బలూచిస్థాన్ తిరుగుబాటు దారులపై పాకిస్థాన్ ఆర్మీ విరుచుకుపడుతుంది. తాజాగా ఆ ప్రాంతంలో దాడి చేసి మరో 22 మంది BLA ( బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ) సైనికులను మట్టుబెట్టించినట్లు తెలిపింది. దీంతో సైన్యం దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 177కు చేరుకున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
BLA ఆర్మీ కోసం పాకిస్తాన్ సైనికులు గాలింపును తీవ్రతరం చేస్తున్నారు. బీఎల్‌ఎఫ్ స్థావరాలపై పక్కా ప్రణాళికతో దాడి చేసి వారి స్థావరాలను ధ్వంసం చేశారు. భద్రతా చర్యలలో భాగంగా క్వెట్టా ప్రాంతంలో రైలు సేవలను సైన్యం నిలిపివేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్‌ను కట్ చేసింది. భద్రతా బలగాలు ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఉగ్రమూకల స్థావరాలను నిర్విర్యం చేస్తున్నాయని పాక్ ఆర్మీ ప్రకటించింది.
అయితే ఇటీవలే బలుచిస్థాన్ ఆర్మీ ఉగ్రదాడులు చేసిన తర్వేతే కౌంటర్‌గా ఈ దాడులు చేపడుతున్నట్లు బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. కేవలం రాజకీయ చర్చల ద్వారానే ఉగ్రవాదాన్ని నిర్మూలించలేమని వారికి తగిన రీతిలో బదులివ్వడానికి పటిష్టమైన సైన్యం అవసరమన్నారు.
అయితే బలూచిస్తాన్‌లోని ఉగ్రవాదులతో సహా వారి సానూభూతిపరుల నెట్‌వర్క్ మెుత్తంగా 4నుంచి 5వేల మధ్య ఉండే అవకాశం ఉందని సర్ఫరాజ్ బుగ్తీ అభిప్రాయపడ్డారు. ఈ దాడులలో ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా పాకిస్థాన్ ఆర్మీ సంయమనం పాటించిందని ఆయన తెలిపారు.


