ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం.. అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులు నివసించే ప్రపంచ ఆర్థిక కేంద్రం హాంకాంగ్. అయితే, ఇక్కడ నివసిస్తున్న గృహ కార్మికులు, సామాన్య ఉద్యోగుల సంబంధించిన జీవన శైలి తాజాగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీకెండ్స్‌లో కార్మికులు, ఉద్యోగులు అట్ట పెట్టెల్లో నివాసం ఉండటం, అండర్‌పాస్‌ల కింద సేద తీరడం వంటికి వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో, ఈ విషయం చర్చకు దారి తీసింది. ఇంతకీ వాళ్లంతా ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే..
సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు హాంకాంగ్‌లో కార్మికుల జీవన శైలి, అక్కడి పరిస్థితులను వివరించారు. హాంకాంగ్‌లో గృహ నిర్మాణ కార్మికులు, సాధారణ ఉద్యోగులు, విద్యార్థుల అవస్థలను తెలియజేశారు. పలువురు కార్మికులు అండర్‌పాస్‌లు, వంతెనలపై కార్డ్‌బోర్డ్ పెట్టెలలో “కాఫిన్ హోమ్స్” (అట్ట పెట్టెల్లాంటి గదులు) నివసించడం ఆ వీడియోలో చూపించారు. ఈ సందర్బంగా వారందరికీ నివాసం ఉండేందుకు సొంత ఇళ్లు లేదని చెప్పుకొచ్చారు. కార్డ్‌బోర్డ్ పెట్టెలతో తాత్కాలిక "గదులను" నిర్మించుకుంటారు. ఈ క్రమంలో.. హాంకాంగ్ ధనికులకు నివాసం కల్పించడానికి నిరాకరించే శ్రమశక్తిపైనే హాంకాంగ్ ఆధారపడి నడుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అయితే, “కాఫిన్ హోమ్స్” అనేవి అత్యంత చిన్న, కిక్కిరిసిన నివాస స్థలాలు. వీటిలో కార్మికులు మరియు తక్కువ ఆదాయం కలిగిన ప్రజలు నిద్రించాల్సి వస్తుంది. ఎందుకంటే హాంకాంగ్‌లో గృహ ధరలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి. దీంతో, ప్రతీ ఆదివారం(సెలవు రోజున) ఫిలిప్పీన్స్ మరియు ఇండోనేషియాకు చెందిన వేలాది మంది మహిళలు తాము శుభ్రపరిచే విలాసవంతమైన అపార్ట్‌మెంట్ల నుండి, నగరంలోని ఉన్నత వర్గాల వారిని చూసుకునే కేర్ సెంటర్ల నుండి బలవంతంగా బయటకు పంపించేయబడుతున్నారు. వారికి సెలవు రోజున నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు. సొంత నివాసాలు లేకపోవడంతో ఇలా అండర్‌పాస్‌లు, వంతెనలపై కార్డ్‌బోర్డ్ పెట్టెలలో సేద తీరుతున్నారు. కాగా, ఐక్యరాజ్యసమితి కూడా వీటిని “మానవ గౌరవానికి అవమానం”గా పేర్కొంది.
ప్రధాన కారణం..
హాంకాంగ్‌లో గృహ సంక్షోభానికి ప్రధాన కారణం భూమి కొరత, అధిక గృహ ధరలు, మరియు ప్రభుత్వ విధానాలే కారణం. హాంకాంగ్‌లో భూమి పరిమితంగా ఉండటం, ఎక్కువ భాగం పర్వతాలు లేదా రక్షిత ప్రాంతాలు కావడం ప్రధాన కారణం. మరోవైపు.. 2004–2021 మధ్య గృహ ధరలు 239% పెరిగాయి, కానీ వేతనాలు కేవలం 7.1% మాత్రమే పెరిగాయి. ప్రభుత్వం భూమి అమ్మకాలపై ఆధారపడటం వల్ల, అధిక విలువ గల ప్రాజెక్టులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ధరలను మరింత పెంచాయి. దీంతో, సామాన్యులు, కార్మికులు ఇళ్లు కొనే పరిస్థితి లేదు.
Hong Kong’da pazar izni gerçeği: Binlerce ev işçisi, çalıştıkları evden çıkmak zorunda kaldığı için köprü altlarında karton kutularla kendine “oda” yapıyor.
Modern şehir dediğimiz şey bazen sadece pahalı binalardan ibaret. pic.twitter.com/ZTz9OvrB6M— 🐺Özet Geç 🦅 (@_OzetGec_) April 26, 2026
కాఫిన్ హోమ్స్ అంటే ఏమిటి?.
పరిమాణం: 11–25 sq ft (సాధారణంగా ఒక పార్కింగ్ స్థలం లేదా జైలు గది పరిమాణం).
రూపకల్పన: పాత అపార్ట్‌మెంట్‌లను విభజించి, లోపల పెట్టెల్లాంటి గదులు తయారు చేస్తారు.
సౌకర్యాలు: కిటికీలు లేకపోవడం, గాలి ప్రసరణ తక్కువగా ఉండటం, ప్రైవసీ లేకపోవడం.
నివాసులు: తక్కువ ఆదాయం కలిగిన కార్మికులు, డెలివరీ వర్కర్లు, వృద్ధులు, కొంతమంది విద్యార్థులు.
సవాళ్లు..
అద్దెలు పెరగడం: కొత్త నియమాలు గృహ ప్రమాణాలను మెరుగుపరుస్తాయి కానీ అద్దెలు పెరిగే అవకాశం ఉంది.
సామాజిక అసమానత: తక్కువ ఆదాయం గల కార్మికులు ఇంకా “కాఫిన్ హోమ్స్” లేదా subdivided flatsలోనే ఉండే ప్రమాదం ఉంది.
రాజకీయ ప్రభావం: డెవలపర్లు మరియు ప్రభుత్వ ఆదాయ ప్రయోజనాలు ప్రజా గృహాల విస్తరణను అడ్డుకుంటాయి.
సమస్యలు, పరిష్కారాలు
సమస్య: హాంకాంగ్‌లో గృహ ధరలు అత్యంత ఎక్కువగా ఉండటం వల్ల కార్మికులు ఇలాంటి “కాఫిన్ హోమ్స్”లో నివసించాల్సి వస్తోంది.
ప్రభుత్వ చర్యలు: తాత్కాలిక గృహాలు (transitional housing) అందిస్తున్నారు, కానీ 2 సంవత్సరాలకే పరిమితం.
సామాజిక ప్రభావం: ఇది హాంకాంగ్‌లోని ఆర్థిక అసమానతకు స్పష్టమైన ఉదాహరణ.


