హైదరాబాద్ : చిన్నారుల ఆనందం అర్ణవమైంది. బుడుగుల సంబరం అంబరమంటింది. రోబోటిక్స్ వర్క్‌షాప్‌లతో ఉత్సాహభరితంగా మారింది. బాలల సృజనాత్మకతకు అద్దం పట్టింది.
ఆదివారం శేరిలింగంపల్లి నల్లగండ్ల లోని అపర్ణ సైబర్ జోన్‌లో ‘సాక్షి’ హ్యాపీ కిడ్స్ ఈవెనింగ్‌లో (Sakshi Happy Kids Evening) భాగంగా ‘సాక్షి’ జూనియర్ జర్నలిస్టు, రోబోటిక్స్ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది.


