
హాయిగా సాగిపోతున్న జీవితాన్ని భయానక వ్యాధులు ఒక్క ఊదుటన మొత్తం జీవితాన్నే తలికిందులు చేస్తాయి. వైద్యానికి అయ్యే ఖర్చులతో కుటుంబాన్ని రోడ్డుమీదకు తీసుకొచ్చేస్తాయి. వీటన్నింటికి తోడు ఆ మహమ్మారి పెట్టే భయాన్ని తట్టకోవాలంటే కొండంత ధైర్యం ఉండాల్సిందే. అలా అనితరసాధ్యమైన స్థైర్యంతో ఓ నాన్న కూతురు కోసం కేన్సర్ మహమ్మారిని ఎలా జయించాడో తెలిస్తే..హృదయం ద్రవించిపోతుంది. లెక్కలేనన్ని సర్జరీలు, బతుకుతానా లేదా అన్న నిరాశ నిస్ప్రహల నడుమ పోరాడి గెలిచిన ఓ తండ్రి కథ ఇది.
అతడే 60 ఏళ్ల అర్జున్ సేన్. అతడు మార్కెటింగగ్ ఎగ్జిక్యూటివ్, పాడ్కాస్ట్ హోస్ట్, రచయిత, వ్యవస్థాపకుడు కూడా. కానీ అతడి జీవితం ప్రతిక్షణం మరణం అనే పంజాను విసురుతూనే ఉండేది. కానీ అది ప్రతిసారి అతడి నవ్వు ముందుకు ఓడిపోయింది. ఆయకు 1996లో, కడుపుకు మెటాస్టాసిస్ అనే స్వరపేటిక కేన్సర్ వచ్చింది. వైద్యులు వంద రోజులకు మించి బతికే ఛాన్స్ లేదని చెప్పేశారు.
ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఆ వ్యాధి సోకినప్పడు అర్జున్కి 32 ఏళ్లు. వాస్తవానికి అర్జున్ అందరిని నవ్వించేవాడే..ఈ రోజు నిరాసనిస్ప్రుహలతో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. సరిగ్గా అతడి కూతురు రాకా అతడిని చూసి.." నాన్న చనిపోవడం అంటే ఏమిటి, నువ్వు చనిపోతున్నావా..? మరి నా పెళ్లిలో డ్యాన్స్ చేయవా అంటూ అమాయకంగా అడిగిన కూతురు మాటలకు నిశ్చేష్టుడయ్యాడు.
కాసేపటికి తేరుకుని అప్పుడే పెళ్లికి ఎందుకు తొందరపడుతున్నావ్ రా అనగానే కూతురు మోములోని సిగ్గు అతని ముఖంలోకి నవ్వు తెప్పించింది. పైగా కూతురిని దగ్గరకు తీసుకుని లేదు కచ్చితంగా నీ పెళ్లిలో ఈ నాన్న డ్యాన్స్ చేస్తాడు అని కూతురికి వాగ్దానం చేశాడు." అది అబద్ధమని తెలిసి కూడా అప్రయత్నంగా అర్జున్ ఆ మాటలు అనేశాడు. కానీ ఆ మాటలే ఆ తండ్రికి ఊపిరిపోశాయి..అప్పటి దాక ఉన్న బాధకు ఆ నవ్వు ఔషధంగా మారింది.
తనకింకా వంద రోజుల కాదు వేల వందల 24 గంటలు ఉన్నాయన్నంత కొండంత ఆశను, ధైర్యాన్ని అందించాయి. అసలు ఈ మహమ్మారి ముందు చేతులు పైకెత్తేసి ఓడిపోవడం దేనికి పోరాడితే ఏముంది అనే శక్తిమంతమైన ఆలోచనను రేకెత్తించింది. ఆ ధైర్యంతోనే కీమోథెరపీ చికిత్సలు తీసుకునేవాడు..ప్రతిసారి ట్రీట్మెంట్కి వెళ్లినప్పుడూ తాను బయటపడతానా అనే ప్రశ్న.. వైద్యులను అడిగేవాడు..వాళ్లు కూడా బి పాజిటివ్ అనేవారే తప్ప..పర్లేదు బయటపడగలవు అనే భరోసా ఇచ్చేవారు కారు.
అయినా సరే అర్జున్కి తన కూతురు రాకా కోసం బతికి బట్టగట్టగాలి అనే మొండి ధైర్యాన్ని కొని తెచ్చుకుని మరి చికిత్స తీసుకునేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా 20 సర్జరీలు చేయించుకున్నాడు. మంచి చికిత్స తీసుకుని పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. అలా ఆ మహమ్మారి నుంచి బయటపడి కూతురికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
అంతేగాదు అతడి గాథని పికూ (2015), విక్కీ డోనర్ (2012) మూవీల దర్శకుడు షూజిత్ సిర్కార్ ఐ వాంట్ టు టాక్ మూవీగా తెరకెక్కించాడు. ఈ మూవీలో తండ్రి కూతుళ్ల మధ్య సైలంట్గా సాగే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. బాక్సాపీస్ వద్ద విమర్శకుల ప్రశంసలందుకుంది కూడా. అసలు ముందు మనమే సమస్యకు భయపడిపోతే ఎలా మన కంటి పాపల కోసమైన మృత్యువుతో పోరాడే చిన్న ప్రయత్నమైనా.. చేయాలి అని చాటిచెప్పే భావోద్వేగ కథ ఇది.
(చదవండి: కపిల్ శర్మ వెయిట్ లాస్ స్టోరీ..! రెండు నెలల్లో 11 కిలోలు..! ఏంటి 21. 21. 21 రూల్..?)