శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 13 విమానాలు రద్దు | 13 flights cancelled at shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 13 విమానాలు రద్దు

Dec 16 2025 10:58 AM | Updated on Dec 16 2025 11:17 AM

13 flights cancelled at shamshabad airport

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం మొత్తం 13 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ విమానాశ్రయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు. 

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన మొత్తం ఏడు విమానాలు రద్దయ్యాయి. ఇందులో ఐదు ఇండిగో, రెండు ఎయిర్ ఇండియా విమానాలు ఉన్నాయి. అలాగే ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన ఆరు విమానాలు కూడా రద్దయ్యాయి. వీటిలో ఐదు ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా విమానాలు ఉన్నాయి.

విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ప్రయాణికులు కోరుతున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement