breaking news
Afghanistan
-
ఆఫ్ఘనిస్తాన్ భరతం పట్టిన జింబాబ్వే బౌలర్
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో (Zimbabwe Vs Afghanistan) జింబాబ్వే యువ పేసర్ బ్రాడ్ ఈవాన్స్ (Brad Evans) చెలరేగిపోయాడు. 9.3 ఓవర్లలో 22 పరుగుల మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈవాన్స్కు బ్లెస్సింగ్ ముజరబానీ (11-1-4-3), తనక చివంగ (6-0-29-1) కూడా తోడవ్వడంతో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్‌ను 127 పరుగులకే ఆలౌట్ చేసింది.ఇవాళే మొదలైన (అక్టోబర్ 20) ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆదిలో ఆఫ్ఘనిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే బ్రాడ్ ఈవాన్స్ ఒక్కసారిగా చెలరేగడంతో ఆఫ్ఘనిస్తాన్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. ఈవాన్స్ తన కెరీర్లో రెండో టెస్ట్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్ కాగా.. అబ్దుల్ మాలిక్ (30), ఇబ్రహీం జద్రాన్ (19), బషీర్ షా (12), అహ్మద్జాయ్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే కూడా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 6 పరుగులకే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్‌ను జియా ఉర్ రెహ్మాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. బెన్ కర్రన్ (2), నిక్ వెల్చ్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి. చదవండి: రిటైరయ్యే వయసులో అరంగేట్రం.. పాక్ ప్లేయర్ అరుదైన ఘనత -
పాక్, అఫ్గాన్ కాల్పుల విరమణ
ఇస్లామాబాద్: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య శాంతి దిశగా ముందడుగు పడింది. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇరుపక్షాలు ఆదివారం అంగీకారానికి వచ్చాయి. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలం శాంతియుత పరిస్థితులు, స్థిరత్వం నెలకొనేలా చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా దాడులు, కాల్పులు, ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల్లో పలువురు సైనికులు, సామాన్య ప్రజలు, ఉగ్రవాదులు మరణించారు. కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్, అఫ్గాన్ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ మధ్య ఖతార్ రాజధాని దోహాలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చల కోసం ఖతార్, తుర్కియే దేశాలు చొరవ తీసుకున్నాయి. కాల్పులు వెంటనే ఆపేయాలని పాక్, అఫ్గాన్ అంగీకారానికి వచి్చనట్లు ఖతార్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే రాబోయే రోజుల్లో తరచుగా సమావేశం కావాలని, శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని, భద్రత, స్థిరత్వానికి కట్టుబడి ఉండాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది. -
పాక్-ఆప్ఘన్ మధ్య కీలక చర్యలు.. శాంతికి ఓకే
దోహా: కొద్ది రోజులుగా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య శాంతి చర్యలు ఫలించాయి. పాక్-ఆప్ఘన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ మేరకు ఖతార్ (Qatar) విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో రెండు దేశాల సరిహద్దులో దాడులు నిలిచిపోనున్నాయి.ఖతార్ రాజధాని దోహా వేదికగా పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఈ చర్చలకు ఖతార్, తుర్కియే (Turkey) మధ్యవర్తిత్వం వహించాయి. చర్చల్లో పాల్గొనేందుకు ఇరుదేశాలకు చెందిన రక్షణ మంత్రులు ఖతార్ వచ్చారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణకు సంబంధించి కీలకంగా చర్చించారు. రెండు దఫాలుగా జరిగిన ఈ చర్చల్లో శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో, శాంతి చర్చలు ఫలించాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన స్థిరత్వాన్ని కొనసాగించడంపై రానున్న రోజుల్లో మరిన్ని చర్చలు జరిపేందుకు కూడా వారు అంగీకరించారని ఖతార్ వెల్లడించింది. ఈ మేరకు ఖతార్ (Qatar) విదేశాంగ మంత్రిత్వశాఖ స్వయంగా ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించింది.ఇక, శుక్రవారం అర్ధరాత్రి ఆఫ్ఘనిస్థాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌పై పాక్ వైమానిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాక్ చేసిన దాడుల్లో యువ క్రికెటర్లు, మహిళలు, చిన్నారులతో సహా కనీసం 10 మంది మృతి చెందారు. ఈ క్రమంలో పక్క దేశం నుంచి వస్తున్న దురాక్రమణలకు మాత్రమే ప్రతిస్పందిస్తున్నామన్నట్లుగా ఇరువర్గాలు వాదనలు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆప్ఘన్ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడంతో పాటు సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం పునరుద్ధరణ చర్యలపై మాత్రమే దృష్టి పెట్టామని పాక్ పేర్కొంది. సరిహద్దుల్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలను ఆప్ఘన్ ఖండించింది. -
కొంచెం కూడా సిగ్గు లేదు.. జింబాబ్వేను బ్రతిమాలుకున్న పాకిస్తాన్
శ్రీలంక-పాకిస్తాన్‌తో జరగనున్న టీ20 ట్రై సిరీస్ నుంచి అఫ్గానిస్తాన్ వైదొలిగిన సంగతి తెలిసిందే. తమ దేశంపై పాకిస్తాన్ సైన్యం చేసిన వైమానిక దాడిని ఖండిస్తూ అఫ్గన్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్గాన్‌లోని అర్గున్, బర్మల్ జిల్లాలపై పాక్ సైన్యం చేసిన దాడిలో ముగ్గురు వర్ధమాన క్రికెటర్లు మృతి చెందారు ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన అఫ్గన్ బోర్డు పాక్ గడ్డపై క్రికెట్ ఆడేది లేదని తేల్చి చెప్పింది.అయితే అఫ్గానిస్తాన్ తప్పుకొన్నప్పటికి ఈ ముక్కోణపు టోర్నీ షెడ్యూల్ ప్రకారం జరగనుంది. ఈ టోర్నీలో అఫ్గాన్ స్ధానాన్ని జింబాబ్వేతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. ఇప్పటికే ఈ విషయంపై జింబాబ్వే క్రికెట్ బోర్డుతో పీసీబీ చర్చలు జరిపింది. అందుకు జింబాబ్వే క్రికెట్ కూడా అంగీకరించనట్లు పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా అఫ్గానిస్తాన్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు నేపాల్, యూఏఈ క్రికెట్ బోర్డులతో కూడా పాక్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కానీ అందుకు ఆయా క్రికెట్ బోర్డులు కాస్త సమయం కోరినట్లు సమాచారం. కానీ అంతలోనే జింబాబ్వే ఒప్పుకోవడంలో అప్డేటడ్ షెడ్యూల్‌ను పీసీబీ విడుదల చేసింది.అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శల వర్షం కురుస్తోంది. మీ దేశం చేసిన దాడిలో ముగ్గురు యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోతే .. సంతాపం తెలపాల్సింది బదులు కొత్త షెడ్యూల్ రిలీజ్ చేస్తారా? అంటూ ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు.నవంబర్ 17 నుండి 29 వరకు జరగనున్న ఈ ముక్కోణపు సిరీస్‌కు రావల్పిండి, లహోర్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ సిరీస్ టీ20 ప్రపంచకప్-2026 సన్నాహాకాల్లో భాగంగా జరగనుంది. కాగా ఈ యువ క్రికెటర్ల మృతి పట్ల ఐసీసీ, బీసీసీఐ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.ట్రైసిరీస్ షెడ్యూల్17 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి19 నవంబర్ – శ్రీలంక వర్సెస్ జింబాబ్వే, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి22 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, గడాఫీ స్టేడియం, లాహోర్23 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే, గడాఫీ స్టేడియం, లాహోర్25 నవంబర్ – శ్రీలంక వర్సెస్ జింబాబ్వే, గడాఫీ స్టేడియం, లాహోర్27 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, గడాఫీ స్టేడియం, లాహోర్29 నవంబర్ – ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్ -
పాక్–ఆఫ్గాన్ యుద్ధాన్ని చిటికెలో ఆపగలను: ట్రంప్
వాషింగ్టన్: పాకిస్తాన్–ఆఫ్గనిస్తాన్ మధ్య పెరుగు తున్న ఘర్షణలపై అమెరికా అధ్యక్షుడు తనదైన శైలిలో స్పందించారు. ఆ రెండు దేశాల మధ్య ఘ ర్షణను ఆపటం తనకు చిటికెలో పని అని తెలి పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో శుక్రవారం మధ్యాహ్నం ట్రంప్ సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పాకిస్తాన్‌పై జరుగుతున్న దాడి, ఆఫ్గని స్తాన్‌పై పాక్ జరుపుతున్న దాడి గురించి నాకు అర్థమవుతోంది. నేను గనుక పరిష్కరించాలని అనుకుంటే ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణను ఆపటం చాలా తేలిక. ప్రజలను చంపే ఘర్షణలను ఆపటం అంటే నాకు చాలా ఇష్టం. నేను లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడాను. ఈ యుద్ధాన్ని ఆపటంలో కూడా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది’అని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా పాక్–ఆఫ్గాన్ మధ్య సైనిక ఘర్ష ణ జరుగుతున్న విషయం తెలిసిందే. -
BCCI: పిరికిపందల దాడి.. అఫ్గన్ బోర్డుకు మద్దతుగా బీసీసీఐ ప్రకటన
అఫ్గనిస్తాన్ క్రికెటర్ల మృతి పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంతాపం వ్యక్తం చేసింది. అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB)కు సంఘీభావం ప్రకటించింది. తమ క్రికెటర్ల మరణానికి కారణమైన దేశంతో.. అఫ్గన్ బోర్డు సిరీస్ రద్దు చేసుకోవడాన్ని బీసీసీఐ స్వాగతించింది.పిరికిపందల దాడి.. ఈ మేరకు.. ‘‘సరిహద్దులోని పక్తికా ప్రావిన్స్‌లో పిరికిపందలు జరిపిన సీమాంతర వైమానిక దాడుల్లో అఫ్గనిస్తాన్ యువ క్రికెటర్లు కబీర్ ఆఘా, సిబ్ఘతుల్లా, హరూన్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. వీరి మృతి పట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.ఈ కష్ట సమయంలో బీసీసీఐ అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డుకు మద్దతుగా నిలుస్తుంది. అఫ్గన్ క్రికెట్ ప్రపంచానికి, మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. మీ దుఃఖాన్ని మేమూ పంచుకుంటాం. ఇందుకు కారణమైన అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.తీవ్రంగా కలచివేస్తోందివైమానిక దాడుల్లో మరణించిన అమాయక ప్రజలు.. ముఖ్యంగా క్రీడల్ని భవిష్యత్తుగా ఎంచుకున్న వ్యక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేస్తోంది. అఫ్గనిస్తాన్ ప్రజలకు బీసీసీఐ హృదయపూర్వకంగా సానుభూతి ప్రకటిస్తోంది. వారి బాధను మేమూ పంచుకుంటాము’’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేరిట బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది.కాగా పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో అఫ్గన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఇందులో ముగ్గురు స్థానిక క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాక్ వైఖరికి నిరసనగా పాకిస్తాన్‌తో ఆడాల్సిన ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకొంటున్నట్లు అఫ్గన్ బోర్డు ప్రకటించింది.ఆట కంటే దేశమే ముఖ్యంఅఫ్గన్ టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్‌తో పాటు పలువురు క్రికెటర్లు బోర్డు నిర్ణయాన్ని స్వాగతించారు. ఆట కంటే దేశమే ముఖ్యమని పేర్కొన్నారు. కాగా రావల్పిండి వేదికగా నవంబరు 19 నుంచి పాకిస్తాన్- శ్రీలంక- అఫ్గనిస్తాన్ మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహణకు ముందుగా షెడ్యూల్ ఖరారైంది.అయితే, పాక్ దుశ్చర్య కారణంగా అఫ్గన్ బోర్డు ఈ సిరీస్‌ను బహిష్కరించగా.. తాము మరో జట్టు కోసం వెతుకుతున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ‘‘అప్గనిస్తాన్ తప్పుకొన్నా ట్రై సిరీస్ కచ్చితంగా జరుగుతుంది. అఫ్గన్ జట్టు స్థానాన్ని భర్తీ చేయగల టీమ్ కోసం చూస్తున్నాం’’ అని పీసీబీ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి.చదవండి: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం! -
బీసీసీఐ, కేంద్రం.. ఆప్ఘన్‌ను చూసైనా సిగ్గుపడాలి: ప్రియాంక చతుర్వేది
ముంబై: పాకిస్తాన్ సైన్యం వైమానిక దాడుల కారణంగా ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు మృతిచెందారు. దీంతో వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంక జట్లతో తలపడబోయే ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ నిర్ణయంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఏసీబీని చూసి బీసీసీఐ, భారత ప్రభుత్వం నేర్చుకోవాలి అని ఘాటు విమర్శలు చేశారు.శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పాకిస్తాన్ వ్యవస్థలో అమాయక బాధితుల రక్తం తాగే కొందరు వ్యక్తులు సరిహద్దుల్లో ఉన్నారు. వారంతా సిగ్గుపడాలి. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్‌తో తమ సిరీస్ మ్యాచ్‌లను రద్దు చేసుకోవడం సరైన చర్య. బహుశా బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం క్రీడల కంటే దేశానికి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలో ఆప్ఘన్ నుంచి నేర్చుకోవాలంటూ విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు సంఘీభావంగా శ్రీలంక జట్టు కూడా సిరీస్ నుండి కూడా వైదొలగాలని ఆశిస్తున్నాను. 2009లో పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు వారి జట్టుపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారని మర్చిపోకూడదు. బీసీసీఐ లాగా కాకుండా పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇతర ఆసియా జట్లు సంఘీభావంగా నిలుస్తాయని ఆశిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.Pakistan establishment is made up of a bunch of cowards who thrive on the blood of their innocent victims and get thrashed at the borders. Shame on them. Good to see Afghanistan Cricket Board call off their series matches with Pakistan, maybe BCCI and GoI can take tips on how to… https://t.co/VzAvFcUOwi— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 18, 2025రాజకీయాలకు క్రీడలను దూరంగా ఉంచాలి. ఇక్కడ పోరాటం కేవలం రాజకీయల గురించి మాత్రమే కాదు. దుష్ట దేశం పాకిస్తాన్ గురించి. పాక్ ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైంది. దేశం అంతా బాధపడుతోంది. కాబట్టి ఇది రాజకీయాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవాలి’ అంటూ హితవు పలికారు. ఇక, అంతుకుముందు కూడాప్రియాంక బీసీసీఐ, కేంద్రం తీరును తప్పుబట్టారు. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో భారత జట్టు మ్యాచ్‌లు ఆడటమేంటని ప్రశ్నించారు. Keep Politics out of sports is something that gets thrown around so easily by apologists of the government and the BCCI. This isn’t politics but about terrorism. Lives are lost, families are impacted, economy is affected, country suffers all of it because of one rogue nation. So…— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 18, 2025ఇదిలా ఉండగా.. క్రికెటర్ల మరణంపై ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘అత్యంత విషాదకరమైన ఘటన. అనైతికం, అనాగరిక చర్య. పాకిస్తాన్ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. విషాద ఘటనలో మహిళలు, పిల్లలు, క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. జాతీయజట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటోన్న యువ ప్లేయర్ల లక్ష్యం నెరవేరకుండానే జీవితం ముగిసింది. పౌరులపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరుతున్నా. పాక్‌తో తలపడబోయే ట్రై సిరీస్ నుంచి వైదొలుగుతున్నామని మా క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం సరైందే. క్లిష్ట సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తాం. మాకు దేశ సమగ్రత అత్యంత ముఖ్యమైన అంశం’ అని పేర్కొన్నాడు. -
పాకిస్తాన్ సైన్యం అరాచకం.. తాలిబన్ నేత సీరియస్ వార్నింగ్
కాబూల్: దాయది దేశం పాకిస్తాన్(pakistan), ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు జరిగిన తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. డ్యూరాండ్ లైన్ వెంట వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడుల కారణంగా పదుల సంఖ్యలో ఆప్ఘన్ పౌరులు మృతి చెందినట్టు తెలిసింది. వారిలో ముగ్గురు ఆప్ఘన్ క్రికెటర్లు కూడా ఉన్నారు.పాక్ సైన్యం ఆప్ఘనిస్థాన్‌లోని మూడు రాష్ట్రాల్లో జనావాసాలే లక్ష్యంగా వైమానిక దాడులకు పాల్పడింది. ఇరుదేశాలు 48 గంటల కాల్పుల విరమణను పొడిగించడానికి పరస్పరం అంగీకరించిన కొన్ని గంటల తర్వాత పాక్ సైన్యం ఓవరాక్షన్‌కు దిగింది. డ్యూరాండ్ లైన్ (Durand Line) వెంబడి ఉన్న పక్తికా (Paktika) ప్రావిన్స్‌లోని అర్గున్, బెర్మల్ జిల్లాలలో పలు ఇళ్లపై మూడు ప్రాంతాల్లో బాంబు దాడి చేసింది. పాక్ దాడుల కారణంగా ముగ్గరు ఆప్ఘన్ క్రికెటర్లతో పాటుగా మరో 10 మంది పౌరులు మృతిచెందినట్టు సమాచారం.మరోవైపు.. పాక్ చర్యలపై తాలిబాన్ సీనియర్ నేత ఒకరు స్పందిస్తూ.. మూడు జిల్లాలపై పాక్ సైన్యం గగనతల దాడులకు తెగబడింది. పాక్ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించుకునేందుకు, రెండు దేశాల నాయకులు శనివారం ఖతార్, దోహాలో సమావేశం కానున్నారు. ఇప్పటికే పాక్ ప్రతినిధులు దోహా చేరుకున్నారు, ఆప్ఘనిస్థాన్ నుంచి ఇంకా బయల్దేరాల్సి ఉంది. అయితే, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందే ఉల్లంఘించడం గమనార్హం. -
ఎవడ్రా సామి నువ్వు.. పాక్‌ను ఇంతలా వణికిస్తున్నావ్?
అది కాబూల్‌లోని ఓ మారుమూల కొండ ప్రాంతం. ఓ టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనం నిదానంగా వెళ్తోంది. ఓ క్షిపణి రయ్‌మంటూ దూసుకొచ్చి ఆ వాహనాన్ని ఢీ కొట్టింది. ‘హమ్మయ్యా..’ అంటూ పాక్ సైన్యం సంబురాలు చేసుకుంది. కట్ చేస్తే.. ఆ మరుసటిరోజే ‘నేను అమరుడ్ని..’ అనే రేంజ్లో ఓ వ్యక్తి వాయిస్‌తో ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. అంతే పాక్ సైనికాధికారుల ముఖంలో సంతోషం పోయి.. మళ్లీ తలపట్టుకున్నారు. పాకిస్తాన్-అఫ్గనిస్తాన్ మధ్య గత 10 రోజులుగా పరస్పర దాడులతో యుద్ధ పరిస్థితులు నెలకొన్నది చూస్తున్నదే!. ఈ దరిమిలా 48 గంటల కాల్పుల విరమణతో పరిస్థితి కాస్త చల్లారినట్లే కనిపిస్తోంది. అయితే.. ఒకప్పుడు జగ్రి దోస్తులుగా ఉన్న ఈ రెండు దేశాలు దుష్మన్లుగా మారడానికి కారణం.. ఒకే ఒక్కడు. వాడి పేరు నూర్ వాలి మోహ్సూద్(Noor Wali Mehsud). పాక్‌కు కొరకరాని కొయ్యగా(వ్యక్తిగా) మారిన ఇతని గురించి ఇంటర్నెట్లో ఇప్పుడు తెగ వెతికేస్తున్నారు. నూర్ వాలి మెహ్సూద్(47).. ఒకప్పుడు తాలిబాన్ ఉద్యమంలో భాగమైన వ్యక్తి. అయితే ఆ తర్వాతి కాలంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) అనే ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తూ.. పాక్‌ను వణికిస్తున్నాడు. ఇతని నేతృత్వంలో టీటీపీ సంస్థ పాక్ గడ్డపై పలు దాడులు జరిపింది. మరీ ముఖ్యంగా సైనిక స్థావరాలు, పోలీసు ఔట్‌పోస్టులను లెక్కలేన్నంటిని నాశనం చేసింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఇతని నేతృత్వంలో జరిగిన దాడులతో పాక్‌కు తీరని నష్టమే వాటిల్లింది. అలా.. తమ దేశ భద్రతా వ్యవస్థకు నూర్ వాలి మెహ్సూద్ పెనుముప్పుగా మారడంతో పాక్ ప్రభుత్వం శాంతి చర్చలకు ఆహ్వానించింది. అయితే.. నూర్ మొండి పట్టు వల్లే ఆ చర్చలు విఫలం కావడం గమనార్హం. తాజాగా ఇతగాడి చర్యల వల్ల పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పాక్ సైన్యం.. అతను ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై క్షిపణి దాడులు చేసింది. అయితే అనూహ్యంగా నూర్ వాలి దాడి నుంచి తప్పించుకున్నాడు. అతని అనుచరులు గాయాలతోనే బయటపడినట్లు తెలుస్తోంది. తన క్షేమసమాచారాన్ని తెలియజేస్తూ ఆ మరుసటిరోజే ఆడియో క్లిప్ ఒకటి నూర్ బయటకు వదిలాడు. ఈ టీటీపీ ఏంటసలు.. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) పలు నిషేధిత సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన గ్రూప్. అయితే.. ఇది ఏర్పడడానికి ఒక బలమైన కారణం ఉంది. లాల్ మసీదు ఏరియా.. ఇస్లామాబాద్‌లో ఒకప్పుడు మతపరమైన కేంద్రంగా విరజిల్లేది. మౌలానాలు అబ్దుల్ అజీజ్, అబ్దుల్ రషీద్ ఘాజీ సారథ్యంలో షరియా చట్టం అమలు కోసం ఉద్యమించారు. అయితే.. ఉద్యమం మాటున ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అప్పటి సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రభుత్వం ఆపరేషన్ సైలెన్స్ పేరిట చర్యకు ఉపక్రమించింది. జులై 3-11 తేదీ మధ్య ఈ దాడిలో 100 మంది మరణించగా.. 11 మంది సైనికులు, 200 మంది పౌరులు గాయపడ్డారు.మరణించిన వాళ్లంతా మిలిటెంట్లేనని ముషారఫ్ నాడు ప్రకటించారు. లాల్ మసీద్ ఘటన భావోద్వేగంగా, మతపరంగా ప్రజలను ప్రభావితం చేసింది. అయితే.. ఈ ఘటనను ఇస్లాం మీద దాడిగా భావించిన పలు గ్రూపులు.. పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రతీకారంగా కలసి TTPను డిసెంబర్ 2007లో ప్రకటించాయి. దీని లక్ష్యం.. అప్పటి ముష్రాఫ్ ప్రభుత్వాన్ని కూల్చేయడం, పాకిస్తాన్లో షరియా చట్టం అమలయ్యేలా చూడడం. కాలక్రమంలో.. ఇది పాక్ సరిహద్దు ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేసుకుని పాక్ భూభాగంపై తరచూ దాడులు చేస్తూ వస్తోంది.నూర్ సారథ్యం.. మరో మలుపు!2018లో అఫ్గన్ సరిహద్దులో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో టీటీపీ కీలక నేతలు ముగ్గురూ మరణించారు. దీంతో నూర్ వాలి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. నూర్ వాలి మెహ్సూద్ సారథ్యంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) కొత్త పంథా ఎంచుకుంది. టీటీపీ అంటే అప్పటిదాకా పాక్ అమాయక పౌరులను బలిగొన్న కరుడుగట్టిన ఉగ్రసంస్థగా ముద్రపడిపోయింది. 2014లో ఓ పాఠశాలలో జరిపిన దాడిలో 130 మంది చిన్నారులు మరణించడం.. ఇందుకు ఓ ఉదాహరణ కూడా. అయితే మత పండితుడైన నూర్.. తన సారధ్యంలో అలాంటివి జరగకూడదని బలంగా తీర్మానించాడు. పాక్ సైన్యం అనేది ఇస్లాంకు వ్యతిరేకంగా.. 78 ఏళ్లుగా పాక్ ప్రజలను బందీఖానాలో ఉంచిందని, రాజకీయ జోక్యంతో భ్రష్టు పట్టిపోయిందని ఘాటు విమర్శలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పౌరుల జోలికి పోకూడదని.. కేవలం పాక్ ఆర్మీ, అవసరమైతేనే పోలీసులను లక్ష్యంగా చేసుకోవాలని టీటీపీ కేడర్‌కు సూచించాడు. అలా టీటీపీపై పడ్డ మచ్చను చెరిపేసే ప్రయత్నం చేశాడు నూర్. 2021లో అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ అధికారంలోకి రావడంతో.. TTPకు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో స్వేచ్ఛగా సంచరించే అవకాశం కలిగింది. ప్రత్యేకించి.. పాక్ ఉత్తర పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు పెరిగాయి. పాక్ చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే.. నూర్ వాలి ఆఫ్ఘనిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నాడని, తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వ సహకారంతోనే మరింత రెచ్చిపోతున్నాడని. అంతేకాదు.. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఇస్లాం మతాన్ని వక్రీకరిస్తోందని, అలాంటి సంస్థకు భారతదేశమూ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ వచ్చింది. అయితే, ఈ ఆరోపణలను న్యూఢిల్లీ ఖండించింది, తాము ఎలాంటి మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేసింది. -
భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోంది.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే, భారత్ (India) తరఫున ఆప్ఘనిస్తాన్ పరోక్ష యుద్ధం చేస్తుందంటూ నిందలు మోపే ప్రయత్నం చేశారు. భారత్, ఆప్ఘన్‌తో రెండు వైపులా యుద్దానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందన్నారు.పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ‘పాకిస్తాన్ విషయంలో ఆప్ఘన్, భారత్ అనుచితంగా వ్యవహరిస్తున్నాయి. రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. భారత్ సరిహద్దులో డర్టీ గేమ్ ఆడుతోంది. ఇస్లామాబాద్ యుద్ధ పరిస్థితులపై ప్రతిస్పందించడానికి వ్యూహాలను రూపొందించింది. యుద్ధానికి సంబంధించి బలమైన అవకాశాలు ఉన్నాయి. యుద్ధ వ్యూహాల గురించి బహిరంగంగా చర్చించలేను. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.🚨🚨 Pakistan is prepared for 2 front war: Khawaja Asif Anchor: According to war analysts, India might play dirty games along the border. Are you anticipating that?Khawaja Asif: No, absolutely, you cannot rule that out. There are strong possibilities. pic.twitter.com/ixIU7ClFrJ— Naren Mukherjee (@NMukherjee6) October 17, 2025అంతకుముందు కూడా ఆసిఫ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆప్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఇటీవల భారత్‌లో పర్యటించడంపై అక్కసు వెళ్లగక్కారు. ముత్తాఖీ ఆరు రోజుల పర్యటనలో పలు ప్రణాళికలు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఈ పర్యటన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతర ఉద్దేశాలను కలిగి ఉందన్నారు. ఇక, ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయొద్దంటూ హెచ్చరికలు చేశారు. తాలిబాన్ నిర్ణయాలను ఢిల్లీ స్పాన్సర్ చేస్తోంది. ఢిల్లీ కోసం కాబూల్ ప్రాక్సీ యుద్ధం చేస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ‘ఆప్ఘన్లో భారీ దాడులు జరిగాయి. స్నేహపూర్వక దేశాల జోక్యం తర్వాత కాల్పుల విరమణకు వారు అంగీకరించారు. కానీ, అది పేలవంగా ఉంది. ఇది ఎక్కువ కాలం ఉంటుందని అనుకోవడం లేదు’ అని అన్నారు.ఇది కూడా చదవండి: ‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’ -
పేద దేశమైనా రూపాయి కంటే బలమైన కరెన్సీ.. ఎలా?
ఆఫ్ఘనిస్తాన్ అంటే ప్రపంచంలో అత్యంత పేద, అస్థిర దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఎప్పుడూ యుద్ధం లేదా ఉగ్రవాద ఘటనలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు దాని కరెన్సీ బలం వల్ల ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న ఈ దేశం కరెన్సీ పరంగా మాత్రం అత్యంత స్థిరమైన దేశాల్లో ఒకటిగా అవతరించడమంటే నిజంగా ఆశ్చర్యమే.ఆఫ్ఘన్ ఆఫ్ఘనీ విలువ ఎంత?ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ (Afghanistan Currency) ఆఫ్ఘనీ (AFN). ప్రస్తుతం ఆఫ్ఘన్ ఆఫ్ఘనీ.. భారత రూపాయి (Indian Rupee) కంటే బలంగా ఉంది. కరెన్సీ ఎక్స్ఛేంజ్ వెబ్సైట్ XE.com ప్రకారం.. 1 ఆఫ్ఘన్ ఆఫ్ఘనీ విలువ రూ.1.33 భారతీయ రూపాయలతో సమానం. ఇది అర్థం ఏమిటంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో 1 లక్ష ఆఫ్ఘనీలను సంపాదించడం, భారతదేశంలో సుమారు రూ.1.33 లక్షలకు సమానమవుతుంది. ఇది ఆర్థికంగా పోరాటం చేస్తున్న దేశానికి పెద్ద విషయమే.ఆఫ్ఘన్ కరెన్సీ బలానికి కారణం2021లో అధికారంలోకి వచ్చిన తాలిబన్ ప్రభుత్వం, దేశీయ కరెన్సీని బలోపేతం చేసే చర్యలు తీసుకుంది. అవి..విదేశీ కరెన్సీ వినియోగంపై నిషేధం: ముఖ్యంగా అమెరికన్ డాలర్, పాకిస్తాన్ రూపాయి వాడకాన్ని ఆపివేశారు.ఆఫ్ఘన్ కరెన్సీలో లావాదేవీలు తప్పనిసరి నిబంధన: ఇది స్థానిక కరెన్సీకి డిమాండ్‌ను పెంచింది.ద్రవ్య విధానాల పటుత్వం: కఠిన ద్రవ్య విధానాల ద్వారా ద్రవ్యపు ప్రవాహాన్ని నియంత్రించారు.కరెన్సీ స్థిరత్వం వెనుక వాస్తవంఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నదిగా ఉండవచ్చు. కానీ పరిమిత దిగుమతులు, చాలా తక్కువ విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యం కారణంగా దాని కరెన్సీ స్థిరంగా ఉంది. దాదాపు ప్రతి దేశీయ లావాదేవీ స్థానిక కరెన్సీలో నిర్వహించడంతో, ఆఫ్ఘన్ ఆఫ్ఘన్ విలువ పడిపోవడానికి బదులుగా స్థిరంగా ఉంటుంది. -
తాలిబాన్ల చేతిలో.. పాక్‌కు ఘోర అవమానం
పరస్పర ఆరోపణలతో.. అఫ్తనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. బుధవారం జరిగిన పాకిస్తాన్ వైమానిక దాడుల్లో కనీసం 15 మంది అఫ్గాన్ పౌరులు మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. దీంతో తాలిబాన్ సైన్యం ప్రతిచర్యలకు దిగడంతో పాక్ సైన్యం తోకముడిచినట్లు తెలుస్తోంది. అయితే యుద్ధం తప్పదనే భావిస్తున్న తరుణంలో.. అనూహ్యంగా 48 గంటలపాటు కాల్పుల విరమణ తెరపైకి రావడం గమనార్హం. ఈ క్రమంలో.. కాబూల్, కాంహార్ దాడులపై అఫ్గనిస్తాన్ ప్రజలు రగిలిపోతున్నారు. స్పిన్ బోల్దక్ వద్ద పాక్ మిలిటరీ ఔట్ పోస్టులపై తాలిబాన్ బలగాలు మెరుపు దాడులు చేయగా, సైనికులు పరారైనట్లు, కొంత మందిని బంధించినట్లు సమాచారం. భారీగా ఆయుధాలు, ఆహార పదార్థాలు, పాక్ సైనికుల దుస్తులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకొని నంగర్హార్ ప్రావిన్స్‌లో బహిరంగంగా ప్రదర్శించారు. పాక్ సైనికుల ప్యాంట్లను ప్రదర్శిస్తూ.. వ్యతిరేక నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాక్ దాడుల నేపథ్యంలో అఫ్గన్ ప్రజలు తాలిబాన్లకు మద్దతుగా నిలిచారు. అవసరమైతే మేము కూడా ముజాహిదీన్‌గా మారిపోయి యుద్ధానికి సిద్ధం అని కాందహార్ యువకులు కొందరు చెబుతున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్(తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం) సరైన ప్రతీకారం తీసుకుంది. ప్రజలంతా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తాలిబాన్‌తో ఉన్నారు అని పక్తియా ప్రజలు అంటున్నారు. మా భూమిని రక్షించిన భద్రతా బలగాలకు కృతజ్ఞతలు. మేము ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటాం అని కాబూల్ వాసి ఒకరు తెలిపారు.బీబీసీ జర్నలిస్టు దౌద్ జున్బిష్ ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పాక్ సైన్యం విడిచిపెట్టిన అవుట్‌పోస్టుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ప్యాంట్లను తాలిబాన్ ప్రదర్శిస్తోంది అని ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఇది పాక్‌కు తీవ్ర అవమానమే అనే చర్చ నడుస్తోంది. Viral video: Afghan Taliban displaying pants of Pakistani Army soldiers - who were captured by Afghanistan, in the recent border clashes.Why does Pakistani Army always surrender with their pants open? 🤔pic.twitter.com/JqcKw28aou— Treeni (@TheTreeni) October 15, 2025 Again #Pakistan Begging For Cease fire from #Afghanistan .Wait for tomorrow and they will claim victory ! Afghans Celebrating with the pants of their Pak army men hanging in their Bazaar. Pak army is getting battered from all sides .#PakistanArmy pic.twitter.com/HN0Rgz45sc— Meena K (@Raagmaand) October 15, 2025 పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ ఒకప్పుడు మిత్రదేశాలే అయినా.. డ్యూరాండ్ లైన్ విషయంలో కయ్యానికి కాలు దువ్వుకున్నాయి. గత వారం రోజులుగా రెండు దేశాల సైన్యాలు 7 చోట్ల ఘర్షణలకు దిగాయి. తొలుత కాబూల్‌లోని తెహ్రాక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) క్యాంపులపై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. దాంతో తాలిబన్లు సైతం ఎదురుదాడి ప్రారంభించారు. అయితే దాడుల విషయంలో పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి ఈ రెండు దేశాలు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఉద్రిక్తతలతో ఇప్పటిదాకా 200 మంది తాలిబన్లు, 58 మంది పాక్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. 2021లో అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్న తర్వాత పాక్‌తో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం. మరోవైపు.. అఫ్గనిస్తాన్ మంత్రి భారత పర్యటనకు వెళ్లిన వేళే.. ఈ దాడులు మొదలయ్యాయి. కాబూల్‌లో రాయబార కార్యాలయం ప్రారంభిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించడం పాకిస్తాన్‌కు కంటగింపుగా మారింది. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతుండడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతున్నట్లు స్పష్టమవుతోంది.ప్లీజ్.. మధ్యవర్తిత్వం వహించరా?కాల్పుల విరమణ విషయంలో ఇరు దేశాలు పరస్పరం విరుద్ధ ప్రకటన చేసుకుంటున్నారు. తాలిబాన్ల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పాక్, పాకిస్తాన్ కోరుకోవడం వల్లనే కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ చెబుతున్నారు. మరోవైపు.. ఖతార్, సౌదీ అరేబియా ప్రభుత్వాలను పాక్ తరఫున ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులుగా వ్యవహరించాలని, వెంటనే జోక్యం చేసుకొని తాలిబాన్లను శాంతి ఒప్పందానికి ఒప్పించాలని కోరింది.ఇదీ చదవండి: ఇక నేనే ప్రెసిడెంట్‌ని.. నేను చెప్పినట్లే ప్రజలు వినాలి! -
పాక్, అఫ్గాన్ మధ్య మళ్లీ ఘర్షణ
ఇస్లామాబాద్: ఒకప్పటి సన్నిహిత మిత్రదేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఇరుదేశాల సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణ జరిగింది. కాందహార్ ప్రావిన్స్‌లో మంగళవారం అర్ధరాత్రి పాక్ సైన్యం, తాలిబన్ ఫైటర్ల మధ్య కాల్పులు జరిగాయి. తర్వాత ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 15 మంది సాధారణ పౌరులు మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 80 మందికిపైగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. పాక్ దాడిలో దాదాపు 50 మంది తాలిబన్లు మరణించినట్లు సమాచారం. సరిహద్దుల్లో ఘర్షణ నానాటికీ ముదురుతుండడంతో పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఖతార్, సౌదీ అరేబియా ప్రభుత్వాలను ఫోన్లో సంప్రదించింది. అఫ్గాన్ సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా మధ్యవ ర్తులుగా వ్యవహరించాలని, వెంటనే జోక్యం చేసుకొని తాలిబన్లను ఒప్పించాలని కోరింది. పరస్పరం నిందలు పాక్, అఫ్గాన్ మధ్య గతవారం హింసాకాండ మొదలైంది. కాబూల్‌లోని తెహ్రాక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) క్యాంపులపై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. దాంతో తాలిబన్లు సైతం ఎదురుదాడి ప్రారంభించారు. డురాండ్ లైన్లో 58 మంది పాక్ సైనికులను హతమార్చారు. 20 పాక్ సెక్యూరిటీ ఔట్‌పోస్టులను ధ్వంసం చేశారు. 2021లో అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్న తర్వాత పాక్‌తో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం. అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలోనే పాక్ సైన్యం తాలిబన్లపై గురిపెట్టింది. మంగళవారం రాత్రి తొలుత పాక్ జవాన్లే కాల్పులు జరిపారని, భారీ ఆయుధాలు ప్రయోగించారని తాలిబన్ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ ఆరోపించారు. తమ ఎదురుకాల్పుల్లో పెద్ద సంఖ్యలో పాక్ జవాన్లు హతమయ్యారని, పాక్ ఆయుధాలను, యుద్ధ ట్యాంక్‌లను స్వా«దీనం చేసుకున్నామని వెల్లడించా రు. అయితే, రెండు సరిహద్దు పోస్టులు సహా మొ త్తం నాలుగుచోట్ల తాలిబన్లు మొదట కాల్పులు జరిపారని, దాంతో తాము ప్రతిస్పందించాల్సి వచ్చిందని పాకిస్తాన్ సైన్యం తెలియజేసింది. ఎదురుకాల్పుల్లో 30 మంది తాలిబన్ ఫైటర్లు మరణించారని స్పష్టంచేసింది. స్పిన్ బోల్డాక్‌లో మరో 20 మంది మృతిచెందారని వివరించింది. తాలిబన్లకు సంబంధించిన 8 సైనిక పోస్టులు, 6 యుద్ధ ట్యాంకులు ధ్వంసమైనట్లు పేర్కొంది. తాలిబన్ల దాడిలో చమన్‌జిల్లాలో నలుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారని పాక్ వెల్లడించింది. ఒరాక్జాయ్ జిల్లాలో ఆరుగురు పాక్ పారామిలటరీ సిబ్బంది మృతిచెందినట్లు తెలిసింది. ఇరువర్గాల కాల్పుల నేపథ్యంలో సరిహద్దుల నుంచి వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గత పది రోజులుగా సరిహద్దు మార్గాలను అధికారులు మూసివేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. పాక్ రక్షణ శాఖ మంత్రి, ఐఎస్ఐ అధినేత, ఇద్దరు సైనికాధికారులకు వీసాలు ఇవ్వడానికి తాలిబన్ ప్రభుత్వం నిరాకరించింది. వారిని తమ దేశంలోకి అనుమతించబోమని తేల్చిచెప్పింది. దాంతో అఫ్గాన్‌తో అన్ని రకాల సంబంధాలను తెంచేసుకుంటున్నట్లు పాక్ ప్రభుత్వం సంకేతాలిచ్చింది. మరోవైపు భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతుండడాన్ని పాక్ జీరి్ణంచుకోలేకపోతోంది. కాబూల్‌లో రాయబార కార్యాలయం ప్రారంభిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించడం పాకిస్తాన్‌కు కంటగింపుగా మారింది.48 గంటల కాల్పుల విరమణ అఫ్గానిస్తాన్‌తో 48 గంటలపాటు తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. తాలిబన్ల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ కోరుకోవడం వల్లనే కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ తెలియజేశారు. ఒప్పందాన్ని తాము గౌరవిస్తామని అన్నారు. ఒకవేళ పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తగిన రీతిలో బదులిస్తామని స్పష్టంచేశారు. -
నష్టం తక్కువ... లాభం ఎక్కువ
2021 ఆగస్టులో అధికారాన్ని చేపట్టిన తర్వాత మొదటిసారి, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీకి న్యూఢిల్లీలో భారత్ ఆతిథ్యం ఇచ్చింది. తాలిబాన్‌ను అఫ్గానిస్తాన్ అధికారిక ప్రభుత్వంగా గుర్తించకుండానే, దానితో చర్చలు సాగించే విధానాన్ని ఇన్నాళ్లూ భారత్ అను సరిస్తూ వచ్చింది. ఆ మాటకొస్తే, రష్యా మాత్రమే కొద్ది నెలల క్రితం ఆ ప్రభు త్వాన్ని గుర్తించింది. ముత్తాకీ న్యూఢిల్లీ రావడం, ఆయన్ని అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రిగా భారత్ ప్రస్తావించడంతో, తాలిబన్‌ను అఫ్గానిస్తాన్ అధికారిక ప్రభుత్వంగా గుర్తించే దిశగా భారత్ మరో అడుగు వేసిన ట్లయింది. అలా చేస్తే, ఎదురుకాగల ఇబ్బందులు తక్కువ, ఒనగూడ గల వ్యూహాత్మక ప్రయోజనాలు ఎక్కువ.మూడు ముఖ్య అభ్యంతరాలుఅవాంఛనీయ విలువలను ప్రబోధిస్తూ, తన జనాభాలో సగం మందికి వ్యతిరేకంగా వివక్షాయుత విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వాన్ని భారత్ గుర్తించకూడదన్నది ఒక వాదన. దీనిలో సహే తుకత ఉంది. అయితే, మనం ఒక విషయాన్ని దృష్టిలో ఉంచు కోవాలి. (క్రూరమైన పనులను నాజూకుగా చేస్తున్నంత మాత్రాన) అన్ని ప్రభుత్వాలూ నైతికంగా ఆమోదయోగ్యమైనవి కావు. అంగీ కారయోగ్యం కాని విలువలతో కూడిన ప్రభుత్వాన్ని గుర్తించినంత మాత్రాన, ఆ విలువలను మనం ఆమోదిస్తున్నట్లు కాదు. అంత ర్జాతీయ రాజకీయాలు అంతకు మించి జటిలమైనవి. వ్యక్తిగత స్నేహానికి ఎంచుకొనే ప్రమాణాలను, ప్రభుత్వాల విధాన నిర్ణయాలకు వర్తింపజేయలేం. అఫ్గానిస్తాన్ చట్టబద్ధమైన పాలకులుగా తాలిబాన్‌ను గుర్తించడం వల్ల, ఈ ప్రాంతంలో శుద్ధాచారవాదం పెరిగేందుకు దోహద పడినట్లు అవుతుందనేది రెండో అభ్యంతరం. కానీ, తాలిబాన్‌ను గుర్తించడం ద్వారా వారు ప్రధాన జీవన స్రవంతిలోకి రావడానికీ, సామాజికంగా మెరుగైన ప్రవర్తనను అలవరచుకోవడానికీ బాటలు పరచినట్లు అవుతుంది. 1996 నాటి తాలిబాన్ వేరు, 2025 తాలి బాన్ వేరు. వారు మరికాస్త మధ్యేవాదులుగా మారారు, ఆధునిక మార్గాలను అనుసరించేందుకు మరింత సుముఖంగా ఉన్నారు. స్త్రీ–పురుష వివక్ష చూపడంపై విమర్శలను ఎదుర్కొన్న తర్వాత, భారతీయ మహిళా జర్నలిస్టులను ఆహ్వానించడం ద్వారా, తాలి బాన్ తన తప్పును సరిదిద్దుకుంది. కొన్నిసార్లు మార్పు, ఏక పక్షంగా దూరం పెట్టడం కన్నా, నలుగురితో కలవడం, ఒత్తిడిని చవిచూడటం వల్ల వస్తుంది. వారి మత విశ్వాసాలు, విధానాలతో ఏకీభవించనంత మాత్రాన పొరుగు దేశాన్ని దూరంపెట్టడం గొప్ప రాజ్య లక్షణం అనిపించుకోదు. తాలిబాన్‌కు దగ్గరైతే పాకిస్తాన్‌తో మన సంబంధాలు మరింత క్షీణిస్తాయనేది మూడో అభ్యంతరం. వాస్తవం ఏమిటంటే, భారత్ –పాక్ సంబంధాలు ఇప్పటికే అట్టడుగుకు చేరాయి. ఈ చర్య వల్ల ఇప్పుడు ఆ గతిశీలతలో గణనీయంగా రాబోయే మార్పు ఏమీ లేదు. నాలుగు ప్రధాన ప్రయోజనాలుఐ.సి.814 విమాన హైజాక్ ఉదంతాన్ని పక్కన పెడితే, సాధా రణంగా భారత్ పట్ల తాలిబాన్ వైఖరి సానుకూలంగానే ఉంది. ఆ హైజాక్ సూత్రధారి పాకిస్తాన్ సైనిక గూఢచారి సంస్థ. ఆ ఘటనలో తాలిబాన్ కన్నా ఐఎస్ఐ పాత్ర ఎక్కువ. తాలిబాన్ 2021 ఆగస్టులో అధికారం చేపట్టిన నాటి నుంచీ భారత్‌తో సంబంధాలు మెరుగు పరచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కశ్మీర్‌ను భారత్ – పాక్ మధ్య ద్వైపాక్షిక అంశంగా చూడటం ద్వారా, అది భారత్ వైఖరిని సమ ర్థిస్తోంది. రెండు – రష్యాను అనుసరిస్తూ మిగిలిన దేశాలూ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి ఎంతో కాలం పట్టదు. తాలిబాన్‌పై పశ్చిమ దేశాల ఒత్తిడీ తగ్గింది. చైనా, పాకిస్తాన్ కూడా రష్యాను అనుసరించే అవకాశం ఉంది. మిగిలిన దేశాలు గుర్తించేంత వరకు భారత్ వేచి చూసి, ఆ తర్వాత గుర్తిస్తే, దౌత్యపరంగా దానికి ఇపుడు న్నంత ప్రాధాన్యం ఉండదు. పైగా, త్వరగా గుర్తించడం వల్ల, వ్యూహాత్మకంగా మొదటి మిత్రుని సానుకూలత లభిస్తుంది. అఫ్గానిస్తాన్ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహించే అవకాశం దక్కుతుంది. మూడు – తాలిబాన్ నేతృత్వంలోని అఫ్గానిస్తాన్‌తో సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడం మనకే మంచిది. ఈ ప్రాంతంలోని దేశాలను భారత్‌కు దూరం చేయాలని చైనా – పాకిస్తాన్ వేస్తున్న పథకాలను అడ్డుకునేందుకు వీలవుతుంది. కాబూల్‌తో చైనా సాన్నిహిత్యం కూడా పెరుగుతోంది. దానితో వీలైనంత మేరకు సమతూకం సాధించేందుకు ఇది తోడ్పడుతుంది. కాబూల్‌లో ఎవరు అధికారంలో ఉన్నారనేదానితో ప్రమేయం లేకుండా, అఫ్గానిస్తాన్ చాలావరకు, భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామిగా కొనసాగుతూ వస్తోంది. కాబూల్‌లో అనంగీకార ప్రభుత్వం ఉందని, ఆ భాగస్వామ్యాన్ని పాడుచేసుకోకూడదు. ‘అఫ్గానిస్తాన్ సార్వభౌమత్వానికీ, ప్రాంతీయ సమగ్రతకూ, స్వాతంత్య్రానికీ’ భారత్ పూర్తిగా కట్టుబడి ఉంది’’ అని ముత్తాకీ పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చేసిన ప్రకటన ప్రధానంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించినదిగానే కనిపిస్తోంది. అఫ్గాన్ ప్రభుత్వంతో క్రియాశీలంగా వ్యవహరించడంలోని వ్యూహా త్మక విలువను న్యూఢిల్లీ గుర్తించిందనీ, ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రాబల్యాన్ని కట్టడి చేసేందుకు ఒక మార్గంగా దాన్ని భావిస్తోందనీ ఆ ప్రకటన సూచిస్తోంది. అంతిమంగా, భారత్ నుంచి దౌత్యపరమైన గుర్తింపు లభించడం అంతర్జాతీయంగా గుర్తింపు కోసం తహతహలాడుతున్న తాలి బాన్‌కు ఎంతో ఊతాన్ని ఇస్తుంది. ప్రాంతీయంగా అ–మిత్ర వాతా వరణం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ చర్య ద్వారా, మధ్య ఆసియాలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, స్నేహపూర్వక ఉనికితో భారత్ లబ్ధి పొందనుంది.హ్యాపీమాన్ జాకబ్వ్యాసకర్త ‘కౌన్సిల్ ఫర్ స్ట్రేటజిక్ డిఫెన్స్ అండ్రిసెర్చ్’ వ్యవస్థాపక డైరెక్టర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు ఘర్షణలు.. పలువురు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ దళాలు, స్థానిక ఉగ్రవాదులు సరిహద్దు వెంబడి జరిపిన కాల్పులకు తమ సైన్యం ప్రతీకారం తీర్చుకున్నదని పాకిస్తాన్ తెలిపింది. తాజా ఘర్షణల్లో పదుల సంఖ్యలో సైనికులతో పాటు పౌరులు కూడా మృతిచెందారని ఇరువైపుల భద్రతా అధికారులు మీడియాకు తెలిపారు.కాందహార్ ప్రావిన్స్‌లోని స్పిన్ బోల్డాక్‌లో ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఆఫ్ఘన్ తాలిబాన్ వర్గాలు గస్తీ తిరుగుతున్నాయి. కాగా ప్రధాన సరిహద్దు పోస్టులపై ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు చేసిన రెండు దాడులను తిప్పికొట్టామని, దక్షిణ కాందహార్ ప్రావిన్స్‌లోని ఆఫ్ఘన్ వైపున ఉన్న స్పిన్ బోల్డాక్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో దాదాపు 20 మంది తాలిబాన్ సభ్యులు మరణించారని పాకిస్తాన్ సైన్యం తెలిపింది. పౌర జనాభాను పట్టించుకోకుండా ఈ దాడి జరిగిందని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ సైన్యంతో సరిహద్దులో రాత్రిపూట జరిగిన ఘర్షణల్లో దాదాపు 30 మంది మరణించారని తెలుస్తోంది.రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో జరిగిన తాజా హింసలో 15 మంది పౌరులు మృతి చెందారని సంబంధిత అధికారులు ఆఫ్ఘన్ వార్తా సంస్థకు తెలిపారు. పాకిస్తాన్ సరిహద్దు జిల్లా ఒరాక్జాయ్లో దళాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన పోరాటంలో ఆరుగురు పాకిస్తాన్ పారామిలిటరీ సైనికులు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని భద్రతా అధికారులు వెల్లడించినట్లు రాయిటర్స్ పేర్కొంది. కాగా తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పాకిస్తాన్ దళాలు భారీ ఆయుధాలతో దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గత వారాంతంలో ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్తాన్‌పై ప్రతీకార దాడులు చేపట్టింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి.కాగా తమ దాడుల్లో 58 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించినప్పటికీ, మృతుల సంఖ్య 23 అని పాకిస్తాన్ తెలిపింది. ఎదురు కాల్పుల్లో 200 మందికి పైగా తాలిబాన్లను, అనుబంధ దళాలను అంతమొందించామని పేర్కొంది. ఈ ఉద్రిక్తతల మధ్య అక్టోబర్ 12 నుంచి ఆఫ్ఘనిస్తాన్- పాకిస్తాన్ మధ్య సరిహద్దు క్రాసింగ్లను మూసివేశారు. ఏఎప్పీ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం తాజాగా జరిపిన మోర్టార్ కాల్పుల్లో 15 మంది పౌరులు మరణించారని స్పిన్ బోల్డక్ ప్రాంతంలోని స్థానిక సమాచార విభాగం ప్రతినిధి అలీ మొహమ్మద్ హక్మల్ తెలిపారు. 80 మందికి పైగా మహిళలు, పిల్లలు గాయపడ్డారని స్పిన్ బోల్డక్ జిల్లా ఆసుపత్రి అధికారి అబ్దుల్ జాన్ బరాక్ మీడియాకు తెలిపారు. -
దుమ్మురేపిన రషీద్ ఖాన్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) ఆఫ్ఘనిస్తార్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ (Rashid khan) దుమ్మురేపాడు. ఏకంగా 5 స్థానాలు ఎగబాకి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను గద్దె దించాడు. తాజాగా బంగ్లాదేశ్‌పై అద్భుత ప్రదర్శనల (3 మ్యాచ్‌ల్లో ఓ 5 వికెట్ల ప్రదర్శన సహా 11 వికెట్లు) అనంతరం రషీద్ ఈ ఘనత సాధించాడు.ప్రస్తుతం రషీద్ ఖాతాలో 710 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న కేశవ్ మహారాజ్‌తో పోలిస్తే రషీద్ 30 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు.చెప్పుకోదగ్గ మార్పులు..తాజాగా ర్యాంకింగ్స్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ కూడా గణనీయంగా లబ్ది పొందాడు. పేసర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ 19 స్థానాలు మెరుగుపర్చుకొని 21వ స్థానానికి ఎగబాకాడు. బంగ్లా బౌలర్ తంజిమ్ హసన్ 24 స్థానాలు మెరుగుపర్చుకొని 67వ స్థానానికి చేరాడు. మరో బంగ్లా బౌలర్ తన్వీర్ ఇస్లాం 27 స్థానాలు మెరుగుపర్చుకొని 97వ స్థానానికి ఎగబాకాడు. తాజాగా ర్యాంకింగ్స్‌లో బౌలింగ్ విభాగానికి సంబంధించి ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.పడిపోయిన కుల్దీప్టీమిండియా నుంచి టాప్-10లో ఇద్దరు బౌలర్లు మాత్రమే ఉన్నారు. కుల్దీప్ యాదవ్ ఓ స్థానం కిందకు పడిపోయి 5వ స్థానంలో ఉండగా.. రవీంద్ర జడేజా 10వ స్థానాన్ని కాపాడుకున్నాడు. మహ్మద్ షమీ 14, అక్షర్ పటేల్ 37 స్థానాల్లో ఉన్నారు.బ్యాటింగ్ విభాగానికొస్తే.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి 3, 5 స్థానాల్లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ 9వ ప్లేస్‌లో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో తాజాగా ముగిసిన మూడో వన్డేలో తృటిలో సెంచరీ చేజార్చుకున్న ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ 8 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు.ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ అతన్ని కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు నబీ, రషీద్ ఖాన్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. భారత్ తరఫున రవీంద్ర జడేజా (9) ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. చదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ -
నబీ విధ్వంసం.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
మూడు మ్యాచ్ సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో (Bangladesh) ఇవాళ (అక్టోబర్ 14) జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) (111 బంతుల్లో 95; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్హమైన సెంచరీని రనౌటై, చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (44 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) కూడా రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ఆతర్వాత జద్రాన్ సెదిఖుల్లా అటల్ (29) సాయంతో ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించారు.అయితే సెదిఖుల్లా ఔటయ్యాక ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. 76 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వెటరన్ మొహమ్మద్ నబీ (Mohammad Nabi) జూలు విదిల్చాడు. బంగ్లా బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. చివరి రెండు ఓవర్లలో 44 పరుగులు పిండుకున్నాడు. నబీ ధాటికి ఆఫ్ఘన్ స్కోర్ రాకెట్లా పైకెళ్లి పోయింది. 249 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ పడ్డ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ముగియడం లాంఛనమే అనుకున్నారు.అయితే నబీ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో నబీ 37 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నబీ ఇటీవల షార్జాలో కూడా ఇలాంటి సునామీ ఇన్నింగ్సే ఆడాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు తొలుత పట్టు కోల్పోయినా, ఆతర్వాత పుంజుకున్నారు. సైఫ్ హసన్ 3, హసన్ మహమూద్, తన్వీర్ ఇస్లాం తలో 2, రిషద్ హొసేన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది.చదవండి: టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..? -
‘తాలిబన్ నేతకు డిన్నర్ ఇస్తారా?: అవమానంతో తలదించుకున్నట్లుంది’
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ఏర్పాటైన సుమారు నాలుగేళ్ల తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తఖీ భారత్ పర్యటనపై ప్రముఖ కవి, రచయిత జావేద్ అక్తర్ విమర్శలు గుప్పించారు. ఒక తాలిబన్ నేతను భారత్‌కు ఆహ్వానించడమే కాదు.. డిన్నర్ కూడా ఇస్తారా? అవమానంతో తలదించుకున్నట్లైంది అంటూ మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే మనం, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన తాలిబన్ నేతకు విందు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. అన్ని ఉగ్రవాద సంస్థలపై పోరాటం చేసే మనం, ఇలా వారిని ఆహ్వానించి ప్రత్యేక విందులు ఏర్పాటు చేయడమేంటని నిలదీశారు.I hang my head in shame when I see the kind of respect and reception has been given to the representative of the world’s worst terrorists group Taliban by those who beat the pulpit against all kind of terrorists . Shame on Deoband too for giving such a reverent welcome to their “…— Javed Akhtar (@Javedakhtarjadu) October 13, 2025 కాగా, ఆరు రోజుల భారత పర్యటనలో భాగంగా అమిర్ ఖాన్ ముత్తఖీ.. ఇటీవల ఢిల్లీలో అడుగుపెట్టారు. ఈ మేరకు భారత్ ప్రభుత్వ పెద్దల్ని కలుస్తూ తాము అఫ్గాన్‌ను ముందుకు నడిపిస్తున్న తీరును వివరించారు. అదే సమయంలో తమ దేశంలో ఉగ్రజాడలు లేకుండా చేశామని కూడా చెప్పుకొచ్చారు. భారత్ గడ్డపై నుంచే పాక్ ఉగ్రవాదాన్ని వీడాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇలా ముత్తఖీ హెచ్చరించిన గంటల వ్యవధిలోనే పాకిస్తాన్-అఫ్గాన్ల మధ్య పోరు రాజుకుంది. తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) సంస్థ స్థావరమే లక్ష్యంగా పాకిస్తాన్ జరిపిన దాడులు చివరకు తాలిబాన్, పాక్ మధ్య పోరును మరింత ఉధృతం చేశాయి. పాక్–అఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం సైతం ఇరు దేశాల పరస్పర దాడుల పర్వం కొనసాగింది. శత్రుదేశానికి భారీ నష్టం వాటిల్లజేశామని అటు అఫ్గానిస్తాన్, ఇటు పాకిస్తాన్ ప్రకటించుకున్నాయి. ఇదీ చదవండి:అంతా మాలా ఉండండి.. ఉగ్రవాదాన్ని తరమండి: అఫ్గాన్ మంత్రి -
శాంతియుత పరిష్కారం కావాలి
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో సరిహద్దుల వెంట కొనసాగుతున్న ఉద్రిక్తత సమసిపోయేందుకు శాంతియుత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నట్లు అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమిర్‌ఖాన్ ముత్తాఫీ వ్యాఖ్యానించారు. పోరు సద్దుమణిగేందుకు శాంతియుత మార్గాలను అన్వేషిస్తామని, అది సాధ్యంకాకుంటే ఇతర ‘మార్గాలను’ వెతుకుతామని ఆయన అన్నారు. భారత పర్యటనలో ఉన్న ముత్తాఖీ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వంటి విదేశీ శక్తుల చొరబాట్లను అడ్డుకునేందుకు అఫ్గానిస్తాన్ ఐక్యంగా పోరాడుతుంది. అఫ్గాన్ సార్వభౌమత్వానికి భంగపరిచే ఎలాంటి చర్యలను మేం సహించబోం. చర్చలు, పరస్పర అవగాహన ద్వారా సమస్యల పరిష్కారానికే మా ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకూడదనేదే మా విదేశాంగ విధానం. అది కుదరనప్పుడు మేం వేరే దారులను వెదికి అనుకున్నది సాధిస్తాం. అయినా మాకు పాక్ ప్రభుత్వం, ప్రజలతో ఎలాంటి విబేధాలు లేవు. అక్కడ తిష్టవేసిన కొన్ని శక్తులే(ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు) అసలు సమస్య. అఫ్గాన్‌లో అంతర్గతంగా విబేధాలు ఉండి ఉండొచ్చు. కానీ బయటిశక్తుల నుంచి పెను ప్రమాదం పొంచి ఉంటే తాలిబాన్ ప్రభుత్వ, పౌరులు, మతాధికారులు అంతా ఏకమై శత్రువును తుదముట్టిస్తారు ’’ అని ఆయన అన్నారు. -
58 మంది పాక్ సైనికుల మృతి
కాబూల్/ఇస్లామాబాద్: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గంటగంటకూ ముదురుతున్నాయి. ఇరువైపులా భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి. కాబూల్‌పై పాక్ కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా తాము కాల్పులు జరిపినట్లు తాలిబన్ ప్రభుత్వం చెబుతుండగా.. అకారణంగా ఆఫ్ఘన్ తమపై కాల్పులకు దిగిందని పాక్ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ రెండు సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. అయితే.. తమ సేనలు జరిపిన కాల్పుల్లో 58 మంది పాక్ సైనికులు హతమయ్యారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ తెలిపారు. 30 మంది సైనికులు గాయపడ్డట్లు పేర్కొన్నారు. ఆఫ్ఘన్ వైపు తొమ్మిది మంది సైనికులు మరణించగా.. 18 మంది గాయపడ్డట్లు ఆదివారం మధ్యాహ్నం కాబూల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే.. పాకిస్థాన్ మాత్రం ఈ గణాంకాలను నిర్ధారించలేదు. తమవైపు ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు మృతిచెందినట్లు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) ప్రకటించింది. తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ముక్తకంఠంతో ఆఫ్ఘన్ చర్యలను ఖండించినట్లు పాక్ మీడియా తెలిపింది. తాలిబన్ సర్కారుకు గట్టి బదులిచ్చేందుకు పాక్ సైన్యం సిద్ధమైనట్లు వెల్లడించింది.టీటీపీ లక్ష్యంగా డ్రోన్ దాడులుతెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) చీఫ్ నూర్ వలీ మహ్సూద్ టార్గెట్‌గా పాక్ సైన్యం దాడులు జరుపుతోంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం కాబూల్‌లో డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇద్దరు టీటీపీ సీనియర్ నేతలు మరణించగా.. వారిలో మహ్సూద్ ఉన్నారా? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. డ్రోన్ దాడులకు ప్రతిగా ఆఫ్ఘన్ సైన్యం పాక్ సరిహద్దుల్లో కాల్పులను ప్రారంభించింది. హెల్మాండ్ ప్రావిన్స్ లో రెండు పాకిస్థాన్ పోస్టులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కునార్, నంగర్హార్, హెల్మాండ్ ప్రాంతాల్లో భీకర కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.రంగంలోకి ఇరాన్పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఘర్షణలను నిలువరించేందుకు ఇరాన్ రంగంలోకి దిగింది. ఇరువర్గాలు శాంతిని పాటించాలని పిలుపునిచ్చింది. ఘర్షణలను తగ్గించేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రకటించింది. సౌదీ అరేబియా, ఖతార్ కూడా ఇరుదేశాలు సంయమనం పాటించాలని కోరాయి. నిజానికి ఆఫ్ఘనిస్థాన్ అంతర్జాతీయంగా ఒంటరిగా ఉంది. కేవలం రష్యా మాత్రమే తాలిబన్ల అధికారాన్ని, ప్రభుత్వాన్ని గుర్తించింది. తాజాగా భారత్‌లో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి పర్యటన తర్వాత.. ఉపఖండంతో తాలిబన్ల మైత్రికి అడుగులు పడ్డాయి.👉ఇదీ చదవండి: హమాస్ కొత్త బ్రాండ్ పేరు.. ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’ -
స్టార్ ప్లేయర్‌కు గాయం.. వీల్ చైర్‌పై గ్రౌండ్ బయటకు! వీడియో వైరల్
బంగ్లాదేశ్‌తో మూడో వన్డేకు అఫ్గానిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ రహమత్ షా కాలి పిక్క కండరాల గాయం కారణంగా సిరీస్‌లోని ఆఖరి వన్డేకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. శనివారం అబుదాబి వేదికగా జరిగిన రెండో వన్డేలో రహమత్ షా కాలి పిక్క కండరాలు పట్టేశాయి.ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఫలితం లేకపోయింది. దీంతో ఈ మిడిలార్డర్ బ్యాటర్ రిటైర్ట్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత చివరి వికెట్ పడిన తర్వాత జట్టుకు తన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో రహమత్ నొప్పిని భరిస్తూనే తిరిగి బ్యాటింగ్‌కు వచ్చాడు.కానీ కేవలం ఒక బంతి మాత్రమే ఎదుర్కొన్న రహమత్.. క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో అఫ్గాన్ జట్టు ఫిజియో నిర్మలన్ థనబలసింగం వెంటనే మైదానంలోకి పరుగెత్తి వచ్చి మళ్లీ చికిత్స అందించాడు. కానీ నొప్పి ఎక్కువగా ఉండడంతో రహ్మత్ను వీల్‌చెయర్‌లో మైదానం బయటకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధిచిన వీడియోను అఫ్గాన్ క్రికెట్ ఎక్స్‌లో షేర్ చేసింది. కాగా అతడి గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది"దురదృష్టవశాత్తు రహమత్ గాయపడ్డాడు. అతడిని రేపు(ఆదివారం) స్కానింగ్ తీసుకువెళ్తాము. రిపోర్ట్స్ బట్టి అప్డేట్ ఇస్తాము. ఏదేమైనప్పటికి అతడు కొంతకాలం ఆటకు దూరంగా ఉంటాడని నేను అనుకుంటున్నాను"అని థనబలసింగం మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.అతడు ఈ నెలలో జింబాబ్వేతో జరిగే ఏకైక టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజంగా ఇది అఫ్గాన్ గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. ప్రస్తుతం అఫ్గాన్ జట్టులో రహమత్ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇటీవలే రహ్మత్ షా 4,000 వన్డే పరుగులు పూర్తి చేసిన తొలి అఫ్గాన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌పై 81 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే అఫ్గాన్ సొంతం చేసుకుంది.చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 65 ఏళ్లలో ఇదే తొలిసారిPure dedication from @RahmatShah_08, who put his body on the line for his country, walking out to bat when he could barely walk. 👏👏#AfghanAtalan | #AFGvBAN2025 | #GloriousNationVictoriousTeam pic.twitter.com/BYdM8akhzz— Afghanistan Cricket Board (@ACBofficials) October 11, 2025 -
పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్థాన్ బోర్డర్ లో టెన్షన్
-
పాక్, ఆప్ఘన్ బోర్డర్లో టెన్షన్.. పాకిస్తాన్‌కు బిగ్ షాక్
కాబూల్: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆప్ఘన్, పాక్ మధ్య బుల్లెట్ల వర్షం కురుస్తోంది. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో పాకిస్తాన్‌కు సైనికులు 12 మంది చనిపోయినట్టు ఆప్ఘన్ ప్రకటించింది. మరోవైపు.. ఆప్ఘన్ సైనికులు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది.పాక్, ఆప్ఘన్ సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో శనివారం అర్థరాత్రి సరిహద్దులో కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఆఫ్ఘన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో అస్థిర కునార్, హెల్మండ్ ప్రావిన్సులు కూడా ఉన్నాయని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా కాల్పుల్లో కనీసం 12 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ప్రకటించింది. బహ్రంచా జిల్లాలోని షకీజ్, బీబీ జాని, సలేహాన్ ప్రాంతాలలో, అలాగే పక్తియాలోని ఆర్యుబ్ జాజీ జిల్లా అంతటా తీవ్ర పోరాటం జరిగినట్లు నివేదించింది.#𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆:🚨Afghanistan has initiated an offensive against Pakistan from seven distinct border points, according to the Afghan Ministry of Defence; Huge battles underway. Pakistani jets have gone airborne in the east of the country.#Afghanistan #Pakistan pic.twitter.com/n5gwjaicYs— Jahangir (@jahangir_sid) October 11, 2025అయితే, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ప్రతీకార చర్యగా దాడులు జరిపినట్టు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనాయతుల్లా ఖోవరాజ్మి ఈ ఆపరేషన్‌ను అభివర్ణించారు. శనివారం అర్ధరాత్రి నాటికి ఘర్షణలు ముగిశాయని ఆయన అన్నారు. మరోసారి పాక్.. ఇలా గగనతల ఉల్లంఘనకు పాల్పడితే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పాకిస్తాన్ గగనతలాన్ని తాము ఆక్రమిస్తామని వార్నింగ్ ఇచ్చారు.Afghan Taliban After capture pakistani post...🇦🇫🇵🇰The Afghan Taliban announce that they have launched attacks against Pakistan at 7 points along the border.Source: Afghan Defense MinistryFuck Pakistan 🖕🖕 pic.twitter.com/9BatiJtBFU— Sumit (@SumitHansd) October 11, 2025ఇక, పాకిస్తాన్ భద్రతా అధికారులు మాత్రం ఆఫ్ఘనిస్తాన్ దాడులను తమ దళాలు పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలపై ఖతార్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, చర్చల ద్వారా వారి విభేదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. -
మాకు ఇండియానే ఫస్ట్.. పాకిస్తాన్ కు షాకిచ్చిన తాలిబన్ మంత్రి
-
అఫ్గాన్‌లో అభివృద్ధి కార్యక్రమాల పునఃప్రారంభం
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని భారత్ టెక్నికల్ మిషన్ ఇకనుంచి దౌత్య కార్యాల యంగా మారనుంది. అంతేకాదు, తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించనుంది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ ఈ విషయాలను ప్రకటించారు. భద్రతాపరమైన భారత ప్రభుత్వ ఆందోళనలపై సానుకూలంగా స్పందించిన తాలిబన్లను ఆయన అభినందించారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించి భారత్‌కు సంఘీభావం తెలపడం ముఖ్యమైన విషయ మన్నారు. ఆ దేశంలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను పునరుద్ధ రించడంతోపాటు కొత్తగా ఆరింటిని ప్రారంభించనున్నామన్నారు. సుహృద్భావ సూచనగా 20 అంబులెన్సులను కానుకగా అందజేయనున్నట్లు చెప్పారు. ముందుగా ఐదు అంబులెన్సులను స్వయంగా మంత్రి ముత్తాఖీకి అందజేశానని జై శంకర్ తెలిపారు. భారత్‌లో ఆరు రోజుల పర్యటనకు వచ్చిన అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీతో మొదటిసారిగా జై శంకర్ శుక్రవారం భేటీ అయ్యారు. భారత్‌కు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని వాడుకునేందుకు ఎవరికీ అవకాశ మివ్వబోమని ముత్తాఖీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రెండు దేశాలతోపాటు ఈ ప్రాంతమంతటికీ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) సవాలుగా మారిందని అంగీకరించారు. ఈ ఉగ్ర గ్రూపుతో తాము సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. భారత కంపెనీలు తమ దేశంలో గనులు, ఖనిజాల రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీనివల్ల రెండు దేశాల వాణిజ్య సంబంధాలు బలోపేతమవుతాయని చెప్పారు. రెండు దేశాల మధ్య నేరుగా అదనంగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చారు. అనంతరం, ముత్తాఖీ మీడియాతో మాట్లాడుతూ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పర్చుకునేందుకు దశల వారీగా చేపట్టే చర్యల్లో భాగంగా భారత్‌కు దౌత్యాధికారులను కూడా పంపిస్తామన్నారు. మహిళా జర్నలిస్టులకు అందని ఆహ్వానం అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోకి మహిళా జర్నలిస్టులకు ఆహ్వానం పంపకపోవడం వివాదానికి దారి తీసింది. భారత్‌లో ఉన్నా తాలిబన్లు లింగ వివక్షను కొనసాగించడంపై నిరసన వ్యక్తమైంది. భారత ప్రజాస్వామిక విలువలకు ఇది అవమానకరమంటూ జర్నలిస్టులతో పాటు రాజకీయ నేతలు, నెటిజన్లు మండిపడ్డారు. సహనాన్ని పరీక్షించొద్దు: ముత్తాఖీ హెచ్చరికమీడియా సమావేశంలో ముత్తాఖీ పాకిస్తాన్ తీరుపై మండిపడ్డారు. కాబూల్‌లోని తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) స్థావరాలే లక్ష్యంగా పాక్ వైమానిక దాడులకు దిగడంపై ఆయన స్పందిస్తూ.. అఫ్గాన్ల సహనాన్ని పరీక్షించే సాహసం చేయొద్దంటూ ఆ దేశానికి గట్టి వార్నింగిచ్చారు. ‘సరిహద్దులు దాటి మా భూభాగంలో దాడికి పాల్పడి పాకిస్తాన్ తప్పు చేసింది. 40 ఏళ్ల తర్వాత శాంతిని, పురోగతి దిశగా సాగుతున్నాం. ఈ సమయంలో అఫ్గాన్ల సహనాన్ని పరీక్షించవద్దు’ అని ముత్తా్తఖీ అన్నారు. -
అంతా మాలా ఉండండి.. ఉగ్రవాదాన్ని తరమండి: అఫ్గాన్ మంత్రి
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి మవ్లావీ అమీర్ ఖాన్ ముత్తాకీ.. పాకిస్తాన్‌కు సందేశంతో కూడిన వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌ను పరోక్షంగా హెచ్చరించారు. ముత్తాకీ. తాము అధికారం చేపట్టిన తర్వాత అఫ్గాన్‌లో ఒక ఉగ్రవాది పురుగు కూడా చొరబడలేదన్నారు ముత్తాకీ. తమ దేశం తరహాలోనే ప్రతీ దేశం కూడా ఉగ్రవాదంపై పోరును సాగించాలనే సూచించారు. ఈ మేరకు పాకిస్తాన్‌కు భారత్ గడ్డపై నుంచే వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి దూరంగా ఉండటం మంచిదని హెచ్చరించారు. గత నాలుగేళ్లుగా అఫ్గాన్‌లో ఉగ్రవాదం అనే ఛాయలే లేవని, అందుకు తాము అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు. అంతకుముంద లష్కరే తోయిబా, జైషీ మహ్మద్ ఉగ్రవాద సంస్థలు తమ గడ్డ నుంచి కార్యకలాపాలు సాగించినా తాము అధికారం చేపట్టిన తర్వాత ఆ పప్పులు ఉడకలేదన్నారు. ఏ దేశంలోనైనా శాంతి నెలకొనాలంటే ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని పాక్‌కు సూచించారు. ఇది పాకిస్తాన్ ఆచరిస్త వారికి మంచిదంటూ తన సందేశంలో పేర్కొన్నారు. తాలిబన్లు అఫ్గాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ దేశం నుంచి ఒక దౌత్యవేత్త భారత్‌కు రావడం ఇదే తొలిసారి. నిన్న(అక్టోబర్9వ తేదీ) భారత్‌లో అడుగుపెట్టారు ముత్తాకీ. తన భారత పర్యటనలో జై శంకర్, అజిత్ ధోవల్‌తో సమావేశం కానున్నారు ముత్తాకీ. ఇది చదవండినోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర?.. ట్రంప్ సంచలన ఆరోపణ! -
ప్రయాణ నిషేధం మినహాయింపు.. భారత్‌కు తాలిబాన్ మంత్రి
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తఖీ గురువారం భారత్ చేరుకున్నారు. ఆమిర్ ఖాన్ అధికారికంగా భారత్‌లో జరుపుతున్న తొలి పర్యటన ఇది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, పలు ప్రాంతీయ అంశాలపై చర్చించేందుకు వారం రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు.దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న ముత్తఖీని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఘనంగా స్వాగతించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాల దౌత్య సంబంధాలు, ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరగనున్నాయని తెలిపింది. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తఖీ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలుసుకోనున్నారు.ఈ పర్యటన ఇంతకుముందే జరగాల్సి ఉన్నప్పటికీ, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) విధించిన ప్రయాణ నిషేధం నుంచి ఆమిర్ ఖాన్ ముత్తఖీకి మినహాయింపు లభించకపోవడంతో వాయిదా పడింది. ఇటీవలే యూఎన్ఎస్సీ కమిటీ ముత్తఖీ ప్రయాణానికి ప్రత్యేక మినహాయింపు మంజూరు చేసింది. దీంతో అతని పర్యటనకు మార్గం సుగమమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మీడియాకు తెలిపారు.ఇరు దేశాల భేటీలలో భారత్ అందిస్తున్న మానవతా సాయం, ఆఫ్ఘనిస్థాన్‌లో చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆమధ్య ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం సంభవించినప్పుడు భారత్ వెంటనే స్పందించి సహాయ సామగ్రిని పంపించిందని జైస్వాల్ తెలిపారు. ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు పెరుగుతున్న నేపథ్యంలో ముత్తఖీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. గత జనవరిలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తఖీతో సమావేశమయ్యారు. -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. తొలి బౌలర్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ (Rashid Khan) సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో వారి దేశం (Afghanistan) తరఫున 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశతో నిన్న (అక్టోబర్ 8) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం వికెట్లు తీసిన రషీద్ తన వన్డే వికెట్ల సంఖ్యను 202కు పెంచుకున్నాడు. రషీద్ కేవలం 115 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.రషీద్ ఖాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లుగా మొహమ్మద్ నబీ (176), దవ్లత్ జద్రాన్ (115), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (101), గుల్బదిన్ నైబ్ (74) ఉన్నారు.మరో ఘనతరషీద్ ఆఫ్ఘన్ తరఫున 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించడంతో పాటు మరో ఘనత కూడా సాధించాడు. వన్డేల్లో సక్లయిన్ ముస్తాక్ (పాక్) తర్వాత అత్యంత వేగంగా 200 వికెట్లు పూర్తి చేసిన స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. సక్లయిన్ 104 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా.. రషీద్‌కు 115 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. ఓవరాల్‌గా చూస్తే.. రషీద్ వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు మైలురాయిని తాకిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. మిచెల్ స్టార్క్ (102), సక్లయిన్ ముస్తాక్ (104), మొహమ్మద్ షమీ (104), ట్రెంట్ బౌల్ట్ (107), బ్రెట్ లీ (112) రషీద్ కంటే వేగంగా ఈ ఘనత సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే.. రషీద్ మాయాజాలం (10-0-38-3), ఒమర్జాయ్ ఆల్‌రౌండ్ షోతో (9-0-40-3, 40) సత్తా చాటడంతో తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. దీనికి ముందు ఆఫ్ఘనిస్తాన్ ఇదే బంగ్లాదేశ్ చేతిలో 0-3 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. రషీద్ ఖాన్, ఒమర్జాయ్, అల్లా ఘజన్ఫర్ (9.5-1-55-2) ధాటికి 48.5 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తౌహిద్ హృదోయ్ (56), కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ (60) అర్ద సెంచరీలతో రాణించారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 47.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి ఆట ముగించింది. రహ్మానుల్లా గుర్బాజ్ (50), రహ్మత్ షా (50) అర్ద సెంచరీలతో రాణించగా.. ఒమర్జాయ్, కెప్టెన్ హష్మతుల్లా షాహీది (33 నాటౌట్) పర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. తన్వీర్ ఇస్లాం, మెహిది హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. రెండో వన్డే అక్టోబర్ 11న జరుగుతుంది.చదవండి: టీమిండియాలో దక్కని చోటు.. మహ్మద్ షమీ కీలక నిర్ణయం -
బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. టీ20 సిరీస్ పరాభవానికి ప్రతీకారం
టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) చేతిలో ఎదురైన పరాభవానికి ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టి ప్రత్యర్దికి షాకిచ్చింది. యూఏఈ వేదికగా జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లలో తొలుత బంగ్లాదేశ్ 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ చేసింది.అబుదాబీ వేదికగా నిన్న (అక్టోబర్ 8) జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ (Azmatullah Omarzai) ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టాడు. రషీద్ ఖాన్ (Rashid Khan) తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. రహ్మానుల్లా గుర్బాజ్, రహ్మత్ షా అర్ద సెంచరీలతో రాణించారు.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఒమర్జాయ్ (9-0-40-3), రషీద్ ఖాన్ (10-0-38-3), అల్లా ఘజన్ఫర్ (9.5-1-55-2) ధాటికి 48.5 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తౌహిద్ హృదోయ్ (56), కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ (60) అర్ద సెంచరీలతో రాణించారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 47.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి ఆట ముగించింది. రహ్మానుల్లా గుర్బాజ్ (50), రహ్మత్ షా (50) అర్ద సెంచరీలతో రాణించగా.. ఒమర్జాయ్ (40), కెప్టెన్ హష్మతుల్లా షాహీది (33 నాటౌట్) పర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. తన్వీర్ ఇస్లాం, మెహిది హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే అక్టోబర్ 11న ఇదే వేదికగా జరుగుతుంది. చదవండి: World Cup 2025: పాక్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా -
తాలిబన్లతో సఖ్యత!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులుండరన్న నానుడి దౌత్యానికి కూడా వర్తిస్తుంది. పైకి ఏం చెబుతున్నా, ఇతరేతర ప్రత్యామ్నాయాల సాధ్యాసాధ్యాలను పరిశీలించటమనే ప్రక్రియ దౌత్యంలో నిరంతరం కొనసాగుతుంటుంది. పర్యవసానంగా ఒక్కోసారి అనూహ్య పరిణామాలు కూడా చోటుచేసుకోవచ్చు. తాలిబన్ల ఆధ్వర్యంలోని అఫ్గానిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ గురువారం అయిదు రోజుల భారత సందర్శనకు రావటం అటువంటిదే. ఇది దక్షిణ, మధ్య ఆసియా భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేసే పరిణామం. ప్రపంచ దేశాల్లో రష్యా మినహా మరే దేశమూ ఇంతవరకూ అఫ్గాన్ ప్రభుత్వాన్ని లాంఛనంగా గుర్తించలేదు. మన దేశం తొలిసారి ఆ దిశగా అడుగులేస్తున్నది. అమీర్ ఖాన్ రానున్న సందర్భంగా తాలిబన్‌ను ప్రాంతీయ బృందంలోని భాగస్వామిగా గుర్తించటానికి భారత్ సిద్ధపడింది. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించటం ఇక లాంఛన ప్రాయం. భద్రతా మండలి ఉగ్రవాదులుగా గుర్తించి ఆంక్షలు విధించిన వారిలో అమీర్ ఖాన్ ఒకరు. దానికింద ఆయన తారసపడితే అరెస్టు చేయాల్సి ఉంటుంది. భారత్ చొరవతో ఈ విషయంలో తాత్కాలికంగా మినహాయింపు లభించింది.తొలిసారి 1996లో అఫ్గాన్ తాలిబన్ల వశమైనప్పుడు మనకు ఎన్ని విధాల సమస్య లొచ్చాయో ఎవరూ మరిచిపోరు. సోవియెట్ దురాక్రమణను ప్రతిఘటించి పాలనాధి కారాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు అనేకమంది మిలిటెంట్లను కశ్మీర్‌కు తరలించారు. పర్యవసానంగా అక్కడ నెత్తురుటేర్లు పారాయి. కేంద్రంలో వాజ్‌పేయి నాయ కత్వాన తొలి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక 1999లో ఉగ్రవాదులు ఖాట్మండు నుంచి న్యూఢిల్లీ వచ్చే విమానాన్ని హైజాక్ చేసి అఫ్గాన్‌లోని కాందహార్‌కు తరలించారు. ముగ్గురు ఉగ్రవాదుల్ని విడిపించుకున్నారు. ఈ చర్య వెనక నేరుగా తాలిబన్లు లేక పోయినా ఉగ్రవాదులు సురక్షితంగా వెళ్లటానికి సహకరించారు. తాలిబన్లతో చర్చలు గానీ, గుర్తింపుగానీ ఉండబోదని అప్పట్లో మన దేశం ప్రకటించింది. ఇంటా, బయటా వారు సాగిస్తున్న అరాచకాలను తీవ్రంగా ఖండించేది.ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా 2001లో అఫ్గాన్‌ను దురాక్రమించాక ఏర్పడిన ప్రభుత్వాలకు మన దేశం మద్దతుగా నిలిచింది. 2021లో తాలిబన్ల పునరాగమనంతో అష్రాఫ్ ఘనీ ప్రభుత్వం పడిపోయేవరకూ మన దేశం పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టింది. రూ. 25,000 కోట్ల వ్యయంతో పార్లమెంటు భవనాన్నీ, సల్మా ఆనకట్టనూ, ఒక జాతీయ రహదారినీ నిర్మించింది. విద్యుదుత్పాదన ప్రాజెక్టులు, విద్య, వైద్యం తదితరాల్లో పాలుపంచుకుంది. ఇవన్నీ తాలిబన్లలో సద్భావన కలిగించటంతో పాటు పాకిస్తాన్‌తో వచ్చిన విభేదాలు కూడా వారిని భారత్‌వైపు మొగ్గేలా చేశాయి. పాక్– అఫ్గాన్ దీర్ఘకాల సంబంధాలూ, ఉజ్బెకిస్తాన్ ద్వారా సన్నిహితం కావటానికి పాక్ చేస్తున్న ప్రయత్నాలూ, చైనా వరస మంతనాలూ మన దేశంలో కూడా పునరాలోచన కలిగించాయి. మనం ముందడుగు వేయనట్టయితే ఏదోనాటికి తాలిబన్–పాకిస్తాన్ సంబంధాలు మెరుగుపడి, చైనా పలుకుబడి పెరిగి అది మన భద్రతకు ముప్పు కలిగించే అవకాశం కూడా ఉంటుంది. పైగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా కీలకమైన అఫ్గాన్‌లోని బగ్రాం వైమానిక స్థావరాన్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు. ఇది కూడా మన భద్రతను ప్రశ్నార్థకం చేసే పరిణామం. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోబట్టే తాలిబన్లతో సత్సంబంధాలకు మన దేశం సిద్ధపడింది. ఏ దేశానికైనా స్వీయ ప్రయోజనాలు, భద్రత అత్యంత కీలకం. ఆ తర్వాతే మిగిలిన వన్నీ. గత నాలుగేళ్లుగా మన దేశం వేలాది టన్నుల గోధుమలు, వందల టన్నుల మందులు, వ్యాక్సిన్లు, భారీ మొత్తంలో పురుగుమందులు, అత్యవసర సరుకులు పంపింది. ఇటీవల భూకంపం వచ్చినప్పుడు టెంట్లు, మందులు, దుప్పట్లు, జనరేటర్లు అందించింది. కాబూల్‌లో పూర్తిస్థాయి దౌత్య కార్యాలయం కాకపోయినా సాంకేతిక కార్యాలయాన్ని తెరిచింది. తాలిబన్ ప్రభుత్వం ఢిల్లీలో రాయబార కార్యాలయం ప్రారంభించుకోవటానికి అనుమతినిచ్చింది. ఈ అనుకూల వాతావరణంలో అఫ్గాన్‌తో సత్సంబంధాలకు ప్రయత్నించటం అనేక విధాల శుభ పరిణామం. -
రణధీర శరణార్థులు
గౌహతిలోని బర్స పారా క్రికెట్ స్టేడియంలో ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన మహిళల ప్రపంచ కప్ 2025 ప్రారంభ మ్యాచ్‌కు అఫ్గానిస్థాన్ శరణార్థ మహిళల క్రికెట్ జట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, ఇనోకా రణవీర ప్రారంభ ఆటలో అద్భుతమైన ప్రదర్శనతో వార్తల్లో నిలిచారు. అయితే ఆటలోకి అడుగు పెట్టకుండానే అఫ్గాన్ మహిళల జట్టు వార్తల్లో నిలిచింది. మహిళల హక్కుల కోసం పోరాడి, తాలిబాన్ ప్రభుత్వం నుంచి తప్పించుకున్న ఈ అఫ్గాన్ మహిళా క్రికెటర్ల బృందం ప్రవాసంలో ఉంటుంది. భద్రతా విషయాలను దృష్టిలో పెట్టుకొని అఫ్గానిస్థాన్ ప్లేయర్స్ వివరాలను ఐసీసీ బయటపెట్టలేదు. రాబోయే రోజుల్లో అఫ్గాన్ మహిళల క్రికెట్ జట్టును మరింత క్రియాశీలం చేయడానికి వారి పర్యటన తొలి ప్రయత్నంగా భావించాలి. అఫ్గానిస్థాన్ శరణార్థుల క్రికెట్ జట్టుకు భవిష్యత్తులో జరగబోయే రెండు ప్రధాన ప్రపంచ టోర్నమెంట్లలో స్థానం కల్పించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత క్రికెట్‌తో సహా ఎన్నో ఆటలపై మహిళలు ఆడకుండా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో తమ దేశం నుంచి పారిపోయిన అఫ్గాన్ మహిళా అథ్లెట్లకు సహాయం చేయడానికి ఐసీసీ చొరవ చూపింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసీసీఐ), ఇంగ్లండ్ అండ్ వేల్ఫ్ క్రికెట్ బోర్డ్ (ఇసీబి), క్రికెట్ ఆస్ట్రేలియా (సిఏ) సహకారంతో అఫ్గాన్ జట్టును ముందుకు నడిపించడానికి ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా కీలకంగా వ్యవహరిస్తున్నాడు.చాలామంది శరణార్థ ప్లేయర్స్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. మరికొందరు యూకే, కెనడాలలో నివసిస్తున్నారు. అయితే వీసా సమస్య కారణంగా చాలామంది మన దేశానికి రాలేకపోయారు. ఇక్కడికి వచ్చిన వారు శిక్షణ శిబిరాలలో పాల్గొంటారు. దేశీయ జట్లతో కొన్ని మ్యాచ్‌లలో పోటీ పడతారు. -
రషీద్ ఖాన్ తిప్పేసినా ఆఫ్ఘనిస్తాన్‌కు తప్పని ఓటమి
ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ (Afghanistan vs Bangladesh) జట్లు షార్జా, అబుదాబీ వేదికలుగా మూడు మ్యాచ్‌ల టీ20, వన్డేల్లో సిరీస్‌ల్లో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా షార్జా వేదికగా నిన్న (అక్టోబర్ 2) తొలి టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (40), మొహమ్మద్ నబీ (38) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్, రిషద్ చరో 2 వికెట్లు తీయగా.. తస్కిన్, నసుమ్, ముస్తాఫిజుర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 152 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించినా, ఆతర్వాత రషీద్ ఖాన్ (Rashid Khan) (4-0-18-4) తన స్పిన్ మాయాజాలంతో వారిని వణికించాడు. ఓపెనర్లు తంజిద్ (51), పర్వేజ్ ఎమోన్ (54) అర్ద సెంచరీలతో రాణించి తొలి వికెట్‌కు 109 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ.. ఆతర్వాత రషీద్ ధాటికి 8 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. ఎట్టకేలకు నురుల్ హసన్ (23 నాటౌట్), రిషద్ హొసేన్ (14 నాటౌట్) బంగ్లాదేశ్‌ను విజయతీరాలకు చేర్చారు. మరో 8 బంతులు మిగిలుండగా ఆ జట్టు లక్ష్యాన్ని చేరుకుంది (6 వికెట్లు కోల్పోయి). ఈ సిరీస్‌లో రెండో టీ20 ఇవాళే (అక్టోబర్ 3) జరుగనుంది. చదవండి: World Cup 2025: పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్ -
నో టికెట్.. నో మనీ : విమానం ల్యాండింగ్ గేర్ పట్టుకుని ఢిల్లీకి వచ్చేసాడు
‘విపత్కర పరిస్థితులనుంచి ఎలాగైనా ప్రాణాలను కాపాడుకోవాలి. బతికి బట్ట కట్టాలి’’ ఈ ఆరాటానికి నియమాలు, కట్టుబాట్లు ఇవేవీ గుర్తు రావు. ఈ ధిక్కారమే ఒక ఆఫ్ఘన్ బాలుడి (Afghan Boy) సాహసోపేత చర్యకు దారి తీసింది. ఏకంగా విమానం ల్యాండింగ్ గేర్‌కు వేలాడుతూ ఢిల్లీ దాకా వచ్చేశాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ప్రమాదమని తెలిసినాసాహసానికి పూనుకున్న 13 ఏళ్ల తెగువ ఇపుడు నెట్టింట చర్చనీయాంశంగా నిలిచింది.కాబూల్ నుండి ఢిల్లీకి (Kabul-Delhi) కామ్ ఎయిర్‌లైన్స్ విమానంRQ-4401 లో ఆదివారం(సెప్టెంబర్ 22) ఉదయం 11.10 గంటలకు 1.5 గంటల ప్రయాణం తర్వాత ఢిల్లీలో దిగిపోయాడు. విమానం కాబూల్ నుండి ఢిల్లీకి గంటన్నర ప్రయాణం పూర్తిచేసుకుని ల్యాండ్ అయిన తరువాత అధికారులు ఈవిషయాన్ని గ్రహించారు. టాక్సీవేపై నడుస్తున్న బాలుడిని గుర్తించి ఎయిర్‌లైన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో అధికారులు విస్తుపోయారు. బాలుడ్ని అదుపులోకి తీసుకుని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సహా భద్రతా సంస్థలకు అప్పగించారు.కుందూజ్ ప్రాంతానికి చెందిన ఈ బాలుడు సెక్యూరిటీ కళ్లు గప్పి ఎయిర్‌పోర్ట్‌లోకి చొరబడి విమానం బయలుదేరే ముందు రియర్ సెంట్రల్ ల్యాండింగ్ గేర్‌లోకి ఎక్కి దాక్కున్నట్టు అంగీకరించాడు. అంతేకాదు విమానం అటు ఇటు కుదుపులకు గురైనప్పటికీ వేలాడుతూ అలాగే ధైర్యంగా ఉండిపోయినట్లు చెప్పాడు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చేరాడు. అయితే మైనర్‌బాలుడు కావడంతో ఎలాంటి చర్యలు లేకుండానే మరో విమానంలో తిరిగి కాబూల్‌కు పంపించివేశారు అధికారులు. గడ్డ కట్టే చలి, తీవ్రమైన గాలులు లాంటి వాతావరణం మధ్య ఆ బాలుడు ఎలా తట్టుకున్నాడు? అల్పోష్ణస్థితి , హైపోక్సియా , అధిక ఎత్తులో తక్కువ వాతావరణ పీడనంతో ఎవరైనా చనిపోవాల్సిందే అని కొందరు, ఇది స్టోరీ మాత్రమే కాదు, ప్రాణాలకు తెగించి పారిపోవాల్సి భయానక పరిస్థితులకు అద్దం అని కొందరు వ్యాఖ్యానించారు. కాగా గతంలో కూడా ఇలాంటి ఘటనలు కొన్ని వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా “వీల్-వెల్ స్టోవేవే” అని పిలుస్తారు. -
అఫ్గానిస్తాన్ తాలిబన్ చెర నుంచి బ్రిటిష్ దంపతుల విడుదల
దుబాయ్: అఫ్గానిస్తాన్‌లో ఏడు నెలలుగా నిర్బంధంలో ఉంచుకున్న బ్రిటన్ జంటను తాలిబన్లు శుక్రవారం విడిచిపెట్టారు. పీటర్ రేనాల్ట్సŠ(80), బార్బీ రేనాల్డ్స్(75) దంపతులు అఫ్గానిస్తాన్‌లోని బామియన్‌లో గత 18 ఏళ్లుగా విద్య, శిక్షణ సంస్థలను నిర్వహిస్తున్నారు. 2021లో అమెరికా ప్రభుత్వం దన్నుతో నడుస్తున్న ప్రభుత్వాన్ని తాలిబన్లు కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాతా వీరు అక్కడే ఉంటున్నారు.అయితే, వీరు చట్టాలను ఉల్లంఘించారంటూ తాలిబన్ యంత్రాంగం అదుపులోకి తీసుకుని, గుర్తు తెలియని ప్రాంతంలో నిర్బంధించింది. బ్రిటన్ వినతి మేరకు రంగంలోకి దిగిన ఖతార్ ప్రభుత్వం దంపతుల విడుదలపై తాలిబన్లతో చర్చలు జరిపింది. చర్చలు ఫలప్రదం కావడంతో రేనాల్డ్స్ దంపతులను తాలిబన్లు విడిచిపెట్టారు. శుక్రవారం వీరు కాబూల్ నుంచి విమానంలో స్వదేశానికి బయలుదేరారు. అఫ్గాన్‌లోని తాలిబన్ ప్రభుత్వానికి ప్రపంచ దేశాల గుర్తింపు లభించలేదు.దీంతో, వీరు రేనాల్డ్స్ దంపతులను నిర్బంధించడం ద్వారా తమ డిమాండ్లపై బేరసారాలకు దిగినట్లుగా భావిస్తున్నారు. అమెరికాకు చెందిన పర్యాటకుడు జార్జి గ్లెజ్మాన్ను నిర్బధంలోకి తీసుకున్న తాలిబన్లు అనంతరం ఆ దేశంతో ఖైదీల మార్పిడి ఒప్పందం కుదుర్చుకుని, ఇటీవల విడుదల చేయడం తెల్సిందే. -
Asia Cup 2025: అఫ్గానిస్తాన్‌పై గెలుపుతో ‘సూపర్–4’కు శ్రీలంక
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో గ్రూప్ ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధించాయి. గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. ఈ గ్రూప్‌లో మూడు విజయాలతో లంక, రెండు విజయాలతో బంగ్లాదేశ్ ముందంజ వేయగా... అఫ్గానిస్తాన్ టోర్నీ నుంచి నిష్రమించింది. ‘సూపర్–4’ దశకు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన పోరులో... టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మొహమ్మద్ నబీ (22 బంతుల్లో 60; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు. వెలలాగే వేసిన చివరి ఓవర్లో నబీ ఏకంగా 5 సిక్స్‌లు కొట్టడం బాదడం విశేషం. ఈ ఓవర్లో అతను వరుసగా 6, 6, 6, (నోబాల్), 6, 6 బాదాడు. ఇతర బ్యాటర్లలో రషీద్ ఖాన్ (24), ఇబ్రహీమ్ జద్రాన్ (24) కొన్ని పరుగులు జోడించారు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం లంక 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (52 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు) అర్ధ సెంచరీతో జట్టును గెలిపించగా... కుశాల్ పెరీరా (28), కమిందు మెండిస్ (26 నాటౌట్) రాణించాడు. శనివారం జరిగే తొలి సూపర్–4 మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడతాయి. -
Asia Cup: గట్టెక్కిన బంగ్లాదేశ్
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో బంగ్లాదేశ్ కీలక విజయాన్ని అందుకుంది. ‘సూపర్–4’ రేసులో తమకు పోటీగా వచ్చే అవకాశం ఉన్న అఫ్గానిస్తాన్‌పై పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బంగ్లా 8 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ తన్జీద్ హసన్ (31 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తన్జీద్, మరో ఓపెనర్ సైఫ్ హసన్ (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి తొలి వికెట్‌కు 40 బంతుల్లో 63 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత అఫ్గాన్ స్పిన్నర్లు నూర్ అహ్మద్ (2/23), రషీద్ ఖాన్ (2/26) బంగ్లా బ్యాటర్లను కట్టి పడేసి తొలి నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ దశలో తౌహీద్ హృదయ్ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కొంత పోరాడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. గుర్బాజ్ (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఒమర్జాయ్ (16 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా...ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. చివర్లో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించేందుకు ప్రయత్నించినా ... 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్ కావడంతో అఫ్గాన్ ఓటమి ఖాయమైంది. ముస్తఫిజుర్ రహమాన్ 3 వికెట్లు పడగొట్టగా... నసుమ్ అహ్మద్, రిషాద్ హుస్సేన్ చెరో 2 వికెట్లు తీశారు. నేడు జరిగే మ్యాచ్‌లో యూఏఈతో పాకిస్తాన్ ఆడుతుంది. -
Asia Cup 2025: రషీద్ ఖాన్ సేనకు భారీ ఎదురుదెబ్బ
ఆసియా కప్ 2025లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌తో రేపు (సెప్టెంబర్ 16) జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్ గాయపడ్డాడు. గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న నవీన్ ఆసియా కప్ మొత్తానికే దూరమయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నవీన్‌కు ప్రత్యామ్నాయంగా అహ్మదుల్లా అహ్మద్జాయ్ను ప్రకటించింది. ఇదివరకే రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో ఉండిన అహ్మద్జాయ్ మెయిన్ జట్టులోకి ప్రమోట్ అయ్యాడు.కాగా, ఆసియా కప్‌ను ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో బోణీ కొట్టింది. టోర్నీ ఓపెనర్‌లో హాంగ్‌కాంగ్‌పై 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రేపు బంగ్లాదేశ్‌తో జరుగబోయే మ్యాచ్ గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్ సూపర్-4 దశకు చేరుకుంటుంది. ఈ టోర్నీలో ఆఫ్గన్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్, హాంగ్‌కాంగ్‌తో పాటు గ్రూప్-బిలో ఉన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తానే గ్రూప్-బి టాపర్‌గా ఉంది. ఆ జట్టు అద్భుతమైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హాంగ్‌కాంగ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి చిట్టచివరి స్థానంలో ఉంది.గ్రూప్-ఏ విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో భారత్, పాక్, ఒమన్, యూఏఈ జట్లు ఉన్నాయి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ ఈ గ్రూప్ టాపర్‌గా ఉంది. పాకిస్తాన్, ఒమన్, యూఏఈ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. టోర్నీలో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. యూఏఈ, ఒమన్ మధ్య మ్యాచ్ 5:30 గంటలకు మొదలైంది. రాత్రి 8 గంటలకు శ్రీలంక, హాంగ్‌కాంగ్ మ్యాచ్ జరుగుతుంది. -
విరాట్ కోహ్లిపై తాలిబన్ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు
దిగ్గజ బ్యాటర్, టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లి ఈ ఏడాది మే 12న టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి యావత్ క్రికెట్ ప్రపంచానికి ఊహించని షాకిచ్చాడు. కోహ్లిలో మరో మూడు, నాలుగేళ్లు టెస్ట్‌ల్లో కొనసాగే సత్తా ఉన్నా ఎందుకో సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. కోహ్లి ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా అతను మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. అంతకుముందే (గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత) పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విరాట్.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. త్వరలో ఆస్ట్రేలియాతో వారి దేశంలోనే జరుగబోయే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ పాల్గొనే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, తాజాగా విరాట్ టెస్ట్ రిటైర్మెంట్పై ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన తాలిబన్ అగ్రనేత అనాస్ హక్కానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే హకాన్నీ విరాట్ టెస్ట్ రిటైర్మెంట్పై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. విరాట్ కోహ్లి టెస్ట్ రిటైర్మెంట్ వెనుక కారణాలు నాకు తెలియదు. బహుశా భారత మీడియా వల్ల విసిగిపోయి అతనలా చేసి ఉండవచ్చు. విరాట్ లాంటి ఆటగాడు కనీసం 50 ఏళ్ల వరకైనా ఆడాలన్నది నా కోరిక. విరాట్‌కు ఇంకా చాలా సమయం మిగిలి ఉంది. జో రూట్‌ను చూడండి, సచిన్ అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డును ఛేదిస్తున్నాడు. విరాట్ కూడా ఆ రికార్డును టార్గెట్‌గా పెట్టుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.హక్కానీ లాంటి ఉగ్ర నేపథ్యమున్న నేత విరాట్ టెస్ట్ రిటైర్మెంట్పై స్పందించడం క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం తాలిబన్ల ప్రభుత్వం నడుస్తున్న విషయం తెలిసిందే. హక్కానీకి తాలిబన్ ఉద్యమ నేత. తాలిబన్లు తీసుకునే అంతర్గత నిర్ణయాల్లో హక్కానీ కీలకపాత్రధారుడు. హక్కానీ క్రమం తప్పకుండా క్రికెట్‌ను ఫాలో అవుతుండటంతో పాటు సోషల్‌మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడు. హక్కానీ వారి దేశ క్రికెట్ జట్టుకు (ఆఫ్ఘనిస్తాన్) మంచి మద్దతుదారుడు. వారి తురుపుముక్క రషీద్ ఖాన్‌ను హక్కానీ అనునిత్యం ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ భారత్‌తో పాటు ఆసియా కప్‌లో పాల్గొంటుంది. ఈ ఖండాంతర టోర్నీలో ఇరు జట్లు వేరువేరు గ్రూప్‌ల్లో ఉండటంతో గ్రూప్ దశలో పోటీపడటం లేదు. ఇరు జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తే సూపర్ ఫోర్లో తలపడే అవకాశం ఉంటుంది. -
అఫ్గానిస్తాన్ అలవోకగా...
అబుదాబి: అఫ్గానిస్తాన్ జట్టు అంచనాలకు తగిన ప్రదర్శనతో ఆసియా కప్‌లో శుభారంభం చేసింది. మంగళవారం మొదలైన ఈ టి20 టోర్నీ గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 94 పరుగుల తేడాతో హాంకాంగ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా... ఆ తర్వాత హాంకాంగ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 94 పరుగులే చేయగలిగింది. అఫ్గాన్ భారీ స్కోరులో ఓపెనర్ సాదిఖుల్లా అటల్ (52 బంతుల్లో 73 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (21 బంతుల్లో 53; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో ప్రధాన పాత్ర పోషించారు. ముఖ్యంగా అజ్మతుల్లా 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని అఫ్గాన్ తరఫున ‘ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ’ని నమోదు చేశాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 35 బంతుల్లోనే 82 పరుగులు జోడించడం విశేషం. సీనియర్ ఆటగాడు మొహమ్మద్ నబీ (26 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక పరుగులతో రాణించగా... రహ్మనుల్లా గుర్బాజ్ (8), ఇబ్రహీం జద్రాన్ (1), గుల్బదిన్ నైబ్ (5) విఫలమయ్యారు. హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా, ఆయుశ్ శుక్లా చెరో 2 వికెట్లు పడగొట్టాడు. హాంకాంగ్ ఫీల్డింగ్ వైఫల్యం కూడా అఫ్గాన్ టీమ్‌కు కలిసొచ్చింది. ఆ జట్టు ఆటగాళ్లు ఏకంగా నాలుగు సునాయాస క్యాచ్‌లు వదిలేశారు. సాదిఖుల్లాకు 4, 45, 51 పరుగుల వద్ద లైఫ్ లభించగా...అజ్మతుల్లా 22 పరుగుల వద్ద బతికిపోయి ఆ తర్వాత మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. కఠినమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హాంకాంగ్ పూర్తిగా తడబడింది. మొత్తం జట్టులో బాబర్ హయత్ (43 బంతుల్లో 39; 3 సిక్స్‌లు), ముర్తజా (16) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. 9.5 ఓవర్ల వద్దే 43/5 వద్ద నిలిచిన జట్టు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. హాంకాంగ్ తమ తర్వాతి మ్యాచ్‌లో 11న బంగ్లాదేశ్‌తో... అఫ్గానిస్తాన్ తమ తర్వాతి మ్యాచ్‌లో 16న బంగ్లాదేశ్‌తో తలపడతాయి. -
దుమ్ములేపిన ఒమర్జాయ్, అటల్.. హాంకాంగ్ టార్గెట్ ఎంతంటే?
ఆసియాకప్-2025లో అబుదాబి వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అఫ్గాన్ ఆరంభంలోనే రెహ్మతుల్లా గుర్బాజ్(8), ఇబ్రహీం జాద్రాన్(1) వికెట్లు కోల్పోయినప్పటికి.. ఓపెనర్ సెదికుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్ దుమ్ములేపారు. వీరిద్దరూ హాంకాంగ్ బౌలర్లను వీరిద్దరూ ఉతికారేశారు. అటల్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73 పరుగులు చేసి ఆజేయంగా నిలవగా.. ఒమర్జాయ్ కేవలం 21 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరితో పాటు మహ్మద్ నబీ(33) రాణించాడు.హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా, అయూష్ శోక్లా తలా రెండు వికెట్లు పడగొట్టగా..ఇషాన్, అతీక్ చెరో వికెట్ పడగొట్టారు. అయితే హాంకాంగ్ ఫీల్డర్లు మూడు సునాయస క్యాచ్‌లను జారవిడిచారు. ఫలితంగా అఫ్గాన్ ఈ భారీ స్కోర్ సాధించగల్గింది. -
చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. విదేశీ వేదికపై 20 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా అవతరించింది. షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో 29 మ్యాచ్‌లు ఆడిన ఆఫ్ఘన్ జట్టు 20 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. యూఏఈ ట్రై సిరీస్‌లో భాగంగా నిన్న యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందడంతో ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది.ఓవరాల్‌గా ఓ వేదికపై అత్యధిక విజయాలు సాధించిన రికార్డు బంగ్లాదేశ్ పేరిట ఉంది. బంగ్లాదేశ్ ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో 48 మ్యాచ్‌ల్లో 24 విజయాలు సాధించింది. బంగ్లాదేశ్ తర్వాత స్వదేశంలో అత్యధిక టీ20 విజయాలు సాధించిన రికార్డు పాకిస్తాన్ పేరిట ఉంది. పాక్ లాహోర్‌లోని గడాఫీ స్టేయడింలో 26 మ్యాచ్‌ల్లో 16 విజయాలు సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత విదేశీ వేదికగా అత్యధిక విజయాలు సాధించిన రికార్డు కూడా పాకిస్తాన్ పేరిటే ఉంది. పాక్ దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 32 మ్యాచ్‌ల్లో 18 విజయాలు సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. యూఏఈపై ఆఫ్ఘనిస్తాన్ 4 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఓపెనర్లు గుర్బాజ్ (40), ఇబ్రహీం జద్రాన్ (48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కరీం జనత్ (28), గుల్బదిన్ నైబ్ (20 నాటౌట్), అజ్మతుల్లా (14 నాటౌట్) ఆఖర్లో వేగంగా పరుగులు సాధించారు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ 2 వికెట్లు తీయగా.. సిమ్రన్‌జీత్ సింగ్, ముహమ్మద్ ఫరూక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 171 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ.. చివరి బంతి వరకు గెలుపు కోసం పోరాడింది. చివరి ఓవర్లో గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా.. యూఏఈ తొలి మూడు బంతులకే 12 పరుగులు చేసి గెలుపు ఖాయమనుకుంది. అయితే ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ మాలిక్ అనూహ్యంగా పుంజుకుని చివరి 3 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో యూఏఈకి ఓటమి తప్పలేదు.యూఏఈ ఇన్నింగ్స్‌కు కెప్టెన్ ముహమ్మద్ వసీం (44), అలీషాన్ షరాఫు (27) శుభారంభాన్ని అందించారు. ఆఖర్లో ఆసిఫ్ ఖాన్ (40) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా చివరి రెండు బంతులను వృధా చేసి ఆఫ్ఘన్ ఓటమికి బాధ్యుడయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫరీద్ మాలిక్, ముజీబ్, షరాఫుద్దీన్, నూర్ అహ్మద్, అహ్మద్జాయ్ తలో వికెట్ తీశారు.కాగా, ఈ టోర్నీ ఫైనల్ రేపు జరుగనుంది. టైటిల్ కోసం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తలడపడతాయి. ఈ టోర్నీ ముగియగానే ఇరు జట్లు ఆసియా కప్‌లో పాల్గొంటాయి. -
భయపెట్టిన యూఏఈ.. బతికిపోయిన ఆఫ్ఘనిస్తాన్
యూఏఈ ట్రై సిరీస్-2025లో ఇదివరకే ఫైనల్‌కు క్వాలిఫై అయిన ఆఫ్ఘనిస్తాన్.. నిన్న యూఏఈతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో తృటిలో ఓటమి తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో యూఏఈ ఓడినా, అద్భుతంగా పోరాడింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యానికి యూఏఈ 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఓపెనర్లు గుర్బాజ్ (40), ఇబ్రహీం జద్రాన్ (48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కరీం జనత్ (28), గుల్బదిన్ నైబ్ (20 నాటౌట్), అజ్మతుల్లా (14 నాటౌట్) ఆఖర్లో వేగంగా పరుగులు సాధించారు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ 2 వికెట్లు తీయగా.. సిమ్రన్‌జీత్ సింగ్, ముహమ్మద్ ఫరూక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 171 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ.. చివరి బంతి వరకు గెలుపు కోసం పోరాడింది. చివరి ఓవర్లో గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా.. యూఏఈ తొలి మూడు బంతులకే 12 పరుగులు చేసి గెలుపు ఖాయమనుకుంది. అయితే ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ మాలిక్ అనూహ్యంగా పుంజుకుని చివరి 3 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు.దీంతో యూఏఈకి ఓటమి తప్పలేదు. యూఏఈ ఇన్నింగ్స్‌కు కెప్టెన్ ముహమ్మద్ వసీం (44), అలీషాన్ షరాఫు (27) శుభారంభాన్ని అందించారు. ఆఖర్లో ఆసిఫ్ ఖాన్ (40) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా చివరి రెండు బంతులను వృధా చేసి, మూడో బంతికి ఔటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫరీద్ మాలిక్, ముజీబ్, షరాఫుద్దీన్, నూర్ అహ్మద్, అహ్మద్జాయ్ తలో వికెట్ తీశారు.కాగా, ఈ టోర్నీ ఫైనల్ రేపు జరుగనుంది. టైటిల్ కోసం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తలడపడతాయి. ఈ టోర్నీ ముగియగానే ఇరు జట్లు ఆసియా కప్‌లో పాల్గొంటాయి. -
పగబట్టిన ప్రకృతి.. అప్గానిస్థాన్‌లో మూడు సార్లు భూకంపం
కాబుల్: అప్ఘానిస్థాన్‌పై ప్రకృతి పగబట్టింది. వరుస భూకంపలతో మారణహోమం సృష్టిస్తోంది. తాజాగా శుక్రవారం రోజు గంటల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది. శుక్రవారం అర్ధరాత్రి 3.16గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 4.9తీవ్రత .. ఉదయం 7గంటల 6 సెకన్ల సమయంలో 5.2 తీవ్రత, మళ్లీ ఉదయం 7గంటల 46సెకన్ల సమయంలో 4.6తీవ్రతతో భూకంపం సంభవించింది.భూకంప కార్యకలాపాల పర్యవేక్షించే భారత్ ప్రభుత్వ సంస్థ ఆధారంగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) శుక్రవారం అర్ధరాత్రి 3.16గంటలకు ఆప్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని జలాలాబాద్ అనే నగరంలో రిక్టర్ స్కేలుపై 4.9తీవ్రతతో భూమి మీద నుంచి 120కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.ఉదయం 7గంటల 6 సెకన్ల సమయంలో 5.2 తీవ్రతతో కునార్‌లో 140కిలోమీటర్ల లోతులో .. ఉదయం 7గంటల 46సెకన్ల సమయంలో 4.6 తీవ్రతతో గాజియాబాద్‌లో భూమికంపించింది. అయితే,భూమి మీద నుంచి వందల కిలోమీటర్ల లోపల భూమికంపించడం వల్ల ప్రాణం నష్టం కంటే ఆస్తినష్టం ఎక్కువగా జరుగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి వరుస భూకంపాలు సెప్టెంబర్ 1 నుంచి వరుస భూకంపాలు ఆప్ఘానిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ దేశ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సెప్టెంబర్ 1న రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకృతి విపత్తు కారణంగా సుమారు 1,411 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 5,400 కంటే ఎక్కువ ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు నేలమట్టమయ్యాయి2,205 మరణాలుఈ విపత్తు తాలిబన్ పరిపాలనలో మూడో అతిపెద్ద భూకంపంగా నమోదైంది. సహాయక చర్యలకు పర్వత ప్రాంతాలు, దూర ప్రాంతాలు ప్రధాన అడ్డంకిగా మారాయి. దీంతో తమను రక్షించాలని తాలిబాన్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి సహాయం కోరింది. సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగువరకు సంభవించిన భూకంపం కారణంగా 2,205 మరణించినట్లు తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి హిమ్మదుల్లా అధికారికంగా ప్రకటించారు. -
భారత్, అఫ్గానిస్తాన్ మ్యాచ్ ‘డ్రా’
హిసర్ (తజికిస్తాన్): అందివచ్చిన అవకాశాల్ని చేజార్చుకున్న భారత ఫుట్‌బాల్ జట్టు అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించుకుంది. సీఏఎఫ్‌ఏ నేషన్స్ కప్ ఫుట్‌బాల్ టోరీ్నలో గురువారం భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్ ఒక్క గోల్ నమోదు కాకుండానే 0–0తో ‘డ్రా’ అయ్యింది. ‘ఫిఫా’ ర్యాంకుల్లో 127వ స్థానంలో ఉన్న భారత్ తమకన్నా దిగువ ర్యాంకు 160లో ఉన్న అఫ్గానిస్తాన్‌పై ప్రభావం చూపలేకపోయింది. మ్యాచ్ మొత్తం మీద బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడంలోనూ విఫలమైంది. ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై చేసిన దాడుల్లోనూ నిరాశపరిచింది. అఫ్గానిస్తాన్ మూడుసార్లు భారత్ గోల్‌పోస్ట్‌పై గురిపెడితే... భారత్ కేవలం రెండుసార్లే గోల్ ప్రయత్నాలు చేయగలిగింది. భారత్ కన్నా అఫ్గానిస్తాన్ రక్షణ శ్రేణి మెరుగ్గా ఆడింది. తాజా ఫలితంలో భారత్ గ్రూప్ ‘బి’లో 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాల్ని కోల్పోయిన భారత్ ఇప్పుడు మూడు, నాలుగో స్థానాల కోసం ఉజ్బెకిస్తాన్‌తో తలపడుతుంది. ఈ నెల 8న ఈ కాంస్య పతకపోరు జరుగుతుంది. -
మైనారిటీ వలసదారులకు ఉపశమనం.. ప్రభుత్వ కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు చెందిన మైనారిటీ వలసదారులకు ప్రభుత్వం ఉపశమనం కల్పించే వార్త చెప్పింది. 2024, డిసెంబర్ 31కి ముందు భారత్‌లోకి వచ్చి, చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు చెందిన మైనారిటీలు, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరు 2025, సెప్టెంబర్ 4 నుండి అమలులోకి వచ్చిన భారతదేశ ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం ప్రకారం శిక్షా చర్యల నుండి మినహాయింపు పొందుతారు. ఈ మినహాయింపు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లోని పౌరసత్వ ప్రమాణాలను ప్రభావితం చేయదు.తాజాగా హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) నోటిఫై చేసిన ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ (మినహాయింపు) ఆర్డర్, 2025 లో ఈ నిబంధనలు పొందుపరిచారు. ఈ చట్టం కింద నేరాలను గుర్తించే అధికారం, చట్టాన్ని అమలు చేసే అధికారాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అప్పగిస్తూ మంత్రిత్వ శాఖ ప్రత్యేక నోటిఫికేషన్లను జారీ చేసింది.చట్టం- జరిమానాలుఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా వీసా లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే ఏ విదేశీయుడైనా ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానాకు అర్హులు. సెక్షన్ 23 ప్రకారం, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఎక్కువ కాలం నివసించే విదేశీయులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, లేదా రూ. 3 లక్షల జరిమానా విధించనున్నారు.మినహాయింపుల వివరణడిసెంబర్ 31, 2024 లోపు భారతదేశంలోకి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలను నిర్బంధం, బహిష్కరణ చర్యల నుండి ఈ ఆర్డర్ మినహాయింపు కల్పిస్తుంది. ఈ మినహాయింపు 2014, డిసెంబర్ 31కి ముందు భారతదేశానికి వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం మంజూరు చేసే సీఏఏ నిబంధనలకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఈ గడువులో భారతదేశంలోకి ప్రవేశించిన వారిని అక్రమ వలసదారులుగా పరిగణించరని, వారి పాస్‌పోర్ట్, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారతదేశంలోనే ఉండవచ్చని పేర్కొన్నారని ఒక అధికారి తెలిపారు.చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు విధించే జరిమానాలను కూడా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, వీసా లేకుండా అక్రమంగా ప్రవేశించే ఏ విదేశీయునికైనా రూ. 5 లక్షల జరిమానా విధించనున్నారు. వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలో నివసించే వారికి ఇమ్మిగ్రేషన్ అధికారి పెనాల్టీ విధిస్తారు. 30 రోజుల వరకు ఉండే వారికి రూ. 10వేలు. 31 నుండి 90 రోజుల వరకు ఉండే వారికి రూ. 20 వేలు జరిమానా విధించనున్నారు. టిబెటన్లు, మంగోలియాకు చెందిన బౌద్ధ సన్యాసులు, అర్హత కలిగిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘన్ వలసదారులకు ఈ జరిమానాలు వర్తించవు. -
ఎడాపెడా సిక్సర్లు.. పాక్ 10వ నంబర్ ఆటగాడి ప్రపంచ రికార్డు
యూఏఈ ట్రై సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాడు హరీస్ రౌఫ్ పలు రికార్డుల్లో భాగమయ్యాడు. ఈ మ్యాచ్‌లో పాక్ ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఓడినా రౌఫ్ పలు ఘనతలు సాధించాడు. స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ అయిన రౌఫ్.. బౌలింగ్‌లో కాకుండా బ్యాటింగ్‌లో రికార్డుల్లో భాగం కావడం విశేషం.ఈ మ్యాచ్‌లో 10వ స్థానంలో (లక్ష్య ఛేదనలో) బ్యాటింగ్‌కు వచ్చిన రౌఫ్.. 16 బంతుల్లో 4 సిక్సర్ల సాయంతో 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. రౌఫ్ మెరుపు ఇన్నింగ్స్ పాక్‌ను గెలిపించలేకపోయినా అతన్ని మాత్రం రికార్డుపుటల్లోకెక్కించింది.అంతర్జాతీయ టీ20ల చరిత్రలో 10 లేదా 11వ స్థానంలో వచ్చి అత్యధిక సిక్సర్లుగా (4) బాదిన ఆటగాడిగా రౌఫ్ విండీస్ ఆటగాడు అకీల్ హొసేన్తో కలిసి ప్రపంచ రికార్డును షేర్ చేసుకున్నాడు.అలాగే చివరి వికెట్‌కు సూఫియాన్ ముఖీమ్‌తో కలిసి (7 నాటౌట్) రౌఫ్ నెలకొల్పిన అజేయమైన 40 పరుగుల భాగస్వామ్యం పాక్ తరఫున 10వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యంగా రికార్డైంది. గతంలో ఈ రికార్డు షోయబ్ అక్తర్-వాహబ్ రియాజ్ (31*) పేరిట ఉండేది.ఈ మ్యాచ్‌లో రౌఫ్ చేసిన స్కోర్ (34 నాటౌట్) పాక్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌గా నిలిచింది. పాక్ టీ20ల చరిత్రలో 10 లేదా 11వ నంబర్ ఆటగాళ్ళు ఓ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడం ఇదే మొదటిసారి.మ్యాచ్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటి పాక్‌కు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ పాక్‌ను 18 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సెదీఖుల్లా అటల్ (64), ఇబ్రహీం జద్రాన్ (65) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్ (4-0-27-4) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.అనంతరం ఆఫ్ఘన్ బౌలర్లు చెలరేగడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫజల్ హక్ ఫారూకీ, కెప్టెన్ రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, నూర్ అహ్మద్ తలో 2 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు. -
గర్జించిన ఆఫ్ఘన్ సింహాలు.. తోక ముడిచిన పాకిస్తాన్
ఆసియా ఖండంలో టీమిండియా తర్వాత రెండో అత్యుత్తమ క్రికెట్ జట్టు ఏదనే అంశంపై గత కొంతకాలంగా డిబేట్స్ నడుస్తూ ఉన్నాయి. చాలామంది ఆ స్థానం శ్రీలంక లేదా పాకిస్తాన్ జట్లదిగా భావిస్తుంటారు.అయితే ఈ భావన తప్పని ఆఫ్ఘనిస్తాన్ గతకొంతకాలంగా నిరూపిస్తూ వస్తుంది. పాక్, శ్రీలంక జట్లను ఇటీవలికాలంలో చాలాసార్లు ఓడించి, ఆసియాలో టీమిండియా తర్వాత తామే తోపులమని రుజువు చేసుకుంది.అయినా ఎక్కడో, ఏ మూలనో ఆఫ్ఘనిస్తాన్ సామర్థ్యంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అలాంటి వారికి తాజా ఉదంతం శాశ్వత సమాధానమిచ్చింది. ఆసియాలో టీమిండియా తర్వాత ఆఫ్ఘనిస్తానే అత్యుత్తమ జట్టని ఈ ఉదంతంతో తేటతెల్లమైంది.యూఏఈ ట్రై సిరీస్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. అన్ని విభాగాల్లో పాక్ కంటే మెరుగైన ప్రదర్శనలు చేసి ఆసియాలో నంబర్-2 తామేనని మరోసారి రజువు చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌లో రాణించి, ఆతర్వాత తమ ప్రధాన బలమైన బౌలింగ్‌లో చెలరేగి ఓ మోస్తరు లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది.ఈ దెబ్బతో ఆసియా నంబర్-2 జట్టేదన్న డిబేట్‌కు పుల్ స్టాప్ పడింది. టీమిండియా తర్వాత ఆఫ్ఘనిస్తానే తోపని నిరూపితమైంది. ఇంకా క్లారిటీ రావాలంటే ఆసియా కప్ వరకు వేచి చూడాలి. ఆ ఖండాంతర టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్.. భారత్ సహా పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర జట్లను ఎదుర్కోనుంది. అక్కడ కూడా ఇదే ఫలితం పునరావృతమైతే ఆసియాలో నంబర్ 2 జట్టేదన్న డిస్కషన్ ఆపై జరుగదు.మ్యాచ్ విషయానికొస్తే.. షార్జా వేదికగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ పాక్‌ను 18 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సెదీఖుల్లా అటల్ (64), ఇబ్రహీం జద్రాన్ (65) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్ (4-0-27-4) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.అనంతరం ఆఫ్ఘన్ బౌలర్లు చెలరేగడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫజల్ హక్ ఫారూకీ, కెప్టెన్ రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, నూర్ అహ్మద్ తలో 2 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో పదో నంబర్ ఆటగాడు హరీస్ రౌఫ్ చేసిన 34 పరుగులే అత్యధికం. -
అఫ్గాన్‌కు ఆపత్సమయం
అంతరిక్షాన్ని దాటి గ్రహాలను పలకరించి, సూర్యుడిపై సైతం నిశితంగా చూపు సారించేందుకు తహతహలాడుతున్న మనిషి తన కాళ్లకిందనున్న నేలలో జరిగే కల్లోలం ఏమిటో, అది ఎప్పుడు ఎందుకు కంపించి పెను విపత్తుల్ని తెచ్చిపెడుతున్నదో తెలియని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాడు. అంతా అయినాక భూకంప కేంద్రం ఎక్కడో, దాని తీవ్రత ఏపాటో చెప్పగలుగుతున్నా ముందుగా పసిగట్టడం అసాధ్యంగానే ఉంది. సోమవారం అఫ్గానిస్తాన్‌లో సంభవించిన భూకంపంలో ఇంతవరకూ 1,400 మందికి పైగా మరణించగా వేలాది మంది గాయపడ్డారు. ఆకలి, అనారోగ్యం, పేదరికం వంటి అనేకానేక క్లేశాలతో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్ ప్రజలకు అక్కడి తాలిబన్ పాలకులు అదనపు సమస్య. వారి విధానాలను సాకుగా చూపి పలు దేశాలు ఇప్పటికీ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. భారత్ గుర్తించకపోయినా వివిధ రూపాల్లో దౌత్యం నెరపుతున్నది. ఇప్పుడు తక్షణ సాయం అందించింది. 2021 ఆగస్టులో తాలిబన్లు కూలదోసిన అష్రాఫ్ ఘనీ సర్కారే చాలా దేశాల దృష్టిలో ‘నిజమైన’ ప్రభుత్వం. చాలా దేశాల్లో ఘనీ ప్రభుత్వ రాయబార కార్యాలయాలే ఉన్నాయి. అఫ్గాన్‌కు ఆ దేశాలు అందించాల్సిన సాయమంతా ఐక్యరాజ్యసమితి సంస్థలకే వెళ్తుంది. వాటిని స్వచ్ఛంద సంస్థలు స్వీకరిస్తాయి. అఫ్గాన్‌ను 2001–21 మధ్య తన ఉక్కు పిడికిట్లో బంధించి, ఆ దేశాన్ని అనేక విధాల ధ్వంసం చేసి నిష్క్రమించిన అమెరికా... యూఎస్ఎయిడ్ కింద ఏటా అఫ్గాన్కిచ్చే 380 కోట్ల డాలర్ల మానవీయ సాయానికి ఈ ఏడాది జనవరి నుంచి కోత విధించింది. పర్యవసానంగా ఆ సాయం 76 కోట్ల డాలర్లకు పడిపోయింది. అందుకే ఇప్పుడు తక్షణమే అందాల్సిన వైద్యసాయం మొదలుకొని పునరావాసం వరకూ అన్నిటికన్నీ పడకేశాయి.ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రీతిలో క్రియాశీలంగా ఉన్న భూకంప ప్రాంతాల్లో అఫ్గాన్ ఉన్న హిందూకుష్ పర్వత శ్రేణి ప్రాంతం ఒకటి. ఇక్కడ భారత పలక, యూరేసియా పలకలు పరస్పరం ఢీకొంటున్నాయి. పర్యవసానంగా ఏర్పడే రాపిడి వల్ల శక్తి విడుదలై అది తరంగాల రూపంలో భూ ఉపరితలానికి చేరటంతో ప్రకంపనలు జనం అనుభవంలోకొస్తాయి. భూకంప కేంద్రం భూ ఉపరితలానికి దగ్గర లో ఉంటే ఆ ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండి పెను ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. తాజాగా సంభవించిన భూకంప కేంద్రం ఉపరితలానికి కేవలం 8 కిలోమీటర్ల లోతులో ఉందంటున్నారు.అందువల్లే తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6గా నమోదైనా, ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎక్కువున్నాయి. లోలోతు పొరల్లో సంభవించే భూకంపాల వల్ల విడుదలయ్యే తరంగాలు ఉపరితలానికి చేరేలోపే తమ శక్తిని చాలాభాగం కోల్పోతాయి. కనుకనే నష్టం తక్కువుంటుంది. ఉత్తర అఫ్గాన్‌లోని పామీర్–హిందుకుష్ ప్రాంతంలో భూకంపాల తీవ్రత ఎక్కువ. కానీ అవి దాదాపు 200 కిలోమీటర్ల లోతులో సంభవిస్తుంటాయి. ఇందుకు భిన్నంగా పశ్చిమ పాకిస్తాన్, ఆగ్నేయ అఫ్గాన్ ప్రాంతంలోని సులేమాన్ పర్వత శ్రేణి వద్ద భూ ఉపరితలానికి సమీపంగా భూకంప కేంద్రాలుంటాయి. భూకంపాలు వాటంతటవే ప్రమాదకరమైనవి కాదు. అవి సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే కట్టడాలు, ఆ విపత్తు విషయంలో అక్కడి పౌరుల్లో ఉండే అవగాహన నష్టం తీవ్రతను తగ్గిస్తాయి. భూకంపాల విషయంలో ఎంతో అనుభవాన్ని గడించి, ప్రాథమిక విద్యాస్థాయి నుంచీ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్న జపాన్ ఇందుకు ఉదాహరణ. అక్కడ భూకంపాన్ని తట్టుకునే విధంగా భవంతులు నిర్మించటం తప్పని సరి. అందువల్లే భూకంప తీవ్రత ఎక్కువున్న సందర్భాల్లో సైతం జపాన్‌లో ప్రాణనష్టం కనిష్ఠంగా ఉంటున్నది. మెరుగైన, శాస్త్రీయమైన ఆవాసాల నిర్మాణానికయ్యే అధిక వ్యయాన్ని భరించే స్తోమత దారిద్య్రంలో కొట్టుమిట్టాడే అఫ్గాన్ ప్రజలకు లేదు. అందుకే స్థానికంగా లభించే మట్టి, రాళ్లు, ఇటుకలతో ఇళ్లు నిర్మించుకుంటారు. పైగా అవి పర్వత సానువుల్లో ఉంటాయి. విపత్తుల సమయాల్లో ఒక్కసారిగా కుప్పకూలి పౌరులకు బయట పడే వ్యవధినీయవు. ఈ ఆపత్సమయంలో అఫ్గాన్‌ను ఆదుకోవటం ప్రపంచ దేశాల బాధ్యత. సాధారణ సమయాల్లో ఏం చేసినా చెల్లుతుందిగానీ, విపత్తులు విరుచుకు పడినప్పుడు అందరూ ఏకం కావాలి. మానవీయతను చాటుకోవాలి. -
Asia Cup 2025: భారీ రికార్డుపై కన్నేసిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ 26 ఏళ్ల వయసులోనే ఎన్నో రికార్డులు నెలకొల్పి, ప్రపంచ అగ్రశ్రేణి స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. 10 ఏళ్ల కెరీర్లో ప్రపంచవాప్తంగా దాదాపు అన్ని టోర్నీల్లో సత్తా చాటి తిరుగులేని బౌలర్‌గా చలామణి అవుతున్నాడు.అయితే రషీద్ ఒక్క టోర్నీలో మాత్రం తనపై ఉన్న హైప్‌కు న్యాయం చేయలేకపోయాడు. ఆ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్. ఈ టోర్నీలో రషీద్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఓ మోస్తరు ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. ఇది అంత తీసి పారేసే ప్రదర్శనేమీ కానప్పటికీ.. రషీద్ స్థాయి అయితే కాదు.త్వరలో ప్రారంభం కాబోయే ఆసియా కప్‌లో (టీ20) రషీద్ తన మార్కు చూపించాలని తహతహలాడుతున్నాడు. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కాబోయే ఈ ఖండాంతర టోర్నీలో మరో 3 వికెట్లు తీస్తే.. ఈ టోర్నీలోని అత్యుత్తమ రికార్డు రషీద్ ఖాతాలో పడుతుంది. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. భువీ ఈ టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో 5.34 ఎకానమీ చొప్పున పరుగులిచ్చి 13 వికెట్లు తీశాడు.ఈ రికార్డుకు సంబంధించి ప్రస్తుతం రషీద్ నాలుగో స్థానంలో ఉన్నాడు. రషీద్‌కు ముందు భువీకి మధ్యలో యూఏఈ బౌలర్లు అంజద్ జావెద్ (7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు), మొహమ్మద్ నవీద్ (7 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు) ఉన్నారు. రషీద్ ఖాన్‌తో పాటు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆసియా కప్ టీ20 టోర్నీ చరిత్రలో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచేందుకు రషీద్‌తో పాటు హార్దిక్ పాండ్యాకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి.ప్రస్తుతం రషీద్ షార్జాలో జరుగుతున్న యూఏఈ ట్రై సిరీస్‌లో అదరగొడుతున్నాడు. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. యూఏఈ ట్రై సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్, యూఏఈతో పాటు పాకిస్తాన్ కూడా పాల్గొంటుంది.ఇంతకీ ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో ఎన్ని సార్లు జరిగింది..?కాగా, ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు రెండు సార్లు జరిగింది. త్వరలో జరుగబోయేది మూడో ఎడిషన్ అవుతుంది. 2016లో ఈ ఖండాంతర టోర్నీని తొలిసారి పొట్టి ఫార్మాట్లో (బంగ్లాదేశ్) నిర్వహించారు. ఆతర్వాత 2022లో రెండో సారి జరిగింది (యూఏఈలో). తొలి ఎడిషన్‌లో భారత్ విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్‌లో శ్రీలంక ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఆసియా కప్ యూఏఈ వేదికగా జరుగనుంది. -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రషీద్ ఖాన్.. సరికొత్త చరిత్ర
ఆఫ్ఘనిస్టాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ దిగ్గజం టిమ్ సౌథీని వెనక్కు నెట్టాడు.నిన్న (సెప్టెంబర్ 1) యూఏఈతో (ముక్కోణపు సిరీస్) జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీయడంతో ఈ ఘనత సాధించాడు. సౌథీ 126 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు తీయగా.. రషీద్ 98 మ్యాచ్‌ల్లోనే అతన్ని అధిగమించాడు. ప్రస్తుతం రషీద్ ఖాతాలో 165 వికెట్లు ఉన్నాయి.అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 బౌలర్ల జాబితాలో రషీద్, సౌథీ తర్వాతి స్థానాల్లో ఐష్ సోధి (150), షకీబ్ అల్ హసన్ (149), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (142), ఆదిల్ రషీద్ (135), వనిందు హసరంగ (131), ఆడమ్ జంపా (130), మార్క్ అదైర్ (128), ఎషాన్ ఖాన్ (127) ఉన్నారు.ఈ విభాగం టాప్-10లో ఒక్క భారత బౌలర్ కూడా లేకపోవడం విచారకరం. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్షదీప్ సింగ్ (99) ఉన్నాడు. అర్షదీప్ తర్వాతి స్థానాల్లో యుజ్వేంద్ర చహల్ (96), హార్దిక్ పాండ్యా (94) టాప్-3లో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో యూఏఈపై ఆఫ్ఘనిస్తాన్ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సెదీఖుల్లా అటల్ (40 బంతుల్లో 54), ఇబ్రహాం జద్రాన్ (40 బంతుల్లో 63), అజ్మతుల్లా (12 బంతుల్లో 20 నాటౌట్), కరీమ్ జనత్ (10 బంతుల్లో 23 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ.. రషీద్ ఖాన్ (4-0-21-3), షరాఫుద్దీన్ అష్రఫ్ (4-0-24-3) ధాటికి 150 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ ముహమ్మద్ వసీం (37 బంతుల్లో 67), వికెట్‌కీపర్ రాహుల్ చోప్రా (35 బంతుల్లో 52 నాటౌట్) యూఏఈని గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ మిగతా వారి నుంచి వారికి సహకారం లభించలేదు.ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇదే తొలి విజయం. యూఏఈ ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. ఈ టోర్నీలో మరో జట్టు పాక్ వరుసగా రెండు విజయాలు (ఆఫ్ఘన్, యూఏఈ) సాధించింది. ఇవాళ పాక్, ఆఫ్ఘనిస్తాన్ మరోసారి తలపడనున్నాయి. -
శవాలదిబ్బగా అఫ్ఘనిస్తాన్!
భారీ భూకంపంతో అఫ్ఘనిస్తాన్ అతలాకుతలం అయ్యింది. ఇప్పటిదాకా 800 మందికి పైనే మరణించినట్లు అల్జజీరాతో పాటు పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్ దానిని ధృవీకరించింది. భూకంపంతో వేల మంది గాయపడినట్లు(1500 మందికిపైనే) అక్కడి పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. శిథిలాల తొలగింపు సహాయక చర్యలు కొనసాగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.యూఎస్ జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1, 2025 రాత్రి(ఆదివారం 11.47గం. సమయంలో) సమయంలో హిందూ కుష్ పర్వత ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. గంట వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించినట్లు తెలుస్తోంది. భూకంప కేంద్రం పాకిస్థాన్ సరిహద్దులోని నంగర్హార్ ప్రావిన్స్ జలాలాబాద్ సమీపంలో 10 కి.మీ లోతులో నమోదైనట్లు తెలుస్తోంది. #BREAKING : Afghanistan’s government spokesman Mawlawi Zabihullah Mujahid says the death toll now stands at 800, with 2,500 injured#Afghanistan #AfghanistanEarthquake #earthquake #afghanistanquake pic.twitter.com/Tx18Rv0xYd— upuknews (@upuknews1) September 1, 2025అఫ్గానిస్థాన్‌లోని కునార్, నోరిస్థాన్, నంగర్హార్ ప్రావిన్స్‌లు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయి. వారి జీవితం అగమ్యగోచరంగా మారింది. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాలపాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉంది. అసమర్థ తాలిబన్ ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా లేదు. ఈ సమయంలో కునార్ ప్రజలకు సాయం అత్యవసరం. అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలి. అవసరమైన ఆహారం అందించి.. ఆశ్రయం కల్పించాలి. ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి అని వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘఫ్పారీ ఓ పోస్టు పెట్టారు. ఘోర విపత్తు కారణంగా కునార్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. పలు కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. భూకంప తీవ్రతకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బాధితులకు అత్యవసర సహాయం అవసరమని పలువురు పోస్టులు పెడుతున్నారు.భూకంపం కారణంగా పలువురు మరణించారనే వార్త విని తాను చలించిపోయానని క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఓ పోస్టు చేశారు. బాధితుల కుటుంబం కోసం ప్రార్థిస్తున్నానని.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొండ ప్రాంతాల్లోని జనావాసాల్లో భూకంపం రావడంతో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు స్పష్టమవుతోంది. భారీ పరిమాణంలోని కొండ రాళ్లు దొర్లిపడడంతో.. సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నట్లు సమాచారం.🇦🇫 Report from #Afghanistan: More than 500 dead ‼️ and 1,000 injured ‼️ following the earthquake in the eastern part of the country https://t.co/T1zF4VkEw0— War & Political News (@Elly_bar_bkup) September 1, 2025 Deadly Earthquake in Afghanistan 🚨▪️ 622 dead▪️ 1,300+ injured▪️ Remote villages destroyedRescue teams struggle to reach survivors near Jalalabad.Afghanistan faces tragedy on top of conflict. 💔#Afghanistan #Earthquake pic.twitter.com/xSunHdB40A— Epoch - Global (@epochglobalnews) September 1, 2025మరోవైపు.. ఈ ప్రకంపనలు 350 కిలోమీటర్ల దూరంలోనూ ప్రభావం చూపించాయి. ఫలితంగా.. ఉత్తర భారతదేశం, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. అఫ్గనిస్తాన్‌లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి, ముఖ్యంగా హిందూ కుష్ ప్రాంతం భౌగోళికంగా చురుకుగా ఉండటంతో ఇది సాధారణమని నిపుణులు చెబుతున్నారు. -
అఫ్గాన్‌లో భారీ భూకంపం..
-
అఫ్గాన్‌ను అల్లాడించిన భూ విలయం
కాబూల్: అఫ్గానిస్తాన్ అల్లాడింది. దేశ తూర్పు ప్రాంతంలోని కూనూర్, నాన్‌ఘర్ ప్రావిన్సుల్లో ఆదివారం సంభవించిన భారీ భూకంపం ధాటికి గ్రామాలకు గ్రామాలే నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకు పోయాయి. 800 పై చిలుకు మంది మృత్యువాత పడగా 2,500 మందికి పైగా గాయపడ్డారు. భూకంపం సంభవిస్తూనే ప్రభావిత ప్రాంతాల్లోని జనమంతా హాహాకారాలు చేస్తూ ఇళ్లనుంచి బయటికి పరిగెత్తే ప్రయత్నం చేశారు. కానీ చాలామంది నిస్సహాయంగా శిథిలాల కింద చిక్కుబడ్డారు. మృతదేహాలను, గాయపడ్డవారిని సహాయక సిబ్బంది వెలికి తీస్తూ మార్చురీలకు, ఆస్పత్రులకు తరలిస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతులు, క్షతగాత్రుల సంఖ్య భారీగా పెరిగే ఆస్కారముంది. కునార్, నంగర్హార్తో పాటు రాజధాని కాబూల్ నుంచి కూడా ప్రభుత్వ తదితర బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలకు ఉపక్రమించినట్టు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి షరాఫత్ జమాన్ తెలిపారు. చాలా ప్రాంతాల్లో మృతుల సంఖ్య ఇంకా తెలియాల్సి ఉందని తాలిబన్ సర్కారు ప్రధాన అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అన్నారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న అతి పెద్ద పట్టణమైన జలాలాబాద్ కూడా భూకంపానికి బాగా ప్రభావితమైంది. అది అఫ్గాన్లోకెల్లా అతి పెద్ద వర్తక కేంద్రాల్లో ఒకటి. పాక్‌కు సమీపంలో ఉండటంతో సరుకులు తదితరాల లభ్యత అత్యధికంగా ఉండటమే అందుకు కారణం. ఆదివారం అర్ధరాత్రి 11.47 గంటలకు నాన్‌ఘర్ ప్రావిన్స్‌లో జలాలాబాద్‌కు ఈశాన్యాన 27 కి.మీ. దూరంలో 6.0 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రం భూ ఉపరితలానికి కేవలం 8 కి.మీ. లోతులో ఉండటంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని అమెరికా జియాలాజికల్ సర్వే పేర్కొంది. దాని తాలూకు ప్రకంపనలు ఏకంగా అసోం దాకా కనిపించాయి! తక్కువ లోతులో వచ్చే భూకంపాలు అత్యంత ప్రమాదకరంగా మారుతుంటాయి. 2023 అక్టోబర్ 7న 6.3 తీవ్రతతో కూడిన భూకంపం అఫ్గాన్‌ను వణికించింది. ఆ ఉత్పాతానికి 4,000 మందికి పైగా బలయ్యారు. 🚨BREAKING… A 6.0 magnitude earthquake has just struck north of Bāsawul, Afghanistan in the Hindu Kush region. The quake was shallow (6.2 mi) and felt across a wide region. “Strong shaking” reported near Jalalabad. DEVELOPING… #earthquake #Jalalabad #Afghanistan #Basawul pic.twitter.com/xW6CKcFzRE— Steve Norris (@SteveNorrisTV) August 31, 2025కొండల్లో కల్లోలంభూకంపం సంభవించిన తూర్పు అఫ్గాన్ దాదాపుగా కొండ ప్రాంతమే. పైగా అత్యధిక ప్రాంతాలు చేరరానంత దుర్గమమైనవే! నేటికీ టెలిఫోన్ తదితర మౌలిక సమాచార వ్యవస్థలకు కూడా నోచుకోనివే. కునార్ ప్రాంతం, సమీపంలోని నుర్గల్ జిల్లా భూకంపానికి అత్యధికంగా నష్టపోయాయి.కాళరాత్రి.. కన్నీటి వెతలు– ‘‘భారీ శబ్దంతో ఇంట్లో వాళ్లమంతా ఒక్కసారిగా మేల్కొన్నాం. నా పిల్లల్లో ముగ్గురిని వెంటనే బయటికి చేరేశాను. మిగతా వాళ్లను, కుటుంబీకులను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే పైకప్పు విరిగి నేరుగా నాపై పడింది. ఆ శిథిలాల్లో సగం దాకా కూరుకుపోయా. చుట్టుపక్కల వాళ్లు ధైర్యం చిక్కబట్టుకుని తిరిగొచ్చి బయటికి లాగేదాకా నరకయాతన అనుభవించా. నా భార్య, ఇద్దరు పిల్లలు భూకంపానికి బలైనట్టు తెలిసి గుండె బద్దలైంది’’ అని మజా దారా గ్రామానికి చెందిన సాదిఖుల్లా బావురుమన్నాడు. మూగవోయిన ఫోన్లు...అఫ్గాన్‌లో అత్యధికం తక్కువ ఎత్తులో ఉండే నిర్మాణాలే. అందులోనూ కాంక్రీట్, నాటు ఇటుకతో చేసినవే. ప్రమాద తీవ్రత పెరగడానికి ఇది కూడా కారణమేనని చెబుతున్నారు. దేశవ్యాప్తంగాఅసలే అంతంతమాత్రంగా ఉండే టెలిఫోన్ తదితర సమాచార వ్యవస్థలు భూకంపం దెబ్బకు పూర్తిగా కుప్పకూలాయి. దాంతో స్వదేశంలోని తమవారి క్షేమ సమాచారం తెలియక ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని వేలాది అఫ్గాన్లు అల్లాడుతున్నారు. 🎦 | 🇦🇫 Footage:At least 20 are dead (as for local sources) from a powerful earthquake in #Afghanistan a couple of hours ago. pic.twitter.com/FS8s9z8ZrG— TGA Media (@TGAMedia_) September 1, 2025భారత్ ఆపన్నహస్తంఅఫ్గాన్ భూకంప విలయంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ఈ ఆపత్సమయంలో అన్నివిధాలా మానవీయ సాయం అందించేందుకు భారత్ సిద్ధమని ప్రకటించారు. ‘‘పొరుగు దేశంలో జరిగిన ప్రాకృతిక విపత్తు, అది చేకూర్చిన అపార ప్రాణ నష్టం చూసి తీవ్ర ఆవేదనకు లోనయ్యా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. ఇప్పటికే 15 టన్నుల ఆహార సామగ్రి తదితరాలను కాబూల్‌లోని భారత హై కమిషన్ కార్యాలయం నుంచి కునార్‌కు పంపినట్టు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడించారు. -
మెరిసిన సల్మాన్, రవూఫ్
షార్జా: ఆసియాకప్ టి20 టోర్నమెంట్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ముక్కోణపు టోర్నీలో పాకిస్తాన్ శుభారంభం చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ) పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ 39 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెపె్టన్ సల్మాన్ ఆగా (36 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సాహిబ్జాదా ఫర్హాన్ (21; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ఫఖర్ జమాన్ (20; 1 ఫోర్, 1 సిక్స్), మొహమ్మద్ నవాజ్ (21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా... రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా, ముజీబ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ జట్టు 19.5 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రషీద్ ఖాన్ (16 బంతుల్లో 39; 1 ఫోర్, 5 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... రహా్మనుల్లా గుర్బాజ్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) కాస్తా పోరాడాడు. మొహమ్మద్ నబీ (3), అజ్మతుల్లా (0), కరీమ్ జనత్ (0), ఇబ్రహీమ్ జద్రాన్ (9) విఫలమవడంతో అఫ్గాన్‌కు పరాజయం తప్పలేదు. ఒక దశలో 97 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును రషీద్ ఆదుకున్నాడు. ఎడాపెడా సిక్స్‌లు బాదుతూ ప్రత్యర్థిని భయపెట్టాడు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 4 వికెట్లు పడగొట్టగా... షాహీన్ షా అఫ్రిది, మొహమ్మద్ నవాజ్, ముఖీమ్ తలా రెండు వికెట్లు తీశారు. -
అఫ్గానిస్తాన్ క్రికెట్ కీలక నిర్ణయం.. ఆరేళ్ల తర్వాత అతడికి పిలుపు
ఆసియాకప్-2025కు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఐర్లాండ్ దిగ్గజం జాన్ మూనీని ఏసీబీ నియమించింది. దీంతో మళ్లీ ఆరేళ్ల తర్వాత అఫ్గాన్ కోచింగ్ సెటప్‌లోకి మూనీ తిరిగొచ్చాడు.ఈ ఐరీష్ మాజీ పేసర్ ఇంతకుముందు 2018 నుండి 2019 వరకు అఫ్గాన్ ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఆ తర్వాత షేన్ మెక్‌డెర్మాట్ అఫ్గాన్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగాడు. అతడు ఇటీవలే తన పదవికి రాజీనామా చేసి పాకిస్తాన్ ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో అఫ్గాన్ క్రికెట్ మళ్లీ మూనీకి పిలుపునిచ్చింది. 43 ఏళ్ల మూనీ ఐర్లాండ్ తరపున 91 మ్యాచ్‌లు ఆడాడు. 2007, 2011, 2015 వన్డే వరల్డ్‌కప్‌లు ఆడిన ఐర్లాండ్ జట్టులో అతడు భాగంగా ఉన్నాడు. అదేవిధంగా రెండు టీ20 ప్రపంచకప్‌లలో కూడా ఐరీష్‌కు అతడు ప్రాతినిథ్యం వహించాడు. అతడు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నుంచి లెవల్ 3, 2, 1 కోచింగ్ సర్టిఫికెట్లను కలిగి ఉన్నాడు.ఇక అఫ్గాన్ జట్టు విషయానికి వస్తే.. ఆసియాకప్-2025కు సన్నద్దమవుతోంది. అంతకంటే ముందు యూఏఈ-పాకిస్తాన్లతో రషీద్ సేన ట్రైసిరీస్ ఆడనుంది. ఇప్పటికే యూఏఈకు చేరుకున్న అఫ్గాన్ జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.కాగా ఆసియాకప్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఇటీవలే ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నాయకత్వం వహించనున్నాడు. రషీద్ డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ వ్యవహరించనున్నాడు. కాగా సెప్టెంబర్ 9న అబుదాబిలో జరిగే టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో అఫ్గానిస్తాన్ తలపడనుంది.ఆసియాకప్-2025కు అఫ్గాన్ జట్టు ఇదేరషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహమాన్, అల్లాహ్ గజన్ఫార్. నూర్ అహ్మద్, ఫారిక్ అహ్మద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీ -
అఫ్గనిస్తాన్‌లో బస్సు దగ్ధం 17 మంది పిల్లలు సహా 73 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు.. ట్రక్కు, మోటార్ సైకిల్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి దగ్ధం అయ్యింది. ఈ ప్రమాదంలో 17 మంది పిల్లలు సహా 73 మంది మరణించారు. ఇరాన్ నుంచి బహిష్కరణకు గురైన అఫ్గాన్ వలసదారులతో నిండిన బస్సు మంగళవారం కాబూల్‌కు బయలుదేరింది. సరిహద్దు దాటిన తరువాత హెరాత్ ప్రావిన్స్‌లో ప్రమాదానికి గురైంది. బస్సులో ఉన్న ప్రతి ఒక్కరూ మరణించారు. ఇతర వాహనాల్లో ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు. బస్సు డ్రైవర్ మితిమీరిన వేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందని హెరాత్ పోలీçÜులు ప్రాథమిక విచారణలో తేల్చారు. దశాబ్దాల సంఘర్షణ కారణంగా రోడ్లు దెబ్బతిన్న అఫ్గానిస్తాన్‌లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. ఇక 1970ల నుంచి లక్షలాది మంది ఆఫ్గన్లు ఇరాన్, పాకిస్తాన్లకు పారిపోయారు. 1979లో సోవియట్ దండయాత్ర సమయంలో, 2021లో తాలిబన్లు దేశాన్ని తమ వశం చేసకున్న తరువాత ఈ వలసలు పెద్ద ఎత్తున కొనసాగాయి. ఇరాన్లో క్రమక్రమంగా అఫ్గాన్ వ్యతిరేక భావన పెరిగింది. శరణార్థులు చాలాకాలంగా వ్యవస్థాగత వివక్షను ఎదుర్కొంటున్నారు. పత్రాలు లేని అఫ్గాన్లు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలంటూ మార్చిలోనే హెచ్చరించిన ఇరాన్ జూలై వరకు ఇచ్చిన గడువు కూడా పూర్తయ్యింది. జనవరి నుంచి 15 లక్షల మందికి పైగా అఫ్గాన్లు ఇరాన్‌ను వదిలి వెళ్లారని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తెలిపింది.వీరిలో చాలా మంది తరతరాలుగా ఇరాన్లో నివసిస్తున్నవారు కావడం గమనార్హం. జూన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన స్వల్పకాలిక యుద్ధం తర్వాత జాతీయ భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో.. లక్షలాది మంది అఫ్గాన్లను ఇరాన్ అధికారులు బలవంతంగా తిప్పి పంపించారు. భద్రతా వైఫల్యాలతో జరిగిన ఇజ్రాయెల్ దాడులకు అఫ్గాన్లను బలిపశువులు చేస్తున్నారనేది విమర్శకుల వాదన. ఎలాంటి పత్రాలు లేని అఫ్గాన్లను పాకిస్తాన్ కూడా వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల నుంచి తిరిగి అఫ్గానిస్తాన్‌కు వచి్చన శరణార్థుల సంఖ్య లక్షల్లో ఉంది. -
బస్సులో మంటలు.. 71 మంది మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆఫ్ఘన్లో వలసదారులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. బస్సుకు మంటలు అంటుకోవడంతో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. ఇటీవల ఆప్ఘన్ వలసదారులు ఇరాన్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీంతో, వారంతా స్వదేశానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వలసదారులతో వెళ్తున్న బస్సు, మోటారు సైకిల్ ఢీకొన్నాయి. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో సహా స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 17 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.🚨BREAKING: At least 71 people died in Afghanistan’s Herat province when a bus carrying deported migrants crashed into a truck and a motorcycle. pic.twitter.com/HdQxk36CzC— World Source News 24/7 (@Worldsource24) August 19, 2025ఇక, ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందారు. నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. కాగా.. అఫ్గాన్ శరణార్థులపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్, పాకిస్తాన్ (Pakistan) భారీ డిపోర్టేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు 1.5 మిలియన్ల మందికి పైగా ఆఫ్ఘన్లు ఇరాన్, పాకిస్తాన్ నుంచి బలవంతంగా స్వదేశానికి తిరిగివచ్చారు. మరోవైపు.. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.⚡️🇦🇫 At least 71 people including 17 children were killed when a bus carrying deported migrants collided with a truck and motorcycle in Herat province, Afghanistan, before catching fire. pic.twitter.com/vapzIvuqPO— Lala News & Stuff (@lala515711) August 19, 2025 -
Asia Cup 2025: అఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రషీద్ ఖాన్
ఆసియాకప్-2025 కోసం అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు తమ సన్నాహాకాలను ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ కోసం 22 మంది సభ్యులతో కూడిన తమ ప్రాథమిక జట్టును అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ ఎంపికయ్యాడు.మహ్మద్ నబీ, కరీం జనత్, గుల్బీద్దన్ నైబ్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. అదేవిధంగా అబ్దుల్లా అహ్మద్జాయ్, బషీర్ అహ్మద్, వఫియుల్లా తారఖిల్ వంటి యువ సంచలనాలకు అఫ్గాన్ సెలక్టర్లు అవకాశమిచ్చారు.కాగా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు అఫ్గానిస్తాన్ జట్టు షార్జా వేదికగా యూఏఈ, పాకిస్తాన్లతో ట్రై సిరీస్ ఆడనుంది. అంతకంటే ముందు యూఏఈకు అఫ్గాన్ జట్టు వెళ్లనుంది. అక్కడ రెండు వారాల పాటు స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో అఫ్గాన్ జట్టు పాల్గోనుంది.ఆ తర్వాత ఆసియాకప్‌నకు కోసం 15 మంది సభ్యుల ప్రధాన జట్టును ఏసీబీ ఖరారు చేయనుంది. కాగా అఫ్గాన్-యూఏఈ- పాక్ ట్రైసిరీస్ ఆగస్టు 29న ప్రారంభమై.. సెప్టెంబర్ 7న ముగియనుంది. అనంతరం సెప్టెంబర్ 9 నుంచి ఆసియాకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో అఫ్గాన్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా హాంకాంగ్‌తో తలపడనుంది.అఫ్గానిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదిఖుల్లా అటల్, వఫివుల్లా తారఖిల్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, మొహమ్మద్ ఇషాక్, రషీద్ ఖాన్ (కెప్టెన్), మహ్మద్ నబీ, నంగ్యాల్ ఖరోటీ, షరాఫుద్దీన్ అష్రఫ్, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, ముజీబ్ జద్రాన్, అమీర్ హంజా గజన్ఫర్, నూర్ అహ్మద్,ఫజల్ హక్ ఫరూఖీ, నవీన్-ఉల్-హక్, ఫరీద్ మాలిక్, సలీమ్ సఫీ, అబ్దుల్లా అహ్మద్జాయ్, బషీర్ అహ్మద్. -
Viral Video: తండ్రి బౌలింగ్‌ను చెడుగుడు ఆడుకున్న తనయుడు
ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ, అతని పెద్ద కొడుకు హసన్ ఐసాఖిల్ (18) ష్పగీజా క్రికెట్ లీగ్ 2025లొ ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఈ లీగ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో తండ్రి నబీ బౌలింగ్‌ను కొడుకు హసన్ ఐసాఖిల్ చెడుగుడు ఆడుకున్నాడు. తండ్రి బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే హసన్ ఐసాఖిల్ భారీ సిక్సర్‌గా మలిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంది. SON HITTING FATHER FOR A SIX. - Hassan Eisakhil welcomed his father Mohammad Nabi with a six. 😄pic.twitter.com/2T1gzzXkzq— Mufaddal Vohra (@mufaddal_vohra) July 22, 2025ఈ వీడియోకు నెటిజన్లను నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. 40 ఏళ్ల నబీ కొడుకు హసన్ ఐసాఖిల్‌తో కలిసి అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ఆరాటపడుతున్నాడు. హసన్ గతేడాది అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించి జాతీయ జట్టు నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు. హసన్ రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తాడు. హసన్ ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడు. హసన్ విధ్వంసకర శతకంహసన్ గతేడాది తొలిసారి వార్తల్లో నిలిచాడు. కాబుల్ ప్రీమియర్ లీగ్ 2024లో 45 బంతుల్లో 150 పరుగులు చేసి రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో హసన్ రికార్డు స్థాయిలో 19 సిక్సర్లు కొట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్లో మరో శతకంహసన్ ఇదే ఏడాది స్వదేశంలో జరిగిన ఓ ఇంటర్ రీజియన్ టోర్నీలో (మెర్వైస్ నికా రీజినల్ 3-డే ట్రోఫీ) భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఆ టోర్నీలో హసన్.. బాంద్-ఎ-అమీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 235 బంతుల్లో 143 పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో హసన్‌కు ఇది తొలి సెంచరీ.కొడుకు కోసం ఇంకా కొనసాగుతున్న నబీ40 ఏళ్ల నబీ వయసు పైబడినా కొడుకు కోసం అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా కొనసాగుతున్నాడు. టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన నబీ.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆడుతూనే ఉన్నాడు. 2009లో వన్డేల్లో, 2010లో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన నబీ.. 173 వన్డేలు, 132 టీ20లు ఆడి 2 సెంచరీలు, 23 అర్ద సెంచరీల సాయంతో దాదాపు 6000 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 273 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం నబీకి జాతీయ జట్టు తరఫున పెద్దగా అవకాశాలు రాకపోయిన ప్రపంచవాప్తంగా జరుగుతున్న ప్రైవేట్ టీ20 లీగ్‌ల్లో బిజీగా ఉన్నాడు. నబీ 2017 నుంచి గతేడాది వరకు ఐపీఎల్‌లోనూ అలరించాడు. -
ఆరేళ్ల పాపను పెళ్లాడాడు.. మూడేళ్లు ఆగాలన్న సర్కారు!
తాలిబన్ల అఫ్గానిస్తాన్‌లో బాల్య వివాహాలు నానాటికీ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఆ ఘోరాల పరంపరకు పరాకాష్ట వంటి ఉదంతం తాజాగా దక్షిణ అఫ్గాన్‌లో చోటుచేసుకుంది! 45 ఏళ్ల వయసున్న ఓ ప్రబుద్ధుడు ఆరేళ్ల పాపను పెళ్లాడాడు. కాసుల కక్కుర్తితో తండ్రే ఆ చిన్నారిని పెళ్లి పేరిట ఇలా సదరు కామాంధునికి కట్టబెట్టాడట. ఇదే ఘోరమంటే, దీనిపై తాలిబన్ సర్కారు మరీ అరాచకంగా స్పందించింది. ‘నువ్వు చేసిన పని మమ్మల్ని షాక్‌కు గురి చేసింది. అంత చిన్న వయసు పాపను పెళ్లాడకుండా ఉండాల్సింది. కనీసం తనకు తొమ్మిదేళ్లు వచ్చేదాకా, అంటే మరో మూడేళ్ల దాకా కాపురానికి తీసుకెళ్లడానికి వీల్లేదు’ అని సదరు నవ వరుడిని ఆదేశించింది. అతనితో పాటు పాప తండ్రిని లాంఛనంగా అరెస్టు చేసింది. అమెరికాకు చెందిన అఫ్గాన్ సంస్థ ఏఎంయూ.టివి ఈ మేరకు పేర్కొంది. మనవాడికి అప్పటికే రెండు పెళ్లిళ్లయ్యాయట. పాప ప్రస్తుతానికి తల్లి దగ్గరే ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఇదెక్కడి పాడు పని అంటూ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. చిన్న పాప పక్కన పెళ్లి దుస్తుల్లో ఉన్న వరుని ఫొటోలు వైరల్‌గా మారాయి. మానవ హక్కుల సంఘాలు కూడా తాలిబన్ల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. రూపురేఖలను బట్టి రేటు! అఫ్గాన్‌లో అమల్లో ఉన్న దుర్మార్గమైన వాల్వార్ సంప్రదాయం మేరకు ఈ పెళ్లి జరిగింది. ఇందులో వధువు శరీరాకృతి, చదువు తదితరాల ఆధారంగా తనకు ధర నిర్ణయిస్తారు. అది చెల్లించిన వాడికిచ్చి పెళ్లి చేస్తారు. 2021లో తాలిబన్లు అఫ్తాన్ను హస్తగతం చేసుకున్న నాటినుంచీ బాల్య వివాహాలు పెచ్చరిల్లాయి. దుర్భర దారిద్య్రం దీనికి తోడైంది. పిల్లలను పెంచలేక తల్లిదండ్రులు ఇలా ఆడపిల్లలను పెళ్లి సాకుతో అయినకాడికి అమ్ముకుంటున్నారు. దేశంలో అమ్మాయిలకు అసలు కనీస వివాహ వయసు నిబంధనే లేదు. అమ్మాయిల చదువుపై నిషేధం విధించడంతో అఫ్గాన్‌లో కొన్నేళ్లుగా బాల్య వివాహాలు దేశంలో ఏకంగా 45 శాతానికి పెరిగినట్టు ఐరాస నివేదిక పేర్కొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా.. మీకు ఇదే మా సందేశం: తాలిబన్లు
మార్పును బట్టే సమాజం ముందుకు పోతోంది. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం మతం, ఆచార వ్యవహారాల పేరిట వెనక్కి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జాబితాలో అఫ్గనిస్తాన్‌కు చోటు ఉంది. అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాలతో వీధుల వెంట విచ్చలవిడిగా తిరుగుతుండడం, విద్యపై నిషేధం, మహిళలపై అక్కడ అమలు చేస్తున్న కఠిన ఆంక్షల సంగతి సరేసరి. ఇలాంటి తరుణంలో తాలిబన్ల నుంచి కలలో కూడా ఊహించని వీడియో ఒకటి విడుదలై ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓపెన్ చేయగా.. ముసుగులో ఉన్న కొందరు వ్యక్తుల చుట్టూ ఏకే 47 తుపాకులతో, మారణాయుధాలతో తాలిబన్లు కనిపిస్తారు. అమెరికా ఇదే మా సందేశం అంటూ ఓ వ్యక్తి చెబుతున్నాడు. ఆ వెంటనే కింద ఉన్న వ్యక్తికి ఉన్న ముసుగు తొలగించగానే.. చిరునవ్వుతో Welcome to Afghanistan అంటూ ఆహ్వానిస్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అఫ్గన్ నేలపై ఉన్న ప్రకృతి సుందర దృశ్యాలు, అక్కడి ఆహారం.. ఇలా అన్నింటినీ అందులో చూపించారు. పాశ్చాత్య టూరిస్టులు అక్కడి సంప్రదాయ పఠాన్ దుస్తులను ధరించి.. స్థానిక వంటలు ఆస్వాదిస్తూ, జలపాతాల్లో ఈతలు కొడుతూ, స్థానికులతో నవ్వుతూ కనిపిస్తారు. ఇవన్నీ మాంచి ఫన్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగుతాయి. ఈ వీడియోను తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదు. కానీ, తాలిబన్లకు సంబంధించిన పేజీల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. సాధారణంగా.. ఉగ్రవాదులు విదేశీయులను అపహరించి.. వాళ్ల పీకలు కోస్తూ వీడియోలు తీసి బయటకు వదలడం గతంలో జరిగేది. ఆ ఫార్ములానే ఇప్పుడు టూరిజం ప్రమోషన్ కోసం తాలిబన్లు వాడుకుంటున్నారు. మీ నుంచి(అమెరికా) మేం స్వేచ్ఛను దక్కించుకున్నాం. ఇప్పుడు మీరు మా దేశానికి అతిథులుగా రండి అంటూ ఆ వీడియోలో చెప్పడం ఉంది.ప్రశాంతమైన వాతావరణం, అందులో విదేశీ పర్యాటకులతో స్థానికుల సందడి.. పైగా డమ్మీ తుపాకులపై Property of US Government అని రాసి ఉండడం వాళ్ల వెటకారాన్ని బయటపెట్టంది. వెరసి అఫ్గనిస్తాన్‌ను ఆతిథ్యభరిత దేశంగా చూపించే ప్రయత్నమిదనే విషయం ఈ వీడియోతో స్పష్టమవుతోంది. అయితే..అఫ్గనిస్తాన్‌ను అమెరికా బలగాలు వీడాక.. 2021 అగష్టులో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇది తాత్కాలికమే అయినప్పటికీ అంతర్జాతీయంగా ఆ ప్రభుత్వానికి గుర్తింపు దక్కకపోవడంతో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. పైగా ఈ దేశం ఇంకా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల జాబితాలోనే ఉండడంతో.. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పటికీ అఫ్ఘానిస్థాన్‌కి ప్రయాణించవద్దని హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఆ దేశం.ప్రపంచానికి తాము మారిపోయామని తాలిబన్లు చూపించిన ఈ ప్రయత్నం ఒకవైపు ఆశ్చర్యంతో పాటు వీడియోపై విమర్శలు అదే స్థాయిలో వెల్లువెత్తాయి. తుపాకులతో యుద్ధ నేరాల తరహాలో పర్యాటకాన్ని ప్రమోట్ చేయడంపై మండిపడుతున్నారు. పైగా వీడియోలలో ఎక్కడా ఒక మహిళను చూపించకపోవడమూ విమర్శలు తావిస్తోంది. ఇది అడ్వైర్టైజ్మెంటా? లేదంటే పర్యాటకులకు హెచ్చరికనా? అని గొణుక్కునేవారు లేకపోలేదు. The Taliban has released a tourism appeal video aimed at attracting American visitorsTheir message to Americans:"Now that we've liberated our homeland from you, you're welcome to come back as tourists or guests"Would you go? #Afganistan pic.twitter.com/iLRYXFAJjn— Nabila Jamal (@nabilajamal_) July 9, 2025‘‘తాలిబాన్లు ప్రపంచంపై ఓ ముద్ర వేసుకుని ఉన్నారు. అది చెరిపేసుకునేందుకు గత నాలుగేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, బాహ్య ప్రపంచానికి ఏం ఆకర్షణీయంగా కనిపిస్తుందో అంచనా వేయడంలో వాళ్లు తప్పటడుగే వేస్తున్నారు’’ అని ఓ విశ్లేషకుడు ఈ వీడియోపై అభిప్రాయపడ్డారు. ఇంతకీ అఫ్గన్ నేలపై ఏమున్నాయి.. కాబూల్ (Kabul) అఫ్గన్ రాజధాని నగరం. గార్డెన్స్ ఆఫ్ బాబర్, దారుల్ అమల్ ప్యాలెస్, నేషనల్ మ్యూజియం వంటి ప్రాచీన, సాంస్కృతిక స్థలాలు ఉన్నాయి. దారుల్ అమల్ ప్యాలెస్హెరాత్ (Herat)లో సుప్రసిద్ధ మసీదు, హెరాత్ సిటాడెల్ వంటి ఇస్లామిక్ శిల్పకళకు ప్రసిద్ధి చెందిన కట్టాడాలున్నాయి.మజార్-ఇ-షరీఫ్ (Mazar-e-Sharif) – Blue Mosque అనే అద్భుతమైన మసీదు ఇక్కడ ఉంది.బామియాన్ (Bamiyan) – బౌద్ధ విగ్రహాల అవశేషాలు, UNESCO వారసత్వ ప్రదేశం.కాందహార్ (Kandahar) – Mosque of the Sacred Cloak, అఫ్గాన్ చరిత్రకు కేంద్రం.జలాలాబాద్ (Jalalabad) – పచ్చని ఉద్యానవనాలు, ఆకర్షనీయమైన వాతావరణం.ఫైజాబాద్ (Faizabad) – హిందూ కుష్ పర్వతాల మధ్య ఉన్న ప్రకృతి అందాలు.బాండ్-ఎ-అమీర్ నేషనల్ పార్క్ (Band-e Amir National Park) – నీలి సరస్సులు, పర్వతాలు; అఫ్గాన్‌లో మొట్టమొదటి నేషనల్ పార్క్.పంజ్‌షీర్ లోయ (Panjshir Valley) – మంచుతో కప్పబడిన పర్వతాలు, నదులు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గం.బాల్క్ (Balkh) – పురాతన నగరం; రూమీ జన్మస్థలం, బౌద్ధ మరియు జరోస్త్రియన్ చరిత్రకు కేంద్రం.బిజినెస్ ఇన్సైడర్ గణాంకాల ప్రకారం.. 2021 చివరి నుంచి ఇప్పటిదాకా 14,500 మంది విదేశీయులు అఫ్గనిస్తాన్‌లో పర్యటించారు. అందులో రష్యా, చైనా, టర్కీ, మిడిల్ ఈస్ట్‌కు చెందిన వాళ్లు న్నారు. వీళ్లలో చాలామంది వ్లోగర్స్ ఉండడం గమనార్హం. వీళ్లు అక్కడి టూరిజాన్ని, ఆహారపు అలవాట్లను ప్రమోట్ చేసే వీడియోలనే ఎక్కువగా వదిలారు. -
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో పెను విషాదం
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో విషాదం నెలకొంది. ఆ దేశ అంతర్జాతీయ అంపైర్ బిస్మిల్లా జన్ షిన్వారీ 41 ఏళ్ల యుక్త వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రమైన అనారోగ్యం కారణంగా షిన్వారీ మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (జులై 8) ప్రకటించింది. ఏసీబీ షిన్వారీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. ఆఫ్ఘన్ క్రికెట్ గొప్ప సేవకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేస్తూ.. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.ACB's Condolence and Sympathy MessageACB’s leadership, staff, and entire AfghanAtalan family are deeply shocked and saddened by the demise of Bismillah Jan Shinwari (1984 - 2025), a respected member of Afghanistan’s elite umpiring panel.It is with deep sorrow that we share… pic.twitter.com/BiZrTOLe6m— Afghanistan Cricket Board (@ACBofficials) July 7, 20251984 మార్చిలో జన్మించిన షిన్వారీ 2017 డిసెంబర్లో అంతర్జాతీయ అంపైరింగ్ అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 మ్యాచ్‌లో అతను చివరి సారి అంపైరింగ్ చేశాడు. షిన్వారీ తన కెరీర్లో 60 అంతర్జాతీయ మ్యాచ్‌లకు (34 వన్డేలు, 26 టీ20లు) అంపైర్‌గా వ్యవహరించాడు. షిన్వారీ తన అంపైరింగ్ జర్నీని ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ వన్డే మ్యాచ్‌తో ప్రారంభించాడు.బాంబు పేలుళ్ల నుంచి బయటపడి..!షిన్వారీ 2020 అక్టోబర్‌లో నగర్హర్ ఫ్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుళ్లను బయటపడ్డాడు. ప్రాథమిక నివేదికల్లో షిన్వారీ మరియు అతని కుటుంబ సభ్యులు చాలా మంది మృతి చెందారని వార్తలు వచ్చాయి. అయితే అతనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చనిపోలేదని నిర్ధారించాడు. -
మళ్లీ పాక్ అబద్ధం.. అజార్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నడంటూ..
న్యూఢిల్లీ: భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకడైన మసూద్ అజార్ ఎక్కడున్నాడనే విషయంపై పాక్ మరోమారు కల్లబొల్లి కబుర్లు చెప్పింది. అజార్ గురించి తమకేమీ తెలియదని వివరించే ప్రయత్నం చేసింది. కాగా భారత్.. ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తున్న సమయంలో అజార్‌తో పాటు అతని సంస్థ జైష్-ఎ-ముహమ్మద్ ప్రధాన కార్యాయాన్ని టార్గెట్ చేసింది. తాజాగా పాక్ సంకీర్ణ నేత బిలావల్ భుట్టో జర్దారీ ఉగ్రవాది మసూద్ అజార్‌కు సంబంధించిన సమాచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మసూద్ అజార్ 2001లో భారత పార్లమెంటుపై దాడి, 26/11 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019లో జరిగిన పుల్వామా దాడిలో పాల్గొన్నాడు. 2019లో ఐక్యరాజ్యసమితి.. అజార్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. 1999లో కాందహార్ హైజాక్ తర్వాత ప్రయాణీకులకు బదులుగా అతన్ని విడుదల చేశారు. కాగా అజార్, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌లను అప్పగించాలని భారతదేశం ఎప్పటినుంచో పాకిస్తాన్‌ను డిమాండ్ చేస్తూ వస్తోంది. పాక్‌లో మసూద్ అజార్ తలదాచుకుంటున్నాడనే ఆధారాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ తనకేమీ తెలియదంటూ కల్లబొల్లి మాటలు చెబుతోంది.తాజాగా అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. జైష్ ఎ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఎక్కడ ఉన్నాడో పాకిస్తాన్‌కు తెలియదని, అతను ఇక్కడే ఉన్నాడని భావిస్తున్న భారత్.. అతనిని అరెస్టు చేయాలని అనుకుంటోందని అన్నారు. సయీద్ స్వేచ్ఛగా ఉన్నాడా? అని ఆయనను మీడియా అడగగా.. దీనికి ఖచ్చితంగా అవునని సమాధానం చెప్పలేమని, అతను పాకిస్తాన్ అదుపులో లేడని, తాము అతనిని అరెస్టు చేయలేకపోయామని, ఎక్కడున్నాడో కూడా గుర్తించలేకపోయామని కూడా భుట్టో అన్నారు. అయితే అతని గత చరిత్రను అనుసరించి చూస్తే, ప్రస్తుతం మసూద్ అజార్ ఆఫ్ఘనిస్తాన్‌లో తలదాచుకున్నడని భావిస్తున్నామని అన్నారు.పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్‌ల అనంతరం భుట్టో చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పలు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వాటిలో మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం, బహవల్పూర్లోని జైషే-ఏ-మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్నాయి. కాగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పీపీపీ చీఫ్ స్పందిస్తూ, పాకిస్తాన్‌కు సింధు నీటిని నిరాకరిస్తే యుద్ధానికి దిగుతామని హెచ్చరించారు. సింధు నది తమదేనని ఆయన అన్నారు. -
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ షాక్.. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్
ఇరాన్ సహా 12 దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పెద్ద షాకిచ్చారు. ఆ దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా ట్రావెల్ బ్యాన్(Travel Ban) విధిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. రాబోయే సోమవారం(జూన్ 9వ తేదీ) నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ జాబితాలో ఇరాన్(Trump Travel ban on Iran), లిబియా, అఫ్గనిస్తాన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, హైతీ, సోమాలియా, సూడాన్, యెమెన్, ఎరిత్రియా సైతం ఉన్నాయి. వీటితో పాటు మరో ఏడు దేశాలపైనా ఆయన తాత్కాలిక నిషేధం విధించారు. ఇందులో.. బూరుండి, వెనిజులా, క్యూబా, లావోస్, సియెరా లియోన్, టోగో, టుర్కిమేనిస్తాన్ ఉన్నాయి.ఈ మేరకు అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. వీసా పొందుతున్న వ్యక్తుల సమాచారాన్ని తగిన విధంగా పరిశీలించే అవకాశాలు తక్కువగా ఉండడం, అదే సయమంలో వీసా గడువు ముగిసినా కూడా తిరిగి వెళ్లకుండా అమెరికాలోనే ఉండిపోతుండడం.. ఈ రెండు కారణాల వల్ల భద్రతా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ప్రమాదకరమైన విదేశీ శక్తుల నుంచి అమెరికన్లను రక్షిస్తానని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. ఇప్పుడు ఆయన ఆ హామీని నిలబెట్టుకుంటున్నారు అని వైట్‌హౌజ్ అధికార ప్రతినిధి అబిగెయిల్ జాక్సన్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలో ఉండడం, ఇరాన్ క్యూబా దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రభుత్వాలే ప్రోత్సాహిస్తుండడం, చాద్.. ఎరిత్రియాలాంటి దేశాల పౌరులు వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోతుండడం.. లాంటి కారణాలతో ఈ నిషేధం విధిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ట్రంప్ ‘విదేశీ ఉగ్రవాదుల నుంచి అమెరికాను రక్షించడం కోసమే’ అంటూ ప్రకటించడం గమనార్హం.ఇదిలా ఉంటే.. అధ్యక్షుడిగా ట్రంప్ తన తొలి టర్మ్‌లోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. 2017లో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న ఇరాక్, ఇరాన్, సిరియా, సూడాన్, లిబియా, యెమెన్, సోమాలియా దేశాల పౌరులను అమెరికాలోకి రాకుండా నిషేధించారు. అయితే ఆ తర్వాత జో బైడెన్ అధికారంలోకి వచ్చాక 2021లో దానిని ఎత్తివేశారు. -
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
శత్రువుకి శత్రువు.. మిత్రుడు. అలాగే శత్రువుకి మిత్రుడు కూడా శత్రువే కదా!. కానీ, ఆ శత్రువునే తమ మిత్రుడిగా మార్చుకునేందుకు ఆఘమేఘాల మీద చైనా చేస్తున్న ప్రయత్నాలపై ‘‘అయ్యో.. పాపం’’ అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. సీపీఈసీ ప్రాజెక్టును ఆప్ఘనిస్థాన్ వరకు పొడిగించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం.పాక్, అఫ్గనిస్తాన్ ప్రతినిధుల మధ్య బుధవారం చైనా ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్యవర్తిత్వం వహించారు. ఈ భేటీ తర్వాత చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ఆ ఇరు దేశాలు దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. ఇందుకుగానూ ఇరు దేశాల పరస్పరం రాయబారులను నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. సీపీఈసీ ప్రాజెక్టు ఒప్పందం అదే విషయం. అయితే.. పాక్-అఫ్గన్ దేశాల మధ్య బంధం ఎంతటి ధృడమైందో యావత్ ప్రపంచానికి తెలుసు. అఫ్గనిస్తాన్‌ను ఉగ్రవాదుల స్వర్గధామంగా పాక్ తరచూ అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే అఫ్గన్ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. 2024 డిసెంబర్లో అఫ్గన్ పాక్టికా ప్రావిన్స్‌లో పాక్ వైమానిక దాడులు జరిపి 50 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘోరంలో మరణించింది ఎక్కువగా మహిళలు, పిల్లలే. అయితే తాము ఉగ్ర శిబిరాలపై దాడి చేశామంటూ పాక్ ప్రకటించుకోవడం గమనార్హం. ఈ పరిణామంపై అఫ్గన్ రగిలిపోతూ వస్తోంది. అలాంటిది.. ఇప్పుడు, ఈ ఇరు దేశాలు ఇప్పుడు దగ్గరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ చైనా ప్రకటించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ఎందుకీ తొందర?2021లో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. కానీ, ప్రపంచంలోని ఏ దేశం కూడా ఆ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. దీంతో అది తాత్కాలిక ప్రభుత్వంగానే కొనసాగుతోంది. అయితే చైనా, పాక్, రష్యా,ఇరాన్ దేశాలు సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నాయి. ఉగ్రవాద లిస్ట్ నుంచి ఆ దేశాన్ని తొలగించాయి. అయితే తాలిబన్ సర్కార్‌కు గుర్తింపు ఇవ్వకున్నా.. ఆ దేశం తరఫున తమ దగ్గర రాయబారికి అనుమతించింది చైనా. ఇక..భారత్ అఫ్గన్ తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. కానీ, వాళ్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు ప్రధానాంశంగా పలుమార్లు చర్చలు కూడా జరిపాయి. వాటిలో పురోగతి లేకున్నా.. మానవతా సాయం, అక్కడి పౌరుల బాగోగుల మీద దృష్టిసారిస్తూనే వస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడేందుకు దోహదపడ్డాయి. ఈ క్రమంలోనే.. దౌత్యపరమైన సమావేశాలు గత ఏడాది కాలంలో చాలానే జరిగాయి. ఈ ఏడాది జనవరిలో భారత విదేశాగం కార్యదర్శి విక్రమ్ మిస్రీ, తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముట్టాఖితో దుబాయ్‌లో భేటీ అయి కీలక అంశాలపై చర్చించారు. తాజాగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా అమీర్ ఖాన్ ముట్టాఖితో కీలక సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామం.. భారత్‌లో దౌత్యవేత్తల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కాన్సులర్ సేవలతో పాటు పలు నగరాల్లో వ్యాపార, విద్య, వైద్యం కోసం వచ్చే అఫ్గన్ పౌరులకు సేవల అనుమతికి అంగీకారం తెలపడం లాంటి నిర్ణయాలకు వేదికైంది. ఇది ఓర్వలేక.. కుటిల బుద్ధితో.. భారత్ వ్యతిరేకిస్తున్న సీపెక్‌లో అఫ్గన్‌ను భాగం చేసిందని, హడావిడిగా తాలిబన్లకు చైనా ప్రాధాన్యం ఇస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడు. -
కడపలో పట్టుబడ్డ ఆఫ్గనిస్తాన్ సిటిజన్స్
-
భారత్, అఫ్గాన్ స్నేహ గీతం
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా భారత్, అఫ్గానిస్తాన్ దేశాలు స్నేహగీతం పాడుకుంటున్నాయి. శతాబ్దాల క్రితం అఖండ భారత్‌లో భాగమైన రెండు దేశాల మధ్య మళ్లీ సంబంధాలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తాజాగా అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 2021 ఆగస్టులో తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను మరోసారి ఆక్రమించిన తర్వాత అక్కడి మంత్రితో అధికారికంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడడం ఖాయమని చెప్పడానికి ఇదొక నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. అఫ్గాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం పట్ల భారత్ ఇటీవల సానుకూల వైఖరి ప్రదర్శిస్తోంది. ఇది మున్ముందు పూర్తిస్థాయి వ్యూహాత్మక ద్వైపాక్షిక బంధంగా మారిన ఆశ్చర్యం లేదు. 1999లో ఉగ్రవాదులు భారత విమానాన్ని హైజాక్ చేసి, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌లో దించిన సంగతి తెలిసిందే. ప్రయాణికులను రక్షించడానికి సైనిక ఆపరేషన్ చేపట్టేందుకు భారత్ సిద్ధపడగా, అప్పటి తాలిబన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దాంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు చాలావరకు తెగిపోయాయి. తదనంతర పరిణామాల నేపథ్యంలో రెండు దేశాలు మళ్లీ ఒక్కటవుతున్నాయి. తాలిబన్ల రాకతో దెబ్బతిన్న సంబంధాలు శతాబ్దాల పాటు అఖండ భారత్‌లో అంతర్భాగంగా కొనసాగిన అఫ్గనిస్తాన్ 18వ శతాబ్దంలో ప్రత్యేక దేశంగా విడిపోయిందని చరిత్రకారులు చెబుతుంటారు. అమెరికా, రష్యా మధ్య ఆధిపత్య పోరుకు అఫ్గాన్ ఒక వేదికగా మారింది. చాలా ఏళ్లపాటు ఈ పోరాటం కొనసాగింది. 1973లో అఫ్గాన్ రిపబ్లిక్ దేశంగా అవతరించింది. అఫ్గాన్‌ను భారత్ అధికారికంగా గుర్తించింది. తమ మిత్రదేశంగా ప్రకటించింది. 1996 దాకా ఇరుదేశాల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తలేదు. సాధ్యమైనంత వరకు పరస్పరం సహకరించుకున్నాయి. 1996లో తాలిబన్ల ప్రాబల్యం మొదలైంది. పాకిస్తాన్ అండతో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అఫ్గాన్‌లో తాలిబన్ సర్కార్‌ను గుర్తించేందుకు భారత్ నిరాకరించింది. విమానం హైజాక్ ఘటన తర్వాత పరిస్థితి దిగజారింది. భారత్–అఫ్గాన్ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రంపై అల్‌ఖైదా ఉగ్రవాదుల దాడి, అఫ్గాన్‌పై అమెరికా యుద్ధం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా మద్దతుతో అఫ్గాన్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. 2021లో అమెరికా తన సేనలను అఫ్గాన్ నుంచి ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు గద్దెనెక్కారు. ఇన్నాళ్లూ రహస్యంగా చర్చలు! మళ్లీ అధికారంలోకి వచి్చన తాలిబన్లతో భారత ప్రభుత్వం తొలుత అంటీముట్టనట్లుగానే వ్యవహరించింది. వేచి చూసే ధోరణి అవలంబించింది. భారత్–అఫ్గాన్ మధ్య సంబంధాలు మానవతా సాయం, సాంస్కృతిక, క్రీడల రంగానికే పరిమితం అయ్యాయి. అఫ్గాన్ క్రికెటర్లు ఇండియాలో పోటీల్లో పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య చాలాసార్లు రహస్యంగా చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ, భారత్ వాటిని ఖండించింది. మరోవైపు సంబంధాలు మెరుగవుతున్న సూచనలు స్పష్టంగా కనిపించాయి. ఈ ఏడాది జనవరి 8వ తేదీన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ అఫ్గాన్ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సైతం అఫ్గాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ప్రాంతీయ ప్రయోజనాల కోణంలో అఫ్గాన్‌ను సన్నిహిత దేశంగా మార్చుకోవాలని భారత్ భావిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్‌కు ఇక ముసళ్ల పండుగే జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గత నెల 22వ తేదీన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడికి పాకిస్తాన్ నుంచే కుట్ర జరిగినట్లు భారత్ గుర్తించింది. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను అంతం చేయాలన్న లక్ష్యంతో ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను, వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. ఉగ్రవాదం పీడను శాశ్వతంగా వదిలించుకోవడంతోపాటు దక్షిణాసియాలో తనకు తలనొప్పిగా మారిన పాకిస్తాన్‌ను ఏకాకిని చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగానే అఫ్గానిస్తాన్‌కు స్నేహహస్తం అందిస్తోంది. రాబోయే రోజుల్లో భారత్, అఫ్గాన్ మరింత సన్నిహితంగా మారితే పాకిస్తాన్‌కు ఇక్కట్లు తప్పవని నిపుణులు అంటున్నారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, అఫ్గాన్ నిర్ణయానికి వచి్చనట్లు తెలుస్తోంది. పాక్–అఫ్గాన్ మధ్య రగులుతున్న విభేదాలు తాలిబన్లకు తండ్రి లాంటి పాకిస్తాన్, తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు రగులుతున్నాయి. ఇరుదేశాల మధ్య సరిహద్దు గొడవలు ముదురుతున్నాయి. తాలిబన్లు తమ చెప్పుచేతల్లో ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తుండడం పాకిస్తాన్ జీరి్ణంచుకోలేకపోతోంది. ఇస్లామాబాద్, కాబూల్ నడుమ సంబంధాలు వేగంగా పతనమవుతున్నాయి. తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) అనే సంస్థ పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూంక్వా, బలూచిస్తాన్ ప్రావిన్స్‌ల్లో ఇటీవల దాడులకు పాల్పడింది. టీటీపీకి తాలిబన్ సర్కారు అండదండలు ఉన్నాయని పాక్ ఆరోపిస్తోంది. అఫ్గాన్ గడ్డపైనుంచే టీటీపీ కార్యకలాపాలు సాగిస్తోందని మండిపడుతోంది. టీటీపీ దాడులకు ప్రతీకారంగా గత ఏడాది డిసెంబర్లో పాక్ సైన్యం అఫ్గాన్‌లోని పాక్తీకా ప్రావిన్స్‌లో వైమానిక దాడులు నిర్వహించింది. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని పాక్ ప్రకటించింది. ఈ దాడుల పట్ల తాలిబన్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మరోవైపు సరిహ ద్దుల్లో కంచె వేసేందుకు పాక్ ప్రయతి్నస్తుండగా, తాలిబన్లు అడ్డుకుంటున్నారు. బ్రిటిష్ పాలకులు నిర్ధారించిన డురాండ్ లైన్‌ను సరిహద్దు రేఖగా ఇస్లామాబాద్ గుర్తిస్తుండగా, అఫ్గాన్ అందుకు ఒప్పుకోవడం లేదు. మరోవైపు 2023లో వేలాది మంది అఫ్గాన్ శరణార్థులను పాక్ ప్రభుత్వం బలవంతంగా బ యటకు వెళ్లగొట్టింది. ఈ వ్యవహారంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. సాక్షి, నేషనల్ డెస్క్ -
భారీ సెంచరీతో కదంతొక్కిన స్టార్ క్రికెటర్ కొడుకు
ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ కొడుకు హసన్ ఐసాఖిల్ స్వదేశంలో జరుగుతున్న ఓ ఇంటర్ రీజియన్ టోర్నీలో (మెర్వైస్ నికా రీజినల్ 3-డే ట్రోఫీ) భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఈ టోర్నీలో అమో రీజియన్‌కు ఆడతున్న 18 ఏళ్ల హసన్.. బాంద్-ఎ-అమీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 235 బంతుల్లో 143 పరుగులు (సెకెండ్ ఇన్నింగ్స్) చేసి ఔటయ్యాడు. ఈ ఫార్మాట్లో హసన్‌కు ఇది తొలి సెంచరీ.ఈ మ్యాచ్‌లో హసన్ కష్టాల్లో ఉన్న తన జట్టును గట్టెక్కించి భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అంతకుముందు కమాల్ ఖాన్ (105), సెదిఖుల్లా పచా (77) కూడా సత్తా చాటడంతో అమో రీజియన్ తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేసింది.అనంతరం బాంద్-ఎ-అమీర్ జట్టు ఓపెనర్ హరూన్ ఖాన్ (109) సెంచరీతో ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులు చేయగలిగింది. అమో బౌలర్లలో సఖీ 4 వికెట్లు తీశాడు. 76 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అమో టీమ్.. హసన్ సెంచరీతో సత్తా చాటడంతో 235 పరుగులు చేసి, ప్రత్యర్థి ముందు 312 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 45 బంతుల్లో 150 పరుగులుహసన్ గతేడాది తొలిసారి వార్తల్లో నిలిచాడు. కాబుల్ ప్రీమియర్ లీగ్ 2024లో 45 బంతుల్లో 150 పరుగులు చేసి రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో హసన్ రికార్డు స్థాయిలో 19 సిక్సర్లు కొట్టాడు. హసన్ గతేడాది అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్న హసన్ తండ్రి నబీ కొడుకుతో పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ముచ్చట పడుతున్నాడు. -
ఆఫ్ఘనిస్థాన్ లో నేటి తెల్లవారుజామున భూకంపం
-
ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున హిందూకుష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే, దీని ప్రకంపనలు భారత్‌ను తాకాయి.వివరాల ప్రకారం.. ఆఫ్ఘనిస్థాన్‌లో హిందూకుష్ ప్రాంతం కేంద్రంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇక, ఈ భూకంప తీవ్రత ప్రకంపనలు భారత్‌ను తాకాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. 55 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంపానికి సంబంధించి వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.A 6.1 magnitude earthquake shook the Hindu Kush region of Afghanistan, and another 6.9 magnitude earthquake shook Tajikistan. pic.twitter.com/HcvpzSd0Cl— Niv Calderon (@nivcalderon) April 16, 2025 -
జుత్తు సరిగా లేకున్నా అరెస్టే..
కాబూల్: రంజాన్ మాసంలో మసీదుకు వెళ్లని వారితోపాటు జుత్తు సరిగ్గా కట్ చేయించుకోని వారిని కూడా అఫ్గానిస్తాన్ తాలిబన్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా జుత్తు కత్తిరించని క్షురకులను సైతం కటకటాల వెనక్కి నెట్టేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను ప్రకటించిన ఆరు నెలల అనంతరం వాటిని పాటించని వారిపై తాలిబన్లు చర్యలు తీసుకుంటున్నట్లు ఐక్యరాజ్యసమితి గురువారం వెలువరించిన నివేదికలో పేర్కొంది. పౌరులు దైనందిన జీవితంలో ముఖ్యంగా రవాణా, సంగీతం, షేవింగ్, వేడుకల సమయంలో ఎలా మెలగాలో నిర్దేశిస్తూ తాలిబన్ పాలకులు గతేడాది ఆగస్ట్‌లో నియమ నిబంధనలను ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళల స్వరం వినిపించరాదు, వారి ముఖాలు కనిపించరాదనేవి కూడా ఇందులో ఉన్నాయి. వీటిపై అప్పట్లోనే ఐరాస అభ్యంతరం తెలిపినా తాలిబన్లు పట్టించుకోలేదు. ఆగస్ట్ తర్వాత అరెస్టయిన వారిలో సగం మంది ఇలా నిబంధనలు పాటించని వారేనని ఐరాస అఫ్గానిస్తాన్ మిషన్ పేర్కొంది. గడ్డం పొడవు, జుత్తు నిర్దేశించిన మేరకు లేకున్నా గడ్డం ట్రిమ్మింగ్ చేసిన క్షురకులను నైతిక విభాగం పోలీసులు నిర్బంధిస్తున్నారని తెలిపింది. ఇటువంటి అరెస్ట్‌లపై ఎలాంటి చట్టపరమైన ప్రక్రియలను అమలు చేయడం లేదని, ఇదంతా ఏకపక్షంగా సాగుతోందని పేర్కొంది. రంజాన్ మాసంలో సామూహిక ప్రార్ధనలను తాలిబన్లు తప్పనిసరి చేశారు. నిఘా పెట్టిన నైతిక పోలీసులు సామూహిక ప్రార్థనల్లో పాలుపంచుకోని వారిని ఎలాంటి హెచ్చరికలు లేకుండానే అదుపులోకి తీసుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇలాంటి చర్యలతో చిన్న వ్యాపారాలు, ప్రైవేట్ విద్యాసంస్థలు, హెయిర్ డ్రెస్సింగ్ సెంటర్లు, టైలర్లు, రెస్టారెంట్లు, వెడ్డింగ్ కేటరర్లకు పని దొరక్కుండా పోయిందని, ఆయా వ్యాపారాలు మూతబడే పరిస్థితికి చేరుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సామాన్యుల జీవనం మరింత భారంగా మారిందని ఐరాస తెలిపింది. మహిళలకు విద్య, ఉద్యోగావకాశాలు లేకుండా చేయడంతో అఫ్గానిస్తాన్ ఏడాదికి 14 బిలియన్ డాలర్ల మేర నష్టపోతోందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అయితే, అఫ్గాన్ సమాజం, ప్రజలను సంస్కరించేందుకే ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తున్నామని తాలిబన్ నేత హైబతుల్లా అఖుంద్జాదా చెప్పుకుంటున్నారు. నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 3,300 మంది ఇన్స్పెక్టర్లను తాలిబన్ ప్రభుత్వం నియమించింది. -
ట్రంప్ సంచలన నిర్ణయం.. లక్షలాది మందికి మరణశాసనం
రోమ్: లక్షలాది మందికి ఆహార సాయాన్ని నిలిపేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) తీవ్రంగా తప్పుబట్టింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆకలితో అలమటిస్తున్న లక్షలాది మంది పాలిన మరణశాసనంగా అభివర్ణించింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం విజ్ఞప్తి చేసింది. ప్రాణాలను కాపాడే కార్యక్రమాలకు నిరంతరం మద్దతివ్వాలని కోరేందుకు ట్రంప్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది.అఫ్గానిస్తాన్, సిరియా, యెమన్, మరో 11 పేద దేశాల్లో లక్షలాది మంది అన్నార్తులకు సాయపడే యూఎస్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం అత్యవసర కార్యక్రమాలకు ట్రంప్ ప్రభుత్వం నిధులను నిలిపేయడం తెలిసిందే. ఎలాన్ మస్క్ డోజ్‌లో టాప్ లెఫ్టినెంట్ జెరెమీ లెవిన్ ఆదేశాల మేరకు వాటికి నిధుల కేటాయింపును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అత్యవసర ఆహార కార్యక్రమాలకు సాయాన్ని కోతల నుంచి మినహాయిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇతర ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా లాభం లేకపోయింది.ట్రంప్ టార్గెట్ చేసిన కార్యక్రమాలు 13 ఏళ్ల అంతర్యుద్ధం, ఇస్లామిక్ స్టేట్ గ్రూపు తిరుగుబాటు తర్వాత సిరియా పేదరికం, ఆకలి, అభద్రతతో సతమతమవుతోంది. ఆ దేశానికి తాజాగా 23 కోట్ల డాలర్ల ఒప్పందాలను అమెరికా రద్దు చేసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవీయ విపత్తును ఎదుర్కొంటున్న యెమన్‌లో డబ్ల్యూఎఫ్‌పీ ఆహార కార్యక్రమాలకు సాయం నిలిపేసింది. సిరియా శరణార్థులు తీవ్రంగా ప్రభావితమయ్యే లెబనాన్, జోర్డాన్లలో కార్యక్రమాలూ పడకేశాయి.సోమాలియా, అఫ్గాన్, జింబాబ్వేల్లో యుద్ధాలతో నిరాశ్రయులైన వారికి జలకు ఆహారం, నీరు, వైద్య సంరక్షణ, ఆశ్రయం వంటి కార్యక్రమాలు కూడా ప్రభావితమయ్యాయి. అఫ్గాన్‌కు మానవతా సహాయంలో అమెరికా 56 కోట్ల డాలర్లు కోత పెట్టింది. తాలిబన్ ఆంక్షల వల్ల విదేశాల్లో చదువుతున్న అఫ్గాన్ యువతులకు అందించే సాయాన్ని శుక్రవారం నిలిపేసింది. అమెరికా కోతలతో ప్రపంచవ్యాప్తంగా ఇలా సుమారు 1,000కి పైగా కార్యక్రమాలు నిలిచిపోయాయి. 5,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. డబ్ల్యూఎఫ్‌పీకి గతేడాది అందిన 980 కోట్ల డాలర్ల విరాళాల్లో 450 కోట్లు అమెరికా ఇచ్చినవే! 🚨 US emergency food aid cuts by the Trump administration threaten millions in 14 countries, warns the UN. Despite earlier pledges to protect aid, these cuts put vulnerable communities at risk. 🔵 Calls for urgent action to restore funding. #UN #FoodAid #GlobalCrisis pic.twitter.com/EGLNbz8D8n— Thomas MORE (@ThomaMore) April 8, 2025వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యూఎఫ్‌పీ) 2025 లెక్కల ప్రకారం పలు దేశాల సాయం ఇలా ఉంది. అమెరికా.. మూడు బిలియన్ డాలర్లు కాగా, జర్మనీ.. ఒక్క బిలియన్ డాలర్లు. యూకే, యూరోపియన్ కమిషన్, ప్రైవేటు డోనార్స్ ఉన్నారు. -
Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో స్వల్ప వ్యవధిలో రెండు భూకంపాలు
కాబూల్: మయన్మార్‌లో సంభవించిన భూకంపం గురించి మరువకముందే ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)లో స్వల్ప వ్యవధిలో రెండుమార్లు భూకంపం సంభవించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. నిముషాల వ్యవధిలో భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు. EQ of M: 4.7, On: 29/03/2025 05:16:00 IST, Lat: 36.50 N, Long: 71.12 E, Depth: 180 Km, Location: Afghanistan. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/F4P212Y0hC— National Center for Seismology (@NCS_Earthquake) March 28, 2025ఆఫ్ఘనిస్థాన్‌లో ఈరోజు (శనివారం, మార్చి 29) ఉదయం సంభవించిన భూప్రకంననలు(Earthquakes) ప్రజలను వణికింపజేశాయి. స్వల్ప వ్యవధిలో ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన రెండు ప్రకంపనల తీవ్రత వరుసగా 4.7, 4.3 గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4:51.. 5:16 గంటలకు ఈ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం కారణంగా జనం తమ ఇళ్లనుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతానికి ఈ భూకంపాల వలన ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు లేవు. మార్చి 28న మయన్మార్, థాయిలాండ్‌లలో బలమైన ప్రకంపనలు సంభవించినప్పుడు ఆఫ్ఘనిస్థాన్లోనూ భూకంపం సంభవించింది.EQ of M: 4.3, On: 29/03/2025 04:51:37 IST, Lat: 36.59 N, Long: 71.12 E, Depth: 221 Km, Location: Afghanistan. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/gPUcvvaCpb— National Center for Seismology (@NCS_Earthquake) March 28, 2025భూకంపశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 4.3, 4.7 తీవ్రతతో వచ్చే భూకంపాలను మోడరేట్ భూకంపాలుగా వర్గీకరిస్తారు. ఇటువంటివి బలహీనమైన నిర్మాణాలు ఉన్న ప్రదేశాలలో భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాగా మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్‌లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) నివేదిక ప్రకారం దీని కేంద్రం భూమికి 160 కి.మీ. దిగువన ఉంది. మార్చి 13న కూడా ఆఫ్ఘనిస్థాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రత నమోదయ్యింది.ఇది కూడా చదవండి: Earthquake: మయన్మార్‌లో మళ్లీ భూ ప్రకంపనలు.. జనం పరుగులు -
స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. చిన్నారి మృతి
అఫ్గానిస్తాన్ స్టార్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతడి రెండేళ్ల కుమార్తె మృతి చెందింది. ఈ విషయాన్ని హజ్రతుల్లా టీమ్మేట్ కరీం జనత్ ధృవీకరించాడు. తన సహచరుడి కుమార్తె మృతి పట్ల జనత్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపాడు. "నా సన్నిహిత మిత్రుడు హజ్రతుల్లా జజాయ్ తన కుమార్తెను కోల్పోవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని బరువెక్కిన హృదయంతో అందరితో పంచుకుంటున్నాను.ఈ కష్ట సమయంలో వారి కటుంబానికి దేవుడు అండగా నిలవాలని కోరుకుంటున్నాను. హజ్రతుల్లా జజాయ్ , అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని జనత్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. అయితే చిన్నారి మృతికి కారణం ఏంటి అన్నది జనత్ వెల్లడించలేదు. జజాయ్ కుమార్తె మృతి పట్ల అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా సంతాపం వ్యక్తం చేసింది.2016లో యూఏఈతో (UAE)తో జరిగిన వన్డే మ్యచ్‌తో జజాయ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అఫ్గాన్ టీ20 జట్టులో జజాయ్ కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. హజ్రతుల్లా తన కెరీర్లో ఇప్పటివరకు అఫ్గాన్ తరపున 16 వన్డేలు 45 టీ20లు ఆడాడు. వన్డేల్లో 361 పరుగులు చేయగా.. టీ20ల్లో 1160 రన్స్ చేశాడు.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న అఫ్గాన్ జట్టులో అతను భాగం కాదు. కాగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో ప్లేయర్‌గా జజాయ్ కొనసాగుతున్నాడు. జజాయ్ డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్‌పై 62 బంతుల్లో 162 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. జజాయ్ చివరిసారిగా 2024 డిసెంబర్లో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున ఆడాడు.చదవండి: IPL 2025 Teams And Captains: అందరూ ఇండియన్సే.. ప్యాట్ కమ్మిన్స్ ఒక్కడే View this post on Instagram A post shared by Karim Janat (@karimjanat_11) -
ట్రంప్ మార్క్ రాజకీయం.. పాకిస్థాన్‌కు భారీ షాక్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి డొనాల్డ్ ట్రంప్(trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్నారు. తాజాగా దాయాది దేశం పాకిస్థాన్, ఆఫ్గానిస్తాన్‌కు ఊహించని షాకిచ్చారు. రెండు దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టారిఫ్‌ల పేరుతో పలు దేశాలను హెచ్చరించారు. అమెరికాలో అక్రమ వలసదారులను తరలించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా అమెరికాలోకి ప్రవేశించే పలు దేశాల వారిపైనా నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ (Pakistan), అఫ్గానిస్థాన్(Afghanistan)లపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నారు. వచ్చే వారం నుంచి ఇది అమలు కానున్నట్టు తెలుస్తోంది.డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అనేక పరిశీలన అనంతరం 2018లో అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ప్రభుత్వం.. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. దీంతో, ఆయా దేశాల పౌరులు.. అమెరికాలోకి వచ్చారు.🚨For those who were in celebration of #Trump statement ...!!US likely to impose travel ban on Pakistan,A new travel ban by US could ban people from #Afghanistan and #Pakistan from entering the #UnitedStates next week, pic.twitter.com/n21PxRh37z— Sardar Waleed Mukhtar (@waleedmukhtar_1) March 6, 2025ఇక, ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇందులో అమెరికాలోకి ప్రవేశించే విదేశీయులను నుంచి జాతీయ భద్రతా ముప్పు పొంచి వుందా అన్న విషయాన్ని ముందే గుర్తించే కార్యనిర్వాహక ఆదేశంపైనా సంతకం చేశారు. దీని ప్రకారమే ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా, అంతకుముందు.. కాబూల్ విమానాశ్రయంపై 2021లో బాంబు పేలుళ్లు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆత్మాహుతి దాడిలో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన 13 మంది సైనికులు చనిపోయారు. అయితే, తాజాగా ఈ దాడులకు పాల్పడిన సూత్రధారిని పట్టుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ సాయం వల్లే ఈ నిందితుడిని అరెస్ట్ చేయగలిగామని కూడా వివరించారు. అంతేకాకుండా పాకిస్థాన్‌కు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. కాగా, పాకిస్థాన్‌కు కృతజ్ఞతలు చెప్పిన వెంటనే ఆ దేశ పౌరులపై బ్యాన్ విధిస్తూ ట్రంప్ షాకివ్వడం గమనార్హం. -
Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు ఆస్ట్రేలియా
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్-బిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ (ఫిబ్రవరి 28) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. మ్యాచ్ మధ్యలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఫలితంగా ఆస్ట్రేలియా గ్రూప్-బి నుంచి సెమీస్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలు దాదాపుగా గల్లంతయ్యాయి. ఏదైనా అద్భుతం జరిగి రేపటి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ భారీ విజయం సాధిస్తే తప్ప, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరలేదు. ఈ మ్యాచ్ రద్దు కావడం సౌతాఫ్రికాకు పరోక్షంగా కలిసొచ్చింది. రేపటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా సౌతాఫ్రికా సెమీస్‌కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా మరీ దారుణంగా మాత్రం ఓడకూడదు. ఒకవేళ అలా జరిగి సౌతాఫ్రికా రన్‌రేట్ మైనస్‌లోకి పడిపోతే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో 4 పాయింట్లు (0.475), సౌతాఫ్రికా ఖాతాలో 3 పాయింట్లు (2.140), ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో 3 పాయింట్లు (-0.990) ఉన్నాయి. ఈ గ్రూప్‌లో ఉన్న మరో జట్టు ఇంగ్లండ్ ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి..!క్రిక్‌బజ్ లెక్కల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే రేపటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే సౌతాఫ్రికాను కనీసం 207 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ సెకెండ్ బ్యాటింగ్ చేస్తే 11.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది (రెండు సందర్భాల్లో మొదటి ఇన్నింగ్స్ టోటల్ 300 పరుగులు అనుకుంటే).ఇలా జరగకపోతే మాత్రం రేపటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా సౌతాఫ్రికా సెమీస్‌కు చేరుకుంటుంది. రేపటి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైనా సౌతాఫ్రికానే సెమీస్‌కు చేరుకుంటుంది.కాగా, గ్రూప్-ఏ నుంచి ఇదివరకే సెమీస్ బెర్తలు ఖారారైన విషయం తెలిసిందే. ఈ గ్రూప్ నుంచి మరో మ్యాచ్ జరగాల్సి ఉన్నా భారత్, న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ గ్రూప్‌లో మిగిలిన మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మార్చి 2వ తేదీన జరుగుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సెదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 67; ఫోర్, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా, ఒమర్జాయ్.. ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (12), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20), రషీద్ ఖాన్‌తో (19) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆసీస్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (0), మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4), నూర్ అహ్మద్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆసీస్ 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (20) ఔట్ కాగా.. ట్రవిస్ హెడ్ (59), స్టీవ్ స్మిత్ (19) క్రీజ్‌లో ఉన్నారు. షార్ట్ వికెట్ ఒమర్జాయ్కు దక్కింది. -
Champions Trophy 2025: ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy) గ్రూప్-బిలో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 28) జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia), ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు (Rain Stopped The Play) తగిలాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ పూర్తై.. ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆసీస్ పైచేయి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 12.5 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (59), స్టీవ్ స్మిత్ (19) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలవాలంటే మరో 37.1 ఓవర్లలో 165 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. వర్షం ఎంతకీ తగ్గక ఈ మ్యాచ్ ఫలితాన్ని డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ప్రకటించాల్సి వస్తే ఆస్ట్రేలియానే విజేతగా నిలుస్తుంది. ఆసీస్ వర్షం ముప్పును ముందే పసిగట్టి ఛేదనను ధాటిగా ప్రారంభించింది. ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్లు రెండు సునాయాస క్యాచ్‌లు వదిలేయడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. ఈ రెండు క్యాచ్‌ల్లో ఒకటి ట్రవిస్ హెడ్‌ది ఉంది. లైఫ్ లభించిన అనంతరం హెడ్ చెలరేగిపోయాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తప్పక గెలవాలి. ఓడిపోయినా లేక ఫలితం రాకపోయినా ఆఫ్ఘనిస్తాన్ టోర్నీ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే.. ఆ జట్టుతో పాటు సౌతాఫ్రికా సెమీస్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో ఫలితం రాకపోయినా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికానే సెమీస్‌కు చేరకుంటాయి.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. వన్ డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 67; ఫోర్, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా, ఒమర్జాయ్.. ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (12), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20), రషీద్ ఖాన్‌తో (19) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆసీస్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (0), మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4), నూర్ అహ్మద్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు. -
Champions Trophy: ఆసీస్‌తో కీలక సమరం.. ఆఫ్ఘనిస్తాన్ కొంపముంచిన రషీద్ ఖాన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్-బిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక సమరంలో ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్ చేసింది. వన్ డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 67; ఫోర్, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా, ఒమర్జాయ్.. ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (12), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20), రషీద్ ఖాన్‌తో (19) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆసీస్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (0), మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4), నూర్ అహ్మద్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు.274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ తొలి ఓవర్ నుంచే ఆఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఓ బౌండరీ బాదిన షార్ట్.. మూడో ఓవర్లో శివాలెత్తిపోయాడు. ఒమర్జాయ్ వేసిన ఈ ఓవర్లో షార్ట్ 2 బౌండరీలు, ఓ సిక్సర్ బాదాడు. ఫలితంగా ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. మరో ఎండ్‌లో విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ కూడా ఫజల్ హక్ ఫారూకీ బౌలింగ్‌లో బౌండరీ బాది మాంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. వీరిద్దరు రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా 3 ఓవర్లలో 32 పరుగులు చేసింది.హెడ్ క్యాచ్ జారవిడిచిన రషీద్ ఖాన్ఫజల్ హక్ ఫారూకీ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికి డేంజరెస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్‌ను ఔట్ చేసే సువర్ణావకాశాన్ని ఆఫ్ఘనిస్తాన్ చేజార్చుకుంది. హెడ్ మిడ్ ఆన్ దిశగా అందించిన క్యాచ్‌ను రషీద్ ఖాన్ జారవిడిచాడు. ఈ క్యాచ్ ఎంత మూల్యమైందో ఆఫ్ఘనిస్తాన్ కొద్ది సేపటిలోనే తెలిసింది. లైఫ్ లభించిన అనంతరం హెడ్ చెలరేగిపోయాడు. ఆతర్వాతి బంతికే సిక్సర్ బాదాడు. అదే ఓవర్ చివరి బంతికి బౌండరీ కొట్టాడు. దీంతో 4 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 42కు చేరింది.సింపుల్ క్యాచ్‌ను జారవిడిచిన ఖరోటేఅనంతరం ఐదో ఓవర్ తొలి బంతికి ఆఫ్ఘనిస్తాన్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ఖరోటే సింపుల్ క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ సారి మాథ్యూ షార్ట్‌కు లైఫ్ లభించింది. ఒమర్జాయ్ బౌలింగ్ షార్ట్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను ఖరేటో వదిలేశాడు. దీంతో 7 బంతుల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్లు రెండు క్యాచ్‌లు జారవిడిచినట్లైంది.ఆఫ్ఘనిస్తాన్ ఊపిరిపీల్చుకుందిఖరోటే క్యాచ్ వదిలేశాక రెండు బంతులకే షార్ట్ ఔటయ్యాడు. ఒమర్జాయ్ బౌలింగ్‌లో గుల్బదిన్ క్యాచ్ పట్టడంతో షార్ట్ మెరుపు ఇన్నింగ్స్‌కు (15 బంతుల్లో 20; 3 ఫోర్లు, సిక్స్) తెరపడింది. దీంతో ఆఫ్ఘన్లు ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్‌కు ఔట్ చేసిన ఆనందం ఆఫ్ఘన్లకు ఎంతో సేపు మిగల్లేదు. స్టీవ్ స్మిత్ వచ్చీ రాగానే రెండు వరుసగా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఆసీస్ 5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది.మూల్యం చెల్లించుకుంటున్న ఆఫ్లన్లుహెడ్ క్యాచ్‌ను జారవిడిచినందుకు ఆఫ్ఘన్లు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. లైఫ్ లభించాక హెడ్ చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో 3 బౌండరీలు.. తొమ్మిదో ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు సాధించి ఆఫ్ఘన్లను పశ్చాత్తాపపడేలా చేశాడు. అనంతరం హెడ్ నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్లో రెండు పరుగులు తీసి కెరీర్లో 17వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 12 ఓవర్లలోనే ఆస్ట్రేలియా వికెట్ నష్టపోయి 100 పరుగుల మార్కును తాకింది.ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆసీస్‌కు మాత్రం ఈక్వేషన్స్ అలా లేవు. ఆసీస్ ఈ మ్యాచ్‌లో ఓడినా.. రేపు జరుగబోయే మ్యాచ్‌లో ఇంగ్లండ్ సౌతాఫ్రికాను ఓడిస్తే సెమీస్‌కు చేరే అవకాశం (మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంటే) ఉంటుంది. -
Champions Trophy 2025: ఆసీస్‌తో కీలక సమరం.. విధ్వంసం సృష్టించిన ఒమర్జాయ్
ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy-2025) ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) అంచనాలకు మించి రాణిస్తుంది. ఆఫ్ఘన్లకు ఇది అరంగేట్రం ఎడిషనే (ఛాంపియన్స్ ట్రోఫీలో) అయినా.. ఎంతో అనుభవజ్ఞుల్లా ఆడుతున్నారు. దాయాది పాకిస్తాన్ కంటే వెయ్యి రెట్లు బెటర్ అనిపిస్తున్నారు. ఈ టోర్నీలో తమ రెండో మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. ఇవాళ (ఫిబ్రవరి 28) ఆస్ట్రేలియాతో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో (సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలి) తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. వన్ డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (Sediqulla Atal) (95 బంతుల్లో 85), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (Azmatulla Omarzai) (63 బంతుల్లో 67) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.తొలి ఓవర్లోనే ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (0) వికెట్ కోల్పోయి కష్టాల్లో పడిన ఆఫ్ఘనిస్తాన్‌ను గత మ్యాచ్ సెంచరీ హీరో ఇబ్రహీం జద్రాన్ (22), వన్‌డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. అనంతరం జద్రాన్‌ను అద్భుతమైన బంతితో ఆడమ్ జంపా బోల్తా కొట్టించాడు. తర్వాత బరిలోకి దిగిన రహ్మత్ షా (12) కొద్దిసేపు నిలకడగా ఆడాడు. బౌండరీ కొట్టి జోష్ మీదున్న షాను మ్యాక్స్‌వెల్ ఔట్ చేశాడు. అనంతరం అటల్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిదితో (20) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే సెదిఖుల్లా దురదృష్టవశాత్తు సెంచరీకి ముందు ఔటై ఆఫ్ఘనిస్తాన్ ఆశలు నీరుగార్చాడు. సెదీఖుల్లా క్రీజ్‌లో ఉన్నంత సేపు ఆస్ట్రేలియన్లకు చెమటలు పట్టించాడు.సెదిఖుల్లా ఔటైన కొద్ది సేపటికే హష్మతుల్లా షాహిది, మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4) కూడా ఔట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ 199 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్‌కే పరిమితం అయ్యేలా చేసింది. ఈ దశలో గత మ్యాచ్ హీరో అజ్మతుల్లా ఒమర్జాయ్ విజృంభించాడు. వరుస సిక్సర్లతో విరుచుకుపడి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్‌ను 270 దాటించాడు. మధ్యలో రషీద్ ఖాన్ (19) కూడా తన స్టయిల్లో విరుచుకుపడ్డాడు. మొత్తానికి సెదీఖుల్లా, ఒమర్జాయ్ అదరగొట్టడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచింది. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆసీస్‌కు మాత్రం ఈక్వేషన్స్ అలా లేవు. ఆసీస్ ఈ మ్యాచ్‌లో ఓడినా.. రేపు జరుగబోయే మ్యాచ్‌లో ఇంగ్లండ్ సౌతాఫ్రికాను ఓడిస్తే సెమీస్‌కు చేరే అవకాశం (మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంటే) ఉంటుంది. -
CT 2025 Aus Vs Afg: వరుణుడు కరుణిస్తే...
లాహోర్: చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్, అఫ్తానిస్తాన్ల మ్యాచ్ ఫలితం మొత్తం గ్రూప్ ‘బి’ సమీకరణాలనే మార్చేసింది. నాలుగు జట్లలో ఒక్క ఇంగ్లండ్ తప్ప దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్‌లు సెమీఫైనల్ రేసులో ఉన్నాయి. ఈ రోజు నాకౌట్ దశ బెర్త్ కోసం ఆసీస్, అఫ్గాన్లు కాచుకున్నట్లే ఆసక్తికరంగా మ్యాచ్‌ను ఆపేందుకు వర్షం కూడా కాచుకుంది. శుక్రవారం వానముప్పు ఉందని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకవేళ మ్యాచ్‌ను ముంచేసే వాన కురిస్తే మాత్రం అఫ్గానిస్తాన్ కథ ఇక్కడితోనే ముగుస్తుంది. 4 పాయింట్లతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో మిగిలున్న మ్యాచ్‌తో సంబంధం లేకుండా దక్షిణాఫ్రికా (ప్రస్తుతం 3 పాయింట్లు) సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. తాజా పోరు విషయానికొస్తే ఆ్రస్టేలియాను ఓడించడం అఫ్గాన్‌కు అంత సులువైతే కాదు. కానీ ఇది క్రికెట్. స్థిరమైన ఫలితాలేవీ ఉండవు. మేటి జట్టా, గట్టి ప్రత్యర్థా... అనేవి, గత గణాంకాలు పనికిరావు. శుక్రవారం ఏ జట్టు బాగా ఆడితే ఆ జట్టే గెలుస్తుంది. అఫ్గాన్ ఈ టోర్నీలో సంచలనానికి సీక్వెల్ చూపిస్తే మాత్రం దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్ ఫలితం, ఇతర ఏ సమీకరణంతో సంబంధం లేకుండా దర్జాగా సెమీస్ చేరుతుంది. ఆసీస్ మాత్రం దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితం కోసం నిరీక్షించక తప్పదు. ఆ్రస్టేలియా కంటే దక్షిణాఫ్రికా రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో సఫారీ జట్టు ఓడిపోయినా సెమీఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇరు జట్లకు తెలిసిన పిచ్‌పై... లాహోర్‌పై ఇటు అఫ్గాన్‌కు, అటు ఆసీస్‌కు అవగాహన ఉంది. ఇరు జట్లు కూడా తమ బ్యాటింగ్ సత్తాతోనే తమ తమ మ్యాచ్‌ల్లో గెలిచాయి. కాబట్టి ఇక్కడి పిచ్ పరిస్థితుల్ని బాగా ఆకళింపు చేసుకున్నాయి. దీంతో సహజంగా టాస్ కీలకపాత్ర పోషించే అవకాశముంది. ఏ రకంగా చూసిన మాజీ చాంపియన్ ఆ్రస్టేలియా గట్టి ప్రత్యర్థి. కానీ అజేయమైన ప్రత్యర్థి కాదు. ఈ ‘చాంపియన్స్’ చరిత్రలో 2009 తర్వాత మొన్న ఇంగ్లండ్‌పై మాత్రమే గెలిచిన కంగారూ జట్టు మధ్యలో జరిగిన రెండు టోర్నీల్లో ఓటమి లేదంటే రద్దు ఫలితాలతో నిరాశపరిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 352 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా బౌలింగ్ దళం చాలా బలహీనంగా ఉంది. పేస్ త్రయం కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్ల లోటు కనిపిస్తోంది. బౌలింగ్ విషయంలో అఫ్గాన్ కాస్త మెరుగే అయినా... స్మిత్, లబుõÙన్, హెడ్, ఇన్‌గ్లిస్, మ్యాక్స్‌వెల్‌లాంటి బ్యాటింగ్ లైనప్‌ను ఢీకొంటుందా అనే సందేహం కూడా ఉంది. పిచ్, వాతావరణం లాహోర్ పూర్తిగా బ్యాటింగ్ పిచ్. ఆస్ట్రేలియా–ఇంగ్లండ్... అఫ్గాన్–ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగుసార్లు 300 పైచిలుకు స్కోరు సులువైంది. దీంతో మరో భారీస్కోరు ఆశించవచ్చు. ఇదే జరిగితే బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. కానీ భారీ వర్షసూచన కూడా ఉంది. 4 ఆ్రస్టేలియాతో అఫ్గానిస్తాన్ జట్టు ఇప్పటి వరకు 4 వన్డేలు ఆడింది. నాలుగింటిలోనూ ఆ్రస్టేలియానే గెలిచింది.తుది జట్లు ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్ ), షార్ట్, హెడ్, లబుషేన్, జోస్ ఇన్‌గ్లిస్, అలెక్స్ కేరీ, మ్యాక్స్‌వెల్, డ్వార్షుయిస్, నాథన్ ఎలిస్, ఆడమ్ జంపా, జాన్సన్. అఫ్గానిస్తాన్: హష్మతుల్లా (కెప్టెన్ ), గుర్బాజ్, ఇబ్రహీమ్ జద్రాన్, సిద్ధిఖుల్లా, రహ్మత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, నబీ, గుల్బదిన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్. -
ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన హీరో.. ఎవరీ ఇబ్రహీం జద్రాన్? (ఫొటోలు)
-
Champions Trophy: అఫ్గానిస్తాన్ మళ్లీ అదరగొట్టింది
రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్ చేతిలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఆ రోజు అది ఒక సంచలనంగా కనిపించింది. ఇప్పుడు మరో ఐసీసీ టోర్నీలో మళ్లీ చెలరేగిన అఫ్గానిస్తాన్ అదే తరహా ఆటతో మళ్లీ ఇంగ్లండ్ పని పట్టింది. ఇప్పుడిది సంచలనం కాదు సాధారణమని నిరూపించింది. స్ఫూర్తిదాయక ఆటతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీలో తమ సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోగా... వరుసగా రెండో ఓటమితో ఇంగ్లండ్ నిష్క్రమించింది.చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో ఇబ్రహీమ్ జద్రాన్ తన టీమ్‌కు భారీ స్కోరును అందించగా... బౌలింగ్‌లో ఐదు వికెట్లతో అజ్మతుల్లా టీమ్‌ను నిలబెట్టాడు. ఆరేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ చేసిన జో రూట్ ఎంతో పోరాడినా... విజయానికి 26 బంతుల్లో 39 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుటవ్వడం ఇంగ్లండ్ ఓటమికి కారణమైంది. లాహోర్: చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’లో ఇంకా ఆసక్తికర పోటీ సాగుతోంది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలతో పాటు ఇప్పుడు అఫ్గానిస్తాన్ కూడా సెమీఫైనల్ రేసులోకి వచ్చింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ నిరీ్ణత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇబ్రహీమ్ జద్రాన్ (146 బంతుల్లో 177; 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) భారీ సెంచరీ బాదగా... అజ్మతుల్లా (31 బంతుల్లో 41; 1 ఫోర్, 3 సిక్స్‌లు), మొహమ్మద్ నబీ (24 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ హష్మతుల్లా (67 బంతుల్లో 40; 3 ఫోర్లు) సహకరించారు. అనంతరం ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (111 బంతుల్లో 120; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయగా...అఫ్గాన్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (5/58) ప్రత్యరి్థని దెబ్బ తీశాడు. శుక్రవారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆ్రస్టేలియాతో అఫ్గానిస్తాన్; శనివారం జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ తలపడతాయి. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా 3 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా... అఫ్గానిస్తాన్ ఖాతాలో 2 పాయింట్లున్నాయి. చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ నెగ్గినా ఆ జట్టుకు రెండు పాయింట్లు మాత్రమే లభిస్తాయి. భారీ భాగస్వామ్యాలు... ఇంగ్లండ్ ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అఫ్గాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఇదే ఒత్తిడిలో జట్టు 26 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో గుర్బాజ్ (6), సాదిఖుల్లా (4)లను అవుట్ చేసిన ఆర్చర్ ఆ తర్వాత రహ్మత్ షా (4)ను కూడా వెనక్కి పంపాడు. తొలి 10 ఓవర్లలో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో అఫ్గాన్ 39 పరుగులే చేసింది. అయితే ఆ తర్వాతి మూడు భాగస్వామ్యాలు అఫ్గాన్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాయి. దూకుడైన బ్యాటింగ్‌తో చెలరేగిన ఇబ్రహీమ్ వరుసగా నాలుగు, ఐదు, ఆరో వికెట్లకు హష్మతుల్లాతో 103 పరుగులు, అజ్మతుల్లాతో 72 పరుగులు, నబీతో 111 పరుగులు జోడించాడు. ఒవర్టన్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన ఇబ్రహీమ్...106 బంతుల్లో వన్డేల్లో ఆరో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 40వ ఓవర్ తర్వాత అఫ్గాన్ బ్యాటింగ్ మరింత ధాటిగా సాగింది. ఆర్చర్ ఓవర్లో ఇబ్రహీమ్ 3 ఫోర్లు, సిక్స్ బాదగా... రూట్ ఓవర్లో నబీ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. మెరుపు ప్రదర్శన చేసిన ఇబ్రహీమ్ చివరి ఓవర్ తొలి బంతికి అవుటయ్యాడు. ఆఖరి 10 ఓవర్లలో అఫ్గానిస్తాన్ 113 పరుగులు సాధించడం విశేషం. రూట్ మినహా... సాల్ట్ (12), జేమీ స్మిత్ (9) ఆరంభంలోనే వెనుదిరగడంతో భారీ ఛేదనలో ఇంగ్లండ్‌కు సరైన ఆరంభం లభించలేదు. అయితే రూట్, డకెట్ (45 బంతుల్లో 38; 4 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. ఈ భాగస్వామ్యం తర్వాత బ్రూక్ (25), బట్లర్ (42 బంతుల్లో 38; 2 సిక్స్‌లు) కూడా కొద్దిసేపు రూట్‌కు సహకరించారు. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సరైన రీతిలో సాగలేదు. రూట్, ఒవర్టన్ (28 బంతుల్లో 32; 3 ఫోర్లు) భాగస్వామ్యం కొద్దిగా ఇంగ్లండ్ విజయంపై ఆశలు రేపింది. 101 బంతుల్లో రూట్ వన్డేల్లో 17వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే చక్కటి బంతితో రూట్‌ను అజ్మతుల్లా బోల్తా కొట్టించిన తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ అఫ్గాన్ వైపు మొగ్గింది.స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (బి) ఆర్చర్ 6; ఇబ్రహీమ్ (సి) ఆర్చర్ (బి) లివింగ్‌స్టోన్ 177; సాదిఖుల్లా (ఎల్బీ) (బి) ఆర్చర్ 4; రహ్మత్ షా (సి) ఆదిల్ రషీద్ (బి) ఆర్చర్ 4; హష్మతుల్లా (బి) రషీద్ 40; అజ్మతుల్లా (సి) (సబ్) బాంటన్ (బి) ఒవర్టన్ 41; నబీ (సి) రూట్ (బి) లివింగ్‌స్టోన్ 40; గుల్బదిన్ (నాటౌట్) 1; రషీద్ ఖాన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 325. వికెట్ల పతనం: 1–11, 2–15, 3–37, 4–140, 5–212, 6–323, 7–324. బౌలింగ్: ఆర్చర్ 10–0–64–3, మార్క్ వుడ్ 8–0–50–0, ఒవర్టన్ 10–0–72–1, ఆదిల్ రషీద్ 10–0–60–1, రూట్ 7–0–47–0, లివింగ్‌స్టోన్ 5–0–28–2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) అజ్మతుల్లా 12; డకెట్ (ఎల్బీ) (బి) రషీద్ 38; స్మిత్ (సి) అజ్మతుల్లా (బి) నబీ 9; రూట్ (సి) గుర్బాజ్ (బి) అజ్మతుల్లా 120; బ్రూక్ (సి అండ్ బి) నబీ 25; బట్లర్ (సి) రహ్మతుల్లా (బి) అజ్మతుల్లా 38; లివింగ్‌స్టోన్ (సి) గుర్బాజ్ (బి) గుల్బదిన్ 10; ఒవర్టన్ (సి) నబీ (బి) అజ్మతుల్లా 32; ఆర్చర్ (సి) నబీ (బి) ఫారుఖీ 14; రషీద్ (సి) ఇబ్రహీమ్ (బి) అజ్మతుల్లా 5; వుడ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 317. వికెట్ల పతనం: 1–19, 2–30, 3–98, 4–133, 5–216, 6–233, 7–287, 8–309, 9–313, 10–317. బౌలింగ్: ఫారుఖీ 10–0–62–1, అజ్మతుల్లా 9.5–0–58–5, నబీ 8–0–57–2, రషీద్ ఖాన్ 10–0–66–1, నూర్ 10–0–51–0, గుల్బదిన్ 2–0–16–1. చాంపియన్స్ ట్రోఫీలో నేడుపాకిస్తాన్ X బంగ్లాదేశ్స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన జద్రాన్.. రికార్డు శతకం.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా లాహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరుగుతున్న కీలక సమరంలో ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) రికార్డు శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో జద్రాన్ 146 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 177 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (6), సెదికుల్లా అటల్ (4), రహ్మత్ షా (4) విఫలం కాగా.. హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్జాయ్ (41), మహ్మద్ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్ 2, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో అలరించిన జద్రాన్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ (177) నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ పేరిట ఉండేది. డకెట్ ఇదే ఎడిషన్‌లో ఆస్ట్రేలియాపై 165 పరుగులు స్కోర్ చేశాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..ఇబ్రహీం జద్రాన్-177బెన్ డకెట్-165నాథన్ ఆస్టల్-145 నాటౌట్ఆండీ ఫ్లవర్-145సౌరవ్ గంగూలీ-141 నాటౌట్సచిన్ టెండూల్కర్-141గ్రేమీ స్మిత్-141ఈ సెంచరీతో జద్రాన్ మరో రెండు భారీ రికార్డులు కూడా సాధించాడు. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు గతంలో కూడా జద్రాన్ పేరిటే ఉండేది. జద్రాన్ తన రికార్డును తనే సవరించుకున్నాడు. 2022లో శ్రీలంకతో జరిగిన వన్డేలో జద్రాన్ 162 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండింది. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..ఇబ్రహీం జద్రాన్-177 వర్సెస్ ఇంగ్లండ్, 2025ఇబ్రహీం జద్రాన్-162 వర్సెస్ శ్రీలంక, 2022రహ్మానుల్లా గుర్భాజ్-151 వర్సెస్ పాకిస్తాన్, 2023అజ్మతుల్లా ఒమర్జాయ్-149 నాటౌట్ వర్సెస్ శ్రీలంక, 2024రహ్మానుల్లా గుర్భాజ్-145 వర్సెస్ బంగ్లాదేశ్, 2023ఈ సెంచరీతో జద్రాన్ రెండు ఐసీసీ వన్డే ఈవెంట్లలో సెంచరీలు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. జద్రాన్.. వన్డే వరల్డ్‌కప్‌లో, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలు చేశాడు. జద్రాన్.. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీతో మెరిశాడు. ముంబైలో జరిగిన ఆ మ్యాచ్‌లో జద్రాన్ 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఈ రికార్డులతో పాటు జద్రాన్ మరో ఘనత కూడా సాధించాడు. పాక్ గడ్డపై నాలుగో అత్యధిక వన్డే స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాక్ గడ్డపై వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన ఘనత గ్యారీ కిర్‌స్టన్‌కు దక్కుతుంది. 1996 వరల్డ్‌కప్‌లో కిర్‌స్టన్ యూఏఈపై 188 పరుగులు (నాటౌట్) చేశాడు.పాక్ గడ్డపై వన్డేల్లో అత్యధిక స్కోర్లు..గ్యారీ కిర్‌స్టన్-188 నాటౌట్వివియన్ రిచర్డ్స్-181ఫకర్ జమాన్-180 నాటౌట్ఇబ్రహీం జద్రాన్-177బెన్ డకెట్-165ఆండ్రూ హడ్సన్-161జద్రాన్ అద్భుత పోరాటంటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ధాటికి 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆర్చర్.. 11 పరుగుల వద్ద గుర్భాజ్‌ను (6), 15 పరుగుల వద్ద సెదికుల్లా అటల్‌ను (4).. 37 పరుగుల వద్ద రహ్మత్ షాను (4) ఔట్ చేశాడు. ఈ దశలో జద్రాన్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. సెంచరీ వరకు ఆచితూచి ఆడిన జద్రాన్.. ఆతర్వాత శివాలెత్తిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాది ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. లివింగ్‌స్టోన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతికి జద్రాన్ ఔటయ్యాడు. జద్రాన్ ఔట్ కాపోయుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇంకా భారీ స్కోర్ చేసేది. ఇదే ఓవర్లో నబీ కూడా ఔట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ చివరి ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
Champions Trophy 2025: శతక్కొట్టిన జద్రాన్.. తొలి ఆఫ్ఘన్ ప్లేయర్‌గా రికార్డు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఇంగ్లండ్‌తో (England) ఇవాళ (ఫిబ్రవరి 26) జరుగుతున్న కీలక సమరంలో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో జద్రాన్ 106 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 35 మ్యాచ్‌ల వన్డే కెరీర్లో జద్రాన్‌కు ఇది ఆరో శతకం. ఈ సెంచరీతో జద్రాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. జద్రాన్ 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీతో మెరిశాడు. ముంబైలో జరిగిన ఆ మ్యాచ్‌లో జద్రాన్ 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ధాటికి 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆర్చర్.. 11 పరుగుల వద్ద గుర్భాజ్‌ను (6), 15 పరుగుల వద్ద సెదికుల్లా అటల్‌ను (4).. 37 పరుగుల వద్ద రహ్మత్ షాను (4) ఔట్ చేశాడు. ఈ దశలో జద్రాన్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది నాలుగో వికెట్‌కు 103 పరుగులు జోడించి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌కు జీవం పోశారు. హష్మతుల్లా 40 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం జద్రాన్..అజ్మతుల్లా ఒమర్జాయ్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 31 బంతుల్లో బౌండరీ, మూడు సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసిన అనంతరం అజ్మతుల్లా జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 42 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 227 పరుగులుగా ఉంది. జద్రాన్‌తో (115) పాటు మహ్మద్ నబీ (8) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, గ్రూప్-బిలో ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్‌గా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్ రేసులో నిలుస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య నిన్న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ప్రస్తుతం గ్రూప్-బి పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలో 3 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ ఖాతా తెరవకుండా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు ఇదివరకే సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. ఆతిథ్య పాకిస్తాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. -
గెలిచిన జట్టే నిలుస్తుంది
లాహోర్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ముందుకెళ్లేందుకు ఇంగ్లండ్ కీలకమైన పోరుకు సిద్ధమైంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో బట్లర్ బృందం అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సెమీస్ రేసులో ఉంటుంది. ఓడిన జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. తొలి మ్యాచ్‌లో ఆ్రస్టేలియాపై 350 పైచిలుకు స్కోరు చేసినా బౌలింగ్ వైఫల్యంతో ఓడిన ఇంగ్లండ్... లోపాల్ని సవరించుకొని అఫ్గాన్‌తో సమరానికి సిద్ధమైంది. ఓపెనర్ బెన్ డకెట్, జో రూట్, కెపె్టన్ బట్లర్, ఆర్చర్లు జోరు మీదున్నారు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నబీలతో కూడిన ప్రత్యర్థి స్పిన్ త్రయంపై జాగ్రత్తగా ఆడితే పరుగుల వరద పారించొచ్చు. వుడ్, ఆదిల్ రషీద్, లివింగ్‌స్టోన్‌లతో ఉన్న బౌలింగ్ దళం పరుగుల నిరోధంపై దృష్టి పెట్టాల్సి ఉంది. మరోవైపు అఫ్గానిస్తాన్ తొలి పోరులో దక్షిణాఫ్రికాతో ఘోరంగా ఓడింది. సఫారీకి 300 పైచిలుకు పరుగులు సమరి్పంచుకున్న అఫ్గాన్ కనీసం 50 ఓవర్ల కోటా కూడా ఆడలేక 208 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్‌లో గుర్బాజ్, జద్రాన్, సిద్ధిఖుల్లా వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా మారింది. రహ్మత్ షా ఒక్కడే బాధ్యత కనబరిచాడు. కీలకమైన పోరులో జట్టంతా కలిసి సమష్టిగా సర్వశక్తులు ఒడ్డితేనే గట్టి ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను ఎదుర్కోవచ్చు లేదంటే ఏ ఒక్కరిద్దరి ప్రదర్శనను నమ్ముకుంటే మాత్రం గత ఫలితమే మళ్లీ పునరావృతం అవుతుంది. తుది జట్లు (అంచనా) ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), సాల్ట్, డకెట్, జేమీ స్మిత్, రూట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, కార్స్, ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. అఫ్గానిస్తాన్: హష్మతుల్లా (కెప్టెన్), గుర్బాజ్, జద్రాన్, సిద్ధిఖుల్లా, రహ్మత్ షా, అజ్మతుల్లా, నబీ, గుల్బదిన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్.3 ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్లో ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ జట్లు ముఖాముఖిగా మూడుసార్లు తలపడ్డాయి. వరల్డ్‌కప్ టోర్నీ సందర్భంగానే ఈ మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఇంగ్లండ్ (2015, 2019లలో) రెండుసార్లు, అఫ్గానిస్తాన్ (2023లో) ఒకసారి గెలుపొందాయి. -
ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో మరో జట్టుతో జతకట్టిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్‌కు (Rashid Khan) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్యామిలీతో బంధం మరింత బలపడింది. ఇప్పటికే మూడు లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల్లో సభ్యుడిగా ఉన్న రషీద్.. తాజాగా మరో ఎంఐ ఫ్రాంచైజీతో జతకట్టాడు. రషీద్‌ను ద హండ్రెడ్ లీగ్‌లో ఎంఐ యాజమాన్యంలో నడుస్తున్న ఓవల్ ఇన్విన్సిబుల్స్ (డిఫెండింగ్ ఛాంపియన్) సొంతం చేసుకుంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇటీవలే పెట్టుబడులు పెట్టింది. ఇందులో 49 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కొనుగోలు చేసింది.ప్రస్తుతం రషీద్ ఒక్క ఐపీఎల్ మినహా మిగతా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల్లో (ఫారిన్ లీగ్‌ల్లో) సభ్యుడిగా ఉన్నాడు. రషీద్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్నాడు. రషీద్ సౌతాఫ్రికా టీ20 లీగ్ ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌కు.. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌కు.. మేజర్ లీగ్ క్రికెట్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ద హండ్రెడ్ లీగ్ ప్రారంభం నుంచి (2021) ట్రెంట్ రాకెట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్‌ను ఓవల్ ఇన్విన్సిబుల్స్ డైరెక్ట్ ఓవర్సీస్ సైనింగ్ ద్వారా దక్కించుకుంది.కాగా, ద హండ్రెడ్ లీగ్-2025 సీజన్ కోసం ప్లేయర్ల రిటెన్షన్ జాబితాలను ఎనిమిది ఫ్రాంచైజీలు ఇవాళ ప్రకటించాయి. గత సీజన్లో తమతో ఉన్న 10 మంది సభ్యులను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవచ్చు. రిటెన్షన్ జాబితాలో ఒక ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ తప్పక ఉండాలి. అలాగే ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్లు ఉండవచ్చు. అదనంగా ఓ విదేశీ ఆటగాడిని డైరెక్ట్ సైనింగ్ చేసుకోవచ్చు. ఈ పద్దతిలోనే ఇన్విన్సిబుల్స్ రషీద్ ఖాన్‌ను దక్కించుకుంది. ఫ్రాంచైజీల్లో మిగిలిన స్థానాల భర్తీ డ్రాఫ్ట్ ద్వారా జరుగుతుంది. డ్రాఫ్ట్ తేదీ ప్రకటించాల్సి ఉంది.ద హండ్రెడ్ లీగ్‌లో ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఓవల్ ఇన్విన్సిబుల్స్లో ముంబై ఇండియన్స్.. నార్తర్న్ సూపర్చార్జర్స్లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో లక్నో సూపర్ జెయింట్స్.. సథరన్ బ్రేవ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ దక్కించుకున్నాయి. వీటిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీ మొత్తాన్ని కొనుగోలు చేసింది. మిగతా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆయా ప్రాంచైజీల్లో 49 శాతం వాటాను దక్కించుకున్నాయి.రిటెన్షన్స్ జాబితా..బర్మింగ్హమ్ ఫీనిక్స్- బెన్ డకెట్, ట్రెంట్ బౌల్ట్ (ఓవర్సీస్), లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, ఆడమ్ మిల్నే (ఓవర్సీస్), బెన్నీ హోవెల్, టిమ్ సౌథీ (ఓవర్సీస్), డాన్ మౌస్లీ, విల్ స్మీడ్, క్రిస్ వుడ్, ఆనురిన్ డొనాల్డ్లండన్ స్పిరిట్- లియామ్ డాసన్, డాన్ వారోల్, కేన్ విలియమ్సన్ (ఓవర్సీస్), రిచర్డ్ గ్లీసన్, ఓలీ స్టోన్, ఓలీ పోప్, కీటన్ జెన్నింగ్స్మాంచెస్టర్ ఒరిజినల్స్- జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్, హెన్రిచ్ క్లాసెన్ (ఓవర్సీస్), మ్యాటీ హర్స్ట్, జోష్ టంగ్, స్కాట్ కర్రీ, టామ్ హార్ట్లీ, సోనీ బేకర్, టామ్ ఆస్పిన్వాల్నార్త్రన్ సూపర్ ఛార్జర్స్- హ్యారీ బ్రూక్, డేవిడ్ మిల్లర్ (ఓవర్సీస్), ఆదిల్ రషీద్, మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్), బ్రైడన్ కార్స్, బెన్ డ్వార్షుయిస్ (ఓవర్సీస్), మాట్ పాట్స్, పాట్ బ్రౌన్, గ్రహం క్లార్క్, టామ్ లాస్ఓవల్ ఇన్విన్సిబుల్స్- సామ్ కర్రన్, విల్ జాక్స్, రషీద్ ఖాన్ (ఓవర్సీస్), జోర్డన్ కాక్స్, సామ్ బిల్లింగ్స్, సాకిబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, డొనొవన్ ఫెరియెరా (ఓవర్సీస్), నాథన్ సౌటర్, ట్వాండా ముయేయేసథరన్ బ్రేవ్- జోఫ్రా ఆర్చర్, జేమ్స్ విన్స్, క్రిస్ జోర్డన్, టైమాల్ మిల్స్, డుప్లెసిస్ (ఓవర్సీస్), లూయిస్ డు ప్లూయ్, లారీ ఈవాన్స్, క్రెయిగ్ ఓవర్టన్, ఫిన్ అలెన్ (ఓవర్సీస్), డ్యానీ బ్రిగ్స్, జేమ్స్ కోల్స్ట్రెంట్ రాకెట్స్- జో రూట్, మార్కస్ స్టోయినిస్ (ఓవర్సీస్), టామ్ బాంటన్, సామ్ కుక్, జాన్ టర్నర్, సామ్ హెయిన్, టామ్ అల్సోప్, కాల్విన్ హ్యారీసన్వెల్ష్ ఫైర్- జానీ బెయిర్‌స్టో, స్టీవ్ స్మిత్ (ఓవర్సీస్), టామ్ కొహ్లెర్ కాడ్మోర్, టామ్ ఏబెల్, లూక్ వెల్స్, స్టీవీ ఎస్కినాజీ -
అదరగొట్టిన దక్షిణాఫ్రికా
కరాచీ: సుదీర్ఘ కాలంగా ఐసీసీ ట్రోఫీ టైటిల్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్న దక్షిణాఫ్రికా చాంపియన్స్ ట్రోఫీని భారీ విజయంతో మొదలు పెట్టింది. తొలిసారి టోర్నీ ఆడుతున్న అఫ్గానిస్తాన్‌కు ఎలాంటి సంచలనానికి అవకాశం ఇవ్వకుండా తమ స్థాయికి తగ్గ ఆటతో పైచేయి సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో భారీ స్కోరుతో చెలరేగిన మాజీ చాంపియన్ ఆ తర్వాత పదునైన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టింది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ర్యాన్ రికెల్టన్ (106 బంతుల్లో 103; 7 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ బవుమా (76 బంతుల్లో 58; 5 ఫోర్లు), మార్క్రమ్ (36 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), డసెన్ (46 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం అఫ్గానిస్తాన్ 43.3 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. రహ్మత్ షా (92 బంతుల్లో 90; 9 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. మూడు అర్ధ సెంచరీలు... ఇన్నింగ్స్ ఆరంభంలోనే టోనీ జోర్జి (11) వెనుదిరగ్గా ... రికెల్టన్, బవుమా కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. తొలి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరు 46 పరుగులకు చేరింది. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న రికెల్టన్ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు అఫ్గాన్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 63 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్న అనంతరం నబీ బౌలింగ్‌లో బవుమా వెనుదిరిగాడు. రికెల్టన్, బవుమా రెండో వికెట్‌కు 23.4 ఓవర్లలో 129 పరుగులు జోడించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి 101 బంతుల్లో రికెల్టన్ కెరీర్లో తొలి శతకాన్ని సాధించాడు. అయితే తర్వాతి ఓవర్లోనే అతను అనూహ్యంగా రనౌటయ్యాడు. కీలక వికెట్ తీసిన ఆనందం అఫ్గాన్‌కు దక్కలేదు. ఆపై డసెన్, మార్క్రమ్ తమ జోరును ప్రదర్శించడంతో దక్షిణాఫ్రికా స్కోరు 300 దాటింది. రహ్మత్ షా మినహా... భారీ ఛేదనలో అఫ్గాన్ టీమ్ తడబడింది. రహ్మత్ షా పట్టుదలగా నిలబడినా... ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం లేకపోయింది. నలుగురు సఫారీ పేసర్ల ధాటికి బ్యాటర్లు నిలవలేకపోయారు. పవర్‌ప్లే ముగిసేసరికే తొలి 2 వికెట్లు కోల్పోయిన జట్టు తర్వాతి 5 ఓవర్లలో మరో 2 వికెట్లు చేజార్చుకుంది. 89/5 స్కోరు వద్ద జట్టు గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. రహ్మత్ మాత్రం కాస్త పోరాడుతూ సెంచరీకి చేరువయ్యాడు. అయితే మరోవైపు నుంచి అతనికి సహకారం లభించలేదు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (రనౌట్) 103; టోనీ జోర్జి (సి) అజ్మతుల్లా (బి) నబీ 11; బవుమా (సి) సాదిఖుల్లా (బి) నబీ 58; డసెన్ (సి) హష్మతుల్లా (బి) నూర్ 52; మార్క్రమ్ (నాటౌట్) 52; మిల్లర్ (సి) రహ్మత్ (బి) ఫారుఖీ 14; యాన్సెన్ (బి) అజ్మతుల్లా 0; ముల్డర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 315. వికెట్ల పతనం: 1–28, 2–157, 3–201, 4–248, 5–298, 6–299. బౌలింగ్: ఫారుఖీ 8–0–59–1, అజ్మతుల్లా 6–0–39–1, నబీ 10–0– 51–2, రషీద్ ఖాన్ 10–0–59–0, గుల్బదిన్ 7–0–42–0, నూర్ అహ్మద్ 9–0–65–1. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) మహరాజ్ (బి) ఎన్గిడి 10; ఇబ్రహీమ్ (బి) రబడ 17; సాదిఖుల్లా (రనౌట్) 16; రహ్మత్ షా (సి) రికెల్టన్ (బి) రబడ 90; హష్మతుల్లా (సి) బవుమా (బి) ముల్డర్ 0; అజ్మతుల్లా (సి) రికెల్టన్ (బి) రబడ 18; నబీ (సి) రబడ (బి) యాన్సెన్ 8; గుల్బదిన్ (సి) బవుమా (బి) ఎన్గిడి 13; రషీద్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 18; నూర్ (బి) ముల్డర్ 9; ఫారుఖీ (నాటౌట్) 0; ఎక్స్ ట్రాలు 9; మొత్తం (43.3 ఓవర్లలో ఆలౌట్) 208. వికెట్ల పతనం: 1–16, 2–38, 3–50, 4–50, 5–89, 6–120, 7–142, 8–169, 9– 208, 10–208. బౌలింగ్: యాన్సెన్ 8–1– 32– 1, ఎన్గిడి 8–0–56–2,రబడ 8.3–1–36–3, ముల్డర్ 9–0–36–2, మహరాజ్ 10–0–46–1. చాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆ్రస్టేలియా X ఇంగ్లండ్‌వేదిక: లాహోర్ మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు (ఫిబ్రవరి 21) మరో ఆసక్తికర పోరు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) ఇవాళ (ఫిబ్రవరి 21) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan).. ఓ సారి ఛాంపియన్ (1998) సౌతాఫ్రికాను (South Africa) ఢీకొట్టనుంది. కరాచీ వేదికగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్-బిలో భాగంగా ఈ మ్యాచ్ జరుగుతుంది.సౌతాఫ్రికాకు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చివరిసారిగా 2024 సెప్టెంబర్‌లో ఎదురెదురుపడ్డాయి. యూఏఈ వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ఆ సిరీస్‌లో సౌతాఫ్రికాకు శృంగభంగం జరిగింది. ఆ సిరీస్‌ను సౌతాఫ్రికన్లు 1-2 తేడాతో కోల్పోయారు. దీనికి ముందు ఇరు జట్లు 2023 వన్డే వరల్డ్‌కప్‌లో తలపడగా.. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. వన్డేల్లో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు తలపడగా.. 3 మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్, 2 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా విజయాలు సాధించాయి.గతంలో పోలిస్తే ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు పటిష్టంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ జట్టు ఫుల్ మెంబర్ టీమ్‌తో బరిలోకి దిగింది. అలాగని ఆఫ్ఘనిస్తాన్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇటీవలి కాలంలో ఆఫ్ఘన్లు పటిష్టమైన జట్లకు షాకిచ్చారు.దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్), టోనీ డి జోర్జి, టెంబా బవుమా(కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, వియాన్ ముల్డర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగీ ఎంగిడి, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, కొర్బిన్ బాష్, రస్సీ వాన్ డర్ డస్సెన్ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఇక్రమ్ అలీఖిల్, నవీద్ జద్రాన్, నంగేయాలియా ఖరోటేఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు జరగ్గా రెండు రసవత్తరంగా సాగాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌కు న్యూజిలాండ్ షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో కివీస్ 60 పరుగుల తేడాతో గెలుపొందింది. నిన్న (ఫిబ్రవరి 20) జరిగిన మ్యాచ్‌లో భారత్.. బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు అంత ఈజీగా గెలుపు దక్కలేదు. బంగ్లా ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారు. -
అఫ్గాన్ సరిహద్దుల్లో పాక్ ఆపరేషన్.. 30మంది ఉగ్రవాదులు హతం
పెషావర్: పాకిస్తాన్ సైన్యం పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ సైనిక చర్య జరిగింది. నిఘావర్గాలు అందించిన సమాచారం మేరకు భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టి, 30 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. దీనికి సంబంధించిన వివరాలను పాక్ సైన్యం మీడియాకు తెలిపింది.ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందిన నేపధ్యంలో దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలోని సరోఘా ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, 30 మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. ఈ సైనిక చర్య విజయవంతమైన నేపధ్యంలో పాకిస్తాన్ సాయుధ దళాలను ప్రధాని షాబాజ్ షరీఫ్ ప్రశంసించారు.దీనికి ముందు పాకిస్తాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. వారు జరిపిన కాల్పుల్లో నలుగురు పాకిస్తాన్ సైనికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. 2025 జనవరి నుంచి పాకిస్తాన్లో ఉగ్ర దాడులు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది 2024 డిసెంబర్ కంటే 42 శాతం ఎక్కువ. జనవరిలో ఉగ్రవాద నిరోధక చర్యలలో భాగంగా భద్రతా దళాలు 185 మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఒక నివేదిక పేర్కొంది.ఇది కూడా చదవండి: రిస్క్‌లో కుంభమేళా మోనాలిసా? -
మా జట్టుకు గట్టి పోటీ తప్పదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: పాక్ మాజీ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్ దశలో తమ జట్టుకు గట్టిపోటీ తప్పదంటున్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed). టీమిండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ల జట్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుందని పేర్కొన్నాడు. అయితే, సొంతగడ్డపై జరిగే ఈ టోర్నీలో పాకిస్తాన్(Pakistan) తప్పకుండా సెమీ ఫైనల్‌కు మాత్రం చేరుతుందని సర్ఫరాజ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశాడు.కాగా 2017లో చివరగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్లో పాక్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. నాడు సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో లండన్ వేదికగా జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఎనిమిదేళ్ల అనంతరంఇక ఇప్పుడు.. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం ఈ మెగా టోర్నీ మరోసారి జరుగనుండగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.ఇక ఈ ఐసీసీ ఈవెంట్‌కు పాకిస్తాన్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి.ఈ క్రమంలో ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ , ఇంగ్లండ్‌ను చేర్చారు. ఇక పాక్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడనుంది.సెమీ ఫైనల్స్‌లో ఆ నాలుగేఈ నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సెమీస్ చేరే జట్లపై తన అంచనా తెలియజేశాడు. ‘‘పాకిస్తాన్ ఉన్న గ్రూపులో జట్ల నుంచి గట్టి పోటీ తప్పదు. అయితే, నా అభిప్రాయం ప్రకారం... ఈసారి పాకిస్తాన్, ఇండియా, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా బలమైన జట్లుగా కనిపిస్తున్నాయి. సెమీ ఫైనల్స్ ఈ నాలుగే చేరతాయి’’ అని సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు.ఇక తమ జట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ టీమ్ పటిష్టంగా ఉంది. సొంతగడ్డపై టోర్నీ ఆడనుండటం అతిపెద్ద సానుకూలాంశం. సొంత మైదానాల్లో ఎలా ఆడాలన్న అంశంపై ప్రతి ఒక్క ఆటగాడికి అవగాహన ఉంది. 2017లో ట్రోఫీ గెలిచిన జట్టుతో పోలిస్తే.. ప్రస్తుత జట్టు మరింత స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది.ప్రధాన బలం వారేబాబర్ ఆజం రూపంలో జట్టులో వరల్డ్‌క్లాస్ ప్లేయర్ ఉన్నాడు. ఫఖర్ జమాన్ ఆనాడు కొత్తగా జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు అనుభవం కలిగిన ఆటగాడిగాబరిలోకి దిగబోతున్నాడు. వీళ్దిద్దరు పాకిస్తాన్ జట్టుకు ప్రధాన బలం’’ అని సర్ఫరాజ్ అహ్మద్ చెప్పుకొచ్చాడు.కాగా 2017లో చివరగా ఐసీసీ టైటిల్ గెలిచిన పాకిస్తాన్ ఇప్పటివరకు మళ్లీ మెగా ఈవెంట్లలో గెలుపు రుచిచూడలేదు. 2023 వన్డే వరల్డ్‌కప్, టీ20 ప్రపంచకప్-2024లో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇప్పుడు స్వదేశంలోనైనా.. గత చేదు అనుభవాలను మరిపించేలా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇటీవల వన్డే సిరీస్‌లలో వరుస విజయాలతో జోరు మీదున్న పాక్ జట్టుకు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో పరాభవం ఎదురైంది.మహ్మద్ రిజ్వాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ విజయం సాధించిన పాక్.. సౌతాఫ్రికాలో 3-0తో క్లీన్‌స్వీప్ చేసి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. అయితే, తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌తో జరిగిన ట్రై సిరీస్‌లో ఫైనల్ చేరుకున్న రిజ్వాన్ బృందం కివీస్ చేతిలో ఓటమిపాలైంది.చదవండి: డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ మాత్రమే.. మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర: నీతా అంబానీ -
ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ సంచలనం
ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) స్పిన్ సంచలనం అల్లా ఘజన్ఫర్ (AM Ghazanfar) త్వరలో ప్రారంభంకానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy) దూరమయ్యాడు. 18 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్ బౌలర్ గత నెలలో జింబాబ్వేతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఘజన్ఫర్కు వెన్నుపూసలో పగుళ్లు వచ్చినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీని కారణంగా ఘజన్‌ఫన్ నాలుగు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఘజన్ఫర్ ఐపీఎల్ 2025లో పాల్గొనేది కూడా అనుమానమే అని తెలుస్తుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఘజన్‌ఫర్‌ను రూ. 4.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఘజన్ఫర్కు ప్రత్యామ్నాయంగా నంగేయాలియా ఖరోటేను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు. లెఫ్ట్ ఆర్మ స్పిన్నర్ అయిన ఖరోటే ముందుగా ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టులో (ఛాంపియన్స్ ట్రోఫీ) ట్రావెలింగ్ రిజార్వ్గా ఉన్నాడు. 20 ఏళ్ల ఖరోటే ఆఫ్ఘనిస్తాన్ తరఫున 7 వన్డేలు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. ఘజన్ఫర్ విషయానికొస్తే.. ఈ మిస్టరీ స్పిన్నర్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున 11 వన్డేల్లో 21 వికెట్లు.. ఓ టెస్ట్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. ఘజన్ఫర్ లేని లోటు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్పై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహమత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇక్రామ్ అలీఖిల్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటే, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ ప్రయాణం ఫిబ్రవరి 21న ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లతో కలిసి గ్రూప్-బిలో పోటీపడుతుంది.2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్‌లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లు..ఫిబ్రవరి 21న సౌతాఫ్రికాతోఫిబ్రవరి 26న ఇంగ్లండ్తోఫిబ్రవరి 28న ఆస్ట్రేలియాతో -
ఉగ్రవాదాన్ని అంతమొందించాలంటే...
ఆధునిక మానవుడు సాధించిన ఎన్నో ఘన విజయాలకు, సాధించుకున్న సామాజిక ప్రశాంతతకు భంగం కలిగించడంలో ఉగ్రవాదం పెనుసవాలుగా మారింది. గడచిన రెండువందల ఏళ్ల కాలంలో వివిధ దేశాల్లో పుట్టుకొచ్చిన 400కు పైగా టెర్రర్ గ్రూపుల పైన, అవి రూపాంతరం చెందడం, అంతమవడం పైన సమగ్ర అధ్యయనం చేశారు ప్రొ‘‘ ఆడ్రీ కుర్త్ క్రోనిన్. ప్రస్తుతం ఆమెరికాలోని ‘కార్నెగీ మెలన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటెజీ అండ్ టెక్నాలజీ’ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గత చరిత్రను తవ్వి తీసి ఆమె చేసిన పరిశోధనలో ఉగ్ర భూతాన్ని అంతమొందించడంపై విలువైన సమాచారం ఉంది. ఆమె రాసిన ‘హౌ టెర్రరిజమ్ ఎండ్స్: అండర్స్టాండింగ్ ద డిక్లయిన్ అండ్ డిమైస్ ఆఫ్ టెర్రరిస్ట్ క్యాంపెయిన్స్’ పరిశోధన గ్రంథాన్ని ప్రిన్స్టన్ యూనివర్శిటీ ప్రెస్ 2011లో ప్రచురించింది. ఉగ్రవాద సంస్థలు అంతమయ్యే ఆరు మార్గా లను తన అధ్యయనంలో గుర్తించారామె. అవి:1) ఉగ్ర సంస్థల అగ్రనేతలను భౌతికంగా అంతమొందించడం. 2) సంప్రతింపుల ద్వారా టెర్రరిస్టు గ్రూపు డిమాండ్ల పరిష్కారం. 3) రాజ్యంపై ఉగ్రవాద సంస్థ పైచేయి సాధించడం ద్వారా తానే రాజ్యం కావడం (ఉదా: తాలిబన్ ప్రభుత్వం). 4) అంతర్గత కలహాలతో పతనమవడం. 5) మిలిటరీ దాడులతో చెల్లాచెదురవడం. 6) ఉగ్ర సంస్థ తనకు తానుగా పంథా మార్చుకుని రాజకీయ పార్టీగా అవత రించడం.ఉగ్రవాద నేతల అంతం విషయంలో ఒక పద్ధతి పైస్థాయి నేతలను అడ్డు తొలగించుకోవడం. ఉదా: ఒసామా బిన్ లాడెన్‌ను చంపడం. బిన్ లాడెన్ తర్వాత అల్‌ఖైదాకు నేతృత్వం వహించిన అల్ జవహిరిని కూడా అమెరికా 2022లో కాబూల్‌లో డ్రోన్ దాడితో అంతమొందించింది. ఇదంతా ఉగ్రవాద భూతం తల నరికేయడమన్న మాట!ఇరాన్ ఎజెండాను అమలు చేసే ప్రాక్సీ గ్రూపులు హమాస్, హెజ్బొల్లాలకు చెందిన పలువురు కీలక నేతలను మట్టుబెట్టడం ద్వారా ఇజ్రాయెల్ ఇదే పని చేస్తోంది. ఇంకో ఉదాహరణ మన పొరుగున ఉన్న శ్రీలంకకు చెందిన ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్’ (ఎల్టీటీఈ)! 2009లో వేలుపిళ్లై ప్రభాకరన్ మరణంతో ఒకప్పుడు ఆ దేశం మొత్తాన్ని గడగడ వణికించిన ఉగ్రవాద సంస్థ కాస్తా నిర్వీర్యమైపోయింది. ప్రత్యేక దేశం కోసం పంజాబ్‌లో మొదలైన ‘ఖలిస్తాన్’ ఉగ్రవాదం 1980లో పతాక స్థాయికి చేరిన విషయం అంద రికీ తెలిసిందే. 1984లో స్వర్ణ దేవాలయం నుంచి ఉగ్ర వాదులను ఏరివేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’, ఆ తరువాత 1988లో చేపట్టిన మరో మిలిటరీ చర్య ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థను నిర్మూలించాయి.ఈ మధ్యే సిరియాలో అధికార మార్పిడి జరిగింది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి రష్యాకు పారిపోయాడు. బషర్ వైరి పక్షాలకు అమెరికా, ఇజ్రా యెల్లు పరోక్ష మద్దతునివ్వడం వల్లనే ఇది సాధ్యమైంది. ఈ రెండు దేశాలూ కొన్ని గ్రూపులకు ప్రత్యక్షంగా మరి కొన్నింటికి పరోక్షంగా సాయం చేశాయి. అయితే బషర్ అల్–అసద్ పాలన అంతమై పోవడం కాస్తా ఆ ప్రాంతంలో ఇరాన్ ప్రాభవం తగ్గేందుకు కారణమైంది. ఉగ్రవాద భూతాన్ని ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరం అనేందుకు ఇజ్రాయెల్ కోవర్టు ఆపరేషన్లు ఒక నిదర్శనం. ఉగ్రవాదాన్ని అణచివేసే మార్గాల్లో కీలకమైంది చర్చలు. ఉత్తర ఐర్లాండ్‌లో ‘గుడ్‌ఫ్రైడే అగ్రిమెంట్’ కావచ్చు, అఫ్గానిస్తాన్‌లోని ఇటీవలి పరిణామాలు కావచ్చు... ఉగ్రవాద సంస్థలను ప్రభుత్వ పాత్రల్లోకి మార్చే క్రమంలో వచ్చే సంక్లిష్టతలు, సమస్యలకు దర్పణం పడతాయి. అయితే సందర్భాన్ని బట్టి చేపట్టే చర్చల వ్యూహాలు, ప్రణాళికలు వాటి అమలు వంటివి జయాపజయాలను నిర్ణయిస్తూ ఉంటాయి. ఉగ్రవాద సంస్థల లోపల ఉన్న వైరుద్ధ్యాలను గుర్తించడం, ప్రజల మద్దతు లేకుండా చేయడం వంటివి సంస్థ లను విడదీసేందుకు బాగా ఉపయోగపడతాయి. ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనేవారు... ఈ అంతర్గత వైరుద్ధ్యాలకు ఆజ్యం పోయగలవారై ఉండాలి. మత విశ్వాసాలే ఇంధనంగా మనుగడ సాగించే ఉగ్ర సంస్థలను కేవలం మిలిటరీ,కౌంటర్ టెర్రరిస్ట్ చర్యలతో సమూలంగా నాశనం చేయలేం. చర్చలు జరపడం, వాటి డిమాండ్లు న్యాయబద్ధమైనవైతే అంగీకరించడం, అది వీలుకాని సందర్భంలో వాటిలో చీలికలు తీసుకువచ్చి బలహీన పర్చడం చేయొచ్చు. డా‘‘ క్రోనిన్ పరిశోధన ప్రకారం... ఉగ్రవాద సంస్థల జీవిత కాలం ఐదు నుంచి పదేళ్లు మాత్రమే. కొన్ని ఇంతకంటే ఎక్కువ కాలం ఉనికిలో ఉండవచ్చు. విధాన రూపకర్తలు ఉగ్రవాద సంస్థల విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవడం మేలని ఆమె సూచి స్తున్నారు. సైబర్ టెర్రరిజమ్, దేశాలు ప్రేరేపించే ఉగ్ర వాదాల వంటి సంక్లిష్ట అంశాల విషయంలో దీని ప్రాధాన్యం మరింత ఎక్కువ.ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్న దేశాలకు డా‘‘ క్రోనిన్ పరిశోధన ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. స్థూలంగా చెప్పాలంటే... ఓపిక, పరిస్థితులకు అనుగుణంగా మార్చు కోవాల్సిన అవసరం, సమస్యను సమగ్రంగా అర్థం చేసు కోవడం కౌంటర్ టెర్రరిజమ్ వ్యూహాల రూపకల్పనలో చాలా కీలకమని ఈ పరిశోధన చెబుతుంది. విధాన రూపకర్తలు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆధునిక రూపం సంతరించుకున్న ఉగ్రవాద భూతానికి పగ్గాలు వేసేందుకు సమర్థమైన చర్యలు చేపట్టాలి. భారీ నెట్‌వర్క్‌లు ఉన్న వాటితోపాటు... వ్యక్తులు కూడా ఉగ్రవాదానికి పాల్పడుతున్న ఈ కాలంలో క్రోనిన్ పరిశోధన ఉగ్రవాదాన్ని పునాదులతోపాటు పెకిలించే వ్యూహానికి విలువైన సూచనలు ఇస్తోంది.బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో (ఇంటర్నేషనల్ మరియు ఫ్రాంచైజీ క్రికెట్) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రషీద్ ఈ రికార్డును సాధించే క్రమంలో విండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (Dwane Bravo) రికార్డును బద్దలు కొట్టాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో (SA20) భాగంగా పార్ల్ రాయల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన రషీద్.. తన జట్టును (ఎంఐ కేప్‌టౌన్) తొలిసారి ఫైనల్స్‌కు (కెప్టెన్‌గా) చేర్చాడు.26 ఏళ్ల రషీద్ 461 టీ20ల్లో 633 వికెట్లు పడగొట్టగా.. అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రావో 582 మ్యాచ్‌ల్లో 631 వికెట్లు తీశాడు. రషీద్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 161 వికెట్లు.. ఫ్రాంచైజీ మరియు దేశవాలీ క్రికెట్లో 472 వికెట్లు పడగొట్టాడు. రషీద్ తన టీ20 కెరీర్లో ఆఫ్ఘనిస్తాన్ సహా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఎంఐ కేప్‌టౌన్, అడిలైడ్ స్ట్రయికర్స్, గయానా అమెజాన్ వారియర్స్, ఎంఐ ఎమిరేట్స్, లాహోర్ ఖలందర్స్, ససెక్స్ షార్క్స్, ట్రెంట్ రాకెట్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..రషీద్ ఖాన్-633డ్వేన్ బ్రావో-631సునీల్ నరైన్-574ఇమ్రాన్ తాహిర్-531షకీబ్ అల్ హసన్-492కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ఫైనల్‌కు చేరింది. నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఎంఐ కేప్‌టౌన్ పార్ల్ రాయల్స్‌పై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన రాయల్స్ 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. రాణించిన బ్రెవిస్, రికెల్టన్ఈ మ్యాచ్‌లో ఎంఐ చేసిన స్కోర్.. ఈ సీజన్లో ఆ జట్టుకు మూడో అత్యధిక స్కోర్. ఎంఐ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వాన్ డర్ డస్సెన్ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా డెవాల్డ్ బ్రెవిస్ (30 బంతుల్లో 44 నాటౌట్; 4 సిక్సర్లు), జార్జ్ లిండే (14 బంతుల్లో 26; 3 సిక్సర్లు), డెలానో పోట్గెటర్ (17 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. రాయల్స్ బౌలర్లలో దునిత్ వెల్లలగే 2, ఫోర్టుయిన్, డేవిడ్ గేలియమ్ తలో వికెట్ పడగొట్టారు.తలో చేయి వేసిన బౌలర్లు200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌ను ఎంఐ బౌలర్లు తలో చేయి వేసి దెబ్బేశారు. ఎంఐ బౌలర్ల ధాటికి రాయల్స్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ, కార్బిన్ బాష్, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జ్ లిండే ఓ వికెట్ పడగొట్టి రాయల్స్ పతనాన్ని శాశించారు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ (45) టాప్ స్కోరర్‌గా నిలువగా.. దినేశ్ కార్తీక్ (31) ఓ మోస్తరు స్కోర్ చేశాడు.ఓడినా మరో ఛాన్స్ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్ చేరేందుకు రాయల్స్‌కు మరో అవకాశం ఉంది. రేపు (ఫిబ్రవరి 6) జరుగబోయే క్వాలిఫయర్-2లో రాయల్స్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 5) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్.. జోబర్గ్ సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. గత రెండు సీజన్లలో టేబుల్ లాస్ట్‌లో నిలిచిన ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి ఫైనల్‌కు చేరింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్ రెండు ఎడిషన్లలో విజేతగా నిలిచింది. -
తాలిబన్లను వ్యతిరేకించి క్రికెట్ బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ధీర వనితలు
ఆఫ్ఘనిస్తాన్ మహిళల క్రికెట్లో (Afghanistan Women's Cricket Team) నవశకం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ ధీర వనితలు తమ దేశంలో రాజ్యమేలుతున్న ఆటవిక తాలిబన్ల (Taliban) పాలనను వ్యతిరేకించి క్రికెట్ బరిలోకి దిగారు. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో (Melbourne Cricket Ground) క్రికెట్ వితౌట్ బోర్డర్స్ ఎలెవెన్‌తో ఇవాళ (జనవరి 30) ఎగ్జిబిషన్ టీ20 మ్యాచ్ ఆడారు. మహిళల యాషెస్ (ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్) టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఈ మ్యాచ్ జరిగింది. క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ వితౌట్ బోర్డర్స్, ఆస్ట్రేలియా ప్రభుత్వం కలిసి ఈ మ్యాచ్‌ను నిర్వహించాయి. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు, అప్పటి నుంచి అక్కడి మహిళలు క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. దీంతో ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్లు ఒక్కొక్కరుగా దేశాన్ని వీడి ఆస్ట్రేలియాలో శరణార్థులుగా తలదాచుకున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ప్రభుత్వం చొరవతో ఒక్కొక్కరుగా విడిపోయిన ఆఫ్ఘన్ క్రికెటర్లు మూడేళ్ల తర్వాత జట్టుగా కూడి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు.చాలాకాలం తర్వాత జట్టుగా బరిలోకి దిగడంతో ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మాకందరికీ ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశాన్ని వీడాం. ఇప్పుడు అందరం కలిసి ఒక్కటయ్యాం అని ఓ ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్ భావోద్వేగ ప్రకటన చేసింది. కాగా, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వం మహిళలపై అనేక అంక్షలు అమల్లో పెట్టిన విషయం తెలిసిందే. అక్కడి మహిళలు ఉన్నత చదువులు చదువకోవడానికి వీల్లేదు. స్వేచ్ఛగా బయట తిరగకూడదు. ఎలాంటి క్రీడల్లో పాల్గొనకూడదు. -
వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు గెలుచుకున్న ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్
ఆఫ్ఘనిస్తాన్ యువ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ప్రతిష్టాత్మక ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డును గెలుచుకున్నాడు. గతేడాది వన్డేల్లో విశేషంగా రాణించినందుకు గానూ ఒమర్జాయ్ను ఈ అవార్డు వరించింది. ఒమర్జాయ్ గతేడాది 14 వన్డేల్లో 417 పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు. ఒమర్జాయ్ బ్యాటింగ్ సగటు గతేడాది 52.12గా ఉంది. ఒమర్జాయ్ ప్రదర్శనల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ గతేడాది ఆడిన ఐదు వన్డే సిరీస్‌ల్లో నాలుగింట జయకేతనం ఎగురవేసింది. శ్రీలంక మినహా ఐర్లాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలపై విజయాలు సాధించింది. ఒమర్జాయ్ గతేడాది ఆఫ్ఘనిస్తాన్ తరఫున సెకండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా, సెకెండ్ హైయెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. 24 ఏళ్ల ఒమర్జాయ్ రైట్ ఆర్మ్ పేస్ బౌలింగ్‌తో పాటు రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు. ఒమర్జాయ్ 2024లో తన తొలి వన్డేలోనే సూపర్ సెంచరీ చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అతను అజేయమైన 149 పరుగులు చేశాడు. ఒమర్జాయ్ గతేడాది సౌతాఫ్రికాపై ఓ అద్భుత ప్రదర్శన చేశాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లోని రెండో వన్డేలో ఒమర్జాయ్ 50 బంతుల్లో అజేయమైన 86 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఒమర్జాయ్ బంతితోనూ చెలరేగాడు. 2021లో వన్డే అరంగ్రేటం చేసిన ఒమర్జాయ్ ఇప్పటివరకు 36 వన్డేలు ఆడి 907 పరుగులు చేశాడు. అలాగే 30 వికెట్లు పడగొట్టాడు. మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కోసం ఒమర్జాయ్తో పాటు కుసాల్ మెండిస్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వనిందు హసరంగ పోటీ పడ్డారు.2024కు సంబంధించి ఇప్పటివరకు ప్రకటించిన ఐసీసీ అవార్డులు- ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ - ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్- ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్- ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝా- ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్- ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్- ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్- ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్: యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జామీ స్మిత్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్‌కీపర్), చరిత్ అసలంక (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగా, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్, అల్లా ఘజన్ఫర్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్. -
పాకిస్తాన్ ముంగిట తాలిబన్ సవాళ్లు
అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ దళాలు 2021లో అఫ్గానిస్తాన్‌ను వీడిన తర్వాత ఆ దేశాన్ని రెండోసారి హస్తగతం చేసుకున్న తాలిబన్... ప్రస్తుతం భద్రతా పరంగా పాకిస్తాన్‌కు అత్యంత ముప్పుగా మారింది. ఒకప్పుడు అఫ్గానిస్తాన్‌లో తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ మిలిటరీ, నిఘా సంస్థలు తాలిబన్లకు శిక్షణ ఇచ్చి వారిని మరింత బలపడేలా చేశాయి. సోవియట్ యూనియన్ దళాల ఉపసంహరణ తర్వాత రాజకీయ అనిశ్చితి మధ్య అఫ్గానిస్తాన్‌ను పాలిస్తున్న బుర్హనుద్దీన్ రబ్బానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి 1996లో తాలిబన్లు ఆ దేశాన్ని హస్తగతం చేసు కున్నారు. అప్పటినుండి 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై దాడి తర్వాత అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని కూలదోసి హమీద్ కర్జాయ్ ప్రభుత్వం ఏర్పడే దాకా, తాలిబన్లతో పాకిస్తాన్ సత్సంబంధాలు నెరిపింది.వివాదాలు కూడా పట్టనంతగా...ఈ కాలంలో తాలిబన్ ప్రభుత్వం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎంతలా పెనవేసుకు పోయాయంటే, రెండు దేశాల మధ్య 1947 నుండి ఉన్న సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేంతగా. ముఖ్యంగా 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించిన 2,640 కిలోమీటర్ల పొడవైన డ్యూరాండ్ లైన్ వల్ల దశాబ్దాలుగా ఏర్పడిన సంఘర్షణాత్మక వైఖరులను కూడా మరిచిపోయేంతగా. తాలిబన్‌తో సహా అఫ్గానిస్తాన్‌లో ఏర్పడిన అన్ని ప్రభుత్వాలదీ డ్యూరాండ్ లైన్ మీద ఒకే వైఖరి. వాటి వాదన ప్రకారం, ఇది సరిహద్దులకు ఇరువైపులా ఉన్న పష్తూ జాతి ప్రజలను వేరుచేయడమే కాకుండా, శతాబ్దాలుగా ఉన్న సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను దెబ్బతీస్తోంది. పాకిస్తాన్ మాత్రం ఈ లైన్ చట్టబద్ధత కలిగిన అధికారిక సరి హద్దుగా భావిస్తోంది. తాలిబన్ తన మొదటి దశ పాలనలో ఎక్కు వగా అఫ్గానిస్తాన్‌ను ఏకీకృతం చేయడంపై, తన అధికార పరిధిని విస్తరించడంపై దృష్టి కేంద్రీకరించింది. తాలిబన్‌కు కావలసిన కీలక మైన సైనిక, ఆర్థిక, దౌత్య సహాయాలను పాక్ చేస్తుండటంతో సరి హద్దు సమస్యలను లేవనెత్తి పాకిస్తాన్ ఆగ్రహానికి గురికాకూడదనే భయంతో తాలిబన్ కూడా సరిహద్దు విషయాన్ని పక్కన పెట్టింది. సరిహద్దులకు ఇరువైపులా ఉన్న పష్తూన్లు ఏకమైతే పష్తూన్ జాతీయ వాదం తమను ముక్కలు చేస్తుందన్న భయం పాకిస్తాన్‌ను మొదటి నుండి వెంటాడుతోంది. ఆ విషయం తాలిబన్‌కు తెలిసినప్పటికీ తన కున్న అవసరాల దృష్ట్యా పష్తూన్ల ఐక్యత ఒక రాజకీయ కోణంలా రూపాంతరం చెందకుండా చూసుకుంది.ఎక్కడ చెడింది?ఇంతటి బలమైన సంబంధాలు నెరపిన పాకిస్తాన్, తాలిబన్ మధ్య 2021 తర్వాత దూరం పెరగడానికి ముఖ్యంగా రెండు కారణాలు కనబడతాయి. ఒకటి, 2001లో అమెరికా చేపట్టిన తీవ్రవాదంపై యుద్ధంలో పాకిస్తాన్ పోషించిన ముఖ్యపాత్ర. 1999లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి జనరల్ ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దుర్భరస్థితిలో వుంది. ఆ దేశ విదేశీ అప్పులు సుమారు 39 బిలియన్ డాలర్లు ఉంటే, వడ్డీల చెల్లింపులకే బడ్జెట్లో సుమారు 56 శాతం కేటాయించాల్సిన పరిస్థితి! ఆ సమయంలో అమెరికాతో జట్టు కట్టడం వలన, అనేక బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం పొందడమే కాకుండా, పారిస్ క్లబ్ రుణదాతల నుండి కొత్త రుణాలు పొందగలిగింది. పాత రుణ బకాయిల చెల్లింపుల్లో సైతం అనేక వెసులుబాట్లు పొందగలిగింది. 1998లో అణు పరీక్షల తర్వాత ఎదుర్కొన్న అనేక ఆర్థిక ఆంక్షల నుండి విముక్తి పొందగలిగింది. వీటన్నిటి ఫలితంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడటమే కాకుండా, 2003 నాటికి పారిశ్రామిక రంగం సుమారు 8 శాతం వృద్ధి నమోదు చేసింది. అదే సమయంలో 2001లో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కూలిపోవడంతో అనేక మంది తాలిబన్ ఫైటర్లు పాకిస్తాన్‌లోని ట్రైబల్ ఏరియాల్లోకి పారిపోయి ప్రజల్లో కలిసి పోయారు. మరి కొంతమంది, 2007లో పాకిస్తాన్లో కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇస్లామిక్ సిద్ధాంతాలను వ్యాపింప జేయ డానికి ‘తెహ్రిక్ ఏ తాలిబన్ పాకిస్తాన్’(టీటీపీ) స్థాపించారు.రెండో కారణానికి వస్తే, పాకిస్తాన్ 2017–2022 మధ్య ఏక పక్షంగా తన, అఫ్గానిస్తాన్ మధ్యన ఉన్న సరిహద్దుల్లో కంచె వేసి సరి హద్దులకిరువైపులా ఉన్న అనేక సంబంధాలను దెబ్బ తీసింది. ఈ కంచె తనకు సరిహద్దులపై పట్టును కల్పించి తీవ్రవాదాన్ని, మాదక ద్రవ్యాల, ఆయుధాల, మానవ, ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు తోడ్పడుతుందని భావించింది. అష్రాఫ్ ఘనీ నేతృత్వంలోని అప్పటి అఫ్గాన్ ప్రభుత్వం ఎంత వ్యతిరేకించినప్పటికీ అత్యాధునిక వసతులతో సరిహద్దు కంచెను పూర్తిచేసింది. ఇది అఫ్గానిసాన్లోని అన్ని వర్గాలను, ముఖ్యంగా తాలిబన్లకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ సరిహద్దు వలన, సుమారు పదిహేను వేలమంది అఫ్గాన్లు తమ ఉపాధి కోల్పోవడమే కాకుండా, పాకిస్తాన్ నుండి వచ్చే సరుకుల్లో సుమారు 40 శాతం వస్తువులపై కోత పడటంతో అవి స్థానిక మార్కెట్లలో లభ్యం కాక అఫ్గాన్ ప్రజలు తీవ్ర అవస్థలు పడటానికీ, వస్తువుల ధరలు పెరగడానికీ దారితీసింది.టీటీపీ డిసెంబర్ 31, 2022న మరింత ముందుకెళ్లి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఏకంగా పాకిస్తాన్ సార్వ భౌమత్వాన్ని సవాలు చేయడమే. అప్పటి నుండి పాకిస్తాన్లో తీవ్ర వాద దాడులు పెరగడం చూడవచ్చు. ఇస్లామాబాద్‌లోని ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్’ ఇటీవల ప్రచురించిన నివేదిక ప్రకారం, పాకిస్తాన్ గతేడాది 1,166 తీవ్రవాద దాడులు ఎదుర్కొంది. అందులో 2,546 మంది చనిపోతే, 2,267 మంది గాయపడ్డారు. ఈ లెక్కలు అంతకుముందు ఏడాది (2023)తో పోలిస్తే 66 శాతం ఎక్కువ. ఒక్క గత నవంబర్లోనే 444 (రోజుకు సుమారు 15) దాడులు జరిగితే అందులో సుమారు 685 మంది చనిపోయారు.అంటే పరిస్థితి ఎంత తీవ్రత సంతరించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఒక వైపు టీటీపీ, మరోవైపు బలోచిస్తాన్ ప్రాంత స్వతంత్రం కోసం కొట్లాడుతున్న తీవ్రవాద గ్రూపుల దాడుల మధ్య పాకిస్తాన్ చిక్కుకుంది. అయితే, ఆ రెండు ప్రాంతాల తీవ్రవాద గ్రూపుల మధ్య ఉన్న భావజాల విభేదాల వల్ల వాటికి సన్నిహిత సంబంధాలు ఉండక పోవచ్చు. కానీ సరిహద్దుల్లో తాలిబన్ దాడులు చేస్తోంటే, పాకిస్తాన్ లోపల టీటీపీ రక్తపాతాన్ని సృష్టిస్తోంది.ఇండియాకూ కీలకమే!ఇలాంటి పరిస్థితుల మధ్య గత డిసెంబర్ 30న పాకిస్తాన్ ఐఎస్ఐ అధినేత... తాలిబన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అఫ్గాన్ నేష నల్ ఫ్రంట్‌కు ఆశ్రయమిచ్చిన తజికిస్తాన్ అధ్యక్షుడు ఏమోమాలి రహెమాన్‌ను కలిశారు. అది జరిగిన కొద్ది రోజులకు, జనవరి 8న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తాలిబన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టకీని దుబాయ్‌లో కలిశారు. ఇవి కొత్త చర్చలకు దారి తీయడమే కాకుండా, ఈ ప్రాంతంలో మారుతున్న వ్యూహాత్మక సమీకరణాలను, ఏర్పడుతున్న కొత్త సంబంధాలను, ఆవిష్కృతమవుతున్న నూతన ప్రాంతీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రానున్న రోజులలో వివిధ అవసరాల దృష్ట్యా తాలిబన్లతో సత్సంబంధాలు అటు రష్యాకూ, ఇటు చైనాకూ, వాటితో పాటే భారత్‌కూ అత్యంత కీలకం. గద్దె ఓంప్రసాద్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్,దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం, జేఎన్‌యూ, న్యూఢిల్లీ ‘ opgadde2@gmail.com -
గుల్బదిన్ ఆల్‌రౌండ్ షో.. వైపర్స్‌కు తొలి పరాజయం
ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో (ILT20-2025) డెసర్ట్ వైపర్స్‌కు తొలి పరాజయం ఎదురైంది. నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో వైపర్స్ దుబాయ్ క్యాపిటల్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. క్యాపిటల్స్‌ను గుల్బదిన్ నైబ్ ఆల్‌రౌండ్ షోతో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్ 19.5 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. వైపర్స్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ హేల్స్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (27), డాన్ లారెన్స్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఫకర్ జమాన్ (14), సామ్ కర్రన్ (3), ఆజమ్ ఖాన్ (10), హసరంగ (13), తనిశ్ సూరి (0), అలీ నసీర్ (2), లకీ ఫెర్గూసన్ (7) నిరాశపరిచారు. క్యాపిటల్స్ బౌలర్లలో చమీరా, జహీర్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. హైదర్ అలీ, మెక్కాయ్, గుల్బదిన్, సికందర్ రజా తలో వికెట్ తీశారు.అనంతరం 140 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని క్యాపిటల్స్ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఆ జట్టు 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బౌలింగ్‌లో ఓ వికెట్ తీసి, ఫీల్డింగ్‌లో ఓ క్యాచ్ పట్టిన గుల్బదిన్ నైబ్.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి రెచ్చిపోయాడు. 51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.నైబ్కు జతగా సికందర్ రజా (24), నజీబుల్లా జద్రాన్ (10 నాటౌట్) నిలబడి క్యాపిటల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో బెన్ డంక్ 13, షాయ్ హోప్ 8, ఖలద్ షా 4 పరుగులు చేశారు. వైపర్స్ బౌలర్లలో ఫెర్గూసన్ 2, మొహమ్మద్ అమిర్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపు క్యాపిటల్స్‌కు ప్రస్తుత ఎడిషన్‌లో రెండోది. ప్రస్తుతం ఆ జట్టు 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. క్యాపిటల్స్ చేతిలో ఓడినా వైపర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉంది. -
ప్రపంచంలో సంతోషకరంగా లేని దేశాలివే.. భారత్ స్థానం?
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా గురించి విన్నాం. ప్రతిసారి ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిచి సంతోషానికి ప్రతికగా నిలుస్తోంది. మరికొన్ని దేశాలు కొద్ది తేడాలతో సంతోషకరమైన దేశాలుగా మొదటి పదిస్థానాల్లో నిలిచి మరింత ఆనందంగా జీవించేలా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాయి. అయితే ఆ సంతోషానికి కనుచూపు మేరలో కూడా లేకుండా తీవ్ర అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్న దేశాలు కూడా ఉన్నాయి. ఆ దేశాల జాబితా, అందుకు గల కారణాలు తోపాటు భారత్ ఏ స్థానంలో ఉందో చూద్దామా..ప్రపంచవ్యాప్తంగా ఆనంద స్థాయిలలో వైవిధ్యాలను నిర్ణయించడానికి ఆరు కీలక అంశాలను పరిగణలోనికి తీసుకుంటుంది ప్రపంచ సంతోష నివేదిక. ఈ అంశాల్లో సామాజిక మద్దతు, ఆరోగ్యం, ఆదాయం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి లేకపోవడం తదితరాల ఆధారంగా జాబితాను అందిస్తుంది. వాటన్నింటిలో వెనుకబడి ఉండి అత్యల్ప సంతోషకరమైన దేశాలుగా నిలిచిన దేశాలేవంటే..అఫ్ఘనిస్తాన్..ప్రపంచ సంతోష సూచికలో 137 దేశాలలో అట్టడుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌తో తక్కువ ఆయుర్దాయం తోపాటు మహమ్మారికి ముందు నుంచి ఉన్న వివిధ నిరంతర సమస్యల సవాలును ఎదుర్కొంటుంది. దీనికి గొప్ప సాంస్కృతిక చరిత్ర ఉన్నప్పటికీ, పోరాటాలు, పౌరుల శ్రేయస్సును గణనీయంగా ప్రభావితం చేశాయి.లెబనాన్..అఫ్ఘనిస్తాన్ తర్వాత, లెబనాన్ రెండవ అత్యల్ప సంతోషకరమైన దేశంగా దురదృష్టకర ఘనతను కలిగి ఉంది. ఈ దేశంలో అత్యంత సంతోషకరమైన దేశాల కంటే ఆయుర్దాయం ఎక్కువగా ఉన్నప్పటికీ సామాజిక-రాజకీయ సవాళ్లు, ఆర్థిక అస్థిరతతో సతమతమవుతోంది. సియెర్రా లియోన్..ప్రపంచంలో మూడవ అత్యలప్ప సంతోషకరమైన దేశంగా ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ నిలిచింది. తక్కువ సంతోష సూచికకు దోహదపడే ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆర్థిక అసమానతలు, రాజకీయ అస్థిరత, సామాజిక అశాంతి తీవ్రంగా ఉన్నాయిజింబాబ్వే..ప్రపంచ సంతోష నివేదికలో నాల్గవ స్థానంలో ఉంది. యుద్ధంతో దెబ్బతిన్న అఫ్ఘనిస్తాన్, లెబనాన్, సియెర్రా లియోన్‌లతో పోలిస్తే జింబాబ్వే కొంచెం అనుకూలమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశం అల్లకల్లోల చరిత్ర, కొనసాగుతున్న సవాళ్లతో పోరాడుతోం. ఇది ఆ దేశలోని మొత్తం జనాభా శ్రేయస్సును తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో..ఈ దేశం ఐదవ స్థానాన్ని దక్కించుకుంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సుదీర్ఘ చరిత్ర సంఘర్షణ, రాజకీయ తిరుగుబాటు, నిరంకుశ పాలన, బలవంతంగా స్థానభ్రంశం తదితర సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ అంశాలన్ని అత్యల్ప సంతోషానికి సూచిక.బోట్స్వానా..బోట్స్వానా అఫ్ఘనిస్తాన్, లెబనాన్ వంటి దేశాల కంటే కొంచెం ముందుంది. ఇక్కడ సాపేక్ష స్థిరత్వం ఉన్నప్పటికీ, సామాజిక శ్రేయస్సలో వెనుబడి ఉండటంతో అత్యల్ప సంతోషకరమైన దేశాల్లో చేరింది.మలావి..వేగంగా పెరుగుతున్న జనాభా, సారవంతమైన భూమి, నీటిపారుదల లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది మలావి. ఈ నేపథ్యంలోనే అక్కడ పౌరులు అనందానికి ఆమడం దూరంలో ఉండి, అసంతృప్తితో బతుకీడస్తన్నారు. కొమొరోస్..ఈ దేశం రాజకీయ తిరుగుబాట్లు కారణంగా కొమొరోస్ను ప్రపంచంలోని అత్యల్ప సంతోషకరమైన దేశాల జాబితాలో చేర్చింది. ఇక్కడ ఉన్న సామాజిక-రాజకీయ దృశ్యం ప్రజలపై గణనీయంగా ప్రభావితం చూపుతోంది. అందువల్లే ఈ దేశం అసంతృప్తి వాతవరణంగా తార స్థాయిలో నెలకొంది.టాంజానియా..ప్రధాన సంతోష సూచికలలో తక్కువ స్కోర్ల కారణంగా దీనిని ఈ జాబితాలో చేర్చారు. దేశం ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పలు తీవ్ర సవాళ్లను ఎదుర్కుంటుంది. ఇది మొత్తం దేశం శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. అందవల్లే ఆధునిక ప్రపంచాన్ని నావిగేట్ చేయడంలో విఫలమవుతుంది. ఈ కారణాల రీత్యా అత్యల్ప సంతోషకరమైన దేశాల జాబితాలో చేరింది. జాంబియాఅత్యల్స సంతోషకరమైన జాబితాలో చిట్టచివరన పదో స్థానంలో ఉన్న దేశం జాంబియా. దీన్ని సెంట్రల్ ఆఫ్రికన్ ఫెడరేషన్ అని పిలుస్తారు. ఇక్కడ ఉపాధి, రాజకీయ అనిశ్చిత, సామాజిక అసమానత తదితర సవాళ్లతో పోరాడుతోంది.భారతదేశం ఈ జాబితాలో లేనప్పటికీ, అది చాలా వెనుకబడి లేదు. ‘ప్రపంచంలోని అత్యంత తక్కువ సంతోషకరమైన దేశంగా 12వ స్థానంలో ఉంది.(చదవండి: అస్సాం సత్రియా చారిత్రాత్మక అరంగేట్రం) -
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడి రీఎంట్రీ
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (జనవరి 13) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హష్మతుల్లా షాహిదీ ఎంపికయ్యాడు. మెగా టోర్నీలో షాహిదీకి డిప్యూటీగా రహమత్ షా వ్యవహరించనున్నాడు. మడమ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్టార్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. జద్రాన్ గాయం కారణంగా గతేడాది జూన్ నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్.. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించిన సెడిఖుల్లా అటల్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. సీనియర్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను కాదని ఘజన్‌ఫర్‌ను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు. 50 ఓవర్ల ఫార్మాట్‌కు కావాల్సినంత ఫిట్నెస్ లేకపోడంతో ముజీబ్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ముజీబ్‌ను కేవలం టీ20లకు మాత్రమే పరిమితం కావాలని అతని డాక్టర్లు సలహా ఇచ్చారట. ముజీబ్ 2023 వన్డే వరల్డ్‌కప్ చివరిసారి ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డే ఆడాడు.2023 వరల్డ్ కప్ ఆడిన జట్టులోని 10 మంది సభ్యులు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికయ్యారు. ముజీబ్, నవీన్ ఉల్ హక్, రియాజ్ హసన్, అబ్దుల్ రెహ్మాన్, నజీబుల్లా జద్రాన్ లాంటి సీనియర్లకు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు దార్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటి, బిలాల్ సమీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు గత రెండు ఐసీసీ టోర్నీలో అద్భుత ప్రదర్శనలు చేసిన విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆఫ్ఘన్లు సంచలన విజయాలు నమోదు చేశారు. వీటిలో పాటు ఆఫ్ఘన్లు గతేడాది వన్డేల్లో సౌతాఫ్రికా లాంటి అగ్రశ్రేణి జట్లను మట్టికరిపించారు. అదే ఊపుతో ఆఫ్ఘన్లు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ సంచలనాలు సృష్టించాలని ఆశిస్తున్నారు.మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి పటిష్ట జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ ఫిబ్రవరి 21న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. కరాచీ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు సౌతాఫ్రికాను ఢీకొంటారు. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ దశలో ఇంగ్లండ్ (ఫిబ్రవరి 26న లాహోర్‌లో), ఆస్ట్రేలియాతో (ఫిబ్రవరి 28న లాహోర్‌లో) తలపడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహమత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, ఎఎమ్ గజన్హర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూఖీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.రిజర్వ్ ఆటగాళ్లు: దార్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటి, బిలాల్ సమీ -
'అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ఆడొద్దు'.. సౌతాఫ్రికాకు ఆ దేశ ప్రజల పిలుపు
అఫ్గానిస్తాన్(Afghanistan)లో ప్రస్తుతం తాలిబాన్ల పరిపాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా సంకీర్ణ సేనల నిష్క్రమణతో మళ్లీ అధికారం చేపట్టిన తాలిబాన్లు అఫ్గాన్‌లో స్త్రీ హక్కుల్ని పూర్తిగా కాలరాశారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరించి కట్టుబాట్లతో ముళ్లబాట పరుస్తున్నారు. అఫ్గానిస్తాన్‌కు చెందిన మహిళా జట్లను ఏ క్రీడల్లోనూ పాల్గొనివ్వడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy)లో అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టుతో మ్యాచ్ ఆడొద్దంటూ పలు దేశాల క్రికెట్ బోర్డులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే అఫ్గాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు 160 మందికి పైగా రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేయగా.. తాజాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా చేరింది.త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్‌తో మ్యాచ్ రద్దు చేసుకోవాలని సౌతాఫ్రికా క్రికెట్(South Afrcia)ను ఆ దేశ ప్రజలు నినాదిస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా ప్రజల డిమాండ్‌కు ఆ దేశ క్రీడల మంత్రి గేటన్ మెకెంజీ సంఘీభావం తెలిపారు. "ప్రజల నిరసనకు నైతిక మద్దతు తెలుపుతున్నాను. అఫ్గాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలి. అయితే నా అధికారాలు పరిమితం. ఇందులో నేను నిర్ణయం తీసుకోలేను. దక్షిణాఫ్రికా ప్రభుత్వం, క్రికెట్ బోర్డు సమాలోచనలు చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను.ఈ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కఠిన చర్యలు తీసుకోవాలి. బోర్డు విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో శ్రీలంక క్రికెట్‌ను సస్పెండ్ చేసినట్లు, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుపై కూడా వేటు వేయాలి. క్రీడల వ్యవహరాల్లో రాజకీయ జోక్యాన్ని ఏ మాత్రం సహించకూడదు. మహిళల పట్ల వివక్ష చూపుతున్న అఫ్గానిస్తాన్ వైఖరిని క్రికెట్ దక్షిణాఫ్రికాతో పాటు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు సైతం ఖండించాలి" అని గేటన్ మెకెంజీ పేర్కొన్నారు.మరో 40 రోజుల్లో..కాగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మరో 40 రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ మెగా ఈవెంట్లో సఫారీ జట్టు కరాచీ వేదికపై ఫిబ్రవరి 21న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.ఇక టీమిండియా తమ మొదటి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరగనున్నాయి.ఈ టోర్నీలో పాల్గోనే ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను జనవరి 12లోపు ఐసీసీకి సమర్పించాలి. ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ శనివారం(జనవరి11) ప్రకటించే అవకాశముంది.చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్‌గా మైఖేల్ వాన్ తనయుడు -
Champions Trophy: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించండి..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ఇంగ్లండ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు ఆ దేశ క్రికెట్ బోర్డును (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, ఈసీబీ) కోరారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం మహిళల హక్కులపై ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ఇంగ్లండ్ పొలిటీషియన్స్ ఈ మేరకు పిలుపునిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ ఫిబ్రవరి 26న ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని 160 మందికి పైగా రాజకీయ నాయకులు ఈసీబీకి విజ్ఞప్తి చేశారు. అయితే ఇంగ్లండ్ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిని ఈసీబీ తిరస్కరించినట్లు సమాచారం. తాలిబన్ల పాలనలో మహిళలు, బాలికలపై వివక్షకు తాము వ్యతిరేకమని చెప్పిన ఈసీబీ.. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.కాగా, 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై అడ్డగోలు అంక్షలు అమల్లో ఉన్నాయి. అమ్మాయిలు ఆరవ తరగతికి మించి చదవకూడదని.. మహిళలు ఉద్యోగాలు చేయకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో (జిమ్‌లు, పార్కులు) మహిళలు కనిపించకూడదని.. మగ తోడు లేకుండా మహిళలు ప్రయాణం చేయకూడదని.. మహిళలు క్రీడల్లో పాల్గొనకూడదని తాలిబన్ ప్రభుత్వం మహిళలపై అంక్షలు విధించింది. ఈ అంక్షల కారణంగానే ఇంగ్లండ్ ప్రజాప్రతినిధులు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.గతంలో ఆస్ట్రేలియా కూడా ఇలాగే..!మహిళలపై తాలిబన్ ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా గతంలో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పురుషుల జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు నిరాకరించింది. అయితే ఆతర్వాత ఇరు జట్లు 2023 వన్డే ప్రపంచకప్, 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో తలపడ్డాయి.జింబాబ్వేతో మ్యాచ్‌ను బహిష్కరించిన ఇంగ్లండ్ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ 2003 వన్డే ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసింది. అప్పట్లో జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే పాలనకు వ్యతిరేకంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ మేరకు నిర్ణయించింది.ఇదిలా ఉంటే, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్యలో జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌లో జరుగుతాయి. పాక్‌తో సత్సంబంధాలు లేని కారణంగా టీమిండియా పాక్‌లో అడుగుపెట్టరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న (బంగ్లాదేశ్‌తో) ఆడుతుంది. మెగా టోర్నీలో దాయాదుల సమరం ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లండ్ మ్యాచ్‌కు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఆరు టెస్ట్‌ల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. 26 ఏళ్ల రషీద్ ఆరు టెస్ట్‌ల అనంతరం 45 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ స్పిన్నర్ అల్ఫ్ వాలెంటైన్, శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఆరు టెస్ట్‌ల అనంతరం 43 వికెట్లు పడగొట్టి రషీద్ తర్వాతి స్థానంలో ఉన్నారు.జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్‌లో రషీద్ 11 వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టెస్ట్‌లో విజయంతో ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రషీద్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. రషీద్ తన ఆరు మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 3 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు.రెండో ఇన్నింగ్స్‌లో రషీద్ నమోదు చేసిన గణాంకాలు (7/66) ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యుత్తమమైనవి. రషీద్ తన సొంత రికార్డునే (7/137) అధిగమించి ఈ గణాంకాలు నమోదు చేశాడు.రెండో స్థానంలో రషీద్ఆరు టెస్ట్‌ల అనంతరం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ (45) సౌతాఫ్రికా పేసర్ వెర్నన్ ఫిలాండర్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ చార్లీ టర్నర్ టాప్‌లో నిలిచాడు. టర్నర్ ఆరు టెస్ట్‌ల అనంతరం 50 వికెట్లు పడగొట్టాడు.వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 10 వికెట్లుఈ మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రషీద్.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో రషీద్‌తో పాటు సౌతాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ మాత్రమే వరుసగా రెండు టెస్ట్‌ల్లో 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.జింబాబ్వేతో రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (157) చాపచుట్టేసిన ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని 363 పరుగులు చేసింది. రహ్మత్ షా (139), ఇస్మత్ ఆలం (101) సెంచరీలతో కదంతొక్కారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇస్మత్ అరంగేట్రంలోనే శతక్కొట్టాడు. ఎనిమిది అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి డెబ్యూలో సెంచరీ చేసిన 11 ఆటగాడిగా ఇస్మత్ ఆలం రికార్డుల్లోకెక్కాడు.జింబాబ్వే విషయానికొస్తే.. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఎక్కువ స్కోర్ చేసింది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే తడబడింది. రషీద్ తన స్పిన్ మాయాజాలంలో జింబాబ్వేను 205 పరుగులకు పరిమితం చేశాడు. ఫలితంగా జింబాబ్వే లక్ష్యానికి 73 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
రషీద్ ఖాన్ విశ్వరూపం.. 10 వికెట్ల ప్రదర్శన నమోదు
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 10 వికెట్ల ఘనత నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రషీద్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా రషీద్ ఖాన్‌కు టెస్ట్‌ల్లో ఇది మూడో 10 వికెట్ల ప్రదర్శన. రషీద్ తన ఆరు మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో ఐదు 5 వికెట్ల ప్రదర్శనలు, మూడు 10 వికెట్ల ప్రదర్శనల సాయంతో 44 వికెట్లు పడగొట్టాడు. రషీద్ విజృంభించడంతో రెండో టెస్ట్‌లో జింబాబ్వే ఓటమి అంచుల్లో ఉంది. ఛేదనలో తడబడిన జింబాబ్వే విజయానికి ఇంకా 82 పరుగుల దూరంలో ఉంది. చేతిలో మరో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. క్రెయిగ్ ఎర్విన్ (44), రిచర్డ్ నగరవ (3) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్‌లో బెన్ కర్రన్ (38), సికందర్ రజా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఆరు వికెట్లు పడగొట్టగా.. జియా ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీశాడు.అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. తొలుత రహ్మత్ షా (139) సెంచరీతో కదం తొక్కగా.. ఎనిమిదో నంబర్ ఆటగాడు ఇస్మత్ ఆలం (101) ఆఖర్లో బాధ్యతాయుతమైన సెంచరీ చేశాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 363 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ ఆరు వికెట్లు పడగొట్టగా.. నగరవ 3, సికందర్ రజా ఓ వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో సీన్ విలియమ్స్ (49) విలువైన పరుగులు జోడించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, అహ్మద్జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 157 పరుగులకే ఆలౌటైంది. సికందర్ రజా, న్యామ్హురి తలో మూడు వికెట్లు, ముజరబానీ రెండు, నగరవ ఓ వికెట్ పడగొట్టి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, జింబాబ్వే-ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. -
సూపర్ సెంచరీతో ఆదుకున్న రహ్మత్ షా
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మత్ షా (105 నాటౌట్) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో షా బాధ్యతాయుతంగా ఆడుతూ ఆఫ్ఘనిస్తాన్‌ను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. షా సెంచరీతో కదంతొక్కడంతో ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోర్ దిశగా సాగుతుంది. మూడో రోజు టీ విరామం సమయానికి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 207/6గా ఉంది. షా అజేయ సెంచరీతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగా.. అతనికి జతగా ఇస్మత్ ఆలం (31) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ 121 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఆదుకున్న షా69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను రహ్మత్ షా ఆదుకున్నాడు. షా.. షాహీదుల్లా కమాల్ (22), ఇస్మత్ ఆలమ్‌ల సహకారంతో ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నాడు. షా సెంచరీతో ఆదుకోకపోయుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ఘోరంగా పతనమయ్యేది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ మాలిక్ 1, రియాజ్ హసన్ 11, హష్మతుల్లా షాహిది 13, జియా ఉర్ రెహ్మాన్ 6, అఫ్సర్ జజాయ్ 5 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ 3, నగరవ 2, సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించగా.. సీన్ విలియమ్స్ (49) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, అహ్మద్జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వే బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 157 పరుగులకే చాపచుట్టేసింది. సికందర్ రజా, న్యామ్హురి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ 2, నగరవ ఓ వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (154), క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (234), హష్మతుల్లా షాహిది (246) డబుల్ సెంచరీలు చేయగా.. అఫ్సన్ జజాయ్ (113) శతక్కొట్టాడు. -
జింబాబ్వేకు ఆధిక్యం
బులవాయో వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో జింబాబ్వేకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. తద్వారా 86 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ ఎర్విన్ (75) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. సికందర్ రజా (61), సీన్ విలియమ్స్ (49) రాణించారు. జింబాబ్వే జట్టులో జాయ్‌లార్డ్ గుంబీ 8, బెన్ కర్రన్ 15, కైటానో 0, డియాన్ మైయర్స్ 5, బ్రియాన్ బెన్నెట్ 2, న్యూమ్యాన్ న్యామ్హురి 11, రిచర్డ్ నగరవ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అహ్మద్జాయ్ మూడు, ఫరీద్ అహ్మద్ రెండు, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 8 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది. అబ్దుల్ మాలిక్ 1, రియాన్ హసన్ 11 పరుగులు చేసి ఔట్ కాగా.. రహ్మత్ షా (6), హస్మతుల్లా షాహిది (0) క్రీజ్‌లో ఉన్నారు. బ్లెస్సింగ్ ముజరబాని రెండు వికెట్లు తీశాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా 67 పరుగులు వెనుకపడి ఉంది. రెండో రోజు ఆట కొనసాగుతుంది.అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అబ్దుల్ మాలిక్ 17, రియాజ్ హసన్ 12, రహ్మద్ షా 19, షాహిది 13, జజాయ్ 16, షహీదుల్లా 12, ఇస్మత్ అలామ్ 0, అహ్మద్ జాయ్ 2, జియా ఉర్ రెహ్మాన్ 8 (నాటౌట్), ఫరీద్ అహ్మద్ 17 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, న్యూమ్యాన్ న్యామ్హురి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబాని రెండు, నగరవ ఓ వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (154), క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (234), హష్మతుల్లా షాహిది (246) డబుల్ సెంచరీలు చేయగా.. అఫ్సన్ జజాయ్ (113) శతక్కొట్టాడు. -
జింబాబ్వేతో రెండో టెస్టు.. అఫ్గాన్ 157 ఆలౌట్
బులవాయో: అద్వితీయ బ్యాటింగ్‌తో జింబాబ్వేతో తొలి టెస్టును ‘డ్రా’ చేసుకున్న అఫ్గానిస్తాన్ జట్టు... రెండో టెస్టులో స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. ఇరు జట్ల మధ్య గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.రషీద్ ఖాన్ (20 బంతుల్లో 25; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లలో ఏ ఒక్కరూ 20 పరుగుల మార్క్ దాటలేకపోయారు. కెపె్టన్ హష్మతుల్లా (13), రహమత్ షా (19), అబ్దుల్ మాలిక్ (17), రియాజ్ హసన్ (12), అఫ్సర్ (16), షహీదుల్లా (12), ఇస్మత్ ఆలమ్ (0) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు వరస కట్టారు.జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, న్యూమన్ న్యామురి చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. చేతిలో 10 వికెట్లు ఉన్న జింబాబ్వే ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 151 పరుగులు వెనుకబడి ఉంది. జాయ్‌లార్డ్ గుంబీ (4 బ్యాటింగ్), బెన్ కరన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.చదవండి: IND vs AUS: రోహిత్‌ను కావాలనే పక్కన పెట్టారా?.. కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే? -
టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అఫ్గనిస్తాన్.. కానీ
జింబాబ్వే- అఫ్గనిస్తాన్(Zimbabwe vs Afghanistan) జట్ల మధ్య బులవాయో వేదికగా తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 515/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన అఫ్గనిస్తాన్ 197 ఓవర్లలో 699 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక టెస్టు క్రికెట్లో అఫ్గనిస్తాన్ జట్టుకిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. 2021లో అబుదాబిలో జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో అఫ్గానిస్తాన్ 4 వికెట్లకు 545 పరుగులు చేసింది.హష్మతుల్లా, రహ్మత్ షా డబుల్ సెంచరీలుఇక జింబాబ్వేతో తొలి టెస్టు ఆఖరి రోజు అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది(Hashmatullah Shahidi- 474 బంతుల్లో 246; 21 ఫోర్లు) డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... అఫ్సర్ జజాయ్ (169 బంతుల్లో 113; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకం సాధించాడు. అంతకుముందు మూడో రోజు రహ్మత్ షా (424 బంతుల్లో 234; 23 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీ చేశాడు.‘డ్రా’కు అంగీకరించిన కెప్టెన్లుఓవరాల్గా అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ నమోదు కావడం విశేషం. 113 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 34 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసింది. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. రిజల్ట్ రాకపోయినా పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది.అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లోనే ఇలాఇదిలా ఉంటే.. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 586 పరుగులు సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 2 నుంచి బులవాయోలోనే జరుగుతుంది. కాగా టెస్టు క్రికెట్లో తొలిసారి 600 పరుగుల స్కోరు దాటేందుకు అఫ్గనిస్తాన్ పది టెస్టులు ఆడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు 10 జట్లు టెస్టుల్లో 600 అంతకంటే ఎక్కువ స్కోరు నమోదు చేశాయి. ఇందులో అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లో ఈ మైలురాయిని దాటడం విశేషం.కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటన(Afghanistan tour of Zimbabwe, 2024-25)కు వెళ్లింది. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న అఫ్గన్.. వన్డే సిరీస్‌లోనూ 2-1తో నెగ్గింది. ఇక తొలి టెస్టును డ్రా చేసుకుంది.జింబాబ్వే వర్సెస్ అఫ్గనిస్తాన్ తొలి టెస్టు(డిసెంబరు 26-30)👉వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో👉టాస్: జింబాబ్వే... తొలుత బ్యాటింగ్👉జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోరు: 586👉అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 699👉జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ స్కోరు: 142/4👉ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఆఖరి రోజు ‘డ్రా’కు అంగీకరించిన ఇరుజట్లు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హష్మతుల్లా షాహిది(అఫ్గనిస్తాన్- 474 బంతుల్లో 246 పరుగులు).చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి! -
మహిళలు పనిచేసే ఎన్జీవోల మూత
కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ పాలకులు మహిళలకు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ మహిళలు పనిచేసే జాతీయ, విదేశీ ప్రభుత్వేతర సంస్థలన్నిటినీ మూసివేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం ధరించాల్సిన హిజాబ్‌ను ఆయా సంస్థల్లోని అఫ్గాన్ మహిళలు ధరించకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఆర్థిక శాఖ ఆదివారం రాత్రి ‘ఎక్స్’లో ఈ విషయం వెల్లడించింది. తమ ఉత్తర్వులను బేఖాతరు చేసే సంస్థల లైసెన్సులను రద్దు చేస్తామని, కార్యకలాపాలను నిలిపివేస్తామని కూడా అందులో హెచ్చరించింది. నాన్ గవర్నమెంటల్ సంస్థల రిజిసే్ట్రషన్, సమన్వయం, నిర్వహణ, పర్యవేక్షణ సహా అన్ని కార్యకలాపాల బాధ్యత తమదేనని స్పష్టం చేసింది. తాలిబాన్ నియంత్రణలో లేని సంస్థలు అన్నిటిలోనూ మహిళలు పనిచేయడం ఆపేయాలని మరోసారి హుకుం జారీ చేసింది. అత్యవసరమైన మానవతా సాయం అందించే కార్యక్రమాల్లోనూ మహిళల ప్రాతినిథ్యాన్ని తాలిబన్లు అడ్డుకుంటున్నారని ఇటీవల ఐరాస సైతం ఆరోపించడం గమనార్హం. బాలికలు ఆరో గ్రేడ్ మించి చదువుకోరాదని, బహిరంగంగా కనిపించే విధుల్లో పాల్గొనరాదని ఇప్పటికే తాలిబన్ పాలకులు నిషేధం విధించడం తెలిసిందే. కిటికీల నుంచి మహిళలు కనిపించొద్దు తాలిబన్ నేత హిబతుల్లా అఖుంద్జాదా మరో తాఖీదు జారీ చేశారు. మహిళలు, నిలబడి లేదా కూర్చున్నట్లుగా కనబడేలా భవనాలకు కిటికీలు ఉండరాదన్నారు. కొత్తగా నిర్మించే వాటితోపాటు ఇప్పటికే ఉన్న భవనాలకు సైతం ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. వరండాలు లేదా వంటగదులు కనిపించేలా కిటికీలు ఏర్పాటు చేయవద్దన్నారు. ఒక వేళ కిటికీలుంటే భవన యజమాని ఆ స్థానంలో గోడను నిర్మించడం లేదా ఏదైనా అడ్డుగా ఉంచడం చేయాలన్నారు. నివాస భవనాల్లోపలి భాగం కనిపించేలా కొత్తగా భవన నిర్మాణం చేయరాదని ఆయన మున్సిపల్, ఇతర అధికారులకు సైతం నిర్దేశించడం గమనార్హం. -
రికార్డు డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్
ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీ (246) చేసిన షాహిది.. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో రెండు డబుల్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. షాహిది 2021లో జింబాబ్వేపై తొలి డబుల్ సెంచరీ (200) చేశాడు.తాజాగా డబుల్‌తో షాహిది మరో రికార్డు కూడా సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (246) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇదే మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రహ్మత్ షా (234) కూడా డబుల్ సెంచరీ చేశాడు. షాహిదికి ముందు రహ్మత్ షాదే ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక స్కోర్‌గా ఉండేది.మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో మూడు డబుల్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. ఈ మూడింటిలో రెండు ఇదే మ్యాచ్‌లో నమోదు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు (అఫ్సన్ జజాయ్) సెంచరీ (113) చేశాడు.రహ్మత్, షాహిది డబుల్.. జజాయ్ సెంచరీ సాధించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (699) చేసింది. టెస్ట్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోర్. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆఫ్ఘన్ ఆటగాళ్లు మూడంకెల స్కోర్లు సాధించడం కూడా ఇదే మొదటిసారి. 639 పరుగుల వరకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్.. ఆతర్వాత 60 పరుగుల వ్యవధిలో మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే బౌలర్లలో బ్రియాన్ బెన్నెట్ ఐదు వికెట్లు పడగొట్టగా.. సీన్ విలియమ్స్ 2, ముజరబానీ, గ్వాండు, న్యామ్హురి తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు జింబాబ్వే సైతం తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (586) చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సైతం ముగ్గురు మూడంకెల స్కోర్లు సాధించారు. సీన్ విలియమ్స్ (154), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. కెరీర్లో తొలి టెస్ట్ ఆడుతున్న బెన్ కర్రన్ (ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రన్ అన్న) అర్ద సెంచరీతో (68) రాణించాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్‌తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ 113 పరుగులు ఎక్కువగా సాధించింది. జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ సెంచరీ సహా ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేయడం మరో విశేషం.113 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 5 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. బెన్ కర్రన్ (23), జాయ్‌లార్డ్ గుంబీ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు జింబాబ్వే ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. మ్యాచ్ చివరి రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. కాగా, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లను ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గిన ఆఫ్ఘన్లు.. వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకున్నారు. ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుండగా.. రెండో టెస్ట్ జనవరి 2న ప్రారంభంకానుంది. -
డబుల్ సెంచరీతో చెలరేగిన అఫ్గాన్ ఆటగాడు..
బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వేకు అఫ్గానిస్తాన్ ధీటుగా బదులిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి అఫ్గానిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇంకా 161 పరుగులు వెనంజలో ఉంది. 95/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన అఫ్గాన్ జట్టు వికెట్ నష్టపోకుండా 330 పరుగులు చేసింది.రహ్మత్ షా డబుల్ సెంచరీ..అఫ్గానిస్తాన్ ఫస్ట్ డౌన్ బ్యాటర్ రహ్మత్ షా (416 బంతుల్లో 23 ఫోర్లు, 3 సిక్స్‌లు 231 బ్యాటింగ్) ఆజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీతో కలిసి ఇన్నింగ్స్‌ను అద్బుతంగా నడిపించాడు. రహ్మత్‌కు ఇదే తొలి టెస్టు డబుల్ సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు షాహిదీ(276 బంతుల్లో 16 ఫోర్లు, 141 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 361 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.రహ్మత్ షా అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగిన రహ్మత్ షా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అఫ్గాన్ తరపున అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్‌గా రహ్మత్(231*) నిలిచాడు. గతంలో ఈ రికార్డు హష్మతుల్లా షాహిదీ(200) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో షాహిదీ ఆల్‌టైమ్ రికార్డును షా బ్రేక్ చేశాడు. అదే విధంగా టెస్టు మ్యాచ్‌లో ఒక రోజు మొత్తం వికెట్ కోల్పోకపోవడం ఇదే తొలిసారి 2019 తర్వాత ఇదే తొలిసారి.చదవండి: VHT 2024-25: పంజాబ్ ఓపెనర్ విధ్వంసం.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో -
ZIM Vs AFG: టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జింబాబ్వే.. శతకాల మోత
బులవాయో: అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు కూడా జింబాబ్వే జోరే కొనసాగింది. దీంతో ఆ జట్టు తమ టెస్టు చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (176 బంతుల్లో 104; 10 ఫోర్లు), బ్రియాన్ బెనెట్ (124 బంతుల్లో 110 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో మొత్తం మూడు శతకాల మోత మోగింది. తొలిరోజు ఆటలో సీన్ విలియమ్స్ సెంచరీ సాధించాడు.ఓవర్‌నైట్ స్కోరు 363/4తో రెండో రోజు ఆట కొనసాగించిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 135.2 ఓవర్లలో 586 పరుగుల వద్ద ఆలౌటైంది. 2001లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో జింబాబ్వే చేసిన 563/9 స్కోరే ఇప్పటిదాకా అత్యధిక పరుగులు కాగా... ఇప్పుడా రికార్డును సవరించింది.ఓవర్‌నైట్ బ్యాటర్లలో విలియమ్స్ ఎంతోసేపు నిలువలేదు. ఇర్విన్... తర్వాత వచ్చిన బెనెట్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో ఇద్దరు సెంచరీలు పూర్తిచేసుకున్నారు. టెయిలెండర్లు న్యుమన్ న్యామ్హురి (26; 2 ఫోర్లు, 1 సిక్స్), ముజరబని (19; 1 ఫోర్, 1 సిక్స్) చేసిన పరుగులతో జింబాబ్వే అత్యధిక స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్ 3, నవీద్ జద్రాన్, జహీర్ ఖాన్, జియావుర్ రహ్మాన్ తలా 2 వికెట్లు తీశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన అఫ్గానిస్తాన్ ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఓపెనర్లు సిదిఖుల్లా అతల్ (3), అబ్దుల్ మాలిక్ (23; 1 ఫోర్) నిష్క్రమించగా.. రహ్మత్ షా (49 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (16 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అఫ్గాన్ ఇంకా 491 పరుగులు వెనుకబడి ఉంది. -
సీన్ విలియమ్స్ అజేయ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా జింబాబ్వే
బులవాయో: జింబాబ్వే పర్యటనకు వచ్చిన అఫ్గానిస్తాన్‌కు తొలి టెస్టులో ఆతిథ్య బ్యాటర్ల నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 4 వికెట్లకు 363 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ కరన్ (74 బంతుల్లో 68; 11 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ కైటానో (115 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 49 పరుగులు జతచేశారు. కరన్ నిష్క్రమించాక వచ్చిన సీన్ విలియమ్స్ (161 బంతుల్లో 145 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అఫ్గాన్ బౌలర్లపై వన్డేను తలపించే ఇన్నింగ్స్ ఆడాడు. విలువైన భాగస్వామ్యాలతో జట్టు భారీస్కోరుకు బాటలు వేశాడు.కైటానోతో కలిసి మూడో వికెట్‌కు 78 పరుగులు, అనంతరం మైయెర్స్ (27; 3 ఫోర్లు)తో నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. తర్వాత విలియమ్స్, కెప్టెన్ ఇర్విన్ (94 బంతుల్లో 56 బ్యాటింగ్; 6 ఫోర్లు)తో కలిసి జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో 115 బంతుల్లోనే విలియమ్స్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఇర్విన్ కూడా అర్ధసెంచరీ సాధించడంతో ఇద్దరు అబేధ్యమైన ఐదో వికెట్‌కు 143 పరుగులు జోడించారు. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్ 2, నవీద్ జద్రాన్, జహీర్ ఖాన్ చెరో వికెట్ తీశారు. -
ఆప్ఘనిస్తాన్ టార్గెట్‌గా పాక్ దాడులు.. 15 మంది మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్(Pakistan) వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల కారణంగా దాదాపు 15 మంది మరణించినట్టు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. ఈనేపథ్యంలో పాక్, ఆప్ఘన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.ఆఫ్ఘనిస్థాన్‌లోని(Afghanistan) పక్టికా ప్రావిన్స్‌లో ఉన్న బర్మాల్ జిల్లాపై మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. లామన్‌తో సహా ఏడు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో 15 మంది మృతిచెందగా పలువురు గాయపడినట్టు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించినట్టు అక్కడి మీడియా ఖమా నివేదించింది. ఈ బాంబు పేలుళ్లకు పాకిస్తాన్ జెట్ విమానాలే కారణమని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. పాక్ వైమానిక దాడులు తీవ్రమైన పౌర ప్రాణనష్టం, విస్తృత విధ్వంసానికి కారణమయ్యాయి. దాడుల కారణంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.మరోవైపు.. బర్మాల్, పక్టికాపై జరిగిన వైమానిక దాడికి(Air Strike) ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆప్ఘన్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం తమ చట్టబద్ధమైన హక్కు అని పేర్కొంది. పాక్ వైమానిక దాడులను ఖండించింది. పాక్ లక్ష్యంగా దాడులు చేసిన వారిలో వజీరిస్థానీ శరణార్థులు కూడా ఉన్నారని తెలిపింది.Aftermath of precision airstrikes conducted by the Pakistan Air Force, eliminating over 40+ TTP terrorists and crippling militant infrastructure in Paktika province Afghanistan.A significant step taken by Pakistan Armed forces in counter-terrorism efforts reaffirming their… pic.twitter.com/x6AZgOx5JB— Global Defense Agency (@Defense_GDA) December 24, 2024ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ మధ్య ఉద్రికత్తలు పెరిగాయి. అయితే, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)కు చెందిన ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ తాలిబాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ క్రమంలో దాడులకు చేసినట్టు తెలుస్తోంది. ఇక, పాకిస్తాన్ అధికారులు అధికారికంగా వైమానిక దాడిని ధృవీకరించ లేదు. సరిహద్దుకు సమీపంలో ఉన్న తాలిబాన్ రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సైనిక సన్నిహిత భద్రతా వర్గాలు సూచించాయి. -
మూడో వన్డేలో ఘన విజయం.. అఫ్గాన్‌దే వన్డే సిరీస్
జింబాబ్వే పర్యటనలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న అఫ్గానిస్తాన్ జట్టు... వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. టి20 సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన అఫ్గాన్... తాజాగా వన్డే సిరీస్‌ను 2–0తో చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఆఖరి వన్డేలో అఫ్గాన్ 8 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది.మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 30.1 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (61 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీతో రాణించగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. కెపె్టన్ ఇరి్వన్ (5), ఆల్‌రౌండర్ సికందర్ రజా (13), బెనెట్ (9) ఒకరివెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు.అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్ 5 వికెట్లతో విజృంభించగా... రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ 26.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. సెదిఖుల్లా అతల్ (50 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఘజన్ఫర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సెదిఖుల్లా అతల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి తొలి టెస్టు జరగనుంది.చదవండి: IND vs AUS: టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం -
ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే తొలి వన్డే రద్దు
ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 17) జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం మొదలైంది. అయితే మధ్యలో వరుణుడు కాసేపు శాంతించడంతో 28 ఓవర్ల మ్యాచ్‌గా కుదించారు. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.సామ్ కర్రన్ సోదరుడు అరంగేట్రంఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ పెద్ద సోదరుడు బెన్ కర్రన్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. బెన్ తన తండ్రి దేశమైన జింబాబ్వే తరఫున తన తొలి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో బెన్ 22 బంతులు ఎదుర్కొని ఓ బౌండరీ సాయంతో 15 పరుగులు చేశాడు. అనంతరం బెన్ అజ్మతుల్లా బౌలింగ్‌లో ఇక్రమ్ అలీఖిల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.నిప్పులు చెరిగిన ఒమర్జాయ్తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. ఆఫ్ఘనిస్తాన్ పేసర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ నిప్పులు చెరగడంతో విలవిలలాడిపోయింది. ఒమర్జాయ్ ధాటికి జింబాబ్వే 41 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఒమర్జాయ్ 4.2 ఓవర్లలో 18 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. జింబాబ్వే స్కోర్ 44/5 వద్ద నుండగా (9.2 ఓవర్లు) వర్షం మళ్లీ మొదలైంది. ఈ దశలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బెన్ కర్రన్ 15, మరుమణి 6, బ్రియాన్ బెన్నెట్ 0, డియాన్ మైర్స్ 12, సీన్ విలియమ్స్ 0 పరుగులకు ఔట్ కాగా.. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (1),సికందర్ రజా (1) క్రీజ్‌లో ఉన్నారు. -
టెస్ట్ జట్టులో రషీద్ ఖాన్
త్వరలో జింబాబ్వేతో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 16) ప్రకటించారు. ఆఫ్ఘన్ స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రషీద్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. గజ్జల్లో గాయం కారణంగా రషీద్ టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా సెలెక్టర్ల కోరిక మేరకు రషీద్ టెస్ట్ జట్టులో చేరాడు.జింబాబ్వేతో టెస్ట్ సిరీస్ కోసం హష్మతుల్లా షాహిది నేతృత్వంలో 18 మంది సభ్యులతో కూడిన ఆఫ్ఘన్ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో ఏడుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ బషీర్ అహ్మద్, ఆల్‌రౌండర్ ఇస్మత్ ఆలమ్ దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటారు.మరో నలుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫరీద్ అహ్మద్ మలిక్, రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌తో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ఎంపికయ్యారు. ఆ మ్యాచ్ వర్షం, వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఒక్క రోజు కూడా సాగలేదు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లలో టీ20 సిరీస్ ఇదివరకే ముగిసింది. టీ20 సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడు వన్డే మ్యాచ్‌లు డిసెంబర్ 17, 19, 21 తేదీల్లో జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ హరారే వేదికగా జరుగుతాయి. తొలి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి.. రెండో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి బులవాయో వేదికగా జరుగుతాయి.జింబాబ్వేతో రెండు టెస్ట్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), ఇక్రమ్ అలీఖైల్ (వికెట్‌కీపర్), అఫ్సర్ జజాయ్ (వికెట్‌కీపర్), రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్, అబ్దుల్ మలిక్, బహీర్ షా మహబూబ్, ఇస్మత్ ఆలం, అజ్మతుల్లా ఒమర్జాయ్, జహీర్ ఖాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్ , జహీర్ షెహజాద్, రషీద్ ఖాన్, యామిన్ అహ్మద్జాయ్, బషీర్ అహ్మద్ ఆఫ్ఘన్, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్ -
జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న ఆఫ్ఘనిస్తాన్
తొలి టీ20లో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. హరారే వేదికగా ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన రెండో టీ20లో ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వేపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ జట్లు 1-1తో సమానంగా నిలిచాయి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దర్విష్ రసూలీ (58) అర్ద సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా (28), గుల్బదిన్ (26 నాటౌట్), సెదికుల్లా అటల్ (18), గుర్బాజ్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. జింబాబ్వే బౌలర్లలో ట్రెవర్ గ్వాండు, ర్యాన్ బర్ల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.154 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. ఆఫ్ఘన్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో 17.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2, ఒమర్జాయ్, ఫరీద్ మలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికందర్ రజా (35) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బ్రియాన్ బెన్నెట్ (27), తషింగ ముసేకివా (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 డిసెంబర్ 14న జరుగనుంది. -
ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్పై జింబాబ్వే విజయం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగింది. చివరి బంతికి ఒక్క పరుగు చేయల్సి ఉండగా.. తషింగ సింగిల్ తీసి జింబాబ్వేను గెలిపించాడు. చివరి ఓవర్లో జింబాబ్వే 11 పరుగులు రాబట్టి గెలుపు తీరాలకు చేరింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను కరీమ్ జనత్ (54 నాటౌట్), మహ్మద్ నబీ (44) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 79 పరుగులు జోడించి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 3 వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ, ట్రెవర్ గ్వాండు, మసకద్జ తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఆదిలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (49) జింబాబ్వేను గెలుపు వాకిటి వరకు తీసుకొచ్చి ఔటయ్యాడు. ఇక్కడే ఆఫ్ఘన్లు జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. 11 పరుగుల వ్యవధిలో జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయి గెలుపు కోసం చివరి బంతి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తషింగ (16 నాటౌట్), మసకద్జ (6 నాటౌట్) సాయంతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ (4-1-33-3), రషీద్ ఖాన్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. మహ్మద్ నబీకి ఓ వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 13న జరుగనుంది. -
CT 2025: అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీలో తొలిసారి తమ జట్టు పాల్గొనబోతున్న నేపథ్యంలో హెడ్‌కోచ్‌గా జొనాథన్ ట్రాట్ పదవీ కాలాన్ని ఏడాది పొడిగించింది. ఈ క్రమంలో.. 2025 ఏడాది ముగింపుదాకా ట్రాట్ హెడ్ కోచ్‌గా కొనసాగుతాడు.మేటి జట్లను కంగుతినిపించికాగా 43 ఏళ్ల ఈ ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ 2022 జూలై నుంచి అఫ్గనిస్తాన్ హెడ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అతడి శిక్షణలోని అఫ్గనిస్తాన్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లాంటి మేటి జట్లను కంగుతినిపించింది.ప్రపంచకప్‌లో తొలిసారి సెమీఫైనల్స్కుఅదే విధంగా.. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్-2024లో అఫ్గనిస్తాన్ తొలిసారి సెమీఫైనల్స్‌కు చేరింది. గతేడాది భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ గ్రూప్ దశలో మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లకు షాక్ ఇచ్చింది. తద్వారా కటాఫ్ సమయానికి ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో నిలిచిన అఫ్గన్.. చాంపియన్స్ ట్రోఫీ(వన్డే ఫార్మాట్)కి అర్హత సంపాదించింది.కేవలం వన్డేలకు మాత్రమేఅంతేకాదు.. ఇటీవల దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై ద్వైపాక్షిక సిరీస్‌లను 2–1తో కైవసం చేసుకుంది. ప్రధాన కోచ్‌గా ట్రాట్ నియామకం తర్వాత అఫ్గన్ జట్టు 14 వన్డేలు, 20 టీ20ల్లో గెలిచింది. ఇలాంటి సానుకూలతల నేపథ్యంలో అఫ్గాన్ బోర్డు ట్రాట్ కాంట్రాక్టును మరో ఏడాది పాటు పొడిగించడం విశేషం. అయితే ఈ దఫా అతడు కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే జట్టుకు అందుబాటులో ఉంటాడు. వ్యక్తిగత కారణాల నేపథ్యంలో కుటుంబంతో గడిపేందుకు టీ20లు, టెస్టులకు జట్టుతో పయనించడు.చదవండి: SA vs PAK: డేవిడ్ మిల్లర్ ఊచకోత.. ఉత్కంఠ పోరులో ఓడిన పాకిస్తాన్ -
పుట్టిన రోజు వేడుకలకూ నోచుకోలేదు
ఈ ఫొటో చూస్తే మీకేమనిపిస్తోంది? ఏదో హెయిరాయిల్ ప్రకటనలా ఉంది కదా! కానీ నిజానికి అదో బర్త్‌డే పార్టీ. అత్యంత రహస్యంగా చేసుకున్న పార్టీ. అందులో పాల్గొన్న అమ్మాయిలంతా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ముఖాలు కనబడకుండా జాగ్రత్త పడ్డారు. బర్త్‌డే పార్టీ అంత రహస్యంగా చేసుకోవడమెందుకు? వేరే ఏ దేశంలోనైనా అవసరం లేదు. కానీ ఆఫ్గానిస్తాన్‌లో మాత్రం అది అత్యవసరం! తాలిబన్ల పాలనలో అక్కడి మహిళలు, బాలికల దుస్థితికి అద్దం పడుతున్న ఈ ఫొటోను ఇరాన్–కెనడియన్ ఫొటో జర్నలిస్ట్ కియానా హయేరి తీశారు. ఇలాంటి చిత్రాల సమాహారాన్ని ‘నో విమెన్స్ లాండ్’ పేరిట ఈ నెల పారిస్‌లో ప్రదర్శించనున్నారు.ఏడు ప్రావిన్సులు తిరిగి... ఫ్రెంచ్ పరిశోధకురాలు మెలిస్సా కార్నెట్తో హయేరి 2018 నుంచి కలిసి పని చేస్తున్నారు. వారు కొన్నేళ్లుగా అఫ్గాన్‌లోనే ఉంటున్నారు. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్‌ను వీడటం, దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడం వంటి పరిణామాలకు వాళ్లు ప్రత్యక్ష సాక్షులు. నానాటికీ దిగజారుతున్న పరిస్థితులు వారిని భయపెట్టాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని కల్లబొల్లి ప్రతిజ్ఞలు చేసిన తాలిబన్లు చివరికి వాళ్లకు అసలు ప్రజా జీవితమే లేకుండా చేశారు. ప్రాథమిక హక్కులతో సహా సర్వం కాలరాశారు. మహిళల గొంతు వినపడటమే నిషేధం. ముసుగు లేకుండా, మగ తోడు లేకుండా గడప దాటడానికి లేదు! బాలికల చదువుకు పాఠశాల స్థాయితోనే మంగళం పాడారు. బహిరంగ ప్రదేశాల్లో సంగీతం, నృత్యం నిషేధం. అఫ్గాన్ మహిళల దుస్థితిని బయటి ప్రపంచానికి చూపేందుకు హయేరి, కార్నెట్ ఏడు ప్రావిన్సుల్లో పర్యటించారు. ఎంతోమంది మహిళలను కలిశారు.ఆశలకు ప్రతీకలు కూడా... ఎంతసేపు అణచివేత గురించే ఎందుకు చెప్పాలి? అందుకే అఫ్గాన్ బాలికలు, మహిళలకు భవిష్యత్తు మీదున్న ఆశను కూడా హయేరి, కార్నెట్ ఫొటోల్లో బందించారు. తమ చీకటి జీవితాల్లో వెలుగులు నింపే వేడుకలను వాళ్లు జరుపుకొంటున్నారో చెబుతున్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో బాలికలు, స్త్రీలకు సంబంధించి చిన్న వేడుక అయినా అది నేరుగా తాలిబన్ ప్రభుత్వాన్ని ధిక్కరించడమే. అందుకే బాలికలు పుట్టిన రోజులు, పెళ్లిళ్ల వంటి వేడుకల్లో స్నేహితులను కలుస్తున్నారు. వాటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది ప్రమాదాలు తెచ్చి పెడుతుందని తెలిసీ రిస్క్ చేస్తున్నారు. మహిళలు గుర్తింపుకే నోచుకోని చోట ఇలాంటి చిన్న వేడుకైనా పెద్ద ప్రతిఘటనే! చిరునవ్వులు చిదిమేస్తున్న కాలంలో ఆనందాన్ని ప్రదర్శించడం కూడా తిరుగుబాటే. అందుకే నిరసనను వ్యక్తం చేసే ఏ అవకాశాన్నీ మహిళలు వదులుకోవడం లేదంటున్నారు. హయేరి, కార్నెట్.తాలిబన్లలోనూ విభేదాలు!మహిళలను తీవ్రంగా అణచివేయడంపై తాలిబన్లలోనే వ్యతిరేకత పెరుగుతోంది! అతివాది అయిన దేశాధినేత షేక్ హైబతుల్లా అఖుందా జాదా నిర్ణయాలను తాలిబన్లలోనే ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ వంటివాళ్లు బాలికలు, యువతుల విద్య కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఆరో తరగతి తర్వాత కూడా విద్యను అందించే అండర్ గ్రౌండ్ పాఠశాలలపై తాలిబన్లలోని కొన్ని విభాగాలు దృష్టి సారించినట్టు కార్నెట్ పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేకేఆర్ ఆటగాడి విధ్వంసం.. ధనాధన్ వీరుల జట్టు ఓటమి
అబుదాబీ టీ10 లీగ్‌లో కేకేఆర్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో యూపీ నవాబ్స్కు నాయకత్వం వహిస్తున్న గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్).. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఫలితంగా యూపీ నవాబ్స్.. విధ్వంసకర వీరులతో నిండిన గ్లాడియేటర్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ధనాధన్ వీరులు టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (22), రిలీ రొస్సో (10), నికోలస్ పూరన్ (8), జోస్ బట్లర్ (30), మార్కస్ స్టోయినిస్ (0), డేవిడ్ వీస్ (29), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. నవాబ్స్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 2 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బినుర ఫెర్నాండో 2 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తైమాల్ మిల్స్ 2, అఖిలేశ్ ఓ వికెట్ దక్కించుకున్నారు.113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నవాబ్స్ 8.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (52), ఆవిష్క ఫెర్నాండో (34) నవాబ్స్ విజయానికి గట్టి పునాది వేశారు. ఆండ్రీ ఫ్లెచర్ 7, డేవిడ్ మలాన్ 6, ఓడియన్ స్మిత్ 8 పరుగులు చేశారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్, స్టోయినిస్, ఇబ్రార్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. ప్రస్తుత ఎడిషన్‌లో నవాబ్స్కు ఇది రెండో విజయం. గ్లాడియేటర్స్‌కు తొలి ఓటమి. కాగా, రెండు రోజుల కిందట జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ గుర్బాజ్‌ను 2 కోట్ల బేస్ ధరకు తిరిగి సొంతం చేసుకుంది. -
ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. ఆఫ్ఘన్ ఆటగాడి విధ్వంసం
అబుదాబీ టీ10 లీగ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో బంగ్లా టైగర్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న జజాయ్ ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదాడు. నార్త్రన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జజాయ్ ఈ ఫీట్‌ను సాధించాడు. వారియర్స్ బౌలర్ అంకుర్ సాంగ్వాన్ జజాయ్ ధాటికి బలయ్యాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఐదో బంతి మినహా మిగిలిన ఐదు బంతులను జజాయ్ సిక్సర్లుగా మలిచాడు. ఈ మ్యాచ్‌లో జజాయ్ 23 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 53 పరుగులు చేశాడు. జజాయ్‌తో పాటు మొహమ్మద్ షెహజాద్ (25 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో నార్త్రన్ వారియర్స్‌పై బంగ్లా టైగర్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్రన్ వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 28 బంతుల్లో 4 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. వారియర్స్ ఇన్నింగ్స్‌లో మున్రో మినహా ఎవరూ రాణించలేదు. బ్రాండన్ కింగ్ (12), జాన్సన్ చార్లెస్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 7, అజ్మతుల్లా 4, జియా ఉర్ రెహ్మాన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ పేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 108 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్ 7.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ప్రస్తుత ఎడిషన్‌లో బంగ్లా టైగర్స్‌కు ఇది వరుసగా రెండో విజయం. -
నాడు బెదిరింపులు, నిషేధానికి గురైన అమ్మాయి..నేడు ప్రపంచమే..!
‘నువ్వు మాట్లాడకూడదు’ అని బెదిరింపులు ఎదుర్కొన్న అమ్మాయి గురించి ఇప్పుడు ప్రపంచం గొప్పగా మాట్లాడుకుంటోంది. ‘నువ్వు ఇంటికే పరిమితం కావాలి’ అనే అప్రకటిత నిషేధానికి గురైన అమ్మాయి గురించి..‘నీలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో ఉండాలి’ అంటున్నారు. అఫ్గానిస్థాన్‌కు చెందిన పదిహేడేళ్ల నీలా ఇబ్రహీమి ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్ (కిడ్స్ రైట్స్ ప్రైజ్) గెలుచుకుంది. మహిళలు, బాలికల హక్కుల కోసం బలంగా తన గొంతు వినిపించినందుకు నీలా ‘కిడ్స్ రైట్స్ ప్రైజ్’కు ఎంపికైంది....‘కిడ్స్ రైట్స్’ ఫౌండేషన్ అందించే అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి మానవహక్కులు, సామాజిక న్యాయానికి సంబంధించి గణనీయమైన కృషిచేసిన వారికి ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా 47 దేశాల నుంచి 165 మంది నామినీల నుంచి గట్టి పోటీని అధిగమించి ఈ బహుమతికి ఎంపికైంది నీలా ఇబ్రహీమి.‘నీలా ధైర్యసాహసాలకు ముగ్ధులం అయ్యాం’ అన్నారు ‘కిడ్స్ రైట్స్ ఫౌండేషన్’ ఫౌండర్ మార్క్ డల్లార్ట్.లింగ సమానత్వం, అఫ్గాన్ మహిళల హక్కుల పట్ల నీలా పాట, మాట ఆమె అంకితభావం, ప్రతిఘటనకు ప్రతీకలుగా మారాయి. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఊహించినట్లుగానే మహిళల హక్కులను కాలరాయడం మొదలుపెట్టారు. ఆడపిల్లలు ప్రాథమిక పాఠశాలకు మించి చదువుకోకూడదు. మహిళలు మార్కులు, జిమ్, బ్యూటీ సెలూన్లకు వెళ్లడాన్ని నిషేధించారు. మహిళలు ఇల్లు దాటి బయటికి రావాలంటే పక్కన ఒక పురుషుడు తప్పనిసరిగా ఉండాల్సిందే. దీనికితోడు కొత్త నైతిక చట్టం మహిళల బహిరంగ ప్రసంగాలపై నిషేధం విధించింది. ఈ పరిస్థితినిఐక్యరాజ్యసమితి ‘లింగ వివక్ష’గా అభివర్ణించింది. తాలిబన్ ప్రభుత్వం మాత్రం ఇది నిరాధారమని, దుష్ప్రచారం అని కొట్టి పారేసింది. మహిళల హక్కులపై తాలిబన్ల ఉక్కుపాదం గురించి నీలా పాడిన శక్తిమంతమైన నిరసన పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాట అఫ్గాన్ సమాజంపై చూపిన ప్రభావం ఇంతా అంతా కాదు. నీలా ‘ఐయామ్ మైసాంగ్’ మూవ్మెంట్ మహిళల హక్కులపై గొంతు విప్పడానికి ఎంతోమందికి స్ఫూర్తినీ, ధైర్యాన్ని ఇచ్చింది.‘నేను చేసిన పని రిస్క్‌తో కూడుకున్నది. అది అత్యంత ప్రమాదకరమైనదని కూడా. అయితే ఆ సమయంలో నాకు అదేమీ తెలియదు. ఎందుకంటే అప్పుడు నా వయసు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది నీలా. ‘అంతర్జాతీయ బాలల శాంతి బహుమతిని గెలుచుకోవడం అంటే అఫ్గాన్ మహిళలు, బాలికల గొంతు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించడం. తాలిబన్ల ΄పాలనలో అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళల హక్కుల కోసం పోరాడాను. పోరాడుతూనే ఉంటాను’ అంటూ పురస్కార ప్రదానోత్సవంలో మాట్లాడింది నీలా.నీలా పట్ల అభిమానం ఇప్పుడు అఫ్గాన్ సరిహద్దులు దాటింది. అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు అభిమానులు ఉన్నారు. అఫ్గాన్‌ను విడిచిన నీలా ఇబ్రహీమి ‘30 బర్డ్స్ ఫౌండేషన్’ సహాయంతో కుటుంబంతో కలిసి కెనడాలో నివసిస్తుంది. ‘నేను నా కొత్త ఇంట్లో సురక్షితంగా ఉన్నాను. అయితే అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమ్మాయిల గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. ప్రపంచంలో ఏ ్ర΄ాంతంలో మహిళల హక్కులు దెబ్బతిన్నా అది యావత్ ప్రపంచంపై ఏదో ఒకరకంగా ప్రభావం చూపుతుంది’ అంటుంది నీలా. ‘హర్ స్టోరీ’ కో–ఫౌండర్‌గా అఫ్గానిస్థాన్‌లోని అమ్మాయిలు తమ గొంతు ధైర్యంగా వినిపించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తోంది.అఫ్గాన్‌లో మహిళా విద్య, హక్కులకు సంబంధించి జెనీవా సమ్మిట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ. యూకే హౌజ్ ఆఫ్ లార్డ్స్, కెనడియన్ ఉమెన్ ఫర్ ఉమెన్ ఆఫ్ అఫ్గానిస్థాన్ మాంట్రియల్ సమ్మిట్, టెడ్ వాంకూవర్లాంటి వివిధ కార్యక్రమాలలో తన గళాన్ని వినిపించిన నీలా ఇబ్రహీమీ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలాతో కలిసి పనిచేస్తోంది. -
ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ పాలన.. భారత్‌లో కీలక పరిణామం
ఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ పాలనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలిసారిగా భారత్‌లోని ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఆప్ఘనిస్థాన్ దౌత్యవేత్త కార్యాలయం (కాన్సులేట్) తాత్కాలిక రాయబారిగా విద్యార్థి ఇక్రముద్దీన్ కమిల్ నియమితులయ్యారు. 2021లో ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే తాలిబన్ పాలనను కేంద్రం వ్యతిరేకించింది. భారత్‌లో ఆప్ఘనిస్థాన్ కాన్సులేట్ రాయబారుల్ని వెనక్కి పంపింది. మూడేళ్ల తర్వాత తాజాగా భారత్‌లోని ఆప్ఘనిస్థాన్ కాన్సులేట్ రాయబారిగా ఇక్రముద్దీన్ కమిల్‌ను తాలిబన్ ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది. ఈ నియామకంపై కేంద్రం వివరణ ఇవ్వాల్సి ఉంది. -
సెంచరీ చేజార్చుకున్న మహ్మదుల్లా.. బంగ్లాదేశ్ స్కోర్ ఎంతంటే..?
షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను మెహిది హసన్ మీరాజ్ (119 బంతుల్లో 66; 4 ఫోర్లు), మహ్మదుల్లా (98 బంతుల్లో 98; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 145 పరుగులు జోడించి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. మహ్మదుల్లా ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటై సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ 19, సౌమ్య సర్కార్ 24, జకీర్ హసన్ 4, తౌహిద్ హృదోయ్ 7, జాకెర్ అలీ 1, నసుమ్ అహ్మద్ 5 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ నాలుగు వికెట్లు తీసి 37 పరుగులిచ్చాడు. ఇవి అతని వన్డే కెరీర్లో అత్యుత్తమ గణంకాలు. మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్.. బంగ్లాదేశ్ రెండో మ్యాచ్‌లో గెలుపొందాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. -
AFG Vs BAN: రాణించిన మొహమ్మద్ నబీ.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. షార్జా స్టేడియంలో ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. క్రికెట్ చరిత్రలో ఏ స్టేడియం కూడా 300 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లు తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ తలో నాలుగు వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్‌ను దెబ్బకొట్టారు. షొరీఫుల్ ఇస్లాం ఓ వికెట్ దక్కించుకున్నాడు.రాణించిన నబీ, షాహిది71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను మొహమ్మద్ నబీ, హష్మతుల్లా షాహిది ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. షాహీది 92 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. మొహమ్మద్ నబీ 79 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు.ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ 5, సెదికుల్లా అటల్ 21, రహ్మత్ షా 2, అజ్మతుల్లా ఒమర్జాయ్ 0, గుల్బదిన్ నైబ్ 22, రషీద్ ఖాన్ 10, ఖరోటే 27 (నాటౌట్), అల్లా ఘజన్ఫర్ 0, ఫజల్ హక్ ఫారూకీ 0 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ ఆఖర్లో నబీ, ఖరోటే వేగంగా ఆడటంతో ఆఫ్ఘన్లు గౌరవప్రదమైన స్కోర్ చేశారు.అనంతరం 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. తంజిద్ హసన్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. సౌమ్య సర్కార్ 28, నజ్ముల్ హసన్ షాంటో 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అల్లా ఘజన్ఫర్కు తంజిద్ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలంటే 42 ఓవర్లలో మరో 197 పరుగులు చేయాల్సి ఉంది. -
ఆసియా కప్ 2024 విజేతగా ఆఫ్ఘనిస్తాన్
ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 టోర్నీ విజేతగా ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టు అవతరించింది. నిన్న (అక్టోబర్ 27) జరిగిన ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్-ఏ శ్రీలంక-ఏపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. బిలాల్ సమీ (4-0-22-3), అల్లా ఘజన్ఫర్ (4-0-14-2) అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంకను కట్టడి చేశారు.THE HISTORIC MOMENT. - Afghanistan wins the Emerging Asia Cup. 🥶pic.twitter.com/vwiX4xaE6o— Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2024శ్రీలంక ఇన్నింగ్స్‌లో సహన్ అరచ్చిగే (64 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. పవన్ రత్నాయకే (20), నిమేశ్ విముక్తి (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. యశోధ లంక (1), లహీరు ఉదార (5), నువనిదు ఫెర్నాండో (4), అహన్ విక్రమసింఘే (4), రమేశ్ మెండిస్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. దుషన్ హేమంత 6 పరుగులతో అజేయంగా నిలిచాడు. పవన్ రత్నాయకే, నిమేశ్ విముక్తి రనౌటయ్యారు. THE CELEBRATIONS OF AFGHANISTAN TEAM WITH EMERGING ASIA CUP TROPHY..!!! 🏆- A Historic Moments for Afghanistan Cricket History. 🇦🇫 pic.twitter.com/NctY2q9yvO— Tanuj Singh (@ImTanujSingh) October 27, 2024అనంతరం 134 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీయాలకు చేరింది. సెదికుల్లా అటల్ (55 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో ఆఫ్ఘనిస్తాన్‌ను గెలిపించాడు. అతనికి కరీం జనత్ (33), కెప్టెన్ దర్విష్ రసూలీ (24), మహ్మద్ ఇషాక్ (16 నాటౌట్) సహకరించారు. Happy team, Happy moments to cherish 👏pic.twitter.com/Cmhas0L9zY— CricTracker (@Cricketracker) October 27, 2024లంక బౌలర్లలో సహన్ అరచ్చిగే, దుషన్ హేమంత, ఎషాన్ మలింగ తలో వికెట్ పడగొట్టారు. ఫైనల్లో అద్భుతమైన స్పెల్‌తో (4-0-14-2) శ్రీలంకను కట్టడి చేసిన అల్లా ఘజన్ఫర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీ ఆధ్యంతం అద్భుతంగా రాణించిన సెదికుల్లా అటల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యాడు. -
Asia Cup 2024 Final: ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ 134 రన్స్
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 టోర్నీ ఫైనల్లో ఇవాళ (అక్టోబర్ 27) శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు బిలాల్ సమీ (4-0-22-3), అల్లా ఘజన్ఫర్ (4-0-14-2) సత్తా చాటడంతో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది.శ్రీలంక ఇన్నింగ్స్‌లో సహన్ అరచ్చిగే (64 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. పవన్ రత్నాయకే (20), నిమేశ్ విముక్తి (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. యశోధ లంక (1), లహీరు ఉదార (5), నువనిదు ఫెర్నాండో (4), అహన్ విక్రమసింఘే (4), రమేశ్ మెండిస్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. దుషన్ హేమంత 6 పరుగులతో అజేయంగా నిలిచాడు. పవన్ రత్నాయకే, నిమేశ్ విముక్తి రనౌటయ్యారు. అనంతరం 134 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. జుబైద్ అక్బరీ (0), కెప్టెన్ దర్విష్ రసూలీ (24) ఔట్ కాగా.. సెదికుల్లా అటల్ (19), కరీం జనత్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలవాంటే మరో 72 బంతుల్లో 87 పరుగులు చేయాలి. -
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన
షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (అక్టోబర్ 23) ప్రకటించారు. ఈ జట్టుకు హష్మతుల్లా షాహిదీ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. రహ్మత్ షా వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. నవంబర్ 6, 9, 11 తేదీల్లో ఈ వన్డే సిరీస్ జరుగనుంది.ముజీబ్ ఔట్.. నూర్ అహ్మద్ ఇన్ఈ సిరీస్ కోసం ఆఫ్ఘన్ సెలెక్టర్లు కొత్తగా ఇద్దరిని ఎంపిక చేశారు. గాయాల బారిన పడిన ఇబ్రహీం జద్రాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాల్లో సెడిఖుల్లా అటల్, నూర్ అహ్మద్ జట్టులోకి వచ్చారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇటీవల సౌతాఫ్రికాపై సిరీస్ విజయం (వన్డే) సాధించిన విషయం తెలిసిందే. షార్జాలో జరిగిన ఆ సిరీస్‌లో ఆఫ్ఘన్లు 2-1 తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేశారు. ఐసీసీ టాప్-5 ర్యాంక్ టీమ్‌పై ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది తొలి సిరీస్ విజయం.బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలీఖిల్, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, సెడిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, నంగ్యల్ ఖరోటీ, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూఖీ, బిలాల్ సమీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.చదవండి: న్యూజిలాండ్ టీమ్‌కు కొత్త కెప్టెన్ -
#RashidKhanMarriage : వైరలవుతున్న స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పెళ్లి (ఫొటోలు)
-
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. రషీద్ వివాహం నిన్న (అక్టోబర్ 3) రాత్రి ఆఫ్ఘన్ రాజధాని కాబుల్‌లో జరిగింది. పష్తూన్ సంప్రదాయం ప్రకారం రషీద్ పెళ్లి చేసుకున్నాడు. రషీద్ వివాహ కార్యక్రమానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈవో నసీబ్ ఖాన్ సహా చాలా మంది స్వదేశీ క్రికెటర్లు హాజరయ్యారు. Historical Night 🌉 Kabul is hosting the wedding ceremony of the prominent Afghan cricket star and our CAPTAIN 🧢 Rashid Khan 👑 🇦🇫 @rashidkhan_19Rashid Khan 👑 and his three brother got married at same day.Wishing him a and his thee brother happy and healthy life ahead! pic.twitter.com/YOMuyfMMXP— Afghan Atalan 🇦🇫 (@AfghanAtalan1) October 3, 2024రషీద్‌తో పాటు అతని ముగ్గురు సోదరులకు ఒకే సారి వివాహం జరిగినట్లు తెలుస్తుంది. రషీద్ పెళ్లి ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. రషీద్ వివాహ వేదిక వద్ద కొందరు తుపాకులు పట్టుకుని పహారా కాస్తూ కనిపించారు. ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.Scenes outside the hotel which is hosting Rashid Khan's wedding in Kabul. pic.twitter.com/LIpdUYVZcA— Mufaddal Vohra (@mufaddal_vohra) October 3, 202426 ఏళ్ల రషీద్‌కు ప్రపంచంలో మేటి స్పిన్నర్‌గా పేరుంది. రషీద్ పొట్టి క్రికెట్లో తిరుగులేని బౌలర్‌గా చలామణి అవుతున్నాడు. రషీద్ విశ్వవ్యాప్తంగా జరిగే ప్రతి లీగ్‌లో పాల్గొంటాడు. టీ20ల్లో రషీద్ సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా (613 వికెట్లు) కొనసాగుతున్నాడు. Congratulations to the one and only King Khan, Rashid Khan, on your wedding! Wishing you a lifetime of love, happiness, and success ahead.@rashidkhan_19 pic.twitter.com/fP1LswQHhr— Mohammad Nabi (@MohammadNabi007) October 3, 2024రషీద్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున 5 టెస్ట్‌లు, 105 వన్డేలు, 93 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో రషీద్ 376 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ రషీద్ 121 మ్యాచ్‌లు ఆడి 149 వికెట్లు తీశాడు. రషీద్ ఖాతాలో ఐదు వన్డే హాఫ్ సెంచరీలు, ఓ టెస్ట్ హాఫ్ సెంచరీ ఉన్నాయి.The wedding hall that will host Rashid Khan’s wedding ceremony in Kabul, Afghanistan today 🔥#ACA pic.twitter.com/FOM2GCkqZw— Afghan Cricket Association - ACA (@ACAUK1) October 2, 2024Black is the ultimate style statement. Congratulations Mr. Magician @rashidkhan_19 🎉🎊 pic.twitter.com/KlMYqzpJ32— Wazhma Ayoubi 🇦🇫 (@WazhmaAyoubi) October 3, 2024 -
CT: మాతో పాటు టీమిండియా.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్
ICC Champions Trophy 2025: వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మరో క్రేజీ ఈవెంట్ క్రికెట్ ప్రేమికులను అలరించనుంది. దాదాపు ఏడేళ్ల రీఎంట్రీ ఇవ్వనున్న ఈ ఐసీసీ టోర్నీ పాకిస్తాన్లో జరుగనుంది. 2017లో ట్రోఫీ గెలిచిన పాక్.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.అఫ్గనిస్తాన్ చేతిలో తొలి ఓటమిఅయితే, గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో బాబర్ ఆజం జట్టు చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే పాక్ నిష్క్రమించింది. అంతేకాదు.. తమ వన్డే చరిత్రలో మొట్టమొదటిసారి అఫ్గనిస్తాన్ చేతిలో ఓటమిని చవిచూసింది.పొట్టి వరల్డ్‌కప్‌లో మరీ ఘోరంగాఈ నేపథ్యంలో దారుణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బాబర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు మళ్లీ పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వన్డే, టీ20 జట్ల పగ్గాలు చేపట్టాడు. కానీ పొట్టి వరల్డ్‌కప్‌లో మరీ ఘోరంగా.. పసికూన అమెరికా చేతిలో ఓడి.. సూపర్-8కు కూడా చేరకుండానే పాక్ ఇంటిబాట పట్టడం గమనార్హం.సంచలన విజయాలతో అఫ్గన్ సెమీ ఫైనల్కుమరోవైపు.. అఫ్గనిస్తాన్ సంచలన విజయాలతో ఏకంగా సెమీ ఫైనల్‌కు చేరడం విశేషం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దిగ్గజ జట్లకు షాకిచ్చి టాప్-4లో నిలిచింది. అయితే, సెమీస్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగినా.. ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది.చాంపియన్‌గా చాంపియన్గాఇక ఈ పొట్టి వరల్డ్‌కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ తర్వాత జరుగబోయే తొలి ఐసీసీ ఈవెంట్ కాబట్టి చాంపియన్స్ ట్రోఫీ పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ వన్డే జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.సెమీస్ చేరే జట్లు ఇవేచాంపియన్స్ట్రోఫీ-2025 సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవేనంటూ అఫ్గనిస్తాన్‌తో పాటు.. వన్డే ప్రపంచకప్-2023 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ ఇండియా, మాజీ చాంపియన్ ఇంగ్లండ్ పేర్లను చెప్పాడు. గత కొన్నాళ్లుగా వరుస వైఫల్యాలతో చతికిల పడ్డ ఆతిథ్య పాకిస్తాన్ పేరును షాహిది పక్కనపెట్టడం గమనార్హం. కాగా అఫ్గన్ ఇటీవలే తొలిసారిగా సౌతాఫ్రికాపై వన్డే విజయం సాధించడంతో పాటు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న జోష్‌లో ఉంది.ఇదిలా ఉంటే.. వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న చాంపియన్స్‌ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అన్న అంశంపై ఇంత వరకు స్పష్టత రాలేదు. తమకు తటస్థ వేదికలు కేటాయించాలని బీసీసీఐ కోరగా.. ఐసీసీ నుంచి ఇంత వరకు ఎలాంటి హామీ రాలేదని సమాచారం.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ! -
ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..!
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఆసియా దేశాలైన భారత్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇరగదీస్తున్నాయి. టెస్ట్ హోదా కలిగిన ఐదు దేశాల్లో ఒక్క పాక్ మినహా మిగతా నాలుగు దేశాలు అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. వీటిలో భారత్ తిరుగులేని శక్తిగా దూసుకుపోతుండగా.. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. భారత్ ప్రత్యర్ధి ఎవరైనా చీల్చిచెండాడుతుండగా.. మిగతా మూడు దేశాలు తమకంటే మెరుగైన ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి.భారత్ విషయానికొస్తే.. శ్రీలంక చేతిలో ఇటీవల వన్డే సిరీస్‌లో పరాజయం మినహా టీమిండియా అపజయమనేదే ఎరుగదు. టీ20 వరల్డ్‌కప్‌లో జగజ్జేతగా అవతరించిన అనంతరం భారత్ ఎదుర్కొన్న తొలి సిరీస్ పరాజయం అది.శ్రీలంక విషయానికొస్తే.. ఈ ద్వీప దేశం ఇటీవలికాలంలో మెరుగైన క్రికెట్ ఆడుతుంది. కొత్త కోచ్ సనత్ జయసూర్య ఆథ్వర్యంలో ఈ జట్టు సంచలన విజయాలు సాధిస్తుంది. భారత్‌పై మూడు మ్యాచ్ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అనంతరం ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయినప్పటికీ.. చివరి టెస్ట్‌లో అబ్బురపడే విజయాన్ని సాధించింది. తాజాగా శ్రీలంక స్వదేశంలో న్యూజిలాండ్‌కు తొలి టెస్ట్‌లో షాకిచ్చింది. ఇవాళ (సెప్టెంబర్ 23) ముగిసిన మ్యాచ్‌లో శ్రీలంక 63 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది.ఆఫ్ఘనిస్తాన్ విషయానికొస్తే.. ఒకప్పటి క్రికెట్ పసికూన ఇప్పుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ జట్టు 2023 వన్డే వరల్డ్‌కప్ నుంచి హేమీహేమీ జట్లన్నిటికీ షాకిస్తూ లెజెండ్ కిల్లర్‌గా మారింది. టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ వరకు చేరిన ఆఫ్ఘన్లు.. అక్కడ సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవానికి తాజాగా ప్రతీకారం తీర్చుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది.బంగ్లాదేశ్ విషయానికొస్తే.. తమదైన రోజున ఈ జట్టు ఆటగాళ్లను ఎంత మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. బంగ్లాదేశ్ ఇటీవల పాక్‌లో పర్యటించి ఆతిథ్య దేశాన్నే 2-0 తేడాతో (టెస్ట్ సిరీస్‌లో) మట్టికరిపించింది. తాజాగా బంగ్లాదేశ్ పటిష్టమైన టీమిండియా చేతిలో ఓడింది కాని, ప్రదర్శన ప్రకారం పర్వాలేదనిపించింది. చదవండి: ఐదేసిన జయసూర్య.. న్యూజిలాండ్‌ను ఖంగుతినిపించిన శ్రీలంక -
క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా
షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. నిన్న (సెప్టెంబర్ 22) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఆఫ్ఘన్ల చేతిలో క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకుంది. రెండో వన్డేలో సెంచరీ హీరో ఈ మ్యాచ్‌లో కూడా రాణించినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్‌కు పరాజయం తప్పలేదు. తొలుత బౌలర్లు.. ఆతర్వాత మార్క్రమ్ నిలకడగా ఆడి సౌతాఫ్రికాకు ఎట్టకేలకే ఓ విజయాన్ని అందించారు.Afghanistan wins the ODI series against South Africa. 🇦🇫 pic.twitter.com/ddmwyc4Akd— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. 34 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్ మరో మంచి ఇన్నింగ్స్‌తో (89) ఆఫ్ఘనిస్తాన్‌కు చెప్పుకోదగ్గ స్కోర్ అందించాడు. గుర్బాజ్ మినహా ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో ఏ ఒక్కరూ రాణించలేదు. అల్లా ఘజన్ఫర్ (31), షాహిది (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, నకాబా పీటర్, ఫ్లెహ్లుక్వాయో తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ఫోర్టుయిన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.Rahmanullah Gurbaz scored 89 (94) out of Afghanistan's 169 total.- The lone warrior of Afghans tonight! 👏pic.twitter.com/pQQIQzm1aC— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2024అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఎయిడెన్ మార్క్రమ్ (69 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (26 నాటౌట్) ప్రొటీస్‌ను విజయతీరాలకు చేర్చారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ జోర్జీ 26, బవుమా 22, రీజా హెండ్రిక్స్ 18 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఘజన్ఫర్, నబీ, అహ్మద్ మాలిక్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో 89 పరుగులు చేయడంతో పాటు రెండో వన్డేలో రికార్డు సెంచరీ చేసిన గుర్బాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.చదవండి: రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్ -
సౌతాఫ్రికాతో రెండో వన్డే.. శతక్కొట్టిన గుర్బాజ్.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
షార్జా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ మెరుపు సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న గుర్బాజ్ 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. గుర్బాజ్‌కు వన్డేల్లో ఇది ఏడో సెంచరీ. ఈ సెంచరీతో గుర్బాజ్ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే సౌతాఫ్రికాపై వన్డేల్లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. Aggression 🔥pic.twitter.com/TjTAiRuM3S— CricTracker (@Cricketracker) September 20, 202499 పరుగుల వద్ద ఒక్క పరుగు కోసం తెగ ఇబ్బంది పడిన గుర్బాజ్.. మార్క్రమ్ బౌలింగ్‌లో బౌండరీ బాది రికార్డు శతకం సాధించాడు. గుర్బాజ్ కేవలం 42 వన్డేల్లో 5 హాఫ్ సెంచరీలతో పాటు 7 సెంచరీలు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. గుర్బాజ్ సెంచరీతో చెలరేగగా.. రహ్మత్ షా (50), అజ్మతుల్లా ఒమర్జాయ్ (86 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. రియాజ్ హస్సన్ 29, మొహమ్మద్ నబీ 13 పరుగులు చేసి ఔటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, నండ్రే బర్గర్, నకాబా పీటర్, మార్క్రమ్ తలో వికెట్ తీశారు.కాగా, షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్-సౌతాఫ్రికా జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పోటీపడుతున్నాయి. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది. వన్డేల్లో ఆఫ్ఘన్లకు సౌతాఫ్రికాపై ఇదే తొలి విజయం. మూడో వన్డే సెప్టెంబర్ 22న జరుగనుంది. చదవండి: IND VS BAN 1st Test: తప్పు చేసిన విరాట్ కోహ్లి -
సౌతాఫ్రికాపై సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్
వన్డే క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ సీనియర్ ప్లేయర్ మొహమ్మద్ నబీ చరిత్ర సృష్టించాడు. 46 దేశాలపై విజయాల్లో భాగమైన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నిన్న షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో నబీ ఖాతాలో ఈ భారీ రికార్డు చేరింది.నబీ విజయాలు సాధించిన 46 దేశాలు..డెన్మార్క్, బహ్రెయిన్, మలేషియా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఇరాన్, థాయిలాండ్, జపాన్, బహామాస్, బోట్స్వానా, జెర్సీ, ఫిజి, టాంజానియా, ఇటలీ, అర్జెంటీనా, పపువా న్యూ గినియా, కేమాన్ దీవులు, ఒమన్, చైనా, సింగపూర్, పాకిస్థాన్, ట్రినిడాడ్ మరియు టొబాగో, యూఎస్ఏ, భూటాన్, మాల్దీవులు, బార్బడోస్, ఉగాండా, బెర్ముడా, ఐర్లాండ్, స్కాట్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్, కెనడా, కెన్యా, హాంకాంగ్, యూఏఈ, జింబాబ్వే, వెస్టిండీస్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాసౌతాఫ్రికాపై తొలి విజయంషార్జా వేదికగా నిన్న (సెప్టెంబర్ 18) జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై సంచలన విజయం సాధించింది. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు సౌతాఫ్రికాపై ఇది తొలి విజయం.SENA దేశాలపై విజయాలుఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలన్నిటిపై (వన్డేల్లో) విజయాలు సాధించినట్లైంది.ఏడాదికాలంగా సంచలనాలు..ఆఫ్ఘనిస్తాన్ జట్టు గతేడాది కాలంగా ఫార్మాట్లకతీతంగా సంచలన విజయాలు సాధిస్తుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంకపై విజయాలు సాధించిన ఆఫ్ఘనిస్తాన్.. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి జట్లకు షాకిచ్చి ఏకంగా సెమీస్‌కు చేరింది.భారత్ మినహా..ఇటీవలికాలంలో పెద్ద జట్లన్నిటికీ షాక్ ఇస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. ఒక్క భారత్ మినహా అన్ని ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాలపై విజయాలు సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. 33.3 ఓవర్లలో 106 పరుగులకు కుప్పకూలింది. ఫజల్ హక్ ఫారూకీ 4, ఘజనఫర్ 3, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసి సౌతాఫ్రికా పతనాన్ని శాశించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు (వియాన్ ముల్దర్ (52), ఫోర్టుయిన్ (16), టోని డి జోర్జీ (11), వెర్రిన్ (10)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 26 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (25), గుల్బదిన్ నైబ్ (34) అజేయ ఇన్నింగ్స్‌లతో ఆఫ్ఘనిస్తాన్‌ను విజయతీరాలకు చేర్చారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఫోర్టుయిన్ 2, ఎంగిడి, మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 20న జరుగనుంది. చదవండి: శతక్కొట్టిన కమిందు మెండిస్.. శ్రీలంక తొలి ప్లేయర్‌గా.. -
వన్డే క్రికెట్లో పెను సంచలనం
వన్డే క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. పసికూనగా చెప్పుకునే ఆఫ్ఘనిస్తాన్ పటిష్ట జట్టు సౌతాఫ్రికాకు ఊహించని షాక్ ఇచ్చింది. షార్జా వేదికగా నిన్న (సెప్టెంబర్ 18) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు సౌతాఫ్రికాపై ఇది తొలి విజయం. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలన్నిటిపై (వన్డేల్లో) విజయాలు నమోదు చేసినట్లైంది. ఈ విజయాలన్ని కూడా గత ఏడాదికాలంలోనే సాధించనవి కావడం విశేషం. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా అద్భుతాలు (2023 వన్డే వరల్డ్‌కప్‌లో సంచలన విజయాలు, 2024 టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్స్) చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. ఒక్క భారత్ మినహా అన్ని ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాలపై విజయాలు సాధించింది.THE WINNING MOMENT FOR AFGHANISTAN VS SOUTH AFRICA. 🇦🇫- What a time for Afghan cricket, they're one of the best currently! 💯pic.twitter.com/SZ8LIplppT— Mufaddal Vohra (@mufaddal_vohra) September 18, 2024మ్యాచ్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లు షార్జా వేదికగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సౌతాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. 33.3 ఓవర్లలో 106 పరుగులకు కుప్పకూలింది. ఫజల్ హక్ ఫారూకీ 4, ఘజన్ఫర్ 3, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసి సౌతాఫ్రికా పతనాన్ని శాశించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్లు (వియాన్ ముల్దర్ (52), ఫోర్టుయిన్ (16), టోని డి జోర్జీ (11), వెర్రిన్ (10)) చేయగలిగారు. వియాన్ ముల్దర్ అర్ద సెంచరీతో ఆదుకోకపోయి ఉంటే సౌతాఫ్రికా స్కోర్ కూడా రెండంకెలకే పరిమితమయ్యేది.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. ఆ జట్టు 26 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆదిలో తడబడినప్పటికీ.. అజ్మతుల్లా ఒమర్జాయ్ (25), గుల్బదిన్ నైబ్ (34) అజేయ ఇన్నింగ్స్‌లతో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఫోర్టుయిన్ 2, ఎంగిడి, మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 20న జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. చదవండి: వరల్డ్ నంబర్ వన్‌గా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు.. ఏకంగా.. -
అత్యంత చెత్త రికార్డు.. 91 ఏళ్ల చరిత్రలో తొలిసారి..?
-
రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం..అప్ఘాన్ జిమ్ ఓనర్ మృతి
దేశా రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అప్ఘాన్కి చెందిన 35 ఏళ్ల జిమ్ యజమానికి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తరంజన్ పార్క్‌లో నివశిస్తున్న అఫ్ఘాన్‌కు చెందిన జిమ్ యజమాని నాదిర్ షా పార్క్ చేసిన రెండు కార్ల పక్కన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. సరిగ్గా గురువారం రాత్రి 10.40 గంటలకు గళ్లచొక్కా ధరించిన వ్యక్తి ఆ ఇద్దరు వ్యక్తులపై అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నాదిర్ షా తీవ్రంగా గాయపడగా, మరొక వ్యక్తి ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అనతరం దుండగుడు కొన్ని మీటర్ల దూరంలో పార్క్ చేసిన మోటార్ సైకిల్‌పై ఎక్కి తప్పించుకున్నాడు. దుండగడు దాదాపు ఆరు నుంచి ఎనిమి రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. అలాగే ఘటనా స్థలంలో బుల్లెట్ ప్రక్షేపకాలు, ఖాళీ కాట్రడ్జ్లు లభించాయి. తీవ్రంగా గాయపడిన బాధితుడు నాదిర్ షాను మాక్స్ ఆస్పత్రికి తరలించగా..అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని వెల్లడించారు అధికారులు. అయితే దాడి చేసిన వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి అతడిపై కాల్పులు జరిపి పారిపోయారని చెబుతున్నారు . అయితే బాధితుడు నాదిర్ షాకి దుబాయ్‌లో పలు వ్యాపారాలు ఉన్నాయని, అలాగే అతడిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అంతేగాదు అతడు ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారులకు తెలిసిన పోలీస్ ఇన్ఫార్మర్ అని అధికారిక వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా..ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ బ్రార్ సన్నిహితుడు రోహిత్ గోదారా పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ పెద్ద దుమారం రేపింది. ఆ పోస్ట్‌లో తీహార్ జైలులో ఉన్న తన సన్నిహితుడు సమీర్ బాబా వ్యాపార ఒప్పందాలను అడ్డుకోవడంతోనే తాను నాదిర్ షాను అంతమొందించాలని తన సహాయకులను ఆదేశించినట్లు రోహిత్ గోదారా సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు. పైగా ఎవరైనా ఆ ధైర్యం చేస్తే వారికి అదే గతిపడుతుందని హెచ్చరించడం గమనార్హం.(చదవండి: వేధించే ఎన్ఆర్ఐ భర్తలపై కొరడా) -
ఒక్క బంతి కూడా పడకుండా రద్దైన టెస్ట్ మ్యాచ్‌లు
గ్రేటర్ నోయిడా వేదికగా ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్ వర్షం, తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యేలా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే మూడు రోజులు రద్దయ్యాయి. కనీసం టాస్ కూడా పడలేదు. ఆటగాళ్లు హోటల్ రూమ్లకే పరిమితమయ్యారు. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో డ్రైనేజీ సదుపాయం సరిగ్గా లేకపోవడం కారణంగా వర్షం పడకపోయినా తొలి రెండు రోజుల ఆట రద్దైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా రెండు రోజుల ఆట కూడా జరిగే ఆస్కారం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో క్రికెట్‌కు ఆతిథ్యం ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో భారత్ వారికి గ్రేటర్ నోయిడా మైదానాన్ని హోం గ్రౌండ్‌గా ఆఫర్ చేసింది. బీసీసీఐ వారి ముందు కాన్పూర్, బెంగళూరు, నోయిడా వేదికలను ఛాయిస్‌గా ఉంచితే వారే నోయిడాను ఎంచుకున్నారు. కాబుల్ నుంచి ఢిల్లీ.. ఢిల్లీ నుంచి నోయిడా దగ్గర కావడమే ఇందుకు కారణం. ఏది ఏమైనా వర్షం, సరైన డ్రైనేజీ సదుపాయం లేకపోవడం కారణంగా నోయిడాలో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ రద్దయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌లు రద్దైన పలు సందర్భాలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.1890లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది1938లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది1970లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- టెస్ట్ మ్యాచ్‌ను వన్డేగా మార్చారు1989లో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్- టెస్ట్ మ్యాచ్‌ను వన్డేగా మార్చారు1990లో ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్- ఐదో రోజు వన్డే మ్యాచ్ ఆడారు1998లో పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే- కనీసం జట్లు కూడా ప్రకటించలేదు1998లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్- మూడో రోజు మ్యాచ్‌ను రద్దు చేశారుచదవండి: Afg vs NZ: మొన్న అలా.. ఇప్పుడిలా! ఖేల్ ఖతం? -
రెండో రోజూ అదే పరిస్థితి
గ్రేటర్ నోయిడా: అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్‌ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టుకు వింత పరిస్థితి ఎదురవుతోంది. ఇరుజట్ల మధ్య సోమవారం నుంచి టెస్టు మ్యాచ్ జరగాలి. కానీ ఆటగాళ్లు మైదానంలో దిగడం లేదు. ఆట ముందుకు సాగడమే లేదు. రెండు రోజులుగా ఇదే జరుగుతోంది. అలాగని ఈ రెండు రోజులుగా వర్షమేమీ కురవడం లేదు. వాన చినుకు జాడ లేకపోయినా... మైదానం మాత్రం ఆడేందుకు సిద్ధంగా లేదు. కొన్ని రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాల వల్ల మైదానం చిత్తడిగా మారింది. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యం అవుతోంది. కేవలం ప్రతికూల పరిస్థితుల వల్లే మొదలవడం లేదు. మంగళవారం రెండోరోజు ఆట జరిపించేందుకు మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది తెగ శ్రమించారు. ల్యాండ్‌స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చారు. ఫ్యాన్లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేశారు. అయినాకూడా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం గ్రౌండ్ సిద్ధంగా లేకపోవడంతో ఫీల్డు అంపైర్లు కుమార ధర్మసేన, షర్ఫుద్దౌలా రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
సౌతాఫ్రికా జట్ల ప్రకటన.. స్టార్ పేసర్ రీ ఎంట్రీ
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్‌లతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం మూడు వేర్వేరు దక్షిణాఫ్రికా జట్లను ఇవాళ (సెప్టెంబర్ 9) ప్రకటించారు. ఈ సిరీస్‌లలో సౌతాఫ్రికా తొలుత ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు షార్జా వేదికగా జరుగనున్నాయి. ఆతర్వాత సౌతాఫ్రికా ఐర్లాండ్‌తో రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ అబుదాబీ వేదికగా జరుగనున్నాయి.ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్‌లతో జరిగే సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్లలో వన్డే జట్టుకు టెంబా బవుమా, టీ20 జట్టుకు ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ లుంగి ఎంగిడి ఈ సిరీస్‌లతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. జేసన్ స్మిత్, న్కాబా పీటర్, ఆండిలే సైమ్‌లేన్ తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ సెప్టెంబర్ 18, 20, 22 తేదీల్లో జరుగనుంది. ఐర్లాండ్‌తో టీ20లు సెప్టెంబర్ 27, 29.. వన్డేలు అక్టోబర్ 2, 4, 7 తేదీల్లో జరుగనున్నాయి.ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, న్కాబా పీటర్, ఆండిలే సైమ్‌లేన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రైన్, లిజాడ్ విలియమ్స్ఐర్లాండ్తో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్కే, నండ్రే బర్గర్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, పాట్రిక్ క్రూగర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, ఆండిలే సైమ్‌లేన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్ఐర్లాండ్తో వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, బ్జోర్న్ ఫోర్టుయిన్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, న్కాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్, కైల్ వెర్రెయిన్, లిజాడ్ విలియమ్స్ -
గుర్బాజ్ ఊచకోత.. ఒక్క బౌండరీ లేదు.. అన్నీ సిక్సర్లే..!
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లో 7 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. 101 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో మాథ్యూ ఫోర్డ్ వేసిన మూడో ఓవర్లో గుర్బాజ్ శివాలెత్తిపోయాడు. హ్యాట్రిక్ సిక్సర్లు సహా మొత్తం నాలుగు సిక్సర్లు బాదాడు. గుర్బాజ్ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ లేదు. అన్నీ సిక్సర్లే. గుర్బాజ్ ఊచకోత ధాటికి వారియర్స్ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో ఛేదించింది. గుర్బాజ్‌కు జతగా టిమ్ రాబిన్సన్ (20 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. pic.twitter.com/aXt21tOfvL— Cricket Cricket (@cricket543210) September 8, 2024వారియర్స్ ఇన్నింగ్స్‌లో షాయ్ హోప్ 11, ఆజమ్ ఖాన్ 0, హెట్‌మైర్ 8, కీమో పాల్ 1 పరుగు చేశారు. లూసియా కింగ్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్.. గుడకేశ్ మోటీ (3.3-0-16-3), ఇమ్రాన్ తాహిర్ (4-0-29-3), కీమో పాల్ (2-0-19-2), ప్రిటోరియస్ (2-0-10-1) ధాటికి 14.3 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది. లూసియా కింగ్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ ఫోర్డ్ (31), జాన్సన్ ఛార్లెస్ (19), టిమ్ సీఫర్ట్ (12), అకీమ్ అగస్ట్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ గెలుపుతో వారియర్స్ సీజన్లో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. లూసియా కింగ్స్ సీజన్ తొలి ఓటమిని ఎదుర్కొంది. -
భారత్‌కు చేరుకున్న న్యూజిలాండ్ జట్టు.. ఎందుకంటే?
న్యూజిలాండ్-అఫ్గానిస్తాన్ మధ్య చారిత్రత్మక టెస్టు మ్యాచ్‌కు గ్రేటర్ నోయిడా ఆతిథ్యమివ్వనుంది. బీసీసీఐ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మ్యాచ్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏకైక టెస్టు మ్యాచ్ కోసం అఫ్గానిస్తాన్ జట్టు ఇప్పటికే నోయిడాకు చేరుకోగా.. తాజాగా కివీస్ జట్టు సైతం భారత గడ్డపై అడుగుపెట్టింది.కెప్టెన్ టిమ్ సౌథీ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు గురువారం తెల్లవారుజామునఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ నుంచి గ్రేటర్ నోయిడాకు బస్సులో కివీస్ పయనమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.శుక్రవారం నుంచి బ్లాక్ క్లాప్స్ తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టనుంది. కాగా ఈ మ్యాచ్ భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు జరగనుండడంతో కివీస్‌కు ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది.అఫ్గాన్ సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ , బెన్ సియర్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్ Welcome @BlackCapsVideo: The New Zealand team has arrived at the hotel in Greater Noida, India, for the one-off Test match against Afghanistan's national team.#AfghanAtalan | #AFGvNZ | #GloriousNationVictoriousTeam pic.twitter.com/UlQApG5UXP— Afghanistan Cricket Board (@ACBofficials) September 5, 2024 -
ప్రమాదంలో అఫ్గాన్ ఉనికి
2021 ఆగస్టు 15. భారత్, దక్షిణ కొరియా వంటి పలు దేశాలు స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటున్న వేళ. అఫ్గానిస్తాన్‌లో మాత్రం ప్రజాస్వామ్యం కుప్పకూలింది. దేశం మరోసారి తాలిబన్ల హస్తగతమైంది. వారి మూడేళ్ల అరాచక పాలనలో అత్యంత భారీ మూల్యం చెల్లించుకున్నది, ఇంకా చెల్లించుకుంటున్నదీ మహిళలే. అడుగడుగునా ఆంక్షల నడుమ సర్వ హక్కులూ కోల్పోయారు. ఇదిలాగే కొనసాగితే దేశ ఉనికికే ప్రమాదమంటున్నారు అఫ్గాన్ హక్కుల కార్యకర్త మహబూబా సిరాజ్. పరిస్థితిని మెరుగు పరిచేందుకు అంతర్జాతీయ సమాజం తాలిబన్లతో చర్చించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే...మళ్లీ అవే అణచివేతలు... 1996 నుంచి 2001 దాకా తాలిబన్లు తొలిసారి అధికారం చేపట్టినప్పుడు అఫ్గాన్‌లో అత్యంత అరాచకం తాండవించింది. మహిళలపై అత్యంత కఠినమైన ఆంక్షలు! విద్య, ఉపాధి అవకాశాల్లేవు. ఒంటరిగా గడప దాటొద్దు. ముఖం పూర్తిగా కప్పుకోకున్నా కొరడా దెబ్బలు, బహిరంగ ఉరి శిక్షలు! తాలిబన్ల పునరాగమనంతో ఆఫ్గాన్ మహిళల పరిస్థితి మళ్లీ దయనీయంగా మారింది. ఆంక్షలు ఇంకా పెరిగాయి. ఇస్లాంలో, అల్లా దృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. దాన్ని తోసిరాజని మహిళలను ఇలా అణచివేయడం ఏం ధర్మమో అర్థం కాదు!చర్చలే పరిష్కారం.. ఈ అరాచకం ఇలాగే కొనసాగితే అఫ్గాన్ ఉనికే ప్రమాదంలో పడుతుంది. తాలిబన్లతో చర్చించాలన్నందుకు నన్ను వారి లాబీయిస్టునంటూ విమర్శిస్తున్నారు. ఎవరితో సమస్యో వాళ్లతో కనీసం మాట్లాడకపోతే పరిష్కారం ఎలా సాధ్యం? మా ముందున్నవి రెండే మార్గాలు. పరస్పరం చంపుకోవడం ఒకటైతే, కూర్చుని చర్చించుకోవడం రెండోది. పోరే శరణ్యమంటే అకారణంగా చచ్చిపోతాం. అందుకే చర్చలంటున్నాను. తాలిబన్లు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నేను దేశంలో లేను. ఈసారి ఎందుకుంటున్నానని ప్రశి్నస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి మహిళలకు నా అవసరముంది. మాకిప్పుడు ప్రపంచంలోని ప్రతి మహిళ మద్దతూ అవసరం. అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చి మాకు సాయపడాలి. భవిష్యత్తుపై ఆశ.. శరణార్థులు, వలసదారులు యూరప్‌ను రంగులమయం చేస్తున్నారు. అయినా ముస్లింలంటే పాశ్చాత్య దేశాలకు భయమెందుకో అర్థం కాదు. ఒకనాటి అఫ్గానిస్తాన్ విభిన్న జాతులు, సంప్రదాయాలతో కూడిన అందమైన కళాఖండం. ఆ పాత అఫ్గాన్ తిరిగి రావాలంటే దేశం వీడిన వాళ్లంతా తిరిగి రావాలి. రాచరిక నేపథ్యం... 75 ఏళ్ల మెహబూబా సిరాజ్ రాజ కుటుంబీకురాలు. 1880 నుంచి 1901 దాకా అఫ్గాన్‌ను పాలించిన అబ్దుర్ రెహా్మన్ ఖాన్ వంశీకురాలు. హజారా తెగ ఊచకోత రెహ్మాన్ హయాంలో జరిగిందే. నియంతృత్వ పాలనతో కర్కోటకునిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. తనపై తాలిబన్ల కీలుబోమ్మ అన్న ఆరోపణలకు ఆ వారసత్వమే కారణమని వాపోతారామె. ఆమె 26 ఏళ్ల పాటు అమెరికాలో గడిపి 2003లో అఫ్గాన్ తిరిగి వెళ్లారు. దేశంలో మహిళలు, బాలికల హక్కుల కోసం కృషి చేస్తున్నారు. అఫ్గాన్ విమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వంటివి నిర్వహిస్తున్నారు. గృహ హింసకు గురవుతున్న మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. గతేడాది నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఇటీవలే ఫిన్లండ్ ఇంటర్నేషనల్ జెండర్ ఈక్వాలిటీ అవార్డు అందుకున్నారు. -
న్యూజిలాండ్‌తో ఏకైక టెస్ట్.. రషీద్ ఖాన్‌కు విశ్రాంతి
సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు గ్రేటర్ నోయిడా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగనున్న ఏకైక టెస్ట్ కోసం ఆఫ్ఘనిస్తాన్ ప్రిలిమినరీ స్క్వాడ్‌ను ఇవాళ (ఆగస్ట్ 27) ప్రకటించారు. 20 సభ్యులున్న ఈ జట్టుకు హష్మతుల్లా షాహిది సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్‌కు చోటు దక్కలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా రషీద్ ఖాన్‌కు విశ్రాంతి ఇస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. రషీద్‌కు టెస్ట్ మ్యాచ్ ఆడే ఫిట్నెస్ లేదని ఏసీబీ పేర్కొంది. రషీద్ ఆగస్ట్ 12న జరిగిన హండ్రెడ్ లీగ్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో అర్దంతరంగా అతను ఆ టోర్నీ నుంచి వైదొలిగాడు. రషీద్ ఇటీవల జరిగిన ఓ లోకల్ టోర్నీలో పాల్గొన్నా టెస్ట్ క్రికెట్ ఆడే స్థాయి అతనికి లేదని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. రషీద్.. న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ అనంతరం జరిగే సౌతాఫ్రికా వన్డే సిరీస్కంతా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని ఏసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సెప్టెంబర్ 18-22 మధ్య తేదీల్లో జరుగనుంది. ఈ సిరీస్‌కు యూఏఈ ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు 20 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ ప్రిలిమినరీ స్క్వాడ్ ఈనెల 28న గ్రేటర్ నొయిడాలోకి సన్నాహక శిబిరానికి చేరుకుంటుంది. ఈ సన్నాహక శిబిరంలో ప్రతిభ ఆధారంగా 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేస్తారు. బీసీసీఐ గ్రేటర్ నోయిడాను ఆఫ్ఘనిస్తాన్‌కు హోం గ్రౌండ్ కింద అలాట్ చేసిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, బహీర్ షా మహబూబ్, ఇక్రమ్ అలీఖేల్ (వికెట్‌కీపర్), షాహిదుల్లా కమల్, గుల్బాదిన్ నాయబ్, అఫ్సర్ జజాయ్ (వికెట్‌కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, షాహమ్సుర్ రెహ్మాన్, ఖైస్ అహ్మద్, జహీర్ ఖాన్, నిజత్ మసూద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, నవీద్ జద్రాన్, ఖలీల్ అహ్మద్, యమా అరబ్. -
గళానికీ సంకెళ్లు!
మిగతా ప్రపంచమంతా కాలంతో పందెం వేస్తూ దూసుకెళ్తుంటే అఫ్గానిస్తాన్ మాత్రం కాలంతో పాటు వెనక్కు పయనిస్తోంది. మూడేళ్ల క్రితం పాలన తాలిబన్ల చేతిలోకి వెళ్లినప్పటి నుంచీ అక్కడ రాతియుగపు పాలన నడుస్తోంది. మహిళల మనుగడ దినదిన గండంగా మారింది. ఆంక్షల కొలిమిలో నిలువునా కాలడం వారికి నిత్యకృత్యమైపోయింది. తాజాగా మహిళల గళానికి కూడా సంకెళ్లు పడ్డాయి... – సాక్షి, నేషనల్ డెస్క్అడుగు కదిపితే ఆంక్షలు. ఊపిరి కూడా ఆడని రీతిలో చుట్టూ నిబంధనల చట్రం. అఫ్గాన్‌లో మహిళపై తాలిబన్లు పాల్పడుతున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్లు పెద్ద చదువులు చదివేందుకు వీల్లేదు. ఆరో తరగతి తర్వాత ఇంటికే పరిమితం కావాలి. ఒళ్లంతా పూర్తిగా కప్పుకుంటే తప్ప ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికి లేదు. ఈ అణచివేతను పరాకాష్టకు తీసుకెళ్తూ తాలిబన్లు తాజాగా మరో మతిలేని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మహిళలు బహిరంగ స్థలాల్లో మాట్లాడటానికి కూడా వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. ప్రసార మాధ్యమాల్లో కూడా వారి స్వరం పొరపాటున కూడా విని్పంచకూడదని ఆదేశించారు! అంతేకాదు, ఇల్లు దాటాలంటే ఒంటితో పాటు ముఖాన్ని కూడా పూర్తిగా కప్పుకోవడం తప్పనిసరంటూ మరో నిబంధన విధించారు!! మహిళల అస్తిత్వానికే గొడ్డలిపెట్టు వంటి ఈ ఆటవిక నిర్ణయాలపై అంతర్జాతీయ సమాజంలో విస్మయం వ్యక్తమవుతోంది. ‘సద్గుణాల వ్యాప్తి, దుర్గుణాల కట్టడి’ పేరిట తాలిబన్లు మూడేళ్ల క్రితం ఏకంగా ఒక శాఖనే ఏర్పాటు చేశారు. మహిళలపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాలతో 114 పేజీల డాక్యుమెంట్‌ను ఆ శాఖ విడుదల చేసింది. అందులో 35 రకాల నూతన నిబంధనలను పొందుపరిచారు. మహిళలు ఇకపై బహిరంగ స్థలాల్లో మాట్లాడేందుకు వీల్లేదన్నది వాటిలో ప్రధానమైనది. ఈ నిబంధనలకు తాలిబన్ పాలకుడు హిబతుల్లా అఖుంద్జాదా ఇటీవలే ఆమోదముద్ర వేశారు. ఆగస్టు 21 నుంచి అవి అమల్లోకి వచ్చాయి.‘మంచిని పెంచేందుకు, చెడును తుంచేందుకు ఈ నూతన ఇస్లామిక్ నిబంధనలు ఎంతగానో దోహదపడుతాయి’ అంటూ సంబంధిత శాఖ అధికార ప్రతినిధి అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకొచ్చారు! కొత్త ఆంక్షలు ఇలా...– ఇకపై మహిళలు బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడటానికి ఏమాత్రం వీల్లేదు. – బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా చదవొద్దు. పాటలు పాడొద్దు. రాగాలు తీయొద్దు. – మీడియాలో కూడా మహిళల గొంతు ఏ రకంగానూ విని్పంచకూడదు. – రక్త సంబం«దీకులను, భర్తను తప్ప మరే పురుషుని వైపూ కన్నెత్తి కూడా చూడొద్దు. – బహిరంగ ప్రదేశాలలో మహిళలు మగవాళ్లతో మాట్లాడటం నిషిద్ధం.– మహిళలను బయటికొచి్చనప్పుడు ముఖం పూర్తిగా కవరయ్యేలా కప్పుకోవాలి. లేదంటే వాళ్లను చూసి మగవాళ్లు ఉద్రేకానికి లోనయ్యే ఆస్కారముంది. – కనుక మహిళలు ఇకపై ముఖంపై పూర్తిగా మేలిముసుగు ధరించాల్సిందే. కేవలం జుత్తు, మెడను మాత్రమే కవర్ చేసే హిజాబ్ మాత్రం ధరిస్తే చాలదు. – మహిళలు ఇకనుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సంగీత వాయిద్యాలను ముట్టుకోకూడదు. – వాహనదారులెవరూ మగవాళ్లు తోడు లేనిదే మహిళలను ఎక్కించుకోకూడదు. – పురుషులు గడ్డం చేసుకోకూడదు. నియమిత వేళల్లో విధిగా ఉపవాసముండాలి. – అఫ్గాన్ మీడియా ఇకపై షరియా చట్టాలను తూ.చా. తప్పకుండా పాటించాలి. – మీడియాలో ఎవరి ఫొటోలూ చూపించడానికి, ప్రచురించడానికి వీల్లేదు.శిక్షలు ఇలా... – నూతన నిబంధనలను ఉల్లంఘించే మహిళలకు... – తొలుత హెచ్చరికల జారీ. – అనంతరం ఆస్తుల జప్తు. – మూడు రోజులదాకా నిర్బంధం. – అనంతరం అవసరాన్ని బట్టి కఠిన శిక్షలు. – నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో వేలాది మంది అఫ్గాన్ మహిళలు ఇప్పటికే నిర్బంధంలో మగ్గుతున్నారు. ఇప్పటికే ఈ ఆంక్షలు... – బాలికలు ఆరో తరగతితోనే చదువు ఆపేయాలి. – మహిళలు ఎటువంటి స్వచ్ఛంద సంస్థల్లోనూ పని చేయడానికి వీల్లేదు.– హిజాబ్ లేకుండా వాళ్లు ఇల్లు దాటకూడదు. -
ఆఫ్ఘనిస్తాన్ అసిస్టెంట్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీథర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. శ్రీథర్ త్వరలో జరుగబోయే న్యూజిలాండ్, సౌతాఫ్రికా సిరీస్‌లతో ఆఫ్ఘనిస్తాన్ అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుతో శ్రీథర్ ఒప్పందం దీర్ఘకాలిక ఒప్పందంగా ఉండే అవకాశం ఉంది.శ్రీథర్‌కు కోచింగ్ విభాగంలో అపార అనుభవం ఉంది. అతను 2021 టీ20 వరల్డ్‌కప్ వరకు రవిశాస్త్రి అండర్లో టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశాడు. 2008-14 వరకు అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో అసిస్టెంట్ ఫీల్డింగ్ మరియు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. అలాగే 2014 ఇండియా అండర్-19 వరల్డ్‌కప్ స్క్వాడ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. శ్రీథర్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి కూడా పని చేశాడు. స్వతహాగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అయిన శ్రీథర్ ఆఫ్ఘన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. శ్రీథర్.. ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్ జోనాథన్ ట్రాట్ అండర్లో పని చేయనున్నాడు. సెప్టెంబర్ 9 నుంచి ఆఫ్ఘనిస్తాన్.. న్యూజిలాండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు భారత్‌లోని నోయిడా వేదిక కానుంది. ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ ఆ జట్టుకు నోయిడాను హోం గ్రౌండ్‌గా ఆఫర్ చేసింది. సెప్టెంబర్ 18 నుంచి ఆఫ్ఘనిస్తాన్ సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ షార్జా వేదికగా జరుగనుంది. -
‘మహిళల స్వేచ్ఛ’పై నినదించినందుకు...
పారిస్: ఒలింపిక్స్ క్రీడల ‘బ్రేకింగ్’ (బ్రేక్ డ్యాన్స్) ఈవెంట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ ప్లేయర్ ఇండియా సర్జో, ఐఓసీ శరణార్ధి టీమ్‌కు చెందిన మనీజా తలాష్ మధ్య ప్రి క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. ఈ పోరు కొనసాగుతున్న సమయంలో మనీజా అఫ్గనిస్తాన్‌లోని మహిళలను స్వేచ్ఛను ప్రసాదించమంటూ ‘ఫ్రీ అఫ్గాన్ ఉమెన్’ అంటూ రాసి ఉన్న కేప్‌ను తన డ్రెస్‌పై ధరించి డ్యాన్సింగ్ చేసింది. అయితే రాజకీయపరమైన వ్యాఖ్యలు, నినాదాలు ప్రదర్శించడంపై ఒలింపిక్స్‌లో నిషేధం ఉంది. దాంతో వెంటనే పోటీని నిలిపివేసిన అధికారులు ఆమెను డిస్క్వాలిఫై చేస్తున్నట్లు ప్రకటించారు. మనీజా స్వదేశం అఫ్గానిస్తాన్ కాగా... ఆ దేశం తాలిబాన్ల ఆ«దీనంలోకి వచ్చిన తర్వాత అఫ్గాన్ నుంచి పారిపోయి స్పెయిన్‌లో శరణార్థిగా తలదాచుకుంది. క్రీడల్లో కల నెరవేర్చుకునేందుకు వచ్చానంటూ 21 ఏళ్ల మనీజా తన గురించి చెప్పుకుంది. ఇప్పుడు శరణార్ధి జట్టు ద్వారా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం రాగా, బరిలోకి దిగి తమ మహిళల గురించి ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆమె చేసిన పనికి ఒలింపిక్స్‌లో అనర్హత వేటును ఎదుర్కొంది. -
ఆఫ్గాన్ ఫస్ట్ ఫిమేల్ ఒలింపిక్ బ్రేక్ డ్యాన్సర్
సినిమాకు ఎంతమాత్రం తీసిపోని కథ మనిజా తలాష్ది. మహిళలు సంగీతం వినడం తప్పు... అనుకునే పరిస్థితులు ఉన్న దేశంలో బ్రేక్డ్యాన్స్పై ఇష్టాన్ని పెంచుకుంది. ఆ ఇష్టం ఆమెకు ఎన్నో కష్టాలు తెచ్చింది. అయినా మడమ తిప్పలేదు. తలాష్ కష్టం వృథాపోలేదు. అఫ్గాన్ ఫస్ట్ ఫిమేల్ ఒలింపిక్ బ్రేక్ డ్యాన్సర్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది...‘సంకల్ప బలం ఉంటే బందీఖానాలో ఉన్నప్పటికీ కల నిజం చేసుకోవచ్చు’ అంటుంది ఆఫ్గానిస్తాన్ ఫస్ట్ ఫిమేల్ ఒలింపిక్ బ్రేక్డ్యాన్సర్ మనీజా తలాష్. కొన్ని సంవత్సరాల క్రితం యూట్యూబ్‌లో ఆఫ్గాన్ బ్రేక్ డ్యాన్సర్ల వీడియో చూసి ‘ఇది కలా నిజమా! ఇలా చేయడం సాధ్యమా’ అనుకుంది తలాష్.మూడు నెలల తరువాత...‘సుప్రియర్స్ క్రూ’గా సుపరిచితులైన బ్రేక్ డ్యాన్సర్లను ట్రైనింగ్ క్లబ్లో కలుసుకుంది. ‘నాకు డ్యాన్స్ నేర్పించగలరా?’ అని అడిగింది. వారు ఓకే అన్నారు. శిక్షణ తీసుకుంటున్న 55 మందిలో తానొక్కతే అమ్మాయి. మొదట ఇబ్బందిగా ఫీలయ్యేది.‘ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే. ఇబ్బందిగా ఫీల్ కావద్దు’ అని ధైర్యం చెప్పేవారు సుప్రియర్ క్రూ సభ్యులు. అయితే తలాష్ బ్రేక్ డ్యాన్స్ నేర్చుకోవడం తల్లిదండ్రులు, ఉ΄ాధ్యాయులకు ఎవరికీ నచ్చేది కాదు. ఈ ఒత్తిడి ప్రభావంతోనో ఏమో... ‘నేర్చుకోవడం నాకు కష్టంగా ఉంది’ అన్నది.‘కష్టం కావచ్చు. అసాధ్యం మాత్రం కాదు’ అన్నారు ‘సుప్రియర్ క్రూ’ సభ్యులు.ఇక అప్పటినుంచి వెనకడుగు వేయలేదు తలాష్. నాలుగు సంవత్సరాల తరువాత... అఫ్గానిస్తాన్ ఫస్ట్ ‘బీ–గర్ల్’ (బ్రేక్డ్యాన్సర్ గర్ల్)గా పేరు తెచ్చుకుంది. మరోవైపు తలాష్కు బెదిరింపు కాల్స్ రావడం మొదలైంది. తన కల సాకారం అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో పన్నెండేళ్ల సోదరుడిని తీసుకొని ΄ాకిస్థాన్కు ΄ారిపోయింది. అక్కడి నుంచి స్పెయిన్‌కు వెళ్లి హ్యుస్కా అనే చిన్న పట్టణంలోని హెయిర్ సెలూన్లో పనిచేస్తూ బ్రేక్ డ్యాన్స్ ్ర΄ాక్టీస్ చేసేది. తలాష్ కథ ఐవోసీ (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) ఎగ్జిక్యూటివ్ బోర్డ్ దృష్టికి రావడంతో రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్‌లో స్థానం కల్పించారు. ఒలింపిక్స్‌లో తలాష్ మెడల్ తేస్తే పెద్ద చరిత్రే. కష్టమే అదృష్టమై...΄ారిస్ ఒలింపిక్స్‌తో మొదటిసారిగా బ్రేకింగ్ స్పోర్ట్ (బి–బోయింగ్, బి–గర్లింగ్ లేదా బ్రేక్ డ్యాన్సింగ్)ను ప్రవేశ పెట్టారు. ప్రపంచ క్రీడా వేదిక చెంతకు చేరడానికి ఇది మనిజా తలాష్కు అదృష్టంగా మారింది. అయితే కష్టాన్ని తప్ప అదృష్ట, దురదృష్టాలను ఎప్పుడూ పెద్దగా నమ్ముకోలేదు తలాష్. ఆమె ఒలింపిక్స్ వరకు రావడమే పెద్ద విజయం. పతకం గెలుచుకుంటే చారిత్రక విజయం అవుతుంది. ‘ఈపోటీ నా కోసం మాత్రమే కాదు. నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న స్నేహితులు, ఆత్మీయుల కోసం’ అంటుంది మనిజా తలాష్.