సైనస్‌తో బాధపడుతున్నారా? కపాలభాతితో చెక్‌ | Yoga: Kapalabhati for Sinus Problem, Check here | Sakshi
Sakshi News home page

Yoga సైనస్‌తో బాధపడుతున్నారా? కపాలభాతితో చెక్‌

May 2 2026 10:21 AM | Updated on May 2 2026 10:43 AM

Yoga: Kapalabhati for Sinus Problem, Check here

 Yoga కపాలభాతి అంటే తలను, మెదడును శుభ్రంగా చేసి ప్రకాశవంతంగా చేసే  శ్వాస సాధన. దీన్ని శుద్ధిక్రియ  అని కూడా అంటారు.

 

విధానం
 

  • ముందుగా సుఖాసనం లేదా పద్మాసనంలో కూర్చోవాలి.వెన్నెముక నిటారుగా ఉంచాలి.
  • కళ్లు మూసుకొని రెండు చేతులను మోకాళ్లపైన జ్ఞానముద్రలో ఉంచాలి.
  • శ్వాస ప్రక్రియ: లోతుగా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసను వేగంగా, బలంగా బయటకు వదలండి. శ్వాసను బయటకు వదిలినప్పుడు, పొట్ట కండరాలను వెన్నెముక వైపు లోపలికి నొక్కాలి.
  • శ్వాసను బయటకు వదలడం యాక్టివ్‌గా ఉండాలి, లోపలికి తీసుకోవడం పాసివ్‌గా – అంటే శ్వాసను లోపలికి తీసుకునే ప్రయత్నం చేయనక్కర్లేదు, అదిఆటోమేటిక్‌గా జరుగుతుంది) ఉండాలి.
  • బయటకు వదిలే శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టాలి.ఇలా 15–20 సార్లు వేగంగా శ్వాస తీసుకున్న తర్వాత, ఒక్క రౌండ్‌ పూర్తవుతుంది.
  • కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని,  2–3 రౌండ్లు చేయాలి.
     

జాగ్రత్తలు

  • ఉదయం ఖాళీ కడుపుతో  చేస్తే ఎక్కువ ప్రయోజనం.
  • వేగంగా చేయకూడదు. తల తిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే ఆపాలి.
  • హై బీపీ, గర్భిణీలు,  హెర్నియా, గుండె సమస్యలు ఉన్నవారు చేయకూడదు.
     

ఉపయోగాలు

  • ముక్కులో ఉన్న మ్యూకస్‌ (కఫం) బయటకు వస్తుంది. 
  • ముక్కు బ్లాకేజ్‌ తగ్గుతుంది. సైనస్‌ ప్రెషర్, తలనొప్పి తగ్గుతుంది.
  • శ్వాస సులభంగా జరుగుతుంది.ఊపిరితిత్తులు  బలంగా అవుతాయి.
  •  జీర్ణశక్తి మెరుగవుతుంది.  పొట్ట కొవ్వు తగ్గడానికి సహాయం చేస్తుంది.
  •  మనసు ప్రశాంతంగా, చురుకుగా ఉంటుంది.

– అనిత  పాతర్ల, యోగా ట్రైనర్‌  

Advertisement
 
Advertisement
Advertisement