క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్-2026కు రంగం సిద్దమైంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. ఈ టోర్నీలో పాల్గోనే మొత్తం 20 జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుండగా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు టైటిల్ ఫేవరేట్‌గా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో టోర్నీ విజేత ఎవరన్నదిపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. టీమిండియా తిరిగి టైటిల్‌ను నిలబెట్టుకుంటుందని సన్నీ థీమా వ్యక్తం చేశాడు. "భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి అని భావిస్తున్నాను. ఫైనల్లో మాత్రం ఇంగ్లండ్, భారత్ తలపడడం ఖాయం. ఇంగ్లండ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. శ్రీలంకతో జరిగిన సిరీస్‌ను 3-0 తేడాతో ఇంగ్లీష్ జట్టు సొంతం చేసుకుంది.
అలాగే టీమిండియా కూడా టీ20ల్లో అసాధరణ ప్రదర్శన కనబరుస్తోంది. కాబట్టి ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి మెన్ ఇన్ బ్లూ టైటిల్‌ను రిటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని" గవాస్కర్ స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. భారత్ తమ తొలి మ్యాచ్‌లో టోర్నీ ఆరంభం రోజునే ముంబై వేదికగా అమెరికాతో తలపడనుంది.


