'కప్పు గెలవడమే మా లక్ష్యం'.. ప్రత్యర్థులకు రషీద్ ఖాన్ వార్నింగ్ | Rashid Khan claims Afghanistan will play T20 World Cup final | Sakshi
Sakshi News home page

T20 WC 2026: 'కప్పు గెలవడమే మా లక్ష్యం'.. ప్రత్యర్థులకు రషీద్ ఖాన్ వార్నింగ్

Feb 5 2026 6:45 PM | Updated on Feb 5 2026 7:23 PM

Rashid Khan claims Afghanistan will play T20 World Cup final

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు మ‌రో రెండు రోజుల్లో తెర‌లేవ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 7 నుంచి ఈ మెగా టోర్నీ నుంచి షురూ కానుంది.  ఈ నేప‌థ్యంలో ఐసీసీ తాజాగా కెప్టెన్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా అఫ్గానిస్తాన్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్‌కు ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. "ఈ ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ ఏ జట్టును ఓడిస్తే అది సంచ‌లనం అవుతుంది?" అని విలేకరులు ప్రశ్నించారు.

ర‌షీద్ వెంట‌నే త‌డ‌బ‌డ‌కుండా  "ఫైనల్‌కు ఎవరు వచ్చినా, వారిని ఓడించడమే మా లక్ష్యం" అని బదులిచ్చాడు. అంటే ఈ మెగా ఈవెంట్‌లో అఫ్గానిస్తాన్ క‌చ్చితంగా ఫైన‌ల్ చేరుతుందాన్న థీమాతో ర‌షీద్ ఉన్నాడు. గ‌త కొంత‌కాలంగా అఫ్గానిస్తాన్ ప్ర‌పంచ మేటి జ‌ట్ల‌కు గ‌ట్టి పోటీ ఇస్తోంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2024లో అఫ్గానిస్తాన్ అద్బుతాలు చేసింది.

పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి జ‌ట్ల‌ను ఓడించి అఫ్గాన్‌కు సెమీస్‌కు చేరింది. కానీ దురదృష్టవశాత్తూ సెమీస్‌లో రషీద్ సేన బోల్తా పడింది. అయితే ఈసారి ఎలాగైనా ఫైనల్‌కు చేరి టైటిల్ గెలవడమే అఫ్గాన్ పట్టుదలతో ఉంది. అప్గాన్ జట్టులో అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. అఫ్గాన్ ఈసారి గ్రూప్‌-డిలో ఉంది. ఈ గ్రూపులో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి వరల్డ్‌క్లాస్ జట్లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement