స్నానం చేయాలన్నా, ముఖం కడుక్కోవాలన్నా సబ్బు వాడటం తప్పనిసరి. బట్టలుతకడానికి, గిన్నెల తోమడానికి కూడా సబ్బు వాడుతుంటారు. ఈ సబ్బు చరిత్రేమిటో మీకు తెలుసా?
కొన్ని కొవ్వులు, నూనెలను ఒక బేస్‌తో కలపడం ద్వారా సబ్బులు తయారవుతాయి. మనుషులు వేల సంవత్సరాలుగా సబ్బునుపయోగిస్తున్నారని చరిత్రకారులు అంటున్నారు. సబ్బుల గురించి సుమేరియన్, బాబిలోనియన్, ఈజిప్షియన్ గ్రంథాలలో మొదటిసారి ప్రస్తావించారు. ఇప్పుడు మనం చూసే సబ్బులకు గతంలోని సబ్బులకు చాలా తేడా ఉండేది.
క్రీ.పూ 2800 ప్రాంతంలో పురాతన బాబిలోన్‌లో సబ్బు లాంటి పదార్థాల ఉత్పత్తికి ఆధారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో నూనె, చెక్క బూడిద మిశ్రమాన్ని వేడి చేయడం ద్వారా సబ్బులు తయారు చేసేవారు. వీటిని ఉన్ని దుస్తులను ఉతకడానికి ఉపయోగించారు. పురాతన ఈజిప్షియన్లు సబ్బును ఔషధంగా కూడా ఉపయోగించారు. జంతువుల కొవ్వులు లేదా కూరగాయల నూనెలను ట్రోనా అనే సోడా యాష్ పదార్థంతో కలపడం ద్వారా వీటిని తయారు చేసేవారు. 17వ శతాబ్దం నుండి యూరప్‌లో జంతువుల కొవ్వులకు బదులుగా కూరగాయల నూనెలను వాడి సబ్బులు తయారు చేయడం ప్రారంభించారు.
1800 నుంచి సబ్బు ధనవంతులకు తప్పనిసరి వస్తువుగా మారింది. 1853లో సబ్బుల వ్యాపారం ఊపందుకుంది. ఆపై బార్ సబ్బులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రకరకాల ఆకృతుల్లో సబ్బులు మార్కెట్లోకి వస్తున్నాయిస్నానం చేయాలన్నా, ముఖం కడుక్కోవాలన్నా సబ్బు వాడటం తప్పనిసరి. బట్టలుతకడానికి, గిన్నెల తోమడానికి కూడా సబ్బు వాడుతుంటారు.
ఇదీ చదవండి: ఎప్‌స్టీన్ ఫైల్స్ : రష్యన్ ముద్దుగుమ్మలతో బిల్‌గేట్స్ ఆ జబ్బు , అంతేనా!


