ఢిల్లీ: సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణరాజుకు భారీ షాక్ తగిలింది. ఇండ్ భారత్ కేసులో స్టేను సుప్రీంకోర్టు తాజాగా ఎత్తివేసింది. దాంతో సీబీఐ దర్యాప్తునకు అడ్డంగి తొలగింది. ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందు నిందితులకు షోకాజ్ నోటీసులు అవసరం లేదని సీజేఐ ధర్మాసనం తేల్చిచెప్పింది. నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో ఎఫ్‌ఐఆర్‌న క్వాష్ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది.
రఘురామ కృష్ణం రాజు, వాకాటి నారాయణ రెడ్డి కంపెనీల కేసుల్లో గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులు ఎత్తివేసింది. ఖాతాల ఫ్రాడ్ తదితర అంశాలపై ఇతర న్యాయస్థానాల్లో సవాల్ చేసే స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.
ఫలితంగా ఫోర్జరీ పత్రాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఇక సీబీఐ దర్యాప్తు వేగవంతం కానుంది. బ్యాంకుల కన్సర్షియం నుంచి వేలకోట్ల రూపాయలు అప్పులు తీసుకొని నిధులు దారి మళ్లించిన రఘురామ కృష్ణంరాజు కంపెనీ.. గతంలో తీసుకున్న రుణాలను ఎఫ్‌డీలు చేసి.. వాటిపై మళ్లీ రుణాలు తీసుకుంది.


