
ఆమె లక్ష్యం ఐపీఎస్..కానీ ఊహించని విధంగా రూ. 9 లక్షల ఇంటర్న్‌షిప్‌ని అదుకుని స్ఫూర్తిగా నిలిచింది. పైగా ఈ ఏడాది స్లీప్ ఆఫ్‌ది ఇయర్‌గా టైటిల్‌ని దక్కించుకుంది. ఎవరామె అంటే..
పూణేకి చెందిన మాధవ్ వావల్ ఐపీఎస్ పోటీపరీక్షలకి సన్నద్ధమవుతోంది. ఆమె ఈ ఏడాది జరగుతున్న నాల్గో సీజన్ స్లీప్ ఇంటర్న్‌షిప్ పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. మొత్తం 60 రోజుల నిద్ర ఛాలెంజ్‌ని స్వీకరించి రూ. 9.1 లక్ష ఇంటర్న్‌షిప్‌ని గెలుచుకుని స్లీప్ ఛాంపియన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.
దీంతో ఈ ఏడాది స్లీప్ ఇంటర్న్‌షిప్ నాల్గవ సీజన్ విజేతగా స్థానం కైవసం చేసుకుంది మాధవ్ వావల్. ఈ పోటీ భారతదేశంలో పెరుగుతన్న నిద్రలేమి సమస్యను నివారించడమే ముఖ్యోద్దేశంగా రూపొందించిన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఇది. ఈ నిద్ర వర్క్‌షాప్‌లో మంచి నిద్ర అలవాటుని మెరుపరచడానికి ఉద్దేశించిన సవాళ్లను ఫేస్‌చేయాలి ఉంటుంది.
పోటీలో పాల్గొనే వాళ్లు కళ్లకు గంతలు కట్టుకుని బెడ్ మేకింగ్ అలారం క్లాక్‌ల సాయంతో వారి నిద్ర నాణ్యతను అంచనా వేస్తారు వేక్‌ఫిట్ నిర్వాహకులు. ఇక్కడ మాధవ వావల్ ఈ పోటీలో 91.36 మార్కులు స్కోర్ చేసి తొలి స్థానంలో నిలిచింది. అలాగే ఆమె తోపాటు పాల్గొన్న మిగతా 15 మంది ఈ ఇంటర్న్‌షిప్‌ని పూర్తి చేసినందుకు గానూ ఒక్కొక్కరికి ఒక లక్ష్క చోప్పున నగదుని బహుమతిగా అందించారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
కనీస వయసు: దరఖాస్తు చేసుకునే సమయంలో 22 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి.
ఎంట్రీ: ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
చేయు విధానం: దరఖాస్తు ఫామ్‌ని పూర్తిగి ఫిల్ చేయాల్సిందే అసంపూర్ణంగా సమర్పించిన దరఖాస్తులను పరగణించబడవు
పోటీ జరుగు విధానం: తమ ఇళ్ల నుంచి ఎస్‌ఎంస్, ఇమెయిల్, వాట్సాప్ లేదా ఫోన్ కాల్ భాగస్వామ్యంతో
అలాగే పోటీదారుడి వివరాలను గోప్యంగానే ఉంచుతారు.
ఆన్‌లైన్ ఫారమ్‌లు, వీడియో రెజ్యూమ్‌లు, ఇంటర్వ్యూల ద్వారా ఫైనలిస్ట్‌లను ఎంపిక చేస్తారు.
కాగా, ఈస్లీప్ ఇంటర్న్‌షిప్ 2019 నుంచి ప్రారంభమైంది. ఇప్పటివరకు మొత్తం నాలుగు సీజన్‌లు పూర్తి చేసుకుంది. ప్రతి సీజన్‌లో లక్షలాది మంది ఈ ఇంటర్న్‌షిప్‌కి దరఖాస్తు చేసుకోవడం విశేషం. 60 రోజులు రాత్రుళ్లలలో కనీసం 9 గంటలు నిద్రపోవడాని ప్రయత్నించినవారే పెద్దమొత్తంలో నగదుని గెలుచుకుంటారు. ఇక ఈ ఏడాది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్ ప్రకారం సుమారు 58% మంది భారతీయులు రాత్రి 11 గంటల తర్వాతే పడుకుంటారని, అందువల్ల ఉదయం అలసటను ఎదుర్కొటున్నట్లు పేర్కొంది.
(చదవండి: నాన్నా నా పెళ్లిలో డ్యాన్స్ చేస్తావా..? ఆ మాటలే ఊపిరి పోశాయి..)