ఢిల్లీలోని పాలంలో తీవ్ర ఉద్రిక్తత | Clash broke out between BJP and AAP leaders in Palam | Sakshi
Sakshi News home page

ఢిల్లీలోని పాలంలో తీవ్ర ఉద్రిక్తత

Mar 19 2026 9:58 PM | Updated on Mar 19 2026 10:00 PM

Clash broke out between BJP and AAP leaders in Palam

ఢిల్లీ: నగరంలోని పాలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  ఆప్‌,  బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించేందుకు  ఇరు పార్టీల నేతలు వెళ్లారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. ఆప్‌ నేత సౌరభ్ భరద్వాజ్‌పై దాడికి యత్నించారు. ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఇక  ఆప్‌ అధినేత, మాజీ అరవింద్‌ కేజ్రీవాల్‌ భారీ బందోబస్తు నడుమే అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. 

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాలం ప్రాంతంలోని ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారు.  ఈ ఘటనలో 9 మంది మృత్యువాత పడ్డారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పాలం మెట్రో స్టేషన్ సమీపంలోని లేన్ నంబర్2లోని ఒక నాలుగు అంతస్తుల భవనంలో మంటలు అంటుకుని ఈ  ప్రమాదం చోటు చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement