breaking news
Supreme court of India
-
సుప్రీం కోర్టులో రేవంత్‌రెడ్డికి ఊరట.. పెద్దిరాజుపై సీజేఐ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. గోపనపల్లి ప్రైవేట్ భూ వివాదం కేసులో రేవంత్‌కి వ్యతిరేకంగా, ఎన్ పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ సోమవారం డిస్మిస్ చేసింది. అదే సమయంలో.. పిటిషన్లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గమనించిన సీజేఐ ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. పిటిషన్ రాసిన న్యాయవాది, సంతకం పెట్టిన ఏవోఆర్‌పై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూనే.. పెద్దిరాజు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్, ఏవోఆర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణకు పిటిషనర్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే.. పిటిషనర్ తరఫు న్యాయవాది రితీష్ పాటిల్ క్షమాపణ కోరుతూ.. కేసు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ నోటీసులు సీజేఐ గవాయ్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై తదుపరి విచారణ ఆగస్టు 11కు వాయిదా వేశారు.ఏం జరిగిందంటే.. గోపన్‌పల్లి గ్రామం సర్వే నంబర్ 127లోని సొసైటీకి సంబంధించిన భూమిని ఆక్రమించడంతో పాటు నిర్మాణాలను జేసీబీతో కూల్చేశారంటూ గచ్చిబౌలి పీఎస్‌లో 2016లో కేసు నమోదైంది. పెద్దిరాజు ఫిర్యాదు మేరకు.. ఈ కేసులో ఏ-1గా కొండల్ రెడ్డి(రేవంత్ సోదరుడు), ఏ-2గా ఈ.లక్ష్మయ్య, ఏ-3గా రేవంత్ రెడ్డిని చేర్చారు. ఎల్బీ నగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న జస్టిస్ మౌషమీ భట్టాచార్య ధర్మాసనం.. రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలో లేరనే విషయాన్ని ఫిర్యాదుదారు సైతం అంగీకరించారని పేర్కొంది. తాను లేను కాబట్టి తనపై కేసు కొట్టేయాలని అడుగుతున్నారని, మిగతా వారిపై కేసుకొట్టేయాలని అడగటం లేదని వ్యాఖ్యానించింది. రేవంత్‌రెడ్డి ఆదేశాలమేరకే దూషించారనే ఆరోపిస్తున్నా ఆధారాలు లేవని తెలిపింది. ఇదే భూమికి సంబంధించి ఇదే ఆరోపణలతో గచ్చిబౌలి పీఎస్‌లో 2014లో సైతం కేసు నమోదైందని, నిందితులు-సొసైటీకి మధ్య సివిల్ వివాదమని తేలడంతో తప్పుడు కేసుగా మూసేశారని గుర్తుచేసింది. దీనిపై ఫిర్యాదుదారు పెద్దిరాజు మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు దాన్ని కొట్టేసిందని, దానిపై క్రిమినల్ రివిజన్ పెండింగ్‌లో ఉందని పేర్కొంది. ఈ క్రమంలో.. జులై 18వ తేదీన రేవంత్‌రెడ్డిపై నమోదు అయిన కేసును కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. -
ఎస్ఐఆర్పై స్టే ఇవ్వలేం
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియపై ఇప్పటికిప్పుడు మధ్యంతర స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పిన అత్యున్నత న్యాయస్థానం.. ఓటరు జాబితా సవరణకు ఆధార్‌తోపాటు ఓటరు గుర్తింపు కార్డును పరిగణనలోకి తీసుకోవాలని ఈసీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ధ్రువీకరణలను వాస్తవమై నవిగా భావిస్తున్నామంది. ‘రేషన్ కార్డులకు సంబంధించి చూస్తే వీటిని తేలిగ్గా ఫోర్జరీ చేయొచ్చు. కానీ, ఆధార్, ఓటర్ కార్డులను వాస్తవమైనవిగా భావించొచ్చు. ఈ రెండు ధ్రువీకరణలను అనుమతించండి’అని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో తుది విచారణను ఈ నెల 29వ తేదీన చేపడతామని తెలిపింది. పిటిషనర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ అనే ఎన్జీవో తరఫున సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు. ఇప్పటికిప్పుడే మధ్యంతర జాబితాను ఖరారు చేయవద్దని, ఆగస్ట్ ఒకటో తేదీన ఈసీ ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించకుండా మధ్యంతర స్టే ఇవ్వాలని కోరారు. అయితే, దీనివల్ల మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియే నిలిచిపోతుందని పేర్కొన్న ధర్మాసనం ఆయన వాదనను తోసిపుచ్చింది. ‘న్యాయస్థానం అధికారాన్ని తక్కువగా చూడకండి. ఈ ప్రక్రియ చట్ట వ్యతిరేకమని తేలిన పక్షంలో మీ వాదనను అంగీకరిస్తాం. అప్పుడే ఎస్ఐఆర్ ప్రక్రియ ఆసాంతంగా రద్దు చేసేస్తాం’అని ధర్మాసనం కరాఖండిగా చెప్పింది. బిహార్‌లో చేపట్టిన ఎస్ఐఆర్కు ఆధార్‌తోపాటు ఓటరు ఐడీని అంగీకరించాలంటూ ఈసీని ఈ నెల 10వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. ఈ మేరకు ప్రాథమికంగా అంగీకరిస్తూ ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్‌ను సోమవారం ధర్మాసనం పరిశీలించి, పై వ్యాఖ్యలు చేసింది. ఆధార్, ఓటరు కార్డును అంగీకరిస్తూ ఈసీ అఫిడవిట్ వేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఈ సందర్భంగా లాయర్ శంకరనారాయణన్ తెలపగా.. ఎస్ఐఆర్ కోసం అంగీకరిస్తున్న 11 ధ్రువీకరణలతోపాటు ఆధార్, ఓటరు ఐడీ కూడా ఉంటాయని జస్టిస్ సూర్య కాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈసీ తరఫున సీనియర్ లాయర్ రాకేశ్ ద్వివేది..ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని, అదేవిధంగా, ఓటరు ఐడీని ఓటరు సవరణ ప్రక్రియలో నమ్మకమైందిగా భావించలేమన్నారు. ఓటరు ఐడీని పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం ప్రక్రియతో ఎటువంటి లాభం ఉండదని పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం.. ‘ఈ ప్రపంచంలో ఏ ధ్రువీకరణ పత్రాన్నైనా ఫోర్జరీ చేయొచ్చు. ఫోర్జరీ కేసుల విషయాన్ని ఈసీ చూసుకోవాలి. అన్ని పేర్లను తొలగించడానికి బదులుగా అందరినీ జాబితాలో చేర్చేలా చూడాలి. -
న్యాయస్థానం సహనాన్ని పరీక్షిస్తున్నారు..!
న్యూఢిల్లీ: భారత ఆర్మీ అధికారి కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మధ్యప్రదేశ్ మంత్రి కువ్వర్ విజయ్ షా తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పకుండా న్యాయస్థానం సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ తలంటింది. జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి సోమవారం ఈ కేసు విచారణ సందర్భంగా మంత్రి ప్రవర్తనను, వ్యాఖ్యల వెనుక ఆయన ఉద్దేశాన్ని అనుమానించాల్సి వస్తోందని పేర్కొంది. ‘ఈ విధంగా క్షమాపణ చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెబుతున్నాం. ఏది? ఎక్కడ చెప్పారు? మా సహనాన్ని ఆయన పరీక్షిస్తున్నారు’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మంత్రి షా చెప్పిన బహిరంగ క్షమాపణలను ఆన్లైన్లో షేర్ చేశామని ఆయన తరఫు లాయర్ కె.పరమేశ్వర్ తెలపగా.. ‘క్షమాపణలను ఆన్లైన్లో చెప్పడమేంటి? ఆయన తీరు, ఉద్దేశాలపై మాకు అనుమానాలు కలుగుతున్నాయి. క్షమాపణ చెప్పినట్లుగా రికార్డు చేయండి. మేం దాన్ని చూడాల్సి ఉంది’అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. మంత్రి షా ప్రకటనలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆగస్ట్ 13వ తేదీలోగా నివేదికను తమకు అందజేయాలంది. ఈ సందర్భంగా సిట్ అధికారి ఒకరు 27 మంది ఇచ్చిన వాంగ్మూలాలను సీల్డ్ కవర్లో అందజేశారు. వీటిపై తాము దర్యాప్తు చేపట్టినట్లు ఆ అధికారి చెప్పారు. షా ప్రకటనలు కాకుండా ఇదే విషయంలో ఇతరులు చేసిన అనుచిత ప్రకటనలను రికార్డు చేయాలని ధర్మాసనం సిట్‌ను ఆదేశించింది. కున్వర్ విజయ్ షాను మంత్రిపదవికి రాజీనామా చేయించాలంటూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. షా గతంలో చేసిన ఇటువంటి అనుచిత ప్రకటనలపైనా సిట్ దర్యాప్తు చేస్తుందని పేర్కొంటూ తదుపరి విచారణను ఆగస్ట్ 18వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన సిట్‌ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేలో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు మీడియాకు జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. వీరిపై మంత్రి కున్వర్ విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదైంది. -
భూమ్మీద దేన్నైనా ఫోర్జరీ చేస్తారు కదా?: ఈసీకి ‘సుప్రీం’ ప్రశ్న
బీహార్ ఓటరు జాబితా సవరణలో.. ఆధార్ కార్డుకు పౌరసత్వ గుర్తింపుకార్డుల జాబితా నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్రంగా పరిగణించింది. ఆధార్‌తో పాటు ఓటర్ ఐడీ ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు(EPIC)ని చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ల కింద పరిగణించాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్లో భాగంగా ఆధార్‌ను గుర్తింపుకార్డుగా ఈసీ పరిగణించడం లేదు. తద్వారా ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఈసీని ఉద్దేశించి కీలక వ్యాఖ్య చేసింది. ‘‘భూమ్మీద దేనినైనా ఫోర్జరీ చేస్తారు కదా?’’ అని కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలపై సూటిగా ప్రశ్నను సంధించింది. ఈ క్రమంలో..ఆధార్‌ను తిరస్కరిస్తూ.. బీహార్ ఓటర్ల రివిజన్ ప్రక్రియలో ఓట్లను తొలగిస్తూ వస్తోంది ఎన్నికల సంఘం. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. జులై 10వ తేదీ నాటి విచారణ సందర్భంగా బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్ సబబేనన్న సుప్రీం ధర్మాసనం.. అదే సమయంలో ఆధార్, ఎపిక్, రేషన్ కార్డులనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఈసీకి స్పష్టం చేసింది. అయితే.. ఇవాళ్టి వాదనల సందర్భంగా ఆధార్‌ను ప్రూఫ్ ఆఫ్ సిటిజన్‌షిప్‌గా పరిగణించడం కుదరదని, రేషన్ కార్డులు నకిలీవి సృష్టించే అవకాశం లేకపోలేదని.. కాబట్టి వాటి మీద ఆధారపడలేమని ఈసీ వాదనలు వినిపించింది. అలాగే ఓటర్ నమోదు ప్రక్రియలో ఆధార్‌ను కేవలం ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా మాత్రమే పరిగణిస్తామని పేర్కొంది.దీనిపై సుప్రీం కోర్టు స్పందించింది. ఈ భూమ్మీద ఏ డాక్యుమెంట్‌ను ఫోర్జరీ చేయలేరో చెప్పాలంటూ ఈసీని ప్రశ్నించింది. ఓటర్ నమోదు సమయంలో ఆధార్ ప్రస్తావన ఉంటున్నప్పటికీ.. ఓటరు జాబితా గుర్తింపు కోసం ఎందుకు పరిగణించడం లేదని మరోసారి నిలదీసింది. ఈ క్రమంలో.. ఆధార్, ఎపిక్‌ని బీహార్ ఓటర్ రోల్ రివిజిన్కు చేర్చాలంటూ ఆదేశించింది.ఎన్నికల సంఘం (EC) జాబితాలోని ఏదీ నిర్ణయాత్మక పత్రం కాదు కదా. ఆధార్, ఎపిక్ విషయాల్లో మీరు ఎత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే గనుక రేపు మీరు అంగీకరించిన ఇతర పత్రాలు కూడా ఫోర్జరీ జరిగితే.. దాన్ని నిరోధించే వ్యవస్థ ఎక్కడ? అని ఈసీకి ప్రశ్న ఎదురైంది. అదే సమయంలో.. ఆగస్టు 1వ తేదీన ఈసీ ప్రచురించబోయే బీహార్ ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్‌పై మధ్యంతర స్టే విధించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది గోపాల్ శంకర్నారాయణన్ కోరారు. అయితే.. రేపటి విచారణలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని బెంచ్ స్పష్టం చేసింది. -
తల్లా? పెళ్లామా?
తల్లా? పెళ్లామా? అనే పరిస్థితిలో.. ఎవరి మాటకు విలువ ఇవ్వాలో తెలియక మదనపడే వాళ్లే మన మధ్యే కనిపిస్తుంటారు. అయితే అలాంటి మానసిక సంఘర్షణలో నలిగిపోతున్న ఓ వ్యక్తికి.. భారత సర్వోన్నత న్యాయస్థానం హితబోధ చేసింది.ఆ భార్యభర్తలిద్దరూ.. మనస్పర్థలతో దూరంగా ఉంటున్నారు. భర్త అమెరికాలో ఉండగా.. పెద్ద కూతురు అతని తల్లి(నాన్నమ్మ) దగ్గర, మైనర్ కొడుకు మాత్రం భార్యతో ఉంటున్నాడు. ఈ తరుణంలో కలిసి ఉండడం కుదరని భావించిన ఆ జంట కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం.. జస్టిస్ బీవీ నాగరత్న, కేవీ విశ్వనాథన్ ఈ పిటిషన్‌ను విచారించారు. ఈ క్రమంలో వర్చువల్ విచారణకు హాజరైన ఆ దంపతులు ధర్మాసనం సమక్షంలోనే వాదులాడుకున్నారు.తనపై తన భార్య తప్పుడు క్రిమినల్ కేసు పెట్టిందని ఆ భర్త, తన భర్త తనను పట్టించుకోవడం మానేశాడని ఆ భార్య పరస్పరం ఆరోపించుకున్నారు. ఈ తరుణంలో బెంచ్ జోక్యం చేసుకుంది.మధ్యవర్తిత్వం ద్వారా మాట్లాడుకుని పిల్లల కోసం కలిసి జీవించాలని ధర్మాసనం ఆ జంటకు సూచించింది. అయితే పదే పదే ఆ వ్యక్తి తన తల్లి ప్రస్తావన తీసుకురావడాన్ని గమనించిన జస్టిస్ నాగరత్న.. కుటుంబాల్లో గొడవలు భార్యల మాటల్ని భర్తలు పెడచెవిన పెట్టినప్పుడే మొదలవుతాయని వ్యాఖ్యానించారు.‘‘తమ మాట కంటే తల్లుల మాటకు భర్తలు ఎక్కువ విలువ ఇచ్చినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అలాగని తల్లిని పక్కనపెట్టాలని మేం అనడం లేదు. భార్యలు చెప్పేది కూడా వినాలి. భర్తలు భార్యల భావాల్ని గౌరవించాల్సిందే’’ అని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో భర్త తన కుమారుడిని చూడలేదని చెప్పడంతో, కోర్టు ఆ భార్య తీరును తప్పుబట్టింది. ఒక పిల్లవాడు తన తండ్రి, సోదరిని చూడకుండా ఉండడం సరికాదని అభిప్రాయపడింది. మధ్యవర్తిత్వ సమయంలోనైనా ఆ పిల్లాడి చూపించాలని, పిల్లల శ్రేయస్సు కోసం సమస్యలు పరిష్కరించుకుని కలిసి జీవించాలని మరోసారి ఆ జంటకు సూచిస్తూ కేసు వాయిదా వేసింది.మరో కేసులో.. విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగండని ఓ జంటకు సుప్రీం కోర్టు సూచించింది. భార్య, ఆమె తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని బాలాకోట్ దాడుల్లో పాల్గొన్న యుద్ధ విమాన పైలట్ ఒకరు కోర్టును ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కోరారాయన. అయితే.. జీవితం అంటే ప్రతీకారం తీర్చుకోవడం కాదని, సర్దుకుపోయి ముందుకు సాగాలని ఆ జంటకు ధర్మాసనం సూచించింది. -
జువెనైల్ జస్టిస్ బోర్డుకు వెళ్లండి..!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తాజాగా ఓ అరుదైన కేసును విచారించింది. ఈ కేసులో నిందితుడు 1988లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష సైతం అనుభవించాడు. 2024లో ఇందుకు సంబంధించి దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలిపివేసింది. నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. నేరానికి పాల్పడినట్లు చెబుతున్న సమయంలో తన వయస్సు 16 ఏళ్లేనంటూ రుజువులు చూపాడు. దీంతో, అతడిని తిరిగి జువెనైల్ జస్టిస్ బోర్డుకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించడం గమనార్హం. రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి 1988లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విచారించిన కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అతడు రాజస్తాన్ హైకోర్టులో సవాల్ చేయగా శిక్షను నిలుపుదల చేస్తూ 2024లో ఆదేశాలిచ్చింది. అనంతరం నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఘటన జరిగిన సమయంలో తన వయస్సు 16 ఏళ్లు మాత్రమేనంటూ అతడు స్కూలు రికార్డులను రుజువులుగా చూపాడు. 1972 జూలై ఒకటో తేదీ పుట్టిన తేదీ అయినందున నేరానికి పాల్పడినప్పటికి తనింకా మైనర్‌నే అంటూ వాదించాడు. ఈ నెల 23న కేసు విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ మసీహ్‌ల ధర్మాసనం..వైద్య పరీక్షలు, బాధితురాలు, సాకు‡్ష్యల వాంగ్మూలాలు సరిగ్గానే ఉన్నాయని పేర్కొంది. అయితే, నిందితుడు అందజేసిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అతడు మైనరేనని నిర్థారణయిందని పేర్కొంది. ఇన్నేళ్ల తర్వాత అతడిని మైనర్‌గా పేర్కొనడం సరికాంటూ రాజస్తాన్ ప్రభుత్వ న్యాయవాది వాదించగా చట్ట ప్రకారం సరైందేనని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో తగు ఆదేశాల కోసం అజ్మీర్‌లోని జువెనైల్ జస్టిస్ బోర్డును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. నిబంధనల ప్రకారం జువెనైల్ జస్టిస్ బోర్డు దోషిని గరిష్టంగా మూడేళ్లపాటు ప్రత్యేక షెల్టర్‌కు పంపించే అవకాశముంది.జువెనైల్ జస్టిస్ చట్టం ఏం చెబుతోంది? జువెనైల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్)చట్టం–2015 ప్రకారం నేరం జరిగినప్పటికి ఆ వ్యక్తి వయస్సు 18 ఏళ్లు లోపు ఉండాలి. ఈ కేసుల్లో నిందితులను జువెనైల్ జస్టిస్ బోర్డులే విచారించాలి. సాధారణ కోర్టులు కాదు. వీరికి జీవిత కారాగారం, మరణ శిక్ష వంటివి విధించరాదు. ఈ చట్టంలోని సెక్షన్ 18ని అనుసరించి దోషులుగా తేలిన వారిని కౌన్సెలింగ్ చేయడం లేదా గరిష్టంగా మూడేళ్లపాటు జువెనైల్ హోంలో ఉంచడం వంటి చర్యలు చేపట్టవచ్చు. అయితే, నేరం జరిగిన సమయంలో అమల్లో ఉన్న జువెనైల్ జస్టిస్ చట్టం–1986ను అనుసరించి 16 ఏళ్లలోపు వారిని బాలురనీ, బాలికలైతే 18 ఏళ్లుగా నిర్వచించారు. 2015 చట్టం ప్రకారం సుప్రీంకోర్టు బాలబాలికల వయస్సును సమానంగా 18 ఏళ్లుగా నిర్ణయించింది. నిందితుడి ప్రస్తుత వయస్సు, గడిచిన సమయంతో సంబంధం లేకుండా బాల నేరస్థుల వాదనలు చెల్లుబాటు అవుతాయని తాజా కేసు తెలియజేస్తోంది. తీవ్రమైన నేరాల కేసుల్లో సైతం బాల నేరస్తులను భిన్నంగా చూడాలనే సూత్రానికి ఇది బలం చేకూరుస్తోంది. -
డీలిమిటేషన్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచేలా నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)కు కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ‘ఈ పిటిషన్లో చట్టబద్ధత ఏదీ కనబడలేదు. అందుకే దీన్ని డిస్మిస్ చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. 2014 నాటి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26ను అమలు చేయాలని... దాని ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభించేలా ఆదేశించాలని ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన జమ్మూ–కశ్మీర్లో నియోజకవర్గాల పునర్వీభజన కోసం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. ఇదే విషయంలో ఏపీ, తెలంగాణను మినహాయించడం వివక్షేనని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం జమ్మూ–కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్వీభజన నోటిఫికేషన్ నుంచి ఏపీ, తెలంగాణను మినహాయించడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3)కి లోబడే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ఉందని, దాని ప్రకారం 2026 తర్వాత నిర్వహించే తొలి జనాభా లెక్కల అనంతరమే నియోజకవర్గాల పునర్వీభజన ప్రక్రియను చేపట్టడం సాధ్యమవుతుందని తేల్చిచెప్పింది. అనుమతిస్తే ఇక పిటిషన్ల వరద: సుప్రీం ధర్మాసనం జమ్మూ–కశ్మీర్లో ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై పిటిషనర్ చేసిన వివక్ష వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య నియోజకవర్గాల పునర్విభజనలో వర్తించే నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయని, అందుకే జమ్మూకశ్మీర్‌కు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్రాల పరిస్థితులతో సరిపోల్చడం తగదని వ్యాఖ్యానించింది. ఇలాంటి విజ్ఞప్తులను స్వీకరిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి పిటిషన్లు వరదలా కోర్టులను ముంచెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. అలాంటి పరిణామాలకు తాము తలవంచలేమని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
విద్యార్థుల ఆత్మహత్యలు వ్యవస్థాగత లోపమే: సుప్రీం
న్యూఢిల్లీ: యువత, ముఖ్యంగా విద్యార్థుల బలవన్మరణాలు పెరిగిపోతుండటం ఆందోళనకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘ఇది వ్యవస్థాగత లోపానికి నిదర్శనం. ఈ జాఢ్యాన్ని నిర్లక్ష్యం చేయలేం’’అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. విశాఖపట్నానికి చెందిన ఓ 17 ఏళ్ల నీట్ విద్యార్థి ఆత్మహత్య కేసు విచారణను సీబీఐకి బదలాయించాలన్న పిటిషన్‌ను శుక్రవారం విచారించింది. ఈ అంశంపై 15 మార్గదర్శకాలు జారీ చేసింది. ‘‘విద్యా సంస్థల్లో విద్యార్థి–కౌన్సెలర్ నిష్పత్తిని గరిష్ట సంఖ్యకు పెంచాలి. ముఖ్యంగా పరీక్షలు, కౌన్సెలింగ్ తదితరాల వేళ వీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. సూసైడ్ హెల్ప్‌లైన్ నంబర్లు, టెలీ–మానస్ తదితర జాతీయ సేవల చిరునామా, ఫోన్ నంబర్లను విద్యా సంస్థలు, హాస్టళ్లు, తరగతి గదులతో పాటు వెబ్సైట్లలో కూడా ప్రముఖంగా కనిపించేలా ఉంచాలి. బోధన, బోధనేతర సిబ్బంది అందరూ ఏటా కనీసం రెండుసార్లు తప్పనిసరి మానసిక శిక్షణ తీసుకోవాలి. సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ చేయగలిగి ఉండాలి. విద్యార్థుల్లో ఆత్మహత్యకు సంబంధించిన ధోరణులను తొలి దశలోనే గుర్తించి, సరిగా స్పందించగలిగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మానసిక ఆరోగ్య అక్షరాస్యత, భావోద్వేగాలను నియంత్రించుకోవడం, జీవ కళా విద్య వంటివాటికి తరగతి గదుల్లో చోటివ్వాలి. విద్యాపరమైన ఒత్తిళ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ విద్యా సంస్థలే నివారణ చర్యలు చేపట్టాలి’’అని పేర్కొంది. ‘‘2022లో భారత్‌లో 1.7 లక్షల పైచిలుకు ఆత్మహత్యలు నమోదయ్యాయి. వాటిలో 7 శాతానికి పైగా, అంటే 13,044 విద్యార్థుల ఆత్మహత్యలే. వీటిలోనూ 2,248 ఆత్మహత్యలు నేరుగా పరీక్షల ఫలితాలతో సంబంధమున్నవే కావడం మరింత బాధాకరం’’అంటూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను ఉటంకిస్తూ ధర్మాసనం పేర్కొంది. ‘‘స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు, కాలేజీలు, శిక్షణ కేంద్రాల వంటివాటిలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇది ఒక రకంగా మానసిక ఆరోగ్య సంక్షోభం. ఇదే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మానసిక ఆరోగ్యం రాజ్యాంగం కల్పించే జీవించే హక్కులో భాగం’’అని గుర్తు చేసింది. దీనిపై 90 రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. -
అరకోటి మంది ఓటర్లెక్కడ?
బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా నవీకరణ సుప్రీంకోర్టులో విచారణ దశలోనే వున్నా, పార్లమెంటులో అలజడి రేగుతున్నాఆ ప్రక్రియ తన దోవన తాను ముందుకెళ్తున్నది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ గురువారం ఆ వ్యవహారం గురించి వెల్లడించిన వివరాల ప్రకారం, లక్షమందికి పైగా ఓటర్ల ఆచూకీ లేదు. 21.6 లక్షల మంది మరణించారు. మరో 31.5 లక్షల మంది శాశ్వతంగా వేరే చోటుకు వలసపోయారు. పోలింగ్ కేంద్రం స్థాయి అధికారులు (బీఎల్ఓలు) అడుగుతున్నా, మరో ఏడు లక్షల మంది ఇంతవరకూ తమ పత్రాలు దాఖలు చేయలేదు. తాము ఫలానా చోట ఉంటు న్నామని రుజువులు చూపక పోయినా, బతికే ఉన్నామని చెప్పకపోయినా లేదా తగిన పత్రాలుఅందజేయక పోయినా ఈ 61 లక్షల మంది ఓటర్లు జాబితా నుంచి శాశ్వతంగా కనుమరుగవుతారు. రాష్ట్ర ఓటర్లలో వీరు 7.7 శాతం. శుక్రవారం సాయంత్రంతో వీరందరికీ గడువు ముగిసిపోయింది. సవరించిన ఓటర్ల జాబితా ఆగస్టు 1న విడుదలవుతుంది. అయితే సెప్టెంబర్ 1లోగా ఎవరైనా జాబితాలో తమ పేరు లేదని ఫిర్యాదు చేస్తే పరిశీలించి, తగిన పత్రాలున్న పక్షంలో వారిని చేర్చి తుది జాబితా విడుదల చేస్తారు. నకిలీ లేదా విదేశీయులుగా గుర్తించిన వారిని తొలగించటం కోసం ప్రారంభించిన ఈ ప్రక్రియ దేశ చరిత్రలోనే మొట్టమొదటిది. ‘పరిశుద్ధమైన’ ఓటర్ల జాబితా రూప కల్పనే తమ లక్ష్యమని జ్ఞానేశ్ చెబుతున్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని స్వాగతించాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా నడవాలంటే మెజారిటీ ఆమోదం పొందిన ప్రభుత్వాలు ఏర్పడాలి.ప్రజల ఆదరణ ఉన్నవారే పాలకులు కావాలి. నకిలీ ఓటర్లు లేదా ఈ దేశ పౌరులు కానివారు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే స్థితి ఉంటే ఆ ఎన్నికలే ప్రహసన ప్రాయమవుతాయి. ఎన్నికలు సజావుగా పూర్తవుతున్నాయన్న భావన వల్లే ఫలితాలు వెలువడ్డాక అధికార మార్పిడి శాంతియుతంగా పూర్తవుతోంది. గత దశాబ్దాలతో పోలిస్తే ఎన్నికల హింస గణనీయంగా తగ్గింది. ఇలాంటి కారణాల వల్లే విదేశాల ఎన్నికలకు మన ఈసీ అధికారులు పరిశీలకులుగా వెళ్తున్నారు. వారు సూచిస్తున్న మార్పులకు ఎంతో విలువ ఉంటున్నది. కానీ గత ఏడాది, రెండేళ్లుగా ఈసీ వ్యవహార శైలిపై విమర్శలూ, ఆరోపణలూ వెల్లువెత్తు తున్నాయి. వాటిపై అసలే స్పందించకపోవటం లేదా మరిన్ని సందేహాలు కలిగే రీతిలో జవాబీ యటం రాజకీయ పక్షాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. బిహార్ ఎన్నికల జాబితా సంగతే తీసుకుంటే సుప్రీంకోర్టు సూచించిన ఆధార్, రేషన్ కార్డు వగైరాలు పరిశీలనకు పనికి రావని అది ఎందుకు తిరస్కరించిందో అంతుపట్టదు. ఆధార్‌ను ప్రారంభించినప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ కార్డే ఇకపై సర్వస్వమని, దాని ఆధారంగానే పథకాల వర్తింపు అయినా, పౌరుల గుర్తింపయినాఉంటుందన్నారు. కానీ జరుగుతున్నది అందుకు విరుద్ధం. మరి విశ్వసనీయత లేని ఆధార్‌ను అన్నిటికీ అనుసంధానం చేయటం ఎందుకు? ఇప్పటికీ ఆ కార్డు సంపాదించటానికి సాధారణ పౌరులు తలకిందులవుతున్నారు. పుట్టిన చోటే నవజాత శిశువులకు ఆధార్ అందేలా తాజాగా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అటువంటి కార్డు ఓటరు గుర్తింపునకు పనికిరాదని ఈసీ ఎలా చెబుతుందో అర్థంకాని విషయం. పౌరుల్ని గుర్తించటమనే ప్రక్రియ అన్యులకు ఆసాధ్యమని, కేవలం తామే సమర్థులమని ఆ సంస్థ చెప్పదల్చుకుంటే దాన్నెవరూ అంగీకరించరు.ఎన్నికల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తటంపై ఆంధ్రప్రదేశ్ మొదలుకొని మహారాష్ట్ర, హరియాణాల వరకూ ఎన్ని ఉదాహరణలైనా చూపొచ్చు. ఏపీ సంగతే తీసుకుంటే... అక్కడ ఓటింగ్‌కు గడువు ముగిసి కేవలం ప్రాంగణంలో ఉన్న వారితో పోలింగ్ పూర్తి చేయటానికి అర్ధరాత్రి వరకూ సమయం పట్టింది. అలా వేచివున్నవారి సంఖ్య ఏకంగా 51 లక్షలు! ఇది నమ్మేలా ఉందా? ఇక పోలింగ్ శాతంపై మొదటి, చివరి ఈసీ ప్రకటనల్లోని అంకెల మధ్య 12.5 శాతం తేడావచ్చింది. ఇది గతంలో ఎప్పుడూ ఒక శాతం మించిలేదు. ఇందువల్ల సగటున ఒక్కో అసెంబ్లీ స్థానంలో అదనంగా 28,000 ఓట్లు, లోక్‌సభ స్థానంలో 1.96 లక్షల ఓట్లు అమాంతం పెరిగి పోయాయి. తటస్థ సంస్థల లెక్కల ప్రకారం ఇది 87 అసెంబ్లీ స్థానాల గెలుపోటముల్ని తారుమారు చేసింది! వేరే రాష్ట్రాల్లోనూ ఇలాంటి ధోరణే కనబడిందని అక్కడి విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ సందేహాలకు సక్రమమైన జవాబు చెబితే బిహార్‌లో చేపట్టిన ‘సర్’పై పెద్దగా అభ్యంతరాలు వచ్చేవి కాదేమో! కానీ ఆ సంస్థ తనకు తోచినప్పుడు మాట్లాడటం తప్ప జవాబుదారీతనాన్నీ, బాధ్యతాయుత వర్తననూ కనబరచటం లేదు. సందేహాలు పటాపంచలు చేద్దామన్న పట్టుదలను ప్రదర్శించటం లేదు. ఈసీ న్యాయబద్ధంగానే వ్యవహరిస్తున్నాననుకోవచ్చు. కానీ అలా అందరూ అనుకునేలా తన వ్యవహార శైలి వుండాలి. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థకైనా ఇది తప్పనిసరి.అందునా ప్రభుత్వాల తలరాతలను మార్చే కీలకమైన వ్యవస్థగా ఉన్న ఈసీకి ఇది మరింత ప్రాణప్రదం. దేశంలో ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుంచి వలసలు ఎక్కువుంటాయి. అలాంటిచోటఇంత తక్కువ వ్యవధిలో ఎక్కడెక్కడినుంచో పనులు మానుకుని వచ్చి ఓటర్లుగా నమోదు చేసు కోవటానికి అవసరమైన పత్రాలు సేకరించి సమర్పించటం బడుగు జీవులకు సాధ్యమేనా? అందుకే సర్వోన్నత న్యాయస్థానం సూచించిన ఇతర ప్రత్యామ్నాయాల గురించి కూడా ఈసీ పరిశీలించాలి. ఈ మాదిరి సవరణకు దేశవ్యాప్త ఆదరణ లభించాలంటే ఇది తప్పనిసరి. -
ఏపీ, తెలంగాణలో డీలిమిటేషన్ ఇప్పట్లో కుదరదు: సుప్రీంకోర్టు
సాక్షి, ఢిల్లీ: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రాజ్యాంగం పరిధికి లోబడే ఏపీ విభజన చట్టం సెక్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం తీర్పును వెలువరించింది.ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో డీలిమిటేషన్ చేయాలని సుప్రీంకోర్టులో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్.. జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి లోబడి మాత్రమే ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్-26ను ప్రత్యేకంగా వేరుగా చూడలేం. ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత అందుబాటులోకి వచ్చే జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ ఉంటుంది. రాజ్యాంగం పరిధికి లోబడే ఏపీ విభజన చట్టం సెక్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. రాజ్యాంగం పరిధిలోనే డీలిమిటేషన్ జరగాలి. లేకుంటే ఇలాంటి డిమాండ్లకు వరద గేట్లు ఎత్తినట్లే అవుతుంది. జమ్ముకశ్మీర్‌తో పాటు ఏపీ, తెలంగాణ డీలిమిటేషన్‌ను కలిపి చూడలేం అని స్పష్టం చేసింది. -
నటుడు దర్శన్.. మళ్లీ జైలుకేనా?
కన్నడ అగ్రనటుడు దర్శన్ తూగుదీప బెయిల్ వ్యవహారంపై సుప్రీం కోర్టు మళ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో న్యాయాధికారం దుర్వినియోగమైందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది. దర్శన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నాలుగు నెలలపాటు జైలులో గడిపాడు నటుడు దర్శన్. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌తో ఉపశమనం పొందిన సంగతి తెలిసిందే. అయితే.. దర్శన్‌తో సహా మరో ఏడుగురి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ పార్థీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు వింది. ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి CCTV ఫుటేజ్, ఫోటోలు, రేణుకాస్వామిపై జరిగిన హింసకు సంబంధించిన ఆధారాలు చూపిస్తూ, బెయిల్ రద్దు అవసరం ఉందని లూథ్రా వాదించారు. ఇది అత్యంత క్రూరమైన హత్యగా పేర్కొంటూ, రేణుకాస్వామి శరీరంపై గాయాలు, అంగవైకల్యం, రక్తస్రావం వంటి అంశాలను వివరించారు. ఇక దర్శన్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. అయితే.. జులై 17నాటి విచారణ సందర్భంగా జస్టిస్ పార్థీవాలా దర్శన్ తరఫు లాయర్ కపిల్ సిబాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘హైకోర్టు తీర్పు చదివితే, వాళ్లు నిందితులను ఎలా విడుదల చేయాలో చూస్తున్నట్టు ఉంది. ఈ కేసులో సుప్రీం కోర్టు ఎందుకు జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నారో వివరించాంలి’’ అని సిబాల్‌ను కోరారు. దానికి కపిల్ సిబాల్ స్పందిస్తూ.. హైకోర్టు తీర్పును పక్కన పెట్టి, సాక్షుల స్టేట్మెంట్లను పరిశీలించాలంటూ కోరారు. ఈ తరుణంలో ఇవాళ్టి విచారణ సందర్భంగానూ సుప్రీం కోర్టు దర్శన్ బెయిల్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది న్యాయ అధికార వికృత వినియోగం అని వ్యాఖ్యానించింది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించిన తెలిపిన బెంచ్.. పదిరోజుల్లో తీర్పు ఏంటన్నది వెల్లడిస్తామంది.కేసు ఏంటంటే..రేణుకాస్వామి అనే అభిమాని, దర్శన్ ప్రేయసి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. 2024 జూన్‌లో దర్శన్, అతని సహచరులు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని షెడ్లో మూడు రోజుల పాటు హింసించారు. అనంతరం అతని శవాన్ని డ్రెయిన్‌లో పడేశారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్ అయ్యారు. ఆపై వాళ్లు బెయిల్ మీద బయటకు వచ్చారు. 2024 డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఏడుగురి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అయితే విచారణలో దర్శన్‌కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. ఒకవేళ సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు అయితే, దర్శన్ మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కేసు టైంలైన్2024 జూన్: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. 2024 సెప్టెంబర్ 21: అనారోగ్య కారణంగా బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.2024 అక్టోబర్ 31: కర్ణాటక హైకోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.2024 డిసెంబర్ 13: హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. -
ముంబై పేలుళ్ల కేసులో.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ: ముంబై రైళ్లలో పేలుళ్ల కేసులో ఇటీవలే బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును గురువారం అత్యున్నత న్యాయస్థానం నిలిపేసింది. ప్రభుత్వ పిటిషన్‌పై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్.వి.అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నిర్దోషులుగా విడుదలైన 12 మందిని తిరిగి అరెస్ట్ చేయాలని చెప్పలేమంది. ‘ఈ కేసులో ప్రతివాదులందరినీ విడుదల చేశారు. మళ్లీ వారిని జైలుకు తీసుకొచ్చే ప్రశ్నే లేదు. అయితే, ఈ అభ్యంతరకరమైన తీర్పును మరే ఇతర కేసులలోనూ ఉదాహరణగా పరిగణించరాదు. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద ఉన్న ఇతర కేసులను హైకోర్టు తీర్పు ప్రభావితం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొనడంతో సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 189 మంది ప్రాణాలు తీసిన 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో 12 మంది దోషులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారించింది.ముంబై పేలుళ్ల కేసు.. టైం లైన్2006 జూలై 11న ముంబై వెస్ట్రన్ రైల్వే లైన్లో 7 రైళ్లలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో 189 మంది మరణించగా, 827 మంది గాయపడ్డారు.2015లో ప్రత్యేక కోర్టు 5 మందికి మరణశిక్ష, 7 మందికి జీవిత ఖైదు విధించింది.జూలై 21, 2025.. హైకోర్టు విచారణలో ఆరోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైంది అని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చంద్రక్ పేర్కొన్నారు.కన్ఫెషన్ స్టేట్మెంట్లు, సాక్షుల వాంగ్మూలాలు, గుర్తింపు పరేడ్ వంటి ఆధారాలు నమ్మదగినవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది.తీర్పు ప్రకారం, వారు ఇతర కేసుల్లో అవసరం లేకపోతే వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.జులై 24.. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే -
అరెస్ట్.. రిమాండ్.. ఇష్టా‘రాజ్యం’కాదు
అరెస్టు అనేది ఒక వ్యక్తికి అవమానం కలిగించేది. స్వేచ్ఛను హరించేది. జీవితాంతం అరెస్ట్‌కు సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇది జీవితాంతం ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఇది చట్టసంస్కర్తలకూ, పోలీసులకూ తెలుసు. చట్టసంస్కర్తలకు – పోలీసులకు మధ్య ఈ విషయమై ఓ పోరాటం నడుస్తోంది.కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ తన పాఠాన్ని నేర్చుకోలేదు. ఆ పాఠం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లో స్పష్టంగా ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ, పోలీసులు ఇంకా తమ వలస పాలన తరహా మానసిక స్థితి నుంచి బయటపడలేదు. పోలీస్ వ్యవస్థను ఇంకా ప్రజలకు మిత్రుడిగా కాకుండా వేధింపులకు, అణచివేతకు హేతువుగా భావిస్తున్నారు. అరెస్టు అనే తీవ్రమైన అధికారాన్ని వినియోగించడంలో జాగ్రత్త అవసరమని కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా, అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.అరెస్టు చేసే అధికారం పోలీసుల వ్యవస్థకు ఒక లెక్కలేని తనాన్ని కలిగిస్తోంది. అదే విధంగా మేజిస్ట్రేట్ వ్యవస్థ విఫలమవడం కూడా దీనికి సహకరిస్తోంది. అరెస్టు అధికారం పోలీస్ అవినీతికి ఒక లాభదాయకమైన వనరుగా మారింది. ముందు అరెస్టు చేసి, తర్వాత విచారణ జరపాలనే దురదృష్టకర ధోరణి పెరిగిపోతోంది. మానవత్వాన్ని అర్థం చేసుకోలేని పోలీస్ అధికారులకు, ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారం పనిచేసే వారికి ఒక ఆచరణ సాధనంగా అరెస్టుల ప్రక్రియ మారిపోయింది.లా కమిషన్లు, పోలీసు కమిషన్లు, ఈ కోర్టు ఎన్నో తీర్పుల్లో అరెస్టు అధికారాన్ని వినియోగించేటప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ– సమాజ శాంతి మధ్య సమతౌల్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని పదే పదే గుర్తుచేశాయి. పోలీసు అధికారులు తాము అరెస్టు చేసే అధికారాన్ని కలిగి ఉన్నామని భావిస్తూ అరెస్టు చేస్తుంటారు. అరెస్టు వ్యక్తి స్వేచ్ఛను హరిస్తుంది. అవమానాన్ని కలిగిస్తుంది. కనుక మేము దీనిని భిన్నంగా భావిస్తాం. కేవలం ఒక నాన్–బెయిలబుల్ అలాగే గుర్తింపు ఇవ్వదగిన నేరం (నాన్–బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్– తీవ్రమైన) జరిగిందని పోలీసులు నమ్మడమే ఆధారంగా అరెస్టు చేయకూడదు. అరెస్టు చేయగల అధికారాన్ని కలిగి ఉండటం ఒక విషయం. అయితే, ఆ అధికారాన్ని వినియోగించడానికి న్యాయసమ్మతమైన కారణం కలిగి ఉండటం ఇంకొక విషయం.పోలీస్ అధికారుల వద్ద అరెస్టు చేసే అధికారంతో పాటు, ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో తెలుపగల న్యాయసమ్మతమైన కారణాలు ఉండాలి. కేవలం ఎవరో ఒకరు చేసిన ఆరోపణల ఆధారంగా ఒక వ్యక్తిని యాదృచ్ఛికంగా అరెస్టు చేయడం అనేది చెల్లదు. ఆరోపణల ప్రామాణికతపై కొంత విచారణ చేసిన తర్వాత పోలీసు అధికారికి న్యాయమైన సంతృప్తి వచ్చినపుడే అరెస్టు చేయడం సమంజసం, ఇది ఒక సరైన, సముచిత నిర్ణయం అవుతుంది. ఇలాంటి స్పష్టమైన న్యాయపరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అరెస్టుల విషయంలో పరిపక్వత కనబడడంలేదు. అరెస్టుల సంఖ్య తక్కువ కావడంలేదు.చివరకు పార్లమెంట్ రంగంలోకి దిగి, లా కమిషన్ 2001లో సమర్పించిన 177వ నివేదిక సిఫార్సులకు అనుగుణంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని సెక్షన్ 41ను ప్రస్తుత రూపంలో అమలు చేసింది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే లా కమిషన్ ఇదే సిఫార్సును 1994లో ఇచ్చిన 152,154వ నివేదికలలోనూ చేసింది. అరెస్టు చేసే విషయంలో చట్టంలో చేసిన సవరణలను పూర్తి పారదర్శకత (ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ) ఆధారంగా రూపొందించడం జరిగింది. అంటే చిన్న నేరం చేశారన్న కారణంతోనే ఒకరిని వెంటనే అరెస్టు చేయకూడదు. నేరం తీవ్రత, వ్యక్తి నుంచి వచ్చే ముప్పు, విచారణకు సహకరిస్తాడా లేదా వంటి అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుని అరెస్టు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి.వారెంటు లేకుండా పోలీసులు అరెస్టు చేసిన నిందితుడిని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) అలాగే సీఆర్పీసీ సెక్షన్ 57 ప్రకారం అవసరమైన ప్రయాణ సమయాన్ని మినహాయించి, ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటల లోపల మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలి. ఇది నిందితుని హక్కు. ఒక కేసు దర్యాప్తు సమయంలో 24 గంటల కంటే ఎక్కువగా నిందితుడిని పోలీసు కస్టడీలో ఉంచాలంటే, అది సీఆర్పీసీ సెక్షన్ 167 ప్రకారం మేజిస్ట్రేట్ అనుమతితో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ కస్టడీ అనుమతిని మంజూరు చేయడం అనేది చాలా బాధ్యతగల, సున్నితమైన న్యాయపరమైన కార్యం. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభావితం చేస్తుంది కాబట్టి దీన్ని అత్యంత జాగ్రత్తతో ఉపయోగించాలి. అయితే అనుభవంలో చూస్తుంటే, పలుమార్లు మేజిస్ట్రేట్లు ఈ అనుమతిని నిర్లక్ష్యంగా, మామూలుగా, అషామాషీగా మంజూరు చేస్తున్నారు.మేజిస్ట్రేట్ సీఆర్పీసీ సెక్షన్ 167 ప్రకారం నిందితుడిని రిమాండు చేయాలంటే ముందుగా ఆ అరెస్ట్ చట్టబద్ధమైనదా? రాజ్యాంగ హక్కులను పాటించడం జరిగిందా? అనే విషయాలపై సంతృప్తి చెందాలి. పోలీసు అధికారి చేసిన అరెస్ట్ సీఆర్పీసీ సెక్షన్ 41 లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా లేకపోతే, మేజిస్ట్రేట్ అతనికి రిమాండు విధించకుండా విడుదల చేయాలి. అంటే, ఒక నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచినప్పుడు, పోలీసు అధికారి అరెస్ట్ చేసిన కారణాలు, ఆధారాలు అలాగే తాను ఆ మేరకు తీసుకున్న నిర్ణయాలను మేజిస్ట్రేట్‌కు వివరించాలి. మేజిస్ట్రేట్ ఆ వివరాలన్నింటినీ పరిశీలించి, న్యాయపరమైన సంతృప్తి పొందిన తరువాత మాత్రమే రిమాండ్ అనుమతించాలి. మేజిస్ట్రేట్ తన ‘సంతృప్తి’ని తన ఆదేశంలో స్పష్టంగా (చిన్నగా అయినా సరే) నమోదు చేయాలి. ఇది కేవలం పోలీస్ అధికారి చెప్పిన మాటల ఆధారంగా కాకూడదు.ఉదాహరణకు, ఒక నిందితుడిని మరో నేరాన్ని చేయకుండా అడ్డుకోవడానికి, సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా నిలువరించడానికి లేదా ఇతరులను బెదిరించకుండా నివారించడానికి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని పోలీస్ భావిస్తే, అలాంటి నిర్దిష్ట కారణాలు, ఆ ఆధారాలను మేజిస్ట్రేట్ ముందు సమర్పించాలి. మేజిస్ట్రేట్ వాటిని పరిశీలించి, తాను ఆయా అంశాల పట్ల సంతృప్తి పొందుతున్నట్లు లిఖితపూర్వకంగా నమోదు చేసిన తరువాత మాత్రమే రిమాండ్ విధించాలి.దోషిగా ఆరోపణలు ఉన్న వ్యక్తి శిక్షార్హత గల నేరాన్ని (శిక్ష ఏడేళ్ల కన్నా తక్కువ లేదా ఏడేళ్ల వరకు ఉండవచ్చు జరిమానాతో కలిపి లేదా కాకుండా) చేసాడని పోలీసు అధికారికి అనిపించినంత మాత్రాన, అదే ఏకైక కారణంగా అతడిని అరెస్టు చేయ కూడదు. అలాంటి సందర్భాల్లో, పోలీసు అధికారి అరెస్టు అవసరమనే విషయంలో మరింత సంతృప్తి పొందాలి. అంటే..ఆ వ్యక్తి మరిన్ని నేరాలు చేయకుండా నివారించడానికి,కేసు సమగ్రంగా దర్యాప్తు చేయడానికి,నేరానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా అడ్డుకోవడానికి,సాక్ష్యులను మోసం చేయకుండా నిరోధించడానికినిజాలు చెప్పదలచిన సాక్షులను భయపెట్టి, ప్రలోభ పెట్టి లేదా బెదిరించి నిజాలు బయటపెట్టకుండా చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి,లేదా అతన్ని అరెస్టు చేయకపోతే కోర్టులో అవసరమైనప్పుడు అతని హాజరు విషయంలో విఫలమవుతామని భావించినప్పుడు.. మాత్రమే.. అరెస్టు చేయవచ్చు. అయితే పోలీసు అధికారి ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయం వెనుక ఉన్న కారణాలను రాతపూర్వకంగా నమోదు చేయాలి. అంతే కాదు, అరెస్టు చేయకపోతే కూడా, ఎందుకు అరెస్టు చేయలేదన్న కారణాలను కూడా లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సిన బాధ్యత ఉంది. మరింత వివరంగా చెప్పాలంటే, పోలీసు అధికారి తనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి:ఎందుకు అరెస్టు? నిజంగా అరెస్టు అవసరమా? అది ఎలాంటి ప్రయోజనం ఇస్తుంది? ఏ లక్ష్యాన్ని సాధిస్తుంది?ఈ ప్రశ్నలకు సమాధానాలు తీసుకుని, పైన పేర్కొన్న నిబంధనల్లో కనీసం ఒక నిబంధన విషయంలో సంతృప్తి పొందినప్పుడే అరెస్టు అధికారం వినియోగించాలి. ఇందుకు సంబంధించిన సమాచారం, సాక్ష్యాలకు ప్రామాణికత ఉండాలి. పోలీసులు ఎవ్వరినైనా అరెస్ట్ చేయాలంటే, కేవలం ఆ వ్యక్తి నేరం చేశారని అనిపిస్తే చాలదు. సీఆర్పీసీ 41 (ఏ)లో సబ్–క్లాజ్ (ఏ) నుండి (ఈ) వరకూ పేర్కొన్న పరిస్థితులు (అంశాల్లో) ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అంశాల్లో సంతృప్తి పొందుతున్నామా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకుని, అరెస్ట్ అవసరం అని తార్కికంగా తేల్చుకున్నప్పుడే అరెస్ట్ జరగాలి.ఇంకొక ముఖ్యమైన నిబంధనగా భావించదగిన సీఆర్పీసీ సెక్షన్ 41ఏ.. అనవసరమైన అరెస్టులను నివారించేందుకు, అరెస్ట్‌కు గురవుతాయన్న భయాన్ని తగ్గించేందుకు ఉద్దేశించినది. ఈ నిబంధనను చైతన్యవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ చట్టం, 2008 (యాక్ట్ 5 ఆఫ్ 2009) ద్వారా సెక్షన్ 6 కింద అనుసంధానమైన ఈ కీలక సెక్షన్ 41ఏ ఏమి చెబుతోందో ఈ సందర్భంగా చర్చించుకోవడం సందర్భోచితం.41ఏ. పోలీసు అధికారి ముందు హాజరు కావాలనే నోటీసు :–(1) సెక్షన్ 41(1) ప్రకారం ఒక సమంజసమైన ఫిర్యాదు లేదా విశ్వసనీయ సమాచారం అందిన మీదట, ఆ వ్యక్తి కాగ్నిజబుల్ అఫెన్స్ (గుర్తింపదగిన తీవ్ర నేరం) చేశాడనే సమంజసమైన అనుమానం ఉండి, సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేని ప్రతి సందర్భంలో పోలీసు అధికారి ఆ వ్యక్తిని తాను పేర్కొన్న స్థలానికి హాజరు కావాలంటూ నోటీసు జారీ చేయాలి. ఈ నోటీసులో హాజరు కావాల్సిన తేదీ, సమయం, స్థలాన్ని స్పష్టంగా పేర్కొనాలి. ఈ విధంగా, పోలీసు అధికారికి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో నేరుగా అరెస్ట్ చేయకుండా, ముందుగా వ్యక్తికి హాజరు కావాలనే నోటీసు జారీ చేయడం తప్పనిసరి.(2) అలాంటి నోటీసు ఎవరైనా వ్యక్తికి జారీ అయినప్పుడు, ఆ వ్యక్తి ఆ నోటీసులో పేర్కొన్న నిబంధనలకు లోబడిన విధంగా సహకరించాలి. దీనిని ఒక బాధ్యతగా పరిగణించాలి.(3) అట్టి వ్యక్తి నోటీసులో అంశాలను తూ.చా. తప్పకుండా పాటిస్తూ, ఇదే విధానాన్ని కొనసాగిస్తే, ఆ నోటీసులో పేర్కొన్న నేరానికి సంబంధించి అతడిని అరెస్టు చేయరాదు. అయితే, ఆ వ్యక్తిని అరెస్టు చేయవలసిన అవసరం ఉందన్న అభిప్రాయం పోలీసు అధికారి కలిగి ఉంటే, దానికి సంబంధించిన కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ లిఖితపూర్వక కారణాల ప్రాతిపదికనే అతడిని అరెస్టు చేయవచ్చు.(4) ఒక వ్యక్తి నోటీసులో పేర్కొన్న నిబంధనలను ఎప్పుడైనా పాటించకపోతే లేదా అతను తనకు తాను పోలీసుల ముందు హాజరుకావడానికి ఇష్టపడకపోతే, అటువంటి సందర్భాల్లో, సంబంధిత నోటీసులో పేర్కొన్న నేరానికి సంబంధించి, ఒక అర్హత కలిగిన న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులకు లోబడే, పోలీసులు అతడిని అరెస్టు చేయవచ్చు. పై విధానాన్ని బట్టి, సీఆర్పీసీ సెక్షన్ 41(1) ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అవసరం లేని అన్ని సందర్భాల్లో, పోలీసు అధికారి తప్పనిసరిగా నిందితుడికి ఒక నోటీసు జారీ చేయాలి. అందులో పోలీసు అధికారిని ఎక్కడ, ఎప్పుడు కలవాలో స్పష్టంగా పేర్కొనాలి. చట్టం ప్రకారం, నిందితుడు ఆ నోటీసు నిబంధనలను పాటించి పోలీసు అధికారిని కలవాలి. ఇకపోతే, నిందితుడు ఆ నోటీసు నిబంధనలను పాటిస్తే, సాధారణంగా అతన్ని అరెస్ట్ చేయకూడదు. అయితే, అరెస్టు అవసరమని పోలీసులు భావిస్తే, దానికి కారణాలు రాసి ఉంచాలి. ఈ దశలో కూడా, అరెస్టు చేయడానికి ముందు, సీఆర్పీసీ సెక్షన్ 41 లో పేర్కొన్న షరతులను పాటించాలి. న్యాయమూర్తి సమీక్షకు అది తప్పనిసరిగా లోబడి ఉండాలి.మా అభిప్రాయం ప్రకారం, మేజిస్ట్రేట్ ఉత్తర్వులు లేకుండా అలాగే వారెంట్ లేకుండా నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసు అధికారికి అధికారం కల్పించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 41 లోని నిబంధనలు నిజాయితీగా అమలయితే, పోలీసులు ఉద్దేశపూర్వకంగా లేదా తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వచ్చే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. మేము ప్రత్యేకంగా చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే, సీఆర్పీసీ సెక్షన్ 41లో పేర్కొన్న కారణాలను కేసు డైరీలో యాంత్రికంగా పునరావృతం చేయడం అనే ఆచారాన్ని నిరుత్సాహ పర్చాలి. విడనాడాలి.ఈ తీర్పులో మా ప్రయత్నం ఏమిటంటే, పోలీసులు అనవసరంగా నిందితులను అరెస్ట్ చేయకుండా, మేజిస్ట్రేట్లు కూడా అనాలోచితంగా లేదా యాంత్రికంగా శిక్షించకుండా (రిమాండ్లు విధించకుండా) ఉండాలనే లక్ష్యంతోనే మేము ఈ వ్యాఖ్యలు చేస్తూ, ఆయా అంశాల అమలుకు మేము కింద సూచనలు ఇస్తున్నాము. ప్రతి పోలీస్ అధికారికి, సెక్షన్ 41(1)(బీ)(ఐఐ) కింద పేర్కొన్న నిర్దిష్ట ఉపఖండాలతో కూడిన తనిఖీ జాబితా (చెక్‌లిస్ట్) అందించాలి. ఈ చర్య, అరెస్టు చేసే సమయంలో అవసరమైన ప్రమాణాలను పోలీసులు గుర్తించేందుకు దోహదపడుతుంది. పోలీసు అధికారి నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నప్పుడు లేదా రిమాండ్‌ను కోరుతున్నప్పుడు అరెస్ట్ అవసరం అయిన కారణాలు అలాగే ఆధారాలను స్పష్టంగా వివరించాలి. అంతేకాకుండా, తనిఖీ జాబితాను సమర్పించి, దాన్ని సరిగ్గా నింపినట్టు చూపించాలి.నిందితుడిని రిమాండ్‌కు పంపేందుకు అనుమతి ఇచ్చే ముందు ‘పై విధంగా’ పోలీసు అధికారి సమర్పించిన నివేదికను మేజిస్ట్రేట్ పరిశీలించాలి. ఆ నివేదిక ఆధారంగా తగిన సంతృప్తిని వ్యక్తపరచి, లిఖితపూర్వకంగా నమోదుచేసిన తరువాత మాత్రమే, నిందితునికి రిమాండ్ విధించాలి. నిందితుడిని అరెస్ట్ చేయకూడదని తీసుకున్న నిర్ణయం, కేసు దాఖలైన తేదీ నుంచి రెండు వారాల్లోగా మేజిస్ట్రేట్‌కు పంపించాలి. అలాగే, ఒక నకలును మేజిస్ట్రేట్‌కి అందించాలి. అవసరమైతే, జిల్లాకు చెందిన పోలీసు సూపరింటెండెంట్ లిఖిత రూపంలో కారణాలు నమోదు చేసి, ఆ గడువును పొడిగించవచ్చు.కేసు దాఖలు చేసిన తేదీ నుంచి రెండు వారాల వ్యవధిలోగా నిందితుడికి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం హాజరుకై నోటీసు జారీ చేయాలి. ఈ గడువును, అవసరమైతే, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) లిఖితపూర్వకంగా కారణాలు నమోదు చేసి పొడిగించవచ్చు.పై సూచనలను పాటించడంలో వైఫల్యం ఉన్నట్లయితే, సంబంధిత పోలీసు అధికారులు శాఖాపరమైన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీనితోపాటు సంబంధిత న్యాయ పరిధి (జ్యూరిస్డిక్షన్) కలిగిన హైకోర్టులో దాఖలయ్యే కోర్టు ధిక్కరణ కేసులో శిక్షకు గురయ్యే అవకాశమూ ఉంటుంది.సంబంధిత కారణాలను రికార్డు చేయకుండా నిందితునికి రిమాండ్ విధిస్తే, సంబంధిత రాష్ట్ర హైకోర్టు ద్వారా సంబంధిత జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కూడా శాఖాపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ తీర్పు ప్రతిని రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, పోలీస్ డైరెక్టర్ జనరల్స్‌కు, అలాగే అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్‌కు పంపించాలని మేము ఆదేశిస్తున్నాము. తద్వారా వారు దీన్ని ఇతరులకు పంపించి, అమలులోకి తీసుకురాగలుగుతారు.1. అరెస్టు అనేది ఒక వ్యక్తికి అవమానం కలిగించేది. స్వేచ్ఛను హరించేది. జీవితాంతం అరెస్ట్‌కు సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇది జీవితాంతం ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఇది చట్టసంస్కర్తలకూ, పోలీసులకూ తెలుసు. చట్టసంస్కర్తలకు– పోలీసులకు మధ్య ఈ విషయమై ఓ పోరాటం నడుస్తోంది. కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ తన పాఠాన్ని నేర్చుకోలేదు. ఆ పాఠం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లో స్పష్టంగా ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ, పోలీసులు ఇంకా తమ వలస పాలన తరహా మానసిక స్థితి నుంచి బయటపడలేదు.2. అరెస్టు చేసే అధికారం పోలీసుల వ్యవస్థకు ఒక లెక్కలేని తనాన్ని కలిగిస్తోంది. అదే విధంగా మేజిస్ట్రేట్ వ్యవస్థ విఫలమవడం కూడా దీనికి సహకరిస్తోంది. అరెస్టు అధికారం పోలీస్ అవినీతికి ఒక లాభ దాయకమైన వనరుగా మారింది. ముందు అరెస్టు చేసి, తర్వాత విచారణ జరపాలనే దురదృష్టకర ధోరణి పెరిగిపోతోంది. మానవత్వాన్ని అర్థం చేసుకోలేని పోలీస్ అధికారులకు, ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారం పనిచేసే వారికి ఒక ఆచరణ సాధనంగా అరెస్టుల ప్రక్రియ మారిపోయింది.3. పోలీస్ అధికారుల వద్ద అరెస్టు చేసే అధికారంతో పాటు, ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో తెలుపగల న్యాయసమ్మతమైన కారణాలు ఉండాలి. కేవలం ఎవరో ఒకరు చేసిన ఆరోపణల ఆధారంగా ఒక వ్యక్తిని యాదృచ్ఛికంగా అరెస్టు చేయడం అనేది చెల్లదు.4. దోషిగా ఆరోపణలు ఉన్న వ్యక్తి శిక్షార్హత గల నేరాన్ని (శిక్ష ఏడేళ్ల కన్నా తక్కువ లేదా ఏడేళ్ల వరకు ఉండవచ్చు జరిమానాతో కలిపి లేదా కాకుండా) చేశాడని పోలీసు అధికారికి అనిపించినంత మాత్రాన, అదే ఏకైక కారణంగా అతడిని అరెస్టు చేయకూడదు. 5. ఒక నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచినప్పుడు, పోలీసు అధికారి అరెస్ట్ చేసిన కారణాలు, ఆధారాలు అలాగే తాను ఆ మేరకు తీసుకున్న నిర్ణయాలను మేజిస్ట్రేట్‌కు వివరించాలి. మేజిస్ట్రేట్ ఆ వివరాలన్నింటినీ పరిశీలించి, న్యాయపరమైన సంతృప్తి పొందిన తరువాత మాత్రమే రిమాండ్ అనుమతించాలి. మేజిస్ట్రేట్ తన ‘సంతృప్తి’ని తన ఆదేశంలో స్పష్టంగా (చిన్నగా అయినా సరే) నమోదు చేయాలి. ఇది కేవలం పోలీస్ అధికారి చెప్పిన మాటల ఆధారంగా కాకూడదు.6. మా అభిప్రాయం ప్రకారం, మేజిస్ట్రేట్ ఉత్తర్వులు లేకుండా, అలాగే వారెంట్ లేకుండా నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసు అధికారికి అధికారం కల్పించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 41 లోని నిబంధనలు నిజాయితీగా అమలయితే, పోలీసులు ఉద్దేశపూర్వకంగా లేదా తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు.7. ఈ తీర్పులో మా ప్రయత్నం ఏమిటంటే, పోలీసులు అనవసరంగా నిందితులను అరెస్ట్ చేయకుండా, మేజిస్ట్రేట్లు కూడా అనాలోచితంగా లేదా యాంత్రికంగా శిక్షించకుండా (రిమాండ్లు విధించకుండా) ఉండాలనే లక్ష్యంతోనే మేము ఈ వ్యాఖ్యలు చేస్తూ, ఆయా అంశాల అమలుకు కింద సూచనలు ఇస్తున్నాము.8. మా సూచనలను పాటించడంలో వైఫల్యం ఉన్నట్లయితే, సంబంధిత పోలీసు అధికారులు శాఖాపరమైన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీనితోపాటు సంబంధిత న్యాయ పరిధి (జ్యూరిస్డిక్షన్) కలిగిన హైకోర్టులో దాఖలయ్యే కోర్టు ధిక్కరణ కేసులో శిక్షకు గురయ్యే అవకాశమూ ఉంటుంది. – సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా -
రాత్రికి రాత్రే అడవులపై బుల్డోజర్లు ఎందుకు?: సుప్రీంకోర్టు
రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేయాల్సిన అవసరం ఏమొచ్చింది?. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు. అడవులను సంరక్షించాలా? లేదా మీ అధికారులను జైలుకు పంపాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోండి. ..: సీజేఐ జస్టిస్ గవాయ్ :.. సాక్షి, న్యూఢిల్లీ: రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేసి సుస్థిర అభివృద్ది కోసమేనని సమర్థించుకోలేరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న అటవీ భూమిని అంత అత్యావశ్యకంగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అటవీ సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ సున్నితంగా హెచ్చరించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ జోమలయ బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు, మరో పిటిషనర్ తరపున ఎస్.నిరంజన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. తాజా నివేదికను దాఖలు చేశాం ప్రస్తుతం కంచ గచ్చిబౌలిలో అన్ని పనులను నిలిపివేసినట్లు ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ ధర్మాసనానికి తెలిపారు. అక్కడ ఎటువంటి పనులు జరగట్లేదని, కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర అంశాలతో కూడిన నివేదికను కోర్టులో దాఖలు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ అఫిడవిట్‌ను పరిశీలించేందుకు తమకు సమయం కావాలని అమికస్ క్యూరీ పరమేశ్వర్, దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు, ఎస్.నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే వారం వాదనలు వింటామని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. దీనిపై స్పందించిన... ప్రతివాదులు మరింత సమయం కావాలని కోరగా.. ఆగస్టు 13కు తదుపరి విచారణను వాయిదా వేశారు. పర్యావరణ అంశాలపై సుప్రీంకోర్టుకు సహాయం చేసేందుకు కేంద్ర సాధికారక కమిటీ (సీఈసీ) స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి తమకు నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. మేం అడవులను కాపాడాం ‘సరే ప్రస్తుతానికైతే అటవీ భూమిని కాపాడారు కదా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ధర్మాసనం అడిగింది. అది అటవీ భూమా.. కాదా?’అనే అంశంపై మరోసారి విచారణ జరగాల్సిన అవసరం ఉందని సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘ఏదేమైనా సరే ప్రస్తుతానికి ఆ స్థలంలో చెట్లు సంరక్షించబడ్డాయి. అభివృద్ధి కోసం అడవులను నరకడం అనేది సమంజసం కాదు. సుస్థిర అభివృద్ధిని నేను వ్యక్తిగతంగా సమర్థిస్తాను. అంటే దానర్థం రాత్రికిరాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి మొత్తం అడవిని ధ్వంసం చేయడాన్ని సమర్థిస్తానని మాత్రం కాదు’అని అన్నారు. అటవీ భూమిని కాపాడకపోతే అధికారులను అక్కడే టెంపరరీ జైలుకు పంపుతామని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అడవులను సంరక్షించాలా లేదా మీ అధికారులను జైలుకు పంపాలా అనే దానిపై నిర్ణయం తీసుకోండి అని అని జస్టిస్ గవాయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
దర్యాప్తు ప్రశ్నార్థకం కారాదు!
అంతా ఎప్పటిలాగే గడిచిపోతున్నదనుకునే వేళ హఠాత్తుగా సంభవించిన పేలుడు జనాన్ని భయకంపితుల్ని చేస్తుంది. తేరుకున్న వెంటనే అది మిగిల్చిన ప్రాణనష్టాన్నీ, విధ్వంసాన్నీ కళ్లారా చూశాక ఆ భయాందోళనలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. తీవ్ర గాయాలై కాళ్లూ చేతులూ తెగిపడినవారి ఆర్తనాదాలు మిన్నంటుతాయి. సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. నేరగాళ్లను పట్టి బంధించాలన్న డిమాండు ఊపందుకుంటుంది. తీరా దీర్ఘకాలం గడిచాక నిందితులు నిర్దోషులనీ, దర్యాప్తు లోపభూయిష్టమనీ తేలితే ప్రజానీకంలో నిరాశా నిస్పృహలు ఆవరించవా? బాధిత కుటుంబాలు మరోసారి రోదించవా? 189 మంది మరణానికీ, 816 మంది క్షతగాత్రులు కావటానికీ కారణమైన 2006 నాటి పేలుళ్ల ఘటనల్లో బొంబాయి హైకోర్టు దాదాపు 20 యేళ్లు కావస్తుండగా వెలువరించిన తీర్పు అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. పోలీసులు ఈ కేసులో వెనువెంటనే 13 మందిని అరెస్టు చేశారు. వారంతా ప్రధాన నిందితులని, మరో 15 మంది పరారీలో వున్నారని తేల్చారు. నిషేధిత ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందిన ఈ నిందితులకు పాకిస్తాన్ ఉగ్ర సంస్థ లష్కరే తొయిబాతో సంబంధ బాంధవ్యాలున్నాయని ఆరోపించారు. పేలుళ్ల ఘటనలు జరిగిన కొద్ది రోజుల్లోనే నిందితులను అరెస్టు చేయటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యేక కోర్టు 2015 సెప్టెంబర్‌లో ఒకరు మినహా మిగిలిన 12 మందినీ దోషులుగా నిర్ధారించింది. వారిలో అయిదుగురికి ఉరిశిక్ష, మిగిలినవారికి వేర్వేరు రకాల శిక్షలు పడ్డాయి. 2021లో ఒకరు కోవిడ్ వ్యాధితో మరణించారు. జనం కిక్కిరిసి ప్రయాణించే సాయంత్రం సమయాన్ని పేలుళ్లకు ఎంచుకుని ఏడు లోకల్ రైళ్లలో బాంబులుంచి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.తమ ముందు విచారణకొచ్చిన కేసుల్లో న్యాయస్థానాలు సాక్ష్యాధారాలను నిశితంగా పరిశీలిస్తాయి. నిందితులుగా చూపించిన వారికి ఆ ఘటనలతో వున్న సంబంధం ఏమిటో, ఏ ప్రాతిపదికన వారే కారకులని పోలీసులు నిర్ధారణకొచ్చారో తరచి చూస్తాయి. ఎంతమంది దోషులైనా తప్పించుకోవచ్చుగానీ, ఒక్క నిరపరాధికి కూడా శిక్షపడరాదన్న సూత్రమే దానికి మూలం. ఉగ్రవాదం మన దేశానికి కొత్తగాదు. దశాబ్దాలుగా అడపా దడపా ఏదో ఒక మూల అది తలెత్తుతూనే వుంది. వివిధ సంఘటనల్లో పదులకొద్దీ మంది మరణిస్తున్నారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికన్నట్టు కొత్త చట్టాలు వస్తున్నాయి. ఉన్న చట్టాలు మరింత కఠినతరమవుతున్నాయి. కానీ చాలా సందర్భాల్లో జరుగుతున్నదేమిటో 2006 నాటి ముంబై పేలుళ్ల ఉదంతమే తార్కాణం. 671 పేజీల తీర్పులో ముంబై హైకోర్టు ధర్మాసనం ప్రస్తావించిన లోటుపాట్లు గమనిస్తే ఇంత నాసిరకంగా దర్యాప్తు జరిగిందా అనిపిస్తుంది. నిందితుల ప్రమేయాన్ని సందేహాతీతంగా నిరూపించాలన్న కర్తవ్యం కన్నా, ఏదో అయిందనిపిద్దామన్న ధోరణే ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) దర్యాప్తులో కనబడిందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించాల్సి వచ్చిందంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. పేలుళ్ల ఉదంతాలప్పుడు పౌరుల్లో ఆగ్రహావేశాలు కలుగుతాయి. ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయటం లేదన్న ఆవేదన వ్యక్తమవుతుంది. రాజకీయ పక్షాల, ఇతర సంస్థల ఆరోపణలు సరేసరి. అందువల్ల దర్యాప్తు చేసేవారిపై ఒత్తిళ్లు పెరుగుతాయన్నది కూడా వాస్తవం. కానీ ఇవేవీ వారిని ప్రభావితం చేయకూడదు. ఘటనాస్థలిలో దొరికిన చిన్న చిన్న ఆధారాలతో అల్లుకుపోతూ ఒక పెద్ద కుట్రను ఛేదించినప్పుడే, నిజమైన నిందితులను పట్టుకున్నప్పుడే సమాజం సురక్షితంగా వుంటుంది. ధర్మాసనం వ్యాఖ్యానించినట్టు నిందితులను పట్టుకున్నామని, అంతా పరిష్కరించామన్న తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించటం వల్ల సమాజానికి ఒరిగేదేమీ వుండదు. తప్పించుకున్న అసలు నిందితులు మరో దురంతానికి పథక రచన చేస్తారు. నిందితులుగా ముద్రపడినవారి కుటుంబాలు దిక్కుతోచక అల్లాడతాయి. జనానికి కావాల్సింది ఆ దారుణానికి పాల్పడ్డ నేరగాళ్లను పట్టుకోవటం తప్ప ఆ పేరిట ఎవరో కొందరిని నిందితులుగా చూపటం కాదు. దేశం మొత్తాన్ని పట్టికుదిపిన కేసులో సాదాసీదా దర్యాప్తు సరికాదని పోలీసు ఉన్నతాధికారులకు అనిపించకపోవటం ఆశ్చర్యం. ఎన్నో కేసుల దర్యాప్తులో పాలుపంచుకొని, ఎంతో అనుభవాన్ని గడించిన వారంతా తమ స్థాయిలోనే ఈ లోటుపాట్లను పట్టుకోవటం అసాధ్యం కాదు. కనీసం న్యాయస్థానం ముందుకెళ్తే ఎలాంటి సందేహాలు ఎదురవుతాయోనన్న బెరుకు ఎవరిలోనూ లేకపోవటం విస్మయం కలిగిస్తుంది. సాంకేతిక కారణాలతోనే ఈ కేసు కొట్టేశారని, సుప్రీంకోర్టుకు వెళ్లి దోషులకు శిక్షపడేలా చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. సాంకేతిక కారణాల సంగతలా వుంచి నిందితుల ఒప్పుకోలు పత్రాలన్నీ దాదాపు ఒకే మాదిరి వుండటం, పొంతన లేని సాక్ష్యాలు నిందితుల అపరాధత్వంపై సందేహాలు కలిగించాయి. తాము నిర్దోషులమని నిరూపించుకునే బాధ్యత నిందితులపైనే వుండేలా చట్టాలు పదునెక్కాయి. కానీ పోలీసులు సక్రమంగా వ్యవహరించి నేరాంగీకారంతో సరిపోలే విధంగా తిరుగులేని సాక్ష్యాధారాలు చూపలేకపోతే ఆ నిబంధన కొరగానిదవుతుంది. దర్యాప్తు ప్రక్రియకు అవరోధంగా మారుతుంది. కనీసం పేలుళ్లలో వాడిన బాంబులేమిటో ఏటీఎస్ నికరంగా చెప్పలేకపోయింది. రేపు సర్వోన్నత న్యాయస్థానం ఏం నిర్ధారిస్తుందో చెప్పలేం. ఇప్పటికైతే బాధిత కుటుంబాలకు ఖేదం మిగిలింది. ఈ తీర్పు దర్యాప్తు సంస్థల తీరుతెన్నులను మరింత పదునెక్కించగలగాలి. నిజమైన నేరగాళ్లను బోనెక్కించాలి. -
కంచ గచ్చిబౌలి కేసు.. సుప్రీం కోర్టు మరో వార్నింగ్
సాక్షి, ఢిల్లీ: వివాదాస్పద హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి కేసు విచారణలో భాగంగా.. అధికారులకు సుప్రీం కోర్టు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అక్కడికక్కడే తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసి అందులోకి అధికారులు పంపాల్సి ఉంటుందని భారత ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం హెచ్చరించారు. కంచ గచ్చిబౌలి కేసు విచారణ ఇవాళ సుప్రీం కోర్టులో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పరీశీలనకు సమయం కావాలని ప్రతివాదులు కోరారు. దీంతో రెండు వారాల సమయం ఇస్తూ.. తదుపరి విచారణను ఆగష్టు 13కి వాయిదా వేసింది. కోర్టు.. అయితే.. ప్రస్తుతం అడవిని కాపాడారు కదా? అని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వం తరఫున లాయర్లను ప్రశ్నించారు. దానికి ‘‘ప్రస్తుతానికి కంచ గచ్చిబౌలి భూముల్లో అన్ని పనులు ఆపేశాం’’ అని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది బదులిచ్చారు. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు. రాత్రికి రాత్రి బుల్డోజర్ పెట్టి అడవిని తీసేద్దామనుకున్నారు. సుస్థిర అభివృద్ధి కోసం నేను అడ్వొకేట్ చేస్తున్నా. అడవిని కాపాడకుంటే... అధికారులను అక్కడే టెంపరరీ జైలుకు పంపుతాం అని హెచ్చరించారాయన. -
498(ఏ) కేసుల్లో హడావుడి అరెస్ట్‌లు వద్దు: సుప్రీం
వరకట్న వేధింపుల కేసుల విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ 498 (ఏ) కేసు దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా 2022లో అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థించింది. వరకట్న వేధింపుల కేసుల్లో భర్త లేదా అతడి కుటుంబ సభ్యులను తొందరపడి అరెస్ట్ చేయరాదని స్పష్టం చేసింది.దేశంలో ఇటీవలి కాలంలో వరకట్న వేధింపుల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం ఒకటైతే.. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ భర్త, అత్తమామలు, ఇతర బంధువులపై 498 (ఏ) కేసులు వేయడమూ మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఇవి తప్పుడు కేసులని న్యాయస్థానాల్లో తేలడం, పిటిషనర్లకు హెచ్చరికలు, జరిమానాలు విధించడమూ వినే ఉంటాం. దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం 498 (ఏ) దుర్వినియోగమవుతోందని, అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది కూడా. ఈ నేపథ్యంలో మంగళవారం చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ ఎ.జి.మసీహలతో కూడిన బెంచ్ కొన్ని కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వాటి ప్రకారం..- ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత కనీసం రెండు నెలలపాటు ఎలాంటి అరెస్ట్‌లు చేయకూడదు. ఈ సమయం వివాద పరిష్కారానికి అవకాశం కల్పిస్తుంది.- ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత ఫిర్యాదులను ముందుగా ప్రతి జిల్లాలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలకు రిఫర్ చేయాలి. ఈ కమిటీలో శిక్షణ పొందిన మధ్యవర్తులు, న్యాయ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు లేదా వారి సహచరులు ఉండాలి.- ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ సభ్యులను సాక్షులుగా న్యాయస్థానాలు పిలవకూడదు.- వివాద పరిష్కారానికి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలో జరిగే చర్చల్లో ఇరు పక్షాల వారు కనీసం నలుగురు బంధువులు (పెద్దవాళ్లు)లను భాగస్వాములుగా చేయాలి. ఆ తరువాత ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ తదుపరి చర్యల కోసం పోలీసులు, మేజిస్ట్రేట్లకు వివరణాత్మకమైన నివేదిక సమర్పించాలి. (ఇదంతా రెండు నెలల్లోపు పూర్తి కావాలి)- ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ చర్చలు జరుగుతున్న సమయంలో పోలీసులు ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడరాదు. అయితే సాధారణ విచారణను మాత్రం పోలీసులు కొనసాగించవచ్చు. - కమిటీ సభ్యులకు, విచారణ అధికారులకు ప్రత్యేకమైన శిక్షణ కల్పించాలి.- వివాదం ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలోనే సమసిపోతే జిల్లా జడ్జీలు క్రిమినల్ కేసులను మూసివేయవచ్చు.దుర్వినియోగం తగ్గుతుందా?498(ఏ) దుర్వినియోగం తగ్గేందుకు ఈ కొత్త మార్గదర్శకాలు ఉపయోగపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో ఏమాత్రం సంబంధం లేని కుటుంబ సభ్యులు తగిన పద్ధతి లేకుండానే అనవసరమైన వేధింపులకు గురవుతూంటారని, అలాంటి వాటిని ఈ మార్గదర్శకాల అమలుతో అరికట్టవచ్చునని వారు వివరిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సుప్రీంకోర్టు తాజా నిర్ణయానికి దారి తీసిన కేసులో భర్తతోపాటు అతడి తండ్రిని కూడా సుమారు వంద రోజులపాటు జైలు నిర్బంధం అనుభవించాల్సి వచ్చింది. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ భార్య వేసిన కేసులో హత్యాయత్నం, మానభంగం వంటి ఆరోపణలూ చేయడంతో ఆ పరిస్థితి ఏర్పడింది. -
జస్టిస్ వర్మ కోసం టాప్ లాయర్లు.. విచారణకు సీజేఐ దూరం
జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల ఆరోపణల వ్యవహారంలో శరవేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు పార్లమెంట్లో ఆయన్ని అభిశంసించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు.. సుప్రీం కోర్టులో ఆయన వేసిన పిటిషన్‌పై ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం వైదొలిగారు. ఈ పిటిషన్‌ను విచారించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయిస్తామని తెలిపారాయన. ‘‘బహుశా ఈ పిటిషన్‌ను నేను విచారణ చేయలేనుకుంటా. ఎందుకంటే.. జస్టిస్ సంజీవ్ ఖన్నా(మాజీ సీజేఐ) నేతృత్వంలో జరిగిన విచారణలో నేను భాగమయ్యాను. కాబట్టి దీన్ని వేరొక బెంచ్‌కు బదిలీ చేస్తా’’ అని పిటిషన్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్‌కు సీజేఐ స్పష్టం చేశారు. మార్చి 14వ తేదీన ఢిల్లీ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహించిన జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం సంభవించి.. కాలిన స్థితిలో నోట్ల కట్టలు కనిపించాయి. ‘న్యాయవ్యవస్థలో అవినీతి..’ అంటూ ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు.. ఆయన్ని హుటాహుటిన అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసింది. అదే సమయంలో ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు జడ్జిల కమిటీని ఏర్పాటు చేయించింది. ఆ కమిటీ తన నివేదికను అప్పటి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించగా.. ఆయన దానిని లేఖ రూపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు పంపారు. ఆ నివేదిక ప్రకారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ అవినీతికి పాల్పడ్డారని, స్వచ్ఛందంగా రాజీనామాకు ఆయన అంగీకరించలేదని, కాబట్టి ఆయన్ని తొలగించాలని ఇన్-హౌజ్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే తన వాదన వినకుండానే చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టులో జడ్జి యశ్వంత్ వర్మ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఇవాళ(బుధవారం) ఆయన తరఫు లాయర్ కపిల్ సిబాల్ సీజేఐ బెంచ్‌ను కోరారు. జస్టిస్ వర్మ తరఫున కపిల్ సిబాల్‌తో పాటు ముకుల్ రోహత్గి, రాకేష్ ద్వివేది, సిద్ధార్థ్ లూథ్రాలాంటి టాప్ లాయర్లు వాదనలు వినిపిస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ పార్లమెంట్ సెషన్లోనే ఆయనపై అభిశంసనకు చర్యలు నడుస్తున్నాయి. ఇలాంటి అభిశంసన తీర్మానం కోసం లోక్‌సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు అభిశంసన నోటీసుపై సంతకం చేయాలి. అయితే జస్టిస్ వర్మ కేసులో ఇప్పటికే 145 మంది లోక్‌సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఇప్పటికే అభిశంసన నోటీసుపై సంతకం చేశారు. జడ్జి తొలగింపు కోసం భారత రాజ్యాంగంలోని 124, 217, 218 ఆర్టికల్స్ ప్రకారం నోటీసు దాఖలైంది. అయితే.. ఎంపీలు ఇచ్చిన అభిశంసన నోటీసును స్వీకరించిన కొన్ని గంటలకే రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి అయిన జగ్దీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.నెక్ట్స్ ఏంటంటే.. లోక్‌సభ స్పీకర్ , రాజ్యసభ ఛైర్మన్ సంయుక్తంగా ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఒకరు, ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఓ ప్రఖ్యాత న్యాయవేత్త ఉంటారు. ఈ కమిటీకి నివేదిక సమర్పించడానికి మూడు నెలల గడువు ఇస్తారు. అయితే ఈ కమిటీ ముందు తన వాదనలు వినిపించేందుకు జస్టిస్ యశ్వంత్ వర్మకు అవకాశం(మూడుసార్లు) ఉంటుంది. గతంలో త్రీజడ్జి కమిటీ సమర్పించిన నివేదికతో పాటు జస్టిస్ వర్మ వాదనలు, సాక్ష్యాలను పరిశీలించాకే స్పెషల్ కమిటీ ఒక నివేదికను సమర్పిస్తుంది. ఈపై ఇరు సభల్లో ఆ నివేదికపై చర్చ జరిగాక.. అభిశంసన తీర్మానాన్నిప్రవేశపెడతారు. దానిని 2/3 మెజారిటీతో సభ్యులు ఆమోదించాక రాష్ట్రపతికి పంపిస్తారు. అప్పుడు ఆయన తొలగింపుపై రాష్ట్రపతి సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. అదే సమయంలో ఆయన పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆగష్టు 21వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ తరుణంలో ఆయన్ని తొలగించడం ఈ సెషన్లో సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
కన్జ్యూమర్ ఈజ్ కింగ్.. క్యూఆర్ కోడ్ వివాదంపై సుప్రీం
సాక్షి,న్యూఢిల్లీ: కన్వర్ యాత్రికులు వెళ్లే మార్గాల్లోని తినుబండారాల షాపులు, ఇతర దుకాణదారులు తమ పేర్లు బోర్డులపై ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాల్ని రద్దు చేయాలంటూ జారీ చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కన్వార్ యాత్ర కొనసాగుతున్న రూట్లలో షాపులు,దుకాణాల వివరాల్ని వెల్లడిస్తూ ప్రదర్శించే క్యూఆర్ కోడ్ వివాదంపై పిటిషనర్లు (అపూర్వానంద్ జా, మహువా మోయిత్రా తదితరులు) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విధానం మతపరమైన వివక్ష, అసమానత్వానికి దారి తీస్తోందని పిటిషన్లలో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్‌లు క్యూఆర్కోడ్లను తొలగించాలనంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు తిరస్కరించారు. ఈ సందర్భంగా క్యూర్‌కోడ్ వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.కన్జ్యూమర్ ఈజ్ కింగ్. వినియోగదారుడి ఏహోటల్లో ఏ వంటల్ని తయారు చేస్తున్నారు. గతంలో ఇదే హోటల్లో నాన్ వెజ్‌ను వడ్డించారా? అన్న విషయాలు తెలుసుకునే హక్కు ఉంది. అదే సమయంలో అయితే సదరు హోటల్ యజమానుల, ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను బహిరంగంగా ప్రదర్శించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. హోటల్ యాజమానులకు రిజిస్ట్రేషన్ తప్పని సరి చేసింది -
‘నెలకు రూ. కోటి భరణం’ కేసు ఏమైందంటే..
పద్దెనిమిది నెలల కాపురానికి రూ.12 కోట్ల విలువైన భరణం ఆశించిన భార్య సుప్రీంకోర్టులో భంగపడింది. ఆ మహిళ గొంతెమ్మ కోర్కెలకు చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయి బ్రేకులేశారు. భర్త ఇవ్వజూపుతున్న ఫ్లాట్‌తో సరిపెట్టుకోవాలని, చదువుకున్నావు కాబట్టి ఉద్యోగంతో సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేయాలని చీఫ్ జస్టిస్ సుతిమెత్తగా ఆ మహిళను మందలించారు. వివరాలు ఇలా ఉన్నాయి..విడాకుల కోసం ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయి మంగళవారం కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ బి.ఆర్.గవాయి ఆ మహిళను ఉద్దేశించి వేసిన ప్రశ్నలు.. ఆ మహిళ ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి...చీఫ్ జస్టిస్: మీ డిమాండ్ (భరణం) ఏమిటి?మహిళ: ముంబైలోని అప్పులు, తనఖా ఇబ్బందుల్లేని ఇల్లు, మెయిన్టెన్స్ కోసం రూ.12 కోట్లు.చీఫ్ జస్టిస్: ‘‘... కానీ ఆ ఇల్లు కల్పతరులో ఉంది. ఒకానొక మంచి బిల్డర్‌ది. మీరేమో ఐటీ పర్సన్. ఎంబీఏ కూడా చేశారు. మీలాంటి వాళ్లకు డిమాండ్ ఉంది.. బెంగళూరు హైదరాబాద్‌లలో.. మీరెందుకు ఉద్యోగం చేయకూడదు?’’ ‘‘పెళ్లయిన తరువాత మీ దాంపత్యం 18 నెలలు సాగింది... ఇప్పుడు మీకు బీఎండబ్ల్యూ కూడా కావాలా?’’ పద్దెనిమిది నెలల వైవాహిక జీవితానికి నెలకొ రూ.కోటి చొప్పున కావాలా?’’మహిళ: కానీ అతడు బాగా ధనవంతుడు. నాకు స్కిజోఫ్రెనియా ఉందని, వివాహం రద్దు చేయాలని అతడే కోరాడు.సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ (భర్త తరఫు న్యాయవాది): ఆమె కూడా ఉద్యోగం చేయాలి. అన్నీ ఇలా డిమాండ్ చేయడం సరికాదు.మహిళ: మైలార్డ్ నేను స్కిజోఫ్రెనియా బాధితురాలి మాదిరిగా కనిపిస్తున్నానా?చీఫ్ జస్టిస్: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయండి. అయితే ఒకటి అర్థం చేసుకోండి. మీరు అతడి తండ్రి ఆస్తి కోరలేరు!కొంత సమయం తరువాత మంగళవారం బెంచ్ మళ్లీ విచారణ చేపట్టినప్పుడు...చీఫ్ జస్టిస్: ఆదాయపన్ను పత్రాలెక్కడ? మహిళ: ఇక్కడున్నాయి.సీనియర్ న్యాయవాది మాధవి దివాన్: అన్ని పత్రాల కాపీ ఇవ్వండి... చూశారా 2015- 16లో ఆదాయం ఎక్కువ ఉంది. అప్పట్లో అతడు ఉద్యోగం చేసేవాడు.చీఫ్ జస్టిస్: 2015 - 16లో ఆదాయం ఎంత?సీనియర్ న్యాయవాది మాధవి దివాన్: రెండు కోట్ల యాభై లక్షలు, కోటి బోనస్. ఇతర వ్యాపారాలు చేసినట్లు ఆరోపణలేవీ లేవు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీని గురించి మాట్లాడేందుకు ఏమీ లేదు. తాను (మహిళ) ఆక్రమించుకున్న ఫ్లాట్‌కు రెండు కార్ పార్కింగ్లు ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది.చీఫ్ జస్టిస్: అవును అవును. ముంబైలో అన్ని రకాల ప్రదేశాలతో డబ్బు చేసుకోవచ్చు. సీనియర్ న్యాయవాది మాధవి దివాన్: తాను కోరుకుంటున్న బీఎండబ్ల్యూ కారు కూడా పదేళ్ల పాతది. ఎప్పుడో పాడుపడింది. చీఫ్ జస్టిస్: మీకు (మహిళను ఉద్దేశించి) తనఖా ఇబ్బందుల్లేని ఫ్లాట్ లభిస్తుంది అంతే. బాగా చదువుకున్నా ఉద్యోగం చేయకపోవడం మీ సొంత నిర్ణయం. కేసులో తీర్పు రిజర్వ్ చేస్తున్నాం.మహిళ: నా భర్త న్యాయవాదిని ప్రభావితం చేశారు...చీఫ్ జస్టిస్: ఎవరిని? మీకు లభిస్తున్న ఫ్లాట్‌తో సంతృప్తి పడితే మేలు. లేదంటే అతడు ఇవ్వజూపుతున్న రూ.నాలుగు కోట్లు తీసుకుని మంచి ఉద్యోగం చూసుకోండి.మహిళ: వారు నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. నాకు ఏ ఉద్యోగం వస్తుంది?చీఫ్ జస్టిస్:... వాటన్నింటినీ మేము రద్దు చేస్తాం! మీరు అంతంత చదువులు చదువుకున్నారు. మీ కోసం మీరు అడుక్కోకూడదు. సొంతంగా సంపాదించుకుని తినాలి! మ్యాటర్ ఎండ్స్! ఆర్డర్స్ రిజర్వ్డ్!:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
రాజకీయ పోరాటాలతో మీకేం పని?.. ఈడీపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పోరాటం ఈడీ పని కాదని.. అది ముమ్మాటికీ అధికార దుర్వినియోగం కిందికి వస్తుందంటూ పేర్కొంది. కర్ణాటక ‘మూడా స్కాం’ కేసుతో పాటు.. లాయర్లకు ఈడీ సమన్లు జారీ చేసిన వ్యవహారాలను విచారించే క్రమంలో సుప్రీం కోర్టు ఈడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: మూడా స్కాం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి కర్ణాటక హైకోర్టు కల్పించిన ఉపశమనాన్ని ఈడీ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఈడీపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సింగిల్ జడ్జి సమర్థించారని మీకు బాగా తెలుసు. అంటే ఈ కేసులో ఇప్పటికే రెండు స్థాయిల్లో న్యాయ నిర్ణయాలు వచ్చాయి. వాటిని తిరగరాయడానికి ఈడీ ప్రయత్నించడం అనవసరం. ఇది రాజకీయ ప్రమేయంలా అనిపిస్తోంది. రాజకీయాలు పోరాటాలు అనేది ప్రజల మధ్య జరగాలి. మీరు(ఈడీ) దానిని ఎందుకు ఉపయోగిస్తున్నారు? ప్రశ్నించారు. EDను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదు.. అది ప్రజాస్వామ్యానికి హానికరం. ఈ వైరస్‌ను దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందనివ్వకండి అని సీజేఐ వ్యాఖ్యానించారు.Let political battles be fought among the electorate.. రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి. రాజకీయ పార్టీల మధ్య ఉన్న విభేదాలు, ఆరోపణలు, విమర్శలు కోర్టుల ద్వారా కాదు, ఓటర్ల తీర్పు ద్వారా పరిష్కరించాలి. అలాంటిది ED (Enforcement Directorate) వంటి సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయా?. కోర్టులను రాజకీయ వేదికలుగా ఉపయోగించకండి. ప్రజాస్వామ్యంలో ఓటర్లు మాత్రమే రాజకీయ నాయకుల భవితవ్యాన్ని నిర్ణయించాలి, న్యాయవ్యవస్థ కాదు.దురదృష్టవశాత్తూ.. మహారాష్ట్రలో ఈడీతో నాకు అనుభవం ఉంది. మాతో మీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసేలా చేసుకోకండి అని చీఫ్ జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. ఈ క్రమంలో అదనపు సోలిసిటర జనరల్ ఎస్వీ రాజు తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని ధర్మాసనానికి తెలిపారు. అదే సమయంలో.. భవిష్యత్తులో ఈ పిటిషన్‌ను ఇతర కేసుల్లో ఉదాహరించవద్దంటూ విజ్ఞప్తి చేశారాయన. దీంతో పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. మరో కేసులో.. క్లయింట్లకు సలహాలు ఇస్తున్నారనే అభియోగాల కింద.. ఈడీ సీనియర్ అడ్వొకేట్లకు కొందరు సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు .. ఇవాళ విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ తోపాటు మరికొన్ని లీగల్ బాడీస్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. చైనా, టర్కీలలో బార్ అసోషియేషన్లు రద్దైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశాయి. అదే సమయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోరాయి. దీంతో.. న్యాయపరమైన సలహాలు ఇవ్వడం తప్పెలా అవుతుంది? అని ఈడీ తీరును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. అయితే గుజరాత్లో ఓ హత్య కేసులో నిందితుడికి న్యాయవాది సలహా ఇవ్వడాన్ని ఈడీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో ఈడీని నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం జరుగుతోందంటూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అయితే అది వేరే సందర్భమన్న సీజేఐ బెంచ్.. న్యాయవాదిని సమన్లు ఇవ్వాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలనే విషఁఆన్ని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో మార్గదర్శకాల రూపకల్పనకు అమీకస్ క్యూరీని నియమిస్తామంటూ వచ్చేవారానికి విచారణ వాయిదా వేసింది.మూడా (MUDA) కేసు నేపథ్యంకర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య B.M. పర్వతికి సంబంధించి మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) ద్వారా భూ కేటాయింపులపై అక్రమతల ఆరోపణలతో ప్రారంభమైంది. సుమారు 3.16 ఎకరాల భూమి పర్వతి పేరుతో ఉంది, ఇది MUDA ద్వారా డెనోటిఫై చేయబడిన తర్వాత రెసిడెన్షియల్ లేఅవుట్‌గా అభివృద్ధి చేయబడింది. MUDA ఈ భూమిని ఉపయోగించినందుకు పర్వతి 14 ప్లాట్లు (ప్రతి ఒక్కటి ₹2 కోట్ల విలువ) విజయనగర ప్రాంతంలో పొందారు. అయితే.. బీజేపీ, JD(S) వంటి ప్రతిపక్షాలు దీన్ని ₹4,000 కోట్ల స్కాంగా అభివర్ణించాయి. మూడా (MUDA) కేసు కోర్టు విచారణ టైం లైన్కర్ణాటక గవర్నర్ తావార్చంద్ గెహ్లాట్ 2024 ఆగస్టు 17న MUDA కేసులో ED విచారణకు అనుమతి ఇచ్చారు. తద్వారా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లైంది. ED తన Enforcement Case Information Report (ECIR) నమోదు చేసి, పర్వతి (CM భార్య) సహా ఇతరులపై ప్రీలిమినరీ విచారణ ప్రారంభించింది. ఆగస్టు 19, 2024👉 సీఎం సిద్ధరామయ్య గవర్నర్ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.👉 ED విచారణకు అనుమతి ఇచ్చిన గవర్నర్ ఆదేశాన్ని రద్దు చేయాలని కోరారు.ఆగస్టు 29, 2024👉 హైకోర్టు ప్రత్యేక కోర్టును MUDA కేసులో తాత్కాలికంగా ఆదేశాలు ఇవ్వకుండా ఉండమని సూచించింది.👉 విచారణ తదుపరి తేదీకి వాయిదా వేసింది. సెప్టెంబర్ 12, 2024👉 హైకోర్టు విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వ్ చేసింది.👉 న్యాయమూర్తి M. నాగప్రసన్న రెండు పక్షాల వాదనలు ఆఖరి రోజులోనే ముగించాలని స్పష్టం చేశారు.సెప్టెంబర్ 24, 2024👉 కర్ణాటక హైకోర్టు సీఎం సిద్ధరామయ్య పిటిషన్‌ను తిరస్కరించింది.👉 గవర్నర్ అనుమతి చట్టబద్ధమైనదే అని తీర్పు ఇచ్చింది.2025 మార్చి 7కర్ణాటక హైకోర్టు సిద్ధరామయ్య సతీమణి B.M. పార్వతికి ఉపశమనంMUDA భూ కేటాయింపు కేసులో, ED జారీ చేసిన సమన్లను హైకోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తి M. నాగప్రసన్న ఈ తీర్పును ఇచ్చారు, పార్వతి, మంత్రి బైరతి సురేష్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించి, ED చర్యలు చట్టపరంగా నిలబడవని తేల్చారు. Money Laundering Act (PMLA) ప్రకారం, “proceeds of crime” అనే అంశం స్పష్టంగా లేకపోతే, ED విచారణ కొనసాగించలేదని కోర్టు అభిప్రాయపడింది. పార్వతి 14 ప్లాట్లు స్వచ్ఛందంగా తిరిగి అప్పగించడంతో, ఆర్థిక లాభం పొందలేదని కోర్టు గుర్తించింది. సమన్లు జారీ చేయడం చట్టబద్ధంగా కాదని తీర్పు ఇచ్చారు.జూలై 21, 2025👉 సుప్రీం కోర్టు ఈ కేసులో ED అప్పీల్‌ను తిరస్కరించింది.👉 “రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి, కోర్టుల్లో కాదు” అని CJI BR గవాయ్ వ్యాఖ్యానించారు. -
‘దత్త’ పుత్రులు.. నిరీక్షిస్తున్నారు
‘దత్తత ప్రక్రియలో దీర్ఘ జాప్యం కారణంగా దత్తత తీసుకోవడానికి చట్టబద్ధంగా అర్హులని ప్రకటించిన పిల్లలకు డిమాండ్ పెరిగింది, దీనివల్ల దత్తత కోసం పిల్లలను అక్రమంగా తరలించే ప్రమాదం ఉంది’– ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలివి. దేశంలో దత్తతకు చట్టపరంగా ఏ అడ్డంకులూ లేని బిడ్డ కోసం దంపతులు.. సగటున మూడేళ్లకుపైగా వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇలా ఆలస్యమయ్యేకొద్దీ కొన్నాళ్లకు వాళ్లకు దత్తతపై పూర్తిగా ఆసక్తిపోయే అవకాశం ఉంటుంది. ఇది అనాథలైన చిన్నారుల పాలిట శాపంలా మారుతుంది. వా రికొక కుటుంబం ఏర్పడే అవకాశాన్ని కాలరాస్తోంది. చిన్నారుల దత్తత ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లోనే ‘కేరింగ్స్’పోర్టల్ ద్వారా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దత్తత విధి విధానాలు శీఘ్రంగా అమలయ్యేందుకు కేంద్ర దత్తత వ్యవహారాల ప్రాధికార సంస్థ (కారా)ను ఏర్పాటుచేసింది. ఇది గత కొన్నేళ్లుగా దత్తతలను సమర్థంగా నిర్వహించలేకపోతోంది అనే విమర్శలు ఎదుర్కొంటోంది. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, పరిమిత సంఖ్యలో మాత్రమే పిల్లలను దత్తత ఇవ్వటానికి చట్టబద్ధమైన అనుమతులు పొందగలుగుతోంది. దీనిపై గతంలోనే పార్లమెంటరీ కమిటీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. దరఖాస్తుల వెల్లువ సమాచార హక్కు దరఖాస్తుల ద్వారా వెల్లడైన తాజా సమాచారం ప్రకారం 2021లో 26,734 మంది తల్లిదండ్రులు దత్తత కోసం ‘కారా’పోర్టల్‌లో నమోదు చేసుకోగా, 2,430 మంది పిల్లలు మాత్రమే చట్టబద్ధమైన దత్తతకు సిద్ధంగా ఉన్నారు. అంటే, ప్రతి బిడ్డకు 11 మంది తల్లిదండ్రులు ఎదురు చూశారన్నమాట. 2025 జూలై 19 నాటికి, దత్తత తీసుకునేందుకు నమోదు చేసుకున్న తల్లిదండ్రుల సంఖ్య 36,433కి, పిల్లల సంఖ్య 2,777కి పెరిగింది. ప్రస్తుతం దత్తతకు యోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డకు 13 మంది తల్లిదండ్రులు ఉన్నారు. 2025–26లో జూలై 19 వరకు 1,365 మంది పిల్లలు దత్తుకు వెళ్లారు.మూడేళ్లకు పెరిగిన జాప్యం 2025లో దేశం మొత్తం మీద దత్తత కోసం పేర్లు నమోదు చేసుకున్న తల్లిదండ్రుల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నారు. దత్తతకు న్యాయపరమైన అన్ని ప్రక్రియలు పూర్తవటానికి 2017లో ఒక సంవత్సరంగా ఉన్న సగటు ఆలస్యం 2022 నాటికి మూడేళ్లకు, ప్రస్తుతం దాదాపు 3.5 సంవత్సరాలకు పెరిగింది. 34 శాతం వారే! ప్రస్తుతం దత్తత కోసం సిద్ధంగా ఉన్న పిల్లల్లో దాదాపు 34 శాతం మంది 14–18 సంవత్సరాల వయసువారే. ‘దత్తత తీసుకుంటున్న తీరును పరిశీలిస్తే.. భారతీయ తల్లిదండ్రులు సాధారణంగా పెద్ద పిల్లలు, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను దత్తత తీసుకోవడానికి ఇష్టపడటం లేదని అర్థమవుతోంది’అని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. అర్హత ప్రక్రియల్లో అస్పష్టత జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, భద్రత) చట్టం (2021) ప్రకారం బాలల సంరక్షణ సంస్థలలో (సీసీఐలు) ఉండే పిల్లలను దత్తతకు అనుమతిస్తారు. కానీ, ఆయా రాష్ట్రాల్లో సీసీఐలలో ఉండే పిల్ల ల సంఖ్యకు, దత్తతకు అర్హులుగా ప్రకటించే పిల్లల సంఖ్యకూ చాలా వ్యత్యాసం ఉంటోంది. పిల్లల సంఖ్య ఎక్కు వ ఉన్నప్పటికీ.. దత్తతకు అర్హులైన వారి సంఖ్య తక్కు వగా ఉంటోంది. 2025లో 22,000 కంటే ఎక్కువ మంది పిల్లలు సీసీఐలలో ఉన్నారని, చట్టబద్ధంగా దత్తతకు అర్హత ఉన్న పిల్లల సంఖ్య కంటే ఇది 8.5 రెట్లు ఎక్కువ అనీ సమాచార హక్కు డేటా చూపిస్తోంది. సీసీఐలలోని పిల్లల్లో అనాథలు, తల్లిదండ్రులు వదిలేసినవారు, బంధువులు తెచ్చి అప్పగించినవారు, సంరక్షకులు లేని పిల్లలు ఉంటారు. వారిలో దత్తతకు అర్హమైన పిల్లల్ని ప్రక టించే ప్రక్రియ ఇంకా అస్పష్టంగానే ఉంది. సంరక్షకులు / తల్లిదండ్రులు ఉండి కూడా ఏనాడూ తమ పిల్లల ముఖం చూడ్డానికి రాకపోవటం వల్ల కూడా చట్టబద్ధంగా వారిని దత్తత ఇవ్వటంలో అవాంతరాలు ఎదురౌతున్నాయి. -
జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపునకు ముహూర్తం ఖరారు?
సాక్షి,న్యూఢిల్లీ: కాలిన నోట్ల కట్టల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు పదవి నుంచి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైంది.రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందే జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసన ద్వారా తొలగించే ప్రక్రియపై 100 మంది పార్లమెంట్ సభ్యులు సంతకాలు పెట్టినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా ప్రకటించారు.ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. విచారణకు సుప్రీంఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ ఎత్తున కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జస్టిస్ వర్మపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీతో విచారణ చేపట్టింది. ఈ విచారణలో కాలిన నోట్ల కట్టలు జస్టిస్ యశ్వంత్ వర్మవేనన్న సాక్షులు,ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అభిశంసన చర్యలువీటిని పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీ సైతం జస్టిస్ వర్మను అభిశంసన ద్వారా తొలగించాలని సిఫారసు చేసింది. త్రిసభ్య కమిటీ నిర్ణయాన్ని తప్పుబట్టిన జస్టిస్‌వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయ స్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చేసిన సిఫార్సులను సైతం సవాలు చేశారు.త్రిసభ్య కమిటీ రిపోర్టుపై సవాలునోట్ల కట్టల వ్యవహారంలో తన వాదన పూర్తిగా వినకుండానే నివేదిక రూపొందించారని అంతర్గత ఎంక్వైరీ కమిటీ తీరును ఆయన తప్పుపట్టారు. ఈ దర్యాప్తులో లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు కమిటీకి లభించలేదన్నారు.ఏకమైన అధికార,ప్రతి పక్షాలు తనను దోషిగా తేల్చాలన్న ముందస్తు వ్యూహంతోనే నివేదిక సిద్ధంగా చేశారని విమర్శించారు. తనపై దర్యాప్తు ప్రక్రియ మొత్తం రాజ్యాంగవిరుద్ధంగా సాగిందని, తన ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికపై తాను అధికారికంగా స్పందించకముందే దాన్ని మీడియాకు లీక్ చేశానని, తన ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర జరిగిందని జస్టిస్ వర్మ మండిపడ్డారు. అందుకే ఈ నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అయినప్పటికీ జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అధికార,ప్రతి పక్షాలు ఏకమయ్యాయి. అభిశంసన తీర్మానం ద్వారాభారత రాజ్యాంగం ప్రకారం.. అవినీతి ఆరోపణల ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుండి తొలగించవచ్చు.అటువంటి ఘటనల్లో అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు లేదంటే లోక్‌సభలో కనీసం 100 మంది సభ్యుల మద్దతు ఉంటేనే ఆమోదిస్తారు. ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి సభలోని మూడింట రెండు వంతుల ఎంపీల మద్దతు అవసరం.మంత్రి కిరణ్ రిజిజు ఏమన్నారంటే?ఇప్పుడు ఇదే పద్దతిలో జస్టిస్ వర్మ తొలగింపునకు అధికార,ప్రతిపక్ష లోక్ సభ,రాజ్య సభ సభ్యులు సంతకాలు పెట్టారు. న్యాయవ్యవస్థలో అవినీతి అనేది చాలా సున్నితమైన విషయం. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉన్నాయి. వర్షాకాల సమావేశంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రభుత్వం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నాం’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అభిశంసన తీర్మానంలో అనూహ్య పరిణామంఈ అభిశంసన తీర్మానంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం విభేదిస్తుంటాయి. కానీ న్యాయవ్యవస్థలో అవినీతి వంటి సున్నితమైన అంశంపై పార్టీలకు అతీతంగా స్పందించడం, ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలుస్తూ.. 100 మంది ఎంపీలు అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయడం, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా 35 మంది కాంగ్రెస్ ఎంపీలు సైతం సంతాలు చేసినట్లు సమాచారం. -
గవర్నర్‌ను క్షమాభిక్ష కోరవచ్చు
న్యూఢిల్లీ: కాబోయే భర్తను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన కర్ణాటక మహిళ శుభాకు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. కర్ణాటక గవర్నర్ నుంచి క్షమాభిక్ష కొరేందుకు ఆమెకు అనుమతి ఇచ్చింది. సామాజిక పరిస్థితులు, ఒత్తిళ్ల కారణంగా మహిళలు కొన్ని సందర్భాల్లో నేరాలకు పాల్పడుతున్నారని న్యాయస్థానం పేర్కొంది. శుభా 20 ఏళ్ల వయసులో కాలేజీలో చదువుకుంటున్న సమయంలో నిశ్చితార్థం జరిగింది. ఈ పెళ్లి ఆమెకు ఎంతమాత్రం ఇష్టంలేదు. కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. కాబోయే భర్తను హత్య చేస్తే తనకు ఈ పెళ్లి తప్పుతుందని భావించింది. తన మిత్రులైన అరుణ్ వర్మ, వెంకటేశ్, దినేశ్‌తో కలిసి అతడిని హత్య చేసింది. శుభాపై నేరం రుజువైంది. అయితే, బలవంతంగా పెళ్లి చేసేందుకు పెద్దలు ప్రయత్నించడంతో విధిలేని పరిస్థితుల్లో అతడిని చంపాల్సి వచ్చిందని శుభా మొరపెట్టుకుంది. గవర్నర్‌ను క్షమాభిక్ష కొరేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. శుభా వినతి పట్ల సానుకూలంగా స్పందించింది. -
రష్యా మహిళ, చిన్నారి జాడ తక్షణమే కనిపెట్టండి
న్యూఢిల్లీ: రష్యా మహిళ, ఆమె కుమార్తె కనిపించకుండా పోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీని వెనుక కుట్ర కోణం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా ఆమెకు ఎవరో సాయం చేసి ఉండొచ్చని పేర్కొంది. లుకౌట్ నోటీసు జారీ చేసి, తల్లి, కుమార్తె జాడను త్వరగా తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సైకత్ బసు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా శుక్రవారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చిల ధర్మాసనం పైవిధంగా స్పందించింది. రష్యా పౌరురాలైన తన మాజీ భార్య విక్టోరియా బసు, నాలుగున్నరేళ్ల చిన్నారి ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ సైకత్ బసు పేర్కొన్నారు. పోలీసులు లుఔట్ నోటీసు జారీ చేశారని, రష్యా ఎంబసీతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి ధర్మాసనానికి నివేదించారు. ఈ నెల 6న ఆమెకున్న కెనరా బ్యాంక్ అకౌంట్లో కేవలం రూ.169 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆమె దేశం విడిచి వెళ్లినట్లు ఎయిర్‌పోర్టుల్లో నమోదు కాలేదని వివరించారు. స్పందించిన ధర్మాసనం..విక్టోరియా బసు వేరే మార్గాల ద్వారా దేశం దాటి వెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడింది. అన్ని రైల్వే స్టేషన్లు, ఇతర రవాణా వ్యవస్థల నుంచి సమాచారం సేకరించాలని, ఢిల్లీని విడిచారా లేదా నిర్థారించాలని ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే వారి జాడ కనుగొనాలంది. సుప్రీంకోర్టు గత ఆదేశాల మేరకు సైకత్, విక్టోరియా దంపతులు చిన్నారి సంరక్షణను వారంలో చెరో మూడు, నాలుగు రోజులు తీసుకోవాల్సి ఉంది. అయితే, ఈ నెలారంభంలో ఢిల్లీలోని రష్యా ఎంబసీ వెనుక వైపు నుంచి ఓ దౌత్యాధికారి వెంట కూతురిని తీసుకుని వెళ్లిన విక్టోరియా జాడ మళ్లీ కనిపించలేదని సైకత్ పేర్కొన్నారు. కుమార్తె సహా ఆమె భారత్ విడిచి వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
భూమికి ఉద్యోగం కేసు.. లాలూకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో(భూమికి ఉద్యోగం) ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్పై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అంతేకాదు.. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేసేలా ఢిల్లీ హైకోర్టుకు ఆదేశాలివ్వాలన్న ఆయన అభ్యర్థననూ శుక్రవారం తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో విచారణ యధాతథంగా కొనసాగనుంది.ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాని కోరుతూ లాలూ ప్రసాద్ ముందుగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. విచారణపై స్టే విధించడానికి ఎలాంటి కారణలూ లేవని తెలిపింది. ఆపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఇవాళ ఆయన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు ద్విససభ్య ధర్మాసనం తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది.యూపీఏ ప్రభుత్వ హయాంలో.. 2004 నుంచి 2009 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో భారతీయ రైల్వే తరఫున మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో వెస్ట్ సెంట్రల్ జోన్లో గ్రూప్-డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ 2022లో అభియోగాలు నమోదు చేసింది. అక్రమంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు లాలూ, అతని కుటుంబ సభ్యులకు భూములు బహుమతిగా ఇచ్చారని సీబీఐ అభియోగాలు మోపింది. ఇదే వ్యవహారంపై మనీలాండరింగ్ వ్యవహారం (PMLA) కింద కేసు నమోదు చేసిన ఈడీ.. లాలూ కుటుంబ సభ్యులకు చెందిన 25 చోట్ల సోదాలు జరిపింది. ఆ సమయంలో.. రూ.6 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది.అయితే.. రాజకీయ దురుద్ధేశ్యంతోనే తనపై దాదాపు దశాబ్దన్నర తర్వాత కేసు నమోదు చేశారని లాలూ అంటున్నారు. -
కమిటీ నివేదికను రద్దు చేయండి..జస్టిస్ యశ్వంత్ వర్మ
న్యూఢిల్లీ: నోట్ల కట్టల విషయంలో అంతర్గత విచారణ కమిటీ నివేదికను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నివేదికను రద్దు చేయాలని కోరుతూ గురువారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చేసిన సిఫార్సులను సైతం సవాలు చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టును ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎంక్వైరీ కమిటీ నివేదికను రద్దు చేయాలంటూ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం అత్యంత అరుదైన ఘటన అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఒకవైపు ఏర్పాట్లు జరుగుతుండగా, మరోవైపు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. నోట్ల కట్టల వ్యవహారంలో తన వాదన పూర్తిగా వినకుండానే నివేదిక రూపొందించారని అంతర్గత ఎంక్వైరీ కమిటీ తీరును ఆయన తప్పుపట్టారు. ఈ దర్యాప్తులో లోపాలు ఉన్నాయని స్పష్టంచేశారు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు కమిటీకి లభించలేదన్నారు. తనను దోషిగా తేల్చాలన్న ముందస్తు వ్యూహంతోనే నివేదిక సిద్ధంగా చేశారని విమర్శించారు. తనపై దర్యాప్తు ప్రక్రియ మొత్తం రాజ్యాంగవిరుద్ధంగా సాగిందని, తన ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికపై తాను అధికారికంగా స్పందించకముందే దాన్ని మీడియాకు లీక్ చేశానని, తన ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర జరిగిందని జస్టిస్ వర్మ మండిపడ్డారు. అందుకే ఈ నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అభిశంసన తీర్మానం ప్రవేశపెడతాం: మేఘ్వాల్న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీర్మానం ప్రవేశపె ట్టనున్నట్లు న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ శుక్రవారం వెల్లడించారు. దీనిపై నిర్ణయం తీసు కోవాల్సింది ఎంపీలేనని, ఇందులో ప్రభుత్వం పాత్ర ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు లేదా హై కోర్టు జడ్జిని పదవి నుంచి తొలగించే హక్కు పార్లమెంట్‌కు ఉందని గుర్తుచేశారు. అభిశంసన తీర్మానానికి లోక్‌సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరమని అన్నారు. -
సుప్రీంకోర్టు ఉత్తర్వు రివర్స్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణ యం తీసుకుంది. ఏడాది క్రితం తాము స్వయంగా ఇచ్చిన ఉత్తర్వునే మార్చేసింది. 13 ఏళ్ల బాలుడి మానసిక పరిస్థితిని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అతడిని తల్లికే అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ బాలుడిని తండ్రి కస్టడీకి అప్పగిస్తూ 2024 ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వును న్యాయస్థానం మార్చింది. కేరళకు చెందిన యువతి, యువకుడికి 2011లో వివాహం జరిగింది. వారికి 2012లో కుమారుడు జన్మించాడు. తర్వాత కాపురంలో విభేదాలు తలెత్తడంలో వేర్వేరుగా జీవిస్తున్నారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుమారుడు తల్లి వద్దే ఉండేలా, తండ్రి నెలకు రెండు రోజులు చూసేలా ఒప్పందం కుదిరింది. 2015లో వారికి విడాకులు మంజూరయ్యాయి. యువతి మళ్లీ పెళ్లిచేసుకుంది. ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. మొ దటి భర్త నాలుగేళ్లుగా ఆమె మొదటి కుమారుడిని చూడడానికి రాలేదు. తాను మలే షియా వెళ్లిపోతున్నానని, మొదటి బిడ్డను కూడా తీసుకెళ్తానని, ఇందుకు అంగీకరిస్తూ సంతకం చేయాలని మొదటి భర్తను 2019 లో కోరింది. అందుకు అతడు నిరాకరించా డు. ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన బిడ్డను తనకే అప్పగించాలని కోరాడు. కానీ, బిడ్డను తల్లికే అప్పగిస్తూ 2022లో ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ మొదటి భర్త కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. హైకోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బిడ్డను తండ్రి కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తల్లి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గత ఏడాది విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు తీర్పును సమరి్థంచింది. కుమారుడు తండ్రి వద్దే ఉండొచ్చని ఉత్తర్వు జారీ చేసింది. దాంతో ఈ ఉత్వర్వును పునఃసమీక్షించాలని కోరుతూ తల్లి మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వును రివర్స్ చేస్తున్నట్లు తేల్చిచెప్పింది. కుమారుడు తల్లి కస్టడీలోనే ఉండొచ్చని తేల్చిచెప్పింది. ఈ సమయంలో అతడికి తల్లి అవసరం చాలా ఉందని అభిప్రాయపడింది. చిన్న వయసులో బిడ్డకు తల్లే అసలైన సంరక్షురాలు అని న్యాయస్థానం పేర్కొంది. -
రష్యన్ మహిళను వెతికి పట్టుకోండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భర్తతో విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్న సమయంలో ‘కస్టడీ డీల్’లో ఉన్న ఐదేళ్ల పిల్లాడితో కనిపించకుండా పోయిన రష్యాకు చెందిన మహిళను వెంటనే వెతికి పట్టుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు. కొన్నేళ్ల క్రితం రష్యాకు చెందిన మహిళ విక్టోరియా బసూను భారత్‌కు చెందిన సైకత్ బసూ వివాహం చేసుకోగా, ప్రస్తుతం వారి మధ్య విడాకుల కేసు ఢిల్లీ సాకేత్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ సమయంలో విక్టోరియా బసూ కనిపించకుండా పరారైయినట్లు భర్త సైకత్ బసూ ఫిర్యాదు చేశాడు. తన భార్య పిల్లాడిని తీసుకుని పరారైనట్లు సైకత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిలో భాగంగా విచారణ చేపట్టిన ధర్మాసనం సదరు మహిళను వెంటనే పట్టుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో రష్యన్ మహిళ వెంట పెట్టుకుని తీసుకుని పోయిన ఆమె కుమారుడ్ని వెంటనే ట్రేస్ అవుట్ చేయాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. ఇందులో ఎటువంటి జాప్యం లేకుండా త్వరతగతిన పిల్లాడి ఆచూకీని ఛేదించాలని స్పష్టం చేసింది. ఆపై పిల్లాడిని తండ్రి సైకేత్కు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం.. పిల్లాడితో పాటు కనిపించకుండా పోయిన విక్టోరియా బసూ పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని ఆదేశించింది. ఎయిర్పోర్ట్, నావీ పోర్ట్ల్లో అధికారులు ఆ మహిళపై ఓ కన్నేసి ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది ధర్మాసనం. అదే సమయంలో ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. విక్టోరియా బసూ ఎక్కడ ఉందో తెలియదంటూ ఆమె తరఫు న్యాయవాది తెలిపిన క్రమంలో.. సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ‘ ‘ఆమె ఎక్కడ ఉందో మీకు తెలుసు. మీరు మాతో ఆటలు ఆడాలనుకుంటున్నారా?, మీ దగ్గరికి మళ్లీ వస్తాం.. మీరు కాస్త ఆగండి’ అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఆమెకు రష్యా ఎంబాసీ అధికారి సాయం చేశారు..తన భార్య పారిపోవడానికి భారత్‌లో ఉన్న రష్యన్ ఎంబసీ ప్రతినిధి సాయం చేశారని సైకేత్ కోర్టుకు తెలిపారు. విడాకుల కేసు ప్రోసిడింగ్స్‌లో ఉండగా ఢిల్లీలోని రష్యన్ ఎంబసీ నుంచి ఆమె పారిపోయిందని భర్త తెలిపారు. ఎంబసీ వెనుక గేటు నుంచి ఆమె వెళ్లిపోయిందని, రష్యన్ ఎంబసీ అధికారి ఆమెకు సాయం చేశారని భర్త ఆరోపిస్తున్నాడు. లగేజీ పట్టుకుని మరీ వెళ్లిన ఆమెను సదరు అధికారి పంపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. రష్యన్ ఎంబాసీ అధికారి ఆమెకు సాయం చేయడం తాను చూశానన్నాడు. అ అధికారి ఇళ్లు సోదా చేయడానికి అనుమతి కోరండిరష్యన్ రాయబార కార్యాలయ అధికారితో సంబంధం ఉందని బాధిత భర్త చేసిన ఆరోపణను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది; ఆమె గుర్తించబడకుండా భవనంలోకి ప్రవేశించడానికి సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఎవరు అనేది అస్పష్టంగా ంది. ఢిల్లీలోని ఈ అధికారి ఇంటిని సోదా చేయడానికి అనుమతి కోరాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు.విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా ఆ పిల్లాడు మూడు రోజులు తల్లి దగ్గర ఉండాలనేది కస్టడీ డీల్. దీనిలో భాగంగా మే 22వ తేదీన పిల్లాడిని తీసుకుంది. అదే తాను పిల్లాడిని చివరిసారి చూడటమని కోర్టుకు తెలిపాడు భర్త సైకేత్. భార్య విక్టోరియా బసూ.. జూలై 7 నుంచి పిల్లాడితో సహా కనిపించకుండా పోయిందని సైకేత్ బసూ కోర్టుకు తెలిపారు. -
రహస్య రికార్డింగులు సాక్ష్యాలే
న్యూఢిల్లీ: జీవిత భాగస్వాములతో సంభాషణను రహస్యంగా రికార్డు చేయడం విడాకులతో పాటు అన్నిరకాల వైవాహిక వివాదాల్లోనూ సాక్ష్యాలుగా చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ధర్మాసనం సోమవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. సదరు సంభాషణలకు సాక్ష్యాల చట్టంలోని 122వ సెక్షన్ కింద రక్షణ ఉంటుందని, కనుక వాటిని న్యాయ వివాదాల్లో ఉపయోగించడాన్ని అనుమతించలేమని పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. వాటిని సాక్ష్యాలుగా అనుమతిస్తే వైవాహిక బంధాన్ని, కుటుంబంలో సామరస్యాన్ని దెబ్బతీస్తాయని, భాగస్వామిపై గూఢచర్యానికి దారి తీస్తాయని హైకోర్టు వెలువరించిన అభిప్రాయాలతో ధర్మాసనం విభేదించింది. ‘‘ఇలాంటివి చెల్లుబాటయ్యే వాదనలు కావన్నది మా అభిప్రాయం. భార్యాభర్తలు పరస్పరం తరచూ ఇలా సంభాషణను గుట్టుగా రికార్డు చేయడం వంటి పనులకు పాల్పడుతున్నారంటేనే ఆ బంధం బీటలు వారిందని, వారి మధ్య విశ్వాసం సన్నగిల్లిందని అర్థం. కనుక అలాంటి పరిస్థితుల్లో గోప్యంగా రికార్డు చేసిన భాగస్వామి తాలూకు సంభాషణను సాక్ష్యంగా అంగీకరించడం అసమంజమేమీ కాదు. ఎందుకంటే అది వైవాహిక సమస్యల తాలూకు ఫలితమే తప్ప వాటికి కారణం కాదు’’ అని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. ‘‘122వ సెక్షన్ పేర్కొంటున్న గోప్యత హక్కు భార్యాభర్తల సంభాషణలకు కూడా వర్తిస్తుందన్నది నిజమే. కానీ అది సంపూర్ణమైనది కాదు. ఈ అంశాన్ని ఆ సెక్షన్‌కు ఇచ్చిన మినహాయింపులతో కలిపి చూడాల్సి ఉంటుంది’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఇలాంటి విషయాల్లో గోప్యత హక్కు కంటే కూడా సక్రమ విచారణ హక్కుదే పై చేయి అవుతుంది. వైవాహిక బంధం విచి్ఛన్నమయ్యే స్థితికి చేరినప్పుడు భాగస్వాములకు తమ వాదనను రుజువు చేసే సాక్ష్యాలు సమరి్పంచే హక్కును గోప్యత తదితరాలను ప్రాతిపదికగా చూపి కాలరాయలేం’’ అని స్పష్టం చేసింది. 2017 నాటి ఓ విడాకుల కేసులో భార్యకు తెలియకుండా భర్త జరిపిన ఆమె సంభాషణల రికార్డులను సాక్ష్యంగా అనుమతిస్తూ పంజాబ్‌లోని భటిండా ఫ్యామిలీ కోర్టు ఇచి్చన తీర్పును పునరుద్ధరించింది. -
నిమిష కేసు: చేతులెత్తేసిన కేంద్రం! అంతా మంచి జరగాలంటూ..
కేరళ నర్సు నిమిషా ప్రియా కేసులో కేంద్రం చేతులెత్తేసింది. యెమెన్‌లో ఈ నెల 16వ తేదీన ఆమె మరణ శిక్ష అమలు కానుంది. అయితే కేంద్రం తక్షణ జోక్యం చేసుకుని.. నిమిష శిక్షను తప్పించేలా అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. ఈ కేసులో ఎలా ఆర్డర్ పాస్ చేయాలి, ఎవరు ఫాలో అవుతారని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆరా తీసింది. అయితే తాము (కేంద్రం) చేయగలిగినదంతా చేశామని, యెమెన్‌తో భారత్‌కు సత్సంబంధాలు అంతగా లేవని, అయినా కూడా అక్కడి ప్రాసిక్యూటర్‌కు మరణశిక్షను వాయిదా వేయాలని రాశామని, బ్లడ్‌మనీ చివరి అవకాశమని, ఆ చర్చలంతా ప్రైవేట్ వ్యవహారమని, అందులో ప్రభుత్వ జోక్యం ఉండబోదని, అంతా మంచి జరగాలని ప్రార్థిస్తున్నామని అటార్నీ జనరల్ వెంకటరమణి ధర్మాసనానికి స్పష్టం చేశారు. దీంతో జస్టిస్ సందీప్ మెహతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ప్రాణాలు పోతే గనుక చాలా బాధాకరమని అన్నారాయన. అయితే అనధికారిక మార్గాలు ఏమైనా ఉన్నాయో పరిశీలన చేసి వెంటనే సంప్రదించాలని ఆయన ఏజీకి సూచిస్తూ.. ఈ పిటిషన్లో విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. యెమెన్‌లో ఓ వ్యక్తిని చంపిన కేసులో నిమిషా ప్రియాకు 2017లో మరణశిక్ష పడింది. యెమెన్‌లో తాను తీవ్ర చిత్రహింసలకు గురయ్యానని, తన వ్యాపార భాగస్వామి(బాధితుడి) తన పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు అతనికి మత్తు మందు ఇచ్చానని నిమిష చెబుతోంది. అయితే మత్తుమందు డోస్ ఎక్కువ కావడంతో అతను మరణించాడని తేలింది. ఈ కేసులో చివరగా మిగిలిన ఆశ బ్లడ్‌మనీ ఒక్కటే. షరీయత్ చట్టం ప్రకారం ‘బ్లడ్ మనీ’ చెల్లిస్తే క్షమాపణ దక్కే అవకాశం ఉంది. అయితే.. బాధితుడి కుటుంబానికి $1 మిలియన్ (రూ. 8.3 కోట్లు) చెల్లించేందుకు నిమిష కుటుంబం అంగీకరించింది. కానీ అవతలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరణశిక్ష అమలుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన తరుణంలో నిమిషాకు అంతర్జాతీయ మద్దతు కోసం ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
తిరుమల లడ్డూ కేసు: సిట్ దర్యాప్తులో రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలి
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదం కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ బెంచ్ ఎదుట లిస్టు చేయాలని జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ అంజారియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ వ్యవహారంలో సిట్ రాజకీయ ప్రేరేపిత దర్యాప్తుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని నియంత్రించేందుకు.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే నేరుగా నిష్పక్షపాత, పారదర్శక విచారణ జరపాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం(జులై 14) ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. సిట్ పని విధానంపై స్టేటస్ కో కొనసాగించాలి. సిట్ సేకరించిన రికార్డులన్నీ పరిశీలించాలి. సిట్‌కు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ నిర్దేశించాలి. సిట్ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి. దర్యాప్తు సమయంలో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ తోపాటు అడ్వకేటును అనుమతించాలి. అన్నింటికంటే ముఖ్యంగా.. దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలి అని కోర్టును కోరారు.పిటిషన్లో ఏముందంటే.. తిరుమల లడ్డు కేసులో సిట్ రాజకీయ కక్షతో, దురుద్దేశంతో దర్యాప్తు జరుపుతోంది. కదురు చిన్నప్పన్న నుంచి బలవంతంగా వీడియో స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ కు అనుగుణంగా స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. నన్ను, మాజీ ఈవోను ఈ కేసులో ఇరికించి.. అరెస్టు చేసే విధంగా బలవంతంగా సాక్షాలను చెప్పిస్తున్నారు. సిట్ పారదర్శకంగా పనిచేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఈ కేసులో కదురు చిన్నప్పన్నను భయపెట్టి బలవంతపు స్టేట్మెంట్లు తీసుకుంటున్నది. ఆయన ఆస్తులను జప్తు చేస్తామని భయపెడుతోంది. రాజకీయ జోక్యంతో సిట్ దర్యాప్తు గాడి తప్పింది. రాజకీయాల కతీతంగా దర్యాప్తు జరపాల్సిన సిట్ వాటికి తిలోదకాలు ఇచ్చిందిరాష్ట్ర ప్రభుత్వ అధికారుల మితిమీరిన జోక్యంతో సిట్ దర్యాప్తుపై ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. సిట్ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయడం లేదు. సిట్ కాంపోజిషన్ లో బ్యాలెన్స్ తప్పింది. సిట్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుండడంతో సెలెక్టివ్ గా విచారణ చేసి, అనేక అంశాలను తొక్కి పెడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సిట్ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో నేరుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే నిష్పక్షపాత, పారదర్శక విచారణ జరపాలి. -
ఒకే రాజ్యం.. ఒకే రాజ్యాంగం..
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో రాష్ట్రంలో ఒకటి.. దేశంలో మరొకటి ద్వంద్వ పౌరసత్వం ఉంటుందని.. మన దేశం (రాజ్యం)లో అది సాధ్యం కాదని.. ఒకే దేశం–ఒకే రాజ్యాంగం మనదని బాబా సాహెబ్ అంబేడ్కర్ వ్యాఖ్యానించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేర్కొన్నారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఎలా పనిచేయాలో ఆయన రోడ్‌మ్యాప్ వేశారన్నారు. 75 ఏళ్లుగా ఇలా చెక్కుచెదరకుండా ఉన్నామంటే అందుకు దృఢమైన రాజ్యాంగమే కారణమని చెప్పారు. భవిష్యత్ అవసరాల మేరకు రాజ్యాంగ సవరణ అనివార్యమంటూనే ప్రాథమిక హక్కుల రక్షణ బాధ్యతను సుప్రీంకోర్టుకు అప్పగించారని వెల్లడించారు. భారత రాజ్యాంగం: అంబేడ్కర్ పాత్ర అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ రూపకల్పన సమయంలో అంబేడ్కర్ ఆలోచనా సరళిని లోతుగా విశ్లేషిచారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేరాలని.. రాజ్యాంగ విలువలు, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశంలో అంతర్గత సంఘర్షణలు ఎన్ని వచ్చినా మన రాజ్యాంగం వల్లే బలంగా తట్టుకొని నిలబడగలిగామని చెప్పారు. నేరుగా ‘సుప్రీం’ను ఆశ్రయించే వెసులుబాటు.. ‘భవిష్యత్తు అవసరాల రీత్యా రాజ్యాంగ సవరణకు అంబేడ్కర్ అనుమతించారు. ఆ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది. అతి సమైక్య, అతి కేంద్రీకృత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ ఆత్మలా, రక్షణ కవచంలా ఆరి్టకల్ 32 పౌర హక్కులకు భంగం కలగకుండా కాపాడుతోంది. పరిష్కార మార్గాలు లేని హక్కులున్నా ఉపయోగం లేదని అంబేడ్కర్ చెప్పిన విషయాన్ని మరిచిపోవద్దు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే వెసులుబాటును రాజ్యాంగం కల్పించింది. అమెరికాలో ద్వంద పౌరసత్వం అమల్లో ఉన్నా.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంతోపాటు సమాఖ్య పౌరసత్వం ఉంది. అందుకు భిన్నంగా రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేలా బలమైన ప్రజాస్వామ్య రాజ్యంగా పటిష్టపరిచే ఒకే దేశం ఒకే రాజ్యాంగాన్ని అంబేడ్కర్ అమల్లోకి తీసుకురావడం గరి్వంచదగిన విషయం. 1973లో ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులపై ఘర్షణ వచ్చింది. దీనిపై 13 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు కలిసే పనిచేస్తాయని తేల్చిచెప్పింది. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు కూడా రోడ్‌మ్యాప్ నిర్మాణంలో అంబేడ్కర్ పాత్ర ఎనలేనిది’అని సీజేఐ జస్టిస్ గవాయ్ వివరించారు. త్వరలోనే మళ్లీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఎక్కువ సమయం కేటాయిస్తానని ప్రసంగాన్ని ముగించారు. అంబేడ్కర్‌కు హైకోర్టు సీజేగా ఆఫర్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ ప్రసంగిస్తూ ‘హైదరాబాద్ నా సొంత నగరం. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా. నా సొంత నగరంలో నా వర్సిటీకి సీజీఐ రావడం, ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం హర్షణీయం. అంబేడ్కర్‌కు హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. సామాజిక న్యాయ పోరాటంలో భాగంగా అంబేడ్కర్ భాగ్యనగరాన్ని సందర్శించారు. నిజాం నవాబ్ ఆయన్ను కలసి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండాలని కోరారు. అయితే ఆ ఆఫర్‌ను అంబేడ్కర్ సున్నితంగా తిరస్కరించారు. మన దేశ రాజ్యాంగం ఎంతో గొప్పది.. ఔన్యతమైనది’అని వెల్లడించారు. అంబేడ్కర్‌తో హైదరాబాద్‌కు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేశారు. ఇక్కడ జరిగిన సామాజిక ఉద్యమాలకు ఆయన మద్దతు ప్రకటించారన్నారు. అంబేడ్కర్ తన ఆత్మకథలో హైదరాబాద్ ఉద్యమాలు, సామాజిక న్యాయం సహా అనేక విషయాలను పొందుపరిచారని వివరించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ ప్రసంగిస్తూ 1947 అక్టోబర్‌లో రాజ్యాంగ ముసాయిదా సిద్ధమైందని.. రెండున్నరేళ్ల చర్చలు, భేటీల తర్వాత 1949 నవంబర్‌లో తుదిరూపు వచ్చిందన్నారు. బీఆర్ గవాయ్ తండ్రి అంబేడ్కర్‌కు సన్నిహితుడు.. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి ప్రసంగిస్తూ 1953 జనవరి 12న అంబేడ్కర్‌కు ఓయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందన్నారు. ఇది ఓ భారతీయ విశ్వవిద్యాలయం ఆయనకు ప్రదానం చేసిన తొలి డాక్టరేట్ అని చెప్పారు. బీఆర్ గవాయ్ తండ్రి ఆర్ఎస్ గవాయ్ అంబేడ్కర్‌కు అత్యంత సన్నిహితుడని.. దాదా సాహెబ్ గవాయ్‌గా ఆయన సుపరిచితుడన్నారు. విద్యావేత్త, రాజకీయ నేత, సామాజిక కార్యకర్తగానే కాకుండా పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారన్నారు. ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం మాట్లాడుతూ... 108 ఏళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రగతిని నివేదించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, పీపీ పల్లె నాగేశ్వర్రావు, రిజిస్ట్రార్ జనరల్ (ఎఫ్ఏసీ) గోవర్దన్‌రెడ్డి, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ఆచార్య జితేందర్ కుమార్ నాయక్, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ పోస్టల్ కవర్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్ విడుదల చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. -
ఆ అధికారం మీకెక్కడిది.. ఈసీ తీరుపై సుప్రీం ఆగ్రహం
-
ఎన్నికల ముందే ‘సవరణ’ ఎందుకు?
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను యథాతథంగా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆ ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని వెల్లడించింది. ప్రత్యేక సవరణను సవాలు చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం తరఫున సీనియర్ లాయర్ రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. బిహార్‌లో 60 శాతం ఓటర్ల తనిఖీ పూర్తయ్యిందని చెప్పారు. ఓటర్లను సంప్రదించకుండా వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల సంఘం ఉద్దేశం, నిజాయతీని తాము శంకించడం లేదని, ప్రత్యేక సవరణ చేపట్టకుండా ఎన్నికల సంఘాన్ని అడ్డుకోవాలని భావించడం లేదని తెలిపింది. ప్రత్యేక సవరణతో సమస్య లేదని, చేపట్టిన సమయమే అసలు సమస్య అని పేర్కొంది. తీరా అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరించాల్సిన అవసరం ఏమిటని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణను ఆమోదిస్తున్నామని.. కానీ, ఎన్నికల ముందే ఈ ప్రక్రియ ఎందుకు మొదలుపెట్టారో చెప్పాలని పేర్కొంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్న పిటిషనర్ల వాదనను తిరస్కరించింది. ఎన్నికలతో సంబంధం లేకుండా చేపట్టలేమా? ఓటర్ల జాబితా సవరణ అనేది చాలా ముఖ్యమైన విషయమని చెప్పడంలో సందేహం లేదని, ఇది ప్రజాస్వామ్య మూలాలు, ఓటుకు ఉన్న శక్తికి సంబంధించిన అంశమని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషనర్లు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని సూచించింది. ‘‘నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన బిహార్‌లో ఈ సవరణ ప్రక్రియ ఇప్పుడే ఎందుకు ప్రారంభించారు? ఎన్నికలతో సంబంధం లేకుండా ఎందుకు చేపట్టకూడదు? ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందే ప్రారంభించడం వెనుక ఔచిత్యం ఏమిటి?’’ అని ప్రశ్నించింది. ప్రత్యేక సవరణపై మధ్యంతర స్టే విధించాలని పిటిషనర్లు కోరలేదని వెల్లడించింది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నెల 21వ తేదీ నాటికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. పౌరసత్వం నిర్ధారణ మీ పనికాదు ప్రత్యేక సవరణలో ఓటర్ల అర్హతను నిర్ధారించడానికి ఆధార్ కార్డును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 326 ప్రకారం ప్రతి ఓటర్ తప్పనిసరిగా భారతీయుడై ఉండాలని, ఆధార్ కార్డు అనేది ప్రజల పౌరసత్వానికి ధ్రువీకరణ కాదని రాజేశ్ ద్వివేది బదులిచ్చారు. ఓటర్ల పౌరసత్వాన్ని ధ్రువీకరించడం ఎన్నికల సంఘం బాధ్యత కాదని, అది కేంద్ర హోంశాఖ పరిధిలోని అంశమని ధర్మాసనం స్పష్టంచేసింది. నిజంగా పౌరసత్వాన్ని తేల్చాలని అనుకుంటే ఆ ప్రక్రియను గతంలోనే ప్రారంభిస్తే బాగుండేదని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని పేర్కొంది. అందుకే అర్హులైన ఓటర్లను నిర్ధారించడానికి ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డుతోపాటు ఆధార్ కార్డును సైతం పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది. -
పిల్లలది ప్రత్యేక పరిస్థితి.. అందుకే ఇల్లు మారడం కష్టమవుతోంది; మాజీ సీజేఐ
న్యూఢిల్లీ: ఒక్క ఏడాది వెనక్కి వెళితే.. డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు సీజేఐ స్థానంలో కచ్చితమైన తీర్పులతో ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. ఇప్పుడు అదే చంద్రచూడ్ మాజీ సీజేఐ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అధికారిక నివాసం విషయమై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ రాయడంతో ఆయన మరోసారి వార్తల్లోకి వచ్చారు.జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ అనంతరం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండటాన్ని సర్వోన్నత న్యాయస్థానం లేఖలో ప్రస్తావించింది. అయితే దీనిపై ఇప్పటికే స్పందించిన చంద్రచూడ్.. మరోసారి తాను ఆ నివాసాన్ని ఇప్పటివరకూ ఎందుకు ఖాళీ చేయాలేకపోయాననే అంశంపై ఎన్డీటీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో కాస్త వివరంగా షేర్ చేసుకున్నారు.పిల్లల్ని ప్రత్యే పరిస్థితుల్లో పెంచుతున్నాం..‘మా పిల్లలు ప్రియాంక, మహిలను ప్రత్యేక పరిస్థితుల్లో పెంచాల్సి వస్తుంది. 24 గంటలు వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. నేను, నా భార్య కల్పనా దాస్ ఇద్దరం కలిసి పిల్లల ఆలనా పాలన చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ప్రత్యేకమైన డిజార్డర్‌తో బాదపడుతున్నారు. పిల్లల ఇద్దరికీ అరుదైన డిజార్డర్ కలిగి ఉన్నారు. నెమలైన్ మయోపతి(శరీరంలోని కండరాల సమస్యతో బాధపడుతున్నారు). దీనిపై భారత్‌తో పాటు విదేశాల్లో పరిశోధనలు జరుగుతున్నప్పటికీ ప్రస్తుతానికి ట్రీట్మెంట్ ఏమీ కూడా ప్రపంచంలో లేదు. ఇది మోటార్ స్కిల్స్ డిజార్డర్. దీనికి డెవలప్మెంటల్ కో ఆర్డినేషన్ డిజార్డర్(డీసీడీ) లేదా డైస్ప్రాక్సియా అని కూడా పిలుస్తారు. అందుకే ఖాళీ చేయలేకపోతున్నాంపిల్లలకు ఈ డిజార్డర్ నయం చేయడానికి ఎంతోమంది స్పెషలిస్టులతో సంప్రదిస్తూనే ఉంటాం. వారికి మంచి ప్రపంచాన్ని ఇవ్వడానికి కృషి చేస్తున్నాం. వారిని వారు పనులు చేసుకునేలా, వారి కాళ్ల మీద వారు నిలబడలా చేయడమే మా ముందున్న కర్తవ్యం. ప్రపంచం వారి శ్రేయస్సు కోసం తిరుగుతోంది’ అని చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలొనే తాము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇచ్చిన నివాసాన్ని ఖాళీ చేయలేకపోయామన్నారుప్రస్తుతం ప్రభుత్వం తమకు తాత్కాలికంగా అద్దెకు ఇచ్చిన బంగ్లాకు మరమ్మత్తులు జరుగుతున్నాయన్నారు. పిల్లల అవసరాలకు తగ్గట్టు దాన్ని డిజైన్ చేయించుకుంటున్నామన్నారు. ఈ క్రమంలోనే ఆలస్యం అవుతుందన్నారు. ప్రస్తుతం ఖాళీ చేసే పనిలోనే ఉన్నామని, అక్కడ ఇంకా పనులు జరుగుతున్నందున ఖాళీ చేయడం వీలు కాలేదన్నారు. -
బీహార్ ఓటర్ల జాబితా వివాదం.. అత్యవసర విచారణకు ‘సుప్రీం’ అంగీకారం
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్ ఓటరు జాబితా వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. సోమవారం వీటిని పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం ఈనెల 10న విచారణ చేపడతామని తెలిపింది. ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో.. ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డును పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. జులై 25 కల్లా అధీకృత డాక్యుమెంట్లు చూపించకుంటే... ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని పిటిషన్లో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. అయితే ఈ రివిజన్ కేవలం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకేనని, బీజేపీని వ్యతిరేకిస్తున్న వర్గాల ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టారని ఆరోపిస్తూ.. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో స్పెషల్ రివిజన్ ఆపివేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. -
ఆర్డర్.. ఆర్డర్ 'రిమాండ్లకీ రూల్సున్నాయ్'!
సాక్షి, అమరావతి: ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులకు ఆయా కోర్టుల మేజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. యాంత్రిక రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రతి రోజూ పిటిషన్లు దాఖలవుతుండడంతో మేజిస్ట్రేస్టేట్‌లకు పరిపాలనాపరంగా మార్గదర్శకాలను నిర్దేశించింది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే నేరాల్లో ఎలాపడితే అలా రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదని.. అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశాలను తు.చ. తప్పక అనుసరించాలని తేల్చిచెప్పింది. అలాగే, ఇమ్రాన్‌ప్రతాప్ గాది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ⇒ రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని.. పోలీసులు చట్టప్రకారం నడుచుకున్నారా? లేదా..? చూడాలని, చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా రిమాండ్ విధిస్తుండడంతో అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోందని పేర్కొంది. ⇒ ప్రసంగాలు, రచనలు, కళల వ్యక్తీకరణలకు సంబంధించి (3–7 ఏళ్లు శిక్షపడే నేరాలు) పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేముందు డీఎస్పీ ఆమోదంతో.. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 173(3) కింద ప్రాథమిక విచారణ జరపాలని, 14 రోజుల్లో దానిని ముగించాలని ఇమ్రాన్‌ప్రతాప్ గాది కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నదని... దీనిప్రకారం రాష్ట్రంలోని మేజిస్ట్రేస్టేట్‌లందరూ రిమాండ్ విధించే ముందు ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు అధికారి... అర్నేష్‌కుమార్, ఇమ్రాన్‌ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను పాటించారా? లేదా? అన్నది చూడాలని హైకోర్టు తేల్చిచెప్పింది. ⇒ నిందితులు పదేపదే నేరాలు చేస్తున్నారా? రిమాండ్ ఇవ్వకుంటే సాక్షులను ప్రభావితం చేసి, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. అందుకని పోలీసు కస్టోడియల్ విచారణ అవసరమని మేజిస్ట్రేస్టేట్లు సంతృప్తి చెందాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను మేజిస్ట్రేస్టేట్‌లందరూ పాటించి తీరాల్సిందేనని ఆదేశించింది. ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలతో పాటు శాఖాపరమైన విచారణతో పాటు కోర్టు ధిక్కార చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని మేజిస్ట్రేస్టేట్‌లకు హెచ్చరించింది. ఈ మేరకు హైకోర్టు శనివారం సర్క్యులర్ జారీ చేసింది.చంద్రబాబు సర్కారుకు ఝలక్..! పోలీసు రాజ్యానికి చెక్!ఏడాది కాలంగా తీవ్ర నిర్బంధంతో... తాలిబాన్ల మాదిరిగా పాలన సాగిస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి హైకోర్టు తాజా మార్గదర్శకాలు చెంపపెట్టులాంటివే. రెడ్‌బుక్ రాజ్యాంగంతో.. ఎలాంటి నిబంధనలు పాటించకుండా, లెక్కలేనితనంతో చెలరేగుతున్న పోలీసుల తీరుకు అడ్డుకట్ట పడనుంది. కక్షసాధింపు చర్యలకు దిగుతూ ఎడాపెడా అరెస్టులకు పాల్పడుతున్న ఖాకీలకు చెంపపెట్టు అని పరిశీలకులు పేర్కొంటున్నారు. హైకోర్టు తాజా మార్గదర్శకాలతో ఇకపై అడ్డగోలు అరెస్టులు, నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్లు కుదరదని వివరిస్తున్నారు.⇒ కూటమి సర్కారు వచ్చాక తమ పనితీరును, వారి నేతలను విమర్శిస్తూ సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు పెట్టినవారిపై.. మరీ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులపై అడ్డగోలుగా కేసు నమోదు చేస్తోంది. వ్యంగ్య ప్రదర్శన ఇచ్చినా సహించలేక కేసులు పెట్టింది. సోషల్‌మీడియా పోస్టులను అత్యంత కఠినమైన వ్యవస్థీకృత నేరం పరిధిలోకి తీసుకొచ్చింది. పెద్దసంఖ్యలో అరెస్ట్‌లు చేసి జైలుకు కూడా పంపింది. బెయిల్ రాకుండా చేసేందుకు ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అయితే, హైకోర్టు పలు సందర్భాల్లో సోషల్ మీడియా పోస్టులకు వ్యవస్థీకృత నేరం కింద ఎలా కేసు పెడతారంటూ నిలదీసింది. అవి ఆ నేరం కిందకు రావని సైతం తెలిపింది. అయినా కూడా పోలీసులు వ్యవస్థీకృత నేరం కింద కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. ⇒ ఇక సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ల ఎదుట ప్రవేశపెట్టగా చాలామంది యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో కూడా సహేతుక కారణాలను వెల్లడించకుండానే రిమాండ్ ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో పలువురు నిందితులు తమ రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. మొన్నటిదాక కూడా రిమాండ్ ఉత్తర్వులపై ప్రతి రోజూ పిటిషన్లు దాఖలవుతూనే వచ్చాయి.హైకోర్టు ఎన్ని వ్యాఖ్యలు చేసినా పట్టించుకోని మేజిస్ట్రేట్లుఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టులోని పలువురు న్యాయమూర్తులు.. మేజిస్ట్రేట్ల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. యాంత్రికంగా రిమాండ్ విధించడం సరికాదని హితవు పలికారు. కొన్ని సందర్భాల్లో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించి తీరాలని చెప్పినా ప్రయోజనం లేకపోయింది. అయినా, యాంత్రికంగా, సహేతుక కారణాలను తెలియజేయకుండా రిమాండ్లు విధించడం కొనసాగిస్తూ వచ్చారు. దీంతో హైకోర్టు చివరకు మేజిస్ట్రేట్లకు పరిపాలనా పరమైన ఉత్తర్వులు ఇవ్వక తప్పలేదు. ఈ క్రమంలో అర్నేష్‌కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి తీరాల్సిందేనని, లేదంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని మేజిస్ట్రేట్లకు తేల్చి చెప్పింది.ఇదీ అర్నేష్‌కుమార్ కేసు...బిహార్ కు చెందిన అర్నేష్ కుమార్ కట్నం కోసం వేధిస్తున్నట్లు అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ సెక్షన్ 498ఎ, వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేశారు. అర్నేష్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం అరెస్టుల విషయంలో కీలక మార్గదర్శకాలు జారీ చేసి వాటిని పాటించాల్సిందేనని కింది కోర్టులు, పోలీసులను ఆదేశించింది. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యమైన తీర్పు ఇది. అందులోని మార్గదర్శకాలు..1. సాధారణంగా ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష విధించే నేరాల్లో నిందితులను అరెస్ట్ చేయకూడదు. ఒకవేళ అరెస్టు చేయాలనుకుంటే.. ముందుగా నిందితుడికి వారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలి. అలాగే వారి హక్కుల గురించి వివరించాలి.2. అరెస్టు చేయడానికి కారణాలను తప్పకుండా రికార్డు చేయాలి.3. పోలీసులు కేసు దర్యాప్తు చేసేటప్పుడు ఈ మార్గదర్శకాలను పాటించాలి.4. న్యాయమూర్తులు కూడా ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని, అవసరమైతే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి. -
సుప్రీంలో ఓబీసీలకు రిజర్వేషన్లు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉద్యోగుల నియామకాలు, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటికే రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. సుప్రీంకోర్టు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర వెనుకబడిన తరగతులకు(ఓబీసీ) సైతం రిజర్వేషన్లు కల్పించింది. సుప్రీంకోర్టులో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అలాగే దివ్యాంగులు, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన వారికి సైతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఇందుకోసం సుప్రీంకోర్టు ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్(కండీషన్స్ ఆఫ్ సరీ్వస్ అండ్ కాండక్ట్) రూల్స్‌లో సవరణ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ చేశారు. రిజర్వేషన్లు కల్పించే విషయలో రాజ్యాంగంలోని ఆరి్టకల్ 146 క్లాజ్(2) ద్వారా సంక్రమించిన అధికారాలను ఆయన ఉపయోగించుకున్నారు. -
హైకోర్టు జడ్జిగా తుహిన్ కుమార్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి పదవికి ప్రముఖ న్యాయవాది గేదెల తుహిన్ కుమార్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని న్యాయమూర్తుల కొలీజియం ఈ మేరకు తీర్మానించింది. తుహిన్ కుమార్ పేరుకు కేంద్రం ఆమోదం తెలిపాక అది ప్రధానమంత్రి కార్యాలయానికి, అక్కడి నుంచి రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తరువాత తుహిన్ కుమార్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం అదనపు న్యాయమూర్తులతో కలుపుకుని మొత్తం 28 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తుహిన్ నియామకంతో ఆ సంఖ్య 29కి చేరుకుంటుంది. హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37. తుహిన్ నియామకం పూర్తయితే 8 ఖాళీలు ఉంటాయి. త్వరలో ఇద్దరు ముగ్గురి పేర్లను హైకోర్టు కొలీజియం న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసే అవకాశం ఉంది. హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు తుహిన్ పేరును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం గత ఏడాది సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు కొలీజియం సిఫారసుకు ఆమోదముద్ర వేసింది. తుహిన్ నేపథ్యం ఇది.. తుహిన్ కుమార్.. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామానికి చెందినవారు. తల్లిదండ్రులు సరోజిని నాయుడు, కృష్ణమూర్తి నాయుడు. తుహిన్ కుమార్ పాఠశాల విద్యాభ్యాసం విశాఖపట్నంలో జరిగింది. కృష్ణా కాలేజీలో ఇంటర్మీడియెట్, విశాఖపట్నం ఎన్‌బీఎం న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1994లో హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2000–2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా పనిచేశారు. 2010–14 మధ్య కాలంలో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ తరఫున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2016–17లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. -
కొనసాగుతున్న జడ్జీల ఎంపిక ప్రక్రియ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న జడ్జీ పోస్ట్‌లను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం తన ఎంపిక విధానాన్ని మరింతగా కఠినతరం చేసింది. అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి రెండు రోజుల్లో 54 మంది అభ్యర్థులతో ముఖాముఖి సమావేశమై వారి సమగ్ర వివరాలను కొలీజియం పరిశీలించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన కోలీజియం జూలై 1, 2 తేదీల్లో అభ్యర్థులతో విస్తృతంగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొదటి రోజున 20 మందితో, రెండో రోజున 34 మందితో సమావేశమైంది. అభ్యర్థుల పనితీరు, బయోడేటా, అనుభవం వంటి అంశాలపై అరగంటపాటు ప్రశ్నలు సంధిస్తూ క్షుణ్ణంగా పరిశీలించింది. ఇప్పటివరకు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) రిపోర్టులు, అలాగే సంబంధిత హైకోర్టులకు చెందిన సుప్రీంకోర్టు జడ్జిల అభిప్రాయాలపైనే ఆధారపడుతూ నియామకాలు జరిగేవి. కొలీజియం ఇప్పటికే చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంతో సిఫారసుల ఆమోదంలో ఆలస్యాలు రావడం వల్ల సమస్యలు ఎదుర్కొంటోంది. కొంతమంది అభ్యర్థులు వీలైనంతకాలం ఎదురు చూడలేక తమ అభ్యర్థిత్వం వెనక్కి తీసుకోవడం కూడా జరిగిపోయింది. అయితే ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో లభించిన అప్రకటిత నగదు కేసు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు వంటి పరిణామాల నేపథ్యంలో కొలీజియం ఈసారి తన పరిశీలనను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా, జిల్లా న్యాయవ్యవస్థ నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఒక రోజు, బార్ అభ్యర్థుల కోసం మరొక రోజు కేటాయించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 371 ఖాళీలుండగా ఇందులో తెలంగాణ హైకోర్టులో 16, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 8 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
కూటమి ప్రభుత్వానికి సుప్రీం గట్టి షాక్.. రెండేళ్ల తర్వాత కేసా?
ఈ వ్యవహారం మొత్తం సివిల్ వివాదం. సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మలుస్తారా? ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత కేసు నమోదు చేస్తారా? ఇదేమి తీరు? సరైన పద్ధతి కాదు. – రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ సుప్రీం విస్మయం అక్రమ కేసులమీద అక్రమ కేసులతో ప్రతిపక్ష నేతలను జైలు పాల్జేయడమే లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పెట్టిన అక్రమ కేసుపై కూటమి సర్కారును నిలదీసింది. తప్పుడు కేసులతో 140 రోజులు జైల్లో ఉంచిన వంశీని బయటకు రాకుండా చేసిన ప్రయత్నాలకు సర్వోన్నత న్యాయస్థానం అడ్డుకట్ట వేసింది. – సాక్షి, అమరావతి⇒ ఓ సివిల్ వివాదంలో ఫిర్యాదుదారు వెనుకుండి వంశీ బెయిల్ రద్దు కోసం పిటిషన్ దాఖలు చేయించిన రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి చీవాట్లు పెట్టింది. వంశీ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.⇒ గన్నవరం మైనింగ్ కేసులో వంశీకి హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో బెయిల్ రద్దు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఇప్పటికే వంశీని అనేక కేసుల్లో అరెస్ట్ చేశారని ప్రభుత్వానికి గుర్తుచేసింది. గన్నవరం మైనింగ్ వ్యవహారంలో మైనింగ్ వాల్యుయేషన్ నివేదికను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుందరేష్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.2022–23లో ఘటన.. 2025లో కేసా?వల్లభనేని వంశీ, తదితరులు తమ ఆస్తి వివాదంలో జోక్యం చేసుకుంటున్నారంటూ సుంకర సీతామహాలక్ష్మి 2025లో గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. అయితే, ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మే 9న తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సీతామహాలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు విన్న ధర్మాసనం వంశీకి బెయిల్ ఇస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. 2022–23లో ఘటన జరిగితే 2025లో కేసు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం మొత్తం సివిల్ వివాదమని, దీనిని క్రిమినల్ కేసుగా ఎలా మారుస్తారంటూ పోలీసుల తీరును ఎండగట్టింది. వంశీ బెయిల్‌ను రద్దు చేయాలన్న సీతామహాలక్ష్మి అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.⇒ గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు, గన్నవరంతోపాటు విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు మైనింగ్ జరిపి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారి మే 15న ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా గన్నవరం పోలీసులు వంశీ, మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి పలు షరతులతో వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మే 29న ఉత్తర్వులిచ్చింది. వీటిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ వేసింది. దీనిపై బుధవారం సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. హైకోర్టు తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు. అక్రమ మైనింగ్‌తో రూ.195 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని తెలిపారు. 700 పేజీల నివేదిక ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ఈ దశలో బెయిల్ రద్దు విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఆ నివేదికను సీల్డ్ కవర్లో తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
పార్లమెంట్ కాదు.. రాజ్యాంగమే సర్వోన్నతం
మన దేశంలో కొంతమంది పార్లమెంటే సుప్రీం అని అంటారు. కానీ, నావరకైతే రాజ్యాంగమే దేశానికి సర్వోన్నతం అని భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్(CJI BR Gavai) అన్నారు. పార్లమెంట్‌కు రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం మాత్రమే ఉందన్న ఆయన.. రాజ్యాంగపు మౌలిక నిర్మాణాన్ని మార్చే హక్కు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తన స్వస్థలం అమరావతి(మహారాష్ట్ర)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత మంది దేశానికి పార్లమెంటే అత్యున్నతమైందని భావిస్తారు. కానీ, నా వరకైతే న్యాయ(judiciary), శాసన(legislature), కార్యనిర్వాహక (executive) వ్యవస్థల్లో ఏదీ గొప్పది కాదు. రాజ్యాంగమే సర్వోన్నతం. ఎందుకంటే..పార్లమెంట్‌కు రాజ్యాంగంలో సవరణలు చేసే హక్కు మాత్రమే ఉంది. కానీ, మౌలిక నిర్మాణాన్ని మార్చే హక్కు మాత్రం లేదు’’ అని అన్నారాయన.జడ్జి ఎలా ఉండాలంటే..ఒక న్యాయమూర్తి కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇవ్వడం వల్ల స్వతంత్రుడు అవ్వలేడు. తాము కేవలం అధికారం ఉన్నవాళ్లం అని మాత్రమే కాకుండా, పౌర హక్కులు, రాజ్యాంగ విలువలను సంరక్షించాల్సిన బాధ్యతగల వాళ్లమని న్యాయమూర్తులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రజలు తమ తీర్పుల గురించి ఏమనుకుంటారో? ఎలా స్పందిస్తారో? అనే విషయాలపై ప్రభావితం కాకూడదు. స్వతంత్రంగా ఆలోచించాలి. ప్రజలు ఏమంటారన్నది నిర్ణయ ప్రక్రియలో భాగం కావాల్సిన అవసరం లేదు.బుల్డోజర్ జస్టిస్ తీర్పు గురించి..నా పని గురించి నా తీర్పులతోనే మాట్లాడుకునేలా చేస్తాను. రాజ్యాంగంలో స్థిరపరిచిన మూల హక్కుల పట్ల గౌరవంగా నిలబడతా. ఈ సందర్భంగా.. బుల్డోజర్ జస్టిస్ తీర్పును(కిందటి ఏడాది నవంబర్ 13న ఇచ్చిన తీర్పును) ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజలకు ఆశ్రయం (నివాసం) హక్కు అత్యున్నతమైనది అని పేర్కొన్నారాయన.భారత సుప్రీంకోర్టు బుల్డోజర్ జస్టిస్‌పై 2024 నవంబర్ 13న కీలక తీర్పు వెల్లడించింది. నేరారోపణలు ఉన్న వ్యక్తుల ఇళ్లను విచారణ లేకుండానే కూల్చడం చట్ట విరుద్ధం అని జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ స్పష్టం చేసిందిఆర్కిటెక్ట్ కావాలనుకున్నా..అలాగే.. తన బాల్యంలో జరిగిన సంఘటనలను ఆయన గుర్తుచేసుకున్నారు. తాను నిజానికి ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నప్పటికీ, తన తండ్రి మాత్రం న్యాయవాదిగా అవ్వాలని ఆకాంక్షించారని గవాయ్ చెప్పారు. నిజానికి నా తండ్రికి కూడా న్యాయవాది అవ్వాలన్న ఆశ ఉండేది. కానీ ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని అరెస్టు కావడంతో అది సాధ్యపడలేదు’’ అని తెలిపారాయన. గవాయ్ తండ్రి సూర్యభాన్ గవాయ్ అంబేద్కర్‌వాదిగా రాజకీయాల్లో రాణించారు. బిహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు కూడా.రాజ్యాంగంపై బీఆర్ గవాయ్ చేసిన తాజా వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ప్రాముఖ్యతను, పార్లమెంట్ సహా అన్ని వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఒంటరి తల్లుల సంతానానికి ఓబీసీ సర్టిఫికెట్
న్యూఢిల్లీ: ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ(ఇతర వెనుకబడిన కులాల)సర్టిఫికెట్ల జారీకి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. తద్వారా తండ్రి వైపు నుంచి ధ్రువీకరణ పత్రాల అవ సరం లేకుండానే వీటిని మంజూరు చేసేందుకు అవ కాశం ఏర్పడనుంది. ‘ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ జారీకి సంబంధించిన చాలా ముఖ్యమైన అంశమిది. ఒంటరి తల్లి ఓబీసీకి చెందిన వారైతే ఆమె కుల ధ్రువీకరణ ఆధారంగా ఆమె పిల్లలకూ ఓబీసీ సర్టిఫికెట్ జారీ చేయాలని పిటిషనర్ కోరుతు న్నారు. ప్రస్తుతమున్న మార్గదర్శకాల ప్రకా రం తండ్రి, లేదా రక్త సంబంధీకులు ఓబీసీకి చెందిన వారైతేనే ఆ పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ అందజేస్తున్నా రు. దీని వల్ల ఒంటరి తల్లులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు’అని సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. ‘ఈ అంశం చాలా ముఖ్యమైంది. కొన్ని అంశాలను పరిష్కరించిన తర్వాత మార్గదర్శకాలను జారీ చేస్తాం’అని జస్టిస్ విశ్వనాథన్ వాదనల సందర్భంగా పేర్కొన్నారు. ‘విడాకులు తీసుకున్న ఒక మహిళ పిల్లల ఓబీసీ కులధ్రువీకరణ పత్రం కోసం మాజీ భర్త వద్దకు ఎలా వెళ్లగలదు?’అని ఆయన ప్రశ్నించారు. ఈ పిటిషన్‌పై ఈ ఏడాది ఫ్రిబవరిలో విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వాదనలు వినిపించారు. 2012 నాటి రమేశ్‌భాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు. ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను వెలువ రించాలని విన్నవించారు. ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను జూలై 22వ తేదీకి వాయిదా వేసింది. -
బుగ్గమఠం భూములపై ‘సుప్రీం’ స్టేటస్ కో ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: బుగ్గమఠం భూములపై సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోసారి.. రెండు వారాలపాటు యధాతధ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ఫై ఇవాళ విచారణ జరిగింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న జస్టిస్ కేవీ విశ్వనాధన్, జస్టిస్ ఎన్ కె సింగ్ ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో బుగ్గ మఠం భూములపై రెండు వారాలపాటు స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశిస్తూనే..చట్ట ప్రకారం ఏపీ హైకోర్టు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. -
ఆ తీర్పు న్యాయ చరిత్రలోనే మాయనిమచ్చ
న్యూఢిల్లీ: యాభై ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ కొనసాగుతున్నకాలంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువర్చిన తీర్పు ప్రపంచ న్యాయచరిత్రలోనే మాయనిమచ్చ అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అభివర్ణించారు. దేశంలో అత్యయిక స్థితి విధించి ఈనెల 25వ తేదీతో 50 ఏళ్లుపూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా జరుపునున్న నేపథ్యంలో ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. ఎమర్జెన్సీకాలంలో ప్రాథమిక హక్కులు ఉండవంటూ ఆనాడు తీరి్పచ్చిన సుప్రీంకోర్టును ధన్‌ఖడ్ తీవ్రంగా తప్పుబట్టారు. శుక్రవారం ఢిల్లీలో రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన సభ్యులనుద్దేశించి ధన్‌ఖడ్ ప్రసంగించారు. ఈ వివరాలను ఉపరాష్ట్రపతి కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘మంత్రిమండలి అభిప్రాయాలకు వీసమెత్తయినా విలువ ఇవ్వకుండా నాటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని నాటి రాష్ట్రపతి ఫక్రుదీద్‌న్ అలీ అహ్మద్ ఆమోదముద్ర వేశారు. కేవలం ప్రధాని హోదాలో ఉన్న ఒక్కరి సలహాకు రాష్ట్రపతి ఆమోదం తెలపకూడదు. రాజ్యాంగంలో దీనిపై ఎన్నెన్నో నిబంధనలున్నాయి. ప్రధాని సారథ్యంలోని మంత్రులు రాష్ట్రపతికి సలహాలు, సూచనలు చేయొచ్చు. కానీ ఇవేం పట్టించుకోకుండా ఇందిరా గాంధీ సిఫార్సుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని విపరిణామాలను వెంటనే దేశం చవిచూసింది. ఆనాడు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షకుపైగా పౌరులను ప్రభుత్వం కటకటాల వెనక్కు నెట్టింది’’అని ధన్‌ఖడ్ గుర్తుచేశారు.న్యాయస్థానం పాత్ర దారుణం ‘‘ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు అమలుకాకుండా ప్ర భుత్వం అడ్డుకుంది. అలాంటప్పుడు జ నం న్యాయం కోసం న్యాయస్థానాల వైపు చూస్తారు. పౌరుల ఆకాంక్షలు నెరవేరేలా తొమ్మిది హైకోర్టులు ఎమర్జెన్సీ విధించినా, విధించకపోయినా ప్రాథమిక హక్కులు మనుగడలోనే ఉంటాయని చరిత్రాత్మక తీ ర్పులు ఇచ్చాయి. కానీ ఆ తీర్పులను కొట్టే స్తూ సుప్రీంకోర్టు అత్యంత ప్రజాస్వామికవ్యతిరేక తీర్పును వెలువర్చింది. ఇది నిజ ంగా ప్రపంచం న్యాయచరిత్రలోనే చీకటిపేజీ. ఎమర్జెన్సీ అమల్లో ఉంటే పౌరులకు ప్రాథమిక హక్కులు ఉండబోమని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుతో నియంతృత్వం, అధికారవాదం దేశంలో తిష్టవేశాయి. కోర్టుల్లో న్యాయం దక్కుతుందని భావిస్తున్న ప్రపంచం ఈ తీర్పుతో దిగ్భ్రాంతికి గురైంది. ఎంతకాలం ఎమర్జెన్సీ కొనసాగాలో అంతకాలం అది అమల్లోఉండేలా పాలకులు ఆశించిందే చివరకు జరిగింది’’అని ధన్‌ఖడ్ అన్నారు. ఈ పరిణామాల దృష్ట్యానే నేటి ప్రభుత్వం జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా జరపాలని సముచితంగా నిర్ణయం తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21వ తేదీదాకా ఎమర్జెన్సీ అమల్లో ఉంది. -
అవినీతి అధికారుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడమా?: సుప్రీం కోర్టు
అవినీతి కేసులో శిక్షలు పడ్డ ప్రభుత్వాధికారుల నిర్దోషిత్వం పైకోర్టుల్లో రుజువు అయ్యేదాకా తిరిగి విధుల్లోకి తీసుకోవడం సరికాదని దేశసర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడం అవుతుందన్న సుప్రీం కోర్టు.. ఇలాంటి చర్యలు నిజాయితీపరులైన అధికారులను అవమానించడమే అవుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది.కేసు ఏంటంటే.. గుజరాత్‌లోని ఒక రైల్వే ఇన్స్పెక్టర్ లంచం తీసుకున్నాడన్న కేసులో ట్రయల్ కోర్టు రెండు సంవత్సరాల శిక్ష విధించింది. అయితే దీనిపై ఆయన అప్పీల్‌కు వెళ్లగా.. గుజరాత్ హైకోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే తన శిక్షను పూర్తిగా రద్దు చేయాలని స్టే కోరుతూ సదరు ఇన్స్పెక్టర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.పిటిషనర్ వాదనలు.. నేను లంచం తీసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేకపోయారు. అయినా కింది కోర్టు మా వాదనలను పట్టించుకోకుండా శిక్ష వేసింది. ఉన్నత న్యాయస్థానం నాకు ఊరట ఇచ్చినప్పటికి శిక్షను రద్దు చేయలేదు. కాబట్టి నా శిక్షపై స్టే విధించి.. నన్ను తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి.సుప్రీం కోర్టు(Supreme Court) ఏం చెప్పిందంటే.. గురువారం జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బీ వరాలేలతో కూడిన బెంచ్ ఆ రైల్వే ఇన్స్పెక్టర్ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ క్రమంలో ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజల నమ్మకమే పాలనా వ్యవస్థకు మూలాధారం. అవినీతికి లోనైన ప్రభుత్వ అధికారిని అన్ని న్యాయ ప్రక్రియలు పూర్తయ్యే వరకు ఉద్యోగంలోకి తిరిగి అనుమతించడం ఆ నమ్మకాన్నే దెబ్బతీస్తుంది. కోర్టులో దోషులుగా తేలిన అధికారులను.. తిరిగి విధుల్లోకి తీసుకోవడం వ్యవస్థ మూలాలను బలహీనపరుస్తుంది. పైగా ఇలాంటి చర్యలు.. నిజాయితీ పరులైన అధికారులను అవమానించడమే అవుతుంది అని బెంచ్ వ్యాఖ్యానించింది.ఈ క్రమంలో.. కేసీ సరీన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పును ప్రస్తావించింది. ‘‘ఒక ప్రభుత్వ అధికారి అవినీతి కేసులో దోషిగా తేలితే.. పైకోర్టుల్లో అతను నిర్దోషిగా తేలేంతవరకు విధుల్లోకి తీసుకోకూడదు. ఒకవేళ అతని/ఆమె అప్పీల్ పెండింగ్‌లో ఉన్నాసరే.. ఉద్యోగంలోకి తిరిగి అనుమతించకూడదు’’ అని ఈ కేసులో తీర్పు ఇచ్చింది. -
కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని.. సినిమాను, స్టాండప్ కామెడీని ఆపలేం
న్యూఢిల్లీ: కమల్ హాసన్ స్టారర్ ‘థగ్ లైఫ్’సినిమా విడుదలను అడ్డుకునే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయనే కారణంతో సినిమా, స్టాండప్ కామెడీ లేదా కవితా గోష్టి వంటి వాటిని ఆపలేమని స్పష్టం చేసింది. ‘మన దేశంలో మనోభావాలను దెబ్బతీసే ఘటనలకు ముగింపు కనిపించడం లేదు. స్టాండప్ కమెడియన్ ఏదో అంటే మనోభావాలు దెబ్బతిన్నాయని, విధ్వంసం, నిరసనలకు దిగుతున్నారు. ఎటు వెళ్తున్నాం మనం? ఏంటి దీనర్థం? నిరసనలు చేపట్టారనే కారణంతో సినిమా, స్టాండప్ కామెడీ షో, కవితా గోష్టి వంటి వాటిని ఆపేయాలా?’అంటూ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. కమల్ హాసన్ వ్యాఖ్యల నేపథ్యంలో విడుదల ఆగిన ‘థగ్ లైఫ్’ను కర్ణాటకలో ప్రదర్శించేందుకు ఆదేశాలివ్వాలంటూ మహేశ్ రెడ్డి వేసిన పిల్‌పై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శన సమయంలో తగు భద్రత కల్పిస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన హామీకి ధర్మాసనం అంగీకరించింది. ఏ వ్యక్తి గానీ, సమూహం గానీ సినిమా ప్రదర్శనకు అవరోధం కల్పించినా, నష్టపరిచినా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయానికి ఇంతటితో ముగింపు పలుకుతున్నామంది. తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలంటూ కమల్ హాసన్‌ను కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్(కేఎఫ్సీసీ) కోరడంపై ధర్మాసనం..‘దీనికి మేం అస్సలు అంగీకరించం. ఒక అభిప్రాయం కారణంగా సినిమాను అడ్డుకుంటారా? స్టాండప్ కామెడీని, కవితా పఠాన్ని ఆపేస్తారా?’అని ప్రశ్నించింది. అయితే, తమకు కొన్ని సమూహాల నుంచి బెదిరింపులు వచ్చినందునే కమల్‌ను క్షమాపణ చెప్పాలని ఒక లేఖ ద్వారానే కోరామని, అంతే తప్ప కమల్‌ను బెదిరించలేదని కేఎఫ్సీసీ వివరించింది. బెదిరింపుల విషయాన్ని పోలీసుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని కేఎఫ్సీసీని ధర్మాసనం ప్రశ్నించింది. సినిమా విడుదల చేస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ వచ్చిన బెదిరింపుల విషయం తెలపగా కేఎఫ్సీసీ స్పందించలేదని మహేశ్ రెడ్డి తర ఫు లాయర్ తెలిపారు. బెదిరించిన వారిపై చర్యలు తప్పక తీసుకుంటామని రాష్ట్ర ప్రభు త్వ లాయర్ హామీ ఇచ్చారు. కన్నడ సాహిత్య పరిషత్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ నూలి వాదనలు వినిపించారు. కమల్ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కమల్ క్షమాపణ చెబితేనే రాష్ట్రంలో ఆ సినిమా ప్రదర్శన వీలవుతుందని, లేకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘అంటే..థగ్ లైఫ్ అనధికార బ్యాన్‌ను, థియేటర్లను బుగ్గిపాలు చేసేందుకు మీరు మద్దతిస్తున్నారా?’అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘క్షమాపణ చెప్పడం ఏమిటి? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరు. మనోభావాలు గాయపడితే పరువునష్టం కేసు వేయండి..!’అని ధర్మాసనం పేర్కొంది. హింసకు పాల్పడే వారిని తాము ప్రోత్సహించమంటూ కన్నడ సంస్థ తరఫు లాయర్ పేర్కొనగా ‘సినిమా విడుదలను కూడా మీరు అడ్డుకోరాదు’అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. -
మీరు ఎవరికీ నోటీసులు ఇవ్వొద్దు.. విచారణ చేయొద్దు
సాక్షి, అమరావతి: ‘తిరుమల లడ్డూ వివాదంపై విచారణ పేరుతో మీరు ఎవరికీ నోటీసులు ఇవ్వొద్దు. విచారణ చేయొద్దు...’ అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దర్యాప్తు అధికారిగా ఉన్న అదనపు ఎస్పీ జె.వెంకటరావును హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు అనుమతి తీసుకోకుండానే సిట్ దర్యాప్తు అధికారిగా అదనపు ఎస్పీ జె.వెంకటరావును నామినేట్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌లో వెంకటరావు భాగం కాదని గుర్తుచేసింది. అలాంటప్పుడు సుప్రీంకోర్టు అనుమతి తీసుకోకుండా విచారణ పేరుతో సాక్షులకు నోటీసులు జారీ చేయడం కోర్టు ధిక్కారమే అవుతుందని అభిప్రాయపడింది. సిట్ దర్యాప్తు అధికారిగా వెంకటరావును నియమిస్తూ సీబీఐ డైరెక్టర్ ఇచి్చన ప్రొసీడింగ్స్ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. సీబీఐ, సిట్ దర్యాప్తు అధికారి హోదాలో సాక్షులకు, నిందితులకు నోటీసులు ఇవ్వకుండా వెంకటరావును హైకోర్టు నిరోధించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల లడ్డూ వివాదంపై దర్యాప్తు నిమిత్తం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యుడిగా లేని వెంకటరావు దర్యాప్తు అధికారి హోదాలో తనకు నోటీసు ఇచ్చి విచారణకు పిలవడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ, ఏపీ భవన్ అప్పటి ప్రత్యేక అధికారి కె.చిన్నప్పన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది చిత్తరవు నాగేశ్వరరావు, న్యాయవాదులు వంపుగడవల ఉదయ్‌కుమార్, పి.యుగంధర్‌రెడ్డి వాదనలు వినిపించారు.సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్’లో వెంకటరావు సభ్యుడు కాదు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న వెంకటరావు భాగం కాదని సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు ఉండాలని, వారిని సీఐడీ డైరెక్టర్ నామినేట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ చైర్మన్ నామినేట్ చేసిన సీనియర్ అధికారి ఒకరు సిట్‌లో ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిందని వివరించారు. లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదట ఓ సిట్‌ను ఏర్పాటు చేసిందన్నారు. తిరుపతి అదనపు ఎస్పీగా ఉన్న వెంకటరావు మొదట దర్యాప్తు చేశారన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సిట్ స్థానంలో మరో సిట్‌ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిందని చెప్పారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌లో వెంకటరావు సభ్యుడు కాదన్నారు. అయినప్పటికీ సీబీఐ డైరెక్టర్ దర్యాప్తు బాధ్యతలను వెంకటరావుకు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారని తెలియజేశారు. -
న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మకు భారీ ఎదురుదెబ్బ
సాక్షి,ఢిల్లీ: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు (justice yashwant varma) భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. కాలిన నోట్ల కట్టల వ్యహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ అత్యున్నత న్యాయస్థానానికి సిఫార్స్ చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో వెలుగులోకి వచ్చిన రూ.500 నోట్ల కట్టల వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. తాజాగా త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసి రిపోర్టును సుప్రీంకోర్టుకు అందించింది. స్టోరూంలో వెలుగులోకి వచ్చిన కరెన్సీ నోట్ల ఏపీసోడ్లో జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని గుర్తించింది. ఇదే వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ 55 మంది సాక్షులను విచారించి, జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసి, మొత్తం 64 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను మొదటగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసింది. నివేదికలో కీలకమైన విషయాలను పరిశీలిస్తే..త్రిసభ్య విచారణ కమిటీ తన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.పేజీ 60లో: “ 30 తుగ్లక్ క్రెసెంట్‌లో ఉన్న స్టో రూమ్‌లో భారీ ఎత్తున నగదు ఉన్నట్లు గుర్తించాం. నగదు ఉన్న ప్రదేశం ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వర్మ అధికారిక నివాసం…” పేజీ 59లో: “... స్టోరుమ్లోకి వెళ్లేందుకు జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకే ఉన్నది. ఎవరు అనుమతి లేకుండా లోపలికి వెళ్లలేరు. మా విచారణలో తేలింది.”మార్చి 14న జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్న సమయంలో స్టోరూంలో పూర్తిగా కాలిన నోట్లు వెలుగులోకి వచ్చాయి. ఓ సాక్షి చెప్పిన ప్రకారం.. “లోపలికి వెళ్లగానే ఏటు వైపు చూసినా, రూ.500 నోట్ల కట్టలు నేలపై పడి ఉన్నాయి. ఇది నా జీవితంలో నేను చూసిన పెద్ద మొత్తంలో నగదు అని సదరు వ్యక్తి త్రిసభ్య కమిటీకి చెప్పారు. కమిటీ నివేదిక ప్రకారం, ఇంత పెద్దమొత్తంలో స్టోరూంలో లభ్యమవ్వడంపై అనేక అనుమానాలున్నాయి. జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా అక్కడ ఉంచడం అసంభవం’ అని నివేదికలో ప్రస్తావించింది.జస్టిస్ వర్మ కుమార్తె దియా వర్మ, ప్రైవేట్ సెక్రటరీ రాజీందర్ కార్కీలను కూడా కమిటీ విచారించింది. విచారణలో ఈ ఇద్దరూ స్టోరూంలో నగదు ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని అగ్నిమాపక సిబ్బందిని కోరినట్లు తేలింది.దీంతో పాటు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కుమార్ చేసిన ఆరోపణలు, దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం, జస్టిస్ వర్మను తొలగించే ప్రక్రియ ప్రారంభించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి’ అని కమిటీ తేల్చింది.దేశంలో ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. సుప్రీం త్రిసభ్య కమిటీ సిఫార్సుతో జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జస్టిస్ వర్మ మాత్రం కాలిన నోట్ల కట్టల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, నిరుపయోగంగా ఉండే స్టోరూంలో ఇతరులు సైతం ప్రవేశించే అవకాశం ఉందని వాదిస్తున్నారు. సుప్రీం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా త్రిసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగ్, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్‌ను సభ్యులుగా ఉన్నారు. -
తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. ఏడీజీపీ జయరామ్‌కు ఊరట
న్యూఢిల్లీ: తమిళనాడు అడిషనల్ డీజీపీ హెచ్ఎం జయరామ్(HM Jayaram)కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయన అరెస్టు వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు తీరుపై సుప్రీం కోర్టు కన్నెర్రజేసింది. కిడ్నాప్ కేసులో సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయాలని ఆదేశించడం ఏమేర సహేతకమని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అదే సమయంలో ఆయనపై సస్పెన్షన్‌ను వేటును ఎత్తేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.మద్రాస్ హైకోర్టు(Madras HC) తన అరెస్ట్‌కు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జయరామ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిన్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. జయరామ్ తరఫు న్యాయవాది పలు అంశాలను ప్రస్తావించారు. తన క్లయింట్ జయరామ్‌ను అరెస్ట్ అయిన వెంటనే కస్టడీలోకి తీసుకున్నారని, సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేసిన 24 గంటల తర్వాతే విడుదల(జూన్ 17న) చేశారని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక అధికారిని అయోమయమైన ఆధారాల ఆధారంగా అరెస్ట్ చేయమని చెప్పడం ఏంటి?. ఇది ఎటువంటి న్యాయ ప్రక్రియకు సరిపోతుంది?. ఇది పరిపాలనా వ్యవస్థపైనా ప్రభావం చూపించే అంశమే కదా. అధికారులపై ఇలాంటి చర్యలు మానసికంగా దెబ్బతీసేలా ఉంటాయి’’అని అభిప్రాయపడింది.అదే సమయంలో ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వంపైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఆయన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముంది?. విచారణకు సహకరిస్తున్నా కూడా చర్యలు తీసుకోవడం ఏంటి?.. సస్పెన్షన్ ఆదేశాలను తక్షణమే వెనక్కి తీసుకోండి.. అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏడీజీపీ జయరామ్ అరెస్టు వ్యవహారం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరువళ్లూరు జిల్లా తిరువేలాంగాడు వద్ద బాలుడి కిడ్నాప్ కేసులో గత సోమవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పురట్చి భారతం పార్టీకి చెందిన కేవీ కుప్పం నియోజవకవర్గ ఎమ్మెల్యే జగన్‌మూర్తిపై కూడా ఆరోపణలున్నాయి. కోర్టు విచారణకు జయరామ్ హాజరు కాగా.. ఆ ప్రాంగణంలోనే ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం ఏడీజీపీ జయరామన్‌ను హోంశాఖ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.విచారణ సమయంలో.. ఈ కిడ్నాప్ కేసులో ఎమ్మెల్యే, పోలీస్ ఉన్నతాధికారి తీరుపై మద్రాసు హైకోర్టు కన్నెర్ర చేసింది. ప్రజా ప్రతినిధులు న్యాయస్థానాలను (Kangaroo Courts)నడిపించడమేంటని? జగన్‌మూర్తికి తీవ్రంగా అక్షింతలు వేసింది.అలాగే.. ఏడీజీపీ జయరామన్ అరెస్టుకు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు.. జగన్మూర్తి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.జరిగింది ఇదే.. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ధనుష్(22) అనే యువకుడ్ని ఓ యువతి వివాహం చేసుకుంది. ఆ యువకుడిని పట్టుకుని తన కూతురిని తిరిగి తనకు అప్పగించాలంటూ ఆమె తండ్రి వనరాజా మాజీ కానిస్టేబుల్ అయిన మహేశ్వరి సాయం కోరాడు. దీంతో ఆమె ఏడీజీపీ జయరామ్‌ను సంప్రదించింది. ఆపై ఆ పంచాయితీ పురట్చి భారతం పార్టీకి చెందిన కేవీ కుప్పం నియోజవకవర్గ ఎమ్మెల్యే జగన్మూర్తి చెంతకు చేరింది. ఈ క్రమంలో ధనుష్ కనిపించకపోవడంతో అతని 16 ఏళ్ల సోదరుడిని అమ్మాయి కుటుంబం కిడ్నాప్ చేశారు. అయితే ఈ కేసులో ఒత్తిళ్ల నేపథ్యంలో చివరకు ఆ బాలుడిని ఓ హెటల్ వద్ద వదిలేసి వెళ్లారు. అయితే ఆ బాలుడ్ని వదిలేసిన వాహనం ఏడీజీపీ జయరామ్ అధికారిక వాహనం కావడం, పైగా అందులో వనరాజా, మహేశ్వరి ఉండడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. -
సుప్రీంకోర్టు చెప్పినా సిట్‌కు లెక్కే లేదా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్రలో భాగంగా ఏర్పడిన సిట్ రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోతోంది. రెడ్‌బుక్ కుట్రలో భాగంగా అక్రమ అరెస్ట్‌లు, దర్యాప్తు ముసుగులో వేధింపులు, చిత్రహింసలకు బరితెగిస్తోంది. సిట్ అరాచకం ఎంతగా సాగుతోందంటే సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు, హెచ్చరికలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ దాష్టీకానికి పాల్పడుతోంది. ఇదే అక్రమ కేసులో నిందితులుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎ.ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీంకోర్టు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు, విచారణ పేరిట ఈ కేసులో సాక్షులు, నిందితులను ఏ విధంగానూ వేధించకూడదని.. వారిని శారీరకంగా హింసించ కూడదని స్పష్టం చేసింది. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరించింది. అంతేకాదు ఆధారాలు లేకుండా అరెస్టు చేయకూడదని పేర్కొంది. కేసు పెట్టాం కాబట్టి అరెస్టు చేసి తీరాలన్న ఆలోచన ఏమాత్రం సరైంది కాదని కూడా విస్పష్టంగా తేల్చి చెప్పింది. అది పౌరుడి గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారమని కూడా వ్యాఖ్యానించింది. అందుకు విరుద్ధంగా రాజకీయ దురుద్దేశాలతో వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సిట్ అధికారులను సుప్రీంకోర్టు హెచ్చరించింది.మా పని మాది..సుప్రీంకోర్టు ఆదేశాలను తామేమాత్రం పట్టించుకోబోమని సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఆయన బృందం తమ చేతల ద్వారా తేల్చి చెప్పారు. ఇప్పటికే ఎంతో మంది సాక్షులను వేధించి, హింసించిన సిట్ అధికారులు తాజాగా తమ పోలీసు శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఏకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి మరీ చిత్రహింసలకు గురి చేయడం విభ్రాంతి కలిగిస్తోంది. అంతే కాకుండా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్ వ్యవహారంలో కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించింది. ఆయనకు వ్యతిరేకంగా సిట్ ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు చూపించనే లేదు. ఆయనకు నోటీసు ఇచ్చి విచారణకు పిలవనే లేదు. మంగవారం మధ్యాహ్నం వరకు ఆయన పేరును ఎఫ్ఐఆర్లో కూడా చేర్చనే లేదు. అయినా సరే మంగళవారం ఉదయం ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసి.. సీఎం చంద్రబాబు కుట్రలకు సిట్ వత్తాసు పలికింది. కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే చెవిరెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా స్పష్టమవుతోంది. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలంటే తమకు ఏమాత్రం లెక్కలేదని, ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్రలకు వత్తాసు పలికి.. వేధింపులు, కక్ష సాధింపులకు పాల్పడటమే తమ ఏకైక లక్ష్యమని సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఆయన బృందం స్పష్టం చేస్తోంది. -
ఉన్నత స్థానాల్లో ఉన్నా ...
భారతదేశంలో మహార్లు వీరోచితమైన చరిత్ర కలిగినవారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఇటు వంటి మహార్లలో జన్మించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. ఆయన తండ్రి రాంజీ సక్పాల్ భక్తి ఉద్యమానికి సంబంధించిన వారు. అంబేడ్కర్ బౌద్ధమతం స్వీకరించేవరకూ మహార్లు భక్తి ఉద్యమంలో ప్రముఖపాత్ర పోషించిన కబీర్ అనుయాయులుగా ఉన్నారు. ఆ తర్వాత బౌద్ధంలోకి మారారు. 1956 డిసెంబర్ 6న అంబేడ్కర్ ఇచ్చిన బౌద్ధ ధర్మ దీక్ష పొందినవారిలో ఒకరు రామకష్ణ సూర్య భాను గవాయి కుమార్. ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి (బీఆర్ గవాయి) ఆయన కుమారుడే. తండ్రి వారస త్వాన్ని అందిపుచ్చుకుని బౌద్ధ మతస్థులతో కొనసాగు తున్న జస్టిస్ గవాయి బౌద్ధ జీవన వికాసానికీ, ఆత్మ గౌరవ స్వరానికీ, అవమానాన్ని ఎదిరించగలిగిన తత్వానికీ నిదర్శనంగా నిలిచారు.దళితులు ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగినప్ప టికీ ఏదో ఒక రూపంలో భారతీయ నిచ్చెన మెట్ల కుల సమాజంలో అవమానాలు ఎదుర్కొనవలసి రావడం విషాదకరం. దళితుడైన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కేరళ నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిష్ఠించారు. ఆయన తాను అనేక అవమానాలను ఎదుర్కొన్నట్లు పదవీ విరమణ తరువాత చెప్పారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన కె.ఆర్. నారాయణ్ ఫ్రాన్స్‌లో గెస్ట్‌హౌస్‌లో ఉన్నప్పుడు ఒక విలేకరి ‘ఇండియన్ అన్ టచ్బుల్’ అన్న విషయాన్ని స్వయంగా పేర్కొన్న విషయం గమనార్హం. ఇప్పుడు దళితుడైన జస్టిస్ బీఆర్ గవాయి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) అయిన తర్వాత ఆయనకు తొలినాళ్లలోనే దక్కవలసిన ప్రొటోకాల్ మర్యాద దక్కకపోవడం చర్చనీయాంశం అయ్యింది.జస్టిస్ గవాయి సీజేఐ అయిన సందర్భంగా మహారాష్ట్ర–గోవా బార్ కౌన్సిల్ ఆయనకు ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్య క్రమానికి మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ముంబై పోలీస్ కమిషనర్ వంటి ఉన్నతాధికారులు హాజరు కాలేదు. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి సీజేఐ వంటి ఉన్నత పదవికి ఎంపికైన తరువాత రాష్ట్రానికి తొలిసారి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. కానీ వారు హాజరు కాలేదు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘నేను నాకు లభించాల్సిన గౌరవం గురించి మాట్లాడడం లేదు. ఒక రాజ్యాంగ వ్యవస్థకు మరో రాజ్యాంగ వ్యవస్థ ఇవ్వాల్సిన గౌరవం గురించి మాట్లాడుతున్నాను’ అని అన్నారు.జస్టిస్ గవాయి గొప్ప సందేశకుడు, ధైర్యశాలి, నిక్కచ్చిగా మాట్లాడటం ఆయన నైజం. ఆయన ప్రమాణ స్వీకారం తరువాత చేసిన ప్రసంగం ఆలో చనను రేకెత్తించింది. దేశంలో ఏ వ్యవస్థా గొప్పది కాదనీ, భారత రాజ్యాంగం మాత్రమే సర్వోన్నతమైనదనీ ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో కీలక స్తంభాలు అయిన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూడూ సమానమేననీ, అవి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలనీ, పరస్పరం గౌరవించుకోవాలనీ స్పష్టం చేశారు. మహారాష్ట్ర–గోవా బార్ కౌన్సిల్ సత్కార సభలో ఆయన ఇచ్చిన 50 కీలక తీర్పుల సంకలన గ్రంథ ఆవిష్కారం జరిగింది. ఆ సందర్భంగా బుల్డోజర్ న్యాయానికి వ్యతిరేకంగా తానిచ్చిన తీర్పు గురించి వివరించారు. ‘నివాస హక్కు ప్రాథమిక హక్కు. ఏ వ్యక్తి అయినా ఏదైనా కేసులో నిందితుడైనా, దోషిగా నిర్ధారణ అయినా... అతడి కుటుంబ నివాసం చట్టబద్ధమైనదైతే దానిని తొలగించడానికి, కూల్చడానికి వీల్లేదు. చట్టాన్ని అనుసరించి వ్యవహరించాల్సిందే’ అని స్పష్టం చేశారు. బుద్ధిస్టు అయిన దళితుడు దేశ అత్యున్నత న్యాయమూర్తి కావడం మంచి పరిణామం.అంబేడ్కర్ భారత రాజ్యాంగకర్తగా ఉండి అనేక అవమానాలు పొందారు. అయితే ఆయన సానుకూల దృక్పథంతో ప్రత్యామ్నాయాలు సృష్టిస్తూ వెళ్ళారు. ఇపుడు భారత రాజ్యాంగ అనుసరణ అనేది ఒక ప్రధాన భూమికగా మారింది. దశాబ్దంలో హిందూ మతోన్మాదశక్తులు, కార్పొరేట్ ఆధిపత్య శక్తులు జమిలిగా మనుస్మృతి భావాజాల ఆధిక్యతను ప్రకటించాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ గవాయి ఇచ్చిన ఆత్మ గౌరవ ఫీలింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు’ అని అంబేడ్కర్ చెప్పారు. ఈ సూత్రాన్ని గ్రహించి దేశంలో రాజ్యాంగం పేర్కొంటున్న సమానత్వం నెలకొనడానికి కృషి జరగాలి. రాజ్యాంగాన్ని అమలు చేసే స్థానంలో ఉన్న వారే కుల వ్యవస్థ దారుణాన్ని చవిచూసినవారైతే వారు ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడుమొబైల్: 98497 41695 -
సుప్రీం కోర్టులో కమల్ సినిమాకు భారీ ఊరట!
కమల్ హాసన్ హీరోగా నటించిన ‘థగ్ లైఫ్’(Thug Life) చిత్రానికి సుప్రీ కోర్టు(supreme court of india)లో భారీ ఊరట లభించింది. కర్ణాటకలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు ఈ సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీం కోర్టు హెచ్చరించింది. థియేటర్స్‌లో ఏమి ప్రదర్శించాలనే అధికారం గుంపులకు, ఆరాచక శక్తులకు లేదని, మూక బెదిరింపులకు చట్ట పాలనను తాకట్టు పెట్టలేమని కోర్టు పేర్కొంది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన ఏ సినిమానైనా విడుదల చేయాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.అలాగే కమల్ వ్యాఖ్యలను వ్యతిరేకించే హక్కు కర్ణాటక ప్రజలకు ఉందని, ప్రాథమిక హక్కులను కాపాడాలని ధర్మాసనం పేర్కొంది. ‘కమల్ వ్యాఖ్యలు తప్పు అని కర్ణాటక, బెంగళూరు వాసులు నమ్మితే.. అలా చెబుతూ ఒక ప్రకటన జారీ చేయవచ్చు. సినిమా థియేటర్లను తగలబెట్టాలని ఎందుకు బెదిరిస్తున్నారు?’ అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.చిత్ర నిర్మాత దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు నుంచి తనకే బదిలీ చేసుకున్న సుప్రీం కోర్టు.. దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. అలాగే ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పు పట్టింది.అసలేం జరిగిందంటే.. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకీ దారి తీశాయి. కమల్ వ్యాఖ్యలపై కన్నడిగులు భగ్గుమన్నారు. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పకపోవడంతో కర్ణాటకలో ఈ సినిమా విడుదలను నిషేధించారు. దీనిపై చిత్రబృందం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నేడు ఆదేశాలు జారీ చేసింది. -
హక్కులకు లెక్కొద్దు
మాతృత్వానికి సిద్ధపడిందంటే స్త్రీ.. 24 బై 7 డ్యూటీకి సైన్ చేసినట్టే! ఆ కొలువుకు ఆ షిఫ్ట్ మాత్రమే ఉంటుంది! శారీరకంగా, మానసికంగా ఎన్ని మార్పులు.. ఎన్ని సర్దుబాట్లను అంగీకరించాలి అమ్మ!? వర్కింగ్ ఉమన్ అయితే.. చెప్పక్కర్లేదు! ఆ శ్రమ నుంచి పాలిచ్చే మొదటి ఆరునెలలైనా ఆ తల్లికి కాస్తంత వెసులుబాటు, విశ్రాంతి కావాలి కదా! తొలి చూలు, మలి చూలుకే అనే నిబంధనతో కాదు! అవసరమైతే మూడో ప్రసవానికి కూడా! సుప్రీం కోర్ట్ కూడా సరే అంది! అదేంటి ఆ అంశం కోర్ట్ దాకా వెళ్లిందా? అవును.. ఇటీవలే తీర్పు వచ్చింది. ఆ వివరాలు..తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన ఉమా దేవికి 2006లో పెళ్లయింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. 2012లో టీచర్‌గా సర్కారు కొలువు వచ్చింది. అయితే భర్తతో వచ్చిన స్పర్థల కారణంగా 2017లో అతన్నుంచి విడాకులు తీసుకుంది ఆమె. పిల్లల కస్టడీని తండ్రికే ఇచ్చింది కోర్ట్. 2018లో ఉమాదేవి మళ్లీ పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు గర్భం దాల్చింది. నెలలు నిండుతుండటంతో తొమ్మిది నెలల ప్రసూతి సెలవుకు దరఖాస్తు చేసుకుంది. ఆ దరఖాస్తును తోసిపుచ్చారు పై అధికారి.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల ప్రకారం.. ఒకరు లేక ఇద్దరు పిల్లల వరకే ప్రసూతి సెలవు వర్తిస్తుందని, ఉమాదేవికి ఇది మూడో కాన్పు అదీ రెండో వివాహంతో కాబట్టి ప్రసూతి సెలవు ఇవ్వడం కుదరదని వివరణిస్తూ! నొచ్చుకున్న ఉమాదేవి మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆమెకు మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సిందేనని తీర్పిచ్చింది ఏకసభ్యధర్మాసనం. దాంతో ఉమాదేవి పై అధికారులు డివిజన్ బెంచ్ (ఇద్దరు సభ్యుల ధర్మాసనం)కి అపీల్ చేశారు. డివిజన్ బెంచ్.. ఏకసభ్య ధర్మాసన తీర్పును కొట్టేస్తూ మెటర్నిటీ లీవ్‌కి ఉమాదేవి అర్హురాలు కాదని తీర్పు ఇచ్చింది. దాంతో ఉమాదేవి సుప్రీం కోర్ట్‌కు వెళ్లింది. ‘నా ఇద్దరు పిల్లలు నేను గవర్నమెంట్ సర్వీస్‌లో జాయిన్ అవకముందు పుట్టారు. సర్వీస్‌లో చేరిన తర్వాత మెటర్నిటీ లీవ్‌కి అప్లయ్ చేసుకోవడం ఇదే మొదలు. అదీగాక మెటర్నిటీ లీవ్ అనేది మహిళ రీప్రొడక్టివ్ రైట్స్ కిందికి వస్తుంది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కూడా దీన్ని గుర్తిస్తుంది’ అని వాదించింది. మూడు కాన్పులకు మెటర్నిటీ లీవ్ ఇవ్వడం అధిక సంతానాన్నిప్రోత్సహించినట్టవడమేకాదు రాష్ట్ర ఖజానాకూ భారమేననే వాదన వినిపించారు ప్రతివాదులు.సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే.. మూడో ప్రసవానికీ మహిళ మెటర్నిటీ లీవ్‌కి అర్హురాలే! అది రెండో పెళ్లయినా సరే! మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ప్రకారం ఉద్యోగం చేసే గర్భిణీకి ప్రసూతి సెలవు మంజూరు చేయాల్సిందే! ప్రసవాల సంఖ్యను బట్టో.. పునర్వివాహాల స్టేటస్‌ను బట్టో కాదు. వాటితో ఈ సెలవుకు సంబంధం లేదు. అధిక సంతానాన్ని, అధిక ఆర్థిక భారాన్ని నియంత్రించాలనే రాష్ట్ర ప్రభుత్వ (తమిళనాడు) నిబంధనలు ప్రశంసించదగ్గవే! అదే సమయంలో ప్రాథమిక హక్కు కోణంలో మహిళల రీప్రొడక్టివ్ హెల్త్, వెల్ బీయింగ్నూ పరిగణనలోకి తీసుకోవాల్సిందే.. వాళ్ల హక్కును గౌరవించాల్సిందే!’ అంటూ స్పష్టమైన తీర్పునిచ్చింది. మహిళలకు సంబంధించి ఇదొక విజయమే! ఎక్కడైనా మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, రీప్రొడక్టివిటీ రైట్ ఉల్లంఘనకు గురైనా.. ఈ తీర్పును చూపించి ఆ హక్కును పొందవచ్చు. ఇదీచదవండి: భర్తకు తుది వీడ్కోలు: కన్నీరుమున్నీరైన అంజలీ రూపానీ -
ఎడాపెడా అక్రమ అరెస్టులపై చెంపదెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పౌరులు, మేధావులు, పాత్రికేయుల వాక్ స్వాతంత్య్ర హక్కును హరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెప్పింది. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ను తప్పుపట్టింది. లైవ్ షోలో ఓ ప్యానలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై నవ్వినందుకు కొమ్మినేనిని అరెస్ట్ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘‘నవ్వడం నేరమా? దానికే అరెస్ట్ చేసేస్తారా?’’ అంటూ మండిపడింది. నవ్వడమే తప్పయితే, తాము కూడా ప్రతి రోజూ నవ్వుతూనే కేసులను విచారణ చేస్తుంటామంటూ గుర్తు చేసింది. లైవ్ షోలో ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వారే తప్ప, ఆయన ఎలాంటి అనుచిత, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది. ఓ జర్నలిస్టుగా లైవ్ న్యూస్ షోలో పాల్గొనే కొమ్మినేని హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని, తద్వారా ఆయన వాక్ స్వాతంత్య్ర హక్కును కూడా పరిరక్షించినట్లవుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఈ నెల 8న నమోదు చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. బెయిల్ మంజూరు సందర్భంగా షరతులు విధించాలని కింది కోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.అరెస్ట్... రిమాండ్‌ను సవాల్ చేసిన కొమ్మినేనికొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే కేఎస్సార్ లైవ్ షోలో పాల్గొన్న మరో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి రాజధాని గురించి పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో కృష్ణంరాజు, కొమ్మినేనిపై టీడీపీకి చెందిన కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కొమ్మినేని, కృష్ణంరాజుపై ఐటీ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. తర్వాత పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయనను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో కొమ్మినేని తన అరెస్ట్, రిమాండ్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కొమ్మినేని తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు. » ఈ నెల 6న కొమ్మినేని లైవ్ షో నిర్వహించారని, అందులో ప్యానలిస్ట్‌గా పాల్గొన్న మరో సీనియర్ జర్నలిస్ట్ అమరావతి గురించి వ్యాఖ్యలు చేశారని సిద్ధార్థ దవే ధర్మాసనానికి వివరించారు. ఈ వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన ఎవరి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని నివేదించారు. ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు.. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిని బాధ్యుడిగా చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు.మరొకరు చేసిన వ్యాఖ్యలకు యాంకర్‌ను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించిన జస్టిస్ మన్మోహన్... అలా అదుపులోకి తీసుకునేందుకు చట్టం అనుమతిస్తుందా? అని ప్రశ్నించారు. ఏ నిబంధన మేరకు అరెస్టు చేశారో చెప్పాలని ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూథ్రాలను ప్రశ్నించారు. చర్చలో ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేని నవ్వారని, ఈ విషయంలో ప్రేక్షక పాత్ర పోషించారని వివరించారు. ఆయన మాట్లాడేటప్పుడు అడ్డుకోకుండా నవ్వారని రోహత్గీ బదులిచ్చారు. ఈ వాదనపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. నవ్వడం నేరమా? నవ్వితే అరెస్ట్ చేస్తారా? అంటూ నిలదీసింది. ఎవరైనా నవ్వొచ్చేలా మాట్లాడితే ధర్మాసనంపై ఉన్న తాము కూడా నవ్వుతామన్న జస్టిస్ మన్మోహన్.. అంతమాత్రాన తప్పుడు కేసులు అంటగట్టేస్తారా? అని ప్రశ్నించారు. జస్టిస్ మిశ్రా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ... ప్రతి రోజూ ఇలా జరుగుతూనే ఉంటుందని అన్నారు. కొమ్మినేని చర్చలో ప్రేక్షకుడు కాదని రోహత్గీ చెప్పగా... ఆయన ఆ వ్యాఖ్యలు చేయలేదు కదా? అని జస్టిస్ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు. పిటిషనర్ స్వయంగా ఎటువంటి పరువు నష్టం కలిగించే, అవమానకర వ్యాఖ్యలు చేయలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. లైవ్ షోలో ఆయన పాత్రికేయ భాగస్వామ్యం రక్షణకు అర్హమైనదని, ఇది వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడుతుందని తెలిపింది. కొమ్మినేని అరెస్ట్ ఎంతమాత్రం సహేతుకం కాదంటూ ఆయనను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు విధించే నిబంధనలు, షరతులకు లోబడి ఈ నెల 8న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నంబర్ 108లో కొమ్మినేనిని బెయిల్‌పై విడుదల చేయాలని నిర్దేశించింది. తాను నిర్వహించే షోలో కొమ్మినేని ఎలాంటి పరువు నష్టం వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని, ఇతరులను అలాంటి ప్రకటనలు చేయడానికి అనుమతించడం గానీ చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు
సాక్షి, అమరావతి: ‘సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ‘ఎక్స్’ వేదికగా శుక్రవారం ఆయన పోస్టు చేశారు. ‘నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధిచెప్పింది.కొమ్మినేని అరెస్టు ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు తీవ్ర భంగకరమని సుప్రీంకోర్టు చెప్పడం ముదావహం’ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘అమరావతి నిర్మాణం పేరిట రూ.వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు.అబద్ధాలు, మోసాలతో కూడిన పాలన నుంచి మళ్లించడానికి, చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విష ప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని ‘సాక్షి’ మీడియా యూనిట్ ఆఫీసుల మీద, కార్యాలయాల మీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు. చంద్రబాబు తన తప్పు తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీకి, ‘సాక్షి’ మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా మాట్లాడడంతోనే ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్ర పన్నారని అర్థం అవుతోంది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ ఇవాళ సుప్రీంకోర్టు ఇచి్చన ఆర్డర్ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటుకావు. సత్యమేవ జయతే’ అని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఇదొక హెచ్చరికకొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సంకెళ్లను న్యాయ వ్యవస్థ బద్దలు కొట్టింది. కొమ్మినేని అరెస్ట్ అక్రమం అని దేశం మొత్తం తెలిసింది. సాక్షి కార్యాలయాలపై తన కార్యకర్తలను, నాయకులను ఉసిగొల్పి దాడులు చేయించిన చంద్రబాబు అరాచకానికి తాజా తీర్పు ఒక హెచ్చరిక. చంద్రబాబు కుట్రపూరిత విధానాలను న్యాయస్థానం ఉత్తర్వులు ఎత్తిచూపాయి.– పూనూరు గౌతంరెడ్డి, వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడుబాబు సిగ్గుతో తలదించుకోవాలికొమ్మినేని అరెస్ట్ అక్రమమని తన తీర్పుతో కూటమి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు బుద్ధి చెప్పింది. చంద్రబాబు సర్కార్ పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలకు ఈ తీర్పు గట్టి హెచ్చరిక. ఇకనైనా చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. అక్రమ అరెస్టులను ఆపాలి. –పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీతల ఎక్కడ పెట్టుకుంటారు..కొమ్మినేని అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చంద్రబాబుకు చెంపపెట్టు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సంకెళ్లను న్యాయ వ్యవస్థ బద్దలు కొట్టింది. ఇప్పుడు చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకుంటారు. – కల్పలత, ఎమ్మెల్సీసుప్రీం తీర్పుతోనైనా బాబు కళ్లు తెరవాలికొమ్మినేనిది అక్రమ అరెస్ట్ అంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుతో అయినా చంద్రబాబు కళ్లు తెరవాలి. చంద్రబాబు మెప్పు కోసం రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్న పోలీసులు పునరాలోచన చేయాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించే వారిని కోర్టుల్లో నిలబెడతాం. – తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యేరాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బకొమ్మినేని అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురురెబ్బ. కనీస నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేయడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం. – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేక్షమాపణ చెప్పాలి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన అంశంలో మంగళగిరి కోర్టు న్యాయమూర్తి, డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, తాజాగా సుప్రీంకోర్టు జర్నలిస్టుల భావప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ వెంటనే విడుదల చేయాలని ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు. తెనాలిలో దళిత, ముస్లిం యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తప్పు పట్టడం కూడా ప్రభుత్వ నేతలను తలదించుకునేలా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ అందరూ కొమ్మినేని అరెస్టుతో ఆగకుండా సాక్షి కార్యాలయాలపై దాడులకు ప్రేరేపించినందుకు తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలాగే కొమ్మినేని, కృష్ణంరాజులపై కేసులను ఉపసంహరించుకోవాలి. – ఈదర గోపీచంద్, సామాజిక విశ్లేషకులు -
‘సుప్రీం తీర్పు’.. చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao)ను వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు అని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అత్యున్నత న్యాయ స్థానం తీర్పుపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘సుప్రీం తీర్పు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహం.అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు. అబద్ధాలు, మోసాలతో కూడిన పాలననుంచి మళ్లించడానికి, తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్‌ద్వారా పథకం ప్రకారం విషప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్ ఆఫీసులమీద, కార్యాలయాలమీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు.చంద్రబాబు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా నిన్న మాట్లాడ్డంతోనే ఆయన రాజకీయ లబ్ధికోసం ఈ కుట్రపన్నారని అర్థం అవుతోంది. విశ్లేషకుడు వ్యాఖ్యలతో యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావు’అని ట్వీట్లో పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు @ncbn గారికి పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2025 -
కొమ్మినేనికి ఊరట.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు(Kommineni Srinivasa Rao)కు భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సాక్షి చానెల్ డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై గుంటూరు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే..కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమమంటూ దాఖలైన పిటిషన్‌ను ఇవాళ జస్టిస్ పీకే మిశ్రా, జస్టిన్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘టీవీ డిబేట్లో నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం?. ఆయన్ని వెంటనే విడుదల చేయండి. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుంది’’ అని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌లోని ముఖ్యాంశాలు:కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేశారు. మూడేళ్ల లోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదు. కేఎస్సార్ లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు.. యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు?. అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్‌ను కేఎస్ఆర్ నియంత్రించారు . వాటిని సమర్థించలేదు. తెలంగాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో.. అదీ ఆంధ్రప్రదేశ్‌లో రిమాండ్ చేశారు. పైగా ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదు. కొమ్మినేని సీనియర్ జర్నలిస్టు. ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదు.పైగా 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్. కొమ్మినేని దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున న్యాయవాదిని అనుమతించలేదు. సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం . ఈ కేసులో పోలీసులు ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21 ,22(1)ను ఉల్లంఘించారు. ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నారు. అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కుకు భంగం కలిగింది’’ అని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది. -
డీఎస్సీ పరీక్షపై స్టే ఇవ్వలేం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకానికి చేపట్టిన డీఎస్సీ–2025 పరీక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పరీక్ష ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున, తగిన న్యాయ సహాయానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ పోసిన ఆనంద్‌సాయికి సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించింది. ఎక్స్ సర్వీస్‌మెన్ రిజర్వేషన్ కోటాలో డీఎస్సీకి దరఖాస్తు చేసిన ఆనంద్ సాయి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. డీఎస్సీలో 5.72 లక్షల మంది అభ్యర్థులు వివిధ షిఫ్టులలో వేర్వేరు ప్రశ్నపత్రాలతో పరీక్ష రాస్తారని, అనంతరం మార్కులు ‘నార్మలైజేషన్‘ పద్ధతిలో ఇవ్వడం అవాస్తవంగా, అన్యాయంగా ఉందని, ఇది అభ్యర్థుల హక్కులకు విఘాతం కలిగిస్తుందని పిటిషనర్ తరఫున అడ్వొకేట్ ఆన్ రికార్డ్ డా. చారు మాథూర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు ఈ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. లక్షల మంది అభ్యర్థులు ఇప్పటికే పరీక్షలు రాశారని చెప్పారు. పరీక్షలు ప్రారంభమయ్యాక వాటిని మధ్యలో నిలిపేయాలని కోర్టులు ఆదేశించలేవని జస్టిస్ మన్మోహన్ వ్యాఖ్యానించారు. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ ఆనంద్‌సాయిని ధర్మాసనం ఆదేశించింది. -
సుప్రీంలో కొత్తగా ముగ్గురు జడ్జీలు
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గురువారం కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. సుప్రీం కొలీజియం సోమవారం సిఫారసు చేసిన కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ఎన్వీ అంజరియా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్, బాంబే హైకోర్టు జస్టిస్ ఏఎస్ చందూర్కర్ వీరిలో ఉన్నారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ గురువారం ‘ఎక్స్’లో ప్రకటించారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన మీదట ఈ నియామకాలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లు ఇటీవల పదవీ విరమణ చేయడంతో ఈ నియామకాలు జరిగినట్లు మంత్రి వివరించారు. తాజాగా నియమితులైన ముగ్గురు జడ్జీలు ప్రమాణం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో, సుప్రీంకోర్టులో మంజూరైన మొత్తం 34 మందీ ఉన్నట్లు లెక్క. అయితే, ఇది స్వల్ప కాలం మాత్రమే. జూన్ 9వ తేదీన జస్టిస్ బేలా ఎం త్రివేదీ పదవీ విరమణ చేయనుండటమే ఇందుకు కారణం. -
స్వదేశానికి రండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును భారతదేశానికి తిరిగి రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వు లు వచ్చే వరకు ప్రభాకర్‌రావుపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని దర్యాప్తు బృందానికి సూచించింది. పాస్‌పోర్టు రద్దు కా రణంగా ప్రభాకర్‌రావు స్వదేశానికి తిరిగి రా లేని పరిస్థితుల్లో ఆయనను పారిపోయిన వ్యక్తి గా పరిగణించలేరని స్పష్టం చేసింది. పాస్ పోర్టు లేదా ప్రయాణ పత్రం అందిన 3 రోజు ల్లోపు దేశానికి తిరిగి వస్తాననే హామీ పత్రం ఇవ్వాలని ప్రభాకర్‌రావుకు సూచించింది. ఈ ఆదేశాలను అడ్వాంటేజ్‌గా తీసుకోవద్దని తెలిపింది. తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రభాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన దర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదించారు. పాస్‌పోర్టు పునరుద్ధరిస్తే వస్తారు ముప్పై సంవత్సరాల పాటు ప్రభుత్వ అధికారిగా సేవలందించిన ప్రభాకర్‌రావుపై తప్పు డు కేసులు పెట్టారని శేషాద్రినాయుడు చెప్పా రు. ఎఫ్ఐఆర్ సమయంలో ఆయన అమెరికా వెళ్లారని, దీంతో ఆయన్ను పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించి పాస్‌పోర్టును రద్దు చేశారని తెలిపారు. ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చేందుకు అవకాశం లేకుండా పాస్‌పోర్టును రద్దు చేశారని తెలిపారు. పాస్‌పోర్టు పునరుద్ధరిస్తే భారత్‌కు తిరిగి వస్తారని, విచారణకు సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే పలువురికి బెయిల్ ఇచ్చారన్నారు. మధ్యంతర రక్షణ ఇవ్వొద్దు : తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహా రం చాలా తీవ్రమైనదని, ప్రభాకర్‌రావుకు ఎటువంటి మధ్యంతర రక్షణ ఇవ్వరాదని అన్నారు. ఆయన పరారీలో ఉన్నందున ముందస్తు బెయిల్‌ను రాష్ట్ర ప్రభు త్వం వ్యతిరేకిస్తోందని చెప్పారు. ప్రభాకర్‌రావు పరారీలో ఉన్నట్లుగా ప్రకటి స్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిందని తెలి పారు.ముందస్తు బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించగా.. పిటిషనర్ తిరిగి వస్తే ఆయనను అరెస్టు చేయబోమని ప్రకటన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించా రు. లేదని, ప్రభాకర్‌రావును అరెస్టు చేయాలని అనుకుంటున్నట్లు తుషార్ మెహతా చెప్పారు. కేసు దర్యాప్తు అధికారి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకున్నారు. ‘ఆయన భారత్‌కు తిరిగి రాలేని పరిస్థితుల్లో ప్రభాకర్‌రావు చట్టానికి దూరంగా ఉన్నట్టు మీరు చెప్పలేరు. ఆయన పారిపోయిన వ్యక్తి కాదు’అని అన్నారు. వాదనల అనంతరం ప్రభాకర్‌రావు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు వీలుగా ఆయన పాస్ పోర్టును పునరుద్ధరించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఆయనను అరెస్టు చేయరాదని ప్రత్యేక దర్యాప్తు బృందానికి తెలిపింది. దేశానికి వచ్చిన మూడు రోజుల వ్యవధిలోనే దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ప్రభాకర్‌రావుకు స్పష్టం చేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్, ఏ1 నిందితుడు ప్రభాకర్‌రావుకు ఊరట లభించింది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఆయన పాస్‌పోర్టును పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. అదే సమయంలో తదుపరి విచారణ దాకా ఆయన్ని అరెస్ట్ చేయొద్దని ప్రత్యేక దర్యాప్తు బృందానికి(SIT) తేల్చి చెప్పింది.ఫోన్ ట్యాపింగ్ కేసుపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అడ్వాంటేజ్‌గా తీసుకోవద్దని.. దేశానికి వచ్చిన వెంటనే మూడు రోజుల వ్యవధిలోనే దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ద్విసభ్య ధర్మాసనం ప్రభాకర్‌రావుకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. ప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘నేను 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ అధికారిగా సేవలందించాను. నాకు వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టారు. పాస్‌పోర్టు ఇస్తే నేను దేశానికి వస్తాను. విచారణకు సహకరిస్తా. గతంలో అనేకమందికి ఈ కేసులో బెయిల్ ఇచ్చారు’’ అని కోర్టుకు ప్రభాకర్‌రావు విజ్ఞప్తిని తెలియజేశారు. ప్రభుత్వం తరఫున వాదనలు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ప్రభాకర్ రావు దేశం విడిచి పారిపోయాడు. పరారీలో ఉన్న నేరస్తుడు షరతులు పెట్టడానికి వీల్లేదు. ముందస్తు బెయిల్ ఇస్తానంటేనే, దేశానికి వస్తానని చెప్పడం ఆమోదయోగ్యం కాదు. ఇదిలాగే కొనసాగితే సాంప్రదాయంగా మారుతుంది. ప్రభాకర్ రావును మేము కచ్చితంగా అరెస్టు చేస్తాం. ఆయన చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడు. ఆ నేరాల తీవ్రత తెలిసే , చెన్నై నుంచి అమెరికాకు పారిపోయాడు. కోర్టు అతన్ని ప్రకటిత నేరస్తుడిగా తీర్పు ఇచ్చింది. ప్రభాకర్ రావు పిటిషన్‌కు అసలు విచారణ అర్హత లేదు’’ అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న బెంచ్.. ప్రభాకర్‌రావుకు ఊరట ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: నేనూ తిక్కదాన్ని.. నాతో పెట్టుకోవద్దు -
ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేం
న్యూఢిల్లీ: ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అత్యాచారానికి గురైనట్లు చెబుతున్న 40 ఏళ్ల మహిళ చిన్నపిల్ల కాదని పేర్కొంది. ఆమె అంగీకారంతోనే లైంగిక చర్య జరిగిట్లు పరోక్షంగా వెల్లడించింది. అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు న్యాయస్థానం బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతడిని అరెస్టు చేసి, జైల్లో పెట్టి తొమ్మిది నెలలు గడుస్తున్నా పోలీసులు అభియోగాలు నమోదు చేయలేదని, అందుకే మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఆ మహిళ ఆ యువకుడిని ఇష్టపూర్వకంగానే కలిస్తే అతడిపై రేప్ కేసు ఎలా నమోదు చేస్తారని ఢిల్లీ పోలీసులను జస్టిస్ బి.బి.నాగరత్న, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఆమె అతడితో ఏడుసార్లు జమ్మూకశ్మీర్‌కు వెళ్లిందని, అతడిపై సెక్షన్ కింద 376 కింద కేసు పెట్టడం సరైంది కాదని పేర్కొంది. ఈ కేసులో సదరు మహిళ దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. తమ దుస్తుల బ్రాండ్ ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన యువకుడిని సంప్రదించారు. క్రమంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆ మహిళ ఫిర్యాదు చేయగా, ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని యువకుడు కోరగా, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దాంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే, బెయిల్‌పై బయట ఉన్నప్పుడు ఈ మహిళను కలవొద్దని షరతు విధించింది. -
1.5 అడుగుల ఎత్తులోగది నిండా నోట్లకట్టలే
న్యూఢిల్లీ: అడుగున్నర ఎత్తున. ఈ మూల నుంచి ఆ మూల దాకా. స్టోర్ రూమ్ నిండా నోట్ల కట్టలే. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు వెలుగు చూసిన ఉదంతంపై సుప్రీంకోర్టు కమిటీ పేర్కొన్న అంశాలివి! గత మార్చి 14న ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో అగ్నిప్రమాదం సంభవించడం, పోలీసులకు, మంటలార్పుతున్న సిబ్బందికి స్టోర్ రూమ్‌లో భారీ సంఖ్యలో కాలిపోయిన నోట్లకట్టలు కనిపించడం తెలిసిందే. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఆయన్ను విధులకు దూరం పెట్టడమే గాక ఆరోపణలపై విచారణకు ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఒక న్యాయమూర్తితో నాటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కమిటీ నియమించారు. అనంతరం కమిటీ సమర్పించిన నివేదికను రాష్ట్రపతికి, ప్రధానికి పంపారు. జస్టిస్ వర్మ వివరణను కూడా జతచేశారు. కమిటీ నివేదికలోని అంశాలను ఇండియాటుడే వార్తా సంస్థ బుధవారం వెల్లడించింది. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని కమిటీ నిర్ధారించింది. స్టోర్ రూములో భారీ సంఖ్యలో లెక్కచూపని నోట్ల కట్టలు బయటపడటం నిజమేనని పేర్కొంది. ‘‘అదంతా లెక్కచూపని డబ్బే. అదెక్కడిదో చెప్పాల్సిన బాధ్యత పూర్తిగా జస్టిస్ వర్మదే. కానీ ఆ డబ్బుకు ఆధారాలు చూపడంలో ఆయన విఫలమయ్యారు. పైగా నోట్లకట్టలతో తనకు ఏ సంబంధమూ లేదని, అదంతా ఎవరో కుట్రపూరితంగా చేసిన పని అని చెప్పుకొచ్చారు’’ అని కమిటీ పేర్కొంది. ‘‘జస్టిస్ వర్మపై అభియోగాలు నిజమే అనేందుకు సరిపడా ఆధారాలు లభించాయి. ఈ అభియోగాలు ఆయన్ను అభిశంసించాల్సినంత తీవ్రమైనవి’’ అని స్పష్టం చేసింది. నివేదిక నేపథ్యంలో రాజీనామా చేయాల్సిందిగా కోరగా జస్టిస్ వర్మ నిరాకరించడం, దాంతో ఆయనను అభిశంసించాలంటూ కేంద్రానికి జస్టిస్ ఖన్నా సిఫార్సు చేయడం తెలిసిందే. అందుకోసం చట్టపరమైన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.నివేదిక ఏం చెప్పిందంటే... ‘‘అగ్నిప్రమాదం జరిగిన రాత్రి జస్టిస్ వర్మ నివాసంలో ఆయన కూతురితో పాటు మొత్తం 17 మంది ఉన్నారు. డబ్బు దొరికిన స్టోర్ రూమ్ పూర్తిగా జస్టిస్ వర్మ, ఆయన కుటుంబం నియంత్రణలోనే ఉంది. ప్రమాద సమయంలో దానికి లాక్ చేసి ఉంది. జస్టిస్ వర్మ, ఆయన కుటుంబానికి తప్ప ఇంకెవరూ దాన్ని తెరిచే అవకాశమే లేదు. పైగా ఆయన ఆరోపిస్తున్నట్టుగా ఎవరో బయటినుంచి స్టోర్ రూమ్‌లోకి ప్రవేశించే అవకాశం కూడా లేదు. నోట్ల కట్టలు స్టోర్ రూమ్ నిండా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అవి గది పొడవునా కనీసం అడుగున్నర ఎత్తున పరుచుకుని ఉన్నట్టు తుగ్లక్ నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. గదిలోని షెల్ఫ్ మీద సగం కాలిపోయిన నోట్లు కూడా అడుగున్నర ఎత్తున ఉన్నాయని చెప్పారు. గదిలో స్విచ్‌బోర్డు సమీపంలో ఉన్న మద్యం సీసాలకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత బాగా పెరిగింది. కాలిపోయిన నోట్ల కట్టలను వెంటనే గది నుంచి తొలగించేందుకు సిబ్బంది ప్రయతి్నంచారు. అగ్నిప్రమాదం గురించి జస్టిస్ వర్మకు ఆయన పీఏ రాజేందర్‌సింగ్ కర్కీ తొలుత సమాచారమిచ్చారు. ఆ రాత్రంతా ఆయనకు కాల్స్ చేస్తూ, ఎప్పటికప్పుడూ సమాచారమిస్తూనే ఉన్నారు. ఇంత జరిగినా నేరం జరిగినట్టు రుజువుల్లేవనే, జస్టిస్ వర్మ అందుబాటులో లేరనే కారణంతో ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అందుబాటులో ఉన్న ప్రత్యక్ష, ఎల్రక్టానిక్ సాక్ష్యాల ఆధారంగా జస్టిస్ వర్మపై అభియోగాలు నిజమేనని కమిటీ నిర్ధారణకు వచ్చింది.’’ఇప్పుడేం జరుగుతుంది? జస్టిస్ వర్మ అభిశంసనకు కేంద్రం సిద్ధమవుతోంది. ఆ మేరకు సీజేఐ ఖన్నా చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవలే రాజ్యసభ చైర్మన్‌కు, లోక్‌సభ స్పీకర్‌కు పంపినట్టు తెలుస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఓ కమిటీ వేస్తారు. దాని నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చిస్తారు. అనంతరం ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్‌లో అభిశంసన తీర్మానం నెగ్గితే జస్టిస్ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. -
ప్రాథమిక హక్కుల రక్షణ కోర్టు బాధ్యత
‘ఒక వ్యక్తి వెలిబుచ్చిన అభిప్రాయాలు చాలా మందికి నచ్చనప్పటికీ ఆ అభిప్రాయాలు వ్యక్తీకరించే వ్యక్తి హక్కులను గౌరవించాలి. అంతేకాదు రక్షించాలి.’ ‘ఏ ఖూన్ కే ప్యాసే బాత్ సునో’ అన్న జీవిత నేపథ్యం కలిగివున్న ఒక వీడియో క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినందుకుగాను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గఢీపై గుజ రాత్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్.ను గత మార్చి 28వ తేదీన సుప్రీంకోర్టు కొట్టివేస్తూ అన్న మాటలు అవి. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ప్రతాప్ గఢీ దాఖలు చేసిన పిటీషన్‌ను అనుమతిస్తూ... ‘ఆ పోస్ట్ ప్రచురించడం వల్ల ఎలాంటి నేరం జరగలే’దని పేర్కొంది. భావప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తీకరణ స్వేచ్ఛలను రక్షించాల్సిన బాధ్యత కోర్టుల మీద, పోలీసుల మీద ఉందని కోర్టు నొక్కి చెప్పింది.గతంలో భారత రాజ్యాంగ సభలో కమ్యూ నిస్ట్ పార్టీ ప్రతినిధిగా ఉన్న సోమ్‌నాథ్ లహరి ‘ప్రాథమిక హక్కుల అధ్యాయం ఒక పోలీస్ కాని స్టేబుల్ దృక్కోణం నుండి రూపొందించి నట్టు అనిపిస్తుం’దని వ్యాఖ్యానించారు. ఈ హక్కుల వినియోగం చట్టబద్ధమైనదా కాదా అన్నది నిర్ణ యించేది పోలీసులే అని ఆయన అన్నారు. ఈ అభిప్రా యంతో మనం ఏకీభవించకపోవచ్చు. కానీ ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులను చూస్తే ఆయన వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి.ఇమ్రాన్ ప్రతాప్ గఢీపై 2024 డిసెంబర్లో ఓ క్రిమినల్ కేసును పోలీసులు నమోదు చేశారు. దాన్ని సుప్రీంకోర్టు 2025 మార్చిలో కొట్టివేసింది. ఒక సామూహిక వివాహ కార్యక్రమం వీడియోను ఇమ్రాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచురించారు. ఆ వీడియో నేపథ్యంలో అతను రాసిన కవిత చది వారు. ఈ కవిత వివిధ వర్గాల ప్రజలను రెచ్చ గొట్టే విధంగా ఉందనీ, వారి మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని రేపేదిగా ఉందనీ ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. అందుకని ఆయనపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 196, 197 (1), 302, 299, 57, 3 (5) కింద కేసును నమోదు చేశారు. అంటే ప్రజా సమూహాల మధ్య శత్రుత్వం లేదా ద్వేషాన్ని కలిగించే చర్యలను, జాతీయ సమైక్య తకు భంగం కలిగించే చర్యలనీ; మత విశ్వా సాలను అవమానించడం, గాయపరచడం చేస్తుందనీ ప్రథమ సమాచార నివేదికలో ఆరోపించారు. ఈ ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ హైకోర్టులో దర ఖాస్తుని దాఖలు చేశారు. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని హైకోర్టు పేర్కొంటూ దర ఖాస్తును కొట్టివేసింది. గుజరాత్ హైకోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టివేయడాన్ని విమర్శిస్తూ సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించింది: ‘‘భారత రాజ్యాంగం అభయం ఇచ్చిన ప్రాథమిక హక్కు లను బలపరచడం, అమలు చేయడం కోర్టుల విధి. వాళ్ళు మాట్లాడిన మాటలు, రాసిన రాతలు న్యాయమూర్తులమైన మనకు నచ్చకపోవచ్చు. అయినప్పటికీ ఆర్టికల్ 19 (1) అభయం ఇచ్చిన భావ ప్రకటన, వ్యక్తీకరణ హక్కులను కాపాడా ల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ ఆదర్శాలను నిలబెట్టాల్సిన బాధ్యత న్యాయమూర్తుల మీద ఉంది. ప్రాథమిక హక్కులను కాపాడటం కోర్టుల విధి... ఈ హక్కులు ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండే అతి ముఖ్యమైన హక్కులు.’’ఇక పోలీసుల నిర్వాకాన్నీ కోర్టు గర్హించింది. ‘‘పోలీసు అధికారి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. రాజ్యాంగ ఆదర్శాలను గౌరవించాలి... దేశ పౌరులందరూ భావప్రకటనా స్వేచ్ఛను కలిగి వున్నారు. అది మన రాజ్యాంగ ఆదర్శాలలో ఒకటి. పోలీసులు కూడా దేశ ప్రజలే. వారు కూడా రాజ్యాంగానికి, అందులోని హక్కులకు కట్టుబడి ఉండాలి. ఇమ్రాన్ రాసిన కవిత ఏ మతాన్ని, కులాన్ని, భాషను ప్రస్తావించదు. ఏ మతానికి చెందిన వ్యక్తులను కూడా కవిత ప్రస్తావించదు. ఏ రకంగా చూసినా గ్రూపుల మధ్య శత్రుభావాన్ని ఈ కవిత కలిగించదు. జాతీయ ఐక్యతకి అవి ఎలా హాని కలిగిస్తాయో అర్థం కాదు’’ అని కోర్టు అభిప్రాయపడింది.నేర సమాచారం రాగానే కానిస్టేబుల్ కేసు నమోదు చేయాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెబుతుంది. ప్రాథమిక విచారణను చేయడానికి వెసులుబాటును ‘భారతీయ నాగరిక సురక్షా సంహిత’ కల్పించింది. ఈ కేసులో ప్రాథమిక విచారణ కూడా అవసరం లేదు. గుర్తించదగిన నేరమే జరగనప్పుడు ప్రాథమిక విచారణ అవసరం లేదు. సాహిత్యం, కళలు మన జీవితాలను అర్థవంతం చేస్తాయి. భావప్రకటనా స్వేచ్ఛ గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తుంది. ఇదే ఇమ్రాన్ ప్రతాపగఢీ కేసులో సుప్రీం తీర్పు సారాంశం.డా‘‘ మంగారి రాజేందర్ వ్యాసకర్త గతంలో జిల్లా సెషన్స్ జడ్జి -
అటు అక్షింతలు.. ఇటు బెదిరింపులు
సాక్షి, టాస్క్ ఫోర్స్: ఓవైపు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను శిరసావహిస్తూ విధుల్లో ముందడుగు వేస్తున్న అటవీ సిబ్బందికి..మరోవైపు కూటమి ప్రభుత్వ పెద్దలు అడ్డుపడుతున్నారు. ఏ చర్యా చేపట్టకూడదంటూ భీషి్మస్తున్నారు. ఈ నేపథ్యంలో కొల్లేరులో అటవీ శాఖ సిబ్బందికి విధులు కత్తిమీద సాములా పరిణమిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్రమ చెరువులకు గండ్లు పెట్టడానికి వెళ్లే అటవీ సిబ్బందిపైకి కూటమి నేతలు మహిళలను ఉసిగొల్పుతున్నారు. రాజకీయాలు, స్థానబలం ముందు అటవీ సిబ్బందికి ఏం చేయాలో ? ఎలా వ్యవహరించారో తెలియక పాలుపోని పరిస్థితి నెలకొంది. బహిరంగంగానే బెదిరింపులుఏలూరు జిల్లా కొల్లేరు ప్రాంతంలో ఇటీవల బహిరంగ సభ జరిగింది. అక్రమ చెరువులకు అటవీ సిబ్బంది అడ్డుతగులుతున్నారంటూ కొల్లేరు అక్రమార్కులు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధి«కి ఫిర్యాదు చేశారు. అంతే రేంజర్ స్థాయి అధికారిపై ఆయన బహిరంగ బెదిరింపులకు దిగారు. ఆనక అధికారిని ఆఫీసుకు పిలిపించి క్షమాపణ చెప్పారు. ‘కొల్లేరులో మిమ్మల్ని కట్టేస్తే నేను రాను. ఇక మీ ఇష్టం’ అంటూ కైకలూరుకు చెందిన మరో ప్రజాప్రతినిధి అటవీ సిబ్బందిని హెచ్చరించారు. ఇదే మండలం చటాకాయి గ్రామంలో అక్రమ చెరువులను ధ్వంసం చేయడానికి వెళితే గ్రామం ప్రారంభంలోనే టెంట్లు వేసి సిబ్బందిని రానివ్వలేదు. గోకర్ణపురం, పందిరిపల్లిగూడెం వద్ద కూటమి నేతలు అటవీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇలాంటి ఘటనలు కొల్లేరు గ్రామాల్లో కోకొల్లలు. అటు ఆంక్షలు.. ఇటు బేరసారాలు కొల్లేరు పరిధిలో అటవీ సిబ్బంది ఆంక్షల చట్రంలో నలిగిపోతున్నారు. అక్రమ చెరువులను గండి కొట్టడానికి వెళ్లే సిబ్బందికి స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వెంటనే ఫోన్లు వస్తుంటాయి. దీంతో ఏమీ చేయలేక వెనుదిరగాల్సి వస్తోంది. ఇంకొన్ని చోట్ల ‘మీరు మాకు సహకరించండి..మేము మీకు చూసుకుంటాం’ అనే ఒప్పందంతో కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పెదపాడు, ఏలూరు, భీమడోలు, నిడమర్రు, కైకలూరు, మండవల్లి, ఆకివీడు మొత్తం ఏడు ఫారెస్టు సెక్షన్లు ఉన్నాయి. వీటి పరిధిలో అభయారణ్యాన్ని రక్షించడానికి డీఎఫ్‌వో, రేంజర్, డీఆర్వో, సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ హెల్పర్లు, కార్యాలయాల్లో సిబ్బంది ఇలా దాదాపు 85 మంది విధులు నిర్వహిస్తున్నారు. కొల్లేరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు ఔట్ సోర్సింగ్‌లో అదే గ్రామాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆయా గ్రామాల్లో వీరు విధులు నిర్వహించడం పెద్ద సాహసంగా మారింది. కూటమి నేతలు చెప్పినట్టుగా చేయకపోతే వీరికి ఉద్యోగాలుండవని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.ఆడవాళ్లతో దాడులు కొల్లేరు ఆక్రమణలు, అక్రమ పట్టుబడుల గురించి ప్రశ్నించినా, వార్తలు రాసినా బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. ఈ సారి దాడుల మార్గాన్ని కొత్తగా ఎంచుకున్నారు. ఏకంగా ఆడవాళ్లను లారీల్లో తీసుకొచ్చి మరీ ఇళ్ళపై దాడి చేస్తాం అంటూ భయపెడుతున్నారు. ఈ లోగా కొల్లేరు మరమ్మతుల పేరుతో గట్ల విస్తీర్ణం పెంచుకుంటున్నారు. నేతల అండదండలతో ఆక్వా చెరువుల నుంచి ఎకరాకి ఇంతని కొల్లేరు పెద్దల ముసుగులో నాయకులు డబ్బులు వసూలు చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ఇలాంటి దాడులే కొల్లేరులో అటవీ సిబ్బందిపై ప్రస్తుతం సాగుతోన్న బెదిరింపులు, హెచ్చరికలను చూస్తుంటే...2014–2019 మధ్య కాలంలో చోటుచేసుకున్న దాడులే స్ఫురణకు వస్తాయి. ముఖ్యంగా 2016లో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు పోలీసు, ఫారెస్టు శాఖలపై దాడులే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఆ దాడుల్లో కొన్నింటిని చూస్తే.. » కొల్లేటికోట జాతర సమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లను చితకబాదారు. » మండవల్లి మండలం చింతపాడు, పులపర్రు, దయ్యంపాడు గ్రామాల్లో అటవీ సిబ్బందిని అడ్డుకున్నారు. జీపును సైతం పడేశారు. » గుమ్మళ్ళపాడులో కోడిపందేలను అడ్డుకున్న సురేశ్, గణేశ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను కొట్టారు. » తన వాహనాన్ని పెద్దింట్లమ్మ దేవస్థానానికి అనుమతించలేదని ఓ మాజీ సర్పంచ్ కానిస్టేబుల్ చొక్కా చింపేశాడు. » తమ మాటను లెక్క చేయలేదని వినోద్‌కుమార్, సునీల్‌కుమార్ అనే ఇద్దరు ఫారెస్టు అధికారులను బదిలీపై పంపించేశారు. » ప్రస్తుతం ఇలాంటి ఘటనలే పునరావృతమవుతుండటంతో అటవీశాఖ, పోలీసు శాఖ సిబ్బందిలో ఏం చేయాలో? ఎలా ముందుకెళ్లాలో? తెలియని పరిస్థితి నెలకొంది. కొల్లేరులో అక్రమంగా చేపల చెరువులను తొలగించండి. ఎందుకు వాటిని తొలగిస్తున్నారో స్థానికులకు అవగాహన కల్పించండి. అందుకు తగిన చర్యలు చేపట్టండి’ – అటవీ శాఖను ఆదేశించిన సుప్రీంకోర్టు‘ఏం చేయమంటారండీ.. ఇటు సుప్రీంకోర్టు నుంచి అక్షింతలు. అటు రాజకీయ నేతల నుంచి బెదిరింపుల మధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నాం. కరవమంటే కప్పకు .. విడవమంటే పాముకు కోపమన్న చందంగా మారింది మా పరిస్థితి’ –పేరు చెప్పడానికి ఇష్టపడని కొల్లేరు అభయారణ్యంలో పనిచేస్తున్న ఓ అటవీ అధికారి ఆవేదన‘అటవీ సిబ్బంది విధులకు ఎవరైనా అడ్డువస్తే సహించేది లేదు. చట్టపరంగా చర్యలు తప్పవు’ – ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు -
పేకాట సిగ్గుమాలిన పని కాదు
న్యూఢిల్లీ: పేకాట ఆడటం సిగ్గుమాలిన పని కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. జూదం, గ్యాంబ్లింగ్‌లో భాగంగా పేకాట ఆడితే మాత్రం నేరమని స్పష్టంచేసింది. ఎలాంటి గ్యాంబ్లింగ్, బెట్టింగ్తో సంబంధం లేకుండా, ఎలాంటి మోసంతో ప్రమేయం లేకుండా కేవలం వ్యక్తిగతంగా, సొంత వాళ్లతో సరదాగా ఆడితే తప్పుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రోడ్డు పక్కన ఆటవిడుపుగా పేకాట ఆడాడన్న కారణంతో కర్ణాటకలో ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బోర్డ్‌లో డైరెక్టర్ సభ్యత్వానికి దూరం చేయడం సబబుకాదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. కర్ణాటకలో గవర్నమెంట్ పోర్సలిన్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ హౌసింగ్ కో–ఆపరేటివ్ సొసైటీలో వైసీ హనుమంతరాయప్ప ఎన్నికల్లో అత్యధిక ఓట్లు గెలిచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యత్వం సాధించారు. అయితే రోడ్డుపక్కన పేకాట ఆడారన్న కారణంగా ఆయనపై రూ.200 జరిమానా వేసి, సభ్యత్వాన్ని రద్దుచేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు వచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టగా మే 14వ తేదీన ఆయనకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హౌసింగ్ సొసైటీలో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటూ తీర్పు వెలువర్చింది. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘ పేకాట అనేది నైతికంగా తప్పు కాదు. బెట్టింగ్, జూదం, గ్యాంబ్లింగ్‌లో భాగంగా ఆడితేనే నేరం. సరదాకి సొంత వాళ్లతో ఆడితే దానిని నేరంగా భావించొద్దు. ఈ కేసులో నిందితుడు హనుమంతరాయప్ప పేకాటకు బానిస కాదు. గ్యాంబ్లింగ్ చేయలేదు. కేవ లం విరామం, విశ్రాంతి వేళ మానసిక ప్రశాంతత కోసం పేకాట ఆడారు. 2020 ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించి డైరెక్టర్ల మండలిలో స్థానం సంపాదించిన ఈయనను పేకాట ఆడాడన్న ఒకే ఒక్క కారణం చూపి శిక్షించడం సహేతుకం అనిపించుకోదు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
కొలీజియంలోకి జస్టిస్ నాగరత్న
న్యూఢిల్లీ: మరో రెండేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి రికార్డ్ సృష్టించబోతున్న జస్టిస్ బీవీ నాగరత్న నేడు సుప్రీంకోర్టు కొలీజియంలో లాంఛనంగా సభ్యురాలు కాబోతున్నారు. ఇంతకాలం కొలీజియంలో సభ్యునిగా ఉన్న సుప్రీంకోర్టు మరో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా శుక్రవారం పదవీవిమరణ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఐదో సీనియర్ మోస్ట్ జడ్జి అయిన జస్టిస్ నాగరత్న మే 25వ తేదీ నుంచి అధికారికంగా సుప్రీంకోర్టు కొలీజియంలో కొనసాగనున్నారు. 2027 అక్టోబర్ 29వ తేదీదాకా ఆమె ఈ కొలీజియంలో కొనసాగుతారు. ఈలోపు అంటే 2027 సెపె్టంబర్ 23వ తేదీన అత్యంత సీనియర్ మోస్ట్ జడ్జి అర్హతతో ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఈమె 1989లో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన మాజీ సీజేఐ జస్టిస్ ఇ. సీతారామయ్య వెంకటరామయ్య కుమార్తె. జస్టిస్ నాగరత్న చేరికతో కొలీజియం సభ్యుల సంఖ్య ఐదుకు పెరగనుంది. ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి ఇందులో సభ్యులుగా ఉన్నారు. సోమవారం సీజేఐ కొలీజియంను సమావేశపరిచి సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఖాళీలపై వివరాలు వెల్లడించనున్నట్లు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. జస్టిస్ అభయ్ ఎస్.ఓకా రిటైర్ అయ్యాక సుప్రీంకోర్టులో మూడు జడ్జీ పోస్టులు ఖాళీ అయ్యాయి. 1993లో కొత్తగా మనుగడలోకి వచ్చిన సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ ద్వారానే సుప్రీంకోర్టు, 25 హైకోర్టులకు జడ్జీల ఎంపిక, బదిలీ, పదోన్నతి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. -
డీఎస్సీ పరీక్షను వాయిదా వేయలేం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను నిర్వహించిన తర్వాతే డీఎస్సీని నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. డీఎస్సీ పరీక్షను వాయిదా వేయలేమని పేర్కొంది. ఏటా రెండుసార్లు నిర్వహించాల్సిన టెట్‌ను గతేడాది అక్టోబర్‌లో నిర్వహించారని, ఆరునెలల్లో మరోసారి నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీని నిర్వహించడం వల్ల తమకు నష్టం జరుగుతుందని దేవిరెడ్డి దుర్గాశ్రీను, పి.హేమంత్ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ ధర్మాసనం శుక్రవారం విచారించింది. వాదనలు విన్న అనంతరం.. డీఎస్సీ అనేది ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, పిటిషనర్లు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టేసింది. ఇలాంటి అంశాల్లో పిటిషన్లు హైకోర్టులోనే దాఖలు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. -
సలహా కోరితే సమాధానమివ్వాలా?
మన రాజ్యాంగం వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విషయాలను సూచిస్తుంది. రాజకీయ వర్గాలకు, ప్రతికూలమైన తీర్పులను ఎత్తి చూపడానికి ఒక సాధనం కావచ్చు. న్యాయ వ్యవస్థకు మాత్రం ఇదొక వేగుచుక్క. చట్టపర మైన ప్రశ్నలపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరడానికి రాష్ట్రపతిని అనుమతించేదే ఆర్టికల్ 143. తాజాగా బిల్లులను పరిష్కరించడంలో గవర్నర్లు, రాష్ట్రపతి అధికారాలకు సంబంధించిన 14 ప్రశ్నలు వేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యాయసలహా కోరి దీన్ని ఉపయోగించారు.సాధారణ సందర్భాల్లో ఇది వివాదాస్పదం అయ్యేది కాదు. కానీ ఈ ప్రశ్నలు తమిళనాడు గవర్నర్ ఉదంతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తేల్చిచెప్పిన అంశాలనే తిరిగి పరిశీలించేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఒక క్లిష్టమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. రాష్ట్రపతి కోరుతున్న న్యాయ సలహా అనేది చట్టబద్ధమైన రాజ్యాంగ చర్యా లేదా సుప్రీం తీర్పును దొడ్డిదారిలో సమీక్షించే ప్రయత్నమా?కోర్టు సమాధానం చెప్పనక్కర్లేదు!ఇటీవల తమిళనాడు కేసు విషయంలో– మంత్రి మండలి సహాయం, సలహా ప్రకారమే గవర్నర్ పనిచేయాలనీ, బిల్లులను ఆమోదించే ప్రక్రియలో నిరవధికంగా ఆలస్యం చేయలేరనీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతితో సహా రాజ్యాంగ అధికారులు జవాబుదారీతనం లేకుండా లేదా కాలపరిమితిని దాటి వ్యవహరించలేరని కూడా ఆ తీర్పు పేర్కొంది. ఈ తీర్పు ఫలితంతో కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి చెందింది. ఫలితంగా ఇప్పటికే కోర్టు సమాధానం ఇచ్చిన వాటికి దాదాపు సమానమైన ప్రశ్నలను సంధి స్తున్న రాష్ట్రపతి న్యాయ సలహాకు కేంద్రం మద్దతు ఇచ్చింది.ప్రజా ప్రాముఖ్యం కలిగిన చట్టపరమైన విషయాలపై సుప్రీంకోర్టు న్యాయ సలహాను, అభిప్రాయాన్ని కోరడానికి ఆర్టికల్ 143 రాష్ట్రపతిని అనుమతిస్తుంది. కోర్టుకు మాత్రం అటువంటి న్యాయ సలహాకు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. 1964లో ప్రత్యేక సూచన నం.1లోనూ, అయోధ్య వివాదంపై 1993లో ప్రత్యేక సూచన నం.1లోనూ మనం చూసినట్లుగా, న్యాయ సలహాను ఇవ్వకుండా తిరస్కరించే విచక్షణ న్యాయస్థానానికి ఉంది.కావేరీ జల వివాదాల కేసులో (1998లో ప్రత్యేక సూచననం.1), కోర్టు అప్పటికే ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేయడానికి లేదారెండవ అభిప్రాయాన్ని కోరడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించ లేరని స్పష్టంగా పేర్కొంది. ‘రాజ్యాంగం ప్రకారం, అలాంటి అప్పీల్ అధికార పరిధి ఈ కోర్టుకు ఉండదు; ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి కూడా దానిపై సమీక్ష కోరలేరు... అటువంటి అధికారం ఆర్టికల్ 143లో ఉందనుకుంటే, అది న్యాయవ్యవస్థ స్వతంత్ర తలోకి తీవ్ర మైన చొరబాటు అవుతుంది’ అని నాడు కోర్టు నొక్కి చెప్పింది.పునఃపరిశీలన కోరుతున్నట్లయితే...రాష్ట్రపతి తాజాగా వేసిన 14 ప్రశ్నలు తమిళనాడు తీర్పులో ఇప్పటికే పరిష్కరించబడిన అనేక ప్రశ్నలను ప్రతిధ్వనిస్తాయి. గవర్నర్ ఒక బిల్లును అనేకసార్లు వెనక్కి ఇవ్వవచ్చా, లేదా ఆమోదం కోసం రాష్ట్రపతి నిర్దిష్ట కాలపరిమితికి కట్టుబడి ఉండాలా అనేవి వీటిలో ఉన్నాయి. వీటిని సుప్రీంకోర్టు అస్పష్టంగా వదిలివేయలేదు. అత్యంత స్పష్టతతో నిర్ణయం చెప్పేసింది. అందుకే రాష్ట్రపతి తాజా న్యాయ సలహా నివేదన నిజంగా స్పష్టతను కోరడం లేదనీ, పునఃపరి శీలన కోరుతోందనీ సూచిస్తుంది. అలా అయితే, ఇది చట్టపరమైన సమస్య కాదు. న్యాయవ్యవస్థ అంతిమం అనే పునాదినే ప్రశ్నిస్తోంది.2012లో 2జీ స్పెక్ట్రమ్‌పై న్యాయసలహా దీనికి ఒక ముఖ్యమైన మినహాయింపు. ఇక్కడ సుప్రీంకోర్టు మునుపటి తీర్పులోని అంశా లను స్పష్టం చేయడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించింది. కోర్టు 122 టెలికామ్ లైసెన్సులను రద్దు చేసిన తర్వాత, సహజ వనరులను కేటాయించడానికి వేలం మాత్రమే అనుమతించదగిన పద్ధతా అనే దానిపై నాటి కేంద్ర ప్రభుత్వం... సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాన్ని కోరింది. వేలం న్యాయమైన పద్ధతి అయినప్పటికీ, అది మాత్రమే రాజ్యాంగబద్ధమైన మార్గం కాదని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా, కోర్టు ఇచ్చిన ఈ స్పష్టత ప్రధానమైన తీర్పును భంగపరచలేదు. ఈ వ్యత్యాసం చాలా ముఖ్యమైనది. 2జీ విషయంలో, తన తీర్పును వెనక్కు తీసుకోవాలని కోర్టును ప్రభుత్వం అడగలేదు. కేవలం భవి ష్యత్ విధానంపై తనకు మార్గనిర్దేశం చేయాలని కోరింది.దీనికి విరుద్ధంగా, తాజాగా రాష్ట్రపతి కోరిన న్యాయ సలహా అనేది తమిళనాడు కేసు తీర్పులోని ప్రధాన విషయానికి వెళుతుంది. ఇది పరిణామాల వివరణ, లేదా భవిష్యత్ కేసులకు మార్గ దర్శకత్వం కోరదు. బదులుగా, కోర్టు ఇప్పటికే సమాధానం ఇచ్చిన ప్రశ్నలను తిరిగి లేవనెత్తుతుంది. దీన్ని అనుమతించడం అంటే సమీక్షను నియంత్రించే ఆర్టికల్ 137ను కార్యనిర్వాహక వర్గం దాటవేయవచ్చు. ఆర్టికల్ 143 ద్వారా కేసులను తిరిగి వ్యాజ్యం చేయవచ్చు. అది రాజ్యాంగపరంగా అనుమతించరానిది, అలాగే వ్యవస్థాగతంగా ప్రమాదకరమైనది.రాష్ట్రపతి కార్యాలయ గౌరవం నిలుపుతూనే...కోర్టుకు స్పందించాల్సిన బాధ్యత ఉందా? లేదు! ప్రత్యేక కోర్టుల బిల్లు కేసులో, కోర్టు ఒక సూచనకు సమాధానం ఇవ్వ డానికి నిరాకరించవచ్చనీ, కాకపోతే అలా చేయడానికి కారణా లను పేర్కొనాలనీ న్యాయస్థానం మాట. 2జీ కేసులో, న్యాయ సలహాను తిరస్కరించడానికి కోర్టు అనేక కారణాలను పొందు పర్చింది: (1) ప్రశ్నలను ఇప్పటికే పరిష్కరించి ఉంటే; (2) ప్రశ్నలు రాజకీయమైనవి అయితే; (3) అవి రాజ్యాంగ ప్రయోజనానికి ఉపయోగపడకపోతే; (4) అవి చట్టపరమైన ప్రాముఖ్యత కలిగిన సమస్యలను కలిగి ఉండకపోతే!తమిళనాడు తీర్పు స్పష్టంగా పరిష్కరించబడిన రాజ్యాంగ ప్రశ్నా విభాగంలోకి వస్తుంది. దీన్ని తిరిగి తెరవడం వల్ల న్యాయ నిర్ణయాల అంతిమత్వంపై సుప్రీం కోర్టుకు కాకుండా కార్య నిర్వాహక వర్గానికి ప్రాధాన్యతను కట్టబెట్టే ప్రమాదం ఉంది. ఇక్కడ రాజకీయ నేపథ్యాన్ని విస్మరించలేము. అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలోని గవర్నర్లు చట్టాలకు మోకాలడ్డేందుకు కాలయాపన వ్యూహాలను అనుసరించారు.ఇది రాజ్యాంగ ప్రశ్న కంటే ఎక్కువగా – రాజకీయంగా అడ్డుకొనే చర్య. ముఖ్యంగా రాజ్యాంగ సమీక్ష మార్గం ఎల్లప్పుడూ అందు బాటులో ఉన్నప్పుడు... రాష్ట్రపతి న్యాయ సలహాను సుప్రీంకోర్టు అంగీకరిస్తే, అది రాజకీయ ఒత్తిడికి లొంగి పోయినట్టు కనిపించే ప్రమాదం ఉంది. అయితే, కోర్టుకు ఇది క్లిష్టమైనదే. రాష్ట్రపతి కార్యాలయం పట్ల గౌరవాన్నీ, తన నిర్ణయాల సమగ్రతనూ కాపాడు కునే బాధ్యతను సమతుల్యం చేసుకోవాలి.ఈ న్యాయ సలహాను కోరడం నిజంగా తమిళనాడు కేసును తిరగదోడే ప్రయత్నమే అయితే, కోర్టు దానికి సమాధానం ఇవ్వడా నికి నిరాకరించాలి. న్యాయపరమైన తీర్పుల అంతిమత్వాన్ని తప్పించుకోవడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించలేమని స్పష్టంగా పేర్కొ నాలి. అయితే, భవిష్యత్ పాలన కోసం స్పష్టత అవసరమయ్యేఅంశాలు తీర్పులో ఉంటే, కోర్టు సమాధానం ఇవ్వడానికి ఎంచు కోవచ్చు. కానీ అది తన మునుపటి నిర్ణయానికి చెందిన అధికారాన్ని నీరుగార్చకుండా చూసుకోవాలి.ఆర్టికల్ 143 రాజకీయంగా తప్పించుకునే మార్గంగా కాకుండా చట్టపరమైన స్పష్టత కోసం ఒక సాధనంగా ఉద్దేశించబడింది. రాష్ట్రపతి కోరిన ఈ న్యాయ సలహాను పరిశీలన లేకుండా స్వీకరిస్తే, అది కోర్టు అధికారాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది. కోర్టు రాజ్యాంగ వ్యాఖ్యాతగా మాత్రమే కాకుండా, దాని సంరక్షకురాలిగా కూడా వ్యవహరించాలి. సమాధానం ఇవ్వడానికి నిరాకరించడం అనేది రెండింటినీ కాపాడుకోవడానికి స్పష్టమైన మార్గం కావచ్చు.-వ్యాసకర్త సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-సంజయ్ హెగ్డే -
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు
న్యూఢిల్లీ: ‘‘సుప్రీంకోర్టు చాలావరకు ప్రధాన న్యాయమూర్తిపైనే ఆధారపడి పని చేస్తోంది. అది సరికాదు. అత్యున్నత న్యాయస్థానం ‘సీజేఐ–కేంద్రిత’ ఇమేజీని తక్షణం వదిలించుకోవాల్సిన అవసరం చాలా ఉంది’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా అభిప్రాయపడ్డారు. ‘‘సుప్రీంకోర్టు ఇటీవలే 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో దేశానికి ఎంతో సేవ చేసిందనడంలో సందేహం లేదు. కానీ ప్రజలు తనపై పెట్టుకున్న ఆకాంక్షలను మాత్రం నెరవేర్చలేకపోయిందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం’’ అని చెప్పారు. ‘‘సుప్రీంకోర్టుకు ఇది ఉత్సవ సమయం కాదు. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం’’ అని హితవు పలికారు. అంతేకాదు, సుప్రీంకోర్టు కంటే హైకోర్టుల పనితీరే ప్రజాస్వామికంగా ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు! ‘‘హైకోర్టుల్లో తొలి ఐదు న్యాయమూర్తులతో కూడిన పాలక కమిటీ ఉంటుంది. అదే ప్రధాన నిర్ణయాలన్నీ తీసుకుంటుంది. కమిటీలు, నిర్దారిత రోస్టర్ల ద్వారా హైకోర్టుల్లో కార్యకలాపాలు సజావుగా సాగిపోతాయి. కానీ సుప్రీంకోర్టులో అలా కాదు. కార్యకలాపాలన్నీ ప్రధానంగా సీజేఐ ఆధారితంగా సాగుతాయి’’ అంటూ ఆక్షేపించారు. ‘‘సుప్రీంకోర్టు అధికారాలను పూర్తిగా వికేంద్రీకరించాలి. కేసుల లిస్టింగ్ పూర్తి పారదర్శకంగా జరగాలి. లిస్టింగ్, కోర్టు కార్యకలాపాల నిర్వహణలో టెక్నాలజీ వాడకం మరింతగా పెరగాలి’’ అంటూ కీలక సూచనలు చేశారు. ఇవన్నీ ప్రస్తుత సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ హయాంలోనే కార్యరూపం దాలుస్తాయని ఆశాభావం వెలిబుచ్చారు. జస్టిస్ ఓకా శుక్రవారం రిటైరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతూ పలు కీలకాంశాలను లేవనెత్తారు. ‘‘హైకోర్టులతో పోలిస్తే సుప్రీంకోర్టు తన పనితీరు విషయంలో సీజేఐపై విపరీతంగా ఆధారపడుతుంది. అక్కడ న్యాయమూర్తిగా చేసిన ఈ మూడేళ్లలో దీన్ని బాగా గమనించాను. సుప్రీంకోర్టులో దేశ నలుమూలల నుంచి వచ్చే 34 మంది న్యాయమూర్తులు ఉంటారు. అలాంటప్పుడు సీజేఐ ఆధారిత ఇమేజీ ఏమాత్రమూ సరికాదు. సుప్రీంకోర్టు మరింత సమ్మిళిత, నిర్మాణాత్మక వ్యవస్థగా మారాల్సిన అవసరముంది’’ అని స్పష్టం చేశారు. లిస్టింగ్ సమస్యలు సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్ విషయంలోనూ తక్షణం పరిష్కరించాల్సిన అంశాలున్నాయని జస్టిస్ ఓకా చెప్పారు. ‘‘కొన్ని కేసులు మర్నాడే విచారణకు వస్తాయని, మరికొన్ని రోజుల తరబడి పెండింగ్‌లో ఉండిపోతాయని చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. కేసుల లిస్టింగ్ విషయంలో హైకోర్టులు ఫిక్స్డ్ రోస్టర్‌ను పాటిస్తాయి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో పూర్తి పారదర్శక విధానాన్ని అనుసరించాలి’’ అని సూచించారు. ‘‘కేసుల లిస్టింగ్‌లో హేతుబద్ధత చాలా ముఖ్యం. వాటిని ఎవరూ వేలెత్తి చూపకుండా చూసుకోవాలి. మానవ ప్రమేయాన్ని పూర్తిగా తగ్గిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇందుకు కృత్రిమ మేధ తదితర పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి. సుప్రీం కేవలం రాజ్యాంగ న్యాయస్థానం మాత్రమే కాదు. అపెల్లెట్ కోర్టు కూడా. కనుక రోజువారీ విధుల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత వంటివి చాలా ముఖ్యం’’ అని కుండబద్దలు కొట్టారు. న్యాయవ్యవస్థకు వెన్నెముక వంటి ట్రయల్, జిల్లా కోర్టులను హైకోర్టులు, సుప్రీంకోర్టు చిరకాలంగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయని జస్టిస్ ఓకా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రయల్ కోర్టుల్లో 30 ఏళ్లుగా పెండింగ్ కేసులు భారీగా పేరుకుపోయాయని గుర్తు చేశారు.వీడ్కోలు ప్రసంగాలు అంత ఈజీ కాదువీడ్కోలు ప్రసంగాలు రాసుకోవడం అంత సులువు కాదంటూ చమత్కరించారు. ‘‘గత రెండు వారాలు భా రంగా గడిచా యి. ఎన్నో తీర్పు లు రాయాల్సొచ్చింది. వాటిని బుధవారానికల్లా పూర్తి చేసి గురువారం వీడ్కోలు ప్రసంగం సిద్ధం చేసుకుందామనుకున్నా. కానీ ఊపిరి సలపని కార్యభారం వల్ల కుదరనే లేదు’’ అని చెప్పుకొచ్చారు. న్యాయమూర్తిగా రెండు దశాబ్దాల పై చిలుకు కెరీర్లో మెజారిటీ తీర్పుతో తాను ఎన్నడూ విభేదించలేదన్నారు. ఇప్పట్లో ఇంటర్వ్యూలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడేందుకు కాస్త సమయం కావాలన్నారు. నమ్మకమిచ్చిన తీర్పరి జస్టిస్ ఓకాపై సీజేఐ ప్రశంసలు జస్టిస్ ఓకాకు సీజేఐ గవాయ్ భావోద్వేగభరింతగా వీడ్కోలు పలికారు. ఆయన తన తీర్పు లతో అసంఖ్యాకులకు న్యాయవ్యవస్థపై నమ్మ కం కలిగించారని కొనియాడారు. ‘‘దాదాపు సమాంతరంగా సాగిన కెరీర్లు మా ఇద్దరివీ. న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తొలినాళ్లలోనే ఆయన అపార ప్రజ్ఞ అందరినీ ఆకట్టుకుంది. ప్రతి వాదనకూ పూర్తిగా సంసిద్ధమై వచ్చేవారు. న్యాయమూర్తిగానూ అదే ఒరవడి కొనసాగించారు. రెండు రోజుల క్రితమే తల్లిని పోగొట్టుకున్నారు. అయినా అంత్యక్రియలు జరిగిన మర్నాడే విధులకు హాజరై 11 తీర్పులు వెలువరించారు. అంతటి అంకితభావమున్న అద్భుతమైన న్యాయమూర్తికి ఈ రోజు వీడ్కోలు పలుకుతున్నాం’’ అన్నారు. న్యాయమూర్తులతో పాటు యువ న్యాయవాదులకు జస్టిస్ ఓకా స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. -
బెట్టింగ్ యాప్స్ స్మోకింగ్ కన్నా డేంజర్: కేఏ పాల్
సాక్షి, న్యూఢిల్లీ: బెట్టింగ్ యాప్స్ వల్ల ఇప్పటికే వేల మంది చనిపోయారని, ఇకనైనా ఆ తరహా మరణాలు సంభవించకూడదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్(Betting Apps) వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఆయన వేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్కే సింగ్ బెంచ్ విచారించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణ వాయిదా వేసింది. ఈ పరిణామంపై కేఏ పాల్(KA Paul) మీడియాతో మాట్లాడారు. ‘‘బెట్టింగ్ యాప్స్ పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.అవసరమైతే రాష్ట్రాలకు కూడా నోటీసులు పంపిస్తామని పేర్కొంది. బెట్టింగ్ యాప్‌ల వల్ల ఇప్పటికే వేల మంది చనిపోయారు. లక్షలు, కోట్లు అప్పులు చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్యలను అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని? ప్రశ్నిస్తూ సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది.. .. సిగరెట్ త్రాగితే హానికరం అని ఉంటుంది. స్మోకింగ్ కంటే మిలియన్ టైమ్స్ డేంజర్.. బెట్టింగ్ యాప్స్. దాదాపు 1,100 లకు పైగా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ కోసం ప్రమోషన్ చేస్తున్నారు. బదులుగా కోట్ల రూపాయలను తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల భవిష్యత్ లో ఆత్మహత్యలు జరక్కుండా చూడాల్సిన అవసరం ఉంది. మనీల్యాండరింగ్ జరగకుండా ఉండాలంటే.. బెట్టింగ్ యాప్ లను నిషేధించేలా కేంద్రం(Centre) చట్టం తీసుకురావాలి అని కేఏ పాల్ ఆకాంక్షించారు.ఇదీ చదవండి: అద్భుతమైన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు -
ఆమే నేరంగా చూడడం లేదు.. అరుదైన తీర్పిచ్చిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: పోక్సో చట్టం కింద శిక్ష పడ్డ ఓ వ్యక్తికి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఊరట ఇచ్చింది. ఆర్టికల్ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగిస్తూ అతని శిక్షను రద్దు చేసింది. ఇదొక అరుదైన కేసుగా పేర్కొన్న సుప్రీం కోర్టు(Supreme Court) అద్భుతమైన తీర్పు ఇస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.‘‘కుటుంబం ఆమెను వదిలేసింది. వ్యవస్థ ఆమెను నిందించింది. న్యాయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. చట్టం దృష్టిలో ఇది నేరమే అయి ఉండొచ్చు. కానీ, బాధితురాలే జరిగిన దానిని నేరంగా పరిగణించడం లేదు. ఇప్పుడు ఆమె వేదనల్లా.. నిందితుడికి శిక్ష పడకుండా రక్షించుకోవాలని. అందుకోసమే ఆమె పోలీస్, న్యాయవ్యవస్థలతో పోరాడుతోంది. ఈ కేసులోని వాస్తవాలు.. ప్రతీ ఒక్కరికీ ప్రతి ఒక్కరికీ కంటి తెరుపు. .. నిందితుడితో బాధితురాలికి ఉన్న భావోద్వేగ అనుబంధం, వారి ప్రస్తుత కుటుంబ జీవితంతో సహా అసాధారణ పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని ‘‘పూర్తి న్యాయం’’ అందించేందుకు ఆర్టికల్ 142(Article 142) కింద అధికారాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా,జస్టిస్ ఉజ్జయ్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. తద్వారా అతని శిక్ష రద్దు చేస్తున్నట్లు జస్టిస్ ఓకా తీర్పు వెల్లడించారు. సంచలన కేసుగా..పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వ్యక్తి తన 24 ఏళ్ల వయసులో 15 ఏళ్ల మైనర్ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే.. ఆ తర్వాత మైనార్టీ తీరాక ఆమెనే అతను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ జంట పిల్లలతో సంతోషంగా జీవిస్తోంది. అయితే అప్పటికే అతనిపై పోక్సో యాక్ట్(POCSO Act) కింద కేసు నమోదు అయ్యింది. కింది కోర్టులో 20 ఏళ్ల కారాగార శిక్షపడడంతో.. కేసు కలకత్తా హైకోర్టుకు చేరింది. అయితే.. 2023లో ఈ కేసు విచారణ సందర్భంగా సదరు వ్యక్తికి ఊరట ఇచ్చిన హైకోర్టు, తీర్పు ఇచ్చే ప్రయత్నంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలికలు తమ లైంగిక కోరికలు అణుచుకోవాలంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పును సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు.. కోల్‌కతా హైకోర్టు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. కిందటి ఏడాది ఆగష్టులో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసి నిందితుడికి శిక్షను పునరుద్ధరించింది. అయితే బాధితురాలు/అతని భార్య విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని శిక్షను అమలు చేయకుండా.. ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించింది. ఈ కేసులో బాధితురాలి ప్రస్తుత మానసిక స్థితి పరిశీలన కోసం నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయించింది సుప్రీం కోర్టు. ఏప్రిల్ సీల్డ్ కవర్లో అందిన ఆ నివేదికను పరిగణనలోకి తీసుకున్న ద్విసభ్య ధర్మాసనం తాజాగా.. బాధితురాలి భర్తకు ఊరట ఇస్తు తీర్పు వెల్లడించింది.ఇదీ చదవండి: ఏకంగా 27 సార్లు బెయిల్ పిటిషన్ వాయిదా? -
బెయిల్ పిటిషన్ 27సార్లు వాయిదానా?
న్యూఢిల్లీ: సీబీఐ నమోదు చేసిన చీటింగ్ కేసులో నిందితుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను 27సార్లు వాయిదా వేసిన అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశంపై విచారణను 27 సార్లు వాయిదా ఎలా వేస్తారు?’ అంటూ ప్రశ్నించింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ మసీహ్‌ల ధర్మాసనం లక్ష్య తవార్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై గురువారం విచారణ సందర్భంగా ఇలా వ్యాఖ్యలు చేసింది. తవార్కు బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం, సీబీఐకి నోటీసు జారీ చేసింది. ‘సాధారణంగా కేసు వాయిదాలకు సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోం. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశంపై 27 పర్యాయాలు వాయిదా వేసి, పెండింగ్‌లో ఉంచడం అసాధారణమైన విషయం. ఈ వ్యవహారాన్ని పరిశీలించాల్సి ఉంది’ అని సీజేఐ పేర్కొన్నారు. కాగా, తవార్పై వివిధ నేరారోపణలకు సంబంధించిన 33 కేసులున్నందున, మరింత ఆలస్యం కాకుండా విచారణను వేగవంతం చేయాలంటూ మార్చి 20న తవార్ బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా సందర్భంగా అలహాబాద్ హైకోర్టు దిగువ న్యాయస్థానానికి ఉత్తర్వులు జారీ చేసింది. -
నీట్–పీజీ సీట్లు బ్లాక్ చేయకుండా కఠినచర్యలు తీసుకోవాలి
న్యూఢిల్లీ: పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ల విషయంలో కొన్ని కాలేజీలు ముందుగానే సీట్లు బ్లాక్ చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నీట్–పీజీకి సంబంధించి కౌన్సెలింగ్‌కు ముందే ఫీజుల వివరాలు బహిర్గతం చేయాలని అన్ని ప్రైవేట్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలను ఆదేశించింది. సీట్ల బ్లాకింగ్ వల్ల అవకాశం కోల్పోయిన ఇద్దరు అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలని అలహాబాద్ హైకోర్టు గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని, లక్నోలోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టర్ జనరల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. మెడికల్ పీజీ సీట్లను ముందుగానే బ్లాక్ చేసి, ఇష్టా్టనుసారంగా విక్రయించుకోవడం అనేది తప్పుడు చర్య మాత్రమే కాకుండా, వ్యవస్థలో లోపాలకు ఉదాహరణ అని వెల్లడించింది. పారదర్శకత లేకపోవడానికి, ప్రభుత్వ విధానాలు బలహీనంగా ఉండడానికి నిదర్శనమని తెలియజేసింది. సీట్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌన్సెలింగ్‌కు ముందే ఫీజులను వెల్లడించడం తప్పనిసరి అని స్పష్టంచేసింది. ట్యూషన్, హాస్టల్ ఫీజులు, కాషన్ డిపాజిట్‌తోపాటు ఇతర ఫీజులను విద్యార్థులకు తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. నేషనల్ మెడికల్ కమిషన్ ఆధ్వర్యంలో కేంద్రీకృత ఫీజుల నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. సీట్లు బ్లాక్ చేసే కాలేజీలకు జరిమానాలు విధించాలని స్పష్టంచేసింది. ఆయా కాలేజీలపై అనర్హత వేటు వేయాలని పేర్కొంది. -
మతాలన్నింటి సారం ఒక్కటే
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) చట్టం–2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మూడు రోజులపాటు జరిగిన వాదనలు గురువారం ముగిశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్‌తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. వక్ఫ్ అనేది కేవలం ఒక సేవా కార్యక్రమం అని, అది ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదని తుషార్ మెహతా పేర్కొనగా, కపిల్ సిబల్ స్పందిస్తూ... మరణానంతర జీవితం కోసం దేవుడికి, సమాజానికి సేవ చేయడమే వక్ఫ్ అని తేల్చిచెప్పారు. ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం భగవంతుడికి అంకితంకావడం వక్ఫ్ అని వివరించారు. సీజేఐ జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. హిందూ మతస్తుల్లో మోక్షం అనే భావన ఉందని గుర్తుచేశారు. జస్టిస్ అగస్టీన్ జార్జి స్పందిస్తూ.. క్రైస్తవ మతంలోనూ అలాంటి భావనే ఉందన్నారు. స్వర్గానికి చేరుకోవడానికి క్రైస్తవులు ఆరాటపడుతుంటారని తెలిపారు. అనంతరం రాజీవ్ ధావన్ మాట్లాడుతూ కేంద్రం వాదనను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. వేదాల ప్రకారం చూస్తే హిందూ మతంలో దేవాలయాలు తప్పనిసరి భాగం కాదని చెప్పారు. ప్రకృతిని ఆరాధించే ఆచారం హిందూ మతంలో ఉందన్నారు. అగ్ని, నీరు, వర్షం, పర్వతాలు, సముద్రాలను దేవుళ్లుగా పూజిస్తుంటారని గుర్తుచేశారు. దాదాపు అన్ని మతాల్లో సేవా భావన ఉందని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. మతాల్లో అదొక ప్రాథమిక సూత్రమని వెల్లడించారు. సేవా కార్యక్రమాల విషయంలో మతాలన్నింటి సారం ఒక్కటేనని, వాటి మధ్య భేదం లేదని పరోక్షంగా తెలియజేశారు. మరోవైపు వక్ఫ్(సవరణ) చట్టాన్ని చట్టబద్ధంగానే తీసుకొచ్చారని, ఇది చట్టవిరుద్ధమని సాక్ష్యాధారాలతో సహా నిరూపించాల్సిన బాధ్యత పిటిషనర్లదేనని సీజేఐ సూచించారు. పార్లమెంట్ ఆమోదంతో తీసుకొచి్చన చట్టంపై స్టే ఇవ్వొద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఎందుకు? సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను కూడా సభ్యులుగా నియమించాలన్న నిబంధనను చట్టంలో చేర్చడాన్ని కపిల్ సిబల్ తప్పుపట్టారు. హిందూ ధార్మిక సంస్థల్లో హిందూయేతరులకు ప్రవేశం ఉండదని తెలిపారు. అలాంటప్పుడు వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. వక్ఫ్(సవరణ) చట్టంపై సుప్రీంకోర్టు ఉత్తర్వు శుక్రవారం వెలువడే అవకాశం ఉంది. -
హద్దులన్నీ దాటుతోంది
న్యూఢిల్లీ/చెన్నై: దేశంలో సమాఖ్య పాలన భావనను తీవ్రంగా ఉల్లంఘిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బరితెగించి ఇష్టారీతిగా ప్రవర్తిస్తోందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తనకు ఇష్టమొచ్చినట్లు దర్యాప్తు చేయడం కోసం హద్దులను మీరి మరీ విపరీత పోకడలతో కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడు రాష్ట్ర మద్యం రిటైలర్ సంస్థ అయిన ‘‘తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్)’’పై నిబంధనలకు విరుద్ధంగా మనీలాండరింగ్ కేసు దర్యాప్తు జరుపుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల ధర్మాసనం గురువారం ఈడీపై ఆగ్రహ అక్షింతలు చల్లింది. తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే టాస్మాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోందని, ఉన్నతాధికారులను ముఖ్యంగా మహిళలను గంటల తరబడి వేధించి, భయపెడుతోందని తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్ వేసిన పిటిషన్‌ను గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈడీ దర్యాప్తు తీరును తీవ్రంగా ఆక్షేపించింది. వెంటనే తమిళనాడు రాష్ట్ర లిక్కర్ రిటైలర్ సంస్థపై ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తిట్లతో తలంటు డీఎంకే సర్కార్, టాస్మాక్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అమిత్ ఆనంద్ తివారీలు వాదించారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు సుప్రీంకోర్టు తిట్లతో తలంటు పోసింది. ‘‘ఒక ప్రభుత్వ కార్పొరేషన్ అనేది నేరం ఎలా చేయగలదు?. ఈడీ అన్ని చట్టబద్ధ హద్దులను దాటేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సమాఖ్య విధానానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడుతోంది’’అని సీజేఐ జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తంచేశారు. ఈడీ దర్యాప్తు చట్టవిరుద్ధంగా సాగుతోందని, అందుకే వెంటనే దర్యాప్తుపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వెంటనే అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కల్పించుకుని ‘‘దర్యాప్తును ఆపకండి. దాదాపు రూ.1,000 కోట్ల అక్రమాలు జరిగాయి. కనీసం ఈ ఒక్క కేసులోనైనా ఈడీ హద్దులు దాటలేదని భావించండి’’అని వేడుకున్నారు. రాజు వాదనలను కపిల్ సిబల్ తప్పుబట్టారు. ‘‘మద్యం దుకాణాల లైసెన్సుల జారీ అంతా సక్రమంగా ఉన్నాసరే అక్రమాలు జరిగాయని అనవసరంగా నేర విచారణను ఈడీ మొదలెట్టింది. 2014 ఏడాది నుంచి ఇప్పటిదాకా అక్రమంగా డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగాలతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేయించారు. ఇప్పుడు కొత్తగా ఈడీ రంగంలోకి దిగి అన్యాయంగా టాస్మాక్ కార్యాలయాలపై చట్టవ్యతిరేకంగా దాడులు చేస్తోంది. మహిళా అధికారులను గంటల తరబడి టాస్మాక్ ఆఫీసుల్లోనే నిర్బంధించి ఈడీ అధికారులు వేధించారు. వ్యక్తిగత వస్తువులను లాక్కుని గోప్యతకు, ప్రాథమిక హక్కులకు భంగం కల్గించారు’’అని సిబల్ వాదించారు. ఈడీ దర్యాప్తును సమర్థిస్తూ ఏప్రిల్ 23వ తేదీన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, టాస్మాక్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. రాష్ట్రాల హక్కులను కూలదోస్తోంది సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ సైతం తన వాదనలను బలంగా వినిపించింది. ‘‘ఈడీ ప్రవర్తన సమాఖ్య విధానాన్ని కూలదోసేలా ఉంది. రాష్ట్రాల హక్కులను ఈడీ కాలరాస్తోంది. తమ పరిధిలోని నేరాల విచారణ రాష్ట్రాలకు సంబంధించిన విషయంకాగా ఈడీ రాష్ట్రాల హక్కులను అన్యాయంగా, బలవంతంగా లాక్కుంటోంది’’అని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. ఈఏడాది మార్చి ఆరో తేదీ నుంచి మార్చి 8వ తేదీదాకా ఏకధాటిగా 60 గంటలపాటు రాష్ట్రంలో ఈడీ చేసిన సోదాలు, తనిఖీలు, దాడులు, జప్తుల పర్వానికి చట్టబద్ధత ఉందా? అని తమిళనాడు సర్కార్ ఈడీని సుప్రీంకోర్టులో నిలదీసింది. ‘‘మార్చి ఆరో తేదీన టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం సోదాలు, జప్తులు చేశామని ఈడీ చెబుతోంది. కానీ టాస్మాక్ అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని సంస్థ. ఇప్పటిదాకా అక్రమంగా నమోదైన ఎఫ్ఐఆర్లలో ఏ ఒక్క దాంట్లోనూ టాస్మాక్ పేరును ‘నిందితుల జాబితా’లో పేర్కొనలేదు. ఎలాంటి ఆరోపణలు లేని, నిందితుల జాబితాలో లేని సంస్థ పరిధిలో, ప్రాంగణాల్లో ఈడీకి విచారణ, దర్యాప్తు చేసే హక్కు లేదు. పీఎంఎల్ఏ చట్టం సైతం ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోంది’’అని తమిళనాడు సర్కార్ కోర్టులో వాదించింది. ‘‘2021లో చివరిసారిగా ఎఫ్ఐఆర్ నమోదైతే ఇంత ఆలస్యంగా సోదాలు చేయడమేంటి?. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం నమ్మశక్యమైన కారణాలు ఉంటేనే దర్యాప్తు/సోదాలు జరపాలి. కానీ ఈడీ ఈ నిబంధనను గాలికొదిలేసింది. సరైన లక్ష్యంలేకుండా రంగంలోకి దూకి అడ్డదిడ్డంగా దర్యాప్తు చేస్తోంది’’అని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఈడీని సుప్రీంకోర్టు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా కేసుల్లో పలు సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఈడీ వైఖరిని తప్పుబట్టాయి. మనీ లాండరింగ్ చట్ట నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. బీజేపీకి చెంపదెబ్బ: సుప్రీంకోర్టు నిర్ణయంపై డీఎంకే వ్యాఖ్య టాస్మాక్ కేసులో సుప్రీంకోర్టు స్టే నిర్ణయం కేంద్రంలోని బీజేపీకి చెంపదెబ్బలా తగిలిందని తమిళనాడులోని పాలక డీఎంకే పార్టీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు డీఎంకే సీనియర్ నాయకుడు, పార్టీ కార్యదర్శి(వ్యవస్థాగతం) ఆర్ఎస్ భారతి గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ‘‘టాస్మాక్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను మేం స్వాగతిస్తున్నాం. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలోని లేని రాష్ట్రాలపై ఈడీని ఉసిగొల్పుతున్నారు. 2021లో తమిళనాడులో ఎంకే స్టాలిన్ సారథ్యంలో డీఎంకే సర్కార్ కొలువుతీరాక ఈ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఈడీని రంగంలోకి దింపారు. తాజాగా కోర్టు ఉత్తర్వులు చూశాకైనా బీజేపీ ఈడీని దుర్వినియోగం చేయడం మానుకుంటే మంచిది. తమిళనాడులో మరో 7–8 నెలల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే ఈడీ సోదాలు చేసింది’’అని ఆర్ఎస్ భారతి అన్నారు. కోర్టు నిర్ణయాన్ని విపక్ష పారీ్టలు సైతం స్వాగతించాయి. -
రాజ్యాంగం, ‘సుప్రీం’ మధ్య విడదీయరాని బంధం
న్యూఢిల్లీ: దేశంలో ప్రాథమిక హక్కుల పరిధిని మరింత విస్తరింపజేయడంలో సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషిస్తోందని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. 75 ఏళ్ల సుప్రీంకోర్టు ప్రయాణాన్ని భారత రాజ్యాంగం నుంచి విడదీసి చూడలేమని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మధ్యవర్తిత్వం, ఎన్నికల ప్రక్రియ వంటి ముఖ్యమైన అంశాల్లో మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా న్యాయస్థానం తీర్పులు ఇస్తున్నట్లు వివరించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూరుస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ బి.ఆర్.గవాయ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల స్మారక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాది మన రాజ్యాంగం, సుప్రీంకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాయని, ఇది చరిత్రాత్మక సందర్భమని వ్యాఖ్యానించారు. రెండింటి మధ్య విడదీయరాని బంధం కొనసాగుతున్నట్లు స్పష్టంచేశారు. ఇవి ఒకే నాణేనికి రెండు ముఖాలు అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టును రాజ్యాంగమే సృష్టించిందని, రాజ్యాంగ ఆదేశాల ప్రకారమే సుప్రీంకోర్టు పనిచేస్తోందని ఉద్ఘాటించారు. అదేసమయంలో రాజ్యాంగానికి సుప్రీంకోర్టు అత్యుత్తమ రక్షణ కవచంగా వ్యవహరిస్తోందని జస్టిస్ గవాయ్ వివరించారు. జస్టిస్ ఓకా పని రాక్షసుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్.ఓకా తనకు మంచి మిత్రుడు, పని రాక్షసుడు జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. జస్టిస్ ఓకా ఈ నెల 24న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో బుధవారం సుప్రీంకోర్టు అడ్వొకేట్–ఆన్–రికార్డు అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ మాట్లాడారు. జస్టిస్ ఓకాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. న్యాయ వ్యవస్థకు ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. జస్టిస్ ఓకా మాట్లాడుతూ.. జస్టిస్ గవాయ్ అసలైన ప్రజాస్వామ్యవాది అని కొనియాడారు. -
ఆ వాఙ్మూలం ముమ్మాటికీ చెల్లదు!
ఆంధ్రప్రదేశ్ మద్యం విధానం కేసులో కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసే సమయంలో సహనిందితుల నేరాంగీకార వాఙ్మూలానికి సంబంధించి హైకోర్టు అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేవలం సహనిందితుడి నేరాంగీకారం ఆధారంగా ఒక వ్యక్తి బెయిల్‌పై నిర్ణయం తీసుకోరాదని వ్యాఖ్యానించింది. సీఆర్పీసీ 161 సెక్షన్ కింద ఇచ్చిన వాఙ్మూలాన్ని మరొకరికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ‘భారతీయ సాక్ష్యాల చట్టం–1872’ సెక్షన్ 30 కింద తుది విచారణ సందర్భంగా ఏ వాఙ్మూలాలను అయితే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందో, వాటిని ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో పిటిషనర్లకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఎందుకు నిరాకరించింది అనేది ముఖ్య మైన ప్రశ్న. రిజిస్టర్ చేసిన కేసులో ఆరోపణలు తీవ్రమైనవి. ఐపీసీ సెక్షన్ 409, 420, 12బి, రెడ్ విత్ సెక్షన్ 34, 37 కింద ఈ కేసు నమోదయ్యింది. అయితే, ముందస్తు బెయిల్‌ను కొట్టివేసే సమయంలో సహనిందితుని వాఙ్మూలానికి సంబంధించి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సెక్షన్ 30కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. సహనిందితుడి పోలీసు భయం ఆధారంగా నేరాంగీకార ప్రకటన నిలబడదనీ, కనుక అలాంటి అరెస్టు చెల్లదనీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చెప్పారా, చెప్పించారా?నేరాలు చేసినప్పుడు సాక్ష్యాలు దొరకవు. పరిశోధనలో, దర్యా ప్తులో కొన్ని సాక్ష్యాలు దొరుకుతాయి. పోలీసులు న్యాయంగా సాక్ష్యాలు సేకరిస్తే, అందులో లంచగొండితనం లేకపోతే నిజాలు రుజువయ్యే అవకాశం ఉంటుంది. కానీ మన లోకంలో, లౌక్యంలో ఏం చెప్పగలం? అందరికీ తెలుసు, పోలీసులు నాలుగు తగిలిస్తే తప్ప నిజాలను కక్కడం సాధ్యం కాదు అంటారు. చాలా వరకు నిజం. కానీ తన్నినప్పుడు చెబుతున్నారా, లేక తంతున్నప్పుడు దెబ్బలు భరించలేక నేరాన్ని ఒప్పుకొంటున్నారా? ఈ రెండిటికీ చాలా తేడా ఉంటుంది. ‘దెబ్బలు నా వల్ల కాదు’ అనుకున్నపుడు, దానికన్నా నేరం ఒప్పుకొంటే కోర్టుకు పోయేదాకా బతికిపోవచ్చు అనుకుంటారు. కనుకనే పోలీసుల హింసలో చెప్పిన అంశాలను కోర్టులో చూపినప్పుడు, ఆ నిందితుడు ఇదంతా హింసించడం వల్ల రాసిందే గానీ నిజం కాదని చెప్పినప్పుడే తగాదా మొదలవుతుంది. అక్కడే లాయర్లు వస్తారు. నేరం రుజువు కాదు. నేరాంగీకారం రుజువు కాదు. సహ నింద భరించే గతి!నేర విచారణలో ఒక నిందితుడు, మరొక వ్యక్తి కూడా ఆ నేరంలో పాలు పంచుకున్నాడని వాఙ్మూలం ఇస్తే, సంబంధిత రెండవ వ్యక్తి సహ నిందితుడు అవుతాడు. పోలీసులు చెప్పించుకున్న నేరాంగీ కారం వాడుకుని మొదటి వాడినీ, తరువాత రెండో వాడినీ కూడా జైలుకు పంపిస్తారు. అప్పుడు బెయిల్ కోసం పోరాటం ప్రారంభ మవుతుంది. అది లాయర్ల భారీ ఫీజు ఆధారంగా, కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టుదాకా న్యాయ పోరాటం సాగుతూ ఉంటుంది. అందుకే తీర్పులు ఆలస్యమవుతాయి. వాయిదాలు వస్తాయి. అప్పీల్సు ఉంటాయి. మధ్యలో తాత్కాలిక ఆర్డర్స్ వస్తాయి. (అంటే అంతిమ నిర్ణయం వంటిది కాకుండా వచ్చే తాత్కాలిక ఉత్తర్వు ఇస్తారు. అక్కడ ఉన్నపుడే, తరువాతి స్థాయి, అంటే సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో అన్యాయంగా జైలుకు పోకుండా బెయిల్ హక్కుల్ని కాపా డుకుని విడుదల అవుతూ ఉంటారు. మన పత్రికా భాషలో ‘నిందితు డికి సుప్రీం నుంచి ఊరట’ అని అంటూ ఉంటాం.)సీఆర్పీసీ సెక్షన్ 161 కింద (ఇది పాత కేసు. పాత నేరం కావడం వల్ల కొత్త ఎన్డీఏ సర్కారు రచించిన భారతీయ న్యాయ చట్టాలను ఈ సందర్భంలో ఉటంకించడం లేదు. కూడదు. లేకపోతే అయోమ యంలో పడిపోతాం) అనుమానితుడి వాఙ్మూలానికి విలువ ఉన్న ప్పటికీ, పోలీసులకు చెప్పిన నేరాంగీకారాన్ని వాడుకుంటూ సహనిందితుడిని అరెస్టు చేయడం న్యాయమా? నేరారోపణ అనే గుడ్డ కాల్చి మొఖాన పారేసినప్పుడు జైల్లో పడేస్తారు. అందులో నిజా నిజాలు తేలకుండానే ఉన్నప్పుడు ఏం చేయాలి? బెయిల్ ఇవ్వాల్సిందే! రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని చెప్పగలిగితే, ఆయా అంశాలను కోర్టు విశ్వసిస్తే, పోలీసులను నమ్మని దశలో బెయిల్ దొరుకుతుంది. అంటే పోలీసులు సాధించిన నేరాంగీకారాల ఆధారంగా నిందితులు, అనుమానితులు అనే పేరుతో అమాయకులను జైలుకు పంపిస్తే, కోర్టే దిక్కు. న్యాయమూర్తులు, జిల్లా స్థాయి న్యాయాధికారులు... మంత్రుల వంటి పెద్దల వీవీఐపీ కేసులని భయపడకుండా ఉత్తర్వులు ఇస్తేనే బెయిల్ దొరుకుతుంది. న్యాయం లభిస్తుంది. ఊరట లభిస్తుంది. ఇది అటువంటి కేసు! వారి ఆరోప ణలు నిజమో కాదో ఇప్పుడే చెప్పలేము. కానీ మొదటి దశలోనే పోలీసుల భయం ఆధారంగా వచ్చిన నేరాంగీకారాలు తీసుకుని అరెస్టు చేయకూడదు.మన ‘కొత్త’ నేర చట్టాలుమన ‘భారతీయ’ సాక్ష్య చట్టం కొత్తది కాదు. ఇది ఆంగ్లేయులు రాసిపెట్టిన సాక్ష్యాల చట్టం... ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. భారతీయ సాక్ష్యాల చట్టం 1872 నుంచి... అంటే 153 ఏళ్ల నుంచి అమలులో ఉన్న చట్టం. (మనం అంతా కొత్త చట్టాలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్నాం. పాత సాక్ష్య చట్టపు నియమం కొత్త న్యాయ చట్టంలోనూ ఉంది.) పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకొంటే అనుమానం ఉంటుంది. కనుక ఆ వాఙ్మూలానికి ఆమోద యోగ్యత ఉండదు. ఇది సెక్షన్లు 24, 25, 30 కింద అనుమానితమైన ప్రకటన అని 153 సంవత్సరాల నాటి సూత్రం. దీనిపైన ఎన్నో వందల కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. నేరాంగీకారాన్ని అనుమానిస్తారు. పోలీసుల సమక్షంలో, లాకప్‌లో, లేదా మరెక్కడైనా సరే కొందరు పోలీసులు ఎదురుగా ఉండినప్పుడు ఈ అనుమానం బలవంతం అని అనుకుంటారు. చట్టం తెలియకపోయినా, సాధారణంగా మామూలు మనుషులకు కూడా ఈ విషయం తెలుసు. భారత శిక్షాస్మృతి (ఐపీసీ), భారతీయ సాక్ష్య చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ భారతదేశ న్యాయ వ్యవస్థలపైన, సమాజం పైన, న్యాయస్థానా ల్లోనూ ఇప్పటికీ నిలబడిన చట్టాలు. 153 సంవత్సరాల నుంచి ఈ సూత్రాలు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇవి మౌలిక మైన సూత్రాలు. ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా అమలు చేయ వలసిన సూత్రాలు. బ్రిటిష్ వారి సూత్రాలు కాబట్టి పనికిరావని అనుకోవడానికి వీల్లేని నియమాలు ఇవి. ఆ సూత్రాలను కాపాడుకుంటూ కొన్ని మార్పులు చేశారు. అయితే, ఈ చట్టాలు మన న్యాయ వ్యవస్థకు పునాదిగా ఉన్నప్పటికీ, ఆధునిక భారతదేశ సంక్లిష్టతలను పరిష్కరించడానికి ఇబ్బంది పడ్డాయి. అందుకే 2020లో ప్రొఫెసర్ (డాక్టర్) రణ్‌బీర్ సింగ్ అధ్యక్షత వహించిన ‘కమిటీ ఫర్ రిఫార్మ్స్ ఇన్ క్రిమినల్ లాస్’ (సీఆర్‌సీఎల్) ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రూపొందించిన కొత్త చట్టాల పేర్లు ఇవి: భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియమం, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత.బెదిరిస్తే, ప్రలోభ పెడితే...నేరారోపణకు గురైన వ్యక్తి చేసిన అంగీకారం ఏదైనా ప్రేరేపణ లేదా బెదిరింపు లేదా లాభం చేస్తామనే వాగ్దానంతో జరిగినట్లు కనిపిస్తే, ఆ వ్యక్తి నేరాంగీకారం అసంబద్ధం. ఇది కీలకమైన సూత్రం. పోలీసు కస్టడీలో నేరాంగీకరణ విషయంలో ఇది కీలకమైన సుప్రీంకోర్టు తీర్పు. తాజాగా 2022లో కూడా ఇంద్రేశ్ కుమార్ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 161 కింద ఇటువంటి నేరాంగీకారాన్ని ఒప్పుకోవడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, ‘వికాస్ సిమెంట్స్’ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్‌కై హైకోర్టుకు వెళ్లారు. ఆపై సుప్రీంకు అప్పీలు చేశారు. ‘నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాఙ్మూలాన్ని సహనిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రం’ అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడమే కాక, దీనిపై సంపూర్ణ వివరణ ఇచ్చింది. బెయిల్ మంజూరు సమయంలో కోర్టులు ఆ యా అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని నిర్దేశించింది. ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో సహనిందితుల వాఙ్మూలా లను పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
బెయిలుకు జైల్లో ఏడాది గడపాలని రూలేం లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో బెయిలివ్వాలంటే ఏడాదిపాటు జైలులో గడపాలన్న నిబంధనేదీ లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రూ.2 వేల కోట్ల లిక్కర్ కుంభకోణంలో గతేడాది ఆగస్ట్‌లో అరెస్టయిన వ్యాపారవేత్త అన్వర్ ధెబార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లో ధర్మాసనం విచారణ చేపట్టింది.ఈ సందర్బంగా ధెబార్ అరెస్టయి ఏడాది కూడా కాలేదని, ఆయనకు బెయిలివ్వరాదని ఈడీ న్యాయవాది వాదించారు. వివిధ కేసుల్లో బెయిల్ మంజూరుకు అత్యున్నత న్యాయస్థానం ‘ఏడాది కస్టడీ బెంచ్‌మార్క్’ను అనుసరిస్తోందని, ఈ కేసులోనూ దీనినే కొలమానంగా తీసుకోవాలని అన్నారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన ధెబర్‌ను విడుదల చేస్తే దర్యాప్తు ఆటంకం కలగొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో, ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది.‘మొత్తం ఈ కేసులోని 450 మంది సాక్షులకు గాను ఇప్పటి వరకు 40 మంది విచారణ మాత్రమే పూర్తయింది. విచారణ సమీప భవిష్యత్తులో ముగిసే సూచనలు కనిపించడం లేదు. దర్యాప్తు పురోగతిలో ఉంది. గరిష్ట శిక్షాకాలం ఏడేళ్లు కాగా ఇప్పటికి 9 నెలలపాటు పిటిషనర్ జైల్లో ఉన్నారు’అని ధర్మాసనం పేర్కొంది. అయితే, ప్రత్యేక కోర్టు పేర్కొనే కఠిన షరతులు, నిబంధనలకు లోబడి ధెబర్‌ను వారం రోజుల్లో బెయిల్‌పై విడుదల చేయాలని దిగువ కోర్టుకు ఉత్తర్వులిచ్చింది పాస్‌పోర్టును అధికారులకు అప్పగించాలని అన్వర్ ధెబార్‌ను ఆదేశించింది. -
విచారణలో ఉన్నా చర్చించవచ్చు!
ఏదైనా కేసుపై విచారణ జరుగుతున్నా, లేదా కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నా ... ఆ కేసును మీడియా ప్రస్తావించడం, చర్చించడం, విమర్శించడం తప్పు కాదని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసు విషయంలో అభిప్రాయపడింది. ఇప్పటివరకూ అలా ప్రసార మాధ్యమాల్లో ప్రస్తావించడం తప్పుగా భావించేవారు. ప్రజాస్వామ్యంలో పటిష్ఠమైన చర్చలు, నిర్మాణాత్మక విమర్శలను స్వాగతించాల్సిన అవసరం ఉందనీ, బలమైన చర్చలతోనే ఆత్మపరిశీలన సాధ్యమవుతుందనీ కూడా కోర్టు పేర్కొంది. న్యాయవ్యవస్థ, మీడియా ప్రజాస్వామ్య మూల స్తంభాలనీ, ఇవి రెండూ పరస్పరం అనుబంధంతో కొనసాగాలనీ, అప్పుడే స్వేచ్ఛాయుత ప్రజా స్వామ్యం పరిఢవిల్లు తుందనీ సుప్రీం పేర్కొంది.వికీమీడియా ఫౌండేషన్‌పై ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఏఎన్ఐ) ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్ విచారణలో ఉంది. అయినా ఆ ఫౌండేషన్ తాను నడుపుతున్న ‘వికీపీడియా’ వెబ్సైట్లో ఆ కేసు వివరాలు పోస్ట్ చేసింది. దీంతో ఏఎన్ఐ అభ్యర్థన మేరకు హైకోర్టు ఈ కేసు వివరాలున్న వెబ్ పేజీని తొలగించాలని వికీమీడియాను ఆదేశించింది. వికీమీడియా ఈ విషయంలో సుప్రీం కోర్టు మెట్లెక్కడంతో అత్యు న్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ హైకోర్టు ఆదేశాలను రద్దుచేసింది. న్యాయస్థానాలు ప్రజలకు సంబంధించిన బహిరంగ వ్యవస్థలనీ, అక్కడ జరిగే అంశాలు, ప్రస్తావనలు ప్రజలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారనీ, అందువల్ల వాటిని గోప్యంగా ఉంచా ల్సిన అవసరం లేదనీ సుప్రీం పేర్కొంది. అలాగని మీడియా విచ్చలవిడిగా వ్యవహరిస్తే కోర్టులు సహించవని సున్నితంగా హెచ్చరించింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో న్యాయస్థానాలను అప్రతి ష్ఠపాలు చేసినా, న్యాయ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా వార్తలు రాసినా, చర్చలు జరిపినా తీవ్రంగా పరిగ ణిస్తామని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ మెరుగుపడాలన్నా ఆత్మపరిశీలన అవస రమనీ, అప్పుడే మెరుగైన ఫలితాలు వెలువడే అవకాశాలు ఉంటాయనీ పేర్కొంటూ, ఇందుకు న్యాయ వ్యవస్థ కూడా మినహాయింపు కాదని స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. మీడియాకు మరింత స్వేచ్ఛ సమకూరడం ఆహ్వా నించదగిన పరిణామమే. అయితే భద్రతా కార ణాల రీత్యా ‘రహస్యం’ (ఇన్ కెమెరా)గా నిర్వహించే విచారణకు ఈ తీర్పు ‘పెనుముప్పు’గా మారే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా, ఎటు వంటి నియంత్రణా లేని సామాజిక మాధ్యమాలకు అడ్డూ అదుపు ఉంటాయా? సంచలనాల పేరుతో మరింత చెలరేగి పోయేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే విచ్చలవిడిగా, బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్న ‘కొన్ని’ సోషల్ మీడియా వేదికలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్రాణాలకు తెగించి వార్తా ప్రసారాలు చేసే చానళ్లు, వార్తలు ప్రచురించే పత్రికలు ఈ తీర్పును మరింత బాధ్యతాయుతంగా ఉపయోగించుకుంటాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ‘గోప్యత హక్కు’ (రాజ్యాంగ అధికరణం 21), అధికారిక రహస్యాల చట్టం, కోర్టు ధిక్కార చట్టం (1971) ఇత్యా దిగా గల చట్టాల సంగతి ఏం కాను? సుప్రీం తాజా తీర్పును ‘యథాతథం’ (ట్రూ స్పిరిట్ )గా అర్థం చేసుకుంటే సానుకూల ఫలితాలు చారెడు. విపరీతా ర్థాలు తీసి, ఇష్టానుసారం వక్రీకరిస్తే అనర్థాలు బారెడు. అందుకే సంయమనంతో మీడియా సంస్థలు వ్యవహరించాల్సి ఉంటుంది.ప్రొ‘‘ పీటా బాబీ వర్ధన్ వ్యాసకర్త మీడియా విశ్లేషకులు -
హైకోర్టు జడ్జిజలందరికీ సమాన పెన్షన్
న్యూఢిల్లీ: మాజీ న్యాయమూర్తుల పెన్షన్ తదితరాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘‘నియామక తేదీ, పద్ధతి, పదవీకాలం తదితరాలతో నిమిత్తం లేకుండా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులందరికీ సమాన పెన్షన్ అందజేయాల్సిందే. ఎందుకంటే హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన రోజునుంచే వారు రాజ్యాంగపరమైన శ్రేణిలోకి వస్తారు. కనుక అలాంటి రాజ్యాంగపరమైన పదవుల విషయంలో వన్ ర్యాంక్, వన్ పెన్షన్ విధానమే పాటించాలి’’ అని స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్, న్యాయమూర్తులు జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీ, జస్టిస్ కె.వినోద్‌చంద్రన్ ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని, గౌరవాన్ని నిలబెట్టేందుకు న్యాయమూర్తుల వేతనాల్లాగే వారి పదవీ విమరణ ప్రయోజనాలు కూడా ఒకేరకంగా ఉండటం తప్పనిసరి అని సీజేఐ గవాయ్ అభిప్రాయపడ్డారు. ‘‘హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు, పెన్షన్ తదితరాల విషయంలో వారి నియామక తేదీ, బాధ్యతల తరహా (శాశ్వత, అదనపు న్యాయమూర్తులు), నేపథ్యం (బార్, జిల్లా స్థాయి న్యాయవ్యవస్థ) వంటివి ప్రాతిపదిక అసలే కారాదు. అది వివక్షాపూరితమే గాక ఆర్టికల్ 14కు విరుద్ధం కూడా’’ అని పేర్కొంది. ఈ మేరకు 63 పేజీల తీర్పు వెలువరించింది. ‘‘జిల్లా న్యాయా« దికారులుగా, బార్ సభ్యులుగా వారి సేవలను, అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, జిల్లా న్యాయాధికారిగా రిటైరయ్యాక హైకోర్టు న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించడానికి మధ్యలో ఉండే అంతరం వంటివి కూడా తక్కువ పెన్షన్‌కు ప్రాతిపదిక కావడానికి వీల్లేదు. నూతన పెన్షన్ పథకం (ఎన్పీఎస్) అమల్లోకి వచ్చాక బాధ్యతలు చేపట్టినా సరే, హైకోర్టు న్యాయమూర్తుల (వేతనాలు, సర్వీసు నిబంధనల) చట్టం, 1954 ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ తదితరాలకు కూడా వారు పూర్తిగా అర్హులు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. రిటైర్డ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులకు రూ.15 లక్షలు, న్యాయమూర్తులకు రూ.13.5 లక్షల చొప్పున మౌలిక వార్షిక పెన్షన్ అందించాలని పేర్కొంది. రిటైర్డ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తుల మరణానంతరం సంబంధీకులకు కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ తదితరాలను నిరాకరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అలాగే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయమూర్తులకు, జిల్లా న్యాయమూర్తులకు కూడా పదవీ విరమణ ప్రయోజనాలు సమానంగా ఉండాలని ఆదేశించింది. -
మొసలి కన్నీళ్లు వద్దు
న్యూఢిల్లీ: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యల కేసులో మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షా క్షమాపణలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘‘న్యాయ విచారణ నుంచి బయటపడేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నట్లు నటిస్తారు. మొసలి కన్నీరు కారుస్తారు. మీ క్షమాపణ అలాగే ఉంది. హైకోర్టులో మీరు క్షమాపణలు చెప్పిన వీడియో చూశాం. ఏదో కోర్టు అడిగింది కదా అని చెబుతున్నట్లుగా ఉంది. సూటిగా తప్పు ఒప్పుకుంటూ నేరుగా క్షమాపణలు చెప్పి ఉండాల్సింది. కానీ మీరేం చేశారు? అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, వాటివల్ల ఎవరైనా బాధ పడి ఉంటే అంటూ నానా వంకలూ తిప్పారు. ఇదెక్కడి క్షమాపణ? తప్పు ఒప్పుకునే పద్ధతేనా ఇది? ఇలాంటి వ్యవహార శైలికి సిగ్గుపడాలి మీరు’’ అంటూ తూర్పార బట్టింది. ‘‘నిజాయితీగా, మన స్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి అభ్యంతరం ఎందుకు? మీ వ్యాఖ్యలతో యావత్ దేశం సిగ్గుపడుతోంది’’ అంటూ తీవ్రంగా మందలించింది. ఈ విషయంలో మంత్రిని అత్యున్నత న్యాయస్థానం గత వారమే తీవ్రంగా మందలించడం, కల్నల్ ఖురేషీకి క్షమాపణలు చెప్పాలని ఆదేశించడం తెలిసిందే. ఆ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టులో మంత్రి క్షమాపణలు చెప్పారు. తనపై కేసు కొట్టేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మంత్రి క్షమాపణలు చెప్పిన తీరుపై జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘అలాంటి మొసలి కన్నీళ్లు వద్దు. కనుక మీ క్షమాపణలు అవసరం లేదు. మీలాంటి వాళ్ల విషయంలో ఎలా వ్యవహరించాలో మాకు బాగా తెలుసు’’ అని స్పష్టం చేశారు. ‘‘మీరో సీనియర్ రాజకీయ నాయకుడు. చాలా ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నారు. ప్రతి మాటా ఆచితూచి మాట్లాడాలి. తద్వారా అందరికీ ఆదర్శంగా నిలవాలి. కానీ మీరేం చేశారు? కల్నల్ ఖురేషీపై వ్యాఖ్యల వీడియో పూర్తిగా చూశాం. మీరు దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో మరింత అభ్యంతరకర పదజాలం కూడా వాడబోయారు. సమయానికి పదాలు దొరక్క ఆగిపోయారంతే! మన సైన్యం ఘనతను చూసి దేశమంతా గర్విస్తుంటే మీరేమో ఇలాంటి మతిలేని మాటలకు దిగారు. ఇలాంటి వ్యవహార శైలికి సిగ్గుపడాలి మీరు!’’ అంటూ మండిపడ్డారు.సిట్‌లో మహిళా ఐపీఎస్మంత్రి వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వంపైన ధర్మాసనం ఆగ్రహం వెలిబుచ్చింది. దర్యాప్తు ప్రగతిపై పోలీసులను ప్రశ్నించి వారి సమాధానంపై పెదవి విరిచింది. ఈ కేసు దర్యాప్తుకు ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లతో సిట్ ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని ధర్మాసనం ఆదేశించింది. ‘‘మంగళవారం ఉదయం పదింటికల్లా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటవ్వాలి. ముగ్గురు ఐపీఎస్‌లూ రాష్ట్రానికి చెందని వారై ఉండాలి. ఒక మహిళా ఐపీఎస్ ఉండాలి. మే 28లోగా సిట్ తొలి నివేదిక సమర్పించాలి’’ అని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ వివరాలను వెల్లడించిన కల్నల్ సోఫియా ఖురేషీని ఉగ్రవాదుల సోదరిగా వర్ణిస్తూ విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. వాటిని మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించింది.దేశం ధర్మసత్రం కాదు శరణార్థులకు ఆశ్రయం కుదరదుశ్రీలంకవాసి కేసులో ‘సుప్రీం’ వ్యాఖ్యలుశరణార్థులు దేశం వీడాలని ఆదేశంన్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులందరికీ ఆశ్రయం ఇవ్వడానికి భారత్ ధర్మసత్రమేమీ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత్‌లో ఆశ్రయం ఓ శ్రీలంక శరణార్థి పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భారత్ ఇప్పటికే 140 కోట్లకు పైగా జనాభాతో సతమతమవుతోంది. శరణార్థులకు ఆశ్రయమివ్వడానికి దేశం ధర్మసత్రం కాదు’’ అని పేర్కొంది. శరణార్థులు తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశించింది. వారికి భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఎల్టీటీఈతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 2015లో అరెస్టయిన శ్రీలంకవాసి పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ప్రాథమిక హక్కుల్లో భాగంగా పిటిషనర్‌కు స్వేచ్ఛగా జీవించే హక్కుందని ఆయన తరఫున లాయర్ వాదనను జస్టిస్ దీపాంకర్ దత్తా తోసిపుచ్చారు. ఆ హక్కు భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఎల్టీటీఈ కార్యకర్త అనే అనుమానంతో పిటిషనర్ 2015లో అరెస్టయ్యాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిషేధ) చట్టం కింద దోషిగా తేలడంతో 2018లో పదేళ్ల జైలు శిక్ష పడింది. 2022లో మద్రాస్ హైకోర్టు దాన్ని ఏడేళ్లకు తగ్గించింది. శిక్ష ముగియగానే భారత్ వీడాలని, అప్పటిదాకా శరణార్థి శిబిరంలో ఉండాలని ఆదేశించింది. వాటిని సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ‘‘2009లో శ్రీలంక యుద్ధంలో ఎల్టీటీఈ సభ్యుడిగా పోరాడినందున అక్కడ నన్ను బ్లాక్ గెజిటెడ్‌గా ఉంచారు. కనుక శ్రీలంకలో నాకు ప్రాణహాని ఉంది. నా భార్య పలు వ్యాధులతో, కుమారుడు పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుతో బాధపడుతున్నారు. వారు భారత్‌లోనే స్థిరపడ్డారు. నేను కూడా వారితో పాటు ఇక్కడే ఉండిపోతా’’ అని అభ్యర్థించాడు. శ్రీలంకలో ప్రాణహాని ఉందని వాదించాడు. దానితో జస్టిస్ దత్తా పూర్తిగా విభేదించారు. ‘‘అయితే మాత్రం ఇక్కడ స్థిరపడేందుకు మీకేం హక్కుంది? మరే దేశమైనా వెళ్లండి’’ అని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు. రోహింగ్యా శరణార్థుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ‘‘ఐరాస శరణార్థుల కార్డుల వంటివి ఉన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్రమంగా దేశంలోకి చొరబడి ఉంటే తిప్పి పంపించేయాల్సిందే’’ అని ఆదేశించింది. -
బిట్‌కాయిన్‌పై స్పష్టమైన విధానం ఎందుకు లేదు?
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల నియంత్రణ విషయంలో స్పష్టమైన విధానాన్ని కేంద్రం ఎందుకు తీసుకురాలేకపోతోంది? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బిట్‌కాయిన్ ట్రేడింగ్‌ను చట్టవిరుద్ధమైనదిగా, హవాలా వ్యాపారంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాంతర మార్కెట్ కలిగి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నట్టు పేర్కొంది. నియంత్రణల ద్వారా క్రిప్టోకరెన్సీ ట్రేడ్లపై దృష్టి సారించొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. గుజరాత్లో బిట్‌కాయిన్ ట్రేడ్ వ్యాపారానికి సంబంధించిన కేసులో నిందితుడు శైలేష్ బాబూలాల్ భట్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ అభిప్రాయాలు వ్యక్తం చేసింది. 2020లో ఆర్బీఐ సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో దేశంలో బిట్‌కాయిన్ ట్రేడింగ్ చట్టవిరుద్ధం కాదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. -
‘మిమ్మల్ని క్షమాపణలు ఎవరు అడిగారు?’
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో కీలక భూమిక పోషించిన కల్నల్ ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు(సోమవారం, మే 19) విచారణలో భాగంగా విజయ్ షా చెప్పిన క్షమాపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.‘క్షమాపణలు ఏమిటి..?, అవి ఏ రకమైన క్షమాపణలు. క్షమాపణలు చెబుతున్నామంటే దానికి ఎంతో కొంత అర్థం ఉండాలి. ఇది విచారణ నుంచి బయటపడటానికి కార్చే మొసలి కన్నీరా?, మీకు ఎలాంటి క్షమాపణ ఉంది?, మిమ్మల్ని కోర్టు క్షమాపణలు చెప్పమని అడిగిందా?, మరి ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు?, మీరు ఆ మహిళా అధికారిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత మీరు నిజాయితీగా క్షమాపణలు కోరిన సందర్భం ఏమైనా ఉందా?, మరి ఇక్కడ ఎందుకు మాకు క్షమాపణలు చెబుతున్నారు?’అంటూ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. అదే సమయంలో విజయ్ షాపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన స్సెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్(సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ సిట్ ను రేపటి(మంగళవారం) ఉదయానికల్లా ఏర్పాటు చేయాలంటూ ఆదేశాల్లో పేర్కొంది. ఒక మహిళా అధికారిని నియమించి మే 28 నాటికి నివేదిక సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది.అసలేమిటీ వివాదం? మంత్రి విజయ్ షా గత మంగళవారం(మే 13వ తేదీ)ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రసంగించారు. కల్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల సోదరి అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘‘జమ్మూకశీ్మర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు హిందువుల బట్టలు విప్పి, మతం నిర్ధారించుకొని కాల్చి చంపారు. ఉగ్రవాదుల బట్టలు మనం విప్పలేకపోయాం. కాబట్టి వారి మతానికి చెందిన ఒక సోదరిని(సోఫియా ఖురేషీ) పంపించాం. మా సోదరీమణులను ఉగ్రవాదులు వితంతవులుగా మార్చారు.అందుకే మీ మతంలోని ఒక సోదరి మిమ్మల్ని వివస్త్రలుగా మారుస్తుంది. పహల్గాం ఉగ్రవాద దాడి పట్ల ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాదుల సోదరిని పాకిస్తాన్‌పైకి పంపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరూపించారు’’అని విజయ్ షా పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలకు అతీతంగా మాజీ సైనికాధికారులు కూడా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
సుప్రీంకు రాష్ట్రపతి లేఖను వ్యతిరేకిద్దాం
సాక్షి, చెన్నై: పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లుల ఆమోదం విషయంలో తనకు గడువు విధించడంపై రాష్ట్రపతి ముర్ము సుప్రీంకోర్టుకు లేఖ రాయడాన్ని ఐకమత్యంతో వ్యతిరేకిద్దామంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు, సమన్వయంతో కూడిన చట్టపరమైన వ్యూహం రూపొందించుకుందామని పిలుపునిచ్చారు. ‘‘తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రశ్నించడమే రాష్ట్రపతి లేఖ ఉద్దేశం. అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పును ధిక్కరించలేమని తెలిసి కూడా రాష్ట్రపతిపై ఒత్తిడి తెచ్చి కేంద్రమే ఆమెతో లేఖ రాయించింది. దీని వెనుక మోదీ ప్రభుత్వ దురుద్దేశం వెల్లడవుతోంది’’ అంటూ పశ్చిమ బెంగాల్, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, కేరళ, జార్ఖండ్, పంజాబ్, జమ్మూకశీ్మర్ సీఎంలను స్టాలిన్ కోరారు. -
అంబేడ్కర్ భావజాలమే ఆదర్శం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ భావజాలమే నాకు ఆదర్శం. ఆయన మార్గమే నన్ను సీజేఐగా నిలబెట్టింది’’అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్ తెలిపారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) శనివారం ఘనంగా సన్మానించింది. యువ న్యాయవాది నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగేదాకా తన న్యాయ ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయాలను సీజేఐ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘చిన్నతనంలో నాకు ఆర్కిటెక్ట్ కావాలనే కోరిక ఉండేది. కానీ అంబేడ్కర్ ఆశయ సాధన, ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన ఆవశ్యకతను తండ్రి సూచించడంతో న్యాయ వృత్తిని ఎన్నుకున్నా. న్యాయమూర్తిగా అవకాశం వచి్చనప్పుడు స్వీకరించాలా వద్దా అన్న మీమాంసలో పడ్డా. న్యాయవాదిగానే కొనసాగితే ఎంతో డబ్బు సంపాదించవచ్చని చాలామంది సలహా ఇచ్చారు. అది నిజమే అయినా న్యాయమూర్తిగా అంబేడ్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లి సామాజిక, ఆర్థిక న్యాయ సాధనకు కృషి చేయొచ్చని నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఆయన మాటలకు కట్టుబడి న్యాయమూర్తిగా మారాను. ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఇప్పుడెంతో సంతోషిస్తున్నా’’అని చెప్పారు. ఖాళీలను భర్తీ చేయాలి న్యాయ నియామకాల్లో వైవిధ్యం పెరగాల్సిన అవసరాన్ని జస్టిస్ గవాయ్ నొక్కిచెప్పారు. ఆ పదవులకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల నుంచి మహిళలను వీలైనంత ఎక్కువగా సిఫార్సు చేయాలని హైకోర్టులకు సూచించారు.‘‘ఈ విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడా మాట్లాడాను. జడ్జి నియామకాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు వారి హైకోర్టుల్లో లేని పక్షంలో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రతిభావంతుల నుంచి ఎంపిక చేసుకోవాలని సూచించాను. ఈ విషయంలో కొంతమేరకు సఫలీకృతమయ్యాం కూడా’’అని వెల్లడించడంతో ఆహూతులు చప్పట్లతో అభినందించారు. వాగ్దానాలు నా నైజం కాదు సీజేఐ అయ్యాక చాలా మీడియా సంస్థలు తన ఇంటర్వ్యూ అడుగుతున్నట్టు జస్టిస్ గవాయ్ చెప్పారు. ‘‘కానీ ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడే కాదు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పటి నుంచీ మీడియాకు దూరంగానే ఉండేవాడిని. మీడియా అంటే నాకేమీ భయం లేదు. కానీ నాకు సిగ్గు చాలా ఎక్కువ’’అని చెప్పి నవ్వులు పూయించారు. ‘‘అదీగాక ముందుగానే వాగ్దానాలు చేయడం నాకిష్టముండదు. అప్పట్లో ఇంటర్వ్యూల్లో అన్ని చెప్పాడు, చివరికి వాటిలో ఒక్కటీ చేయలేదని మీడియా మిత్రులే విమర్శించే ప్రమాదముంది. కనుక ఇంటర్వ్యూలు ఇవ్వనందుకు నన్ను వాళ్లు క్షమిస్తారనే ఆశిస్తున్నా’’అంటూ చమత్కరించారు.ప్రొటోకాల్ పక్కన పెట్టి మరీ జస్టిస్ త్రివేదికి సీజేఐ వీడ్కోలు → చాంబర్‌కు వెళ్లి మరీ తోడ్కొని వచ్చారు → వెల్లడించిన జస్టిస్ విశ్వనాథన్ జస్టిస్ గవాయ్ వినమ్రత, నాయకత్వ లక్షణాలు సాటిలేనివని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.వి.విశ్వనాథన్ అన్నారు. శుక్రవారం రిటైరైన సహచర న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం.త్రివేదికి ప్రొటోకాల్‌ను పక్కన పెట్టిన మరీ ఘనంగా వీడ్కోలు పలికిన తీరే అందుకు గొప్ప నిదర్శనమన్నారు. ‘‘ప్రొటోకాల్ ప్రకారం ధర్మాసనం కార్యకలాపాలు ముగిశాక మధ్యాహ్నం 1.30 సమయంలో ఇతర న్యాయమూర్తులంతా సుప్రీంకోర్టు ఆవరణలోకి వచ్చి రిటైరయ్యే న్యాయమూర్తికి సాదరంగా వీడ్కోలు పలుకుతారు. జస్టిస్ త్రివేది విషయంలో మాత్రం సీజేఐ ఎవరూ ఊహించని పని చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న తన చాంబర్ నుంచి రెండు అంతస్తులు ఎక్కి మరీ స్వయంగా జస్టిస్ త్రివేది చాంబర్లోకి వెళ్లి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. దాంతో మేం కూడా ఆయన్ను అనుసరించాం. సీజేఐ సారథ్యంలో అందరమూ కలిసి ఆమెను కోర్టు ప్రాంగణం దాకా సాదరంగా తోడ్కొని వచ్చాం. గార్డ్ ఆఫ్ ఆనర్తో ఘనంగా వీడ్కోలు పలికాం. ఇది నా దృష్టిలో అత్యంత అర్థవంతమైన వీడ్కోలు’’అని చెబుతూ జస్టిస్ విశ్వనాథన్ భావోద్వేగానికి లోనయ్యారు. -
హరే కృష్ణ మందిరం ఇస్కాన్–బెంగళూరుదే
న్యూఢిల్లీ: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రఖ్యాత హరే కృష్ణ మందిరం బెంగళూరు ఇస్కాన్ సొసైటీకే చెందుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. ఈ మందిరం ముంబై ఇస్కాన్ సొసైటీకి చెందుతుందని కర్ణాటక హైకోర్టు గతంలో ఉత్తర్వు జారీ చేయగా, దీన్ని సవాలు చేస్తూ బెంగళూరు ఇస్కాన్ సొసైటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జీ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. శుక్రవారం తీర్పు వెలువరించింది. కర్ణాటక హైకోర్టు ఇచి్చన ఉత్తర్వును తోసిపుచ్చింది. హరే కృష్ణా మందిరంపై ముంబై ఇస్కాన్ సొసైటీకి హక్కులు ఉన్నాయని చెప్పడానికి ఆ సంస్థ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది. మందిరం స్థలానికి సంబంధించిన సేల్ డీడ్ బెంగళూరు సొసైటీకి అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. సేల్ డీడ్‌ను బెంగళూరు సొసైటీ సభ్యులు మధు పండిత దాస, భక్తిలతా దేవి, చంచలపాటి దాస, చమారిదేవి తారుమారు చేశారంటూ వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టంచేసింది. ఆలయానికి సంబంధించిన కీలక పత్రాల్లో బెంగళూరు సొసైటీ రబ్బర్ స్టాంప్ ఉన్నట్లు తెలియజేసింది. షెడ్యూల్ ‘ఎ’లో ఉన్న ఆ ఆస్తిని బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ ఇస్కాన్ బెంగళూరు సొసైటీకి కేటాయించినట్లు చెప్పడానికి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నట్లు ధర్మాసనం తన తీర్పులో ఉద్ఘాటించింది. బెంగళూరు సొసైటీని కర్ణాటక సొసైటీస్ రిజి్రస్టేషన్ చట్టం కింద స్వతంత్ర సొసైటీగా రిజిస్టర్ చేసినట్లు వివరించింది. ముంబై సొసైటీకి బెంగళూరు సొసైటీ ఒక శాఖ అని హైకోర్టు చెప్పడం సరైంది కాదని అభిప్రాయపడింది. అందుకే హైకోర్టు తీర్పును పక్కనపెడుతున్నట్లు తేల్చిచెప్పింది. బెంగళూరు సొసైటీ హరే కృష్ణా మందిరంతోపాటు ఒక విద్యాసంస్థను కూడా నిర్వహిస్తోంది. ఈ మందిరం ముంబై సొసైటీదే అంటూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు జారీ చేయగా, బెంగళూరు సొసైటీ ఆఫీసు–బేరస్ కోదండరామ దాస 2011 జూన్ 2న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీర్పు పట్ల బెంగళూరు ఇస్కాన్ సొసైటీ అధ్యక్షుడు మధు పండిత్ దాస హర్షం వ్యక్తంచేశారు. -
పత్రికల్లో పేరు కోసం పిటిషన్లా?
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) చట్టం–2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ఇక కొత్తగా పిటిషన్లు దాఖలైతే విచారణకు స్వీకరించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు కుండబద్ధలు కొట్టినట్లు తేల్చిచెప్పింది. పత్రికల్లో పేరు కోసం కొందరు ఇష్టానుసారంగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. పత్రికల్లో పేరు రావాలని కోరుకుంటున్నారని, అందుకే పిటిషన్లు అంటూ తమ సమయం వృథా చేస్తున్నారని మండిపడింది. మీడియాలో పబ్లిసిటీ కోసం కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయడం ఏమిటని నిలదీసింది. వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొత్తగా రెండు వ్యాజ్యాలు దాఖలు కాగా, వాటిని విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం నిరాకరించింది. ఆ రెండు పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై ఈ నెల 20న విచారణ చేపట్టనున్నట్లు తెలియజేసింది. వక్ఫ్(సవరణ) చట్టాన్ని సవాలు చేస్తూ లెక్కలేనన్ని పిటిషన్లు దాఖలవుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి చేయగా, ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. కొత్తగా ఎవరూ వ్యాజ్యాలు దాఖలు చేయొద్దని పరోక్షంగా హెచ్చరించింది. -
ఇకపై కుదరవు... పనులు మొదలయ్యాక పర్యావరణ అనుమతులు
న్యూఢిల్లీ: పర్యావరణ అనుమతుల విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ గీసింది. మైనింగ్ తదితర ప్రాజెక్టులకు కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత పర్యావరణ అనుమతులు ఇవ్వరాదని ఆదేశించింది. అలా అనుమతులిచ్చేందుకు వీలు కల్పిస్తూ 2017, 2021 ఉత్తర్వుల ఆధారంగా కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లు తదితరాలు అక్రమమని పేర్కొంటూ వాటన్నింటినీ కొట్టేసింది. ఇకపై అలాంటి ఆదేశాలు, సర్క్యులర్లు, నోటిఫికేషన్లు, ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. అయితే ఆయా నోటిఫికేషన్ల ఆధారంగా ఇప్పటికే జారీ చేసిన పర్యావరణ అనుమతులు మాత్రం చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో పర్యావరణ అనుమతుల్లేకుండా మొదలైన ప్రాజెక్టులు తమ కార్యకలాపాలను క్రమబద్దీకరించుకునేందుకు ఇకపై అవకాశముండదు. కావాలనే ఉల్లంఘనలు అత్యంత కీలకం, తప్పనిసరి అయిన పర్యావరణ అనుమతులను పట్టించుకోకపోవడం భారీ అవకతవకలకు పాల్పడటమే తప్ప మరోటి కాదని జస్టిస్ ఓకా ఆగ్రహం వెలిబుచ్చారు. ‘‘ఇలా చేస్తున్నవాళ్లు నిరక్షరాస్యులేమీ కారు. వారు కంపెనీలు, రియల్టీ డెవలపర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, మైనింగ్ పరిశ్రమల యజమానులు. వీళ్లంతా ఉద్దేశపూర్వకంగానే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న వాళ్లే’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘అందుకే ఇలాంటి వాళ్లకు ఎలాంటి అనుచిత లబ్ధీ కలగడానికి అనుమతించేది లేదు. ఇలాంటి ప్రాజెక్టులకు అనంతర కాలంలో ఈసీలు ఇచ్చేలా 2017 నోటిఫికేషన్ల వంటివి ఇకపై జారీ చేయడానికి వీల్లేదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా నిర్దేశాలు జారీ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఈఐఏ) నోటిఫికేషన్ (2006) ప్రకారం మైనింగ్‌తో పాటు ఎలాంటి భారీ ప్రాజెక్టులకైనా ముందుగా పర్యావరణ అనుమతులు (ఈసీ) తీసుకోవడం తప్పనిసరి. అలాంటివేవీ లేకుండానే మొదలు పెడుతున్న ప్రాజెక్టులకు ఈసీల జారీని సవాలు చేస్తూ వనశక్తి అనే స్వచ్ఛంద సంస్థ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమ ఉత్తర్వులు ఈఐఏ నోటిఫికేషన్‌కు విరుద్ధమేమీ కాదని, కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఈసీలు ఇవ్వకపోతే భారీ నష్టం వాటిల్లుతుందని కేంద్రం వాదించింది. పర్యావరణ పరిరక్షణ చట్ట నిబంధనల మేరకే ఆ చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. -
‘ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు సాధించిన అతిపెద్ద విజయం’
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలను చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆ రాష్ట్ర బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఎప్పట్నుంచో మమతా ప్రభుత్వం నాన్చుతూ వస్తున్న పెండింగ్ డీఏను చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల విజయంగా బీజేపీ పేర్కొంది. ఈరోజు(శుక్రవారం) దీనికి సంబంధించి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ ఉద్యోగుల 25 శాతం డీఏ బకాయిలను మూడు నెలల నిర్ణీత వ్యవధిలో చెల్లించాలని సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.దీనిపై వెస్ట్ బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధి అమిత మాలవియా మాట్లాడుతూ.. ‘ ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు సాధించిన అతిపెద్ద విజయం. సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగింది. ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా మమతా సర్కారు దీన్ని పట్టించుకోవడం లేదు. 17 వాయిదాలు, విచారణలో ఆటంకాల తర్వాత సుప్రీంకోర్టుల చివరకు తన తీర్పును వెల్లడించడం హర్షించదగ్గ విషయం. ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు, బీజేపీ సాధించిన అతిపెద్ద విజయం. ఇది ఒక మైలురాయి లాంటి తీర్పు’ అని పేర్కొన్నారు.కాగా, 2022, మే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. -
విచారణ పేరుతో వేధింపులు
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురి చేస్తోంది. గురువారం 13 గంటలకుపైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతోంది. రిటైర్డ్ అధికారులైన వారిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11.15 గంటల వరకు విచారణ పేరుతో విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉంచడం గమనార్హం. తాము తదుపరి విచారణ చేపట్టేవరకు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సిట్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ బుధవారం స్వచ్ఛందంగా సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. తొలిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వారిని విచారించిన సిట్ అధికారులు మరుసటి రోజు గురువారం కూడా రావాలని పేర్కొన్నారు. దీంతో వారిద్దరూ వరుసగా రెండో రోజు గురువారం కూడా విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు.మళ్లీ మళ్లీ.. అవే ప్రశ్నలుసిట్ చీఫ్‌గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంవో కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు. ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా సరే సిట్ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి గురి చేసేందుకు యత్నించారు. ఇక మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ చెప్పమని సిట్ అధికారులు అడిగారు. అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు.వెళ్లిపోవచ్చంటూ.. మళ్లీ రప్పించి..ఎట్టకేలకు రాత్రి 9.30 గంటల సమయంలో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి నుంచి సెల్ ఫోన్లు తీసుకుని విచారణ ముగిసిందని, వెళ్లవచ్చని సిట్ అధికారులు చెప్పారు. అయితే బయటకు వెళుతున్న వారిని మరోసారి వెనక్కి రప్పించారు. సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్‌బాబు మరోసారి విచారిస్తారని, వేచి ఉండాలని సూచించారు. అయితే రాజశేఖర్‌బాబు పనుల మీద బయటకు వెళ్లినందున ఆయన వచ్చే వరకు వేచి ఉండాలంటూ మరో గంటన్నరకుపైగా కాలహరణం చేశారు. వారిద్దరినీ మానసికంగా, శారీరకంగా వేధించడమే లక్ష్యంగా వ్యవహరించారు. సిట్ అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దాంతో ఎట్టకేలకు రాత్రి 11.15 గంటల సమయంలో విచారణ ముగిసిందంటూ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ అధికారులు పంపించేశారు. ఇలా ఉద్దేశపూర్వకంగా వేధించాలని ముందుగానే రూపొందించుకున్న ప్రణాళికను అమలు చేశారు. శుక్రవారం కూడా మళ్లీ విచారణకు రావాలని వారికి సిట్ అధికారులు సూచించారు.సిట్ తీరు దారుణందర్యాప్తు పేరుతో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ వేధింపులకు గురి చేస్తోంది.రాజ్యాంగం, న్యాయస్థానాల తీర్పులు అంటే ఏమాత్రం లెక్కలేనట్లు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. సీనియర్ సిటిజన్లు అయిన వారిద్దరినీ 12 గంటలకు పైగా విచారణ పేరుతో వేధించడం ప్రభుత్వ కుట్రకు తార్కాణం. పౌరుల స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓ నిందితుడి పట్ల సిట్ అధికారులు ఇలాగే వ్యవహరిస్తే న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఇంటికి వెళ్లి విచారించాలని, సాయంత్రం 5 గంటల తరువాత విచారించవద్దని ఆదేశించింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. సిట్ అధికారులు రాజకీయ పార్టీ నేతల్లా వ్యవహరించడం సరికాదు. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళతాం. – మనోహర్ రెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడురాజకీయ వేధింపులు...రాజకీయ కారణాలతోనే ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ వేధిస్తోంది. కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. ఈ అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళతాం. – మొండితోక అరుణ్‌కుమార్, దేవినేని అవినాశ్, వైఎస్సార్సీపీ నేతలు మద్యం విధానంపై కేసు... ముందస్తు బెయిల్‌పై నేడు ‘సుప్రీం’ విచారణ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఇప్పటికే అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట బాలాజీ గోవిందప్ప అరెస్ట్‌పైనా తేలుస్తామన్న ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానానికి సంబంధించి అక్రమ కేసు ఎదుర్కొంటున్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారించనుంది. తాము తదుపరి విచారణ చేపట్టేవరకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అరెస్టు చేయరాదని ఆదేశిస్తూ ఈ నెల 13న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి ముందస్తు బెయిల్ పిటిషన్లు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు నేడు మరోసారి విచారణకు రానున్నాయి. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఇప్పటికే స్వచ్ఛందంగా సిట్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మరింత మురికిగా మార్చవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు..ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుందని తెలిసి కూడా అదే రోజు తెల్లవారుజామున బాలాజీ గోవిందప్పను ఆగమేఘాలపై అరెస్ట్ చేశారని గత విచారణ సందర్భంగా ఆయన న్యాయవాది సిద్ధార్థ్ దవే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గోవిందప్ప అరెస్ట్ అక్రమమని నిరూపిస్తామని, దర్యాప్తు సంస్థ తీరును పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. తదుపరి విచారణలో బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి కూడా తేలుస్తామని ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేయగా... జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకమవుతుందంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం... ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. -
‘సుప్రీం’కు న్యాయ మీమాంస
శాసనసభలు ఆమోదించి పంపే బిల్లులపై రాష్ట్రపతి లేదా గవర్నర్లు నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్ణ యాన్ని ప్రకటించాలనీ, లేనట్టయితే వాటిని ఆమోదించినట్టుగా భావించవచ్చని గత నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరోసారి కోర్టు మెట్లెక్కింది. ఈ తీర్పుపై కేంద్రప్రభుత్వం తాజాగా రాష్ట్రపతి ద్వారా సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని కోరింది. నిజానికి, ఆ తీర్పు ఇటీవల రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. సాక్షాత్తూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ దానిపై విరుచుకు పడ్డారు. ‘ఈమధ్య ఒక తీర్పు ఏకంగా రాష్ట్రపతికే ఆదేశాలు జారీచేసింది. జడ్జీలే సూపర్ పార్లమెంటుగా వ్యవహరిస్తు న్నారు. ప్రజాస్వామ్య శక్తులే లక్ష్యంగా దాడి జరుగుతోంది’ అంటూ విమర్శించారు. కీలకాంశాలపై రాజ్యాంగ న్యాయస్థానాలు వెలువరించే అసాధారణ తీర్పులు ఒక్కోసారి అసాధారణ పరిణా మాలకు దారి తీస్తాయి. తమ శాసనసభ ఆమోదించి పంపిన బిల్లుల్ని గవర్నర్ ఆర్.ఎన్. రవి ఎటూ తేల్చకుండా దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ఇద్దరు న్యాయ మూర్తుల ధర్మాసనం ఈ సంచలన తీర్పు వెలువరించింది. అసెంబ్లీలు ఆమోదించి పంపిన బిల్లులు నెలల తరబడి, ఏళ్ల తరబడి గవర్నర్ల వద్ద పెండింగ్‌లో వుండిపోవటం తమిళనాడు సమస్య మాత్రమే కాదు... విపక్షాల ఏలుబడిలో వున్న కొన్ని ఇతర ప్రభుత్వాల పరిస్థితి సైతం ఇలాగేవుంది. భిన్న సందర్భాల్లో సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేస్తూనే వచ్చింది. విస్తృత ప్రజా ప్రయోజనాలు ఇమిడివున్న అంశాల్లో వివరణ కోరడానికీ లేదా సందేహ నివృత్తికీ, రాష్ట్రాలమధ్య తలెత్తే వివాదాల్లో అభిప్రాయం కోరడానికీ ‘ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్’ రూపంలో కేంద్రప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం ముందు వ్యాజ్యం దాఖలు చేస్తుంది. రాజ్యాంగంలోని 143(1) అధికరణ కింద వున్న ఈ అధికారాన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే కేంద్రం వినియోగించుకుంటుంది. ఈ తీర్పుద్వారా సుప్రీంకోర్టు తన అధికార పరిధిని దాటిందన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నివేదనలో 14 ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులు తమ పరిశీలన కొచ్చినప్పుడు రాష్ట్రపతి లేదా గవర్నర్లు ఏం చేయాలో రాజ్యాంగంలోని 200, 201 అధికరణలు నిర్దేశిస్తున్నాయి. వాటిననుసరించి బిల్లుల్ని ఆమోదించే లేదా తోసిపుచ్చే అధికారం వుంటుంది. 200 అధికరణ ప్రకారం బిల్లు గవర్నర్ పరిశీలనకొచ్చినప్పుడు ‘సాధ్యమైనంత త్వరగా’ దానిపై అభిప్రా యాన్ని ప్రకటించాలంటున్నది. దాన్ని నిరాకరించాక తిరిగి అదే రూపంలో రెండోసారి బిల్లు వచ్చిన ప్పుడు గవర్నర్ తన ఆమోదాన్ని పెండింగ్‌లో వుంచరాదని చెబుతోంది. రెండోసారి వచ్చిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపినపక్షంలో ఏం చేయాలో 201 అధికరణ సూచిస్తోంది. ఆమో దానికి లేదా తిరస్కారానికీ అందులో నిర్దిష్టమైన వ్యవధిని సూచించటం లేదన్నది ‘ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్’ ప్రస్తావిస్తోంది. అలాంటప్పుడు గవర్నర్లయినా, రాష్ట్రపతైనా మూణ్ణెల్లలోగా బిల్లులపై తమ నిర్ణయం ప్రకటించాలని, లేనట్టయితే వాటిని ఆమోదించినట్టే భావించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తుందని ప్రశ్నిస్తోంది. పైగా ఇలాంటి ఆదేశాలు రాజ్యాంగ ధర్మాసనం ఇవ్వాలి తప్ప ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఇవ్వొచ్చునా అనే సందేహాన్నీ వ్యక్తం చేసింది.మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని ఒక దార్శనిక పత్రంగా రూపొందించారు తప్ప మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలో... దేన్ని ఏవిధంగా ఆచరించాలో సూచించే నిబంధనల పత్రంగా తయారుచేయలేదు. కనుకనే ఆచరణలో ఎదురయ్యే సమస్యల్ని దృష్టిలో వుంచుకుని దానికి భాష్యం చెప్పుకోవటం, సవరించుకోవటం తప్పటం లేదు. మన కార్యనిర్వాహక వ్యవస్థ ఈ 75 ఏళ్ల ప్రస్థానంలో రాజ్యాంగానికి వందకుపైగా సవరణలు తీసుకురావాల్సి వచ్చిందంటేనే ఆసంగతి తెలుస్తోంది. ఇక సర్వోన్నత న్యాయస్థానం భిన్న సందర్భాల్లో వెలువరించిన తీర్పుల ద్వారా వివిధ అధికరణల విస్తృతిని పెంచింది. వీటన్నిటికీ రాజ్యాంగస్ఫూర్తే గీటురాయి. మన దేశంలో పటి ష్ఠమైన సహకార సమాఖ్య వ్యవస్థ ఉండాలని రాజ్యాంగం ఆశించింది. కేంద్ర ప్రతినిధులుగా రాష్ట్రాల్లో గవర్నర్లు ఏం చేయాలో, రాష్ట్రపతి ఎలా వ్యవహరించాలో రాజ్యాంగంలోని అధికరణలు చెబుతున్నాయి. తమ ఆచరణ దేశంలో సహకార సమాఖ్య వ్యవస్థ పరిఢవిల్లాలని చెప్పే రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉంటున్నదో లేదో పరిశీలించుకోవాల్సిన అవసరం గవర్నర్లకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా ఒక చర్యకు ఉపక్రమించినప్పుడు దాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవటం ఏ రకంగా సబబవుతుంది?ఇందువల్ల కేవలం ఒక రాజకీయపక్షం ఆధ్వర్యంలోని ప్రభుత్వాన్ని పనిచేయకుండా నిరోధించటం మాత్రమే కాదు... ప్రజలిచ్చిన రాజకీయ అధికారాన్ని గుర్తించ నిరాకరించటం కూడా! ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రాజ్యాంగ పరిధిని దాటి, మందబలంతో దేశ భద్రతకు ముప్పు కలిగించే నిర్ణయాలు తీసుకుంటే వాటిని ఆపడాన్ని ఎవరూ ప్రశ్నించరు. కానీ ప్రజాహితం, వారి సంక్షేమం, భద్రత కోరి చేసే బిల్లుల్ని కూడా పెండింగ్‌లో వుంచటం ఏం సబబు? గవర్నర్లు తమవద్దకొచ్చే బిల్లుల్ని అకార ణంగా పెండింగ్‌లో వుంచటం సారాంశంలో రాజకీయ సమస్య. కనీసం దీన్ని గవర్నర్లవరకూ పరి మితం చేసి రాష్ట్రపతి ప్రమేయాన్ని నివారించి వుంటే బాగుండేది. కానీ రాష్ట్రపతి దగ్గర సైతం బిల్లులు పెండింగ్‌లో పడటం వల్ల సమస్య మరింత జటిలమైంది. తాజా నివేదనను పరిశీలించబోయే రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయంలో ఏం చెబుతుందో వేచిచూడాలి. -
సోఫియా ఖురేషీపై మంత్రి వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు ఏమందంటే?
ఢిల్లీ: భారత సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో కేసు కూడా నమోదైంది. అనంతరం, ఈ వ్యవహారం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు మంత్రి తీరును తప్పుపట్టింది. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పండి అని సూచనలు చేసింది.ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి మీడియాకు వివరాలను వెల్లడించిన కల్నల్ ఖురేషీపై మంత్రి విజయ్ షా వ్యాఖ్యలు చేశారు. ఖురేషీని ఉద్దేశిస్తూ ఆమెను ‘ఉగ్రవాదుల సోదరి’ అంటూ ఉగ్రవాదులను హతమర్చేందుకు ఆమె పాకిస్తాన్ వెళ్లారని విజయ్ షా అన్నారు. దీంతో, సదరు మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంత్రి వ్యాఖ్యలను హైకోర్టు బుధవారం సుమోటోగా తీసుకుంది. శత్రుత్వం, విద్వేషాన్ని ప్రోత్సహించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని జస్టిస్ అతుల్ శ్రీధరణ్, జస్టిస్ అనురాధా శుక్లాలతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి తమకు నివేదించాలని రాష్ట్ర డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.అనంతరం, హైకోర్టు ఆదేశాలపై మంత్రి విజయ్.. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మంత్రి పిటిషన్‌ను రేపు విచారించేందుకు కోర్టు అంగీకరించింది. అంతేగాకుండా ఆయన తీరును తప్పుపట్టింది. ‘ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పండి. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండి’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. మరోవైపు.. అటు జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది.On the shameful statement of BJP minister Vijay Shah by referring to Colonel Sofia as Sister of Terrorists, The division bench of Jabalpur High Court has suo motu directed to register a case against Vijay Shah under serious criminal sections. Via : @sanjaygupta1304 pic.twitter.com/guS2ihv4hb— Mohammed Zubair (@zoo_bear) May 14, 2025 -
తెలంగాణ సర్కార్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. పక్కా ప్లాన్ ప్రకారమే చేశారంటూ..
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలిలో భూముల్లో చెట్ల నరికివేతపై జవాబు చెప్పాలి. పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకి వెళ్లాల్సిందే. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు అంటూ హెచ్చరించింది.తెలంగాణలో కంచె గచ్చిబౌలి భూముల అంశంపై ఈరోజు మరోసారి విచారణ చేపట్టారు. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏమిటి?. పక్కా ప్రణాళికతోనే వారాంతంలో చెట్లు నరికారు. డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికారు. సుస్థిర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు ఉంటాయి. అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దు.. వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి.. కంచె గచ్చిబౌలిలో పనులన్నీ నిలిపి వేశామని వెల్లడించారు. పర్యావరణం కాపాడుతూనే ఐటీ ప్రాజెక్టులు చేస్తామని చెప్పారు. రిజైన్డర్స్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని సింఘ్వీ కోరారు.అనంతరం, విద్యార్థుల అరెస్టు అంశాన్ని ఈ కేసులో చేర్చవద్దని తెలిపింది. విద్యార్థుల అరెస్టు అంశంపై మరొక పిటిషన్‌తో రావాలని సూచించింది. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. తాము ఈ కేసులో పర్యావరణ విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. -
యుద్ధ విమానాలే నడిపిస్తుంటే... సైన్యంలో లీగల్ పోస్టులు మహిళలకు ఇవ్వరా: సుప్రీం
న్యూఢిల్లీ: భారత వాయుసేనలో మహిళలు యుద్ధ విమానాలు నడిపిస్తున్నారని, వారికి సైన్యంలోని లీగల్ పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సైన్యంలో న్యాయమూర్తి, అడ్వొకేట్ జనరల్, ఇతర లీగల్ బ్రాంచ్ పోస్టుల్లో మహిళలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని వెల్లడించింది. ఆయా పోస్టులకు స్త్రీ–పురుష నిష్పత్తి వర్తించదని, అయినప్పటికీ మహిళలను ఎందుకు నియమించడం లేదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సైన్యంలో లీగల్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో తాము నాలుగు, ఐదో ర్యాంకులు సాధించామని, అయినా తమను ఎంపిక చేయలేదంటూ ఇద్దరు మహిళా అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయం చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తమకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన పురుష అధికారులను లీగల్ బ్రాంచ్‌లో నియమించారని వారు ఆక్షేపించారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. సైన్యంలోని న్యాయ విభాగంలో పురుషుల కంటే ఎక్కువగా మహిళలను విధుల్లో చేర్చుకుంటే ఇబ్బందులేమిటో చెప్పాలని నిలదీసింది. పురుషులైనా, మహిళలైనా అర్హత ఉంటే అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టంచేసింది. -
వన్యప్రాణుల రక్షణకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కంచ గచి్చ»ౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం భూ, అటవీ జంతువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక అందజేసింది. ప్రభుత్వం తరఫున ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు వివరాలు, ఫొటోలతో సహా అత్యున్నత న్యాయస్థానానికి అందజేశారు. ‘100 ఎకరాల్లో అటవీ నిర్మూలన కారణంగా ప్రభావితమైన వన్యప్రాణులను రక్షించడానికి తీసుకోవలసిన చర్యలు, తక్షణం అమలు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించాలని రాష్ట్ర వన్యప్రాణి ఉన్నతాధికారులను ఆదేశించాం. ఏప్రిల్ 17, 21, మే 3, 8న రాష్ట్ర చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్, వన్యప్రాణుల నిర్వహణ నిపుణులతో కంచ గచి్చబౌలి భూములను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ భూములు 2,374 ఎకరాల్లో విస్తరించి ఉండగా, అందులో 400 ఎకరాలు వివాదాస్పదంగా మారింది. ఇవన్నీ రాళ్లు, చెట్లు, గడ్డితో కూడిన భూములు. అధికారుల తనిఖీల సమయంలో కొన్ని పక్షులు, మచ్చల జింకలు కనిపించాయి. ఈ ప్రాంతంలో చాలా వీధి కుక్కలు తిరుగుతున్నాయని, వాటి కారణంగా వన్యప్రాణులకు ముప్పు కలిగే అవకాశం ఉందని గ్రహించారు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్‌కు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ చేసిన అభ్యర్థన మేరకు ఏప్రిల్ 4 నుంచి 30 మధ్య 26 వీధి కుక్కలను పట్టుకోవడానికి బృందాలను నియమించి చర్యలు తీసుకున్నాం’అని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు అమర్చాం ‘భూముల్లో వన్యప్రాణులపై నిఘా, రక్షణ కోసం 24 గంటలూ 3 షిఫ్టుల్లో ఐదుగురితో మూడు బృందాలను నియమించాం. నరికిన, ఎండిన చెట్లతో పాటు పొదలు ఎక్కువగా ఉండటం, వేసవిలో అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉండటంతో నివారణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాం. వారికి ప్రత్యేక అగి్నమాపక యంత్రాలు అందజేశాం. ఏ ప్రాంతంలోనైనా వన్యప్రాణుల కదలికల పర్యవేక్షణ, సంగ్రహణకు 20 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశాం. జింకల నీటి అవసరాలకు 12 కృత్రిమ నీటి వనరులను నెలకొల్పాం. భద్రత పర్యవేక్షణలో భాగంగా సీసీ కెమెరాలు అమర్చాం. అడవి జంతువుల భద్రత కోసం వర్సిటీ, టీజీఐఐసీ, పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. తక్షణ పశువైద్య సంరక్షణ, చికి త్స కోసం తెలంగాణ అటవీ శాఖతో కలిపి యాంటీ పోచింగ్ పేరిట స్క్వాడ్‌ను ఏర్పాటు చేశాం. అటవీశాఖ ఆధ్వర్యంలో చెట్ల పెంపకానికి చర్యలు తీసుకోవడంతోపాటు ఇకపై చెట్లను ఎవరూ నరకకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’అని నివేదికలో వివరించారు. ఈ కేసుపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. -
2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?
భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు, ఆరు నెలలు పాటు నవంబర్ 23 దాకా ఆయన సీజేఐగా సేవలందిస్తారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రమాణం చేయించారు. జస్టిస్ గవాయ్ ప్రస్తుత సిజెఐ సంజీవ్ ఖన్నా మాదిరిగానే ఆరు నెలల పాటు అత్యున్నత న్యాయాధికారిగా సేవలందిస్తారు. ఇంతకంటే తక్కువ రోజులు పదవిలో ఉన్న ప్రధాన న్యాయమూర్తుల గురించి తెలుసు కుందాం.జస్టిస్ బీవీ నాగరత్న ఘనతభారత సుప్రీంకోర్టు స్థాపించి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి పదవి ఇంతవరకు ఏ మహిళకు దక్కలేదు. కానీ ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న 2027లో భారతదేశపు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించనున్నారు. ఆమె పదవీకాలం కేవలం 36 రోజులు మాత్రమే. 2027, సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 30 వరకు మాత్రమే ఆమె ఈ పదవిలో ఉన్నారు. అయితే ఇదే తక్కువ కాదు. అత్యల్ప కాలం సీజేఐగా పనిచేసిన వారు జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్. ఆయన పదవీకాలం కేవలం 17 రోజులు మాత్రమే.సుప్రీంకోర్టులో ఒక మహిళా న్యాయమూర్తిగా అత్యధిక కాలం అంటే 6 సంవత్సరాల 2 నెలల పాటు పనిచేసిన తర్వాత బివి నాగరత్న 54వ సిజెఐగా ఆమె పదవీకాలం కేవలం 36 రోజులు మాత్రమే ఉండనుంది. సెప్టెంబర్ 27, 2027న రికార్డులు మీద రికార్డు సృష్టించనున్నారు జస్టిస్ బీవీ నాగరత్న.75 సంవత్సరాల చరిత్రలో భారతదేశపు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తిగా అత్యధిక కాలం అంటే ఆరు సంవత్సరాల రెండు నెలలు పనిచేసిన రికార్డుఅంతేకాదు ఆమె తండ్రి జస్టిస్ ఇఎస్ వెంకటరామయ్య 19వ సీజేఐగా పనిచేశారు. ఈ నేపథ్యంలో భారతదేశ చరిత్రలో భారతదేశ ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన తొలి తండ్రీ బిడ్డలుగా నిలవనున్నారు. 2008లో జస్టిస్ బీవీ నాగరత్నకర్ణాటక హైకోర్టుకు ఎంపికయ్యారు. 2021 ఆగస్టులో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. మరిన్ని విశేషాలుఅత్యధిక కాలం పనిచేసింది జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా 7 సంవత్సరాల 139 రోజులు పనిశారు. అత్యంత తక్కువ రోజులు పనిచేసిన వారిలో కమల్నారాయణ్ సింగ్ తరువాత జస్టిస్ ఎస్ రాజేంద్ర బాబు నిలుస్తారు. రాజేంద్ర బాబు పదవీకాలు 29 రోజులు . సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సీనియారిటీ నియమాన్ని అలాగే పాటిస్తే, జస్టిస్ బివి నాగరత్న మేడో అతి తక్కువ పదవీకాలం అంటే 36 రోజులు సేవలందించే అవకాశం ఉంది.ఇప్పటివరకు భారతదేశంలోని 51 మంది 11 మంది చీఫ్ జస్టిస్‌లలో అందరూ పురుషులే. 11 మంది మహిళలు మాత్రమే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేశారు.సీనియారిటీకి అనుగుణంగా న్యాయమూర్తులను పదోన్నతి కల్పించాలనే అలిఖిత నియమాన్ని అనుసరిస్తుంది. ఈ నియమం ప్రకారం, సాధారణంగా, పరిశీలనలో ఉన్న న్యాయమూర్తులలో, సీనియర్ న్యాయమూర్తిని అత్యున్నత న్యాయస్థానానికి ఎంపిక చేస్తారు. అదేవిధంగా, సీనియర్ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఇతర నియమిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలం కూడా కేవలం ఆరు నెలల నుండి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. ఈనేపథ్యంలో మాజీ చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఎనిమిది మంది ప్రధాన న్యాయమూర్తులను హైకోర్టులకు నియమించారు. వారిలో ప్రధాన న్యాయమూర్తి రాజీవ్ శక్తిధర్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నుండి కేవలం 24 రోజుల తర్వాత పదవీ విరమణ చేశారు.అయితే ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలంపై చర్చ మొదలైంది.భారత 40వ ప్రధాన న్యాయమూర్తి పళనిసామి గౌండర్ సదాశివం, CJIల స్వల్ప పదవీకాలంపై స్పందించారు. "నేను చేయాలనుకున్నవి చాలా ఉన్నాయి కానీ (నా) స్వల్ప పదవీకాలం కారణంగా చేయలేకపోయాను" అని పదవీ విరమణకు రెండు రోజుల ముందు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈయన దాదాపు తొమ్మిది నెలలపాటు పదవిలో ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తులకు స్థిరమైన పదవీకాలం అవసరమని భావించారు.సెప్టెంబర్ 2024లో జస్టిస్ హిమా కోహ్లీ పదవీ విరమణ చేసిన తర్వాత, సుప్రీంకోర్టులో మహిళా న్యాయ మూర్తుల సంఖ్య 34 మందిలో ఇద్దరు మాత్రమే మహిళలు. ప్రస్తుతం, జస్టిస్ బీవీ నాగరత్న , జస్టిస్ బేలాఎం త్రివేది మాత్రమే సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు. 1989లో సుప్రీంకోర్టుకు నియమితులైన మొదటి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా బీవీ చరిత్ర సృష్టించారు, కానీ ఆమె సుప్రీంకోర్టుకు ఎంపికైన మహిళా న్యాయమూర్తులలో రెండున్నర సంవత్సరాల అతి తక్కువ పదవీకాలం పనిచేశారు.ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, హైకోర్టు న్యాయమూర్తులలో 14శాతం మంది మహిళలు ఉన్నారు. సీనియారిటీ నియమాన్ని అలాగే పాటిస్తే రాబోయే కొన్ని సంవత్సరాలలో ఉన్నత న్యాయస్థానంలో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. -
ఏపీ సీఐడీకి సుప్రీం కోర్టు నోటీసులు
సాక్షి,న్యూఢిల్లీ: ఏపీ సీఐడీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రాజ్ కేసిరెడ్డి అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై సీఐడీకి నోటీసులు పంపించింది. రాజ్ కసిరెడ్డి అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ జేబీ పార్థి వాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్ కేసిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు మహేష్ జెఠ్మలానీ , పొన్నవలు సుధాకర్ రెడ్డి, అల్లంకి రమేష్‌లు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణ మే 19కి వాయిదా వేసింది. వాదనలు విన్న అనంతరం ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. -
సీజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్
ఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (Justice BR Gavai) ప్రమాణస్వీకారం చేశారు. భాతర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. గవాయ్‌కు అభినందనలు తెలిపారు. సీజేఐ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, గవర్నర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు.సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న గవాయ్.. చరిత్రాత్మక తీర్పుల్ని వెలువరించారు. సీజేఐగా ఆరు నెలలు కొనసాగి నవంబరు 23న పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా గవాయ్‌గా పేరు పొందారు.ఇక, మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబరు 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 2003 నవంబరు 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గవాయ్ 2005 నవంబరు 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ఆ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబయితోపాటు, నాగ్‌పుర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత ఆరేళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామ్యం పంచుకొని పలు కీలక కేసులను విచారించారు.#WATCH | Delhi: President Droupadi Murmu administers oath of office to Justice BR Gavai as the Chief Justice of India (CJI).(Video Source: President of India/social media) pic.twitter.com/3J9xMbz3kw— ANI (@ANI) May 14, 2025 -
ఆధారాలు లేకుండా అరెస్టులా..?
‘‘అరెస్ట్ అనేది.. పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది. అరెస్ట్ అన్నది.. వ్యక్తి గౌరవాన్ని, ప్రతిష్టను, సమాజంలో వారి స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల అరెస్ట్ విషయంలో దర్యాప్తు అధికారి తనకున్న అధికారాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది..’’– సుప్రీంకోర్టు ధర్మాసనం..సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అరెస్టులపై సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు, కారణాలు లేకుండా అరెస్టులు చేయడం సరికాదని పేర్కొంది. కేసు పెట్టిన వెంటనే కారణాలు లేకుండా అరెస్ట్‌లు చేయడం తగదంది. ‘ఏదైనా కేసులో అరెస్టు చేయడానికి సహేతుక కారణాలు చూపించాలి. కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్ చేసి తీరాలన్న ఆలోచన ఎంతమాత్రం సరికాదు. ఇలాంటి యాంత్రిక అరెస్ట్‌లు సబబు కాదు...’ అని గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ విచారణకు స్వీకరించదగ్గ ప్రతి నేరంలో నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అరెస్టుల విషయంలో పోలీసులు తమ అధికారాన్ని జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ఉపయోగించాలని పునరుద్ఘాటించింది.హైకోర్టు తీర్పును రద్దు చేసిన ‘సుప్రీం’...మద్యం కేసులో రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై తిరిగి విచారణ జరిపి తగిన నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు తీర్పును పరిశీలిస్తే.. ఆధారాలను పూర్తిస్థాయిలో పరిశీలించలేదన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. దర్యాప్తు అధికారి సేకరించిన ఆధారాలను మరోసారి జాగ్రత్తగా పరిశీలించి నాలుగు వారాల్లో ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. మిథున్‌రెడ్డి పరువు, ప్రతిష్టలను కూడా కేసు విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. హైకోర్టు నిర్ణయం వెలువరించేంత వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఏసీబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్ధీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.హైకోర్టు తీర్పుపై సుప్రీంకు మిథున్‌రెడ్డి...గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మి«థున్‌రెడ్డి తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు విచారణ జరిపారు. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ గత నెల 3న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ పార్ధీవాలా ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది.దర్యాప్తునకు సహకరిస్తున్నారు...మిథున్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, రంజిత్ కుమార్‌లు వాదనలు వినిపిస్తూ పిటిషనర్ ఇప్పటికే దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరయ్యారని తెలిపారు. మద్యం కేసులో మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చామని రాష్ట్ర ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు తీర్పును ఆక్షేపించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది. తీర్పు వెలువరించేంత వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయబోమన్న రాష్ట్ర ప్రభుత్వ హామీని ధర్మాసనం రికార్డ్ చేసింది. -
డిప్యూటీ కలెక్టర్‌కు తహసీల్దార్‌గా డిమోషన్
సాక్షి, న్యూఢిల్లీ: తహసీల్దార్ హోదాలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి, గుంటూరు జిల్లాలో మురికివాడల నివాసితుల గుడిసెలను బలవంతంగా తొలగించిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన డిప్యూటీ కలెక్టర్ మోహనరావును తహసీల్దార్‌గా డిమోట్చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు రూ.లక్ష జరిమానా విధించి నాలుగు వారాల్లోగా జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని నిర్ధారించి, 2 నెలల సాధారణ జైలు శిక్ష విధించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుకు వ్యతిరేకంగా డిప్యూటీ కలెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ‘చట్టం గొప్పతనం శిక్షించడంలో కాదు, క్షమించడంలో ఉంది’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2013 డిసెంబరు 11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా 2014 జనవరిలో అప్పటి తహసీల్దార్‌గా ఉన్న మోహనరావు గుంటూరు జిల్లాలో గుడిసెలను బలవంతంగా తొలగించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి.. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు అధికారికి రెండు నెలల జైలు శిక్ష విధించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి డివిజన్ బెంచ్ నిరాకరించింది. దీంతో డివిజన్ బెంచ్ ఉత్తర్వును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును మోహనరావు ఆశ్రయించగా జస్టిస్ గవాయ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. తాజాగా వాదోపవాదాల అనంతరం మోహనరావు ఎటువంటి క్షమకు అర్హులు కానప్పటికీ, ఆయన పిల్లలు, కుటుంబాన్ని బాధపెట్టరాదని భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. డిప్యూటీ కలెక్టర్ 2 నెలల జైలు శిక్ష అనుభవిస్తే, ఆయన తన ఉద్యోగం నుంచి వైదొలగాల్సి ఉన్నందున దయ చూపిస్తున్నామని, డిప్యూటీ కలెక్టర్ నుంచి తహసీల్దార్‌గా డిమోట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నట్టు వెల్లడించింది. డీమోట్ విషయంలో ఆయన వెనక్కి తగ్గకపోతే తిరిగి ఉద్యోగంలో నియమించకుండా చూస్తామని పేర్కొంది. దీంతో డిమోట్ విషయంలో మోహనరావును ఒప్పించడానికి న్యాయవాది సమయం కోరడంతో కేసు మళ్లీ వాయిదా పడింది. -
మహిళా సైనికాధికారుల సేవలను ఉపయోగించుకోవాలి
న్యూఢిల్లీ: షార్ట్ సర్విసు కమిషన్(ఎస్ఎస్సీ)కు సంబంధించిన మహిళా సైనికాధికారులను విధుల నుంచి తప్పించకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం పాకిస్తాన్‌తో ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో వారికి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించకూడదని సూచించింది. ఇలాంటి సమయంలో వారి సేవలు ఉపయోగించుకోవాలని, వారికి అండగా నిలవాలని స్పష్టంచేసింది. తమకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ 69 మంది మహిళా సైనికాధికారులకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు క్రమశిక్షణా చర్యల కింద పిటిషనర్లను విధుల నుంచి రిలీవ్ చేసేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఈ తరుణంలో ఈ పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. శక్తిసామర్థ్యలు కలిగిన మహిళల సేవలను చక్కగా వాడుకోవాలని కేంద్రానికి సూచించింది. -
ఐదేళ్ల క్రితమే కల్నల్ సోఫియా ఘనత!
పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల అణచివేతకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరు దేశంలో ఎంతగా ప్రాచుర్యంలోకి వచ్చిందో.. ఆ ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న మహిళా సైనికాధికారులు సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ పేర్లు కూడా అంతగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముఖ్యంగా కల్నల్ సోఫియా ఖురేషీ గొప్పతనం గురించి ఐదేళ్ల క్రితమే దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. సైన్యంలో మహిళా అధికారుల శాశ్వత నియామకానికి (పర్మనెంట్ కమిషన్) సంబంధించిన కేసులో ఈమె ట్రాక్ రికార్డును న్యాయస్థానం ఉదాహరణగా చూపటం విశేషం.ఆడవాళ్లన్న కారణంతో సైన్యంలో పర్మనెంట్ కమిషన్ (పీసీ)కు అనర్హులుగా నిర్ధారించటం చట్టవ్యతిరేకమని 2020 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు ఇచ్చింది. ఆ కేసులో మహిళల పీసీకి వ్యతిరేకంగా సైన్యం, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లపై నాడు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 పేరుతో భారతదేశం నిర్వహించిన అతిపెద్ద అంతర్జాతీయ మిలిటరీ ఎక్సర్సైజ్లో భారత కంటింజెంట్‌కు న్యాయకత్వం వహించిన మొదటి మహిళ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ (Colonel Sofiya Qureshi).2006లోనే ఆమె కాంగోలో ఐక్యరాజ్యసమితి (United Nations) శాంతి పరిరక్షక దళంలో సేవలందించారు. ఆ సమయంలో కాల్పుల విరమణకు అక్కడి దేశాలను ఒప్పించటంతోపాటు మానవతా సాయంలో కూడా ఆమె కీలకపాత్ర పోషించారు. తన శక్తియుక్తులతో అక్కడ శాంతి సాధనకు కృషిచేశారు. సైన్యంలో పురుషులతోపాటు భుజంభుజం కలిపి పనిచేస్తున్న మహిళలకు.. వారి శరీర నిర్మాణాన్ని సాకుగా చూపి పీసీకి అనర్హులుగా ప్రకటించటం సరికాదు’ అని సుప్రీంకోర్టు నాటి తీర్పులో పేర్కొంది.చదవండి: అది ఇల్లు కాదు.. చిన్నపాటి సైనిక శిబిరం! -
గెజిట్‌పై స్టే ఇవ్వలేం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి పరీవాహకంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణను కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ)కు అప్పగించాలని ఆదేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై ప్రస్తుత పరిస్థితిలో స్టే విధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ గతంలో తెలంగాణ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన డివిజన్ బెంచి విచారణ జరిపింది. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న వాటాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు గాను అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 కింద కృష్ణా ట్రిబ్యునల్–2కు కేంద్రం అదనపు మార్గదర్శకాలు (టీఓఆర్) జారీ చేసిన నేపథ్యంలో అంతకు ముందు జారీ చేసిన గెజిట్‌పై స్టే విధించాలని తెలంగాణ తరఫు న్యాయవాది వాదించారు. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు స్టేను కోరుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, గెజిట్ ఇంకా అమల్లోకి రాలేదని బదులిచ్చారు. ‘అమల్లోకి రానప్పుడు స్టే ఎందుకు? అలాంటి ఉపశమనం ఇవ్వలేము’అని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో వాదనలు విని తుది తీర్పు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ జరగలేదని, ఈ పరిస్థితిలో రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణను కృష్ణా బోర్డుకు అప్పగించడం సరికాదని తెలంగాణ న్యాయవాది కోర్టుకు వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంపిణీకి ఓ ప్రాతిపదికన లేనప్పుడు కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడం తగదన్నారు. కాగా, నీటి పంపకాలను కృష్ణా ట్రిబ్యునల్–2 తేల్చలేదని, ఈ పరిస్థితిలో స్టే ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. కేసు తుదుపరి విచారణను జూలై 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరిపేందుకు గాను కృష్ణా ట్రిబ్యునల్–2కు అదనపు మార్గదర్శకాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీం కోర్టులోని మరో ధర్మాసనం విచారించనుంది. -
సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాలు ఎలా చూడొచ్చంటే?
ఢిల్లీ: సుప్రీంకోర్టు (supreme court) కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాల్ని పబ్లిక్ డొమైన్లో అందుబాటులోకి తెచ్చింది.ఏప్రిల్ 1వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా కలిసి ఫుల్ కోర్టు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులందరూ వారి ఆస్తుల వివరాల్ని బహిర్గతం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయ స్థానానికి చెందిన 33 మంది జడ్జీలలో 21మంది జడ్జీల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు.ఈ ఆస్తుల్లో రియల్ ఎస్టేట్,మూవబూల్ ప్రాపర్టీలు ,గోల్డ్,పెట్టుబడుల వివరాలు ఉన్నాయి. జడ్జీలతో పాటు వారి సతీమణులకు చెందిన ఆస్తులతో పాటు, ఉమ్మడి కుటుంబమైతే వారి ఆస్తుల వివరాల్ని సైతం ఉన్నాయి. ఆస్తుల వివరాల్ని జడ్జీలతో పాటు ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం సైతం వారి ఆస్తుల వివరాల్ని అందిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.నవంబర్ 2022 మే 2025 మధ్య జరిగిన నియామకాల గురించి ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం, పారదర్శకతను పెంచేందుకు అత్యున్నత న్యాయస్థానం ఈ వివరాల్ని తన వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఆస్తుల వివరాలే కాదు సుప్రీంకోర్టు, హైకోర్టులలో నియామకాలు, హైకోర్టు కొలీజియంకు కేటాయించిన పాత్రలతో సహా, రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టు జడ్జీల నియామకపు ప్రతిపాదనలు వంటి ఇతర వివరాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలుకాగా,ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా (Delhi HC Judge) యశ్వంత్‌వర్మ అధికారిక నివాసంలో భారీఎత్తున కాలిన నోట్ల కట్టలు బయటపడడం సంచలనంగా మారింది. న్యాయమూర్తి అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరగడంతో.. ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఇది వివాదాస్పదం కావడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాలు.. ఎలా చూడొచ్చంటే?గూగుల్‌లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అని టైప్ చేయండి. అనంతరం మీకు సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ ఇంటర్ ఫేస్ కనిపిస్తుంది. ఇంటర్ ఫేస్ టాప్ బార్లో మీకు హోం,అబౌట్ అజ్,జడ్జస్ ఇలా కేటగిరీలు కనిపిస్తాయి. వాటిల్లో జడ్జస్ కేటగిరి మీద ట్యాప్ చేస్తే అసెట్స్ ఆఫ్ జడ్జస్ అనే సబ్ కేటగిరీలు కనిపిస్తాయి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సుప్రీంకోర్టు జడ్జీల పేర్లు పక్కన వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆస్తుల వివరాలు ఓపెన్ అవుతాయి. -
అన్నీ తప్పుడు కేసులే.. ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, ఢిల్లీ: ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా ఈడీ అధికారులు.. అరెస్ట్ చేస్తున్నారని వ్యాఖ్యలు చేసింది. తప్పుడు కేసులు పెడుతోందని ఘాటుగా స్పందించింది.దేశంలో ఈడీ కేసుల్లో అరెస్టులపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ధర్మాసనం స్పందిస్తూ..‘ఆధారాలు లేకుండా ఈడీ అరెస్టులు చేస్తోంది. ఈడీకి ఇదొక అలవాటుగా మారింది. ఇలా అనేక కేసులు మేము చూస్తున్నాం. ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కాంలో ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ ఆధారాలు చూపలేదు. గతంలోనూ అనేక కేసుల్లో ఆధారాలు చూపించలేదు. తప్పులు కేసులు పెడుతుంది. ప్రతీ స్కాంలో ఈడీ తీరు ఇలాగే ఉంది. అరెస్టులు చేయడం అలవాటుగా మారింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ED making allegations without evidence: Supreme Court observes #SupremeCourt while hearing a bail application in an ED arrest:Justice Abhay S Oka: this is what we’re seeing in umpteen number of cases filed by the ED. This is the pattern, you just make allegations without any… pic.twitter.com/THRaLZg9R5— Bar and Bench (@barandbench) May 5, 2025 -
ఇదంతా వేధింపుల్లో భాగమే: మద్యం కొనుగోళ్ల వ్యవహారం కేసులో పిటిషనర్లు
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కొనుగోళ్ల వ్యవహారం కేసులో అరెస్టు నుంచి తమకు రక్షణ కల్పించాలని ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ క్రమంలో పిటిషన్లో పేర్కొన్న కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘మద్యం కొనుగోళ్లతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వ్యవహారం అంతా ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ పరిధిలోనిది. మేమేకుట్ర దారులమని చెప్పేందుకు ప్రాథమికంగా ఇలాంటి ఆధారాలు లేవు. ఇదే కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పించారు. . పైగా మద్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చింది. .. మాపై ఆరోపణలు చేయడం వేధింపులో భాగమే. మద్యం కొనుగోళ్లలో మా పాత్ర ఉందనే ఆరోపణలకు ఆధారాలు ఉంటే ఏసీబీ వద్దే ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఆధారాలను తాము ఎలా తారుమారు చేయగలం. మా స్థాయిని తగ్గించి, అవమానించే ఉద్దేశంతోనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని పిటిషన్లో ప్రస్తావించారు వాళ్లు. మరో పక్క ఈ వ్యవహారంలో మే 7వ తేదీన ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఆలస్యం లేకుండా విచారణ జరపాలని ఆదేశించిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారణను మే 8వ తేదీకి వాయిదా వేసింది. -
వక్ఫ్ చట్టం చట్టబద్ధతపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం(Waqf Amendment Act) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ మే 15కి వాయిదా వేసిందిసీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్లపై విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా వక్ఫ్ కేసు విచారణను జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనానికి బదిలీ చేసింది. మే 13న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా రిటైర్ కానున్న నేపథ్యంలో కేసు బదిలీపై నిర్ణయం తీసుకుంది.వక్ఫ్ కేసులలో తదుపరి విచారణ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారణ కొనసాగించనుంది.వక్ఫ్ (సవరణ) చట్టం2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖయ్యాయి. ఇప్పటికే పలుసార్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కేంద్రం విజ్ఞప్తి మేరకు నేటి వరకు గడువు ఇచ్చింది. గత విచారణ సమయంలో చట్టంలోని రెండు వివాదాస్పద నిబంధనలను తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. మే 5వ తేదీ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపింది. గత వాదనల్లో.. వక్ఫ్ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించొద్దని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. గత విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అన్నిరకాలుగా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంది. ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి వాదనలు వినకపోవడం సముచితం కాదని పేర్కొన్నారు. మరోవైపు.. వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించొద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ చెప్పింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్ అఫీషియో సభ్యులను నియమించొచ్చని.. ఈ మేరకు వక్ఫ్(సవరణ) చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదించింది. -
అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి
సాక్షి, అమరావతి: మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన అక్రమ కేసులో అరెస్ట్ నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అప్పటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్‌కు చెందిన బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం అత్యవసరంగా మూడు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరపాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. కాగా, తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఇప్పటికే హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. వీటిపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వికాస్‌సింగ్, నాగముత్తు కోరారు. ఈ లోపు ఏసీబీ అరెస్ట్ చేస్తే తాము దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు నిరర్థకం అవుతాయని తెలిపారు.అయితే, ఏసీబీ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు స్పష్టం చేశారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ధనుంజయరెడ్డి తదితరులు అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కనీస స్థాయిలో కూడా మా వాదన వినలేదుఅరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించడాన్ని తమ వ్యాజ్యాల్లో ధనుంజయరెడ్డి తదితరులు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తమ వ్యక్తిగత స్వేచ్ఛ ముడిపడి ఉందని, న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు ఎంతో ప్రాధాన్యతనిస్తాయని తమ పిటిషన్లలో పేర్కొన్నారు. హైకోర్టు తీరు తమ హక్కులను కాలరాసే విధంగా ఉందన్నారు. అరెస్ట్ విషయంలో తమ ఆందోళనను హైకోర్టు కనీస స్థాయిలో పట్టించుకోలేదని, తమ సీనియర్ న్యాయవాదులకు వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పారు. ముందస్తు బెయిల్ మంజూరు అంశాన్ని కనీస స్థాయిలోనూ పరిశీలించకపోవడం, వాదన వినిపించే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. వాస్తవానికి ఏసీబీకి ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసే అధికారం హైకోర్టుకు ఉందన్నారు. గుర్భక్ష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపారు. అరెస్ట్ విషయంలో ఆందోళన ఉన్నప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఏసీబీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టుల్లో తమను కుట్రదారులుగా పేర్కొందని, ఆ ఆరోపణలన్నీ నిరాధారమని ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తమ వ్యాజ్యాల్లో వివరించారు.మద్యం కొనుగోళ్లతో మాకేం సంబంధం లేదుమద్యం కొనుగోళ్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి వివరించారు. ఇదంతా పూర్తిగా ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోనిదని తెలిపారు. తాము కుట్రదారులని చెప్పేందుకు ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదే వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇప్పటికే ఎంపీ మిథున్‌రెడ్డికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. మద్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇప్పటికే తేల్చి చెప్పిన సంగతిని గుర్తుచేశారు. అయినా కూడా తమపై ఆరోపణలు చేయడం వేధింపుల్లో భాగమేనని పేర్కొన్నారు. మద్యం కొనుగోళ్లలో తమ పాత్ర ఉందన్న ఆరోపణలకు ఆధారాలుంటే అవి ఏసీబీ వద్దే ఉంటాయని, అలాంటప్పుడు తాము ఆధారాలను ఎలా తారుమారు చేయగలమని వారు ప్రశ్నించారు. ప్రజల్లో తమ స్థాయిని తగ్గించి, అవమానించాలన్న ఉద్దేశంతోనే ఏసీబీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. -
ఏపీ సీఐడీ పరిధి సంగతి తేలుస్తాం
సాక్షి, అమరావతి: ఏపీ సీఐడీ పరిధి సంగతిని తేలుస్తామని, సీఐడీ కూడా చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని పేర్కొంది. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తనకు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ రాజ్ కేసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సీఐడీ నోటీసుల్లో జోక్యానికి నిరాకరిస్తూ హైకోర్టు గత నెల 4న ఇచ్చిన ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, సీఐడీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.తెలంగాణ పరిధిలో జోక్యం చేసుకునే అధికారం ఏపీ సీఐడీకి లేదుఅంతకుముందు రాజ్ కేసిరెడ్డి తరఫు న్యాయవాది శ్రీహర్ష పీచర వాదనలు వినిపించారు. రాజ్ హైదరాబాద్‌లో నివాసం ఉంటారని, అందువల్ల ఆయనకు నోటీసులు జారీ చేసే పరిధి ఏపీ సీఐడీకి లేదని వివరించారు. ఒక రాష్ట్రం తన పరిధిలోని ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే కలగజేసుకునే వీలుంటుందని తెలిపారు. తాము సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ మొదట ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశామని, అయితే ఏపీ సీఐడీ పరిధిలోకి తెలంగాణ రాష్ట్రం వస్తుందంటూ 2022లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తమ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిందని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ సీఐడీలకు ఇరు రాష్ట్రాలు కూడా ఒకదానికొకటి పొరుగు పోలీస్ స్టేషన్లు అవుతాయన్న తీర్పు ఇవ్వడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసిందని వివరించారు. సీఐడీ పరిధి విషయంలో హైకోర్టు చెప్పిన భాష్యం వల్ల సెక్షన్ 179 నిరర్థకం అవుతోందన్నారు. హైకోర్టు తీర్పుతో ఏపీ సీఐడీకి అపరిమిత అధికారులు దఖలు పడ్డాయన్నారు. దీంతో పొరుగు రాష్ట్రంలోని వారికి సైతం నోటీసులు ఇచ్చే అధికారం సీఐడీకి కలిగిందని తెలిపారు. అందులో భాగంగానే పిటిషనర్ రాజ్ కేసిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే పిటిషనర్‌ను తప్పుడు కేసులో ఇరికించినట్లు చెప్పారు.ఇప్పటికే అరెస్ట్ చేశారు.. ఈ వ్యాజ్యం నిరర్థకంరాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, సీఐడీ పరిధి విషయంలో ఏపీ హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని.. పిటిషనర్‌ను సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసిందని తెలిపారు. కాబట్టి నోటీసులను సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం నిరర్థకం అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ పరిధిని తేలుస్తాం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీఐడీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని తెలిపింది. -
కుల గణనపై మాజీ సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశంలో జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టాలన్న కేంద్రం నిర్ణయంపై మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. జనగణనలో భాగంగా కుల గణన చేయడం చారిత్రక అవసరం అని ఎన్వీ రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే, జనగణనలో ప్రతి సామాజిక సూచికను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.తాజాగా మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కులం, కులం ఆధారిత వివక్ష ఒక కఠినమైన వాస్తవం. చాలా కాలం పాటు మనం ఈ వాస్తవాన్ని అంగీకరించకుండా విస్మరించడానికే ప్రాధాన్యం ఇచ్చాం. ఇప్పుడు మనం చైతన్యంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. కుల గణన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వానికీ హృదయపూర్వక అభినందనలు. కులాన్ని ఒక గుర్తింపుగా తీసుకుని జనగణన (Census)లో భాగం కుల గణన నిర్వహించడం సరైన నిర్ణయం.ప్రామాణికమైన డేటాను సేకరించకపోతే సమగ్ర కోణంలో అభివృద్ధి కార్యాచరణను రూపొందించడం సాధ్యపడదు. కుల గణనతో మన సమాజంలోని అన్ని వర్గాలకు అధికారంలో, ఆర్థిక అభివృద్ధిలోను వారికి రావాల్సిన వాటా లభించేలా చేయడంలో తోడ్పడుతుంది. సామాజిక, ఆర్థిక, ఇతరత్రా అసమానతలను తగ్గించడంలో కూడా కుల గణన ఎంతో దోహదపడుతుంది. జనగణనలో ప్రతి సామాజిక సూచికను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని అన్నారు. -
మోహన్‌బాబుకు ‘సుప్రీం’ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: సినీనటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2019 ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులో విచారణ నుంచి తనకు మినహాయింపుతోపాటు స్టే ఇవ్వాలని కోరిన మోహన్‌బాబు పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు విచారణకు హాజరుకాకుండా స్టే ఇవ్వాలని మోహన్‌బాబు తరపు సీనియర్ న్యాయవాది నిఖిల్ గోయల్ కోరారు. అంతేగాక మే 2న ఈ కేసులో విచారణకు హాజరుకావాలని తమకు ఇచ్చిన నోటీసుపై స్టే విధించాలని కోరగా... శుక్రవారం విచారణాధికారి ముందు కచ్చితంగా హాజరు కావాలని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఆదేశించింది. అనుమతి లేకుండా ధర్నా చేయడంతో..2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తమ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి–మదనపల్లె జాతీయ రహదారిపై విద్యార్థులతో కలిసి మోహన్‌బాబు కుటుంబం బైఠాయించింది. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ముందస్తు అనుమతి తీసుకోకుండా ధర్నా చేయడంతో.. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద మోహన్‌బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌కుమార్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఏఓ తులసినాయుడు, పీఆర్వో సతీష్ౖపె చంద్రగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో స్టే కోరుతూ మోహన్‌బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దీనిపై బుధవారం వాదనలు జరిగాయి. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. -
పహల్గామ్ దాడి ఘటన: సుప్రీంలో రేపు విచారణ
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి జ్యుడిషియల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాలు(పిల్)పై రేపు(గురువారం) విచారణ జరగనుంది. దాంతో పాటు కశ్మీర్ కు వచ్చే టూరిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతపై కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలకు తగిన మార్గదర్శకాలకు ఇవ్వాలని కోరుతూ పిల్ దాఖలైంది.కశ్మీర్ కు చెందిన మహ్మద్ జునైద్, ఫతేష్ సాహు, విక్కీ కుమార్ లు దాఖలు చేసిన ప్రయోజన ప్రయోజన వాజ్యాలు దాఖలు చేయగా రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ఈ మూడు పిల్ లను కలిపి విచారించనుంది.జమ్మూ కశ్మీర్ ప్రాంతమైన పహల్గామ్ ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత మంగళవారం(ఏప్రిల్ 22వ తేదీ) జరిగిన ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో అక్కడకు వెళ్లిన టూరిస్టులు 26 మంది మృత్యువాత పడగా. కొంతమంది తృటిలో ప్రాణాలు దక్కించుకున్నారు. -
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పెగాసస్ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్(Spyware)ను కలిగి ఉండటం తప్పులేదని పేర్కొంది. అయితే.. అది ఎలా? ఎవరిపై ఉపయోగించారనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.దాదాపు నాలుగేళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్‌ను వినియోగించి దేశంలోని ప్రముఖ పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. పెగాసస్ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. పిటిషన్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందా? లేదా? అనే విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక, ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపి సాంకేతిక నిపుణుల బృందం నివేదిక కోసం సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించిందని, ఇప్పటివరకూ ఆ నివేదిక అందలేదని, దానిని బయట పెట్టాలని ధర్మాసనాన్ని కోరారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. దేశం స్పైవేర్‌ను వినియోగిస్తే గనుక అందులో తప్పేముంది. అయితే, దాన్ని ఎవరిపైన ఉపయోగిస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. పౌర సమాజంపై కాకుండా.. దేశ వ్యతిరేక శక్తులపై దీన్ని వినియోగిస్తే గనుక అందులో ఏ తప్పు లేదు. దేశ భద్రత విషయంలో రాజీపడకూడదు. ఒకవేళ సామాన్య పౌరులపై ఉపయోగిస్తే గనుక దాని గురించి మేం దర్యాప్తు జరిపిస్తాం. ఉగ్రవాదులు గోప్యత హక్కును కోరకూడదు. అయితే, సామాన్య పౌరుల గోప్యతకు మేం తప్పకుండా రక్షణ కల్పిస్తాం. ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు(పహల్గాం ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ..). కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక, సాంకేతిక బృందం నివేదిక గురించి మాట్లాడుతూ.. ‘‘దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయడం సరికాదు. ఒకవేళ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే.. వారికి సమాచారం అందిస్తాం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.పెగాసస్ వ్యవహారం ఏంటంటే.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ అనే సంస్థ ‘పెగాసస్’ స్పైవేర్‌ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్‌ను ఎన్ఎస్వో పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తుంటుంది. అయితే, ఈ పెగాసస్‌ను ఉపయోగించి పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేశారంటూ 2021లో ఓ అంతర్జాతీయ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. భారత్ నుంచి 300 మంది ఫోన్లు హ్యాక్ అయినట్లు పేర్కొంది. వీరిలో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ వివాదం దేశ రాజకీయాలను కుదిపేసింది. -
విభేదిస్తే వ్యతిరేకించాలా?
‘అధికారం చెడగొడుతుంది. సంపూర్ణ అధి కారం సంపూర్ణంగా చెడగొడుతుంది.’ లార్డ్ జాన్ డల్బర్గ్ 1887లో చెప్పిన మాట ఇది. అధికారం అహంకారం కూడా తెస్తుంది,సంపూర్ణ అధికారం సంపూర్ణ అహంకారం తెస్తుంది... ఇది నేటి మాట. ఈ అహంకారానికి అవమానించే గుణం తోడవుతోంది. అహంకారులు భిన్నస్వరాన్ని భరించలేరు. అణచివేస్తారు. ఇండియాలోనే కాదు, అమెరికా తదితర అనేక దేశాల్లోనూ ఈ ధోరణి ప్రబలుతోంది.స్వేచ్ఛ కాగితాలకే పరిమితమా?అధికార పార్టీ నేతల పట్ల వ్యతిరేక భావాలు వ్యక్తం చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటి వారిపై భౌతిక దాడులు జరుగుతాయి. ప్రభుత్వ ఏజన్సీలు వారిని వేటాడతాయి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. రాజకీయ, సామాజిక రంగాల్లో అసమ్మతి ప్రకటించే వారి పట్లే ఈ తృణీకార ధోరణి ఇంతకాలం పరిమితమైంది. కానీ ఇప్పుడిది ఎల్లలు దాటింది. ఆఖరికి న్యాయవ్యవస్థను కూడా వదిలిపెట్టని దుఃస్థితి దాపురించింది. తమ మాటకు తలొగ్గని వారు ఎవరైనా వారికి ఒకటే. న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఇందుకు మినహాయింపు కాదు. తమతో విభేదించిన న్యాయవ్యవస్థ వారి అవమానానికి గురవుతోంది.చిన్నప్పుడు మనకు స్కూల్లో ఏం చెప్పేవారు? చట్ట సభలు ప్రజా స్వామ్య పీఠాలనీ, సభ్యులకు అక్కడ భయం లేకుండా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందనీ చెప్పేవారు కదా! నిజానికి అవన్నీ కాగితాలకే పరిమితం. ప్రజలెన్నుకున్న ప్రతినిధులు చట్టసభల్లో అధికార పక్షంతో విభేదించి తమ గొంతు వినిపించగలుగుతున్నారా? అధికార పార్టీ సభ్యులు గానీ, అధ్యక్ష స్థానంలో ఉన్నవారు గానీ వారిని అందుకు అనుమతించడం లేదు. శాసన నిర్మాణ సంస్థల స్థాయి పెరిగే కొద్దీ వాటిలో ఈ ధోరణీ హెచ్చుతోంది.ప్రతిపక్ష సభ్యుల గొంతు వినబడకుండా అరుపులు కేకలతో పాలకపార్టీ సభ్యులు వారిని నిరోధించడం సర్వసాధారణమైంది. ఒక వేళ వారా పని చేయలేకపోతే, సభాధ్యక్షులు జోక్యం చేసుకుని ప్రతి పక్ష సభ్యుల మాటలను రికార్డుల నుంచి తొలగిస్తారు, మైకులు కట్ చేస్తారు. లేదంటే మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఇచ్చినా తగినంత సమయం కేటాయించరు.తటస్థత చూపనక్కర్లేదా?అత్యున్నత పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం, దిగువ సభ స్పీకర్, ఎగువ సభ చైర్మన్ తమ రాజకీయ అనుబంధాలను పక్కన పెట్టి విధి నిర్వహణలో తటస్థంగా ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో ఇలా జరగటం లేదు. ఈ సంప్రదాయం నుంచి వారు వైదొలగుతున్నారు. కింది స్థాయి చట్టసభల్లోనే కాదు, లోక్‌సభలో, రాజ్యసభలో సైతం ఇదే జరుగుతోంది. ఉదాహరణకు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను చూడండి. బీజేపీతో ఆయన తన అనుబంధాన్ని వీడలేక పోతున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యవహరించారు. ఇప్పుడూ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఆయన కళ్లన్నీ రాష్ట్రపతి పదవి మీదున్నాయి. అధినాయకుడి అను గ్రహం ఉంటేనే ఆ కల నెరవేరుతుంది. అందుకోసం ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఆయనొక్కడే కాదు, అలాంటివారు పార్లమెంటులో చాలామంది ఉన్నారు. తగిన అర్హతలు లేకున్నా అధి నాయకుడి పట్ల విధేయత అనే ఒక్క అర్హతతో వారు మహనీయమైన ఉన్నత పదవులు పొందగలిగారు. గొప్ప మేధావులు ఎందరో ధన్ ఖడ్‌కు ముందు ఆ పదవిని అలంకరించారు. అత్యున్నత ప్రజాస్వా మిక విలువలతో వారంతా తమ పదవికి వన్నె తెచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ని అణు క్షిపణిగా పేర్కొంటూ ధన్ ఖడ్ ఈ మధ్య ఒక తూటా పేల్చారు (సంపూర్ణ న్యాయం చేయడం కోసం సుప్రీంకోర్టుకు విస్తృత విచక్షణాధికారాలను కట్టబెట్టే ఆర్టికల్ ఇది). ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే! ఆ అధికరణంపై సమగ్ర సమీక్ష, అవగాహనతో చేసిన వ్యాఖ్య కాదు! తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన ప్రకటన వెలువడింది. గవర్నర్లు చట్టసభలు చేసిన బిల్లులకు తప్పనిసరిగా సమ్మతి ఇవ్వాలన్నది తీర్పు సారాంశం. ఈ మధ్యకాలంలో చాలా మంది గవ ర్నర్లు కేంద్రానికి పక్క వాద్యకారులుగా పని చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ధన్‌ఖడ్ సైతం ఇలాగే చేశారు. కాబట్టి, అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సబబే! ఆయన ఆర్టికల్ 142ని అణు క్షిపణిగా పేర్కొనడం... శాసన, న్యాయ వ్యవస్థల నడుమ ఉండాల్సిన అధికార సమతుల్యతను తిర స్కరించడమే అవుతుంది. ఇలా వ్యాఖ్యానించి, రాజ్యాంగ నిర్మాతల విజ్ఞతకు ఆయన సవాలు విసిరారు. ఇది మరీ తీవ్రమైన అంశం. నైతికత సారథులుగా వ్యవహరించాలి!రాష్ట్రపతి మూడు నెలల్లో బిల్లుపై నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గడువు విధించడాన్ని ధన్‌ఖడ్ తప్పు పట్టారు. అయితే, మనం ఉన్నది రాజరిక వ్యవస్థలో కాదనీ, మనది ప్రజాస్వామ్యం అనీ ఉప రాష్ట్రపతి గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రపతి పౌరులకు జవాబుదారీ కనుక, న్యాయవ్యవస్థకు లోబడి ఉండాలని మర్చిపోకూడదు. చట్టం తు.చ. తప్పకుండా అమలయ్యేట్లు చూడటంతో పాటు, ఆ శాసన ఆదేశాల ఉద్దేశం ఏమిటో గ్రహించడం కూడా న్యాయ వ్యవస్థ విధి.శాసన, న్యాయ వ్యవస్థల నడుమ అధికార విభజన గురించి స్పష్టంగా చెప్పిన వాళ్లలో మాంటెస్క్యూ ఒకరు. ‘ద స్పిరిట్ ఆఫ్ లా’ (1748) పుస్తకంలో ఆయన దీన్ని గురించి చర్చించారు: శాసన, కార్య నిర్వాహక అధికారాలు ఒకే వ్యక్తి వద్ద లేదా న్యాయాధికారుల బృందం చేతిలో ఉంటే స్వేచ్ఛ బతకదు. అందుకే వాటి నుంచి న్యాయాధికారాన్ని వేరు పరచాలి. మూడు అధికారాలు ఒకే వ్యక్తి లేదా ఒకే సంస్థ చలాయించేట్లయితే అన్నీ నాశనమవుతాయి... ఇదీ ఆయన సిద్ధాంతం. దేశంలో ‘సివిల్ వార్’కు సుప్రీంకోర్టు బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించారు. ధన్‌ఖడ్ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన ఈ మాటలన్నారు. హిందూ రాష్ట్ర స్థాపన తమ ధ్యేయమని బీజేపీ నాయకత్వం పదేపదే ప్రకటిస్తోంది. ఈ సందర్భంగా, బీజేపీ నాయకత్వం శామ్యూల్ టేలర్ కొలరిజ్ రాసిన ‘ద స్టేట్స్‌మన్స్ మాన్యువల్’ చదివి తీరాలి. రాజకీయ నాయకులు తమ నిర్ణయాలు నైతిక, ఆధ్యాత్మిక విలువలకు అనుగుణంగాఉండేట్లు జాగ్రత్త వహించాలి. తమను తాము నైతికత సారథులుగా భావించాలి. కేవలం వ్యావహారిక నైపుణ్యం, ప్రయోజకత్వం మీద ఆధారపడే రాజకీయాలను ఆయన విమర్శిస్తాడు. బదులుగా, పవిత్ర గ్రంథాల్లోని దివ్యజ్ఞానం ప్రాతిపదికగా ఉండే సూత్రప్రాయ విధానా లను అనుసరించాలని కొలరిజ్ సూచిస్తాడు. తద్వారా రాజనీతిజ్ఞులు ప్రజలకు సమర్థమైన పాలన అందించడంతో పాటు సమాజాన్ని నైతికంగానూ ఉన్నతస్థితికి చేర్చగలరని హితవు పలికాడు.అభయ్ మోకాశీవ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మీడియా ట్రెయినర్ -
ఓటీటీలలో అలాంటి కంటెంట్ వద్దు.. సుప్రీంకోర్టు నోటీసులు జారీ
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్న కంటెంట్ పట్ల కేంద్రం ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసింది. ఏ రేటింగ్ ఉన్న కంటెంట్‌తో పాటు అశ్లీల కంటెంట్‌ను కూడా అందుబాటులో ఉంచడం చట్టరిత్యా నేరం అని, వీటిని కట్టడి చేసేలా నిబంధనలను రూపొందించాల్సింది కేంద్రమే’నని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం ఇప్పటికే పేర్కొంది. అయితే తాజాగా అశ్లీల కంటెంట్ ప్రసారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటీటీ సంస్థలకే కాకుండా పలు సామాజిక మాధ్యమాల హ్యాండిళ్లకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఉల్లు, ఆల్ట్‌టీ ఓటీటీతో పాటు ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లకు సుప్రీమ్ కోర్టు నోటీసులిచ్చింది.సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్‌ను అడ్డుకోవాలని గతంలో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనల అనంతరం అశ్లీల కంటెంట్‌పై కేంద్రం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆన్లైన్ వేదికల్లో లైంగిక, అశ్లీల కంటెంట్ తీవ్రమైన విషయమని, వెంటనే ఈ అంశంపై విచారణ జరపాలని న్యాయవాది జైన్ విజ్ఞప్తి చేశారు. చట్టం ప్రకారం నిషేధించిన ఏ కంటెంట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం చేయకుండా ఉండేలా చూడాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. -
‘ఇది చాలా తప్పు చంద్రబాబు’.. ఉర్సా ల్యాండ్ డీల్‌పై సుప్రీం న్యాయవాది ఆగ్రహం
సాక్షి,విజయవాడ: ఉర్సా ల్యాండ్ డీల్‌పై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఉర్సాకి రూ.3వేల కోట్ల విలువైన భూముల్ని చంద్రబాబు కట్టబెట్టారు. అయితే, ఊరుపేరు లేని ఉర్సాకి వేలకోట్ల భూముల్ని కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆఫీస్,ట్రాక్ రికార్డ్ లేని ఉర్సాకి భూ కేటాయింపులపై ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎక్స్ వేదికగా స్పందించారు.రెండు నెలల కిందట పెట్టిన ఉర్సాకు కోట్ల విలువైన భూముల్ని కేటాయించడంపై విమర్శలు గుప్పించారు. ఆఫీసు లేదు, ట్రాక్ రికార్డ్ లేదు. రెండు నెలల కిందట పెట్టిన ఉర్సాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయల ఒప్పందం ఎలా కుదుర్చుకుంది? వావ్! చంద్రబాబు ప్రభుత్వం ఘోస్ట్ కంపెనీకి 59.6 ఎకరాల భూమిని దాదాపు ఉచితంగా బహుమతిగా ఇచ్చింది! పూర్తిగా చట్టవిరుద్ధం! 59.6 ఎకరాలు ఘోస్ట్ కంపెనీకి కేటాయించడం చట్ట వ్యతిరేకం’ అని ట్వీట్లో పేర్కొన్నారు. No Office, No Track Record: How a Two-Month-Old Firm Landed a Multi-Crore Deal With Andhra Govt. Wow!59.6 Acres of land gifted virtually free to this ghost company by the CB Naidu govt! Totally illegal!Is it kickbacks or connections with Top officials? https://t.co/XzoU8HVCp4— Prashant Bhushan (@pbhushan1) April 22, 2025ఒక్క రూపాయికి కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు..! మరి 99 పైసలకు రూ.3,000 కోట్ల భూములు ఎలా..? అంటూ ఉర్సా ల్యాండ్ డీల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీసీఎస్ కంటే ఎక్కువగా ఉర్సాకి భూ కేటాయింపులపై అనుమానాలు తలెత్తతున్నాయి.అయినా సరే ఉర్సా ల్యాండ్ డీల్‌పై ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నోరు మెదకపోవడం గమనార్హం. ఉర్సా డైరెక్టర్ అబ్బూరి సతీష్‌తో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి భాగస్వామ్యం ఉంది. కేశినేని చిన్ని, అబ్బూరి సతీష్ బంధం బయటపడటంతో ఉర్సా ల్యాండ్ డీల్‌పై గల్లీ నుంచి ఢిల్లీ వరకు చర్చాంశనీయంగా మారింది. -
ఆశల పల్లకిలో కొల్లేరు
కైకలూరు: కొల్లేరు అనే ఈ మూడక్షరాల పదం రాష్ట్రంలో మరోమారు చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు చెబుతున్న సూచనలను రాజకీయ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్నారు. తాజాగా మరోసారి కొల్లేరు సరిహద్దుల పరిశీలన చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర సాధికారిత కమిటీని ఆదేశించింది. కొల్లేరు ఆపరేషన్ ద్వారా అక్రమ చెరువులను ధ్వంసం చేసి 19 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అభయారణ్యం ఆక్రమణల చెరలోనే చిక్కుకుంది. కొల్లేరు కాంటూరు కుదింపు సాధ్యం కాదని అధ్యయన కమిటీలు గతంలోనే నివేదిక ఇచ్చాయి. కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపుతామంటున్న నేతల వాగ్దానాలు నెరవేరేనా అనే అనుమానాలు కొల్లేరు ప్రజల్లో సర్వత్రా వినిపిస్తున్నాయి. మరోమారు తెరపైకి.. కొల్లేరు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అంతర్జాతీయ రామ్సర్ ఒడంబడిక ప్రకారం 1999 అక్టోబరు 4న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీఓ 120ను తీసుకొచ్చింది. పూర్వపు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 9 మండలాల్లో + 5 కాంటూరు పరిధి వరకు 77,138 ఎకరాలను అభయారణ్యంగా నిర్ణయించారు. అక్రమ చేపల చెరువులు అభయారణ్యంలో పెరగడంతో 2006లో కొల్లేరు ఆపరేషన్ ద్వారా వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులను ధ్వంసం చేశారు. కొల్లేరు సంరక్షణకు 2006 ఏప్రిల్ 10న సుప్రీం కోర్టు జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వ అధికారులు అమలు చేయలేదని ఇది కోర్టు ధిక్కరణకు వస్తుందని కాకినాడకు చెందిన కె.మృత్యుంజయరావు 2004 సెపె్టంబరులో సుప్రీం కోర్టులో కేసు వేశారు. కాంటూరు కుదింపు సాధ్యమయ్యేనా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచం గుర్తించిన ఏకైక చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. 10వ కాంటూరు పై వరకు కొల్లేరు విస్తరించి ఉన్నప్పటికీ 5వ కాంటూరు వరకు మాత్రమే 77,138 ఎకరాల్లో అభయారణ్యంగా గుర్తించారు. కొల్లేరు అభయారణ్యాన్ని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదిస్తే 48,777 ఎకరాలు మిగులుతోంది.అభయారణ్యంలో పట్టా భూములు 14,932 ఎకరాలు, సొసైటీ భూములు 5,510 ఎకరాలు ఉన్నాయి. నష్టపరిహారం చెల్లించకుండా ధ్వంసం చేశారని కొల్లేరు ప్రజలు వాదన వినిపిస్తోన్నారు. కొల్లేరుపై అధ్యయనం చేసిన పలు కమిటీలు కాంటూరు కుదింపు సాధ్యం కాదని నివేదికలు అందించాయి. కూటమి నేతలు మాత్రం కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేసినట్లుగానే ప్రచార చేస్తున్నారు. ప్రధాని హామీ అమలు చేయాలి ఎన్నికల ప్రచారంలో భాగంగా 2014లో భీమవరం వచ్చిన ప్రధాని మోదీ కొల్లేరు కాంటూరును కుదిస్తానని హామీ ఇచ్చారు. ఆ సభలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఉన్నారు. 2015 జూలైలో అప్పటి కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేవకర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొల్లేరులో సమావేశం నిర్వహించారు. అనంతరం కాంటూరు కుదింపుపై త్రిసభ్య కమిటీని నియమించారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్, రివ్వూ పిటీషన్లు దాఖలు చేసి వాదనలు వినిపించాలని కొల్లేరు ప్రజలు కోరుతున్నారు. కాంటూరు కుదింపు జరగాలంటే జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు (ఎన్టీడబ్ల్యూఎల్) ఆమోదం జరగాలంటే రాష్ట్ర బోర్డు తీర్మాణం చేయాల్సి ఉంది. అలాగే కొల్లేరులో నిత్యం నీరు నిల్వ ఉండాలంటే రెగ్యులేటర్ల నిర్మాణం జరగాలి. ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని పలువురు కోరుతున్నారు. రాజకీయం చేయద్దు కాంటూరు కుదింపు చేస్తామని రాజకీయ నాయకులు చెబుతున్నారు. ముందుగా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలి. కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ఏళ్లు గడిచిపోయాయి. అమాయకులైన కొల్లేరు ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పండి. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ అమలు చేయడానికి కూటమి నేతలు కృషి చేయాలి. –బలే గణేష్, శృంగవరప్పాడు,కైకలూరు మండలం -
Rahul Gandhi: ‘సుప్రీం’ మందలింపు.. ఆ వెంటనే చిక్కులు!
ముంబై/న్యూఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చిక్కుల్లో పడ్డారు. పరువు నష్టం కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ పుణే కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. స్వాతంత్ర సమరయోధుడు వీరసావర్కర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.ఏఎన్ఐ కథనం ప్రకారం.. 2023 మార్చి 5వ తేదీన లండన్ పర్యటనలో రాహుల్ గాంధీ వీరసావర్కర్(Veer Savarkar)ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకు గానూ రాహుల్‌పై సావర్కర్ దగ్గరి బంధువు పుణే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన కోర్టు.. మే 9వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.మరోవైపు.. సావర్కర్‌పై మరో సందర్భంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలనుగానూ కేసు నమోదు అయ్యింది. అయితే.. తాజాగా ఆ కామెంట్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.2022లో.. భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్ర అకోల్‌లో రాహుల్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.అయితే, దీనిపై అనేకసార్లు విచారణకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని న్యాయస్థానం (ACJM) రాహుల్‌కు రూ.200 జరిమానా కూడా విధించింది. అయితే.. ఈ కేసులో తనకు జారీ చేసిన సమన్లను అలహాబాద్ హైకోర్టు రద్దు చేయడానికి నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తాజాగా.. విచారణ జరిపిన సుప్రీం కోర్టు రాహుల్‌ను గట్టిగానే మందలించింది.వీర్ సావర్కర్‌కు (Vinayak Damodar Savarkar) మహారాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారని పేర్కొన్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం.. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని మందలించింది. స్వాతంత్ర్య సమరయోధులను ఎగతాళి చేయడం తగదని.. మళ్లీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులపై ఎవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి అనుమతించమని పేర్కొంది. ఇకనుంచి వాళ్లను అపహాస్యం చేస్తే ఇకపై కోర్టు సుమోటోగా విచారణ చేపడుతుందని తెలిపింది.అదే సమయంలో.. రాహుల్‌పై దాఖలైన కేసులో ఆయనపై క్రిమినల్ చర్యలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. రాహుల్‌పై ఫిర్యాదు చేసిన నృపేంద్ర పాండేకు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. -
సమరయోధులపై అపహాస్యమా?
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది. వీర సావర్కర్‌ను మహారాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆరాధిస్తారని గుర్తు చేసింది. ‘‘మీ నానమ్మ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా సావర్కర్‌ను ప్రశంసిస్తూ లేఖ రాశారని మీకు తెలుసా? మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు తెచ్చిపెట్టిన వారిని ఇలా అవమానిస్తారా?’’ అంటూ ఆగ్రహం వెలిబు చ్చింది. ‘‘మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని సుమోటోగా తీసుకుంటాం’’ అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం శుక్రవారం హెచ్చరించింది. ‘‘ఇలాగే వదిలేస్తే మున్ముందు ‘గాంధీ బ్రిటిష్‌వారికి సేవకుడు’ అని కూడా చెబుతారు. ఎందుకంటే వైస్రాయ్ను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు గాంధీ ‘మీ నమ్మ కమైన సేవకుడు’ అంటూ మాట్లాడేవారు. స్వాతంత్య్ర యోధులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని అనుమతించబోం’’ అని స్పష్టం చేసింది. సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలను బాధ్యతారాహిత్యంగా అభివర్ణించింది. యూపీలో దాఖలైన కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై స్టే విధించింది. -
అతి జాప్యంతో అదృశ్యమైన న్యాయం!
ఇటీవల ఒక న్యాయ, చట్ట సంబంధమైన వార్తల వెబ్ సైట్లో ఒక ఆశ్చర్యకరమైన వార్తా కథనం కనబడింది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ల ధర్మాసనం ముందు, తన కక్షిదారు చనిపోయాడనీ, ఆ కేసులో నిందితులుగా ఉన్న ఇరవై ఆరు మందీ చనిపోయారనీ ఒక న్యాయవాది చెప్పారు. అవి ప్రతీకార హత్యలేమీ కావు, సహజ మరణాలు. ఈ దేశంలో సామాజిక వ్యవస్థ గురించీ, న్యాయవ్యవస్థ గురించీ ఎన్నో పాఠాలు చెప్పగల నేరమూ–శిక్షా కథ ఇది.బిహార్ లోని అర్వాల్ జిల్లా లక్ష్మణ్ పూర్ బాతే అనే గ్రామంలో 1997 డిసెంబర్ 1న నరసంహారం జరిగింది. రాజధాని పట్నాకు తొంభై కి.మీ. దూరంలో సోన్ నదీ తీరగ్రామం లక్ష్మణ్ పూర్ బాతే. అప్పుడు ఆ ప్రాంతంలో ఎన్నో అరాచకాలకూ, హత్యాకాండలకూ పాల్పడిన రణ వీర్ సేన అనే అగ్రవర్ణాల సేన ఆ గ్రామంలోని దళితుల ఇళ్ల మీద దాడి చేసి చిన్నారి పిల్లలు, స్త్రీలతో సహా 58 మందిని ఊచకోత కోసింది. హతులలో ఒక ఏడాది పసిపాప, ఒక గర్భిణి కూడా ఉన్నారు. నదికి అవతలి ఒడ్డు నుంచి రాత్రి పదకొండు గంటలకు పడవలలో వచ్చి దళిత వాడలో ఇళ్ల తలుపులు విరగ్గొట్టి, లోపలికి చొరబడి, పడుకున్నవాళ్లను పడుకున్నట్టే కాల్చి చంపారు. మూడు గంటల పాటు జరిగిన మారణకాండలో యువతుల మీద అత్యాచారాలు చేసి చంపేశారు. తర్వాత అక్కడికి వెళ్లిన పోలీసులకు అత్యాచారానికి గురైన ఐదుగురు బాలికల నగ్న మృతదేహాలు కనిపించాయి. ఈ నరసంహారం సాగించి, తిరిగి అదే పడవలలో నది దాటిన హంతకులు సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి తమను నది దాటించిన ఇద్దరు పడవవాళ్ల గొంతులు కోసి చంపేశారు.అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ‘దేశానికి సిగ్గు చేటు’ అని అభివర్ణించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. ఈ మారణకాండ కారణాలు, పూర్వరంగం ఏమైనప్పటికీ, తర్వాత జరిగిన న్యాయ విచారణా ప్రక్రియ ఆశ్చర్యకరమైన మలుపులు తిరిగింది. జహానాబాద్ జిల్లా సెషన్స్ కోర్టులో జరగవలసిన ఈ విచారణను పట్నా హైకోర్టు ఆదేశాల మేరకు 1999 అక్టో బర్లో పట్నాకు బదిలీ చేశారు. తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత 2008 డిసెంబర్లో 46 మంది రణవీర్ సేన కార్యకర్తల మీద నేరారోపణలు నమోద య్యాయి. రెండు సంవత్సరాల తర్వాత 2010 ఏప్రిల్ 7న పట్నా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి విజయ్ ప్రకాష్ మిశ్రా నిందితులలో 16 మందికి మరణశిక్ష, 10 మందికి యావ జ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ హత్యాకాండ ‘పౌర సమాజం మీద మచ్చ’ అనీ, ‘పాశవికత్వంలో అరుదైన వాటిలోకెల్లా అరుదైనది’ అనీ తీర్పులో రాశారు. శిక్షితులు అప్పీలుకు వెళ్లగా పట్నా హైకోర్టు జస్టిస్ వీఎన్ సిన్హా, జస్టిస్ ఏకే లాల్ ద్విసభ్య ‘ధర్మాసనం’ 2013 అక్టోబర్ 9న ‘సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా’ శిక్షలన్నిటినీ కొట్టివేసింది. ఇంత అన్యాయమైన హైకోర్టు తీర్పు వార్త ప్రధాన స్రవంతి పత్రికలకు పట్టనే లేదు. యాభై ఎనిమిది మందిని హత్య చేసి, కింది కోర్టులో నేరం రుజువై తీవ్రమైన శిక్షలు కూడా పడిన నేరస్థులను, అలా సాక్ష్యాధారాలు లేవంటూ వదిలివేసిన దుర్మార్గమైన వార్త కన్నా ఆ రోజే క్రికెట్ నుంచి విరమించుకుంటున్నానని సచిన్ టెండూల్కర్ చేసిన ప్రకటన పెద్ద వార్త అయింది! హైకోర్టు తీర్పును బిహార్ ప్రభుత్వమూ, బిహార్‌లోని రాజకీయ పార్టీలన్నీ తప్పు పట్టాయి. ఈ తీర్పును ఎంత మాత్రమూ అంగీకరించడానికి వీలు లేదని, తీర్పును సమీక్షించమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని బిహార్ రాజకీయ పార్టీలు కోరాయి.పట్నా హైకోర్టు తీర్పును సమీక్షించి, కొట్టివేయాలని, మారణకాండ దోషులకు కఠిన శిక్షలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2013 డిసెంబర్లో సుప్రీంకోర్టును అభ్యర్థించింది. 2014 జనవరి 13న సుప్రీంకోర్టు కేసు నమోదు చేసుకుని నోటీసులు పంపింది. నాలుగు సంవత్సరాల తర్వాత 2018, 2019లలో కాస్త విచారణ జరిగి, కేసు మౌలిక దస్తావేజులు, అదనపు పత్రాలు పంపమని కింది కోర్టులను ఆదేశించడంలోనే సమయం గడిచిపోయింది. 2023 ఒక్క సంవత్సరంలోనే ఎటువంటి వాదనలు, విచా రణ జరగకుండా ఆరుసార్లు వాయిదాలు పడ్డాయి. ఈ మధ్యలో కొందరు నిందితులు మరణించారని న్యాయ వాదులు సుప్రీంకోర్టు దృష్టికి తెస్తూనే ఉన్నారు. 2025 జనవరి 1 నాటికి ఇరవై ఆరు మందిలో ఐదుగురు మర ణించారని నమోదయింది. పన్నెండేళ్లుగా వాయిదాలు పడుతూ నత్తనడకలతో సాగుతూ సాగుతూ వచ్చిన ఆ కేసులో 2025 ఏప్రిల్ 3న ఒక నిందితుడి తరఫున వాది స్తున్న న్యాయవాది ‘ఇరవై ఆరు మంది నిందితులూ మరణించారని ధర్మాసనానికి తెలియజేస్తున్నాం’ అన్నారు. వాస్తవ స్థితి ఏమిటో చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన ధర్మాసనం కేసును మళ్లీ వాయిదా వేసింది. ఆలస్యం చేయడమంటే న్యాయాన్ని నిరాకరించినట్టే అనే నానుడిని నిజం చేస్తూ మన న్యాయవ్యవస్థ సాచివేత ద్వారా న్యాయాన్ని నిరాకరిస్తున్న తీరు ఇది! ఇప్పుడు నడుస్తున్న మందకొడి వేగంతోనే నేర విచారణలు సాగుతూ పోతే దేశంలో ఆ నాటికి న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ పూర్తి కావడానికి 324 సంవ త్సరాలు పడుతుందని 2018లో నీతి ఆయోగ్ ఒక వ్యూహ పత్రంలో నిర్ధారించింది. ఆ నాటికి దేశం మొత్తం మీద పెండింగ్‌లో ఉన్న కేసులు రెండు కోట్ల తొంబై లక్షలు కాగా, 2025 జనవరి నాటికి ఆ సంఖ్య ఐదు కోట్ల ఇరవై లక్షలకు చేరింది. నీతి ఆయోగ్ అంచనా ప్రకారమే చూస్తే, ప్రస్తుత పెండింగ్ కేసులు పూర్తి కావడానికి 580 సంవ త్సరాలు పడుతుంది!! అప్పటికి వాదులూ ఉండరు, ప్రతి వాదులూ ఉండరు. అటు, ఇటు వాదించే న్యాయ వాదులూ ఉండరు! న్యాయం ఉంటుందా?ఎన్. వేణుగోపాల్ సీనియర్ జర్నలిస్ట్ -
సెక్షన్ 3 ప్రకారం కృష్ణాజలాల పంపిణీతో ఏపీకి తీరని నష్టం
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్రాష్ట్ర నదీజలాల చట్టం–1956లోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణాజలాల పునఃపంపిణీ కోసం కేంద్రం జారీచేసిన నూతన మార్గదర్శకాల వల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. గతంలోని కేటాయింపులు కాకుండా ఇప్పుడు మళ్లీ కేటాయింపులను మొదటి నుంచి పరిశీలించేలా విధివిధానాలను ఖరారు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది.కృష్ణాజలాల పంపిణీకి సంబంధించి ట్రైబ్యునల్‌కు కేంద్రం జారీచేసిన సెక్షన్ 3ను రద్దుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. నదీజలాల కేటాయింపు విషయంలో గతేడాది తీసుకున్న కేంద్ర నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, నదీజల వివాద చట్టం ప్రకారం బ్రిజేష్ ట్రైబ్యునల్‌కు ఇలా అదనపు అంశాలు పరిశీలించే అధికారం లేదని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, జైదీప్ గుప్తా వాదనలు వినిపించారు.గతంలో కృష్ణానది జలాల పంపిణీలో భాగంగా ఏపీకి 811 టీఎంసీలు కేటాయించగా.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని తెలిపారు. అయితే ఈ కేటాయింపులను మళ్లీ మొదటి నుంచి పరిశీలించేలా విధివిధానాలు ఖరారు చేయడం వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగే అవకాశముందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం కోర్టు సమయం ముగియడంతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తదుపరి వాదనలు గురువారం లేదా మరోరోజు వింటామని ధర్మాసనం తెలిపింది. -
పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మునగాల హరీశ్వర్‌రెడ్డి మంగళవారం హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్, రిజిష్ట్రార్ (జ్యుడీషియల్)కు ఫిర్యాదు చేశారు. వీరిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేర చర్యలు తీసుకోవాలని కోరారు. హరీశ్వర్‌రెడ్డి తరఫున ఆయన న్యాయవాదులు కాసా జగన్మోహన్రెడ్డి, కె.జానకిరామిరెడ్డి, యర్రంరెడ్డి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, పొన్నపురెడ్డి శశివర్థన్‌రెడ్డి, పాపుడిప్పు శశిధర్‌రెడ్డి తదితరులు ఫిర్యాదు కాపీని రిజిష్ట్రార్ జనరల్, రిజిష్ట్రార్ (జ్యుడీషియల్)కు అందజేశారు.పోలీస్ అధికారులు, అలాగే మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ధిక్కరించి, ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలలోనూ నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపుతున్నారని హరీశ్వర్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై కూడా తిరుపతి తూర్పు పోలీసులు పలు సెక్షన్ల కింద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని, ఈ సెక్షన్లన్నీ ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడేవేనన్నారు. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు తనను అరెస్ట్ చేశారని తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, మేజిస్ట్రేట్ తగిన కారణాలను వెల్లడించకుండా యాంత్రికంగా తనను రిమాండ్‌కు పంపారని హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు.తమ ఆదేశాల అమలును హైకోర్టులు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు చెప్పిందితాను కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు ఇలాంటి కేసులు ఎన్నో జరిగినట్లు తెలిసిందని హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సుప్రీం ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు పలువురిని అరెస్ట్ చేసినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. తమ మార్గదర్శకాల అమలును దేశంలోని అన్నీ హైకోర్టులు పర్యవేక్షించాలని, వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సంతేందర్ కుమార్ అన్టిల్ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు.ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టు సైతం చెప్పింది..ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం బొల్లినేని రాజగోపాల్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొందన్నారు. ‘సీఆర్పీసీ సెక్షన్ 167 ప్రకారం రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసే ముందు మేజిస్ట్రేట్లు తమ సంతృప్తిని రికార్డ్ చేయాలి. వాస్తవాల విషయంలో నిష్పాక్షికంగా ఆలోచించి, కారణాలతో కూడిన ఉత్తర్వు ఇవ్వాలి. దీనికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా తీవ్రంగా పరిగణిస్తాం. మేజిస్ట్రేట్లు లోపభూయిష్టమైన రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని నిందితులు కానీ, వారి తరఫున ఇతరులు గానీ హైకోర్టు దృష్టికి తీసుకొస్తే ఆ మేజిస్ట్రేట్లపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం’ అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆదేశాలను ఉల్లంఘించిన విచారణాధికారులు, మేజిస్ట్రేట్ల వివరాలను కేసుల వివరాలతో సహా ఈ ఫిర్యాదుకు జత చేస్తున్నానని, వాటిని పరిశీలించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన రిజిస్ట్రీ దీనిని ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచుతామని హరీశ్వర్‌రెడ్డి న్యాయవాదులకు చెప్పినట్లు తెలిసింది. మొత్తం 149 కేసులకు సంబంధించిన వివరాలను, ఆయా మేజిస్ట్రేట్ కోర్టుల వివరాలను హరీశ్వర్‌రెడ్డి తన ఫిర్యాదుతో జత చేశారు. -
ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ వ్యాఖ్యలకు కపిల్ సిబాల్ కౌంటర్!
న్యూఢిల్లీ: పార్లమెంటే సుప్రీం అంటూ ఉప రాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎంపీ కపిల్ సిబాల్ పరోక్షంగా కౌంటరిచ్చారు. ఇక్కడ పార్లమెంట్ సుప్రిమా.. లేక కార్యనిర్వాహక శాఖ సుప్రిమా అనేది ప్రశ్నే కాదని, కేవలం రాజ్యాంగం మాత్రమే ఇక్కడ సుప్రీం అంటూ సిబాల్ తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా కపిల్ సిబాల్ స్పందించారు. భారతదేశంలో చట్టాన్ని ఎలా అర్ధం చేసుకుంటందనే దానికి కపిల్ సిబాల్ వివరణ ఇచ్చారు. ‘ పార్లమెంట్, కార్యనిర్వహాక శాఖ సుప్రీం కాదు.. రాజ్యాంగమే మన దేశంలో సుప్రీం. ఇప్పటివరకూ దేశం చట్టాన్ని ఇలానే అర్ధం చేసుకుంది’ అని స్సష్టం చేశారు.The law :Neither Parliament Nor the Executive is supreme The Constitution is supreme The provisions of the Constitution are interpreted by the Supreme CourtThat’s how this country has understood the law so far !— Kapil Sibal (@KapilSibal) April 22, 2025కాగా, రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే ‘అల్టిమేట్ మాస్టర్స్’ అని జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. . రాష్ట్ర గవర్నర్ పంపిన బిల్లులకు రాష్ట్రపతి నిర్ణీత గడువులోపు సమ్మతి తెలపాలని సుప్రీంకోర్టు గడువు విధించడంపై ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన ధన్ ఖడ్.. మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు‘‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలి. అది ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే!. ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యం. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్. పార్లమెంట్ కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కాబట్టి పార్లమెంటే సుప్రీం అని పేర్కొన్నారు. -
పార్లమెంటే సుప్రీం.. ఉప రాష్ట్రపతి నోట మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్(jagdeep dhankhar) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే ‘అల్టిమేట్ మాస్టర్స్’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్ పంపిన బిల్లులకు రాష్ట్రపతి నిర్ణీత గడువులోపు సమ్మతి తెలపాలని సుప్రీంకోర్టు గడువు విధించడంపై ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో.. మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలి. అది ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే!. ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యం. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్. పార్లమెంట్ కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కాబట్టి పార్లమెంటే సుప్రీం’’ అని అన్నారాయన. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయం గురించి కూడా ధన్‌ఖడ్ ప్రస్తావించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. రాజ్యాంగ కార్యకర్తగా తాను మాట్లాడే ప్రతి మాట అత్యున్నత జాతీయ ప్రయోజనాలకు మార్గనిర్దేశం చేయబడుతుందని అన్నారు. అంతకు ముందు.. ‘‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదు. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారాన్ని సుప్రీం కోర్టు రాష్ట్రపతికి బిల్లుల విషయంలో గడువు విధించడానికి ముడిపెడుతూ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఓ సీనియర్ న్యాయవాది, పైగా ఉప రాష్ట్రపతి హోదాలో ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రతిపేక్షాలు సహా మేధో వర్గం తీవ్రంగా తప్పుబట్టింది.మరోవైపు.. బీజేపీ నేతలు సహా ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా సుప్రీం కోర్టు(supreme court) స్పందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా? అని బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. -
ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ప్రస్తుతం తాము కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామంటూ సోమవారం వ్యాఖ్యానించింది.ముర్షిదాబాద్ అల్లర్ల కేసు నేపథ్యంతో.. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన(Bengal President Rule) విధించాలని కోరుతూ విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో జస్టిస్ గవాయ్ పిటిషన్‌ను పరిశీలిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మేం ఇప్పటికే కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో.. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని, సైన్యాన్ని మోహరింపజేయాలని మాండమస్ రిట్ ప్రకారం రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా?’’ అని పిటిషనర్ లాయర్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ కోరిన ఆదేశాలు జారీ చేయడానికి బెంచ్ నిరాకరించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును సుప్రీం కోర్టు తప్పుబడుతూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గవర్నర్, రాష్ట్రపతికి సైతం కాలపరిమితి విధించింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలు పని చేయబోవని.. ఒకవేళ ఆ కాలపరిమితిని ఉల్లంఘిస్తే కోర్టులను ఆశ్రయించొచ్చని రాష్ట్రాలకు సూచించింది. అదే సమయంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లనూ విచారిస్తూ.. స్టే ఆదేశాలు జారీ చేసింది కూడా. అయితే ఈ రెండు పరిణామాలపై బీజేపీ నేతలు కొందరు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సుప్రీం కోర్టుపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే గనుక.. పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలి’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత దినేశ్ శర్మ సైతం సుప్రీం కోర్టుపై విమర్శలు గుప్పించారు. ఆఖరికి ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ కూడా సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టారు. ‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. అది ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని ప్రయోగించడమే అవుతుంది. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని అన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారంపై స్పందిస్తూ దన్ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక బీజేపీ నేతల వ్యాఖ్యలను వ్యతిగతం అని పేర్కొంటూ అధిష్టానం దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.ప్రస్తుతం సీజేఐగా ఉన్న సంజీవ్ ఖన్నా పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఆ స్థానంలో బీఆర్ గవాయ్(BR Gavai) బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కీలకమైన వక్ఫ్ పిటిషన్లపై ఈయనే విచారణ జరపబోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన కార్య నిర్వాహక వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 8-12 తేదీల మధ్య షంషేర్‌గంజ్, సూటి, ధులియాన్, జంగిపూర్ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముగ్గురు మరణించగా.. వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లనువిచారించే క్రమంలోనూ ఈ అల్లర్లను సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రస్తావించింది. మే 5వ తేదీన ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. -
బీజేపీ వివరణ రాజకీయ వంచన
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి లక్ష్యంగా పలు వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే, దినేశ్ శర్మలపై ఆ పార్టీ చర్యలెందుకు తీసుకోలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. వారి విమర్శలు వ్యక్తిగతమని చెబుతూ దూరంగా ఉండేందుకు ప్రయత్నించడం రాజకీయ వంచనగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. ‘ఆ ఎంపీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కనీసం షోకాజ్ నోటీసులు ఎందుకివ్వలేదు?’ అని నిలదీశారు. తరచూ వివిధ వర్గాలు, వ్యక్తులు, సంస్థలే లక్ష్యంగా విద్వేష, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నిశికాంత్ దూబే, దినేశ్ శర్మలకు పార్టీతో సంబంధం లేదంటూ దూరంగా ఉండటం కేవలం నష్ట నివారణ చర్య మాత్రమేనన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మౌనంగా ఉండటం తగదని పేర్కొన్నారు. ఒక వేళ ఉపరాష్ట్రపతి అభిప్రాయాలతో పార్టీ ఏకీభవిస్తోందా? అని జేపీ నడ్డాను ప్రశ్నించారు. భారత రాజ్యాంగంపై ఇలా పదే పదే జరుగుతున్న దాడులపై ప్రధాని మౌనంగా ఉండటమంటే వారికి పరోక్షంగా మద్దతు ఇవ్వడమేనని జైరామ్ రమేశ్ అన్నారు. ఇదంతా బీజేపీ రాజకీయ వంచన అని ఆయన అభివర్ణించారు. జార్ఖండ్‌కు చెందిన ఎంపీ నిశికాంత్ దూబే పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన అల్లర్లు, వక్ఫ్ చట్టంపై చేసిన వ్యాఖ్యలు ధిక్కారం కిందికే వస్తాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ‘ఇది కోర్టు ధిక్కారానికి, రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన స్పష్టమైన కేసు. తేలిగ్గా తీసుకోలేం. భారత ప్రధాన న్యాయమూర్తిపై ఈ ఎంపీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. న్యాయవ్యవస్థను బెదిరించడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఇది న్యాయవ్యవస్థపై జరిగిన ప్రత్యక్ష దాడి. స్పీకర్, సుప్రీంకోర్టు ఆ ఎంపీపై చర్య తీసుకోవాలి’ అని వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఎంపీ దూబే శనివారం సుప్రీంకోర్టుపై విమర్శలు చేయడం తెల్సిందే. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తుంటే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలను మూసివేసుకోవాల్సిందేనన్నారు. దేశంలో సివిల్ వార్లకు సీజేఐ కారణమని నిందించారు. అదేవిధంగా, రాష్ట్రపతి తన వద్దకు వచ్చిన బిల్లులపై 90 రోజుల్లోగా స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించిన యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ ఇటీవల.. పార్లమెంట్‌ను, రాష్ట్రపతిని ఎవరూ ఆదేశించలేరంటూ వ్యాఖ్యానించారు. అయితే, వీరి వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని శనివారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. ‘న్యాయవ్యవస్థ, భారత ప్రధాన న్యాయమూర్తిపై ఎంపీలు నిశికాంత్ దూబే, దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇవి వారి వ్యక్తిగతం. పార్టీ వీటితో ఏకీభవించదు. ఇలాంటి వ్యాఖ్యలకు ఎప్పుడూ మద్దతివ్వదు. పూర్తిగా తిరస్కరిస్తుంది’ అని నడ్డా తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. -
ప్రభుత్వ ప్రాయోజిత మత పక్షపాతం
కొత్త వక్ఫ్ చట్టాన్ని ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఒక తప్పుడు సంకే తాన్ని ఇస్తున్నాయి. ముస్లిం ధర్మాదాయ దేవాదాయ వ్యవహారాలను వక్ఫ్అంటారు. 1995 నాటి వక్ఫ్ చట్టం ఇప్పటి వరకు అమలులో వుంది. ఇప్పుడు దీన్ని ‘యునైటెడ్ వక్ఫ్ మేనే జ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్–2025 (యూడబ్ల్యూఎమ్ఈఈడీఏ)గా మార్చారు. వక్ఫ్ సవరణ బిల్లు ఏప్రిల్ 3న లోక్‌సభలో 288 – 232 ఓట్ల తేడాతో గెలిచింది. రాజ్యసభలో ఏప్రిల్ 4న 128 – 95 ఓట్ల తేడాతో గెలిచింది. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిపోయింది. ఇక్కడ ఒక విశేషం ఉంది. 543 మంది సభ్యు లున్న లోక్ సభలో ముస్లింలు 24 మంది మాత్రమే. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు.అంటే 208 మంది ముస్లిమే తర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. అలాగే 245 మంది సభ్యులున్న రాజ్య సభలో ముస్లింలు 15గురు మాత్రమే. 95 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అంటే 80 మంది ముస్లిమేతర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. రెండు సభల్లోనూ కలిపి ముస్లింల సంఖ్య 39 మాత్రమే. వాళ్ల పక్షాన నిలిచిన ముస్లిమేతరులు 288 మంది. కొత్త చట్టం రాజ్యాంగ ఆదర్శాలకు, హామీలకు విరుద్ధంగా ఉందనీ, దాన్ని పునఃసమీక్షించాలని కొన్ని సంఘాలు, కొన్ని రాజకీయపార్టీలు సుప్రీంకోర్టులో 70కు పైగా పిటీషన్లు వేశాయి. ఈ విషయంలోనూ ముస్లింల సంఖ్య చాలా తక్కువ. ముస్లిమేతరుల సంఖ్య చాలా ఎక్కువ. మన దేశంలో వర్ధిల్లుతున్న మతసామరస్యానికి ఇది తాజా ఉదాహరణ. దీనికి విరుద్ధంగా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టానికి మద్దతు ప్రకటించాయి. ఒక బిల్లు ఉభయ సభల్లో మెజారిటీ సాధించి రాష్ట్రపతి ఆమోద ముద్రపడి చట్టంగా మారాక కూడ సుప్రీం కోర్టుకు చేరడం విశేషం. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ 16న ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. కొత్త చట్టంలో వివాదాంశాలు అనేకం ఉన్నాయి. ఇందులో నాలుగు అంశాలు మరింత తీవ్రమైనవి. వక్ఫ్ బోర్డులో, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో కొత్తగా ముస్లిమేతరులను అనుమతించడం తీవ్రమైన వివాదంగా మారింది. వక్ఫ్ భూముల్లో ‘వక్ఫ్ బై యూజర్’ సౌలభ్యాన్ని తొలగించి అది వక్ఫ్‌గా కొనసాగాలంటే రిజిస్ట్రేషన్ దస్తావేజులు చూపాలనడం ఇంకో వివాదాంశం. వక్ఫ్ ఆస్తి అవునో కాదో తేల్చడానికి జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పించడం, కనీసం ఐదేళ్ళుగా ఇస్లామిక్ ధార్మిక ఆచరణను కొనసాగిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ దానం చేయడానికి అర్హులు అనడం కూడా వివాదంగా మారింది. వక్ఫ్ భూములకు దస్తావేజులు చూపడం అసాధ్యమైన విషయం. 19వ శతాబ్దం ఆరంభం వరకు మన దేశంలో అసలు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ల సంప్రదాయమే లేదు. లార్డ్ కార్న్ వాలిస్ 1793లో తొలిసారిగా శాశ్వత భూమిపన్ను విధానాన్ని తెచ్చాడు. అది కూడా ఇప్పటి బెంగాల్, బిహార్, ఒడిశాప్రాంతంలో మాత్రమే. ఆ తరువాత థామస్ మన్రో మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల్లో రైత్వారీ విధానాలను తెచ్చాడు. భారత దేశంలో 8వ శతాబ్దం నాటికే ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం ప్రవేశించిన వెయ్యేళ్ళ తరువాత మనకు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ విధానాలు వచ్చాయి. అత్యున్నత న్యాయస్థానపు ధర్మాసనం సరిగ్గా ఈ అంశాన్నే పట్టించుకుంది. ‘మనం చరిత్రను తిరగరాయలేం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు గుర్తుచేశారు. వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకతను ప్రదర్శించడమేగాక, రెండు మత సమూహాల సహవాసాన్ని కొత్త చట్టం ప్రోత్సహిస్తుందని, ముస్లింల గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నదని సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు. ఇలా రెండు మతసమూహాల కలయిక ఒక ఆదర్శం అని కేంద్ర ప్రభుత్వం నిజంగానే నమ్ముతోందా? నమ్మితే హిందూ ధర్మాదాయ కమిటీల్లోనూ హిందూయేతరులకు స్థానం కల్పించాలిగా? సరిగ్గా ఈ ప్రశ్ననే భారత ప్రధాన న్యాయమూర్తి వేశారు. తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు వక్ఫ్ భూములు వేటినీ డీ–నోటిఫై చేయరాదని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.కేంద్ర ప్రభుత్వ వాదనను వినిపించడానికి ఒక వారం రోజులు గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. ఇందులో ఒక కిటుకు ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా మరో మూడు వారాల్లో, మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఎలాగోలా ఈ సమయాన్ని సాగదీస్తే అనుకూ లమైన తీర్పు తెచ్చుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.- వ్యాసకర్త సమాజ విశ్లేషకులు ‘ 90107 57776'- డానీ -
‘సుప్రీంకోర్టు నిర్దేశిస్తుందా?.. ఇక మేము పార్లమెంట్‌ను మూసేస్తాం’
రాంచీ: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడు ఆ జాబితాలో జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ ఎంపీ నిక్షికాంత్ దుబే చేరిపోయారు. సుప్రీం తీర్పు ‘అరాచకం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ.. ఇక తాము పార్లమెంట్ ను, అసెంబ్లీలను కూడా మూసేస్తాం అంటూ సెటైర్లు వేశారు. ప్రధానంగా రాష్ట్రపతికి మూడు నెలల టైమ్ లైన్ విధించడాన్ని ఆక్షేపించారు సదరు ఎంపీ.నియామక అధికారికి మీరు ఎలా దిశానిర్దేశం చేస్తారు?, రాష్ట్రపతి అనేవారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను నియమిస్తారు. పార్లమెంట్ అనేది ఈ దేశంలో చట్టాలు తయారు చేస్తుంది. అప్పుడు మీరు పార్లమెంట్ ను ఎలా డిక్టేట్ చేస్తారు. మీరు కొత్త చట్టాన్ని ఎలా రూపొందించారు. ఏ చట్టంలో రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఉంది? అంటే మీరు ఈ దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లాలనుకుంటున్నారా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై పార్లమెంట్ లో సమగ్ర చర్చ జరగాల్సిందేనని దూబే పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థ పరిమితులపై ప్రశ్నలను లెవనెత్తింది’ అంటూ వ్యాఖ్యానించారు.ఇటీవల ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదన్నారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు.ఇవీ చదవండి:వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులురాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’ -
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
న్యూఢిల్లీ: శిక్షా కాలం సగం ముగిశాక శిక్ష రద్దుపై నిర్ణయం తీసుకుంటామంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ వ్యక్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఎటువంటి ప్రాతిపదిక లేని కొట్ట చట్టాన్ని హైకోర్టు కనిపెట్టడం మాకు ఆశ్చర్యం కలిగించింది’ అని వ్యాఖ్యానించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం పిటిషనర్‌కు బెయిల్ మంజూరు చేసింది.అయితే, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నందున తీర్పును సవాల్ చేస్తూ వేసే అప్పీల్‌పై సమీప భవిష్యత్తులో వాదనలు వినే అవకాశాలు లేవు కాబట్టి బెయిల్ ఇవ్వవచ్చని ఈనెల 17న వెలువరించిన తీర్పులో స్పష్టం చేసింది. చట్టాలను యథాతథంగా అమలు చేయాలని, బెయిల్ కోసం పిటిషనర్లు తమ దాకా వచ్చేలా చేయరాదని పేర్కొంది.కాగా, హైకోర్టు ఏం చెప్పిందంటే.. ‘తన వద్ద పట్టుబడిన నకిలీ నోట్ల గురించి పిటిషనర్ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అందుకే, శిక్ష నిలిపివేత, బెయిల్ మంజూరుకు తగు ప్రాతిపదిక లేదు. మొదటి దరఖాస్తును తిరస్కరించిన రెండు నెలల లోపలే బెయిల్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. అందుకే, సగం శిక్షా కాలం పూర్తయ్యాక మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’ అని పేర్కొంది. సాధారణ చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్లో నిందితులకు బెయిల్ తిరస్కరించ వద్దని గతంలో ట్రయల్ కోర్టును, హైకోర్టులను కూడా సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది. -
‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’
న్యూఢిల్లీ: రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని , సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కౌంటరిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్దేశించబడిన పనులను ఆయా శాఖలు సరిగా చేయకపోతే న్యాయవ్యవస్థ జోక్యం అనేది కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రోజు(శుక్రవారం) ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కపిల్ సిబాల్.. ‘కార్యనిర్వాహక శాఖ తన పని తాను చేయకపోతే జోక్యం చేసుకునే హక్కు న్యాయవ్యవస్థకు ఉంది. అది ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకు కల్పించబడిన స్వతంత్ర హక్కు.కార్యనిర్వాహక శాఖ దాని పని అది చేయకపోతే అప్పుడు న్యాయవ్యవస్థ కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. అది కోర్టులకు కల్పించబడ్డ ప్రాథమిక హక్కు. ఈ దేశంలోని ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ అనేది స్వతంత్రంగా పని చేస్తుంది’ అని పేర్కొన్నారు. ‘ఉప రాష్ట్రపతి వ్యాఖ్యలు నన్ను దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రస్తుత రోజుల్లో దేశంలో ఎవరైనా దేనిపైనైనా నమ్మకం ఉంచుతున్నారంటే అది న్యాయవ్యవస్థే. మన దేశంలో రాష్ట్రపతికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. నామమాత్రంగానే వ్యవహరిస్తారు. కేవలం క్యాబినెట్ సలహాలతోనే రాష్ట్రపతి ముందుకు వెళతారు. అంతేకానీ ఇక్కడ రాష్ట్రపతికి ఎటువంటి వ్యక్తిగత అధికారాలు లేవు’ అని కపిల్ సిబాల్ స్పష్టం చేశారు.జగదీప్ ధన్‌ఖడ్ ఏమన్నారంటే..రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదన్నారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు. సుప్రీంకోర్టుకు అలాంటి ఆదేశాలిచ్చే అధికారం ఎక్కడిదని ఆక్షేపించారు. గురువారం రాజ్యసభలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సిన పనులను న్యాయ వ్యవస్థ చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ దేశంలో ఏం జరుగుతోంది? అని నిలదీశారు. -
రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు
న్యూఢిల్లీ: రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదని చెప్పారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు. సుప్రీంకోర్టుకు అలాంటి ఆదేశాలిచ్చే అధికారం ఎక్కడిదని ఆక్షేపించారు. గురువారం రాజ్యసభలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సిన పనులను న్యాయ వ్యవస్థ చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ దేశంలో ఏం జరుగుతోంది? అని నిలదీశారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను ఏనాడూ ఊహించలేదన్నారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరిస్తూ ఏకంగా రాష్ట్రపతికే ఆదేశాలు జారీ చేయడం సరైంది కాదన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ సుప్రీంకోర్టుకు అలాంటి అధికారాలు ఇవ్వలేదని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థకు చట్టాలు వర్తించడం లేదని, అందుకే పారదర్శకత కనిపించడం లేదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ హద్దులు దాటుతోందని విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకు ఇచ్చిన ప్లీనరీ అధికారాలు.. నిత్యం ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రయోగించడానికి న్యూక్లియర్ మిస్సైల్‌గా మారాయని వ్యాఖ్యానించారు.నోట్లకట్టల ఘటనలో ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో మార్చి 14న నోట్ల కట్టలు దొరికిన ఘటనపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నించారు. న్యాయమూర్తులు విచారణకు అతీతమా? అని ప్రశ్నించారు. వారికి అలాంటి వెసులుబాటు ఉందా? అని అడిగారు. సాధారణ పౌరుల ఇంట్లో నగదు దొరికి ఉంటే దర్యాప్తు ఎలక్ట్రానిక్ రాకెట్ వేగంతో జరిగేదని చెప్పారు. యశ్వంత్ వర్మ విషయంలో దర్యాప్తు కనీసం ఎడ్లబండి వేగంతోనూ జరగడం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనేది దర్యాప్తు నుంచి రక్షణ పొందడం కాకూడదని తెలిపారు. -
‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం’
హైదరాబాద్: కేంద్రం సవరణ చేసిన వక్ఫ్ బోర్డు బిల్లుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యాంగం మీద ముస్లింలకు నమ్మకం ఉందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ‘వక్ఫ్ బోర్డ్ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కేంద్రం సవరణ చేసిన వక్ఫ్ బోర్డ్ బిల్లును మేము సుప్రీంకోర్టులో చాలెంజ్ చేశాం. మా తరఫున కపిల్ సిబాల్ వాదించారు. కేవలం ఒక మతానికి మాత్రమే చట్టం ఎలా చేస్తారు?. వక్ఫ్ భూములు గవర్నమెంట్ ఇచ్చిన భూములు కావు...దాతలు ఇచ్చిన భూములు పేద ముస్లింలకు చెందాలని ఇచ్చారు. వక్ఫ్ బోర్డు లో మహిళలు ఉన్నారుతెలంగాణలో,ఏపీలో మహిళలు కూడా ఉన్నారు. అన్ని మతాల దేవాలయాల భూములు కబ్జా చేస్తున్నారు. అన్నిటికీ చట్టం తీసుకొని రావాలి.... అప్పుడు స్వాగతిస్తం. వేరే వేరే మతాల వారిని బోర్డులో నియమించడం వల్ల గొడవలు జరుగుతాయి’ అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.కాగా, వక్ఫ్ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ 73 పిటిషన్లు నమోదు కాగా.. గురువారం వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టు వాదనలు వింది. కొన్ని అంశాలతో ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు. -
సుప్రీం కోర్టు తీర్పు.. ఉపరాష్ట్రపతి హాట్ కామెంట్స్
న్యూఢిల్లీ: శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించడం లేదంటే తిప్పి పంపే విషయంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ ఇటీవల సుప్రీం కోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. న్యాయస్థానాలు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి ఉండకూడదంటూ వ్యాఖ్యలు చేశారాయన. రాజ్యసభ ఇంటర్న్స్ 6వ బ్యాచ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. న్యాయస్థానాలు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి ఉండకూడదన్నారు. అదే జరిగితే రాజ్యాంగంలోకి ఆర్టికల్ 142 కింద సుప్రీం కోర్టు తనకున్న ప్రత్యేక అధికారాలను.. ప్రజాస్వామ్య శక్తులపై ఒక అణ్వాయుధాన్నే ప్రయోగించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు నిర్దిష్ట సందర్భాల్లో ఈ అధికారాన్ని విస్తృతంగా ఉపయోగించడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన.తమిళనాడు పెండింగ్ బిల్లుల వ్యవహారంపై జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్న సర్వోన్నత న్యాయస్థానం.. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం 10 పెండింగ్ బిల్లుల్ని చట్టాలుగా ప్రకటించింది.అయితే అటుపై రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలే చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గవర్నర్ పంపిన బిల్లులను రాష్ట్రపతి ఎటూ తేల్చకపోతే అప్పుడు రాష్ట్రాలు నేరుగా తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తీర్పుపై కేంద్రం ప్రభుత్వం సమీక్షకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే వేదిక నుంచి.. ఢిల్లీ హైకోర్టు జడ్జి బంగ్లాలో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంపైనా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ స్పందించారు. ఘటన జరిగి నెలరోజులు గడుస్తున్నా.. ఎఫ్ఐఆర్ లేకపోవడం, దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం, జడ్జిలకు కలిగే ఉపశమనం గురించీ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: వక్ఫ్ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ 73 పిటిషన్లు నమోదు కాగా.. గురువారం వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టు వాదనలు వింది. కొన్ని అంశాలతో ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు. ఈ క్రమంలో.. వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దని సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ‘‘వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు చేయొద్దు. వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించొద్దు. వక్ఫ్, వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీ నోటిఫై చేయొద్దు వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై స్టేటస్ కో విధిస్తున్నాం. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు వారం రోజుల్లో సవివర రిప్లై దాఖలు చేయాలి. మరో ఐదు రోజుల్లో రిజైన్డర్ దాఖలు చేయాలి’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. గత విచారణలో(బుధవారం).. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుందిఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టంవక్ఫ్ అంటే ఇస్లాం కు అంకితమైందికేంద్రప్రభుత్వం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలుజేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపామువక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమేహిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయిహిందూయేతర అధికారులు హిందూ ధార్మిక సంస్థలను నిర్వహిస్తున్నారువక్ఫ్ భై యూజర్ ద్వారానే అనేక మసీదులను ఏర్పాటు చేశారురిజిస్టర్ చేసుకోవడంలో మసీదులకున్న అభ్యంతరం ఏమిటి సుప్రీంకోర్టు సీజేఐ వ్యాఖ్యలుసుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయివక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం..అయితే ఇది దుర్వినియోగమైందిఅయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయిహిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదాపార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా ?హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదాఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమి లోనే ఉందని అంటున్నారు చారిత్రక , పురావస్తు ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించడానికి వీలు లేదువక్ఫ్ పిటిషన్లపై విచారణ వేళ.. హైలైట్స్‌అంతకు ముందు.. వక్ఫ్ పిటిషన్ల విచారణను లైవ్ టెలికాస్ట్ కోరుతూ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ లేఖ రాసింది. బుధవారం విచారణ టైంలో కిక్కిరిసిపోయిన కోర్టు హాల్లో కనీసం నిలబడటానికి కూడా స్థలం సరిపోలేదని, ఊపిరి ఆడక ఇద్దరు లాయర్లు స్పృహ కోల్పోయారని లేఖలో ప్రస్తావించింది.సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ హర్షంహైదరాబాద్: వక్ఫ్ (సవరణ) బిల్లుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు వైఖరి దేశవ్యాప్తంగా ముస్లింలకు ఊరట కలిగించిందన్నారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం చేసిందన్నారు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంలో జరిగిన పరిణామాలను స్వాగతిస్తున్నామన్నారు. 👉అధికారంలోకి రాగానే వక్ఫ్ చట్టాన్ని అడ్డుకుంటాం. బీహార్‌ను వక్ఫ్ అల్లర్లతో మరో బెంగాల్(ముర్షిదాబాద్)గా మార్చాలని వాళ్లు(కేంద్రంలోని బీజేపీ) అనుకుంటున్నారు. ఆర్జేడీ నాయకత్వంలో అది అయ్యే పని కాదు అని తేజస్వి యాదవ్ అన్నారు. 👉వక్ఫ్ చట్టం దేశ ప్రజల మధ్య ఐక్యతను క్రమంగా తుడిచిపెట్టేందుకేనని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వక్ఫ్ సవరణ చట్టం తెచ్చిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. ఇది ఫెడరలిజాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘించడమేనని అన్నారాయన. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్య ద్వారా.. ఆరెస్సెస్, బీజేపీలు వక్ఫ్ చట్టం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. ఇండియా కూటమి.. కలిసి పోరాడుదాంరాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ సవరణ చట్టం అడ్డుకునేందుకు ప్రతిపక్ష కూటమి ఇండియా కలిసి రావాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. సొంత దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం.. సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఆతిథ్యం మాత్రం స్వీకరిస్తున్నారని మండిపడ్డారు. ఏకతాటిపైకి వచ్చి వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు పోరాడాలని ఆమె అంటున్నారు. -
సీఈసీ, ఈసీల నియామకంపై మే14న సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: 2023 చట్టం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్లు(ఈసీల) నియామకాలను చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 14వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశంపై సత్వరం విచారణ చేపట్టాలంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన వినతి మేరకు బుధవారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 19న సుప్రీంకోర్టు ప్రకటించిన విధంగా వాస్తవానికి ఈ పిటిషన్లపై బుధవారమే విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే, భూ సేకరణకు సంబంధించిన కీలకమైన అంశాలున్నందున వాయిదా వేయాల్సి వచ్చిందని ధర్మాసనం తెలిపింది. మే 14వ తేదీన తప్పక విచారిస్తామంది. -
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైన వక్ఫ్(సవరణ) చట్టం,2025ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ తొలిరోజే సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్లకు కాస్తంత ఊరట కల్గించేలా వ్యాఖ్యానించింది. సుదీర్ఘకాలంగా ముస్లిం మత, దాతృత్వ కార్యక్రమాలతో సంబంధముండి వక్ఫ్ అ«దీనంలో ఉన్న ఆస్తులను(వక్ఫ్ బై యూజర్) ఇకమీదటా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమా ర్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఆ దిశగా ఉత్తర్వులు, ఆదేశాలు ఇవ్వడానికంటే ముందు ఈ పిటిషన్లపై పూర్తిగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం కోరింది. ‘‘ ఆస్తులు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వక్ఫ్ అ«దీనంలో ఉన్నాయా? రిజిస్ట్రర్ డాక్యుమెంట్లతో వక్ఫ్ కు దఖలుపడ్డాయా? అనేది తేలకుండానే ‘వక్ఫ్ బై యూజర్’ అనే నిబంధనను తొలగించలేం. ఎక్స్–అఫీషియో సభ్యులు మినహా వక్ఫ్ బోర్డులు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లలో అందరూ ముస్లింలే సభ్యులుగా ఉండాలి’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. వక్ఫ్(సవరణ)చట్టం చట్టబద్ధతను సవాల్‌చేస్తూ దాఖలైన డజన్లకొద్దీ పిటిషన్లను బుధవారం విచారించడం మొదలెట్టాక తొలుత వీటిని హైకోర్టుకు బదలాయించాలని సుప్రీంకోర్టు భావించింది. అయితే ఈ ఆలోచనపై పిటిషన్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్, హుజేఫా అహ్మదీ, వైఎస్సార్సీపీ తరఫున వాదించిన ఎస్.నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావంచూపగల ఈ కేసులను సుప్రీంకోర్టులోనే విచారించాలని కపిల్ సిబల్ గట్టిగా వాదించారు. తర్వాత కోర్టు కేసును గురువారం మధ్యాహ్నానికి వాయిదావేసింది. ఆనాటి ఆస్తులకు పత్రాలుంటాయా? వక్ఫ్ ఆస్తిగా నమోదుచేయాలంటే వాటి డాక్యుమెంట్లు కచి్చతంగా సమర్పించాలంటూ చట్టంలోని సెక్షన్ 2ఏలో పేర్కొనడంపై సీజేఐ జస్టిస్ ఖన్నా అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘ ఢిల్లీలోని జామా మసీదునే ఉదాహరణగా తీసుకుందాం. వందల ఏళ్లుగా వాళ్ల అ«దీనంలో ఉన్న ఇలాంటి పాత ఆస్తులకు రిజిస్టర్ చేయాలంటే ఇప్పుడు డాక్యుమెంట్లు తీసుకురమ్మంటే ఎలా?. అలాంటి ఆస్తులకు డాక్యుమెంట్లు వాళ్ల దగ్గర ఉంటాయా? ’’ అని సీజేఐ.. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. గతాన్ని మీరు మార్చలేరు అని కేంద్రానుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ వక్ఫ్ ఆస్తుల్లో కొన్ని దురి్వనియోగం అయిన మాట వాస్తవమే. అంతమాత్రాన దాన్ని సాకుగా చూపి ‘వక్ఫ్ బై యూజ్’ నిబంధనను తొలగిస్తామంటే కొత్త సమస్యలొస్తాయి. వక్ఫ్ బై యూజర్‌ను కోర్టులు గతంలోనే ధృవీకరించాయి. కోర్టు తీర్పులు, ఉత్తర్వులు, నిర్ణయాలను ప్రభుత్వాలు నిర్ణయించకూడదు. మీరు కేవలం ప్రాతిపదికను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి’’ అని కేంద్రాన్ని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. వక్ఫ్ చట్టం తమకొద్దని చాలా మంది ముస్లింలు చెబుతున్నారని తుషార్ మెహతా చెప్పగా కోర్టు కలుగజేసుకుని ‘‘ అయితే మీరు హిందూ దాతృత్వ ట్రస్టుల్లోనూ ముస్లింలను సభ్యులుగా చేరుస్తామని చెప్పదల్చుకున్నారా?’’ అని సూటి ప్రశ్న వేసింది. ‘‘ వక్ఫ్ చట్టంపై ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ 38 సార్లు సమావేశమైంది. ఏకంగా 98.2 లక్షల మెమోరండంలను కమిటీ పరిశీలించింది. తర్వాతే పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందింది’’ అని మెహతా చెప్పుకొచ్చారు. దీంతో సీజేఐ స్పందించారు. ‘‘ ఇక్కడ రెండు విషయాలు తేలాలి. ఈ కేసులన్నింటినీ హైకోర్టుకు బదలాయించాలా? లేదంటే అసలు మీరు సుప్రీంకోర్టు ద్వారా ఏం ఆశిస్తున్నారు? ఏం వాదించాలనుకుంటున్నారు? అంటూ కేంద్రంంతోపాటు పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారు. వాటికి సమాధానం చెప్పాలని ఆదేశించారు. ‘‘ చట్టంపై ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం ఆందోళనకరం. ఓవైపు ఈ అంశం కోర్టుల పరిధిలో పరిశీలనలో ఉండగా మరోవైపు ఆందోళనలు,హింస చెలరేగడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది’’ అని అన్నారు. వెంటనే తుషార్ మెహతా కలుగజేసుకుని ‘‘ఇలా ఆందోళనలు చేయడం ద్వారా వ్యవస్థపై వాళ్లు తీవ్రమైన ఒత్తిడిని తేద్దామని చూస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ ఎవరు ఎవరిపై ఒత్తిడి తెస్తున్నారు? మాకైతే అర్థంకావట్లేదు’’ అని సిబల్ బదులిచ్చారు. ‘‘ సానుకూల అంశాలపైనా చర్చిద్దాం’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఏ ప్రాతిపదికన ముస్లింగా నిర్ధారిస్తారు? పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్ వాదించారు. ‘‘ నేను ముస్లింనా కాదా అనే విషయాన్ని ఏ రకంగా కేంద్రం నిర్ధారిస్తుంది?. ఇతను వక్ఫ్‌కు ఆస్తిని, ఇతరత్రాలను దానంగా ఇవ్వడానికి అర్హుడు అని కేంద్రం ఎలా నిర్ధారించుకుంటుంది?. గత ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్న వాళ్లే దానం ఇవ్వాలని చెప్పే హక్కు కేంద్రానికి ఎక్కడిది?’’ అని కోర్టులో సిబల్ వాదించారు. దశాబ్దాలుగా ఆచరణలో ఉన్న ‘వక్ఫ్ బై యూజర్’ను ఏకపక్షంగా తొలగించకూడదని లాయర్ హుజేఫా అహ్మదీ కోరారు. వైఎస్సార్సీపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమియత్ ఉలేమా–ఇ–హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ, సమస్థ కేరళ జమియతుల్ ఉలేమా, అంజుమ్ ఖదారీ, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మొహమ్మద్ షఫీ, మొహమ్మద్ ఫజుల్‌రహీమ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ ఝా, డీఎంకే, కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, మొహమ్మద్ జావేద్, తదితరులు మొత్తంగా 72 పిటిషన్లను వక్ఫ్ చట్టాన్ని సవాల్‌చేస్తూ దాఖలు చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీచేయకుండా ముందస్తుగా కేంద్రం ఏప్రిల్ 8వ తేదీన కెవియట్ పిటిషన్ దాఖలుచేసింది. దీంతో పటిషన్ల విచారణ మొదలుకాకుండానే సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి తాత్కాలిక ఉత్తర్వులురాకుండా అడ్డుకోగలిగింది.కేంద్రానికి సుప్రీంకోర్టు సంధించిన కీలక ప్రశ్నలు ⇒ ముస్లిమేతరులూ వక్ఫ్ బోర్డుల్లో ఉండేందుకు కొత్త చట్టం అనుమతిస్తోంది. మరి హిందూ ఆలయాల నిర్వహణ బాధ్యతలు చూసే ట్రస్టుల్లో ముస్లింలను సభ్యులుగా కేంద్రప్రభుత్వం అనుమతిస్తుందా? ⇒ బ్రిటిషర్లు రానంతవరకు భారత్‌లో భూములకు రిజి్రస్టేషనే లేదు. కొన్ని మసీదులను 14వ, 15వ శతాబ్దంలో నిర్మించారు. వాటికి సేల్‌డీడ్ లాంటివి తేవడం అసాధ్యం. శతాబ్దాలుగా వక్ఫ్ ఆస్తులుగా కొనసాగుతున్న మసీదులు, ఇతర ఆస్తుల హక్కుల పత్రాలు, డాక్యుమెంట్లను ముస్లింలు ఇప్పుడెలా తీసుకురాగలరు? ⇒ విచారణ, దర్యాప్తు పూర్తిచేసి అధీకృత అధికారి నిర్ధారించనంతవరకు సంబంధిత ఆస్తి వక్ఫ్‌ది కాదు అని ప్రభుత్వం చెబుతోంది. అలా నిర్ధారణ సాధ్యంకాని ఆస్తులన్నీ ప్రభుత్వానికి చెందుతాయా? ⇒ వక్ఫ్(సవరణ)చట్టం,2025 అమల్లోకి రాకముందు వరకు వక్ఫ్ బై యూజర్ నిబంధన అమల్లో ఉంది. ఇప్పుడు అది మనుగడలో లేదంటారా? ⇒ గతంలో కొన్ని ఆస్తులు వక్ఫ్ ఆస్తులేనని కోర్టు తీర్పులే స్పష్టంచేస్తున్నాయి. కొత్త చట్టంలోని సెక్షన్ 2ఏతో ప్రభుత్వం ఆ తీర్పులను చెల్లనివిగా మారుస్తోందా? -
‘కంచ’లోనే లోపలేస్తాం!
సాక్షి, న్యూఢిల్లీ: ‘అభివృద్ధి పేరుతో మూడు రోజుల్లోనే వందల బుల్డోజర్లను ఉపయోగించి 100 ఎకరాల్లో చెట్లను తొలగించారు. చెట్ల నరికివేతను ఏ రకంగానూ సమర్ధించుకోవాలని చూడొద్దు. చెట్ల నరికివేతకు అసలు అనుమతులు తీసుకున్నారా లేదా? ఈ ప్రశ్నకు మాకు సూటిగా సమాధానం చెప్పండి. ఒకవేళ అనుమతులు తీసుకోకపోయి ఉంటే మాత్రం అందుకు బాధ్యులైన అధికారులందరినీ జైలుకు పంపుతాం. వారి కోసం అదే ప్రాంతంలో తాత్కాలిక జైలు నిర్మించి మరీ ఊచలు లెక్కబెట్టిస్తాం’అంటూ కంచ గచ్చిబౌలి భూముల కేసులో రాష్ట్ర ప్రభుత్వంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జ్ అగస్టీన్ మసీలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో 1996లో తామిచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులే బాధ్యులవుతారనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించింది. వంద ఎకరాల్లో అటవీ సంరక్షణ కోసం చట్టప్రకారం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ఆదేశించింది. తాము చేపట్టబోయే తీవ్ర చర్యల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఇతర కార్యదర్శులను కాపాడాలనుకుంటే 100 ఎకరాల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తేల్చిచెప్పింది. పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికతోనే మా ముందుకు రావాలని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సుమారు అరగంటపాటు సాగిన వాదనల అనంతరం కేసు విచారణను మే 15కు వాయిదా వేసింది. అప్పటివరకు స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపింది. చెట్ల తొలగింపుపై తమ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) సమర్పించిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల గడువు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, ‘బీ ద ఛేంజ్ వెల్ఫేర్ సొసైటీ’పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు, మరో పిటిషన్ తరఫున ఎస్.నిరంజన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అభివృద్ధి చేసేందుకే.. అంతకుముందు అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు ప్రారంభిస్తూ అన్ని అనుమతులతోనే ఆ భూముల్లో చెట్లను (పొదలు) తొలగించామన్నారు. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా అని ఈ సందర్భంగా ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది. తెలంగాణలో వాటర్ అండ్ ట్రీ (వాల్టా) యాక్ట్ ఉందంటూ అమికస్ క్యూరీ పరమేశ్వర్ జోక్యం చేసుకొని ధర్మాసనానికి వివరించగా ఈ చట్టం కింద అనుమతులు తీసుకోకుంటే అందరిపై చర్యలు తీసుకుంటామని ధర్మాసనం బదులిచ్చింది. ఆ భూములను రూ. 10 వేల కోట్లకు తనఖాపెట్టి ప్రభుత్వం అప్పు తెచ్చుకుందని అమికస్ క్యూరీ పేర్కొనగా ఆయన వ్యాఖ్యలను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘ఆ భూములను మార్టిగేజ్ చేశారా లేదా అమ్ముకున్నారా అనేది మాకు అనవసరం. అక్కడ చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా? లేదా అనేది మాత్రమే మాకు సూటిగా జవాబు చెప్పండి’అంటూ సింఘ్వీని ప్రశ్నించింది. ఆ ప్రాంతంలో కొన్ని షెడ్యూల్డ్ జంతువులు ఉన్నాయని.. అక్కడ పనులు జరిగేటప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని ‘బీ ద ఛేంజ్ వెల్ఫేర్ సొసైటీ ’తరుఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, మోహిత్‌రావులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో జేసీబీలు ఉన్నాయని చెప్పారు. హెచ్సీయూకు 25 వేల ఎకరాల భూమి ఉందని.. అందులో 400 ఎకరాల భూవివాదం 2004 నుంచి కొనసాగుతోందని సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. దీనికి సంబంధించి కోర్టు తీర్పులు, 20 ఏళ్లలో ఆ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. ఈ స్థలంలో ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మందికి జీవనోపాధి, ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు చెప్పారు. సీఎస్ ఒక మహిళ అని, ఆమె నెల రోజుల్లో రిటైరవనున్నారని సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. జేసీబీలు వచ్చిన విషయం సీఎస్‌కు తెలియదా? ఈ సందర్భంగా ధర్మాసనం మళ్లీ స్పందిస్తూ ‘మేం పదేపదే చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అని అడుగుతున్నాం. ఈ ప్రశ్నకు మాకు సూటిగా మీ సమాధానం కావాలి’అంటూ వ్యాఖ్యానించింది. ‘సీఎస్ నెల రోజుల్లో రిటైరవుతున్నారంటే ఎలా సింఘ్వీజీ? ఆ ప్రాంతంలో జేసీబీలు వచ్చిన విషయం సీఎస్‌కు తెలియదా? రాష్ట్రంలో జరుగుతున్న విషయాలకు సీఎస్ బాధ్యత వహించాలి కదా?’అంటూ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘అడవి అనే పదానికి నిర్వచనం ఇస్తూ 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా చెట్ల నరికివేత జరిగి ఉంటే మాత్రం మేం ఊపేక్షించం. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకోవాలనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అంటూ ధర్మాసనం నిలదీసింది. మహానగరాల్లో అటవీభూముల్లో కాపాడుకోకపోతే ఎలా? ‘చార్ధామ్ యాత్ర కోసం రోడ్డు నిర్మాణానికి చెట్లు తొలగిస్తామంటేనే మేం అనుమతించలేదు. మహారాష్ట్రలో సచివాలయ నిర్మాణం కోసం పర్యావరణానికి నష్టం కలిగించిన కేసు రెండు దశబ్దాలుగా సుప్రీంకోర్టులోనే పెండింగ్‌లో ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాల్లోని అటవీ భూముల్ని కూడా కాపాడుకోలేకపోతే ఎలా? అంటూ ప్రశ్నలు సంధించింది. మంత్రులు ఏది చెబితే అధికారులు అది చేసేస్తున్నారంటూ అమికస్ క్యూరీ పరమేశ్వర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా ‘పర్యావరణానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను జైళ్లకు పంపించాల్సి వస్తుంది జాగ్రత్త. చెట్లను కొట్టేసిన దగ్గరే తాత్కాలిక జైలు నిర్మిస్తాం. సంబంధిత అధికారులను అదే జైలులో 6 నెలలపాటు ఊచలు లెక్కబెట్టిస్తాం’అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారు? చెట్లు కొట్టేసిన ప్రాంతంలో పర్యావరణ పునరుద్ధరణ కోసం తీసుకున్న చర్యలేంటి? ఆ భూముల్లో వన్యప్రాణుల్ని ఎలా రక్షిస్తారు? అక్కడి నష్టాన్ని ఎలా పూడుస్తారు?’అంటూ సింఘ్వీపై ధర్మాసనం ప్రశ్నలవర్షం కురిపించింది. విధ్వంసం చేస్తే ప్రేక్షక పాత్ర పోషించాలా? ఆ ప్రాంతంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు సిద్ధపడిందని.. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నందునే ఆ ప్రాంతమంతా దట్టమైన పొదలతో అడవిలా తయారైందని సింఘ్వీ వాదించారు. ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసి ఎందరో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనుందని ధర్మాసనానికి చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘అభివృద్ధి, ఉద్యోగాల కల్పన పేరుతో మీరు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంటే మేం ప్రేక్షకపాత్ర పోషించాలా?. మీకు మీరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏమిటి? మూడు రోజుల్లో 100 ఎకరాలు ధ్వంసం చేశారంటే ఎన్ని బుల్డోజర్లు అక్కడ ఉన్నట్లు? మీరు సృష్టించిన రణరంగానికి అక్కడి జంతువులు ప్రాణభయంతో పరుగులు తీయగా వాటిని కుక్కలు కరిచాయి. ఆ వీడియోలను చూసి చలించిపోయాం’అని పేర్కొంది. అయితే ఆ భూముల్లో జంతువులు లేవని.. కావాలనే కొందరు నకిలీ వీడియోలు సర్క్యులేట్ చేశారని సింఘ్వీ బుదులివ్వగా ధర్మాసనం ఆక్షేపించింది. అక్కడ జంతువులు పరుగులు తీసిన వీడియోలను తాము చూసి చలించిపోయమని తెలిపింది. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని సింఘ్వీ ధర్మాసనానికి బదులిచ్చారు. దీనిపై తదుపరి విచారణను ధర్మాసనం మే 15కు వాయిదా వేసింది. -
కంచ గచ్చిబౌలి భూములపై సర్కారు వితండవాదం తగదు
ఢిల్లీ, సాక్షి: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వితండవాదాన్ని మానుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ తరుణంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం 100 ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించాలి. చీఫ్ సెక్రటరీకి తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి చెట్ల నరికివేతకు ఆదేశాలు ఇచ్చారు. కొంపలు మునిగిపోతున్నట్లుగా ఫ్లడ్‌లైట్లు పెట్టి మరి చెట్లు నరికారు. పర్యావరణ విషయంలో నాపై పోలీసులు కేసులు పెడతానంటే..రెడీ. హైదరాబాదులో ఒక్క చెట్టు కొట్టాలన్న వాల్టా చట్టం కింద అనుమతి తప్పనిసరి. ప్రభుత్వాలు నడిపేందుకు భూములు అమ్మితే భవిష్యత్తు తరాలు క్షమించవు’ అని వ్యాఖ్యానించారు. -
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్.. కొలీజియం సిఫార్సు
ఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court) తదుపరి చీఫ్ జస్టిస్‌గా భూషణ్ రామకృష్ణ గవాయ్ (justice Bhushan Ramkrishna Gavai) బాధ్యతలు చేపట్టనున్నారు. మే13న కానున్న ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా రిటైర్ కానున్నారు. తదుపరి సీజేఐగా జస్జిస్ గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. అనంతరం, కొలీజియం తన ప్రతిపాదనను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సుకు అనుగుణంగా కేంద్రం జస్టిస్ గవాయిని తదుపరి సీజేఐగా ((Chief Justice of India) నియమించింది. దీంతో సీజేఐ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ అనంతరం సుప్రీం తదుపరి సీజేఐ జస్జిస్ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆరు నెలల పాటు సుప్రీం సీజేఐగా జస్జిస్ గవాయ్కేంద్రం నిర్ణయంతో జస్టిస్ గవాయ్ సుమారు ఆరు నెలలు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఆయన నవంబరులో పదవీవిరమణ చేయనున్నారు. 2007లో భారత అత్యున్నత న్యాయస్థాన పదవిని చేపట్టిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే రెండో దళితుడు జస్టిస్ గవాయ్.జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రస్థానంమహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు.1992లో నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు. త్వరలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
గచ్చిబౌలి భూములు.. తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక
సాక్షి, ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడ చెట్ల నరికివేతపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి అని ప్రశ్నించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలి భూముల అంశంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం.. చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దీన్ని సమర్ధించుకోవద్దంటూ చురకలు అంటించింది. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా?.. సూటిగా జవాబు చెప్పండి. వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారు?. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలేదు. వీడియోలు చూసి మేము ఆందోళనకు లోనయ్యాం. అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరం. ఇష్టం వచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకోం. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే చెరువు దగ్గరే తాత్కాలిక జైలుపెట్టి అధికారులను అక్కడే ఉంచుతాం. షెల్టర్ కోసం జంతువులు పరుగులు తీస్తే.. వాటిని వీధి కుక్కలు తరిమాయి. 1996లో మేము ఇచ్చిన తీర్పుకు భిన్నంగా అధికారులు సొంత మినహాయింపులు ఇస్తే వారే బాధ్యులు అవుతారు. ప్రైవేట్ ఫారెస్టులో సైతం చెట్లు నరికితే సీరియస్‌గా పరిగణిస్తాం. భూముల తాకట్టు అంశాలతో మాకు సంబంధం లేదు. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలి. డజన్ల కొద్ది బుల్డోజర్లతో అడవిలో వంద ఎకరాలు తొలగించారు. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలి. సిటీలో గ్రీన్ లంగ్ స్పేస్ ఉండాలి. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించింది. చివరగా.. పర్యావరణ, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని తెలిపింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ.. అన్ని పనులు ఆపి వేశాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారు. మినహాయింపులకు లోబడే మేము కొన్ని చెట్లు తొలగించాం అని చెప్పుకొచ్చారు.అమికస్ క్యూరీ వాదనలు వినిపిస్తూ.. సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుని.. అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు. ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధం. ఈ భూములు తాకట్టుపెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంది అని అన్నారు. అంతకుముందే, ఈ కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగా హెచ్‌సీయూ భూములలోని పక్షులు ఇక్కడికి వచ్చాయని పేర్కొంది. -
కంచె లేకపోవడం వల్లే.. కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్
న్యూఢిల్లీ, సాక్షి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇవాళ విచారణ జరగనుంది. ఈ భూముల్లో జరుగుతున్న అన్ని కార్యాకలాపాలపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌తో కూడిన ధర్మాసనం ఇంతకుముందు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 16లోపు(ఇవాళ) అఫిడవిట్ సమర్పించాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు ఎంపవర్డ్ కమిటీని ఆదేశించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగానే.. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ‘‘కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగానే హెచ్‌సీయూ భూముల్లోని పక్షులు ఇక్కడికి వచ్చాయి’’ అని కౌంటర్లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు.. సుప్రీం కోర్టు ఆదేశాలనుసారం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించిన కేంద్ర సాధికార కమిటీ(సీఈసీ) నివేదికను ఇవాళ కోర్టుకు సమర్పించనుంది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణ నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ శాంతికుమారి( CS Shanti Kumari), తెలంగాణ పీసీసీఎఫ్ డోబ్రియాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్, సీఈసీ దాఖలుచేసిన నివేదికను పరిశీలించిన తర్వాత ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.‘‘అంత అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు?. పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారు?. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?. ఇది చాలా తీవ్రమైన విషయం. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం’’ అంటూ తదుపరి ఆదేశాలిచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘనలు గనుక జరిగితే సీఎస్‌దే బాధ్యత’’గత వాదనల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయిన జస్టిస్ గవాయ్ -
వక్ఫ్ పిటిషన్లపై ‘సుప్రీం’ కీలక విచారణ.. హైలైట్స్
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను(Waqf Petitions) సుప్రీంకోర్టులో ఇవాళ (ఏప్రిల్ 16న) విచారణ జరపనుంది. కేంద్రం కేవియెట్ పిటిషన్ వేయడంతో ఇరువైపులా వాదనలను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. కొత్త చట్టంలోని పలు సెక్షన్లు రాజ్యాంగానికి విరుద్ధమని, జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు పలు సంస్థలు, ఎన్జీవోలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను ఉమ్మడిగా ఇవాళ మధ్యాహ్నాం సీజేఐ బెంచ్ విచారణ జరపనుంది. వక్ఫ్ సవరణ చట్టం(Waqf Amendment Law) రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంతో ముస్లిం మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమేనని వైఎస్సార్సీపీ సైతం తన పిటిషన్లో పేర్కొంది.👉ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్(బిహార్)తో పాటు జేడీయూ, ఆప్, డీఎంకే, సీపీఐ, వైఎస్సార్‌షీపీ.. ఇలా ప్రధాన పార్టీలతో పాటు జమైత్ ఉలేమా హింద్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా పిటిషన్లు వేశాయి. వక్ఫ్‌సవరణ చట్టం బిల్లు నిబంధనలు ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని, ముస్లింల హక్కులను హరించే కుట్రగా అభివర్ణిస్తున్నాయి. ; ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. 👉బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు చట్టానికి మద్ధతుగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. ఆ చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టేయబోదన్న ధీమాతో ఉంది.👉ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో మంగళవారం మరో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపడతామని వెల్లడించింది. అయితే అది ఇవాళ విచారించబోయే పిటిషన్లతోనా? లేదంటే ప్రత్యేకంగానా? అనేదానిపై ఈ మధ్యాహ్నాం స్పష్టత రానుంది.👉పిటిషన్లలో కొన్ని.. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరికొన్ని.. దీనిని అమలు చేయకుండా కేంద్రాన్ని ఆదేశించాలని కోరాయి. 👉పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఈ నెల మొదట్లో సుదీర్ఘ చర్చల అనంతరం ఇటు లోక్‌సభలో, అటు రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించింది. 👉అయితే.. చట్టసభల పరిధిని తాము దాటబోమని ఇంతకు ముందే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినప్పటికీ రాజ్యాంగానికి సంబంధించిన అంశాల్లో చివరి తీర్పు ఇచ్చే అధికారం మాత్రం ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో.. వక్ఫ్ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లో సమానత్వ హక్కు, మతాచారాలను అనుసరించేలాంటి హక్కులు ప్రభావితం అయ్యాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. అందుకే సుప్రీం కోర్టు ఈ పిటిషన్లపై వాదనలు వినేందుకు సిద్ధమైంది. 👉ఈ సవరణలు వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి, వెనుకబడిన ముస్లింలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని కేంద్రం అంటోంది. మత స్వేచ్ఛను హరిస్తాయనే విమర్శలను తప్పుబడుతోంది. ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటోంది. వక్ఫ్ బోర్డుల్లో అవినీతిని తగ్గించి, వ్యవస్థను పారదర్శకంగా చేయడానికే ఈ బిల్లును తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. -
ఈసీ తీరు పూర్తిగా.. అనుమానాస్పదం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు సంస్థ పూర్తిగా తిలోదకాలిస్తోందంటూ ధ్వజమెత్తాయి. ‘‘ఓటింగ్‌కు సంబంధించి పౌరులందరికీ తెలియాల్సిన గణాంకాలను అడిగినా బయటపెట్టడం లేదు. ఎన్నికల ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఈసీ తీరుతో నానాటికీ బలపడుతున్నాయి’’ అంటూ దుయ్యబట్టాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించిన పూర్తి గణాంకాలను బయట పెట్టాల్సిందిగా అవి చిరకాలంగా డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఈ విషయమై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లకు సంబంధించి 17సీ పార్ట్–1 తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. దీనిపై తొలుత ఈసీని సంప్రదించాల్సిందిగా గత నెల కోర్టు వారికి సూచించింది. దాంతో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఆహ్వానం ఆ మేరకు మంగళవారం సమావేశం జరిగింది. ఏడీఆర్ ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, మొయిత్రా తదితరులు భేటీలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను మరోసారి ఈసీ ప్రతినిధుల ముందుంచారు. అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. ఈసీ తీరుపై పెదవి విరిచారు. తమ డిమాండ్లకు ఎలాంటి సానుకూల స్పందనా రాలేదంటూ ఆక్షేపించారు.సీఈసీ, ఈసీ ఎక్కడ: భూషణ్సీఈసీ గానీ, ఎన్నికల కమిషనర్లు గానీ భేటీలో పాల్గొనకపోవడాన్ని ప్రతినిధులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఏదో అత్యున్నత న్యాయస్థానం సూచించింది గనుక తప్పలేదన్నట్టుగా వ్యవహరించారు. భేటీకి కేవలం ఈసీ ప్రతినిధులను పంపి సరిపెట్టారు. సంస్థ విశ్వసనీయతకు సంబంధించిన అతి కీలకమైన సమస్య విషయంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో దీన్నిబట్టే తేలిపోతోంది. అయినా సుప్రీంకోర్టుపై గౌరవంతో మా అనుమానాలన్నింటినీ ఈసీ ప్రతినిధుల ముందుంచాం. 2019 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ శాతానికి సంబంధించిన డేటాలో చాలా అవకతవకలున్నట్టు వారి దృష్టికి తీసుకెళ్లాం. వాటిపై సమాధానాలు కోరాం. ఫాం 17(సీ), 20 వంటివాటిని వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించాం. ఇది ఈసీ విశ్వసనీయతకే పెనుసవాలు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరాం. కానీ వారినుంచి సానుకూల స్పందనే లేదు’’ అంటూ ప్రశాంత్ భూషణ్ పెదవి విరిచారు. దీనిపై తమ తదుపరి వాదనలను ఇక సుప్రీంకోర్టు ముందే ఉంచుతామని స్పష్టం చేశారు. ఓటింగ్ సంబంధిత డేటాను ఎన్నికల ఏజెంట్లకు అందించడంలో లేని అభ్యంతరం వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ‘‘ఓటింగ్ విషయంలో తప్పిదాలు, అవకతవకలు జరుగుతున్నాయని, ఈవీఎంల టాంపరింగ్ జరుగుతోందని దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా అనుమానాలున్నాయి. అవి వాస్తవమేనంటూ దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు గళమెత్తుతున్నారు. ఈసీ ప్రవర్తన ఆ అనుమానాలకు మరింతగా బలం చేకూరుస్తోంది’’ అంటూ భూషణ్ దుయ్యబట్టారు.2024లోనూ అవకతవకలు: మొయిత్రా2019లోనే గాక 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో కూడా ఓటింగ్‌కు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయని మొయిత్రా ఆరోపించారు. ‘‘గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు పొంతనే లేదు. సాయంత్రం దాకా ఉన్న పోలింగ్ శాతాలు రాత్రికల్లా అనూహ్యంగా భారీగా పెరిగిపోయాయి. చాలాచోట్ల ఈ పెరుగుదల ఏకంగా 20 శాతం దాకా ఉంది’’ అని గుర్తు చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఈసీ విశ్వసనీయత ఎన్నడూ లేనంతగా అడుగంటిందని విమర్శించారు. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈసీ పూర్తిగా అప్రతిష్టపాలైందన్నారు. ‘‘మేం కోరుతున్నది రహస్య వివరాలేమీ కాదు. దేశప్రజలందరికీ వాటిని తెలుసుకునే హక్కుంది. అంతేకాదు, వాటిని తెలుసుకుని తీరాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది’’ అని ఆమె స్పష్టం చేశారు. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ముస్లిం జేఏసీ
సాక్షి, అమరావతి: వక్ఫ్ సవరణ చట్టం అమలుకాకుండా చూడాలంటూ ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాని కోరుతూ ఇప్పటికే వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలు, ముస్లిం సంస్థలు ఇప్పటి వరకు సుప్రీం కోర్టులో 13 వ్యాజ్యాలు వేయడం గమనార్హం. వక్ఫ్ సవరణ చట్టం అమలుతో తీవ్ర అభద్రతాభావానికి లోనవుతున్న ముస్లింలు ఓవైపు మసీదుల్లో సమావేశాలను నిర్వహిస్తునే మరోవైపు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కేంద్రం వక్ఫ్ చట్టాన్ని సవరించి ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సమర్థత, అభివృద్ధి చట్టం–2025ను అమలులోకి తేవడంపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు, వారికి మద్దతుగా లౌకిక వాదులు, రాజకీయ పార్టీలు సైతం న్యాయపోరాటానికి దిగాయి. తమకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీకి ముస్లింలు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పార్లమెంట్లో బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ, వక్ఫ్ సవరణ చట్టం అమలును అడ్డుకోవాలంటూ సుప్రీంను ఆశ్రయించడాన్ని అభినందిస్తున్నారు. ఈ విషయంలో తొలి నుంచి టీడీపీ రెండు నాల్కల ధోరణి తేటతెల్లమైందని, ఇంకా ఆ పార్టీ సమర్థించుకోవడం సరికాదని మండిపడుతున్నారు.మత స్వేచ్ఛ,మానవ హక్కులపై దాడి ఏకపక్షంగా వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి తేవడం మత స్వేచ్ఛ, మానవ హక్కులు, రాజ్యాంగంపై మూకుమ్మడి దాడి. సవరణల సాకుతో స్వయం ప్రతిపత్తి కలిగిన వక్్పబోర్డ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. 44 సవరణలు అంటూ ఏకంగా 119 సవరణలు చేసి వక్ఫ్ పూర్తి స్వభావాన్ని దెబ్బతీశారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రా«థమిక హక్కులకు భంగం కలుగుతున్నందునే న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాం. ఇతర మతాలకు వర్తించని నిబంధనలు ముస్లింలకు మాత్రమే పెట్టి మత స్వేచ్ఛను దెబ్బతీయడం దారుణం. కొత్త చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులు, ఖబర్‌స్థాన్‌లు, మసీదులు, దర్గాలు, అషూర్ఖానాలు, మదరసాలు సైతం ప్రమాదంలో పడతాయి. సవరణ బిల్లును ఆపే అవకాశం ఉన్నా, అడ్డగోలుగా మద్దతిచ్చిన సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముస్లిం ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు. – షేక్ మునీర్ అహ్మద్, ఏపీ ముస్లిం జేఏసీ కన్వినర్వక్ఫ్ సవరణచట్టం రాజ్యాంగ విరుద్ధం వక్ఫ్ సవరణ చట్టం–2025 రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడేలా మాజీ సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తుంటే.. సీఎం చంద్రబాబు మాత్రం ఊసరవెల్లి మాదిరి రంగులు మార్చే రాజకీయ నాయకుడని మరోసారి తేటతెల్లమైంది. ఆయన ఇంకా ముస్లిం సమాజాన్ని మభ్య పెట్టే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, మతపరమైన హక్కులకు సంబంధించి గతంలో సుప్రీం కోర్టు జారీ చేసిన పలు ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా కొత్త వక్ఫ్ సవరణ చట్టం రూపొందింది. – షేక్ గౌస్ లాజమ్, ఏపీ స్టేట్ హజ్ కమిటీ మాజీ చైర్మన్చంద్రబాబువి కల్లబొల్లి మాటలు ముస్లింలపై ఈగవాలనివ్వబోమని ఎన్నికల్లో కల్లబొల్లి కబుర్లు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న మోసపూరిత రాజకీయాలను ముస్లింజాతి ఎప్పటికీ క్షమించదు. ఇప్పటికైనా టీడీపీ వైఖరిని ముస్లిం సమాజం గుర్తించాలి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడేందుకు వైఎస్సార్సీపీ పాటుపడింది. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టును ఆశ్రయించడం గొప్ప విషయం. ఇందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. – షేక్ నాగుల్ మీరా, ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీడీపీలోని ముస్లింలు ఆలోచించుకోవాలి వక్ఫ్ బిల్లు విషయంలో డబుల్ గేమ్ ఆడిన చంద్రబాబు ఇంకా ముస్లిం సమాజాన్ని మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకుని టీడీపీలోని మైనార్టీ నేతలతో వైఎస్సార్సీపీపై బురద చల్లించే ప్రయత్నం చేస్తున్నారు. బాబు అవకాశవాద రాజకీయంపై టీడీపీలోని ముస్లింలు తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ మాజీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – కాగజ్ ఘర్ రిజ్వాన్, అనంతపురం జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ -
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ
ఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిసి పిటిషన్ పై రేపు(బధవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ ఐటం నెంబర్ 86గా సుప్రీంకోర్టులో లిస్ట్ అయ్యింది. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న వైఎస్సార్సీపీ.. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంతో ముస్లింల మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పిటిషన్ లో పేర్కొంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ లో స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే, వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె వి విశ్వనాథన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. -
రోడ్డు ప్రమాదాలపై ఏఐ నిఘా
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా లక్షల మందిని బలితీసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను నిరోధించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత ప్రమాదకర ట్రాఫిక్ ఉల్లంఘనలపై కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పనిచేసే సీసీ కెమెరాలను వినియోగించేలా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను రూపొందించాలని ఆదేశించింది. తొలిదశలో ఆ నాలుగు రకాలపై... కేంద్ర రోడ్డు రవాణా ఉపరితల మంత్రిత్వ శాఖ తొలిదశలో నాలుగు రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలపై దృష్టి సారించింది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం, వన్ వే, రాంగ్ రూట్లలో దూసుకురావడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను కట్టడి చేయడానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించడానికి ఏఐతో కూడిన సీసీ కెమెరాలను వినియోగించాలని చెప్పింది. హైరిస్క్ ఏరియాలు గుర్తించి, ఏర్పాటు తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే హైరిస్క్ ప్రాంతాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. బ్లాక్ స్పాట్స్‌గా పిలిచే ఆ ప్రాంతాల గుర్తింపు కోసం సైతం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలు, రాష్ట్ర రహదారుల్లో ఒక కిలోమీటర్ పరిధిలో మూడేళ్లలో మూడు కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగితే అది హైరిస్క్ కారిడార్ కిందికు వస్తుంది. పట్టణ, నగరాల్లోని రహదారుల్లో 100 మీటర్ల పరిధిలో మూడేళ్లలో రెండు ప్రమాదాలు జరిగినా, ఇతర ప్రధాన రహదారులు, జిల్లా రోడ్లపై 500 మీటర్ల పరిధిలో మూడేళ్ల వ్యవధిలో రెండు యాక్సిడెంట్లు జరిగినా, విద్యాసంస్థలు ఉన్న ప్రాంతాల్లో 100 మీటర్ల పరిధిలో మూడేళ్లలో రెండు ప్రమాదాలు జరిగినా వాటిని హైరిస్క్ జాబితాలో చేర్చాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో కచి్చతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నామమాత్రంగా కాకుండా... హైదరాబాద్‌తోపాటు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో సీసీ కెమెరాల వినియోగం విస్తృతమైంది. కానీ వాటిలో అత్యధికం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఏదైనా ఉదంతం జరిగినప్పుడో లేదా పోలీసు కేసుల దర్యాప్తులో అవసరమైనప్పుడో మాత్రమే వాటిలోని లోపాలు బయటపడుతున్నాయి. కావాల్సిన కోణంలో వీడియోలు రికార్డు కాకపోవడమో లేదా రికార్డు అయినప్పటికీ విశ్లేషణకు అవసరమైన స్పష్టత లోపించడం పరిపాటిగా మారింది. చాలాచోట్ల కనీసం 50 శాతం సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం ఏఐ ఆధారిత సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రమాణాలు నిర్దేశించింది. ఆయా కెమెరాలు ఎల్లవేళలా వీడియోలు రికార్డు చేసేలా, ఏదైనా వాహనం గంటకు 200 కి.మీ. వేగంతో దూసుకెళ్లినా స్పష్టంగా ఆయా చిత్రాలను నమోదు చేసే సామర్థ్యం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అంతా ఆటోమేటిక్‌గా పనిచేసేలా... ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతోపాటు వాటి సర్వర్లలో మరికొన్ని హంగులు కూడా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. హైరిస్క్ ఏరియాలపై నిత్యం నిఘా ఉంచేలా సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరాల్లో పొందుపరచాలని సూచించింది. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులను గుర్తించి ఈ–చలాన్లు జారీ చేయడంతోపాటు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాన్ని గుర్తించి సంబంధిత విభాగాలను అప్రమత్తం చేస్తూ సందేశం పంపాలని పేర్కొంది. ఆయా కారిడార్లలో ఉల్లంఘనల తీరుతెన్నుల్ని సాంకేతికంగా అధ్యయనం చేయాలని చెప్పింది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసిన లేదా వాటిని సస్పెండ్ చేసిన వాహనదారుల వివరాలు కలిగి ఉండటంతోపాటు బీమా వివరాలు సర్వర్‌లో నిక్షిప్తమై ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. 2014 తర్వాత ఈ దిశగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని చర్యలు చేపట్టారు. ఐటీఎంఎస్, హెచ్–ట్రిమ్స్ తదితర పేర్లతో కొన్ని ప్రాజెక్టులు చేపట్టారు. వాటిలో సీసీ కెమెరాల ఏర్పాటు వరకు సమర్థంగా పూర్తయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం నిక్షిప్తం చేయడం మాత్రం పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో మూడు కమిషనరేట్లలోని సీసీ కెమెరాలు ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదు. చిరునామా, ఫోన్ నంబర్లు మారితే.. కేంద్ర మార్గదర్శకాల్లో మరో కీలకాంశమూ ఉంది. ఓ ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి జారీ చేసే ఈ–చలాన్ వాహనదారుడికి చేరాల్సిన అవసరం ఉంది. ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులతో అనుసంధానించిన చిరునామా, ఫోన్ నంబర్లే దీనికి ఆధారం. అయితే చాలా మంది వాహనచోదకులు ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా, వినియోగిస్తున్న సెల్‌ఫోన్ నంబర్‌కు రికార్డుల్లో ఉన్న వాటికి సంబంధం ఉండట్లేదు. ఈ కారణంగానే సగానికి సగం ఈ–చలాన్లు వాహనదారులకు చేరట్లేదు. ఈ నేపథ్యంలో ఆయా వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేలా వారికి అవకాశం ఇవ్వాలని సూచించింది. అలాగే ట్రాఫిక్ సిబ్బంది సైతం తనిఖీలప్పుడు వాహనదారుల చిరునామా, ఫోన్ నంబర్ల మార్పును పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. -
సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కౌంటర్ దాఖలు
ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ భూముల వివాదంపై 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్న నేపథ్యంలో ముందుగానే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావని తెలంగాణ సర్కార్ అంటోంది. దీనిని అనుసరించే కౌంటర్ దాఖలు చేసింది. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల అక్కడ పొదలు పెరిగాయని, అటవీ రెవెన్యూ రికార్డుల్లో వాటిని అటవీ భూములుగా పేర్కొనలేదనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఆ భూములకు ఎలాంటి కంచలేదని, కంచె ఏర్పాటు చేసేందుకు తాము ప్రయత్నం చేశామని, ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవని కౌంటర్ లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఎల్లుండి(బుధవారం, ఏప్రిల్ 16వ తేదీ) సుప్రీంకోర్టులో విచారణకు లోపే కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండటంతో న్యాయనిపుణులతో సుదీర్ఘ చర్చల తర్వాత ఓ క్లారిటీకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ భూముల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే తెలంగాణ సర్కారుకు గట్టిగానే మొట్టికాయలు వేసింది. గత విచారణ సందర్భంగా భూముల్ని తదుపరి విచారణ వరకూ కొట్టివేయొద్దని, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. చెట్లు నరికివేతపై తీవ్రంగా స్పందించింది. కంచ గచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాను హడావుడి చేపట్టాల్సిన అవసరం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ మదింపు ధృవీకరణ నివేదిక తీసుకుందా, దీనికి సంబంధించి అవసరమైన అనుమతులు పొందారా, స్థానిక చట్టాలను అమలు చేశారా అంటూ పలు ప్రశ్నలను సంధించింది.