సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మరో కీలక అంశంపై స్పందించారు. బెట్టింగ్ యాప్స్ లాంటి తీవ్రమైన అంశాలపై స్పందించిన సజ్జనార్ బిడ్డల అనాదరణకు గురై రోడ్డు పాలువుతున్న వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమంపై దృష్టి సారించారు. ఈ మేరకు వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను సొంత బిడ్డలే అనాథలుగా వదిలివేస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, హింసించినా ఉపేక్షించేది లేదు. కన్నవారిని రోడ్డున వదిలేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు అని సజ్జనార్ హెచ్చరించారు.
ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో హెచ్చరిక కనిపెంచిన అమ్మానాన్నల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నవారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్న ప్రతి వృద్ధుడికి, ప్రతి తల్లికి పోలీసుశాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చు. మీరు ఒంటరి వారు కాదు. మీ ఆత్మగౌరవం, భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. బాధితులు నిర్భయంగా నేరుగా సంప్రదించ వచ్చని తన ట్వీట్‌లో సూచించిన వైనం నెట్టింట పలువురిని ఆకట్టుకుటోంది.
ఇదీ చదవండి: బోండీ బీచ్ హీరోకు సర్వత్రా ప్రశంసలు : భారీగా విరాళాలు
తుపాను బీభత్సం : కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
నిత్యం ఎంతోమంది బాధితులు తమ కష్టనష్టాలను చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. గతంలో టీజీఎస్ఆర్టీసీ, సైబరాబాద్ సహా వివిధ జిల్లాల్లో పనిచేసిన అనుభవంలోనూ.. ప్రస్తుతం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గానూ నన్ను తీవ్రంగా కలచివేస్తున్న వాస్తవం ఒక్కటే.
వృద్ధాప్యంలో, అనారోగ్యంతో… pic.twitter.com/sBDOllJA1G— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 16, 2025


