వరంగల్: చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తండాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో చలిమంట కాగుతున్న కాంగ్రెస్ కార్యకర్తల వద్దకు అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాటామాట పెరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై వాగ్వాదం తీవ్రమై, చివరకు ఇరువర్గాలు ఒకరిపై ఒకరు చలిమంటల కర్రలతో దాడి చేసుకున్నారు.
ఈ ఘర్షణలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు వారిని నర్సంపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.


