బంగారం చూస్తే అలా..వీడేమో ఇలా! | crazy boy exchanges Rs 85 lakh family gold for free plates at UP momo stall | Sakshi
Sakshi News home page

బంగారం చూస్తే అలా..వీడేమో ఇలా!

Feb 2 2026 3:10 PM | Updated on Feb 2 2026 3:43 PM

crazy boy exchanges Rs 85 lakh family gold for free plates at UP momo stall

అసలే బంగారం ధరలు కొండెక్కి కూచున్న తరుణంలో ఉత్తర ప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. తనకిష్టమైన మెమోల కోసం లక్షల రూపాయల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టేశాడో టీనేజర్‌.  చివరికి విషయం తెలిసిన కుటుంబ సభ్యులు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు.

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో  ఈ ఘటన చోటుచేసుకుంది.  రాంపూర్ కర్ఖానా పోలీస్ పరిధిలోని ఒక గ్రామంలో 14 ఏళ్ల కుమారుడి నిర్వాకాన్ని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వారణాసికి చెందిన పూజారి విమ్లేష్ మిశ్రా దాఖలు చేసిన అధికారిక ఫిర్యాదు ప్రకారం కొడుకు అమాయకత్వాన్ని వాడుకుని స్థానిక మోమోల దుకాణాల యజమానులు సుమారు రూ. 85 లక్షల విలువైన బంగారాన్ని దోచేశారు.

ఇంట్లో అడిగితే డబ్బులు ఇవ్వరనుకున్నాడో ఏమోగానీ,  ఏడవ తరగతి విద్యార్థి ఒక రోజుబీరువాలోని నగ తీసుకెళ్లి, దుకాణదారులకిచ్చి కావాలను కున్నప్పుడల్లా చెక్కగా మోమోలను లాగించేవాడు.ఈ చోరీనిఇంట్లో వాళ్లు కూడా గుర్తించక పోవడంతో దాన్నే అలవాటుగా మార్చుకున్నాడు. అటు దుకాణాదారులు కూడా పిల్లవాణ్ని వారించడంగానీ, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంగానీ చేయలేదు. పైగా ఆభరణాలు తెస్తేనే  మెమోలు ఇస్తామని బాలుడు బెదిరించినట్టు సమాచారం.

ఎలా బైట పడిందంటే
బాలుడి అత్త పుట్టింటికి వచ్చి, తన నగలకోసం ఆరా తీయడంతో,  బీరువాలో నగలు మాయమయ్యాయన్న సంగతిని గమనించారు.  అనుమానం వచ్చిన బాలుడిని విచారించగా, ఆభరణాలను మోమోలు అమ్మేవారికి ఇచ్చేసినట్లు బాలుడు తన చేసిన పని గురించి చెప్పుకొచ్చాడు. బాలుడి అత్త తన ఆభరణాలను తీసుకోవ డానికి పుట్టింటికి వచ్చినప్పుడు నిజం బయటపడింది. 

కనిపించకుండా పోయిన ఆభరణాల ప్రస్తుత విలువ రూ. 85 లక్షలు దాకా ఉంటుందని దిగ్భ్రాంతికి గురైన విమ్లేష్ మిశ్రా, ముగ్గురు దుకాణ యజమానుల పేర్లను పేర్కొంటూ లిఖితపూర్వక ఫిర్యాదు దాఖలు చేశారు.

దర్యాప్తు జరుగుతోందని పోలీసులు ధృవీకరించారు. వివరాలను ధృవీకరించి, నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. అధికారులు ఇప్పుడు నిందితులైన విక్రేతలను గుర్తించి సబంధిత ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.  అసలు ఎంత బంగారం పోయింది? దాని విలువ ఎంత అనే వివరాలను కూపీ లాగుతున్నారు.

ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement