నిర్మల్ జిల్లా: పంచాయతీ ఎన్నికల్లో మాజీ ఎంపీటీసీలు సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. దహెగాం పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ సభ్యురాలు రాపర్తి జయలక్ష్మి బీజేపీ మద్దతుతో బరిలో నిలిచి సమీప అభ్యర్థి తుమ్మిడె మల్లీశ్వరిపై 242 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందారు. మండలంలోని ఇట్యాల పంచాయతీ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేయగా గజ్జెల జయలక్ష్మి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి బీఆర్‌ఎస్ మద్దతుదారు పొన్న కళావతిపై 109 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలిచారు.
ముత్యాల కుటుంబానికి మూడోసారి..
లోకేశ్వరం: మండలంలోని బాగాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ముత్యాల శ్రీవేద ఒకే ఓటుతో ఎన్నికల్లో విజయం సాధించింది. 1972లో లోకేశ్వరం, నగర్, భాగాపూర్ గ్రామాలకు ఆమె తాత ముత్యాల నారాయణ్‌రెడ్డి సర్పంచ్‌గా ఐదేళ్ల పాటు పని చేశారు. నారాయణ్‌రెడ్డి చిన్న కోడలు ముత్యాల రజిత 2013లో సర్పంచ్‌గా గెలుపొందారు. 2018లో డీఎస్సీలో రజిత స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం ముధోల్ మండలం ఎడ్‌బిడ్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. ఇప్పుడు బీటెక్ చదివిన శ్రీవేద గెలుపుతో ముత్యాల కుటుంబానికి మూడోసారి సర్పంచ్ పదవి దక్కినట్లయింది. 


