'మెహ్మాన్' అంటూ.. భారతీయుల మనసులను గెలుపొందాడు..! | Juice Seller In Afghanistan Refuses Money From Indian Tourist Goes Viral | Sakshi
Sakshi News home page

ఆ ఒక్క మాటతో భారతీయుల హృదయాలను గెలుచుకున్న అఫ్గాన్‌ విక్రేత..!

Dec 2 2025 5:53 PM | Updated on Dec 2 2025 5:58 PM

Juice Seller In Afghanistan Refuses Money From Indian Tourist Goes Viral

కొన్ని వైరల్వీడియోలు గొప్ప సందేశాన్ని, ద్భుతమైన ప్రేమను వ్యక్తం చేస్తాయి. అలాంటి అద్భుతమైన క్షణానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. భారతీయ ట్రావెల్వ్లాగర్కైలాష్మీనా భారతీయ సందర్శకులు పట్ల సంస్కృతిని ప్రతిబింబించే సంభాషణను రికార్డు చేశాడు. వీడియోలో అఫ్గనిస్తాన్లోని జ్యైస్కార్ట్‌ ​వద్ద కైలాష్ఒక గ్లాసు దానిమ్మ రసం ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది.

తర్వాత డబ్బు చెల్లించబోతుంటే..విక్రేత మర్యాదగా నవ్వి డబ్బు తీసుకోవడానికి నిరాకరిస్తాడు. పైగా "మెహ్మాన్" అనే పదాన్ని పునరావృతం చేస్తాడు. అంటే మీరు మా అతిథి అని అర్థం. అంతేగాదు సమీపంలో నిలబడి ఉన్న ఒక స్థానిక వ్యక్తి  "ఇండియా మెహ్మాన్ హై" అని గట్టిగా చెబుతూ భావోద్వేగం వ్యక్తం చేస్తాడు. ముఖ్యంగా భారతీయ ప్రయాణికుల పట్ల చూపిన ఆప్యాయతను గురించి వీడియోలో నొక్కి చెప్పడం స్పష్టంగా చూడొచ్చు

అందుకు ముగ్దుడై ట్రావెల్వ్లాగర్ దేశం ఆతిథ్యాన్ని గుర్తిస్తూ  "యే హై ఆఫ్ఘనిస్తాన్ కి మెహ్మన్నవాజీ" అని అంటాడు. అంతేగాదు తాను అఫ్గాన్అంతటా చాలా ప్రదేశాల్లో స్థాయి ఆతిథ్యాన్నే చూశానని, మళ్లీ దేశాన్ని సందర్శించాలనుకుంటున్నా అంటూ వీడియోని ముగించాడు. వీడియో నెటిజన్లను ఆకర్షించడమే కాదు అఫ్గాన్దేశం ఆతిథ్యంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: జేఈఈ ప్రిపరేషన్‌ నుంచి రాష్ట్రపతి మెడల్‌ వరకు..! ఎన్డీఏ చరిత్రలో సరికొత్త మైలు రాయి..)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement