హైదరాబాద్: ఆస్ట్రేలియా ఉగ్రదాడి కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఆ ఉగ్రదాడికి పాల్పడిన సాజిద్ అక్రమ్ అనే వ్యక్తికి హైదరాబాద్ నగరంతో లింక్స్ ఉన్నట్లు వెల్లడైంది. సాజిద్ హైదరాబాద్‌లో వీసా పొందినట్లు గుర్తించారు. స్టూడెంట్ వీసాపై 1998లో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్.. 2001లో పార్టనర్ వీసాగా మార్చుకున్నాడు.
ఆపై 2002లో రెసిడెంట్ రిటర్న్స్ వీసా పొందాడు సాజిద్. 2022లో టోలీచౌక్‌లోని ఆస్తులను అమ్ముకుని తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. హైదరాబాద్‌లోనే బీకామ్ డిగ్రీ పూర్తి చేసిన్ సాజిద్.. అక్కడ యూరోపియన్ యువతిని పెళ్లి చేసుకున్నాడు.
దీనిపై తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. సాజిద్ అనే వ్యక్తి 27 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లాడని, తిరిగి భారత్‌కు ఆరుసార్లు మాత్రమే వచ్చాడన్నారు. సాజిద్‌తో తెలంగాణకు కానీ, భారత్‌తో కానీ ఎలాంటి సంబంధం లేదని డీజీపీ వెల్లడించారు.
సాజిద్ చివరిసారిగా 2022లో భారత్‌కు..
భారతదేశంలోని సాజిద్ బంధువుల ప్రకారం, గత 27 సంవత్సరాలుగా సాజిద్ కు తన కుటుంబంతో చాలా తక్కువ సంబంధాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత అతను ఆరుసార్లు భారతదేశాన్ని సందర్శించాడు. దీనికి కారణం ఆస్తికి సంబంధించిన కుటుంబ సమస్యలు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం, సాజిద్ చివరిసారిగా 2022లో భారతదేశాన్ని సందర్శించాడు. తన తండ్రి మరణించిన సమయంలో కూడా అతను భారతదేశాన్ని సందర్శించలేదని సమాచారం. సాజిద్ లేదా నవీద్ యొక్క తీవ్రమైన అభిప్రాయాలు లేదా కార్యకలాపాల గురించి తమకు తెలియదని కుటుంబం వాదిస్తోంది.
అంతకుముందు, సాజిద్ అక్రమ్ గత నెల నవంబర్ 1న తన కుమారుడు నవీద్‌తో కలిసి ఫిలిప్పీన్స్ వెళ్లాడని ఫిలిప్పీన్స్ అధికారులను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్ ప్రచురించింది.
సాజిద్ భారతీయ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించగా, అతని కుమారుడు ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించాడు. వారు ఒక నెల నుండి దాడికి ప్రణాళిక వేశారు
కాగా, ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్‌లో ఆదివారం(డిసెంబర్ 14వ తేదీ) ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. బాండీ బీచ్‌లో హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులపై సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అనే తండ్రికొడుకులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 16మంది మరణించగా 40 మందికి గాయాలయ్యాయి. దాడి చేసిన వారు ఆస్ట్రేలియాకు వలస వచ్చారని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:


