బాబీ సింహా, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా, తనికెళ్ల భరణి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రల్లో ఓ సినిమా ప్రారంభమైంది. మెహర్ యరమతి దర్శకత్వంలో యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత – డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ఎస్‌కేఎన్ క్లాప్ ఇచ్చారు. తనికెళ్ళ భరణి మేకర్స్‌కి స్క్రిప్ట్ అందించారు.


