నటి మాజీ భర్త ఆస్తుల కేసులో ఇంట్రస్టింగ్‌ ట్విస్ట్‌ | Late Sunjay Kapur inheritance row SC names exCJI Chandrachud as mediator | Sakshi
Sakshi News home page

నటి మాజీ భర్త ఆస్తుల కేసులో ఇంట్రస్టింగ్‌ ట్విస్ట్‌

May 7 2026 4:11 PM | Updated on May 7 2026 4:59 PM

Late Sunjay Kapur inheritance row SC names exCJI Chandrachud as mediator

న్యూఢిల్లీ:  బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త,  సంజయ్ కపూర్‌ మరణం తరువాత  అతని భార్య  ప్రియా కపూర్, తల్లి రాణీ కపూర్‌ మధ్య వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  సోనా గ్రూప్ (Sona Group) వారసత్వ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఈ ఆస్తి వివాదాన్ని పరిష్కరించేందుకు కోర్టు మధ్యవర్తిత్వాన్ని (Mediation) ఆశ్రయించాలని సూచించింది.


మధ్యవర్తిగా మాజీ సీజేఐ
సోనా గ్రూప్ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన రాణి కపూర్- ఆమె కోడలు ప్రియా కపూర్ (దివంగత సంజయ్ కపూర్ భార్య) మధ్య నడుస్తోంది.  ఈ కేసులో విచారణలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) డి.వై. చంద్రచూడ్ గారిని ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియను పర్యవేక్షించేందుకు నియమించారు. ఇరు పక్షాలు సామరస్యపూర్వక పరిష్కారానికి అంగీకరించడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

వివాదం ఏమిటి?
2017లో తనకు స్ట్రోక్ వచ్చినప్పుడు,తన అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని తన కుమారుడు సంజయ్ కపూర్, కోడలు ప్రియా కపూర్ తన ఆస్తులను ఫ్యామిలీ ట్రస్ట్‌కు బదిలీ చేశారని  తల్లి రాణి కపూర్‌ ఆరోపించారు. పరిపాలనాపరమైన ఫార్మాలిటీస్ అని చెప్పి ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. గతేడాది జూన్‌లో సంజయ్ కపూర్ మరణించిన తర్వాత ఈ పోరాటం మరింత తీవ్రమైంది. ప్రియా కపూర్ సోనా గ్రూప్ సంస్థలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు ఆస్తిలో ఎటువంటి వాటా లేకుండా చేస్తున్నారని రాణి కపూర్ పిటిషన్ వేశారు. 

ఈ పిటిషన్‌ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ జె.బి. పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.  ఇది కుటుంబ వివాదం కనుక  కుటుంబానికే పరిమితం చేచాలని  ఇది ఇతరులకు వినోదంగా మారకూడదని హితవు పలికింది. అలాగే . 80 ఏళ్ల వయస్సులో ఉన్న పిటిషనర్ కోర్టుల చుట్టూ తిరగడం కంటే, మధ్యవర్తిత్వం ద్వారా అన్ని సమస్యలను (A to Z) ఒకేసారి పరిష్కరించు కోవడం శ్రేయస్కరం అంటూ  పెద్దావిడ రాణి కపూర్‌కి సూచించింది.

కాగా సంజయ్‌ కపూర్‌ ఆకస్మిక మరణం తరువాత, ఆయన తొలి, మాజీ భార్య, బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలలు  ఆస్తులు, వారసత్వ  హక్కులపై కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై  అంగీకరించిన ఢిల్లీ హైకోర్టు. సంజయ్ కపూర్ ఆస్తులపై ప్రియా కపూర్ ఎటువంటి థర్డ్-పార్టీ హక్కులను సృష్టించకుండా కోర్టు ఇప్పటికే స్టే ఇచ్చింది మరోవైపు ఈ వివాదం వార్తల్లోకి రావడంతో గురువారం ట్రేడింగ్‌లో సోనా బీఎల్ డబ్ల్యూ (Sona BLW) షేర్లు సుమారు 0.96శాతం బనష్టపోయాయి. 

ఇదీ చదవండి: సెకండ్‌ ర్యాంక్‌ వచ్చిందని ఎగతాళి : 9 ఏళ్ల కూతుర్నే ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement