RCB vs DC Women Final live updates and highlights: డబ్ల్యూపీఎల్-2026 ఛాంపియన్స్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఆర్సీబీకి ఇది రెండో డబ్ల్యూపీఎల్ టైటిల్.
ఢిల్లీ విధించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ త్వరగా ఔటైనప్పటికి కెప్టెన్ స్మృతి మంధాన(41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87),జార్జియా వోల్ (53 బంతుల్లో 79) విధ్వంసం సృష్టించారు. ఆఖరిలో రాదా యాదవ్(5 బంతల్లో 12) కీలక ఇన్నింగ్స్ ఆడింది.
వాల్ అవుట్
174 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 79 పరుగులు చేసిన వాల్.. మిన్ను మణి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. ఆర్సీబీ విజయానికి 18 బంతుల్లో 27 పరుగులు కావాలి.
13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 135/1
13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. జార్జియా వాల్(67), కెప్టెన్ మంధాన(56) దూకుడుగా ఆడుతున్నారు.
దంచి కొడుతున్న వాల్, మంధాన
9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో వాల్(46), స్మతి మంధాన(32) ఉన్నారు. ఆర్సీబీ విజయానికి 66 బంతుల్లో 113 పరుగులు కావాలి.
దూకుడుగా ఆడుతున్న వాల్
4 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. క్రీజులో వాల్(17), మంధాన(5) ఉన్నారు.
ఆర్సీబీ తొలి వికెట్ డౌన్
204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. 9 పరుగులు చేసిన గ్రేస్ హ్యారిస్.. హెన్రీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యారు.
ఢిల్లీ బ్యాటర్ల జోరు.. ఆర్సీబీ టార్గెట్ 204 పరుగులు
ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్( 57)టాప్ స్కోరర్‌గా నిలవగా.. లారా వోల్వడర్ట్(44), లీ(37), హెన్రీ(35) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో నడైన్ డిక్లార్క్, సత్ఘరే , అరుంధతి రెడ్డి తలా వికెట్ సాధించారు.
రోడ్రిగ్స్ ఔట్
148 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం 37 బంతుల్లో 57 పరుగులు చేసిన కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్.. సత్ఘరే బౌలింగ్‌లో ఔటైంది. క్రీజులో లారా వోల్వర్డ్(30), హెన్రీ(2) ఉన్నారు. 17 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 155/3
రోడ్రిగ్స్ దూకుడు..
12 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(20 బంతుల్లో 34) దూకుడుగా ఆడుతోంది.
లీ ఔట్..
72 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన లెజ్‌లీ.. నడైన్ డిక్లార్క్ బౌలింగ్‌లో ఔటైంది. 8 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 74/2
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
49 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన షెఫాలీ వర్మ.. అరుంధతి రెడ్డి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. 6 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 53/1
4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 29/0
4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. క్రీజులో లీ(17), షెఫాలీ వర్మ(6) ఉన్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో తుది పోరుకు తెరలేచింది. వడోదర వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు గత మ్యాచ్‌లో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్‌తోనే బరిలోకి దిగాయి.
ఇక వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఈసారి ఎలాగైనా జెమిమా రోడ్రిగ్స్ కెప్టెన్సీలో కప్పు కొట్టాలని పట్టుదలతో ఉంది. మరోవైపు డబ్ల్యూపీఎల్-2024 ఫైనల్ నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
తుది జట్లు
ఆర్సీబీ: స్మృతి మంధాన (కెప్టెన్), గ్రేస్ హారిస్, జార్జియా వోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, నడైన్ డి క్లెర్క్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్, సయాలీ సత్ఘరే.
ఢిల్లీ క్యాపిటల్స్: లిజెల్ లీ, షెఫాలీ వర్మ, లారా వోల్వార్డ్, జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మరిజన్ కాప్, షినెల్ హెన్రీ, నికి ప్రసాద్,స్నేహ రాణా, మిన్ను మణి, నందిని శర్మ, శ్రీ చరణి,


