కశ్మీర్‌కు వెళ్లిన ప్రతిసారీ ఇంతే.. | director kabir khan shared kashimir girl pic viral | Sakshi
Sakshi News home page

‘ఇది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం’

Jan 2 2026 7:26 PM | Updated on Jan 2 2026 7:32 PM

director kabir khan shared kashimir girl pic viral

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ఖాన్‌ ఇటీవల కశ్మీర్‌కు వెళ్లాడు. అరు అనే గ్రామంలో క్రికెట్‌ ఆడుతున్న ఓ బాలిక దగ్గరకు వెళ్లి పలకరించాడు.

మాటల్లో ‘స్మృతి మంధాన అంటే నాకు ఇష్టం. ఆమెలా ఆడాలనుకుంటున్నాను’ అని చెప్పింది.
ఆ బాలిక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి...

‘కశ్మీర్‌కు వెళ్లిన ప్రతిసారీ నా కెమెరా ఏదో ఒక అద్భుత దృశ్యాన్ని చూస్తూనే ఉంటుంది. ఈసారి అద్భుతం... ఆరు గ్రామంలోని బాలిక. తాను భవిష్యత్తులో స్మృతి మంధాన కావాలనుకుంటుంది. స్మృతి ఈ పోస్ట్‌ చూస్తుందని ఆశిస్తున్నాను’ అని రాశాడు ఖాన్‌.

అతడు ఆశించినట్లే... స్మృతి ఈ పోస్ట్‌ చూసి సంతోషించింది. ఒక మెసేజ్‌ ద్వారా ఆ కశ్మీర్‌ బాలికకు బిగ్‌ హగ్‌ ఇచ్చింది! ‘ఇది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం’ అని రాసింది.

చ‌ద‌వండి: ఏం చేశావ్ బ్రో.. చూపు తిప్పుకోలేక‌పోయాం

మారుమూల గ్రామాల్లోని పిల్లలకు ఆడాలనే తపన తప్ప, క్రికెట్‌కు సంబంధించి ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండవు. అయితే వారిలో ప్రతిభ ఉంటే, ఆ ప్రతిభ వారిని ఎక్కడికో తీసుకెళుతుందని చరిత్ర చెబుతూనే ఉంది! 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement