ఇండియా, EU డీల్ .. కుప్పకూలనున్న పాక్‌ ఆర్థిక వ్యవస్థ? | india Eu trade deal pakistan faces billions in losses | Sakshi
Sakshi News home page

ఇండియా, EU డీల్ .. కుప్పకూలనున్న పాక్‌ ఆర్థిక వ్యవస్థ?

Feb 3 2026 2:47 AM | Updated on Feb 3 2026 4:45 AM

 india Eu trade deal pakistan faces billions in losses

ఇటీవల భారత్-ఈయూ మధ్య కీలక ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ అగ్రిమెంట్ పాకిస్థాన్‌ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టెసే ప్రమాదముందని ఆ దేశ నాయకుడు అభిప్రాయపడ్డారు. ఇంతకాలం యూరప్-పాక్ మధ్య నడిచిన జీరో టారిఫ్‌ హానీమూన్ ఈ డీల్ వల్ల ముగిసిందన్నారు. దీని వల్ల ఆ దేశంలో తీవ్ర ఆర్థిక నష్టంతో పాటు దాదాపు కోటి ఉద్యోగాలు పోయే అవకాశం ఉందన్నారు.

ఈయూ- భారత్ మధ్య జరిగిన ఒప్పందం పాకిస్థాన్‌ని పేదరికంలోకి నెట్టేసే అవకాశం ఉన్నట్లు ఆ దేశ నాయకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో పాక్‌పై పడే ప్రభావం అంచనా వేస్తున్నారు. దీనిపై ఆ దేశ మాజీ వాణిజ్య శాఖ మంత్రి స్పందించారు. "ఇంతకాలం ఈయూతో జరిగిన హానీమూన్ ఒప్పందం ముగిసింది. 10 మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. ప్రభుత్వం పరిశ్రమలకు చౌకవిద్యుత్, తక్కువ పన్నులు, సులభమైన రుణాలు అందించాలి అలా అయితే ఇతర దేశాలతో పోటీపడగలం" అని ఆయన అన్నారు.

యూరోపియన్ యూనియన్‌లో ఇంతకాలం పాకిస్తాన్‌ హావా నడిచింది. ఆ దేశానికి చెందిన దాదాపు 65 శాతం వస్తువులు ఎటువంటి పన్నులు లేకుండా  అక్కడికి ఎగుమతి చేయబడుతున్నాయి. ఇప్పుడు భారత్‌తో ఈయూ డీల్ నేపథ్యంలో ఆ ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. భారత్, ఈయూ ఈ ఏడాది జనవరి 27న వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. దాదాపు 200 కోట్ల మంది ప్రజలు ఈ ఒప్పందంలో భాగంగా ప్రభావితమవుతారు. ప్రపంచ జీడీపీలో ఈ ఈయూ-భారత్ మార్కెట్ విలువ దాదాపు 25 శాతం. ఈ ఒప్పందం రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను ఏకం చేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement