాలంగా హుబ్బళ్లి-బెలగావి-పుణే మార్గంలో రోజువారీ సెమీ-హై-స్పీడ్ రైలును నడపాలని కోరుతున్నారు. ప్రస్తుతం వారానికి మూడుసార్లు నడపబోయే ఈ కొత్త వందే భారత్ రైలు ఈ డిమాండ్‌ను తీర్చనుంది. పూణే-షెగావ్ వందే భారత్ రైలు దౌండ్, అహ్మద్‌నగర్, ఛత్రపతి సంభాజీనగర్ జల్నాలలో ఆగనుంది. మహారాష్ట్రలోని ప్రసిద్ధ గజానన్ మహారాజ్ ఆలయాన్ని సందర్శించే పర్యాటకులకు ఈ రైలు సౌకర్యవంతంగా ఉండనుంది. అలాగే పూణే-వడోదర మధ్య నడవబోయే రైలు మహారాష్ట్ర గుజరాత్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని ఏర్పరుస్తుంది. ఈ రైలు మహారాష్ట్ర, గుజరాత్ మధ్య వాణిజ్యం, పర్యాటకాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. వందేభారత్ రైళ్లలో సౌకర్యవంతమైన సీటింగ్, ఆటోమేటిక్ డోర్లు, వైఫై యాక్సెస్, ఆధునిక టాయిలెట్లు మెరుగైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. కాగా ఈ కొత్త వందేభారత్ రైలు సేవల అధికారిక షెడ్యూల్‌ను రైల్వే శాఖ ఇంకా ధృవీకరించలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన రావచ్చని సమాచారం. -
నోటీసు పీరియడ్‌లో ఉండగానే, పని ఒత్తిడి తట్టుకోలేక..
పని ప్రాంతాల్లో ఉద్యోగులపై ఒత్తిళ్లు సహజమే. అయితే ఆ ఒత్తిళ్లు ఈ మధ్యకాలంలో ఉద్యోగులను తీవ్ర నిర్ణయాల వైపు అడుగులేయిస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ బ్యాంకులో పని చేసే సీనియర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడడం.. అదీ బ్యాంకులోనే కావడం.. అందునా రాజీనామా చేసిన వారానికే కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.శివశంకర్ మిత్రా.. మహారాష్ట్ర పుణే బారామతిలోని ఓ నేషనలైజ్డ్ బ్యాంకులో పని చేస్తున్నారు. 40 ఏళ్ల వయసులో పని ఒత్తిడి, అనారోగ్య కారణాలతో జులై 11వ తేదీన ఆయన తన చీఫ్ మేనేజర్ పోస్టుకు రాజీనామా చేశారు. అయితే ఏమైందో ఏమోగానీ నోటీసు పీరియడ్‌లో ఉన్న ఆయన అనూహ్యంగా ఘాతుకానికి పాల్పడ్డారు.గురువారం రాత్రి బ్యాంకు నుంచి సిబ్బంది అందరూ ఇళ్లకు వెళ్లిపోయాక.. తాళాలు తాను వేస్తానంటూ వాచ్‌మెన్‌కు చెప్పి ఆయన ఒక్కరే లోపలే ఉండిపోయారు. అంతకు ముందే తనతో పాటు తెచ్చుకున్న తాడులో బ్యాంకులోపలే ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదంతా అక్కడి సీసీటవీ కెమెరాల్లో రికార్డయ్యింది. భర్త ఇంటికి రాకపోవడం, ఫోన్‌కాల్స్‌కి ఎంతకీ స్పందిచకపోవడంతో ఆమె అనుమానంతో అర్ధరాత్రి బ్యాంకు వద్దకు చేరుకుంది. అందరూ వెళ్లిపోయి ఉంటారని వాచ్మెన్ చెప్పగా.. లోపల లైట్లు వేసి ఉండడంతో అనుమానంతో గేట్లు తీసి చూశారు. లోపల ఆయన ఫ్యానుకు విగతజీవిగా వేలాడుతూ కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో పని ఒత్తిడే కారణమని పేర్కొన్న ఆయన.. ఎవరి పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతేకాదు తన భార్య, బిడ్డలను క్షమాపణ కోరుతూ.. వీలైతే తన కళ్లను దానం చేయాలని నోట్లో కోరారాయన. దీంతో ఆ కుటుంబం విలపిస్తోంది. రాజీనామా చేసిన కొన్నిరోజులకే ఆయన ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడంతో తోటి సిబ్బంది సైతం కంటతడి పెట్టారు. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఇదే పుణేలో ఈవై కంపెనీలో పని చేసే కేరళ యువతి అన్నా సెబాస్టియన్(26) పని ఒత్తిడి కారణంగా హఠాన్మరణం చెందింది. ఆమె తల్లి బహిరంగ లేఖతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. దేశంలో పని గంటలు, ఒత్తిళ్లు తదితర అంశాలపై విస్తృత చర్చ నడిచింది. అప్పటి నుంచి ఈ తరహా మరణాలు నెలలో కనీసం ఒకటి రెండైనా వెలుగు చూస్తున్నాయి. మొన్నటి మే నెలలో ఒలా ఏఐయూనిట్ కృత్రిమ్‌లో పని చేసే నిఖిల్ సోమవాన్షి ‘టాక్సిక్ వర్క్‌కల్చర్, పని ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడడం సైతం చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా మరణాలకు ప్రధాన కారణాలుఅత్యధిక పని గంటలు (55+ గంటలు/వారానికి)అనియంత్రిత డెడ్లైన్లుపరిమిత మానసిక ఆరోగ్య మద్దతుముఖ్యంగా హస్టల్ కల్చర్ (Hustle Culture) ప్రభావం.. అంటే విశ్రాంతికి చోటు లేకుండా టార్గెట్లు రీచ్ అయ్యేందుకు ఎప్పుడూ పని చేయాలనే మానసిక ధోరణి. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితంతో పాటు ఆరోగ్యాన్ని పట్టించుకోరు.Economic Times నివేదిక ప్రకారం, ఇండియాలో యువ ఉద్యోగులు అధిక పని గంటల వల్ల ఆత్మహత్యలు, గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాల్లో పని ఒత్తిడి అధికంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన EU నివేదిక ప్రకారం, వర్క్‌స్ట్రెస్ వల్ల ప్రతి సంవత్సరం 10,000 మంది మరణిస్తున్నారు. ఆత్మహత్య అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు.. అలాంటి అఘాయిత్యాలకు పాల్పడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.. కౌన్సెలింగ్ సెంటర్లను ఆశ్రయించి సాయం పొందండి. తెలంగాణలో.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comఆంధ్రప్రదేశ్‌లో.. 1లైఫ్, ఫోన్ నెంబర్ 78930-78930; 100జీజీహెచ్ కాకినాడ.. 98499-03870 -
ప్రిన్స్ చార్లెస్, ఓప్రా విన్ఫ్రే మెచ్చిన ప్రదేశం.. ఫిట్నెస్కి కేరాఫ్ అడ్రస్! (ఫోటోలు)
-
ఐపీఎస్కి ప్రిపేరవ్వుతున్న అమ్మాయికి రూ. 9 లక్షల ఇంటర్న్‌షిప్..!
ఆమె లక్ష్యం ఐపీఎస్..కానీ ఊహించని విధంగా రూ. 9 లక్షల ఇంటర్న్షిప్ని అదుకుని స్ఫూర్తిగా నిలిచింది. పైగా ఈ ఏడాది స్లీప్ ఆఫ్‌ది ఇయర్‌గా టైటిల్‌ని దక్కించుకుంది. ఎవరామె అంటే..పూణేకి చెందిన మాధవ్ వావల్ ఐపీఎస్ పోటీపరీక్షలకి సన్నద్ధమవుతోంది. ఆమె ఈ ఏడాది జరగుతున్న నాల్గో సీజన్ స్లీప్ ఇంటర్న్‌షిప్ పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. మొత్తం 60 రోజుల నిద్ర ఛాలెంజ్‌ని స్వీకరించి రూ. 9.1 లక్ష ఇంటర్న్షిప్ని గెలుచుకుని స్లీప్ ఛాంపియన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. దీంతో ఈ ఏడాది స్లీప్ ఇంటర్న్‌షిప్ నాల్గవ సీజన్ విజేతగా స్థానం కైవసం చేసుకుంది మాధవ్ వావల్. ఈ పోటీ భారతదేశంలో పెరుగుతన్న నిద్రలేమి సమస్యను నివారించడమే ముఖ్యోద్దేశంగా రూపొందించిన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఇది. ఈ నిద్ర వర్క్‌షాప్‌లో మంచి నిద్ర అలవాటుని మెరుపరచడానికి ఉద్దేశించిన సవాళ్లను ఫేస్చేయాలి ఉంటుంది. పోటీలో పాల్గొనే వాళ్లు కళ్లకు గంతలు కట్టుకుని బెడ్ మేకింగ్ అలారం క్లాక్‌ల సాయంతో వారి నిద్ర నాణ్యతను అంచనా వేస్తారు వేక్‌ఫిట్ నిర్వాహకులు. ఇక్కడ మాధవ వావల్ ఈ పోటీలో 91.36 మార్కులు స్కోర్ చేసి తొలి స్థానంలో నిలిచింది. అలాగే ఆమె తోపాటు పాల్గొన్న మిగతా 15 మంది ఈ ఇంటర్న్షిప్ని పూర్తి చేసినందుకు గానూ ఒక్కొక్కరికి ఒక లక్ష్క చోప్పున నగదుని బహుమతిగా అందించారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?కనీస వయసు: దరఖాస్తు చేసుకునే సమయంలో 22 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. ఎంట్రీ: ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలిచేయు విధానం: దరఖాస్తు ఫామ్‌ని పూర్తిగి ఫిల్ చేయాల్సిందే అసంపూర్ణంగా సమర్పించిన దరఖాస్తులను పరగణించబడవుపోటీ జరుగు విధానం: తమ ఇళ్ల నుంచి ఎస్ఎంస్, ఇమెయిల్, వాట్సాప్ లేదా ఫోన్ కాల్ భాగస్వామ్యంతోఅలాగే పోటీదారుడి వివరాలను గోప్యంగానే ఉంచుతారు. ఆన్లైన్ ఫారమ్‌లు, వీడియో రెజ్యూమ్‌లు, ఇంటర్వ్యూల ద్వారా ఫైనలిస్ట్‌లను ఎంపిక చేస్తారు. కాగా, ఈస్లీప్ ఇంటర్న్‌షిప్ 2019 నుంచి ప్రారంభమైంది. ఇప్పటివరకు మొత్తం నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రతి సీజన్లో లక్షలాది మంది ఈ ఇంటర్న్‌షిప్‌కి దరఖాస్తు చేసుకోవడం విశేషం. 60 రోజులు రాత్రుళ్లలలో కనీసం 9 గంటలు నిద్రపోవడాని ప్రయత్నించినవారే పెద్దమొత్తంలో నగదుని గెలుచుకుంటారు. ఇక ఈ ఏడాది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్ ప్రకారం సుమారు 58% మంది భారతీయులు రాత్రి 11 గంటల తర్వాతే పడుకుంటారని, అందువల్ల ఉదయం అలసటను ఎదుర్కొటున్నట్లు పేర్కొంది. (చదవండి: నాన్నా నా పెళ్లిలో డ్యాన్స్ చేస్తావా..? ఆ మాటలే ఊపిరి పోశాయి..) -
కొత్త మలుపు తిరిగిన అత్యాచారం కేసు
పూణేలో ఇటీవల జరిగిన ‘అత్యాచార ఘటన’ కొత్త మలుపు తిరిగింది. ఓ డెలివరీ బాయ్ తనపై పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారానికి ఒడిగట్టాడని, మళ్లీ వస్తా అని మెసేజ్ కూడా ఫోన్లో టైప్ చేశాడని అని యువతి చెప్పిందంతా అంతా తూచ్ అని పోలీసులు తేల్చేశారు. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి డెలివరీ బాయ్ వచ్చి అత్యాచారానికి పాల్పడలేదని, ఇది తన ఫ్రెండ్‌తో కలిసి ఆ 22 ఏళ్ల యువతి ఆడిన కట్టుకథ అని పోలీసులు స్పష్టం చేశారు. పూణేలో 22 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ పై జరిగిన అత్యాచారం కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడి వ్యక్తి అపరిచితుడు కాదని, ఆ మహిళకు తెలిసిన వ్యక్తే అని పోలీసులు వెల్లడించారు. అత్యాచారం అనంతరం నిందితుడు తన ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడని యువతి పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే. దాన్ని సాక్ష్యంగా చూపించేందుకు ఆమె సెల్ఫీ స్వయంగా తీసుకుందని తేలింది. నిందితుడు తన ఫోన్లో మళ్లీ వస్తా అని మెసేజ్ టైప్ చేసి ఉంచడం కూడా కల్పితమని పోలీసులు బట్టబయలు చేశారు.పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ శుక్రవారం( జూలై 4వ తేదీ) మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి ఆమెకు రెండేళ్లుగా పరిచయం ఉంది. ఆమెకు అతను కొత్త వ్యక్తి కాదు. ఆ సెల్ఫీని సైతం ఆమె స్వయంగా తీసుకుంది. ఐ విల్ బీ బ్యాక్( నేను మళ్లీ వస్తా) అనే మెసేజ్‌ను కూడా ఆమె టైప్ చేసింది’ అని చెప్పారు.మరి ఆరోపణలు ఎందుకు చేసింది..? డెలివరీ బాయ్ పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని ఆమెకు ఎందుకు చెప్పిందనే దానిపైనే ఇప్పుడు పూర్తి దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇంకా విచారణ దశలోనే ఉందని, అయితే యువతి మానసిక స్థితి సరిగా లేనట్లు ఉందన్నారు. ఇంకా దర్యాప్తు జరుగుతుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఇంతకీ యువతి ఫిర్యాదు ఏమిటంటే..!పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి సదరు యువతి నివాసం ఉంటోంది. ఆమెకు వచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడని. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడని పేర్కొంది. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లినట్లు, ఆ తర్వాత డెలివరీ బాయ్ తనపై పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని తెలిపింది. ఇదే విషయాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యులకు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. -
మళ్లీ వస్తా.. యువతిపై డెలివరీ బాయ్ ఘాతుకం.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ దిగి..
పూణే: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు నిందితుడు అంతటితో ఆగకుండా ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వివరాల ప్రకారం.. పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి బాధితురాలు(22) నివాసం ఉంటోంది. అయితే, ఆమెకు వచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడు. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడు. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ ఓ పేపర్‌పై రాసిపెట్టే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని హెచ్చరించి పరారయ్యాడు. ఓ గంట తర్వాత బాధితురాలు స్పృహలోకి కన్నీరు పెట్టుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు.. ఆమె ఇంటికి చేరుకుని వివరాలను సేకరించారు. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే మాట్లాడుతూ.. ఇంట్లో బాధితురాలి సోదరుడు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నాం. సీసీ కెమెరాల ఆధారం అతడి గురంచి అన్వేషిస్తున్నాం. లైంగిక దాడి, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. బాధితురాలి మొబైల్ సెల్ఫీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నిందితుడు ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి ఏదో పదార్థాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఏదైనా స్ప్రే ఉపయోగించారా? అని వివరాలు సేకరిస్తున్నాం అని తెలిపారు. VIDEO | Here's what Pune Deputy Commissioner of Police (Zone 5) Rajkumar Shinde said on the alleged rape of a 22-year-old woman in her apartment by a courier delivery executive:"A case has been registered under Bharatiya Nyaya Sanhita sections 64 (punishment for rape), 77… pic.twitter.com/rbxvN86an9— Press Trust of India (@PTI_News) July 3, 2025 -
Urine Eye Wash: ప్లీజ్ అలా చెయ్యొద్దు..! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల ఇన్‌స్టా రీల్స్ పిచ్చి మాములుగా లేదు కొందరికి. అందుకోసం వాళ్లు చేసే పిచ్చి చేష్టలకు అంతుపొంతు లేకుండాపోతోంది. అది సరైనదా? కాదా..? అన్నది అనవసరం. సోషల్ మీడియా క్రేజ్, ఆ కంటెంట్‌కి ఎన్ని వ్యూస్ వచ్చాయ్ అన్నదే ధ్యేయం. కానీ వీటిని స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యి ఇబ్బందులు పడుతున్న అభాగ్యులెందరో ఉన్నారు. ప్రస్తుతం తాజాగా అలాంటి వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఆ వీడియోని చూసి వైద్యులే కంగుతిన్నారు. ప్లీజ్ అలా చెయ్యకండి అని హెచ్చరిస్తునన్నారు. అసలేం జరిగిందంటే.. పూణెకు చెందిన నుపుర్ పిట్టీ అనే మహిళ వైరల్ వీడియోలో తనను "మెడిసిన్-ఫ్రీ లైఫ్ కోచ్"గా పరిచయం చేసుకుంటూ "యూరిన్ ఐ వాష్ " గురించి వివరించింది. ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన ఔషధం అంటూ..మూత్రం కళ్లను శుభ్రం చేసుకుంటూ కనిపించింది వీడియోలో. మన మూత్రంతో ఇలా కళ్లను వాష్ చేసుకుంటే..డ్రైగా మారడం, ఎరుపెక్కడం వంటి కంటి సమస్యలు రావని ఆరోగ్య సలహాలు కూడా ఇచ్చేసింది. అయితే ఈ వీడియోపై వైద్య నిపుణులు తీవ్రంగా స్పందించడమే గాక మండిపట్టారు. ప్రజల ఆరోగ్యంతో ఇలా చెలగాటం ఆడటం మంచిద కాదని ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రక్రియలు ప్రమాదకరమైనవని, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. మూత్రంతో ఇలా అస్సలు చేయొద్దని గట్టిగా హెచ్చరించారు కూడా.ఎందుకు మంచిది కాదంటే..నిపుణులు అభిప్రాయం ప్రకారం మూత్రాన్ని తాగడం లేదా ఉపయోగించటం అనేది ఆరోగ్యానికి మంచిదని శాస్త్రీయంగా ఎక్కడ నిరూపితం కాలేదు. “యూరిన్ థెరపీ“కి సంబంధించి వైద్యపరమైన ఆధారాలు కూడా లేవు. మూత్రంలో చాలా తక్కువ మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నప్పటికీ ఏవిధమైన ఆరోగ్య ప్రయోజనాలను అందివ్వదు. అందులో శరీరానికి అవసరం లేని ద్రవం, శరీరంలోని వ్యర్థాలనను తొలగించిన ద్రవమే మూత్రం. మూత్రపిండాలు రక్తప్రవాహం నుంచి అదనపు నీటిని సెల్యులార్ వ్యర్థాలను బయటకు పంపించే ఉత్పత్తి ఇది. దీనిలో 90 శాతం నీరు ఉండగా, మిగిలిన భాగం అమ్మోనియా వంటి ఇతర లవణాలు ఉంటాయి. అంతేగాదు మూత్రపిండాల అనే రెండు కండరాల గొట్టలు ద్వారా మూత్రాశయానికి మూత్రాన్ని పంపుతాయి. మూత్రాశయం నిండినప్పుడు, నరాల చివరలు మెదడుకు బాత్రూమ్కి వెళ్లమని సంకేతమిస్తాయి. దాంతో మూత్రనాళం అనే చిన్నగొట్టం సాయంతో విసర్జిస్తాం. అదీగాక ఈ మూత్రనాళం కొన్ని రకాల బ్యాక్టీరియాలకు నిలయం.అందువల్ల మూత్రం శుభ్రమైనద కాదు. శరీరం వదిలించుకున్న ఈ వ్యర్థ ద్రవం తిరిగి శరీరంలోకి పంపిస్తే..హనికరమైన బ్యాక్టీరియాకు గురై లేనిపోని వ్యాధులు బారినపడే ప్రమాదం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. Please don't put your urine inside your eyes. Urine is not sterile. Boomer aunties trying to be cool on Instagram is depressing...and terrifying.Source: https://t.co/SQ5cmpSOfY pic.twitter.com/qgryL9YHfI— TheLiverDoc (@theliverdr) June 25, 2025 (చదవండి: ఆ తప్పిదాలతో 116 కిలోల బరువు..కానీ 13 నెలల్లో ఏకంగా..) -
పక్షి ఢీ కొట్టడంతో ఎయిరిండియా విమాన సర్వీస్ రద్దు!
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు.. ఆ మాటకొస్తే మిగతా సంస్థల విమానాలు కూడా రకరకాల కారణాలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి. సాంకేతిక సమస్యలతో ప్రయాణికుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా.. పక్షికి ఢీ కొట్టడంతో ఏకంగా ఎయిరిండియా విమాన సర్వీసును రద్దు చేయాల్సి వచ్చింది.శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి పుణే (మహారాష్ట్ర)కు ఎయిరిండియా AI2470 విమానం చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన తనిఖీల్లో విమానాన్ని పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో ఇంజనీరింగ్ టీంను రంగంలోకి దింపి విస్తృత తనిఖీలు జరిపింది. ఆపై ఆ విమాన సర్వీసును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.#AirIndia Pune-bound flight from Delhi suffers a bird hit, forcing the airline to cancel its return journey.Read more ⬇️https://t.co/kzYUgPcSiW— NDTV Profit (@NDTVProfitIndia) June 20, 2025✈️ జరిగింది ఇదే..జూన్ 20వ తేదీ.. ఉదయం 5:31కి ఢిల్లీ నుంచి ఏఐ2470 విమానం బయలుదేరి, 7:14కి పుణేలో ల్యాండ్ అయింది.ల్యాండింగ్ తర్వాత నిర్వహించిన తనిఖీల్లో పక్షి ఢీకొన్నట్లు గుర్తించారు.దీంతో, అదే విమానంతో తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సిన AI-2470 ఫ్లైట్‌ను రద్దు చేశారు.🛠️ తీసుకున్న చర్యలువిమానాన్ని గ్రౌండ్ చేశాక.. ఇంజినీరింగ్ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది.ప్రయాణికుల కోసం వసతి ఏర్పాట్లు, పూర్తి రీఫండ్లు లేదంటే ఉచిత రీషెడ్యూలింగ్ అందిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటనప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు కూడా అందిస్తామని తెలిపిన ఎయిరిండియా. 🔍 జూన్ 12వ తేదీన లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు కింద ఉన్న మరో 38 మంది మరణించారు. ఈ ప్రమాద నేపథ్యంలో.. ఎయిరిండియా బోయింగ్ 787, 777 విమానాలపై విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. -
పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం
-
అబ్బే తుప్పుపట్టింది ప్రభుత్వనికి కాదయ్య! వంతెనకు!!
-
ఇంద్రాయణి నదిపై కుప్పకూలిన వంతెన.. ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు
-
indrayani river bridge collapses: పూణెలో ఘోర ప్రమాదం
మహరాష్ట్ర: పూణెలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఇంద్రాయణి నదిపై (indrayani river bridge collapses) పురాతన కూలిన వంతెన కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 25మంది గల్లంతయ్యారు.పోలీసుల సమాచారం మేరకు.. పుణె జిల్లాలోని మావళ్ తాలూకాలోని తలెగావ్ దాభాడే వద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కుండమళా వద్ద ఆదివారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఇంద్రాయణి నదిపై ఉన్న పాత బ్రిడ్జ్ ఆకస్మాత్తుగా కూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 20 నుంచి 25మంది బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న ఇంద్రాయణి నదిలో గల్లంతయ్యినట్లు తెలుస్తోంది.Pune: Many Tourists Feared Drowned After Old Bridge Collapses Over Indrayani River at Kund MalaRead in detail here: https://t.co/CuDeeJOuZo pic.twitter.com/7YKBkIJeCR— Punekar News (@punekarnews) June 15, 2025పర్యాటక ప్రాంతం కావడంతో వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వచ్చారు. అయితే, రెండు రోజులు పాటు భారీగా కురిసిన వర్షాలకు పురాతన బ్రిడ్జి నానింది. పర్యాటకులు రావడంతో బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న ఇంద్రాయణి నదిలో జారీ పడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకు ఎన్డీఆర్ఫ్ బృందాలు బాధితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఐదుగురు పర్యాటకుల్ని రక్షించారు. ఈ దుర్ఘటనతో పింప్రి-చించ్వడ్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని తలెగావ్ దాభాడే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అధికార యంత్రాంగం, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. #Maval Bridge collapsed ,5 tourist feared to be dead.On weekend huge #ITcrowd visit these places we pray for everyones saftey . Morethan 25 are missing .30We hope govt should audit all tourist hot spot to ensure everyones saftey .#IndrayaniRiver #Kundamala #BridgeCollapse pic.twitter.com/IOU6XJj0Fy— Forum For IT Employees - FITE (@FITEMaharashtra) June 15, 2025 -
ఆలుమగలకు 5 కారణాలే విలన్లు
పెళ్లి భార్యాభర్తలను దగ్గరకు చేయాలి. రోజులు గడిచే కొద్ది అనుబంధం పెరగాలి. ఆకర్షణ నిలవాలి. ‘కాని నేడు చాలా పెళ్లిళ్లలో ఆలుమగల మధ్య నిర్లిప్తత చోటు చేసుకుంటోంది’ అంటున్నారు డాక్టర్ సప్నా శర్మ. పూణెలో చాలా గుర్తింపు పొందిన ఈ మేరేజీ కౌన్సిలర్ ఆలుమగల మధ్య ఆకర్షణ నశించడానికి ఐదు ముఖ్యకారణాలను తెలియచేస్తున్నారు అవి...‘గతంలో మనకున్న ఉమ్మడి కుటుంబాలు పిల్లలకు పాఠశాలలుగా ఉండేవి. పెద్దవాళ్లు కష్టసుఖాల్లో ఎలా సర్దుకుపోయేవారో, ఒకరికి ఒకరు సపోర్ట్ ఎలా ఇచ్చేవారో గమనించి పిల్లలు నేర్చుకునేవారు. కాని ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఉన్నాయి. పైగా పిల్లలకు తల్లిదండ్రులు చదువు తప్ప వేరే ఏ విషయం మీద ధ్యాస పెట్టనీకుండా చేస్తున్నారు. చదువు పూర్తయ్యి ఉద్యోగం రాగానే పెళ్లి చేస్తున్నారు. పెళ్లి గురించి, భార్యాభర్తలు ఉండవలసిన తీరు గురించి, పెళ్లి డిమాండ్ చేసే బాధ్యతల గురించి, అత్తమామలు ఇతర అనుబంధాలు తెచ్చే ఒత్తిడి గురించి ఏమాత్రం తెలియచేయకుండా సంసారంలో పడేస్తే వాళ్లు కన్ఫ్యూజ్ కారా?’ అంటున్నారు డాక్టర్ సప్న శర్మ.నాగపూర్‌లో జన్మించి ఐ సర్జన్‌గా పని చేసి తర్వాతి రోజుల్లో పర్సనాలిటీ కోచ్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా, మేరేజ్ కౌన్సిలర్‌గా గుర్తింపు పొందిన సప్న శర్మ భారతీయ ఆలుమగల మధ్య వస్తున్న ఘర్షణలకు కారణాలను అర్థం చేసుకుంటూ వాటిని తిరిగి సమాజానికి చెప్పి హెచ్చరికలు చేస్తున్నారు. ఆలుమగల మధ్య జీవితం నిస్సారం అనిపించడానికి ఐదు కారణాలను ఆమె తెలియ చేస్తున్నారు. అవి ఇవి:1. అనురాగానికి ఆటంకాలు పెళ్లయిన స్త్రీ, పురుషులు ఒకరితో మరొకరు ప్రేమగా బహిరంగంగా కనిపించడంపై మన సమాజంలో కనపడని నిషేధాజ్ఞలు ఉన్నాయి. పెళ్లయి జీవితం మొదలుపెట్టాక ఇంట్లో అత్తామామలో తల్లిదండ్రులో ఉంటే భార్యాభర్తలు సరదా భాషణం చేయడం, ఒకరినొకరు తాకడం తప్పు అనే భావన ఇంజెక్ట్ చేస్తారు. దాంతో ప్రేమగా ఉండటం ఏ అర్దరాత్రో తలుపు చాటున చేయవలసిన పనిగా మారుతుంది. అసలు భార్యభర్తలు తమ ప్రేమను ప్రదర్శించడానికి అవకాశమే లేనప్పుడు ప్రేమ జనించే అవకాశం ఎక్కడ? ఇది ఒక పెద్ద సమస్య.2. దొరకని ఏకాంతంభారతదేశంలో పెళ్లయ్యాక యువ జంట ఎక్కడికి ఆఖరుకు సినిమాకు వెళ్లాలన్నా ఎవరో ఒకరు తోడు ఉంటారు. కలిసి ఊళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సిందే తప్ప వీరు తమ మానామ తాము వెళ్లడం దోషంగా చెప్పబడుతుంది. ఇక ఒకరిద్దరు పిల్లలు పుట్టాక భార్యాభర్తలు ఆ పిల్లల్ని ఎక్కడైనా వదిలి నాలుగు రోజులు విహారంగా వెళ్లడం దాదాపు చోద్యంగా, పాపంగా పరిగణించబడుతుంది. భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకునే, ప్రేమను పెంచుకునే అవకాశాలే లేని కుటుంబ వ్యవస్థ వల్ల వారి మధ్య బంధం తప్ప ప్రేమతో కూడిన బంధం ఉండటం లేదు.3. ఆసక్తి లేకపోవడంవీటన్నింటి దరిమిలా భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి ఆసక్తి పోతోంది. చక్కగా తయారవడం అనేది బయటకు వెళ్లేటప్పటి సంగతిగా భావిస్తారు. మంచి బట్టలు, నగలు అన్నీ బయట వారికి చూపించడానికే. ఇంట్లో ఉన్నప్పుడు దారుణమైన బట్టలతో, సింగారం లేకుండా భార్య భర్తకు కనపడుతుంటుంది. భర్త కూడా ఏ పైజామో వేసుకుని తిరుగుతుంటాడు. ఇలాంటి అవతారాల్లో భార్యాభర్తలు ఒకరి ఎదుట మరొకరు ఉంటే ఎందుకు ఆకర్షణ కలుగుతుంది?4. ఫిట్నెస్ను పట్టించుకోకపోవడంపెళ్లి అయ్యే వరకు అబ్బాయి, అమ్మాయి ఎంతో కొంత ఫిట్నెస్ గురించి దృష్టి పెట్టినా మన దేశంలో పెళ్లయ్యాక ఆకారాలు ఎలా ఉన్నా పర్లేదులే అనే నిర్ణయానికి వస్తారు. ఫిట్నెస్ను పూర్తిగా వదిలేస్తారు. స్త్రీలు పిల్లలు పుట్టాక తిరిగి శరీరాన్ని ఫిట్‌గా మార్చుకుందాం అనుకోరు. పురుషులు బరువు పెరిగి, బొజ్జలు పెంచి వికారంగా ఉన్నామని తెలిసినా వ్యాయామం మాట ఎత్తకుండా ఉంటారు. ఇలా ఉండటం వల్ల భార్యాభర్తలు లోలోపల ఒకరిపై మరొకరు అసంతృప్తిని పెంచుకుంటారు.5. ఒకరి ఆసక్తులు మరొకరివైభార్యాభర్తలు భౌతిక ఆకర్షణను కోల్పోయినా మానసికంగా దగ్గరగా ఉంటే చాలా సమస్యలు పోతాయి. భర్త ఆసక్తులు భార్యకు పట్టకపోవడం భార్య ఇష్టాలు భర్తకు రుచించకపోవడం ఇద్దరూ కలిసి మాట్లాడుకునే ఉమ్మడి అభిరుచులే లేకపోతే వారి మధ్య అనుబంధం పెనవేసుకోవడం కష్టమవుతుంది. భర్తను భార్య మెచ్చుకోకపోగా సూటిపోటి మాటలు అనడం, భార్యను కాంప్లిమెంట్ చేయడం... హగ్ చేసుకోవడం భర్త ‘అహాని’కి అడ్డుగా మారడం... ఇవి మానసిక బంధానికి విఘాతంగా మారుతున్నాయి.భార్యాభర్తలే కాదు ఇంటి పెద్దలు కూడా ఈ కారణాలను కొడుకు కోడలు, కూతురు అల్లుళ్ల మధ్య గమనిస్తూ సరి చేయడానికి చేసుకోవడానికి ప్రయత్నించాలి.అప్పుడే వివాహం నూరేళ్ల బంధం అవుతుంది. -
NDA శిక్షణ పూర్తిచేసుకున్న 17 మంది మహిళా క్యాడెట్లు
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) 148వ కోర్సు నుండి తొలి బ్యాచ్ మహిళా క్యాడెట్లు రికార్డ్ సృష్టించారు. కఠినమైన తమ శిక్షణనువిజయవంతంగా పూర్తిచేశారు. శుక్రవారం ఉదయం జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ తర్వాత 17 మంది మహిళా క్యాడెట్లు జోష్ పుష్-అప్‌లతో ఔరా అనిపించారు. 300 మందికి పైగా పురుష క్యాడెట్లతో పాటు పదిహేడు మంది మహిళా క్యాడెట్లు అకాడమీ నుండి గ్యాడ్యుయేట్ కావడం విశేషం.పుణేలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఆర్మీ చీఫ్ , మిజోరాం ప్రస్తుత గవర్నర్ జనరల్ వీకే సింగ్ పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్ష అధికారిగా ఉన్నారు. అకాడమీ క్యాడెట్ కెప్టెన్ ఉదయవీర్ నేగి 148వ కోర్సు కవాతుకు నాయకత్వం వహించారు. "ఈ రోజు అకాడమీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన రోజు, ఎన్‌డిఎ నుండి మహిళా క్యాడెట్ల తొలి బ్యాచ్ శిక్షణను పూర్తి చేసుకుందని, ఇదిమరింత మంది మహిళలు చేరడానికి, వారి సాధికారత వైపు సాగేలా చారిత్రాత్మక మైలురాయి లాందని జనరల్ సింగ్ ఈ సందర్భంగా అన్నారు.వీరు "నారి శక్తి"కి బలమైన చిహ్నం, ఇది మహిళల అభివృద్ధిని మాత్రమే కాకుండా మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని కూడా ప్రతిబింబిస్తుందన్నారు. అంతేకాదు ఇది ఈ క్యాడెట్ల అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానన్నారు. #WATCH | Maharashtra | Female cadets celebrate after their 'Passing Out Parade’ held at Pune, which was reviewed by Mizoram Governor and former Chief of the Army Staff VK SinghThe first batch of 17 female cadets graduated from the National Defence Academy (NDA) along with over… pic.twitter.com/yCnDU3SiLL— ANI (@ANI) May 30, 2025తమకు జెండర్ అనేది తమకు ఎపుడూ అడ్డంకి కాలేదనీ క్యాడెట్ ఇషితా శర్మ సంతోషం వ్యక్తం చేశారు. ఒకరికొకరం కష్టనష్టాల్ని పంచుకుంటూ అచంచలమైన విశ్వాసం, వైఖరితో ఐక్యతా స్ఫూర్తిని స్వీకరించా మన్నారు. 2021లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యుపీఎస్సి (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) మహిళలు డిఫెన్స్ అకాడమీకి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించిన తర్వాత ఎన్డీఏలో మహిళా అభ్యర్థుల ప్రవేశానికి మార్గం సుగమం అయింది. 2022లో మహిళా క్యాడెట్ల మొదటి బ్యాచ్ 2022లో ఎన్‌డిఎ 148వ కోర్సులో చేరిన సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్ష ద్వారా ఈ మహిళా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు NDA లో మూడు సంవత్సరాల పాటు శిక్షణ పొందుతారు. శఙక్షణ అనంతరం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలలో ఎంపిక చేయబడతారు. View this post on Instagram A post shared by Defence Squad™ | YouTube (@defencesquad) -
‘భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్’ నేడు ఆవిష్కరణ
న్యూఢిల్లీ: వాతావరణ పరిస్థితులు, వర్షాల విషయంలో మరింత కచ్చితత్వంతో సమాచారం అందించడానికి ఉద్దేశించిన ‘భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్’ను ప్రభుత్వం సోమవారం ఆవిష్కరించనుంది. పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం) ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇకపై స్థానికంగా వాతావరణ పరిస్థితులను కచ్చితత్వంతో వెల్లడించడానికి వీలవుతుందని కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ తెలిపారు. బీఎఫ్ఎస్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జాతికి అంకితం ఇవ్వనున్నారు. -
వర్షమే ఆ రెండు జంటలను కలిపింది..!
కొన్ని సంఘటనలు భలే గమ్మత్తుగా జరుగుతాయి. ఆఖరికి ప్రకృతి కూడా మనమంతా ఒక్కటే అని చెప్పేలా ఘటనలు సృష్టిస్తుంది. ఒక్క తొలకరి జల్లుతో ఎలా మతసామరస్యానికి పీట వేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వరుణుడే సాక్షిగా..రెండు వేర్వేరు మతాలకు చెందిన జంటలను ఒక వేదికపైనే పెళ్లి చేసుకునేలా చేశాడు. ఈ ఘటన పూణేలోని వాన్వోరిలో చోటు చేసుకుంది.అసలేం జరిగిందంటే..పూణేలోని వాన్వోరిలో మంగళవారం సాయంత్రం ఒక హాలులో ముస్లిం పెళ్లి జరుగుతుండగా.. అక్కడకు సమీపంలోని మైదానంలో హిందూ జంట పెళ్లితంతు జరుగుతోంది. ఇంతలో వర్షం పడటంతో వారి వివాహానికి ఆటంకం ఏర్పడింది. సరిగ్గా ఆ హిందూ జంట సాయంత్రం 6.56 గంటలకు అలంకారన్ లాన్స్‌లో వివాహం చేసుకోవలసి ఉంది. ముహర్తం మించి పోతుంది వర్షం ఆగేట్టు లేదు. దాంతో ఒక్కసారిగా ఆ హిందూ వివాహ వేడుకలో గందరగోళం ఏర్పడింది. పక్కనే హాలులో వలీమా(ముస్లిం ఆచారంలో జరిగే పెళ్లి) జరగుతోంది. ఇక వాళ్లనే రిక్వస్ట్ చేసి సప్తపది నిర్వహించాలనుకున్నారు కుటుంబ సభ్యులు. అందుకు ముస్లీం కుటుంబం కూడా అంగీకరించి..వాళ్లు ఖాళీ చేసి వేదికను ఇచ్చారు. అలాగే హిందూ ఆచారాల కోసం చేసే ఏర్పాట్లకు ముస్లీం కుటుంబం సాయం కూడా చేసింది. ఒకరి సంప్రదాయాలనుల ఒకరు గౌరవించుకుంటూ..ఆ జంటలు ఘనంగా వివాహం చేసుకున్నారు. అంతేగాదు రెండు వర్గాల ప్రజలు ఉమ్మడి విందును ఆనందంగా ఆస్వాదించారు. ఇక కొత్తగా పెళ్లైన ముస్లిం జంట మహీన్, మోమ్సిన్ కాజీలు హిందూ జంట నరేంద్ర, సంకృతిలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒకరకంగా ప్రకృతి మతసామరస్యంగా ఉండండిరా.. అని పిలుపునిచ్చినట్లుగా వేర్వేరు మతాలకు చెందిన ఆ జంటలను ఒక వేదికపైకి తీసుకొచ్చింది కాబోలు.(చదవండి: మూడు నెలలకు మించి బతకడన్నారు.. కట్‌చేస్తే ఏకంగా వందేళ్లకు పైగా..) -
ప్రముఖ శాస్త్రవేత్త నార్లికర్ కన్నుమూత.. సాగించిన పరిశోధనలివే..
పూణే: ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లికర్(Scientist Jayant Vishnu Narlikar) మహారాష్ట్రలోని పూణేలో నేడు (మే 20) కన్నుమూశారు. భారతదేశంలో ఖగోళ భౌతిక శాస్త్ర పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడంలో నార్లికర్ గణనీయమైన పాత్ర పోషించారు. విశ్వోద్భవ శాస్త్రం, బిగ్ బ్యాంగ్‌కు ప్రత్యామ్నాయ సిద్ధాంతాల రూపకల్పనలో నార్లికర్ విశేష కృషి చేశారు. పూణేలోని ఇంటర్-యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్(Inter-University Center for Astronomy and Astrophysics) (ఐయూసీఏఏ) వ్యవస్థాపక డైరెక్టర్‌గా పేరొందారు. 1938, జూలై 19న మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించిన ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అక్కడ ఆయన ఫ్రెడ్ హోయిల్‌తో కలిసి హోయ్ల్-నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఇది సాంప్రదాయ విశ్వోద్భవ నమూనాలను సవాలు చేసింది.తన శాస్త్రీయ రచనలతో పాటు నార్లికర్ పలు సంక్లిష్టమైన శాస్త్రీయ భావనలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పుస్తకాలు, వ్యాసాలు రాశారు. ఆయన మరాఠీలో సైన్స్ ఫిక్షన్ కూడా రాశారు. నార్లికర్ రచనలు కొత్త తరాల పరిశోధకులకు స్ఫూర్తినిస్తున్నాయి. ఖగోళ భౌతిక శాస్త్ర రంగాల్లో నార్లికర్ చేసిన కృషిగా గాను ఆయన పద్మభూషణ్ (1965), పద్మవిభూషణ్ (2004), మహారాష్ట్ర భూషణ్ (2010) తదితర ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1980ల చివరలో ఆయన ప్రముఖ టీవీ షో ‘కాస్మోస్: ఎ పర్సనల్ వాయేజ్’లో కనిపించారు. ఇది ఖగోళ భౌతిక శాస్త్రంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న గుర్తింపును మరోమారు గుర్తు చేసింది.ఇది కూడా చదవండి: World Bee Day... అప్పుడు మనిషి జీవితం నాలుగేళ్లే! -
Rahul Gandhi: ‘సుప్రీం’ మందలింపు.. ఆ వెంటనే చిక్కులు!
ముంబై/న్యూఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చిక్కుల్లో పడ్డారు. పరువు నష్టం కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ పుణే కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. స్వాతంత్ర సమరయోధుడు వీరసావర్కర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.ఏఎన్ఐ కథనం ప్రకారం.. 2023 మార్చి 5వ తేదీన లండన్ పర్యటనలో రాహుల్ గాంధీ వీరసావర్కర్(Veer Savarkar)ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకు గానూ రాహుల్‌పై సావర్కర్ దగ్గరి బంధువు పుణే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన కోర్టు.. మే 9వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.మరోవైపు.. సావర్కర్‌పై మరో సందర్భంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలనుగానూ కేసు నమోదు అయ్యింది. అయితే.. తాజాగా ఆ కామెంట్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.2022లో.. భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్ర అకోల్‌లో రాహుల్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.అయితే, దీనిపై అనేకసార్లు విచారణకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని న్యాయస్థానం (ACJM) రాహుల్‌కు రూ.200 జరిమానా కూడా విధించింది. అయితే.. ఈ కేసులో తనకు జారీ చేసిన సమన్లను అలహాబాద్ హైకోర్టు రద్దు చేయడానికి నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తాజాగా.. విచారణ జరిపిన సుప్రీం కోర్టు రాహుల్‌ను గట్టిగానే మందలించింది.వీర్ సావర్కర్‌కు (Vinayak Damodar Savarkar) మహారాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారని పేర్కొన్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం.. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని మందలించింది. స్వాతంత్ర్య సమరయోధులను ఎగతాళి చేయడం తగదని.. మళ్లీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులపై ఎవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి అనుమతించమని పేర్కొంది. ఇకనుంచి వాళ్లను అపహాస్యం చేస్తే ఇకపై కోర్టు సుమోటోగా విచారణ చేపడుతుందని తెలిపింది.అదే సమయంలో.. రాహుల్‌పై దాఖలైన కేసులో ఆయనపై క్రిమినల్ చర్యలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. రాహుల్‌పై ఫిర్యాదు చేసిన నృపేంద్ర పాండేకు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. -
జెన్సోల్.. ఓ ఉత్తుత్తి కంపెనీ!
ముంబై: కంపెనీ నిధులను ఇష్టాసారం వాడేసుకుని, ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన జోన్సోల్ ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంపెనీ షేరు ధరతో పాటు నిధుల్లో గోల్మాల్ చోటు చేసుకుందని గతేడాది జూన్‌లో సెబీకి అందిన ఫిర్యాదుపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ)అధికారి పుణెలోని కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్లాంట్‌లో జరిపిన తనిఖీల్లో అసలు ఎలాంటి తయారీ కార్యకలాపాలు లేనట్లు బట్టబయలైంది. అలాగే, అక్కడ కేవలం ఇద్దరు ముగ్గురు కార్మికులు మాత్రమే ఉన్నారని ఈ నెల 15న సెబీ జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో సెబీ వెల్లడించింది. జెన్సోల్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ.. కంపెనీ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా ఇన్వెస్టర్లను పక్కదారి పట్టించిన విషయాన్ని నియంత్రణ సంస్థ బయటపెట్టింది. తవ్వేకొద్దీ... సెబీ తరఫున ఎస్ఎస్ఈ అధికారి ఈ నెల 9న పుణె దగ్గర్లోని చకన్ వద్దనున్న జెన్సోల్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్‌లో విచారణ చేపట్టారు. ‘ఈ సందర్భంగా అక్కడ ఉత్పత్తి కార్యకపాపాలు ఏవీ కనబడలేదు. ఇద్దరు ముగ్గురు కార్మికులే ఉన్నారు. దీంతో గత 12 నెలల కరెంట్ బిల్లులను అధికారి కోరగా 2024 ఏడాది డిసెంబర్ నెలలో మాత్రమే అత్యధికంగా రూ.1,57,037 మొత్తాన్ని ఈ యూనిట్ చెల్లించినట్లు వెల్లడైంది‘ అని సెబీ తెలిపింది. కాగా, ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో జెన్సోల్ కొత్త ఈవీని ప్రదర్శించడమే కాకుండా, దాదాపు 30,000 ఈవీలకు ప్రి–ఆర్డర్లు కూడా వచ్చాయని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేయడం గమనార్హం. అయితే, కంపెనీ డాక్యుమెంట్ల ప్రకారం 29,000 ఈవీల కొనుగోలుకు వ్యక్తం చేసిన 9 సంస్థలతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) మాత్రమే కుదిరినట్లు సెబీ గుర్తించింది. ఎలాంటి ధర, డెలివరీ తేదీలు లేకపోవడాన్ని చూస్తే, ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన విషయం స్పష్టమవుతోందని సెబీ పేర్కొంది. జెన్సోల్ ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ 6,400 ఈవీలను కొనుగోలు చేయడం కోసం ఇరెడా, పీఎఫ్సీ నుంచి 978 కోట్ల రుణాలు తీసుకుని కేవలం 4,704 ఈవీలను మాత్రమే (రూ.568 కోట్లు) కొనుగోలు చేసిన విషయం సెబీ దర్యాప్తులో తాజాగా బయటపడిన విషయం తెలిసిందే. మిగతా నిధులను పక్కదారి పట్టించి, జగ్గీ బ్రదర్స్ సొంతానికి వాడేసుకున్నట్లు కూడా సెబీ తేల్చింది. దీంతో జెన్సోల్ సహా ప్రమోటర్లను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధించడంతో పాటు జగ్గీ సోదరులు కంపెనీలో ఎలాంటి పదవులూ చేపట్టకుండా కఠిన చర్యలు చేపట్టింది. దీంతో ప్రమోటర్లు తమ డైరెక్టర్ పదవులను రాజీనామా చేశారు, మరోపక్క, జెన్సోల్ ఇంజినీరింగ్ షేరు విభజన ప్రణాళికను కూడా సెబీ పక్కనబెట్టింది. -
Rutuja Warhade: దేశం కోసమే మొదటి అడుగు
ప్రతిష్ఠాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడెమీ ఫలితాలు ఇటీవలే వెలువడ్డాయి. దేశం మొత్తం నుంచి 12 లక్షల మంది రాశారు. వీళ్లలో లక్షన్నర మంది అమ్మాయిలు. ఈ అమ్మాయిల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది పూణెకు చెందిన రుతుజా వర్హాడే. అంతే కాదు.. దేశం మొత్తం మీద 3వ ర్యాంక్ పొందింది. 75 ఎన్ డీఏ చరిత్రలో ఒక అమ్మాయి టాప్ ర్యాంక్ సాధించడం ఇదే మొదలు. ‘మొదటి నుంచి డిఫెన్స్ లో పని చేయాలనేది నా కోరిక... అందుకే కష్టపడ్డా’’ అంటోంది రుతుజా.పూణెలో ఉండే ప్రతిష్ఠాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్.డి.ఏ) ఎంట్రన్స్ సంవత్సరంలో రెండుసార్లు జరుగుతుంది. ఏప్రిల్‌లో. సెప్టెంబర్‌లో. ఏప్రిల్‌లో జరిగిన ఎంట్రెన్స్‌కు 12 లక్షల మంది దేశవ్యాప్తంగా అప్పియర్ అయితే వారిలో 3వ ర్యాంక్ సాధించింది రుతుజ వర్హాడే. అకాడెమీ చరిత్రలో ఒక అమ్మాయికి ఈ స్థాయి ర్యాంక్ రావడం ఇదే మొదలు. పరీక్షలో పాల్గొన్న 12 లక్షల మంది అభ్యర్థుల్లో లక్షన్నర మంది అమ్మాయిలైతే వారిలో మొదటి స్థానంలో నిలిచింది రుతుజ. అందుకే ఆమెను అందరూ శ్లాఘిస్తున్నారు. ఆ ప్రతిభకు సెల్యూట్ చేస్తున్నారు.దేశం కోసం...రుతుజ పూణెలో పుట్టి పెరిగింది. తండ్రి ప్రొఫెసర్. తల్లి ఇంట్లో 5వ తరగతి పిల్లల నుంచి ఇంజనీరింగ్ పిల్లల వరకూ మేథ్స్‌లో ట్యూషన్ చెబుతుంది. రుతుజ చిన్నప్పటి నుంచి చదువులో చాలా బ్రిలియంట్‌గా ఉంది. పదవ తరగతిలో టాప్ మార్క్స్ వచ్చాయి. ఇంటర్లో కూడా అంతే. ఎన్.డి.ఏ ఎంట్రన్స్ ఇంటర్ తర్వాత రాయాలి కాబట్టి ముందు నుంచి ప్రిపేర్ అవుతూ కోచింగ్ తీసుకుంటూ రాసి టాప్ ర్యాంక్ సాధించింది. ‘ఆర్మ్డ్ ఫోర్స్‌లో పని చేయాలనేది నా కల. దేశం కోసమే నా మొదటి అడుగు’ అంటోంది రుతుజ.ఎనిమిదవ తరగతిలో ఉండగా...సాధారణంగా ఆమ్మాయిలు ఎన్.డి.ఏ.లో చదవాలని కోరుకోరు. అందుకే నిన్న మొన్నటి వరకూ వారిని అనర్హులుగా చూసేది ఎన్.డి.ఏ. అయితే రుతుజ ఎనిమిదవ క్లాస్‌లో ఉన్నప్పుడు ఎన్.డి.ఏ. ఇకపై ఆడపిల్లలకూ ప్రవేశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ‘ఈ విషయం మా క్లాస్‌లో చర్చకి వచ్చింది. అప్పుడే ఎన్.డి.ఏ గురించి తెలిసింది. మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండటం మొదటి అర్హత అయితే కఠినమైన రిటన్ టెస్ట్‌లో పాసయ్యి రెండవ దశలో సీట్ సంపాదించడం ఇంకా కష్టమని తెలుసుకున్నాను. ఎలాగైనా ఈ అకాడెమీలో చేరాలని నిర్ణయించుకుని కష్టపడ్డాను. మేథ్స్, అబిలిటీ, జనరల్ నాలెడ్జ్ మీద ప్రశ్నలు ఉంటాయి. వాటి కోసం కోచింగ్ సెంటర్లో నాలుగైదు గంటల మెగా లెక్చర్స్ వినేదాన్ని. అంతేకాదు... మా నాన్నగారు అందించిన ప్రోత్సాహం కూడా నన్ను మోటివేట్ చేసింది’ అంటుంది రుతుజ.మాటలు పడినా...రుతుజ ఈ క్రమంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంది. చదువులోనే నిమగ్నమై ఉండటంతో స్నేహితులు ఆమెను బాయ్‌కాట్ చేశారు. ఎప్పుడూ చదువే నీకు... ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో నీ ప్రతిభ గుండు సున్నా అని ఎగతాళి చేశారు. ‘రోషపడి సీనియర్ ఇంటర్లో క్లాసుల కంటే కూడా స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్‌లో ఎక్కువ సమయం వెచ్చించాను. దాంతో నా గ్రేడ్స్ పడిపోయాయి. చాలా డల్ అయిపోయాను. ఆ దశ నుంచి తిరిగి టాప్ స్టూడెంట్‌గా నిలవడానికి కష్టపడాల్సి వచ్చింది’ అని తెలిపింది రుతుజ.‘సాధారణంగా సీనియర్ ఇంటర్లో చాలామంది డైవర్ట్ అవుతారు. అలా కాకుండా కష్టపడి చదివి లక్ష్యం వైపు అడుగు వేస్తే విజయం మీదే’ అంటోంది రుతుజ. -
గడ్డిభూముల్లో హాయ్.. హాయ్
సఫారీ.. ఈ మాట వింటే ఠక్కున గుర్తొచ్చేది దక్షిణాఫ్రికా. సవన్నాలుగా పిలిచే విశాలమైన పచ్చిక భూముల ప్రాంతం క్రూర మృగాలు, వన్యప్రాణుల ఆవాసం. కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతంలో విహరిస్తుంటే ఆ ఆనందమే వేరు. అందుకే ఆ దేశం పర్యాటకానికి ప్రాధాన్యమిస్తోంది. తద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలను సృష్టిస్తోంది. ఈ విషయంలో భారత్ సైతం ఇప్పుడిప్పుడే చొరవ కనబరుస్తోంది. గడ్డిభూములున్న ప్రాంతాలను గుర్తించి పర్యావరణ, పర్యాటకాన్ని ద్విగుణీ కృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇంతకీ ఆ గడ్డిభూములు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అక్కడి విశేషాలేంటి?మహారాష్ట్ర మొదటగా..పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పుణే(మహారాష్ట్ర) లోని అటవీ శాఖ షోలాపూర్‌లో గ్రాస్ ల్యాండ్ సఫారీ (గడ్డి భూముల్లో విహారయాత్ర)కి శ్రీకారం చుట్టింది. ఇక్కడి బోరామణి గ్రామ గడ్డి భూముల్లో తాజాగా ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ భూములు కృష్ణ జింకలు, తోడేళ్ళు, బెంగాల్ నక్కలు, అడవి పందులు, రంగురంగుల సీతాకోకచిలుక జాతులకు ఆవాసాలు. ముఖ్యంగా అంతరించిపోతున్న అరుదైన బట్టమేక పక్షి (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) ఉనికి ఇక్కడ కనిపిస్తుంది. వాటి సహజ ఆవాసాలను వాహనాల్లో సంచరిస్తూ వీక్షించే అవకాశాన్ని అటవీశాఖ కల్పిస్తోంది.రోజుకు రెండు సార్లు మాత్రమే..ఈ గ్రాస్‌ల్యాండ్ సఫారీ రెండు విడతల్లో ఉంటుంది. ఉదయం 6:30 నుంచి 10:30 వరకు, మధ్యాహ్నం 3:30 నుంచి 6:30 గంటల మధ్యలో విహరించేందుకు అనుమతిస్తున్నారు. వన్య ప్రాణులు, పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగించకుండా పరిమిత సంఖ్యలో వాహనాల్లో సంచరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందర్శకులకు మెరుగైన అనుభవాన్ని పంచడానికి అటవీ శాఖ రాత్రి పూట బసలను అందుబాటులో ఉంచింది. ఈ గడ్డిభూముల్లో సందర్శకులు సొంత వాహనాల్లో, అద్దెవాహనాల్లో విహరిస్తూ ఆస్వాదించే సౌకర్యం కల్పించింది.కర్బన శోషకాలు.. గడ్డిభూములు కర్బన ఉద్గారాలతో పాటు ఉదజని (కార్బన్ డయాక్సైడ్)ని శోషించి వాతావరణాన్ని నియంత్రించడంలో గడ్డిభూములది కీలక పాత్ర. కృష్ణ జింకలు, జింకల్లాంటి శాకాహారులు, తోడేళ్లు, నక్కల్లాంటి మాంసాహారులు పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిలో ఎనలేని పాత్ర పోషిస్తాయి. గడ్డిభూముల సంరక్షణ విషయానికి వస్తే..అడవులతో పోల్చి చూస్తే తక్కువే అని చెప్పొచ్చు. పర్యావరణ స్థిరత్వాన్ని కాపాడటంలో ఇవి ఎంతో ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రాఫర్లు, పరిశోధకులకు స్వేచ్ఛగా గడ్డిభూముల్లో విహరించే వీలు కల్పించడం ద్వారా వీటి సంరక్షణపై అవగాహన తీసుకురావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. 2024 జనవరిలో ప్రారంభంగడ్డిభూముల్లో సఫారీకి 2024 జనవరిలో పుణే, షోలాపూర్ ప్రాంతాల్లో తొలిసారిగా శ్రీకారం చుట్టారు. ఇక్కడ అటవీ రేంజ్ లోని గడిఖేల్, శిర్షుపాల్, సబ్లెవాడీ, పర్వాడీ పరిధిలో విశాలమైన పచ్చిక బయళ్లలో సఫారీ ప్రారంభించారు. ఇది విజయవంతం కావడంతో గడ్డిభూములున్న ప్రాంతాల్లో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నారు. దీంతో స్థానికులకు ప్రత్యక్ష,ంగా, పరోక్షంగా ఉపాధి దొరికింది. శిక్షణ పొందిన స్థానిక గైడ్లకు రూ. వేలల్లో ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. -
నాన్నా.. నేనేం నేరం చేశాను..!
నాన్న.. పిల్లలకు కంటి రెప్ప, నాన్న.. పిల్లల భవిష్యత్ కు భరోసా, నాన్న..పిల్లలకు నడత నేర్పించే మార్గదర్శి.. అన్నింటీకి మించి నాన్న అంటే వెనుక ఉండి నడిపించే శక్తి. మరి అటువంటి నాన్న అత్యంత కర్కశంగా తన బిడ్డను చంపేసుకుంటే ఏమనాలి. రాక్షసుడు అనే పదం సరిపోదేమో. నాన్నే తన పాలిట రాక్షసుడై జీవితాన్నే ఛిదిమేస్తే.. ఆ నరక యాతన ఎంతలా ఉంటుంది. ‘నాన్నా.. నేనేం నేరం చేశాను’ అని అసువులు బాసేముందు మూగరోదన తప్ప.ఈ తరహా ఘటనలు ఎన్నో ప్రతీ రోజూ ఏదొకటి మనకు తారసపడుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో తన కన్న కొడుకునే పొట్టబెట్టుకున్నాడు తండ్రి.. అభం శుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారి బాలుడిని దారుణంగా చంపేశాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్న ఆ తండ్రి.. ఆ బాలుడి పాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానంతో కొడుకును హత్య చేశాడు. అతి దారుణంగా హత్య..ఆ బాలుడి గొంతును కోసేసి, ఆ తర్వాత అటవీ ప్రాంతంలో పడేశాడు కర్కశ తండ్రి. మాధవ్ తికేతీ, స్వప్నాలకు హిమ్మాత్ మాధవ్ ఒకే ఒక్క కొడుకు. ఎంతో గారంగా పెరగాల్సిన ఆ చిన్నారి.. తల్లి దండ్రుల మనస్పర్థలకు బలయ్యాడు. ఒకవైపు భార్యపై అనుమానం పెంచుకున్నాడు మాధవ్ తికేతి. ఇదే విషయంలో వీరిద్దరికి తీవ్రమైన ఘర్షణ ఈ గురువారం జరిగింది. దాంతో కొడుకును తీసుకుని వెళ్లిపోయాడు మాధవ్ తికేతి. అయితే తిరిగిరాలేదు. కొడుకును హత్య చేసి పుణేలోని చందాన్ నగర్ ఫారెస్ట్ ఏరియాలో పడేశాడు. భర్త, కొడుకును తీసుకుని వెళ్లి ఇంకా తిరిగి రాలేదని భార్య స్వప్ప ఆందోళన చెందింది. పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ పసిబాలుడు హత్యకు గురైనట్లు గుర్తించారు.హత్య చేసిన రోజు’(గురువారం) ఇంటి నుంచి మధ్యాహ్నం గం. 12.30 నిం.లకు కొడుకును తీసుకుని బయటకు వెళ్లిన మాధవ్ తివేతి.. ఆ తరువాత అదే రోజు గం. 2.30ని.లకు ఒక చోట పిల్లాడితో కనిపించినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో నమోదైంది. ఆపై అదే రోజు గం. 5.30 ని.లకు ఒంటరిగా వస్త్ర దుకాణంలో దుస్తులు కొనుగోలు చేసినట్లు సీసీ టీవీల ఫుటేజ్ ల ఆధారంగా గుర్తించారు. అంటే ఆ బాలుడ్ని గం. 2.30ని.ల నుంచి గం. 5.30 ని.ల మధ్యలో హత్య చేసి ఫారెస్ట్ ఏరియాలో పడేశాడు.దీనిపై గత రాత్రి(శుక్రవారం) ఆ బాలుడి తల్లి, మాధవ్ భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త.. కుమారుడిని తీసుకువెళ్లి ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈరోజు(శనివారం) పిల్లాడు హత్య గావించబడిన విషయాన్ని గుర్తించారు. అదే సమయంలో మాధవ్‌ను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. అయితే కొడుకును తానే చంపినట్లు మాధవ్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా కేసును దర్యాప్తు చేస్తున్నామని, హత్యా అభియోగాలు కింద కేసు కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఒక సీనియర్ పోలీస్ అధికారి స్పష్టం చేశారు. -
‘స్వార్గేట్’ కేసు : నిందితుడి పోలీసు కస్టడీ పొడిగింపు
‘స్వార్గేట్’అత్యాచారం కేసు నిందితుడికి కోర్టు మార్చి 26 వరకు పోలీసు కస్టడీ విధించింది. 12 రోజుల పోలీసు కస్టడీ అనంతరం గడేను బుధవారం కోర్టులో హాజరు పరిచాం. కస్టడీని పొడిగించాలని కోర్టుకు విన్నవించాం. ఈమేరకు మార్చి 26 వరకూ నిందితుడికి జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ’అని క్రైంబ్రాంచ్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముందే క్రిమినల్ నేపథ్యం ఫిబ్రవరి 25 తెల్లవారుజామున స్వార్గేట్ టెర్మినస్ వద్ద ఎమ్మెస్సార్టీసీ బస్సులో 26 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ దత్తాత్రాయ్ గడే అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. బాధితురాలు ఫిబ్రవరి 25 తెల్లవారుజామున సతారా జిల్లాలోని తన స్వస్థలానికి వెళ్లేందుకు స్వార్గేట్ బస్టాండ్‌లో వేచి ఉండగా బస్కండక్టర్నని చెప్పి గాడే ఆమెను అప్పటికే అక్కడ ఉన్న బస్సులో ఎక్కాల్సిందిగా కోరాడు. ఈమేరకు బాధితురాలు బస్సులోపలికి వెళ్లగా గాడే రెండు తలుపులూ మూసివేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం డ్రోన్లు స్నిఫర్ డాగ్‌ల సహాయంతో శిరూర్ తహసీల్ పరిధిలో తన స్వస్థలం గుణత్ గ్రామానికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గడేను పట్టుకున్నారు. అతడిపై ఇప్పటికే అరడజను క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. -
బీట్స్‌తో అదరగొట్టేసిన బుడ్డోళ్లు : 3 కోట్ల వ్యూస్, ఓ లుక్కేసుకోండి మరి!
‘బాల్యం బంగారు నిధి’ ఇది అందరం ఒప్పుకునే మాట. బాల్య స్మృతులు ఎవరికైనా చెప్పలేనంత ఉల్లాసాన్ని ఇస్తాయి. బాల్యం అనగానే అందమైన అనుభూతులు, అనుభవాలు ఒక్కసారిగా మనల్ని చుట్టుముడతాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించిన జ్ఞ్యాపకాలు ఒక్కసారిగా నిద్ర లేస్తాయి. చిన్నపుడు మనం చేసిన అల్లరి, చిలిపి చిలిపి చేష్టలు గుర్తొస్తాయి. బ్లాక్ బోర్డుపై రాసిన రాతలు, స్కూలు బెంచ్‌పై చెక్కుకున్నపేర్లు, అదేదో సినిమాలో అన్నట్టు నచ్చిన అమ్మాయిపై పేపర్ బాల్ విసరడం, అది మాస్టార్‌కు తగిలి, వీపు పగలడం ఇలా.. ఎన్నో..ఎన్నో గుర్తుకు వస్తాయి కదా. ఇపుడు మీరు చదవబోయే కథనం కూడా అలాంటి ఎన్నో అనుభవాలను గుర్తు చేస్తుంది. పుణేకు చెందిన విద్యార్థుల వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.ప్రాజెక్ట్ అస్మి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఇది 3 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కమెంట్లు వెల్లువెత్తాయి. పూణేలోని ఒక పాఠశాల చెందిన బ్యాచ్ జామెట్రీ బాక్స్, బెంచె మీద వాయిస్తూ అద్భుతమైన సంగీతాన్ని సృష్టించారు. వాటర్ బాటిల్‌ను మాత్రమే ఉపయోగించి డ్రమ్ బీట్స్‌తో అదరగొట్టేశారు. ఒకరి తరువాత ఒకరు తమ టాలెంట్‌తో రెచ్చిపోయారు. దీంతో తరగతి గది ఒక చిన్న కచేరీ వేదికగా మారిపోయింది. దీంతో టీచర్లు కూడా అలా మైమరిచిపోయారు. చుట్టూ ఉన్న పిల్లలు, స్నేహితులు చప్పట్ల మోత మోగించారు. చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా? View this post on Instagram A post shared by Project Asmi (@projectasmi_pune)అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి విద్యార్థులు ఉత్పత్తి చేసే బీట్లు , రిథమ్‌లు భలే ఉంటాయి. వారి క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేం. కల్మషం లేని లేత వయసులో వారి ప్రతిభను ,సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే గొప్ప ప్రతిభావంతులుగా మారతారు. మరి ఈ బాల శివమణిలకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుందో వేచి చూద్దాం. -
‘మెడలో తాళి, నుదుటున బొట్టు లేదు.. మీ భర్త మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు’: కోర్టు
ముంబై : వాళ్లిద్దరూ భార్యా, భర్తలు. అయితే, భర్త తనని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోరింది. ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో న్యాయమూర్తికి, మహిళకు మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పూణేకు చెందిన అంకుర్ ఆర్ జగిధర్ లాయర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ తనని సంప్రదించిందని, అందుకే ఆమె తరుఫున వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తన క్లయింట్ కేసు పూణే జిల్లా కోర్టులో విచారణకు వచ్చిందని, విచారణ సమయంలో న్యాయమూర్తితో జరిగిన వాదనలను భార్య తరుఫు లాయర్ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో పూణే జిల్లా కోర్టులో ‘‘నా క్లయింట్ విడాకుల కేసు విచారణ జరిగింది. విచారణలో భర్త తన డిమాండ్లను నెరవేర్చాలని కోర్టును కోరింది. అయితే, ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి నా క్లయింట్‌ను ఇలా ప్రశ్నించారు. ‘‘ఏమ్మా.. మిమ్మల్ని చూస్తుంటే మొడలో మంగళసూత్రం, నుదుట బొట్టు పెట్టుకునేవారిలా కనిపించడం లేదే? వివాహం జరిగిన స్త్రీగా మీరు కనిపించకపోతే.. మీ వారు.. మిమ్మల్ని ఎలా ఇష్టపడతారు? అందుకే భర్తలతో ప్రేమగా ఉండండి. కఠువగా ఉండకండి అని సలహా ఇచ్చారు.అంతేకాదు.. మాటల మధ్యలో న్యాయమూర్తి ఇలా అన్నారు. ‘‘ఒక స్త్రీ బాగా సంపాదిస్తే, ఆమె ఎప్పుడూ తనకంటే ఎక్కువ సంపాదిస్తున్న భర్తనే కోరుకుంటుంది. తక్కువ సంపాదిస్తున్న వ్యక్తి చాల్లే అని సరిపెట్టుకోదు. అదే బాగా సంపాదించే వ్యక్తి తాను వివాహం చేసుకోవాలనుకుంటే, తన ఇంట్లో పాత్రలు కడిగే పనిమనిషినైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటాడు. కాబట్టి మీరు మీ భర్త పట్ల కాస్త ప్రేమను చూపించండి. కఠినంగా ఉండొద్దు అని ఇద్దరు దంపతుల్ని ఒక్కటి చేసే ప్రయత్నం చేశారని వివరిస్తూ’’ సదరు న్యాయవాది రాసిన సోషల్ మీడియా పోస్టు నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. -
నిందితుడి అరెస్ట్.. ఎలా చిక్కాడంటే!
-
పూణే అత్యాచార కేసు.. నిందితుడు రామ్‌దాస్ అరెస్ట్
పూణే: మహారాష్ట్రలోని పూణే అత్యాచార కేసులో నిందితుడు దత్తాత్రేయ్ రామ్‌దాస్ గాదేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దారుణ ఘటన తర్వాత 75 గంటల గాలింపు అనంతరం నిందితుడు పోలీసులకు చిక్కాడు. నిందితుడి కోసం పోలీసులు 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.వివరాల ప్రకారం.. పూణేలోని స్వర్గేటు బస్టాండ్ వద్ద 26 ఏళ్ల యువతిపై బస్సులో అత్యాచారానికి పాల్పడిన దత్తాత్రేయ్ రామ్‌దాస్ పోలీసులకు చిక్కాడు. 75 గంటల గాలింపు చర్యల అనంతరం నిందితుడు రామ్‌దాస్‌ను శుక్రవారం తెల్లవారుజామున శ్రీరూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, పోలీసు స్టేషన్‌కు తరలించారు. అత్యాచార ఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డు అందజేస్తామని పోలీసుశాఖ సైతం తెలిపింది.Pune rape case -; Accused, Dattatray Ramdas Gade, has been arrested by Pune Crime Branch from a village in Shirur Tehsil of Pune district#punecrime #Rape #maharshtra @PuneCityPolice pic.twitter.com/G8PdSUGHO8— Indrajeet chaubey (@indrajeet8080) February 28, 2025 జరిగింది ఇదీ..పూణేలో అత్యంత రద్దీగా ఉండే బస్ స్టేషన్లలో ఒకటైన స్వర్గేట్లో మంగళవారం ఉదయం అత్యాచార చోటు చేసుకుంది. తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్‌స్టేషన్‌కు చేరుకున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు. అక్క అని సంబోధిస్తూ నమ్మించాడు. గ్రామానికి వెళ్లే బస్సు మరో చోట ఉందని చెప్పి బస్ స్టేషన్లోనే దూరంగా ఎవరూ లేని చోట ఆగి ఉన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్ దగ్గరకు ఆమెను తీసుకెళ్లాడు.బస్సులోకి వెళ్లేందుకు యువతి తటపటాయించడంతో లోపల ప్రయాణికులు ఉన్నారని.. నిద్రలో ఉండటంతో వాళ్లు లైట్లు వేసుకోలేదని నమ్మించాడు. బస్సులోకి యువతి ప్రవేశించగానే తలుపు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్ (36)గా పోలీసులు గుర్తించారు. అతడిపై అనేక కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిల్ మీద ఉన్నాడని తెలిపారు. రామదాస్‌ను పట్టుకొనేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అత్యాచారం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం. -
అత్యాచార ఘటనపై మాజీ సీజేఐ చంద్రచూడ్ ఏమన్నారంటే..
ఢిల్లీ: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్గేట్ జంక్షన్ బస్టాండ్‌లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్‌జంక్షన్‌లలో ఒకటైన స్వార్గేట్ బస్టాండ్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు.చంద్రబూడ్ ఏమన్నారంటే..ఈ అత్యాచార ఘటనపై మాజీ సీజేఐ చంద్రచూడ్ స్పందించారు. ‘గతంలో ‘నిర్భయ’ ఉదంతం చోటు చేసుకున్న తర్వాత చట్టంలో అనేక మార్పులు వచ్చాయి. కేవలం చట్టాల వల్లే మహిళలకు రక్షిణ కల్పించలేం. దీన్ని సొసైటీ ఒక పెద్ద బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో చట్టాలు అమలు తీరు కూడా కచ్చితంగా ఉండాలి. మహిళల రక్షణ కోసం చట్టాలను సరైన విధానంలో అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. తాము బయటకు వెళితే రక్షణ ఉంది అనే భావన మహిళలకు రావాలి. ఈ తరహా కేసుల్లో ఇది చాలా ముఖ్యమైన అంశం. విచారణ న్యాయబద్ధంగా జరగాలి.. అలాగే కఠినమైన శిక్షలను అమలు చేయాలి. తొందరగా విచారణ పూర్తి చేసి శిక్షలను కూడా అంతే త్వరగా అమలు చేయాలి. ఇందులో న్యాయ వ్యవస్థతో పాటు పోలీసులది కూడా పెద్ద బాధ్యతే’ అని చంద్రచూడ్ స్పష్టం చేశారు. నిందితుడి కోసం జల్లెడ పడుతున్న పోలీసులుఈ అత్యాచార ఘటనలో నిందితుడిగా చెప్పబడుతున్న 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన అనంతరం తిరిగి తన ప్రాంతానికి వెళ్లే క్రమంలో అతను చెరుకు తోటల్లో ఉన్నాడనే అనుమానంతో అక్కడ పోలీసులు సోదాలు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అత్యాచార ఘటన తర్వాత ఆ నిందితుడు తన డ్రెస్ మార్చుకోవడంతో పాటు షూస్ కూడా మార్చినట్లు తెలుస్తోంది. తొలుత కూరగాయాలు తీసుకెళ్లే వ్యాన్ లో అతను తిరిగి పయనమైనట్లు గుర్తించిన పోలీసులు.. అటు తర్వాత అతని ఇంటికి సమీపంగా ఉన్న చెరుకు తోటల్లో ఉన్నట్లు అనుమానిస్తన్నారు. దాంతో ప్రత్యేకమైన డాగ్ స్క్వాడ్స్‌తో పాటు డ్రోన్లను కూడా ఉపయోగించి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు. పుణె బస్టాండ్‌లో దారుణం.. ఒంటరిగా ఉన్న మహిళకు మాయమాటలు చెప్పి -
‘అతడికి ఉరిశిక్ష సరైందే’.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్
ముంబై: మహారాష్ట్ర పూణేలోని ఓ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో దారుణం జరిగింది. నిలిపి ఉన్న బస్సులో నిందితుడు.. యువతిపై దారుణానికి ఒడిగట్టాడు . ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర అధికార శివసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధినేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్లు ఈ తరహా దారుణాలకు పాల్పడే నిందితుల్ని ఉరితీయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బస్సులో జరిగిన దుర్ఘటనపై మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి చెందిన పార్టీ నేతలు గురువారం స్వర్గేట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన బాట పట్టారు. మహా ప్రభుత్వం మహిళల భద్రత కంటే ఉచితాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో బస్సు దుర్ఘటనపై ఏక్నాథ్ షిండే స్పందించారు. పుణే ఘటన చాలా దురదృష్టకరం. నిందితులు ఎవరైనా ఉపేక్షించబోం. అలాంటి వారిని ఉరితీయాలి’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు అజిత్ పవార్ సైతం దారుణంపై మీడియాతో మాట్లాడారు. స్వర్గేట్ బస్ స్టేషన్లో జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరం, అవమానకరమైనది. నిందితుడు చేసిన నేరం క్షమించరానిది. ఇలాంటి నేరస్తులకు మరణశిక్ష తప్ప మరొకటి ఉండదు. దారుణంపై సమాచారం అందుకున్న వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేయాలని పూణే పోలీసు కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. ఇంటికి వెళ్లేందుకు.. బస్సు కోసం ఎదురు చూస్తూపూణేలోని నిత్యం రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్‌లో యువతిపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సతారా జిల్లాలోని ఫల్తానా ప్రాంతానికి చెందిన యువతి మంగళవారం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేట్ బస్టాండ్‌లో బస్సు కోసం వేచిచూస్తోంది. అసలే ఆలస్యం అవుతుంది. బస్సులు కనిపించడం లేదని యువతి ఆందోళనకు గురైంది. ఆ సమయంలో బాధితురాలికి సమీపంలో దత్తాత్రేయ రాందాస్ గాడే (36) కనిపించాడు. బస్సులు రాకపోకల గురించి ఆరా తీసింది. సమీపంలో ఓ ఉన్న బస్సును చూపిస్తూ.. ఆ బస్సు మీ ఊరు వెళుతుందని నమ్మించే ప్రయత్నించాడు. ప్లాట్‌ఫారమ్ మీదకు రావాల్సిన బస్సు ఆక్కడ ఎందుకు ఆగి ఉంది? ఆగి ఉంటే లైట్లు ఎందుకు ఆర్పేశారు? అని ఇలా ప్రశ్నించింది. దీంతో గాడే.. బస్సులో ప్రయాణికులు ఉన్నారని, అందరూ నిద్రలో ఉండడం వల్ల లైట్లు ఆర్పేశారు. కావాలంటే మీరే చూడండి అంటూ యువతిని నమ్మించాడు. గాడే మాటల్ని నమ్మిన యువతి బస్సు దగ్గరికి వెళ్లింది. ప్రయాణికులు ఉన్నారా? లేరా? అని చూసేందుకు బస్సు డోర్ ఓపెన్ చేసింది. వెంటనే నిందితుడు యువతిని బస్సు లోపలికి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తనపై జరిగిన దారుణాన్ని తన స్నేహితురాలికి చెప్పడంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పలు కేసులు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 8 బృందాలుగా విడిపోయి గాలింపులు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. పోలీసుల గాలింపు చర్యల్లో బస్సులో యువతిపై అత్యాచారానికి పాల్పడింది 36ఏళ్ల దత్తాత్రయ రాందాస్ గాడే అని నిర్ధారించారు. గాడేపై గతంలో దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆ కేసుల్లో జైలు శిక్షను అనుభవించి 2019లో నుండి బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. తాజాగా, మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. -
పుణె బస్టాండ్‌లో దారుణం
పుణె: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్గేట్ జంక్షన్ బస్టాండ్‌లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్‌జంక్షన్‌లలో ఒకటైన స్వార్గేట్ బస్టాండ్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు. గతంలో ఇతనిపై దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు సతారా జిల్లాలోని ఫల్టణ్ పట్టణానికి వెళ్లే బస్సు ఎక్కేందుకు బాధిత మహిళ ఈ బస్టాండ్‌లోని ఒక ప్లాట్‌ఫామ్ వద్ద వేచిచూస్తోంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన నిందితుడు ‘సోదరీ’ అంటూ ఆమెతో మాటలు కలిపాడు. తాను బస్ కండక్టర్‌ను అని, మీరు ఎక్సాలిన బస్సు సమీపంలో ఆగి ఉందని చెప్పి, సమీపంలో ఆగి ఉన్న ‘శివ్ షాహీ’ ఏసీ బస్సును చూపించాడు. అది మీరు వెళ్లాల్సిన రూట్లో వెళ్తుందని చెప్పి ఆ బస్సు ఎక్కాలని ఆమెకు సలహా ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన ఆమె ఎవరూ లేని ఆ బస్సు ఎక్కింది. లైట్లు ఆఫ్ చేసి, చిమ్మచీకటిగా ఉన్న బస్సును ఎక్కేందుకు తొలుత ఆమె తటపటాయించింది. బస్సులో ప్రయాణికులు నిద్రిస్తుండటంతో లైట్లు ఆర్పివేశారని, నచ్చజెప్పి బస్సులో లోపలిదాకా వెళ్లేలా చేశాడు. వెంటనే వెనకాలే వచ్చిన అతను బస్సు తలుపు మూసేసి, ఆమెను రేప్‌చేసి పారిపోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్మార్థనా పాటిల్ చెప్పారు. ఘటన జరిగినప్పుడు బస్టాండ్‌లో ఎన్నో బస్సులు, ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారు. మహిళ తనకు జరిగిన అన్యాయంపై వెంటనే ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఫల్టణ్కు వెళ్లే బస్సు ఎక్కి మార్గమధ్యంలో తన స్నేహితురాలికి ఫోన్‌చేసి ఘోరాన్ని వివరించింది. ఆమె సలహామేరకు బాధితురాలు వెంటనే బస్సు దిగి సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్ట్చేసేందుకు పోలీసులు ఎనిమిది బృందాలను ఏర్పాటుచేసి వేట మొదలెట్టారు. పోలీస్‌స్టేషన్‌కు ఈ బస్టాండ్ కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. నిందితుడు గతంలో ఒక కేసులో బెయిల్ సంపాదించి 2019 ఏడాది నుంచి బయటే ఉన్నాడు.విపక్షాల విమర్శలు‘‘ఏమాత్రం భయం లేకుండా అసాంఘిక శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. పుణెలో నేరాలను అరికట్టడంలో హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం విఫలమయ్యారు’’ అని ఎన్సీపీ(ఎస్పీ) నాయ కురాలు, ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు. -
డోపింగ్‌లో దొరికిన మారథాన్ విజేత
న్యూఢిల్లీ: రెండు నెలల క్రితం పుణేలో నిర్వహించిన హాఫ్ మారథాన్ పరుగులో విజేతగా నిలిచిన ప్రధాన్ విలాస్ కిరులేకర్ డోపింగ్‌లో దొరికిపోయాడు. దీంతో అతనిపై తాత్కాలిక నిషేధం విధించారు. డిసెంబర్లో నిర్వహించిన 21.09 కిలోమీటర్ల రేసును ప్రధాన్ విలాస్ అందరికంటే ముందుగా ఒక గంటా 4 నిమిషాల 22 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు. అయితే అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్ని ల్యాబ్‌లో పరీక్షించగా, నిషిద్ధ ఉ్రత్పేరకం మెల్డొనియమ్ తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్లూఏ)కు చెందిన స్వతంత్ర ఏజెన్సీ అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) ప్రధాన్ విలాస్‌పై చర్యలు చేపట్టింది. గతనెల భారత్‌కు చెందిన లాంగ్ డిస్టెన్స్ రన్నర్ మాధురి కాల్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడటంతో ఏఐయూ సస్పెన్షన్ వేటు వేసింది. 2016లో రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపొవా కూడా ఈ మెల్డొనియమ్ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలడంతో ఆమెపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. సాధారణంగా మెల్డొనియమ్ను డాక్టర్లు హృద్రోగులకు, నరాల జబ్బులున్న రోగులకు శక్తి కోసం సిఫారసు చేస్తారు. -
ఇంట్లో 300 పిల్లులు ఎలా వచ్చాయి ?
-
రామ్‌కుమార్ సంచలనం
పుణే: మహా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్(Ramkumar Ramanathan) మెయిన్ ‘డ్రా’కు మరో విజయం దూరంలో నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో రామ్‌కుమార్ సంచలనం సృష్టించాడు. టాప్ సీడ్, ప్రపంచ 267వ ర్యాంకర్ ఇలియాస్ ఇమర్ (స్వీడన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 403వ ర్యాంకర్ రామ్‌కుమార్ 5–7, 6–1, 6–4తో గెలుపొందాడు.ఒక గంట 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో కిమర్ కాప్‌జాన్స్ (బెల్జియం)తో రామ్‌కుమార్ ఆడతాడు. ఈ మ్యాచ్‌లో నెగ్గిన ప్లేయర్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. చైనా జట్టుకు ఇండోనేసియా షాక్కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇండోనేసియా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ చైనా జట్టుతో జరిగిన ఫైనల్లో ఇండోనేసియా 3–1తో నెగ్గింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో రివాల్డీ–ఫాదియా జంట 21–11, 21–13తో జువాన్–మెంగ్ యింగ్ జోడీని ఓడించడంతో ఇండోనేసియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఇక రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఫర్హాన్ 21–15, 21–13తో హు జె ఆన్‌ను ఓడించడంతో ఇండోనేసియా ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో జు వెన్ జింగ్ 21–12, 21–13తో కుసుమ వర్ధినిపై గెలవడంతో చైనాకు తొలి విజయం దక్కింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో షోహిబుల్ ఫిక్రి–డానియల్ మారి్టన్ జోడీ 21–15, 21–9తో చెన్ జుజున్–హువాంగ్ ది (చైనా) ద్వయంపై గెలిచి ఇండోనేసియాకు టైటిల్‌ను ఖరారు చేసింది. -
ఆన్లైన్ గేమ్‌లో పరిచయం.. ఆపై అత్యాచారం..
ఫిలింనగర్: ఆన్లైన్ గేమ్ నగరానికి చెందిన ఓ బాలిక పాలిట శాపంగా మారింది. ఆన్లైన్ గేమ్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలతో ఆ చిన్నారిని లొంగదీసుకున్నాడు. ఆన్లైన్ చాటింగ్‌లో తియ్యటి కబుర్లతో ఆమెను ఆకట్టుకుని ఫొటోలు షేర్ చేయించుకున్నాడు. అందులో బాలిక నగ్న ఫొటోలు కూడా ఉండడంతో తల్లిదండ్రులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి పూణే నుంచి హైదరాబాద్ వచ్చి తన వాంఛను తీర్చుకుని వెళ్లేవాడు. ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతానికి చెందిన బాలిక 2021లో ఏడో తరగతి చదివే సమయంలో ప్రతిరోజూ సాయంత్రం ‘ఎమాంగ్ అజ్’ యాప్‌లో ఆన్లైన్ గేమ్ ఆడుతుండేది. ఈ క్రమంలోనే ‘రూథ్‌లెస్’ పేరిట ప్రొఫైల్ ఉన్న ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అతని ద్వారా పూణె ఎంఐటీ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతున్న ఖుష్ డేవ్ (21) సదరు బాలికకు పరిచయం అయ్యాడు. వారు యాప్ ద్వారా చాట్ చేయడం ప్రారంభించారు. మొదట్లో ఒకరికొకరు స్నేహితుల్లా ఉండేవారు. ఆ తర్వాత 2023లో ఆమెకు టెలిగ్రామ్ లింక్ షేర్ చేసి ఆ యాప్ ద్వారా చాట్ చేయమని అడిగాడు. దీంతో టెలిగ్రామ్ ద్వారా చాట్ చేసుకునేవారు. చాట్ చేసే క్రమంలో బాలిక ఫొటోలను షేర్ చేయాల్సిందిగా ఖుష్‌డేవ్ అడగ్గా ఆమె నిరాకరించింది. రోజంతా ఆమెను బలవంతం చేయడంతో ఆమె తన ఫొటోలను, వీడియోలను పంపింది. నగ్న ఫొటోలతో బెదిరింపులు.. వాటిలో నగ్న ఫొటోలు కూడా ఉండటంతో అప్పటి నుంచి ఆ ఫొటోలను ఆమె తల్లిదండ్రులు, బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. తనను కలవాల్సిందిగా బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో గత ఏడాది అక్టోబర్ 6న టోలిచౌకీలోని ఓ పార్కులో కలిసింది. అప్పటి నుంచి ప్రతిరోజూ తనను కలవాల్సిందిగా డిమాండ్ చేస్తూ వచ్చాడు. తల్లిదండ్రులు తనను బయటకు పంపడం లేదని చెప్పినా రాత్రిపూట అందరూ నిద్రపోయిన తర్వాత ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పాడు. అర్ధరాత్రి అత్యాచారం.. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 24న బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా, 25న తెల్లవారుజామున అక్కడికి వచ్చిన ఖుష్‌డేవ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో కలుసుకున్నారు. ఇదే అదునుగా మరుసటి రోజు అర్ధరాత్రి సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడానికి బాలిక భయపడింది. ఈ విషయాన్ని ఆమె తన స్నేహితురాలికి చెప్పడంతో ఆమె టీచర్ దృష్టికి తీసుకెళ్లింది. టీచర్ ద్వారా ప్రిన్సిపాల్‌కు, ఆమె ద్వారా తల్లిదండ్రులకు విషయం తెలియగా వారు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు ఖుష్‌డేవ్‌పై బీఎన్ఎస్ సెక్షన్ 65(1), 351 (2), సెక్షన్ 5 రెడత్ విత్ 6, పోక్సో చట్టం–2012, సెక్షన్ 67 ఐటీ చట్టం–2008 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాడు చెత్తకుండీలో... నేడు క్రికెట్ దిగ్గజం!
‘జీవిత వాస్తవాలు ఫిక్షన్ కంటే వింతగా ఉంటాయి’అంటారు. దీనికి బలమైన ఉదాహరణ లిసా స్థలేకర్. పుణెలోని ఒక చెత్తకుండీలో దయనీయమైన స్థితిలో కనిపించిన ఆ పాపను విధి ఆస్ట్రేలియాకు చేర్చింది. ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా లిసా సత్తా చాటింది. వరల్డ్ కప్ గెలుచుకుంది.మహారాష్ట్రలోని పూణేలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పాపను అనాథాశ్రమం ముందు ఉన్న చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయారు. ఆ ఆశ్రమ నిర్వాహకుడు పాపను తన బిడ్డగా అక్కున చేర్చుకున్నాడు ‘లైలా’ అనే పేరు పెట్టాడు. ఆ రోజుల్లో స్యూ, హరేన్ అనే అమెరికన్ దంపతులు మన దేశానికి వచ్చారు. వారికి ఒక బిడ్డ ఉన్నప్పటికీ అబ్బాయిని దత్తత తీసుకోవడానికి ఇండియాకి వచ్చారు.‘మాకు అందమైన అబ్బాయి కావాలి’ అంటూ ఆ దంపతులు ఆశ్రమానికి వచ్చారు. కోరుకున్న అబ్బాయి వారికి కనిపించలేదు. అయితే స్యూ కళ్లు లైలా మీద పడ్డాయి. లైలా ప్రకాశవంతమైన గోధుమ రంగు కళ్లు, అమాయకమైన ముఖం చూసి వావ్ అనుకుంది స్యూ. ఆ తరువాత లైలాను దత్తత తీసుకున్నారు. (Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట)దత్తత తరువాత ‘లైలా’ పేరు ‘లిసా’గా మారింది. మొదట్లో యూఎస్‌లో ఉన్న ఆ దంపతులు ఆ తరువాత సిడ్నీలో శాశ్వతంగా స్థిరపడ్డారు. కుమార్తెకు క్రికెట్ ఆడడం నేర్పించారు. ఆ ఆటే లిసా జీవితాన్ని మార్చేసింది. మొదట లిసా మాట్లాడింది. ఆ తరువాత ఆమె బ్యాట్ మాట్లాడింది. ఆ తరువాత ఆమె రికార్డ్‌లు మాట్లాడడం మొదలైంది! (నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్)ఐసీసీ ర్యాంకింగ్ విధానం మొదలైనప్పుడు ఆమె ప్రపంచంలోనే నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా ఉంది. నాలుగు ప్రపంచ కప్‌లలో పాల్గొంది. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సత్తా చాటిన లిసా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. -
మరొకరిని బలిగొన్న పూణె వైరస్
పూణే: మహారాష్ట్రలో జీబీఎస్ వైరస్ (గ్విలియన్-బారే సిండ్రోమ్) మరొకరి ప్రాణాన్ని బలిగొంది. రాష్ట్రంలో జీబీఎస్ వైరస్ కారణంగా రెండవ మరణం నమోదయ్యింది. పూణేకు చెందిన ఒక మహిళ జీబీఎస్ బారినపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలో జీబీఎస్ వైరస్ వ్యాప్తి చెందుతోందనడానికి ఉదాహరణగా నిలిచింది.గతంలో ఈ వైరస్ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. పూణేలో ఇప్పటివరకు 127 జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ పూణేలోని ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. కేసులు కూడా మరింతగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అనుమానిత జీబీఎస్(Guillain-Barré syndrome) కేసుల సంఖ్య 127కి చేరింది. ఈ వైరస్‌తో బాధపడుతున్న 13 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఇదే వైరస్‌తో షోలాపూర్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. పూణేలో అతనికి ఇన్ఫెక్షన్ సోకింది.షోలాపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ డాక్టర్ సంజీవ్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కాళ్ల నొప్పులు, విరేచనాలతో బాధపడుతున్న ఒక బాధితుడిని జనవరి 18న ఆసుపత్రిలో చేర్చించారు. అతను వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.జీబీఎస్ అనేది ఒక అరుదైన వ్యాధి. దీని బారినపడితే శరీర భాగాలు అకస్మాత్తుగా మొద్దుబారిపోతాయి. కండరాల బలహీనత ఏర్పడుతుంది. బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా జీబీఎస్‌కి కారణమవుతాయని వైద్యులు తెలిపారు.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రంలోనూ ‘లివ్ ఇన్’కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి -
ది ఇండియా స్టోరీ ప్రారంభం
‘ది ఇండియా స్టోరీ’ని మొదలెట్టారు హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal). శ్రేయాస్ తల్పాడే, కాజల్ అగర్వాల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మూవీ ‘ది ఇండియా స్టోరీ’(The India Story). చేతన్ డీకే దర్శకత్వంలో సాగర్ బి. షిండే నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పుణేలోప్రారంభమైంది. ‘‘ది ఇండియా స్టోరీ’ తొలి షెడ్యూల్‌ని పుణే(Pune)లోప్రారంభించాం. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని, ఓ ప్రభావితమైన కథను చూపించబోతున్నాం. ఆగస్టు 15న థియేటర్స్‌లో కలుద్దాం’’ అని ‘ఎక్స్’ వేదికగా కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా.. ‘ది ఇండియా స్టోరీ’ లోని ఓ మేజర్ షెడ్యూల్ చిత్రీకరణ కొల్హాపూర్‌లో జరగనుందని బాలీవుడ్ సమాచారం. రైతుల కష్టాలు, వ్యవసాయ రంగంలో కొన్ని పురుగులమందు వ్యాపార సంస్థలు చేసే మోసాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని టాక్. -
పూణేలో కొత్త వైరస్ కలకలం.. 71కి చేరిన కేసులు
పూణే: మహరాష్ట్రలో కొత్త వైరస్ వ్యాప్తి తీవ్ర కలకలం సృష్టించింది. పూణేలో అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ గులియన్ బారే సిండ్రోమ్ (GBS) కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో ఆరు కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 71కి చేరుకుంది. వీరిలో 14 మందికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వైరస్ కారణంగా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ర్యాపిడ్ ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటుచేసింది.పూణేలో కొత్త వైరస్ వ్యాప్తి అక్కడ ప్రజలకు వణికిస్తోంది. గులియన్ బారే సిండ్రోమ్ (GBS) బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వైరస్బారినపడిన వారి సంఖ్య తాజాగా 71కి చేరుకుంది. బాధితుల్లో 47 మంది పురుషులు, 24 మంది మహిళలు ఉండగా.. వీరిలో 14 మందికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇక, ఈ వ్యాధి వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది. దీంతో, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక పరిశోధనా టీమ్‌ను ఏర్పాటు చేసింది. అయితే, జీబీఎస్‌కు చికిత్స లేదు. దీని బారినపడిన వ్యక్తులు కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.జీబీఎస్ అంటే ఏమిటి?గులియన్ బారే సిండ్రోమ్ (GBS) అనేది అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. దీని కారణంగా నరాల బలహీనత, తిమ్మిరి లేదా పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గులియన్-బారే సిండ్రోమ్ అరుదైనది వ్యాధి. మాయో క్లినిక్ ప్రకారం.. గులియన్-బారే సిండ్రోమ్ లక్షణాలు కనిపించడానికి కనీసం ఆరు వారాల ముందు శ్వాసకోశ సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి.లక్షణాలు ఇలా..బాధితులకు మెట్లు ఎక్కడం, నడవడం కష్టమవుతుంది.నరాల బలహీనత, కాళ్లు, చేతులు, ముఖం, శ్వాస కండరాలు బలహీనమవుతాయి.నరాలు దెబ్బతినడం వల్ల మెదడులో అసాధారణ సంకేతాలు వస్తాయి.అసాధారణ హాట్బీట్, రక్తపోటు మార్పులు, జీర్ణక్రియ సమస్యలు, మూత్రాశయ నియంత్రణలో సమస్యలు కూడా ఉంటాయి. -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్
పుణే: హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలెదుర్కొంటున్న కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టు బెయిలిచ్చింది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం రాహుల్ వర్చువల్‌గా హాజరు కావడంతో ఎంపీ/ ఎమ్మె ల్యేల ప్రత్యేక కోర్టు రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ జోషి ఈ మేరకు కోర్టుకు ష్యూరిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 18వ తేదీన తదుపరి విచారణ ఉంటుందని, ఈ కేసులో ప్రత్యక్షంగా రాహుల్ హాజరయ్యే అవసరం లేకుండా కోర్టు మినహాయింపు ఇచ్చిందని లాయర్ మిలింద్ చెప్పారు.ఇదీ చదవండి: కోల్డ్ కాఫీ చేసిన రాహుల్ గాంధీ, వైరల్ వీడియో -
ఘోరం.. చిరుత దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి
ముంబై : పూణే జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిరుత దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతిని జిల్లా అటవీ శాఖ అధికారులు అధికారంగా ధ్రువీకరించారుపూణేలోని షిరూర్ తాలూకా పింపల్సుతి గ్రామానికి చెందిన రక్ష నిఖమ్ (4) ఇంట్లో ఆడుకుంటుంది. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిరుత చిన్నారిని నోట కరుచుకుని స్థానిక చెరుకు తోటల్లోకి తీసుకెళ్లింది. చిరుత పులి రాకను గమనించిన తల్లి కాపాడండి అంటూ కేకలు వేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది రక్ష కోసం గాలింపు చర్యలు చేపట్టారు.రెండు గంటల పాటు గాలింపు చర్యల అనంతరం చెరుకు తోటలో చిన్నారి జాడ దొరికింది. చిన్నారిపై చిరుత తీవ్రంగా దాడి చేసింది. ఈ దాడితో బాలిక తల,మొండెం వేర్వేరుగా కనిపించాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జున్నార్ ఫారెస్ట్ డివిజన్ అధికారి మితా రాజ్‌హన్స్ మాట్లాడుతూ బాలికపై దాడి చేసిన చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. -
పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ
పుణే: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని పుణే నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అమరావతికి చెందిన కార్మికులు వారి కుటుంబాలతోపాటు రెండు రోజుల క్రితం ఉపాధి కోసం పుణేకు వచ్చారు. వఘోలి ప్రాంతంలోని కెస్నాడ్ ఫటా ఫుట్‌పాత్‌పై వీరంతా నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 12.55 గంటల సమయంలో అదుపు తప్పిన ఓ ట్రక్కు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైగా దూసుకెళ్లింది. ఘటనలో రెండేళ్లలోపు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ గజానన్ టొట్రేను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
తప్పతాగి ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి.. పుణేలో ఘోరం
ముంబై: పుణేలో అర్ధరాత్రి ఘోరం జరిగింది. ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఫుట్‌పాత్ నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది.సుమారు ఒంటి గంట సమయంలో ఓ వ్యక్తి వాహనం నడుపుతూ వాఘోలి చౌక్ ఏరియాకు చేరుకున్నాడు. హఠాత్తుగా తన బండికి అక్కడే ఉన్న ఫుట్‌పాత్‌పైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు మోటార్ వెహికిల్స్ యాక్ట్‌తో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మృతుల్లో.. ఏడాది, రేండేళ్ల వయసున్న చిన్నారులు, విశాల్ పన్వర్(22) ఉన్నారు. అమరావతిలో నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీలు.. కేశ్నాథ్ ఫాటా ఏరియాలో ఫుట్‌పాత్‌పై పడుకున్నారని, వాళ్లపై నుంచి ట్రక్కు దూసుకెళ్లిందని, వాహనం నడిపిన వ్యక్తి బాగా తాగి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.#महाराष्ट्र के पुणे में भयानक सड़क हादसा..नशे में धुत #डंपर ड्राइवर ने फुटपाथ पर सो रहे 9 लोगों को कुचला, 3 की मौत#Maharashtra #Pune #accident #footpath #Dumper #drunkdriving pic.twitter.com/y71i5EtaAQ— mishikasingh (@mishika_singh) December 23, 2024Pune: Dumper Truck Driver Claims Three Lives, Injures Nine In Wagholi Near Kesnand Phata In a tragic incident on Pune’s Wagholi area near Kesnand phata, a speeding dumper truck ran over 12 people sleeping on a footpath, killing three and injuring nine. The accident, reportedly… pic.twitter.com/K6T09Om7v4— Pune Pulse (@pulse_pune) December 23, 2024 -
హైదరాబాద్ సహా మూడు నగరాలకు ఫుల్ డిమాండ్: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
పూణే: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పుల కారణంగా రానున్న కాలంలో బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాలకు భారీ ఎత్తున వలసలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వలసల లేకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో నారాయణమూర్తి మాట్లాడుతూ..‘భారత్ సహా పలు దేశాల్లో(ఆఫ్రికన్) ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా రాబోయే రెండు దశాబ్దాల్లో కొన్ని దేశాల ప్రజలు భారత్‌వైపు చూసే అవకాశం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాలు నివాసయోగ్యంగా ఉండటంతో వారు ఇక్కడికి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఫలితంగా పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతాయని అన్నారు.ఇదే సమయంలో భారత్ విషయానికి వస్తే హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాల్లోకి వలసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అందుకే వారంతా ఇక్కడే వచ్చేందుకు చూస్తారు. అప్పుడు ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం కారణంగా ఇక్కడ పరిస్థితులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వలసలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. కార్పొరేట్ ప్రపంచం, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు కలిసి వాతావరణ మార్పు సమస్యను పరిష్కరించాలని సూచనలు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు వారంలో 70 గంటలు పనిచేయాలంటూ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాల్సిందేనని కుండ బద్ధలుకొట్టారు. లేకుంటే పేదరికం నుంచి ఎలా బయటపడగలమని? ప్రశ్నించారు. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?. భవిష్యత్తు కోసం మనమంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. Infosys CEO Narayana Murthy warns of urban overload due to climate change pic.twitter.com/85EwbchiOD— NDTV (@ndtv) December 22, 2024 -
పెను విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి.. వీడియో
క్రికెట్ మైదానంలో పెను విషాదం చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా యువ ఆటగాడు మృతి చెందాడు. పూణేలోని ఛత్రపతి సంభాజి నగర్లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఇమ్రాన్ పటేల్ అనే ఆటగాడు కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన ఇమ్రాన్ పటేల్.. కొన్ని ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన అనంతరం ఛాతీ నొప్పి వస్తుందని అంపైర్లకు చెప్పాడు. పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో ఇమ్రాన్ కుప్పకూలిపోయాడు. A young man, Imran Sikandar Patel, died of a #heartattack while playing cricket in the Chhatrapati Sambhaji Nagar district of Maharashtra.https://t.co/aCciWMuz8Y pic.twitter.com/pwybSRKSsa— Dee (@DeeEternalOpt) November 28, 2024హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఇమ్రాన్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. పైపెచ్చు ఎప్పుడూ ఫిట్‌గా ఉండేవాడని తోటి క్రికెటర్లు చెప్పారు. ఇమ్రాన్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు నాలుగు నెలల పసి గుడ్డు. ఇమ్రాన్ అంత్యక్రియలకు జనం తండోపతండాలుగా వచ్చారు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన ఇమ్రాన్ పటేల్‌కు ఓ క్రికెట్ టీమ్ ఉంది. జీవనోపాధి కోసం అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు జ్యూస్ షాప్ నడిపే వాడు. ఇమ్రాన్ మృతి స్థానికంగా విషాద ఛాయలు నింపింది. అచ్చం ఇమ్రాన్లాగే రెండు నెలల క్రితం ఇదే పూణేలో మరో స్థానిక క్రికెటర్ కూడా మృతి చెందాడు. హబీబ్ షేక్ అనే క్రికెటర్ మ్యాచ్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు.సెప్డెంబర్ 7న ఈ ఘటన జరిగింది. మృతుడు షుగర్ పేషంట్ అని తెలిసింది. -
సికింద్రాబాద్–పుణే మధ్య వందే భారత్ రైలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్–పుణే మధ్య త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలోనే ఈ మార్గాన్ని రైల్వేబోర్డు నోటిఫై చేసినా.. రైల్ రేక్ సిద్ధంగా లేకపోవటంతో ప్రారంభించలేదు. ఈ క్రమంలో త్వరలో ఈ రైలును పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. అది ముగిశాక ప్రారంభించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య శతాబ్ది సర్వీసు కొనసాగుతోంది. అది రోజూ మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయలు దేరుతుంది. వందే భారత్‌ను ఉదయమే బయలుదేరేలా నడిపే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెప్తున్నాయి.స్లీపర్ కేటగిరీపై పరిశీలన!వందే భారత్ రైళ్లలో స్లీపర్ కేటగిరీ త్వరలో పట్టాలెక్కబోతోంది. ఇటీవలే నమూనా రైలు సిద్ధమైంది. ఆ రైలు రేక్స్ తయారవుతున్నాయి. ట్రయల్‌రన్ తర్వాత వాటిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 16 రూట్లను ఈ రైళ్లకోసం ఖరారు చేశారు. మరిన్ని మార్గాలను కూడా ఎంపిక చేయనున్నారు. సికింద్రాబాద్–పుణే మధ్య వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపే అంశాన్ని కూడా రైల్వే బోర్డు పరిశీలిస్తోంది.ఈ నగరాల మధ్య ప్రస్తుతమున్న పుణే శతాబ్ది రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్న సమయంలో ప్రారంభమవుతోంది. కానీ రాత్రివేళ సర్వీసు పెట్టాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. ఈ క్రమంలో రాత్రివేళ వందే భారత్ స్లీపర్ సర్వీసును ప్రారంభించి.. ఆ తర్వాత సాధారణ వందే భారత్‌ను శతాబ్ది స్థానంలో ప్రవేశపెట్టాలన్నది రైల్వే యోచన అని సమాచారం.నాగ్‌పూర్ సర్వీసు విఫలంతో..సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య 20 కోచ్‌లతో వందే భారత్ రైలు సేవలు మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు నగరాల మధ్య నిత్యం నాలుగు రైళ్లు నడుస్తున్న నేపథ్యంలో వందే భారత్‌కు డిమాండ్ లేకుండా పోయింది. ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం కూడా ఉండటం లేదు. నెల గడుస్తున్నా దీనికి ఆదరణ పెరగకపోవటంతో కోచ్‌ల సంఖ్యను తగ్గించి.. ఎనిమిది కోచ్‌లకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో పుణే సర్వీసు ఎలా ఉంటుందన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.సికింద్రాబాద్–పుణే మధ్య సర్వీసులు తక్కువ. పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న నగరాలు కావడం, ప్రయాణికుల డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో.. ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ సర్వీసు విఫలమయ్యే చాన్స్ లేదని ప్రాథమికంగా తేల్చారు. వందే భారత్‌ను పట్టాలెక్కించాలనే నిర్ణయానికి వచ్చారు. సాధారణ వందే భారత్ సర్వీసా? స్లీపర్ సర్వీసా? అన్నదానిపై మహారాష్ట్ర ఎన్నికల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కివీస్‌తో రెండో టెస్ట్.. నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
Sarfaraz vs KL Rahul: గిల్ రాక.. ఎవరిపై వేటు? కోచ్ ఆన్సర్ ఇదే
న్యూజిలాండ్‌తో సిరీస్‌ను పరాజయంతో ప్రారంభించిన టీమిండియా.. రెండో టెస్టులో విజయానికి గురిపెట్టింది. పుణెలో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం రోహిత్ సేన ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. భారత్- కివీస్ జట్ల మధ్య గురువారం నుంచి మొదలుకానున్న ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే మీడియాతో మాట్లాడాడు.ఈ సందర్భంగా శుబ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి వస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. గిల్ కోసం కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరిని తప్పిస్తారని విలేకరులు అడుగగా.. ‘‘శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. బెంగళూరులో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఇక తుదిజట్టులో ఎవరు ఉండాలన్న అంశంపై పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయం తీసుకుంటాం.జట్టులో ఒకరికి చోటు నిరాకరించడం అనేది ఉండదు. సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టులో అద్భుతంగా ఆడాడు. కేఎల్ రాహుల్ కాస్త నిరాపరిచిన మాట వాస్తవమే. అయితే, తను ఎన్ని బంతులు మిస్ చేశాడని అడిగినపుడు అందుకు బదులుగా ఒక్కటి కూడా మిస్ చేయలేదనే సమాధానమే వచ్చింది.ఒక్కోసారి ఇలాగే జరుగుతుంది. బాగా ఆడినా పరుగులు రాబట్టలేకపోవచ్చు. కాబట్టి కేఎల్ రాహుల్ గురించి ఆందోళన అక్కర్లేదు. తను మానసికంగానూ ఏమాత్రం అలసటకు గురికాలేదు. అయితే, అందుబాటులో ఉన్న ఆరు స్థానాల్లో ఏడుగురిని ఇరికించడం కుదరదు. కాబట్టి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌నే ఎంచుకుంటాం.ఇప్పటికైతే కేఎల్ రాహుల్ ఫామ గురించి మాకెలాంటి బెంగా లేదు. అతడి ఆట తీరుపై పూర్తి నమ్మకం ఉంది. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా గౌతీ(హెడ్‌కోచ్ గౌతం గంభీర్) తనకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్.. అతడు బెంగళూరులో 150 పరుగులు చేశాడు. ఇరానీ కప్ ఫైనల్లో డబుల్ సెంచరీ చేశాడు. కాబట్టి మిడిలార్డర్లో చోటు కోసం ఇద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉంది’’ అని టెన్ డష్కాటే తెలిపాడు.ఇక రిషభ్ పంత్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని పుణెలో జరుగనున్న రెండో టెస్టులో అతడే వికెట్ కీపింగ్ చేస్తాడని ఈ సందర్భంగా డష్కాటే సంకేతాలు ఇచ్చాడు. కాగా మెడనొప్పి కారణంగా శుబ్‌మన్ గిల్ బెంగళూరలో జరిగిన తొలి టెస్టుకు దూరం కాగా.. వన్‌డౌన్‌లో అతడి స్థానంలో విరాట్ కోహ్లి వచ్చాడు. కోహ్లి ఆడే నాలుగో స్థానంలో సర్ఫరాజ్ బ్యాటింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ 0, 12 పరుగులు చేశాడు. -
మహారాష్ట్ర: రూ. 5 కోట్ల నగదు పట్టివేత
పూణె: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. ఇంతలో పూణె సమీపంలో ఓ కారులో భారీగా నగదు పోలీసులకు పట్టుబడింది. ఖేడ్ శివ్పూర్ టోల్ ప్లాజా సమీపంలో ఓ వాహనంలో రూ. 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ వాహనం ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నారనేదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇన్నోవా వాహనంలో భారీగా డబ్బు తరలిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై, ఖేడ్ శివపూర్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో ఒక ఇన్నోవా కారులో తనిఖీలు చేసినప్పుడు భారీగా నగదు బయటపడింది. విషయం తెలుసుకున్న ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు గంటల పాటు నోట్లను లెక్కించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘చియోంగ్‌చియాన్’పై అధ్యయనం -
పూణె మెట్రో స్టేషన్లో మంటలు
పూణె: మహారాష్ట్రలోని పూణెలోని ఒక మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళం ఘటనా స్థలికి చేరుకుని, మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని మెట్రో అధికారులు తెలిపారు.పూణెలోని మండై మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మెట్రో స్టేషన్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫోమ్ మెటీరియల్‌లో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన మెట్రో అధికారులు వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు.ఐదు అగ్నిమాపక దళ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని, ఐదు నిమిషాల వ్యవధిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. మెట్రో స్టేషన్లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు చెలరేగాయి. కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ ఒక ట్వీట్లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. మెట్రో స్టేషన్లో పరిస్థితులు చక్కబడ్డాయని, మెట్రో రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. पुणे के मेट्रो स्टेशन में लगी आगमहाराष्ट्र के पुणे में मंडई मेट्रो स्टेशन के ग्राउंड फ्लोर पर रविवार आधी रात को आग लग गई, हालांकि घटना में कोई घायल नहीं हुआ. फायर विभाग के मुताबिक, वेल्डिंग के दौरान फोम में आग लगने से यह घटना घटी.#Maharashtra | #pune | #fireaccident | #fire pic.twitter.com/V8lBA4hdTV— NDTV India (@ndtvindia) October 21, 2024ఇది కూడా చదవండి: పిరమిడ్‌పై పక్షుల వేట -
సిద్దిఖీ హత్యకు పుణెలో కుట్ర
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్దిఖీని కాల్చిచంపడానికి పుణెలో కుట్ర జరిగిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. íసిద్దిఖీని గుర్తించడానికి వీలుగా ఆయన ఫొటో, చిత్రం ముద్రించిన ఫ్లెక్సీని షూటర్లకు అందజేశారు. ఈ హత్యలో పుణెకు చెందిన సోదరులు ప్రవీణ్ లోంకర్, శుభమ్ లోంకర్ల పాత్ర ఉందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. నిందితులు దొరకితే హత్యకు కారణాలు తెలుస్తాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. లోంకర్ సోదరులే హత్యకు పాల్పడిన షూటర్లకు రూ.50 వేల చొప్పున అడ్వాన్సు అందించారని, నిందితుల మధ్య సమావేశాలను ఏర్పాటు చేశారని, హత్యకు కావాల్సిన ఏర్పాట్లను చూశారని చెప్పారు. శుభమ్‌కు చెందిన డైరీలో ప్రవీణ్ పనిచేస్తున్నాడని.. అక్కడే షూటర్లు శివకుమార్ గౌతమ్, ధర్మరాజ్ కశ్యప్‌లను హత్య కోసం నియమించుకున్నారని తెలిపారు. అడ్వాన్సుగా అందిన మొత్తం నుంచి నిందితులు ఒక మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసి.. దాని పైనే సిద్దిఖీ నివాసం, ఆఫీసుల వద్ద, ఆయన దినచర్య పైనా రెక్కీ నిర్వహించారని వివరించారు. గుర్మైల్ బల్జీత్‌సింగ్ (హరియాణా), ధర్మరాజ్ కశ్యప్ (ఉత్తరప్రదేశ్), ప్రవీణ్ లోంకర్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితులకు దిశానిర్దేశం చేసిన మొహమ్మద్ యాసిన్ అక్తర్ కోసం. సిద్దిఖీని కాల్చిచంపిన గౌతమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
టక్ చేయలేదని చితక్కొట్టిన టీచర్
టక్ చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఎడమ చెవిపై గట్టిగా కొట్టడంతో కర్ణభేరి పగిలింది. దాంతో ఆ చెవి శాశ్వతంగా వినికిడి సామర్థ్యం కోల్పోయింది. సీసీటీవీ ఫుటేజీతో ఈ ఘటన వెలుగులోకి రావడంతో టీచర్‌పై పిల్లాడి తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. నిర్లక్ష్యంగా సమాధానమిచి్చన టీచర్‌ను తల్లిదండ్రులు పోలీసుల ఎదుట చితక్కొట్టారు. కంప్యూటర్ సబ్జెక్ట్ బోధించే సందేశ్ బోసాలే సెప్టెంబర్ 27న ఆరో తరగతి గదిలో ఓ విద్యార్థి టక్ చేసుకోకపోవడం గమనించి కోపంతో కొట్టాడు. మెడ పట్టి క్లాసు నుంచి గెంటేశాడు. దెబ్బలకు బాలుని ముక్కు, ఎడమ చెవి నుంచి రక్తం కారింది. ఇంటికెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా ఎడమ చెవి కర్ణభేరి పగిలిందని వైద్యుడు చెప్పాడు. కుటుంబసభ్యులు స్కూలు యాజమాన్యాన్ని నిలదీసినా తమకు సంబంధం లేదన్నారు. దాంతో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన సలహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి ఇరు వర్గాలను స్కూలుకు పిలిపించారు. అప్పటికే కోపంతో ఉన్న కుటుంబసభ్యులు, నవనిర్మాణ్ సేన కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే టీచర్‌ను చితకబాదారు. महाराष्ट्र के पुणे में पहले टीचर ने छात्र को पीटा, फिर मनसे और छात्र के परिजनों ने टीचर को पीटा! केस दर्ज छात्र का शर्ट इन नहीं था pic.twitter.com/NZ5fwgTX8R— Avinash Tiwari (@TaviJournalist) October 6, 2024


