రాహుల్‌పై కంగనా ‘పోకిరి’ వ్యాఖ్యల దుమారం | Kangana Ranaut Slams Rahul Gandhi For Making Women Uncomfortable | Sakshi
Sakshi News home page

రాహుల్‌పై కంగనా ‘పోకిరి’ వ్యాఖ్యల దుమారం

Mar 18 2026 7:01 PM | Updated on Mar 18 2026 7:46 PM

Kangana Ranaut Slams Rahul Gandhi For Making Women Uncomfortable

సాక్షి,న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ప్రవర్తన మహిళలకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని, ఆయన వ్యవహరించే తీరుతో మహిళలందరమూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నామన్నారు. అంతేకాదు రాహుల్ ఒక "టపోరీ"(ఆకతాయి)లా వచ్చి వెడతారన్న వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి.

పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ 200కుపైగా మాజీ అధికారులు రాసిన బహిరంగ లేఖ రాజకీయ చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ప్రవర్తనపై వచ్చిన విమర్శలపై రనౌత్ స్పందిస్తూ, రాహుల్‌ని చూస్తే మహిళలంతా అసౌకర్యానికి గురవుతారని, ఎందుకంటే ఒక పోకిరిలాగా దూకుడుగా మాట్లాడటం,  ఇంటర్వ్యూలు ఇచ్చే వారిని ఎగతాళి చేస్తూ ఇబ్బంది పెడతారని ఆమె మండిపడ్డారు.

ప్రియాంకతో పోలిక
అయితే రాహుల్‌  సోదరి ప్రియాంక గాంధీ వాద్రా హుందాగా ప్రవర్తిస్తారని  కంగనా పేర్కొన్నారు. రాహుల్ తన సోదరి ప్రియాంకగాంధీని చూసి నేర్చుకోవాలని హితవు పలకం విశేషం. ప్రియాంక ప్రవర్తన చాలా బాగుంటుందని, కానీ రాహుల్ ప్రవర్తన మాత్రం "సిగ్గుచేటు" అంటూ  కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేసారు.

 ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!


రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత, రాజకీయ విభేదాలు ఉండవచ్చు, కానీ రాహుల్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. మహిళల గౌరవం, వారి అభ్యున్నతి పట్ల ఆయన చాలా నిబద్ధతతగా ఉంటారనీ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నపుడు ఆయనతో కలిసి పనిచేశానని చెప్పారు. ఇందిరా గాంధీ, సోనియా లాంటి మహిళా నాయకత్వ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిపై ఇటువంటి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement