‘ఏం కావాలి ఈ జీవితానికి?’ అనే ప్రశ్నకు జవాబు... ‘చిన్న ఆనందం’ కేన్సర్ బారిన పడిన ఆ తల్లికి తన జీవితం ముగింపు దశకు వచ్చిందనే విషయం తెలిసిపోయింది. ‘నాకు తాజ్‌మహల్ చూపెట్టరా’ అని కుమారుడిని అడిగింది. అడిగిందే తడవుగా తల్లితో పాటు తండ్రిని కూడా తీసుకెళ్లి తాజ్‌మహల్ చూపించాడు.
‘ఈ జీవితానికి ఇది చాలురా’ అన్నట్లుగా ఉంది ఆమె కళ్లలోని సంతోషం. భర్త యూఎన్ శాంతి పరిరక్షక దళంలో పనిచేస్తున్నందు వల్ల చికిత్స కోసం ప్రతి రెండు వారాలకు ఒంటరిగా గ్వాలియర్ నుండి ఢిల్లీకి వెళ్లేది. ఆగ్రా, కాన్పూర్‌ల మధ్య ఒక చిన్న గ్రామంలో జన్మించిన ఆమె తాజ్‌మహల్ గురించి వినడమే తప్ప ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు.
కుమారుడు ‘ది ఒబేరాయ్ అమర్‌విలాస్’లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ‘తాజ్ మహల్ చూడాలని ఉంది’ అని తల్లి అడిగిన తరువాత తల్లిదండ్రులను ఆగ్రాకు తీసుకువెళ్లి తాను ఉద్యోగం చేసే హోటల్లో వారికి బస ఏర్పాటు చేశాడు. హోటల్ నుంచి అల్లంత దూరాన తాజ్‌మహల్ కనిపిస్తోంది.
‘ఎప్పుడు వెళుతున్నాం అక్కడికి?’ అని అడిగింది తల్లి. ఆ తరువాత కొద్దిసేపట్లోనే తల్లికి తాజ్ చూపించి ఆమెను ఆనందంలో ముంచెత్తాడు కుమారుడు. తాజ్‌మహల్ చూసిన పదిహేనురోజులకు ఆమె చనిపోయింది. తన తల్లి చివరి కోరిక గురించి రెడిట్‌లో చేసిన పోస్ట్ నెటిజనుల హృదయాలను కదిలించింది.
(చదవండి:


